Top Stories
ప్రధాన వార్తలు

‘లోకేష్ అన్యాయం చేశారు మీరైనా..’ పట్టించుకోని పవన్!
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు నిరసన సెగ తగిలింది. మంగళగిరి జనసేన కార్యాలయంలో ఇవాళ ఆ పార్టీ ఆధ్వర్యంలో పహల్గాం సంతాప సభ జరిగింది. అయితే ఆ సమయంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(PET) అభ్యర్థులు ఆయన కోసం నిరసన చేపట్టారుడీఎస్సీ నుంచి పీఈటీని ఎత్తేయడంపై ఆయన్ని ప్రశ్నించారు. పాదయాత్రలో నారా లోకేష్ తమకు హామీ ఇచ్చి మోసం చేశారని.. కనీసం మీరైనా న్యాయం చేయాలని పవన్‌ను ఉద్దేశిస్తూ ఫ్లెక్సీ, ఫ్లకార్డులు పట్టుకున్నారు. వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, దాని ద్వారానే పీఈటీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.పవన్ కాన్వాయ్ వస్తున్న సమయంలో వాళ్లు తమ నినాదాలను పెంచారు. అయితే పవన్ వాళ్లను కనీసం పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో వాళ్లు నిరాశ చెందారు.

ట్రంప్ కోరుకునేది ఎన్నటికీ జరగదు.. విక్టరీ స్పీచ్‌లో మార్క్ కార్నీ
టొరంటో: కెనడాలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అధికార లిబరల్ పార్టీ(Liberal Party of Canada) విజయం దిశగా దూసుకెళ్తోంది. వరుసగా నాలుగోసారి అధికారం చేపట్టడం దాదాపు ఖాయం కావడంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. ఈ క్రమంలో మార్క్ కార్నీ(Mark Carney) మద్ధతుదారుల్ని ఉద్దేశిస్తూ విజయ ప్రసంగం చేస్తూ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు.‘‘కెనడా చరిత్రలో కీలకమైన క్షణం ఇది. అమెరికా(America)తో మన పాత ఏకీకరణ సంబంధం ఇప్పుడు ముగిసింది. ఇకపై అమెరికాను స్థిరమైన మిత్రదేశంగా నమ్మలేం. అమెరికా చేసిన ద్రోహం నుండి మనం తేరుకుంటున్నాం. నెలల తరబడి నుంచి నేను ఈ విషయంలో హెచ్చరిస్తూ వస్తున్నా. అమెరికా మన భూమిని, మన వనరులను, మన నీటిని, మన దేశాన్ని కోరుకుంటోంది. మనల్ని విచ్ఛిన్నం చేసి తద్వారా కెనడాను సొంతం చేసుకోవాలని ట్రంప్ ప్రయత్నించారు. కానీ, అది ఎప్పటికీ జరగదు’’ అని కార్నీ అన్నారు.అమెరికాతో సుంకాల యుద్ధం, కెనడా యూఎస్‌లో 51వ రాష్ట్రంగా చేరాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) బెదిరింపుల వేళ ఈ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కెనడా పార్లమెంట్లో 343 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటునకు 172 మెజారీటీ అవసరం. ఇప్పటికే కన్జర్వేటివ్ పార్టీ నేత పియరీ పొయిలివ్రా ఓటమిని అంగీకరించారు. అయితే లిబరల్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోయినప్పటికీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో మిత్రపక్షాలతో కలిసి మార్క్ కార్నీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.ఈ ఏడాది జనవరిలో జస్టిన్ ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో లిబరల్ పార్టీ సభ్యులు తదుపరి ప్రధానిగా ఆర్థిక వేత్త అయిన మార్క్ కార్నీని ఎన్నుకున్నారు. ప్రధాని బాధ్యతలు చేపట్టిన కార్నీ.. ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.ఇదీ చదవండి: ట్రంప్‌తో కయ్యం.. ఎవరీ మార్క్ కార్నీ?

రజతోత్సవ సభతో నయా జోష్!.. కేసీఆర్ ప్లాన్ ఫలించినట్లేనా?
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) తెలంగాణలో తన పూర్వ వైభవాన్ని సంపాదించుకునే దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టింది. వరంగల్‌లో జరిగిన పార్టీ రజతోత్సవ సభను విజయవంతంగా నిర్వహించి ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈ సభ పార్టీ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపేందుకు, నేతల ఆత్మవిశ్వాసం పెంచేందుకు ఉపయోగపడుతుందని విశ్లేషకుల అంచనా. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ పాలనపై ఇప్పటికే అసంతృప్తి ఏర్పడ్డ నేపథ్యంలో ప్రజల దృష్టి బీజేపీవైపు కాకుండా బీఆర్ఎస్కు అధికారం వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం ఏర్పడేందుకు కూడా వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఉపయోగపడుతుంది.2023లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం అనూహ్యమే. దీంతో పార్టీ శ్రేణుల్లోనూ నైరాశ్యం నెలకొంది. ఆ తరువాత జరిగిన పార్లమెంటు, శాసన మండలి ఎన్నికల్లోనూ ఓటమే ఎదురు కావడంతో పరిస్థితులు ఇబ్బందిగా మారాయి. రాజకీయాలలో ఒడిదుడుకులు ఉండటం సహజం. రాజకీయ పార్టీలకు ఇలాంటి పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎదుర్కొన్నాయి. 1983 నుంచి 1989 వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 1989 లోక్‌సభ ఎన్నికల్లో రెండు స్థానాలకే పరిమితమైంది. ఆ తర్వాత 1991లో 13 సీట్లు వచ్చాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్లపాటు సీఎంగా ఉన్నారు. కానీ ఆయన ఒంటెద్దు పోకడల ఆరోపణలు, వ్యతిరేకత ఉందని తెలిసి సిట్టింగ్‌లకు సీట్లు ఇవ్వడం వంటి అనేకానేక కారణాల వల్ల 2023 ఎన్నికల్లో పార్టీ 39 సీట్లకే పరిమితమైంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదానైతే దక్కించుకుంది కానీ.. పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో కొంత నష్టం చేసింది.రేవంత్ రెడ్డి సర్కార్ కాళేశ్వరం, తదితర అంశాలపై విచారణ కమిషన్లు వేయడం కూడా పార్టీపై వ్యతిరేక ప్రచారం జరిగేందుకు అవకాశమిచ్చింది. దీన్ని అధిగమించడానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రజలలో వ్యతిరేకత పెంచడానికి కేసీఆర్ ఈ రజతోత్సవ సభను వాడుకున్నారు. తన పాలనకు, కాంగ్రెస్ పాలనకు మధ్య ఉన్న తేడాను వివరించి, ప్రస్తుతం తెలంగాణ ఆగమవుతోందని, అది చూసి తనకు దుఃఖం వేస్తోందని ఆయన చెప్పారు. అలాగే తెలంగాణ ఉద్యమం నాటి సంగతులు, 1956 నుంచి జరిగిన రాజకీయ పరిణామాలు అన్నింటినీ ప్రజలకు వివరించడం ద్వారా మరోసారి సెంటిమెంట్‌ను ప్రయోగించే యత్నం చేసినట్లు స్పష్టంగా బోధపడుతుంది. ఈ క్రమంలో 1956లో ప్రజలంతా తెలంగాణ, ఏపీలో కలపడానికి వ్యతిరేకించారని ఆయన చెప్పడం కొంత వక్రీకరించడమే అవుతుంది. ఎందుకంటే అప్పట్లో తెలంగాణ, ఆంధ్రలు కలవడానికి అంగీకరించని వారు కొంతమంది ఉండవచ్చు కానీ, హైదరాబాద్ శాసనసభలో ఉమ్మడి ఏపీకి అనుకూలంగా మెజార్టీ సభ్యులు మాట్లాడారు.అంతేకాదు.. అంతకుముందు ప్రముఖుల సారథ్యంలో తెలంగాణలో సైతం ఆంధ్ర మహాసభలు జరిగేవి. చరిత్రను ఎవరికి అనుకూలంగా వారు చెప్పుకోవచ్చు. అది వేరే విషయం. 2009లో సోనియాగాంధీ తెలంగాణ ప్రకటన చేయడం కీలకమైన మలుపు. టీఆర్ఎస్కు అప్పట్లో ఇద్దరు ఎంపీలే ఉండేవారు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించడం, తదనంతరం జరిగిన పరిణామాలలో తెలంగాణలోని కాంగ్రెస్ నేతలు పలువురు ప్రత్యేక రాష్ట్ర సాధనకు కట్టుబడి ఉండటం, చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడం వంటి అంశాలు కలిసి వచ్చాయి.తెలంగాణ వాదంతో కాంగ్రెస్, టీడీపీలను కేసీఆర్ భయపెట్టగలిగారు. ఆ పార్టీలను తనదారిలోకి తెచ్చుకోగలిగారు. అంతవరకు ఉన్న రాజకీయ ఉద్యమం, ప్రజా ఉద్యమంగా మారే పరిస్థితులు ఏర్పడడం కలిసి వచ్చిన అంశం అని చెప్పాలి. ఏది ఏమైనా తెలంగాణకు సంబంధించినంత వరకు గతంలో నాయకత్వం వహించిన చెన్నారెడ్డి, తదితరులకు భిన్నంగా కేసీఆర్ పనిచేసిన మాట నిజం. టీడీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ వాదానికే కట్టుబడి రాజకీయం చేశారు. నిజానికి ఇదంతా గతం. ఇప్పుడు ఆ అంశాలను ప్రస్తావించి కాంగ్రెస్ ఆనాడైనా, ఈనాడైనా తెలంగాణకు విలనే అని చెప్పడంలో హేతుబద్దత ఎంత ఉందన్నది ఎవరికి వారు ఆలోచించుకోవాలి. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా అని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి, పొన్నం, సీతక్కలు ప్రశ్నించారు.అయితే, ప్రస్తుతం అధికారంలో ఉన్నందున కాంగ్రెస్‌నే టార్గెట్ చేస్తారు. అదే పని కేసీఆర్ చేశారు. బీజేపీపై మాత్రం నామమాత్రపు విమర్శలు చేశారనే చెప్పాలి. అంత భారీ సభలో కేసీఆర్ ఒక్కరే మాట్లాడటం కూడా విశేషమే. సాధారణంగా ఇలాంటి సభలలో నాయకుడు వచ్చేలోగా పలువురు నేతలు మాట్లాడుతుంటారు. ఈసారి అలా చేయలేదు. కాకపోతే పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు అయిన కేటీఆర్ ప్రాముఖ్యతను మరింత పెరిగేలా ఈ సభలలో జాగ్రత్తపడ్డారని అనుకోవాలి. సభా వేదికపై కూడా కేసీఆర్‌తోపాటు ఆయన ఫోటో కూడా ఉంచారు. కేసీఆర్ తన స్పీచ్‌ను మరీ ఎక్కువ సేపు చేయలేదు. అంతేగాక.. పరుష పదాలతో కాంగ్రెస్‌ను తీవ్రంగా రెచ్చగొట్టే యత్నం కూడా చేసినట్లు అనిపించదు. కాంగ్రెస్ పాలనపై గట్టి విమర్శలే చేస్తూ, ప్రధానంగా తెలంగాణ ఆగమైందని, రియల్ ఎస్టేట్ పడిపోయిందని, రైతులు పాట్లు పడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రస్తావించి వాటిని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్లు ప్రస్తావించకుండా ప్రసంగించడం కూడా చెప్పుకోదగిన అంశమే.కాంగ్రెస్ పార్టీ హామీలపై బాండ్లు రాసిచ్చి ప్రజలను మోసం చేసిందని ఆయన పేర్కొన్నారు. ఇందులో వాస్తవం ఉందని చెప్పక తప్పదు. కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన కొన్ని వాగ్దానాలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఉపయోగం లేదని ఆయన తేల్చారు. తన పాలన గురించి చెబుతూ ప్రత్యేకించి రాష్ట్రంలో నీరు, విద్యుత్ తదితర సదుపాయాలు కల్పించడంలో నెంబర్ వన్‌గా ఉన్నామని, భూముల విలువలు పెరగడానికి దోహదపడ్డామని, రైతుబంధును అమలు చేయడం ద్వారా రైతులకు మేలు చేశామని ఆయన వివరించారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడుతోందని, పోలీసులకు రాజకీయాలు వద్దని ఆయన సూచించారు. ఆయా సందర్భాలలో సభలోని వారిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంపై చేస్తున్న ఆరోపణలు, అధిక అప్పుల భారం, ఫోన్ ట్యాపింగ్ తదితర అంశాల జోలికి వెళ్లలేదు.కేసీఆర్ స్పీచ్ ముగిసిన వెంటనే మంత్రులు గట్టిగానే జవాబు ఇచ్చారు. కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని, ఆయన చేసిన విమర్శలపై చర్చకు సిద్దమని అన్నారు. పొన్నం ప్రభాకర్ అయితే గ్రీన్‌మ్యాట్ వేసి ప్రజలు అధికంగా వచ్చినట్లు చూపే యత్నం జరిగిందని ఆరోపించారు. కాకపోతే గతంలో మాదిరి కాకుండా, ఇప్పుడు కనుచూపు మేర కుర్చీలు వేశారు. రాజకీయ సభల నిర్వహణలో చాలా మార్పులు వస్తున్నాయి. ఏ పార్టీ సభ జరిగినా, గతంలో ఒకటి, రెండు బ్లాక్‌లు తప్ప, అంతా కిందే కూర్చునేవారు. ఇప్పుడు అలా చేయడం లేదు. విశేషం ఏమిటంటే కేసీఆర్‌పై విమర్శలు చేసిన మంత్రులలో పొంగులేటి, జూపల్లి గతంలో బీఆర్ఎస్ ప్రముఖులు. గత ఎన్నికల సమయంలో వారు కాంగ్రెస్ పక్షాన పోటీచేసి గెలిచారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకంటే చిన్నవాడు కావడం, కొందరు మంత్రులు గతంలో తన వద్ద పని చేసినవారు కావడం తదితర కారణాల వల్ల బహుశా ఆయన ఈగో సమస్య ఎదుర్కొంటున్నారని అది కేసీఆర్ స్పీచ్‌లో కనిపించిందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇది కొంతవరకు నిజమే కావచ్చు. ఓవరాల్‌గా పరిశీలిస్తే రజతోత్సవ సభకు జనం బాగానే వచ్చారు. స్పందన కూడా బాగానే ఉంది. కానీ, ఇదే వరంగల్‌లో ఉద్యమ సమయంలో ఇంతకన్నా భారీ బహిరంగ సభలే జరిగాయి. అయినా భారీ సభలే అన్నిటికి కొలమానం కావు. కాకపోతే జనంలో పార్టీ పట్ల ఒక నమ్మకాన్ని పెంచడానికి రజతోత్సవ సభ కొంతమేర అవకాశం కలిగిస్తుంది. కేసీఆర్ ఒక్కరే మాట్లాడడం వల్ల ఎంతవరకు ప్రయోజనమో చెప్పలేం. కేసీఆర్ పూర్వపు స్పీచ్‌ల మాదిరి మరీ ఘాటుగా మాట్లాడలేదన్నది ఎక్కువ మంది అభిప్రాయం. అదేమీ తప్పు కాదు. ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్లు ఉన్నప్పటికీ, ఈ సభ ద్వారా తాను మళ్లీ బయటకు వచ్చి జనంలో తిరుగుతానని కేసీఆర్ చెబుతున్నారు. ఇప్పటికీ కేసీఆర్ గ్లామర్ పైనే బీఆర్ఎస్ ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఇది కీలకం.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

భారత్‌తో యుద్ధ భయం.. పాక్ సైన్యంలో భారీ రాజీనామాలు
ఇస్లామాబాద్: కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. భారత్ ఎప్పుడు, ఎలా దాడి చేస్తుందోనన్న భయంతో పాకిస్తాన్ వణికిపోతోంది. తమపై భారత్ వైమానిక దాడులకు దిగొచ్చని పాకిస్తాన్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత వైమానిక దాడులను పసిగట్టడానికి సియాల్కోట్ ప్రాంతానికి పాక్ సైన్యం తన రాడార్ వ్యవస్థలను తరలిస్తున్నట్లు సమాచారం. అలాగే, అత్యవసరంగా తమ దేశ గగనతలాన్ని సైతం మూసివేసింది.ఇదిలా ఉండగా.. పహల్గాం దాడి తర్వాత భారత్ తీసుకుంటున్న చర్యలు, హెచ్చరికల కారణంగా పాకిస్తాన్‌కు టెన్షన్ మొదలైంది. ఈ క్రమంలో పాక్ ఆర్మీ కూడా భయాందోళనకు గురైనట్టు తెలుస్తోంది. ఈ ఉగ్రదాడి తర్వాత.. కేవలం రెండు రోజుల వ్యవధిలో పాకిస్తాన్ ఆర్మీలో 4500 మంది సైనికులు, 250 మంది అధికారులు తమ పదవులను విడిచిపెట్టి వెళ్లిపోయినట్టు ‘ది డేలీ గార్డియన్’ ఓ కథనంలో వెల్లడించింది. ఈ మేరకు పాక్ 11వ దళ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉమర్ బుఖారీ లేఖను బయటపెట్టింది.కథనం ప్రకారం.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌కు బుఖారీ ఒక లేఖ రాశారు. ఈ లేఖలో తమ దేశ సైనికుల ఆత్మస్థైర్యం వేగంగా క్షీణిస్తోందని హెచ్చరించారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే.. ఒకవేళ భారత్‌తో యుద్ధం చేయాల్సి వస్తే.. పాకిస్తాన్ సైన్యం అసమర్థమైన ప్రతిఘటనను ప్రదర్శించవచ్చు. కొంతమంది సైనికులు ఇప్పటికే క్రియాశీల విధులను విడిచిపెట్టినప్పటికీ, మరికొందరు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది పాకిస్తాన్ సైనిక ర్యాంకుల్లో తీవ్ర సంక్షోభాన్ని సూచిస్తోంది. ఈ పరిణామం తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు.. సామూహిక రాజీనామాలపై పాకిస్తాన్ సీనియర్ అధికారులు ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. పహల్గాం దాడి తర్వాత బలమైన భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంటుందనే భయమే రాజీనామాలకు ముఖ్య కారణంగా తెలుస్తోంది. భారత్ ఎప్పుడైనా దాడి చేయవచ్చనే భయంతో సైనికులు కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు సైనికులు రాజీనామాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 🚨 Breaking News.4500 Soldiers and 250 Officers of Pakistan Army resigned from service amid arising tension with India after #PahalgamTerroristAttackLt. Gen Umar Ahmad Bukhari, 11 Corp Cdr has written this letter to the Chief of army Staff. This letter is being circulated on… pic.twitter.com/XLE1G84rrY— JK CHANNEL (@jkchanneltv) April 28, 2025మునీర్ ఎక్కడ?మరోవైపు.. సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ సైన్యాధిపతి జనరల్ సయీద్ అసిమ్ మునీర్ కనిపించడం లేదన్న వార్తలు పాకిస్తాన్లో కలకలం రేపుతున్నాయి. కుటుంబంతో పాటుగా ఆయన దేశం వీడి పారిపోయారని స్థానిక మీడియాలో ఆదివారం వార్తలొచ్చాయి. ‘తొలుత కుటుంబాన్ని విదేశాలకు తరలించారు. తర్వాత తానూ పాక్ వీడారు’ అన్నది వాటి సారాంశం. కొద్ది రోజులుగా, ఆ మాటకొస్తే పహల్గాం దాడి జరిగినప్పటి నుంచీ మునీర్ బయట ఎక్కడా కన్పించడం లేదని ఆ కథనాలు చెబుతున్నాయి. దాడిపై ఆగ్రహంతో రగిలిపోతున్న భారత్ తీవ్రస్థాయిలో ప్రతీకార చర్యలకు దిగుతుందని పాక్ ఆందోళన చెందుతోంది. అందుకు తానే బాధ్యుడిని అవుతానని మునీర్ భయపడ్డారు. అందుకే దేశం నుంచి జారుకున్నట్టు కనిపిస్తోంది’ అని కథనాలు పేర్కొంటున్నాయి

ఐక్యత చాటాల్సిన తరుణమిది.. మోదీకి ఖర్గే, రాహుల్ లేఖ
న్యూఢిల్లీ: పహల్గాం దాడి నేపథ్యంతో ప్రత్యేక పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే.. ఇటు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు వేర్వేరు ఈ ఇద్దరూ ప్రధాని నరేంద్ర మోదీ(Narendra modi)కి లేఖలు రాశారు.2025 ఏప్రిల్ 22న పహల్గాం ఘటన(Pahalgam Incident)లో అమాయక పౌరులపై జరిగిన క్రూరమైన ఉగ్రవాద దాడి జరిగింది. ఈ తరుణంలో ఐక్యత, సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉంది. అందుకే పార్లమెంట్ ఉభయ సభలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయించండి. తద్వారా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలనే మన సమిష్టి సంకల్పానికి ఇది శక్తివంతమైన ప్రదర్శన అవుతుంది అని ఖర్గే(Kharge) తన లేఖలో ప్రస్తావించారు.Congress President and Leader of the Opposition in the Rajya Sabha Shri Mallikarjun Kharge has written to the PM last night requesting that a special session of both Houses of Parliament be convened at the earliest to demonstrate a collective will to deal with the situation… pic.twitter.com/v3F5unn6I8— Jairam Ramesh (@Jairam_Ramesh) April 29, 2025ఇక తన లేఖలో రాహుల్ గాంధీ.. ప్రియమైన ప్రధానిగారూ.. పహల్గాం ఉగ్రదాడితో ప్రతీ భారతీయుడు రగిలిపోతున్నాడు. ఇలాంటి క్లిష్టతరుణంలో ఉగ్రవాదానికి మనమెంత వ్యతిరేకమో చాటిచెప్పాల్సిన అవసరం ఉంది. ఐక్యత ప్రదర్శించాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయి. అది పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల మాత్రమే సాధ్యపడుతుందని ప్రతిపక్షంగా మేం భావిస్తున్నాం. ఇక్కడే ప్రజాప్రతినిధులు తమ ఐక్యతను, దృఢ సంకల్పాన్ని ప్రదర్శించగలరు. కాబట్టి వీలైనంత త్వరగా సమావేశం నిర్వహిస్తారని ఆశిస్తున్నాం అని రాహుల్ గాంధీ(Rahul gandhi) రాశారు. My letter to PM Modi requesting a special session of both houses of Parliament to be convened at the earliest. At this critical time, India must show that we always stand together against terrorism. pic.twitter.com/7AIXGqBqTl— Rahul Gandhi (@RahulGandhi) April 29, 2025ఇదిలా ఉంటే.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్ 4వ తేదీల మధ్య రెండు దఫాలుగా జరిగాయి. ఇక తరువాత జులైలో వర్షాకాల సమావేశాలు జరగాల్సి ఉంది. ఈ తరుణంలో ప్రతిపక్ష విజ్ఞప్తికి కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.పహల్గాం దాడి తర్వాత జరిగిన అఖిలపక్ష సమావేశంలో.. విపక్షాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతుగా నిలుస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

బ్రదర్ కేటీఆర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా గాయపడిన మాజీ మంత్రి కేటీఆర్(KTR) త్వరగా కోలుకోవాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. బ్రదర్ కేటీఆర్.. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని వైఎస్ జగన్ పోస్టు చేశారు. ఇక, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా గాయపడ్డారు. దీంతో, కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని కేటీఆర్‌కు వైద్యులు ఆయనకు సూచించారు. ఈ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్లో పోస్టు చేశారు. వైద్యుల పర్యవేక్షణలో రికవరీ అవుతున్నట్లు పేర్కొన్నారు. త్వరగా కోలుకొని రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న పలువురు నేతలు, అభిమానులు కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు.Wishing you a speedy recovery, brother. Get well soon! @KTRBRS— YS Jagan Mohan Reddy (@ysjagan) April 29, 2025 Picked up a slip disc injury during a gym workout session. Have been advised a few days of bed rest and recovery by my doctorsHope to be back on my feet soon— KTR (@KTRBRS) April 28, 2025

తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!
వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఐపీఎల్ 2025 (Indian Premier League 2025) సీజన్లో ఒక సంచలనం. చిచ్చర పిడుగు. 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లో అడుగుపెట్టి చర్రితను తిరగరాసిన అద్భుత ప్రతిభావంతుడు. ఐపీఎల్లో అత్యంత పిన్న వయస్కుడైన క్రికెటర్. రికార్డు బద్దలు కొట్టేశాడు. అయితే ఎవరి విజయమైనా అంత సులువుగా రాదు. కష్టాలు కన్నీళ్లు, కఠోర శ్రమతో తన కలను సాకారం చేసు కోవాల్సిందే. అలా అద్భుత ఇన్నింగ్స్ తో స్టార్‌గా మారిపోయాడు వైభవ. తరువాత ఈ సందర్బంగా కల తీరింది. భయంలేదు అంటూ తన జర్నీ గురించి మాట్లాడిన తీరు అమోఘంగా నిలిచింది. వైభవ్ సక్సెస్ జన్నీ ఎలా సాగింది, దేశంలోని అత్యుత్తమ క్రికెటర్‌గా తీర్చిదిద్దేందుకు వైభవ్ కుటుంబం చేసిన త్యాగం, కృషి ఏంటి అనేది నెట్టింట చర్చకు దారి తీసింది.వైభవ్ తండ్రి త్యాగం, పట్టుదల14 ఏళ్ల క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ, T20లలో అర్ధశతకం సాధించిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడి ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. దీంతో యువ క్రికెటర్‌పై ప్రశంసలు వెల్లువెత్తాయి. కొడుకు కోసం స్వయంగా గ్రౌండ్, నాలుగేళ్ల క్రితం పొలం అమ్మేశాడువైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ సూర్యవంశీ తన కొడుకు క్రికెటర్ కావాలనే కలను నెరవేర్చడానికి నాలుగు సంవత్సరాల క్రితం తన వ్యవసాయ భూమిని అమ్మేశాడు. 2011 మార్చి 27న బిహార్‌లోని తాజ్పూర్ అనే ఓ మారుమూల గ్రామంలో జన్మించాడు వైభవ్ సూర్యవంశీ. నాలుగేళ్ల వయసులోనే క్రికెట్ అంటే ఇష్టాన్ని, అతనిలోని ప్రతిభను తండ్రి , స్వయంగా క్రికెటర్ అయిన సంజీవ్ సూర్యవంశీ గుర్తించాడు. అంతే తనకున్న కొద్దిపాటి స్థలంలోనే వైభవ్ కోసం ఒక చిన్న ఆట స్థలాన్ని ఏర్పాటు చేశాడు. స్వయంగా ఆయన చేతుల మీదిగా ఆ నేలను చదును చేసి కొడుకు కోసం చిన్న ప్లే గ్రౌండ్ తయారు చేసి ఇచ్చాడు. అదే అతని కరియర్‌కు నాంది పలికింది. తొమ్మిదేళ్లు నిండగానే సమస్తిపూర్ పట్టణంలోని క్రికెట్ అకాడమీలో చేర్పించారు సంజీవ్. అంతేకాదు కొడుకును క్రికెటర్‌గా తీర్చిదిద్దాలన్న కోరిక, కొడుకు క్రికెట్ కలను సాకారం కావాలనే ఆశయంతో తన పొలాన్ని అమ్మేశారు. తండ్రి నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయలేదు కొడుకు. రెండున్నరేళ్ల శిక్షణ తరువాత విజయ్ మర్చంట్ ట్రోఫీ కోసం అండర్-16లో సత్తా చాటాడు వైభవ్. అలాగే ప్రతి రోజు సమస్తిపూర్ నుండి పాట్నాకు 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి మరీ మాజీ రంజీ ఆటగాడు మనీష్ ఓజా శిక్షణలో మరింత రాటు దేలాడు. అలా గత ఏడాది ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ అతి పిన్న వయస్కుడైన క్రికెటర్ ఎంపిక చేయడం వరకు అతని జర్నీ సాగింది. వైభవ్ తనకొడుకు మాత్రమే కాదని, మొత్తం బిహార్‌కు కొడుకునని సంతోషంగా ప్రకటించారు తండ్రి సంజీవ్. చదవండి : ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్డోరేమాన్ నుంచి 13 ఏళ్లకే కోటీశ్వరుడుగాతాను కష్టపడి పనిచేసి వైభవ్‌కు శిక్షణ ఇప్పించాననీ, ఎనిమిదేళ్ల వయస్సు నుండి, క్రికెటర్ కావాలనే తన కలను సాధించేందుకు చాలా కష్టపడ్డాడంటూ కొడుకు పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు సంజీవ్. చిన్నపుడు డోరేమాన్ చూసేవాడు.. ఆ తరువాత క్రికెట్ ఒకటే.. అదే అతని ప్రాణం. ఎనిమిదేళ్లకే U-16 జిల్లా ట్రయల్స్‌లో రాణించాడన్నారు. క్రికెట్ కోచింగ్ కోసం సమస్తిపూర్‌కు తీసుకెళ్లి, తీసుకొచ్చేవాడినంటూ ఆయన తన శ్రమను గుర్తు చేసుకున్నారు. తన శ్రమ, త్యాగం వృధా కాలేదు అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. వైభవ్‌ను క్రికెటర్‌గా చూడాలన్న ఆశయంకోసం వ్యవసాయ భూమిని అమ్మేశాను.ఇప్పటికీ ఆర్థిక సమస్యలున్నాయని చెప్పుకొచ్చారు.𝙏𝙖𝙡𝙚𝙣𝙩 𝙢𝙚𝙚𝙩𝙨 𝙊𝙥𝙥𝙤𝙧𝙩𝙪𝙣𝙞𝙩𝙮 🤗He announced his arrival to the big stage in grand fashion 💯It’s time to hear from the 14-year old 𝗩𝗮𝗶𝗯𝗵𝗮𝘃 𝗦𝘂𝗿𝘆𝗮𝘃𝗮𝗻𝘀𝗵𝗶 ✨Full Interview 🎥🔽 -By @mihirlee_58 | #TATAIPL | #RRvGT https://t.co/x6WWoPu3u5 pic.twitter.com/8lFXBm70U2— IndianPremierLeague (@IPL) April 29, 2025 IPL 2025 వేలం రెండవ రోజున, రాజస్థాన్ రాయల్స్ వైభవ్‌ను రూ. 1.10 కోట్లు వెచ్చింది. ఈ ఎన్నిక అంత ఆషామాషీగా ఏం జరగలేదు. ఈ మెగా వేలానికి ముందు, రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ నాగ్‌పూర్‌లో ఏర్పాటు చేసిన ట్రయల్స్ క్యాంప్‌లో సత్తా చాటుకున్నాడు. చిచ్చర పిడుగు సిక్సర్ల టాలెంట్ అప్పుడే బైటపడింది. ఇపుడు చరిత్రలో అతి పిన్న వయస్కుడైన ఆటగాడి తన పేరును లిఖించుకున్నాడు. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేసి తొలి బాల్ సిక్స్‌కొట్టి ఔరా అనిపించుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ చరిత్రలో మొదటి బంతికి సిక్స్ కొట్టిన పదో ఆటగాడిగా నిలిచాడు. అతని దూడుకును గమనిస్తే.. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు రానున్నాయో అనిపించక మానదు. అందుకే యావత్ క్రికెట్ అభిమానులు ఆల్ ది బెస్ట్ అంటూ అభినందిస్తున్నారు.

'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్
కోర్ట్ రూమ్ డ్రామా సినిమాలు తెలుగులో పెద్దగా రాలేదు. రీసెంట్ టైంలో మాత్రం 'కోర్ట్' అనే మూవీ సూపర్ హిట్ అయింది. తొలుత థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ పైన ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా అదే జోరు చూపించింది. 'కోర్ట్'(Court Movie Telugu) గురించి కాసేపు పక్కనబెడితే ఇదే తరహాలో తీసిన వెబ్ సిరీసులు కూడా ఓటీటీలో ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి 'క్రిమినల్ జస్టిస్'(Criminal Justice). 2019లో తొలి సీజన్ రిలీజ్ కాగా అద్భుతమైన స్పందన వచ్చింది. 'మీర్జాపుర్' ఫేమ్ పంకజ్ త్రిపాఠి(Pankaj Tripathi), విక్రాంత్ మస్సే ఇందులో నటించారు.(ఇదీ చదవండి: శోభిత ప్రెగ్నెంట్ అని రూమర్స్.. నిజమేంటి?) తొలి సీజన్ సూపర్ సక్సెస్ అయ్యేసరికి మరో కేసుని తీసుకుని 2020లో రెండో సీజన్, 2022లో మూడో సీజన్ రిలీజ్ చేశారు. వీటికీ మంచి స్పందన వచ్చింది. ఇప్పటివరకు వచ్చిన మూడు సీజన్లు కూడా థ్రిల్లింగ్ గా ఉన్నాయి. ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకుని నాలుగో సీజన్ ని సిద్ధం చేశారు. 'క్రిమినల్ జస్టిస్: ఏ ఫ్యామిలీ మేటర్' పేరుతో నాలుగో సీజన్ టీజర్ తాజాగా రిలీజ్ చేశారు. మే 22 నుంచి హాట్ స్టార్ ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించారు. మరి ఈసారి ఎలాంటి కేసు వాదించబోతున్నారో అనేది చూడాలి?(ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా) Seedha aur simple toh Madhav Mishra ji ke syllabus mein hai hi nahi. Aapke favourite vakeel sahab aa rahe hain courtroom mein wapas! ⚖️#HotstarSpecials #CriminalJustice - A Family Matter, streaming from May 22, only on #JioHotstar@ApplauseSocial @BBCStudiosIndia @nairsameer… pic.twitter.com/Gu1B3bnLWF— JioHotstar (@JioHotstar) April 29, 2025

RR VS GT: ఇది నా కల.. నాకు భయం లేదు: వైభవ్ సూర్యవంశీ
ఐపీఎల్ 2025లో నిన్న (ఏప్రిల్ 28) గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకంతో (35 బంతుల్లో) విరుచుకుపడ్డాడు. ఈ సెంచరీతో (38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు) వైభవ్ చాలా రికార్డులు కొల్లగొట్టాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ విధ్వంసకాండ దెబ్బకు రాయల్స్ 15.5 ఓవర్లలోనే గుజరాత్ నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి అద్భుత విజయం సాధించింది.వైభవ్ సాధించిన రికార్డులు..ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ఆటగాడు (35 బంతుల్లో)ఐపీఎల్లో సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడు (క్రిస్ గేల్ (30 బంతుల్లో) తర్వాత)ఐపీఎల్లో సెంచరీ, హాఫ్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడు (14 ఏళ్ల 32 రోజులు)ఐపీఎల్లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (11) కొట్టిన ఆటగాడు (మురళీ విజయ్‌తో కలిసి)టీ20 క్రికెట్ చరిత్రలో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడు (14 ఏళ్ల 32 రోజులు)ఐపీఎల్లో హాఫ్ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడు (14 ఏళ్ల 32 రోజులు)ఐపీఎల్ 2025లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (17 బంతుల్లో)ఐపీఎల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న అతి పిన్న వయస్కుడుమ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. శుభ్‌మన్ గిల్ (50 బంతుల్లో 84; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), జోస్ బట్లర్ (26 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), సాయి సుదర్శన్ (30 బంతుల్లో 39; 4 ఫోర్లు, సిక్స్) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. వైభవ్ రికార్డు సెంచరీతో (38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు) చెలరేగడంతో మరో 25 మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. రాయల్స్ గెలుపులో వైభవ్‌తో పాటు మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (40 బంతుల్లో 70 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా కీలకపాత్ర పోషించాడు. ఆఖర్లో రియాన్ పరాగ్ (15 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు.మ్యాచ్ అనంతరం వైభవ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఇది చాలా మంచి అనుభూతి. ఐపీఎల్లో సెంచరీ సాధించాలనేది నా కల. దీన్ని నా మూడో మ్యాచ్‌లోనే సాకారం చేసుకున్నాను. సీజన్ ప్రారంభానికి ముందు చేసిన కఠోర సాధనకు ఈ మ్యాచ్‌లో ఫలితం పొందాను. నేను బంతిని బాగా గమనించి ఆడతాను. నాకు భయం లేదు. నేను పెద్దగా ఆలోచించను. కేవలం ఆడటంపైనే దృష్టి పెడతాను. జైస్వాల్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా బాగుంది. అతను నాకు ప్రతి విషయంలో గైడ్ చేస్తాడు. ఏమి చేయాలో, ఎలా ఆడాలో చెబుతాడు. నాలో సానుకూల విషయాలను నింపుతాడు.కాగా, రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం వైభవ్‌ను ఎంతో నిశితంగా పరిశీలించి, ఈ సీజన్ మెగా వేలంలో రూ. 1.1 కోట్లకు కొనుక్కుంది. ఊహించినట్లుగానే వైభవ్ తొలి మ్యాచ్‌లోనే (లక్నోతో) విధ్వంకర ఇన్నింగ్స్ (20 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆడి ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో వైభవ్ తొలి బంతికే సిక్సర్ బాది అందరినీ ఆశ్యర్యపరిచాడు. ఆతర్వాతి మ్యాచ్‌లో (ఆర్సీబీ) కాస్త నిరాశపరిచినా (12 బంతుల్లో 16; 2 సిక్సర్లు).. కెరీర్లో మూడో మ్యాచ్‌లోనే విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు.

రేపే అక్షయ తృతీయ.. భగ్గుమంటున్న పసిడి ధరలు!
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టినట్లే పట్టి తిరిగి ఈరోజు మళ్లీ పెరిగింది. త్వరలో తులం రూ.ఒక లక్షకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో మంగళవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.89,800 (22 క్యారెట్స్), రూ.97,970 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవార ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.400, రూ.440 పెరిగింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.400, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.440 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.89,800 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.97,970 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.400 పెరిగి రూ.89,950కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.440 పెరిగి రూ.98,120 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగా కాకుండా మంగళవారం వెండి ధర(Silver Prices)ల్లో ఎలాంటి మార్పులు కనిపించలేదు. నిన్నటి ధరలతో వెండి ధర స్థిరంగా ఉంది. దాంతో కేజీ వెండి ధర రూ.1,11,000 వద్ద నిలిచింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
సార్ .. నా కూతురిని నేను పోషించలేను..
అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఎన్టీఆర్
పాక్ విషయంలో ఇంకా ఏం చేద్దాం..?
శ్రీకృష్ణ లీలలు
ఇంకెంత దిగజారుతారు.. కార్గిల్‌లో ఓడించినా బుద్ధి రాలేదా.. అఫ్రిది వ్యాఖ్యలకు ధవన్ కౌంటర్
ట్యూషన్ టీచర్ నిర్వాకం.. బాలుడి తండ్రి ఆవేదన
ప్రస్తుతం మన దగ్గర ఉన్నవి ఇవే సార్! క్షిపణుల బదులు 130 ఇవే బిగించాం!
‘లోకేష్ అన్యాయం చేశారు మీరైనా..’ పట్టించుకోని పవన్!
'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్
సల్మాన్ ‘సౌత్’ వ్యాఖ్యలపై స్పందించిన నాని!
ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
'ప్రవస్తి' నీకు నేను ఉన్నా.. మేము ఉన్నాం: గీతా మాధురి
వీళ్లు ఐదురూపాయలు బిచ్చమేశార్రా! దీంతో వైజాగ్‌లో ఐదెకరాల భూమి కొనేయవచ్చు... మనకూ ‘ఉర్సా’ లాంటి కంపెనీ ఉంటే!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
మార్కెట్లోకి సరికొత్త హైటెక్ ఫ్యాన్: ధర ఎంతంటే?
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్
ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
నా కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తా..!
నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా
Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
ఆ హీరోయిన్ల పేర్లు కలిసేలా విజయ్ (TVK) పార్టీ ఉంది: మంత్రి
భారత్‌తో జాగ్రత్త.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హెచ్చరిక
బ్రదర్ కేటీఆర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: వైఎస్ జగన్
నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..
నా కొడుకును సంపేయండి
నచ్చిన వారితో శృంగారం.. అజిత్‌పై నటి 'హీరా' సెన్సేషనల్ కామెంట్
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
కొత్త రేషన్ కార్డు దేవుడెరుగు..!
బాలకృష్ణ విలన్‌ను ఎంపిక చేసుకున్న పూరీ జగన్నాథ్
మహాభారతంలో నాని.. కన్ఫార్మ్ చేసిన రాజమౌళి
యాహూ! ఎట్టకేలకు భారతీయురాలిగా..! వీడియో వైరల్
ఆర్మూరు–జగిత్యాల హైవేకు ఓకే
జాబ్ చేస్తానంటే ఇంట్లోకి రమ్మంటారు.. బాధ చెప్పుకున్న దీపిక
మూడో పంటగా సౌర విద్యుత్తు!
బంగారం భారీగా పడిపోతుంది!
ప్రస్తుతం మన దగ్గర ఉన్నవి ఇవే సార్! క్షిపణుల బదులు 130 ఇవే బిగించాం!
వామ్మో.. ఇదేం ట్రాఫిక్!
అయ్యో దేవుడా..ఏమిటీ ఘోరం
ఏపీ రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారు
IPL 2025: విధ్వంసంలో వైభవం
తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!
పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి వరదలోచ్చిస్తున్నాయ్స్సార్.. ఎవరైనా కాపాడండి!
వాడికి ఏడాదిన్నర వయసు.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్
నిరంతర ‘కోత’లు!.. అల్లాడుతున్న ప్రజలు
IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్యవంశీ.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
నాటి రైతు బిడ్డ... నేడు ఐపీఎల్ హీరో
ఇల్లు తుడిచిన హీరో.. ఎవరో తెలుసా?
స్తంభించిన విద్యుత్.. మూడు దేశాలు అతలాకుతలం
ఈవారం థియేటర్లో పెద్ద సినిమాలు.. ఓటీటీలో 20 చిత్రాలు
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి..?
పాకిస్తాన్‌ను వదిలే ప్రసక్తే లేదు.. ఐరాసలో భారత్ హెచ్చరిక
ముష్కర మూకలకు ముచ్చెమటలు
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
‘ఛీ’నా రాజకీయం...
RR VS GT: ఓ పక్క వైభవ్ విధ్వంసకాండ కొనసాగుతుండగా, జైస్వాల్ రికార్డుల్లోకెక్కాడు
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
IPL 2025: ఒక్క విజయం.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ
తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరు
భారత్‌తో యుద్ధ భయం.. పాక్ సైన్యంలో భారీ రాజీనామాలు
మార్చి రిపోర్ట్: నిండా మునిగిన నిర్మాతలు.. 15 సినిమాల్లో ఒక్కటే హిట్టు!
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
జిమ్ చేస్తూ గాయపడ్డ కేటీఆర్
ఇంట్లో పాముల కలకలం
వాళ్ల గురించి ఇలా మాట్లాడకండి.. నాకు బాధేస్తోంది: కోటి
కొత్త కార్డులు 1,017
పాక్ పాచికల్ని పారనీయొద్దు!
ఇలా ఒక్కరినే టార్గెట్ చేయడం సరికాదు: రిషభ్ పంత్ అసహనం!
బ్యాంకులో క్యాష్ వేస్తున్నారా..? జాగ్రత్త!!
కెనడా ఎన్నికలు.. ఆధిక్యంలో లిబరల్ పార్టీ
సెట్ చేయడానికే ఏడాది: సీఎం రేవంత్
RR VS GT: ఇది నా కల.. నాకు భయం లేదు: వైభవ్ సూర్యవంశీ
సమంత కాదు మాతాజీ.. ప్రియుడితో యానిమల్ బ్యూటీ!
IPL 2025: ‘పంజాబ్ ఈసారీ టైటిల్ గెలవదు.. ఎందుకంటే?!’
టీడీపీ నాయకుడి దురాగతం.. ఆస్తి కోసం అక్క, తల్లిపై దాడి
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
'డ్రాగన్'తో హిట్.. క్రేజీ ఛాన్స్ కొట్టేసిన కాయదు
డిప్యూటీ కలెక్టర్‌ని.. టీడీపీ కోసం ఎంతో చేశా
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
విభేదిస్తే వ్యతిరేకించాలా?
సూర్యవంశీ సుడిగాలి ఇన్నింగ్స్.. గుజరాత్‌కు రాజస్తాన్ షాక్
నా పరిస్థితి నా కూతురికి రాకూడదు: ఊర్వశి
IPL 2025: 35 బంతుల్లో సెంచరీ.. వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం
ఏపీలో సమంత టెంపుల్.. ఇప్పుడు మరో విగ్రహం
3 నిమిషాలకో మరణం
RR VS GT: వైభవ్ సృష్టించిన బీభత్సం మాటల్లో వర్ణించలేనిది: రాజస్థాన్ కెప్టెన్
IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. తొలి భారత ప్లేయర్‌గా
బాహుబలి రిటర్న్స్
గుత్తి: రాయలసీమ ఎక్స్‌ప్రెస్ భారీ దొంగతనం.. 30 తులాల బంగారం..
కశ్మీర్లో స్లీపర్‌సెల్స్ యాక్టివ్.. ఇంటెలిజెన్స్ హెచ్చరిక
మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని భావన యాదవ్
లండన్ లో తప్పిపోయిన నిజామాబాద్ జిల్లా విద్యార్థి
75 ఏళ్లుగా చెక్కుచెదరని పెంకుటిల్లు..!
వక్ఫ్ ఆస్తులు ఆ రాష్ట్రంలోనే ఎక్కువ!
ఐక్యత చాటాల్సిన తరుణమిది.. మోదీకి ఖర్గే, రాహుల్ లేఖ
ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
ఈపీఎఫ్ క్లెయిమ్‌కు వెళ్తున్నారా..?
రాజధానిలో మరిన్ని భూములు సమీకరణ
ఏప్రిల్‌లో విడుదలైన టాప్ 10 మొబైల్స్
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
ఇప్పుడు రాలేను.. సమయం ఇవ్వండి: మహేష్ బాబు
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
రెండు రోజులే పనిచేసే రోజులొస్తాయ్..
తెలంగాణకు వర్షసూచన.. ఐదు రోజులు ఈ జిల్లాల్లో గట్టి వానలే..
వాళ్ల మధ్య వేలెందుకు పెట్టార్సార్!
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
భార్య కళ్లెదుటే ప్రియుడ్ని?.. పట్టపగలే పెద్దపల్లిలో దారుణం
IPL 2025: ఆర్సీబీ తలరాత మార్చే ప్రయత్నం చేస్తున్న భువీ.. ఈ క్రమంలో అరుదైన ఘనత
సార్ .. నా కూతురిని నేను పోషించలేను..
అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఎన్టీఆర్
పాక్ విషయంలో ఇంకా ఏం చేద్దాం..?
శ్రీకృష్ణ లీలలు
ఇంకెంత దిగజారుతారు.. కార్గిల్‌లో ఓడించినా బుద్ధి రాలేదా.. అఫ్రిది వ్యాఖ్యలకు ధవన్ కౌంటర్
ట్యూషన్ టీచర్ నిర్వాకం.. బాలుడి తండ్రి ఆవేదన
ప్రస్తుతం మన దగ్గర ఉన్నవి ఇవే సార్! క్షిపణుల బదులు 130 ఇవే బిగించాం!
‘లోకేష్ అన్యాయం చేశారు మీరైనా..’ పట్టించుకోని పవన్!
'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్
సల్మాన్ ‘సౌత్’ వ్యాఖ్యలపై స్పందించిన నాని!
ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
'ప్రవస్తి' నీకు నేను ఉన్నా.. మేము ఉన్నాం: గీతా మాధురి
వీళ్లు ఐదురూపాయలు బిచ్చమేశార్రా! దీంతో వైజాగ్‌లో ఐదెకరాల భూమి కొనేయవచ్చు... మనకూ ‘ఉర్సా’ లాంటి కంపెనీ ఉంటే!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
మార్కెట్లోకి సరికొత్త హైటెక్ ఫ్యాన్: ధర ఎంతంటే?
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్
ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
నా కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తా..!
నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా
Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
ఆ హీరోయిన్ల పేర్లు కలిసేలా విజయ్ (TVK) పార్టీ ఉంది: మంత్రి
భారత్‌తో జాగ్రత్త.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హెచ్చరిక
బ్రదర్ కేటీఆర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: వైఎస్ జగన్
నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..
నా కొడుకును సంపేయండి
నచ్చిన వారితో శృంగారం.. అజిత్‌పై నటి 'హీరా' సెన్సేషనల్ కామెంట్
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
కొత్త రేషన్ కార్డు దేవుడెరుగు..!
బాలకృష్ణ విలన్‌ను ఎంపిక చేసుకున్న పూరీ జగన్నాథ్
మహాభారతంలో నాని.. కన్ఫార్మ్ చేసిన రాజమౌళి
యాహూ! ఎట్టకేలకు భారతీయురాలిగా..! వీడియో వైరల్
ఆర్మూరు–జగిత్యాల హైవేకు ఓకే
జాబ్ చేస్తానంటే ఇంట్లోకి రమ్మంటారు.. బాధ చెప్పుకున్న దీపిక
మూడో పంటగా సౌర విద్యుత్తు!
బంగారం భారీగా పడిపోతుంది!
ప్రస్తుతం మన దగ్గర ఉన్నవి ఇవే సార్! క్షిపణుల బదులు 130 ఇవే బిగించాం!
వామ్మో.. ఇదేం ట్రాఫిక్!
అయ్యో దేవుడా..ఏమిటీ ఘోరం
ఏపీ రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారు
IPL 2025: విధ్వంసంలో వైభవం
తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!
పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి వరదలోచ్చిస్తున్నాయ్స్సార్.. ఎవరైనా కాపాడండి!
వాడికి ఏడాదిన్నర వయసు.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్
నిరంతర ‘కోత’లు!.. అల్లాడుతున్న ప్రజలు
IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్యవంశీ.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
నాటి రైతు బిడ్డ... నేడు ఐపీఎల్ హీరో
ఇల్లు తుడిచిన హీరో.. ఎవరో తెలుసా?
స్తంభించిన విద్యుత్.. మూడు దేశాలు అతలాకుతలం
ఈవారం థియేటర్లో పెద్ద సినిమాలు.. ఓటీటీలో 20 చిత్రాలు
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి..?
పాకిస్తాన్‌ను వదిలే ప్రసక్తే లేదు.. ఐరాసలో భారత్ హెచ్చరిక
ముష్కర మూకలకు ముచ్చెమటలు
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
‘ఛీ’నా రాజకీయం...
RR VS GT: ఓ పక్క వైభవ్ విధ్వంసకాండ కొనసాగుతుండగా, జైస్వాల్ రికార్డుల్లోకెక్కాడు
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
IPL 2025: ఒక్క విజయం.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ
తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరు
భారత్‌తో యుద్ధ భయం.. పాక్ సైన్యంలో భారీ రాజీనామాలు
మార్చి రిపోర్ట్: నిండా మునిగిన నిర్మాతలు.. 15 సినిమాల్లో ఒక్కటే హిట్టు!
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
జిమ్ చేస్తూ గాయపడ్డ కేటీఆర్
ఇంట్లో పాముల కలకలం
వాళ్ల గురించి ఇలా మాట్లాడకండి.. నాకు బాధేస్తోంది: కోటి
కొత్త కార్డులు 1,017
పాక్ పాచికల్ని పారనీయొద్దు!
ఇలా ఒక్కరినే టార్గెట్ చేయడం సరికాదు: రిషభ్ పంత్ అసహనం!
బ్యాంకులో క్యాష్ వేస్తున్నారా..? జాగ్రత్త!!
కెనడా ఎన్నికలు.. ఆధిక్యంలో లిబరల్ పార్టీ
సెట్ చేయడానికే ఏడాది: సీఎం రేవంత్
RR VS GT: ఇది నా కల.. నాకు భయం లేదు: వైభవ్ సూర్యవంశీ
సమంత కాదు మాతాజీ.. ప్రియుడితో యానిమల్ బ్యూటీ!
IPL 2025: ‘పంజాబ్ ఈసారీ టైటిల్ గెలవదు.. ఎందుకంటే?!’
టీడీపీ నాయకుడి దురాగతం.. ఆస్తి కోసం అక్క, తల్లిపై దాడి
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
'డ్రాగన్'తో హిట్.. క్రేజీ ఛాన్స్ కొట్టేసిన కాయదు
డిప్యూటీ కలెక్టర్‌ని.. టీడీపీ కోసం ఎంతో చేశా
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
విభేదిస్తే వ్యతిరేకించాలా?
సూర్యవంశీ సుడిగాలి ఇన్నింగ్స్.. గుజరాత్‌కు రాజస్తాన్ షాక్
నా పరిస్థితి నా కూతురికి రాకూడదు: ఊర్వశి
IPL 2025: 35 బంతుల్లో సెంచరీ.. వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం
ఏపీలో సమంత టెంపుల్.. ఇప్పుడు మరో విగ్రహం
3 నిమిషాలకో మరణం
RR VS GT: వైభవ్ సృష్టించిన బీభత్సం మాటల్లో వర్ణించలేనిది: రాజస్థాన్ కెప్టెన్
IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. తొలి భారత ప్లేయర్‌గా
బాహుబలి రిటర్న్స్
గుత్తి: రాయలసీమ ఎక్స్‌ప్రెస్ భారీ దొంగతనం.. 30 తులాల బంగారం..
కశ్మీర్లో స్లీపర్‌సెల్స్ యాక్టివ్.. ఇంటెలిజెన్స్ హెచ్చరిక
మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని భావన యాదవ్
లండన్ లో తప్పిపోయిన నిజామాబాద్ జిల్లా విద్యార్థి
75 ఏళ్లుగా చెక్కుచెదరని పెంకుటిల్లు..!
వక్ఫ్ ఆస్తులు ఆ రాష్ట్రంలోనే ఎక్కువ!
ఐక్యత చాటాల్సిన తరుణమిది.. మోదీకి ఖర్గే, రాహుల్ లేఖ
ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
ఈపీఎఫ్ క్లెయిమ్‌కు వెళ్తున్నారా..?
రాజధానిలో మరిన్ని భూములు సమీకరణ
ఏప్రిల్‌లో విడుదలైన టాప్ 10 మొబైల్స్
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
ఇప్పుడు రాలేను.. సమయం ఇవ్వండి: మహేష్ బాబు
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
రెండు రోజులే పనిచేసే రోజులొస్తాయ్..
తెలంగాణకు వర్షసూచన.. ఐదు రోజులు ఈ జిల్లాల్లో గట్టి వానలే..
వాళ్ల మధ్య వేలెందుకు పెట్టార్సార్!
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
భార్య కళ్లెదుటే ప్రియుడ్ని?.. పట్టపగలే పెద్దపల్లిలో దారుణం
IPL 2025: ఆర్సీబీ తలరాత మార్చే ప్రయత్నం చేస్తున్న భువీ.. ఈ క్రమంలో అరుదైన ఘనత
సినిమా

ఆ హీరోయిన్ల పేర్లు కలిసేలా విజయ్ (TVK) పార్టీ ఉంది: మంత్రి
తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, సినీ నటుడు విజయ్‌పై డీఎంకే నేత, మంత్రి పన్నీర్ సెల్వం సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తమకు పోటీ కేవలం డీఎంకే పార్టీ మాత్రమేనని విజయ్ ఇప్పటికే సందేశం పంపాడు. కొద్దిరోజులుగా ముఖ్యమంత్రి స్టాలిన్‌పై విమర్శలు చేస్తున్నారు కూడా.. అధికార పార్టీలో జరుగుతున్న అవినీతిని ఎండగట్టేందుకు తాను ఉన్నానంటూ విజయ్ పలు వేదికలపై చెబుతున్నారు. దీంతో డీఎంకే మంత్రి పన్నీర్ సెల్వం తాజాగా విజయ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.తాజాగా జరిగిన రాజకీయ సమావేశంలో విజయ్ పార్టీ గురించి మంత్రి పన్నీర్ సెల్వం కామెంట్స్ చేశారు. 'బ్లాక్ టికెట్లు అమ్ముకునే వ్యక్తి మాకు అవినీతి గురించి పాఠాలు చెప్పడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన తీసుకునే డబ్బు (రెమ్యునరేషన్) అంతా బ్లాక్ మనీ అని అందరికీ తెలిసిందే.' అని ఆయన అన్నారు. ఆపై వేదికపై నుంచే విజయ్ పార్టీ (TVK) అంటే ఏంటి..? దానికి సమాధానం చెప్పాలని జనసమూహాన్ని పన్నీర్ సెల్వం కోరారు. వెంటనే వారు (T-త్రిష, V- విజయ్, K- కీర్తి సురేష్) అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో మీరంతా బ్రిలియంట్స్ అంటూ మంత్రి వ్యంగ్యాస్త్రాలు కురిపించారు. ఇలాంటి పార్టీ అధికారంలోకి వస్తామని చెబుతుంటే నమ్మడానికి ప్రజలు పిచ్చోళ్లు కాదని ఆయన అన్నారు.రాష్ట్రాన్ని నడపటం అంటే సినిమాలో నటించడం అంత సులభం అనుకుంటున్నారా.? అని మంత్రి ప్రశ్నించారు. జయలలిత మరణం తర్వాత తమిళనాట డీఎంకే పార్టీతో స్టాలిన్ తిరుగులేని విజయాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం అక్కడ మోస్ట్ పవర్ఫుల్ లీడర్‌గా స్టాలిన్ ఉన్నారని జాతీయ స్థాయి సర్వేలు కూడా తేల్చేశాయి. తర్వాతి రెండో స్థానంలో విజయ్ పార్టీ ఉందని ఆ సర్వేలు చెప్పాయి. అక్కడ మరో ప్రత్యామ్నాయం లేదు. దీంతో 2026 ఎన్నికల్లో విజయ్‌తో స్టాలిన్‌కు గట్టిపోటీ తప్పదని తెలుస్తోంది.

'ది ఫ్యామిలీ మ్యాన్-3' నటుడు అనుమానాస్పద మృతి
ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా అలరించిన భారతీయ వెబ్‌సిరీసుల్లో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టాప్‌లో ఉంటుంది. అయితే, సీజన్- 3లో నటించిన నటుడు రోహిత్ బస్ఫోర్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. అస్సాంలోని ఓ జలపాతం వద్ద ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అతన్ని గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.స్నేహితులతో సరదాగా గడిపేందుకు అస్సాం గర్భంగ అటవీప్రాంతంలోని జలపాతం వద్దకు రోహిత్ బస్ఫోర్ వెళ్లినట్లు అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమ కుటుంబానికి కావాల్సిన వారే ఈ హత్యకు పాల్పడ్డారని వారు ఆరోపించారు. కొద్దిరోజుల క్రితం పార్కింగ్ విషయంలో రంజిత్ బాస్ఫోర్, అశోక్ బాస్ఫోర్, ధరమ్ బాస్ఫోర్ అనే ముగ్గురు వ్యక్తులు తమ కుమారుడితో గొడవ పడ్డారని మృతుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇంటి వద్దే ఉన్న రోహిత్‌ను ట్రిప్‌కు వెళ్దాం అంటూ జిమ్ యజమాని అమర్దీప్ ఆహ్వానం మేరకే వెళ్లాడని వారు పోలీసులకు తెలిపారు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే తమ కుమారుడిని హత్య చేశారని వారు చెబుతున్నారు. గౌహతి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో నిర్వహించిన శవపరీక్షలో అతని శరీరంపైనే కాకుండా తల, ముఖం ఇతర భాగాలపై అనేక గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోహిత్ బస్ఫోర్ నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్-3’ త్వరలో విడుదల కానుంది.

నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా
నవీన్ చంద్ర, షాలిని జంటగా నటించిన చిత్రం '28 డిగ్రీస్ సెల్సియస్'(28°C Movie).. 2025 ఏప్రిల్ 4న విడుదలైన ఈ చిత్రం సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండానే ఈ థ్రిల్లర్ చిత్రాన్ని మేకర్స్ విడుదల చేశారు. పొలిమేర సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్న దర్శకుడు డా. అనిల్ విశ్వనాధ్ ఆరేళ్ళ క్రితం నవీన్ చంద్రతో ఈ మూవీని తెరకెక్కించారు. అయితే, ఈ మూవీ కరోనాకు ముందే రిలీజ్ కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడింది. ఈ సినిమాను వీరాంజనేయ ప్రొడక్షన్స్, రివర్సైడ్ సినిమాస్, జెనస్ స్టూడియోస్ బ్యానర్లపై సాంబకుల సాయి అభిషేక్ నిర్మించారు.హారర్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన '28 డిగ్రీస్ సెల్సియస్' చిత్రంలో ప్రియదర్శి, వైవా హర్ష, జయప్రకాష్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. చనిపోయిన వాళ్లు మళ్లీ తిరిగొస్తారా? అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీ తాజాగా 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో(Amazon Prime Video) స్ట్రీమింగ్ అవుతుంది. కేవలం నెలరోజుల్లోనే ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసింది.కథేంటంటే..?కార్తీక్(నవీన్ చంద్ర)కి మెడిసిన్ చదువుతున్న సమయంలో అంజలి(షాలిని వడ్నికట్టి) పరిచయమై ప్రేమలో పడతాడు. కార్తీక్ అనాథ, వేరే కులం కావడంతో అంజలి ఇంట్లో ఒప్పుకోకపోవడంతో అంజలి ఇంట్లోంచి వచ్చేసి కార్తీక్ ని పెళ్లి చేసుకుంటుంది. అయితే అంజలికి బాడీ టెంపరేచర్ కి సంబంధించిన ఓ ఆరోగ్య సమస్య తలెత్తుతుంది. అంజలి బాడీ 28 డిగ్రీల సెల్సియస్ వద్ద మాత్రమే బాగుంటుంది. అంతకంటే పెరిగినా, తగ్గినా కాసేపటికే చనిపోతుంది. అంజలి ట్రీట్మెంట్ కోసం కార్తీక్ తనని జార్జియా తీసుకెళ్తాడు. అక్కడ ఇద్దరూ ఓ హాస్పిటల్ లో పనిచేస్తూనే అంజలికి ట్రీట్మెంట్ తీసుకుంటారు. అనుకోకుండా ఓ రోజు కార్తీక్ వచ్చేసరికి ఇంట్లో అంజలి చనిపోయి ఉంటుంది. అంజలి చనిపోయిన బాధలో కార్తీక్ తాగుడుకు బానిస అవుతాడు. కానీ ఆ ఇంట్లో అంజలి ఆత్మ తిరుగుతుందని అనుమానాలు వచ్చేలా కొన్ని సంఘటనలు జరుగుతాయి. అసలు అంజలి ఎలా చనిపోయింది? నిజంగానే అంజలి ఆత్మ వస్తుందా? కార్తీక్ మళ్ళీ మాములు మనిషి అవుతాడా తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్
చిత్రపరిశ్రమలో రాణించాలంటే హిట్లు తప్పనిసరి.. అలా అయితేనే ఇక్కడ నిలదొక్కుకుంటారు. ముఖ్యంగా ఈ రూల్ హీరోయిన్లకు ఎక్కువగా వర్తిస్తుంది. ఫ్లాప్ ఇచ్చిన హీరోయిన్స్‌కు మళ్లీ అవకాశాలు రావడం కాస్త కష్టమే.. ఒకట్రెండు హిట్లు కొట్టి ఆ తర్వాత ప్లాపులు రావడంతో చాలామంది హీరోయిన్స్ కనిపించకుండా పోయారు. అయితే, ఆ జాబితాలోకి డింపుల్ హయతి(Dimple Hayathi) కూడా చేరిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ, ఈ తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్ తలుపుతట్టింది. మళ్లీ తన గ్లామర్‌తో ప్రేక్షకులకు దగ్గర కానుంది. ఈ ప్రాజెక్ట్ హిట్ అయితే, మళ్లీ పలు సినిమాల్లో తప్పకుండా అవకాశాలు రావచ్చని చెప్పవచ్చు.హీరో శర్వానంద్(Sharwanand) కెరీర్లో తొలి పాన్ ఇండియా సినిమాకు అంతా సిద్ధమైంది. శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తుండగా సంపత్‌నంది దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఈ మూవీ ఉంది. ఇప్పటికే ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, మరో కీలకమైన పాత్ర కోసం డింపుల్ హయాతిని దర్శకుడు సంపత్‌నంది ఎంపిక చేశారు. 2022, 2023లో (ఖిలాడీ, రామబాణం) వరుసగా ఫ్లాపులిచ్చిన డింపుల్ హయతికి మళ్లీ ఛాన్సులు దక్కలేదు. ఈ గ్యాప్‌లో రోజూ జిమ్‌కు వెళ్లి తన గ్లామర్‌ను కాపాడుకుంటూ వచ్చిన ఈ బ్యూటీ మరింత స్లిమ్‌గా అయింది. రెగ్యూలర్‌గా తన గ్లామర్ ఫోటోలను సోషల్‌మీడియాలో విడుదల చేస్తూ ఎప్పుడూ ప్రేక్షకులతో టచ్‌లో ఉంటూ వచ్చింది. అలా ఇప్పడు ఛాన్సులు దక్కించుకుంది.1960లో ఉత్తర తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన యధార్థ ఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందుతుందని మేకర్స్ ప్రకటించారు. షూటింగ్‌కు అన్నీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని ప్రకటించారు. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. View this post on Instagram A post shared by Dimple 🌟 (@dimplehayathi)
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

RR VS GT: ఓ పక్క వైభవ్ విధ్వంసకాండ కొనసాగుతుండగా, జైస్వాల్ రికార్డుల్లోకెక్కాడు
ఐపీఎల్ 2025లో నిన్న (ఏప్రిల్ 28) గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకంతో (35 బంతుల్లో) విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో వైభవ్ విధ్వంసకాండ ఓ పక్క కొనసాగుతుండగానే రాయల్స్ మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ రికార్డుల్లోకెక్కాడు.ఈ మ్యాచ్‌లో 40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 70 పరుగులు చేసిన జైస్వాల్.. రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చడంతో పాటు ఆ జట్టు తరఫున 2000 పరుగులు పూర్తి చేసిన మూడో భారత ఆటగాడిగా, ఓవరాల్‌గా ఐదో ప్లేయర్‌గా, ఐపీఎల్లో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఐదో బ్యాటర్‌గా, రాజస్థాన్ తరఫున అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్ అరంగేట్రం నుంచి (2020) రాజస్థాన్ రాయల్స్‌కే ఆడుతున్న జైస్వాల్.. 62 ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీల సాయంతో 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్‌కు ముందు రాయల్స్ తరఫున సంజూ శాంసన్ (3966), జోస్ బట్లర్ (3055), అజింక్య రహానే (2810), షేన్ వాట్సన్ (2372) 2000 పరుగులు పూర్తి చేశారు.ఐపీఎల్లో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లుక్రిస్ గేల్- 48 ఇన్నింగ్స్ల్లోషాన్ మార్ష్- 52రుతురాజ్ గైక్వాడ్- 57కేఎల్ రాహుల్- 60యశస్వి జైస్వాల్- 62మ్యాచ్ విషయానికొస్తే.. గుజరాత్ నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో వైభవ్ సూర్యవంశీ (38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు) సునామీ శతకంతో విరుచుకుపడటంతో రాయల్స్ 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓ పక్క వైభవ్ విధ్వంసకాండ కొనసాగుతుండగానే జైస్వాల్ తన సహజ శైలిలో చెలరేగుతూ రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఆఖర్లో రియాన్ పరాగ్ (15 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.అంతకుముందు శుభ్‌మన్ గిల్ (50 బంతుల్లో 84; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), జోస్ బట్లర్ (26 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), సాయి సుదర్శన్ (30 బంతుల్లో 39; 4 ఫోర్లు, సిక్స్) సత్తా చాటడంతో గుజరాత్ 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.

IPL 2025: 35 బంతుల్లో సెంచరీ.. వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (ఏప్రిల్ 28) గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 ఏళ్ల రాజస్థాన్ రాయల్స్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లో సెంచరీ కొట్టి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాడు. ఈ విధ్వంసకర ప్రదర్శనతో సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తుంది. సోషల్‌మీడియాలో ఎక్కడ చూసినా సూర్యవంశీ జపమే నడుస్తుంది. క్రికెట్ దిగ్గజాలు సూర్యవంశీ సృష్టించిన బీభత్సాన్ని వేనోళ్ల పొగుడుతున్నారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, రాజస్థాన్ రాయల్స్ కోచ్ రాహుల్ ద్రవిడ్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, భారత మాజీ ఆల్‌రౌండర్లు ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్.. ఇలా చాలామంది భారత మాజీలు వైభవ్‌ను ఆకాశానికెత్తారు. సోషల్‌మీడియాలో అభిమానులు వైభవ్‌కు 'బేబీ బాస్'గా బిరుదు ఇచ్చారు.స్కూల్‌కు వెళ్లాల్సిన వయసులో (14 ఏళ్ల 32 రోజులు) వైభవ్ సృష్టించిన ఈ విధ్వంసకాండ పొట్టి క్రికెట్ చరిత్రలో చిరకాలం గుర్తుండిపోతుంది. రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం వైభవ్‌ను ఎంతో నిశితంగా పరిశీలించి, ఈ కుర్రాడిలో ఎదో మ్యాజిక్ ఉందని భావించి ఈ సీజన్ మెగా వేలంలో రూ. 1.1 కోట్లకు కొనుక్కుంది. ఊహించినట్లుగానే వైభవ్ తొలి మ్యాచ్‌లోనే (లక్నోతో) విధ్వంకర ఇన్నింగ్స్ (20 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆడి ఆకట్టుకున్నాడు. ఆ ఇన్నింగ్స్‌లో వైభవ్ తొలి బంతికే సిక్సర్ బాది అందరినీ ఆశ్యర్యపరిచాడు. ఆతర్వాతి మ్యాచ్‌లో (ఆర్సీబీ) కాస్త నిరాశపరిచినా (12 బంతుల్లో 16; 2 సిక్సర్లు).. కెరీర్లో మూడో మ్యాచ్‌లోనే విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు.ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 38 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో వైభవ్ చాలా రికార్డులను కొల్లగొట్టాడు.- ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ఆటగాడిగా- ఐపీఎల్లో సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా (క్రిస్ గేల్ (30 బంతుల్లో) తర్వాత)- ఐపీఎల్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా- ఐపీఎల్లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా (మురళీ విజయ్‌తో కలిసి)- టీ20 క్రికెట్లో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా - ఐపీఎల్లో హాఫ్ సెంచరీ (17 బంతుల్లో) చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డులు నెలకొల్పాడు.ఈ మ్యాచ్‌లో ప్రదర్శనకు గానూ వైభవ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఐపీఎల్లో అత్యంత పిన్న వయసులో ఈ అవార్డు అందుకున్న ఆటగాడిగానూ వైభవ్ రికార్డుల్లోకెక్కాడు.ఈ ఇన్నింగ్స్‌లో వైభవ్ ఇషాంత్ శర్మపై ఎదురుదాడికి దిగిన వైనం మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. ఇషాంత్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో వైభవ్ 3 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 28 పిండుకున్నాడు. అనుభవజ్ఞుడు, కోపిష్టి అయిన ఇషాంత్ 14 ఏళ్ల వైభవ్ షాట్లు ఆడుతుంటే నిస్సహాయస్థితిలో చూస్తుండిపోయాడు. వైభవ్ కరీమ్ జనత్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లోనూ శివతాండవం చేశాడు. ఆ ఓవర్లో అతను 3 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 30 పరుగులు రాబట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో వైభవ్ ఏ బౌలర్‌నూ వదల్లేదు. వాషింగ్టన్ సుందర్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో 2 సిక్సలు, 2 ఫోర్లు సహా 21 పరుగులు.. సిరాజ్ వేసిన తొలి ఓవర్లోనే భారీ సిక్సర్.. ప్రస్తుత సీజన్లో అద్భుతాలు చేస్తున్న ప్రసిద్ద్ బౌలింగ్‌లో మరో భారీ సిక్సర్ ఇలా ప్రతి ఒక్క బౌలర్‌ను ఊచకోత కోశాడు. రషీద్ ఖాన్ ఒక్కడే తప్పించుకున్నాడు.వైభవ్ సృష్టించిన విధ్వంసం ధాటికి గుజరాత్ నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్యం 15.5 ఓవర్లలోనే ఛేదించబడింది. ఐపీఎల్ చరిత్రలోనే 200 ప్లస్ టార్గెట్ ఇంత తక్కువ బంతుల్లో ఛేదించబడటం ఇదే మొదటిసారి. రాయల్స్ ఇన్నింగ్స్‌లో జైస్వాల్ (40 బంతుల్లో 70 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), రియాన్ పరాగ్ (15 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.అంతకుముందు శుభ్‌మన్ గిల్ (50 బంతుల్లో 84), జోస్ బట్లర్ (26 బంతులోల 50 నాటౌట్) సత్తా చాటడంతో గుజరాత్ 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.

IPL 2025: విధ్వంసంలో వైభవం
సచిన్ వేగాన్ని ఆరాధించాం. సెహ్వాగ్ దూకుడును చూశాం. రో‘హిట్స్’ను ఆస్వాదించాం. కోహ్లి ‘షో’కు ముచ్చటపడ్డాం. వీళ్లందరూ ప్రొఫెషనల్ క్రికెటర్లు. కానీ వైభవ్ సూర్యవంశీ మాత్రం కాదు. 14 ఏళ్ల ఈ కుర్రాడు ఓ అనామకుడు. ఇంకా చెప్పాలంటే ఈ మ్యాచ్‌కు ముందు బహుశా చాలా మందికి అతనెవరో తెలియదు. కానీ తెలుసుకుంటారు. నెట్టింట గూగుల్‌లో సెర్చ్ చేస్తారు. ‘లైక్’లు కొట్టే షాట్లను ఫోన్ కెమెరాల్లో బంధించారు. ‘షేర్’ చేసే సమయం ఇవ్వనంతగా సిక్స్‌ల ‘షో’ చూశారు. 35 బంతుల సెంచరీకి ‘సబ్ స్క్రైబ్’ అయిపోయారు. ఐపీఎల్ కొత్త వైభవానికి పండగ చేసుకున్నారు. జైపూర్: ఐపీఎల్ 2008లో పుట్టింది. లీగ్ పుట్టిన మూడేళ్ల (2011లో) తర్వాత లోకం చూసిన బుడ్డొడిని పురుడు పోసిన కొద్దిమందే చూశారు! 14 ఏళ్లు తిరిగేసరికి ఇప్పుడా కుర్రాడిని మొత్తం క్రికెట్ ప్రపంచమే చూసి మురిసింది. అ బుడ్డొడు... ఇప్పటి కుర్రాడు... వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్లో అతనొక సంచలనం. బ్యాటింగ్ మెరుపులకే వైభోగం. క్రికెట్ ప్రేక్షకులకి కనుల పండగ అతని శతకం. బంతి సిక్స్‌లకే ఫిక్స్ అయినట్లు... అతని బ్యాట్ షాట్లకే అలవాటైనట్లు... అతని ‘షో’కు బంతులన్నీ దాసోహమైనట్లు అలవోకగా ఆడేశాడు.వైభవ్ (38 బంతుల్లో 101; 7 ఫోర్లు, 11 సిక్స్‌లు) శతకానికి జైపూర్‌లో నిశిరాతిరి కూడా వెలుగులు విరజిమ్మింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీస్కోరు చేసింది. శుబ్‌మన్ గిల్ (50 బంతుల్లో 84; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), జోస్ బట్లర్ (26 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో కదంతొక్కారు. అనంతరం రాజస్తాన్ రాయల్స్ 15.5 ఓవర్లలోనే కేవలం రెండే వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసి గెలిచింది. యశస్వీ జైస్వాల్ (40 బంతుల్లో 70 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగాడు. ఫిఫ్టీలో 48 పరుగులు... సిక్స్‌లు, ఫోర్లతోనే... పెద్ద లక్ష్యం... ఛేదించడం కష్టం... ఇలాంటి పరిస్థితుల మధ్య పరుగుల వేట మొదలుపెట్టిన యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) పరుగుల ఉప్పెన చూపెట్టారు. ముఖ్యంగా 14 ఏళ్ల వైభవ్ ఆట అసాంతం హైలైట్స్‌నే తలపించింది. సూర్యవంశీ షాట్ల ఎంపిక, సిక్స్‌ల తుఫాన్ ఒక్క మైదానాన్నే కాదు... క్రికెట్ ప్రపంచాన్నే తనవైపు తిప్పుకుంది. జైస్వాల్ పరుగుతో మొదలైన తొలిఓవర్ వైభవ్ సిక్సర్‌తో ఊపందుకుంది. రెండో ఓవర్లో యశస్వి సిక్స్ బాదడంతో రెండు ఓవర్లలో 19 పరుగులు వచ్చాయి. కానీ ఆ తర్వాతే విధ్వంసరచన మొదలైంది. సిరాజ్ మూడో ఓవర్లో జైస్వాల్ 3 ఫోర్లు కొట్టాడు. 3 ఓవర్లలో జట్టు స్కోరు 32. అప్పటికింకా వైభవ్ (9) పది పరుగులైనా చేయలేదు. ఇషాంత్ నాలుగో ఓవర్‌తో అతని షో మ్యాచ్ రూపాన్ని మార్చింది. 6, 6, 4, 0, 6, వైడ్, వైడ్, 4లతో ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. తర్వాత ఐదో ఓవర్లో జైస్వాల్ బౌండరీ, సింగిల్ తీసివ్వగా, వైభవ్ 6, 0, 6, 4... ఈ బౌండరీతోనే 17 బంతుల్లోనే అతని ఫాస్టెస్ట్ అర్ధసెంచరీ అది కూడా ఐదో ఓవర్లోనే పూర్తయ్యింది. ఇందులో 3 బౌండరీలు, 6 సిక్స్‌లు అంటే 48 పరుగులు మెరుపులే! ఇలా ‘పవర్ ప్లే’నే పరుగెత్తుకున్న చందంగా, బౌండరీ లైన్–బంతి ముద్దు ముచ్చటలాడిన విధంగా అతని విధ్వంసం సాగింది. 35 బంతుల్లో భారతీయ శతకం రాయల్స్ జట్టు 6 ఓవర్లలో 87/0 స్కోరు చేసింది. జైస్వాల్ కొట్టిన వరుస బౌండరీలతో ప్రసిధ్ కృష్ణ 8వ ఓవర్లో జట్టు స్కోరు వందను దాటింది. ఇంకా డజను ఓవర్లు మిగిలివుంటే చేయాల్సిన లక్ష్యం (102) సగం కంటే తక్కువగా కరిగింది. ఐపీఎల్ అరంగేట్రం చేసిన కరీమ్ జనత్ వేసిన పదో ఓవర్లో అయితే వైభవ్ వీరబాదుడికి సిక్స్, ఫోర్ పోటీపడినట్లుగా అనిపించింది. 6, 4, 6, 4, 4, 6లతో 30 పరుగుల్ని రాబట్టాడు. 10 ఓవర్లలో 144/0 స్కోరు చేసింది. రషీద్‌ఖాన్ వేసిన మరుసటి ఓవర్లోనే మిడ్‌వికెట్ మీదుగా బాదిన సిక్స్‌తో వైభవ్ సెంచరీ 35 బంతుల్లోనే పూర్తయ్యింది. గేల్ (30 బంతుల్లో) తర్వాత ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన శతకం కాగా... భారత ఆటగాడు కొట్టిన తొలి ఫాస్టెస్ట్ సెంచరీగా పుటలకెక్కింది. 12వ ఓవర్లో వైభవ్‌ను బౌల్డ్ చేయడం ద్వారా ప్రసిధ్ కృష్ణ తొలివికెట్‌ను తీశాడు. 166 పరుగుల ఓపెనింగ్ వికెట్‌కు తెరపడింది. నితీశ్ (4) విఫలమైనా... మిగతా లాంఛనాన్ని జైస్వాల్, కెప్టెన్ రియాన్ పరాగ్ (15 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా అంతే వేగంగా ముగించారు. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) పరాగ్ (బి) తీక్షణ 39; గిల్ (సి) పరాగ్ (బి) తీక్షణ 84; బట్లర్ (నాటౌట్) 50; వాషింగ్టన్ సుందర్ (సి) హెట్‌మైర్ (బి) సందీప్ 13; తెవాటియా (ఎల్బీడబ్ల్యూ) (బి) ఆర్చర్ 9; షారుఖ్ ఖాన్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–93, 2–167, 3–193, 4–202. బౌలింగ్: ఆర్చర్ 4–0–49–1, తీక్షణ 4–0–35–2, యు«ద్వీర్ 3–0–38–0, సందీప్ శర్మ 4–0–33–1, పరాగ్ 1–0–14–0, హసరంగ 4–0–39–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (నాటౌట్) 70; వైభవ్ (బి) ప్రసిధ్ కృష్ణ 101; నితీశ్ రాణా (ఎల్బీడబ్ల్యూ) (బి) రషీద్ ఖాన్ 4; పరాగ్ (నాటౌట్) 32; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (15.5 ఓవర్లలో 2 వికెట్లకు) 212. వికెట్ల పతనం: 1–166, 2–171. బౌలింగ్: సిరాజ్ 2–0–24–0, ఇషాంత్ 2–0–36–0, సుందర్ 1.5–0–34–0, ప్రసిధ్ కృష్ణ 4–0–47–1, రషీద్ 4–0–24–1, కరీమ్ 1–0–30–0, సాయి కిషోర్ 1–0–16–0. వైభవ్ సూర్యవంశీ రికార్డులు → టి20 క్రికెట్ చరిత్రలో సెంచరీ చేసిన పిన్న వయసు్కడిగా వైభవ్ (14 ఏళ్ల 32 రోజులు) ప్రపంచ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు భారత్‌కే చెందిన మహారాష్ట్ర ప్లేయర్ విజయ్ జోల్ (18 ఏళ్ల 118 రోజులు; ముంబైపై 2013లో) పేరిట ఉంది. → ఐపీఎల్లో అర్ధ సెంచరీ, సెంచరీ చేసిన పిన్న వయస్కుడిగా వైభవ్ ఘనత వహించాడు. గతంలో అర్ధ సెంచరీ రికార్డు రియాన్ పరాగ్ (17 ఏళ్ల 175 రోజులు; 2019లో) పేరిట, సెంచరీ రికార్డు మనీశ్ పాండే (19 ఏళ్ల 253 రోజులు; 2009లో) పేరిట నమోదయ్యాయి. → ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారతీయ ప్లేయర్‌గానూ వైభవ్ గుర్తింపు పొందాడు. యూసుఫ్ పఠాన్ (37 బంతుల్లో ముంబై ఇండియన్స్‌పై 2010లో) పేరిట ఉన్న రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. క్రిస్ గేల్ (30 బంతుల్లో 2013లో పుణే వారియర్స్‌పై) తర్వాత ఐపీఎల్లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్ వైభవే కావడం విశేషం.చాలా ఆనందంగా ఉంది. ఐపీఎల్లో ఆడిన మూడో ఇన్నింగ్స్‌లోనే సెంచరీ చేయడం సంతోషం. మూడు, నాలుగు నెలల నుంచి పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. నేను బౌలర్లు ఎవరనే విషయాన్ని పెద్దగా పట్టించుకోను. కేవలం బంతి మీదే దృష్టి పెడతా. యశస్వి జైస్వాల్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం సౌకర్యవంతంగా ఉంటుంది. అవసరమైనప్పుడు సలహాలు ఇవ్వడంతో పాటు ఆత్మవిశ్వాసం నింపుతాడు. దీంతో బ్యాటింగ్ చేయడం సులువవుతుంది. ఐపీఎల్లో సెంచరీ చేయాలన్నది నా కల. క్రీజులో అడుగు పెట్టాక భయపడను. అసలు వేరే ఏ అంశాలను పట్టించుకోను. కేవలం నా ఆటపైనే దృష్టి పెడతా. – వైభవ్ సూర్యవంశీ

సూర్యవంశీ సుడిగాలి ఇన్నింగ్స్.. గుజరాత్‌కు రాజస్తాన్ షాక్
ఐపీఎల్-2025లో జైపూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ జూలు విధిల్చింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ను 8 వికెట్ల తేడాతో రాజస్తాన్ చిత్తు చేసింది. ఈ విజయంతో రాజస్తాన్ తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. 210 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్తాన్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.5 ఓవర్లలో చేధించింది. రాజస్తాన్ బ్యాటర్లలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 35 బంతుల్లోనే తొలి ఐపీఎల్ సెంచరీని అందుకున్నాడు. ఐపీఎల్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా 14 ఏళ్ల వైభవ్ రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా 38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్స్‌లతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు యశస్వి జైశ్వాల్(40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 70 నాటౌట్) సైతం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గుజరాత్ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ప్రసిద్ద్, రషీద్ ఖాన్ మాత్రమే చెరో వికెట్ సాధించారు.గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్..అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో శుబ్‌మన్ గిల్ మరోసారి తన బ్యాట్‌కు పని చెప్పాడు. 50 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 84 పరుగులు చేసి గిల్ ఔటయ్యాడు. అతడితో పాటు బట్లర్(50), సాయిసుదర్శన్(39) రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో థీక్షణ రెండు, అర్చర్, సందీప్ శర్మ తలా వికెట్ సాధించారు.
బిజినెస్

యాప్ స్టోర్.. ఏడాదిలో రూ.44 వేల కోట్ల విక్రయాలు
టెక్ దిగ్గజం యాపిల్ యాప్ స్టోర్ ద్వారా గతేడాది రూ.44,447 కోట్ల విలువ చేసే డెవలపర్ల బిల్లింగులు, విక్రయాలు (ఉత్పత్తులు, సేవలు) నమోదయ్యాయి. యాపిల్‌కి కమీషన్లులాంటివి లేకుండా ఇందులో 94 శాతం భాగం నేరుగా డెవలపర్లు, వ్యాపార సంస్థలకే లభించింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (అహ్మదాబాద్)కి చెందిన ప్రొఫెసర్ విశ్వనాథ్ పింగళి నిర్వహించిన అధ్యయన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.నివేదికలోని అంశాల ప్రకారం గత అయిదేళ్లలో భారతీయ డెవలపర్లకు అంతర్జాతీయంగా వచ్చే ఆదాయాలు రెట్టింపయ్యాయి. ఫుడ్ డెలివరీ, ట్రావెల్, గేమింగ్, ఎంటర్టైన్మెంట్ తదితర రంగాలకు చెందిన యాప్‌ల వినియోగం గణనీయంగా పెరిగింది. గతేడాది భారతీయ డెవలపర్ల ఆదాయాల్లో దాదాపు 80 శాతం వాటా ఇతర దేశాల్లోని యూజర్ల నుంచే వచ్చింది. ఏడాది పొడవున యాప్ స్టోర్ నుంచి 75.5 కోట్ల సార్లు మన డెవలపర్ల యాప్‌లను యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నారు.ఇదీ చదవండి: వ్యాపార ‘పద్మా’లు..భారతదేశంలోని డెవలపర్ల సృజనాత్మకత, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడంలో యాప్ స్టోర్ కీలక పాత్ర పోషిస్తుంది. యాపిల్ వ్యాపార నమూనాలో ‘ఫ్రీ’మియం(ఉచితం) యాప్‌లు, పెయిడ్ యాప్‌లు, ఇన్-యాప్ పర్చేజ్లు లేదా సబ్స్క్రిప్షన్లతో కూడిన యాప్‌లు వంటి వివిధ మానిటైజేషన్ విధానాలు ఉన్నాయి. ఇది డెవలపర్లను వారి లక్ష్యాలకు అనుగుణంగా టార్గెటెడ్ ఆడియన్స్‌ను ఎంచుకునేందుకు వీలు కల్పిస్తుంది.

పరిశ్రమలు డీలా..
దేశీ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి స్థిరంగా కొనసాగుతోంది. ఫిబ్రవరిలో నమోదైన 2.7 శాతంతో పోలిస్తే మార్చిలో పెద్దగా మార్పులు లేకుండా 3 శాతంగా నమోదైంది. తయారీ, మైనింగ్, విద్యుత్ రంగాల పేలవ పనితీరు కారణంగా గత ఆర్థిక సంవత్సరం మార్చిలో నమోదైన 5.5 శాతం పోలిస్తే మాత్రం తగ్గింది. ఇక 2024–25 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఐఐపీ వృద్ధి నాలుగేళ్ల కనిష్టమైన 4 శాతానికి నెమ్మదించింది.2023–24లో ఇది 5.9 శాతంగా, 2020–21లో ఏకంగా మైనస్ 8.4 శాతంగా నమోదైంది.2021–22లో 11.4 శాతంగా, 2022–23లో 5.2 శాతంగా ఉంది.ఇదీ చదవండి: వ్యాపార ‘పద్మా’లు..జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) ప్రకారం ఈ ఏడాది మార్చిలో తయారీ రంగ వృద్ధి 5.9 శాతం నుంచి (వార్షికంగా) 3 శాతానికి, మైనింగ్ ఉత్పత్తి 1.3 శాతం నుంచి 0.4 శాతానికి, విద్యుదుత్పత్తి 8.6 శాతం నుంచి 6.3 శాతానికి నెమ్మదించింది.ఐఐపీ గణాంకాలను 28వ తారీఖున విడుదల చేయడం ఇదే ప్రథమం.ఇప్పటివరకు నెల ముగిసిన ఆరు వారాల తర్వాత ప్రతి నెల 12వ తారీఖున విడుదల చేసేవారు. ఇకపై నాలుగు వారాల తేడాతో ప్రకటిస్తారు.

వ్యాపార ‘పద్మా’లు..
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సోమవారం ప్రతిష్టాత్మక ‘పద్మ’ పురస్కారాల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జైడస్ లైఫ్‌సైన్సెస్ ఛైర్మన్ పంకజ్ పటేల్ పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. పద్మశ్రీ గ్రహీతల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య, పారిశ్రామికవేత్త పవన్ కుమార్ గోయెంకా ఉన్నారు. సుజుకీ మోటర్ మాజీ చీఫ్, దివంగత ఒసాము సుజుకీకి (మరణానంతరం) ప్రకటించిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని సుజుకీ మోటర్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ తొషిహిరో సుజుకీ అందుకున్నారు.పంకజ్ పటేల్పంకజ్ పటేల్ దేశంలోని ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో ఒకటైన జైడస్ లైఫ్ సైన్సెస్ ఛైర్మన్. 1953 మార్చి 16న గుజరాత్లో జన్మించిన ఆయన హెల్త్ కేర్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన నాయకత్వంలో జైడస్ అధిక కొలెస్ట్రాల్ కలిగిన మధుమేహ వ్యాధిగ్రస్తులకు తొలి భారతీయ ఔషధం లిపాగ్లిన్, దేశంలో మొట్టమొదటి హెచ్ 1 ఎన్ 1 వ్యాక్సిన్ వాక్సిఫ్లూ-ఎస్ వంటి ఉత్పత్తులను అభివృద్ధి చేసింది.అరుంధతీ భట్టాచార్యప్రముఖ భారతీయ బ్యాంకర్, కార్పొరేట్ లీడర్‌గా గుర్తింపు పొందారు. 2013 నుంచి 2017 వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఛైర్‌పర్సన్‌గా పనిచేసిన తొలి మహిళ. ఆమె తన పదవీకాలంలో మహిళా ఉద్యోగులకు విశ్రాంతి సెలవులు, సంస్థలో మహిళలకు ఉచిత గర్భాశయ క్యాన్సర్ టీకాలు వంటి విధానాలను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం సేల్స్‌ఫోర్స్ ఇండియా ఛైర్పర్సన్, సీఈఓగా ఉన్నారు. గతంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో సహా పలు బోర్డుల్లో పనిచేశారు.పవన్ కుమార్ గోయెంకాఆటోమోటివ్ రంగంలో సేవలందిస్తున్న ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త. మహీంద్రా స్కార్పియో ఎస్యూవీ వంటి ఐకానిక్ వాహనాల అభివృద్ధికి కృషి చేశారు. మహీంద్రా అండ్ మహీంద్రాను గ్లోబల్ బ్రాండ్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించారు. 2021లో పదవీ విరమణ చేసే వరకు మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఐఎన్-స్పేస్) ఛైర్మన్‌గా ఉన్నారు.ఇదీ చదవండి: భారత్‌లో తగ్గిన పేదరికం! ఎలాగంటే..ఒసాము సుజుకి ప్రపంచ ఆటోమోటివ్ పరిశ్రమలో సేవలించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. సుజుకి మోటార్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, సీఈఓగా పని చేశారు. భారత కార్ల మార్కెట్లో మారుతి సుజుకి ద్వారా విప్లవాత్మకమైన పాత్ర పోషించారు. ఇది దేశంలో సరసమైన, నమ్మదగిన వాహనాలకు గుర్తింపుగా మారింది. కంపెనీలో తన నాయకత్వం 1978 నుంచి 2021 వరకు నాలుగు దశాబ్దాలకు పైగా కొనసాగింది. 1930 జనవరి 30న జపాన్‌లో జన్మించిన ఒసాము సుజుకీ 1958లో సుజుకి మోటార్ కార్పొరేషన్లో చేరారు. 2024 డిసెంబర్ 25న తన 94వ ఏట కన్నుమూశారు.

మహిళలకు ఉద్యోగాల బూమ్
న్యూఢిల్లీ: ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో ఉద్యోగ దరఖాస్తులు (నియామకాలు) గణనీయంగా పెరిగినట్టు.. ముఖ్యంగా మహిళల భాగస్వామ్యం పెరిగినట్టు ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్ ఆప్నా వెల్లడించింది. సౌకర్యవంతమైన పని నమూనాలు, టైర్–2, 3 పట్టణాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఆప్నా ఒక నివేదికను విడుదల చేసింది. జనవరి–మార్చి మధ్య 1.81 కోట్ల ఉద్యోగ దరఖాస్తులు వచ్చాయని, గతేడాది మొదటి మూడు నెలలతో పోల్చితే 30 శాతం పెరిగినట్టు తెలిపింది. బీపీవో, ఫైనాన్స్, హెచ్ఆర్ తదితర విభాగాల్లో నియామకాలు పెరగడం, ఆర్థిక వ్యవస్థ పట్ల ఆశావహ పరిస్థితులకు ఈ గణాంకాలు నిదర్శమని పేర్కొంది. ముఖ్యంగా మహిళల నుంచి దరఖాస్తులు 23 శాతం పెరిగి 62 లక్షలుగా ఉన్నాయి. మొత్తం దరఖాస్తుల్లో ఫ్రెషర్ల (ఉద్యోగానికి కొత్త/అనుభవం లేని) నుంచి వచి్చనవి 66 లక్షలు ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 46 శాతం పెరిగాయి. చండీగఢ్, ఇందోర్, జమ్షెడ్పూర్ తదితర టైర్ 2, 3 పట్టణాల నుంచి అధిక దరఖాస్తులు వచ్చాయి. ముఖ్యంగా ఆప్నా ప్లాట్‌ఫామ్‌పై 3.1 లక్షల జాబ్ పోస్టింగ్‌లు నమోదయ్యాయి. 2024 క్యూ1తో పోల్చితే 26% పెరిగాయి. చిన్న, మధ్య తరహా సంస్థల నుంచి ఎక్కువగా ఉన్నాయి. వరంగల్‌లో పెరుగుతున్న టెక్ నియామకాలు ఎల్ఐసీ, పేటీఎం, డెల్హివరీ, ఫ్లిప్‌కార్ట్ తదితర సంస్థల నుంచే లక్ష నియామకాలు జరిగాయి. ఇవి మెట్రోలకు బయట ఇతర పట్టణాల్లోనూ నియామకాలు చేపట్టాయి. సాఫ్ట్వేర్/వెబ్ డెవలపర్ ఉద్యోగాలకు పోస్టింగ్‌లు 65 శాతం మేర పెరిగాయి. ఈ పోస్ట్‌లకు ఫ్రెషర్ల నుంచి 42 శాతం అధికంగా దరఖాస్తులు రావడం గమనార్హం. ఏఐ/ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, బిజినెస్ ఇంటెలిజెన్స్ తదితర ఉద్యోగాల్లో నిపుణుల అవసరం పెరిగింది. ఇక కొత్త నియామకాల్లో ఢిల్లీ ఎన్సీఆర్, బెంగళూరు, ముంబై ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. జైపూర్ లక్నో, రాజ్‌కోట్, వరంగల్ టెక్నాలజీ ఉద్యోగ నియామకాల్లో కీలక కేంద్రాలుగా అవతరిస్తున్నట్టు ఆప్నా నివేదిక వెల్లడించింది. ఈ పట్టణాల్లో 30–50 శాతం వృద్ధి కనిపించినట్టు పేర్కొంది. దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి ట్రిలియన్ డాలర్లకు చేరుకునే విషయంలో టైర్ 2, 3 పట్టణాలు కీలక పాత్ర పోషించనున్నట్టు తెలిపింది.
ఫ్యామిలీ

ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
ఆధునికయుగం, స్మార్ట్ యుగం అని చెప్పుకొని పొంగిపోతున్న నేటి కాలంలో కూడా ఆడ శిశువులపై అంతులేని వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆడబిడ్డ మహాలక్ష్మీగా భావించే సమాజమే ఆడబిడ్డను భారంగా భావిస్తుంది. అందుకే కొందరు తల్లిదండ్రులు ఆడశిశువులను భారంగా భావిస్తున్నారు. అవును మళ్లీ ఆడపిల్లే పుట్టిందన్న బాధతో పసిగుడ్డును ఆసుపత్రిలోనే వదిలివేసిన ఘటన మానవత్వానికే మచ్చగా నిలిచింది. దీనికి సంబంధించిన ఘటనను ఒక మహిళా వైద్యురాలు షేర్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది.చదవండి: అమ్మమ్మ కాంజీవరం పట్టు చీరలో ‘బుట్టబొమ్మ’లామహిళా డాక్టర్ పోస్ట్ చేసిన వైరల్ వీడియో ప్రకారం, ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక మహిళ తన మూడవ కుమార్తెకు జన్మనిచ్చింది. మళ్లీ ఆడ శిశువు జన్మించడంతో నిరాశ చెందిన ఆ కుటుంబం, నవజాత శిశువును ఆసుపత్రిలోనే వదిలివేసింది. ప్రసవం తర్వాత శిశువు తండ్రి కూడా ఆమెను సందర్శించలేదని డాక్టర్ వెల్లడించారు.I am shocked to see this happening in 2025.These kinds of people don't deserve to be parents!. pic.twitter.com/0kHYhbZHTf— Anushka Gupta (@Anushqq) April 27, 2025సోషల్ మీడియాలో డాక్టర్ భావోద్వేగ విజ్ఞప్తి21వ శతాబ్దంలో కూడా ఇప్పటికీ కొనసాగుతున్న, లోతుగా పాతుకుపోయిన లింగ వివక్షను ఆమె హైలైట్ చేశారు. దేశ అధ్యక్షురాలు మహిళ, ఇటీవల అంతరిక్షంనుంచి ఎంతో ధైర్యంతో తిరిగి వచ్చిన సునీతా విలియమ్స్ మహిళ. ఇలాంటి వారిట భారతదేశం ఎంత గర్వపడాలి.ఆడ శిశువును ఎలా తిరస్కరించడం అన్యాయం,ఇది తనకు ఎంతో బాధను కలిగించిందని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది దీనిపై నెటిజనులు స్పందించారు. ఈ ఘటనపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేయగా, మరికొందరు తాము దతత్త తీసుకుంటామన్నారు. ఆమెను ప్రేమతో నిండిని గూడును అందించడానికి తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు. దీంతో శిశువు కుటుంబం తమ తప్పును గ్రహించారు. తిరిగి తమ బిడ్డను తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ఆ డాక్టర్ తరువాత ఒక ఫాలో-అప్ వీడియోను షేర్ చేశారు. సోషల్ మీడియా వల్లే ఆ ఫ్యామిలి తమ తప్పు తెలుసుకుంది అంటూ ఆమె నెటిజన్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ పాప కుటుంబ సభ్యులను వివరాలను మాత్రం డాక్టర్ గోప్యంగా ఉంచారు.ఇదీ చదవండి: అమాయకులను పొట్టనబెట్టుకున్నారు: వాళ్ల పాపానికి మేం మూల్యం చెల్లిస్తున్నాం!

Rich Man's Disease: అరటి పండ్లు తిన్నారంటే ఇలా..!
ఇదేం వ్యాధి ఆ పేరేంటీ.. అనుకోకుండి. కేవలం ధనవంతులకే వచ్చే వ్యాధా..? అంటే..ఔననే అంటున్నారు నిపుణులు. ధనవంతులు, వారి జీవనశైలి, అలవాట్ల కారణంగా వస్తుంది కాబట్టి దీన్ని Rich Man's Disease(ధనవంతుల వ్యాధి) అని అంటారు. ఇంతకీ ఏంటా వ్యాధి..? ఎలా నయమవుతుంది అంటే..బాగా డబ్బున్న వ్యక్తులు(Rich Man's )తీసుకునే మాంసం, పానీయాలు, ప్రత్యేక కూరగాయాలు తదితరాల కారణంగా వచ్చే వ్యాధి కావడంతో Rich Man's Disease(ధనవంతుల వ్యాధి) అని పిలుస్తారు. ఆర్థరైటిస్ మరో రూపామైన గౌట్ వ్యాధిని ఇలా పిలుస్తారట. కీళ్లల్లో తరుచుగా బొటనవేలు దిగువన తీవ్రమైన నొప్పి, వాపు, ఎరుపులతో ఇబ్బంది పెడుతుంటుంది. ఆ ప్రదేశం అంతా చాలా సున్నితంగా ఉండి కొంచెం తాకిన నొప్పితో విలవిలలాడినట్లుగా ఉంటుంది. ఇది ఒకరమైన ఆర్థరైటిస్‌గా చెబుతుంటారు నిపుణులు. ఎందువల్ల వస్తుందంటే..గౌట్ శరీరంలో యూరిక్ ఆమ్లం పేరుకుపోవడం వల్ల వస్తుంది. ఇది కీళ్లలో సూది లాంటి స్ఫటికాలు ఏర్పడటానికి దారితీస్తుంది. యూరిక్ యాసిడ్ పెరుగుదల గౌట్‌కు ఎలా కారణం అంటే..కొన్ని ఆహారాలు, పానీయాలలో కనిపించే ప్యూరిన్లు అనే రసాయనాలను విచ్ఛిన్నం కావడంతో యూరిక్ యాసిడ్ ఉత్ఫన్నమవుతుంది. అదీగాక శరీరం కూడా సహజంగా యూరిక్ యాసిడ్‌ను తయారు చేస్తుంది. ఫలితంగా శరీరంలో అదనపు యూరిక్ యాసిడ్ పేరుకుపోవడం మొదలై గౌట్‌కు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. మూత్రపిండాలు సాధారణంగా రక్తం నుంచి యూరిక్ యాసిడ్‌ను ఫిల్టర్ చేసి, మూత్ర విసర్జన రూపంలో బయటకి పంపించేస్తుంది. అయితే శరీరం అధిక మొత్తంలో యూరిక్ యాసిడ్‌ని ఉత్పత్తి చేస్తే.. మూత్రపిండాలను దాన్ని బయటకు పంపించలేకపోతాయి. ఫలితంగా ఆ యూరిక్ యాసిడ్ స్ఫటికాల రూపంలో కీళ్లల్లో ఏర్పడతాయి. ఆ పదునైన స్ఫటికాలు కారణంగా నొప్పి, వాపు ఇతర సమస్యలు ఉత్ఫన్నమై గౌట్ వ్యాధి వస్తుంది. గౌట్ సంకేతాలు, లక్షణాలు..గౌట్ అటాక్స్ చాలా బాధాకరంగా ఉంటుందితీవ్రమైన, భరించలేని నొప్పిరంగు మారడం లేదా ఎరుపుదనంకీళ్ల దృఢత్వంవాపు తేలికపాటి స్పర్శకు కూడా తట్టుకోలేని సున్నితత్వంవెచ్చదనం, లేదా కీలు మండుతున్నట్లుగా అనిపించడంఏ ఆహారాలు గౌట్‌కు కారణం అంటే..ప్యూరిన్లతో నిండిన ఆహారాన్ని తినడం లేదా త్రాగడం వల్ల గౌట్‌కు దారితీసే అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. చక్కెర పానీయాలు, డెజర్ట్‌లు.కార్న్ సిరప్ ఇది అన్ని ప్యాక్ చేసిన ఆహార ఉత్పత్తుల్లోనూ ఉంటుందిఆల్కహాలిక్ పానీయాలలో ప్యూరిన్ ఎక్కువగా ఉంటుందిహెర్రింగ్, స్కాలోప్స్, మస్సెల్స్, కాడ్ ఫిష్, ట్యూనా, ట్రౌట్, హాడాక్ వంటి సముద్రపు చేపల్లోరెడ్మీట్నివారణ..ఆహారంలో మార్పులను సూచిస్తారు వైద్యులు. తక్కువ ప్యూరిన్ ఆహారాన్ని అనుసరించడం ద్వారా సమస్య తగ్గుతుంది. నిపుణులు పొటాషియం అధికంగా ఉండే అరటిపండ్లను తినాలని సిఫార్సు చేస్తారు. ఇది మూత్రం ద్వారా యూరిక్ యాసిడ్‌ను విసర్జించడానికి సహాయపడుతుంది. అలాగే, అరటిపండ్లు విటమిన్ సి పవర్‌హౌస్. ఇది రక్తంలోని యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్ కూడా. అలాగే, అరటిపండ్లతో పాటు నారింజ, నిమ్మకాయలు, ద్రాక్షపండ్లు, కివి స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీస్, చెర్రీస్, ఆపిల్స్, పైనాపిల్స్ వంటి వాటిల్లో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇవి గౌట్ వ్యాధిని అదుపులో ఉంచుతాయని చెబుతున్నారు వైద్యులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగత వైద్యులను లేదా నిపుణులను సంప్రదించాలి. (చదవండి: 'గ్రానీ' అభిరుచులే ట్రెండ్ అంటున్న యువత..! నిపుణులు ఏమంటున్నారంటే..)

అమ్మమ్మ కాంజీవరం పట్టు చీరలో ‘బుట్టబొమ్మ’లా
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటి పూజా హెగ్డే (Pooja Hegde). వరుసగా సినిమాలతో టాలీవుడ్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న పూజా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రానికి సంబంధించిన ప్రతి అప్డేట్ను షేర్ చేస్తూ అభిమానులను ఊరిస్తోంది. తాజాగా అందమైన చీరలో, నుదిటిన, బొట్టు, మల్లెపూలు పెట్టుకొని దర్శనమిచ్చింది. 70 ఏళ్ల కాంజీవరం ( Kanjivaram ) చీర ధరించినఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీంతో ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.బుట్టబొమ్మగా పాపులర్ అయిన పూజా హెగ్డే సంప్రదాయ లుక్‌లో ఫొటో షూట్ చేసింది. పాతకాలపు బీరువా.. 70 ఏళ్ల నాటి అద్భుతమైన చీర.. నా అందమైన అజ్జీ (అమ్మమ్మ) కంజీవరంలో రోజు గడుపుతున్న దృశ్యాలు, పెళ్లికి వెళ్ళే ముందు ఇంట్లో ఉండే మల్లెలతాజా వాసన, తొలి చినుకుల తర్వాత తడిసిన మంగళూరు బురద వాసనలు... ఓహ్, చిన్న విషయాల్లో అందం’’ అనే కాప్షన్‌తో అందమైన ఫోటోలను షేర్ చేసింది. సాంప్రదాయ చీరలొ అద్భుతంగా కనిపించిన నటి, మ్యాచింగ్ బ్లౌజ్‌తో సంతోషంగా పోజులిచ్చింది. చదవండి: Pahalgam గడువు లోపు వెళ్లకపోతే...తప్పదు భారీ మూల్యం!ఇటీవల తన లేటెస్ట్ మూవీ రెట్రోకు సంబంధించి పూజా హెగ్డే రెండు నిమిషాల టీజర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి, "ఈ పాత్రలో నా హృదయంలో ఒక భాగం. భావోద్వేగాల హెచ్చు తగ్గులు 'రెట్రో' వచ్చేసింది" అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. ఈ మూవీలో నటి ఒక పల్లెటూరి అమ్మాయి పాత్రను పోషిస్తోంది. ఆమె సూర్య మణికట్టుపై స్నేహితురాలిగా రక్ష సూత్రాన్ని కట్టింది. దీని తర్వాత, సూర్య టీజర్లో, "నేను నా కోపాన్ని అదుపు చేసుకుంటాను, ఈ క్షణం నుండి నేను ప్రతిదీ వదిలివేస్తాను. నేను నవ్వడానికి,సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. నా జీవిత ఉద్దేశ్యం స్వచ్ఛమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే." కాగా 'రెట్రో' ఈ సంవత్సరం మే 1న థియేటర్లలో విడుదల అవుతుంది. హెగ్డే 'రెట్రో' తో పాటు అనేక ఇతర ప్రత్యేక ప్రాజెక్టులతో బిజీగా ఉంది. పూజా 'దళపతి 69' 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' వంటి అనేక ఇతర ఉత్తేజకరమైన ప్రాజెక్టులను కలిగి ఉంది.చెన్నైలో 'దళపతి 69' షూటింగ్ ప్రారంభం గురించి చెబుతూ ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది.ఇదీ చదవండి: అమాయకులను పొట్టనబెట్టుకున్నారు: వాళ్ల పాపానికి మేం మూల్యం చెల్లిస్తున్నాం!

అమాయకులను పొట్టనబెట్టుకున్నారు: వాళ్ల పాపానికి మేం మూల్యం చెల్లిస్తున్నాం!
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో పౌరులు, పర్యాటకులు సహా 26 మంది మరణించిన ఘటనలో కేంద్రం పాక్‌పై అనేక ఆంక్షలు విధించింది. ముఖ్యంగా భారత్‌లో ఉంటున్న పాకిస్తానీయుల వీసాలను రద్దు చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ జాతీయులు భారతదేశం నుండి వెళ్లి పోతున్నారు. ఈ సందర్భంగా ఎంతో భావోద్వేగానికి గురవుతున్నారు. ఎవరో చేసిన పాపానికి తాము శిక్ష అనుభవిస్తున్నామంటూ ఆవేదనను వెలిబుచ్చుతున్నారు.కేంద్రప్రభుత్వ ఆదేశాల ప్రకారం నివేదికల ప్రకారం గురువారం నుండి దాదాపు 700 మంది అట్టారి-వాఘా సరిహద్దు క్రాసింగ్ ద్వారా దేశాన్ని వీడారు. వీరిలో పర్యాటకులు , వైద్య చికిత్స కోసం భారతదేశానికి వచ్చిన వారు ఉన్నారు. చాలామంది తమకు వేరే మార్గం లేదంటూ విచారం వ్యక్తం చేశారు. అంతేకానీ ఈ పరిస్థితిని ప్రశ్నిస్తున్నారు.అట్టారి-వాఘా సరిహద్దును దాటే ముందు తాను మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ను సందర్శించడానికి వచ్చానని ఒక మహిళ తెలిపింది. కానీ వేరెవరోపాపానికి తాను 'శిక్ష అనుభవిస్తున్నానని' ఆమె వాపోయింది. పహల్గామ్లో జరిగింది తప్పు... అమాయకులను వారు పొట్టన బెట్టుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.#WATCH | Punjab | A Pakistani national returning to Pakistan via Attari Border says, "... We came to visit Nagpur and since our visa expired, we are going back... Someone else is being punished for someone else's deeds... Whatever happened in Pahalgam was wrong and innocents… pic.twitter.com/OBbf1wkYXW— ANI (@ANI) April 28, 2025పాకిస్తాన్‌లోని అమర్‌కోట్ నివాసి అయిన మరో వ్యక్తి మాట్లాడుతూ జనవరి నుండి పంజాబ్‌లోని బంధువుతో ఉంటున్నాననీ, దీర్ఘకాలిక వీసా లేనందున, భారత్ ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరిగి వెళ్లిపోతున్నామని తెలిపారు. పహల్గామ్లో జరిగినది తప్పు.. కానీ దానికి మనం మూల్యం చెల్లిస్తున్నాం."అంటూ విచారం వ్యక్తంచేశారు. ఈ విషయంలో "రెండు దేశాలు కలిసి పనిచేస్తే మంచిది," అని ఆయన అన్నారు. కాల్పులు, బాంబులు, ఉగ్రవాద దాడుల కంటే శాంతి, సామరస్యం ,వాణిజ్య మార్పిడి ద్వారా వారికి మంచి ప్రయోజనం చేకూరుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.కాగా ఏప్రిల్ 22 దాడి తర్వాత భారతదేశం పాక్ జాతీయులకు వీసాలను నిలిపివేసింది. ఆదివారం ఆ సస్పెన్షన్ అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం భారతదేశంలో కొనసాగే ఏ పాక్ జాతీయుడైనా గడువు లోపు వెళ్లకపోతే, మూడేళ్ల జైలు శిక్ష లేదా గరిష్టంగా రూ. 3 లక్షల జరిమానా విధించవచ్చు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను వారి వారి అధికార పరిధిలో నివసిస్తున్న లేదా ఉంటున్న పాక్ జాతీయులను గుర్తించి వెనక్కి పంపించివేయాలని ఆదేశించింది. మరోవైప పహల్గామ్ ఉగ్ర వాద దాడి తర్వాత, జమ్మూ కశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో పోలీసులు, భద్రతా దళాలు ఎంపిక చేసిన ఇళ్లను కూల్చివేస్తున్నాయి. ఇప్పటివరకు దాదాపు 10 ఇళ్లను ఇలా కూల్చివేసినట్టు సమాచారం. ఇదీ చదవండి: Pahalgam గడువు లోపు వెళ్లకపోతే...తప్పదు భారీ మూల్యం!
ఫొటోలు
అంతర్జాతీయం

Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
న్యూఢిల్లీ: సింధు జలాల నదీ ఒప్పందం నిలిపివేత నేపథ్యంతో భారత్‌ను ఉద్దేశించి పలువురు పాక్ నేతలు అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. వారిలో బిలావల్ భుట్టో జర్దారీ చేసిన వ్యాఖ్యలకు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నీ తాత, తల్లిని చంపిందెవరో ఒక్కసారి గుర్తు తెచ్చుకో అంటూ బిలావల్‌ను ఉద్దేశించి ప్రశ్న సంధించారాయన.‘‘ఇవన్నీ పిల్ల మాటలు. అతని తాతకు ఏం జరిగిందో అతనికి తెలియదా? అతని తల్లిని ఉగ్రవాదులేగా చంపేశారు. కనీసం అది గుర్తున్నా? అతను అలా మాట్లాడి ఉండడు. అమెరికా సాయం చేస్తేనేగానీ ముందుకు నడవలేని దేశం పాకిస్తాన్. అలాంటిది మీరా మనల్ని చిన్నచూపు చూస్తోంది? అంటూ బిలావల్‌ను ఉద్దేశించి ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.అతని తల్లిని చంపినప్పుడు అది ఉగ్రవాదం.. అదే మన అమ్మలను, బిడ్డలను చంపినప్పుడు అది ఉగ్రవాదం కాదా?. ఇది కూడా అర్థం చేసుకోలేనివాడికి మనం ఏం చెప్పినా వ్యర్థమే’’ అని ఒవైసీ వ్యాఖ్యానించారు.పనిలో పనిగా పాక్ నేతలకూ ఆయన చురకలంటించారు. ‘‘ పాక్‌లో కూర్చుని అడ్డగోలుగా మాట్లాడొద్దు. పాక్ దేశ మొత్తం బడ్జెట్.. మా దేశ రక్షణ బడ్జెట్ కంటే తక్కువే.మీరు ఏ దేశంలోకి చొరబడి అమాయకుల ప్రాణాలు తీస్తుంటే ఎవరూ మౌనంగా ఉండరు. మతం అడిగి మరీ చంపడం.. వికృతమైన పని. ఉగ్రవాదులు మరోసారి దాడి చేసే సాహసం చేయకుండా ప్రధాని మోదీ కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని ఒవైసీ అన్నారు. 2007 డిసెంబర్ 30వ తేదీన రావల్పిండిలో జరిగిన ర్యాలీలో.. ఆత్మాహుతి దాడి జరిగి బెనజీర్ భుట్టోతో పాటు మరో 20 మంది బలయ్యారు. ఇక..పాక్ మాజీ అధ్యక్షుడు, ప్రధాని అయిన ఆమె తండ్రి జుల్ఫీకర్ అలీ భుట్టోను ఓ హత్య కేసుకుగానూ 1979 ఏప్రిల్ 4వ తేదీన ఉరి తీశారు. అయితే అది రాజకీయ ప్రేరేపిత కేసు అనే అభియోగాలు ఉన్నాయి. 2023 దాకా విదేశాంగ మంత్రిగా పని చేసిన పీపీపీ నేత బిలావల్ భుట్టో.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. ‘‘సింధూ నది మాదే. ఎప్పటికీ మాదే. నదిలో నీరైనా పారుతుంది లేదా వారి రక్తమైనా పారుతుంది. పాకిస్థాన్ గానీ అంతర్జాతీయ సమాజం కానీ ఈ యుద్ధ కాంక్షను అస్సలు సహించదు. వేల ఏళ్ల నాటి సింధూ నాగరికతకు తాము వారసులమని మోదీ అంటుంటారు. కానీ ఈ సంస్కృతికి పరిరక్షకులము మేమే. ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుంటాము’’ అంటూ ఓ ర్యాలీలో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను కేంద్ర మంత్రులు సహా భారత్‌లోని పలువురు నేతలు ఇప్పటికే ఖండించారు కూడా.

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. దాయాదితో టచ్‌లోకి చైనా
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడి ఘటన భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను పెంచింది. ఇందులో భాగంగా పాకిస్తాన్ విషయంలో భారత్ పలు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో పొరుగు దేశం చైనా ఆచితూచి అడుగులు వేస్తోంది. తాజాగా ప్రస్తుత పరిస్థితుల్లో భారత్- పాకిస్థాన్‌లు సంయమనం పాటించాలని చైనా భావిస్తోంది అంటూ ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి చెప్పుకొచ్చారు.తాజాగా చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ, పాకిస్తాన్ విదేశాంగ మంత్రితో మాట్లాడారు. ఈ క్రమంలో వాంగ్ యీ మాట్లాడుతూ..‘పాకిస్తాన్, భారత్ మధ్య పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాం. ఉగ్రదాడిపై నిష్పక్షపాత దర్యాప్తునకు మద్దతు ఇస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు దేశాలు సంయమనం పాటించాలని బీజింగ్ భావిస్తోంది. పరస్పరం ముందుకు సాగాలని, ఉద్రిక్తతలను తగ్గించేందుకు కృషి చేయాలని ఆశిస్తోంది’ అని చెప్పినట్లు చైనా మీడియా ఓ ప్రకటనలో పేర్కొంది. ఉగ్రవాదంపై పోరాటం అన్ని దేశాల ఉమ్మడి బాధ్యత అని స్పష్టం చేసినట్లు వెల్లడించింది.ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తు వ్యవహారంలో రష్యా, చైనాలు జోక్యం చేసుకోవాలని పాకిస్థాన్ కోరుకుంటున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ‘ఈ ఘటన దర్యాప్తు విషయంలో రష్యా, చైనా లేదా పశ్చిమ దేశాలు సానుకూల పాత్ర పోషించగలవు. భారత్, మోదీ అబద్ధం చెబుతున్నారా? లేదా.. పాకిస్తాన్ నిజం చెబుతుందా? అనేది వెలికితీసేందుకు దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేయవచ్చు’ అని కథనాలు వెలువడ్డాయి.China breaks its silence on the ongoing tensions between India and Pakistan.Chinese Foreign Minister Wang Yi spoke with Pakistan’s Deputy PM Ishaq Dar today and said that China supports Pakistan in safeguarding its sovereignty and security interests. pic.twitter.com/wIUt1Yz0UJ— Salt News (@SaltNews_) April 27, 2025మరోవైపు.. పహల్గాంలో ఉగ్ర దాడిని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ ఖండించారు. ఈ విషయంలో భారత్‌కు పూర్తి మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేశారు. ఉగ్రవాదం నుంచి ప్రపంచం ఎదుర్కొంటున్న బెదిరింపులను ఈ దాడి గుర్తు చేసిందని పేర్కొన్నారు. దాడి అనంతరం భద్రతా దళాలు స్పందించిన తీరును ప్రశంసించారు. ‘కశ్మీర్లో ఇటీవల జరిగిన దాడిలో మరణించిన వారికి ఎఫ్‌బీఐ సంతాపం తెలుపుతోంది. భారత్ ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా నిలుస్తోంది’ అని వ్యాఖ్యానించారు.పహల్గాం ఉగ్ర దాడిని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఖండించారు. ఉగ్రవాదాన్ని అడ్డుకోవడానికి ప్రాంతీయ సమన్వయం అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీకి తాను ఫోన్ చేసి దాడిని ఖండించినట్లు ఆయన ప్రకటించారు. పహల్గాం దుర్ఘటనలను ఈ ప్రాంతంలోని దేశాలు ఉమ్మడి బాధ్యతగా తీసుకుని స్పందించాలని సూచించారు. ఇరాన్లో పర్యటించాలని ప్రధాని మోదీకి ఆయన ఆహ్వానం పలికారు.

పాక్ ఆర్మీ చీఫ్ ఎక్కడ?
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ సైన్యాధిపతి జనరల్ సయీద్ ఆసిఫ్ మునీర్ కనిపించడం లేదన్న వార్తలు పాకిస్తాన్లో కలకలం రేపుతున్నాయి. కుటుంబంతో పాటుగా ఆయన దేశం వీడి పారిపోయారని స్థానిక మీడియాలో ఆదివారం వార్తలొచ్చాయి. ‘‘తొలుత కుటుంబాన్ని విదేశాలకు తరలించారు. తర్వాత తానూ పాక్ వీడారు’’ అన్నది వాటి సారాంశం. కొద్ది రోజులుగా, ఆ మాటకొస్తే పహల్గాం దాడి జరిగినప్పటి నుంచీ మునీర్ బయట ఎక్కడా కని్పంచడం లేదని ఆ కథనాలు చెబుతున్నాయి. మునీర్‌కు తీవ్ర భారత విద్వేషిగా పేరుంది. కొద్ది రోజులుగా భారత వ్యతిరేక వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. పాక్‌కు కశ్మీర్ జీవనాడి అని, దాన్ని వదులుకునే ప్రసక్తే లేదని, హిందువులు, ముస్లింలు భిన్న జాతులని ఇటీవలే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తర్వాత రెండు రోజులకే పహల్గాం ఉగ్ర దాడి జరిగింది. ‘‘దాడిపై ఆగ్రహంతో రగిలిపోతున్న భారత్ తీవ్రస్థాయిలో ప్రతీకార చర్యలకు దిగుతుందని పాక్ ఆందోళన చెందుతోంది. అందుకు తానే బాధ్యుడిని అవుతానని మునీర్ భయపడ్డారు. అందుకే దేశం నుంచి జారుకున్నట్టు కనిపిస్తోంది’’ అని కథనాలు పేర్కొంటున్నాయి. మునీర్ పాక్‌లోనే ఉన్నారని, రావలి్పండి బంకర్లో తలదాచుకున్నారని మరికొందరు చెబుతున్నారు. ఈ పుకార్లలో సైన్యం మనోబలం దెబ్బ తింటుందని గ్రహించిన పాక్ ప్రభుత్వం నష్ట నివారణకు దిగింది. ప్రధాని షహబాజ్ షరీఫ్, ఉన్నత సైనికాధికారులతో శనివారం మునీర్ దిగిన గ్రూప్ ఫొటో అంటూ పాక్ పీఎంఓ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. దాన్ని నమ్మలేమని, శనివారం సైనిక కాలేజీ ఉత్సవాల్లో ప్రధానితో పాటు మునీర్ పాల్గొన్నట్టుగా వచి్చన వార్తలూ నమ్మశక్యంగా లేవని మీడియా అభిప్రాయపడింది. మరోవైపు పాక్ సైన్యంలోని జనరల్స్, ఉన్నతాధికారులు తమ కుటుంబాలను ఉన్నపళంగా దేశం దాటిస్తున్నట్టు చెబుతున్నారు.

భారత్‌పై దాడి కోసం 130 అణు బాంబులు.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసీ బహిరంగంగా బెదిరింపులకు దిగాడు. భారత్‌పై దాడి చేసేందుకు పాకిస్తాన్ 130కి పైగా అణు ఆయుధాలతో పాటు ఘోరి, షాహీన్, ఘజ్నవి మిసైళ్ళను సిద్ధం చేసినట్లు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. రాక్షసత్వానికి పరాకాష్ఠగా నిలిచిన పహల్గాం ఉగ్రదాడిపై రగిలిపోతున్న భారత్ తన చర్యల ద్వారా దాయాదిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సింధూ నదీ జలాల నిలిపివేత, పాకిస్తాన్ జాతీయుల వీసాలు రద్దు, ఇతర వాణిజ్య సంబంధాలను నిలిపివేసింది. దీంతో ఏం చేయాలో పాలుపోక దీనంగా చూస్తోంది.ఈ క్రమంలో హనీఫ్ అబ్బాసీ భారత్‌ను కవ్వించే ప్రయత్నం చేశారు. భారత్ ఇండస్ వాటర్ ఒప్పందాన్ని నిలిపివేస్తే యుద్ధానికి సిద్దంగా ఉండాలని హెచ్చరించారు. యుద్ధం చేసేందుకు తాము సన్నంద్ధంగా ఉన్నామని, దేశ వ్యాప్తంగా అణు ఆయుధాల్ని సిద్ధం చేశామన్నారు. ఆ అణు ఆయుధాలు ప్రదర్శన కోసం కాదని, భారత్‌పై దాడి చేసేందుకేనని చెప్పారు. "Pakistan's nuclear missiles are not for decoration. They have been made for India," threatens Railway Minister Muhammad Hanif Abbasi pic.twitter.com/UqCCRmpXx6— Shashank Mattoo (@MattooShashank) April 27, 2025 స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘నీటి సరఫరాను ఆపితే మనతో యుద్ధం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉండాలి. మన వద్ద ఉన్న సైనిక పరికరాలు, మిసైళ్ళు ప్రదర్శన కోసం కాదు. మన అణు ఆయుధాలు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదు. నేను మళ్లీ చెబుతున్నాను, ఈ బాలిస్టిక్ మిసైళ్ళు, అవన్నీ భారత్‌పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అంతకుముందు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దేశం గత మూడు దశాబ్దాలుగా ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషించిందని ఒప్పుకున్నారు. దాని ఫలితమే ఈ దుర్భర పరిస్థితులకు కారణమని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.
జాతీయం

తహవ్వుర్ రాణా కస్టడీ పొడిగింపు
న్యూఢిల్లీ: ముంబై ఉగ్రదాడుల కేసులో కీలక నిందితుడు తహవ్వుర్ రాణా కస్టడీని ఎన్ఐఏ కోర్టు మరో 12 రోజులు పొడిగించింది. 18 రోజుల కస్టడీ గడువు ముగియడంతో సోమవారం ప్రత్యేక కోర్టు జడ్జి చందర్ జిత్ సింగ్ ఎదుట ఎన్ఐఏ హాజరు పరిచింది. ముఖానికి ముసుగు తొడిగిన రాణాను అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కోర్టుకు తీసుకువచ్చారు. తమ వద్ద ఉన్న కీలకమైన పత్రాలపై అతడి నుంచి సమాచారం రాబట్టాల్సి ఉందని ఎన్ఐఏ తెలిపింది. కస్టడీ సమయంలో సాధించిన దర్యాప్తు పురోగతిని జడ్జికి ప్రత్యేకంగా వివరించింది. విచారణలో అతడు తమకు సహకరించడం లేదని ఎన్ఐఏ లాయర్లు వాదించారు. ఎన్ఐఏ అధికారుల సమక్షంలోనే అతడు లాయర్‌ను కలుసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.

జేఎన్‌యూలో పట్టు నిలబెట్టుకున్న వామపక్షం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (జేఎన్‌యూఎస్‌యూ) ఎన్నికల్లో వామపక్షాలు మరోమారు సత్తా చాటాయి. కీలకమైన నాలుగు పదవులకు గాను మూడింటిని కైవసం చేసుకున్నాయి. ఆర్ఎస్ఎస్ అనుబంధ ఏబీవీపీకి తొమ్మిదేళ్ల తర్వాత జాయింట్ సెక్రటరీ పోస్టు దక్కించుకోగలిగింది. జేఎన్‌యూఎస్‌యూ ఎన్నికల కమిషన్ సోమవారం ఉదయం ప్రకటించిన ఫలితాల్లో ప్రెసిడెంట్ పదవిని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ)కు చెందిన నితీశ్ కుమార్ గెలుచుకున్నారు. ఈయనకు 1,702 ఓట్లు పడగా సమీప ప్రత్యర్థి ఏబీవీపీకి చెందిన శిఖా స్వరాజ్‌కు 1,430 ఓట్లు దక్కాయి. ఎస్ఎఫ్ఐకి చెందిన తయ్యబా అహ్మద్ 918 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. వైస్ ప్రెసిడెంట్‌గా డెమోక్రాటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్(డీఎస్ఎఫ్)బలపరిచిన మనీ షా 1,150 ఓట్లతో విజయం సాధించారు. ఏబీవీపీ అభ్యర్థికి 1,116 ఓట్లు దక్కాయి. జనరల్ సెక్రటరీ పదవిని గెలుచుకున్న డీఎస్‌ఎఫ్‌కు చెందిన ముంతేహా ఫతిమాకు 1,520 ఓట్లు రాగా ప్రత్యర్థి, ఏబీవీపీకి చెందిన కునాల్ రాయ్‌కి 1,406 ఓట్లొచ్చాయి. అదేవిధంగా, ఏబీవీపీ అభ్యర్థి వైభవ్ మీనా 1,518 ఓట్లతో జాయింట్ సెక్రటరీ పదవిని గెలుచుకున్నారు. సమీప ప్రత్యర్థి ఏఐఎస్ఏకు చెందిన నరేశ్ కుమార్‌కు 1,433 ఓట్లు, ప్రోగ్రెసివ్ స్టూడెంట్ అసోసియేషన్(పీఎస్ఏ) అభ్యర్థి నిగమ్ కుమారికి 1,256 ఓట్లు పడ్డాయి.2015–16 తర్వాతచిట్టచివరిసారిగా 2015–16 జేఎన్‌యూఎస్‌యూ ఎన్నికల్లో ఏబీవీపీ అభ్యర్థి సౌరవ్ శర్మ జాయింట్ సెక్రటరీగా గెలుపొందారు. ఆ తర్వాత ఆ పదవి దక్కడం ఇదే మొదటిసారి. అదేవిధంగా, 2000–01 ఎన్నికల్లో ఏబీవీపీకి చెందిన సందీప్ మహాపాత్ర జేఎన్‌యూఎస్‌యూ ప్రెసిడెంట్ అయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఏబీవీపీ ఆ పదవిని ఇప్పటి వరకు గెలుచుకోలేకపోయింది.

ముష్కర మూకలకు ముచ్చెమటలు
శ్రీనగర్: పహల్గాంలో ఉగ్రవాదుల రాక్షసకాండ తర్వాత కోపంతో రగిలిపోతున్న భారతసైన్యం ఏక్షణంలోనైనా పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని ఉగ్రవాదుల శిబిరాలపై దాడి చేయొచ్చనే భయా నుమానాలు పాక్ సైన్యంలో ఎక్కువయ్యాయి. దీంతో ఇన్నాళ్లూ తాము పెంచి పోషించిన ఉగ్రవాదులను పాక్ సైన్యం వెంటనే ఆయా ‘లాంచ్‌ప్యాడ్’ల నుంచి సురక్షితంగా దూర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ముందస్తుగా ఆ ముష్కరులను తమ సైనిక శిబిరాలు, బంకర్లలోకి పంపేస్తున్నట్లు తెలుస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత సరిహద్దు వెంట ఉన్న లాంచ్ప్యాడ్లను ఖాళీచేయిస్తోంది. ఈ లాంచ్ప్యాడ్లు క్రియాశీలకంగా ఉన్న విషయాన్ని భారత సైనిక నిఘా వర్గాలు పసిగట్టడంతో ముందుజాగ్రత్తగా పాక్ సైన్యం అప్రమత్తమై అక్కడి ఉగ్రవాదులను వేరే చోట్లకు పంపేస్తోంది.ఇవన్నీ కీలక స్థావరాలుపాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని కేల్, సర్దీ, దుధ్నియాల్, అథ్ముఖాన్, జురా, లిపా, పచ్ఛిబన్, ఫార్వర్డ్ కహూతా, కోట్లీ, ఖుయిరాట్టా, మంధార్, నిఖాయిల్, ఛమన్కోట్, జాన్కోటేలలో ఈ ఉగ్రస్థావరాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతాలన్నింటి నుంచీ ఉగ్రవాదులు తాత్కాలికంగా వెళ్లిపోతున్నట్లు వార్తలొచ్చాయి. వాస్తవానికి ఇవన్నీ ఉగ్రవాదులకు కీలక స్థావరాలు(లాంచ్‌ప్యాడ్). వాస్తవాధీన రేఖ గుండా భారత్‌లోకి చొరబడటానికి ఉగ్రవాదులు ఈ స్థావరాల నుంచే బయల్దేరతారు. ఇక్కడే వీళ్లకు నెలల తరబడి ఉగ్రశిక్షణ ఇస్తారని తెలుస్తోంది. పీఓకేలో క్రియాశీలంకంగా ఉన్న 42 లాంచ్ప్యాడ్లను ఇటీవల భారత భద్రతా బలగాలు గుర్తించాయి. పహల్గాం దాడి ఉదంతం తర్వాత ఆగ్రహావేశాలతో ఊగిపోతున్న భారతసైన్యం ఏ క్షణంలోనైనా దాడి చేయవచ్చనే ఉద్దేశంతో ఉగ్రవాదులను పాక్ సైన్యం హుటాహుటిన ఇతర ప్రదేశాలకు పంపేస్తోంది. ఇలా తరలిస్తున్న ఉగ్రవాదుల సంఖ్య 150 నుంచి 200దాకా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే హిజ్బుల్ మొజాహిదీన్, జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రసంస్థలకు చెందిన దాదాపు 60 మంది విదేశీ కిరాయి ఉగ్రవాదులు కశ్మీర్లోకి చొరబడ్డారని జాతీయ మీడియాలో కథనం వెలువడింది. వీరిలో 17 మంది స్థానికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత సైన్యం సరిహద్దు వెంట గాలింపును మరింత ఉధృతంచేసింది.

ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పలువురు ప్రముఖులు సోమవారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాలు అందుకున్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన నలుగురికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు ప్రదానం చేశారు. వైద్యరంగంలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ దువ్వూరి నాగేశ్వర్‌రెడ్డి (పద్మవిభూషణ్), కళారంగంలో నందమూరి బాలకృష్ణ (పద్మభూషణ్), మాడుగుల నాగఫణిశర్మ (పద్మశ్రీ) పురస్కారాలు అందుకున్నారు.మిరియాల అప్పారావు (పద్మశ్రీ) తరఫున ఆయన కుమార్తె యడవల్లి శ్రీదేవి అవార్డు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జి.కిషన్‌రెడ్డి, రామ్మోహన్నాయుడు, శివరాజ్‌సింగ్ చౌహాన్, జితేంద్రసింగ్, ఏపీ మంత్రి లోకేశ్ దంపతులు, అవార్డు గ్రహీతల కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖలు పాల్గొన్నారు. బాలకృష్ణకు సీఎం, డిప్యూటీ సీఎం అభినందనలు సాక్షి, అమరావతి: సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సోమవారం పద్మభూషణ్ అవార్డు అందుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ వేర్వేరుగా అభినందనలు తెలిపారు. ‘కళ, సేవ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న బాలయ్య మరిన్ని నూతన శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’ అని సీఎం చంద్రబాబు ‘ఎక్స్’లో పోస్టులో చేశారు. ‘తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాలకృష్ణది ప్రత్యేక స్థానం. ఆయన ప్రజాసేవలో, కళాసేవలో మరిన్ని మైలురాళ్లు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను..’ అని పవన్‌కళ్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఎన్ఆర్ఐ

రాయలసీమ ప్రగతికి డాలస్‌లో జీఆర్ఏడీఏ అడుగులు
గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఏరియా (GRADA) ఆధ్వర్యంలో ఏప్రిల్ 13న ఫ్రిస్కో, టెక్సాస్‌లో రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం జరిగింది. రాయలసీమ సమస్యలు, అభివృద్ధి అవకాశాలు, తెలుగు భాషా సాహిత్యాల ప్రాముఖ్యతపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి రాయలసీమకు చెందిన రచయిత భూమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగంలో రాయలసీమ ప్రస్తుత పరిస్థితి, ముఖ్యంగా దీర్ఘకాలంగా వేధిస్తున్న నీటి సమస్యలు, వెనుకబాటుతనం గురించి ఎంతో ఆవేదనతో, స్పష్టంగా వివరించారు.మన ప్రాంత సహజ సంపద అయిన శేషాచలం అడవుల గురించి, ముఖ్యంగా ఎర్రచందనం చెట్ల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ విలువైన సంపదను అక్రమ మార్గాల్లో ఇతర దేశాలకు తరలించి లాభం పొందకుండా, స్థానికంగానే వాటి ఆధారిత పరిశ్రమలను స్థాపించి, ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా మన ప్రాంతాన్ని ఎలా ఆర్ధికంగా బలోపేతం చేయవచ్చో ఆయన చక్కగా వివరించారు. ఆయన మాటలు మనందరిలో కొత్త ఆలోచనలను రేకెత్తించాయి. సహజ వనరులను సక్రమంగా వినియోగించుకుంటే రాయలసీమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే ఆశాభావాన్ని ఆయన కలిగించారు.మరో గౌరవ అతిథిగా కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ఛాన్సలర్, ప్రఖ్యాత విద్యావేత్త ప్రొఫెసర్ పి. కుసుమ కుమారి హాజరయ్యారు. ఆమె తన ప్రసంగంలో తెలుగు భాష మాధుర్యం, సాహిత్యం గొప్పదనం, పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. నంద కోర్వి, అనిత నాగిరెడ్డి, సతీష్ సీరం, బ్రహ్మ చిరా, హరినాథ్ పొగకు, హేమంత్ కాకుట్ల, జగదీశ్వర నందిమండలం, జగదీష్ తుపాకుల, పవన్ పల్లంరెడ్డి, ప్రసాద్ నాగారపు, రాజు కంచం, శివ అద్దేపల్లి, శివ వల్లూరు, శ్రీధర్ బొమ్ము, శ్రీకాంత్ దొంత, సురేష్ మోపూరు, ఉమా గొర్రెపాటి, మరియు కార్తీక్ మేడపాటి ఈ సమావేశానికి హాజరయ్యారు.

సింగపూర్‌లో ‘అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం’
'వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా' 'శ్రీ సాంస్కృతిక కళాసారథి - సింగపూర్' మరియు 'వంశీ ఇంటర్నేషనల్ - ఇండియా' సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, ఆదివారం 13వ తేదీ హైదరాబాద్ , శ్రీ త్యాగరాయ గానసభలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 12 గంటల పాటు నిర్విరామంగా "అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం" కార్యక్రమం అద్వితీయంగా నిర్వహించబడింది.ఈ మూడు సంస్థలు కలసి విశ్వావసు నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని 80 మంది కవులతో 'అంతర్జాతీయ కవి సమ్మేళనము', 20 నూతన గ్రంధావిష్కరణలు, ఆచార్య శలాక రఘునాథ శర్మ 'రాయప్రోలు వంశీ జాతీయ సాహితీ జీవన సాఫల్య పురస్కార' ప్రదానము డా. బులుసు అపర్ణచే ప్రత్యేక 'మహిళా అష్టావధానము' మొదలైన అంశాలతో ఈ 'అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం' కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించి నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్, విశిష్ట అతిథులుగా కవి జొన్నవిత్తుల, కిమ్స్ ఆస్పత్రి వ్యవస్థాపకులు బొల్లినేని కృష్ణయ్య, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానంద రావు, ప్రముఖ రాజకీయవేత్త వామరాజు సత్యమూర్తి తదితరులు హాజరయ్యారు.ఉదయం 9 గంటలకు డా వంశీ రామరాజు అందించిన స్వాగతోపన్యాసంతో ఆరంభమైన ప్రారంభోత్సవ సభలో, కార్యక్రమ ప్రధాన సమన్వయకర్త రాధిక మంగిపూడి సభా నిర్వహణలో, మండలి బుద్ధ ప్రసాద్, కవి జొన్నవిత్తుల, బొల్లినేని కృష్ణయ్య, వామరాజు సత్యమూర్తి, డా. జననీ కృష్ణ తదితరుల ప్రసంగాలు అందరినీ ఆకర్షించాయి.తదనంతరం ఖతార్ నుండి విచ్చేసిన విక్రమ్ సుఖవాసి నిర్వహణలో అతిథుల చేతుల మీదుగా 18 తెలుగు నూతన గ్రంథాలు ఆవిష్కరించబడ్డాయి. వాటిలో కథల కవితల సంకలనాలు, వ్యాస సంపుటాలు, జెవి పబ్లికేషన్స్, మిసిమి మాసపత్రిక వారి ప్రచురణలు, సిద్ధాంత గ్రంథాలు మాత్రమే కాకుండా, ప్రతిష్టాత్మకంగా 2024 నవంబర్‌లో ఖతార్ దేశ రాజధాని దోహా మహానగరంలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో జరిగిన "9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సభా విశేష సంచిక" కూడా ఆవిష్కరించబడడం ఈ సభకు మరింత శోభను చేకూర్చింది.మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు కొనసాగిన "అంతర్జాతీయ కవి సమ్మేళనం"లో ఆస్ట్రేలియా, ఖతార్, దక్షిణాఫ్రికా, అమెరికా మొదలైన దేశాలనుండి, ఉభయ తెలుగు రాష్ట్రాలనుండి, ముంబై, అండమాన్ దీవులు మొదలైన ప్రాంతాలనుండి కూడా వచ్చిన సుమారు 80 మంది కవులు కవయిత్రులు పాల్గొని తమ కవితలు వినిపించారు. వంశీ అధ్యక్షురాలు డా. తెన్నేటి సుధాదేవి, రేవూరు అనంత పద్మనాభరావు, జి భగీరథ, గుండు వల్లీశ్వర్, ప్రొ. రామా చంద్రమౌళి మహెజబీన్, ప్రొ. త్రివేణి వంగారి, డా కేతవరపు రాజ్యశ్రీ, డా. చిల్లర భవానీ దేవి, డా. శంకరనారాయణ, అంబల్ల జనార్ధన్, డా చాగంటి కృష్ణకుమారి మొదలైన ఎందరో కవులు కవయిత్రులు ఈ కవిసమ్మేళనంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం కొందరు రచయితలు ప్రసంగవ్యాసాలు వినిపించారు. సభా వ్యాఖ్యాతలుగా పేరి, కృష్ణవేణి, రాధిక వ్యవహరించారు.అనంతరం సాయంత్రం ఆచార్య శలాక రఘునాథ శర్మను ఘనంగా సత్కరించి, వారికి మూడు నిర్వాహక సంస్థల తరఫున "రాయప్రోలు వంశీ జాతీయ సాహితీ జీవన సాఫల్య పురస్కారం" అందించారు. దీనికి తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానందరావు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. అనంతరం శలాక మాట్లాడుతూ తెలుగువారికి సొంతమైన అవధాన ప్రక్రియలో 'సమస్యా పూరణం' అనే అంశంలో ఉండే చమత్కారాలు వివరణలు తెలియజేస్తూ "అవధాన కవిత్వం - సమస్యలు" అనే అంశంపై ప్రత్యేక ప్రసంగాన్ని అందించారు.సాయంత్రం 5:30 గంటల నుండి ద్విశతావధాని డా. బులుసు అపర్ణ చేసిన అష్టావధానం ఈ సదస్సుకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాధిక మంగిపూడి సంచాలకత్వంలో అమెరికా, యుగాండా, ఆస్ట్రేలియా, ఖతార్, అండమాన్ దీవులు, ముంబై, విశాఖపట్నం, విజయవాడ నుండి వచ్చిన 8 మంది మహిళలు పృచ్ఛకులుగా పాల్గొనడంతో ఇది "సంపూర్ణ మహిళా అష్టావధానం"గా ప్రశంసలు అందుకుంది.ఈ కార్యక్రమానికి ప్రధాన నిర్వాహకులుగా వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. వంగూరి చిట్టెన్ రాజు, వంశీ వ్యవస్థాపకులు డా. వంశీ రామరాజు, సింగపూర్ సంస్థ వ్యవస్థాపకులుకవుటూరు రత్నకుమార్ వ్యవహరించగా, వంగూరి ఫౌండేషన్ భారతదేశ ట్రస్టీ శైలజ సుంకరపల్లి ఆధ్వర్యంలో వేదిక ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పంచవ్యాప్తంగా సాహిత్య అభిమానుల మన్ననలు అందుకుంది.

టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదం, ప్రాణాపాయ స్థితిలో తెలుగు విద్యార్థిని దీప్తి
ఉన్నత చదువులకోసం అమెరికాకు వెళ్లిన తెలుగు విద్యార్థిని ప్రాణలతో పోరాడుతోంది. అమెరికాలోని టెక్సాస్‌లోని డెంటన్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు అమ్మాయిలు గాయపడ్డారు. వీరిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని దీప్తి వంగవోలుగా గుర్తించారు. మరో విద్యార్థినికి కూడా తీవ్రంగా గాయపడిందని అయితే ఆమెకు ప్రాణాపాయం లేదని అమెరికా మీడియా నివేదికలు తెలిపాయి.ఈ ప్రమాదం శనివారం (ఏప్రిల్ 12) తెల్లవారుజామున, ఎన్. బోనీ బ్రే స్ట్రీ మరియు డబ్ల్యు. యూనివర్శిటీ డ్రైవ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన దీప్తి వంగవోలు ,ఆమె స్నేహితురాలు కాలినడకన ఇంటికి చేరుకోబోతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. వెంటనే ఆ వాహనం డ్రైవర్ని అక్కడినుంచి పారిపోయాడు. దీప్తికి తలకు లోతైన గాయం అయిందని, ఆమెకు శస్త్రచికిత్స జరుగుతోందని స్థానిక మీడియా తెలిపింది. ప్రస్తుతం డెంటన్ పోలీసులు ఈ హిట్ అండ్ రన్ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న డ్రైవర్‌ను, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు ప్రజల సహాయం కోరుతూ ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ ఘటనపై మరిన్నివివరాలు అందాల్సి ఉంది. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, దీప్తి వంగవోలు నార్త్ టెక్సాస్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్స్ చదువుతోంది. 2023లో నరసరావు పేట ఇంజనీరింగ్ కళాశాల నుండి బీటెక్ పూర్తి చేసింది.

సింగపూర్ ఎన్నికల్లో సత్తా చాటనున్న భారతీయులు: హింటిచ్చిన పీఎం
సింగపూర్‌లో ( Singapore ) సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ (Lawrence Wong) తన పార్టీ పీపుల్స్ యాక్షన్ పార్టీ (PAP) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన అభ్యర్థులను పోటీలో నిలపబోతున్నామని ప్రకటించారు. త్వరలో ఎన్నికలకు నగారా మోగనున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.ఆదివారం భారతీయ యువతతో సింగపూర్ ప్రధానమంత్రి ముచ్చటించారు. భారతీయ సమాజం చిన్నదే అయినా ప్రభావం చాలా గొప్పదని, పీఎం అన్నారు. మీరు ఇప్పటికే ఆ సింగపూర్ స్పూర్తిని ప్రతిబింబిస్తున్నారనీ, అది ప్రభావంతమైందన్న వాంగ్ వ్యాఖ్యలను ది స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారత సంతతికి చెందిన కొత్త అభ్యర్థులను ఎంపిక చేస్తుందని హామీ ఇచ్చారు. 2020 ఎన్నికల్లో భారతీయులకు చోటు దక్కలేదని గుర్తు చేసిన ఆయన ఈ సారి 30కంటే ఎక్కువమంది భారతీయులు కూడా ఉంటారన్నారు. ది ఇటీవలి చరిత్రలో అతిపెద్దదని పీఎం వాంగ్ వ్యాఖ్యానించారు. వాణిజ్యం, వ్యాపారం, పరిశ్రమలు, ప్రజా సేవ సహా అనేక రంగాలలో భారతీయ కమ్యూనిటీ దేశానికి చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. అయితే, PM వాంగ్ గత శనివారం వెల్లడించిన ఎనిమిది కొత్త ముఖాల్లో భారత సంతతికి చెందిన వైద్యుడు హమీద్ రజాక్ కూడా ఉన్నారని ది స్ట్రెయిట్ టైమ్స్ నివేదిక పేర్కొంది. అయితే, రాబోయే సార్వత్రిక ఎన్నికలలో వారు ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారో వెల్లడించలేదు.చదవండి: Amarnath Yatra 2025 రిజిస్ట్రేషన్లు షురూ! త్వరపడండి!సింగపూర్ నివేదికల ప్రకారం. 2004లో సింగపూర్ పౌరులలో భారతీయులు 7.6 శాతం మంది ఉండగా , మలయ్, చైనీయులు వరుసగా 15.1 శాతం, 75.6 శాతం మంది ఉన్నారు. 2024 డేటా ప్రకారం, ఆగ్నేయాసియా దేశ జనాభాలో వరుసగా 15శాతం, 75శాతం మంది మలేషియన్లు , చైనీయులు ఉన్నారు.90 నిమిషాల పాటు వాంగా ఇప్పో పెసలామ్ చాట్ (రండి, తమిళంలో చాట్ చేద్దాం) అనే వీఐపీ చాట్‌ను తమిళ్ మరసు వార్తాపత్రికి నిర్వహించింది.భారత సంతతికి చెందిన డిజిటల్ అభివృద్ధి, సమాచార శాఖ సీనియర్ సహాయ మంత్రి జనిల్ పుతుచ్చేరి సహా దాదాపు 130 మంది యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.2020 సార్వత్రిక ఎన్నికల్లో పీఏపీ 93 స్థానాల్లో 83 స్థానాలను గెలుచుకుని, ఎన్నికలను కైవసం చేసుకుంది. వీరిలో 27 మంది కొత్త అభ్యర్ధులకు అవకాశం కల్పించగా. వీరిలో భారతీయులెవ్వరూ లేరు. ఇది పార్లమెంటులో సమాజ ప్రాతినిధ్యంపై విమర్శలకు తావిచ్చింది. అమెరికా, కెనడా రాజకీయాల్లో భారతీయ సంతతి అభ్యర్తులు సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. మరి తాజా పరిణామాలతో ఎంతమంది భారత సంతతి వారు గెలుపు గుర్రాలుగా నిలవనున్నారో చూడాలి.
క్రైమ్

ఊపిరితిత్తుల్లో వేరుశనక్కాయ ఇరుక్కుని..
అబ్దుల్లాపూర్‌మెట్(రంగారెడ్డి జిల్లా): ఊపిరితిత్తుల్లో వేరుశనగ కాయ ఇరుక్కోవడంతో ఓ చిన్నారి ప్రాణం కోల్పోయింది. పోలీసులు, బాధి త కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లష్కర్‌గూడకు చెందిన బండారి శ్యామ్‌సుందర్, మహేశ్వరి దంపతుల కూతురు తన్విక (4) ఆదివారం సాయంత్రం వేరుశనగ కాయలు తింటుండగా.. ప్రమాదవశాత్తు ఓ కాయ ఊపిరితిత్తుల్లో ఇరుక్కుంది. దీంతో శ్వాస తీసుకునేందుకు చిన్నారి ఆయాస పడింది. వెంటనే తల్లిదండ్రులు ఆమెను చికిత్స నిమిత్తం నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ఎక్స్‌రే తీయించిన వైద్యులు తని్వక ఊపిరితిత్తుల్లో వేరుశనగ కాయ ఉన్నట్లు గుర్తించారు. ఆపరేషన్ ద్వారా తొలగించాలని సూచించడంతో తల్లిదండ్రులు ఇందుకు అంగీకరించారు. సోమవారం శస్త్రచికిత్స చేస్తామని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా ఉదయం 7.55 గంటల సమయంలో బాలిక మృతిచెందింది. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు.

నా కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తా..!
బంజారాహిల్స్(హైదరాబాద్): వివాహితపై కన్నేసిన ఆమెకు వరుసకు సోదరుడైన యువకుడు తన గదికి వచ్చి కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తానంటూ బెదిరించిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జూబ్లీహిల్స్‌లోని నందగిరిహిల్స్‌లో నివసించే మహిళకు (26)కు ముగ్గురు సంతానం. ఆమెకు భర్తకు దూరపు బంధువైన నవీన్ అనే యువకుడు నగరంలోనే ఉంటూ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తరచూ ఇంటికి వచ్చే అతను ఆమెతో మాటలు కలుపుతూ తన కోరికను బయటపెట్టేవాడు. తాను అడిగింది ఇవ్వకపోతే పరువు తీస్తానంటూ బెదిరించేవాడు. రెండు నెలల క్రితం బాధితురాలు ఈ విషయం తనకు భర్తకు చెప్పడంతో అప్పటి నుంచి నవీన్ ఆమెకు ఫోన్ చేయడం మానేశాడు. ఈ నెల 26న కొందరి వద్ద నవీన్ ఆమెపై అసభ్యకరంగా ప్రచారం చేశాడు. ఆమె పనిచేస్తున్న సెలూన్‌కు వెళ్లి నువ్వు బయటకు వస్తావా..? నన్ను లోపలికి రమ్మంటావా? అంటూ బెదిరించాడు. తాను బయటకు రానని చెప్పడంతో నువ్వు నా గదికి రాకపోతే మొహంపై యాసిడ్ పోసి చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో ఆందోళనకు గురైన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు నవీన్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చంపేసి..లిఫ్ట్ గుంతలో పడేసి..
కవాడిగూడ: గుర్తుతెలియని ఓ యువకుడిని దారుణంగా హత్య చేసి...సమీప భవనంలోని లిఫ్ట్ గుంతలో శవాన్ని పడేసి వెళ్లిన ఘటన దోమలగూడ పీఎస్ పరిధిలోని హిమాయత్‌నగర్ స్ట్రీట్ నెంబర్ 8లో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి ఆ యువకుడిని గుర్తు తెలియని దుండగలు ముందుగా బండరాయితో మోది హత్య చేశారు. అనంతరం మృతదేహన్ని బట్టలో చుట్టి ప్లాజా అపార్ట్మెంట్లోని పంజాబ్ నేషనల్ బ్యాంకు పక్కనే ఉన్న లిఫ్ట్ గుంతలో పడేసి పారిపోయారు. సోమవారం ఉదయం అపార్ట్మెంట్ ప్రాంగణాన్ని శుభ్రం చేసేందుకు వచ్చిన సిబ్బంది రక్తపు మరకలు, దుస్తులు పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే దోమలగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా అపార్ట్మెంట్లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ పక్కనే ఉన్న లిఫ్ట్‌లో 32 సంవత్సరాల యువకుడి మృతదేహం నగ్నంగా పడి ఉంది. వెంటనే సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి, గాందీనగర్ డివిజన్ ఇన్చార్జీ ఏసీపీ గురురాఘవేంద్ర దోమలగూడ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐలు నిరంజన్, సాయిచంద్‌లు, క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి తనిఖీలు చేశారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరిలించారు. ఇదిలా ఉండగా ప్రతి నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో హత్య జరగడం సంచలనం సృష్టించింది. కాగా స్థానికుల వివరాల ప్రకారం..గుర్తుతెలియని యువకుడు ఆదివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో భోజనం చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ షట్టర్ ముందు నిద్రపోగా..మద్యం లేదా గంజాయి మత్తులో ఉన్నకొంత మంది దుండగులు అతని వద్దకు వచ్చి నిద్రలేపి పక్క వీధిలోకి తీసుకెళ్లి ఘర్షణ పడ్డారని తెలిసింది. ఈ క్రమంలోనే హత్య జరిగినట్లు భావిస్తున్నారు. ఈ సంఘటన అర్ధరాత్రి రెండు నుంచి మూడు గంటల మధ్య జరిగినట్లు సమాచారం.

భార్య కళ్లెదుటే ప్రియుడ్ని?.. పట్టపగలే పెద్దపల్లిలో దారుణం
సాక్షి, క్రైమ్: పట్టపగలే.. అదీ అంతా చూస్తుండగానే పెద్దపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మరో వ్యక్తిని కిరాతకంగా పొడిచి చంపడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. సోమవారం వ్యవసాయ మార్కెట్లో చోటు చేసుకున్న ఘటన వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి మండలం అప్పన్నపేటకు చెందిన పొలం కుమార్ అనే యువకుడు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో దారుణ హత్యకు గురయ్యాడు. ధర్మారం మండలం దొంగతుర్తికి చెందిన రైలుకుల సంతోష్(సతీష్) అనే వ్యక్తి కుమార్‌ను కత్తితో పొడిచి హతమార్చాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. అయితే.. ఆ మహిళ సంతోష్ భార్యగా నిర్ధారణ అయ్యింది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని.. అందుకే భార్య కళ్ల ముందే ప్రియుడ్ని హతమార్చి ఉంటాడని భావిస్తున్నారు. నిందితుడు సంతోష్‌ను పోలీసులు అక్కడికక్కడే అరెస్ట్ చేశారు. అయితే కేసు విచారణ చేపట్టిన పోలీసులు.. హత్యకు గల పూర్తి వివరాలు తెలియజేయాల్సి ఉంది.