Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Pahalgam Attack  April 23rd Latest updates1
పహల్గాం ఉగ్రదాడి.. సరిహద్దులో పాక్‌ కవ్వింపు చర్యలు

పహల్గాం ఉగ్రదాడి.. కేంద్రం సీరియస్‌.. అప్‌డేట్స్‌ఉగ్రవాదుల్లో ఇద్దరు కశ్మీరీలే!పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల గుర్తింపుఇద్దరు కశ్మీరీలేనని అనుమానిస్తున్న భద్రతా ఏజెన్సీలు2018లో కశ్మీర్‌ను వదిలి పాక్‌ వెళ్లిపోయిన అదిల్‌ గురి, అషన్‌ఇటీవలే మరో నలుగురితో కలిసి కశ్మీర్‌లో చొరబడినట్లు అనుమానంఅదిల్‌, అషన్‌ గురించి సమాచారం సేకరిస్తున్న భద్రతా బలగాలుపాక్‌ మద్దతుదారుల నుంచి వీళ్లకు మందు గుండు సామాగ్రి, ఏకే 47లునిల్వ ఆహారం, డ్రైఫూట్స్‌ ఉంచుకున్నట్లు అనుమానాలుమతాలవారీగా టూరిస్టులను వేరు చేసిన ఉగ్రవాదులుపాయింట్‌ బ్లాక్‌ రేంజ్‌లో టూరిస్టులను కాల్చేసిన టెర్రరిస్టులుహెల్మెట్‌ మౌంటెడ్‌ బాడీ కేమ్‌లతో రికార్డు చేసి పాక్‌కు చేరవేసి ఉండొచ్చనే అనుమానాలు పాక్‌ కవ్వింపు చర్యలుపాక్‌ దొంగ నాటకాలుపహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌ కవ్వింపు చర్యలుసరిహద్దు వెంట భారీగా సైన్యం మోహరింపుకశ్మీర్‌ సరిహద్దులకు యుద్ధ విమానాల తరలింపుకరాచీ నుంచి లాహోర్‌, రాల్పిండికి యుద్ధ విమానాలుపహల్గాం దాడితో తమకేం సంబంధం లేదని ప్రకటించిన పాక్‌ ప్రభుత్వందాడి ఘటనను ఖండిస్తూ.. మరణించినవారి కుటుంబాలకు సానుభూతి ప్రకటనమమ్మల్ని నిందించొద్దు అంటూ పాక్‌ రక్షణ మంత్రి వ్యాఖ్యలుభారత్‌లో పలు రాష్ట్రాల్లో గొడవలు జరుగుతున్నాయని.. అంతర్గత తిరుగుబాటులే పహల్గాం దాడికి కారణమంటూ ప్రకటనఉగ్రవాదులకు సాయం చేసింది పాక్‌ ఐఎస్‌ఐనే పరిహారం ప్రకటించిన జమ్ము ప్రభుత్వంపహల్గాం ఉగ్రదాడి బాధితులకు పరిహారం ప్రకటించిన జమ్ము కశ్మీర్‌ ‍ప్రభుత్వంమృతులకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడినవాళ్లకు రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వాళ్లకు రూ.1 లక్షదాడికి నిరసనగా కశ్మీర్‌ బంద్‌కు పిలుపు ఇచ్చిన ప్రజా సంఘాలు పహల్గాం ఊచకోతను ఖండిస్తూ సుప్రీం కోర్టు ఏకగ్రీవ తీర్మానంపహల్గాం ఉగ్రఘటన.. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నివాళి ఉగ్రదాడి మృతులకు సంతాపంగా మౌనం పాటించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది ఈ దారుణ ఘటనను ఖండించిన సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్రం ఆపరేషన్‌కశ్మీర్‌, పీవోకేలో ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్రం ఆపరేషన్‌?ప్రధాని మోదీ, రక్షణ మంత్రి వరుస సమావేశాలుహోం మంత్రి అమిత్‌ షా క్షేత్రస్థాయి పర్యటనకశ్మీర్‌ పరిస్థితులను ప్రధాని మోదీకి వివరించిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో త్రివిధ దళాధిపతుల సమావేశంకేంద్రం ఆదేశాల అమలుకు సిద్ధమంటున్న త్రివిధ దళాధిపతులుపహల్గాం ఉగ్రదాడి ప్రధానాంశంగా.. సాయంత్రం కేంద్ర కేబినెట్‌ సమావేశంసమావేశం అనంతరం కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం పహల్గాంలో కూంబింగ్‌పహల్గాంలో కొనసాగుతున్న కూబింగ్‌ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న వేటఒకవైపు.. క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న బలగాలుమరోవైపు డ్రోన్‌ల సాయంతో కొనసాగుతున్న గాలింపుఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదలపహల్గాం దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదలముగ్గురి చిత్రాలను విడుదల చేసిన కేంద్రంఅందులో అసిఫ్‌ అనే ఉగ్రవాదిబాడీ క్యామ్‌ ధరించి దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులుమొత్తం ఏడుగురు దాడికి పాల్పడినట్లు చెబుతున్న ప్రత్యక్ష సాక్షులుకానీ, దాడికి పాల్పడింది ముగ్గురి నుంచి నలుగురే?దాడులకు పాల్పడింది తామేనంటూ ప్రకటించిన లష్కరే తోయిబా విభాగం ది రెసిస్టెంట్‌ ఫ్రంట్‌ పహల్గాం దాడిపై కేంద్రం సీరియస్‌రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశంప్రస్తుత పరిస్థితిని వివరించిన త్రివిధ దళాధిపతులుప్రతిచర్యకు సిద్ధమని ప్రకటనసాయంత్రం ఆరు గంటలకు కేబినెట్‌ కీలక సమావేశంమరోవైపు భద్రతా ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ భేటీ పలు నగరాల్లో హైఅలర్ట్‌దేశవ్యాప్తంగా పలు నగరాల్లో హైఅలర్ట్‌ క​శ్మీర్‌ పహల్గాం దాడితో అప్రమత్తమైన కేంద్రంఢిల్లీ, ముంబై సహా పలు నగరాలకు భద్రతాపరమైన హెచ్చరికలు జారీ చేసిన హోం శాఖ బైసరన్‌కు అమిత్‌ షాపహల్గాం బైసరన్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకాల్పులు జరిపిన ప్రాంతంలో పర్యటించిన షాప్రతి చర్య తప్పదని, ఉగ్రవాదులపై కఠిన చర్యలు ఉంటాయని బాధిత కుటుంబాలకు హోం మంత్రి హామీ నేటి ఐపీఎల్‌ మ్యాచ్‌లో సంఘీభావంపహల్గాం ఉగ్రదాడికి సంఘీభావం తెలుపుతున్న ప్రముఖులుఐపీఎల్‌ క్రికెటర్ల సంఘీభావంఇవాళ హైదరాబాద్‌ ఉప్పల్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌దాడికి సంఘీభావంగా నల్ల బ్యాడ్జీలు ధరించనున్న ప్లేయర్స్‌ఒక నిమిషం మౌనం పాటించనున్న ఆటగాళ్లుచీర్‌గర్ల్స్‌ ఉండబోరని ప్రకటించిన బీసీసీఐ రంగంలోకి ఎన్‌ఐఏపహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో రంగంలోకి దిగిన జాతీయ దర్యాప్తు సంస్థ బృందంహోటల్స్‌, లాడ్జిలను జల్లెడ పడుతున్న అధికారులుదాడి తర్వాత అడవుల్లోకి పరారైనట్లు చెబుతున్న ప్రత్యక్ష సాక్షులుఅయినప్పటికీ పహల్గాంను అదుపులోకి తీసుకుని తనిఖీలు చేపడుతున్న భద్రతా బలగాలుప్రత్యక్ష సాక్షులను ప్రశ్నిస్తున్న ఎన్‌ఐఏ టీం పలు రాష్ట్రాల్లో పాక్‌ వ్యతిరేక నిరసనలుపహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ దేశవ్యాప్త నిరసనలు రోడ్డెక్కిన ప్రజలుపాక్‌, ఉగ్రవాద వ్యతిరేక నినాదాలతో ర్యాలీలుఉగ్రవాదం నశించాలంటూ ఫ్లకార్డులతో ప్రదర్శన పహల్గాం ఉగ్రదాడిలో((Pahalgam Terror attack) మరణించిన మృతులకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా నివాళులర్పించారు. బుధవారం ఉదయం శ్రీనగర్‌ కంట్రోల్‌ రూంలో సైనిక గౌరవ వందనం నడుమ మృతదేహాలపై పుష్ప గుచ్ఛాలను ఉంచారాయన. అనంతరం దాడిలో గాయపడి అనంత్‌నాగ్‌ ఆస్పత్రిలో క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. #WATCH | Union Home Minister Amit Shah pays tributes to the victims of the Pahalgam terror attack, in Srinagar, J&K pic.twitter.com/tPRSj4ewUg— ANI (@ANI) April 23, 2025మంగళవారం రాత్రే శ్రీనగర్‌కు చేరుకున్న హోం మంత్రి అమిత్‌ షా(Amit Shah).. వివిధ భద్రతా బలగాల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించిన సంగతి తెలిసిందే. ఈ సమీక్షలో జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌సిన్హా కూడా పాల్గొన్నారు. ఈ ఉదయం మృతదేహాలకు ఆయన నివాళి అర్పించిన అనంతరం.. ప్రత్యేక విమానాల్లో మృతదేహాలను స్వస్థలాలకు తరలించనున్నారు. మరోవైపు.. పహల్గాం ఘటనకు కారకులైన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. అడవుల్లోకి పారిపోయిన ముష్కరుల కోసం డ్రోన్‌లతో భద్రతా బలగాలు గాలిస్తున్నాయి.జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం ఉగ్రవాదులు తెగబడ్డారు. ప్రకృతి అందాలను చూసి పరవశిస్తోన్న వారిపై పాశవికంగా దాడి చేసి 28 మందిని పొట్టన పెట్టకున్నారు. ఈ ఉగ్రవాద దాడి ఘటనపై ప్రపంచం మొత్తం స్పందించింది. అమాయకులపై జరిగిన ఈ హేయ చర్యను ప్రపంచ నాయకులు ఖండించారు. అమెరికా నుంచి రష్యా వరకు, ఇటలీ నుంచి ఇజ్రాయెల్ వరకు ప్రధాన నేతలు ఈ దాడిని తీవ్రంగా తప్పుబడుతూ, భారత్‌కు బలమైన సంఘీభావాన్ని ప్రకటించారు.

YS Jagan express grief on Pahalgam attack Two AP People Death2
పహల్గాం ఉగ్రదాడి.. ఏపీవాసుల మృతిపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

గుంటూరు, సాక్షి: పహల్గాం ఉగ్రదాడిలో తెలుగు ప్రజల మృతిపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జగన్‌.. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గాంలోని బైసరన్‌ లోయ మైదానాల్లో మంగళవారం మధ్యాహ్నాం సైనికుల దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో 28 మంది మరణించారు. ఇందులో విశాఖ వాసి చంద్రమౌళి, కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు ఉన్నారు. చంద్రమౌళి ఎస్‌బీఐ రిటైర్డ్‌ ఎంప్లాయి కాగా, మధుసూదన్‌ ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెఈలో సీనియర్‌ ఆర్కిటెక్ట్‌గా పని చేస్తున్నారు. ఈ ఇద్దరి మృతిని ధృవీకరించిన కేంద్ర హోం శాఖ.. ప్రత్యేక విమానంలో మృతదేహాలను స్వస్థలాలకు పంపించింది.ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించిన వైఎస్‌ జగన్‌.. పర్యాటకులను దారుణంగా కాల్చి చంపడం అమానవీయ చర్యగా పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందిన ఇద్దరు మృతి చెందడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలను కేంద్రం ప్రభుత్వం ఆదుకుని ఆండగా నిలవాలని వైఎస్‌ జగన్‌ కోరుతున్నారు.

Why Terrorists Choose Pahalgam Baisaran Valley For Attack Full Details3
పహల్గాం ఉగ్రదాడిలో విస్తుపోయే విషయాలు

ప్రభుత్వాధికారులను, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకునే పహల్గాం దాడి జరిగిందా? కాల్చి చంపే ముందు ఉగ్రవాదులు టూరిస్టుల ఐడీ కార్డులను ఎందుకు చెక్‌​ చేశారు?. పైగా మృతుల్లో ఐబీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ విభాగాల ఉద్యోగులే అధికంగా ఉండడం.. ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. పహల్గాం ఉగ్రదాడిలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.కశ్మీర్‌ గడ్డపై నరమేధానికి ఉగ్రవాదులు ఈ పర్యాటక ప్రాంతాన్నే ఎంచుకోవడం వెనుక భద్రతాధికారులు పలు కారణాలు చెబుతున్నారు. పహల్గాం పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసరన్‌ వ్యాలీ(baisaran valley)కి కశ్మీర్‌ ‘మినీ స్విట్జర్లాండ్‌’గా పేరుంది. శీతాకాలంలో మంచు దుప్పటి పర్చుకునే ఈ ప్రాంతం.. మిగతా కాలంలో పచ్చిక బయళ్లతో, ఫైన్ చెట్లతో.. యూరప్‌ అల్పైన్‌ లోయలను తలపిస్తుంటుంది. అందుకే దేశం నలుమూలల నుంచి పర్యాటకలకు వేసవిలో ఈ ప్రాంతానికి క్యూ కడుతుంటారు.‌ పైగా ల్యూలియన్‌ సరస్సుకు బైసరన్‌ వ్యాలీ బేస్‌గా ఉండడంతో పాటు ట్రెక్కింగ్‌ కోసం సాహస యాత్రికులు ఈ ప్రాంతానికి క్యూ కడుతుంటారు.అయితే పహల్గాం(pahalgam) బైసరన్‌ లోయకు ఉన్న ప్రత్యేకతలే.. ఉగ్రవాదులు సులువుగా చొరబడి అమాయకులపై దాడి చేయడానికి వీలు కలిపించింది. ఇక్కడి పచ్చదనం పాడు కాకూడదన్న ఉద్దేశంతో మోటార్‌ వెహికిల్స్‌ను అనుమతించరు. పహల్గాం టౌన్‌ నుంచి ఐదు కిలోమీటర్ల పాటు కాలినడకన లేదంటే పొట్టి గుర్రాలను(Pony) పర్యాటకులు ఆశ్రయించాల్సి ఉంటుంది. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం కోసం తీసుకున్న ఈ చర్యలు ఈ ప్రాంతాన్ని ఒంటరిని చేసేశాయి. తద్వారా అత్యవసర పరిస్థితుల్లో లేదంటే ఊహించని సంఘటనల సమయంలో చర్యలకు జాప్యం కలిగేలా చేశాయి. ప్రభుత్వాధికారులే లక్ష్యంగా.. పక్కా ప్లాన్‌తోనే బైసరన్‌ వ్యాలీలో ఉగ్రదాడి జరిగినట్లు స్పష్టమవుతోంది. మంగళవారం మధ్యాహ్నా సమయంలో (2.45గం.-3గం. ప్రాంతంలో) సైన్యం దుస్తుల్లో సమీప అడవుల నుంచి వచ్చిన బృందం.. టూరిస్టులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది. బాడీక్యామ్‌లు ధరించిన ముగ్గురు టెర్రరిస్టులు పర్యాటకులను ఒక చోటా చేర్చి.. వివరాలను ఆరా తీసి మరి కాల్చి చంపి ఆ దృశ్యాలను రికార్డు చేశారు. టూరిస్టులు పారిపోతున్న టైంలో స్నైఫర్‌ ఫైర్‌ చేశారు. అయితే ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఆరుగురు ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో 26 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. బైరసర్‌ వ్యాలీ దగ్గర వాహనాలు లేకపోవడంతో క్షతగాత్రుల తరలింపు మరింత ఆలస్యమైంది. భద్రతా బలగాలు కూడా కాస్త ఆలస్యంగానే అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈలోపు దట్టమైన అడవుల్లోకి ఉగ్రవాదులు పారిపోగలిగారు. జమ్ము కశ్మీర్‌లోనే అంత్యంత ప్రశాంతమైన పర్యాటక ప్రాంతంగా పేరు ఉన్న బైసరన్‌ వ్యాలీ.. నిన్నటి దాడితో ఆ పేరుపై నీలినీడలు కమ్ముకునేలా చేసుకుంది.ఎమోషనల్‌ పోస్టులుపహల్గాం ఉగ్రదాడి గురించి తెలిశాక.. చాలా మంది(సెలబ్రిటీలతో సహా) సోషల్‌ మీడియాలో బైసరన్‌ వ్యాలీ అనుభూతుల్ని పంచుకుంటున్నారు. గతంలో తాము అక్కడికి వెళ్లిన సందర్భంలో దిగిన చిత్రాలను షేర్‌ చేస్తూ.. ఉగ్రదాడిపై దిగ్‌భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతమైన ఆ నేల నెత్తురోడడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రాన్ని కోరుతున్నారు. 👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)#baisaranvalley. Kashmir. Had been there 2 years before with family. Can’t imagine today this tragic incidence has happened at the same place. My heart goes out to the victims, their families and all those tourist civilians who lost their life🙏 pic.twitter.com/MabmrYmG5F— Rakesh Banerjee (@RakeshB41201077) April 22, 2025 Most people refer to Baisaran Valley in Pahalgam as "Mini Switzerland" but I prefer to call it by its own name Baisaran. After all, it’s Kashmir, not Switzerland. Why would I compare such a breathtaking place in Kashmir to another country? Baisaran has its own unique charm.. pic.twitter.com/MDLDXl41L7— batukh (@Samaandar_) March 13, 2025

Pakistan Bowler Punches Own Teammate During PSL 2025 Match4
ఇలాంటివన్ని పాకిస్తాన్‌ క్రికెట్‌లోనే జరుగుతాయి.. సహచరుడికే ఇచ్చి పడేసిన బౌలర్‌

చిత్రవిచిత్ర ఘటనలన్నీ పాకిస్తాన్‌ క్రికెట్‌లోనే జరుగుతాయి. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2025లో భాగంగా ఓ ఆటగాడు వికెట్‌ తీసిన ఆనందంలో సొంత జట్టు ఆటగాడిపైనే దాడి చేశాడు (అనుకోకుండా). ఈ ఘటనలో బాధిత ఆటగాడి తలకు గాయమైంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.Update: Everyone is ok 🤗Khel Khel main 😄#HBLPSLX l #ApnaXHai l #MSvLQ pic.twitter.com/sJBcX91wai— PakistanSuperLeague (@thePSLt20) April 22, 2025ఇంతకీ ఏం జరిగిందంటే.. పీఎస్‌ఎల్‌ 2025లో భాగంగా నిన్న లాహోర్‌ ఖలందర్స్‌, ముల్తాన్‌ సుల్తాన్స్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముల్తాన్‌ సుల్తాన్స్‌ లాహోర్‌ ఖలందర్స్‌పై 33 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సుల్తాన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోర్‌ చేయగా.. ఛేదనలో తడబడిన ఖలందర్స్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 195 పరుగులకే పరిమితమైంది. ఖలందర్స్‌ను సుల్తాన్స్‌ బౌలర్‌ ఉబైద్‌ షా 3 వికెట్లు తీసి దెబ్బకొట్టాడు.ఈ ఉబైద్‌ షానే ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌లో వికెట్‌ (సామ్‌ బిల్లింగ్స్‌) తీసిన ఆనందంలో పొరపాటున సహచరుడు ఉస్మాన్‌ ఖాన్‌ (వికెట్‌కీపర్‌) తలపై దాడి చేశాడు. వికెట్‌ తీశాక సంబరాల్లో భాగంగా ఉబైద్‌ షా సహచరులకు హై ఫై ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఉస్మాన్‌ ఖాన్‌ కూడా తన చేయి పైకి లేపాడు. అప్పటికే జోరుమీదున్న ఉబైద్‌.. పొరపాటు ఉస్మాన్‌ చేయిపై కాకుండా తలపై హై ఫై ఇచ్చాడు. ఈ ఘటనతో దిమ్మతిరిగిపోయిన ఉస్మాన్‌ తల పట్టుకుని నేల వాలాడు. ఇది చూసి మైదానంలో ఉన్న వారంతా పక్కున నవ్వుకున్నారు.ఊహించని చర్యతో షాక్‌కు గురైన ఉస్మాన్‌ కొద్ది సేపు మైదానంలో పడిపోయాడు. ఫిజియో పరిశీలించాక ఎలాంటి గాయాలు లేకపోవడంతో ఉస్మాన్‌ మ్యాచ్‌లో కొనసాగాడు. ఈ ఘటన కారణంగా మ్యాచ్‌కు కొద్ది సేపు అంతరాయం కలిగింది. కాగా, పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌-2025 గత కొన్ని రోజుల నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఈ లీగ్‌లోని ఓ ఫ్రాంచైజీ (కరాచీ కింగ్స్‌) బాగా రాణించిన తమ ఆటగాళ్లకు హెయిర్‌ డ్రయర్లు, హెయిర్‌ ట్రిమ్మర్లు బహుమతులగా ఇచ్చి నవ్వులపాలైంది. ఈ ఏడాది పీఎస్‌ఎల్‌ ఐపీఎల్‌కు పోటీగా ఒకే సమయంలో జరుగుతుంది. ఐపీఎల్‌ కంటే తమ లీగే గొప్పదంటూ ఢాంబికాలకు పోయిన పాక్‌ క్రికెట్‌ బోర్డు ఇలా చేసింది. తీరా చూస్తే ఐపీఎల్‌ కారణంగా ఒకరిద్దరున్న పీఎస్‌ఎల్‌ అభిమానులు కూడా ఆ లీగ్‌ను చూడటం మానేశారు. ఐపీఎల్‌తో పోటీ కారణంగా ఈ సీజన్‌లో పీఎస్‌ఎల్‌ అభిమానులు ఒక్కసారిగా తగ్గిపోయారు. స్టేడియంలో స్టాండ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియక పాక్‌ క్రికెట్‌ బోర్డు అధికారులు తలలు పట్టుకుని కూర్చున్నారు.

Victims Queue Up For Baldness Medicine In Uppal Hyderabad5
బట్టతలపై జుట్టు అనగానే.. ఉప్పల్‌లో క్యూ కట్టిన జనం.. షాకిచ్చిన పోలీసులు

సాక్షి, హైదరాబాద్: ఉప్పల్‌లో బట్టతల మందు కోసం బాధితులు క్యూ కట్టారు. ఉప్పల్ బాగాయత్‌లో ఏర్పాటు చేసిన శిబిరం.. వేలాది మంది బట్టతల బాధితులతో నిండిపోయింది. వెయ్యి రూపాయలు పెట్టి బట్టతలకు బాధితులు మందు తీసుకుంటున్నారు. 300 ఎంట్రీ ఫీజు.. 700 ఆయిల్ కాస్ట్ అంటూ హరీశ్ అనే వ్యక్తి భారీగా డబ్బులు వసూళ్లు చేస్తున్నాడు. ఢిల్లీ నుంచి ఫ్రాంచైజ్ తీసుకొని బట్టతలకు ఆయిల్ ఇస్తామంటూ మోసానికి పాల్పడుతున్న హరీష్‌, వినోద్, రాజశేఖర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.గతంలో కూడా బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానని ఓ యువకుడు పాతబస్తీలో హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీకి చెందిన వకీల్‌ గత కొంత కాలంగా పాతబస్తీ రామనాస్పుర రోడ్డులో కింగ్‌ పేరుతో కటింగ్‌ షాపును నిర్వహిస్తున్నాడు. నెల రోజుల నుంచి బట్టతలపై జుట్టు మొలిపిస్తానంటూ ప్రచారం చేయడంతో పెద్ద ఎత్తున యువకులు క్యూలో నిలబడి మందు పెట్టించుకున్నారు. ఈ వార్త సోషల్‌ మీడియాలో కూడా వైరల్‌గా మారింది.వకీల్‌ మొదట బట్టతల గుండు కొట్టి రూ.100 తీసుకొని తర్వాత జుట్టు మొలిపించేందుకు కెమికల్‌ను బట్టతలపై రాసేవాడు. ఉన్న కాస్త జుట్టు కూడా పోయిందంటూ ఆందోళనకు గురయ్యారు.

Intel to announce over 20pc job cuts this week major restructuring by new CEO Lip Bu Tan6
టెక్‌ దిగ్గజంలో తొలగింపులు.. 20 వేల మందికిపైనే!

టెక్‌ పరిశ్రమలో అనిశ్చితులు ఇప్పట్లో కుదటపడేలా కనిపించడం లేదు. టాప్‌ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. తాజాగా టెక్ దిగ్గజం ఇంటెల్ కార్పొరేషన్ భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. తమ వర్క్‌ ఫోర్స్‌లో 20 శాతానికి పైగా తొలగించాలని యోచిస్తోన్న ఇంటెల్‌ ఈ వారంలోనే లేఆఫ్‌లను ప్రకటించబోతోంది.గత మార్చిలో సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన లిప్-బు తాన్ నాయకత్వంలో ఇంటెల్ కంపెనీ ఈ వారం 20,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించే ప్రణాళికను ప్రకటించనుందని నివేదికలు సూచిస్తున్నాయి. 2024లో 19 బిలియన్‌ డాలర్ల నష్టంతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఇంటెల్, ఈ కోతలతో అధికారిక వ్యవస్థను తగ్గించి, నిర్వహణను సరళీకరించి, ఇంజనీరింగ్-ఆధారిత సంస్కృతిని పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఇదే మొదటిసారి కాదు...ఇంటెల్ తన పరిస్థితిని మెరుగుపరచుకునేందుకు ఉద్యోగాల కోతలను చేపట్టడం ఇదే మొదటిసారి కాదు. 2024 ఆగస్టులో 15,000 మంది ఉద్యోగులను తొలగించింది. దీంతో కంపెనీ మొత్తం సంఖ్య 1,08,900కు చేరింది. అంతకుముందు సంవత్సరం 2023లో ఇంటెల్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 124,800 ఉండేది.రోజుకు 450 మంది తొలగింపు2025లో 257 టెక్ కంపెనీలు రోజుకు సగటున 450 మంది చొప్పున 50,372 మంది ఉద్యోగులను తొలగించాయని లేఆఫ్స్.ఎఫ్‌వైఐ తెలిపింది. 2024లో 1,115 కంపెనీల్లో 2,38,461 మంది ఉద్యోగులు తొలగింపునకు గురయ్యారు. ఇంటెల్‌ మాత్రమే కాకుండా గూగుల్ 2025 ఏప్రిల్‌లో తన ప్లాట్‌ఫామ్స్ అండ్ డివైజెస్ యూనిట్ (ఆండ్రాయిడ్, పిక్సెల్, క్రోమ్)లో వందలాది మందిని తొలగించింది. అంతకు ముందు క్లౌడ్, హెచ్ఆర్‌ విభాగాల ఉద్యోగుల సంఖ్యలో కోత విధించింది.మరో టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కూడా వచ్చే మే నెలలో తొలగింపులకు సిద్ధమవుతోంది. ఇంజనీర్-టు-మేనేజర్ నిష్పత్తులను పెంచడానికి మిడిల్ మేనేజర్లు, తక్కువ పనితీరు కనబరిచేవారిని లక్ష్యంగా చేసుకుని, ముఖ్యంగా దాని భద్రతా విభాగంలో ఈ తొలగింపులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా 2025 ఫిబ్రవరిలో 3,600 మంది ఉద్యోగులను తొలగించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమాలను క్రమబద్ధీకరించడానికి పనితీరు ఆధారిత తొలగింపులపై దృష్టి సారించింది.

High Temperatures Likely To Be Recorded In Telangana On April 23 And 247
TG: నేడు, రేపు భగభగలే..! ఆ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో నేడు, రేపు భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్‌ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరం భీమ్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకు రెడ్అలర్ట్‌ ప్రకటించింది. రెడ్ అలర్ట్‌ ఉన్న జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.రెడ్ అలర్ట్ జారీ చేసిన తొమ్మిది జిల్లాలు మినహా మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేసింది. రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వడగాల్పుల ప్రభావం ఉందని.. ఆదిలాబాద్‌, కొమరం భీమ్ ఆసిఫాబాద్‌, నిర్మల్, నిజామాబాద్‌, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్ మహబూబ్‌నగర్ జిల్లాలకు వడ గాల్పుల హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది.

KSR Comments On Chandrababu And Lokesh Politics8
తండ్రి బాటలోనే లోకేశ్‌.. ఎంకరేజ్‌ చేస్తున్న పవన్‌!

ఏపీలో ప్రజాస్వామ్యం మూడు కుట్రలు, ఆరు ప్రలోభాలుగా పరిఢవిల్లుతోంది!. విశాఖపట్నం నగర పాలక సంస్థ మేయర్ పదవి నుంచి వైఎస్సార్‌సీపీకి చెందిన వెంకట కుమారిని దించివేయడానికి ఇన్ని కుట్రలు పన్నాలా?. పదవీకాలం ఏడాది కూడా లేకపోయినా, ఎందుకు ఇంత కక్కుర్తి?. బహుశా కూటమి నేతలు, కార్యకర్తల అరాచకాలు త్వరితగతిన తెలిసిపోతున్నాయనో, విశాఖలో తమ పెత్తనం సాగాలనో మరే కారణంతోనో అవిశ్వాస తీర్మానం పెట్టి కార్పొరేషన్‌ను కైవసం చేసుకోవాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు నిర్ణయం తీసుకుని ఉండాలి.అయితే, ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు సర్కార్ స్థానిక సంస్థల స్వతంత్రను దెబ్బతీస్తోంది. ఇందుకు అధికార యంత్రాంగాన్ని వాడుకుంటుంది. చంద్రబాబు తొలుత ముఖ్యమంత్రి అయింది ఇలాంటి కుట్రలతోనే అని అంతా అంటారు. అదే పద్దతిని ఆయన ఇప్పటికీ కొనసాగించడం దురదృష్టకరం. ఇప్పుడు ఆయన కుమారుడు లోకేశ్‌ కూడా అదే బాటలో ఫిరాయింపులను ఎంకరేజ్ చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ మాత్రం చంద్రబాబు, లోకేశ్‌లకు విధేయుడుగా ఉంటూ ప్రశ్నించడం లేదు కనుక వారికి ఇబ్బంది ఉండడం లేదు.గతంలో జగన్ ప్రభుత్వ టైమ్‌లో ఇలాంటి వాటిని ప్రోత్సహించలేదు. ఎన్నికలలో కేవలం రెండు మున్సిపాలిటీల్లోనే టీడీపీ గెలిచే అవకాశం ఉన్నప్పుడు కూడా వారిని డిస్టర్బ్ చేయలేదు. ఇందుకు ఆ రోజుల్లో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అయిన టీడీపీ నేత జేసీ ప్రభాకర రెడ్డి ఓపెన్ గానే అంగీకరించారు. కానీ, చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం రాగానే స్థానిక సంస్థలలో వేధింపుల పర్వం ఆరంభించారు. పలు మండల పరిషత్తులలో వివిధ కారణాలతో ఉప ఎన్నికలు జరిగినప్పుడు కూటమి పెద్దలు పెద్ద ఎత్తున కొనుగోలు లావాదేవీలను సాగించారు. అయినా కేవలం 11 చోట్ల మాత్రమే మెజార్టీ లేకపోయినా మండలాలను కైవశం చేసుకున్నారు. మిగిలిన 39 చోట్ల వైఎస్సార్‌సీపీ గెలిచింది. ఎర్రగొండపాలెం వద్ద ఒక మండల పరిషత్ ఎన్నికలో వైఎస్సార్‌సీపీ మహిళా ఎంపీటీసీ టీడీపీ వారి దాష్టికాన్ని తట్టుకుని ఓటు వేయడం సంచలనమైంది.ఈ మధ్యనే ఆదోని మున్సిపల్ ఛైర్‌పర్సన్ వైఎస్సార్‌సీపీ నుంచి మారిన నేపథ్యంలో అక్కడ మెజార్టీ కౌన్సిలర్లు ఒకే తాటిపై నిలబడి ఆమెను పదవి నుంచి దించేశారు. పార్టీ ఫిరాయింపునకు జవాబు ఇచ్చారు. అలా అన్ని చోట్ల సాధ్యపడదు. ఉదాహరణకు తిరుపతి ఉప మేయర్ ఎన్నికకు సంబంధించి పోలీసుల మద్దతుతో టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడడం, ఒక్క టీడీపీ కార్పొరేటరే ఉన్నప్పటికీ ఆ పదవిని గెలుచుకోవడం జరిగింది. ఈ ఓటింగ్ తర్వాత కొందరు కార్పొరేటర్లు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి వద్దకు వచ్చి టీడీపీ వారి వేధింపులకు తట్టుకోలేక వైఎస్సార్‌సీపీకి ద్రోహం చేశామని కన్నీరు, మున్నీరయ్యారు. అవకాశం ఉన్న చోట్ల మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, జెడ్పీ ఛైర్మన్లను ప్రలోభ పెట్టి టీడీపీలోకి చేర్చుకుంటున్నారు. లొంగకపోతే అధికారుల చేత ఒత్తిడి చేయిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఛైర్మన్లకు సహకరించకుండా ఐఏఎస్‌లు సైతం దారుణంగా వ్యవహరిస్తున్నారు.ఉదాహరణకు గుంటూరు కమిషనర్, ఐఏఎస్ అధికారి మేయర్‌కు కనీసం సమాచారం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శ ఉంది. దాంతో మేయర్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడ మేయర్‌కు ఇవ్వవలసిన ప్రోటోకాల్ ఇవ్వడం లేదు. ఇది స్థానిక సంస్థలను అవమానించడమే. విశాఖపట్నంలో బీసీ వర్గానికి చెందిన మహిళ మేయర్‌ను పదవి నుంచి దించడానికి కొద్ది నెలలుగా టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. కార్పొరేటర్లను రకరకాల ప్రలోభాలకు లోను చేయడానికి యత్నించింది. కొంతమందిని విదేశీ యాత్రలకు పంపారు. టీడీపీ కూటమి దాష్టికాలకు తట్టుకోవడానికి వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు కొందరు కేరళ వెళ్లారట. అక్కడకు వెళ్లి కూడా టీడీపీ నేతలు కొందరిని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని ఒక కార్పొరేటర్ వెల్లడించారు.కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఎక్స్ అఫీషియో సభ్యులతో కలుపుకున్నా వారికి పూర్తి బలం రాలేదు. దాంతో ముప్పై మంది వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను టీడీపీ కొనుగోలు చేసిందని చెబుతున్నారు. ఎలాగైతేనేం విశాఖ నగర పాలక సంస్థను కైవసం చేసుకున్నామని కూటమి పెద్దలు సంబర పడుతున్నారు. ఈ క్రమంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశామని వారు బాధపడడం లేదు. ఈ వైఖరిని ఖండిస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ .. కూటమి ఇలా ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బలం లేకపోయినా ఎలా పదవులలోకి వస్తారని ఆయన ప్రశ్నించారు.ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు పార్టీ ఫిరాయింపులపై స్పష్టమైన విధాన నిర్ణయం చేశారు. వేరే పార్టీవారు ఎవరైనా టీడీపీలోకి రావాలంటే పదవి వదలి పెట్టి రావాలని కండిషన్ పెట్టారు. ఆ సూత్రానికి చంద్రబాబు ఎప్పుడో తిలోదకాలు ఇచ్చారు. సొంత మామ ఎన్టీ రామారావును పార్టీ చీల్చి ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసిన చంద్రబాబుకు ఇలాంటి కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు పెద్ద విషయమా అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తుంటారు. 2014 టర్మ్‌లో కూడా ఇలాగే చేశారు. ఉదాహరణకు మూడు నగరపాలక సంస్థలలో వైఎస్సార్‌సీపీ గెలిస్తే, నెల్లూరు మేయర్‌ను టీడీపీలోకి లాగేసింది. అసెంబ్లీలో 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు ఆధ్వర్యంలో కొనుగోలు చేశారన్నది బహిరంగ రహస్యం. వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చి రాజ్యాంగానికి గండి కొట్టారు.జగన్ దీనికి నిరసనగా అసెంబ్లీని బహిష్కరించి ప్రజలలోకి వెళ్లారు. 2024లో అనూహ్యంగా అధికారంలోకి వచ్చినా, చంద్రబాబు తన పద్దతులను మార్చుకోలేదు. ఒకప్పుడు పార్టీ ఫిరాయింపులను విమర్శిస్తూ ఎమ్మెల్యేలను పశువుల మాదిరి కొంటారా అని వ్యాఖ్యానించిన చంద్రబాబు, తాను అధికారంలోకి వచ్చినప్పుడల్లా అదే పనిచేయడం ఆయన ప్రత్యేకత. దీనిపై బీజేపీ లోక్ సభ సభ్యుడు సీఎం రమేష్ హర్షం వ్యాక్తం చేస్తూ అరాచక పాలనకు ముగింపు పలికారని అన్నారు. అంతే తప్ప ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశామన్న సంగతిని మాత్రం విస్మరించారు. ఆయన పేరుకు బీజేపీ తప్ప, ఒరిజినల్‌గా చంద్రబాబు సొంత మనిషిగానే అంతా పరిగణిస్తారు.టీడీపీ నేతలు తాము విశాఖ నగరంలో అధికారంలోకి వచ్చామని సంబర పడుతుండవచ్చు. కానీ, ప్రజలలో మాత్రం ఏహ్య భావాన్ని మూట కట్టుకున్నారని చెప్పాలి. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా కూటమి నేతలు, ఇలాంటి అరాచకాలకు పాల్పడుతుండటం దురదృష్టకరం. స్థానిక సంస్థలలో అధికారం వచ్చినంత మాత్రాన పెద్దగా ఒరిగేదేమీ ఉండదని అనుభవం చెబుతున్నప్పటికీ, చంద్రబాబు అండ్ కో మాత్రం యథా ప్రకారం ఈ కుట్రలను కొనసాగిస్తున్నారు. 1995లో కుట్రతోనే అధికారంలోకి వచ్చి.. అప్పటి నుంచి వాటినే అమలు చేస్తున్న చంద్రబాబు ఇంతకన్నా గొప్పగా ఉంటారని ఆశించలేమేమో!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల విశ్లేషకులు.

 Dubai Billionaire Spotted Having Breakfast At White House With Elon Musk Who Is Hussain Sajwani9
మస్క్‌తో వైట్‌హౌస్‌లో బ్రేక్‌ఫాస్ట్‌ : ఫోటో వైరల్‌, ఎవరీ సజ్వానీ ?

దుబాయ్‌కు చెందిన డెవలపర్ DAMAC ప్రాపర్టీస్ చైర్మన్ బిలియనీర్ హుస్సేన్ సజ్వానీ Hussain Sajwani) మరోసారి నెట్టింట హల్‌ చల్‌ చేస్తున్నాడు. దుబాయ్ బిలియనీర్, వైట్ హౌస్‌లో ఎలాన్ మస్క్ (Elon Musk), ఆయన భార్యతో కలిసి బ్రేక్‌ ఫాస్ట్‌ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. కొన్ని నిమిషాల్లోనే 10.2 లక్షలకు పైగా వ్యూస్‌, వేలాది లైక్స్‌ దక్కించుకుంది. ఇంతకీ ఎవరీ హుస్సేన్ సజ్వానీ?హుస్సేన్ సజ్వానీ ఎవరు?దుబాయ్ బిలియనీర్ హుస్సేన్ సజ్వానీ (71) డమాక్ ప్రాపర్టీస్‌ చైర్మన్ హుస్సేన్ సజ్వానీ. ఫోర్బ్స్ ప్రకారం. నియక విలువ విలువ 10.2 బిలియన్‌డాలర్లు. ఇటీవల దుబాయ్ బిలియనీర్ హుస్సేన్ సజ్వానీతో కలిసి, టెస్లా , స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ వైట్ హౌస్‌లో అల్పాహార విందు ఆరగించాడు. ‘‘ఒక చిరస్మరణీయ ఉదయం" అంటూ దీనికి సంబంధించిన ఫోటోలను సజ్వానీ ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ ఫోటోలు మస్క్‌తోపాటు, మస్క్‌ భార్య న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్, శివోన్ జిలిస్‌ను కూడా చూడవచ్చు.చదవండి: 5 నెలల్లో 18 కిలోలు తగ్గిన హీరో : ఇదేం కొత్త కాదంటున్న ఫ్యాన్స్‌డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు మొదటి దఫా అధ్యక్షుడిగా పనిచేసినపుడు వార్తల్లో నిలిచారు సజ్వానీ. 2016 నూతన సంవత్సర వేడుకలో ఆయన సంస్థ డమాక్ దుబాయ్‌లో ట్రంప్-బ్రాండెడ్ గోల్ఫ్ కోర్సును నిర్మించాడ. ఇక రెండోసారి ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన అమెరికా డేటా సెంటర్లలో 20 బిలియన్ల పెట్టుబడిని సజ్వానీ ప్రకటించాడు. ఎనిమిది రాష్ట్రాలలో 2025లో నిర్మాణం ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్, అమెరికా సాంకేతిక మౌలిక సదుపాయాలను పెంచడం , డేటా సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉండటం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పెట్టుబడుల తరువాత ట్రంప్ సజ్వానీని "దార్శనిక వ్యాపారవేత్త"గా ప్రశంసించిన సంగతి తెలిసిందే.Had a great breakfast at the White House with Elon Musk and family — a memorable morning. pic.twitter.com/ckTs9PBRVM— Hussain Sajwani (@HussainSajwani) April 21, 2025 1953లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జన్మించిన హుస్సేన్ సజ్వానీ, అనేక లగ్జరీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లతో మల్టీ బిలియనీర్ వ్యాపారవేత్తగా ఎదిగాడు. వ్యాపార కుటుంబానికి చెందిన సజ్వానీ చిన్నతనంలోనే తన తండ్రి దుకాణంలో పనిచేయడం ప్రారంభించాడు. వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రం,పారిశ్రామిక ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు. తరువాత సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించి బిజినెస్‌ టైకూన్‌ ఎదిగాడు. ముఖ్యంగా గల్ఫ్ వార్‌ టైంలో సజ్వానీ అమెరికన్ సైనిక కార్యకలాపాలకు సేవలందిచాడు. 2002లో DAMAC ప్రాపర్టీస్‌ను స్థాపించి వెనుదిరిగి చూసింది లేదు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార దిగ్గజం ఎదిగాడు. DAMAC హోటళ్ళు, అపార్ట్‌మెంట్లు మరియు విల్లాలు వంటి వేలాది లగ్జరీ గృహాలను నిర్మించింది. చదవండి: పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం

Jr NTR Body Double Eshwar Harris Acted in RRR Movie10
RRRలో నటించా.. జెప్టో యాడ్‌లో కూడా నేనే.. : ఎన్టీఆర్‌ డూప్‌

ఓపక్క సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూనే మరోపక్క నటుడిగా ప్రయత్నిస్తున్నాడు ఈశ్వర్‌ హారిస్‌. అంతేకాదు.. టాలీవుడ్‌ స్టార్‌ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌కు బాడీ డబుల్‌ (డూప్‌)గా కూడా చేస్తున్నాడు. అంటే కొన్ని సీన్లలో తారక్‌ స్థానంలో ఈయనే నటిస్తాడన్నమాట! తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈశ్వర్‌ (Eshwar Harris).. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.అలా ఆర్‌ఆర్‌ఆర్‌లో అవకాశంఅతడు మాట్లాడుతూ.. జార్జ్‌ రెడ్డి సినిమాలో విలన్‌గా చిన్న పాత్రలో నటించాను. కొత్తపోరడు, పులిమేక వంటి వెబ్‌సిరీస్‌లు చేసుకుంటూ వచ్చాను. ఆచార్యలో రామ్‌చరణ్‌ ఫ్రెండ్‌గా నటించాను. అయితే ఎడిటింగ్‌లో నా సీన్లు పోయాయనుకోండి. కానీ ఆ సినిమా షూటింగ్‌ సమయంలో ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి నువ్వు జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) లాగే ఉన్నావ్‌ అన్నాడు. రాజమౌళి టీమ్‌ నీ గురించి నెల రోజుల నుంచి వెతుకుతున్నారు అని చెప్పాడు. అలా ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో భాగమయ్యాను.కొమురం భీముడో పాటలో..ఉదయం 6 గంటలకల్లా సెట్స్‌లో ఉండాలనేవారు. ఓరోజు నేను రావడం ఐదు నిమిషాలు ఆలస్యమయ్యేసరికి వందల ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. రాజమౌళి ఆరింటికే షూటింగ్‌ మొదలుపెట్టేస్తాడు. చాలా పక్కాగా ఉంటాడు. కొమురం భీముడో పాటలో మూడు, నాలుగు షాట్స్‌ నావే ఉంటాయి. తారక్‌ అన్న స్థానంలో నన్ను వేలాడదీశారు.. నా కాళ్లు, చేతులకు రక్తం కారే సన్నివేశాలు షూట్‌ చేశారు. ఆ పాటలో కాళ్లు, చేతులు నావే కనిపిస్తాయి. ఫైటింగ్స్‌లాంటివైతే నేనేం చేయలేదు.వార్‌ 2 కోసం అడిగారుమొన్న వార్‌ 2 సినిమా (War 2 Movie) కోసం అడిగారు. అర్జంట్‌గా ముంబై వచ్చేయాలన్నారు. కానీ విమానయాన ఛార్జీలకు కూడా డబ్బులివ్వనన్నారు. మనకన్నా బాలీవుడ్‌ దారుణంగా ఉందనిపించింది. రెమ్యునరేషన్‌ నచ్చకపోవడంతో రానని చెప్పేశాను. ఈ మధ్యే జూనియర్‌ ఎన్టీఆర్‌.. జెప్టో యాడ్‌ కూడా చేశాను. జూనియర్‌ ఎన్టీఆర్‌ అన్నను చూడగానే నాకు ఒక పాజిటివ్‌ వైబ్‌ వస్తుంది. సింగిల్‌ టేక్‌లో చాలా సింపుల్‌గా నటిస్తాడు.జెప్టో యాడ్‌ చేశా..అయితే యాడ్‌ షూటింగ్‌ అప్పుడు ఆయనకు కాస్త జ్వరం వచ్చింది. పైగా డైట్‌లో ఉన్నాడు. అసలే వార్‌ 2లో హృతిక్‌ రోషన్‌ను మ్యాచ్‌ చేయాలి కదా మరి! హృతిక్‌ను మ్యాచ్‌ చేయడమంటే మామూలు విషయం కాదు. జెప్టో యాడ్‌లో క్యారవాన్‌ ఇచ్చి మంచి భోజనం పెట్టి తారక్‌ అన్నతో సమానమైన గౌరవం ఇచ్చారు. బాడీ డబుల్‌గా చేసినప్పుడు సినిమాను బట్టి లక్షల్లో పారితోషికం ఇస్తారు అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈశ్వర్‌.. భీమా, స్వయంభూ వంటి పలు చిత్రాలు చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Eshwar Harris (@eshwar_harris) చదవండి: సునీత మేడం.. వీటికి సమాధానం చెప్పండి: ప్రవస్తి

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement