ఆందోళనకరం అంతర్గత భద్రత | Shekhar gupta writes on Internal security | Sakshi
Sakshi News home page

ఆందోళనకరం అంతర్గత భద్రత

Published Sat, Feb 18 2017 12:52 AM | Last Updated on Tue, Sep 5 2017 3:57 AM

ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌

ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌

జాతిహితం
కశ్మీరీ ప్రజలలో, ప్రత్యేకించి యువతలో ఆశావాదాన్ని నింపడంలో ఎన్‌డీఏ ప్రభుత్వం, జమ్మూకశ్మీర్‌లోని పీడీపీ–బీజేపీ కూటమి విఫలమయ్యాయి. ఒకప్పటిలాగే కశ్మీర్‌ను పూర్తి భద్రతా సమస్యగా చూసే వైఖరికి తిరిగిపోయారు. వాజ్‌పేయి కశ్మీర్‌ విధానమే తనకు ఉత్తేజమని మోదీ అన్నారు. కానీ ఇది వాజ్‌పేయి రచించినది కాదు. ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత మోదీపైనే ఉంది. అందుకు ఆయన చేయాల్సిన కృషి రాజకీయమైనదే తప్ప సైనికమైనది కాదు.

దాదాపు దశాబ్ద కాలంగా దేశం ఇంతకు మున్నెన్నడూ ఎరుగని రీతిలో అంతర్గతంగానూ, బహిర్గతంగానూ కూడా మరింత ఎక్కువ సురక్షితంగా ఉన్న అద్భుతమైన దశలో ఉన్నదనే వాదన సమంజసమనే అనిపించవచ్చు. అది ముగింపునకు వచ్చేసిందని లేదా మంచైనా, చెడైనా ఏ దశైనా మిగతా అన్నిటిలాగే ముగిసిపోక తప్పదని ప్రకటించడం తొందరపాటు కావచ్చు. బహిర్గత పరిస్థితికి వస్తే, నెలల తరబడి వాస్తవాధీన రేఖ మండుతున్నా, మునుపటిలాగే ఉన్నది. మన సరిహద్దులన్నీ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నాయి. కొత్తగా వచ్చిన ముప్పు ఏమీ లేదు. కానీ అంతర్గత పరిస్థితి మాత్రం బాగా ఆందోళనకరమని అనిపించసాగే స్థాయికి దిగజారింది. నరేంద్ర మోదీ ప్రభుత్వ పదవీ కాలం సగం ముగిసేసరికి అంతర్గత భద్రతకు సంబంధించిన పనితీరు సూచిక ఏ మాత్రం ఉత్సాహకరంగా లేదు.

రెండున్నరేళ్లలో అంతా తలకిందులు
2014 వేసవిలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి అంతర్గత పరిస్థితిలో సమంజసమైన స్థాయి సుస్థిరత నెలకొని ఉంది. కశ్మీర్‌ ప్రశాంతంగా ఉండగా, ఈశాన్యం దాదాపుగా పతాక శీర్షికలకు దూరంగా ఉంది. అప్పట్లో ఎక్కువ ఆందోళనకరం ఉన్నది తూర్పు భారతం, ఆదివాసి భారతాల్లోని మావోయిస్టు లేదా హోంశాఖ ముద్దుగా పిలిచే వామపక్ష తీవ్రవాద (ఎల్‌డబ్యూఈ) ప్రభావిత ప్రాంతమే. సాయుధ మావోయిస్టు ఉద్యమాన్ని భారత దేశపు మొట్టమొదటి స్థాయి భద్రతా సమస్యగా నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సరిగ్గా అంచనా వేశారు.

అయినాగానీ యూపీఏ ప్రభుత్వం మావోయిస్టులతో వ్యవహరించే విషయంలో పరస్పర విరుద్ధ వైఖరులను అనుసరించింది. పోలీసు, కేంద్ర బలగాలు మావోయిస్టులకు కలిగించిన నష్టాలతో పోలిస్తే, అవే చాలా పెద్ద ఎత్తున  నష్టాలను చవిచూశాయి. ఎప్పుడు హత్యకు గురవుతామో అని లేదా చట్టవిరుద్ధమైన  ‘‘పన్నులు’’,  బలవంతపు వసూళ్లకు ఇక అంతే ఉండదేమో అనే భయం మన రాజకీయ వర్గాలను నిరంతంరం వెంటాడుతుండేది. స్వదేశంలోనే తలెత్తిన లేదా ఐఎస్‌ఐ దన్ను ఉన్న పాకిస్తానీ జిహాదీల వల్ల నిరంతర ప్రమాదం ఇక ఎలాగూ ఉండనే ఉండేది. ఏదేమైనా 2008 తర్వాతి కాలంలో ఈ విషయంలో సుస్థిరత నెల కొంది. అందువల్లనే హోంశాఖ సహాయ మంత్రి కిరణ్‌ రిజ్జు  2014 మేలో ఎల్‌డబ్ల్యూఈ, కశ్మీర్, ఈశాన్యం అనే క్రమంలో మన అంతర్గత భద్రతా సవాళ్లను పేర్కొనడంతో నేను ఏకీభవించవచ్చు.

ఈ రెండున్నరేళ్ల కాలంలో పరిస్థితి గణనీయంగా మారింది. మావో యిస్టు ప్రాబల్య ప్రాంతం సాపేక్షికంగా ప్రశాంతంగా ఉంది. భద్రతా బలగాల నష్టాలు కనీస స్థాయికి చేరాయి. ఎన్‌కౌంటర్లలో.. వాటిలో చాలావరకు అలా చిత్రించినవి లేదా కల్పనే అయినా... పలువురు చనిపోవడం, పట్టుబడటం వల్ల, పెద్ద ఎత్తున జరిగిన లొంగుబాట్ల వల్ల సాయుధ తిరుగుబాటు శ్రేణుల సంఖ్య బాగా క్షీణించిపోయింది. రాష్ట్రప్రభుత్వాలకు ఆ ప్రాంతాలపై మరింత ఎక్కువ నియంత్రణ ఏర్పడటం, గనుల తవ్వకాలు సాగుతూండటం శుభ సూచకం. కానీ మన మిగతా రెండు ప్రధాన సవాళ్లకు సంబంధించి పరిస్థితి అధ్వానంగా మారింది. ఈ సవాళ్లను ఇప్పుడు కశ్మీర్, ఈశాన్యం, మావో యిస్టు ప్రాబల్య ప్రాంతం అనే ప్రాధాన్య క్రమంలో అమర్చాల్సివస్తోంది.

ఇక ఐఎస్‌ఐ/ఐఎమ్‌/ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదం ముప్పు మునుపటిలాగే పొంచి చూస్తూనే ఉంది. ఒక దశాబ్దం తర్వాత కశ్మీర్‌ ఈ జాబితాలో ప్రథమ స్థానం లోకి వచ్చింది. అందుకు పలు బహిర్గత, అంతర్గత అంశాలు కారణం. ప్రస్తుతం పాక్‌తో మన సంబంధాలు మరీ దిగజారి ఉన్నాయి. మన వైపు నుంచి తీసుకున్న రాజకీయ నిర్ణయమే అందుకు కారణం. అయితే కశ్మీర్‌కు  సంబంధించి అత్యంత ఆందోళనకరమైన కోణం మాత్రం అంతర్గతమైనదే. గత కొన్ని నెలలుగా కశ్మీర్‌ లోయలో నెలకొన్న అశాంతి అత్యంత అధ్వానంగా ఉన్న 2010–11 రోజులను జ్ఞప్తికి తెస్తోంది. అయితే, శాంతియుతంగా ఎన్ని కలు జరగడం, రాజకీయ క్రమం తిరిగి మొదలుకావడంవల్ల సిద్ధించిన రాజ కీయ ప్రయోజనాలను చాలా వరకు కోల్పోవాల్సి రావడం మరింత ప్రాధా న్యం గల అంశం. రాజనీతియుక్తంగా పరస్పర విరుద్ధ భావజాల శక్తు లైన పీడీపీ, బీజేపీల మధ్య ఏర్పడ్డ కలయిక నుంచి ఎంతో ప్రయోజనం సిద్ధిస్తుం దని ఆశించాం. కానీ కార్యరంగంలో అది  విఫలమైంది. అది నిజంగా సాధిం చగలిగి ఉండగలిగే దానితో పోలిస్తే ఆ కూటమి కృషి దానికి నీడగా కూడా మిగలలేదు. ఈ వారం మొదట్లో ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ మాట్లాడి నదానిలో ఆవేదనే ఎక్కువ తప్ప, నిజంగా స్థానిక ప్రజలపై యుద్ధం సాగించా లనే ఉద్దేశం మాత్రం కాదు. కశ్మీర్‌ లోయలో క్షేత్ర స్థాయిలో తలెత్తున్న పరిస్థితి వల్ల కలిగిన నిస్పృహ అది.

వాజ్‌పేయి విధానం ఇదేనా?
వాస్తవాధీన రేఖపై ఎదురయ్యే సవాళ్లకు ఇది భిన్నమైనది. అక్కడి పరిస్థితితో వ్యవహరించగల శక్తిసామర్థ్యాలు మన సైన్యానికి దండిగా ఉన్నాయి. మనది యుద్ధాల్లో రాటుదేలిన సేన, సమరోత్సాహంతో ఉవ్విళ్లూరుతూంటుంది. కానీ అల్పస్థాయి, పట్ణణ సైనిక చర్యలను చేపట్టడం, ఆగ్రహావేశపరులై ఉన్న వేలాది మంది పౌరులతో వ్యవహరించడం అనేవి పూర్తిగా విభిన్నమైనవి. అలాంటి సమస్యలతో వ్యవహరించడానికి మన సైన్యం సంసిద్ధమై లేదు. అల్లర్లకు దిగే గుంపులవద్ద ఉండే అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలు రాళ్లే. ఇజ్రాయెల్, తమ ప్రజలుగా భావించని అలాంటి గుంపు లపై ప్రయోగించిన ఎంతో కఠిన చర్యలు ౖసైతం ఫలితాలను ఇవ్వలేదు. కాబట్టి ఇజ్రాయెల్‌ సైనిక మేధస్సు అనేది ఉత్త డొల్లగా బయటపడిపోయింది. ఇజ్రాయెల్‌ ప్రయోగిం చిన పద్ధతులతో ఏ కొద్దిగానో పోల్చడానికైనా తగిన ఎలాంటి ప్రాణాంతక మైన లేదా ప్రాణహాని కలిగించని ఆయుధాలను సొంత భూభాగంలోని ప్రజ లపై  భారత సైన్యం ప్రయోగించగలిగే అవకాశం లేదు.

కశ్మీరీ ప్రజలను, ప్రత్యేకించి యువతను పాలనలో మరింతగా భాగస్వా ములను చేయడంలో, మరీ ముఖ్యంగా భవిష్యత్తు పట్ల ఆశావాదంతో ఉండ గలిగేలా చేయడంలో ఎన్‌డీఏ ప్రభుత్వం, జమ్మూకశ్మీర్‌లోని పీడీపీ–బీజేపీ కూటమి విఫలమయ్యాయి. అదే వాటి ప్రధాన వైఫల్యం. ఈ క్రమంలో, ఒకçప్పటి 2002కు ముందటి రక్తసిక్త కాలం నాటిలో లాగే కశ్మీర్‌ సమస్యను పూర్తి భద్రతాసమస్యగా చూసే వైఖరికి తిరిగిపోయారు. అంటే, గూఢచార సంస్థలను కంట్రోల్‌ రూంలో ఉంచి సైన్యాన్ని ముందుశ్రేణిలో నిలిపే వైఖరికి తిరిగిపోయారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయి అనుసరించిన కశ్మీర్‌ విధానమే తనకు ఉత్తేజమని మోదీ అన్నారు. కానీ ఇది వాజ్‌పేయి రచించిన సన్నివేశం కాదు. ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత మోదీపైనే ఉంది. అందుకు ఆయన చేయాల్సిన కృషి రాజకీయపరమైనదే తప్ప వ్యూహా త్మకమైనది, ఎత్తుగడలపరమైనది లేదా సైనికపరమైనది కాదు.

కేంద్ర సాయుధ బలగాలను (సీఏపీఎఫ్‌లను) ఎంత విస్తృత స్థాయిలో మోహరింపజేశామనేది అంతర్గత భద్రతకు ముఖ్య సూచిక. సంఖ్య రీత్యా వాటి బలం నేడు 10 లక్షలకు దాటింది  (మన రెగ్యులర్‌ సైన్యం 13 లక్షలు). ప్రపంచంలోనే మనది అతి పెద్ద ఈఏపీఎఫ్‌. ఆ బలగాలను మనం దాదా పుగా రిజర్వు బలగాలే లేని విధంగా పూర్తి స్థాయిలో మోహరించాం. రాష్ట్రాల ఎన్నికలు కూడా కొంతవరకు కారణం. అయితే మార్చి తర్వాత సైతం వాటికి కాస్త వెసులుబాటు కలగడం కష్టమే. రాజకీయ క్రమం తిరిగి మొదలైతే తప్ప, చలికాలపు మంచు కరగడం ప్రారంభం కావడంతోనే కశ్మీర్‌లోయలో తిరిగి ‘‘సైనికచర్యల’’ కాలం ప్రవేశి స్తుంది. అది కూడా ఇందుకు కొంతవరకు కారణం. అయితే, ఇంతవరకు తక్కువ ఆందోళనకరంగా ఉన్న ఈశాన్యంలోకూడా ఇప్పుడు అశాంతికర కార్యకలాపాలు ఉ«ధృతమవుతున్నాయి.

మళ్లీ రగులుతున్న ఈశాన్యం
1980ల మధ్యలో రాజీవ్‌గాంధీ మిజోరాం తిరుగుబాటుదార్లతో, అస్సాం ఆందోళనకారులతో శాంతి ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఆ తర్వాత ఇంతగా ఆందోళనలు సాగుతుండటం ఇప్పుడే. గతంతో పోలిస్తే ఈశాన్యంలో ఇప్పుడు తక్కువ సైన్యం ఉంది. ఈశాన్యంలో తిరిగి రాజుకుం టున్న సమస్య సైనికపరమైనది కాదు, రాజకీయమైనది. దానితో వ్యవహరిం చడం ఇంకా ఎక్కువ కష్టభరితమైనది. మణిపూర్, జాతుల మధ్య అరాచకం చురుగ్గా ఉన్న రాష్ట్రం. అక్కడికి మరిన్ని సీఆర్‌పీఎఫ్‌ కంపెనీలను, వైమానిక దళ  విమానాల్లో డీజిల్‌ను పంపడమూ తప్ప ఎవరూ ఏమీ చేస్తున్నట్టు అని పించడం లేదు. వేర్పాటువాద తిరుగుబాటు ఏళ్ల తరబడి సద్దుమణిగి ఉన్న సమయంలో ఈ పరిస్థితిని ఎవరూ ఊహించలేదు. లోయలోని ప్రజలకు, కొండలలోని తెగలకు మధ్య సంఘర్షణ కాబట్టి పరిపాలనా వైఫల్యం కొన సాగుతోంది.

ఇక కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఎన్నికల లబ్ధికోసం రాజకీయ క్రీడ సాగిస్తున్నాయి. నాగాలాండ్‌ కథ మరింత సంక్లిష్టమైనది, నిరుత్సాహ çకరమైనది. అతిపెద్ద తిరుగుబాటు గ్రూపుతో ఒకే ఒక్క పేజీ సూత్రప్రాయ అంగీకారపత్రంపై సంతకాలు చేసి, ఒప్పందం కుదురిందన్నారు. దీంతో శాంతి ప్రక్రియ చల్లారిపోతున్నది. వివిధ గ్రూపుల మధ్య వైరం, సంఘర్షణ లకు ఇది సమయాన్ని కల్పించింది. ఈ గ్రూపులన్నీ బహిరంగంగా ఆయు ధాలు ధరించి ‘‘పన్నులు’’ వసూలు చేస్తున్నాయి. ఆయా గ్రూపులకు  వాటి సొంత ప్రాబల్య ప్రాంతాలున్నాయి. అక్కడ వాటికి ఎదురు లేదు. స్థానికు లతో కలగలసిపోయి  అరుణాచల్‌ లోతట్టు జిల్లాలకు అవి విస్తరిస్తున్నాయి. ఇది త్వరలోనే సున్నితమైన చమురు జిల్లాలున్న ఎగువ అస్సాంకు వ్యాపించ నుంది. రెండు దశాబ్దాల తర్వాత ఈశాన్యం నేడు తిరిగి సమస్యాత్మక ప్రాతం అవుతోంది. మొత్తంగా చూస్తే మన అంతర్గత  భద్రత పరిస్థితి ఇంత కంటే చాలా మెరుగ్గా ఉండాల్సింది.

తాజా కలం: కశ్మీర్‌లోయలోని అశాంతి నాకు, 1989లో నాటి హోం మంత్రి బూటాసింగ్‌తో జరిగిన ఒక సంభాషణ నుæ గుర్తుకుతెస్తోంది. నాటి రష్యా విదేశాంగ మంత్రి ఎడ్వర్డో షెవర్దనాజే ఆయనను ఒకసారి... ఇంతింత భారీ గుంపులతో భారత్‌ ఎలా వ్యవహరిస్తోందని ఆశ్యర్యం వ్యక్తం చేశారట. దానికి బూటాసింగ్‌ ‘‘గుంపులను అదుపు చేయడానికి మేం సైన్యాన్ని ప్రయో గించం. వారు చేయగలిగింది మారణాయుధ ప్రయోగమే... అందుకు మాకు సీఆర్‌పీఎఫ్‌ అనే బలగం ఉంది. కావాలంటే మీ వాళ్లకు శిక్షణ ఇవ్వడా నికి ఓ రెండు బెటాలియన్లను పంపుతాను’’ అన్నారట.


- శేఖర్‌ గుప్తా

twitter@shekargupta

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement