National interest
-
విస్మరిస్తే చంపెయ్యాలి: ధన్‌ఖడ్
జైపూర్: దేశం కంటే వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారిని చంపేయాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ వ్యాఖ్యానించారు. దేశ ప్రయోజనాలను పరమోన్నతంగా భావించని వారు వెల్లడించే అభిప్రాయం దేశ వ్యతిరేకంగానే ఉంటుందని పేర్కొన్నారు. దేశం ముందుకు సాగాలంటే ఇటువంటి వారిని అడ్డుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అయినా వారు జాతి అభివృద్ధికి హానికరమైన తమ చర్యలను కొనసాగిస్తున్న పక్షంలో చంపేయాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నానన్నారు. విభిన్న అభిప్రాయాలను కలిగి ఉండటం ప్రజాస్వామ్యమనే పుష్పగుచ్ఛంలో పరిమళాలన్న ఉపరాష్ట్రపతి.. వ్యక్తిగత, రాజకీయ లాభం కంటే జాతి ప్రయోజనాలను మిన్నగా చూసుకునే వారికే ఇది వర్తిస్తుందన్నారు. మన గుర్తింపు భారతీయత, మన జాతీయ ప్రయోజనాలను కాపాడుకునే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడరాదన్నారు. ఆదివారం జైపూర్‌లో అవయవదాతలతో ఏర్పాటైన సమావేశంలో ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ మాట్లాడారు. -
మన దూకుడు ఇలాగే సాగాలి
జాతిహితం భారత క్రికెట్ సాధించిన ఆసాధారణ మెరుగుదలకు సంబంధించిన మధురమైన మలుపు 2000లో గంగూలీ కెప్టెన్ కావడం. ఆ పరంపరలో వచ్చిన ఆకలిగొన్న, దూకుడు ఆటగాళ్ల వల్ల మన క్రికెట్ ఉన్నత శిఖరాలకు చేరింది. గత కాలపు స్టార్ క్రికెటర్లకు భిన్నంగా నేటి క్రీడాకారులు ఓటమిని సహించరు. మన క్రికెట్ అలాగే ఉండాలి. కానీ మన కొత్త క్రికెట్ బోర్డు సదుద్దేశాలతోనే అయినా... క్రికెట్ ఆట ఇంకా పాతకాలపు పెద్దమనుషుల ఆటేనని పొరబడి దీన్ని వెనక్కు మరల్చాలని చూస్తోంది. ఎన్నికల ఫలితాల కోసం మీరు ఉదయాన్నే నిద్ర లేచేసరికే నేను చప్పుడు చేయకుండా, మన క్రికెట్ గురించి కొన్ని తీవ్రవ్యాఖ్యలను చేసేస్తాను. ఈ వ్యాఖ్యలు చేయడంలో నా ఉద్దేశాలు మాత్రం మన క్రికెట్‌కు మంచి చేసేటం తటి ఉదాత్తమైనవి. ‘‘సముచితమైన నడవడిక, స్నేహశీలత, మంచి పెంపకం ఉన్న’’ క్రీడాకారులతో కూడినదిగా ఉన్నంత కాలం మన క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ జట్టు అంత బాగానే ఉండేదని నా మొదటి వ్యాఖ్య. ఆక్స్ఫర్డ్/స్టీఫెన్ కళాశాలల విద్యార్థుల తరానికి చెందిన ‘‘మంచివాళ్లు’’, ‘‘సొగసుగా ఓడి పోయే వారు’’ వైదొలగి.. చిన్న పట్టణాలకు చెందిన హెచ్ఎమ్టీ (హిందీ మీడియం టైపు) వారికి దారివ్వడంతో ‘‘చెడ్డవాళ్లు’’ వృద్ధి చెందడం ప్రారంభ మైంది. ఇది నా రెండో వ్యాఖ్య. ఆ తదుపరి మన క్రికెట్ క్రీడా నైపుణ్యాలు అసాధారణమైన రీతిలో మెరుగుపడ్డాయి. దేశ చరిత్రలో ఇంతవరకు ఆడిన క్రీడాకారులతో నేడు అత్యుత్తమ భారత జట్టును, 18 