Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Public Suffering with Power Cuts In Chandrababu TDP Govt1
నిరంతర ‘కోత’లు!.. అల్లాడుతున్న ప్రజలు

చంటిపిల్లలతో అల్లాడిపోతున్నాం.. విద్యుత్‌ కోత వల్ల మేం సక్రమంగా నిద్రపోయి చాలా రోజులైంది. ఏ పనీ చేసుకోలేక పోతున్నాం. ఉక్కపోత వల్ల చంటి పిల్లలతో అల్లాడిపోతున్నాం. పట్టించుకునే నాధుడే లేడు. విద్యుత్‌ సరఫరా లేక వీధుల్లో నిరీక్షించాల్సి వస్తోంది. – చల్లపల్లి మంగ, తారకరామ కాలనీ, బొబ్బిలి.సాక్షి, అమరావతి: ఒకపక్క ముచ్చెమటలు పట్టిస్తున్న బిల్లులు.. మరోపక్క విద్యుత్తు కోతలతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతున్నారు. ఎండాకాలం ప్రారంభంలోనే డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ను సరఫరా చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు సర్కారు మండు వేసవిలో అనధికారిక కోతలతో విసనకర్రలే శరణ్యమనే స్థితికి తెచ్చింది. అధికారంలోకి రాగానే వినియోగదారులపై ఏకంగా రూ.15,485 కోట్ల భారం మోపిన టీడీపీ కూటమి సర్కారు కరెంట్‌ సరఫరాలో దారుణంగా విఫలమైందని.. నిరంతర విద్యుత్తు దేవుడెరుగు.. నిరంతరం కోతలు విధిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ కోతలపై ‘సాక్షి గ్రౌండ్‌ రిపోర్ట్‌’లో అన్నదాతల అగచాట్లు, పట్టణాలు, పల్లెల్లో ప్రజల దుస్థితి వ్యక్తమైంది. ఏప్రిల్‌ నెలలో విద్యుత్తు సరఫరాకు సంబంధించి గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది డిమాండ్‌ తక్కువగానే ఉన్నా అది కూడా సరఫరా చేయలేక కూటమి సర్కారు ఎడాపెడా కోతలు విధిస్తోంది. పల్లెల్లో అగమ్యగోచరం..నగరాల్లో గృహాలకు రోజుకు కనీసం మూడు గంటలు, పట్టణాల్లో నాలుగు గంటల పాటు అనధికా­రికంగా విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. వారంలో ఒక రోజు నిర్వహణ పనుల పేరుతో సరఫరా నిలిపి వేస్తున్నారు. పట్టణాల్లో ప్రాంతాలవారీగా రాత్రిళ్లు రెండు గంటలు విద్యుత్‌ కోత పెడుతున్నారు. ఇక గ్రామాల్లో పరిస్థితి గురించి చెప్పనవసరం లేదు. విద్యుత్‌ సరఫరా ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి తలెత్తింది. గంటల తరబడి విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. గతంలోనూ చంద్రబాబు హయాంలో ఇదే దుస్ధితి నెలకొందని గుర్తు చేసుకుంటున్నారు. ఎల్‌సీ, లైన్ల మరమ్మతులు, సబ్‌ స్టేషన్‌ నిర్వహణ సాకులు చెబుతూ కోతలు పెడుతున్నారు. ఎవరైనా ఇదేమిటని ప్రశ్నిస్తే పార్టీ ముద్ర వేసి పథకాలు రాకుండా చేస్తామని కూటమి నేతలు బెదిరిస్తున్నారు. బాబు హయాంలో పరిశ్రమలకు పవర్‌ హాలిడే..రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 242.849 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉంది. గతేడాది ఇదే సమయంలో 250.804 మిలియన్‌ యూనిట్ల వినియో­గం నమోదైంది. గతేడాదితో పోలిస్తే 3.17 మిలియన్‌ యూనిట్ల వినియోగం తక్కువే ఉన్నా సరఫరా చేయలేక కూటమి సర్కారు అనధికారిక కోతలు విధిస్తోంది. సాధారణంగా వేసవిలో విద్యుత్‌ వాడకం పెరుగుతుంది. కానీ ప్రస్తుతం డిమాండ్‌ గతేడాది కంటే తక్కువగా ఉన్నా సరఫరా చేయలేకపోతోంది. ఇక మే నెలలో రోజువారీ వినియోగం 260 మిలియన్‌ యూనిట్లకు చేరే అవకాశం ఉందని అంచనా. ఇక అప్పడు పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ‘పవర్‌ హాలిడే’ పేరుతో పరిశ్రమలకు వారంలో రెండు రోజులు విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిపివేసింది. దీంతో కుటీర పరిశ్రమలు మూత­పడ్డాయి. మళ్లీ ఇప్పుడు అవే దుర్భర పరిస్థితులు దాపురిస్తున్నాయనే ఆందోళన పారిశ్రా­మిక వర్గాల్లో వ్యక్తమవుతోంది.విజయనగరం జిల్లా బొబ్బిలి తారకరామ కాలనీలో విద్యుత్‌ కోతల వల్ల ఇళ్లలో ఉక్కపోత భరించలేక అర్ధరాత్రి చంటి బిడ్డతో సహా ఆరుబయట కూర్చుని జాగారం చేస్తున్న జనం భవిష్యత్‌ కోసం..భవిష్యత్‌లో విద్యుత్‌ కోసం ఇబ్బంది పడకుండా ముందస్తు ప్రణాళికలు అమలుకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే 33,240 మెగావాట్ల సామర్థ్యంతో 29 పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రో పవర్‌ ప్రాజె­క్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. వ్యవసాయానికి 30 ఏళ్ల పాటు పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్‌ అందించేందుకు 7 వేల మెగావాట్లను సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సెకీ) నుంచి అత్యంత తక్కువ ధరకే తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకుంది.నాడు విద్యుత్తు వెలుగులుఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి విద్యుత్‌ డిమాండ్‌ ప్రధాన సూచి­కగా భావిస్తుంటారు. వినియోగ­దా­రులకు నాణ్యమైన విద్యుత్తును నిరంతరం సరఫరా చేయడంలో గత ప్రభుత్వం విజయం సాధించింది. తీవ్ర బొగ్గు కొరత కారణంగా పలు రాష్ట్రాలు సంక్షోభం ఎదుర్కొన్నప్పటికి ఏపీలో వినియోగానికి సరిపడా విద్యుత్‌ సరఫ­రాను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందించింది. ఫలితంగా 2020 నుంచి 2024కి 22.5 శాతం విద్యుత్‌ సరఫరా వృద్ధి చెందింది. తాజాగా కేంద్ర విద్యుత్‌ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. 2020లో రాష్ట్రంలో ఏడాది మొత్తం మీద 65,414 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ సరఫరా ఉండగా 2024లో 80,151 మిలియన్‌ యూనిట్లకు పెరిగింది. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో జాతీయ, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా తీవ్ర విద్యుత్‌ సంక్షోభం తలెత్తింది. భారత్‌కు చైనా బొగ్గు దిగుమతులు పడిపోయాయి. ఆస్ట్రేలియా నుంచి కూడా అంతంత మాత్రంగానే వచ్చాయి. జపాన్‌లోనూ విద్యుత్‌ సంక్షోభం తాండవించింది. శీతాకాలంలో వెచ్చదనాన్నిచ్చే దుస్తులు వాడి హీటర్లకు విద్యుత్‌ వినియోగం తగ్గించాలని అక్కడి ప్రభుత్వం అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది. అమెరికాలో 15 శాతం విద్యుత్‌ వినియోగంతో పాటు సహజ ఇంధనం ధరలు పెరగడంతో ప్రతి ఆరు ఇళ్లలో ఒక ఇల్లు విద్యుత్‌ బకాయి చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మన రాష్ట్రంలో అవసరానికి తగ్గట్టు విద్యుత్‌ను ఎలాంటి కోతలు లేకుండా గత ప్రభుత్వం ప్రజలకు అందించింది.మా బతుకుల్లో వెలుగు కరువుపగలు రెండు గంటలు, రాత్రి రెండు గంటలు కరెంట్‌ తీసేస్తున్నారు. రాత్రిళ్లు సరిగ్గా భోజనాల వేళకు కరెంట్‌ పోతోంది. వారంలో ఒక రోజు రోజంతా కరెంట్‌ ఉండదు. ఈ ప్రభుత్వం వచ్చాక మా ఇంటికి ఎలాంటి మంచి జరగలేదు. నా భర్తకు పక్షవాతం వస్తే కనీసం పింఛన్‌ ఇవ్వడం లేదు. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మా ఇంట్లో, మా బతుకుల్లో ఈ ప్రభుత్వం వల్ల వెలుగు లేకుండా పోయింది. –దిద్దె రత్నకుమారి, జ్యోతి కాలనీ, నిడదవోలు, తూర్పు గోదావరి జిల్లాఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందోఉపాధి కోసం పిండి మర పెట్టుకుని జీవనం సాగిస్తున్నా. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. ఓల్టేజ్‌ ఎక్కువ, తక్కువ అవుతోంది. దీనివల్ల మోటార్లు కాలిపోతున్నాయి. –కిశోర్, నాగమణి పిండిమిల్లు, టీఆర్‌ కాలనీ, బొబ్బిలితెల్లార్లూ కూర్చునే ఉంటున్నాం..కరెంటు కోసం రోజంతా ఎదురు చూడాల్సిందే. తెల్లార్లూ కూర్చునే ఉండాల్సిన పరిస్థితి. సాయంత్రం తీసి తెల్లవారు జామున 3 గంటలకు ఇస్తున్నారు. అందాకా మెలకువగానే ఉంటున్నాం. ఇదేనా నాణ్యమైన విద్యుత్తు? –సీహెచ్‌ లక్ష్మి, బొబ్బిలిఏం ప్రభుత్వమో ఏమో?గత ప్రభుత్వంలో నగరంలో విద్యుత్‌ సరఫరా ఆగడం ఎప్పుడూ చూడలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెట్టుకొమ్మలు నరుకుతున్నాం, ట్రాన్స్‌ ఫార్మర్‌ బాగు చేస్తున్నాం.. అంటూ ఏదో ఒక సాకుతో వారంలో ఒక రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ కరెంటు కట్‌ చేస్తున్నారు. ఇదేం ప్రభుత్వమో ఏమో? వేసవిలో విద్యుత్‌ కోతలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా..? మరి ఎందుకు పట్టించుకోరు? –డి.లలిత, విశాఖపట్నంపసిపాప అల్లాడుతోంది..మా అమ్మగారింటికి వచ్చా. ఇక్కడ కరెంట్‌ అసలు ఉండటం లేదు. అస్తమానూ తీసేస్తున్నారు. చిన్నపాప ఉక్కపోతకు అల్లాడి పోతోంది. మా పరిస్థితి ఏమని చెప్పుకుంటాం. కరెంటు కట్‌ చేయొచ్చు కానీ రాత్రిళ్లు కూడా లేకుండానా? కోతల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. –దివ్య, బొబ్బిలిబిల్లుల మోత.. విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తామని హామీలిచ్చి కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు పగలు, రాత్రి అనే తేడా లేకుండా విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. విద్యుత్‌ బిల్లుల మోత మోగిస్తున్న ప్రభుత్వం కోతలను పట్టించుకోవడం లేదు. – షేక్‌ మహమ్మద్‌ అలి, కంభం, ప్రకాశం జిల్లారైతన్న కష్టం వృథా...!నాకున్న ఎకరం పొలానికి తోడు మూడెకరాలు కౌలుకి తీసుకుని వ్యవసాయం చేస్తున్నా. చివరి నేలకు తడి లేకపోతే ఇన్ని నెలల కష్టం వృథా అవుతుంది. ఎకరాకు కనీసం రూ.35 వేలు చొప్పున కౌలు చెల్లించాలి. గత ప్రభుత్వంలో వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు విద్యుత్‌ ఒకే విడతలో ఇచ్చేవారు. ఇప్పుడు రోజులో రెండు, మూడు విడతలుగా ఇస్తున్నారు. అది కూడా 7 గంటలు మించడం లేదు. దీంతో తడిసిన నేలే మళ్లీ తడిచి పంటలు ఎండిపోతున్నాయి. గతంలో రైతు భరోసా వచ్చేది. ఇప్పుడు అదీ లేదు. –యాతం రామాంజనేయులు, కడియద్ద, పశ్చిమ గోదావరి జిల్లాఏ పురుగో పుట్రో కరిస్తే...!ఏం ప్రభుత్వమో ఏంటో..! చచ్చిపోతున్నాం ఆఫీసుల చుట్టూ తిరగలేక. నాలుగు రోజులుగా నరకం చూపిస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయింది. పంట ఎండిపోతోందంటే ఎవరూ వినిపించుకోవడం లేదు. రోజుల తరబడి అధికారుల చుట్టూ తిరిగినా కొత్తది ఇవ్వడం లేదు. గతంలో 9 గంటలు కరెంటు ఇచ్చేవారు. ఇప్పుడు 7 గంటలు ఇస్తే అదే ఎక్కువ. తెల్లవారుజామున 4 గంటలకు ఇస్తుండటంతో ఆ సమయంలో పొలానికి వచ్చి చేలకు నీరు పెట్టుకుంటున్నాం. ఏ పురుగో పుట్రో కరిస్తే మా పరిస్థితి ఏంటి? ఇదేం బాలేదు. ప్రభుత్వం ఇవన్నీ చూసుకోవాలి కదా!! –మదుకూరి కొండల రాజు, కృష్ణాపురం, పశ్చిమగోదావరి జిల్లా

CM Revanth Reddy On KCR in a friendly chat with media2
సెట్‌ చేయడానికే ఏడాది: సీఎం రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అనర్థాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని, రాష్ట్ర ఖజానా అంతా లూటీ చేసింది ఆయనేనని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పార్టీ రజతోత్సవం పేరుతో ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ సభలో ఆయనలో ఉన్న అక్కసునంతా వెళ్లగక్కాడని విమర్శించారు. వాస్తవానికి తాను ముఖ్యమంత్రిని అయిన రోజునే కేసీఆర్‌ గుండె పగిలిందని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చాక.. అంతకుముందు పదేళ్లలో కేసీఆర్‌ చేసిన విధ్వంసాన్ని సెట్‌ చేయడానికే ఏడాది కాలం సరిపోయిందని, ఇప్పుడంతా స్ట్రీమ్‌లైన్‌ (క్రమబద్ధీకరణ) చేస్తున్నామని చెప్పారు. సోమవారం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె.జానారెడ్డి నివాసంలో రేవంత్‌రెడ్డి మీడియాతో ముచ్చటించారు. బీఆర్‌ఎస్‌ సభ, మావోయిస్టుల సమస్య, కేసీఆర్‌ పాలన, తన పనితీరు, రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, రాహుల్‌గాందీతో తనకున్న మైత్రి తదితర అంశాలపై మాట్లాడారు. ఎవరో అడుగుతున్నారని అరెస్టులు ఉండవు ‘కేసీఆర్‌ ప్రసంగంలో పస లేదు. బీఆర్‌ఎస్‌ ఎల్కతుర్తి సభ కంటే నేను గజ్వేల్‌లో పెట్టిన సభే హైలైట్‌. ఖమ్మంలో జరిగిన రాహుల్‌గాంధీ సభకు బీఆర్‌ఎస్‌ హయాంలో కనీసం బస్సులు కూడా ఇవ్వలేదు. కానీ మేం బీఆర్‌ఎస్‌ నేతలు అడిగినన్ని బస్సులు ఇచ్చాం. తద్వారా ఆర్టీసీకి ఆదాయం కూడా వచ్చింది. హరీశ్, కేటీఆర్‌లు చిన్నపిల్లలని నేను అసెంబ్లీలో మాట్లాడిన విషయాన్నే కేసీఆర్‌ ఎల్కతుర్తి సభలో చెప్పాడు. మరి పిల్లగాళ్లను అసెంబ్లీకి ఎందుకు పంపిస్తున్నాడు? కేసీఆర్, మోదీ వారి అవసరాలకు అనుగుణంగా మాట్లా డుతుంటారు. కేసీఆర్‌ తరహాలో నేను చట్టాన్ని అతిక్రమించి పనిచేయను. ఎవరో అడుగుతున్నా రని అరెస్టులు చేసే పరిస్థితి ఉండదు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడేది లేదు. చట్టప్రకారమే అన్నీ జరుగుతాయి..’ ముఖ్యమంత్రి అన్నారు. ఏ పథకమైనా అర్హులందరికీ లబ్ధి చేకూరాలి ‘కేసీఆర్‌ తరహాలో లాంచింగ్, క్లోజింగ్‌ పథకాలు నేను పెట్టలేను. షోపుటప్‌ స్కీంలు నాతో కాదు. ఒక పథకాన్ని ప్రారంభిస్తే అర్హులందరికీ లబ్ధి కలిగేంతవరకు పనిచేస్తా. రేవంత్‌రెడ్డి చెప్పిందే చేస్తాడనే నమ్మకం ప్రజల్లో కలిగేలా పనిచేస్తా. ఇప్పటివరకు ప్లానింగ్‌కే సమయం సరిపోయింది. ఇక నుంచి స్పీడప్‌ చేయాల్సిన అవసరం ఉంది. పథకాల గ్రౌండింగ్‌ చేస్తాం. అయితే ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలను చెప్పుకోవడంలో కూడా మేము వెనుకబడ్డాం. ఏడాదిన్నరలోనే ఎన్నో పథకాలు అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే ఎన్నో పథకాలు తీసుకువచ్చాం. ఇప్పుడు వాటన్నింటినీ స్ట్రీమ్‌లైన్‌ చేస్తున్నాం. మేము అమలు చేస్తున్న పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేవు. బీఆర్‌ఎస్‌ తరహాలో మాకు కూడా తెలంగాణ ప్రజలు పదేళ్లు అవకాశం ఇస్తారు. వాస్తవానికి నా పాలన, పథకాల అమలుపై ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే చర్చ జరుగుతోంది..’ అని రేవంత్‌ చెప్పారు. రాహుల్‌తో మంచి సంబంధాలున్నాయి ‘రాహుల్‌గాంధీతో నా స్నేహం గురించి నాకు తెలిస్తే చాలు. ఎవరో ఏదో చెబితే వినాల్సిన పనిలేదు. ఆయనతో నాకు మంచి సంబంధాలున్నాయి. మా ఇద్దరి గురించి బయటి వారు ఏం మాట్లాడుకుంటున్నారనేది నాకు అవసరం లేదు. ప్రపంచంలో ఇందిరాగాంధీకి మించిన రాజకీయ యోధురాలు లేరు. ఒక దేశాన్ని ఓడించిన చరిత్ర ఆమెది. వేరే ఆప్షన్‌ లేకే ఆ అధికారుల కొనసాగింపు పాలన అవసరాలను బట్టి అధికారులను వినియోగించుకుంటాం. కొందరు అధికారుల గురించి అన్ని విషయాలు తెలిసినా వేరే ఆప్షన్‌ లేకపోవడంతో కొనసాగించాల్సి వస్తోంది. కలెక్టర్లను మార్చుకునే వెసులుబాటు ఉంది కనుకనే మారుçస్తున్నాం. సీపీఐ, ఎంఐఎంకు అండగా ఉన్నా.. నేను ఇంకా ఇరవై ఏళ్లు రాజకీయాల్లో ఉంటా. నన్ను నమ్ముకున్న వారిని ఎప్పుడూ మర్చిపోను. నన్ను నమ్మిన సీపీఐకి, ఎంఐఎంకు అండగా ఉన్నా. అద్దంకి దయాకర్‌కు పదవి ఇప్పించగలిగా. దయాకర్‌ ఓపికతో ఉన్న కారణంగానే పదవి వచ్చింది. ఓపికతో ఉంటేనే నాకు కూడా బాధ్యత ఉంటుంది. అవకాశాలు వస్తాయి. అలా కాదని బయటకు వచ్చి స్లీపింగ్‌ రిమార్కులు చేస్తే నాపై భారం తగ్గించినట్టే అవుతుంది. పదవి ఇవ్వలేని పరిస్థితికి, వారి మాటలకు చెల్లుకు చెల్లు అయినట్టు నేను ఫీల్‌ అవుతా..’ అని ముఖ్యమంత్రి అన్నారు. ఎంత చెప్పినా కొందరు ఎమ్మెల్యేలు వినడం లేదు ‘కొందరు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో సరిగా పనులు చేసుకోలేకపోతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా వారు హైదరాబాద్‌ వదిలి వెళ్లలేకపోతున్నారు. మీడియా చుట్టూ తిరిగేందుకే పరిమితం అవుతున్నారు..’ అని సీఎం వ్యాఖ్యానించారు. మావోయిస్టులపై పార్టీ నిర్ణయమే ఫైనల్‌ ‘ఆపరేషన్‌ కగార్‌పై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. మావోయిస్టుల విషయంలో పార్టీ నిర్ణయమే ఫైనల్‌. కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వ విధానాన్ని ప్రకటిస్తాం..’ అని రేవంత్‌ తెలిపారు. జానా నివాసంలో ‘కగార్‌’పై చర్చలు లోకాయుక్త, ఉప లోకాయుక్త పదవీ స్వీకార కార్యక్రమానికి సోమవారం రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి.. అక్కడి నుంచి నేరుగా మాజీ మంత్రి కె.జానారెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ జానారెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్‌రెడ్డిలతో సమావేశమయ్యారు. ఆపరేషన్‌ కగార్‌ గురించి చర్చించారు. మావోయిస్టుల సమస్యకు సంబంధించి శాంతి చర్చల కమిటీ ఆదివారం తనతో సమావేశం కావడాన్ని, తాను చొరవ తీసుకుని కేంద్రాన్ని శాంతి చర్చలకు ఒప్పించేలా చూడాలని వారు కోరిన విషయాన్ని తెలియజేశారు. గతంలో మావోయిస్టులతో చర్చలు జరిగినప్పుడు జానారెడ్డి హోంమంత్రిగా, కేశవరావు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో.. శాంతి చర్చల కమిటీ ప్రతిపాదనలపై ఏం చేయాలన్న దానిపై వారితో చర్చించారు. అక్కడి నుంచే ఏఐసీసీ సీనియర్‌ నేతలు దిగ్విజయ్‌సింగ్, చిదంబరంలతో సీఎం మాట్లాడారని సమాచారం. కాగా శాంతి చర్చల కమిటీ ప్రతిపాదనను పార్టీ అధిష్టానానికి పంపాలని సమావేశంలో నిర్ణయించారు.

China backs Pakistans security concerns and sovereignty3
‘ఛీ’నా రాజకీయం...

అవకాశం దొరికింది కదాని ఇండియాను పాకిస్థాన్ భుజాల మీదుగా కాల్చాలని ప్రయత్నిస్తోంది కుటిల చైనా. ఆ దిశగానే బీజింగ్-ఇస్లామాబాద్ రక్షణ భాగస్వామ్యం బలపడుతోంది. పహల్గాంలో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్న తరుణంలో... గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగల తమ అత్యాధునిక పీఎల్-15 క్షిపణులను పాక్ వైమానిక దళానికి చైనా అందించింది.బియాండ్ విజువల్ రేంజ్ (బీవీఆర్) పీఎల్-15 క్షిపణులను మోసుకెళుతున్న తమ జేఎఫ్-17 బ్లాక్ 3 యుద్ధ విమానాల ఫొటోలను పాక్ వైమానిక దళం (పీఏఎఫ్) ఇటీవల విడుదల చేయడం గమనార్హం. ‘పీఏఎఫ్’కు చైనా సరఫరా చేసినవి ఎగుమతులకు ఉద్దేశించిన ‘పీఎల్-15ఈ’ రకం క్షిపణులు అనుకుంటే పొరపాటు! తమ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ (పీఎల్ఏఏఎఫ్)కు చెందిన సొంత పీఎల్-15 క్షిపణులను చైనా నేరుగా పాక్ కు అందజేసినట్టు ‘యూరేషియన్ టైమ్స్’ ఓ కథనం ప్రచురించింది.భారత్, పాక్ నడుమ వైరం ముదురుతున్న అత్యంత కీలక తరుణంలో ఆగమేఘాలపై ఆయుధాలను సరఫరా చేయడానికి చైనా ఈ మార్గం ఎంచుకున్నట్టు తెలుస్తోంది. మరింత ఎక్కువ దూరం నుంచి భారత్ విమానాలను లక్ష్యంగా చేసుకోగల సామర్థ్యాన్ని పీఎల్-15 క్షిపణులు పాక్ యుద్ధ విమానాల పైలట్లకు కల్పిస్తాయి. అలా శత్రువుపై గెలుపును సునాయాసం చేస్తాయి.ఏమిటీ పీఎల్-15 మిసైల్?పీఎల్-15 క్షిపణి ఆధునిక వైమానిక యుద్ధరంగంలో చైనాకు ఓ ప్రధానాస్త్రం. ఇది ప్రభుత్వ ఏరోస్పేస్ సంస్థయిన ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా (ఏవీఐసీ) అభివృద్ధి చేసిన రాడార్ గైడెడ్ దూరశ్రేణి క్షిపణి. ధ్వని వేగానికి ఐదు రెట్లు (మ్యాక్ 5) మించిన వేగంతో గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించదగ్గ ఈ మిసైల్ 200-300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది.విదేశాలకు ఎగుమతి చేయడానికి ఉద్దేశించిన ‘పీఎల్-15ఈ’ వెర్షన్ మిసైల్ 145 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను మాత్రమే ఛేదించగలదు. జే-10సి, జే11-బి, జే-15, జే-16, జేఎఫ్-17 బ్లాక్ 3, జే-20 విమానాలకు పీఎల్-15 క్షిపణిని అమర్చవచ్చు. 160 కిలోమీటర్ల రేంజితో, శబ్ద వేగానికి నాలుగు రెట్ల వేగంతో ప్రయాణించగల అమెరికాకు చెందిన ఏఐఎం-120డి అమ్రామ్ క్షిపణితో పోలిస్తే రేంజి, వేగం పరంగా మెరుగైన ఈ పీఎల్-15 మిసైల్ 2018 నుంచి చైనా వైమానిక దళానికి సేవలు అందిస్తోంది.పీఎల్-15 వర్సెస్ మీటియర్... యూరోపియన్ ఎంబీడీఎం మీటియర్ క్షిపణితో పీఎల్-15ను పోల్చవచ్చు. గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించగల మీటియర్, ఎంఐసీఏ దూరశ్రేణి క్షిపణులను ప్రస్తుతం భారత్ చెంత ఉన్న రాఫెల్ యుద్ధ విమానాలకు అమర్చవచ్చు. లాంచ్ ప్లాట్ ఫాం, ఎత్తు, లక్ష్యపు చలనశీలత అంశాలపై ఆధారపడి మీటియర్ మిసైల్ పరిధి 100-200 కిలోమీటర్లు ఉంటుంది. ధ్వని వేగానికి నాలుగు రెట్లు మించిన వేగాన్ని అది అందుకోగలదు. సామర్థ్యం పరంగా పీఎల్-15ఈ (ఎగుమతి రకం)తో మీటియర్ క్షిపణిని పోల్చవచ్చు. కానీ పీఎల్-15 స్టాండర్డ్ వెర్షన్ (పాక్ కు చైనా సరఫరా చేసిన ప్రామాణిక రకం) మాత్రం మీటియర్ కంటే అధిక వేగం, దూరశ్రేణి గల క్షిపణి. రాంజెట్ ఇంజిన్ సాయంతో మీటియర్ క్షిపణి ప్రయాణమంతటా స్థిర వేగంతో దూసుకెళుతుంది.ఇందుకు భిన్నంగా పీఎల్-15 మిసైల్ డ్యూయల్ పల్స్ ఘన ఇంధన రాకెట్ మోటార్ సాయంతో ప్రయాణిస్తుంది. ఇందులోని ఘన ఇంధనం కొద్దిసేపు మాత్రమే జ్వలించినప్పటికీ రాంజెట్ ఇంజిన్ గల మీటియర్ కంటే ఎక్కువ వేగం అందిస్తుంది. అయితే ధ్వనికి ఐదు రెట్లు పైబడిన స్పీడ్ అందుకున్నా ప్రయాణం పొడవునా అదే వేగాన్ని పీఎల్-15 మిసైల్ కొనసాగించలేదు! క్షిపణుల బయటివైపు చిన్న రెక్కల్లాంటి భాగాలు (ఫిన్స్) ఉంటాయి. వాటిని మడవగలిగితే మరిన్ని క్షిపణులను యుద్ధవిమానాలకు అమర్చవచ్చు. ఈ బుల్లి రెక్కల్ని మడిచిన పీఎల్-15 క్షిపణి నమూనాను చైనా నిరుడు జూహాయ్ ఎయిర్ షోలో ప్రదర్శించింది. దీంతో జే-20 లాంటి యుద్ధవిమానాలు నాలుగు బదులుగా ఆరు పీఎల్-15 మిసైళ్లను మోసుకెళ్లే వీలు కలిగింది.రష్యన్ ‘ఆర్-37ఎం’ వైపు భారత్ చూపు?పాక్ మోహరించిన పీఎల్-15 మిసైళ్లతో భారత వైమానిక దళానికి తలనొప్పి తప్పేలా లేదు. వాటిపై పైచేయి సాధించే ఆప్షన్ ఇండియాకు లేకపోలేదు. అది... రష్యాకు చెందిన అత్యాధునిక ఆర్-37ఎం దూరశ్రేణి క్షిపణి! అతిధ్వానిక వేగాన్ని (మ్యాక్ 6) అందుకోగల ఈ హైపర్ సానిక్ మిసైల్ 300-400 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను తుత్తునియలు చేస్తుంది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా దీన్ని విస్తృతంగా వినియోగించింది. ఉక్రెయిన్ వైమానిక దళానికి ఆర్-37ఎం క్షిపణి నుంచే ప్రధాన ముప్పు ఎదురైందంటే అతిశయోక్తి కాదు.ఆర్-37ఎంను అమర్చిన మిగ్-31 విమానాలు పలు ఉక్రెయిన్ యుద్ధ విమానాలను కూల్చివేశాయి. ఉక్రెయిన్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని సైతం ఈ మిసైల్ సాయంతో రష్యా కూల్చివేసినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. విశేషం ఏమిటంటే సుఖోయ్ ఎస్యు-30ఎస్ఎం2 యుద్ధ విమానాలపై ఆర్-37ఎం క్షిపణులను మోహరించవచ్చు. భారత్ వద్ద ‘సుఖోయ్ ఎస్యు-30’ శ్రేణికి కొదవ లేదు. ప్రస్తుతం మనకు 260కి పైగా సుఖోయ్ ఎస్యు-30ఎంకెఐ యుద్ధ విమానాలు ఉన్నాయి.వాటిని సుఖోయ్ ఎస్యు-30ఎస్ఎం2 వేరియంట్లుగా ఉన్నతీకరించే అంశాన్ని భారత్ పరిశీలిస్తోంది. ఎస్యు-30ఎంకెఐ విమానాలకే ఆర్-37ఎం క్షిపణులను అమర్చాలంటే పెద్ద సాంకేతిక ప్రక్రియ ఉంది. దాదాపు 84 ఎస్యు-30ఎంకెఐ విమానాలను ఎస్ఎం2 వేరియంట్ స్థాయికి అప్గ్రేడ్ చేయడానికి రూ.63 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా.ఆర్-37ఎం క్షిపణులను ఇండియాకు విక్రయించడానికి రష్యా కూడా ఆసక్తి కనబరుస్తోంది. రాఫెల్ యుద్ధ విమానాలపై ఈ క్షిపణులను మోహరించే అంశంలోనూ చర్చలు సాగుతున్నాయి. 2019లో బాలాకోట్ దాడుల సందర్భంగా ఇండియాకు చెందిన మిగ్-21 బైసన్ యుద్ధ విమానాన్ని పాక్ తన ఎఫ్-16 విమానం-అమ్రామ్ క్షిపణితో కూల్చివేసింది. నాడు ఇండియా చెంత దూరశ్రేణి క్షిపణులు లేకపోవడం పెద్ద లోటు. ఆ తర్వాత మీటియర్ క్షిపణులను అమర్చిన రాఫెల్ విమానాలను భారత్ మోహరించింది. - జమ్ముల శ్రీకాంత్

TDP govt gives Ursa company most expensive land worth Rs 3000 crore in Visakhapatnam4
డొల్ల కంపెనీలతో డీల్‌!

సాక్షి, అమరావతి: ఊరూ పేరు లేని ఉర్సా కంపెనీకి టీడీపీ సర్కారు విశాఖలో రూ.3,000 కోట్ల విలువ చేసే అత్యంత ఖరీదైన భూములను ఎకరా 99 పైసలకే కేటాయించిన నేపథ్యంలో ఈ కుంభకోణం జాతీయ స్థాయిలో పెద్దఎత్తున చర్చకు దారి తీసింది. భూ కేటాయింపులపై చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న విధానాలను న్యాయ నిపుణులు, రాజకీయ పరిశీలకులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఒకపక్క కేంద్ర సంస్థలకు కేటాయించిన భూములకు రూ.కోట్లలో వసూలు చేస్తూ... మరోపక్క తన బినామీలు, వందిమాగదులకు కారుచౌకగా సంతర్పణ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గత పది రోజులుగా ఉర్సా భూ కుంభకోణంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నా కూటమి సర్కారుతోపాటు అనుకూల మీడియా కిక్కురుమనకపోవడం ఆరోపణలకు మరింత బలం చేకూరుతోందని పేర్కొంటున్నారు.చంద్రబాబు సర్కార్‌ను ప్రశ్నిస్తూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ చేసిన పోస్టు ఉర్సాకు భూ కేటాయింపులు చట్ట విరుద్ధం: ప్రశాంత్‌ భూషణ్‌ ఓ ఘోస్ట్‌ కంపెనీకి చంద్రబాబు సర్కారు చట్ట విరుద్ధంగా 59.6 ఎకరాలను కేటాయించిందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ఎక్స్‌ వేదికగా విమర్శించారు. కనీసం ఆఫీసు, ఎలాంటి ట్రాక్‌ రికార్డు లేని కంపెనీతో ప్రభుత్వం ఎలా ఒప్పందం కుదుర్చుకుంటుందని ప్రశ్నించారు. ఇలాంటి దొంగ కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం దాదాపు ఉచితంగా భూమి ఇచ్చిందని, ఇది కిక్‌ బ్యాక్స్‌ ఒప్పందమా? లేక ఉన్నతస్థాయి నాయకుల సంబంధమా? అని ప్రశ్నించారు.ఉర్సా ఎవరి క్లస్టర్‌?: తెలకపల్లి రవిఉర్సా క్లస్టర్‌కు భూ కేటాయింపులపై చాలా సందేహాలున్నాయని, అది ఎవరి క్లస్టర్‌ అన్నది తేలాలని సీనియర్‌ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి తన యూట్యూబ్‌ చానల్‌లో పేర్కొన్నారు. ‘రెండు నెలల కిందట ఏర్పాటైన ఉర్సా క్లస్టర్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు దాదాపు 60 ఎకరాల భూమిని కేటాయించారు. ఎన్ని ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం ఫ్యాక్ట్‌ చెక్‌తో పాటు ఐటీ, ఏపీఐఐసీ విభాగాలు, సోషల్‌ మీడియా వింగ్‌ స్పందించడం లేదు. ఉర్సా కంపెనీ ప్రమోటర్లలో ఒకరైన అబ్బూరి సతీష్‌ చంద్రబాబు నాయుడుతో దిగిన ఫోటోలు ఉన్నాయి. తెలంగాణ పత్రికలు ఈ విషయాన్ని ప్రముఖంగా ఇస్తుంటే ఆంధ్రాలో మాత్రం మీడియా మౌనంగా ఉండటం చాలా సందేహాస్పదంగా ఉంది. 2014–19లో కూడా టీడీపీ ప్రభుత్వం తన సన్నిహితులకు చాలా విలువైన భూములను ధారాదత్తం చేసింది’ అని పేర్కొన్నారు.అదే నిజమైతే కేటాయింపులు ఆపాలి: కె.నాగేశ్వరరావుఊరూ పేరులేని కంపెనీకి, లోకేశ్‌ బినామీలకు భూకేటాయింపులు చేశారన్న ఆరోపణలు నిజ­మైతే ఉర్సాకు భూ కేటాయింపులను తక్షణం ఆపాలని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కె.నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ‘మా యూట్యూబ్‌ ఛానల్‌కు 99 పైసలకు విశాఖలో కనీసం ఒక ఎకరా ఇవ్వమని చెప్పండి. ఉర్సా.. టీసీఎస్‌ కంటే ఎక్కువ ఉద్యోగాలు కల్పి­స్తా. పది పైసలకు పది గుంటలు ఇచ్చినా యూట్యూబ్‌ చానల్‌ను విస్తరించి పెద్ద మీడియా సంస్థ ఏర్పాటు చేస్తా.ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు భూములు విక్రయించ­డం ద్వారా హక్కులు వదులుకోకూడదు. ఫిబ్రవరిలో ఏర్పాటైన ఉర్సా కంపెనీకి 59.6 ఎకరాలు ఎలా కేటాయిస్తారు? ఉర్సాపై ఇంత దుమారం రేగుతున్నా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? లోకేశ్‌ బినామీ కిలారు రాజేష్‌ సంస్థకు భూములు కేటాయించారంటున్నా ఎందుకు స్పందించడం లేదు?’అని తన యూ ట్యూబ్‌ చానల్‌లో పేర్కొన్నారు.

Sakshi Editorial On Pakistan and India Issues about Terror attack5
పాక్‌ పాచికల్ని పారనీయొద్దు!

పహల్గామ్‌లో 26 మంది నిండు ప్రాణాలను బలితీసుకున్న ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనన్న అభిప్రాయం రోజురోజుకూ దేశంలో బలపడుతుండగా పాకిస్తాన్‌ మరింత రెచ్చగొట్టేలా మాట్లాడుతోంది. మొదటి నాలుగు రోజులూ ఉలకని, పలకని ఆ దేశం అటుతర్వాత ‘తటస్థ దర్యాప్తు’ రాగం అందుకుంది. ఆ మర్నాడే అణు బెదిరింపులకు దిగింది. మరోపక్క భద్రతా మండలిలో చడీచప్పుడూ లేకుండా లాబీయింగ్‌ సాగించి తన పాచిక పారేలా చూసుకుంది. ఇక్కడే మన లోపం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని ‘తీవ్రంగా’ ఖండిస్తు న్నట్టు తీర్మానం చెబుతున్నా అందులో దాడికి కారణమైన ‘ద రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌’ (టీఆర్‌ఎఫ్‌) సంస్థ పేరు ప్రస్తావనే లేకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. చైనా ఎప్పటిలాగే పాకిస్తాన్‌ వాదనతో శ్రుతి కలిపింది. కానీ మన కు చాలా సన్నిహితుడనుకున్న డోనాల్డ్‌ ట్రంప్‌ ఏలుబడి అమెరికాలో మొదలైనా పాక్‌తో ఆ దేశం అంటకాగుతున్న వైనం దిగ్భ్రాంతికరం కాదా? ఈమధ్యకాలంలో బలూచిస్తాన్‌లో రైలును దారిమళ్లించి అనేకుల్ని హతమార్చిన ఉదంతంలో భద్రతామండలి అందుకు కారణమైన బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) పేరు ప్రస్తావించింది. 2019లో పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి ఉదంతంలో సైతం జైషే మొహమ్మద్‌ (జేఈఎం) ప్రమేయాన్ని మండలి తీర్మానం ఎత్తి చూపింది. కానీ ఇప్పుడేమైంది? ఇక్కడికొచ్చేసరికి ఈ నీళ్ల నములుడు దేనికి? అమెరికా రూపొందించిన తీర్మానంలో తొలుత ప్రస్తావనకొచ్చిన టీఆర్‌ఎఫ్‌ పేరు ఎందుకు ఎగిరిపోయింది? ఏ సంస్థనూ మాటమాత్రంగానైనా ఖండించటానికి ముందుకురాని తీర్మానం ‘అంతర్జాతీయ శాంతికీ, భద్రతకూ విఘాతం కలిగించే ఉగ్ర ఘాతుకాలపై అన్నివిధాలుగా పోరాడతాం’ అని బడాయి పోవటం చిత్రం కాదా! ఆ ఘనకార్యం మేమే చేశామని విర్రవీగిన సంస్థ పేరెత్తటానికి మండలికున్న అభ్యంతర మేమిటి? అఫ్గాన్‌లో సోవియెట్‌ సైన్యాన్ని ఎదుర్కొనటానికి అమెరికా ఆశీస్సులతో ఉగ్రవాద శిబిరాలు నడిపిన పాపిష్టి చరిత్ర తమకుందని ఈమధ్యే పాక్‌ రక్షణమంత్రి అంగీకరించాడు. తాజా పరిణామాల నేపథ్యంలో అలాంటి లాలూచీ ఇంకా కొన సాగుతున్నదనుకోవాలా? ప్రధాని నరేంద్ర మోదీ మొన్న బిహార్‌లో కావొచ్చు... తాజాగా ‘మన్‌ కీ బాత్‌’లో కావొచ్చు, పహల్గామ్‌ ఉదంతంలో బాధితులకు సరైన న్యాయం దక్కేలా చేస్తామని స్పష్టం చేశారు. పాత్ర ధారుల్ని, సూత్రధారుల్ని తీవ్రాతితీవ్రంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. మంచిదే. అయితే ఈ కృషి బహుముఖాలుగా వుండాలి. ఉగ్రవాదుల్ని పట్టి బంధించటానికి ప్రయత్నించటంతో పాటు అంతర్జా తీయంగా పాక్‌ను ఏకాకిని చేయటానికి కృషి చేయాలి. ఉగ్రసంస్థల్ని కిరాయి ముఠాలుగా వాడుకుంటున్న దాని నైజాన్ని అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టాలి. పాకిస్తాన్‌ తెరవెనకుండి భద్రతామండలి తీర్మానంలో చేయించిన మార్పులు చిన్నవేమీ కాదు. ఉగ్ర సంస్థ టీఆర్‌ఎఫ్‌తో పాక్‌ సర్కారు ఎంతగా చెట్టపట్టాలు వేసుకున్నదో మండలిలో జరిగిన పరిణామాలే తేటతెల్లం చేస్తున్నాయి. తీర్మానంలో టీఆర్‌ఎఫ్‌ ప్రస్తావన లేకుండా చేసిన క్షణాల్లోనే ఆ ఉగ్ర సంస్థ తన పాత ప్రకటన ‘అధికారికమైనది’ కాదంటూ స్వరం మార్చటం గమనించదగ్గది. దాడి జరిగిన వెంటనే తామే అందుకు కారకులమని చెప్పిన ఆ సంస్థ మండలిలో పాక్‌ వాదనకు అనుగుణంగా ఆ ప్రకటన తమది కాదనటమే కాదు... నింద మోపటం కోసం భారత సైన్యం కావాలని చేసిన పనిగా ఆ ఉదంతాన్ని వక్రీకరించే ప్రయత్నం చేసింది. లష్కరే తోయిబా విషపుత్రిక అయిన టీఆర్‌ఎఫ్‌ 2020 నుంచీ జమ్మూకశ్మీర్‌లో అనేక దాడులకు పాల్పడుతోంది. ఆ సంస్థను మన దేశం నిషేధించింది కూడా! ఏదో విధంగా మన దేశాన్ని ఇబ్బందులపాలు చేయటం కోసం ఏళ్ల తరబడి స్వయంగా నిర్మించిన ఉగ్రవాద సాలెగూటిలో తానే చిక్కుకుని పాకిస్తాన్‌ తరచు విలవిలలాడుతోంది. 2015లో పెషా వర్‌ కంటోన్మెంట్‌ ప్రాంతంలోని పాఠశాలపై ఉగ్రవాదులు ఒక్కుమ్మడిగా విరుచుకుపడి 140 మంది బాలబాలికల్ని కాల్చిచంపారు. ఆ మరుసటి ఏడాది క్వెట్టాలో పోలీసు శిక్షణ కేంద్రం ఆవరణలోకి ప్రవేశించి 60 మందిని హతమార్చారు. ఒక యూనివర్సిటీపై దాడికి దిగి ప్రొఫెసర్‌తోపాటు 20 మంది విద్యార్థుల ప్రాణాలు తీశారు. ఈ మాదిరి ఉదంతాలు ఎన్నెన్నో. అయినా పాకిస్తాన్‌ వైఖరిలో ఆవగింజంతైనా మార్పు లేదు. పశ్చాత్తాపం అసలే లేదు. పహల్గామ్‌ దాడిని ఖండించకుండా పర్యాటకులు ప్రాణాలు కోల్పోవటం విచారకరమంటూ ప్రకటన చేసి చేతులు దులుపుకుంది.పాకిస్తాన్‌ తీరు మారదని ఆ దేశ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ దబాయింపు చూస్తే తెలుస్తుంది. ఉగ్రదాడిపై ఆయనగారికి ‘తటస్థ, పారదర్శక, విశ్వసనీయ’ దర్యాప్తు కావాలట! అసలు తన ఎన్నికే సంశయాస్పదమైంది. పాక్‌ సైన్యం అండదండలతో అందలమెక్కిన చరిత్ర షెహబాజ్‌ది. 2016నాటి పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి తర్వాత జరిగిన ఇరు దేశాల సంయుక్త దర్యాప్తును నీరు గార్చిందెవరు? పాక్‌ ప్రతినిధులు మన దేశం వచ్చి దర్యాప్తులో పాల్గొని వెళ్లగా, మన ప్రతినిధి బృందాన్ని మాత్రం పాక్‌ గడ్డపైకి అనుమతించని వైనం, తాము సేకరించిన సాక్ష్యాలను భారత్‌తో పంచుకోని తీరు షెహబాజ్‌ మరిచారా? 2008 నాటి ముంబై పేలుళ్ల ఉదంతంలో ఇచ్చిన సాక్ష్యాధారాలకు ఏ గతి పట్టించారో గుర్తులేదా? అణ్వాయుధ దాడికి సిద్ధమంటూ బెదిరింపులకు దిగుతున్న పాక్‌ దుష్ట పన్నాగాలను ప్రపంచ దేశాలకు తెలియజెప్పాలి. అందుకు దౌత్యపరంగా మరింత కృషి చేయాలి. దాంతోపాటు అన్నివిధాలా సంసిద్ధతలు పెంపొందించుకోవాలి. సామాజిక మీడియాలో కశ్మీరీలపై విద్వేషాన్ని కక్కే అవాంఛనీయ శక్తుల ఆటకట్టించాలి. ఇది కలసికట్టుగా నిలబడాల్సిన కాలమని చాటాలి.

Sakshi Guest Column On Should we oppose if we disagree6
విభేదిస్తే వ్యతిరేకించాలా?

‘అధికారం చెడగొడుతుంది. సంపూర్ణ అధి కారం సంపూర్ణంగా చెడగొడుతుంది.’ లార్డ్‌ జాన్‌ డల్బర్గ్‌ 1887లో చెప్పిన మాట ఇది. అధికారం అహంకారం కూడా తెస్తుంది,సంపూర్ణ అధికారం సంపూర్ణ అహంకారం తెస్తుంది... ఇది నేటి మాట. ఈ అహంకారానికి అవమానించే గుణం తోడవుతోంది. అహంకారులు భిన్నస్వరాన్ని భరించలేరు. అణచివేస్తారు. ఇండియాలోనే కాదు, అమెరికా తదితర అనేక దేశాల్లోనూ ఈ ధోరణి ప్రబలుతోంది.స్వేచ్ఛ కాగితాలకే పరిమితమా?అధికార పార్టీ నేతల పట్ల వ్యతిరేక భావాలు వ్యక్తం చేస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. అలాంటి వారిపై భౌతిక దాడులు జరుగుతాయి. ప్రభుత్వ ఏజన్సీలు వారిని వేటాడతాయి. తప్పుడు కేసుల్లో ఇరికిస్తారు. రాజకీయ, సామాజిక రంగాల్లో అసమ్మతి ప్రకటించే వారి పట్లే ఈ తృణీకార ధోరణి ఇంతకాలం పరిమితమైంది. కానీ ఇప్పుడిది ఎల్లలు దాటింది. ఆఖరికి న్యాయవ్యవస్థను కూడా వదిలిపెట్టని దుఃస్థితి దాపురించింది. తమ మాటకు తలొగ్గని వారు ఎవరైనా వారికి ఒకటే. న్యాయస్థానాలు, న్యాయమూర్తులు ఇందుకు మినహాయింపు కాదు. తమతో విభేదించిన న్యాయవ్యవస్థ వారి అవమానానికి గురవుతోంది.చిన్నప్పుడు మనకు స్కూల్లో ఏం చెప్పేవారు? చట్ట సభలు ప్రజా స్వామ్య పీఠాలనీ, సభ్యులకు అక్కడ భయం లేకుండా మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందనీ చెప్పేవారు కదా! నిజానికి అవన్నీ కాగితాలకే పరిమితం. ప్రజలెన్నుకున్న ప్రతినిధులు చట్టసభల్లో అధికార పక్షంతో విభేదించి తమ గొంతు వినిపించగలుగుతున్నారా? అధికార పార్టీ సభ్యులు గానీ, అధ్యక్ష స్థానంలో ఉన్నవారు గానీ వారిని అందుకు అనుమతించడం లేదు. శాసన నిర్మాణ సంస్థల స్థాయి పెరిగే కొద్దీ వాటిలో ఈ ధోరణీ హెచ్చుతోంది.ప్రతిపక్ష సభ్యుల గొంతు వినబడకుండా అరుపులు కేకలతో పాలకపార్టీ సభ్యులు వారిని నిరోధించడం సర్వసాధారణమైంది. ఒక వేళ వారా పని చేయలేకపోతే, సభాధ్యక్షులు జోక్యం చేసుకుని ప్రతి పక్ష సభ్యుల మాటలను రికార్డుల నుంచి తొలగిస్తారు, మైకులు కట్‌ చేస్తారు. లేదంటే మాట్లాడే అవకాశం ఇవ్వరు. ఇచ్చినా తగినంత సమయం కేటాయించరు.తటస్థత చూపనక్కర్లేదా?అత్యున్నత పార్లమెంటరీ సంప్రదాయం ప్రకారం, దిగువ సభ స్పీకర్, ఎగువ సభ చైర్మన్‌ తమ రాజకీయ అనుబంధాలను పక్కన పెట్టి విధి నిర్వహణలో తటస్థంగా ఉండాలి. కానీ చాలా సందర్భాల్లో ఇలా జరగటం లేదు. ఈ సంప్రదాయం నుంచి వారు వైదొలగుతున్నారు. కింది స్థాయి చట్టసభల్లోనే కాదు, లోక్‌సభలో, రాజ్యసభలో సైతం ఇదే జరుగుతోంది. ఉదాహరణకు, రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ను చూడండి. బీజేపీతో ఆయన తన అనుబంధాన్ని వీడలేక పోతున్నారు. పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ పదవిలో ఉన్నప్పుడు కూడా ఇలాగే వ్యవహరించారు. ఇప్పుడూ అదే ధోరణి కొనసాగిస్తున్నారు. ఆయన కళ్లన్నీ రాష్ట్రపతి పదవి మీదున్నాయి. అధినాయకుడి అను గ్రహం ఉంటేనే ఆ కల నెరవేరుతుంది. అందుకోసం ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఆయనొక్కడే కాదు, అలాంటివారు పార్లమెంటులో చాలామంది ఉన్నారు. తగిన అర్హతలు లేకున్నా అధి నాయకుడి పట్ల విధేయత అనే ఒక్క అర్హతతో వారు మహనీయమైన ఉన్నత పదవులు పొందగలిగారు. గొప్ప మేధావులు ఎందరో ధన్‌ ఖడ్‌కు ముందు ఆ పదవిని అలంకరించారు. అత్యున్నత ప్రజాస్వా మిక విలువలతో వారంతా తమ పదవికి వన్నె తెచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142ని అణు క్షిపణిగా పేర్కొంటూ ధన్‌ ఖడ్‌ ఈ మధ్య ఒక తూటా పేల్చారు (సంపూర్ణ న్యాయం చేయడం కోసం సుప్రీంకోర్టుకు విస్తృత విచక్షణాధికారాలను కట్టబెట్టే ఆర్టికల్‌ ఇది). ఇది కేవలం ఒక రాజకీయ ప్రకటన మాత్రమే! ఆ అధికరణంపై సమగ్ర సమీక్ష, అవగాహనతో చేసిన వ్యాఖ్య కాదు! తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన ప్రకటన వెలువడింది. గవర్నర్లు చట్టసభలు చేసిన బిల్లులకు తప్పనిసరిగా సమ్మతి ఇవ్వాలన్నది తీర్పు సారాంశం. ఈ మధ్యకాలంలో చాలా మంది గవ ర్నర్లు కేంద్రానికి పక్క వాద్యకారులుగా పని చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా ఉన్నప్పుడు ధన్‌ఖడ్‌ సైతం ఇలాగే చేశారు. కాబట్టి, అత్యున్నత న్యాయస్థానం ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం సబబే! ఆయన ఆర్టికల్‌ 142ని అణు క్షిపణిగా పేర్కొనడం... శాసన, న్యాయ వ్యవస్థల నడుమ ఉండాల్సిన అధికార సమతుల్యతను తిర స్కరించడమే అవుతుంది. ఇలా వ్యాఖ్యానించి, రాజ్యాంగ నిర్మాతల విజ్ఞతకు ఆయన సవాలు విసిరారు. ఇది మరీ తీవ్రమైన అంశం. నైతికత సారథులుగా వ్యవహరించాలి!రాష్ట్రపతి మూడు నెలల్లో బిల్లుపై నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు గడువు విధించడాన్ని ధన్‌ఖడ్‌ తప్పు పట్టారు. అయితే, మనం ఉన్నది రాజరిక వ్యవస్థలో కాదనీ, మనది ప్రజాస్వామ్యం అనీ ఉప రాష్ట్రపతి గుర్తు పెట్టుకోవాలి. రాష్ట్రపతి పౌరులకు జవాబుదారీ కనుక, న్యాయవ్యవస్థకు లోబడి ఉండాలని మర్చిపోకూడదు. చట్టం తు.చ. తప్పకుండా అమలయ్యేట్లు చూడటంతో పాటు, ఆ శాసన ఆదేశాల ఉద్దేశం ఏమిటో గ్రహించడం కూడా న్యాయ వ్యవస్థ విధి.శాసన, న్యాయ వ్యవస్థల నడుమ అధికార విభజన గురించి స్పష్టంగా చెప్పిన వాళ్లలో మాంటెస్క్యూ ఒకరు. ‘ద స్పిరిట్‌ ఆఫ్‌ లా’ (1748) పుస్తకంలో ఆయన దీన్ని గురించి చర్చించారు: శాసన, కార్య నిర్వాహక అధికారాలు ఒకే వ్యక్తి వద్ద లేదా న్యాయాధికారుల బృందం చేతిలో ఉంటే స్వేచ్ఛ బతకదు. అందుకే వాటి నుంచి న్యాయాధికారాన్ని వేరు పరచాలి. మూడు అధికారాలు ఒకే వ్యక్తి లేదా ఒకే సంస్థ చలాయించేట్లయితే అన్నీ నాశనమవుతాయి... ఇదీ ఆయన సిద్ధాంతం. దేశంలో ‘సివిల్‌ వార్‌’కు సుప్రీంకోర్టు బాధ్యత వహించాలని బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దూబే వ్యాఖ్యానించారు. ధన్‌ఖడ్‌ ప్రకటన వెలువడిన వెంటనే ఆయన ఈ మాటలన్నారు. హిందూ రాష్ట్ర స్థాపన తమ ధ్యేయమని బీజేపీ నాయకత్వం పదేపదే ప్రకటిస్తోంది. ఈ సందర్భంగా, బీజేపీ నాయకత్వం శామ్యూల్‌ టేలర్‌ కొలరిజ్‌ రాసిన ‘ద స్టేట్స్‌మన్స్‌ మాన్యువల్‌’ చదివి తీరాలి. రాజకీయ నాయకులు తమ నిర్ణయాలు నైతిక, ఆధ్యాత్మిక విలువలకు అనుగుణంగాఉండేట్లు జాగ్రత్త వహించాలి. తమను తాము నైతికత సారథులుగా భావించాలి. కేవలం వ్యావహారిక నైపుణ్యం, ప్రయోజకత్వం మీద ఆధారపడే రాజకీయాలను ఆయన విమర్శిస్తాడు. బదులుగా, పవిత్ర గ్రంథాల్లోని దివ్యజ్ఞానం ప్రాతిపదికగా ఉండే సూత్రప్రాయ విధానా లను అనుసరించాలని కొలరిజ్‌ సూచిస్తాడు. తద్వారా రాజనీతిజ్ఞులు ప్రజలకు సమర్థమైన పాలన అందించడంతో పాటు సమాజాన్ని నైతికంగానూ ఉన్నతస్థితికి చేర్చగలరని హితవు పలికాడు.అభయ్‌ మోకాశీవ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్, మీడియా ట్రెయినర్‌

IPL 2025: Rajasthan Royals beat Gujarat Titans7
IPL 2025: విధ్వంసంలో వైభవం

సచిన్‌ వేగాన్ని ఆరాధించాం.సెహ్వాగ్‌ దూకుడును చూశాం. రో‘హిట్స్‌’ను ఆస్వాదించాం. కోహ్లి ‘షో’కు ముచ్చటపడ్డాం. వీళ్లందరూ ప్రొఫెషనల్‌ క్రికెటర్లు. కానీ వైభవ్‌ సూర్యవంశీ మాత్రం కాదు. 14 ఏళ్ల ఈ కుర్రాడు ఓ అనామకుడు. ఇంకా చెప్పాలంటే ఈ మ్యాచ్‌కు ముందు బహుశా చాలా మందికి అతనెవరో తెలియదు. కానీ తెలుసుకుంటారు. నెట్టింట గూగుల్‌లో సెర్చ్‌ చేస్తారు. ‘లైక్‌’లు కొట్టే షాట్లను ఫోన్‌ కెమెరాల్లో బంధించారు. ‘షేర్‌’ చేసే సమయం ఇవ్వనంతగా సిక్స్‌ల ‘షో’ చూశారు. 35 బంతుల సెంచరీకి ‘సబ్‌ స్క్రైబ్‌’ అయిపోయారు. ఐపీఎల్‌ కొత్త వైభవానికి పండగ చేసుకున్నారు. జైపూర్‌: ఐపీఎల్‌ 2008లో పుట్టింది. లీగ్‌ పుట్టిన మూడేళ్ల (2011లో) తర్వాత లోకం చూసిన బుడ్డొడిని పురుడు పోసిన కొద్దిమందే చూశారు! 14 ఏళ్లు తిరిగేసరికి ఇప్పుడా కుర్రాడిని మొత్తం క్రికెట్‌ ప్రపంచమే చూసి మురిసింది. అ బుడ్డొడు... ఇప్పటి కుర్రాడు... వైభవ్‌ సూర్యవంశీ. ఐపీఎల్‌లో అతనొక సంచలనం. బ్యాటింగ్‌ మెరుపులకే వై¿ోగం. క్రికెట్‌ ప్రేక్షకులకి కనుల పండగ అతని శతకం. బంతి సిక్స్‌లకే ఫిక్స్‌ అయినట్లు... అతని బ్యాట్‌ షాట్‌లకే అలవాటైనట్లు... అతని ‘షో’కు బంతులన్నీ దాసోహమైనట్లు అలవోకగా ఆడేశాడు. వైభవ్‌ (38 బంతుల్లో 101; 7 ఫోర్లు, 11 సిక్స్‌లు) శతకానికి జైపూర్‌లో నిశిరాతిరి కూడా వెలుగులు విరజిమ్మింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీస్కోరు చేసింది. శుబ్‌మన్‌ గిల్‌ (50 బంతుల్లో 84; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), జోస్‌ బట్లర్‌ (26 బంతుల్లో 50 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో కదంతొక్కారు. అనంతరం రాజస్తాన్‌ రాయల్స్‌ 15.5 ఓవర్లలోనే కేవలం రెండే వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసి గెలిచింది. యశస్వీ జైస్వాల్‌ (40 బంతుల్లో 70 నాటౌట్‌; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగాడు. ఫిఫ్టీలో 48 పరుగులు... సిక్స్‌లు, ఫోర్లతోనే... పెద్ద లక్ష్యం... ఛేదించడం కష్టం... ఇలాంటి పరిస్థితుల మధ్య పరుగుల వేట మొదలుపెట్టిన యశస్వి జైస్వాల్, వైభవ్‌ సూర్యవంశీ పరుగుల ఉప్పెన చూపెట్టారు. ముఖ్యంగా 14 ఏళ్ల వైభవ్‌ ఆట అసాంతం హైలైట్స్‌నే తలపించింది. సూర్యవంశీ షాట్ల ఎంపిక, సిక్స్‌ల తుఫాన్‌ ఒక్క మైదానాన్నే కాదు... క్రికెట్‌ ప్రపంచాన్నే తనవైపు తిప్పుకుంది. జైస్వాల్‌ పరుగుతో మొదలైన తొలిఓవర్‌ వైభవ్‌ సిక్సర్‌తో ఊపందుకుంది. రెండో ఓవర్లో యశస్వి సిక్స్‌ బాదడంతో రెండు ఓవర్లలో 19 పరుగులు వచ్చాయి. కానీ ఆ తర్వాతే విధ్వంసరచన మొదలైంది. సిరాజ్‌ మూడో ఓవర్లో జైస్వాల్‌ 3 ఫోర్లు కొట్టాడు. 3 ఓవర్లలో జట్టు స్కోరు 32. అప్పటికింకా వైభవ్‌ (9) పది పరుగులైనా చేయలేదు. ఇషాంత్‌ నాలుగో ఓవర్‌తో అతని షో మ్యాచ్‌ రూపాన్ని మార్చింది. 6, 6, 4, 0, 6, వైడ్, వైడ్, 4లతో ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. తర్వాత ఐదో ఓవర్లో జైస్వాల్‌ బౌండరీ, సింగిల్‌ తీసివ్వగా, వైభవ్‌ 6, 0, 6, 4... ఈ బౌండరీతోనే 17 బంతుల్లోనే అతని ఫాస్టెస్ట్‌ అర్ధసెంచరీ అది కూడా ఐదో ఓవర్లోనే పూర్తయ్యింది. ఇందులో 3 బౌండరీలు, 6 సిక్స్‌లు అంటే 48 పరుగులు మెరుపులే! ఇలా ‘పవర్‌ ప్లే’నే పరుగెత్తుకున్న చందంగా, బౌండరీ లైన్‌–బంతి ముద్దు ముచ్చటలాడిన విధంగా అతని విధ్వంసం సాగింది. 35 బంతుల్లో భారతీయ శతకం రాయల్స్‌ జట్టు 6 ఓవర్లలో 87/0 స్కోరు చేసింది. జైస్వాల్‌ కొట్టిన వరుస బౌండరీలతో ప్రసిధ్‌ కృష్ణ 8వ ఓవర్లో జట్టు స్కోరు వందను దాటింది. ఇంకా డజను ఓవర్లు మిగిలివుంటే చేయాల్సిన లక్ష్యం (102) సగం కంటే తక్కువగా కరిగింది. ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన కరీమ్‌ జనత్‌ వేసిన పదో ఓవర్లో అయితే వైభవ్‌ వీరబాదుడికి సిక్స్, ఫోర్‌ పోటీపడినట్లుగా అనిపించింది. 6, 4, 6, 4, 4, 6లతో 30 పరుగుల్ని రాబట్టాడు. 10 ఓవర్లలో 144/0 స్కోరు చేసింది. రషీద్‌ఖాన్‌ వేసిన మరుసటి ఓవర్లోనే మిడ్‌వికెట్‌ మీదుగా బాదిన సిక్స్‌తో వైభవ్‌ సెంచరీ 35 బంతుల్లోనే పూర్తయ్యింది. గేల్‌ (30 బంతుల్లో) తర్వాత ఐపీఎల్‌ చరిత్రలో రెండో వేగవంతమైన శతకం కాగా... భారత ఆటగాడు కొట్టిన తొలి ఫాస్టెస్ట్‌ సెంచరీగా పుటలకెక్కింది. 12వ ఓవర్లో వైభవ్‌ను బౌల్డ్‌ చేయడం ద్వారా ప్రసిధ్‌ కృష్ణ తొలివికెట్‌ను తీశాడు. 166 పరుగుల ఓపెనింగ్‌ వికెట్‌కు తెరపడింది. నితీశ్‌ (4) విఫలమైనా... మిగతా లాంఛనాన్ని జైస్వాల్, కెపె్టన్‌ రియాన్‌ పరాగ్‌ (15 బంతుల్లో 32 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా అంతే వేగంగా ముగించారు. స్కోరు వివరాలు గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సాయి సుదర్శన్‌ (సి) పరాగ్‌ (బి) తీక్షణ 39; గిల్‌ (సి) పరాగ్‌ (బి) తీక్షణ 84; బట్లర్‌ (నాటౌట్‌) 50; వాషింగ్టన్‌ సుందర్‌ (సి) హెట్‌మైర్‌ (బి) సందీప్‌ 13; తెవాటియా (ఎల్బీడబ్ల్యూ) (బి) ఆర్చర్‌ 9; షారుఖ్‌ ఖాన్‌ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–93, 2–167, 3–193, 4–202. బౌలింగ్‌: ఆర్చర్‌ 4–0–49–1, తీక్షణ 4–0–35–2, యు«ద్‌వీర్‌ 3–0–38–0, సందీప్‌ శర్మ 4–0–33–1, పరాగ్‌ 1–0–14–0, హసరంగ 4–0–39–0. రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (నాటౌట్‌) 70; వైభవ్‌ (బి) ప్రసిధ్‌ కృష్ణ 101; నితీశ్‌ రాణా (ఎల్బీడబ్ల్యూ) (బి) రషీద్‌ ఖాన్‌ 4; పరాగ్‌ (నాటౌట్‌) 32; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (15.5 ఓవర్లలో 2 వికెట్లకు) 212. వికెట్ల పతనం: 1–166, 2–171. బౌలింగ్‌: సిరాజ్‌ 2–0–24–0, ఇషాంత్‌ 2–0–36–0, సుందర్‌ 1.5–0–34–0, ప్రసిధ్‌ కృష్ణ 4–0–47–1, రషీద్‌ 4–0–24–1, కరీమ్‌ 1–0–30–0, సాయి కిషోర్‌ 1–0–16–0. వైభవ్‌ సూర్యవంశీ రికార్డులు → టి20 క్రికెట్‌ చరిత్రలో సెంచరీ చేసిన పిన్న వయసు్కడిగా వైభవ్‌ (14 ఏళ్ల 32 రోజులు) ప్రపంచ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు భారత్‌కే చెందిన మహారాష్ట్ర ప్లేయర్‌ విజయ్‌ జోల్‌ (18 ఏళ్ల 118 రోజులు; ముంబైపై 2013లో) పేరిట ఉంది. → ఐపీఎల్‌లో అర్ధ సెంచరీ, సెంచరీ చేసిన పిన్న వయస్కుడిగా వైభవ్‌ ఘనత వహించాడు. గతంలో అర్ధ సెంచరీ రికార్డు రియాన్‌ పరాగ్‌ (17 ఏళ్ల 175 రోజులు; 2019లో) పేరిట, సెంచరీ రికార్డు మనీశ్‌ పాండే (19 ఏళ్ల 253 రోజులు; 2009లో) పేరిట నమోదయ్యాయి. → ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన భారతీయ ప్లేయర్‌గానూ వైభవ్‌ గుర్తింపు పొందాడు. యూసుఫ్‌ పఠాన్‌ (37 బంతుల్లో ముంబై ఇండియన్స్‌పై 2010లో) పేరిట ఉన్న రికార్డును వైభవ్‌ బద్దలు కొట్టాడు. క్రిస్‌ గేల్‌ (30 బంతుల్లో 2013లో పుణే వారియర్స్‌పై) తర్వాత ఐపీఎల్‌లో రెండో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన ప్లేయర్‌ వైభవే కావడం విశేషం.చాలా ఆనందంగా ఉంది. ఐపీఎల్‌లో ఆడిన మూడో ఇన్నింగ్స్‌లోనే సెంచరీ చేయడం సంతోషం. మూడు, నాలుగు నెలల నుంచి పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. నేను బౌలర్లు ఎవరనే విషయాన్ని పెద్దగా పట్టించుకోను. కేవలం బంతి మీదే దృష్టి పెడతా. యశస్వి జైస్వాల్‌తో కలిసి బ్యాటింగ్‌ చేయడం సౌకర్యవంతంగా ఉంటుంది. అవసరమైనప్పుడు సలహాలు ఇవ్వడంతో పాటు ఆత్మవిశ్వాసం నింపుతాడు. దీంతో బ్యాటింగ్‌ చేయడం సులువవుతుంది. ఐపీఎల్‌లో సెంచరీ చేయాలన్నది నా కల. క్రీజులో అడుగు పెట్టాక భయపడను. అసలు వేరే ఏ అంశాలను పట్టించుకోను. కేవలం నా ఆటపైనే దృష్టి పెడతా. –వైభవ్‌ సూర్యవంశీ

Bill Gates Explains Why He Did Not Fund Daughter Phoebes8
సొంతంగా స్టార్టప్.. కుమార్తెపై బిల్‌గేట్స్ ప్రశంసల వర్షం

తల్లిదండ్రులు ఎంత సంపాదించినా.. వారి ఆస్తి నుంచి చిల్లిగవ్వ తీసుకోకుండా ఎదిగేవాళ్ళు చాలా తక్కువమందే ఉంటారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు.. బిల్‌గేట్స్ కుమార్తె 'ఫోబ్ గేట్స్' (Phoebe Gates). ఈమె తండ్రిపై ఆధారపడకుండానే.. సొంతంగా స్టార్టప్ కోసం నిధులను సమకూర్చుకుంది. ఇది తనకు చాలా సంతోషంగా ఉందని టెక్ బిలియనీర్ న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.తన కుమార్తె ఫోబ్ గేట్స్.. తన స్టార్టప్ కోసం నిధులను సేకరించే క్రమంలో, తన దగ్గరకు వస్తుందని నేను ఊహించాను. ఒకవేళ తను నన్ను సహాయం చేయమని అడిగి ఉంటే.. తప్పకుండా చేసేవాణ్ణి. అయితే కొన్ని షరతులు కూడా పెట్టేవాడినని బిల్‌గేట్స్ అన్నారు. అయితే నిధుల కోసం నన్ను సంప్రదించకుండా.. సొంతంగా సమకూర్చుకున్న కూతురిపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.22 ఏళ్ల ఫోబ్ గేట్స్.. తన స్నేహితురాలు సోషియా కియానీతో కలిసి 'ఫియా' అనే స్టార్టప్ ప్రారంభించారు. ఇది ఒక సిజిటల్ ఫ్యాషన్‌ ప్లాట్‌ఫామ్‌. ఇందులో సుమారు 40,000 కంటే ఎక్కువ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉన్న దుస్తుల ధరలను వెల్లడిస్తుంది. వినియోగదారులకు ఫ్యాషన్‌ ఉత్పత్తుల మీద బెస్ట్ డీల్స్‌ అందించడంతో పాటు.. ఆన్‌లైన్‌ షాపింగ్‌ అనుభవాన్ని మరింత మెరుగుపరచడమే దీని ప్రధాన లక్ష్యం.ఇదీ చదవండి: నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..2024లో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన.. ఫోబ్ గేట్స్ తన స్టార్టప్ కోసం వెంచర్ క్యాపిటలిస్టులు & ఏంజెల్ ఇన్వెస్టర్ల నుంచి సుమారు 500000 డాలర్ల కంటే ఎక్కువ నిధులను సేకరించింది. సుమారు 102.2 బిలియన్ డాలర్ల సంపద కలిగిన తన తండ్రి బిల్‌గేట్స్ సహాయం పొందకుండా.. స్టార్టప్ ప్రారభించడం గొప్ప విషయం అని పలువు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బిల్ గేట్స్ తన మాజీ భార్య మెలిండా ఫ్రెంచ్ గేట్స్ తో ముగ్గురు పిల్లలను కన్నారు. వారు జెన్నిఫర్ (28), రోరీ (25), ఫోబ్.

Andhra Pradesh Rajya Sabha name Confirmed9
ఏపీ రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారు

అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌ రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారు అయ్యారు. బీజేపీ నేత, భీమవరానికి చెందిన పాక వెంకటసత్యనారాయణ(Paka Venkata Satyanarayana)ను ఎంపిక చేసింది ఆ పార్టీ. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. కూటమి అభ్యర్థిగా రేపు ఆయన నామినేషన్‌ వేయబోతునున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఈ సీటు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. తొలుత తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్‌ అన్నామలైకు అవకాశం దక్కవచ్చనే ప్రచారం జరిగింది. చివరకు ఏపీ నేతకే ఆ అవకాశం దక్కింది. ప్రస్తుతం ఏపీ బీజేపీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా ఉన్నారు పాక వెంకటసత్యనారాయణ. గతంలో భీమవరం కౌన్సిలర్‌గా, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పని చేశారీయన.

Mega Power Outage Hits Spain, France, Portugal10
స్తంభించిన విద్యుత్‌.. మూడు దేశాలు అతలాకుతలం

మాడ్రిడ్: విద్యుత్ సప్లై పూర్తిగా నిలిచిపోవడంతో మూడు ఐరోపా దేశాలు అతలాకుతలమవుతున్నాయి. పవర్ గ్రిడ్ లో తీవ్రమైన సమస్యలు తలెత్తడంతో స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్‌ దేశాలు పూర్తిగా స్తంభించిపోయాయి.ప్రస్తుతం పవర్ గ్రిడ్ తిరిగి పునరుద్దరించే పనిలో పడ్డ మూడు దేశాలు.. సోమవారమంతా చీకటిలో మగ్గిపోయాయి. విమానాల రాకపోకల్లో తీవ్ర సమస్యలే కాకుండా భారీ ట్రాఫిక్ జామ్ లు వంటి ఘటనలు ఆ దేశాల్లో తల్తెతాయి. దీనిపై ఆయా దేశాలు అత్యవసరంగా క్యాబినెట్ భేటీ నిర్వహించి పవర్ గ్రిడ్ ను పునరుద్దరించేందుకు కసరత్తులు చేస్తున్నాయి. ఎక్కడికక్కడే నిలిచిపోయిన రైళ్లు..చిమ్మ చీకటిలో గడుపుతున్న ఈ మూడు దేశాల్లో మెట్రో సేవలు ఉన్నపళంగా నిలిచిపోయాయి. . రైళ్లు కూడా ఎక్కడికక్కడి స్తంభించిపోయాయి. . దీంతో ఆయా దేశాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సంక్షోభంపై ఇప్పటివరకూ ఎటువంటి క్లారిటీ లేకపోవడంతో జనాలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. మాడ్రిడ్ లోని నాలుగు టవర్ బిల్డింగ్ ల్లో ఒక దాన్ని ఖాళీ చేయించారు. ఇందులో బ్రిటీష్ ఎంబాసీ పనిచేస్తున్న దరిమిలా ఆ కార్యాలయాన్ని ఆకస్మింగా ఖాళీ చేయించారు.ఆఫీసులు వదిలి.. రోడ్లపైనేతీవ్రమైన విద్యుత్ సంక్షోభంతో కార్యాలయాలు ఏవీ పని చేయడం లేదు. ఆఫీసులకు వచ్చిన ఉద్యోగులు.. రోడ్లపైనే తిరుగుతూ కాలయాపన చేస్తున్నారు. అయితే దీనిపై స్పానిష్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ ఆపరేట్ రెడ్ ఎలక్ట్రికా స్పందించింది. విద్యుత్ ను తిరిగి పునరుద్దరించే క్రమంలో స్థానిక విద్యుత్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. అన్ని యూరోపియన్ విద్యుత్ యూనియన్లను సమన్వయం చేసుకుంటూ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు తాత్కాలిక ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement