Top Stories
ప్రధాన వార్తలు

మీ నిబద్ధతకు హ్యాట్సాఫ్! : వైఎస్ జగన్
స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించిన 50 స్థానాలకు గానూ 39 చోట్ల వైఎస్సార్సీపీ కార్యకర్తలు గొప్ప తెగింపు చూపించి గెలిచారు. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం లేనప్పుడు పోటీ చేయకుండా హుందాగా వదిలేయాలి. కానీ చంద్రబాబు అలా కాకుండా నేను సీఎంను, నా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నాకు బలం ఉన్నా లేకపోయినా ప్రతి పదవీ నాకే కావాలి.. ఎవరినైనా నేను భయపెడతా.. కొడతా.. చంపుతా.. ప్రలోభపెడతా..! అనే రీతిలో అహంకారంతో వ్యవహరిస్తున్న తీరును మనం అంతా చూస్తున్నాం. ఇది ధర్మమేనా? న్యాయమేనా? రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే.. తాను చేసిన మంచి పనిని చూపించి, నేను ఈ మంచి పని చేశానని ప్రజల దగ్గరకు ధైర్యంగా వచ్చి చిరునవ్వుతో వారి ఆశీర్వాదం తీసుకునేలా ఉండాలి. కానీ చంద్రబాబు పాలనలో సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయాయి. అవి మోసాలుగా మిగిలాయి మీ జగన్ పాలనలో ప్రతి నెలా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక మేలు జరిగింది. నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లేవి. చంద్రబాబు వచ్చిన తర్వాత నాలుగు వేళ్లు నోట్లోకి పోవడం మాట అటుంచి.. ఉన్న ప్లేటును కూడా తీసేశారు. ఇలాంటి పరిస్థితులలో ఆయన ప్రజల్లోకి వెళ్లలేడు. తన కార్యకర్తలను పంపించి ప్రజలకు ఫలానా మంచి చేశామని చెప్పే పరిస్థితి కూడా లేదు– వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘మీ అందరినీ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.. రాజకీయాలలో ఎప్పుడూ విలువలు, విశ్వసనీయత ఉండాలని నేను చాలా గట్టిగా నమ్మే వ్యక్తిని. నేను అలాగే ఉంటా.. పార్టీ కూడా అలాగే ఉండాలని మొట్టమొదటి నుంచి ఆశించా. కష్టకాలంలో మీ అందరూ చూపించిన తెగువ, స్ఫూర్తికి హ్యాట్సాఫ్..’ అని స్థానిక సంస్థల వైఎస్సార్సీపీ(YSRCP) ప్రజాప్రతినిధులను పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) ప్రశంసించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ప్రలోభాలకు లొంగకుండా.. బెదిరింపులు, అక్రమ కేసులు, దాడులకు వెరవకుండా పార్టీ కోసం గట్టిగా నిలబడిన వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులను అభినందించారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబు మోసాలు క్లైమాక్స్‌కు చేరాయని వ్యాఖ్యానించారు. ‘రాబోయే రోజులు మనవే.. కళ్లు మూసుకుంటే మూడేళ్లు గడిచిపోతాయి. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ మెజార్టీతో అధికారంలోకి వస్తుంది. జగన్ 1.0 పాలనలో కోవిడ్ వల్ల కార్యకర్తలకు చేయాల్సినంత చేయకపోయి ఉండవచ్చు. కానీ.. జగన్ 2.0లో అలా జరగదు. అందరికీ మాట ఇస్తున్నా. కార్యకర్తలకు కచ్చితంగా అండగా ఉంటా. కార్యకర్తల కోసం జగన్ ఎంత గట్టిగా నిలబడతాడో వచ్చే ఎన్నికల తర్వాత మీ జగన్ చేసి చూపిస్తాడు’ అని పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..సంఖ్యాబలం లేనప్పుడు పోటీ చేయకూడదుమొన్న జెడ్పీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో–ఆప్షన్ సభ్యులు, ఉప సర్పంచ్ స్థానాలు కలిపి దాదాపు 57 చోట్ల స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరిగితే.. ఏడు చోట్ల అధికార పార్టీ గెలిచే పరిస్థితి లేకపోవడంతో ఎన్నికలు వాయిదా వేశారు. మరో 50 చోట్ల వాయిదా వేసే పరిస్థితి లేకపోవడంతో అనివార్యంగా ఎన్నికలు జరిపారు. అలా ఎన్నికలు నిర్వహించిన 50 స్థానాలకు గానూ 39 చోట్ల వైఎస్సార్సీపీ కార్యకర్తలు గొప్ప తెగింపు చూపించి గెలిచారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే.. అసలు టీడీపీకి ఎక్కడా కనీసం గెలవడానికి కావాల్సిన సంఖ్యాబలం లేదు. అయినా సరే.. మభ్యపెట్టి, భయపెట్టి, ప్రలోభ పెట్టి.. ఏకంగా పోలీసులను వాడుకుని దౌర్జన్యాలు చేస్తూ ఎన్నికలు నిర్వహించారు. ఇన్నేళ్లు సీఎంగా చేశానని చెప్పుకునే చంద్రబాబుకు నిజంగా బుద్ధీ, జ్ఞానం రెండూ లేవు! సూపర్ సిక్స్‌లు.. మోసాలుగా మిగిలాయిఎన్నికల మేనిఫెస్టోలో 143 హామీలతో కూటమి పార్టీలు ప్రజలను మభ్యపెట్టి, ప్రతి ఇంటికి వారి కార్యకర్తలను పంపించి పాంప్లెట్లు పంచాయి. చంద్రబాబు బాండ్లు పంపించారని ప్రతి ఒక్కరికీ చెప్పి ఎన్నికల్లో గెలిచాయి. చంద్రబాబు పాలన చేపట్టి దాదాపు 11 నెలలు అవుతుంది. మరి ఆయన చెప్పిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లు ఏమయ్యాయని ఎవరైనా అడగడానికి ధైర్యం చేస్తే.. ఆ స్వరం కూడా వినిపించకుండా చేయాలని తాపత్రయపడుతున్నారు. ఆ హామీలను నెరవేర్చాలనిగానీ, ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంగానీ చంద్రబాబులో కనిపించడం లేదు. ప్రతి అడుగులోనూ మోసం.. పాలనలో అబద్ధాలే కనిపిస్తున్నాయి. సూపర్ సిక్స్‌లు, సెవెన్లు గాలికెగిరిపోయి మోసాలుగా కనిపిస్తున్నాయి. మాట మీద నిలబడే పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారు..సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఎందుకు అమలు చేయడం లేదు అని అడుగుతుంటే రాష్ట్రం అప్పులు రూ.10 లక్షల కోట్లు అని చంద్రబాబు అంటారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లలోనే రాష్ట్రం అప్పు రూ.6.50 లక్షల కోట్లు అని చూపించారు. అందులో రూ.3.13 లక్షల కోట్లు ఆయన ప్రభుత్వం దిగిపోయే నాటికి, ఆయన చేసిన అప్పులే అని తెలుసు. కానీ రాష్ట్రాన్ని భయంకరంగా చూపించాలని రూ.10 లక్షల కోట్లు అని చెబుతున్నారు. మరో రెండు రోజులు పోతే రూ.12 లక్షల కోట్లు.. రూ.14 లక్షల కోట్లు అని చెబుతాడు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను ఎగ్గొట్టడానికే ఈ దిక్కుమాలిన అబద్ధాలు చెబుతున్నారు. ఇలాంటి దిక్కుమాలిన అబద్ధాలు, మోసాలతో రాష్ట్రంలో పాలన చేస్తున్నాడు. ఇలాంటి పాలన పోయి మళ్లీ మాట చెబితే ఆ మాట మీద నిలబడే పాలన రావాలని, ప్రజలకు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యలను పరిష్కరించాలని తపించే గుండె ఉండే మంచి పాలన రావాలని ప్రజలందరూ ఇవాళ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఉన్నదల్లా రెడ్‌బుక్ రాజ్యాంగమే..మరోవైపు ఇవాళ వలంటీర్ వ్యవస్థ లేదు. పారదర్శకత లేదు. స్కీములూ లేవు. ఉన్నదల్లా రెడ్ బుక్ రాజ్యాంగమే. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. పోలీసులను అధికార పార్టీ కాపలాదారులుగా వాడుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దారుణ పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం..⇒ తిరుపతి కార్పొరేషన్లో మనం 48 స్థానాలు గెలిస్తే వాళ్లు కేవలం ఒక్కటే గెలిచారు. అక్కడ ఇటీవల డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్భంగా మన కార్పొరేటర్లు ప్రయాణిస్తున్న బస్సును అడ్డుగుతున్నారు. కార్పొరేటర్లు, ఎమ్మెల్సీని పోలీసుల ఆధ్వర్యంలోనే కిడ్నాప్ చేశారు. ఇలా చేయడానికి సిగ్గు ఉండాలి. ⇒ విశాఖ కార్పొరేషన్లో 98 స్థానాలకు వైఎస్సార్సీపీ 56 స్థానాలకు పైగా గెలిచింది. అక్కడ ప్రజాస్వామ్యయుతంగా వైఎస్సార్సీపీ మేయర్ ఉంటే అవిశ్వాస తీర్మానం పెట్టారు. మన కార్పొరేటర్లు క్యాంపుల్లో ఉంటే.. పోలీసులు వారి ఇళ్ల వద్దకు వచ్చి మీ భర్తలు ఎక్కడున్నారో చెప్పాలని, లేదంటే మిమ్మల్ని స్టేషన్‌కి తరలిస్తామని బెదిరిస్తున్నారు. బుద్ధీ, జ్ఞానం ఉన్నవారు ఎవరైనా పోలీసులను ఈ మాదిరిగా వాడుకుంటారా?⇒ అనంతపురం జిల్లా రామగిరి మండలంలో పదికి తొమ్మిది స్థానాలు మనవే. వాళ్లు ఒక్కటే గెలిచారు. సంఖ్యాపరంగా చూస్తే ఉప ఎన్నికలో మనమే గెలవాలి. కానీ అక్కడ ఎస్ఐ పోలీసు ప్రొటెక్షన్ ఇచ్చినట్లు నమ్మించి తొమ్మిది మంది మన ఎంపీటీసీలను కిడ్నాప్ చేశాడు. వీడియో కాల్లో లోకల్ ఎమ్మెల్యేతో మాట్లాడిస్తున్నాడు. అయినా సరే మన ఎంపీటీసీలు మాట వినకపోవడంతో మండల కేంద్రంలో నిర్బంధించి బైండోవర్ కేసులు పెడుతున్నాడు. దీనిపై మన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంతటితో ఆగకుండా.. ఆ మండలంలో భయం రావాలట..! అందుకోసం లింగమయ్య అనే బీసీ నాయకుడిని హత్య చేశారు. పోలీసుల సమక్షంలో చంద్రబాబు ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి చర్యలు చేయిస్తున్నారు. ఇదా ప్రజాస్వామ్యం?⇒ స్వయంగా చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని రామకుప్పంలో 16కి మొత్తం 16 ఎంపీటీసీలను మనం గెలిచాం. ఆరుగురిని ప్రలోభపెట్టగా..మిగిలిన వాళ్లు మనవాళ్లే. అక్కడ మనవాళ్లు ప్రయాణిస్తున్న బస్సును పోలీసులతో అడ్డుకుని కౌంటింగ్ దగ్గరకు పంపించకుండా చంద్రబాబు ఆపించారు. అక్కడ కోరమ్ లేకపోయినా.. ఆరుగురే ఉన్నా వాళ్ల మనిషే గెలిచినట్లు డిక్లేర్ చేశాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని.. ఎంపీపీ స్థానంలో బలం లేకపోయినా ఆయన వ్యవహరిస్తున్న తీరు ఇదీ.⇒ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం గోపవరంలో ఉప సర్పంచ్ ఎన్నికలు చూస్తే.. మనం 19 గెలిస్తే వాళ్లు నలుగురిని ప్రలోభపెట్టారు. మనవాళ్లు 15 మందిని పోలీసులు బందోబస్తు కల్పిస్తామని చెప్పి తీసుకెళ్లి టీడీపీ సభ్యులున్న చోట విడిచిపెట్టారు. అంటే టీడీపీ వాళ్లను దౌర్జన్యం చేయమని వదిలేశారు. కౌంటింగ్ హాల్లోకి మనవాళ్లను లోపలకి పంపించరు కానీ.. వాళ్లను మాత్రం పంపిస్తారు. అక్కడ నకిలీ వార్డు మెంబర్లతో ఐడీ కార్డులు తయారు చేశారు. అదే విషయం ఎన్నికల అధికారికి చెబితే ఎన్నిక వాయిదా వేశారు. మళ్లీ రెండో రోజు.. ఎన్నికల అధికారికి గుండెపోటు అని వాయిదా వేశారు. బలం లేనప్పుడు ఇలాంటివన్నీ చేస్తున్నారు. ⇒ ఇక తుని మున్సిపాల్టీలో 30కి 30 కౌన్సిలర్లు మనమే గెలిచాం. వాళ్ల దగ్గర ఏమాత్రం సంఖ్యా బలం లేదు. అయినాకూడా వైస్ చైర్మన్ పోస్టు దక్కించుకునేందుకు కావాలని ఎన్నికలకు అడ్డంకులు సృష్టించి వాయిదాల మీద వాయిదాలు వేశారు. చివరకు మున్సిపల్ చైర్మన్ మహిళను బెదిరించి రాజీనామా చేయించారు.⇒ అత్తిలిలో 20 స్థానాలకు మనం 16 గెలిస్తే.. వాళ్లు 4 గెలిచారు. ఒకరు డిస్ క్వాలిఫై కాగా మన బలం 15 ఉంది. అంటే అక్కడ ఎన్నికల్లో మనం గెలవాలి. వాళ్లకు సంఖ్యా బలం లేదు కాబట్టి ఎన్నిక జరపకుండా వాయిదా మీద వాయిదా వేస్తున్నారు. ఇదీ రాష్ట్రంలో జరుగుతోంది!!⇒ ఇంతటి దారుణమైన రాజకీయ వ్యవస్థల మధ్య.. మీ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నా.. మీరంతా గట్టిగా నిలబడ్డారు. నా అక్కచెల్లెమ్మలు చాలా గట్టిగా నిలబడ్డారు. దీన్ని విన్నప్పుడు చాలా సంతోషం అనిపించిన సందర్భాలున్నాయి. ఈ ఎన్నికల్లో మీరు చూపించిన గొప్ప స్ఫూర్తితో... చంద్రబాబు అనే వ్యక్తి ఇలాంటి తప్పుడు పనులు చేయడం తప్పు అనే సందేశం మీ ద్వారా వెళ్లింది. చాలా సంతోషం. రాబోయే రోజుల్లో మీరు చూపించిన ఈ స్ఫూర్తి చిరస్ధాయిగా నిలబడుతుంది.సమావేశానికి హాజరైన వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కార్యకర్తల కోసం ఎంత గట్టిగా నిలబడతానో చూపిస్తా..‘కష్ట సమయంలో ఉన్న మన కార్యకర్తలకు ఒక్కటే చెబుతున్నా. ఈ కష్ట కాలంలో మీరు చూపించిన ఈ స్ఫూర్తి, నిబద్ధతకు మీ జగన్ ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాడు. రాబోయే రోజులు మనవే. ఈసారి కచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో అధికారంలోకి వస్తుంది. ఈ సారి వచ్చినప్పుడు మీ జగన్ కార్యకర్తల కోసం కచ్చితంగా ఉంటాడు. జగన్ 1.0 పాలనలో కార్యకర్తల కోసం చేయాల్సినంత చేయలేకపోయి ఉండవచ్చు. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కోవిడ్ వచ్చింది. కోవిడ్ సమయంలో రెండేళ్లు ప్రజల గురించి, వాళ్ల ఆరోగ్యం గురించే మొత్తం ఎఫర్ట్ పెట్టాం. కాబట్టి కార్యకర్తలకు ఉండాల్సినంత తోడుగా ఉండి ఉండకపోవచ్చు. కానీ జగన్ 2.0 లో అలా జరగదు. అందరికీ మాట ఇస్తున్నా. కార్యకర్తలకు కచ్చితంగా అండగా ఉంటా. కార్యకర్తల కోసం జగన్ ఎంత గట్టిగా నిలబడతాడో వచ్చే ఎన్నికల తర్వాత మీ జగన్ చేసి చూపిస్తాడు’ – వైఎస్ జగన్‌విద్య, వైద్యం, వ్యవసాయం అధోగతి..ఇవాళ స్కూళ్లు నాశనం అయిపోయాయి. ఇంగ్లీషు మీడియం గాలికెగిరిపోయింది. నాడు ృ నేడు పనులు ఆగిపోయాయి. టోఫెల్ తీసేశారు. మూడో తరగతి నుంచి టోఫెల్ శిక్షణ తరగతులు నిర్వహించి పిల్లలను గొప్పగా చదివించాలని ఆరాటపడే ఆలోచనలు గాలికెగిరిపోయాయి. మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్ లేదు. ఎనిమిదో తరగతి పిల్లలకు ఏటా ట్యాబ్‌ల పంపిణీ ఆగిపోయింది.మరోవైపు వైద్యం పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్లు ఖర్చవుతుంది. 11 నెలలకు నెట్ వర్క్ ఆసుపత్రులకు రూ.3,500 కోట్లు బకాయిలు పెట్టారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో పేషెంట్లకు వైద్యం చేయడానికి సుముఖంగా లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. 104, 108 ఆంబులెన్సుల గురించి చెప్పాల్సిన పనిలేదు.ఈ రోజు వ్యవసాయం గురించి అందరికీ తెలిసిందే. ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు. రైతన్న పూర్తిగా దళారుల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి వ్యవసాయం చేయాల్సిన దుస్థితి నెలకొంది. పెట్టుబడి సహాయం కింద జగన్ పీఎం కిసాన్తో కలిపి రూ.13,500 ఇస్తున్నాడు... మేం వస్తే పీఏం కిసాన్ కాకుండా సొంతంగా రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఇచ్చిన అమౌంట్ లేదు... బాబు ఇస్తామన్నది కూడా ఇవ్వలేదు. మరోవైపు ఆర్బీకేలన్నీ నిర్వీర్యం అయిపోయాయి. ఉచిత పంటల బీమా పూర్తిగా ఎత్తివేశారు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది.పీ4 పేరుతో బాబు కొత్త మోసం..చంద్రబాబునాయుడు మోసాలు క్లైమాక్స్‌కి చేరాయి. చాలామంది చంద్రబాబు మారిపోయి ఉంటారని అనుకున్నారు. కానీ ఆయన మారలేదని నిరూపిస్తూ ఈమధ్య పీ4 అని కొత్త మోసం తీసుకొచ్చాడు. పీ4 విధానం ద్వారా సమాజంలో 20 శాతం పేదవారి బాగోగులు అన్నింటినీ 10 శాతం సంపన్నులకు అప్పగిస్తాడట. ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. అసలు చంద్రబాబుకు రాష్ట్రంలో ఎన్ని తెల్లరేషన్ కార్డులు ఉన్నాయో తెలుసా? రాష్ట్రంలో 1.61 కోట్ల ఇళ్లు ఉంటే 1.48 కోట్ల వైట్ (తెల్ల) రేషన్ కార్డులున్నాయి. అంటే 90 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. రాష్ట్రంలో కేవలం 8.60 లక్షల మంది మాత్రమే ఆదాయపన్ను కడుతున్నారు. 25 లక్షల మంది ఐటీ ఫైల్ చేస్తున్నారు. అంటే 8.60 లక్షల మందికి.. 1.48 కోట్ల తెల్ల రేషన్ కార్డు దారులను అప్పగించాలి. అక్కడ కూడా మోసం చేస్తున్నాడు. పేదలు కేవలం 20 శాతం అంటున్నాడు. చంద్రబాబు చెప్పిన దానికి కనీసం వెయ్యి మంది కూడా ముందుకు రారు. చంద్రబాబు చెప్పింది అవాస్తవమని, జరగదని అందరికీ తెలుసు. ఆయన డ్రామాలు ఆడుతున్నాడని ప్రజలకు తెలుసు. జనం నవ్వుకుంటున్నారు. ఆయన మాట్లాడినప్పుడు మీటింగ్‌ల నుంచి వెళ్లిపోతున్నారు. అయినాసరే నేను చెప్పేది ప్రజలు నమ్మాల్సిందే అన్నట్లు అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్నారు.

ట్రంప్ మార్క్ ప్రతీకారం.. భారత్‌కు స్వల్ప ఊరట
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను చెప్పినట్టుగానే ప్రపంచ దేశాలకు షాకిచ్చారు. ట్రంప్ టారిఫ్‌ల బాంబు పేల్చారు. విదేశీ ఉత్పత్తులపై భారీగా సుంకాలు వడ్డించారు. భారతదేశ ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్ వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. అన్ని దేశాల నుంచి దిగుమతి అయ్యే అటోమొబైల్స్‌పై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు తేల్చిచెప్పారు. ప్రతీకార సుంకాలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఇదే సమయంలో భారత ప్రధాని మోదీ గురించి ట్రంప్ ప్రస్తావించారు. తనకు మోదీ గొప్ప స్నేహితుడని చెబుతూనే భారత్ అమెరికాతో సరైనవిధంగా వ్యవహరించడం లేదన్నారు. 52 శాతం సుంకాలను విధిస్తోందని ట్రంప్ అన్నారు. అయితే, పలు దేశాలపై ప్రతీకార సుంకాలను విధించిన ట్రంప్.. రష్యా, ఉత్తర కొరియాకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఈ రెండు దేశాలపై ఎలాంటి సుంకాలు విధించలేదు. ఏప్రిల్ 2వ తేదీని అమెరికా ‘విముక్తి దినం’గా ప్రకటించిన ట్రంప్ బుధవారం వాషింగ్టన్లో మీడియాతో మాట్లాడారు. వైట్‌హౌస్‌లోని రోజ్ గార్డెన్లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ట్రంప్ మాట్లాడుతూ..‘ఈ రోజు కోసం అమెరికా ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తోంది. అమెరికా వ్యాపారం ఈరోజు పునర్జన్మించినట్లు అయింది. అమెరికా మళ్లీ సుసంపన్నమైన దేశంగా అవతరించిన రోజుగా గుర్తుండబోతుంది. సుంకాల పేరుతో అమెరికాను చాలా ఏళ్లుగా మోసగాళ్లు ఉపయోగించుకున్నారు. ఇక అది జరగదు. మాపై సుంకాలు విధించే దేశాలపై తప్పకుండా సుంకాలు విధిస్తాం. అమెరికాకు ఈ రోజు నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చింది.🚨 It’s official. Donald Trump has signed 25% tariffs on our closest trade partners and allies. Friendly reminder that tariffs were a contributing factor for the Great Depression. pic.twitter.com/hlBNCcwyMu— CALL TO ACTIVISM (@CalltoActivism) April 2, 2025ఇప్పుడు అమెరికా మరింత ఎదగడానికి అవకాశం వచ్చింది. సుంకాల ప్రకటనతో అమెరికాలో మళ్లీ పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి. కంపెనీలు తిరిగి వెనక్కి వస్తాయి. విదేశీ మార్కెట్లకు ద్వారాలు తెరుస్తాం. అమెరికాలో పోటీతత్వం పెరిగి సరసమైన ధరల్లో వస్తువులు లభిస్తాయి. దీంతో అమెరికా స్వర్ణయుగమవుతుంది. దశాబ్దాలుగా వాణిజ్య అడ్డంకులను అమెరికా తొలగిస్తూ వచ్చింది. కానీ పలు దేశాలు అమెరికా ఉత్పత్తులపై భారీ సుంకాలను విధిస్తూ వచ్చాయి. పలు దేశాలు అన్యాయమైన నియమాలను అవలంభించాయి.US President Donald Trump announced 26% import duty on India… India 26%National interest first, friendship....#TrumpTariffs pic.twitter.com/ySlvRkIYzs— Equilibrium (@abatiyaashii) April 3, 2025అమెరికాలో దిగుమతి అవుతున్న మోటారు సైకిళ్లపై కేవలం 2.4 శాతమే పన్నులు విధిస్తున్నారు. అదే థాయిలాండ్, ఇతర దేశాలు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న ద్విచక్రవాహనాలపై 60 శాతం, భారత్ 70 శాతం, వియత్నాం 75 శాతం సుంకాలు విధిస్తున్నాయి. వాణిజ్య విషయానికి వచ్చినప్పుడు కొన్నిసార్లు స్నేహితుడు సైతం శత్రువు కంటే ప్రమాదకరం. అందుకే అన్ని విదేశీ తయారీ ఆటోమొబైల్స్‌పై 25 శాతం సుంకాలు ఈ అర్ధరాత్రి నుంచి విధించనున్నాం. అమెరికాలో ఉత్పత్తులు తయారుచేసే కంపెనీలపై ఎలాంటి పన్నులు వసూలు చేయం.అమెరికా ప్రతీకార సుంకాలు ఇలా..భారత్: 26 శాతంయూకే: 10 శాతంఆస్ట్రేలియా: 10 శాతంకొలంబియా: 10 శాతంచిలి: 10 శాతంబ్రెజిల్: 10 శాతంసింగపూర్: 10 శాతంటర్కీ: 10 శాతంఇజ్రాయెల్: 17 శాతంపిలిఫ్ఫీన్స్: 17 శాతంఈయూ: 20 శాతంమలేషియా: 24 శాతంజపాన్: 24 శాతం దక్షిణ కొరియా: 25 శాతంపాకిస్థాన్: 29 శాతం దక్షిణాఫ్రికా: 30 శాతంస్విట్జర్లాండ్: 31 శాతంఇండోనేషియా: 32 శాతంతైవాన్: 32 శాతంచైనా: 34 శాతంథాయిలాండ్: 36 శాతంబంగ్లాదేశ్ 37 శాతంశ్రీలంక: 44 శాతంకంబోడియా: 49 శాతంఈ కార్యక్రమానికి కేబినెట్ సభ్యులతో పాటు స్టీల్, ఆటోమొబైల్ కార్మికులను ట్రంప్ ఆహ్వానించారు. అమెరికా భవిష్యత్తు అమెరికన్ల చేతుల్లోనే ఉందన్నారు. ఇతర దేశాలు తమపై విధిస్తున్న సుంకాల్లో తాము సగమే విధిస్తున్నట్లు తెలిపారు. ఆయా దేశాలపై జాలితోనే ఇలా సగం సుంకాలు ప్రకటించినట్లు తెలిపారు. వీటిని రాయితీ టారిఫ్‌లుగా ట్రంప్ పేర్కొన్నారు.México , México ,México Aquí buscándolo en la lista de aranceles de Donald Trump pic.twitter.com/nouS1sMg7j— Carlos Suárez E (@Caloshhh) April 2, 2025

కర్నూలు బయలుదేరిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి/కర్నూలు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కర్నూలుకు బయలుదేరారు. కాసేపట్లో జీఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో కుడా మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నాయకులు కోట్ల హర్షవర్దన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకల్లో వైఎస్ జగన్ పాల్గొంటారు.వైఎస్ జగన్ ఈరోజు ఉదయం 11.30 గంటలకు కర్నూలులోని జొహరాపురం రోడ్డులో ఉన్న మైపర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నగర శివారులోని జీఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో కుడా మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నాయకులు కోట్ల హర్షవర్దన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకల్లో మాజీ సీఎం పాల్గొంటారు. వధూవరులను ఆశీర్వదించి వైఎస్సార్సీపీ నాయకులతో మాట్లాడిన అనంతరం ఆయన తిరిగి 12.50 గంటలకు తాడేపల్లికి బయలుదేరి వెళ్తారు. వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ పనులను వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, పార్టీ కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జి ఆదిమూలపు సతీష్‌లు పరిశీలించారు. ఏర్పాట్లపై కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్‌తో చర్చించారు.

‘టాప్’లోనే హార్దిక్ పాండ్యా .. మిస్టరీ స్పిన్నర్‌కు ఎదురుదెబ్బ
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) పురుషుల టీ20 ర్యాంకింగ్స్ బుధవారం విడుదలయ్యాయి. తాజా ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఆల్‌రౌండర్ల విభాగంలో తన నంబర్‌వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. హార్దిక్ 252 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.బౌలింగ్ విభాగంలో భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) తన రెండో ర్యాంక్‌ను కోల్పోయాడు. వరుణ్ ఒక స్థానం పడిపోయి 706 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు. నాలుగు స్థానాలు ఎగబాకిన న్యూజిలాండ్ పేసర్ జేకబ్ డఫీ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు.క్రితంసారి వరకు నంబర్‌వన్ స్థానంలో ఉన్న అకీల్ హోసీన్ (వెస్టిండీస్) రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్లు అభిషేక్ శర్మ రెండో స్థానంలో, తిలక్ వర్మ నాలుగో స్థానంలో, సూర్యకుమార్ యాదవ్ ఐదో స్థానంలో ఉన్నారు.రాజస్తాన్ రాయల్స్ సారథిగా సామ్సన్బెంగళూరు: గాయం కారణంగా సారథిగా కాకుండా కేవలం ప్లేయర్‌గా మాత్రమే ఐపీఎల్ ఆడుతున్న సంజూ సామ్సన్‌కు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) నుంచి అనుమతి లభించింది. వేలి గాయం పూర్తిగా మానడంతో కీపింగ్ చేయొచ్చని బీసీసీఐ వెల్లడించింది.తాజా సీజన్ తొలి మూడు మ్యాచ్‌ల్లో సామ్సన్ ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగగా... అతడి స్థానంలో రియాన్ పరాగ్ జట్టుకు సారథిగా వ్యవహరించాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా ఆర్చర్ బౌలింగ్‌లో సామ్సన్... కుడిచేయి బొటనవేలికి గాయం కాగా... శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దిగ్వేశ్కు జరిమానాలక్నో: లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేశ్ సింగ్ రాఠిపై జరిమానా పడింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా... వికెట్ తీసిన అనంతరం అతిగా సంబరాలు చేసుకున్నందుకు గానూ దిగ్వేశ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు. దిగ్వేశ్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్ చివరి బంతికి పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య ఔటయ్యాడు.ఆ సమయంలో బ్యాటర్ దగ్గరకు వెళ్లిన దిగ్వేశ్... అతడి వికెట్ తన ఖాతాలో పడినట్లు పుస్తకంలో రాస్తున్నట్లు సంబరాలు చేసుకున్నాడు. అదే సమయంలో ఫీల్డ్ అంపైర్లు దిగ్వేశ్‌ను వారించగా... నిబంధనలను అతిక్రమించినందుకు రిఫరీ అతడిపై జరిమానా వేయడంతో పాటు ఒక డీ మెరిట్ పాయింట్ కేటాయించారు.‘దిగ్వేశ్ లెవల్–1 తప్పిదానికి పాల్పడ్డాడు. నియమావళిలోని 2.5 ఆర్టికల్ ప్రకారం అతడికి జరిమానా విధించాం’ అని ఐపీఎల్ పాలక మండలి ఒక ప్రకటనలో తెలిపింది. గతంలో వెస్టిండీస్ పేసర్ కెస్రిక్ విలియమ్స్ ఈ తరహా సంబరాలతో ‘ఫేమస్’ అయ్యాడు.టీమిండియాతో ద్వైపాక్షిక సిరీస్ సందర్భంగా వికెట్ తీసిన అనంతరం ‘నోట్‌బుక్’లో ఏదో రాస్తున్నట్లు సైగలు చేస్తూ సంబరాలు చేసుకోగా... దానికి భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన దూకుడైన ఆటతో దీటుగా బదులిచ్చి అచ్చం అదే తరహాలో సంబరాలు చేసుకున్నాడు. కాగా... లక్నో, పంజాబ్ జట్ల మధ్య జరిగిన పోరులో పంజాబ్ కింగ్స్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

మావోయిస్టుల లేఖ.. ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
రాయ్‌పూర్: మావోయిస్టులతో చర్చలకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం విజయ్ శర్మ. ఈ క్రమంలో షరతులు లేకుండా చర్చలు తమ ప్రభుత్వ్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. స్పష్టమైన ప్రతిపాదనలతో మావోయిస్టులు ముందుకు రావాలని సూచించారు.మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో విడుదల చేసిన శాంతి చర్చల లేఖపై డిప్యూటీ సీఎం, హోం మంత్రి విజయ్ శర్మ స్పందించారు. ఈ సందర్బంగా విజయ్ శర్మ మాట్లాడుతూ.. మావోయిస్టులతో చర్చలకు ద్వారాలు తెరిచే ఉన్నాయి. వారితో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. రాష్ట్రంలో మావోయిస్టుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. షరతులు లేకుండా అర్థవంతమైన చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం.మావోయిస్టులు నిజంగా తిరిగి రావాలనుకుంటే వారు తమ ప్రతినిధులను, చర్చల నిబంధనలను స్పష్టం చేయాలి. ఎవరైనా చర్చించాలనుకుంటే భారత రాజ్యాంగం ప్రకారం నిర్ణయాలను అంగీకరించాలి. గతంలో మావోయిస్టుల కంచుకోటలుగా పేరొందిన 40 గ్రామాల్లో ఏడాదిన్నర కాలంలో తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాం. మావోయిస్టులు చర్చల పట్ల సీరియస్‌గా ఉంటే చర్చల కోసం వారే స్వయంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నాను. స్పష్టమైన ప్రతిపాదనలతో ముందుకు రావాలి’ అని తెలిపారు.

అలాంటి జోకర్లందరూ జాగ్రత్తగా ఉండండి.. 'నాని' టీమ్ పోస్ట్
టాలీవుడ్ హీరో నాని, శ్రీకాంత్ ఓదెలా కాంబినేషన్లో వస్తున్న క్రేజీ సినిమా 'ది ప్యారడైజ్'(The Paradise ).. పోస్టర్‌తో పాన్ ఇండియా రేంజ్లో సినీ ప్రేక్షకులను మెప్పించిన ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా షూటింగ్ ప్రారంభం కాకుండానే ఓటీటీ ఢీల్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు వార్తలు వచ్చాయి. కేవలం గ్లింప్స్‌తోనే సంచలనం క్రియేట్ చేసిన ఈ సినిమా ఆగిపోయిందంటూ సోషల్‌మీడియాలో ప్రచారం జరిగింది. ఈ మూవీ స్క్రిప్ట్ విషయంలో నాని అసంతృప్తితో ఉన్నారని, కొన్ని మార్పులు చేయాలని కోరినట్లు వైరల్ అయింది. ఆపై బడ్జెట్ కూడా భారీగానే పెరిగిపోవడం వల్ల ఈ సినిమాను ఆపేస్తున్నారని కథనాలు వచ్చాయి. అయితే, ఈ అంశంపై చిత్ర యూనిట్ గట్టిగానే రియాక్ట్ అయింది.సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు రూమర్స్ వైరల్ చేసేవారిని జోకర్స్‌తో పోలుస్తూ ఇలా చెప్పుకొచ్చారు. 'ది ప్యారడైజ్ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అనుమానాలు వద్దు. మేము అనుకున్నట్లుగానే పనులు జరుగుతున్నాయి. ఎవరూ కంగారుపడాల్సిన పనిలేదు. ఈ చిత్రాన్ని చాలా గొప్పగా తెరకెక్కిస్తున్నాం. దానిని మీరందరూ కూడా త్వరలో చూస్తారు. ఆ సమయం వరకు రూమర్స్‌తో కొందరు బతికేయవచ్చు. 'గజరాజు నడుస్తూ ఉంటే..గజ్జి కుక్కలు అరుస్తాయి'. ది ప్యారడైజ్ సినిమాపై అభిమానులు చూపించే ప్రేమను మేము చాలా దగ్గరగా చూస్తునే ఉన్నాం. ఆపై ఈ మూవీపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారిని కూడా గమనిస్తున్నాం. మేము ప్రేమ, ద్వేశాన్ని రెండూ తీసుకుంటాము. వాటన్నిటితో ఒక శక్తిగా మీ ముందుకు తిరిగొస్తాం. తెలుగు పరిశ్రమలో ఉండే గొప్ప చిత్రాలలో ఒకటిగా ఈ మూవీ ఉంటుంది. సినిమాపై రూమర్స్ క్రియేట్ చేస్తున్న వారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము.. ఫ్యాన్స్ అందరూ మెచ్చేలా ప్యారడైజ్ సినిమాతో నాని తిరిగొస్తాడని మాట ఇస్తున్నాం.' అని ఒక చిత్ర యూనిట్ ఒక పోస్ట్ చేసింది.హిట్ 3 టీజర్లో మోస్ట్ వయోలెంట్ ఆఫీసర్‌గా కనిపించిన నాని దానికి మించిన రేంజ్లో ది ప్యారడైజ్‌లో కనిపంచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వచ్చే సంవత్సరం మార్చి 26న ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు కూడా ప్రకటించారు. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇంగ్లీష్, స్పానిష్ సహా 8 భాషలలో ది ప్యారడైజ్ విడుదల కానుంది. To all 🤡s out there, you feed on us... because we let you do so.#TheParadise is rising in all its glory. Rest assured, it is on the right track. And you all will witness it soon.Meanwhile, keep feeding on us as much as you can. Because...'Gajaraju nadiste..Gajji kukkalu…— THE PARADISE (@TheParadiseOffl) April 2, 2025

టారిఫ్‌లపై కంట్రోల్ రూమ్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించే టారిఫ్‌ల సంబంధ పరిణామాలను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖతో పాటు వివిధ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు ఇందులో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతీకార టారిఫ్‌ల పరిణామాలను ఎదుర్కొనే వ్యూహాలపై వాణిజ్య, పరిశ్రమల శాఖ కసరత్తు చేసినట్లు వివరించాయి.ప్రస్తుతం భారత్‌లో అమెరికా దిగుమతులపై సగటున టారిఫ్‌లు 7.7%గా ఉండగా, ఆ దేశానికి మన ఎగుమతులపై సగటున సుమారు 2.8 శాతమే. ప్రస్తుతం 190 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలనేది ఇరు దేశాల లక్ష్యం. ఈ దిశగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చిస్తున్నాయి.ఇదీ చదవండి: ఏడాదిలో రూ.1.33 లక్షల కోట్ల సమీకరణభారత్పై సుంకాల మోతఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల బాంబు పేల్చారు. అనుకున్నట్లుగా విదేశీ ఉత్పత్తులపై భారీగా సుంకాలు వడ్డించారు. భారతదేశ ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్ వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. వియత్నాం ఉత్పత్తులపై 46 శాతం, చైనాపై 34 శాతం, యూరోపియన్ యూనియన్(ఈయూ)పై 20 శాతం, స్విట్జర్లాండ్‌పై 31, తైవాన్‌పై 32, జపాన్‌పై 24, యూకేపై 10 శాతం సుంకాలను ఖరారు చేశారు. అన్ని దేశాల నుంచి దిగుమతి అయ్యే అటోమొబైల్స్‌పై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు తేల్చిచెప్పారు. ఏప్రిల్ 2వ తేదీని ‘విముక్తి దినం’గా ట్రంప్ ప్రకటించారు.

గుజరాత్లో ప్రమాదం.. మంటల్లో ముక్కలైన భారత యుద్ధ విమానం
గాంధీ నగర్: గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. భారత వాయుసేనకు చెందిన జాగ్వార్ యుద్ధ విమానం గుజరాత్‌లోని జామ్ నగర్లో కుప్పకూలింది. ప్రమాదం నుంచి ఓ పైలట్ సురక్షితంగా బయటపడగా, మరో పైలట్ మృతిచెందారు. ప్రమాదం అనంతరం యుద్ధ విమానంలో మంటలు చెలరేగాయి. ఈ మేరకు భారత వాయుసేన అధికారుల స్పందిస్తూ.. పైలట్ మృతి చెందినట్టు వెల్లడించారు. పైలట్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వివరాల ప్రకారం.. జామ్‌నగర్‌లోని సువర్ద సమీపంలో బుధవారం రాత్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన జాగ్వార్ యుద్ధ విమానం కుప్పకూలింది. పొలాల్లో క్రాష్ కావడంతో విమానంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో విమానం రెండు ముక్కలుగా విరిగిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం నుంచి ఒక పైలెట్ సురక్షితంగా బయటపడగా.. మరో పైలెట్ తప్పిపోయాడు. శిక్షణలో ఉన్న విమానం కూలగానే మంటలు అంటుకున్నాయని, ప్రమాద కారణం ఇంకా తెలియరాలేదని జిల్లా ఎస్పీ ప్రేమ్‌సుఖ్ దేలూ తెలిపారు. గాయపడిన పైలట్‌ను జామ్‌నగర్‌లోని జీజీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. ఇక, విమాన ప్రమాద ఘటనపై ఎయిర్ ఫోర్స్ విచారణకు ఆదేశించింది.#BREAKING: Tragic news from Jamnagar, Gujarat. A Jaguar fighter jet of the Indian Air Force crashed during a routine sortie, 12 kms away from Jamnagar city. While one pilot ejected safely, a trainee pilot has been killed in the crash. The body has been found by the villagers. pic.twitter.com/yGRefVVyQR— Aditya Raj Kaul (@AdityaRajKaul) April 2, 2025ఇదిలా ఉండగా.. మార్చి నెలలో హర్యానాలోని పంచకుల సమీపంలో జాగ్వార్ ఫైటర్ జెట్ కుప్పకూలిన విషయం తెలిసిందే. విమానంలో సాంతికేతిక సమస్య తలెత్తడంతో పైలట్ విమానాన్ని జనవాస ప్రాంతాల నుంచి దూరంగా తీసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. కుప్పకూలిన విమానం అంబాలా ఎయిర్‌బేస్ నుంచి శిక్షణాలో భాగంగా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన జరిగి నెల రోజులు కూడా కాకముందే.. మరో జాగ్వార్ యుద్ధ విమానం క్రాష్ కావడం ఎయిర్ ఫోర్స్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.Tragic news tonight. Trainee IAF fighter pilot killed in Jaguar crash near Jamnagar. The other pilot managed to eject, being treated in hospital.Deepest condolences to the family of the deceased pilot. 💔 pic.twitter.com/bQy6bG1918— Shiv Aroor (@ShivAroor) April 2, 2025 An IAF Jaguar two seater aircraft airborne from Jamnagar Airfield crashed during a night mission. The pilots faced a technical malfunction and initiated ejection, avoiding harm to airfield and local population. Unfortunately, one pilot succumbed to his injuries, while the other…— Indian Air Force (@IAF_MCC) April 3, 2025

చెట్ల నరికివేత ఆపండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో చెట్లు నరకడాన్ని వెంటనే ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు బుధవారం ఆదేశించింది. దీనిపై గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే వరకు అక్కడ ఎలాంటి పనులు చేయొద్దని ఏసీజే జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ రేణుక యారా ధర్మాసనం తేల్చిచెప్పింది. సుదీర్ఘ వాదప్రతివాదనల వల్ల సమయం ముగియడంతో తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. కంచ గచ్చిబౌలిలోని 400 ఎక రాల భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీఐఐసీ)కి బదిలీ చేసి చదును చేయడాన్ని వెంటనే ఆపాలని కోరుతూ హైకోర్టులో రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్స్) దాఖలయ్యాయి. ‘ఐటీ, ఇతర అవసరాల కోసం ఎకరం రూ. 75 కోట్ల మేర సంస్థలకు కేటాయించేలా కంచ గచ్చిబౌలి సర్వే నంబర్ 25లోని 400 ఎకరాల అటవీ భూమిని టీజీఐఐసీకి సర్కార్ కేటాయించింది. ఈ మేరకు గతేడాది జూన్ 26న రెవెన్యూ శాఖ తీసుకొచ్చిన జీవో 54ను కొట్టేయాలి. అక్కడ 40 జేసీబీ తవ్వకాలతో సర్కార్ చెట్లను తొలగిస్తూ వృక్ష, జంతుజాలాన్ని నాశనం చేస్తోంది’ అని పిటిషనర్లు ఆరోపించారు.పర్యావరణ విధ్వంసాన్ని ఆపాలి..పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఎస్.నిరంజన్‌రెడ్డి, ఎల్.రవిచందర్ వాదిస్తూ ‘ఆ 400 ఎకరాలు అటవీభూమి. ఒకవేళ అది ప్రభుత్వ భూమి అయినా సుప్రీంకోర్టు తీర్పులకు లోబడే ప్రభుత్వాలు పనిచేయాలి. 40కిపైగా జేసీబీలతో చెట్లు కొట్టేసి భూమిని చదును చేస్తున్నారు. సుప్రీం తీర్పు ప్రకారం అటవీ ప్రాంతాన్ని చదును చేయాలంటే నిపుణుల కమిటీ వేయాలి. ఆ కమిటీ క్షేత్రస్థాయిలో నెలపాటు అధ్యయనం చేయాలి. ఈ అడవిలో బఫెలో, పీకాక్, ఎస్ఆర్ ప్రధాన సరస్సులు, ‘పుట్టగొడుగుల శిల’ వంటి ప్రత్యేకమైన భౌగోళిక నిర్మాణాలున్నాయి. ఇది 237 జాతుల పక్షులు, నెమళ్లు, చుక్కల జింకలు, అడవి పందులు, నక్షత్ర తాబేళ్లు, ఇండియన్ రాక్ పైథాన్, బోయాస్ వంటి వివిధ పాము జాతులకు పర్యావరణ నివాసం. వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. ‘అడవి’ అనే పదాన్ని ప్రభుత్వ రికార్డులు, చట్టపరమైన నోటిఫికేషన్లకే పరిమితం చేయకూడదని సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. దీనికి విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. పర్యావరణ సమతౌల్యతను దెబ్బతీసే విధ్వంసాన్ని నిరోధించాలి’ అని నివేదించారు.ఆదాయం కోసం ఆరాటమే తప్ప..‘150 ఎకరాలకు మించి అటవీ ప్రాంతాన్ని చదును చేసేందుకు పర్యావరణ అధ్యయనం అవసరం. మీటర్ కంటే ఎక్కువ ఎత్తు కాండం పెరిగిన చెట్లును కొట్టాలంటే వాల్టా చట్ట ప్రకారం అనుమతి పొందాలి. లేకుంటే చట్టప్రకారం శిక్షార్హం. కానీ ప్రభుత్వం అటవీ సంరక్షణ చట్ట ప్రకారం చర్యలు తీసుకోలేదు. ఆదాయం కోసం ఆరాటమే తప్ప పర్యావరణ విధ్వంసం గురించి పట్టించుకోలేదు. హైదరాబాద్ నడిబొడ్డున 400 ఎకరాల్లో దశాబ్దాలకుపైగా ఉన్న భారీ వృక్షాలను తొలగిస్తే పర్యావరణ సమతౌల్యత దెబ్బతింటుంది. పక్కనే కాంక్రీట్ జంగిల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు ఊపిరి కూడా అందడం కష్టమవుతుంది. భవిష్యత్ తరాలు ఆక్సిజన్‌కు అవస్థ పడాల్సి వస్తుంది. ఒకపక్క కేసు హైకోర్టులో విచారణ సాగుతుండగానే అధికారులు రాత్రీపగలు చెట్ల నరికివేత చేపడుతున్నారు. ఈ పనులను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయండి’ అని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరారు.క్రీడల పేరిట రూ. వేల కోట్ల భూములకు చంద్రబాబు..రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎ. సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ‘2003 ఆగస్టు 5న ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ (ఐఎంజీబీపీఎల్) ఏర్పాటైంది. ఆగస్టు 9న ఐఎంజీ భారతతో నాటి చంద్రబాబు ప్రభుత్వం (తాత్కాలిక ప్రభుత్వం) క్రీడల్లో ఇక్కడి యువతను చాంపియన్లుగా తీర్చిదిద్దే పేరుతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. స్పోర్ట్స్ అకాడమీలను నిర్మించడం, అభివృద్ధి చేయడం, నిర్వహించడం కోసమంటూ రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి సర్వే నంబర్ 25లోని 400 ఎకరాలను ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం మామిడిపల్లి సర్వే నంబర్ 99/1లోని మరో 450 ఎకరాలను అప్పగిస్తామని ఒప్పందం చేసుకుంది. అంతేకాదు.. ఐఎంజీ భారత అంతర్జాతీయ స్థాయిలో ప్రధాన కార్యాలయం నిర్మించుకోవడానికి బంజారాహిల్స్ నుంచి మాదాపూర్ వెళ్లే మార్గంలో ఎకరం నుంచి 5 ఎకరాలను కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. 2004 ఫ్రిబవరిలో రూ. వేల కోట్ల విలువైన 400 ఎకరాలను స్వల్ప మొత్తానికి అంటే రూ. 2 కోట్లకు ఐఎంజీ భారతకు సేల్‌డీడ్ చేసింది. ఏమాత్రం అర్హతలేని, భూములు కొట్టేయడం కోసమే ఏర్పడిన కంపెనీ నుంచి ప్రభుత్వ ఆస్తులను కాపాడటం కోసం 2006లో నాటి వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. 2007లో దీన్ని చట్టబద్ధం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్తి (పరిరక్షణ, రక్షణ, పునఃప్రారంభం) చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం ఐఎంజీ భారతకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన సేల్‌డీడ్‌తోపాటు ఎంఓయూ కూడా రద్దయ్యింది. హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా రాజశేఖరరెడ్డి నిర్ణయాన్ని సమర్థించాయి. నాడు వైఎస్సార్ రక్షించిన ఆ 400 ఎకరాలు ఇండస్ట్రియల్ భూములే. నాడు పిల్ దాఖలు చేసిన వారు అర్హతలేని కంపెనీ, తక్కువ ధరనే సవాల్ చేశారు. హెచ్‌సీయూ భూములనిగానీ, పర్యావరణం దెబ్బతింటుందని కానీ ఎక్కడా పేర్కొనలేదు. నాడు ఒక దొంగ నుంచి మేము ఈ భూములను రక్షించినప్పుడు ఈ పిల్ దాఖలు చేసిన వారెవరూ కలసి రాలేదు. ఇప్పుడు పిల్లు దాఖలు చేసి ప్రశ్నిస్తున్నారు’ అని ఏజీ పేర్కొన్నారు.గూగుల్ ఫొటోలే ఆధారామా?‘గూగుల్ ఫోటోల ఆధారంగా అక్కడ ఫారెస్ట్ ఉందని పిటిషనర్లు వాదిస్తున్నారు. రెవెన్యూ, ఇతర ఏ రికార్డుల్లోనూ అది అటవీ భూమిగా లేదు. గూగుల్ చిత్రాలు వానాకాలం ఒకలా, ఎండాకాలంలో మరోలా ఉంటాయి. గూగుల్ చిత్రాలు ప్రామాణికం కాదని సుప్రీంకోర్టు గతంలో పేర్కొంది. నా స్నేహితుడొకరు సభ్యుడిగా ఉన్న ఓ గోల్ఫ్ క్లబ్‌లోనూ నెమళ్లు, జింకలు, పాములు ఉన్నాయి. దాన్ని కూడా అటవీ ప్రాంతంగా డిక్లేర్ చేస్తారా? ఈ లెక్కన హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టొద్దు. గత పదేళ్లలో నాటి ప్రభుత్వం వేలాది ఎకరాలు విక్రయించినా నోరుమెదపని వారు ఇప్పుడు రూ.75 కోట్లకు ఎకరం విక్రయిస్తుంటే ప్రశ్నిస్తున్నారు. ఈ పిల్లు ప్రజాప్రయోజనం ఆశించి వేసినవి కావు. నిజాం కాలం నుంచి ఈ 400 ఎకరాలు గడ్డి భూములు. ఈ భూములకు ఆనుకొని ఉన్న హెచ్‌సీయూ స్థలంలో భారీ భవనాలు నిర్మించారు. నాలుగు హెలీప్యాడ్లు కూడా ఉన్నాయి’ అని ఏజీ చెప్పారు. కాగా, ఇది ఇండస్ట్రియల్ ల్యాండ్ అని సర్కార్ వద్ద రికార్డులున్నాయా? అని ధర్మాసనం ఏజీని ప్రశ్నించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. సమయం ముగియడంతో తదుపరి విచారణ నేటికి వాయిదా వేసింది.

ఈ రాశి వారికి చేపట్టిన కార్యాలు విజయవంతమవుతాయి.. భూవివాదాలు పరిష్కారం
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.షష్ఠి రా.3.27 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: రోహిణి ప.12.25 వరకు, తదుపరి మృగశిర, వర్జ్యం: సా.5.45 నుండి 7.17 వరకు, దుర్ముహూర్తం: ఉ.10.02 నుండి 10.51 వరకు, తదుపరి ప.2.55 నుండి 3.43 వరకు, అమృత ఘడియలు: ఉ.9.24 నుండి 10.55 వరకు.సూర్యోదయం : 5.58సూర్యాస్తమయం : 6.09రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకుయమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు మేషం... కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఎంత కష్టించినా ఫలితం ఉండదు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.వృషభం.... పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.మిథునం.... బంధువిరోధాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ధనవ్యయం. కుటుంబసమస్యలు. వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తుంది. ఉద్యోగులకు ఒత్తిడులు.కర్కాటకం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. దైవదర్శనాలు. వాహన, గృహయోగాలు. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.సింహం... వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆర్థిక ప్రగతి. ఇంటర్వ్యూలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.కన్య.... ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు. ఆరోగ్య సమస్యలు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.తుల..... కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు కలసిరావు. పనులు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.వృశ్చికం... చేపట్టిన కార్యాలు విజయవంతమవుతాయి. భూవివాదాలు పరిష్కారం. శుభవార్తలు వింటారు. నూతన పరిచయాలు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.ధనుస్సు... దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. భూములు, వాహనాలు కొంటారు. పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.మకరం.... పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. మిత్రులు, కుటుంబసభ్యులతో అకారణంగా వైరం. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.కుంభం... కుటుంబసభ్యులతో వివాదాలు. రాబడికి మించి ఖర్చులు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.మీనం.... పలుకుబడి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. పాతబాకీలు వసూలవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
టారిఫ్‌ల ఎఫెక్ట్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
‘గుట్ట’లోకి వెళ్లడాన్ని గుర్తించి అత్యాచారం
ట్రంప్ 26శాతం సుంకాలు: భారత్ రియాక్షన్ ఇదే..
అంత స్వల్ప సమయంలో యువతినెలా నమ్మించాడు?
ఎంఎంటీఎస్ బాధితురాలి ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ
మావోయిస్టుల లేఖ.. ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
‘టాప్’లోనే హార్దిక్ పాండ్యా .. మిస్టరీ స్పిన్నర్‌కు ఎదురుదెబ్బ
తయారీ రంగం.. 8 నెలల గరిష్టం
వర్ధమాన దేశాల్లో భారత్ భేష్
పుతిన్ మరో సంచలన నిర్ణయం.. 1.6 లక్షల మంది సైనికులు..
ట్రంప్ మార్క్ ప్రతీకారం.. భారత్‌కు స్వల్ప ఊరట
అలాంటి జోకర్లందరూ జాగ్రత్తగా ఉండండి.. 'నాని' టీమ్ పోస్ట్
జపాన్‌లో భారీ భూకంపం
కర్నూలు బయలుదేరిన వైఎస్ జగన్
‘టాప్’లోనే హార్దిక్ పాండ్యా .. మిస్టరీ స్పిన్నర్‌కు ఎదురుదెబ్బ
ప్రేమోన్మాది ఘాతుకం
టారిఫ్‌లపై కంట్రోల్ రూమ్..
చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ కూతురు
హెచ్‌సీయూపై సెలబ్రిటీలు సై!
మీ నిబద్ధతకు హ్యాట్సాఫ్! : వైఎస్ జగన్
రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని పరిస్థితిపై వైఎస్ జగన్ ట్వీట్
గుజరాత్లో ప్రమాదం.. మంటల్లో ముక్కలైన భారత యుద్ధ విమానం
హైదరాబాద్‌లో మెట్రో సేవలకు అంతరాయం
యువ ఐఏఎస్ అధికారికి ఫ్యూచర్ సిటీ పగ్గాలు!
ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భాగ్యలక్ష్మి .. చివరకు
సిటీలో దొడ్డు బియ్యమే!
విడాకులు ప్లీజ్
పరిధి దాటొద్దు.. పోలీసులను హెచ్చరించిన సుప్రీంకోర్టు
హలీమ్ @ రూ.వెయ్యి కోట్లు!
బెంగళూరుకు సిరాజ్ షాక్
భారత్‌లో పర్యటించనున్న వెస్టిండీస్, సౌతాఫ్రికా.. షెడ్యూల్ విడుదల
వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం.. లోక్‌సభలో ఎంపీ మిథున్‌రెడ్డి
అప్పుడైనా,ఇప్పుడైనా తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష
ఈ రాశి వారికి చేపట్టిన కార్యాలు విజయవంతమవుతాయి.. భూవివాదాలు పరిష్కారం
చెట్ల నరికివేత ఆపండి: హైకోర్టు
IPL 2025: ఉతికి ఆరేసిన బట్లర్.. ఆర్సీబీపై గుజరాత్ ఘన విజయం
వర్ధమాన దేశాల్లో భారత్ భేష్
నువ్వు యాంకరింగ్ చేయడం నాకు ఇష్టం లేదు..!
గాజాలో ఆకలి కేకలు: పిండీ లేదు.. తిండీ లేదు
ఆకాశవీధిలో..
యూపీఐ.. రయ్
ఏజెంటిక్ ఏఐలో భారత్ టాప్!
చిరంజీవి సినిమాలో అతిథి?
సోషల్ మీడియాని మితిమీరి వాడితే...
హద్దు మీరిన పాక్ సైన్యం... బుద్ధి చెప్పిన భారత జవాన్లు
కొట్టాలి టెంకాయ మళ్లీ మళ్లీ
ముస్లింలపై ఎందుకింత ద్వేషం?
‘పథకం’ ప్రకారం ప్రతినెలా కేవలం ఒక ఇంటిని సందర్శించి వస్తున్నాం సార్!
ఇకనైనా అరాచకం ఆగేనా!
దిశా పటానీ ధగధగ.. కావ్య థాపర్ గిబ్లీ ఆర్ట్!
'మ్యాడ్' హీరోతో మెగా డాటర్ కొత్త సినిమా
అంత స్వల్ప సమయంలో యువతినెలా నమ్మించాడు?
తయారీ రంగం.. 8 నెలల గరిష్టం
పుతిన్ మరో సంచలన నిర్ణయం.. 1.6 లక్షల మంది సైనికులు..
బర్డ్‌ఫ్లూ కలకలం.. చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం
వరమివ్వని ఉద్యానం
శాంతి చర్చలకు మేం సిద్ధం..
మృత్యువుతో 108 గంటల పోరాటం
స్పీకర్ చర్యలు తీసుకోకున్నా చేతులు కట్టుకొని చూస్తుండాలా?: సుప్రీంకోర్టు
కొంచెం సులభమే!
బిల్లుపై ఎవరి వాదనేమిటి?
బ్యాకప్‌లో మనమే అప్
జై బోలో హనుమాన్‌కి...
బందిపోట్లలా కాంగ్రెస్ సర్కారు తీరు!: కేసీఆర్
రెండోసారి గంట సేపు విచారణ!
కుదిరితే సయోధ్య.. లేకుంటే ధర్మయుద్ధం: సీఎం రేవంత్
వక్ఫ్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
65 నుంచి 40కు...
గువాహాటిలో తొలిసారి టెస్టు
శిఖరాన్ని వంచింది
మా ఇంటి మణిదీపం
కాగ్నిజెంట్ గ్లోబల్ హెడ్‌గా శైలజ జోస్యుల
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
బిర్లాన్యూ రూ. 1,300 కోట్ల పెట్టుబడులు
ఆర్బీఐకి కొత్త డిప్యూటీ గవర్నర్.. ఎవరీ పూనమ్ గుప్తా?
నేరుగా వాట్సాప్‌లో.. ఇన్వెస్టర్లకు సరికొత్త ఫీచర్
ఆదిత్య బిర్లా ఫైనాన్స్ విలీనం పూర్తి.. కంపెనీ ఇకపై..
నాపై ట్రోలింగ్.. ఆ ఒక్క పని చేస్తే చాలు: సారా అలీ ఖాన్
అమీన్పూర్ ముగ్గురు పిల్లల మృతి కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు
రాత్రికి రాత్రే బుల్డోజర్లు.. అసలేం జరుగుతుంది?: రష్మిక
ఆ ఐదో ఫిర్యాదుపై కేసు ఎందుకు నమోదు చేయలేదు?: అంబటి
బెయిల్ కోసం హైకోర్టుకు రన్య
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
భూమికి మేలు–రైతుకు వీలు
రెండింటిలోనూ ఇన్వెస్ట్ చేసే ఫండ్..
ట్రంప్ 26శాతం సుంకాలు: భారత్ రియాక్షన్ ఇదే..
ఎంఎంటీఎస్ బాధితురాలి ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ
మావోయిస్టుల లేఖ.. ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
రెండేళ్ల క్రితం భార్య మోసం చేసి వెళ్లిపోయింది..!
పాముతో సీన్స్ చేయడానికి భయపడ్డాను
మొదటి సెషన్ కంటే సులభమే!
అమెరికాపై సుంకాలు ఎత్తేసిన ఇజ్రాయెల్
శ్రీవారికి కునుకు కరువాయె!
వీర విధేయులతో ‘సిట్’
ఇప్పటికైతే ఇంతే 'స్మార్ట్'!
SRH vs KKR: గెలుపు బాటలోకి ఎవరో!
సాకేత్ జోడీ శుభారంభం
ఈ రాతగాళ్లు సవ్యసాచులు
ద్విముఖ పోరు
పట్టణాలకు పన్నుపోటు
ఫ్యాక్టరీ ప్రారంభం రోజునే కార్మికుడి మృతి
చందువ చేప సాగు ఎంతో లాభదాయకం
ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్: హెచ్‌సీయూ వివాదంపై యాంకర్ రష్మీ
RCB VS GT: అదిరిపోయే రీతిలో ప్రతీకారం తీర్చుకున్న సిరాజ్.. వైరల్ వీడియో
జైస్వాల్ బాటలోనే సూర్య, తిలక్..?
IPL 2025: ఆర్సీబీపై గుజరాత్ ఘన విజయం
Bird Flu : హైదరాబాద్‌లో బర్డ్‌ఫ్లూ కలకలం.. వేల కోళ్లు మృత్యువాత
నీలి రంగు అద్దాల మేడలు : భగభగ మంటలు
కిడ్నాప్ చేసి నిన్ను ముంబై తీసుకెళ్లిపోతా: మంచు లక్ష్మీ
ఫేస్బుక్, ఇన్‌స్టా రీల్స్ రిపీట్ అంటూ తెగ చూసేస్తున్నారా?
టారిఫ్‌ల ఎఫెక్ట్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
‘గుట్ట’లోకి వెళ్లడాన్ని గుర్తించి అత్యాచారం
ట్రంప్ 26శాతం సుంకాలు: భారత్ రియాక్షన్ ఇదే..
అంత స్వల్ప సమయంలో యువతినెలా నమ్మించాడు?
ఎంఎంటీఎస్ బాధితురాలి ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ
మావోయిస్టుల లేఖ.. ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
‘టాప్’లోనే హార్దిక్ పాండ్యా .. మిస్టరీ స్పిన్నర్‌కు ఎదురుదెబ్బ
తయారీ రంగం.. 8 నెలల గరిష్టం
వర్ధమాన దేశాల్లో భారత్ భేష్
పుతిన్ మరో సంచలన నిర్ణయం.. 1.6 లక్షల మంది సైనికులు..
ట్రంప్ మార్క్ ప్రతీకారం.. భారత్‌కు స్వల్ప ఊరట
అలాంటి జోకర్లందరూ జాగ్రత్తగా ఉండండి.. 'నాని' టీమ్ పోస్ట్
జపాన్‌లో భారీ భూకంపం
కర్నూలు బయలుదేరిన వైఎస్ జగన్
‘టాప్’లోనే హార్దిక్ పాండ్యా .. మిస్టరీ స్పిన్నర్‌కు ఎదురుదెబ్బ
ప్రేమోన్మాది ఘాతుకం
టారిఫ్‌లపై కంట్రోల్ రూమ్..
చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ కూతురు
హెచ్‌సీయూపై సెలబ్రిటీలు సై!
మీ నిబద్ధతకు హ్యాట్సాఫ్! : వైఎస్ జగన్
రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని పరిస్థితిపై వైఎస్ జగన్ ట్వీట్
గుజరాత్లో ప్రమాదం.. మంటల్లో ముక్కలైన భారత యుద్ధ విమానం
హైదరాబాద్‌లో మెట్రో సేవలకు అంతరాయం
యువ ఐఏఎస్ అధికారికి ఫ్యూచర్ సిటీ పగ్గాలు!
ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భాగ్యలక్ష్మి .. చివరకు
సిటీలో దొడ్డు బియ్యమే!
విడాకులు ప్లీజ్
పరిధి దాటొద్దు.. పోలీసులను హెచ్చరించిన సుప్రీంకోర్టు
హలీమ్ @ రూ.వెయ్యి కోట్లు!
బెంగళూరుకు సిరాజ్ షాక్
భారత్‌లో పర్యటించనున్న వెస్టిండీస్, సౌతాఫ్రికా.. షెడ్యూల్ విడుదల
వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం.. లోక్‌సభలో ఎంపీ మిథున్‌రెడ్డి
అప్పుడైనా,ఇప్పుడైనా తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష
ఈ రాశి వారికి చేపట్టిన కార్యాలు విజయవంతమవుతాయి.. భూవివాదాలు పరిష్కారం
చెట్ల నరికివేత ఆపండి: హైకోర్టు
IPL 2025: ఉతికి ఆరేసిన బట్లర్.. ఆర్సీబీపై గుజరాత్ ఘన విజయం
వర్ధమాన దేశాల్లో భారత్ భేష్
నువ్వు యాంకరింగ్ చేయడం నాకు ఇష్టం లేదు..!
గాజాలో ఆకలి కేకలు: పిండీ లేదు.. తిండీ లేదు
ఆకాశవీధిలో..
యూపీఐ.. రయ్
ఏజెంటిక్ ఏఐలో భారత్ టాప్!
చిరంజీవి సినిమాలో అతిథి?
సోషల్ మీడియాని మితిమీరి వాడితే...
హద్దు మీరిన పాక్ సైన్యం... బుద్ధి చెప్పిన భారత జవాన్లు
కొట్టాలి టెంకాయ మళ్లీ మళ్లీ
ముస్లింలపై ఎందుకింత ద్వేషం?
‘పథకం’ ప్రకారం ప్రతినెలా కేవలం ఒక ఇంటిని సందర్శించి వస్తున్నాం సార్!
ఇకనైనా అరాచకం ఆగేనా!
దిశా పటానీ ధగధగ.. కావ్య థాపర్ గిబ్లీ ఆర్ట్!
'మ్యాడ్' హీరోతో మెగా డాటర్ కొత్త సినిమా
అంత స్వల్ప సమయంలో యువతినెలా నమ్మించాడు?
తయారీ రంగం.. 8 నెలల గరిష్టం
పుతిన్ మరో సంచలన నిర్ణయం.. 1.6 లక్షల మంది సైనికులు..
బర్డ్‌ఫ్లూ కలకలం.. చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం
వరమివ్వని ఉద్యానం
శాంతి చర్చలకు మేం సిద్ధం..
మృత్యువుతో 108 గంటల పోరాటం
స్పీకర్ చర్యలు తీసుకోకున్నా చేతులు కట్టుకొని చూస్తుండాలా?: సుప్రీంకోర్టు
కొంచెం సులభమే!
బిల్లుపై ఎవరి వాదనేమిటి?
బ్యాకప్‌లో మనమే అప్
జై బోలో హనుమాన్‌కి...
బందిపోట్లలా కాంగ్రెస్ సర్కారు తీరు!: కేసీఆర్
రెండోసారి గంట సేపు విచారణ!
కుదిరితే సయోధ్య.. లేకుంటే ధర్మయుద్ధం: సీఎం రేవంత్
వక్ఫ్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
65 నుంచి 40కు...
గువాహాటిలో తొలిసారి టెస్టు
శిఖరాన్ని వంచింది
మా ఇంటి మణిదీపం
కాగ్నిజెంట్ గ్లోబల్ హెడ్‌గా శైలజ జోస్యుల
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
బిర్లాన్యూ రూ. 1,300 కోట్ల పెట్టుబడులు
ఆర్బీఐకి కొత్త డిప్యూటీ గవర్నర్.. ఎవరీ పూనమ్ గుప్తా?
నేరుగా వాట్సాప్‌లో.. ఇన్వెస్టర్లకు సరికొత్త ఫీచర్
ఆదిత్య బిర్లా ఫైనాన్స్ విలీనం పూర్తి.. కంపెనీ ఇకపై..
నాపై ట్రోలింగ్.. ఆ ఒక్క పని చేస్తే చాలు: సారా అలీ ఖాన్
అమీన్పూర్ ముగ్గురు పిల్లల మృతి కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు
రాత్రికి రాత్రే బుల్డోజర్లు.. అసలేం జరుగుతుంది?: రష్మిక
ఆ ఐదో ఫిర్యాదుపై కేసు ఎందుకు నమోదు చేయలేదు?: అంబటి
బెయిల్ కోసం హైకోర్టుకు రన్య
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
భూమికి మేలు–రైతుకు వీలు
రెండింటిలోనూ ఇన్వెస్ట్ చేసే ఫండ్..
ట్రంప్ 26శాతం సుంకాలు: భారత్ రియాక్షన్ ఇదే..
ఎంఎంటీఎస్ బాధితురాలి ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ
మావోయిస్టుల లేఖ.. ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
రెండేళ్ల క్రితం భార్య మోసం చేసి వెళ్లిపోయింది..!
పాముతో సీన్స్ చేయడానికి భయపడ్డాను
మొదటి సెషన్ కంటే సులభమే!
అమెరికాపై సుంకాలు ఎత్తేసిన ఇజ్రాయెల్
శ్రీవారికి కునుకు కరువాయె!
వీర విధేయులతో ‘సిట్’
ఇప్పటికైతే ఇంతే 'స్మార్ట్'!
SRH vs KKR: గెలుపు బాటలోకి ఎవరో!
సాకేత్ జోడీ శుభారంభం
ఈ రాతగాళ్లు సవ్యసాచులు
ద్విముఖ పోరు
పట్టణాలకు పన్నుపోటు
ఫ్యాక్టరీ ప్రారంభం రోజునే కార్మికుడి మృతి
చందువ చేప సాగు ఎంతో లాభదాయకం
ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్: హెచ్‌సీయూ వివాదంపై యాంకర్ రష్మీ
RCB VS GT: అదిరిపోయే రీతిలో ప్రతీకారం తీర్చుకున్న సిరాజ్.. వైరల్ వీడియో
జైస్వాల్ బాటలోనే సూర్య, తిలక్..?
IPL 2025: ఆర్సీబీపై గుజరాత్ ఘన విజయం
Bird Flu : హైదరాబాద్‌లో బర్డ్‌ఫ్లూ కలకలం.. వేల కోళ్లు మృత్యువాత
నీలి రంగు అద్దాల మేడలు : భగభగ మంటలు
కిడ్నాప్ చేసి నిన్ను ముంబై తీసుకెళ్లిపోతా: మంచు లక్ష్మీ
ఫేస్బుక్, ఇన్‌స్టా రీల్స్ రిపీట్ అంటూ తెగ చూసేస్తున్నారా?
సినిమా

పాముతో సీన్స్ చేయడానికి భయపడ్డాను
హీరోయిన్ కేథరిన్ ట్రెసా ప్రధాన పాత్రలో, మహేశ్ శ్రీరామ్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ఫణి’. ఓ.ఎం.జీ ప్రొడక్షన్స్, ఏయూ అండ్ ఐ స్టూడియోల సమర్పణలో డా. మీనాక్షి అనిపిండి ఈ సినిమాను నిర్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు ఇతర ప్రపంచ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కానుంది. బుధవారం జరిగిన ఈ చిత్రం ప్రెస్‌మీట్‌కు దర్శక–నిర్మాత కె. రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా హాజరై, ‘ఫణి’ సినిమా మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘వీఎన్ ఆదిత్య కొత్త వాళ్లతోనూ సినిమా చేయగలడు, స్టార్స్‌తోనూ సినిమా చేయగలడు. ‘ఫణి’ విజయం సాధించాలి’’ అని అన్నారు. ‘‘నాకు పాములంటే భయం. దీంతో పాముతో నేను చేయాల్సిన సీన్స్ అన్నీ సీజీలో చేయాలని ఆదిత్యగారిని రిక్వెస్ట్ చేస్తే, సరే అన్నారు. అయితే షూటింగ్ చివర్లో పాము కాంబినేషన్లో నాతో సీన్స్ చేయించారు. ఒకసారి సీన్ పూర్తయ్యేసరికి పాము నా ముఖానికి దగ్గరగా ఉంది. అప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉండి ఉంటుందో ఊహించుకోండి. మేలో మా ‘ఫణి’ మూవీని రిలీజ్ చేస్తున్నాం’’ అని తెలిపారు కేథరిన్. ‘‘యూఎస్ వెళ్లినప్పుడు నా సోదరి మీనాక్షి–బావ శాస్త్రిగారి ఇంట్లో ఉంటాను. వారు తమ ఓ.ఎం.జీ సంస్థలో నాతో సినిమా చేస్తామన్నప్పుడు నాకు భయం వేసింది. ‘ఫణి’ చిత్రాన్ని చిన్నగా మొదలు పెట్టాం. ఆ తర్వాత కేథరిన్గారు ఒప్పుకోవడంతో మరో స్థాయికి వెళ్లింది’’ అన్నారు వీఎన్ ఆదిత్య. ‘‘ఫణి’ మూవీతో కేథరిన్గారికి జాతీయ అవార్డు వస్తుంది’’ అని తెలిపారు నిర్మాత, సంగీత దర్శకురాలు డా. మీనాక్షి అనిపిండి. ‘‘హాలీవుడ్లో మోడలింగ్, మూవీస్ చేస్తున్నాను. ఈ సినిమాలో నటించడంతో సొంత ఇంటికి వచ్చినట్లుంది’’ అన్నారు మహేశ్ శ్రీరామ్. ఈ చిత్రసమర్పకుడు పద్మనాభరెడ్డి, సహ–నిర్మాత శాస్త్రి అనిపిండి, రైటర్ పద్మ, నటుడు కాశీ విశ్వనాథ్ మాట్లాడారు.

ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్: హెచ్‌సీయూ వివాదంపై యాంకర్ రష్మీ
హెచ్‌సీయూ వివాదంపై టాలీవుడ్ సినీతారలు ఒక్కొక్కరుగా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటికే రేణూ దేశాయ్, రష్మిక మందన్నా, నాగ్ అశ్విన్, సమంత కూడా స్పందించారు. దాదాపు 400 ఎకరాల భూములను ప్రభుత్వం వేలానికి పెట్టడంపై సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఈ వివాదంపై టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ సైతం స్పందించింది. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేసింది .యాంకర్ రష్మీ మాట్లాడుతూ..' అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోను ఎలాంటి రాజకీయాల కోసం చేయటం లేదు. ఏపీ, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి విరుద్ధంగా పోస్ట్ చేయడం లేదు. హెచ్‌సీయూలో జరుగుతున్న పోరాటం గురించి అందరికీ తెలుసు. ఆల్ ఐస్ ఆన్ హెచ్‌సీయూ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. నేను చాలా సౌకర్యంగా అపార్ట్మెంట్లో కూర్చుని పోస్ట్ చేస్తున్నాను. గతంలో ఈ అపార్ట్మెంట్ కట్టేటప్పుడు ఎన్ని పక్షులు, ఎన్ని జంతువులు ఎన్ని చెట్లు తొలగించారో నాకు కూడా తెలుసు' అని అన్నారు. 'కానీ ప్రస్తుతం హెచ్‌సీయూలో జరుగుతున్న అభివృద్ధి వల్ల నెమళ్లు, వేల పక్షులు సఫర్ అవుతున్నాయి. నిన్న రాత్రి జరిగిన వీడియో చూసిన తర్వాత పక్షులు, జంతువులను వారి ఇంటి నుంచి వాటిని తరిమేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రభుత్వం ఆలోచించాలి. ప్రస్తుత వేసవికాలం అందులో పక్షులు, నెమళ్లు, జంతువులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దయచేసి ఆ పశు, పక్షులను దృష్టిలో ఉంచుకుని పునరావాసం కల్పించండి. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దయచేసి మీరు అర్థం చేసుకుని ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అంటూ వీడియోను పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam)

నాపై ట్రోలింగ్.. ఆ ఒక్క పని చేస్తే చాలు: సారా అలీ ఖాన్
సైఫ్ అలీ ఖాన్ ముద్దుల కూతురు సారా అలీ ఖాన్ గురించి బాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. సైఫ్ వారసురాలిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. కొత్త ఏడాదిలో స్కై ఫోర్స్‌తో అభిమానులను మెప్పించింది. ప్రస్తుతం మెట్రో ఇన్ డినో అనే చిత్రంలో కనిపించనుంది. ఈ సినిమాకు అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 4న థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సారా అలీ ఖాన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ముఖ్యంగా సోషల్ మీడియా ట్రోలింగ్‌ను ఉద్దేశించి మాట్లాడింది. తన నటనపై సోషల్ మీడియాలో తరచుగా విమర్శలు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. అయినప్పటికీ అవీ నన్ను పెద్దగా ఇబ్బంది పెట్టలేదని వివరించింది. సోషల్ మీడియాలో వచ్చే నెగెటివిటీ నుంచి బయటపడేందుకు ధ్యానం చేస్తానని తెలిపింది.సారా అలీ ఖాన్ మాట్లాడుతూ.. "నేను సాధ్యమైనంత వరకు వాటిని ఫిల్టర్ చేయడం ప్రారంభించా. ఈ విషయంలో నాకు సహాయపడేది ధ్యానం. ఇలా చేయడం వల్ల నాకు నిజమేంటో తెలుస్తుంది. నేను నా స్వంత ఆలోచనలతో చూడటం ప్రారంభించా. ప్రతి ఆలోచనకు కూడా నన్ను సమర్థించుకోను. ఒక నటిగా నేను ఉన్నతమైన స్థానంలో లేను. కొంతమందికి కొందరు నటీనటులు అంటే ఇష్టం. మరికొందరికి ఇష్టం ఉండదు. నటిగా ఇంకా నేను చాలా దూరం ప్రయాణించాలి. ఆ భగవంతుడు కోరుకుంటే సుదీర్ఘ జీవితం సినిమాల్లో ముందుకు సాగుతా. ఆ తర్వాత ప్రొడక్షన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌పై దృష్టి సారిస్తా.' అని తెలిపింది.

కాంతార ప్రీక్వెల్ విడుదల వాయిదా.. స్పందించిన టీమ్
కాంతార మూవీతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న హీరో రిషబ్ శెట్టి. 2022లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీక్వెల్‌గా కాంతార చాప్టర్-1ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ సినిమాతో రిషబ్ శెట్టి బిజీగా ఉన్నారు. ఈ ఏడాదిలోనే కాంతార చాప్టర్ 1ను ప్రేక్షకుల ముందుకు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అక్టోబర్ 2వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని డేట్ కూడా రివీల్ చేశారు.అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా రిలీజ్ డేట్‌పై రూమర్స్ వినిపిస్తున్నాయి. కాంతార చాప్టర్-1 సినిమా విడుదల మరింత ఆలస్యం కానుందని శాండల్‌వుడ్‌లో టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ అభిమాని సోషల్ మీడియా వేదికగా ఈ మూవీ వాయిదా పడుతుందా? అని ప్రశ్నించాడు. దీనికి కాంతార టీమ్ స్పందించింది.ఎట్టి పరిస్థితుల్లో కాంతార చాప్టర్ -1 మూవీని వాయిదా వేసేది లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని సూచించింది. ముందు అనుకున్నట్లుగానే అక్టోబర్ 02వ తేదీ 2025న థియేటర్లలో విడుదల అవుతుందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియోను షేర్ చేసింది.కాగా.. ఇటీవల 500 మంది యోధులతో ఓ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ ఫైట్ సీక్వెన్స్‌లో దాదాపు 3 వేల మంది భాగమయ్యారు. దీని కోసం రిషబ్ శెట్టి మూడు నెలల పాటు గుర్రపు స్వారీ, కలరి, కత్తియుద్ధం నేర్చుకున్నారు. దాదాపు 50 రోజుల పాటు చిత్రీకరించిన ఈ భారీ సన్నివేశాన్ని కర్ణాటకలోని పర్వతా ప్రాంతాల్లో చిత్రీకరించారు. 2022 చిత్రానికి ప్రీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమా బనవాసికి చెందిన కదంబరాజుల కాలంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్లో రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. View this post on Instagram A post shared by Kantara (@kantarafilm)
న్యూస్ పాడ్‌కాస్ట్

వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం... అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు... నేడు రాజ్యసభ ముందుకు బిల్లు

నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు... చర్చతోపాటు ఓటింగ్ జరిగే అవకాశం

శ్రీసత్యసాయి జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

బడుగుల ఆలోచన ఆ పూట వరకే. ఎస్సీ, బీసీ వర్గాలపై చంద్రబాబు అక్కసు

ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్లను దగా చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... రోడ్డున పడిన 2 లక్షల 66 వేల కుటుంబాలు

థాయ్‌లాండ్, మయన్మార్‌లో భారీ భూకంపం... పేకమేడల్లా కూలిన భవనాలు... రెండు దేశాల్లో ఇప్పటికే 200 దాటిన మృతుల సంఖ్య.. ఇండియా, చైనాలోనూ భూప్రకంపనలు

హిందూ ధర్మంపై వీరికి మాట్లాడే హక్కుందా?... ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం

ఎలాగైనా ఉత్తీర్ణత పెంచాల్సిందే... ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిళ్లు..

పెద్దల మెప్పు కోసం పని చేయొద్దు, పోలీసుల తీరు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతోంది... మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్ అరెస్ట్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం

అరటి రైతును ఆదుకోవాలి. కూటమి ప్రభుత్వమే పూర్తిస్థాయిలో పరిహారం అందించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్
క్రీడలు

సాకేత్ జోడీ శుభారంభం
సాక్షి, హైదరాబాద్: మెనోర్కా ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టెన్నిస్ టోర్నమెంట్లో భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాకేత్ మైనేని శుభారంభం చేశాడు. స్పెయిన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో సాకేత్ తమిళనాడుకు చెందిన రామ్‌కుమార్ రామనాథన్‌తో కలిసి పురుషుల డబుల్స్ విభాగంలో బరిలోకి దిగాడు. తొలి రౌండ్ మ్యాచ్‌లో సాకేత్–రామ్‌కుమార్ ద్వయం 6–1, 6–2తో పెడ్రో కాచిన్ (అర్జెంటీనా)–ఇజాన్ కొరెత్యా (స్పెయిన్) జోడీపై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 48 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సాకేత్–రామ్‌కుమార్ నాలుగు ఏస్‌లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేశారు. తమ సర్వీస్‌లను నిలబెట్టుకొని, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశారు. అనిరుద్‌కు నిరాశమరోవైపు ఇదే టోర్నీలో బరిలోకి దిగిన హైదరాబాద్‌కే చెందిన అనిరుధ్ చంద్రశేఖర్ మాత్రం తొలి రౌండ్‌ను దాటలేకపోయాడు. గతవారం డేవిడ్ వెగా హెర్నాండెజ్ (స్పెయిన్)తో కలిసి జిరోనా ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో డబుల్స్ టైటిల్ నెగ్గిన అనిరుధ్ అదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయాడు. తొలి రౌండ్లో అనిరుధ్ (భారత్)–హెర్నాండెజ్ ద్వయం 6–7 (4/7), 7–5, 5–10తో ‘సూపర్ టైబ్రేక్’లో మూడో సీడ్ డానియల్ కుకెర్మన్ (ఇజ్రాయెల్)–జోషువా పారిస్ (బ్రిటన్) జంట చేతిలో పోరాడి ఓడిపోయింది. రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అనిరుధ్ జంట తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. అయితే నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో మాత్రం అనిరుధ్ ద్వయం తడబడింది. భారత్‌కే చెందిన టాప్ సీడ్ జోడీ విజయ్ సుందర్ ప్రశాంత్–జీవన్ నెడుంజెళియన్ జోడీ 2–6, 0–6తో మాటియో–ఆండ్రియా (ఇటలీ) జంట చేతిలో ఓటమి పాలైంది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో నిక్కీ పునాచా (భారత్)– గోర్నెస్ (స్పెయిన్) ద్వయం 6–3, 6–3తో వరోనా–టబెర్నర్ (స్పెయిన్) జంటపై గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.

బెంగళూరుకు సిరాజ్ షాక్
ఏడేళ్ల పాటు బెంగళూరు ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించిన మొహమ్మద్ సిరాజ్... తొలిసారి ఆ జట్టుకు ప్రత్యర్థిగా ఆడుతూ నిప్పులు చెరిగాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున తన పాత సహచరులపై బుల్లెట్ బంతులతో ప్రతాపం చూపాడు. ఫలితంగా ఐపీఎల్లో టైటాన్స్ రెండో విజయం నమోదు చేసుకోగా... రెండు విజయాల తర్వాత బెంగళూరుకు తొలి ఓటమి ఎదురైంది. సిరాజ్ ధాటికి ఓ మాదిరి స్కోరుకే పరిమితమైన బెంగళూరు జట్టు... ఆ తర్వాత బౌలింగ్‌లో కూడా ఎలాంటి మెరుపులు లేకుండా ఓటమిని ఆహ్వానించింది. బ్యాటింగ్‌లో బట్లర్ మెరుపు ఇన్నింగ్స్‌తో మరో 13 బంతులు మిగిలుండగానే గుజరాత్ గెలుపొందింది. బెంగళూరు: వరుస విజయాలతో జోరుమీదున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు ఐపీఎల్ 18వ సీజన్లో తొలి ఓటమి ఎదురైంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన బెంగళూరు... బుధవారం జరిగిన పోరులో 8 వికెట్ల తేడాతో మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి పాలైంది. గత సీజన్ వరకు ఆర్సీబీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్‌కు చెందిన మొహమ్మద్ సిరాజ్ (3/19) గుజరాత్ టైటాన్స్ తరఫున చెలరేగిపోగా... అతడి బౌలింగ్‌ను ఆడలేక బెంగళూరు ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. మొదట బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్ (40 బంతుల్లో 54; 1 ఫోర్, 5 సిక్స్‌లు) అర్ధశతకం సాధించగా... జితేశ్ శర్మ (33; 5 ఫోర్లు, 1 సిక్స్), టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (7), దేవదత్ పడిక్కల్ (4) కెప్టెన్ రజత్ పాటీదార్ (12), ఫిల్ సాల్ట్ (14), కృనాల్ పాండ్యా (5) విఫలమయ్యారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సిరాజ్ 3 వికెట్లు, సాయికిషోర్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. బట్లర్ (39 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), సాయి సుదర్శన్ (36 బంతుల్లో 49; 7 ఫోర్లు, 1 సిక్స్), రూథర్‌ఫోర్డ్ (18 బంతుల్లో 30 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించారు. సూపర్ సిరాజ్... టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు శుభారంభం దక్కలేదు. అర్షద్ ఖాన్ వేసిన రెండో ఓవర్లో అనవసర షాట్‌కు యత్నించిన కోహ్లి ఫైన్ లెగ్‌లో ప్రసిధ్ చేతికి చిక్కాడు. దీంతో చిన్నస్వామి స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. తదుపరి ఓవర్లో పడిక్కల్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన సిరాజ్ టైటాన్స్ ఆనందాన్ని రెట్టింపు చేశాడు. ఇక కొన్ని మంచి షాట్లు ఆడిన సాల్ట్‌ను కూడా సిరాజ్ బుట్టలో వేసుకున్నాడు. ఈ మధ్య పాటీదార్‌ను ఇషాంత్ శర్మ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో... బెంగళూరు జట్టు 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో జితేశ్ శర్మ, లివింగ్‌స్టోన్... చివర్లో డేవిడ్ ధాటిగా ఆడారు. 15 ఓవర్లు ముగిసేసరికి 105/6తో ఉన్న ఆర్సీబీ... చివరి 5 ఓవర్లలో 64 పరుగులు జోడించింది. రషీద్ ఖాన్ వేసిన 18వ ఓవర్లో 3 సిక్స్‌లు బాదిన లివింగ్‌స్టోన్‌ను తదుపరి ఓవర్లో సిరాజ్ అవుట్ చేశాడు. చివరి ఓవర్లో డేవిడ్ 4, 6, 4 కొట్టడంతో బెంగళూరు ఆ మాత్రం స్కోరు చేసింది. అలవోకగా... ఛేదనలో గుజరాత్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురుకాలేదు. లక్ష్యం చిన్నది కావడంతో ఆ జట్టు ఆడుతూ పాడుతూ ముందుకు సాగింది. బ్యాటింగ్‌లో భారీ స్కోరు చేయలేకపోయిన ఆర్సీబీ... బౌలింగ్‌లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (14) త్వరగానే అవుటైనా... మరో ఓపెనర్ సాయి సుదర్శన్‌తో కలిసి బట్లర్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలతో చెలరేగిన ఈ జంట రెండో వికెట్‌కు 47 బంతుల్లో 75 పరుగులు జతచేసింది. అనంతరం సుదర్శన్ అవుట్ కాగా... రూథర్‌ఫోర్డ్‌తో కలిసి బట్లర్ మూడో వికెట్‌కు 32 బంతుల్లోనే 63 పరుగులు జోడించారు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (బి) సిరాజ్ 14; కోహ్లి (సి) ప్రసిధ్ కృష్ణ (బి) అర్షద్ 7; దేవదత్ పడిక్కల్ (బి) సిరాజ్ 4; పాటీదార్ (ఎల్బీ) (బి) ఇషాంత్ 12; లివింగ్‌స్టోన్ (సి) బట్లర్ (బి) సిరాజ్ 54; జితేశ్ శర్మ (సి) తెవాటియా (బి) సాయికిషోర్ 33; కృనాల్ పాండ్యా (సి అండ్ బి) సాయికిషోర్ 5; టిమ్ డేవిడ్ (బి) ప్రసిధ్ కృష్ణ 32; భువనేశ్వర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 169. వికెట్ల పతనం: 1–8, 2–13, 3–35, 4–42, 5–94, 6–104, 7–150, 8–169. బౌలింగ్: సిరాజ్ 4–0–19–3; అర్షద్ ఖాన్ 2–0–17–1; ప్రసిధ్ కృష్ణ 4–0–26–1; ఇషాంత్ 2–0–27–1; సాయికిషోర్ 4–0–22–2; రషీద్ ఖాన్ 4–0–54–0. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) జితేశ్ శర్మ (బి) హాజల్‌వుడ్ 49; గిల్ (సి) లివింగ్‌స్టోన్ (బి) భువనేశ్వర్ 14; బట్లర్ (నాటౌట్) 73; రూథర్‌ఫోర్డ్ (నాటౌట్) 30; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (17.5 ఓవర్లలో 2 వికెట్లకు) 170. వికెట్ల పతనం: 1–32, 2–107. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–23–1, హాజల్‌వుడ్ 3.5–0–43–1; యశ్ దయాళ్ 3–0–20–0; రసిక్ సలామ్ 3–0–35–0; కృనాల్ పాండ్యా 3–0–34–0; లివింగ్‌స్టోన్ 1–0–12–0. ఐపీఎల్లో నేడుకోల్‌కతా X హైదరాబాద్‌వేదిక: కోల్‌కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

గువాహాటిలో తొలిసారి టెస్టు
ముంబై: ఈ ఏడాది సొంతగడ్డపై భారత జట్టు ఆడే మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదలైంది. ఈ సంవత్సరం భారత క్రికెట్ జట్టు స్వదేశంలో 4 టెస్టులు, 3 వన్డేలు, 5 టి20 మ్యాచ్‌లు ఆడుతుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి దేవజిత్ సైకియా స్వరాష్ట్రం అస్సాంలో భారత జట్టు తొలిసారి టెస్టు మ్యాచ్ ఆడనుంది. గువాహాటిలోని అస్సాం క్రికెట్ సంఘం (ఏసీఏ) స్టేడియం భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టుకు నవంబర్ 26 నుంచి ఆతిథ్యమివ్వనుంది. ఈ ఏడాది వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు భారత్‌లో పర్యటించనున్నాయి. వెస్టిండీస్‌తో భారత్ రెండు టెస్టులు ఆడనుంది. అనంతరం దక్షిణాఫ్రికాతో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టి20 మ్యాచ్‌ల్లో తలపడుతుంది. భారత్–దక్షిణాఫ్రికా మధ్య డిసెంబర్ 6న జరిగే మూడో వన్డే మ్యాచ్‌కు విశాఖపట్నం వేదిక కానుంది.

IPL 2025: ఉతికి ఆరేసిన బట్లర్.. ఆర్సీబీపై గుజరాత్ ఘన విజయం
చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు) వేదికగా ఆర్సీబీతో ఇవాళ (ఏప్రిల్ 2) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి గుజరాత్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. లివింగ్‌స్టోన్ (40 బంతుల్లో 54; ఫోర్, 5 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడటంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. మధ్యలో జితేశ్ శర్మ (21 బంతుల్లో 33; 5 ఫోర్లు, సిక్స్) కూడా ఓ మోస్తరుగా బ్యాట్ ఝులిపించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో వీరు మినహా ఎవరూ రాణించలేదు. సాల్ట్ 14, విరాట్ కోహ్లి 7, పడిక్కల్ 4, పాటిదార్ 12, కృనాల్ పాండ్యా 5 పరుగులు చేసి ఔటయ్యారు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్ 3 వికెట్లు తీయగా.. సాయికిషోర్ 2, అర్షద్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ణ, ఇషాంత్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.170 పరుగుల నామ మాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ 17.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జోస్ బట్లర్ (39 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), సాయి సుదర్శన్ (36 బంతుల్లో 49; 7 ఫోర్లు, సిక్స్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (18 బంతుల్లో 30 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) గుజరాత్‌ను గెలిపించారు. తొలుత నిదానంగా ఆడిన బట్లర్.. ఆతర్వాత గేర్ మార్చి ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆఖర్లో రూథర్‌ఫోర్డ్ (ఇంపాక్ట్ ప్లేయర్) తనదైన శైలితో చెలరేగిపోయాడు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో గుజరాత్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. టాప్ ప్లేస్‌లో ఉండిన ఆర్సీబీ మూడో స్థానానికి పడిపోయింది.
బిజినెస్

ఏజెంటిక్ ఏఐలో భారత్ టాప్!
న్యూఢిల్లీ: కృత్రిమ మేధకు సంబంధించి ఏజెంటిక్ ఏఐ వినియోగంలో భారత్ అగ్రగామిగా ఎదుగుతోంది. దేశీయంగా పలు వ్యాపార సంస్థలు దీనిపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. దాదాపు 80 శాతం సంస్థలు తమ అవసరాల కోసం సొంతంగా ఏఐ ఏజెంట్లను తయారు చేసుకోవడంపై ఆసక్తిగా ఉన్నాయి. భారత్‌లో జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ వినియోగం తీరుతెన్నులపై డెలాయిట్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.దీని ప్రకారం 80 శాతం భారతీయ సంస్థలు అటానమస్ ఏజెంట్లను తయారు చేసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నాయి. ఏజెంటిక్ ఏఐ విషయంలో గణనీయంగా మార్పులు చోటు చేసుకోవడాన్ని ఇది సూచిస్తోందని నివేదిక పేర్కొంది. 70 శాతం కంపెనీలు జెన్ఏఐని ఆటోమేషన్ కోసం ఉపయోగించుకోవడంపై ఆసక్తి కనపర్చగా, సగానికి పైగా కంపెనీలు దాదాపు పది జెన్ఏఐ ప్రయోగాలు నిర్వహిస్తున్నాయి.మనిషి జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేకుండా, స్వతంత్రంగా నిర్దిష్ట పనులను పూర్తి చేసేందుకు ఉపయోగపడే ఏఐ సిస్టమ్‌లను అటానమస్ ఏజెంట్లుగా వ్యవహరిస్తారు. వివిధ పనులు, ప్రక్రియలను ఆటోమేట్ చేసేందుకు వీటిని వినియోగించుకునే విధానాన్ని ఏజెంటిక్ ఏఐగా పరిగణిస్తారు. ఈ సాంకేతికతపై ఆసక్తి పెరుగుతుండటమనేది .. కొత్త ఆవిష్కరణలు, సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు కంపెనీలు ఏఐని ఉపయోగించుకునే విధానంలో వస్తున్న మార్పులను సూచిస్తోందని నివేదిక పేర్కొంది. సవాళ్లూ ఉన్నాయి.. ఏఐ వినియోగం పెరుగుతున్నప్పటికీ కొన్ని సవాళ్లూ ఉంటున్నాయి. తప్పిదాలు (36 శాతం), పక్షపాతం (30 శాతం), డేటా నాణ్యత (30 శాతం)లాంటివి భారీ స్థాయిలో వినియోగానికి సమస్యగా ఉంటున్నాయి. వెంటనే వినియోగించుకోవడానికి వీలుగా ఉండే రెడీమేడ్ ఏఐని ఎక్కువగా కంపెనీలు ఎంచుకుంటూ ఉండటంతో అవసరాలకు తగ్గట్లుగా వాటిలో పెద్దగా మార్పులు, చేర్పులు చేయడానికి అవకాశాలు ఉండటం లేదు. పైపెచ్చు కొన్నాళ్లకు కొరగాకుండా పోయేలా ఉంటున్నాయి. తాము ప్రస్తుతం ఉపయోగిస్తున్న సొల్యూషన్స్ రెండేళ్లలోపే పనికి రాకుండా పోయే అవకాశం ఉందని 28 శాతం కంపెనీలు భావిస్తున్నాయి. ఆశాభావంతో కంపెనీలు.. ఏఐని విస్తృతంగా వినియోగించుకోవడంపై సవాళ్లు నెలకొన్నప్పటికీ వచ్చే రెండేళ్లలో వాటిని అధిగమించగలమని దేశీ కంపెనీలు ఆశాభావంతో ఉన్నాయి. ఎప్పటికప్పుడు వేగంగా మారిపోతున్న ఈ రంగంలో వృద్ధి చెందేందుకు, అగ్రస్థానాన్ని నిలబెట్టుకునేందుకు భారత్ మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని, కొత్త ఆవిష్కరణలపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ మౌమితా సర్కార్ తెలిపారు. కొన్ని దేశీ సంస్థలు సొంతంగా తయారు చేసుకోవడం కాకుండా ఏఐ సొల్యూషన్స్‌ను కొనుక్కోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో అవసరాలకు అనుగుణంగా మల్చుకోగలిగేలా వాటిని తీర్చిదిద్దాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఏఐ పురోగమనంలో ముందంజలో ఉండేందుకు, దీర్ఘకాలంలో అధిక ప్రయోజనాలను పొందేందుకు, పరిస్థితులకు తగ్గట్లుగా మల్చుకోగలిగే ఆవిష్కరణలపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని సర్కార్ చెప్పారు. ఇటు వినియోగం వేగవంతం కావడం అటు దీర్ఘకాలంలో నిలబడగలిగే వ్యూహాలను అమలు చేయడం మధ్య సమతూకం పాటించడమే ఏఐపై పెట్టుబడులకు కీలకమని వివరించారు.

కాగ్నిజెంట్ గ్లోబల్ హెడ్‌గా శైలజ జోస్యుల
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ సర్వీస్ లైన్ గ్లోబల్ హెడ్‌గా శైలజ జోస్యుల నియమితులయ్యారు. కంపెనీ అంతర్జాతీయ జీసీసీ ప్రణాళికల అమలుకు ఆమె తోడ్పడనున్నారు. గతంలో కాగ్నిజెంట్‌లో ఆరేళ్లు పని చేసిన శైలజ, కొద్ది విరామం తర్వాత తిరిగొచ్చారు.ఆర్థిక సేవల మార్కెట్లో ఆమెకు అపార అనుభవం ఉందని కాగ్నిజెంట్ అమెరికాస్ ప్రెసిడెంట్ సూర్య గుమ్మడి తెలిపారు. నిరూపితమైన ట్రాక్ రికార్డుతో, శైలజ నాయకత్వం జీసీసీల ఏర్పాటు, అభివృద్ధిలో తమ సామర్థ్యాన్ని పెంచుతుందని, క్లయింట్లకు గొప్ప విలువను అందిస్తుందని పేర్కొన్నారు.ఈవైలో కొంతకాలం పనిచేసిన తర్వాత జోస్యుల తిరిగి కాగ్నిజెంట్‌లో చేరారు. 2018 నుంచి 2024 వరకు కాగ్నిజెంట్‌లో హైదరాబాద్ సెంటర్ హెడ్‌గా, బీఎఫ్ఎస్ఐ ఆపరేషన్స్ డెలివరీ గ్లోబల్ హెడ్‌గా సేవలందించారు. దాదాపు 30 ఏళ్ల అనుభవం ఉన్న ఆమె థామ్సన్ రాయిటర్స్, హెచ్ఎస్బీసీల్లో నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించారు.

బిర్లాన్యూ రూ. 1,300 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: సీకే బిర్లా గ్రూప్‌లో భాగమైన నిర్మాణ రంగ మెటీరియల్స్ సొల్యూషన్స్ విభాగం బిర్లాన్యూ వచ్చే 3–4 ఏళ్లలో అమ్మకాలను రెట్టింపు చేసుకోవాలని నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా రూ. 1,200 కోట్లు – రూ. 1,300 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు సంస్థ ప్రెసిడెంట్ అవంతి బిర్లా తెలిపారు. అలాగే, అధిక వృద్ధి సాధన దిశగా ఇతర సంస్థలను కొనుగోలు చేసే అవకాశాలనూ పరిశీలిస్తున్నట్లు వివరించారు.పైపులు, నిర్మాణ రంగంలో ఉపయోగించే రసాయనాల వ్యాపార విభాగాలు కీలక వృద్ధి చోదకాలుగా ఉంటాయని, అంతర్జాతీయ ఇంటీరియర్స్ బ్రాండ్ పారాడోర్ వ్యాపారం కూడా వచ్చే మూడు, నాలుగేళ్లలో రెట్టింపు కాగలదని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. కంపెనీ గతేడాదే పైపులు, ఫిట్టింగ్స్ తయారీ సంస్థ క్రెస్టియా పాలిటెక్‌తో పాటు దాని నాలుగు అనుబంధ సంస్థలను రూ. 265 కోట్లకు కొనుగోలు చేసింది.ఏజీఐ గ్రీన్‌ప్యాక్ రూ. 700 కోట్ల పెట్టుబడులు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంటైనర్ గ్లాస్‌ల తయారీ సంస్థ ఏజీఐ గ్రీన్‌ప్యాక్ కొత్త ప్లాంటు ఏర్పాటు కోసం రూ. 700 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపింది. మధ్యప్రదేశ్‌లో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ సీఎండీ సందీప్ సోమాని తెలిపారు. ఈ ప్లాంటు రోజువారీ ఉత్పత్తి సామర్థ్యం 500 టన్నులుగా ఉంటుందని, దీనితో తమ తయారీ సామర్థ్యం సుమారు 25 శాతం పెరుగుతుందని వివరించారు. ఫార్మా, బెవరేజెస్ తదితర రంగాల కోసం ఉత్పత్తులు తయారు చేసే ఈ ప్లాంటు, 24 నెలల్లో అందుబాటులోకి రాగలదని చెప్పారు.

నేరుగా వాట్సాప్‌లో.. ఇన్వెస్టర్లకు సరికొత్త ఫీచర్
హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ వాట్సాప్ ఆధారిత ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్ ‘ట్యాప్2ఇన్వెస్ట్’ను ప్రవేశపెట్టింది. ఈ ఇండస్ట్రీ-ఫస్ట్ ఫీచర్ ప్రస్తుత కేవైసీ-వెరిఫైడ్ ఇన్వెస్టర్లను వాట్సాప్‌లో క్లిక్ ఆధారిత ఇంటర్ఫేస్ ద్వారా మ్యూచువల్ ఫండ్ పథకాలలో పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తుందని మ్యూచువల్ ఫండ్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.టెక్ట్స్ కమాండ్లపై ఆధారపడే సాంప్రదాయ వాట్సాప్ ఆధారిత పెట్టుబడి సేవల మాదిరిగా కాకుండా, ట్యాప్ 2ఇన్వెస్ట్ వాట్సాప్‌లో యూజర్ ఫ్రెండ్లీ, యాప్ లాంటి అనుభవాన్ని అందిస్తుంది. పెట్టుబడిదారులు నేరుగా వాట్సాప్ (+91-82706 82706) ద్వారా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్) ప్రారంభించవచ్చు. లేదా పెద్ద మొత్తం పెట్టుబడులను సైతం పెట్టవచ్చు.యూపీఐ ఆటోపే, నెట్ బ్యాంకింగ్, ఇతర డిజిటల్ పేమెంట్ ఆప్షన్లకు ఈ ప్లాట్‌ఫామ్ సపోర్ట్ చేస్తుందని ఫండ్ హౌస్ తెలిపింది. వాట్సాప్ వంటి సుపరిచిత ప్లాట్ఫామ్లో ఇన్వెస్టర్లు తమ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను నిర్వహించడానికి ‘ట్యాప్2ఇన్వెస్ట్’ సురక్షితమైన మార్గాన్ని అందిస్తుందని హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ఎండీ, సీఈఓ నవనీత్ మునోత్ వివరించారు.
ఫ్యామిలీ

40లలో ఏం తింటామో అది..70లలోని ఆర్యోగ్యాన్ని నిర్ణయిస్తుందా..?
ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఎలాంటి దీర్ఘవ్యాధుల బారినపడకుండా సాగే చక్కటి వృద్ధాప్య జీవితం కొనసాగించడం ఎలా అనేది శాస్తవేత్తలను వేధిస్తున్న చిక్కు ప్రశ్న. మనం తినే ఆహారం వృద్ధాప్యానికి ఏమైనా లింక్ ఉందా? అనే దిశగా విస్తృతమైన పరిశోధనలు చేశారు. అయితే దానికి తాజాగా చేసిన పరిశోధనల్లో సరైన సమాధానం దొరికిందని వెల్లడించారు శాస్త్రవేత్తలు. ఆహారం వృద్ధాప్యాన్ని ఎలా డిసైడ్ చేస్తుందో నిర్థారించామని చెప్పారు. కేవలం ఎక్కువ కాలం జీవించడమే లక్ష్యం కాదని మెరుగ్గా జీవించడమనేది అత్యంత ప్రధానమంటూ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. అవేంటో చూద్దామా..!.నిపుణుల అభిప్రాయం ప్రకారం..సమతుల్య ఆహారం, దీర్ఘాయువు, మెదడు పనితీరుతో సహా మొత్తం ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతుందని అన్నారు. పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు మంటను తగ్గించడానికి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి, శారీరక విధులకు మద్దతు ఇవ్వడానికి సహాపడతాయని చెప్పారు. అందుకోసం 30 ఏళ్ల లోపు వయసున్న దాదాపు ఒక లక్ష మందికి పైగా వ్యక్తుల ఆహారపు అలవాట్లను ట్రాక్ చేశామని చెప్పుకొచ్చారు. వారంతా తీసుకున్న ఆహారం..అది వారి 70 ఏళ్ల వయసులోని ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో నిర్థారించామని చెప్పారు. ఆ క్రమంలోనే ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం తీసుకోవాల్సిన సరైన ఎనిమిది ఆహార విధానాలను కూడా గుర్తించామని తెలిపారు. దాన్ని ఆరోగ్యకరమైన సూచిక(AHEI)గా వర్గీకరించారు. ఈ విధమైన ఆహారాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా నొక్కి చెప్పారు శాస్త్రవేత్తలు.ఆ ఆహారాలు ఏంటంటే..పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు, చిక్కుళ్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు(ఆలివ్ నూనె, చేప కొవ్వు) తదితరాలు మంచివని చెప్పారు. అదే సమయంలోఎరుపు మాంసం, ప్రాసెస్ చేసిన ఆహారాలు(జంక్‌ఫుడ్), శుద్ధిచేసిన ధాన్యాలు, అధిక సోడియం తదితరాలను నివారిస్తే మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలను పొందగలరని అన్నారు. ఈ ఆహారపు అలవాట్లకు కాస్త దగ్గరగా ఉన్నవారు.. 70లలో మెరుగైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకున్నట్లు వివరించారు. ఇలాంటి కొన్ని ఆరోగ్య సూత్రాలు ఆరోగ్యకరమైన జీవతానికి మద్దుతిస్తాయని చెప్పారు. అందుకోసం వివిధ రకాల రంగురంగుల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, అసంతృప్త కొవ్వులు తదితర ఆహారపు అలవాట్లు ప్రాధాన్యత ఇస్తే..70లలో ఏ చీకు చింతా లేకుండా హాయిగా వృద్ధాప్యాన్ని ఆస్వాదించగలుగుతారని అన్నారు పరిశోధకులు.(చదవండి: పొట్ట ఫ్లాట్‌గా ఉండాలా..? ఐతే సాయంత్రం ఆరు తర్వాత ఆ ఆరు ఆహారాలను నివారించండి!)

35 ఏళ్ల నాటి డ్రెస్‌తో రాధికా మర్చంట్ న్యూ లుక్...ఇదే తొలిసారి!
అంబానీ ఫ్యామిలీకి చెందిన 'చోటి బహు' రాధిక మర్చంట్ అందంలోనూ, ష్యాషన్ స్టైల్లోనూ ఎప్పుడూ స్పెషల్‌గా నిలుస్తుంది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీని ప్రేమించి పెళ్లి చేసుకున్న రాధిక తన ట్రెండీ ఫ్యాషన్ లుక్స్‌తో అభిమానులను ఆకర్షిస్తూనే ఉంటుంది. ఆమె ఫ్యాషన్ సెన్స్‌తో ఫ్యాషన్ ప్రపంచాన్ని మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా చందేరీ చీరతో తన డ్రెస్‌ను వినూత్నంగా తీర్చి దిద్దిన వైనం ఆకర్షణీయంగా నిలిచింది. 35 ఏళ్ల వింటేజ్ కార్సెట్‌ను చందేరి చీరతో అందంగా స్టైల్ చేయడం హైలైట్‌గా నిలిచింది.అనంత్ అంబానీతో పెళ్లి సందర్భంగా రాధిక మర్చంట్ తన ఫ్యాషన్ స్టైల్‌ను చాటుకుంది. ప్రీ వెడ్డింగ్ వేడుకలు, అత్యంత ఘనంగా జరిగిన వెడ్డింగ్‌లో ఆమె ధరించిన ఒక్కో డ్రెస్ ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుంది. హల్దీ వేడుకలు, మెహిందీ మొదలు సాంప్రదాయ దుస్తుల్లో కొత్త వధువుగా ఆమె లుక్స్ వరకు ప్రతీ వస్త్రాలంకరణలో అందరి హృదయాలను గెలుచు కుంది. తాజాగా రాధిక తనకు ఇష్టమైన స్టైలిస్ట్ రియా కపూర్ స్టైల్ చేసిన వింటేజ్ కార్సెట్నురీ మోడల్ చేసి కార్సెట్-సారీ ట్రెండ్ సృష్టించింది. సల్వార్-కమీజ్‌కు కూడా స్టైల్‌తో కనిపించేలా చందేరీ చీరతో 35 ఏళ్ల కార్సెట్‌ను రీ స్టైల్ చేసి ధరించడం ద్వారా మరోసారి ఫ్యాషన్ ముద్రను చాటుకుంది.ఏప్రిల్ 1న జరిగిన వివియన్నే వెస్ట్ వుడ్ షోకు హాజరైనప్పటి రాధిక ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్లో సందడి చేశాయి. వివియన్నే వెస్ట్ వుడ్ తయారు చేసిన పోర్ట్రెయిట్ కలెక్షన్ నుండి పురాతన కార్సెట్, స్కార్ఫ్ ధరించి కనిపించింది. ఇందులో ఫ్రెంచ్ కళాకారుడు ఫ్రాంకోయిస్ బౌచర్ రాసిన 'డాఫ్నిస్ అండ్ క్లో' (1743-174) పెయింటింగ్ కూడా ఉండటం విశేషం. వివియన్నే ఒక దుస్తులపై పెయింటింగ్‌ను పునరుత్పత్తి చేయడం ఇదే తొలిసారి. ఈ డ్రెస్ పద్దెనిమిదవ శతాబ్దపు ఆయిల్ పెయింటింగ్ గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది అంటున్నారు ఫ్యాషన్ రంగ నిపుణులు చదవండి: శోభిత ధూళిపాళ బ్యూటీ సీక్రెట్స్ తెలిస్తే షాకవుతారు!ఈ లుక్కు ముత్యాల చోకర్, మ్యాచింగ్ స్టడ్ చెవిపోగులతో స్టైల్ చేయడం మరో హైలైట్. ఈ గతంలో తన మంగళసూత్రాన్ని స్టైల్ చేసిన విధానం అందర్నీ ఆశ్చర్యపరిచింది. మెడలో ధరించాల్సిన మంగళసూత్రాన్ని బ్రాస్లెట్గా ధరించిన సంగతి తెలిసిందే. ముంబైలో జరిగిన వివియన్ వెస్ట్‌వుడ్ ష్యాషన్ ఈవెంట్‌కు రాధికా మర్చంట్ అక్క అంజలి మర్చంట్ మరో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. స్టార్-స్టడెడ్ ఈవెంట్లో ఎమరాల్డ్ గ్రీన్ గౌనులో ఆమె అందంగా కనిపించారు. View this post on Instagram A post shared by yogen shah (@yogenshah_s)

మహిళలకు డిజిటల్ స్కిల్స్
సాక్షి, సిటీబ్యూరో: గ్రామీణ మహిళల సాధికారత కోసం పనిచేసే నాస్కామ్ ఫౌండేషన్ మహిళలకు డిజిటల్ స్కిల్స్‌లో శిక్షణ అందించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. హెచ్ఎస్బీసీతో కలిసి 4వేల మంది మహిళలకు ఆర్థిక అక్షరాస్యత, వ్యాపార దక్షత, ఇ-గవర్నెన్స్.. తదితర విషయాల్లో అవగాహన కల్పించనున్నామని, రాష్ట్రంతో పాటు కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోనూ ఈ కార్యక్రమం కొనసాగుతోందని వివరించింది. ‘డిజిటల్ ఎకానమీలో మహిళల పాత్ర విస్తరణ, మహిళా వ్యాపారుల సామర్థ్యాలను పెంపొందించడం’ పేరిట ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొంది. పాటరీ వర్క్షాప్నగరంలోని ఆర్ట్ లవర్స్ కోసం ప్రత్యేకంగా పాటరీ వర్క్‌షాప్ ప్రారంభించింది మైరా స్టూడియో. బంజారాహిల్స్‌లోని స్టూడియో మైరా వేదికగా నేటి నుంచి ప్రారంభమయ్యే పాటరీ వర్క్‌షాపులో రంగులతో ప్రత్యేక కళాఖండాలను సృష్టించడానికి శిక్షణ అందించనున్నారు. ఈ వర్క్‌షాప్‌కు అవసరమైన మేకింగ్ మెటీరియల్ నిర్వాహకులే అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీ వరకూ కొనసాగనున్న ఈ వర్క్‌షాపులో ఐదేళ్లపైబడిన ఆర్ట్ లవర్స్ ఎవరైనా భాగస్వాములు కావచ్చని నిర్వాహకులు తెలిపారు. బుక్ మై షో ద్వారా నమోదు చేసుకోవచ్చని వివరించారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అందుబాటులో ఉండే ఈ వర్క్‌షాపు వారంలోనూ, వారాంతాల్లోనూ ఉంటుంది.

అగ్గినీ తట్టుకునే ‘అగవె’! దెబ్బకు కార్చిచ్చులు కట్టడి..
అగవె.. చాలా అరుదైన ఎడారి మొక్క. మంటలకు తట్టుకొని నిలబడగలిగే అరుదైన లక్షణం గల ఎడారి పంట ఇది. కలబంద మొక్క మాదిరిగా కనిపించే అగవే చాలా ఎత్తుగా ఎదుగుతుంది. అగవె మట్టల నుంచి నార తీసి, తాళ్లు అల్లే సంప్రదాయం ఉంది. ‘నార కలబంద’ అని పేరుంది. తీవ్ర వేడి పరిస్థితుల్లోనూ మనుగడ సాగిస్తుంది. పశుగ్రాసంగా పనికొస్తుంది. వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి భూమిలో స్థిరీకరించటం ద్వారా భూతాపాన్ని తగ్గిస్తుంది. నేలలో సేంద్రియ కర్బనాన్ని పెంపొందిస్తుంది. దీని మట్టల పైపొర చాలా దృఢంగా, బూడిద పూసినట్లు ఉండటం వల్ల మంటలను కూడా తట్టుకోగలుగుతుంది. అందువల్ల, అగవే తోటలకు నిప్పు భయం ఉండదు. ఉద్యాన తోటల మధ్యలో అక్కడక్కడా కొన్ని వరుసలు అగవే మొక్కలు నాటుకుంటే నిప్పు భయం నుంచి తోటలను కొంతమేరకైనా కాపాడుకోవచ్చు. 275కు పైగా రకాలుఅగవె సక్యులెంట్ ప్లాంట్. అంటే, గాలి నుంచి తేమను గ్రహించి తన ఆకుల్లో దాచుకోగలిగే ఎడారి మొక్క. ఐదారు అడుగుల ఎత్తుకు పెరిగే అగవె జాతులు కూడా ఉన్నాయి. బహుళ ప్రయోజనకారి అయిన అగవె తోటలు అమెరికా ఖండం అంతటా వ్యాపించి ఉన్నప్పటికినీ.. మెక్సికోలో ఎక్కువ. మన దేశంలోనూ అగవె మొక్కలు మెట్ట ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. 275కు పైగా అగవె పంట రకాలున్నాయి. ఇందులో ఎ. సిసాలన, ఎ. కంటల, ఎ.అమెరికానా వంటి అగవె రకాలు భారత దేశంలో అందుబాటులో ఉన్నాయని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం పదేళ్ల క్రితమే ప్రకటించింది. దీని సాగు పద్ధతులను కూడా ప్రామాణీకరించింది. అయినా, ఇప్పటికీ అగవె మనం ఉపయోగించుకోలేక΄ోయిన పంటగానే మిగిలిపోయింది.దైవమిచ్చిన పంట! మెక్సికోలో పురాతన కాలం నుంచే అజ్టెక్ ప్రజలు అగవెను దైవమిచ్చిన పంటగా భక్తితో సాగు చేసుకొని ఉపయోగించుకుంటున్నారని చరిత్ర చెబుతోంది. మాయాహుఎల్ అనే దేవత తమకు ప్రసాదించిన తేనె అగవె మట్టల నుంచి తీసినదేనని వారు నమ్ముతారు. ఇప్పుడు దీన్ని ఒక పారిశ్రామిక పంటగా, ఆదాయ వనరుగా కూడా చూస్తున్నారు. అనేక ఆల్కహాల్ ఉత్పత్తులతో పాటు.. షుగర్, సిరప్ వంటి ఆహారోత్పత్తులు, సహజ నార ఉత్పత్తుల తయారీకి.. పశుగ్రాసంగా కూడా అగవె పంటను ఉపయోగిస్తున్నారు. యాంటీఆక్సిడెంట్లు, సపోనిన్లు వంటి ఆరోగ్యకర ఉత్పత్తులను కూడా ఇటీవల అగవె నుంచి ఇటీవల సంగ్రహిస్తున్నారు. దీంతో ఇది బహుళ ప్రయోజనకారి అయిన పారిశ్రామిక పంటగా మారింది. భూతాపోన్నతి పెచ్చుమీరుతున్న ఈ దశలో ఈ ఎడారి పంట మరింత ప్రాచుర్యంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తీవ్ర నీటి ఎద్దడిని తట్టుకునే స్వభావం వల్ల లాండ్‌స్కేపింగ్‌లో కొన్ని రకాల అగవె మొక్కలను కంచెలుగా పెంచుతుండటం నగరాల్లోనూ కనిపిస్తోంది.వంద కోట్ల అగవె ప్రాజెక్టుఅగవె జాతి మొక్కల పెంపకం వల్ల ప్రజలకే కాకుండా పర్యావరణానికీ గొప్ప మేలు జరుగుతుందని నమ్మే ‘రీజెనరేషన్ ఇంటర్నేషనల్’ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల అగవె మొక్కలు నాటాలన్న బృహత్ సంకల్పం తీసుకుంది. ద బిలియన్ అగవె ప్రాజెక్ట్‌లో భాగంగా మెక్సికోలోని గ్వానాజువాటో ఎడారి ప్రాంతంలో పర్యావరణంలో అద్భుత మార్పులు తేగల అగవె తోటలు నాటుతున్నారు. అగవె మొక్కలతో పాటు వాటి పక్కనే నత్రజనిని గాలిలో నుంచి గ్రహించి భూమిలో స్థిరీకరింపజేసే జాతుల చెట్లను నాటడం, పశువులను ఈ తోటల్లో తగుమాత్రంగా మేపుతూ ఉండటం ద్వారా ఆ ఎడారి ప్రాంతాన్ని తిరిగి పచ్చని ప్రాంతంగా మార్చటం ఈ ప్రాజెక్టు లక్ష్యం. తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల్లో, నిస్సారమైన భూముల్లో అధికంగా పశుగ్రాసాన్ని పెద్ద మొత్తంలో సాగు చేయటం అగవె ద్వారానే సాధ్యమని ఈ సంస్థ తెలిపింది. అగవె మట్టలను గుజ్జులాగా చేసి, కొన్ని రోజులు గాలి తగలకుండా మగ్గబెడితే అద్భుతమైన పశుగ్రాసంగా పనికి వస్తుంది. తీవ్ర కరువు ్ర΄ాంతాల్లో పశువులను ఇది కష్టకాలంలో రక్షిస్తుందని చెబుతున్నారు.సరికొత్త తోటల నమూనా అగవెతో మెట్ట ప్రాంతాల్లో సాగు చేయదగిన సరికొత్త తోటల (ఆగ్రోఫారెస్ట్రీ) నమూనాను రీజనరేషన్ ఇంటర్నేషనల్ రూ΄÷ందించింది. హెక్టారుకు 1600–2500 మొక్కల్ని వత్తుగా నాటాలి. వీటి మధ్యలో వేగంగా పెరిగే, పశువులు తినే ఆకులుండే దీర్ఘకాలిక ద్విదళ జాతి చెట్ల జాతి (గ్లైరిసీడియా (గిరిపుష్పం), తుమ్మ వంటి) మొక్కల్ని 500 వరకు నాటాలి. అగవె మొక్కలు 3 ఏళ్లు పెరిగిన తర్వాత నుంచి 5–7 ఏళ్ల పాటు ఈ చెట్ల మట్టలను (ఆకులను) కోసుకోవచ్చు. గట్టిగా ఉండే ఈ మట్టలను చాప్ కట్టర్ వంటి యంత్రంతో గుజ్జులాగా తరగాలి. ΄్లాస్టిక్ బక్కెట్లు/ డ్రమ్ముల్లో ఈ గుజ్జును నింపి, మూత పెట్టి, 30 రోజులు మాగ బెట్టాలి. దీనితో ΄ాటు.. గ్లైరిసీడియా/ అడవి తుమ్మ /సర్కారు తుమ్మ వంటి ద్విదళ జాతి చెట్ల కాయలు, ఆకులను 20% వరకు కలిపి గుజ్జుగా చేసి కలిపితే ప్రోటీన్లు కూడా సమృద్ధిగా దొరుకుతాయి. ఈ విధంగా సహజ సిద్ధమైన కూడిన పశువుల దాణా అతి తక్కువ ఖర్చుతో తయారవుతుంది. 8–10 ఏళ్ల తర్వాత అగవె చెట్టు పువ్వు పూసి చని΄ోతుంది. ఆ దశలో చెట్టు కాండం నుంచి ఆల్కహాల్ ఉత్పత్తుల తయారీకి వినియోగించవచ్చు. ఈ అగవె తోటలో పశువులను మేపుకుంటూనే, పశువుల దాణాను కూడా తయారు చేసుకోవచ్చు. ఎడారి ప్రాంత రైతులకు అగవె తోటలు ఆర్థికంగానే కాకుండా పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేస్తాయని రీజెనరేషన్ ఇంటర్నేషనల్ స్పష్టం చేస్తోంది. ఇది మన దేశంలోనూ దక్షిణాదిలో మెట్ట ప్రాంత రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే అగ్రోఫారెస్ట్రీ నమూనాగా చెప్పవచ్చు.ఎకరానికి 30–40 టన్నుల మట్టల దిగుబడిమన దేశంలో ఎ. సిసలన, ఎ. కంటల, ఎ. అమెరికానా రకాల అగవె మొక్కలు ఉన్నాయి. నీరు నిల్వ ఉండని, ఎర్ర గరప నేలల్లో బాగా పెరుగుతుందని అగవె పంటపై పరిశోధన చేసిన తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆకు ముక్కలను లేదా పిలకలను నాటుకోవాలి. ఆకు ముక్కల్ని నర్సరీలో 9–12 అంగుళాల వరకు పెంచి, 2“2 మీటర్ల దూరంలో, వర్షాకాలంలో నాటుకోవాలి. మూడేళ్ల తర్వాత నుంచి ఆకుల దిగుబడి వస్తుంది. మీటరు కన్నా ఎక్కువ ΄÷డవు పెరిగిన ఆకులను కత్తిరించాలి. ప్రతి మొక్కా ఏడాదికి 40–50 ఆకుల దిగుబడిని 8 ఏళ్ల వరకు ఇస్తుంది. ఈ మట్టల్లో నార/పీచు రకాన్ని బట్టి 2.5–4.5% వరకు ఉంటుంది. అగవె సిసలన రకంలో 4.5% నాణ్యమైన నార ఉంటుంది. మూడేళ్లు గడచిన తర్వాత ఎకరానికి 30–40 టన్నుల మట్టల దిగుబడి వస్తుంది. పదేళ్ల నాటి అంచనాల ప్రకారం.. ఎకరానికి రూ. 2 వేల నికారాదాయం వస్తుంది. పొలాల చుట్టూ కంచె పంటగా అగవెను నాటుకున్నా.. ఇందులో 25% నికరాదాయం వస్తుంది. యంత్రంతో నార తీసి, నీటితో శుద్ధిచేసి, ఎండబెట్టి బేళ్లుగా కట్టి అమ్మాలి. ఎండగా ఉన్న రోజే నార తియ్యాలి. మట్టలను కోసిన రెండు రోజుల్లోగా తీస్తేనే నాణ్యమైన నార వస్తుంది. పాల తెలుపు నుంచి బంగారు పసుపు రంగుల్లో ఈ నార ఉంటుందని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం పేర్కొంది. అగవెను పశు దాణా ఉత్పత్తి గురించి మెక్సికో రైతులు ఎక్కువగా చెబుతుంటే.. తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం మాత్రం నార కోసం అని మాత్రమే చెబుతోంది. అందుకే దీనికి నార కలబంద అని పేరొచ్చినట్టుంది. ఏదేమైనా బంజర్లు, ఎడారి ్ర΄ాంతాల్లో అగవెతో కూడిన కొత్త రకం ఆగ్రోఫారెస్ట్రీ తోటల సాగుపై ప్రభుత్వ రంగ పరిశోధకులు దృష్టి సారిస్తే వర్షాధార ప్రాంత రైతులకు, పర్యావరణానికీ మేలు కలుగుతుంది. ‘అగవె’నే ఎందుకు?భూతాపం పెచ్చు మీరిన తర్వాత అడవుల్లో కార్చిచ్చులు మరీ ఎక్కువైపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. వేలాది ఎకరాల్లో అడవులు దగ్థమైపోతున్నాయి. అంతర్జాతీయంగా కార్చిచ్చుల నుంచి పచ్చని చెట్లను, తోటలను రక్షించుకోవటానికి మధ్యలో అక్కడక్కడా అగవే మొక్కలు నాటుకోవటం ఒక వినూత్న పరిష్కార మార్గంగా ముందుకు వస్తోంది.అగవె మట్టలు(ఆకులు) మందంగా, బూడిద పూసినట్లు ఉండి, వేడిని తట్టుకునేలా ఉంటాయి. సులువుగా నిప్పంటుకోవటానికి అవకాశం ఉండదు. అగవె మొక్క తన ఆకుల్లో చాలా నీటిని నిల్వ చేసుకుంటుంది. అందువల్ల వాటికి అంత సులువుగా నిప్పంటుకోదు. ఈ కారణంగా మంటలను అవతలి ప్రాంతానికి వ్యాపింపజేయకుండా అడ్డుకునే తత్వం అగవె మొక్కలకు వచ్చింది. అగవె చెట్టు వేర్లు ఎంత విస్తారంగా భూమిలోకి విస్తరించి ఉంటాయంటే.. ఇతరత్రా చెట్లన్నీ అగ్నికి ఆహుతైపోయినా ఇవి మాత్రం నిలబడే ఉంటాయి. ఒక మొక్కకు టన్ను పశువుల దాణా!అగవె మొక్కలు గాలికి, ఎండకు, వానకు పెరుగుతాయి. నిర్వహణ అతి సులభం. బాగా పెరుగుతుంది. ఒక్కో చెట్టు 8–10 ఏళ్లు బతుకుతుంది. ఈ కాలంలో ఒక టన్ను బరువైన మట్టలను అందిస్తుంది. ఈ చెట్లను ఇతర ద్విదళ చెట్లతో కలిపి పెంచితే ఎడారి ప్రాంతం కూడా ఆకుపచ్చగా మారుతుంది. భూమి సారవంతమవుతుంది. వాన నీరు అక్కడికక్కడే భూమిలోకి బాగా ఇంకుతుంది. వాతావరణంలోని కార్బన్ డయాక్సయిడ్ను భారీగా గ్రహించి భూమిలో స్థిరీకరించడానికి అగవె తోటలు దోహదపడతాయి. ఈ ప్రయోజనాల రీత్యా ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల అగవె మొక్కలు నాటాలని ద బిలియన్ అగవె ఉద్యమాన్ని రీజనరేటివ్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రారంభించింది. విరాళాలు, ప్రభుత్వ, ప్రజల పెట్టుబడులతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని ఈ సంస్థ తలపెట్టింది. పతంగి రాంబాబు, సాగుబడి డెస్క్(చదవండి: beat the heat ఇండోర్ ప్లాంట్స్‌తో ఎండకు చెక్)
ఫొటోలు


కూతురు 'శివియా'తో హీరోయిన్ సంగీత.. వైరల్ ఫోటోలు చూశారా..?


ఖరీదైన అపార్ట్ మెంట్ అమ్మేసిన హీరో షారూక్ భార్య (ఫొటోలు)


Sharwanand : కుటుంబంతో కలిసి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శర్వానంద్ పూజలు (ఫోటోలు)


ఆ హెలికాప్టర్ షాట్‌కు 14 ఏళ్లు.. సిక్స్ కొట్టి ప్రపంచకప్ గెలిపించిన ధోని..! (ఫొటోలు)


ప్రముఖ కమెడియన్ రెడిన్ కింగ్స్లే భార్యకు సీమంతం (ఫొటోలు)


జాన్వీకే తలనొప్పిగా మారిన తమన్నా, ఎవరీమె (ఫోటోలు)


గ్రాండ్‌గా దిల్ రాజు కూతురు హన్సిత బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)


తిరుమలలో ఆకాశ్ అంబానీ.. గోమాతకు విశేష పూజలు (ఫొటోలు)


బాంధవి శ్రీధర్ వాటే గ్లామర్... మతిపోగొడుతోన్న మసూద బ్యూటీ (ఫోటోలు)


'శారీ' మూవీ ప్రీరిజ్లో మెరిసిన నటి ఆరాధ్య దేవి (ఫొటోలు)
అంతర్జాతీయం

ఏనుగు–డ్రాగన్ ‘ట్యాంగో’ చేయాలి
బీజింగ్: భారత్, చైనా దేశాలు కలిసికట్టుగా పని చేయాలని చైనా అధినేత జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. ఉమ్మడి లక్ష్యాల సాధనకు మనమంతా చేతులు కలపాలని సూచించారు. ప్రాథమిక ప్రయోజనాల పరిరక్షణ కోసం ఏనుగు–డ్రాగన్ కలిసి ‘ట్యాంగో’డ్యాన్స్ చేయాలని ఆకాంక్షించారు. భారత్–చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మొదలై 75 ఏళ్లవుతున్న సందర్భంగా భారత్‌కు ఆయన మంగళవారం శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు దేశాల నడుమ ద్వైపాక్షిక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు.భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జిన్‌పింగ్ ఒక సందేశం పంపించారు. భారత్, చైనాలు ప్రాచీన నాగరికతలు కలిగిన దేశాలని గుర్తుచేశారు. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద దేశాలుగా, గ్లోబల్ సౌత్‌లో ముఖ్యమైన సభ్యదేశాలుగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఆధునీకరణ ప్రయత్నాల్లో ఇరుదేశాలూ ఇప్పుడు కీలకమైన దశలో ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు జిన్‌పింగ్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. వ్యూహాత్మక పరస్పర విశ్వాసాన్ని మరింత పెంపొందించుకోవడానికి, భారత్–చైనా సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పడానికి భారత్‌లో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.కీలక రంగాల్లో పరస్పర సహకారం మరింత వృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. జిన్‌పింగ్ సందేశంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతిస్పందించారు. స్థిరమైన సేŠన్హ సంబంధాలు, ద్వైపాక్షిక భాగస్వామ్యం మన రెండు దేశాలతోపాటు మొత్తం ప్రపంచానికి మేలు చేస్తాయని వివరించారు. భారత్–చైనా సంబంధాలను మరింత ఉన్నత స్థానానికి చేర్చడానికి ఈ సందర్భాన్ని ఒక అవకాశంగా ఉపయోగించాలని పేర్కొన్నారు. మరోవైపు చైనా ప్రధాని లీ ఖెకియాంగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ సైత పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

ఐస్లాండ్లో మళ్లీ బద్దలైన అగ్ని పర్వతం
లండన్: అట్లాంటిక్ సముద్ర ద్వీప దేశం ఐస్లాండ్లో మరోసారి అగ్ని పర్వతం బద్దలైంది. రెక్జానెక్ ద్వీపకల్పంలోని గ్రిండావిక్ పట్టణ సమీపంలోని అగ్ని పర్వతం నుంచి భారీగా లావా, పొగలు చిమ్ముతుండటంతో మంగళవారం అధికారులు అక్కడున్న 40 నివాసాలను ఖాళీ చేయించారు. ఐస్లాండ్లో అతిపెద్ద పర్యాటక ఆకర్షణగా ఉన్న బ్లూ లగూన్ జియోథర్మల్ స్పాను మూసివేశారు. దాదాపు 800 ఏళ్ల పాటు నిద్రాణంగా ఉన్న ఈ అగ్నిపర్వతం నుంచి ఒక్కసారిగా లావా పెల్లుబకడంతో గతేడాదే ఇక్కడున్న వారందరినీ వేరే చోటుకు తరలించారు. ఉదయం 6.30 గంటలకు లావా ప్రవాహం మొదలై గ్రిండావిక్‌కు ఉత్తరంగా ఏర్పాటు చేసిన రక్షణ బారియర్‌ను దాటుకుని 500 మీటర్ల పొడవున ప్రవహిస్తోందని వాతావరణ విభాగం తెలిపింది. ఉత్తర అట్లాంటిక్‌లోని అగ్ని పర్వతాలకు కేంద్రమైన ప్రాంతంలో ఐస్లాండ్ ఉంది. 2010లో ఇక్కడి అగ్ని పర్వతం విస్ఫోటంతో భారీగా వాతావరణంలోకి వెదజల్లిన బూడిద మేఘాలు కొన్ని నెలలపాటు అట్లాంటిక్ మీదుగా విమాన ప్రయాణాలకు అంతరాయం కలిగించాయి.

మాండలే.. మరుభూమి
మాండలే: మయన్మార్ భూకంపం దేశంలో రెండో అతి పెద్ద నగరమైన మాండలేను మరుభూమిగా మార్చేసింది. నగరంలో మూడొంతులకు పైగా భవనాలు కుప్పకూలాయి. అవన్నీ క్రమంగా శవాల దిబ్బలుగా మారుతున్నాయి. మౌలిక సదుపాయాల లేమితో శిథిలాల వెలికితీత నత్తనడకన సాగుతోంది. వాటికింద వేలాదిమంది చిక్కుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. భూకంపం సంభవించి ఐదు రోజులు కావస్తుండటంతో వారు ప్రాణాలతో ఉండే అవకాశాలు దాదాపుగా సన్నగిల్లుతున్నాయి. కుళ్లుతున్న శవాలతో మాండలే వీధుల్లో ఇప్పటికే భరించలేనంతటి దుర్గంధం వ్యాపించింది.దీనికితోడు మంగళవారం సాయంత్రం కూడా మాండలేను మరో భూకంపం వణికించింది. 5.1 తీవ్రత భూమి కంపించడంతో ఇప్పటికే దెబ్బతిని పగుళ్లిచ్చిన చాలా భవనాలు కుప్పకూలాయి. దాంతో జనం హాహాకారాలు చేస్తూ రోడ్లపైకి పరుగులు తీశారు. రాత్రంతా ఆరుబయటే జాగారం చేస్తూ గడిపారు. దేశవ్యాప్తంగా భూకంప మృతుల సంఖ్య 2,700, క్షతగాత్రుల సంఖ్య 5,000 దాటాయి. వారి స్మృత్యర్థం మంగళవారం మధ్యాహ్నం దేశవ్యాప్తంగా ప్రజలు నిమిషం పాటు మౌనం పాటించారు. మయన్మార్‌లో 10 వేలకు పైగా భవనాలు కూలిపోయినట్టు ఐరాస పేర్కొన్న నేపథ్యంలో మృతుల సంఖ్య అపారంగా ఉంటుందని చెబుతున్నారు. ప్రతికూల వాతావరణం కూడా సహాయక చర్యలకు పెద్ద ప్రతిబంధకంగా మారుతోంది. మంగళవారం దాకా విపరీతమైన ఎండ కాయగా బుధవారం నుంచి భారీ వర్ష సూచనలు ఆందోళనగా మారాయి. బ్యాంకాక్‌లో 21 మంది...థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో భూకంపానికి 21 మంది బలైనట్టు ఇప్పటిదాకా తేలింది. కుప్పకూలిన నిర్మాణంలోని 30 అంతస్తుల భవనం వద్ద శిథిలాల తొలగింపు ఇంకా కొనసా గుతోంది. అందులో పని చేస్తున్నవారిలో 78 మంది ఆచూకీ తేలడం లేదని అధికారులు తెలిపారు. దానికింద చిక్కినవారి సంఖ్య 300 దాకా ఉంటుందని అనధికారిక అంచనాలు చెబుతున్నాయి.పాపం పసివాళ్లు!మాండలేకు 40 కి.మీ. దూరంలోని క్యౌక్సే పట్టణంలో ఓ ప్రీ స్కూల్లో 70 మంది చిన్నారుల్లో అత్యధికులు భూకంపానికి నిస్సహాయంగా బలయ్యారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. జరిగిన దారుణాన్ని తలచుకుంటూ ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటికీ గుండెలవిసేలా రోదిస్తున్నారు. మాండలే సమీపంలో కుప్పకూలిన ఓ బౌద్ధారామం శిథిలాల నుంచి ఇప్పటిదాకా 50 మందికి పైగా సన్యాసుల మృతదేహాలను వెలికితీశారు. వాటికింద నలిగి కనీసం మరో 150 మంది మరణించి ఉంటారని చెబుతున్నారు.మృత్యుంజయులుమయన్మార్ రాజధాని నేపిడాలో భవన శిథిలాల నుంచి ఓ 63 ఏళ్ల వృద్ధురాలు, ఆమె మనవరాలు ఏకంగా 91 గంటల తర్వాత మంగళవారం ప్రాణాలతో బయటపడ్డారు. మరోచోట ఓ ఐదేళ్ల చిన్నారిని, గర్భిణిని కూడా సహాయక బృందాలు కాపాడాయి.

టారిఫ్‌లకు వేళాయె
న్యూయార్క్/వాషింగ్టన్/రోమ్/టోక్యో: ప్రపంచ వాణిజ్య యుద్ధానికి వేళైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గొప్పగా ప్రకటించుకుంటూ వస్తున్న ‘విముక్తి దినం’ రానే వచ్చింది. ప్రపంచ దేశాలపై అగ్ర రాజ్యం ప్రతీకార సుంకాల బాదుడు బుధవారం నుంచే మొదలవనుంది. ఈ పరిణామం ప్రపంచ దేశాల్లో కలకలం రేపుతోంది. అమెరికాతో పాటు చాలా దేశాల్లో స్టాక్‌మార్కెట్లు నేలచూపులు చూస్తున్నాయి. భారత్‌కు కూడా భారీ వడ్డింపులు తప్పవని వైట్‌హౌస్ తాజాగా స్పష్టం చేసింది. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ సోమవారం మీడియాతో మాట్లాడారు.‘‘అమెరికా వ్యవసాయోత్పత్తులు తదితరాలపై భారత్ 100 శాతం సుంకాలు విధిస్తోంది. మా పాడి ఉత్పత్తులపై యూరోపియన్ యూనియన్ దేశాలు 50 శాతం టారిఫ్‌లు వసూలు చేస్తున్నాయి. జపాన్ అయితే మా బియ్యంపై ఏకంగా 700 శాతం టారిఫ్‌లు విధించింది. మా బటర్, చీజ్ తదితరాలపై కెనడా 300 శాతం టారిఫ్‌లు వడ్డిస్తోంది. ఈ దేశాలన్నీ నడ్డి విరిచే టారిఫ్‌లతో అమెరికాను పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఆయా దేశాలకు మా ఎగుమతులను అసాధ్యంగా మార్చేశాయి’’ అంటూ ఆక్షేపించారు. ‘‘ఇక ప్రతీకారానికి వేళైంది. వాళ్లకు అంతకు అంతా వడ్డించబోతున్నాం.అమెరికా ప్రజల సంక్షేమం దిశగా అధ్యక్షుడు తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం బుధవారం నుంచే అమల్లోకి రానుంది’’ అని పునరుద్ఘాటించారు. ఏయే దేశాలపై ఏ రంగంలో ఎంత సుంకాలు విధించబోయేదీ అధ్యక్షుడే స్వయంగా ప్రకటిస్తారని ఆమె తెలిపారు. ఈ టారిఫ్‌లు ఆరంభం మాత్రమేనని, వాటిని త్వరలో భారీగా పెంచుతామని ట్రంప్ ఇప్పటికే పేర్కొనడం తెలిసిందే. ‘‘అమెరికాపై టారిఫ్‌లను భారత్ భారీగా తగ్గిస్తోంది. చాలా దేశాలు కూడా అదే బాటన నడుస్తున్నాయి’’ అని సోమవారం ఆయన మీడియాతో చెప్పుకొచ్చారు. మా ప్లాన్లు మాకున్నాయి: ఈయూ అమెరికా టారిఫ్‌లకు బెదిరేది లేదని యూరోపియన్ యూనియన్ స్పష్టం చేసింది. వాటిని ఎదుర్కోవడానికి తమ వద్ద గట్టి ప్రణాళికలున్నాయని ఈయూ ప్రెసిడెంట్ ఉర్సులా వాండెర్ లెయన్ చెప్పారు. మంగళవారం ఆమె ఈయూ పార్లమెంటులో మాట్లాడారు. అమెరికావి తప్పుడు చర్యలని ఆక్షేపించారు. ‘‘మేం మొదలు పెట్టిన యుద్ధం కాదిది. అగ్ర రాజ్యానికి దీటుగా బదులిస్తాం. టారిఫ్‌ల బారినుంచి మా ప్రజలను, ఆర్థిక వ్యవస్థలను అన్నివిధాలా కాపాడుకుని తీరతాం’’ అని ప్రకటించారు. ‘‘మేం ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్.ఎలాంటి బేరసారాలకైనా కావాల్సినన్ని శక్తియుక్తులు మాకున్నాయి’’ అన్నారు. ‘‘కొన్ని అంశాల్లో అమెరికాకు అన్యాయం జరుగుతోందని ట్రంప్ భావిస్తుంటే, పలు అంశాల్లో మా విషయంలోనూ అదే జరుగుతోందన్నది మా అభిప్రాయం. వీటిపై చర్చలకు మేం సిద్ధమే. ఎందుకంటే టారిఫ్‌ల రగడ అంతిమంగా ప్రజలపైనే భారం వేస్తుంది. వారి జీవన వ్యయం పెరుగుతుంది’’ అని చెప్పారు. టారిఫ్ బాదుడు నుంచి జపాన్ను మినహాయించాలని ఆ దేశ ప్రధాని షిగెరు ఇషిబా మరోసారి ట్రంప్‌కు విజ్ఞప్తి చేశారు. అవసరమైతే వాషింగ్టన్ వెళ్లి ఆయనతో చర్చించేందుకు కూడా సిద్ధమన్నారు.దేశీయ మార్కెట్ల పరిరక్షణకే టారిఫ్‌లపై కేంద్రం ప్రకటనన్యూఢిల్లీ: భారత్‌కు అమెరికాయే అతి పెద్ద వాణిజ్య భాగస్వామి. ఈ నేపథ్యంలో టారిఫ్‌ల పెంపుతో పడే ప్రభావాన్ని కేంద్ర వాణిజ్య శాఖ నిశితంగా గమనిస్తోంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్రం ప్రకటించింది. వాణిజ్య నియంత్రణ, దేశీయ మార్కెట్ల పరిరక్షణే లక్ష్యంగా భారత్ సుంకాలు విధిస్తుందని స్పష్టం చేసింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద మంగళవారం లోక్‌సభలో ఈ మేరకు ప్రకటన చేశారు.హెచ్చు టారిఫ్‌లు దేశానికి మేలు చేయడం లేదని, ఆర్థిక వృద్ధి కోసం వాటిని తగ్గించడం తప్పనిసరని నీతీ ఆయోగ్ ఇటీవల చేసిన ప్రకటనపై ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు బదులిచ్చారు. ఆర్థిక వృద్ధికి మరింత ఊతమివ్వడం ద్వారా ప్రపంచ మార్కెట్లో భారత్‌ను ప్రబల శక్తిగా తీర్చిదిద్దాలన్నది తమ దీర్ఘకాలిక లక్ష్యమని వెల్లడించారు. ‘‘పలు దేశాలతో టారిఫ్‌ల సమతుల్యత సాధించే దిశగా కసరత్తు జరుగుతోంది. ఇందుకోసం పలు దేశాలతో ఇప్పటికే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి’’ అని గుర్తు చేశారు. ప్రస్తుతం 13 దేశాలతో భారత్ ఎఫ్‌టీఏలు చేసుకుంది. అమెరికా, ఈయూ, బ్రిటన్, న్యూజిలాండ్, ఒమన్, పెరు వంటి దేశాలతో ఎఫ్‌టీఏపై చర్చలు జరుగుతున్నాయి.ఇదీ పరిస్థితి!అమెరికా వస్తువులు, ఉత్పత్తులపై భారత్ ప్రస్తుతం సగటున 18 శాతం టారిఫ్‌లు వసూలు చేస్తోంది. భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా టారిఫ్‌లు సగటున 2.8 శాతం మాత్రమే. భారత వ్యవసాయ ఎగుమతులపై అమెరికా 5.3 శాతం సుంకాలు విధిస్తోంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వ్యవసాయోత్పత్తులపై మాత్రం భారత్ 37.7 శాతం సుంకాలు వసూలు చేస్తోంది. ఇరు దేశాల మధ్య దాదాపు 30 రంగాల్లో వాణిజ్య లావాదేవీలు జరుగుతున్నాయి. దాదాపుగా ప్రతి రంగంలోనూ భారతే అమెరికాపై హెచ్చు సుంకాలు విధిస్తోంది.దాంతో ఇరు దేశాల మధ్య టారిఫ్‌ల అంతరం ఆటోమొబైల్స్ రంగంలో 23.1 శాతం, వజ్రాలు, బంగారం, ఆభరణాల్లో 13.3, కెమికల్, పార్మా రంగంలో 8.6, ఎలక్ట్రానిక్స్‌పై 7.2, ప్లాస్టిక్స్‌పై 5.6, కంప్యూటర్లు, యంత్రాలపై 5.3, ఇనుము, స్టీల్‌పై 2.5, టెక్స్టైల్స్, క్లా్లతింగ్లో 1.4 శాతంగా ఉంది. భారత మొత్తం ఎగుమతుల్లో అమెరికాదే 18 శాతం వాటా. ఆ దేశం నుంచి మాత్రం దిగుమతులు 6.22 శాతమే. ద్వైపాక్షిక వాణిజ్యంలో ఈ 10.73 శాతం లోటుపైనా అమెరికా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.
జాతీయం

సీఎం రేవంత్ వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ, సాక్షి: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీలు మారినా ఉప ఎన్నికలు రావు అని రేవంత్ చేసిన వ్యాఖ్యలను బుధవారం విచారణలో ప్రత్యేకంగా ప్రస్తావించిన జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలే చేసింది.పవిత్రమైన చట్టసభలో ఈ వ్యాఖ్యలు చేయడం... రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అపహాస్యం చేయడం కిందకే వస్తుంది. ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయకుండా సీఎంకు హితవు చెప్పండి. ఎట్టిపరిస్థితుల్లో ఈ తరహా వ్యాఖ్యలను ఉపేక్షించబోం. అవసరమైతే కోర్టు ధిక్కారంగా భావించాల్సి వస్తుంది’’ అని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని ఉద్దేశించి జస్టిస్ గవాయ్ అన్నారు.మేం అన్నీ ఆలోచించే కోర్టు ధిక్కార నోటీసులు ఇస్తున్నాం. అంతమాత్రాన మాకు అధికారాలు లేవని కాదు. అసెంబ్లీలో నాయకులు చేసే ప్రకటనలకు ఒక విలువ ఉంటుంది. అసెంబ్లీలో మాట్లాడే అంశాలను కోర్టులు కూడా తీసుకుంటాయి అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. గత బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం రేవంత్ ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని, పార్టీ మారిన ఎమ్మెల్యేలెవరూ ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ‘‘వచ్చే వారమే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్ఎస్ నేతలు ఊదరగొడుతున్నారు. కానీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ రావు. గత బీఆర్ఎస్ హయాంలో ఉన్న రాజ్యాంగమే ఇప్పుడు కూడా ఉంది. స్పీకర్ వ్యవస్థ, చట్టం అవే ఉన్నాయి. ఏవీ మారలేదు. అలాంటప్పుడు అప్పుడు పార్టీలు మారిన నేతల విషయంలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయని వ్యాఖ్యానించారు.

బీసీ రిజర్వేషన్లపై కేంద్రం దిగిరావాలి, లేకుంటే..: రేవంత్‌రెడ్డి
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు ఆమోదిస్తే.. గుజరాత్‌కు వచ్చిన నష్టమేంటని ప్రధాని మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ ఆలోచనా విధానం.. బీసీలకు వ్యతిరేకమన్న ఆయన.. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జంతర్ మంతర్‌లో జరిగిన బీసీ సంఘాల పోరు గర్జనలో పాల్గొని ఆయన ప్రసంగించారు. బీసీల లెక్క తేలకుండా రిజర్వేషన్లు ఇవ్వలేమని కోర్టులు చెబుతున్నాయి. లెక్కలు పక్కగా తీస్తేనే బడుగులకు న్యాయం జరుగుతుంది. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు. అందరి కష్టసుఖాలు తెలుసుకున్నారు. అందుకే అధికారంలోకి వస్తే కులగణన చేయిస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. జనగణనతోనే కులగణన చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలన్నది కాంగ్రెస్ పార్టీ విధానం. అందుకే కేంద్రం కుట్రపూరితంగా జనగణన కూడా చేయడం లేదు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కులగణన చేయడం లేదు. మండల్ కమిషను కు వ్యతిరేకంగా.. కమండల్ తెచ్చిన చరిత్ర బీజేపీది. దేశ రాజకీయాలకు తెలంగాణ ఓ వెలుగు. రాహుల్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. తెలంగాణలో 56.36 శాతం అని పక్కాగా తేల్చాం. ఫిబ్రవరి 4వ తేదీన సోషల్ జస్టిస్ డే జరుపుకుంటున్నాం. బీసీల రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేశాం. రిజర్వేషన్ల పెంపు కేంద్ర పరిధిలోని అంశం. అందుకే కేంద్రానికి పంపాం. మేం తెలంగాణలో రిజర్వేషన్లు కావాలని అడుగుతున్నాం. గుజరాత్లో ఇవ్వాలని కాదు. తెలంగాణలో రిజర్వేషన్లు ఆమోదిస్తే గుజరాత్‌కు వచ్చిన నష్టమేంటి?. విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు అమలైతేనే బీసీలకు న్యాయం జరుగుతుంది.బీసీల రిజర్వేషన్లు పెంచాలనే కోరిక అసంబద్ధమైంది కాదు. అందుకు పలు పార్టీలు కూడా మద్దతు ఈ వేదికపై ప్రకటించాయి. ఎవరేం అనుకున్నా బీసీలకు మేం అడగా నిలబడతాం. మా రాష్ట్రంలో మేం పెంచుకుంటే.. మీకేంటి నష్టం. మేమంతా మద్దతు ఇస్తున్నా మీకు వచ్చిన నష్టమేంటి?. మీ కుర్చీ.. ఎర్రకోటపై జెండా ఎగరేస్తాం అని మేం అనడం లేదు. మాకు మీ ప్రాణాలొద్దు.. 42 శాతం రిజర్వేషన్లు కావాలి. ప్రధాని మోదీ మా గుండె చప్పుడు వినాలి. రిజర్వేషన్లకు అనుమతిస్తే పది లక్షల మందితో మోదీకి సన్మానం చేస్తాం. మాకు అనుమతి ఇవ్వకపోతే దేశమంతా కార్చిలా ఉద్యమిస్తాం. అధికారం, చట్టం మీ చేతుల్లో ఉందని మాపై ఆధిప్యతం చెలాయించాలని చూడకండి. బలం లేకపోయినా వక్ఫ్ బిల్లు తెచ్చారు...మరి బీసీ బిల్లుకు అభ్యంతరం ఏమిటి?. మేం సయోధ్యకు వచ్చాం. గల్లీలో వినిపించుకోవడం లేదని.. ఢిల్లీలో గళం వినిపించేందుకు వచ్చాం. యుద్ధభేరి మోగించే ముందు ఢిల్లీకి రావాలని వచ్చాం. రిజర్వేషన్ల పెంపునకు ఆమోదం తెలపాలి. ఆమోదించకపోతే ఎర్రకోటపై జెండా ఎగరేస్తాం. చెప్పిన మాట వినకపోతే మా సత్తా చూపిస్తాం. తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వని తండ్రీకొడుకుల ఉద్యోగాలు ఊడగొట్టాం. రిజర్వేషన్లపై దిగి రావాలి.. లేదంటే దిగిపోవాలి. ఎన్నికలు వచ్చినప్పుడు బీసీలు వీళ్ల సంగతి తేల్చాలి అని రేవంత్ పిలుపు ఇచ్చారు. బీసీ రిజర్వేషన్లు బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలనే డిమాండ్‌తో హస్తినలో బీసీ గర్జన జరగ్గా.. దేశవ్యాప్తంగా పలు పార్టీల అధినేతలు, ప్రతినిధులు హాజరై మద్ధతు ప్రకటించారు.

శాంతి చర్చలకు సిద్ధం: కేంద్రానికి మావోయిస్టుల లేఖ
న్యూఢిల్లీ, సాక్షి: మావోయిస్ట్ రహిత భారత్ నినాదంతో ఆపరేషన్ కగార్‌ను దూకుడుగా ముందుకు తీసుకెళ్తోంది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. ఈ క్రమంలో గత 100 రోజుల్లో వివిధ ఎన్కౌంటర్లలో 120 మందికి పైగా మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. అదే సమయంలో మరోపక్క భారీగా దళ సభ్యులు లొంగిపోతున్నారు. ఈ క్రమంలో కేంద్ర, పలు రాష్ట్ర ప్రభుత్వాల ముందు మావోయిస్టులు శాంతి చర్చల ప్రతిపాదన ఉంచారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ప్రతిపాదిస్తే.. కాల్పుల విరమణకు సిద్ధమంటూ మావోయిస్ట్ కేంద్ర కమిటీ సంచలన ప్రకటన చేసింది. ‘‘ప్రజల కోసం ఎప్పుడైనా శాంతి చర్చలకు సిద్ధం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలి. ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలి. ఛత్తీస్‌గఢ్, ఒడిషా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణలో జరుపుతున్న హత్యాకాండను ఆపాలి.’’ .. శాంతి చర్చల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూల వాతావరణం కల్పించాలి. అప్పుడు మేం వెంటనే కాల్పుల విరమణ పాటిస్తాం’’ అని మావోయిస్ట్ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదలైంది. దీనికి కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

భార్యను కాపురానికి పంపలేదని అత్తకు శ్రద్ధాంజలి పోస్టర్
వేలూరు: తిరుపత్తూరు సమీపంలోని తన భార్యను కాపురానికి పంపలేదని అత్తపై ఆగ్రహించిన అల్లుడు అత్త మృతి చెందినట్లుగా శ్రద్ధాంజలి పోస్టర్‌ను ముద్రించి వాటిని అన్ని ప్రాంతాల్లో కరిపించడంతో పాటూ బంధువులకు వాట్సాప్ ద్వారా పంపిన ఘటన సంచలనం రేపింది. తిరుపత్తూరు జిల్లా వానియంబాడి సమీపంలోని నిమ్మయంబట్టు గ్రామానికి చెందిన వెంకటేశన్ ఇతని భార్య వినోదిని దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడున్నారు. వెంకటేశన్ బ్యాంకులో లోన్ తీసుకొని పాడి పశువును కొనుగోలు చేసి బ్యాంకు రుణాలను తిరిగి చెల్లించలేదు. దీంతో దంపతుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో భార్య వినోదిని ఇలక్కినాయకన్‌పట్టి గ్రామంలో ఉన్న అమ్మగారింటికి రెండు నెలల క్రితం వెళ్లింది. అక్కడ నుంచే వినోదిని వేరే దుకాణంలో పనిచేస్తోంది. ఇదిలా ఉండగా అత్త మాదు తన భార్యను కాపురానికి పంపకుండా అడ్డుకుంటుందని ఆగ్రహించిన వెంకటేశన్ అత్త ప్రాణాలతో ఉన్నప్పటికీ ఆమె మృతి చెందినట్లు శ్రద్ధాంజలి బ్యానర్, పోస్టర్లు వేసుకొని చుట్టు పక్కల కరిపించడంతో పాటూ భార్య వినోదిని బంధువులకు వాట్సాప్ పంపాడు. ఈ విషయాన్ని బంధువులు వినోదినికి పోన్ చేసి విషయాన్ని తెలిపారు. దీంతో వినోదిని తన భర్త వెంకటేష్ నుంచి తమకు ప్రాణ హాని ఉందని ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంకటేష్ ను అరెస్ట్ చేశారు.
ఎన్ఆర్ఐ

పలాసలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై నాట్స్ అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగు వారికి కొండంత అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ముమ్మరంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌పై అవగాహన సదస్సు నిర్వహించింది. గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ గ్లో ఫౌండేషన్, హోఫ్ ఫర్ లైఫ్ సంస్థలతో కలిసి నాట్స్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆడపిల్లలు సమాజంలో మానవ మృగాల నుంచి తప్పించుకోవాలంటే ఎలా ఉండాలనేది ఈ సదస్సులో వివరించారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! ఆడపిల్లలు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉండాలని పలాస శాసనసభ్యురాలు గౌతు శిరిష అన్నారు. అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి తలెత్తినా అది కచ్చితంగా తల్లితో చెప్పాలని సూచించారు. మేం ఏం చేయలేం అని నిస్సహాయ స్థితి నుంచి మేం ఏదైనా చేయగలమనే ధైర్యం ఆడపిల్లల్లో రావాలని హోఫ్ ఫర్ లైఫ్ సంస్థ వ్యవస్థాపకులు హిమజ అన్నారు. ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యం కల్పించేందుకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌లపై అవగాహన కల్పిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హోఫ్ ఫర్ సంస్థ ప్రతినిధులు ఆశాజ్యోతి, సైకాలజిస్టులు డాక్టర్ సంగీత, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌లపై ఆడపిల్లలకు పూర్తి అవగాహన కల్పించేలా ఈ సదస్సు జరిగింది.

Garimella Balakrishna Prasad అస్తమయంపై నాట్స్ సంతాపం
అన్నమయ్య కీర్తనల గానం ద్వారా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ప్రముఖ సంగీత విద్వాంసుడు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఇకలేరు. వారి కుటుంబ సభ్యులకు మనసారా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, మహానుభావుడైన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. వారి గానం యుగయుగాల పాటు మనలో జీవించే ఉంటుందంటూ నాట్స్ నివాళులర్పించింది. గరిమెళ్ల గళంలో అన్నమయ్య అమృతంఆచార్య తాడేపల్లి పతంజలికొందరు జీవించి ఉన్నప్పుడే తాము ఎంచుకున్న క్షేత్రంలో అంకితభావంతో కృషిచేసి ప్రసిద్ధులవుతారు. శరీరాన్ని విడిచి పెట్టిన తర్వాత ఈ లోకానికి సిద్ధ పురుషులుగా మిగిలిపోతారు. అటువంటి వారిలో శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ ఒకరు.‘పుడమి నిందరి బట్టె భూతము కడుబొడవైన నల్లని భూతము‘ అని అన్నమయ్య వేంకటేశుని గురించి వర్ణిస్తాడు. ఆ అన్నమయ్య కీర్తనల భూతం ఎప్పటినుంచో సంగీత సాహిత్య ప్రపంచంలో చాలా మందిని పట్టుకొని వదలటం లేదు.అటువంటి అన్నమయ్య వేంకటేశుని భూతము పట్టినవారిలో గరిమెళ్ళ ఒకరు. తన మనసుని పట్టుకున్న అన్నమయ్య కీర్తనకి అద్భుతమైన తన గాత్ర రాగ చందనాన్ని అద్ది సంగీత సాహిత్య ప్రియుల హృదయాలలో పట్టుకునేటట్లు కలకాలం నిలిచి ఉండేటట్లు చేసారు. ఒకటా రెండా... వందల కొలది అన్నమయ్య కీర్తనలు గరిమెళ్ళ వారి స్వరరచనలో విరబూసిన వాడిపోని కమలాలుగా, సౌగంధికా పుష్పాలుగా నేటికీ విరబూస్తున్నాయి. భావ పరిమళాలు వెదజల్లుతున్నాయి.NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! ఒక గొప్ప రహస్యంఎందరు గాయకులు పాడుతున్నప్పటికీ ప్రత్యేకంగా శ్రీ గరిమెళ్ళ అన్నమయ్య కీర్తన ఇంతగా ప్రచారం కావడం వెనుక ఒక గొప్ప రహస్యం ఏమిటంటే, అన్నమయ్య మానసిక స్థాయికి తాను వెళ్లి, రసానుభూతితో పాడారు కనుకనే గరిమెళ్ళ వారి అన్నమయ్య కీర్తన సప్తగిరులలోను, లోకంలోను ప్రతిధ్వనిస్తున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకులయిన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ నడుస్తూనే ఈ లోకం నుంచి సెలవు తీసుకొన్నారు. బహుశా ఆ సమయంలో కూడా అన్నమయ్య కీర్తన ఏదో ఆయన మనస్సులో ప్రస్థానం సాగించే ఉంటుంది. అనుమానం లేదు.సంగీత ప్రస్థానంశ్రీ గరిమెళ్ళ సంగీత ప్రస్థానం చాలా విచిత్రంగా సాగింది. మొదట్లో సినిమా పాటలు పాడేవారు. తర్వాత లలిత సంగీతం, ఆ తర్వాత శాస్త్రీయ సంగీతం ఆయనను తన అక్కున చేర్చుకుంది. తన పినతల్లి అయిన ప్రముఖ సినీ నేపథ్యగాయని ఎస్. జానకి గారి ఇంట్లో ఆరు నెలల పాటు ఉండి ఆమెతో కలిసి రికార్డింగ్లకి వెళ్లేవారు. జానకి గారు గరిమెళ్ళ వారిని ఎంతోప్రోత్సహించారు. బాలకృష్ణ ప్రసాద్ మొదట్లో చిన్న చిన్న కచేరీల్లో మృదంగం వాయించేవారు. తన 16వ ఏట చలనచిత్ర గీతాలతో పాటు భక్తి పాటలు కలిపి మొదటి కచేరీ చేసారు. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా చేసిన కచేరీలు, శబ్దముద్రణలు (రికార్డింగ్‌లు లెక్కకు అందనివి.కొత్త పద్ధతిసాధారణంగా ఎవరైనా ఒకే వేదిక నుంచి ఒకరోజు సంకీర్తన యజ్ఞం చేస్తారు కానీ బాలకృష్ణ ప్రసాద్ ఒక వారం రోజులపాటు ఒకేవేదిక నుంచి సంకీర్తన యజ్ఞం చేసి ఒక కొత్త పద్ధతినిప్రారంభించారు. టెలివిజన్ మాధ్యమాల ద్వారా అనేక మందికి సంగీతపు పాఠాలు నేర్పించారు.నేదునూరి నోట – అన్నమయ్య మాటఅప్పట్లో ప్రసిద్ధమయిన ఆకాశవాణి భక్తి రంజనిలో బాలకృష్ణ ప్రసాద్ ని పాడటానికి సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి ఆహ్వానించారు. పోంగిపోయారు బాలకృష్ణ ప్రసాద్. గరిమెళ్ళ గానానికి సంతోషించిన నేదునూరి తిరుపతి అన్నమాచార్యప్రాజెక్టులో చేరమని సలహా ఇచ్చారు. అలా అన్నమయ్య కు వేంకటేశునికి బాలకృష్ణ ప్రసాద్ దగ్గరయ్యారు. అన్నమాచార్యప్రాజెక్టుకు బాలకృష్ణప్రసాద్ అందించిన సేవలు సాటిలేనివి.పురస్కారాలురాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి 2023 ఫిబ్రవరి 23న కేంద్ర సంగీత, నాటక అకాడమీ అవార్డు, శ్రీపోట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు ఇలా కోకొల్లలు. అన్నమాచార్య సంకీర్తన సంపుటి, అన్నమయ్య నృసింహ సంకీర్తనం వంటి పుస్తకాలు తెలుగు, తమిళ భాషల్లో ఆయన ప్రచురించారు. గరిమెళ్ళపై ముగ్గురు పీహెచ్డీ విద్యార్థులు పరిశోధన గ్రంథాలు సమర్పించారు.శివపదం కూడా...గరిమెళ్ళ ఎంతటి అన్నమయ్య వేంకటేశ భక్తులో అంతగా శివభక్తులు కూడా. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ శివునిపై రచించిన సాహిత్యానికి, గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ మృదుమధురంగా స్వరపరిచి పాడారు. ‘‘అడుగు కలిపెను’’,’’ఐదు మోములతోడ’’, ‘‘అమృతేశ్వరాయ’’ వంటి కీర్తనలు ఎంతో ప్రసిద్ధి పోందాయి. ‘చూపు లోపల త్రిప్పి చూచినది లేదు, యాగ విధులను నిన్ను అర్చించినది లేదు‘ అంటూ ఒక శివ పద కీర్తనలో బాల కృష్ణప్రసాద్ ఆర్తి మరిచిపోలేనిది. ఆంజనేయుడు మొదలయిన ఇతర దేవతలపై కూడా గరిమెళ్ళ పాడిన పాటలు ప్రసిద్ధాలు.అన్నమయ్య స్వరసేవ‘అన్నమయ్యకు స్వరసేవ చేయడం తప్ప మరో ప్రపంచం తెలీదు. అన్నమయ్య పాటలే ప్రపంచంగా బతికారు. ఆ పాటలు వినని వాళ్లకు కూడా బలవంతంగా వినిపించేవారు. ప్రతి ఇంట్లో అన్నమయ్య పాట ఉండాలి.. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని తపన పడేవారు. అన్నమయ్య కీర్తనలు స్వరం, రాగం, తాళం తూకం వేసినట్లు కచ్చితంగా పాడాలని పట్టుబట్టేవారు.’’ అని బాలకృష్ణ ప్రసాద్ సతీమణి రాధ చెప్పారు. అన్నమయ్య చెప్పినట్లు ‘‘ఇదిగాక వైభవంబిక నొకటి కలదా?’’చిరస్మరణీయంతెలంగాణ రాష్ట్రంలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి నెల 6న నిర్వహించిన అన్నమాచార్య సంకీ ర్తన విభావరియే ఆయన చివరి కచేరీ. నాలుగు నెలలుగా గొంతు సరిగా లేకపోవడంతో ఎక్కడా కచేరీ చేయలేదని, నీదే భారమంటూ స్వామికి మొక్కి వచ్చినట్లు ఆయన ఆర్ద్రంగా యాదగిరి గుట్టలో చెప్పిన విషయం చిరస్మరణీయం.అన్నమయ్య కీర్తనలకు రాగి రేకులలో ప్రతిపాదించిన రాగాలతో కొన్ని సంగీత పరచినా, కొన్ని పాట అర్థానికి, అందానికి తగినట్లుగా సుందర రంజని, వాణిప్రియ వంటి దాదాపు 20కొత్త రాగాలు కూడా సృష్టించారు.ప్రసూన బాలాంత్రపుమంద్రస్థాయిలోని మధుర స్వరం భక్తి, ప్రేమ రంగరించి రూపం దాలిస్తే అది బాలకృష్ణ ప్రసాద్ అవుతుంది. ఈ తరం వారికి అన్నమయ్య పాటలంటే మొట్టమొదట గుర్తుకు వచ్చేది బాలకృష్ణ ప్రసాద్. లలిత సంగీత ధోరణిలో అన్నమయ్యను అందరికి దగ్గర చేసిన ఘనత ఆయనది.1948 నవంబర్ 9న రాజమండ్రిలో కృష్ణవేణి, గరిమెళ్ళ నరసింహరావులకు జన్మించారు బాలకృష్ణ. ఇంటిలో అందరూ సంగీత కళాకారులే కావడం వల్ల ఆయన పాటతోనే పెరిగారు. ప్రముఖ నేపథ్యగాయని జానకి వారి పినతల్లి. సంగీతం ఎంతో సహజంగా వారికి అబ్బింది కనుకే ఒక పాట రాసినా, సంగీతం కూర్చినా, పాట పాడినా అది అందరి మనస్సులను ఆకర్షించింది. 1980లో మాట. టి.టి.డి వాళ్ళు అన్నమాచార్యప్రాజెక్ట్ మొదలు పెట్టి రాగి రేకులలో దొరికిన అన్నమయ్య పాటలను ప్రజలకు చేర్చాలని నిశ్చయించారు. అప్పటికే కొన్ని పాటలు జనంలో వున్నా అవి అన్నమయ్య పాటలు అని తెలియదు.ఉదాహరణకు ‘జో అచ్యుతానంద’. ఒక ఉద్యమంగా ఈ పాటలు ప్రచారం చెయ్యాలని ప్రతిపాదన. ప్రముఖ విద్వాంసులు రాళ్ళపల్లి అనంత కృష్ణ్ణశర్మ, నేదునూరి కృష్ణమూర్తి, బాలాంత్రపు రజనీకాంతరావు, మల్లిక్ ఈ పాటలకు సంగీతం కూర్చారు. ఆ తరువాత తరం కళాకారులు బాలకృష్ణ ప్రసాద్, శోభారాజు. నేదునూరి కృష్ణమూర్తి గారి దగ్గర బాలకృష్ణ ప్రసాద్ స్కాలర్‌షిప్‌తో శిష్యులుగా చేరి శాస్త్రీయ సంగీతం, అన్నమయ్య పాటలు నేర్చుకున్నారు. నేదునూరి గారు ముందుగా స్వరపరచినది ‘ఏమొకో చిగురుటధరమున’ అనే పాట. ఇది కీర్తన అనేందుకు లేదు. మాములుగా శాస్త్రీయ సంగీతంలో కనిపించే ధోరణులు ఇందులో ఉండవు. మరో పాట ‘నానాటి బ్రతుకు’ కూడా ఇటువంటిదే. ఆ పాటలలో భావం, కవి హృదయం వినే మనస్సుకు అందాలి.అది ఆ సంగీతంలోని భావనా శక్తి. అదే బాలకృష్ణ ప్రసాద్ గారికి స్ఫూర్తి. ఇక అన్నమయ్య పాట పుట్టింది. ప్రచారంలో ఉన్న త్యాగరాజ కీర్తనలకు భిన్నంగా నడిచింది ఈ సంగీతం. నిజానికి అన్నమయ్య త్యాగరాజ ముందు తరం వాడు. అదే బాటలో మొదటి అడుగుగా ‘వినరో భాగ్యం విష్ణు కథ’ పాటలా మన ముందుకు వచ్చింది. నేదునూరి రాగభావన అందిపుచ్చుకుని బాలకృష్ణ ప్రసాద్ ముందుకు నడిచారు. ‘చూడరమ్మ సతులాలా’ అన్నా, ‘జాజర పాట’ పాడినా, ‘కులుకుతూ నడవరో కొమ్మల్లాలా’ అన్నా బాలకృష్ణ ప్రసాద్ గొంతులో భావం, తెలుగు నుడి అందంగా ఒదిగిపోతాయి.అలాప్రారంభం అయిన బాలకృష్ణ ప్రసాద్ సంగీత ప్రస్థానం 150 రాగాలతో 800 పైగా సంకీర్తనలకు సంగీతం కూర్చడం దాకా సాగింది. అన్నమయ్య కీర్తనలకు రాగి రేకులలో ప్రతిపాదించిన రాగాలతో కొన్ని సంగీత పరచినా, కొన్ని పాట అర్థానికి, అందానికి తగినట్లుగా సుందర రంజని, వాణిప్రియ వంటి దాదాపు 20 కొత్త రాగాలు కూడా సృష్టించారు. అన్నమయ్యవి అచ్చ తెలుగు పాటలు. బాలకృష్ణ ప్రసాద్ గొంతులో ఆ తెలుగు సొబగు మృదుమధురంగా వినిపిస్తుంది. ఆయన సంగీతంలో అనవసరమైన సంగతులు ఉండవు. పాట స్పష్టంగా, హృదయానికి తాకేటట్లు పాడడమే ఉద్దేశం. విన్న ప్రతివారు మళ్ళీ ఆ పాట పాడుకోగలగాలి. దీనికై వారు అన్నమయ్య సంగీత శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించి ప్రచారం చేశారు.400 పైగా కృతులను తెలుగు, సంస్కృత భాషల్లో రచించారు బాలకృష్ణ. అనేక వర్ణాలు, తిల్లానాలు, జావళీలు రచించారు. 400కు పైగా లలిత గీతాలు రచించారు. 16 నవంబర్ 2012లో టి.టి.డి ఆస్థాన గాయకులుగా, కంచి కామకోటి పీఠం ఆస్థాన గాయకులుగా నియమించబడ్డారు. ఆయన లలిత గీతాలు కూడా రచించారు. ఆంజనేయ కృతి మణిమాల, వినాయక కృతులు, నవగ్రహ కృతులు, సర్వదేవతాస్తుతి రచించి క్యాసెట్టు రూపంలో అందించి తెలుగు వారి పూజాగృహంలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన పాట ఒక అనుభూతి, ఒక స్వర ప్రవాహం, ఒక భావ సంపద. కొందరికి మరణం ఉండదు. వారి పాట, మాట నిత్యం మనతోనే ఉంటాయి. బాలకృష్ణ ప్రసాద్ అటువంటి మహనీయుడు.

ఛాంపియన్ ట్రోఫీ భారత్ కైవసం, నాట్స్ సంబరాలు
ఛాంపియన్ ట్రోఫిలో భారత్ విజయం సాధించడంపై ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) హర్షం వ్యక్తం చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలవడంతో అమెరికాలో భారత క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.ఛాంపియన్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత్ ఫైనల్‌కు చేరడం.. ఫైనల్లో కూడా అసాధారణ విజయం సాధించడాన్ని నాట్స్ నాయకత్వం అభినందించింది. భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ప్లేయర్స్ అంతా ఈ సీరీస్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ఓ ప్రకటనలో తెలిపారు. ఛాంపియన్ ట్రోఫీ విజయంతో ప్రవాస భారతీయుల హృదయాలు ఆనందంతో ఉప్పొంగాయని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అన్నారు. ఛాంపియన్ ట్రోఫీలో భారత్ విజయానికి తామంతా గర్వపడుతున్నామని నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి తెలిపారు.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!కాగా పాకిస్తాన్, దుబాయ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఎడిషన్‌లో టీమిండియా విజేతగా నిలిచింది. దుబాయ్ వేదికగా ఇవాళ (మార్చి 9) జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్, 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. తొలివికెట్ భాగస్వామ్యం రోహిత్ (76) శుభ్‌మన్ గిల్ (31) 105 పరుగులు అందించారు. కోహ్లీ కేవలం ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. ఆ తరువాత కేఎల్ రాహుల్ (34 నాటౌట్).. హార్దిక్ పాండ్యా (18), రవీంద్ర జడేజా (18 నాటౌట్) బౌండరీతో భారత్ ట్రోఫి దక్కించుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం భారత్‌కు ఇది మూడోసారి (2002, 2013, 2025).

ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని వెస్ట్ చెస్టర్ నగరంలో పియర్స్ మిడిల్ స్కూల్ లో నిర్వహించిన ఈ వేడుకలకు వెయ్యికి మందికి పైగా హాజరై సాంస్కృతిక కార్యక్రమాలు, స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు, డైనమిక్ ఫ్యాషన్ షో, స్టాల్ల్స్, రుచికరమైన విందుతో ఆరు గంటల నాన్ స్టాప్ వినోదాన్ని ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గత ఐదున్నర దశాబ్దాల నుండి డెలావేర్ రాష్ట్రంలోని డోవర్ నగరంలో విశేషసేవలు అందిస్తున్న ప్రముఖ చిన్న పిల్లల వైద్యురాలు డాక్టర్ జానకి కాజా గారిని తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ జానకి కాజా అమెరికా వచ్చినప్పటి నుంచి అనుభవాలను వివరిస్తూ స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేసారు. మన జన్మభూమి భారతదేశం లాగానే కర్మభూమి అమెరికా చాలా గొప్ప దేశమని 1971 లో అమెరికా లో అడుగుపెట్టినప్పటి నుండి ఈరోజు వరకు ఆసుపత్రికి వెళ్లినా, 86 దేశాలు పర్యటించినా మన భారతీయ సంప్రదాయం మరచిపోకుండా తాను ఇప్పటికీ చీర మాత్రమే ధరిస్తానని చీర మన సాంస్కృతిక గర్వానికి చిహ్నంగా ఉంటుందని పేర్కొంటూ మహిళల జీవితం సవాళ్లతో కూడినదని పట్టుదలతో, దృఢసంకల్పంతో అవకాశాలు అందిపుచ్చుకుని జీవితంలో ఎదగాలని ఆకాంక్షించారు. తానా మిడ్ అట్లాంటిక్ మహిళల బృందం ఈ కార్యక్రమం విజయవంతం కోసం అవిశ్రాంతంగా పనిచేసింది. మిడ్-అట్లాంటిక్ మహిళా కమిటీ ఛైర్ సరోజా పావులూరి నేతృత్వంలోని బృందం ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. వ్యాఖ్యాత లక్ష్మి మంద ఎనర్జిటిక్ హోస్టింగ్‌తో అలరించారు. రాజేశ్వరి కొడాలి, భవాని క్రొత్తపల్లి, సౌజన్య కోగంటి, రవీనా తుమ్మల, భవానీ మామిడి, మైత్రి రెడ్డి నూకల, నీలిమ వోలేటి , రమ్య మాలెంపాటి, బిందు లంక, దీప్తి కోకా తదితరుల కృషిని హాజరైన వారందరూ అభినందించారు.తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి తన ప్రసంగంలో మహిళలకు అభినందనలు తెలిపారు. తానా ఫౌండేషన్ మరియు ఇతర సేవా సంస్థల ద్వారా అమెరికాలోనే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మిలియన్ల డాలర్లు వెచ్చించి ఎనలేని సేవలందిస్తున్న బాబు రావు, డాక్టర్ జానకి కాజా దంపతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. డెలావేర్ మిడిల్ టౌన్ నమస్తే ఇండియా రెస్టారంట్ సహా వాలంటీర్లు మరియు క్రాస్ రోడ్స్ రెస్టారంట్, జో కేధార్, రాజన్ అబ్రహం ఇతర దాతలకు అభినందనలు తెలిపారు.2025 జూలై 3 నుంచి 5 వరకు డెట్రాయిట్లో 24వ తానా మహాసభలు జరగబోతున్నాయని తెలిపారు. అందమైన అలంకరణలకు ఫణి కంతేటి మరియు సంగీతాన్ని అందించినందుకు మూర్తి నూతనపాటి, రమణ రాకోతు, ఫోటోగ్రఫీ విశ్వనాధ్ కోగంటిలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తానా మిడ్ అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి వెంకట్ సింగు, సతీష్ తుమ్మల, సునీల్ కోగంటి, టీం స్క్వేర్ చైర్మన్ కిరణ్ కొత్తపల్లి, కృష్ణ నందమూరి, రంజిత్ మామిడి, గోపి వాగ్వాల, సురేష్ యలమంచి, చలం పావులూరి, ప్రసాద్ క్రొత్తపల్లి, కోటి యాగంటి, రవి ముత్తు, రాజు గుండాల, శ్రీనివాస్ అబ్బూరి, సుబ్బా ముప్పా, లీలాకృష్ణ దావులూరి, జాన్ ఆల్ఫ్రెడ్, హేమంత్ ఎర్నేని, సనత్ వేమూరి, హరీష్ అన్నాబత్తిన, రంజిత్ కోమటి, సంతోష్ రౌతు, ఉత్తమ్, హేమరాజ్, రాజా గందె, నాగ రమేష్, కృషిత నందమూరి, ప్రసాద్ కస్తూరి తదితరులు ఈ వేడుకలను విజయవంతం చేయడంలో కృషి చేశారు.
క్రైమ్

ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భాగ్యలక్ష్మి .. చివరకు
తమిళనాడు: పల్లావరం సమీపంలో ఓ నిండు ప్రాణాన్ని వివాహేతర సంబంధం బలితీసుకుంది. ప్రియురాలు మరొకరితో సంబంధం కలిగి ఉందనే కారణంతో ప్రియుడు ఆమెను బండరాయితో కొట్టి హత్య చేశాడు. లొంగిపోయిన కార్పొరేషన్ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై శివారు పల్లావరం సమీపంలోని అనకాపుత్తూరు గౌరీ ఎవెన్యూ 2వ వీధికి చెందిన జ్ఞానసిద్ధన్ (40). నితను తాంబరం కార్పొరేషన్లో లారీ డ్రైవర్. ఇతను అవివాహితుడు. అపార్ట్మెంట్లో ఒంటరిగా నివసిస్తున్నాడు. అనకాపుత్తూరు అరుల్ నగర్ 3వ వీధికి చెందిన భాగ్యలక్ష్మి(33)తో ఇతనికి వివాహేతర సంబంధం ఏర్పడింది. భాగ్యలక్ష్మి అప్పటికే భర్తకు విడాకులు ఇచ్చి, తన ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉంటోంది. ఇద్దరూ తరచూ కలుసుకుని సరదాగా గడుపుతూ వచ్చారు. ఈక్రమంలో భాగ్యలక్ష్మిని పెళ్లి చేసుకోవాలని జ్ఞానసిద్ధన్ నిర్ణయించుకున్నాడు. భాగ్యలక్ష్మికి జ్ఞానసిద్ధన్‌తో పాటు మరొకరితో సంబంధం ఉందని తెలిసింది. ఆగ్రహించిన జ్ఞానసిద్ధన్ బుధవారం ఉదయం భాగ్యలక్ష్మితో గొడవపడ్డాడు. ఆగ్రహించిన జ్ఞానసిద్ధన్ పెద్ద బండరాయితో భాగ్యలక్ష్మి తలపై వేశాడు. భాగ్యలక్ష్మి సంఘటన స్థలంలోనే మృతిచెందింది. జ్ఞానసిద్ధన్ శంకర్ నగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

నువ్వు యాంకరింగ్ చేయడం నాకు ఇష్టం లేదు..!
విశాఖపట్నం: కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త కొట్టడంతో తీవ్రంగా గాయపడిన భార్య చికిత్స పొందుతూ మృతి చెందింది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాలివి.. వెంకటేశ్వరమెట్టకు చెందిన పోలిపల్లి రమాదేవి, భీమ్‌నగర్‌కు చెందిన బంగార్రాజు భార్యాభర్తలు. ఇద్దరూ వృత్తిరీత్యా డ్యాన్సర్లు. రమాదేవి యాంకరింగ్ కూడా చేస్తుంటుంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే రమాదేవి యాంకరింగ్ చేయడం బంగార్రాజుకు ఇష్టం లేదు. ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీనికి తోడు ఆమె వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని బంగార్రాజు అనుమానించడంతో గొడవలు మరింత పెద్దవయ్యాయి. ఈ క్రమంలో గత నెల 31న గొడవ జరగడంతో.. రమాదేవి పిల్లలను తీసుకుని వెంకటేశ్వరమెట్టలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. అదే రోజు బంగార్రాజు అక్కడికి వెళ్లి, తిరిగి ఇంటికి రమ్మని భార్యను పిలిచాడు. ఆమె అందుకు నిరాకరించడంతో.. ఆగ్రహంతో ఆమెను ఇంటి నుంచి బయటకు లాగి చెంపపై కొట్టాడు. ఈ ఘటనలో ఆమె పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో తలకు బలంగా గాయమైంది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మరణించింది. మృతురాలి బంధువులు బంగార్రాజుపై టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశా రు. బంగార్రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కేసు దర్యాప్తులో ఉంది.

రెండేళ్ల క్రితం భార్య మోసం చేసి వెళ్లిపోయింది..!
యశవంతపుర: భార్య ఇంటి నుంచి వెళ్లిపోయి రెండేళ్లవుతోంది. పాఠశాలలో కూతురిని మీ అమ్మ ఎక్కడని అడుగుతున్నారు. ఈ పరిణామాలతో శాడిస్టుగా మారిన ఓ వ్యక్తి.. తుపాకీతో మారణహోమం సృష్టించాడు. భార్యను అంతమొందించాలని వెళ్లాడు, ఆమె లేకపోవడంతో తల్లి, మరదలుతో పాటు కూతురిని కూడా తూటాలకు బలి చేశాడు. ఈ కర్కశ సంఘటన చిక్కమగళూరు జిల్లా ఖాండ్యా సమీపంలోని మాగలు గ్రామంలో చోటుచేసుకొంది. సమాజంలో క్షీణించినపోతున్న కుటుంబ బాంధవ్యాలకు మరోసారి అద్దం పట్టింది. వివరాలు.. జిల్లాలోనే కడబగెరె సమీపంలో ఓ పాఠశాలలో డ్రైవర్‌గా పని చేస్తున్న రత్నాకర్ (35) ఈ రక్తపాతానికి పాల్పడ్డాడు. అతనికి మాగలుకు చెందిన యువతిలో సుమారు పదేళ్ల కిందట పెళ్లయింది. స్కూలు బస్సు డ్రైవర్‌గా పనిచేవాడు. వీరికి కూతురు మౌల్య ఉంది. అయితే కుటుంబ కలహాలతో భార్య రెండేళ్ల కిందట భర్తను వదిలేసి వెళ్లిపోయింది. బెంగళూరులో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తోంది. పాఠశాలలో తన స్నేహితులు మీ అమ్మ ఎక్కడని అడుగుతున్నట్లు కుతూరు మౌల్య రోజు తండ్రి వద్ద చెప్పుకునేది. దీంతో ఆక్రోశానికి గురైన రత్నాకర్ భార్యతో తాడేపేడో తేల్చుకోవాలనుకున్నాడు. ఉగాది పండుగ సందర్భంగా మౌల్య అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. భార్య కూడా వచ్చి ఉంటుందని రత్నాకర్ భావించాడు. విచ్చలవిడిగా కాల్పులు ఆమెతో మాట్లాడాలని, కుదరకపోతే హత్య చేయాలని ప్లాన్ వేసుకొని మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో మాగలులో అత్తవారింటికి వెళ్లాడు. భార్య లేదని తెలిసి అగ్గిమీద గుగ్గిలమయ్యాడు, సింగల్ బ్యారెల్ తుపాకీ తీసి అత్త జ్యోతి (50), మరదలు సింధు (26), కూతూరు మౌల్య (7)ను కాల్చిచంపాడు. అడ్డుకోబోయిన సింధు భర్త మీద కాల్పులు జరపగా స్వల్ప గాయాలు తగిలి తప్పించుకున్నాడు. తరువాత మృతదేహాలను ఇంటి నుంచి కొంతదూరం లాక్కువెళ్లి అక్కడ తుపాకీతో కాల్చుకుని హంతకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. మోసం చేసింది.. అందుకేనంటూ..చంపడాటానికి ముందు రత్నాకర్ సెల్ఫీ వీడియోలో బాధలను చెప్పుకున్నారు. భార్య వదిలి వెళ్లిన తరువాత బాధతో ఈ అమానుషమైన ఘటనకు పాల్పడుతున్నట్లు తెలిపాడు. రెండేళ్ల క్రితం భార్య మోసం చేసి వెళ్లిపోయింది. కూతురి సంతోషం కోసం ఏమైనా చేస్తానన్నాడు. స్కూలులో స్నేహితులు మీ అమ్మ ఎక్కడ అని అడిగితే ఫోటోను చూపిస్తుంది అని వివరించాడు. ఘటనాస్థలిని చిక్కమగళూరు ఎస్పీ విక్రమ్ అమటె పరిశీలించారు. బాళెహొన్నూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా ఆస్పత్రికి తరలించారు.

ప్రేమోన్మాది ఘాతుకం
మధురవాడ (విశాఖ)/శ్రీకాకుళం క్రైమ్/బూర్జ/వీరఘట్టం/సాక్షి, అమరావతి : పెళ్లికి నిరాకరించారన్న కారణంతో తల్లీ కూతుళ్లపై ప్రేమోన్మాది విచక్షణారహితంగా దాడి చేశాడు. తల్లి మృతి చెందగా, కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. సీపీ శంఖబ్రత బాగ్చి, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పార్వతీపురం మన్యం జిల్లా దేవుదళ సమీపంలోని పెద్దపుర్లికి చెందిన నక్కా రాజు బతుకు తెరువు కోసం రెండేళ్ల క్రితం మధురవాడకు వచ్చి, కార్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. భార్య గృహిణి. ఇద్దరు పిల్లలు. కుమార్తె దీపిక (20) ఆరేళ్ల క్రితం వీరఘట్టం మండలం పనసనందివాడలోని తన పిన్ని ఇంటికి ఓ కార్యక్రమానికి వెళ్లింది. ఎదురింట్లో ఉంటున్న దమరసింగి నవీన్ (26) పరిచయమయ్యాడు. నవీన్ డిగ్రీ పూర్తి చేసి, ఖాళీగా ఉంటున్నాడు. దీపిక విశాఖలోని మహిళా డిగ్రీ కళాశాలలో మైక్రోబయాలజీ పూర్తి చేసి, నర్సింగ్ చేస్తోంది. ఈ క్రమంలో దీపికను పెళ్లి చేసుకుంటానంటూ ఆమె తల్లిదండ్రులపై నవీన్ తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నాడు. ఇతడి ప్రవర్తన సరిగా లేకపోవడంతో పెళ్లి ఆలస్యం చేస్తూ వచ్చారు. దీంతో పెళ్లికి అంగీకరించకపోతే చంపేస్తానని కూడా పలుమార్లు బెదిరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే అతడి జీవితం నాశనం అయిపోతుందని దీపిక తండ్రి రాజు ఆలోచించాడు. అదే ఆ కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం12 గంటలకు కొమ్మాది జంక్షన్ హైవేకు కూతవేటు దూరంలో ఉన్న స్వయంకృషి నగర్లో బాధితుల ఇంటికి నవీన్ వచ్చాడు. కొన్నాళ్ల తర్వాత పెళ్లి చేస్తామని చెప్పడంతో విచక్షణ కోల్పోయి వాదనకు దిగాడు. ఓ దశలో ఉన్మాదంతో ఊగిపోతూ 1.30 గంటలకు తల్లీ కూతుళ్లపై చాకుతో దాడి చేశాడు. విచక్షణా రహితంగా పొడిచాడు. దీంతో నక్కా లక్ష్మి (47) అక్కడికక్కడే మృతి చెందగా, దీపికకు చేయి, మెడ ఇతర భాగాలపై తీవ్ర గాయాలై, స్పృహ తప్పింది. ఆ వెంటనే నిందితుడు పరారయ్యాడు. కాసేపటికి స్పృహలోకి వచ్చిన దీపిక తల్లి చలనం లేకుండా ఉండడాన్ని గమనించింది. సహాయం కోసం ఎంత ప్రయత్నించినా ఎవరూ అందుబాటులోకి రాలేదు. మేడ మీద నుంచి అతికష్టంగా కిందికి వచ్చి ఆర్తనాదాలు చేయడంతో పక్కనే ఉన్న వ్యక్తి ఫోన్ చెయ్యడంతో పీఎంపాలెం ఎస్ఐ కె.భాస్కరరావు సంఘటనా స్థలికి చేరుకుని రక్తం మడుగులో ఉన్న దీపికను ద్విచక్ర వాహనంపై దగ్గర్లోని గాయత్రి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం మెడికవర్ ఆస్పత్రికి తరలిస్తామని చెప్పారు. నిందితుడు నవీన్ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు ఐదు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టి, శ్రీకాకుళం జిల్లా బూర్జ నుంచి వీరఘట్టం వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. మేజి్రస్టేట్ ముందు హాజరు పరుస్తామని చెప్పారు. ఉలిక్కిపడిన పనసనందివాడ ఈ ఘటనతో నవీన్ స్వగ్రామం పనసనందివాడ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీపికతో కొన్నేళ్లుగా పరిచయం ఉన్నప్పటికీ, కొద్ది రోజులుగా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరితో ఫోన్లో మాట్లాడినా అనుమానిస్తూ వచ్చాడు. ఓ దశలో ఆ యువతిపై చేయి కూడా చేసుకున్నాడు. దీంతో కొద్దిరోజులుగా అతనితో పెళ్లి జరిపించడంపై యువతి తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలో పది రోజులుగా అతని ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో చివరకు కడతేర్చేందుకు పూనుకున్నాడు. వీరఘట్టం ఎస్ఐ జి.కళాధర్ గ్రామానికి చేరుకుని నవీన్ తల్లిదండ్రులు జ్యోతి, అన్నారావుల నుంచి వివరాలు సేకరించారు. కాగా, నిందితుడిని గంటల వ్యవధిలో పట్టుకున్నందుకు పోలీసులను విశాఖ డీఐజీ గోపినాథ్ జెట్టి, శ్రీకాకుళం ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి అభినందించారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువుకూటమి సర్కారుపై వైఎస్ జగన్ మండిపాటు విశాఖపట్నంలో ప్రేమోన్మాది దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోవడం, మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉండడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళల మాన ప్రాణాలకు రక్షణ కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో వేదింపులు తాళలేక ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మరువక ముందే విశాఖలో ప్రేమోన్మాది దాడిలో యువతి తల్లి నక్కా లక్ష్మి ప్రాణాలు కోల్పోవడం, యువతి దీపిక ప్రాణాపాయ స్థితిలో ఉండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమోన్మాది నవీన్‌ను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లక్ష్మి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందన్నారు.
వీడియోలు


పరిధి దాటొద్దని పోలీసులను హెచ్చరించిన సుప్రీం కోర్టు


నా కూతుర్లపై అసభ్యమైన పోస్టులు.. అంబటి సీరియస్ వార్నింగ్..


ఉపఎన్నికల్లో మీరు చూపిన తెగువకు, ధైర్యానికి హ్యాట్సాఫ్: జగన్


Big Question: ఏడుకొండల్ని రాజకీయాల గుట్టగా మార్చిన బాబు


వరుసగా రెండో విజయాన్ని దక్కించుకున్న గుజరాత్ టైటాన్స్


చెట్ల నరికివేతను ఆపండి.. తెలంగాణ సర్కార్ కు హైకోర్టు ఆదేశం


వర్ఫ్ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం


ఇవాళ కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన


సుంకాల మోత మోగించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్


ప్రేమోన్మాది నవీన్ అరెస్ట్