మంది క్రీడాకారులతోఎంపిక చేసి చూడండి. అందులో 1992కు ముందటి 25 ఏళ్ల కాలానికి చెందిన స్టార్ క్రీడాకారులు ముగ్గురికి మించి ఎంపిక కారు (గవాస్కర్, విశ్వనాథ్, కపిల్). ఈ ముగ్గురిలోకి పాత వాడైన విశ్వనాథ్ 1969లో తొలి టెస్ట్ ఆడారు. అంటే 1932–1969 మధ్య జరిగిన 115 టెస్టులలో ఆడిన వారెవరూ ఈ జట్టులోకి రాలేకపోయారు. గతంలో మన స్పిన్ చతుష్టయం (బిషన్‌సింగ్ బేడీ, ఎర్రపల్లి ప్రసన్న, బీఎస్ చంద్రశేఖర్, ఎస్ వెంకటరా«ఘవన్) అద్భుతమైనదే. కానీ ఇక ఎంత మాత్రమూ అది ఇంత వరకూ గడచిన కాలానికంతటికీ గొప్పది కాదు. ఈ వ్యాఖ్య బహుశా మరింత వివాదాస్పదమైనది కావచ్చు. వారి తర్వాత ఇటీ వలి కాలానికి చెందిన నలుగురు స్పిన్నర్లు... అనిల్ కుంబ్లే, హర్బజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్, ఊపిరి బిగబట్టి వినండి సర్ రవీంద్ర జడేజా. నాటి దిగ్గజాల కంటే నేటి క్రికెటర్లే మిన్న ఈ వాదనలో నాకు ఇద్దరు తోడుగా ఉన్నారు. భారత అత్యుత్తమ క్రికెట్ గణాంక నిపుణుడు మోహన్‌దాస్ మీనన్, హార్పర్ కాలిన్స్వారి అద్భుతమైన కొత్త పుస్తకం ‘నంబర్స్ డు(నాట్) లై’. గణాంకాలను అద్భుతంగా విశ్లేషించే జట్టు ప్రభావ సూచీ ఈ పుస్తకంలో ఉంది. ఒకప్పటి మన టెస్ట్ క్రికెట్ ఓపె నర్, నేటి కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆ పుస్తకంలో దానిని వివరించారు. నా గణాంకపరమైన వివరాలన్నింటికీ ఆధారం మీనన్. పాత కథలు, గత జ్ఞాప కాల మక్కువలకు మించి ఒక క్రీడాకారుడిని గొప్పవాణ్ణి చేసేది ఏమిటో తేల్చే తర్కాన్ని ‘నంబర్స్ డు(నాట్) లై’ అందించింది. లేదంటే నేనిలాంటి వ్యాఖ్యలు చేసే వాడినే కాదు. రాజకీయ వ్యవస్థతో వాదనకు దిగడం వేరు. అదే క్రికెట్ విరాట్టులుగా ఆరాధనలను అందుకుంటున్నవారిని సవాలు చేయడం ఘోర అపచారం. 1932–67 మధ్య భారత్ తొలి 100 టెస్టు మ్యాచ్‌లను ఆడింది. ఇందులో కేవలం 10 సార్లు గెలిచి, 40 సార్లు ఓడిపోయింది. ఆ పురాతన కాలం నాటి మన జట్టు, నేటి బంగ్లాదేశ్ జట్టుకంటే మెరుగ్గా ఉండేదేం కాదు. అది 2000 తర్వాత ఇంతవరకు ఆడిన 98 టెస్టులలో 8 టెస్టులలో గెలిచింది. వినూ మన్కడ్, లాలా అమర్నాథ్, పాలీ ఉమ్రీగర్, పంకజ్‌రాయ్, సీకే నాయుడు, సుభాష్ గుప్తే, నారీ కంట్రాక్టర్, బాపూ నడకర్ణి, నవాబ్ ఆఫ్ పటౌడీ, చందు బోర్డె తదితరులపై మనకున్న ఆరాధనను పట్టించుకోకండి. దక్షిణాఫ్రికా జాతి వివక్షను పాటించడం వల్ల అప్పట్లో ఆ జట్టుపై నిషేధం ఉండేది. ఆ తదుపరి 25 ఏళ్లలో (1967–91) భారత విజయాల శాతం రెట్టింపైంది. 174 టెస్టు లలో 34 విజయాలు లభించాయి. ఆ తర్వాతి 25 ఏళ్లలో (1992–2017) విజయాలు మళ్లీ రెట్టింపై 39.2 శాతానికి చేరాయి. దీంతో మన జట్టు పరా జయాల శాతం కూడా తగ్గింది. గంగూలీ శకం... విజయ పథం భారత క్రికెట్లో వచ్చిన అసాధారణమైన మెరుగుదలలో మరో మధు రమైన మలుపు ఉంది. అది నవంబర్ 2000లో అసలు సిసలు ‘‘చెడ్డ అబ్బాయి’’ సౌరవ్ గంగూలీ మన క్రికెట్ జట్టుకు కెప్టెన్ కావడం. ఆ తదుపరి ఆడిన 177 టెస్టులలో మన గెలుపుల రికార్డు మరింతగా మెరుగుపడి, ఓట ములు పడిపోయాయి. వాస్తవానికి మీనన్ గుర్తుచేసినట్టుగా అప్పటి నుంచి మన జట్టు 43.5% విజయాల రికార్డుతో ఆస్ట్రేలియా(60.6%), దక్షిణాఫ్రికా (49%)ల కంటే మాత్రమే వెనుకబడి గౌరవప్రదమైన మూడో స్థానంలో ఉంది. ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్తాన్ల కంటే ముందుంది. ఈ గంగూలీ శకంలోనే దిక్కుమాలిన వివాదాలలో క్రికెట్ వాటా కూడా పెరిగిందని చెప్పడానికి గణాంకవేత్తలు అవసరం లేదు. గంగూలీ సంతో షంగా ముల్లును ముల్లుతోనే తీసే వైఖరిని అవలంబించేవాడు, ప్రత్యర్థుల ఏకాగ్రతను దెబ్బతీయడం కోసం దూషణలకు దిగడంలో ఆస్ట్రేలియా క్రీడా కారులను మించిపోయేవాడు. లార్డ్స్ మైదానం బాల్కనీలో చొక్కా విప్పి ఊపినవాడతను. తనకి ముందటి ప్రముఖ క్రీడాకారులు ఎవరూ వీటిలో దేనినీ ఆమోదించేవారు కారు. మధ్యాహ్నం పూట బీరు తాగే కొందరు ముసలాళ్లు, కుక్కలు తప్ప మరెవరూ చూడని మ్యాచ్‌లంటూ కౌంటీ క్రికెట్‌ను ఈసడించి, ఎమ్‌సీసీ ఆహ్వానాన్ని తిరస్కరించిన ఖ్యాతి సునీల్ గవాస్కర్‌కే దక్కుతుంది. కాకతాళీయంగా గంగూలీ ఎదుగుదలతో పాటే భారత క్రికెట్ సామాజిక పరివర్తన కూడా సాగింది. మొరటుదనం ఉన్న, చిన్న పట్టణాలకు చెందిన, ఇంగ్లిషు మీడియంలో చదువుకోని, కాలేజీ మొహం చూడని (సచిన్ టెండూ ల్కర్ కూడా అదే బాపతు) క్రీడాకారులు జాతీయ జట్టులోకి ప్రవేశించారు. మనేకా గాంధీ ఆధునిక ప్రయోగంగా తాజాగా వాడుకలోకి తెచ్చిన పద బంధాన్ని ఉపయోగించి చెప్పాలంటే ఇది నిజంగానే ‘‘హార్మోన్ల విస్ఫో టనం’’. ఇది కేవలం క్రికెట్‌కే పరిమితం కాలేదు. ఇదే కాలంలో భారత హాకీ వైఖరి, ఆట తీరు కూడా మారింది. రమేష్ క్రిష్ణన్ లేదా విజయ్ అమృతరాజ్‌ల నైపుణ్యంలో బహుశా ఒక భాగం మాత్రమే ఉన్న లియాండర్ పేస్ టెన్నిస్ టూర్లలో, డేవిస్ కప్ పోటీలలో మరిన్ని ఎక్కువ విజయాలను సాధించాడు. ఆ ఉరవడిలోనే నిర్దాక్షిణ్యమైన వ్యాపారవేత్తలు లేదా రాజకీయవేత్తలు బీసీసీఐ లోకి ప్రవేశించారు. ఇంగ్లండ్‌ను మెచ్చుకునే రాకుమారులు, బడా వ్యాపార వేత్తల శకం ముగిసిపోయింది. జగ్మోహన్ దాల్మియా, గంగూలీ, ఐఎస్ బింద్రా, లలిత్ మోదీ, ఎన్ శ్రీనివాసన్‌లు రంగ ప్రవేశం చేశారు. వారికీ, ఒక ప్పటి విజయ్ మర్చంట్, రాజ్‌సింగ్ దుంగార్పూర్, మాధవ్ రావ్ సింథియా, ఆర్పీ మిశ్రా, ఫతేసింగ్ రావు గేక్వాడ్, అందరిలోకీ అత్యుత్తమమైన పెద్ద మనిషి విజయనగరం మహారాజ్కుమార్ లేదా విజ్జీలకూ పోలికే లేదు. ఒక ఇంగ్లిషు జట్టును తమ రాజప్రాసాదాలకు తీసుకురావడమే వారికి గొప్ప. అడ్డూ అదుపూ లేకుండా బోరవిరుచుకుని, చొక్కాలు విడిచేసి తిరిగే శకంలోకి భారత్ ప్రవేశిస్తోంది. ఈ మార్పు మన క్రికెట్లోని సంప్రదాయవాదులకు, పాత వ్యవస్థ (ఇంగ్లండు–ఆస్ట్రేలియా)లకు వేరు వేరు కారణాలతో మింగుడు పడటం లేదు. నేటి స్పిన్నర్లు బేడీ/ప్రసన్న తరగతికి చెందవచ్చు, చెందకపోవచ్చు. కానీ వారు ఎన్నడూ చేసి ఎరుగని విధంగా వీరు తమ బంతిని బౌండరికి కొట్టినందుకు బ్యాట్స్‌మన్‌ను ప్రశంసించడం కనిపిస్తుంది. గంగూలీ పూర్వ కాలంలో మన మొదటి నిజమైన నాటురకపు, దూకుడు ఆటగాడిగా కపిల్ దేవ్‌ను చూశాం. 1992 పోర్ట్ ఎలిజెబెత్ టెస్ట్‌లో నాన్ స్రై్టకింగ్ బ్యాట్స్‌మన్‌గా ఉన్న పీటర్ కిర్‌స్టన్ బౌలర్ బంతిని వేయడానికి ముందే క్రీజును దాటి నందుకు కపిల్ రన్ ఔట్ చేశాడు (మాన్కేడింగ్). అందుకుగానూ కిర్‌స్టన్ తన బ్యాట్‌తో కపిల్‌ను కొట్టాడు. ఆ బహిరంగ అవమానాన్ని, శారీరకమైన బాధను కపిల్ దిగమింగాల్సి వచ్చింది. విరాట్ కోహ్లి, ఇషాంత్ శర్మ లేదా అశ్విన్‌లను అలా ఎవరైనా చేయగలరా? అది గతించిన గతం... ఇది క్రికెట్ విప్లవం పంజాబీ మాట్లాడే, బిడియంగా ఉండే పాకిస్తాన్ క్రికెట్ జట్టును ఇమ్రా న్‌ఖాన్ 1970లలో ప్రపంచ చాంపియన్లుగా మార్చాడు. ఇమ్రాన్ తమ క్రీడా కారుల భయాన్ని పోగొట్టి, విదేశీయులన్న భావనను దూరం చేశాడు. సూటు, టై «అలవాటులేకపోతే అధికారిక కార్యక్రమాల్లో సల్వార్–కమీజ్ వేసు కోండి, పత్యర్థులను ఎన్నడూ ‘‘సర్’’ అని పిలవకండి, దేనికైనాగానీ సారీ చెప్పకండి, అవసరమైతే శాపనార్థాలు పెట్టండి, ఇంగ్లిష్ రాకపోతేనేం, పంజా బీలో ఆ పని చేయండి, అయినా అది వాళ్లకు అర్థమౌతుంది అని వారికి బోధించాడు. గంగూలీ వచ్చాక భారత క్రికెట్లో కూడా అ విప్లవమే వచ్చింది. ఆకాశ్ చోప్రా రాసిన పుస్తకంలో కపిల్‌కు భారత దేశపు ప్రభావశీల క్రీడా కారులలో స్థానం దక్కలేదు. అయినా ఆ పుస్తకావిష్కరణకు కపిల్ పెద్ద మనసుతో వచ్చాడు. పాత ‘‘బోంబే స్కూల్’’ బ్యాటింగ్‌లో బ్యాట్స్‌మన్ బాల్‌ను బాదినప్పుడు ఫాస్ట్ బౌలర్ మొహంలోకి చూస్తే, ఎక్కడ అతనికి చిర్రెత్తుతుందోనని చూసేవాడు కాడని కపిల్ చెప్పాడు. ఇప్పుడు కోహ్లి బంతులను బౌండరీకి కొట్టి ‘‘పోయి తీసుకురా’’ అంటాడు బౌలర్లను. నేటి మన పెద్దమనిషి తరహా కొత్త క్రికెట్ బోర్డు సదుద్దేశాలతోనే అయినా... క్రికెట్ ఆట అంటే ఇంకా పాతకాలపు పెద్దమనుషుల ఆటేననే పొరబాటు నమ్మకంతో దీన్ని వెనక్కు మరల్చాలని చూస్తోంది. తాజా కలం : నేను చివరగా చేసిన వ్యాఖ్యపై రేగే దుమారం నుంచి తప్పించుకోవాలని చూడటం లేదు. మన అతి గొప్ప స్పిన్నర్లు ఎవరు? 52 రన్స్‌కు ఒక వికెట్ చొప్పున తీసిన అశ్విన్ 1945 తర్వాత ప్రపంచంలోనే అత్యధిక స్ట్రయికింగ్ రేట్‌ను నమోదు చేసిన స్పిన్నర్‌గా నిలిచాడు. మురళి (55), వార్న్ (57)లకంటే ముందున్నాడు. ఇండియాకువస్తే జడేడా, కుంబ్లేలు 62, 66 రన్స్‌తో వరుసగా అశ్విన్ తర్వాత నిలిచారు. పాత స్పిన్నర్ల చతు ష్టయం కుంబ్లే (66) తర్వాత ఉంది. ప్రసన్న (76), బేడీ (80), వెంకట్ (95)lవెనుకబడి ఉన్నారు. బజ్జీ (69) సైతంlవారికంటే ముందే ఉన్నాడు. అందువల్లనే వారెవరూ ప్రభావశీల సూచీ/ఆకాశ్ చోప్రా ప్రభావశీల క్రీడా కారుల జాబితాలో లేరు. అది ఎంతటి అపచారంగానైనా కనిపించొచ్చు నేటి భారత జట్టులోకి వారు ప్రవేశించలేరు. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
ఆందోళనకరం అంతర్గత భద్రత
జాతిహితం కశ్మీరీ ప్రజలలో, ప్రత్యేకించి యువతలో ఆశావాదాన్ని నింపడంలో ఎన్డీఏ ప్రభుత్వం, జమ్మూకశ్మీర్‌లోని పీడీపీ–బీజేపీ కూటమి విఫలమయ్యాయి. ఒకప్పటిలాగే కశ్మీర్‌ను పూర్తి భద్రతా సమస్యగా చూసే వైఖరికి తిరిగిపోయారు. వాజ్‌పేయి కశ్మీర్ విధానమే తనకు ఉత్తేజమని మోదీ అన్నారు. కానీ ఇది వాజ్‌పేయి రచించినది కాదు. ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత మోదీపైనే ఉంది. అందుకు ఆయన చేయాల్సిన కృషి రాజకీయమైనదే తప్ప సైనికమైనది కాదు. దాదాపు దశాబ్ద కాలంగా దేశం ఇంతకు మున్నెన్నడూ ఎరుగని రీతిలో అంతర్గతంగానూ, బహిర్గతంగానూ కూడా మరింత ఎక్కువ సురక్షితంగా ఉన్న అద్భుతమైన దశలో ఉన్నదనే వాదన సమంజసమనే అనిపించవచ్చు. అది ముగింపునకు వచ్చేసిందని లేదా మంచైనా, చెడైనా ఏ దశైనా మిగతా అన్నిటిలాగే ముగిసిపోక తప్పదని ప్రకటించడం తొందరపాటు కావచ్చు. బహిర్గత పరిస్థితికి వస్తే, నెలల తరబడి వాస్తవాధీన రేఖ మండుతున్నా, మునుపటిలాగే ఉన్నది. మన సరిహద్దులన్నీ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నాయి. కొత్తగా వచ్చిన ముప్పు ఏమీ లేదు. కానీ అంతర్గత పరిస్థితి మాత్రం బాగా ఆందోళనకరమని అనిపించసాగే స్థాయికి దిగజారింది. నరేంద్ర మోదీ ప్రభుత్వ పదవీ కాలం సగం ముగిసేసరికి అంతర్గత భద్రతకు సంబంధించిన పనితీరు సూచిక ఏ మాత్రం ఉత్సాహకరంగా లేదు. రెండున్నరేళ్లలో అంతా తలకిందులు 2014 వేసవిలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి అంతర్గత పరిస్థితిలో సమంజసమైన స్థాయి సుస్థిరత నెలకొని ఉంది. కశ్మీర్ ప్రశాంతంగా ఉండగా, ఈశాన్యం దాదాపుగా పతాక శీర్షికలకు దూరంగా ఉంది. అప్పట్లో ఎక్కువ ఆందోళనకరం ఉన్నది తూర్పు భారతం, ఆదివాసి భారతాల్లోని మావోయిస్టు లేదా హోంశాఖ ముద్దుగా పిలిచే వామపక్ష తీవ్రవాద (ఎల్డబ్యూఈ) ప్రభావిత ప్రాంతమే. సాయుధ మావోయిస్టు ఉద్యమాన్ని భారత దేశపు మొట్టమొదటి స్థాయి భద్రతా సమస్యగా నాటి ప్రధాని మన్మోహన్సింగ్ సరిగ్గా అంచనా వేశారు. అయినాగానీ యూపీఏ ప్రభుత్వం మావోయిస్టులతో వ్యవహరించే విషయంలో పరస్పర విరుద్ధ వైఖరులను అనుసరించింది. పోలీసు, కేంద్ర బలగాలు మావోయిస్టులకు కలిగించిన నష్టాలతో పోలిస్తే, అవే చాలా పెద్ద ఎత్తున నష్టాలను చవిచూశాయి. ఎప్పుడు హత్యకు గురవుతామో అని లేదా చట్టవిరుద్ధమైన ‘‘పన్నులు’’, బలవంతపు వసూళ్లకు ఇక అంతే ఉండదేమో అనే భయం మన రాజకీయ వర్గాలను నిరంతంరం వెంటాడుతుండేది. స్వదేశంలోనే తలెత్తిన లేదా ఐఎస్ఐ దన్ను ఉన్న పాకిస్తానీ జిహాదీల వల్ల నిరంతర ప్రమాదం ఇక ఎలాగూ ఉండనే ఉండేది. ఏదేమైనా 2008 తర్వాతి కాలంలో ఈ విషయంలో సుస్థిరత నెల కొంది. అందువల్లనే హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజ్జు 2014 మేలో ఎల్‌డబ్ల్యూఈ, కశ్మీర్, ఈశాన్యం అనే క్రమంలో మన అంతర్గత భద్రతా సవాళ్లను పేర్కొనడంతో నేను ఏకీభవించవచ్చు. ఈ రెండున్నరేళ్ల కాలంలో పరిస్థితి గణనీయంగా మారింది. మావో యిస్టు ప్రాబల్య ప్రాంతం సాపేక్షికంగా ప్రశాంతంగా ఉంది. భద్రతా బలగాల నష్టాలు కనీస స్థాయికి చేరాయి. ఎన్కౌంటర్లలో.. వాటిలో చాలావరకు అలా చిత్రించినవి లేదా కల్పనే అయినా... పలువురు చనిపోవడం, పట్టుబడటం వల్ల, పెద్ద ఎత్తున జరిగిన లొంగుబాట్ల వల్ల సాయుధ తిరుగుబాటు శ్రేణుల సంఖ్య బాగా క్షీణించిపోయింది. రాష్ట్రప్రభుత్వాలకు ఆ ప్రాంతాలపై మరింత ఎక్కువ నియంత్రణ ఏర్పడటం, గనుల తవ్వకాలు సాగుతూండటం శుభ సూచకం. కానీ మన మిగతా రెండు ప్రధాన సవాళ్లకు సంబంధించి పరిస్థితి అధ్వానంగా మారింది. ఈ సవాళ్లను ఇప్పుడు కశ్మీర్, ఈశాన్యం, మావో యిస్టు ప్రాబల్య ప్రాంతం అనే ప్రాధాన్య క్రమంలో అమర్చాల్సివస్తోంది. ఇక ఐఎస్ఐ/ఐఎమ్/ఐఎస్ఐఎస్ ఉగ్రవాదం ముప్పు మునుపటిలాగే పొంచి చూస్తూనే ఉంది. ఒక దశాబ్దం తర్వాత కశ్మీర్ ఈ జాబితాలో ప్రథమ స్థానం లోకి వచ్చింది. అందుకు పలు బహిర్గత, అంతర్గత అంశాలు కారణం. ప్రస్తుతం పాక్‌తో మన సంబంధాలు మరీ దిగజారి ఉన్నాయి. మన వైపు నుంచి తీసుకున్న రాజకీయ నిర్ణయమే అందుకు కారణం. అయితే కశ్మీర్‌కు సంబంధించి అత్యంత ఆందోళనకరమైన కోణం మాత్రం అంతర్గతమైనదే. గత కొన్ని నెలలుగా కశ్మీర్ లోయలో నెలకొన్న అశాంతి అత్యంత అధ్వానంగా ఉన్న 2010–11 రోజులను జ్ఞప్తికి తెస్తోంది. అయితే, శాంతియుతంగా ఎన్ని కలు జరగడం, రాజకీయ క్రమం తిరిగి మొదలుకావడంవల్ల సిద్ధించిన రాజ కీయ ప్రయోజనాలను చాలా వరకు కోల్పోవాల్సి రావడం మరింత ప్రాధా న్యం గల అంశం. రాజనీతియుక్తంగా పరస్పర విరుద్ధ భావజాల శక్తు లైన పీడీపీ, బీజేపీల మధ్య ఏర్పడ్డ కలయిక నుంచి ఎంతో ప్రయోజనం సిద్ధిస్తుం దని ఆశించాం. కానీ కార్యరంగంలో అది విఫలమైంది. అది నిజంగా సాధిం చగలిగి ఉండగలిగే దానితో పోలిస్తే ఆ కూటమి కృషి దానికి నీడగా కూడా మిగలలేదు. ఈ వారం మొదట్లో ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ మాట్లాడి నదానిలో ఆవేదనే ఎక్కువ తప్ప, నిజంగా స్థానిక ప్రజలపై యుద్ధం సాగించా లనే ఉద్దేశం మాత్రం కాదు. కశ్మీర్ లోయలో క్షేత్ర స్థాయిలో తలెత్తున్న పరిస్థితి వల్ల కలిగిన నిస్పృహ అది. వాజ్‌పేయి విధానం ఇదేనా? వాస్తవాధీన రేఖపై ఎదురయ్యే సవాళ్లకు ఇది భిన్నమైనది. అక్కడి పరిస్థితితో వ్యవహరించగల శక్తిసామర్థ్యాలు మన సైన్యానికి దండిగా ఉన్నాయి. మనది యుద్ధాల్లో రాటుదేలిన సేన, సమరోత్సాహంతో ఉవ్విళ్లూరుతూంటుంది. కానీ అల్పస్థాయి, పట్ణణ సైనిక చర్యలను చేపట్టడం, ఆగ్రహావేశపరులై ఉన్న వేలాది మంది పౌరులతో వ్యవహరించడం అనేవి పూర్తిగా విభిన్నమైనవి. అలాంటి సమస్యలతో వ్యవహరించడానికి మన సైన్యం సంసిద్ధమై లేదు. అల్లర్లకు దిగే గుంపులవద్ద ఉండే అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలు రాళ్లే. ఇజ్రాయెల్, తమ ప్రజలుగా భావించని అలాంటి గుంపు లపై ప్రయోగించిన ఎంతో కఠిన చర్యలు ౖసైతం ఫలితాలను ఇవ్వలేదు. కాబట్టి ఇజ్రాయెల్ సైనిక మేధస్సు అనేది ఉత్త డొల్లగా బయటపడిపోయింది. ఇజ్రాయెల్ ప్రయోగిం చిన పద్ధతులతో ఏ కొద్దిగానో పోల్చడానికైనా తగిన ఎలాంటి ప్రాణాంతక మైన లేదా ప్రాణహాని కలిగించని ఆయుధాలను సొంత భూభాగంలోని ప్రజ లపై భారత సైన్యం ప్రయోగించగలిగే అవకాశం లేదు. కశ్మీరీ ప్రజలను, ప్రత్యేకించి యువతను పాలనలో మరింతగా భాగస్వా ములను చేయడంలో, మరీ ముఖ్యంగా భవిష్యత్తు పట్ల ఆశావాదంతో ఉండ గలిగేలా చేయడంలో ఎన్డీఏ ప్రభుత్వం, జమ్మూకశ్మీర్‌లోని పీడీపీ–బీజేపీ కూటమి విఫలమయ్యాయి. అదే వాటి ప్రధాన వైఫల్యం. ఈ క్రమంలో, ఒకçప్పటి 2002కు ముందటి రక్తసిక్త కాలం నాటిలో లాగే కశ్మీర్ సమస్యను పూర్తి భద్రతాసమస్యగా చూసే వైఖరికి తిరిగిపోయారు. అంటే, గూఢచార సంస్థలను కంట్రోల్ రూంలో ఉంచి సైన్యాన్ని ముందుశ్రేణిలో నిలిపే వైఖరికి తిరిగిపోయారు. అటల్ బిహారీ వాజ్‌పేయి అనుసరించిన కశ్మీర్ విధానమే తనకు ఉత్తేజమని మోదీ అన్నారు. కానీ ఇది వాజ్‌పేయి రచించిన సన్నివేశం కాదు. ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత మోదీపైనే ఉంది. అందుకు ఆయన చేయాల్సిన కృషి రాజకీయపరమైనదే తప్ప వ్యూహా త్మకమైనది, ఎత్తుగడలపరమైనది లేదా సైనికపరమైనది కాదు. కేంద్ర సాయుధ బలగాలను (సీఏపీఎఫ్‌లను) ఎంత విస్తృత స్థాయిలో మోహరింపజేశామనేది అంతర్గత భద్రతకు ముఖ్య సూచిక. సంఖ్య రీత్యా వాటి బలం నేడు 10 లక్షలకు దాటింది (మన రెగ్యులర్ సైన్యం 13 లక్షలు). ప్రపంచంలోనే మనది అతి పెద్ద ఈఏపీఎఫ్. ఆ బలగాలను మనం దాదా పుగా రిజర్వు బలగాలే లేని విధంగా పూర్తి స్థాయిలో మోహరించాం. రాష్ట్రాల ఎన్నికలు కూడా కొంతవరకు కారణం. అయితే మార్చి తర్వాత సైతం వాటికి కాస్త వెసులుబాటు కలగడం కష్టమే. రాజకీయ క్రమం తిరిగి మొదలైతే తప్ప, చలికాలపు మంచు కరగడం ప్రారంభం కావడంతోనే కశ్మీర్‌లోయలో తిరిగి ‘‘సైనికచర్యల’’ కాలం ప్రవేశి స్తుంది. అది కూడా ఇందుకు కొంతవరకు కారణం. అయితే, ఇంతవరకు తక్కువ ఆందోళనకరంగా ఉన్న ఈశాన్యంలోకూడా ఇప్పుడు అశాంతికర కార్యకలాపాలు ఉ«ధృతమవుతున్నాయి. మళ్లీ రగులుతున్న ఈశాన్యం 1980ల మధ్యలో రాజీవ్‌గాంధీ మిజోరాం తిరుగుబాటుదార్లతో, అస్సాం ఆందోళనకారులతో శాంతి ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఆ తర్వాత ఇంతగా ఆందోళనలు సాగుతుండటం ఇప్పుడే. గతంతో పోలిస్తే ఈశాన్యంలో ఇప్పుడు తక్కువ సైన్యం ఉంది. ఈశాన్యంలో తిరిగి రాజుకుం టున్న సమస్య సైనికపరమైనది కాదు, రాజకీయమైనది. దానితో వ్యవహరిం చడం ఇంకా ఎక్కువ కష్టభరితమైనది. మణిపూర్, జాతుల మధ్య అరాచకం చురుగ్గా ఉన్న రాష్ట్రం. అక్కడికి మరిన్ని సీఆర్పీఎఫ్ కంపెనీలను, వైమానిక దళ విమానాల్లో డీజిల్‌ను పంపడమూ తప్ప ఎవరూ ఏమీ చేస్తున్నట్టు అని పించడం లేదు. వేర్పాటువాద తిరుగుబాటు ఏళ్ల తరబడి సద్దుమణిగి ఉన్న సమయంలో ఈ పరిస్థితిని ఎవరూ ఊహించలేదు. లోయలోని ప్రజలకు, కొండలలోని తెగలకు మధ్య సంఘర్షణ కాబట్టి పరిపాలనా వైఫల్యం కొన సాగుతోంది. ఇక కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఎన్నికల లబ్ధికోసం రాజకీయ క్రీడ సాగిస్తున్నాయి. నాగాలాండ్ కథ మరింత సంక్లిష్టమైనది, నిరుత్సాహ çకరమైనది. అతిపెద్ద తిరుగుబాటు గ్రూపుతో ఒకే ఒక్క పేజీ సూత్రప్రాయ అంగీకారపత్రంపై సంతకాలు చేసి, ఒప్పందం కుదురిందన్నారు. దీంతో శాంతి ప్రక్రియ చల్లారిపోతున్నది. వివిధ గ్రూపుల మధ్య వైరం, సంఘర్షణ లకు ఇది సమయాన్ని కల్పించింది. ఈ గ్రూపులన్నీ బహిరంగంగా ఆయు ధాలు ధరించి ‘‘పన్నులు’’ వసూలు చేస్తున్నాయి. ఆయా గ్రూపులకు వాటి సొంత ప్రాబల్య ప్రాంతాలున్నాయి. అక్కడ వాటికి ఎదురు లేదు. స్థానికు లతో కలగలసిపోయి అరుణాచల్ లోతట్టు జిల్లాలకు అవి విస్తరిస్తున్నాయి. ఇది త్వరలోనే సున్నితమైన చమురు జిల్లాలున్న ఎగువ అస్సాంకు వ్యాపించ నుంది. రెండు దశాబ్దాల తర్వాత ఈశాన్యం నేడు తిరిగి సమస్యాత్మక ప్రాతం అవుతోంది. మొత్తంగా చూస్తే మన అంతర్గత భద్రత పరిస్థితి ఇంత కంటే చాలా మెరుగ్గా ఉండాల్సింది. తాజా కలం: కశ్మీర్‌లోయలోని అశాంతి నాకు, 1989లో నాటి హోం మంత్రి బూటాసింగ్‌తో జరిగిన ఒక సంభాషణ నుæ గుర్తుకుతెస్తోంది. నాటి రష్యా విదేశాంగ మంత్రి ఎడ్వర్డో షెవర్దనాజే ఆయనను ఒకసారి... ఇంతింత భారీ గుంపులతో భారత్ ఎలా వ్యవహరిస్తోందని ఆశ్యర్యం వ్యక్తం చేశారట. దానికి బూటాసింగ్ ‘‘గుంపులను అదుపు చేయడానికి మేం సైన్యాన్ని ప్రయో గించం. వారు చేయగలిగింది మారణాయుధ ప్రయోగమే... అందుకు మాకు సీఆర్పీఎఫ్ అనే బలగం ఉంది. కావాలంటే మీ వాళ్లకు శిక్షణ ఇవ్వడా నికి ఓ రెండు బెటాలియన్లను పంపుతాను’’ అన్నారట. - శేఖర్ గుప్తా twitter@shekargupta