1/8
నిహారిక కొణిదెల.. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్! యాక్టర్‌గానే కాదు యాంకర్‌గా, ప్రొడ్యూసర్‌గా ఇలా పలు రంగల్లోనూ తన ప్రతిభను చాటుకున్నారు
2/8
నిహారిక.. నటుడు నాగబాబు కూతురన్న విషయం సినీ అభిమానులు అందరికీ తెలిసిందే. నటనపై ఉన్న ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అయితే, తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని కోరుకుంటుంది.
3/8
వెండితెరకు పరిచయమయ్యే ముందు బుల్లితెరపై వ్యాఖ్యతగా చేసింది. తర్వాత ‘ముద్దపప్పు ఆవకాయ్’ అనే లఘు చిత్రంలో నటించి, మెప్పించింది.
4/8
అలా నటనలో ఓనమాలు నేర్చి.. ‘ఒక మనసు’ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ‘సూర్యకాంతం’, ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాల్లో నటించింది.
5/8
తమిళంలోనూ ‘ఒరు నల్లనాళ్ పాత్తు సొల్జేన్’ సినిమాతో రంగప్రవేశం చేసి, మంచి గుర్తింపు పొందింది. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ‘నాన్న కూచి’, ‘మ్యాడ్ హౌస్’ వంటి పలు సిరీస్‌లు చేసింది.
6/8
ఈ మధ్యనే ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ పేరుతో ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి, ప్రొడ్యూసర్‌గానూ మారింది. ఈ సంస్థ నుంచి వచ్చిన ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’, ‘హాలో వరల్డ్’ సిరీస్‌లు సూపర్ హిట్ అయ్యాయి.
7/8
పెళ్లి తర్వాత చిత్ర పరిశ్రమ నుంచి తాత్కాలిక బ్రేక్ తీసుకున్న నిహారిక ఇప్పుడు.. ‘డెడ్ పిక్సెల్స్’ సిరీస్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
8/8
మొదట్లో సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్‌ని చూసి నిహారిక చాలా బాధపడేదట. కానీ రాను రానూ వాటిని పట్టించుకోవడం మానేశారట. అంతేకాదు కొన్ని రూమర్స్ చూసి నవ్వుకుంటానని నిహారిక ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. సైరా సినిమా సమయంలో తనపై వచ్చిన మీమ్స్ చూసి పడీ పడీ నవ్విందట