‘అక్షరవన’ విద్యావిప్లవం | opinion on vandemataram foundation starts akshara vanam by chukka ramaiah | Sakshi
Sakshi News home page

‘అక్షరవన’ విద్యావిప్లవం

Published Tue, Oct 25 2016 1:57 AM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM

‘అక్షరవన’ విద్యావిప్లవం

‘అక్షరవన’ విద్యావిప్లవం

సందర్భం

విద్యార్థి తనకు ఏం కావాలో, ఎలా నేర్చుకోవాలో అర్థం చేయించే విద్యా పరిశోధన కేంద్రాలను అక్షరవనం పేరుతో స్థాపించిన వందేమాతరం ఫౌండేషన్‌ మహబూబ్‌నగర్‌ జిల్లాలో విద్యా విప్లవానికి నాంది పలికింది.


అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా విద్యా ప్రమా ణాలు మెరుగుపరుచుకొని అనూహ్యమైన ఆర్థి కాభివృద్ధితో అగ్రపథాన నిలిచాయి. ఆ దేశాల విద్యా విధాన పద్ధతులు పరిశీలిస్తే.. విద్యార్థులు స్వేచ్ఛాయుతంగా తమకు తాము నేర్చుకొనే అవకాశాలను కల్పించిన కార ణంగా ఫిన్‌ల్యాండ్, సింగపూర్, జపాన్, క్యూబా వంటి దేశాలు  ముందుకెళుతున్నాయి. ఆ దేశాల తీరును మన పాలకులు, విద్యావేత్తలు అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. నూతనంగా ఏర్ప డిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల పనితీరుపై చేసిన సమగ్ర సర్వే కూడా విద్యార్థులు పాఠాలు చదువలేని స్థితిలో ఉన్నట్లు చెప్పడం ఆందోళన కలిగిస్తుంది.

విద్యార్థులకు కనీస సామర్థ్యాలు లేకుండా పాఠాలు బోధించడంవల్ల అర్థంకాని విషయాలపట్ల పిల్లవాడికి అనాసక్తి ఏర్పడుతుంది. తరగతిలో మూడు రకాల విద్యార్థులుంటారు. వీరిలో ఒకరు బడికి రావడమంటే బాధగా భావిస్తాడు. ఇంకొకరు అమ్మా నాన్నల కోసం బడికి వచ్చేవారు. మరొకరు ఆసక్తి, అన్వేషణ, ఆనందం, అనుభూతితో బడికి వచ్చేవారు. ఈ నేపథ్యంలో.. విద్యార్థి తనకు ఏం కావాలో, ఎలా నేర్చుకోవాలో అర్థం చేయించే విద్యా పరిశోధన కేంద్రాలను ‘అక్షరవనం’ పేరుతో మొద లెట్టిన వందే మాతరం ఫౌండేషన్‌ మహబూబ్‌నగర్‌ జిల్లాలో విద్యా విప్లవానికి నాంది పలికింది.

ఇక్కడ జరుగుతున్న లిటిల్‌ లీడర్స్, లిటిల్‌ టీచర్స్‌ ప్రత్యేక నైపుణ్య శిక్షణ శిబిరాలను స్వయంగా నాలుగు పర్యాయాలు సందర్శించినప్పుడు అమిత మైన అనుభూతి చెందుతూ అరుదైన విద్యా ఒర వడిని గమనించగలిగిన 45 రోజులపాటు జరిగిన శిబిరంలో ఉపాధ్యాయులెవ్వరూ లేరు కానీ విద్యా ర్థులు భాష మీద పట్టు సాధించగలిగారు. స్వల్ప కాలిక వ్యవధిలో చతుర్విద గణిత ప్రక్రియలో అల వోకగా చేస్తూ భీజియ సూత్రాలపై పట్టు సాధించ గలిగారు. విద్యార్థులలో నిద్రాణంగా ఉన్న అనేక ప్రతిభ పాటవాలు వెలికితీస్తూ వాటికి పదును పెడుతూ ఆటపాటల మధ్య అలసట లేని బోధనతో అమ్మానాన్నలను, ఇల్లూ వాకిళ్లనూ వదిలి 45 రోజు లపాటు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని 6 జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు ఆహ్లాదకరమైన అధ్య యనాన్ని ఆనందోత్సాహాల మధ్య కొనసాగిం చారు. అనూహ్యంగా ఉపాధ్యాయులు లేకుండా, విద్యార్థులు లేకుండా పెరిగిన విద్యా సామర్థ్యాలపై అధ్యయనం చేయవల్సిందిగా అప్పటి మహబూబ్‌ నగర్‌ జిల్లా కలెక్టర్‌ శ్రీదేవి గారు, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ కేంద్రానికి సిఫారసు చేయగా దాని డైరెక్టర్‌ కొద్దిమంది విషయ నిపుణులు, పాఠ్యపుస్తక రచయితలను అక్షరవనానికి పంపించారు. మూడు రోజులపాటు సమగ్రంగా పరిశీలించి విస్తృతమైన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే స్వయంగా విద్యా శాఖ సంచాలకులు అక్షర వనాన్ని సందర్శించి విద్యా బోధనలో నూతన ఆవిష్కరణలు అందించిన అక్షర వనాన్ని అభినందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిశోధ నను పరివ్యాప్తం చేయాలని నిర్ణయించారు.

విద్య, ఉపాధి కోసం వలసలకు వెళ్లే పాల మూరు జిల్లాలో అంకురించిన అక్షరవన సందర్శ నకు ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థులు, తెలంగాణ రాష్ట్రంలోని అనేక పాఠ శాలల విద్యార్థులు దారులు కట్టారు. పాలమూరు జిల్లాకు అక్షరవనం ఒక విద్యా వరప్రదాయినిగా మారనుంది. అంతర్లీనంగా ఉన్న ప్రవృత్తులను ప్రభావితం చేస్తూ తమ వృత్తులలో నైపుణ్యాన్ని తీసుకువచ్చే విలాస విద్యగా పాఠ్యాంశాలకు, పాఠ్యే తర అంశాలకు మధ్య అంతరాలను అక్షరవనం తొలగించింది. ఈ ప్రయోగాన్ని విద్యాధికారులం దరూ ప్రయోగాత్మకంగా చేసి చూపారు. ఇందులో బాలసభ ఒకటి. ఇదో అద్భుతమైన ప్రయోగం. విద్యార్థి స్వేచ్ఛగా తన భావాలు పంచుకొనే వేదిక పిల్లల ఆనందడోలిక. వారమంతా బడి మానేసినా.. వారాంతంలో జరిగే బాలసభలో మాత్రం పిల్లలు బడిలో నిండుగా కనిపిస్తున్నారంటే, అలసటలేని చదువు ఆట, పాటల ఆనందోత్సాహాల మధ్య ఒత్తిడి లేకుండానే అనేక విషయాలను నేర్చుకొనే అవకాశం కల్పించే విధానం అక్షరవనం రూపొం దించింది. తన సామర్థ్యాలను అంచనా వేసి తనకు నేర్పే వారెవరని అన్వేషించే అవకాశం విద్యార్థికి కల్పించగలిగారు. విద్యా వ్యవస్థను గాడిలో పెట్ట డానికి ప్రభుత్వాలు టీచర్‌ను సంస్కరించే ప్రయ త్నాలు చేస్తున్నాయి. అక్షరవనం ప్రయోగ ఫలితాల ఆధారంగా టీచింగ్‌ను సంస్కరించే సత్ఫలితాలు సాధించే అవకాశముంది. ఈ దశగా మనం ఒక అడుగు ముందుకు వేసిన వాళ్లమవుతాము. విద్యార్థి నేర్చుకొనే విధానంపై దృష్టిసారిస్తే తెలంగాణ రాష్ట్ర విద్యా అభివృద్ధిలో దేశంలోకెల్లా అగ్రపథాన నిలు స్తుంది.

( వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త
శాసనమండలి మాజీ సభ్యులు )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement