Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

Ys Jagan Comments On Chandrababu Ruling1
తెగువ చూపారు.. వారందరికీ సెల్యూట్‌: వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: ఉప ఎన్నికలు, అవిశ్వాస తీర్మానాల సమయంలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు తెగువ చూపారని.. వారందరికీ సెల్యూట్‌ చేస్తున్నానని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో గురువారం ఆయన భేటీ అయ్యారు. ముందుగా జమ్ముకశ్మీర్‌లోని ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన వారి మృతికి సంతాపంగా వైఎస్‌ జగన్, వైఎస్సార్‌సీపీ నాయకులు కాసేపు మౌనం పాటించారు. అనంతరం సమావేశం ప్రారంభించారు. దుర్మార్గమైన రెడ్‌బుక్‌ పాలనలో..‘ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. యుద్ధ వాతావరణంలో ప్రజలు బతుకుతున్నారు. దుర్మార్గమైన రెడ్‌బుక్‌ పాలన జరుగుతోంది’’ అని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. ప్రజావ్యతిరేకతను అణచివేయడం సాధ్యం కాదన్న ఆయన.. మేనిఫెస్టో అమలు చేయకపోతే ప్రతి వైఎస్సార్‌సీపీ కార్యకర్త నిలదీస్తాడని చెప్పారు. ‘‘బలం లేకపోయినా స్థానిక సంస్థల్లో టీడీపీ పోటీ చేస్తోంది. ప్రజలు ఓడించారు కాబట్టే.. చంద్రబాబు తన సొంత నియోజకవర్గం చంద్రగిరిని విడిచిపెట్టి కుప్పం వెళ్లిపోయాడు. అక్కడ బీసీలు ఉన్నారు.. వారు ఆర్థికంగా ఇతరత్రా బలంగా ఉండరు కాబట్టి, వారిని తొక్కితొక్కిపెట్టవచ్చని చంద్రబాబు కుప్పంలో పాగావేశారు’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.జై జగన్.. అన్నారని కేసులు పెట్టారు..చంద్రగిరి ఎంపీపీ ఉప ఎన్నికల్లో గెలిచాక జై జగన్, జై వైఎస్సార్‌సీపీ అన్నారని కేసులు పెట్టారు. గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు తిరిగే ధైర్యంలేదు. తిరిగితే ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ విధ్వంసం. ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లడాన్ని నరకంగా మార్చేశారు. విద్యా, వైద్య రంగాలు దారుణంగా తయారయ్యాయి. చంద్రబాబుగారు అధికారంలో వచ్చాక 4 లక్షలు పెన్షన్లు తీసేశారు. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. బెల్టుషాపులు గుడి, బడి పక్కనే కనిపిస్తున్నాయి.రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ....ప్రతి బాటిల్‌పైన రూ.20ల ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. వైఎస్సార్‌సీపీలో కన్నా ఇసుక రేటు రెండింతలు పెరిగింది. ఉచితం అని చెప్పి.. దోచుకుంటున్నారు. పైనుంచి కిందిదాకా ముడుపులు చెల్లిస్తేనే మైనింగ్‌ అయినా, పరిశ్రమ అయినా నడిచేది. అవినీతినుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్‌ టాపిక్స్‌ ఎంచుకుంటున్నారు. విశాఖపట్నంలో ఊరూపేరు లేని ఉర్సా లాంటి కంపెనీలకు రూ.3,000 కోట్లు ఖరీదు చేసే భూములిస్తున్నారు. ఒక చిన్న ఇంట్లో రెషిడెన్షియల్ అపార్ట్‌మెంట్ కట్టే కరెంటు బిల్లు ఆ కంపెనీ కడుతుంది. అమెరికాలో వాళ్ల ఆఫీసు చూస్తే.. అది కూడా చిన్న ఇల్లే. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ చంద్రబాబు హయాంలో ఉర్సా లాంటి ఊరూ పేరు కంపెనీకి రూ.3,000 కోట్ల డబ్బులు దోచిపెడుతున్నారు. విశాఖఫట్నంలో లూలు గ్రూపులకు, లిల్లీ గ్రూపులకు రూ.1500- 2000 వేల కోట్లు ఖరీదు చేసే భూములను.. టెండర్లు లేకుండా కట్టబెట్టారు.జగన్ చేయగలిగాడు.. బాబు ఎందుకు చేయలేకపోతున్నాడు?’..లెఫ్ట్‌, రైట్, సెంటర్ రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. అమరావతి నిర్మాణ పనుల్లోనూ దోపిడీ. 2018లో ఐదేళ్ల కిందట చంద్రబాబు హయాంలో టెండర్లు పిలిచినప్పుడు పనుల విలువ రూ. రూ.36,000 కోట్లు. అప్పట్లో ఇప్పటికన్నా స్టీలు, సిమెంట్లు రేట్లు ఎక్కువ. అయినా కూడా ఆ రూ.36,000 కోట్ల విలువ ఈరోజు రూ.78,000 కోట్లకు పెంచేశారు. టెండర్లు రింగ్ ఫార్మ్ చేసి వాళ్ల కాంట్రాక్టర్లకే ఇచ్చుకుంటున్నారు. మొబలైజేషన్ అడ్వాన్వులు కొత్తగా ఇవ్వడం మొదలుపెట్టాడు. 10 శాతం మొబలైజేషన్ అడ్వాన్స్‌లు ఇవ్వడం, అందులో 8శాతం కమీషన్లుగా తీసుకోవడం.. ప్రభుత్వం చేసిన అప్పులన్నీ ఎక్కడకు పోతున్నాయో తెలియడంలేదు. గతంలో ఎందుకు జగన్ చేయగలిగాడు.. చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు?’’ అంటూ వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.బాబు హయాంలో బటన్లు లేవు.. నేరుగా ఆయన జేబులోకే డబ్బులు‘‘జగన్ నేరుగా బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వేసేవాడు. ఇప్పుడు చంద్రబాబు హయాంలో బటన్లు లేవు.. నేరుగా ఆయన జేబులోకే పోతున్నాయి. ఇదే విషయాన్ని ఎన్నికల సమయంలో మొత్తుకుని చెప్పాను. చంద్రబాబు నాయుడుని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే. ఈ రోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. వీటికి సమాధానం చెప్పుకోలేక ప్రతిరోజూ డైవర్షనే. ఒక రోజు లడ్డూ, మరోరోజు బోటు.. ఇంకోరోజు ఐపీఎస్ ఆధికార్ల అరెస్టులు అంటూ డైవర్షన్లుఇలాంటి పాలనే రాష్ట్రంలో జరుగుతోంది....కరెంటు బిల్లులు షాక్ కొట్టేలా పెంచారు.. వీటి గురించి అడిగితే.. ఆయన చేసిన లిక్కర్ స్కాంను మరలా ఇంకొకరు మీద రుద్ది అరెస్టు చేస్తాడు. ఇలా ప్రతి రోజూ ఏదో ఒక సెన్షేషన్ క్రియేట్ చేసి దాన్నుంచి టాపిక్ డైవర్షన్ చేయడం పరిపాటిగా మారింది. రోమన్ రాజులు మీద ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా వస్తుందని గ్లాడియేటర్స్‌ను పెట్టిన గేమ్స్ ఆడించేవాళ్లు. మనుషులు చేతుల్లో కత్తులు పెట్టి, జంతువులను పెట్టి.. చనిపోయేవరకు యుద్ధాలు చేయించేవారు. వాటని ప్రజలు చూసేలా చేసి వారిని మభ్యపెట్టి డైవర్ట్ చేసేవారు. దీంతో రాజు ఎలా పరిపాలన చేస్తున్నారో చర్చించడం మాని ప్రజలు ఆ ఆటలు గురించే చర్చించేవారు. మిగిలిన విషయాలు పక్కకు పోయేవి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పాలన జరుగుతుంది. ఎంతో మంచి చేసిన మనమే ప్రతిపక్షంలో కూర్చొన్నాం. ఇక ఏ మంచీ చేయకుండా, మోసం చేసిన చంద్రబాబు పరిస్ధితి ఎలా ఉంటుందో చెప్పక్కరలేదు..ఇంత మోసం చేసిన మనిషిని ప్రజలు సింగిల్ డిజిట్ రాని పరిస్థితుల్లోకి పరిమితం చేస్తారు.ఆ రోజు వస్తుంది. కచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుంది. ప్రతి కార్యకర్తకు.. మన ప్రభుత్వంలో మీ జగన్ 2.0లో తోడుగా ఉంటాడు అని హామీ ఇస్తున్నాను. ఈ రోజు కార్యకర్త ఎంతలా ఇబ్బంది పడుతున్నాడో చూస్తున్నాను’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

India Takes Big Steps Against Pak After Terror Attack2
ఇక భారత్‌ విడిచి వెళ్లాల్సిందే.. పాక్‌ పౌరులకు హెచ్చరిక

న్యూఢిల్లీ : భారత్‌లోని పాక్‌ పౌరులకు కేంద్ర మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో ఉన్న పాక్‌ దేశస్తులు భారత్‌ను విడిచి వెళ్లిపోవాలని సూచించింది. జమ్మూకశ్మీర్‌ పహల్గాం ఉగ్రదాడిని భారత్‌ తీవ్రంగా ఖండిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్‌ హస్తం ఉందని, సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది దేశంపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ తీసుకున్న ఐదు సంచలన నిర్ణయాల అమలుకు భారత్‌ వడివడిగా అడుగువేస్తోంది. వేగంగా చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.ఇందులో భాగంగా గురువారం పాక్‌ పౌరులకు జారీ చేసిన అన్నీ వీసాలను భారత్‌ రద్దు చేసింది. వాటిలో వైద్య వీసాలు కూడా ఉన్నాయి. పాకిస్తానీలకు వీసా సేవలను నిలిపివేసింది.కొద్ది సేపటిక్రితం విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పాక్‌ పౌరులకు చెల్లుబాటయ్యే అన్నీ వీసాలను ఏప్రిల్ 27 రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఆ దేశ పౌరులకు జారీ చేసిన అన్నీ వైద్య వీసాలు ఏప్రిల్ 29 మంగళవారం వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. సవరించిన సమయపాలన ఆధారంగా ప్రస్తుతం భారతదేశంలో ఉన్న అన్ని పాకిస్తానీలు వారి వీసాల గడువు ముగిసేలోపు వెళ్లిపోవాలని పేర్కొంది.

Pahalgam Incident: Pak Counter Action On Indian Decisions3
సింధు జలాలను ఆపడమంటే యుద్ధం ప్రకటించడమే: పాక్‌

ఇస్లామాబాద్‌: పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత్‌ విధిస్తున్న దౌత్యపరమైన ఆంక్షలకు పాకిస్తాన్‌ అల్లలాడిపోతోంది. ఈ క్రమంలో ప్రతీకార చర్యలకు దిగింది. పాక్‌ గగనతలం నుంచి వెళ్లే భారత విమానాలకు అనుమతిని రద్దు చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. గురువారం పాక్‌ ప్రధాని షెహ్‌బాజ్‌ షరీఫ్‌ అధ్యక్షతన జాతీయ భద్రతా కమిటీ సమావేశం జరిగింది. పహల్గాం దాడి తర్వాత పాక్‌ విషయంలో భారత్‌ అనుసరిస్తున్న తీరుపై సమీక్ష ఈ భేటీలో సమీక్ష జరిపారు. పాక్‌ పౌరుల వీసా రద్దు చేయడం, దేశం విడిచి వెళ్లిపోవాలనే ఆదేశాలను పాక్‌ తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే.. కౌంటర్‌ చర్యలను ప్రకటించింది. భారత్‌లో జరిపే అన్ని వర్తకవ్యాపారాలను(మధ్యవర్తి దేశం ద్వారా జరిపే వ్యాపారలావాదేవీలను సైతం) నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వాఘా సరిహద్దును మూసేస్తున్నట్లు తెలిపింది. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌ సిబ్బందిని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. భారతీయ పౌరులకు జారీ చేసే వీసాలను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. సింధు జలాలను ఆపడమంటే యుద్ధం ప్రకటించడం కిందకే వస్తుందని పేర్కొంది. మరోవైపు సైన్యం సెలవులను రద్దు చేసిన పాక్‌ ప్రభుత్వం.. భారత్‌ గనుక యుద్ధానికి దిగితే ప్రతిఘటనకు సిద్ధంగా ఉండాలని పిలుపు ఇచ్చింది. బుధవారం సాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భద్రతా కమిటీ భేటీలో కీలక నిర్ణయాలను ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే పహల్గాం దాడిని ఖండించిన పాక్‌.. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించింది. ‘‘భారత్‌లో జమ్ము కశ్మీర్‌, ఛత్తీస్‌గఢ్‌, మణిపూర్‌ సహా దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాల్లో తిరుగుబాట్లు నడుస్తున్నాయని.. బహుశా ఈ క్రమంలోనే పహల్గాం దాడి జరిగి ఉంటుందని, ఇందులో విదేశీ శక్తుల దాడి అయ్యి ఉండకపోవచ్చని’’ పాక్‌ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్‌ వ్యాఖ్యానించారు. ప్రాథమిక హక్కులను కోల్పోయిన వ్యక్తులపై సైన్యం లేదంటే పోలీసులు దారుణాలకు పాల్పడుతుంటే.. పాకిస్తాన్‌ను నిందించడం అలవాటుగా మారిపోయింది. పహల్గాం దాడిలో.. మమ్మల్ని నిందించకండి’’ అంటూ ఓ లోకల్‌ టీవీ ఛానెల్‌ ఇంటర్వ్యూలో ‍వ్యాఖ్యానించారు.

World's 10 Most Powerful Armies, India in 4th Place4
మోస్ట్ పవర్ ఫుల్ ఆర్మీ కల్గిన దేశాలు ఇవే..

అత్యంత శక్తివంతమైన ఆర్మీ కలిగిన దేశాల జాబితాను గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్(GFP Index) విడుదల చేసింది. ఇందులో భారత్ టాప్ 5లో చోటు దక్కించుకుంది. భారత్ నాల్గో స్థానంలో నిలిచింది. అమెరికా, రష్యా, చైనాల తర్వాత స్థానాన్ని భారత్ ఆక్రమించింది. ప్రపంచ వ్యాప్తంగా 145 దేశాల సైనిక శక్తిని అంచనా వేసేంది గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌ ఇండెక్స్‌సైనిక బలంతో పాటు నేటి ప్రపంచ రక్షణ వాతావరణాన్ని ప్రభావితం చేసే వ్యూహాత్మకత, సాంకేతిక, భౌగోళిక రాజకీయ అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే యూకే, దక్షిణకొరియా, ఫ్రాన్స్ తదితర దేశాలను వెనక్కి నెట్టిన భారత్.. నాల్గో స్థానాన్ని నిలబెట్టుకుంది. యూఎస్ఏ (పవర్‌ ఇండెక్స్ 0.0744)2,127,500 మంది సైనిక శక్తితో యూఎస్ఏ అగ్రస్థానంలో నిలిచింది. 13, 043 విమానాలు, 4, 640 యుద్ధ ట్యాంకుర్లతో కూడిన బలీయమైన సైనిక శక్తితో అమెరికా ఉంది. దాంతోపాటు అతిపెద్ద రక్షణ బడ్జెట్ కూడా అమెరికా సొంతం. అత్యాధునిక సాంకేతికత, వైమానిక ఆధిపత్యం కూడా అమెరికాను అగ్రస్థానంలో నిలబెట్టాయి.రష్యా (పవర్‌ ఇండెక్స్0.0788)అసాధారణ సైనిక శక్తి కల్గిన దేశాల్లో రష్యాది రెండో స్థానం. 3,570,000 మంది మిలటరీ సిబ్బంది, 5, 750 యుద్ధ ట్యాంకర్లు రష్యా సొంతం. విస్తృతమైన యుద్ధ ట్యాంకర్ల దళం, అణ్వాయుధాలు కల్గి ఉంది రష్యా. అణు సామాగ్రిని వివిధ దేశాలకు సరఫరా చేసే దేశాల్లో రష్యా కీలక పాత్ర పోషిస్తుంది. గత కొంతకాలంగా ఉక్రియెన్ తో యుద్ధం చేస్తున్న రష్యా.. చైనాతో వ్యూహాత్మక పొత్తులను కొనసాగిస్తూ తన ఆధిపత్యాన్ని కాపాడుకుంటూ వస్తుంది.చైనా (పవర్‌ ఇండెక్స్ 0.0788)పవర్ ఇండెక్స్ పాయింట్లలో రష్యాతో కలిసి పంచుకుంటున్న చైనా.. అత్యంత శక్తివంతమైన సైనిక సామర్థ్యం కల్గిన దేశాల జాబితాలో మూడో స్థానంలో ఉంది. చైనా సైనిక విస్తరణ, సాంకేతిక పురోగతి, ఆర్థిక శక్తి తదితర అంశాలు ప్రపంచ వేదికపై ఆ దేశ సైనిక పురోగతని చూపెడు\తోంది. 6,800 యుద్ధ ట్యాంకర్లతో అతిపెద్ద ట్యాంక్ ఫ్లీట్ కల్గిన దేశంగా చైనా ఉంది. చైనా 3,170,000 సైనిక సిబ్బందితో పాటు 3,309 యుద్ధ విమానాలను కల్గి ఉంది.భారత్‌ ‍ (పవర్ ఇండెక్స్ పాయింట్లు 0.1184)ప్రపంచంలోని అతిపెద్ద సాయుధ దళాలలో ఒకటిగా ఉన్న భారత్,.. నాల్గో స్థానంలో ఉంది. 5,137,550 మంది సైన్యం, 2,229 యుద్ధ విమానాలు, 4, 201 యుద్ధ ట్యాంకర్లతో భారత్ నాల్గో స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంది. రక్షణ ఉత్పత్తి సామర్థ్యాలను, అణ్వాయుధాలను కల్గిన భారత్.. ఆసియా అంతటా వ్యూహాత్మకంగా తన ఉనికిని విస్తరిస్తూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. దక్షిణకొరియా (పవర్‌ ఇండెక్స్ 0.1656)పవర్ ఇండెక్స్ జాబితాలో దక్షిణాకొరియా ఐదో స్థానంలో కొనసాగుతోంది. 3,820,000 సైనిక సిబ్బంది, 1, 592 యుద్ధ విమానాలు, 2, 236 యుద్ధ ట్యాంకర్లు దక్షిణకొరియా సొంతం. అత్యంత అధునాతన టెక్నాలజీ కల్గిన రక్షణ రంగంలో దక్షిణకొరియాది ప్రత్యేక స్థానం. దాంతోపాటు అమెరికాతో సాన్నిహిత్య సంబంధాలు కూడా దక్షిణకొరియా సైనిక బలానికి మరింత దోహదం చేస్తోంది,. ప్రధానంగా సరిహద్దుల్లో ఉత్తరకొరియాతో ఉన్న వైరంలో భాగంగా ఉద్రిక్త పరిస్థితులను దక్షిణకొరియా ఎప్పటికప్పుడు చాకచక్యంగా తిప్పికొడుతోంది.యూకే (పవర్‌ ఇండెక్స్ 0.1785)పవర్ ఇండెక్స్ స్కోరులో యునైటెడ్ కింగ్ డమ్(యూకే) ఆరోస్థానంలో ఉంది. 1,108,860 మంది సైనిక సిబ్బందితో పాటు 631 ఎయిర్ క్రాఫ్ట్ లు, 227 యుద్ధ ట్యాంకర్లు యూకే కల్గి ఉంది. పవర్ ఫుల్ నేవీ, శక్తివంతమైన న్యూక్లియర్ సామర్థ్యం యూకే సొంతం. నాటో సభ్యత్వం కల్గిన దేశాల్లో యూకే కీలక పాత్ర పోషిస్తోంది.ఫ్రాన్స్ (పవర్‌ ఇండెక్స్ 0.1878)అత్యంత శక్తివంతమైన సైనిక సామర్థ్యం కల్గిన దేశాల జాబితాలో ఫ్రాన్స్ ది ఏడో స్థానం. 376,000 మంది సైనికి శక్తి, 976 ఎయిర్ క్రాఫ్ట్ లు, 215 యుద్ధ ట్యాంకర్లను ఫ్రాన్స్ కల్గి ఉంది. నాటోతో పాటు, యూరోపియేన్ భద్రత విభాగంలో ఫ్రాన్స్ ముఖ్య భూమిక పోషిస్తోంది. అధునాతన ఆయుధ శక్తిని ఫ్రాన్స్ కల్గి ఉంది. అధునాతమైన అణ్వాయుధాలను కల్గిన దేశంగా ఫ్రాన్స్ ఉంది.జపాన్ (పవర్‌ ఇండెక్స్ 0.1839)సైనిక శక్తిలో జపాన్ ఎనిమిదో స్థానంలో ఉంది. 328,150 సైనిక శక్తి, 1, 443 ఎయిర్ క్రాఫ్ట్ లు, 521 యుద్ధ ట్యాంకర్లను జపాన్ కల్గి ఉంది. మిలటరీ విభాగంలో సాంకేతికపరంగా అడ్వాన్స్ డ్ గా ఉ‍న్న దేశం జపాన్. త్యున్నత సైనిక శిక్షణ కల్గిన దేశంగా జపాన్ కొనసాగుతోంది. ప్రధానంగా నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో జపాన్ సైనిక శక్తి అత్యంత బలంగా ఉంది.టర్కీ (పవర్‌ ఇండెక్స్ 0.1902)టర్కీది తొమ్మిదో స్థానం. 883,900 సైనిక సిబ్బంది, 1,083 ఎయిర్ క్రాఫ్ట్స్, 2,238 యుద్ధ ట్యాంకర్లు ఫ్రాన్స్ కల్గి ఉంది. మిడిల్ ఈస్ట్, యూరోపియన్ వ్యవహారాల్లో టర్కీ అత్యంత చురుకైన పాత్ర పోషిస్తోంది. ఎయిర్ ఫోర్స్, మిలటరీ విభాగాల్లో టర్కీ అత్యంత బలంగా ఉంది.ఇటలీ (పవర్‌ ఇండెక్స్ 0.2164)అత్యంత బలమైన సైనిక శక్తి కల్గిన దేశాల టాప్ 10 జాబితాలో ఇటలీది పదో స్థానం. 280,000 సైనిక శక్తిని ఇటలీ కల్గి ఉంది. 729 ఎయిర్ క్రాఫ్ట్ లు, 200 యుద్ధ ట్యాంక్లరు ఇటలీ కల్గి ఉంది. నాటోలో ఇటలీ ముఖ్య భూమికను పోషిస్తూ ఉంది.పవర్‌ ఇండెక్స్‌ లెక్క ఇలా..పవర్‌ ఇండెక్స్‌ స్కోరును లెక్కించేటప్పుడు అన్ని అంశాలకు సమాన ప్రాధాన్యం ఇస్తారు. ఒక దేశానికి అత్యంత శక్తివంతమైన ఎయిర్‌ఫోర్స్‌ ఉండి, అదే దేశానికి నేవీ బలం తక్కువగా ఉంటే, ఆ దేశం మొత్తం స్కోరులో వెనకంజలో ఉంటుంది. ఇక్కడ సైనిక బలాన్ని అన్ని కోణాల్లో సమగ్రంగా లెక్కించి ఒక అంచనా వేస్తారు. పవర్‌ ఇండెక్స్‌ స్కోరు ఎంత తక్కువగా ఉంటే, ఆ దేశం అంత బలంగా ఉన్నట్లు అర్ధం. .

IPL 2025: Top 10 Highest Paid English And Hindi Commentators, Gavaskar In 1st Spot5
IPL: కోట్లలో జీతాలు.. అత్యధిక మొత్తం అందుకున్న కామెంటేటర్‌ ఎవరో తెలుసా?

ఐపీఎల్‌ అంటే ఫోర్లు, భారీ సిక్సర్లే కాదు.. వాటిని బాదిన ఆటగాళ్లు, వారు ఆడిన షాట్లను విశ్లేషిస్తూ.. వారి ఆట కట్టించేందుకు బౌలర్లు రచించే వ్యూహాలు.. ఇలా ఒక్కటేమిటి.. మ్యాచ్‌ ఆసాంతం తమ అద్భుతమైన గొంతుతో ఆటను కళ్లకు గట్టినట్లు చూపుతున్నారే అనేలా వ్యాఖ్యానం చేసే కామెంటేటర్లు కూడా ఇందులో భాగమే!భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌కు చెందిన ఎంతో మంది దిగ్గజాలు ఐపీఎల్‌లో వ్యాఖ్యాతలుగా అలరిస్తున్నారు. మరి.. వాళ్లకు ఇచ్చే పారితోషికం ఎంత? అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకునే కామెంటేటర్‌ ఎవరు?.. హిందీ, ఇంగ్లిష్‌, ప్రాంతీయ భాషల్లో కామెంట్రీ చేసే సీనియర్‌, జూనియర్ల జీతాలు ఎంత? తదితర విషయాలు గమనిద్దామా?టీమిండియా దిగ్గజాలు సునిల్‌ గావస్కర్‌, అనిల్‌ కుంబ్లే, రవిశాస్త్రి నుంచి ఆకాశ్‌ చోప్రా, హర్షా భోగ్లే, ఇయాన్‌ బిషప్‌ వరకు అత్యధిక పారితోషికం అందుకునే కామెంటేటర్ల జాబితాలో ఉన్నారు. వీరిలో సునిల్‌ గావస్కర్‌ అత్యధికంగా ఇంగ్లిష్‌ కామెంట్రీకి రూ. 4.17 కోట్ల వరకు అందుకుంటున్నట్లు సమాచారం.ఐపీఎల్‌-2024కు గానూ అత్యధిక పారితోషికం అందుకున్న టాప్‌-10 కామెంటేటర్లు 1. సునిల్‌ గావస్కర్‌ (భారత్‌)- ఇంగ్లిష్‌- రూ. 4.17 కోట్లు2. మాథ్యూ హెడెన్‌ (ఆస్ట్రేలియా)- ఇంగ్లిష్‌- రూ. 4.17 కోట్లు3. కెవిన్‌ పీటర్సన్‌ (ఇంగ్లండ్‌)- ఇంగ్లిష్‌- రూ. 4.17 కోట్లు4. ఇయాన్‌ బిషప్‌ (వెస్టిండీస్‌)- ఇంగ్లిష్‌- రూ. 4.17 కోట్లు5. హర్షా భోగ్లే (భారత్‌)- ఇంగ్లిష్‌- రూ. 4.1 కోట్లు6. రవిశాస్త్రి (భారత్‌)- ఇంగ్లిష్‌- రూ. 4 కోట్లు7. ఆకాశ్‌ చోప్రా (భారత్‌)- హిందీ- రూ. 2.92 కోట్లు8. సంజయ్‌ మంజ్రేకర్‌ (భారత్‌)- హిందీ- రూ. 2.8 కోట్లు9. సురేశ్‌ రైనా (భారత్‌)- హిందీ- రూ. 2.5 కోట్లు10. హర్భజన్‌ సింగ్‌ (భారత్‌)- హిందీ- రూ. 1.5 కోట్లు11. జతిన్‌ సప్రూ (భారత్‌)- హిందీ- ఒక్కో మ్యాచ్‌కు రూ. 1.5 లక్షల చొప్పునటాప్‌ టైర్‌, జూనియర్‌ కామెంటేటర్ల జీతాల మధ్య భారీ వ్యత్యాసం (ఒక్కో మ్యాచ్‌కు)ఇంగ్లిష్‌- టాప్‌ టైర్‌ కామెంటేటర్లకు రూ. 6- 10 లక్షలు- జూనియర్లకు రూ. 35 వేల చొప్పునహిందీ- టాప్‌ టైర్‌ కామెంటేటర్లకు రూ. 6- 10 లక్షలు- జూనియర్లకు రూ. 35 వేల చొప్పునతమిళ్‌ లేదా ఇతర ప్రాంతీయ భాషలు- టాప్‌ టైర్‌ కామెంటేటర్లకు రూ. 6- 10 లక్షలు- జూనియర్లకు రూ. 35 వేల చొప్పునఆటగాళ్లతో పాటు కామెంటేటర్లపైనా కనక వర్షం కురిపించేదే ఐపీఎల్‌. మరి క్యాష్‌ రిచ్‌ లీగ్‌ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా! అంటారా?!చదవండి: IND Vs PAK: బీసీసీఐ కీలక నిర్ణయం

After Vincy Aloshious another actor accuses Shine Tom Chacko6
దసరా విలన్‌పై మరో నటి ఆరోపణలు.. సెట్‌లో చాలా అసభ్యంగా!

దసరా విలన్ షైన్ టామ్ చాకో పేరు మలయాళ ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది. ఇటీవల ఆయనపై నటి విన్సీ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. అంతేకాకుండా డ్రగ్స్ తీసుకుంటున్నారని చాకో ఉంటున్న హోటల్‌పై రైడ్ చేశారు. ‍అయితే పోలీసులకు రాకముందే హోటల్ నుంచి తప్పించుకున్నాడు. ఇలా రోజుకో వివాదంతో టామ్ చాకో పేరు మాలీవుడ్‌లో హాట్ ‍టాపిక్‌గా మారింది. విన్సీ ఆరోపణలపై ఇప్పటికే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ఈ వివాదంపై విచారణ ‍కొనసాగుతున్న వేళ.. మరో నటి టామ్ చాకోపై విమర్శలు చేసింది. తనతో కూడా అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న మలయాళ నటి అపర్ణా జాన్ ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టామ్ చాకో ప్రవర్తించిన తీరుపై మాట్లాడింది. విన్సీ అలోషియస్ చేసిన ఆరోపణలు వందశాతం నిజమేనని మద్దతుగా నిలిచింది. షైన్ టామ్ చాకో సినిమా సెట్స్‌లో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తాడని చెప్పుకొచ్చింది. సెట్‌లో మహిళకు మానసిక క్షోభ కలిగించేలా షైన్ ప్రవర్తించాడని పేర్కొంది. అతను మాట్లాడుతున్నప్పుడు నోటి నుంచి తెల్లటి పొడి రాలుతుండేదని.. అది మాదకద్రవ్యమో? కాదో తనకు తెలియదని అపర్ణ చెప్పింది. అతని మాటలన్నీ డబుల్ మీనింగ్‌ అర్థం వచ్చేలా ఉంటాయని తెలిపింది.(ఇది చదవండి: దసరా నటుడు అరెస్ట్‌)కాగా.. ఇటీవల నటి విన్సీ ఆరోపణల తర్వాత చాకోను అరెస్టు చేసి బెయిల్‌పై విడుదల చేశారు. విన్సీ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయనప్పటికీ, అతనిపై డ్రగ్ ఆరోపణలు రావడంతో చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. టామ్ చాకో చివరిసారిగా అజిత్ కుమార్‌ నటించిన గుడ్ బ్యాడ్‌ ‍అగ్లీ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించారు. తెలుగులో దసరా మూవీతో గుర్తింపు తెచ్చుకున్నారు.

Modi Pays Tribute To Pahalgam Victims In Bihar Public Meeting7
‘దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా.. ఉగ్రవాదులను మట్టిలో కలిపేస్తాం’

పాట్నా: జమ్మూకశ్మీర్‌ పహల్గాం (Pahalgam terror attack) ఉగ్రదాడిపై ప్రధాని మోదీ తొలిసారి స్పందించారు. ఉగ్రవాదులకు బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదులు సప్తసముద్రాల అవతల దాక్కున్నా సరే వెతికి మరి మట్టిలో కలిపేస్తాం. 140 కోట్ల మంది సంకల్పం ఉగ్రవాదుల్నే కాదు వారిని పెంచి పోషిస్తున్న ఉగ్రవాద నాయకుల వెన్ను విరిచేస్తుంది’ అని హెచ్చరించారు. ప్రధాని మోదీ గురువారం బీహార్‌లో (Bihar)పర్యటించారు. జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా బీహార్‌ రాష్ట్రం మధుబని నగరంలో మౌలిక సదుపాయాలు, ప్రజా సేవలను బలోపేతం చేసేందుకు వీలుగా పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. రూ.13,480 కోట్లకు పైగా వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. సభలో మాట్లాడానికి ముందు పహల్గాం బాధితులకు రెండు నిమిషాల కళ్లు మూసుకుని శ్రద్దాంజలి ఘటించారు. అనంతరం ప్రసంగాన్ని ప్రారంభించారు.#WATCH | On Pahalgam terror attack, PM Modi says, "Today, on the soil of Bihar, I say to the whole world, India will identify, trace and punish every terrorist and their backers. We will pursue them to the ends of the Earth. India's spirit will never be broken by terrorism.… pic.twitter.com/8SPHOAJIi2— ANI (@ANI) April 24, 2025 ‘పహల్గాం ఉగ్ర దాడిలో అమాయకులు చనిపోయారు. దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా.. పహల్గాం ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకుంటాం. టెర్రరిస్టులకు తగిన గుణపాఠం చెప్తాం. ఉగ్రవాదులను మట్టిలో కలిపే సమయం ఆసన్నమైంది. కార్గిల్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరిలోనూ దుఃఖం, ఆగ్రహం ఉన్నాయి. ఈ దాడి కేవలం అమాయక పర్యాటకులపై మాత్రమే కాదు. భారత దేశ ఆత్మపై దాడి జరిగింది. దాడి చేసిన ఉగ్రవాదులు, దానికి కుట్ర పన్నిన వారికి మనం విధించే శిక్ష వారి ఊహకి కూడా అందదు. జమ్మూకశ్మీర్‌లోనే కాదు దేశంలో ఉగ్రవాదాన్ని నాశనం చేసేందుకు సమయం ఆసన్నమైంది.140 కోట్ల మంది సంకల్పం ఉగ్రవాద నాయకుల వెన్ను విరిచేస్తుందన్నారు. సప్త సముద్రాల వెనుక దాక్కున్నా సరేఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘నేను ప్రపంచం మొత్తానికి హామీ ఇస్తున్నా. భారత్‌ ప్రతి ఉగ్రవాదిని, వారికి వెనక ఎవరు ఉన్నా సరే వారిని గుర్తిస్తుంది. శిక్షిస్తుంది. ఉగ్రవాదులు సప్త సముద్రాల వెనుక దాక్కున్నా సరే వెంబడించి మరి మట్టిలో కలిపేస్తాం. ఉగ్రవాదం దేశ స్ఫూర్తిని ఎప్పటికీ విచ్ఛిన్నం చేయలేదు. ఉగ్రవాదానికి తప్పక శిక్ష పడుతుంది. న్యాయం జరిగేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సంకల్పంలో మొత్తం దేశం దృఢంగా ఉంది. మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ మనతో ఉన్నారు. ఈ సమయంలో మనతో పాటు నిలిచిన ప్రపంచ దేశాల ప్రజలకు, వారి నాయకులకు నా కృతజ్ఞతలు’అని అన్నారు.

Pakistani High Commission in Delhi celebrating With Cake8
పాకిస్తాన్‌ అధికారుల ఓవరాక్షన్‌.. పహల్గాం దాడిపై ఢిల్లీలో పాక్‌ సంబరాలు?

సాక్షి, ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడికి దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ పాకిస్తాన్‌ అధికారులు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. ఢిల్లీలో పాక్‌ హైకమిషన్‌ ఆఫీసులో సంబురాలు జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగానే కేక్‌ కట్‌ చేసుకుంటూ ఎంజాయ్‌ చేస్తున్నారు. అయితే, పహల్గాం ఉగ్రదాడికి పాక్‌ సంబరాలు చేసుకుంటా? అంటే అవుననే ఆధారాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఢిల్లీలోని పాక్‌ హైకమిషన్‌లోకి అక్కడ పనిచేసే ఓ కేక్‌ తీసుకెళ్లాడు. ఈ క్రమంలో మీడియా ప్రతినిధులు అతడిని ప్రశ్నించారు. కేక్‌ ఎందుకు అని ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా సదరు వ్యక్తి తప్పించుకుని లోపలికి వెళ్లిపోయాడు. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఉగ్రదాడికి పాకిస్తాన్‌ ప్రతినిధులు కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.This footage shows someone delivering a cake to the Pakistani High Commission in Delhi.What Pakistan’s high commission is celebrating?? TERRORISTS! pic.twitter.com/3lGnIRPcnz— BALA (@erbmjha) April 24, 2025మరోవైపు.. ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. తమ కుటుంబ సభ్యులను కోల్పోవడంతో బోరున విలపిస్తున్నారు. దీంతో, పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం చెప్పాలని భారతీయులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ హై కమిషన్ వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పాకిస్తాన్ నశించాలి అంటూ నిరసనకారులు నినాదాలు చేస్తున్నారు. ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్‌ను నామరూపాలు లేకుండా చేయాలని డిమాండ్ వినిపిస్తున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పాలని కోరుతున్నారు. దీంతో, పాకిస్తాన్‌ హైకమిషన్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ నిరసనల్లో బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. #WATCH | During the BJP protest against Pakistan following the Pahalgam terror attack, BJP MLA Satish Upadhyay says, "There is anger in the hearts of people of India. Pakistan could not tolerate how Kashmir joined the mainstream...Yesterday, the Modi government conducted a… pic.twitter.com/Dk61hNA5VM— ANI (@ANI) April 24, 2025ఇదిలా ఉండగా.. పాకిస్తానీ పౌరులు వెంటనే భారత్‌ను విడిచి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తానీలు తమ దేశానికి తిరిగి వెళ్తున్నారు. వారంతా అట్టారి-వాఘా సరిహద్దుకు చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.VIDEO | Amritsar, Punjab: Pakistani national reach Attari-Wagah border to return to their country after India suspended the SAARC visa exemption scheme (SVES) asking Pakistani citizens in India under SVES visa to leave the country within 48 hours. The decision was taken the… pic.twitter.com/0CVYTaJcBU— Press Trust of India (@PTI_News) April 24, 2025

KSR Comments On Chandrababu Govt Land Allotments To TCS9
బాబూ.. అప్పనంగా అప్పగించేస్తారా?

ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అందరిని నిశ్చేష్టులను చేస్తున్నాయి. అపర కుబేరులకు మరింత సంపద సృష్టించడమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందా? అన్న అనుమానం వస్తోంది. దేశంలోనే అత్యంత ధనవంతమైన కంపెనీలలో ఒకటిగా పేరొందిన టాటా కంపెనీకి చెందిన టీసీఎస్‌కు ఏపీ ప్రభుత్వం వందల కోట్ల రూపాయల విలువైన భూమిని ఎకరం 99 పైసలకే అమ్మాలని నిర్ణయిస్తుందా? పైగా అది ఒక డీల్ అని చెబుతారా? వారి సొంత ఆస్తిని కూడా ఇలాగే పప్పు బెల్లాలకు పంచిపెడతారా?. ప్రజల ఉమ్మడి ఆస్తులకు జవాబుదారిగా ఉండాల్సిన ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్లు, వ్యవహరించడం సమర్దనీయమా?.విశాఖపట్నంలో ఐటీ కంపెనీ టీసీఎస్‌కు 21.6 ఎకరాల భూమి దాదాపు ఉచితంగా అందచేసేందుకు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. టీసీఎస్‌కు భూమి ఇలా ఇవ్వడం ఏమిటని అంతా ఆశ్చర్యపడుతూంటే రెండు నెలల క్రితం మాత్రమే నమోదైన ఉర్సా అనే కంపెనీకి ఇదే తరహాలో 60 ఎకరాలు ఇచ్చే ప్రతిపాదన నిశ్చేష్టులను చేస్తోంది. విశాఖకు లేదా, ఏపీలో మరోచోటకైనా ఏవైనా పరిశ్రమలు వస్తుంటే స్వాగతిస్తారు. అయితే, ఆ కంపెనీల వల్ల ఏపీకి ఉపయోగం ఉండాలి. అదే టైమ్‌లో ఆ కంపెనీలను ఆకర్షించడానికి కొన్ని రాయితీలు ఇవ్వడం తప్పు కాదు. ఏ ప్రభుత్వమైనా ఆ రకంగా కొన్ని విధానాలు రూపొందించుకుంటుంది.కానీ, ఏపీలో కూటమి ప్రభుత్వం భూముల విషయంలో ఒక విధానమంటూ లేకుండా ప్రవర్తిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు గురవుతోంది. తమకు నచ్చిన ప్రైవేటు కంపెనీలకు ఉచితంగా భూములు ఇవ్వడం, ప్రభుత్వ సంస్థలకు మాత్రం కోట్ల రూపాయలకు అమ్మడం ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందో తెలియ చేస్తుంది. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ల కన్నా, సీఎం కుమారుడు, మంత్రి లోకేశ్‌ పవర్ ఫుల్‌గా ఉంటున్నారని, ఆయన మాట కాదనలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారన్న అభిప్రాయం ఉంది. అది ప్రతి రోజూ రుజువు చేస్తున్నట్లుగా లోకేశ్‌ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానిని మంత్రివర్గం అంతా వంత పాడటం సర్వ సాధారణంగా మారిపోయినట్లుంది. పైకి చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ అంటూ ప్రచారం చేస్తూ లోకేశ్‌ స్వయంగా కార్పొరేట్, ప్రైవేటు రంగంలో తన పరపతి పెంచుకునే పనిలో ఉన్నారేమో అనిపిస్తుంది.తెలంగాణకు హైదరాబాద్, కర్ణాటకకు బెంగుళూరు, తమిళనాడుకు చెన్నై బ్రాండ్లు అయితే.. ఏపీకి చంద్రబాబు బ్రాండ్ అని లోకేశ్‌ గొప్పగా చెప్పుకుంటారు. కానీ, అందులో వాస్తవం లేదని ఈ తాజా నిర్ణయం తెలియచేస్తుంది. ఎవరికైనా బ్రాండ్ ఇమేజీ ఉంటే ఏపీకి ఆయా ప్రముఖ సంస్థలు వాటంతట అవే రావాలి. లేదా కూటమి సర్కార్ కోరగానే ప్రభుత్వ విధానాల ప్రకారం పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలి. అవేవీ కాకుండా అత్యంత విలువైన ప్రజల ఆస్తులను తమకు ఉచితంగా ఇస్తేనే వస్తామని ఆ ప్రైవేటు సంస్థలు చెబితే చంద్రబాబు బ్రాండ్ ఏమైనట్లు?. విశాఖలో 99 పైసలకే ఎకరా భూమి అప్పగించడం అంటే చంద్రబాబు బ్రాండ్ విలువ ఇంతేనా అన్న సందేహం మేధావులలో వస్తోంది. టీసీఎస్‌కు ఈ రకంగా స్థలం ఇచ్చాక, మిగిలిన సంస్థలు కూడా ఇదే రకంగా భూమి ఇవ్వాలని కోరవా?. అందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందా?. ఈ ముసుగులో కూటమి పెద్దలు తమ అస్మదీయ కంపెనీలకు విలువైన భూములను ఈ రకంగా అప్పగిస్తే పరిస్థితి ఏమిటి?. ఒక్కసారి అమ్మాక ఆ సంస్థలు సరిగా పని చేయకపోయినా, ఆ భూమి అమ్ముకున్నా చేయగలిగేది ఏం ఉంటుంది?.ఐటీ పరిశ్రమకు ప్రభుత్వ స్థలాలను లీజుకు ఇస్తే అదో రకం. కానీ, ఏకంగా వాటిని ఉచితంగా దానం చేస్తున్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తే అది ఏ రకంగా ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది?. మన సంపదతో వారు ఎంజాయ్ చేసినట్లు కాదా?. కాకపోతే తమకు మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా తమ చేతిలో ఉంది కదా అని ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకోవడం సబబేనా?. గతంలో జగన్ ప్రభుత్వంలో అదానీ, తదితర సంస్థలకు లీజ్ పద్దతిలో భూములు కేటాయిస్తేనే మొత్తం అదానికి రాష్ట్రాన్ని రాసిచ్చేస్తున్నారని ఎల్లో మీడియా నానా గగ్గోలు పెట్టాయి కదా?. అప్పుడు ఆ మీడియాకు టీడీపీ, జనసేన మద్దతు ఇచ్చాయి కదా!. ఇప్పుడు వందల కోట్ల విలువైన భూములను వేల కోట్ల లాభాలు గడించే టాటా సంస్థకు ఉచితంగా ఇస్తున్నారు. దీన్ని ఎలా సమర్ధించుకుంటారు?. నిజమే ఆ కంపెనీ వస్తే కొంతమందికి ఉద్యోగాలు రావచ్చు. అవన్నీ ఏపీలోని వారికే వస్తాయన్న గ్యారంటీ ఉండదు. అయినా ఫర్వాలేదు. రిజిస్ట్రేషన్ విలువకో, మార్కెట్ విలువకో, దానికన్నా కాస్త తక్కువకో భూములు కేటాయిస్తే తప్పు కాదు.సాధారణంగా పారిశ్రామిక వసతుల కల్పన సంస్థ ఆయా చోట్ల మౌలిక వసతులు కల్పించి పరిశ్రమలు పెట్టుకునేవారికి నిర్దిష్ట రేటుకు విక్రయిస్తుంటుంది. అంతే తప్ప ఉచితంగా ఇవ్వదు. కానీ, టాటా సంస్థకు విశాఖ రిషికొండ వద్ద 21.6 ఎకరాల భూమిని కేవలం 22 రూపాయలకే అమ్ముతున్నామని, తానే ఈ కంపెనీతో డీల్ చేశానని లోకేశ్‌ ఒక ఇంటర్వ్యూలో ప్రకటించారు. దానికి ఆ ఇంటర్వ్యూ చేసే యాంకర్ ఆశ్చర్యపోయారు. అదెలాగా ప్రభుత్వం అలాంటి విధానం తయారు చేసిందా? లేక కంపెనీల వారీగా ఇలాగే అమ్ముతుందా? అని అడిగితే ప్రభుత్వం విధానం కాదని, టాటా సంస్థ కేటలిస్టుగా ఉంటుందని భావించి తాము ఈ నిర్ణయం చేశామని 1990 దశకంలో కూడా ఇలేగే జరిగిందని అన్నారు.టాటా కన్సల్టెన్సీకి నికర లాభమే రూ.48554 కోట్లట. అంత పెద్ద కంపెనీ ఎకరా పది కోట్లు పెట్టి కొనుగోలు చేసినా వారికి అయ్యే వ్యయం 220 కోట్లే. ఆ మాత్రం భరించలేని స్థితిలో ఆ కంపెనీ లేదా?. కానీ, ప్రభుత్వమే ఇంత విలువైన భూమిని లీజుకు కాకుండా దాదాపు ఉచితంగా ఇచ్చేస్తామని అంటే ఏ సంస్థ కాదంటుంది?. రాష్ట్రంలో సంపద సృష్టించి పేదలకు పంచుతామని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం, ప్రజల సంపదను ప్రైవేటు కంపెనీలకు దోచిపెడుతోందని ఐఏఎస్ వర్గాలలోనే చర్చ జరుగుతోందట. పీ-4 విధానంలో ప్రైవేటు సంస్థలు ముందుకు వచ్చి పేదలను దత్తత తీసుకోవాలి. కానీ, ఇలా కుబేరులను దత్తత తీసుకుని, ప్రజల సంపదను కోటీశ్వరులకు అప్పగించడం పీ-4 విధానమా అన్న ప్రశ్నను పలువురు వేస్తున్నారు. నిజానికి విశాఖలో యూనిట్ పెట్టడానికి టీసీఎస్‌ గత ప్రభుత్వ టైమ్‌లోనే అంగీకరించింది. ఆ కంపెనీ అధినేత చంద్రశేఖరన్ అప్పట్లోనే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌తో భేటీ కూడా అయ్యారు. కానీ, ఇంతలోనే ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇప్పుడు లోకేశ్‌ తానే దీనిని సాధించానని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తప్పు కాదు.. అదే మార్కెట్ రేటుకు ఈ భూమిని వారికి ఇచ్చేలా ఒప్పందం చేసుకుని ఉంటే అప్పుడు క్రెడిట్ తీసుకున్నా ఫర్వాలేదు.అలా కాకుండా ఉత్త పుణ్యానికి వందల కోట్ల ఆస్తిని ధారాదత్తం చేసి. అదేదో గొప్ప సంగతి అన్నట్లు చెప్పుకుంటే ఏమి లాభం. పైగా ఈ ప్రక్రియ ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్దంగా ఉందని మేధావులు చెబుతున్నారు. రిషికొండ వద్ద రిజిస్ట్రేషన్ విలువ ప్రకారమే చదరపు గజం విలువ ముప్పై వేల వరకు ఉంది. మార్కెట్ ధర ఇంకా అధికంగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ విలువను పరిగణనలోకి తీసుకుంటే ఆ భూమి విలువ 320 కోట్లకు మించి ఉంటుందని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ చెప్పారు. 2012లో విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం ప్రభుత్వ భూములను మార్కెట్ విలువలో 10 శాతం కంటే తక్కువకు ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇవ్వరాదు. అలాగే అమ్మదలిస్తే మార్కెట్ ధరకన్నా తక్కువకు విక్రయించ రాదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. వీటిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇదే టైంలో విశాఖలో నావికా దళానికి, సీబీఐకి ఎకరా రూ.కోటి చొప్పున, పోస్టల్‌ శాఖకు ముప్ఫై సెంట్లకే రూ.కోటి చొప్పున వసూలు చేశారు. ఇప్పుడు టీసీఎస్‌కు 22 రూపాయలకు ఇవ్వడం ఏమిటని శర్మ ప్రశ్నించారు.టీసీఎస్‌ రూ.1370 కోట్లు పెట్టుబడి పెడితే 12వేల ఉద్యోగాలు వస్తాయని లోకేశ్‌ అంటున్నారు. నిజంగా అంతమందికి ఉద్యోగాలు వస్తాయా అన్నది ఒక డౌటు. అది కూడా ఏపీ వారికే ఇస్తారా అన్నది మరో ప్రశ్న. ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ వచ్చాక కాని, ఇతరత్రా కాని, ఐటీ రంగంలో కూడా ఉద్యోగాలు ఇవ్వడం తగ్గిందని చెబుతున్నారు. ఈ మధ్యనే గూగుల్ వంటి ప్రముఖ సంస్థలు ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయని చెబుతున్నారు. అసలు టీసీఎస్‌కు మాత్రమే 21 ఎకరాల స్థలం అవసరమా? పోనీ ఏ ముప్పై ఏళ్లో, ఏభై ఏళ్లకో లీజుకు వస్తే తిరిగి ప్రభుత్వానికి ఆ స్థలం వస్తుందిలే అని అనుకోవచ్చు. రూ.22 లకే ఇచ్చేస్తే దానిపై ప్రభుత్వానికి హక్కులు కూడా ఉండవు.నిజంగానే 12 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్లయితే ఆ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం అవుతుందా?. అమరావతిలో సైతం కూటమి సర్కార్ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు భారీ రేట్లకు, కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలకు అందులో మూడో వంతు ధరకే భూములు ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా ఉచితంగా భూములు ప్రైవేటు కంపెనీలకు కట్టబెడుతున్నారు. దీనినే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు అంటారని పలువురు చమత్కరిస్తున్నారు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Banks to remain closed for four days till April 30 Check full list10
బ్యాంకులకు ఏప్రిల్‌లో ఇంకా 4 సెలవులు..

మరికొన్ని రోజుల్లో ఏప్రిల్‌ నెల ముగుస్తుంది. ఈ మిగిలిన రోజుల్లో ఏప్రిల్‌ 30 వరకూ దేశంలోని బ్యాంకులకు నాలుగు రోజులు సెలవులు ఉన్నాయి. వీటిలో సాధారణ వారాంతపు సెలవులైన నాలుగో శనివారం, ఆదివారంతోపాటు విశేష దినోత్సవాల సెలవులూ ఉన్నాయి. ఆయా రోజుల్లో బ్యాంకు శాఖలు ఖాతాదారులకు అందుబాటులో ఉండవు.దేశంలో బ్యాంకులకు సెలవులను భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) నిర్ణయిస్తుంది. స్థానిక పండుగలు, విశేష సందర్భాల ఆధారంగా ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారవచ్చు. ఈ సెలవులు ఏయే ప్రాంతాల్లో ఉన్నాయో ముందస్తుగా తెలుసుకుంటే వినియోగదారులు తమ బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవడానికి వీలుంటుంది.రానున్న బ్యాంక్ సెలవుల జాబితా» ఏప్రిల్ 26న నాలుగో శనివారం, గౌరీ పూజ కారణంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి.» ఏప్రిల్ 27న ఆదివారం సాధారణ వారాంతపు సెలవు ఉంటుంది.» ఏప్రిల్ 29న పరశురామ్ జయంతి సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ లో బ్యాంకులకు సెలవు.» ఏప్రిల్ 30న కర్ణాటకలో బసవ జయంతి, అక్షయ తృతీయను పురస్కరించుకుని బ్యాంకులు మూతపడనున్నాయి.ఈ సెలవులు ఆఫ్‌లైన్ బ్యాంకింగ్ సేవలపై ప్రభావం చూపినప్పటికీ, ఖాతాదారులకు డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. చాలా కీలకమైన బ్యాంకింగ్ కార్యకలాపాలు ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించి నిర్వహించుకునే వెసులుబాటు ఉంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement