అర్చకుల ఆత్మబంధువు వైఎస్సార్ | YSR priests atmabandhuvu | Sakshi
Sakshi News home page

అర్చకుల ఆత్మబంధువు వైఎస్సార్

Published Fri, Sep 2 2016 1:47 AM | Last Updated on Sat, Jul 7 2018 3:19 PM

అర్చకుల ఆత్మబంధువు వైఎస్సార్ - Sakshi

అర్చకుల ఆత్మబంధువు వైఎస్సార్

హిందూ మతం పట్ల వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రదర్శించిన అనురక్తి, ఆదరణ ప్రత్యేకమై నది. ముఖ్యంగా ఆలయ వ్యవ స్థలో సంస్కరణలు చేపట్టి పూర్వవైభవం తీసుకొస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు.


సందర్భం

హిందూ మతం పట్ల వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రదర్శించిన అనురక్తి, ఆదరణ ప్రత్యేకమై నది. ముఖ్యంగా ఆలయ వ్యవ స్థలో సంస్కరణలు చేపట్టి పూర్వవైభవం తీసుకొస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. 2003 లో నిర్వహించిన పాదయా త్రలో వైఎస్ చేసిన మొట్టమొ దటి వాగ్దానం కూడా ఇదే.. ముఖ్యమంత్రి అయ్యాక ఉమ్మడి రాష్ట్రంలో జీర్ణస్థితిలో ఉన్న ఆలయ వ్యవస్థను సంస్కరించే బృహత్ కార్యానికి పూనుకున్నారు. ఆల యాల విచక్షణారహిత సర్వనాశనానికి 30/87 దేవా దాయ చట్టమేనని గ్రహించిన వైఎస్ ఆ చట్టాన్నే (33/ 2007) సవరించారు. తర్వాత హైదరాబాద్‌లోని బాలాజీ భవన్‌లో అర్చకులను, అధికారులను ఉద్దేశించి వైఎస్ ప్రసంగించారు. ఈ సందర్భంలో ఆలయ వ్యవస్థ సంస్కరణపై, అర్చకుల సంక్షేమంపై వైఎస్ ఎలా ఆలో చించారో చెప్పడానికి రికార్డయిన ఆయన ప్రసంగాన్ని యథాతథంగా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను.

‘‘వేదికపైన ఉన్న పెద్దలారా! ప్రియతమ అర్చక సోదరులారా! భారత సమాజంలో, దేశంలో ధర్మాన్ని నాలుగు పాదాలా నిలబెట్టేందుకు, హిందూ ఆచారా లను, సంస్కృతిని పది కాలాలపాటు నిలబెట్టేందుకు ఎంతగానో కృషి చేస్తున్న అర్చకులకు ప్రత్యేక గుర్తింపు నిచ్చి, వారి జీవన స్థితిగతులను పట్టించుకోవలసిన అవసరం ప్రభుత్వంపై ఉంది. అధికారంలోకి రాక ముందే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో అర్చకులకు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చి, అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పాం. ప్రజామోదం పొంది ప్రభుత్వంలోకి వచ్చాక ఈ మూడున్నరేళ్ల కాలంలో మన సౌందరరాజన్‌గారు అర్చకులకు సంబంధించిన చట్టం తీసుకువచ్చే విష యంలో నన్ను కనీసం 30 సార్లయినా కలసి ఉంటారు  మన సమాజంలో అర్చకుల పట్ల ఎంత గౌరవం ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు... కానీ అర్చకు లకు కనీస సదుపాయాలు కల్పించలేక పోతున్నాం. అధి కారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యలు తీర్చాలని ఒక కమిటీ వేశాం. అన్నిపక్షాల శాసన సభ్యుల సలహా సంప్ర దింపులతో ధార్మిక పరిషత్ అనే సంస్థను ఏర్పాటు

చేసి మెడికల్, హెల్త్ శాఖ బాధ్యతలు చూస్తున్న ఉన్నతాధికారి సుబ్బారావుగారికి ఎండోమెంట్స్ బాధ్య తలు ఇచ్చాం. ఈ విభాగంలోని పలు సమస్యలను తీర్చ డానికి ఆయన చాలా కష్టపడ్డారు.ప్రతి జిల్లాలో అర్చకులు నివసించడానికి ఒక చోటో, రెండు చోట్లో ఒక కాలనీ, ధార్మికపురం నిర్మిం చాలి. ఇందిరమ్మ ఇళ్లకు ఇచ్చే 30 వేలకు మరో 50 వేలను ధార్మిక పరిషత్ నుంచి 3 శాతం అంటే పావలా వడ్డీకి ఇచ్చి కనీసం రెండు గదులు, ఒక బాత్‌రూం, ఒక లెట్రిన్‌తో ఇబ్బంది లేకుండా ప్రతి జిల్లాలో ఇలాంటి కాలనీ ఏర్పాటు చేయాలి.

 థూప దీప నైవేద్యాల పథకం కింద 2 వేలు దేవాలయాలకు, అర్చకుడికి రూ. 1,500 పడితనం కింద రూ.1,000 చొప్పున ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. హిందూ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకు పోవలసిన అవసరం మనందరికీ ఉంది. మన ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నం మీరందరూ చేయాలని ప్రార్థిస్తూ... సెలవు తీసుకుంటున్నాను.

(నేడు డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి వర్ధంతి)
 

వ్యాసకర్త: చిలుకూరు సౌందర్ రాజన్,
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు  మొబైల్ : 98851 00614

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement