
ఇప్పుడంటే లెక్కలేనంత మంది సింగర్స్ ఉన్నారు. కొన్నాళ్ల క్రితం అలా కాదు.

వేళ్లపై లెక్కపెట్టేంత మంది గాయనీగాయకులు మాత్రమే ఉండేవారు. వాళ్లలో చిత్ర ఒకరు.

కేరళకు చెందిన ఈమె 1963లో పుడితే.. 1979 నుంచి పాడటం మొదలుపెట్టింది.

గత 45 ఏళ్లుగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఒరియా, బెంగాలీ భాషల్లో ఎన్నో పాటలు పాడింది.

ఈమె కెరీర్‌లో ఇప్పటివరకు 25 వేల పాటలకు పైగా పాడినట్లు తెలుస్తోంది.

ఇప్పటికీ సినిమాల్లో పాటలు పాడుతూ, స్టేజీ షోల్లో జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

చిత్రకు ఆంధ్ర, తమిళనాడు, కేరళ, ఒడిశా, కర్ణాటక, బెంగాలీ స్టేట్ ఫిల్మ్ అవార్డులు వచ్చాయి.

అలాగే ఆరు నేషనల్ అవార్డులు, తొమ్మిది ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ కూడా ఈమె సొంతమయ్యాయి.

కేఎస్ చిత్రని ముద్దుగా భారతీయ మెలోడీ క్వీన్ అని పిలుస్తారు.

ఎస్పీ బాలు, జేసుదాసు దగ్గర నుంచి ఇప్పటి తరం సింగర్స్‌తోనూ చిత్ర గాత్రాన్ని షేర్ చేసుకుంటున్నారు.
















