Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

KSR Comments On Chandrababu Govt Schemes1
బాబూ.. కూటమి సంక్షేమం ఉత్తుత్తి మాటేనా?

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రభావం ప్రస్తుత అధికార కూటమిపై బాగానే ఉన్నట్టుంది. ఇచ్చిన హామీలను దాదాపుగా నెరవేర్చిన జగన్‌ ఒక పక్కనుంటే.. ఇంకోపక్క ఒకటి అర కూడా అమలు చేయని కూటమి ఇంకోవైపున ఉంది. రెండింటినీ పోల్చుకుంటున్న ప్రజలు అసంతృప్తిని వెళ్లగక్కుతుంటే.. దాన్ని చల్చార్చలేక కూటమి డైవర్షన్‌ రాజకీయాలకు పాల్పడుతోంది. రెడ్‌బుక్‌ పేరుతో సృష్టిస్తున్న ఆరాచకాలు.. జగన్‌పై లేనిపోని అభాండాలు వేయడం వంటివి ఎన్ని చేస్తున్నా ప్రజల్లో అసంతృప్తిని మాత్రం ఇసుమంత కూడా తగ్గడం లేదు.ఈ విషయం కూటమి నేతలకూ బాగానే అర్థమైంది. ఎక్కడికెళ్లినా జగన్‌కు ప్రజాదరణ ఏమాత్రం తగ్గకపోవడం కూడా కూటమి నేతలకు నిద్రలేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు, ఎల్లోమీడియా తన స్వరాన్ని కొంత మార్చుకుంటున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. సూపర్‌సిక్స్‌ హామీల్లో అన్నీ కాకపోయినా కొన్నింటినైనా అమలు చేసినట్లు కనిపించాలని సంక్షేమ రాగం ఎత్తుకున్నాయి!. అయితే ఇందులోనూ చిత్తశుద్ధి కనిపించడం లేదు. సంక్షేమ కార్యక్రమాల పేరిట టీడీపీ కార్యకర్తలకు నిధుల పందేరానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. టీడీపీ పోలిట్‌ బ్యూరో నిర్ణయాలు కొన్నింటిని గమనిస్తే.. పార్టీ కేడర్‌ను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యమని స్పష్టమవుతుంది.టీడీపీ కార్యకర్తలకు గతంలో పెండింగ్‌లో ఉన్న నీరు-చెట్టు, ఉపాధి హామీ పనులకు సంబంధించి సుమారు రూ.650 కోట్ల చెల్లించేందుకు నిర్ణయించారు. ఈ స్కీమ్‌ల కింద పనులు చేయకుండా చేసినట్లు చూపించడం, పలు అవకతవకలు పాల్పడినందున అప్పట్లో విజిలెన్స్ అధికారులు విచారణ చేసి నిధుల మంజూరును నిలిపి వేశారు. కూటమి అధికారంలోకి రాగానే ఇలాంటి పనుల బిల్లులు సుమారు రూ.1000కోట్ల మేర చెల్లించారని వార్తలు వచ్చాయి. తాజాగా మరో రూ.650 కోట్ల నిధులు పంచబోతున్నారు. విశేషం ఏమిటంటే టీడీపీ కార్యకర్తలే ఈ పనులు చేపట్టారని పార్టీ అంగీకరించడం!. పాలిట్ బ్యూరో నిర్ణయాన్ని ప్రజలు వేరే రకంగా భావించకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం సంక్షేమ స్కీములు అమలు చేయబోతోందని, సంక్షేమ క్యాలెండర్ తీసుకురాబోతోందని, దీని ద్వారా ప్రతి నెల ఒక స్కీము అమలు చేయాలని నిర్ణయించారని ఉచిత సిలిండర్లకు సంబంధించి నగదు ముందుగానే లబ్దిదారుల ఖాతాలలోకి వేయాలని నిర్ణయించారంటూ, సంక్షేమ సందడి అంటూ ఎల్లో మీడియా ప్రచారంలో పెట్టింది. టీడీపీ ఈ మాత్రం నిర్ణయాలైనా తీసుకుందంటే అది జగన్ ఎఫెక్ట్ అని తెలుస్తూనే ఉంది.ఉదాహరణకు ఈ మధ్య కాలంలో జగన్ రెండు, మూడు సార్లు అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఎప్పుడు వెళ్లినా అశేష జనసందోహం తరలివచ్చి ఆయనను ‘సీఎం సీఎం’ అంటూ నినాదాలు చేస్తూ జై కొడుతోంది. తిరుపతిలో తొక్కిసలాట ఘటన పరామర్శకు వెళ్లినప్పుడు, సింహాచలంలో గోడ కూలి మరణాలు సంభవించినప్పుడు వారి కుటుంబాలకు ధైర్యం చెప్పడానికి వెళ్లినప్పుడు కూడా జనం అభిమానం ఎంతటిదో అంతా గమనించారు. జగన్ ప్రభుత్వంలో మద్యం స్కాం అంటూ తప్పుడు కేసు పెట్టినా జనం పట్టించుకోవడం లేదని అర్థమైంది. దాంతో సంక్షేమం అమలు చేయబోతున్నామని ప్రజలను ఆకట్టుకోవడానికి యత్నిస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ, ఇందులో ఒక నిజాయితీ ఉందా అన్న చర్చ వస్తోంది. ఉదాహరణకు ప్రభుత్వం మూడు వంట గ్యాస్ సిలిండర్ల హామీ నెరవేర్చడంలో భాగంగా ముందుగానే వాటికి అయ్యే ఖర్చు మొత్తాన్ని వినియోగదారుల ఖాతాలో వేయాలని పాలిట్‌బ్యూరో నిశ్చయించిందట.జనసేన, బీజేపీలతో కూడా మాట్లాడి దీనిపై తుది నిర్ణయం చేస్తారట. నిజంగానే వంటగ్యాస్ వినియోగుదారులందరికీ ఈ రకంగా డబ్బు వేస్తారా?. మళ్లీ ఇందులో ఏ లిటిగేషన్ పెడతారో తెలియదు. ఎందుకంటే ఇప్పటికి ఏడాది పూర్తి అవుతున్నా, ఒక సిలిండర్ మాత్రమే.. అది కూడా అరకొరగా ఇచ్చి కథ నడిపించారు. అంటే ఒక ఏడాదికి రెండు సిలిండర్ల డబ్బు ఎగవేసినట్లు అవుతుంది. నిజంగానే రెండు లేదా, మూడు సిలిండర్ల నగదు ఇచ్చి ఉంటే దానిని విస్తారంగా ప్రచారంలో పెట్టడానికి చంద్రబాబు అన్ని చర్యలు తీసుకునేవారు కదా?. వెయ్యి రూపాయల పెన్షన్ అదనంగా ఇవ్వడానికే చంద్రబాబు లక్షల రూపాయల ఖర్చు పెట్టి హెలికాప్టర్లలో ప్రయాణిస్తూ సభలు పెట్టి హడావుడి చేస్తున్నారు. అలాంటిది అందరికి సిలిండర్ల డబ్బు ఇస్తే ఇంకెంత హడావుడి చేసేవారు? ఇప్పుడైనా నిజంగానే మూడు సిలిండర్ల డబ్బు వినియోగదారులకు ఇస్తారా? అందుకు అవసరమైన బడ్జెట్ ఉందా అంటే అనుమానమే. ఎందుకంటే బడ్జెట్ లో ఈ స్కీమ్‌కు వంద కోట్లే కేటాయించారని, అది ఎలా సరిపోతుందని వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రశ్నించారు. ఆలోచిస్తే ఇది నిజమే కదా అనిపిస్తుంది.ఆంధ్రప్రదేశ్‌లో సుమారు కోటి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయనుకుంటే ఎన్ని కోట్లు అవసరం అవుతాయి. మరి ఇప్పుడు కొత్తగా ఏమైనా నిధులు కేటాయిస్తారా అన్నది చెప్పాల్సి ఉంటుంది. లేకుంటే ఇది ప్రచారం కోసమే అన్న సంగతి అర్థం చేసుకోవడం కష్టం కాదు. తల్లికి వందనం గురించి ఇప్పటికి పలు వాయిదాలు వేశారు. మళ్లీ జూన్ అంటున్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం మరో రెండు నెలలు పడుతుందని చెబుతున్నారు. మహిళలకు రూ.1500 చొప్పున ఇస్తామన్న హామీ గురించి చెప్పడం లేదు. అలాగే నిరుద్యోగ భృతిని ఏం చేశారు?. బీసీలకు 50ఏళ్లకే పెన్షన్ అని ఆర్భాటంగా చెప్పారు. ఆ మాట గురించి ఏంటి?. జగన్ ఆయా స్కీమ్‌లను పద్ధతి ప్రకారం అమలు చేస్తే శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేశారు. ఎన్నికలు వచ్చేసరికి తాము రెండు, మూడు రెట్లు ఎక్కువ ఇస్తామని ఊదరగొట్టారు. అధికారం వచ్చాక అప్పులు పుట్టడం లేదని ఒకసారి, సంక్షేమ పథకాలు వంద శాతం అమలు చేసేశామని ఇంకోసారి, అప్పులు చేసి సంక్షేమం అమలు చేయలేమని మరోసారి చెప్పారు.ఇలా ఎప్పుడు ఏది పడితే అది మాట్లాడితే ప్రజలకు ఏం ఉపయోగం?. పాలిట్‌బ్యూరోలో ప్రస్తావనకు వచ్చిన ఇంకో విషయం రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గురించి.. దావోస్ నుంచి ఒక్క రూపాయి పెట్టుబడులు రాలేదు కానీ.. ఏడాది కాలంలో రాష్ట్రానికి ఎనిమిది లక్షల కోట్లు వచ్చేశాయని డమ్మీ ప్రచారం మొదలుపెట్టింది కూటమి!. ఇలాంటి అబద్ధాలే.. చంద్రబాబు ప్రభుత్వంపై అపనమ్మకాన్ని రోజు రోజుకూ పెంచుతున్నాయి!.- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Ysrcp Leader Rachamallu Siva Prasad Reddy Fires On Chandrababu2
ఏ ఆధారాలతో వారిని అరెస్ట్‌ చేశారు?: రాచమల్లు

సాక్షి, కడప: కూటమి ప్రభుత్వం చేసే అరెస్ట్‌లు కుట్రలో భాగమేనని వైఎస్సార్‌సీపీ నేత రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను అరెస్ట్‌ చేయడం దుర్మార్గమన్నారు. మద్యం పాలసీతో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు సంబంధమే లేదన్నారు. కక్ష సాధింపుల్లో భాగంగానే వారిని అరెస్ట్‌ చేశారన్నారు.ఏ సాక్ష్యాలు, ఆధారాలతో అరెస్ట్‌ చేశారో ప్రభుత్వం చెప్పగలదా? అంటూ రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి నిలదీశారు. ‘‘సత్యప్రసాద్‌ అనే చిన్న ఉద్యోగిని బెదిరించారు. అతని బెదిరించి వారికి కావాల్సిన స్టేట్‌మెంట్‌ ఇప్పించుకున్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌లను బెదిరిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌లు ధైర్యంగా పనిచేయగలుగుతున్నారా?. ఐఏఎస్‌, ఐపీఎస్‌లు జైళ్లకు పోవాల్సిందేనా?’’ అంటూ రాచమల్లు దుయ్యబట్టారు.‘‘కొన్ని బ్రాండ్‌లే అమ్మారు.. అన్ని బ్రాండ్‌లు అమ్మలేదని ఆరోపణ.. కూటమి ప్రభుత్వం ఆరోపణలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. కూటమి ప్రభుత్వం చర్యలు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. ఎవరిని జైలుకు పంపాలని ఉద్దేశంతో అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారు?. రూ.3,200 కోట్ల అవినీతి ఎక్కడ జరిగిందో ఆధారాలతో చెప్పగలరా?. చంద్రబాబు మద్యం పాలసీ అత్త నీతులు చెప్పినట్లుంది. ఎన్నికలకు ముందు మద్యం ధరలు తగ్గిస్తామన్నారు.. తగ్గించారా?’’ అంటూ రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ప్రశ్నించారు.

Pak PM Shahbaz Sharif Key Comments With India War3
అవును.. భారత్‌ క్షిపణుల దెబ్బ మాకు తగిలింది: పాక్‌ ప్రధాని

ఇస్లామాబాద్‌: ఆపరేషన్‌ సిందూర్‌పై ఇన్నాళ్లూ బుకాయించిన పాకిస్తాన్‌.. తాజాగా అసలు నిజాలను వెల్లడించింది. నూర్‌ ఖాన్‌, ఇతర వైమానిక స్థావరాలపై దాడి జరిగిందని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ అంగీకరించారు. దాడుల విషయం తెల్లవారుజామున 2.30 గంటలకు ఆర్మీ చీఫ్‌ జనరల్‌ అసీమ్‌ మునీర్‌ వివరించారని వెల్లడించారు. ఆ సమయంలో తమ వైమానిక దళం స్థానిక సాంకేతిక పరిజ్ఞానం, చైనీస్‌ యుద్ధ విమానాలను వినియోగించిందని షరీఫ్‌ పేర్కొన్నారు. ఇదే సమయంలో భారత్, పాకిస్తాన్‌లు కశ్మీర్‌ సహా తమ మధ్య విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి షహబాజ్‌ షరీఫ్‌ అన్నారు. భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఇప్పటికి మూడు సార్లు యుద్ధం జరిగినా వచ్చిందేమీ లేదు అంటూ సరికొత్త వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాత్రి సైనికులకు నివాళులర్పించే కార్యక్రమంలో పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షరీఫ్‌ మాట్లాడుతూ..‘భారత్, పాకిస్తాన్‌లు ఇప్పటి వరకు మూడుసార్లు యుద్ధాలు చేసినా ఏమీ సాధించలేకపోయాయి. జమ్మూకశ్మీర్‌ వంటి అన్ని ప్రధాన అంశాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. లేకుంటే మనం ప్రశాంతంగా ఉండలేం’ అని పేర్కొన్నారు.Pakistan PM Shahbaz Sharif says, "At around 2:30 am on 10 May, General Syed Asim Munir called me on secure line and informed me that India's ballistic missiles have hit Nur Khan Airbase and other areas.#nurkhanairbase #Pakistan #PakistanArmy pic.twitter.com/RKnWGP8WeS— Manish Shukla (@manishmedia) May 17, 2025తమది శాంతికాముక దేశమైనా స్వీయరక్షణకు తగినట్లు స్పందించే హక్కు ఉందని షెహబాజ్‌ అన్నారు. ‘భారత్‌కు దీటుగా జవాబిచ్చి’ పాక్‌ సైనిక చరిత్రలో స్వర్ణాధ్యాయాన్ని లిఖించారని కొనియాడారు. శాంతియుత వాతావరణం నెలకొనేందుకు ముందుకు వస్తే ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో సహకరిస్తామని భారత్‌కు హామీ ఇచ్చారు. కాల్పుల విరమణకు సహకరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.అనంతరం, పాక్‌ విదేశాంగ మంత్రి, ఉప ప్రధాని ఇశాక్‌ దార్‌ మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్‌ల మధ్య అపరిష్కృత, వివాదాస్పద అంశాలపై సమగ్ర చర్చలు జరుపుదామని కామెంట్స్‌ చేశారు. మరోవైపు.. తమపై భారత్‌ ఎలాంటి దురాక్రమణకు దిగినా దానికి బదులిస్తామని పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ పేర్కొంది. కాల్పుల విరమణకు భారత్‌ చిత్తశుద్ధితో కట్టుబడి ఉండాలని ఈ శాఖ అధికార ప్రతినిధి షఫ్ఖత్‌ అలీఖాన్‌ వ్యాఖ్యలు చేశారు. ఇక, కృతజ్ఞతా దినం సందర్భంగా ఇస్లామాబాద్‌లో 31 సార్లు, ప్రావిన్సుల రాజధానుల్లో 21 సార్లు గాల్లోకి కాల్పులు జరిపి సెల్యూట్‌ చేశారు. ప్రత్యేక ప్రార్థనలు, ర్యాలీలతో సైనికదళాలకు సంఘీభావం ప్రకటించారు.

Virat Business as Usual: Mo Bobat Says Kohli Focussed on RCB Win in IPL4
IPL 2025: ఆర్సీబీని గెలిపిస్తాం కదా!.. అంతా కోహ్లి మయం!

టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (Virat Kohli)కి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్‌ టెండుల్కర్‌ (100) తర్వాత అత్యధిక శతకాలు బాదిన ఆటగాడిగా కోహ్లి (82) కొనసాగుతున్నాడు. ఇక టీ20 ప్రపంచకప్‌-2024 తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఈ రికార్డుల రారాజు.. ఇటీవలే టెస్టు ఫార్మాట్‌కు కూడా వీడ్కోలు (Test Retirement) పలికాడు. ప్రస్తుతం ఐపీఎల్‌తో పాటు.. టీమిండియా తరఫున వన్డేల్లోనూ కొనసాగుతున్నాడు కోహ్లి.అంతా కోహ్లి మయం..ఈ క్రమంలో ఇటీవల వ్యక్తిగత పని పూర్తి చేసుకొని తిరిగొస్తుండగా మైదానంలో ఒక అభిమాని ఎందుకు టెస్టులకు రిటైర్మెంట్‌ తీసుకున్నావని కోహ్లిని అడిగాడు. ఇందుకు స్పందిస్తూ ‘ఆర్సీబీని గెలిపిస్తాం కదా’ అని కోహ్లి జవాబిచ్చాడు. ఈ సీజన్‌లో బెంగళూరుకు టైటిల్‌ అందించాలని అతను ఎంత పట్టుదలగా ఉన్నాడో అర్థమవుతుంది. కోహ్లి బ్యాటింగ్‌లోనూ అది కనిపిస్తోంది. ఐపీఎల్‌-2025 (IPL 2025)లో ఇప్పటికి 11 ఇన్నింగ్స్‌లలో ఏకంగా 7 అర్ధసెంచరీలతో ఇప్పటికే 505 పరుగులు సాధించిన కోహ్లి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.టెస్టు ఫార్మాట్‌కు అనూహ్యంగా రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత మొదటిసారి కోహ్లి మైదానంలోకి దిగుతుండటంతో అందరి దృష్టీ అతనిపైనే ఉంది. గురువారం అతడి ప్రాక్టీస్‌ సెషన్‌ సమయంలో కూడా చిన్నస్వామి స్టేడియంను ఫ్యాన్స్‌ హోరెత్తించారు. వందల సంఖ్యలో హాజరైన అభిమానులు కోహ్లి ప్రతీ కదలికపై సందడి చేశారు. దాదాపు గంట పాటు అతను నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేశాడు. కోహ్లి ఉన్నంత సేపూ అతని పేరు తప్ప అక్కడ మరేమీ వినిపించలేదు.భారీ స్థాయిలో స్పందనకోల్‌కతాతో శనివారం జరిగే మ్యాచ్‌లోనూ ఇదే పరిస్థితి ఉండవచ్చు. కోహ్లి టెస్టుల నుంచి రిటైర్‌ అయిన తర్వాత కొందరు వీరాభిమానులు సోషల్‌ మీడియాలో ఒక సందేశాన్ని పంచుకున్నారు. ‘కింగ్‌’పై తమ అభిమానాన్ని ప్రదర్శిస్తూ, టెస్టు క్రికెటర్‌గా కోహ్లిని గుర్తు చేస్తూ ఐపీఎల్‌ మ్యాచ్‌కు కూడా తెలుపు రంగు టెస్టు జెర్సీలతో స్టేడియానికి రావాలని పిలుపునిచ్చారు. ఇందుకు భారీ స్థాయిలో స్పందన లభించింది.ఎలాంటి ప్రభావం చూపదుఈ రకంగా చూస్తే శనివారం ఆర్సీబీ రెగ్యులర్‌ జెర్సీ ‘రెడ్‌ అండ్‌ గోల్డ్‌’లో కాకుండా ‘విరాట్‌ 18’ వైట్‌ జెర్సీలే మైదానాన్ని ముంచెత్తవచ్చు. అయితే విరాట్‌పై మైదానం బయటి స్పందనలు, వ్యాఖ్యలు ఎలాంటి ప్రభావం చూపించవని... ఏకాగ్రత చెదరకుండా తనదైన శైలిలో ఎప్పటిలాగే అతను బాగా ఆడి మ్యాచ్‌ను గెలిపించాలనే ఏకైక లక్ష్యంతోనే బరిలోకి దిగుతున్నాడని ఆర్సీబీ డైరెక్టర్‌ మో బొబాట్‌ వ్యాఖ్యానించారు. కాగా ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ నేపథ్యంలో భారత్‌- పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారం పాటు వాయిదా పడిన ఐపీఎల్‌ తాజా ఎడిషన్‌ శనివారం (మే 17) నుంచి పునః ప్రారంభం కానుంది. ఆర్సీబీ- కోల్‌కతా జట్ల మధ్య జరిగే శనివారం నాటి మ్యాచ్‌కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక.ఇదిలా ఉంటే.. కొత్త కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ సారథ్యంలో ఆర్సీబీ ఈసారి అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న బెంగళూరు జట్టు.. ఎనిమిదింట గెలిచి పదహారు పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. కోల్‌కతాపై తాజా మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్‌ బెర్తు ఖరారు చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. చదవండి: రోహిత్‌ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక!

​Hindupur: Officer Demands 10 Thousand Bribe From Woman To Grant Pension5
వీడియో వైరల్‌.. ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో దారుణం

శ్రీ సత్యసాయి జిల్లా: ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో దారుణం జరిగింది. పింఛన్ మంజూరు చేసేందుకు రూ. 10 వేలు లంచం కావాలంటూ మహిళను ఓ అధికారి డిమాండ్‌ చేశాడు. దీంతో లంచం ఇవ్వడానికి డబ్బు కోసం చెవి పోగులను ఆ మహిళ తాకట్టు పెట్టింది. హిందూపురం లోని మోడల్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా, అనంతపురం జిల్లాలో మరో ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కళ్యాణ దుర్గం ఎక్సైజ్ సీఐ హసీనా భాను వివాదంలో చిక్కుకున్నారు. అటెండర్‌ను చెప్పుతో కొట్టిన సీఐ హసీనా భాను.. తన పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ అటెండర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకేం తెలియదని అటెండర్‌ చెబుతున్నాడు. ఎక్సైజ్ హసీనా భాను, అటెండర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతపురం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో పంచాయితీ జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Albanian PM Greet Italian PM Giorgia Meloni6
ఇటలీ ప్రధాని మెలోనీ ఖుషీ.. మోకాలిపై కూర్చొని దేశాధినేత స్వాగతం

టిరానా: అల్బేనియా దేశాధినేత ఎడీ రమా చర్చల్లో నిలిచారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి ఆయన స్వాగతం పలికిన తీరు ఆసక్తికరంగా మారింది. మోకాలిపై కూర్చొని ఎడీ.. ఆమెను ఆహ్వానించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అల్బేనియా రాజధాని టిరానాలో ఐరోపా రాజకీయ కమ్యూనిటీ సదస్సు జరిగింది. ఈ సమావేశానికి యూరోపియన్‌ యూనియన్‌ దేశాల నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ వచ్చారు. అనంతరం, మెలోనీ కారు దిగి వేదిక వద్దకు వస్తుండగా.. అల్బేనియా ప్రధాని ఎడీ మోకాలిపై కూర్చొని చేతులు జోడించి నమస్కారం చెబుతూ స్వాగతం పలికారు. రెడ్‌ కార్పెట్‌ మీద ఆమెను సాదరంగా ఆహ్వానించారు.‼️ The Prime Minister of Albania greeted Italian 🇮🇹 Prime Minister Giorgia Meloni with a deep bow and genuflectionA rare display of respect, elegance, and old-world chivalry pic.twitter.com/lKyoNXL8zN— Mambo Italiano (@mamboitaliano__) May 16, 2025ఇక, వర్షంలోనూ ఆయన పలికిన ఈ ఆత్మీయ ఆహ్వానానికి మెలోనీ ఫిదా అయ్యారు. మెలోనీ తన ‘ఇటాలియన్‌ సిస్టర్‌’ అని చెప్పే ఎడీ రమా ఆమె ఎప్పుడు కన్పించినా సరే ఇలాగే పలకరిస్తారు. ఈ ఏడాది జనవరిలో మెలోనీ పుట్టినరోజు నాడు ఓ సదస్సులో కలిసిన ఎడీ.. ఆమెకు మోకాలిపై కూర్చొని స్కార్ఫ్‌ను కానుకగా ఇచ్చారు. ఇటాలియన్‌ భాషలో ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.Bend it like Albanian PM not like #Bekcham. Grand welcome with respect for Italian PM #GiorgiaMeloni, truly commands the utmost respect of world leaders. pic.twitter.com/a4zSQFelwn— Vinay Kumar (@vinatanycost) May 16, 2025

TDP MLA Bonela Vijay Chandra Over Action With MRO7
టీడీపీ ఎమ్మెల్యే.. మహిళా ఎంఆర్వోకి అర్ధరాత్రి వాట్సాప్‌ కాల్‌ చేసి దూషణ..

సాక్షి, పార్వతీపురం మన్యం: ఏపీలో కూటమి సర్కార్‌ పాలనలో ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే అర్ధరాత్రి మహిళా ఎంఆర్వోకు ఫోన్‌ చేసి అసభ్య పదజాలంతో దూషించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. అనంతరం, సదరు మహిళా ఎంఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టీడీపీ ఎమ్మెల్యే ప్లేటు ఫిరాయించారు. రివర్స్‌లో ఆమెపైనే ఆరోపణలు చేశారు.వివరాల ప్రకారం.. పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర.. మహిళా ఎంఆర్వోకు అర్ధరాత్రి వాట్సాప్‌లో కాల్‌ చేశారు. ఈ క్రమంలో అసభ్య పదజాలంతో ఆమెను దూషించారు. దీంతో, సదరు మహిళా ఎంఆర్వో.. పోలీసులకు ఆశ్రయించారు. అనంతరం, టీడీపీ ఎమ్మెల్యే బోనెల.. బహిరంగంగా బ్లాక్‌మెయిల్‌కు దిగారు. సదరు అధికారి.. ఎస్టీ మహిళ కావడంతో తనపై కేసు నమోదు అవుతుందున్న భయంతో ఎంఆర్వోపై తీవ్ర ఆరోపణలు చేశారు.ఆయన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర స్పందిస్తూ..‘భూమి విషయమై మాట్లాడేందుకు అర్ధరాత్రి ఎంఆర్వోకు నేను ఫోన్‌ చేశాను. ఆమె ఎత్తకపోవడంతో వాట్సాప్‌ కాల్‌ చేశాను. ఎంఆర్వో ఆఫీసు అవినీతిమయంగా తయారైంది. ఎంఆర్వో మానసిన పరిస్థితి సరిగా లేదు. ఎంఆర్వోపై శాసనసభ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తా. ఆమె క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు.మరోవైపు... ఎంఆర్వోతో అనుచితంగా మాట్లాడిని ఎమ్మెల్యే తీరుపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఈ సందర్బంగా సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు స్పందిస్తూ.. మహిళా ఎంఆర్వోకు అర్ధరాత్రి ఎమ్మెల్యే ఫోన్‌ చేయడం సరికాదు. ఆమెను వేధింపులకు గురిచేయడమేంటని ప్రశ్నించారు.

do you know Regrowing hair on a bald head is possible8
బట్టతలపై వెంట్రుకలు సాధ్యమే! దువ్వెన్లు సిద్దం చేసుకోండి!

వయసు మీరుతున్న కొద్దీ తలపై జుట్టూడిపోవడం సాధారణం. కానీ.. కొంతమందికి చిన్న వయసులోనే బట్టతల వచ్చేస్తు్తంటుంది. మళ్లీ జుట్టు కావాలని అనుకుంటే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ వంటి వ్యయ ప్రయాసలతో కూడిన పద్ధతులు మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే త్వరలోనే ఈ సమస్య తీరి పోతుందంటున్నారు హార్వర్డ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా... రాలిపోయిన జుట్టు స్థానంలో సరికొత్తగా వెంట్రుకలు మొలిచేలా కూడా చేసేందుకు తాము ఓ కొత్త పద్ధతిని ఆవిష్కరించామని వీరు చెబుతున్నారు. నొప్పి ఏమాత్రం కలిగించని, అతిసూక్ష్మమైన సూదులతో కూడిన పట్టీని అతికించి.. ఆ సూదుల ద్వారా ఒక మందును నెత్తికి అందించడం ద్వారా ఇది సాధ్యమని వారు వివరించారు. ఎలుకలపై తాము ఇప్పటికే కొన్ని ప్రయోగాలు చేశామని, సత్ఫలితాలు సాధించామని తెలిపారు.అలొపీసియాకు కారణాలు కచ్చితంగా తెలియవు కానీ.. ఇది ఒక ఆటో ఇమ్యూన్‌ వ్యాధి. అంటే.. శరీర రోగ నిరోధక వ్యవస్థే.. బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు దాడి చేశాయని పొరబడి మన శరీరానికి నష్టం చేయడాన్నే ఆటో ఇమ్యూన్‌ వ్యాధి అంటారు. అలోపీసియా విషయంలో రోగ నిరోధక వ్యవస్థలోని టీ–కణాలు వెంట్రుకల కుదుళ్లపై దాడి చేస్తాయన్న మాట. ఫలితంగా వెంట్రుకలు అక్కడక్కడా రాలిపోవడం మొదలవుతుంది. కొంతమందిలో రాలిపోయిన తరువాత ఒకసారి పెరిగే అవకాశం ఉంటుంది కానీ.. మిగిలిన వారికి ఆ అదృష్టం ఉండదు. ఇదీ చదవండి: బిగ్‌ బాస్‌ విన్నర్‌ లివర్‌లో టెన్నిస్‌ బాల్‌ అంత కణితి : వైరల్‌ పోస్ట్‌ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కీళ్లనొప్పులు, తామర వంటివి ఆటో ఇమ్యూన్‌ వ్యాధులు కావడం... చికిత్సకు మందులు (రోగ నిరోధక వ్యవస్థను అణచివేసేవి) ఉపయోగించినప్పుడు జుట్టు మొలవడం! మందులు వాడటం నిలిపేసిన వెంటనే జుట్టు రాలడమూ మొదలవుతూ ఉండటాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ఈ మందుల్లోనే ఏదో మర్మముందన్న సందేహంతో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. ఇదీ చదవండి: వెండి గాజుల కోసం.. తల్లి చితిపై పడుకుని..కొడుకు కాదు!మందులు కేవలం వెంట్రుకల కుదుళ్లపై దాడి చేస్తున్న టీ–కణాలే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. దీంతో మైక్రో నీడిల్‌ ప్యాచ్‌ ద్వారా ఈ మందులు నేరుగా వెంట్రుకల కుదుళ్లకు మాత్రమే అందేలా చేశారు. ఎలుకలతో ప్రయోగాలు చేసినప్పుడు మూడు వారాల్లోపు పదిసార్లు ΄్యాచ్‌లు మార్చి.. ఇంకో ఎనిమిది వారాలు వాటిని గమనించారు. మూడు వారాల తరువాత వెంట్రుకలు పెరగడం మొదలైంది. పదివారాలపాటు పెరుగుతూనే ఉన్నాయి. సో... సమీప భవిష్యత్తులోనే బట్టతల కలవారందరూ ఎంచక్కా జేబులో దువ్వెన పెట్టుకుని తిరిగే అవకాశం ఉందన్నమాట!

Dadasaheb Phalke grandson Comments On SS Rajamouli and Aamir Khan9
'దాదాసాహెబ్‌ ఫాల్కే' బయోపిక్‌లో ఎవరు.. క్లారిటీ వచ్చేసింది

భారతీయ సినీ పితామహుడు దాదా సాహెబ్‌ ఫాల్కే (అసలు పేరు ధుండీరాజ్‌ గోవింద్‌ ఫాల్కే) బయోపిక్‌ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. దాదా సాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌ చేసేందుకు ఇటు రాజమౌళి అటు ఆమిర్‌ ఖాన్‌ ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. దీంతో ముందుగా ఎవరు ఈ సినిమాను సెట్స్‌ పైకి తీసుకెళ్తారనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. ఇలాంటి సమయంలో దాదాసాహెబ్‌ ఫాల్కే మనవడు చంద్రశేఖర్‌ అసలు విషయం చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపుతుంది ఎవరో ఆయన పంచుకున్నారు.దాదాసాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌పై ఇండస్ట్రీలో చర్చ జరుగుతుందని ఆయన మనవడు చంద్రశేఖర్‌ అన్నారు. ఈ ప్రాజెక్ట్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన అన్నారు. 'దాదాసాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌ విషయంలో రాజమౌళి టీమ్‌ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మమ్మల్ని సంప్రదించలేదు. కానీ, ఆమిర్‌ టీమ్‌ నన్ను సంప్రదించింది. ఈ బయోపిక్‌ కోసం ఆమిర్‌ మూడేళ్ల నుంచి పరిశోధనలు చేస్తున్నారు. దర్శకుడు రాజ్‌కుమార్‌ హీరాణీ ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ బయోపిక్‌ సినిమా కోసం వర్క్‌ చేస్తున్నట్లు నాకు కూడా సమాచారం ఉంది. రాజ్‌కుమార్‌ హీరాణీ అసిస్టెంట్‌ ప్రొడ్యూసర్‌ హిందూకుష్‌ భరద్వాజ్ నాతో మూడేళ్లుగా టచ్‌లో ఉన్నారు. మా తాతగారి గురించి ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నారు. అతను నన్ను మళ్ళీ మళ్ళీ కలవడానికి, పరిశోధన చేయడానికి, వివరాలు అడగడానికి వచ్చేవాడు. దాదాసాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌లో ఆమిర్‌ ఖాన్‌ బాగా సెట్‌ అవుతాడు.' అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.దాదాసాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌లో ఎన్టీఆర్‌ నటించడం లేదని దీంతో క్లారిటీ వచ్చేసింది. తారక్‌ నటిస్తున్నారని వార్తలు వచ్చిన 24 గంటల్లోపే ఈ ప్రాజెక్ట్‌లో ఆమిర్‌ ఖాన్‌ చేస్తున్నట్లుగా ప్రకటన వచ్చింది. అయితే, మేడ్‌ ఇన్‌ ఇండియా... ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా బయోపిక్‌ ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’కు సమర్పకుడిగా వ్యవహరించనున్నట్లుగా 2023లో దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ చేశారు. వరుణ్‌ గుప్తా, ఎస్‌ఎస్‌ కార్తికేయ ఈ సినిమాను నిర్మించనున్నట్లు, నితిన్‌ కక్కడ్‌ (హిందీ చిత్రం ‘నోట్‌బుక్‌’ ఫేమ్‌) ఈ బయోపిక్‌కు దర్శకత్వం వహించనున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఆ తర్వాత ఈ సినిమా గురించి అప్‌డేట్‌ ఏదీ బయటకు రాలేదు. తాజాగా దాదాసాహెబ్‌ ఫాల్కే మనవుడి ప్రకటనతో క్లారిటీ వచ్చేసింది.

Sebi urges Karvy investors to file claims before June 2 deadline approaches10
డెడ్‌లైన్‌ దగ్గరపడుతోంది.. క్లెయిమ్స్‌ దాఖలు చేయండి

న్యూఢిల్లీ: కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ (కేఎస్‌బీఎల్‌) ఇన్వెస్టర్లు తమ క్లెయిమ్‌లను దాఖలు చేసేందుకు గడువు తేదీ అయిన జూన్‌ 2 దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో మదుపరులు త్వరపడాలని, సత్వరం క్లెయిమ్‌లను ఫైల్‌ చేయాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సూచించింది.దీనిపై సహాయం కోసం ఎన్‌ఎస్‌ఈని సంప్రదించవచ్చని లేదా టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800 266 0050కి కాల్‌ చేయొచ్చని (ఐవీఆర్‌ ఆప్షన్‌ 5), లేదా defaultisc@nse.co.in ఈమెయిల్‌ ఐడీకి మెయిల్‌ చేయొచ్చని ఒక ప్రకటనలో పేర్కొంది. కేఎస్‌బీఎల్‌ తమ క్లయింట్ల సెక్యూరిటీలను తనఖా పెట్టి భారీగా నిధులు సమీకరించడం, వాటిని సొంత అవసరాల కోసం ఇతర అనుబంధ సంస్థలకు మళ్లించడం తెలిసిందే.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement