Top Stories
ప్రధాన వార్తలు

బాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు : వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదంటూ మండిపడ్డారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులతో ఆయన సోమవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు సహా అనేక అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా హాజరయ్యారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతాకాదు. విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్నిరంగాల్లోనూ విద్వంసమే. రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అమలవుతోంది. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. వీటిని ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లాలి’ అని సూచించారు. జిల్లాలో పార్టీ ఓనర్షిప్ మీదిప్రజా సంబంధిత అంశాల్లో ఒకరి ఆదేశాలకోసం మీరు ఎదురు చూడొద్దు. మీకు మీరుగా స్వచ్ఛందంగా కదలాలి. నియోజకవర్గ ఇన్‌ఛార్జితో కలిసి మొదట కదలాల్సిందే మీరే. ప్రజలకు అండగా మీరు చేస్తున్న కార్యక్రమాల వల్ల అది రాష్ట్రస్థాయి దృష్టిని ఆకర్షిస్తుంది. దీనిద్వారానే మీ పనితీరు బయటపడుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ మన్ననలు పొందాల్సిన బాధ్యత మీది. సమాజంలో గొంతులేని వారికి బాసటగా నిలిచేది వైయస్సార్సీపీయే. ప్రతి సమస్యలోనూ బాధితులకు తోడుగా నిలిచేది వైఎస్సార్సీపీయే. మే నెలలోపు మండల కమిటీలు పూర్తిచేయాలిజూన్-జులైల్లో గ్రామస్థాయి, మున్సిపాల్టీలల్లో డివిజన్ కమిటీలు పూర్తిచేయాలి. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరులో బూత్ కమిటీలు ఏర్పాటు కావాలి. ఈమేరకు లక్ష్యంగా పెట్టుకోండి. జిల్లా స్థాయి నుంచి పార్టీని గ్రామస్థాయి వరకూ తీసుకువెళ్లే బాధ్యతల్లో మీరు ఉన్నారు. పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగాలి. జిల్లా అధ్యక్షుల పాత్ర పార్టీలో చాలా కీలకమైనది. గ్రామస్థాయి బూత్ కమిటీలు, గ్రామ కమిటీలు ఏర్పాటు అనేది అత్యంత కీలక విధుల్లో ఒకటి. పార్టీలో సమర్థులు ఎవరు, ప్రతిపక్షంలో ఎవరు లీడ్ చేయగలరు అని ఆలోచన చేసి మీకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. మీమీ జిల్లాల్లో పార్టీ మీద మీకు పట్టు ఉండాలి. పార్టీ బలోపేతం కోసం గట్టిగా కృషిగా చేయాలి. బాధ్యతల నుంచే అధికారం వస్తుంది.జిల్లాల్లో మీరే సర్వం. మీరే పార్టీ.. పార్టీయే మీరుజిల్లాల్లో అన్నిస్థానాల్లో గెలిపించాల్సిన బాధ్యత మీది. మనసా వాచా కర్మేణా అదే తలంపుతో పార్టీని నడపాలి. జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో గెలిపించే బాధ్యత మీది. అది మీ ప్రధాన బాధ్యత. దీనికోసం ఏం చేయాలన్నదానిపై మీరు గట్టిగా పనిచేయాలి. జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ ప్రతి కమిటీ బలంగా ఉండాలి. ఏదైనా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పనితీరు బాగోలేకపోతే పిలిచి చెప్పగలగాలి. అప్పటికీ పనితీరు బాగోలేకపోతే ప్రత్యామ్నాయం చూడ్డంలో మీ భాగస్వామ్యం కీలకం. పార్టీలో ఇద్దరి మధ్య వివాదం ఉన్నప్పుడు పిలిచి సమన్వయం చేయాల్సిన బాధ్యత మీది. మీ పరిధిలో 7కు ఏడు గెలిపించాల్సిన బాధ్యత మీది. బాధ్యత, అధికారం రెండూ తీసుకోండి. మీరు సమర్థులని భావించి, మీకు ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమన్వయం చేయడం, జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ కమిటీ నిర్మాణం మీ ప్రధాన బాధ్యత. అలాగే ప్రజా సంబంధిత అంశాల్లో చురుగ్గా ఉండాలి.ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన నాయకత్వ ప్రతిభ బయటపడుతుందిప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన నాయకత్వ ప్రతిభ బయటపడుతుంది. భారీ లక్ష్యం ఉన్నప్పుడే బ్యాట్స్‌మన్ ప్రతిభ బయటపడుతుంది. అప్పుడే ఆ బ్యాట్స్‌మెన్ ప్రజలకు ఇష్టుడు అవుతాడు. ఇదికూడా అంతే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చేసే పనులవల్ల మనం ఎలివేట్ అవుతాం. ప్రజల దగ్గర, పార్టీలోనూ గౌరవం పెరుగుతుంది. ఇమేజీ పెరుగుతుంది. మన పనితీరు వల్లే మనం మన్ననలను పొందగలుగుతాం. అందరూ ధోనీల్లా తయారు కావాలి. అప్పుడే మీ జిల్లాల్లో ఏడుకు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలవగలుగుతాం. జిల్లాల్లో ఏ జరిగినా మీరు ప్రజల తరఫున నిలబడాలి.కార్యక్రమాలు చురుగ్గాచేయాలి, ఆయా కార్యక్రమాల్లో పాల్గొనాలి. ప్రజా వ్యతిరేక అంశాలమీద గట్టిగా పోరాటం చేయాలి. లేదంటే పార్టీపరంగా మనం అవకాశాలను కోల్పోయినట్టే. బాధితులకు మనం అండగా ఉండాలి.మనమంతా రాజకీయ నాయకులంమనమంతా రాజకీయ నాయకులం. మన జీవితాలను రాజకీయాలకోసం పెట్టామనే విషయం మరిచిపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వెనకడుగు వేయకూడదు. ప్రతిపక్షంగా మనకు వచ్చిన అవకాశాలను వదిలిపెట్టకూడదు. జిల్లాస్థాయిలో ప్రజా సంబంధిత అంశాలను మీరు బాగా వెలుగులోకి తీసుకు వస్తేనే ప్రజలకు దగ్గరవుతాం. మనం అధికారంలోకి వస్తేనే ప్రజలకు మరింత మంచి చేయగలం. ప్రజలకు మరింత మంచి చేయాలన్న తపన, తాపత్రయం ఉంది కాబట్టే రాజకీయాలు చేస్తున్నాం. నాన్నగారు చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నా ఫొటో ఉండాలనుకున్నాను కాబట్టే నేను రాజకీయాలు చేస్తున్నాను. అలాగే ప్రతి జిల్లాల్లో మీ సేవల గురించి మాట్లాడుకోవాలి.రెండు మూడు సంవత్సరాలు అయితే కాని ప్రభుత్వ వ్యతిరేకత సాధారణంగా బయటకు కనిపించదు. కాని ఏడాదిలోపే ప్రభుత్వంమీద వ్యతిరేకత తీవ్రంగా ఉంది. అందుకే యుద్ధ ప్రాతిపదికన కమిటీ నిర్మాణం పూర్తిచేయాలి. దీని తర్వాత పార్టీ పరంగా మీకూ, నాకూ పూర్తిగా పని ఉంటుంది. అందరం కలిసికట్టుగా పార్టీపరంగా కార్యక్రమాలు బలంగా ముందుకు తీసుకెళ్లాలి. అందుకనే పార్టీ పరంగా నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేయాలి. గ్రామస్థాయిలోకూడా కమిటీలు, బూత్ కమిటీల ఏర్పాటు పూర్తిచేస్తే… పూర్తిస్థాయి సన్నద్ధతతో ఉన్నట్టు అవుతుంది ప్రతి జిల్లాల్లో పార్టీ నిర్మాణం ద్వారా దాదాపు 12వేల మంది పార్టీ కార్యక్రమాలకోసం మీకు అందుబాటులో ఉంటారు. ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపుగా 1500 మంది ఉంటారు.మద్దతు ధరలు దొరక్క రైతులు తీవ్రంగా నష్టపోతున్నారువివిధ జిల్లాల్లో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రైతుల తరఫున పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు జిల్లాల్లో రైతులకు అండగా ఉండాలి. రైతుల డిమాండ్లపై పోరాటం చేయాలి.

స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ట్వీట్లు పలు వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ క్రమంలో ఆమె మరో సంచలన ట్వీట్ చేశారు. తనపై వేటు తర్వాత ఎక్స్ వేదికగా ఆమె స్పందిస్తూ.. భగవద్గీతలోని అంశాన్ని తన బదిలీకి అన్వయిస్తూ ట్వీట్ చేశారు. కర్మణ్యే వాధికారస్తే, మా ఫలేషు కదాచన. 4 నెలలు టూరిజం అభివృద్ధి కోసం నా వంతు కృషి చేశాను. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న టూరిజం పాలసీ 25-30లో రాష్ట్రానికి పరిచయం చేశాను’’ అని ట్వీట్ చేశారు.‘‘నిర్లక్ష్యానికి గురైన టూరిస్ట్ సర్క్యూట్లలో దిశ, పెట్టుబడి కోసం పటిష్టమైన ఫ్రేమ్‌ని సృష్టించాను. డిపార్ట్మెంట్ పని శైలిని పునరుద్ధరించాను. జవాబుదారీతనం నింపడానికి ప్రయత్నించాను. లాజిస్టిక్స్, ప్లానింగ్ కోసం పునాది వేసి- గ్లోబల్ ఈవెంట్ కోసం ప్రయత్నం మొదలు పెట్టాను.. అది నాకు ఆనందం.. గౌరవంగా ఉంది’’అంటూ స్మితా ట్వీట్ చేశారు.కాగా, కంచ గచ్చిబౌలి భూవివాదంలో స్మితా సబర్మాల్.. ఏఐ ఫోటో రిట్వీట్ చేసిందని పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై ఆమె.. రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు చేయడం వివాదాస్పదంగా మారిన క్రమంలో తెలంగాణ ప్రభుత్వం.. స్మితాపై బదిలీ వేటు వేసింది. ఆమెను ఆర్థిక సంఘం (ఫైనాన్స్ కమిషన్) సభ్య కార్యదర్శిగా బదిలీ చేసింది.

ప్రొటోకాల్ రగడ.. తుమ్మల సమక్షంలో అధికారులపై ఎమ్మెల్యే ఫైర్
భద్రాద్రి కొత్తగూడెం,సాక్షి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రోటోకాల్ రగడ అధికార కాంగ్రెస్‌లో చర్చాంశనీయంగా మారింది. సొంత పార్టీ ఎమ్మెల్యేకు ప్రొటోకాల్ కరువైంది. దమ్మపేట మండలం పూసికుంటలో మంగళవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. పర్యటనలో గిరిజన ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు అవమానం జరిగింది.కోట్లాది రూపాయల పనుల ప్రారంభానికి ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు ఆహ్వానం అందలేదు. అధికారులు సైతం కాంగ్రెస్ ఎమ్మెల్యేని పట్టించుకోలేదు. ఆహ్వానం అందకపోయినా కార్యక్రమానికి ఎమ్మెల్యే జారె హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల సమక్షంలో అధికారుల తీరుపై జారే మండిపడ్డారు. తీవ్ర ఆవేదనతో మాట్లాడారు. ఎమ్మెల్యే చచ్చిపోయాడనుకున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో శంకుస్థాపన నిలిపివేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..ఎమ్మెల్యే జారె ఆదినారాయణను సముదాయించేందుకు తన కారులోకి తీసుకెళ్లారు. ఎలాగోలా సముదాయించి ఎమ్మెల్యే జారె ఆదినారాయణతో శంకుస్థాపన చేయించారు. అయినప్పటికీ ఎమ్మెల్యే జారె వర్గీయులు వెనక్కి తగ్గలేదు. అధికారుల నిర్లక్క్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు.

IPL 2025: పదేళ్ల వయసులోనే 90 మీటర్ల భారీ సిక్సర్లు కొట్టాడు: వైభవ్ కోచ్ ఓఝా
14 ఏళ్ల వయసులో ప్రపంచ స్థాయి బౌలర్లను గడగడలాడిస్తూ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన వైభవ్ సూర్యవంశీవైపు ప్రస్తుతం ప్రపంచం మొత్తం చూస్తుంది. ఈ కుర్రాడు ఎవరు..? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి అని తెలుసుకునే పనిలో పడ్డారు క్రికెట్ అభిమానులు. ఈ క్రమంలో వైభవ్‌కు సంబంధించిన చాలా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇండియా టుడే ఇచ్చిన ఇంటర్వ్యూలో వైభవ్ చిన్ననాటి కోచ్ మనీశ్ ఓఝా చాలా విషయాలు చెప్పాడు. బ్రియాన్ లారాకు వీరాభిమాని అయిన వైభవ్‌లో నమ్మశక్యంకాని సిక్స్ హిట్టింగ్ ప్రతిభ ఉందని వెల్లడించాడు. వైభవ్ టాలెంట్ ముందు ఈ సెంచరీ చిన్నది అన్ని అన్నాడు. వైభవ్ పదేళ్ల వయసులోనే 90 మీటర్ల భారీ సిక్సర్లు కొట్టేవాడని.. రోజూ నెట్స్‌లో 350–400 బంతులు ఎదుర్కొనేవాడని తెలిపాడు.వైభవ్ గురించి అతడి ఓఝా మాటల్లో.. వైభవ్‌కు శిక్షణ ఇస్తున్న సమయంలో ఒక్కసారి కూడా తిట్టాల్సిన అవసరం రాలేదు. వైభవ్‌కు ఏ షాట్ నేర్పించినా, ఏ టెక్నిక్‌ను వివరించినా దాన్ని పునరావృతం చేయాల్సిన అవసరం లేదు. అతను వెంటనే గ్రహిస్తాడు. వైభవ్‌ను పదిన్నరేళ్ల వయసులో తొలిసారి చూశాను.ఆ వయసులోనే అతను ప్రపంచ స్థాయి బ్యాటర్ల సామర్థ్యం కలిగి ఉన్నాడు. 2022లో ఓఝా కోచింగ్ సెంటర్లో నిర్వహించిన ఓ మ్యాచ్‌లో వైభవ్ 118 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో అతను కొట్టిన సిక్సర్లు ఇప్పుడు ప్రజలు చూస్తున్న సిక్సర్ల మాదిరిగానే ఉన్నాయి. ప్రతి సిక్సర్ 90 మీటర్లపైనే ఉండింది. ఆ సమయంలోనే వైభవ్ శక్తి, ఖచ్చితత్వం అసాధారణంగా ఉండేది. ఆ రోజే వైభవ్ అద్భుతాలు చేయగలడని నమ్మాను.14 ఏళ్ల పిల్లాడిలో ఇంత శక్తి ఎలా వస్తుందనే దానిపై స్పందిస్తూ.. వైభవ్‌లో ఈ అబ్బురపరిచే శక్తి ప్రమాదవశాత్తు వచ్చింది కాదు. అతను భారీ సిక్సర్లు కొట్టే ప్రయత్నం చేయబట్టి నాలుగేళ్లవుతుంది. వైభవ్‌లో ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. అదే కాన్ఫిడెన్స్‌తో అతను భారీ షాట్లు ఆడుతాడు. వైభవ్‌కు ఈ స్థాయి సిక్స్ హిట్టింగ్ సామర్థ్యం రావడానికి అతని కఠోర ప్రాక్టీస్ కూడా ఓ కారణం. వైభవ్ టైమింగ్, టెక్నిక్ కూడా అద్భుతంగా ఉంటుంది. అతడికి ప్రాక్టీస్‌లో రోబోలతో త్రోలు వేయించేవాడిని. వైభవ్ ఎక్కువగా ఫుల్ టాస్ బంతులకు షాట్లు ప్రాక్టీస్ చేసేవాడు. రికార్డు సెంచరీకి ముందు రోజు కూడా వైభవ్‌తో మాట్లాడినట్లు ఓఝా తెలిపాడు.కాగా, ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, పొట్టి క్రికెట్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా, ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రికార్డులు నెలకొల్పాడు.ఈ మ్యాచ్‌లో వైభవ్ ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లపై 11 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఇందులో మూడు సిక్సర్లు 85 మీటర్లకు పైబడినవి కాగా.. రెండు 90 మీటర్లు దాటి ప్రయాణించాయి. కొన్ని సిక్సర్లు స్టేడియంలోని స్టాండ్స్ పైకప్పుపై కూడా పడ్డాయి.

భారత్‌లో పాక్ రక్షణ మంత్రి ఎక్స్ ఖాతా నిలిపివేత
ఢిల్లీ: పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఎక్స్ ఖాతాను భారత ప్రభుత్వం నిలిపివేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్ముకశ్మీర్ పై పాక్ మంత్రి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో ఎక్స్ ఖాతాను కేంద్రం బ్లాక్ చేసింది. భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే పాకిస్థాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలను భారత్‌లో నిషేధించిన సంగతి తెలిసిందే. భారత్‌లో పాక్ జర్నలిస్టుల ఎక్స్ ఖాతాలను కూడా కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఐఎస్ఐ, పాకిస్థాన్ ప్రభుత్వంతో కలిసి భారత్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు ఈ చర్యలు చేపట్టింది.భారత సైన్యం కదలికలపై పాక్ ఐఎస్ఐ కొత్త ఎత్తుగడమరోవైపు, భారత సైన్యం కదలికలపై పాక్ ఐఎస్ఐ కొత్త ఎత్తుగడలు వేస్తోంది. సైన్యం కదలికలపై పాకిస్థాన్ ఐఎస్ఐ ఆరా తీస్తోంది. సరిహద్దులోని మిలిటరీ సిబ్బంది, పౌరులకు.. భారతీయ సైనిక్ స్కూల్ ఉద్యోగులమంటూ ఐఎస్ఐ ఫోన్లు చేస్తోంది. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని.. తెలియని వారికి ఎలాంటి సమాచారం ఇవ్వొద్దని సరిహద్దు ప్రజలకు కేంద్రం సూచిస్తోంది.కాగా, పహల్గాం దాడి తర్వాత పాక్ రక్షణ మంత్రి మీడియాతో మాట్లాడుతూ, అమెరికా, బ్రిటన్ కోసమే చెత్త పనులు చేశామని.. ఉగ్రవాదాన్ని పోత్సహించడం పొరబాటని అర్థమైందంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అమెరికా కోసమే ఉగ్రవాదులను పెంచిపోషించామంటూ ఆయన తప్పును ఒప్పుకున్నారు. ఉగ్రవాదం వల్ల చాలా ఇబ్బందులు పడ్డామన్నారు. ఉగ్ర సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ నిజమేనంటూ స్వయంగా ఆ దేశ రక్షణమంత్రే అంగీకరించారు. ఓ అంతర్జాతీయ మీడియాతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రైవేట్ స్కూల్స్‌లో ఫీజుల దోపిడీకి చెక్.. చట్టం అమలుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
ఢిల్లీ : ప్రైవేట్ స్కూళ్లల్లో అడ్డగోలు ఫీజుల దందాపై చరిత్రలో తొలిసారి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఢిల్లీ స్కూళ్లలో ఫీజులు ఎంత మేరకు ఉండాలనే అంశంపై ప్రభుత్వం విధివిధానాల్ని ఖరారు చేసింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోనుంది.ఫీజుల స్థిరీకరణ,నియంత్రణ బిల్లు- 2025పై ఢిల్లీ కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో పలు స్కూల్స్ ఏకపక్షంగా ఫీజుల పెంచుతున్నారంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఢిల్లీ కేబినెట్ మంగళవారం పాఠశాల ఫీజులను నియంత్రించడానికి చట్టాన్ని ఆమోదించింది. అనంతరం ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మీడియాతో మాట్లాడారు. నా ఆనందానికి అవధుల్లేవు.ఢిల్లీ ప్రభుత్వం ధైర్యమైన నిర్ణయం నిర్ణయం తీసుకుంది. పలు స్కూల్స్ ఏకపక్షంగా ఫీజుల పెంచుతున్నారంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఢిల్లీ కేబినెట్ మంగళవారం పాఠశాల ఫీజులను నియంత్రించడానికి ఒక చట్టాన్ని ఆమోదించింది.📢 Big Reform in Delhi Education!CM Rekha Gupta: “For the first time in history, Delhi Govt has passed a foolproof Bill to regulate fees and set clear guidelines for all 1677 schools — aided, unaided, private, all included.”A bold step toward transparency and fairness in… pic.twitter.com/YzwzSBpLwP— भँ० अजीत सिंह तोमर (@Bhanwar_Ast) April 29, 2025 ఢిల్లీ ప్రభుత్వం చారిత్రాత్మక,సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఫీజుల స్థిరీకరణ,నియంత్రణ బిల్లు- 2025 ముసాయిదా బిల్లును ఈరోజు కేబినెట్ ఆమోదించిందని మీకు చెప్పడానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను’అని అన్నారు.ఢిల్లీలోని 1,677 పాఠశాలలు ఎయిడెడ్, నాన్-ఎయిడెడ్ లేదా ప్రైవేట్ అయినా, ఫీజులకు సంబంధించిన పూర్తి మార్గదర్శకం, విధానాన్ని నిర్ణయిస్తారు. చరిత్రలో మొదటిసారిగా, అటువంటి బిల్లును ప్రభుత్వం రూపొందిస్తోందన్నారు. విద్యా మంత్రి ఆశిష్ సూద్ మాట్లాడుతూ, కొత్త నిబంధనలను అమలు చేయడానికి మూడు కమిటీలను ఏర్పాటు చేస్తామని, పాఠశాల మౌలిక సదుపాయాల ఆధారంగా మూడు సంవత్సరాల పాటు ఫీజులను ప్యానెల్లు నిర్ణయిస్తాయని అన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా నిర్ణయం తీసుకునే ప్రక్రియలో పాల్గొంటారని చెప్పారు. ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలోని పలు స్కూళ్లు ఏకపక్షంగా ఫీజులు వసూలు చేస్తున్నాయంటూ తల్లి దండ్రుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి.ఫిర్యాదులతో పలు పాఠశాలలకు ఢిల్లీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. తన ప్రభుత్వం పారదర్శకత, పిల్లల విద్యా హక్కు రక్షణకు కట్టుబడి ఉందని ఆ సమయంలో సీఎం రేఖా గుప్తా స్పష్టం చేశారు.

భద్రత కోసం రూ.70 కోట్లు!.. సుందర్ పిచాయ్ జీతం ఎంతంటే?
ప్రపంచంలోని దిగ్గజ కంపెనీల సీఈఓల గురించి తెలుసుకునే చాలామంది.. మొదట సెర్చ్ చేసే విషయం జీతమే. ఎందుకంటే వారి వేతనాలు కోట్ల రూపాయల్లో ఉంటాయి. ఇప్పుడు తాజాగా 2024లో సుందర్ పిచాయ్ జీతానికి సంబంధించిన విషయాలు వెల్లడయ్యాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆల్ఫాబెట్ 2025 ప్రాక్సీ స్టేట్మెంట్ ప్రకారం, సుందర్ పిచాయ్ వేతనం 2024లో 10.73 మిలియన్ డాలర్లు (రూ. 91.4 కోట్లు). ఇందులో ఎక్కువ భాగం స్టాక్ అవార్డ్స్, ఇతర పరిహారాల రూపంలో అందింది. కాగా ఈయన బేసిక్ శాలరీ 2 మిలియన్ డాలర్లు (రూ. 17.04 కోట్లు). సాధారణ ఉద్యోగి జీతంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. 2023లో పిచాయ్ వేతనం 8.8 మిలియన్ డాలర్లు మాత్రమే.జీతం విషయం పక్కన పెడితే.. సుందర్ పిచాయ్ భద్రత కోసం ఆల్ఫాబెట్ కంపెనీ ఏకంగా 8.27 మిలియన్ డాలర్లను (రూ. 70.45 కోట్లు) ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అంతకు ముందు ఏడాది సంస్థ భద్రత కోసం చేసిన ఖర్చు 6.78 మిలియన్ డాలర్లు. అంటే సెక్యూరిటీ కోసం.. కంపెనీ అంతకు ముందు సంవత్సరం కంటే 22 శాతం ఎక్కువ ఖర్చు చేసింది.ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం: మరో 195 మంది ట్రైనీలు..కంపెనీ అందించే భద్రతా ప్యాకేజీలో.. ఇంటి నిఘా, ప్రయాణ రక్షణ, వ్యక్తిగత డ్రైవర్లు వంటివన్నీ ఉంటాయి. అయితే దీనిని సంస్థ సుందర్ పిచాయ్ వ్యక్తిగత ప్రయోజనంగా కాకుండా.. ఉద్యోగ భద్రతలో భాగంగానే భావిస్తుంది. నిజానికి, సీఈఓ సుందర్ పిచాయ్ జీతం సగటు ఉద్యోగి జీతం కంటే దాదాపు 32 రెట్లు ఎక్కువ.

పహల్గామ్ దాడి.. నా పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు: విజయ్ ఆంటోనీ క్లారిటీ!
పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రముఖ నటుడు విజయ్ ఆంటోనీ చేసిన పోస్ట్ వివాదానికి దారితీసింది. ఆయన చేసిన పోస్ట్‌పై పలువురు నెటిజన్స్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పాకిస్తాన్లో 50 లక్షల మంది భారతీయులు ఉన్నారన్న ఆయన వాదనపై నెటిజన్స్ మండిపడ్డారు. దీంతో తన పోస్ట్‌పై విజయ్ ఆంటోని క్లారిటీ ఇచ్చారు. తన సందేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని మరో పోస్ట్ చేశారు.కాగా.. అంతకుముందు పహల్గామ్ దాడిని ఖండిస్తూ..కశ్మీర్లో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నా. భారతీయులుగా మనందరికీ బాధాకరమైన క్షణమిది. పాకిస్తాన్లో 50 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారని.. పాకిస్తానీలు మనలాగే శాంతి, ఆనందాన్ని కోరుకుంటారు. ఇలాంటి సమయంలో ద్వేషం కంటే మానవత్వాన్ని చూపిద్దాం' అంటూ విజయ్ ఆంటోని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. దీంతో ఆయనపై పలువురు విమర్శల దాడి చేశారు. పాకిస్తాన్లో ఉన్న ఈ 50 లక్షల మంది భారతీయులు ఎవరు? మీరు హిందువులను భారతీయులుగా పోలుస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. పాకిస్థాన్‌లో భారతీయులు అంటూ ఆయన చేసిన వాదనను పలువురు తప్పుపట్టారు.తాజాగా తన పోస్ట్‌పై వివరణ ఇచ్చేందుకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కశ్మీర్లో దారుణమైన మారణకాండ పాల్పడ్డారు.. వారి లక్ష్యం మన ఐక్యతను, బలమైన బంధాన్ని దెబ్బతీయడమే. భారతీయులుగా మన ప్రభుత్వంతో కలిసి మన సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటామనేదే నా ఉద్దేశమని మరో పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చారు. బిచ్చగాడు మూవీతో ఫేమస్ అయిన విజయ్ ఆంటోనీ సినిమాల విషయానికొస్తే చివరిసారిగా 'హిట్లర్‌లో కనిపించారు. ప్రస్తుతం 'గగన మార్గం', 'వల్లి మయిల్', 'అగ్ని సిరగుగల్', 'ఖాఖీ', 'శక్తి తిరుమగన్' లాంటి ఐదు చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. pic.twitter.com/YbFIloXPQ9— vijayantony (@vijayantony) April 27, 2025 pic.twitter.com/Gne6EdT6yu— vijayantony (@vijayantony) April 28, 2025

రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలకు ముహూర్తం ఖరారైంది. రేపు.. అంటే ఏప్రిల్ 30వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నాం 1గం.కు రవీంద్రభారతిలో సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలు విడుదల చేస్తారని సమాచారం. మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. సుమారు 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మూల్యాంకనం పూర్తి కావడంతో రిజల్ట్స్ రిలీజ్ కోసం ప్రభుత్వం ఆదేశాల కోసం విద్యా శాఖ ఎదురు చూసింది. ఈలోపు గ్రీన్ సిగ్నల్ రావడంతో పలితాలు విడుదల చేస్తోంది. ఈసారి మెమోలో మార్కులతో పాటు సబ్జెక్టుల వారీగా గ్రేడులు ఇవ్వనున్నారు. త్వరగతిన.. కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో ఫలితాలు చెక్ చేసుకునేందుకు https://education.sakshi.com/ క్లిక్ చేయండి.

‘పెగాసస్’పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పెగాసస్ వ్యవహారంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. జాతీయ భద్రతా ప్రయోజనాల కోసం ఓ దేశం స్పైవేర్(Spyware)ను కలిగి ఉండటం తప్పులేదని పేర్కొంది. అయితే.. అది ఎలా? ఎవరిపై ఉపయోగించారనే విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.దాదాపు నాలుగేళ్ల క్రితం దేశ రాజకీయాలను కుదిపేసిన పెగాసస్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ స్పైవేర్‌ను వినియోగించి దేశంలోని ప్రముఖ పాత్రికేయులు, పౌరసమాజ ప్రముఖులపై నిఘా పెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో.. పెగాసస్ ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం విచారణ జరిగింది. పిటిషన్ తరఫున న్యాయవాది మాట్లాడుతూ.. పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగిస్తోందా? లేదా? అనే విషయాన్ని కేంద్రం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేగాక, ఈ ఆరోపణలపై దర్యాప్తు జరిపి సాంకేతిక నిపుణుల బృందం నివేదిక కోసం సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఆదేశించిందని, ఇప్పటివరకూ ఆ నివేదిక అందలేదని, దానిని బయట పెట్టాలని ధర్మాసనాన్ని కోరారు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌తో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. దేశం స్పైవేర్‌ను వినియోగిస్తే గనుక అందులో తప్పేముంది. అయితే, దాన్ని ఎవరిపైన ఉపయోగిస్తున్నారన్నదే ఇక్కడ ప్రశ్న. పౌర సమాజంపై కాకుండా.. దేశ వ్యతిరేక శక్తులపై దీన్ని వినియోగిస్తే గనుక అందులో ఏ తప్పు లేదు. దేశ భద్రత విషయంలో రాజీపడకూడదు. ఒకవేళ సామాన్య పౌరులపై ఉపయోగిస్తే గనుక దాని గురించి మేం దర్యాప్తు జరిపిస్తాం. ఉగ్రవాదులు గోప్యత హక్కును కోరకూడదు. అయితే, సామాన్య పౌరుల గోప్యతకు మేం తప్పకుండా రక్షణ కల్పిస్తాం. ప్రస్తుతం మన దేశం ఎలాంటి పరిస్థితిలో ఉందో అందరికీ తెలుసు(పహల్గాం ఉగ్రదాడి ఘటనను పరోక్షంగా ప్రస్తావిస్తూ..). కాబట్టి మనం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది’’ అని ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇక, సాంకేతిక బృందం నివేదిక గురించి మాట్లాడుతూ.. ‘‘దేశ భద్రత, సార్వభౌమత్వానికి సంబంధించిన నివేదికను బహిర్గతం చేయడం సరికాదు. ఒకవేళ ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు దాని గురించి తెలుసుకోవాలనుకుంటే.. వారికి సమాచారం అందిస్తాం’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.పెగాసస్ వ్యవహారం ఏంటంటే.. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్ అనే సంస్థ ‘పెగాసస్’ స్పైవేర్‌ని అభివృద్ధి చేసింది. నిఘా కార్యకలాపాల కోసం ఈ స్పైవేర్‌ను ఎన్ఎస్వో పలు ప్రభుత్వాలు, ప్రభుత్వ అధీనంలో పనిచేసే సంస్థలకు విక్రయిస్తుంటుంది. అయితే, ఈ పెగాసస్‌ను ఉపయోగించి పాత్రికేయులు, పౌరసమాజ ప్రముఖుల ఫోన్లను హ్యాక్ చేశారంటూ 2021లో ఓ అంతర్జాతీయ పత్రిక సంచలన కథనం ప్రచురించింది. భారత్ నుంచి 300 మంది ఫోన్లు హ్యాక్ అయినట్లు పేర్కొంది. వీరిలో రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నట్లు తెలిపింది. దీంతో ఈ వివాదం దేశ రాజకీయాలను కుదిపేసింది.
తయారీని బలోపేతం చేసేందుకు కమిటీ: నీతి ఆయోగ్ సీఈవో
‘పాక్‌ను దెబ్బకు దెబ్బ తీయాలి’.. ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం
అందంలోనే కాదు.. చదువులోనూ అదుర్స్
ఇంగ్లండ్ కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్..
ప్రొటోకాల్ రగడ.. తుమ్మల సమక్షంలో అధికారులపై ఎమ్మెల్యే ఫైర్
పహల్గాం ఘటన.. ఆ రోజులన్నీ కళ్లముందు తిరిగాయి: నభా నటేష్
ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో
మండే ఎండలు : కిడ్నీలో రాళ్లు, పెరుగుతున్న కేసులు, బీ అలర్ట్!
ప్రైవేట్ స్కూల్స్‌లో ఫీజుల దోపిడీకి చెక్.. చట్టం అమలుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
పహల్గామ్ దాడి.. నా పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు: విజయ్ ఆంటోనీ క్లారిటీ!
ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
'ప్రవస్తి' నీకు నేను ఉన్నా.. మేము ఉన్నాం: గీతా మాధురి
వీళ్లు ఐదురూపాయలు బిచ్చమేశార్రా! దీంతో వైజాగ్‌లో ఐదెకరాల భూమి కొనేయవచ్చు... మనకూ ‘ఉర్సా’ లాంటి కంపెనీ ఉంటే!
తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
మార్కెట్లోకి సరికొత్త హైటెక్ ఫ్యాన్: ధర ఎంతంటే?
నా కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తా..!
నా కొడుకును సంపేయండి
ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా
ఆ హీరోయిన్ల పేర్లు కలిసేలా విజయ్ (TVK) పార్టీ ఉంది: మంత్రి
ప్రస్తుతం మన దగ్గర ఉన్నవి ఇవే సార్! క్షిపణుల బదులు 130 ఇవే బిగించాం!
Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
బ్రదర్ కేటీఆర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: వైఎస్ జగన్
సూర్యవంశీపై గిల్ కామెంట్స్.. జడేజా కౌంటర్
13ఏళ్లకే హీరో, 15ఏళ్లకే టాలీవుడ్ స్టార్..ఒక్క యాక్సిడెంట్‌తో తెరమరుగు..
భారత్‌తో జాగ్రత్త.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హెచ్చరిక
నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..
నచ్చిన వారితో శృంగారం.. అజిత్‌పై నటి 'హీరా' సెన్సేషనల్ కామెంట్
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
కొత్త రేషన్ కార్డు దేవుడెరుగు..!
బాలకృష్ణ విలన్‌ను ఎంపిక చేసుకున్న పూరీ జగన్నాథ్
ఆర్మూరు–జగిత్యాల హైవేకు ఓకే
RR VS GT: ఇది నా కల.. నాకు భయం లేదు: వైభవ్ సూర్యవంశీ
3 నిమిషాలకో మరణం
'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్
మూడో పంటగా సౌర విద్యుత్తు!
వామ్మో.. ఇదేం ట్రాఫిక్!
మహాభారతంలో నాని.. కన్ఫార్మ్ చేసిన రాజమౌళి
జాబ్ చేస్తానంటే ఇంట్లోకి రమ్మంటారు.. బాధ చెప్పుకున్న దీపిక
యాహూ! ఎట్టకేలకు భారతీయురాలిగా..! వీడియో వైరల్
భారత్‌తో యుద్ధ భయం.. పాక్ సైన్యంలో భారీ రాజీనామాలు
తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!
బంగారం భారీగా పడిపోతుంది!
‘లోకేష్ అన్యాయం చేశారు మీరైనా..’ పట్టించుకోని పవన్!
ఏపీ రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారు
ఇల్లు తుడిచిన హీరో.. ఎవరో తెలుసా?
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
వాడికి ఏడాదిన్నర వయసు.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
మహేశ్ బాబు నయా లుక్.. ఎప్పుడు లేనంతగా
పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి వరదలోచ్చిస్తున్నాయ్స్సార్.. ఎవరైనా కాపాడండి!
కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి..?
IPL 2025: ఒక్క విజయం.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ
IPL 2025: విధ్వంసంలో వైభవం
శ్రీకృష్ణ లీలలు
అయ్యో దేవుడా..ఏమిటీ ఘోరం
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
నాటి రైతు బిడ్డ... నేడు ఐపీఎల్ హీరో
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
RR VS GT: వైభవ్ సృష్టించిన బీభత్సం మాటల్లో వర్ణించలేనిది: రాజస్థాన్ కెప్టెన్
RR VS GT: ఓ పక్క వైభవ్ విధ్వంసకాండ కొనసాగుతుండగా, జైస్వాల్ రికార్డుల్లోకెక్కాడు
ముక్కోణపు వన్డే సిరీస్.. టీమిండియా భారీ స్కోర్
కొత్త కార్డులు 1,017
ముష్కర మూకలకు ముచ్చెమటలు
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్
స్తంభించిన విద్యుత్.. మూడు దేశాలు అతలాకుతలం
ఇంట్లో పాముల కలకలం
వాళ్ల గురించి ఇలా మాట్లాడకండి.. నాకు బాధేస్తోంది: కోటి
IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్యవంశీ.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
నిరంతర ‘కోత’లు!.. అల్లాడుతున్న ప్రజలు
మార్చి రిపోర్ట్: నిండా మునిగిన నిర్మాతలు.. 15 సినిమాల్లో ఒక్కటే హిట్టు!
‘పెగాసస్’పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
ఈవారం థియేటర్లో పెద్ద సినిమాలు.. ఓటీటీలో 20 చిత్రాలు
తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరు
‘ఛీ’నా రాజకీయం...
బ్యాంకులో క్యాష్ వేస్తున్నారా..? జాగ్రత్త!!
బాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు : వైఎస్ జగన్
వివాహేతర సంబంధం.. శైలజ నుంచి ఫోన్ వచ్చిందని..!
పాకిస్తాన్‌ను వదిలే ప్రసక్తే లేదు.. ఐరాసలో భారత్ హెచ్చరిక
జిమ్ చేస్తూ గాయపడ్డ కేటీఆర్
మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని భావన యాదవ్
'డ్రాగన్'తో హిట్.. క్రేజీ ఛాన్స్ కొట్టేసిన కాయదు
అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్
టీడీపీ నాయకుడి దురాగతం.. ఆస్తి కోసం అక్క, తల్లిపై దాడి
మనవడితో 50 ఏళ్ల మహిళ పెళ్లి : ఫ్యామిలీని లేపేసేందుకు కుట్ర?
ఇలా ఒక్కరినే టార్గెట్ చేయడం సరికాదు: రిషభ్ పంత్ అసహనం!
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
పాక్ నడ్డి విరిగేలా..
అక్షయ తృతీయ రోజు బంగారు నగలే కొనాలా?
సెట్ చేయడానికే ఏడాది: సీఎం రేవంత్
నా పరిస్థితి నా కూతురికి రాకూడదు: ఊర్వశి
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
75 ఏళ్లుగా చెక్కుచెదరని పెంకుటిల్లు..!
ట్రంప్ కోరుకునేది ఎన్నటికీ జరగదు.. విక్టరీ స్పీచ్‌లో మార్క్ కార్నీ
సమంత కాదు మాతాజీ.. ప్రియుడితో యానిమల్ బ్యూటీ!
పాక్ పాచికల్ని పారనీయొద్దు!
ఏపీలో సమంత టెంపుల్.. ఇప్పుడు మరో విగ్రహం
కెనడా ఎన్నికలు.. ఆధిక్యంలో లిబరల్ పార్టీ
ఎంత పనైపాయే..! పిల్లిలా కనిపించాలని సర్జరీ చేయించుకుంటే చివరికి..
IPL 2025: ‘పంజాబ్ ఈసారీ టైటిల్ గెలవదు.. ఎందుకంటే?!’
డిప్యూటీ కలెక్టర్‌ని.. టీడీపీ కోసం ఎంతో చేశా
IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. తొలి భారత ప్లేయర్‌గా
రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు
కెనడాలో భారతీయ విద్యార్థిని అదృశ్యం విషాదాంతం
ఈ ఐపీఎల్ సీజన్లో సెంచరీలు చేసిన నలుగురిలో ఓ 'కామన్ పాయింట్' ఉంది.. అదేంటి..?
ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
తయారీని బలోపేతం చేసేందుకు కమిటీ: నీతి ఆయోగ్ సీఈవో
‘పాక్‌ను దెబ్బకు దెబ్బ తీయాలి’.. ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం
అందంలోనే కాదు.. చదువులోనూ అదుర్స్
ఇంగ్లండ్ కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్..
ప్రొటోకాల్ రగడ.. తుమ్మల సమక్షంలో అధికారులపై ఎమ్మెల్యే ఫైర్
పహల్గాం ఘటన.. ఆ రోజులన్నీ కళ్లముందు తిరిగాయి: నభా నటేష్
ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో
మండే ఎండలు : కిడ్నీలో రాళ్లు, పెరుగుతున్న కేసులు, బీ అలర్ట్!
ప్రైవేట్ స్కూల్స్‌లో ఫీజుల దోపిడీకి చెక్.. చట్టం అమలుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
పహల్గామ్ దాడి.. నా పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు: విజయ్ ఆంటోనీ క్లారిటీ!
ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
'ప్రవస్తి' నీకు నేను ఉన్నా.. మేము ఉన్నాం: గీతా మాధురి
వీళ్లు ఐదురూపాయలు బిచ్చమేశార్రా! దీంతో వైజాగ్‌లో ఐదెకరాల భూమి కొనేయవచ్చు... మనకూ ‘ఉర్సా’ లాంటి కంపెనీ ఉంటే!
తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
మార్కెట్లోకి సరికొత్త హైటెక్ ఫ్యాన్: ధర ఎంతంటే?
నా కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తా..!
నా కొడుకును సంపేయండి
ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా
ఆ హీరోయిన్ల పేర్లు కలిసేలా విజయ్ (TVK) పార్టీ ఉంది: మంత్రి
ప్రస్తుతం మన దగ్గర ఉన్నవి ఇవే సార్! క్షిపణుల బదులు 130 ఇవే బిగించాం!
Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
బ్రదర్ కేటీఆర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: వైఎస్ జగన్
సూర్యవంశీపై గిల్ కామెంట్స్.. జడేజా కౌంటర్
13ఏళ్లకే హీరో, 15ఏళ్లకే టాలీవుడ్ స్టార్..ఒక్క యాక్సిడెంట్‌తో తెరమరుగు..
భారత్‌తో జాగ్రత్త.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హెచ్చరిక
నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..
నచ్చిన వారితో శృంగారం.. అజిత్‌పై నటి 'హీరా' సెన్సేషనల్ కామెంట్
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
కొత్త రేషన్ కార్డు దేవుడెరుగు..!
బాలకృష్ణ విలన్‌ను ఎంపిక చేసుకున్న పూరీ జగన్నాథ్
ఆర్మూరు–జగిత్యాల హైవేకు ఓకే
RR VS GT: ఇది నా కల.. నాకు భయం లేదు: వైభవ్ సూర్యవంశీ
3 నిమిషాలకో మరణం
'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్
మూడో పంటగా సౌర విద్యుత్తు!
వామ్మో.. ఇదేం ట్రాఫిక్!
మహాభారతంలో నాని.. కన్ఫార్మ్ చేసిన రాజమౌళి
జాబ్ చేస్తానంటే ఇంట్లోకి రమ్మంటారు.. బాధ చెప్పుకున్న దీపిక
యాహూ! ఎట్టకేలకు భారతీయురాలిగా..! వీడియో వైరల్
భారత్‌తో యుద్ధ భయం.. పాక్ సైన్యంలో భారీ రాజీనామాలు
తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!
బంగారం భారీగా పడిపోతుంది!
‘లోకేష్ అన్యాయం చేశారు మీరైనా..’ పట్టించుకోని పవన్!
ఏపీ రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారు
ఇల్లు తుడిచిన హీరో.. ఎవరో తెలుసా?
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
వాడికి ఏడాదిన్నర వయసు.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
మహేశ్ బాబు నయా లుక్.. ఎప్పుడు లేనంతగా
పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి వరదలోచ్చిస్తున్నాయ్స్సార్.. ఎవరైనా కాపాడండి!
కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి..?
IPL 2025: ఒక్క విజయం.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ
IPL 2025: విధ్వంసంలో వైభవం
శ్రీకృష్ణ లీలలు
అయ్యో దేవుడా..ఏమిటీ ఘోరం
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
నాటి రైతు బిడ్డ... నేడు ఐపీఎల్ హీరో
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
RR VS GT: వైభవ్ సృష్టించిన బీభత్సం మాటల్లో వర్ణించలేనిది: రాజస్థాన్ కెప్టెన్
RR VS GT: ఓ పక్క వైభవ్ విధ్వంసకాండ కొనసాగుతుండగా, జైస్వాల్ రికార్డుల్లోకెక్కాడు
ముక్కోణపు వన్డే సిరీస్.. టీమిండియా భారీ స్కోర్
కొత్త కార్డులు 1,017
ముష్కర మూకలకు ముచ్చెమటలు
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్
స్తంభించిన విద్యుత్.. మూడు దేశాలు అతలాకుతలం
ఇంట్లో పాముల కలకలం
వాళ్ల గురించి ఇలా మాట్లాడకండి.. నాకు బాధేస్తోంది: కోటి
IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్యవంశీ.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
నిరంతర ‘కోత’లు!.. అల్లాడుతున్న ప్రజలు
మార్చి రిపోర్ట్: నిండా మునిగిన నిర్మాతలు.. 15 సినిమాల్లో ఒక్కటే హిట్టు!
‘పెగాసస్’పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
ఈవారం థియేటర్లో పెద్ద సినిమాలు.. ఓటీటీలో 20 చిత్రాలు
తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరు
‘ఛీ’నా రాజకీయం...
బ్యాంకులో క్యాష్ వేస్తున్నారా..? జాగ్రత్త!!
బాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు : వైఎస్ జగన్
వివాహేతర సంబంధం.. శైలజ నుంచి ఫోన్ వచ్చిందని..!
పాకిస్తాన్‌ను వదిలే ప్రసక్తే లేదు.. ఐరాసలో భారత్ హెచ్చరిక
జిమ్ చేస్తూ గాయపడ్డ కేటీఆర్
మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని భావన యాదవ్
'డ్రాగన్'తో హిట్.. క్రేజీ ఛాన్స్ కొట్టేసిన కాయదు
అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్
టీడీపీ నాయకుడి దురాగతం.. ఆస్తి కోసం అక్క, తల్లిపై దాడి
మనవడితో 50 ఏళ్ల మహిళ పెళ్లి : ఫ్యామిలీని లేపేసేందుకు కుట్ర?
ఇలా ఒక్కరినే టార్గెట్ చేయడం సరికాదు: రిషభ్ పంత్ అసహనం!
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
పాక్ నడ్డి విరిగేలా..
అక్షయ తృతీయ రోజు బంగారు నగలే కొనాలా?
సెట్ చేయడానికే ఏడాది: సీఎం రేవంత్
నా పరిస్థితి నా కూతురికి రాకూడదు: ఊర్వశి
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
75 ఏళ్లుగా చెక్కుచెదరని పెంకుటిల్లు..!
ట్రంప్ కోరుకునేది ఎన్నటికీ జరగదు.. విక్టరీ స్పీచ్‌లో మార్క్ కార్నీ
సమంత కాదు మాతాజీ.. ప్రియుడితో యానిమల్ బ్యూటీ!
పాక్ పాచికల్ని పారనీయొద్దు!
ఏపీలో సమంత టెంపుల్.. ఇప్పుడు మరో విగ్రహం
కెనడా ఎన్నికలు.. ఆధిక్యంలో లిబరల్ పార్టీ
ఎంత పనైపాయే..! పిల్లిలా కనిపించాలని సర్జరీ చేయించుకుంటే చివరికి..
IPL 2025: ‘పంజాబ్ ఈసారీ టైటిల్ గెలవదు.. ఎందుకంటే?!’
డిప్యూటీ కలెక్టర్‌ని.. టీడీపీ కోసం ఎంతో చేశా
IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. తొలి భారత ప్లేయర్‌గా
రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు
కెనడాలో భారతీయ విద్యార్థిని అదృశ్యం విషాదాంతం
ఈ ఐపీఎల్ సీజన్లో సెంచరీలు చేసిన నలుగురిలో ఓ 'కామన్ పాయింట్' ఉంది.. అదేంటి..?
ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
సినిమా

రాజకీయాల్లో ఎంట్రీపై హీరోయిన్‌కు ప్రశ్న.. నెటిజన్‌కు క్షమాపణలు చెప్పిన బ్యూటీ!
బాలీవుడ్ భామ ప్రీతి జింటా ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్నారు. పంజాబ్ కింగ్స్ యజమానిగా ఉన్న ప్రీతి బాలీవుడ్లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగులోనూ వెంకటేశ్ సరసన ప్రేమంటే ఇదేరా మూవీలో మెప్పించింది. ప్రస్తుతం లాహోర్1947 అనే మూవీతో బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తోంది.అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే ప్రీతి జింటా తాజాగా ఎక్స్‌తో అభిమానులతో ఓ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ఆసక్తికర ప్రశ్న వేశారు. మీరు బీజేపీలో చేరుతున్నారా? అంటూ ప్రీతి జింటాను ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నకు ఆమె కాస్తా ఘాటుగానే స్పందించారు. దీంతో ప్రీతిపై పలువురు నెటిజన్స్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు అతనికి క్షమాపణలు చెప్పింది. ఇంతకీ ప్రీతి జింటా ఏమని సమాధానం ఇచ్చిందో తెలుసుకుందాం.ప్రీతి జింటా మాట్లాడుతూ.. 'నా సమాధానం మీకు కఠినంగా అనిపిస్తే నన్ను క్షమించండి. సోషల్ మీడియాతో వచ్చే ఇబ్బంది ఇదే. ప్రతి ఒక్కరూ మనల్ని జడ్జ్ చేస్తారు. నేను దేవాలయాలకు, కుంభమేళాలకు వెళ్తే భాజపాలో చేరతానని కాదు. విదేశాల్లో ఉన్న సమయంలో దేశం విలువ ఏంటో నాకు తెలిసింది. అందరి కంటే నేను ఇప్పుడు భారత్‌ను, భారతీయ సంస్కృతిని ఎక్కువగా గౌరవిస్తున్నా. విదేశాల్లో నివసించినా కూడా నా పిల్లలు సగం భారతీయులేనని మర్చిపోకుండా పెంచుతున్నా. అంతేకాదు మా పిల్లలను హిందువులుగానే పెంచుతున్నా. దురదృష్టవశాత్తూ నాపై విమర్శలు వస్తున్నాయి. నేను ఎవరో.. నా పిల్లలకు వారి మూలాలు, మతం గురించి బోధిస్తున్నందుకు గర్వపడుతున్నా' అని అన్నారు. అయితే ఇంత ఈ చిన్న ప్రశ్నకు ఇంతలా స్పందించాలా అంటూ కొందరు నెటిజన్స్ ప్రీతి జింటాను విమర్శిస్తున్నారు. I’m sorry if I sounded abrupt ! I have PTSD from this question. Appreciate your clarification 🙏After becoming a mom & living in a foreign country I wanna make sure my kids don’t forgot they are half Indian. Since my husband is agnostic we are bringing up our kids as Hindus.… https://t.co/ce0pHFKj8H— Preity G Zinta (@realpreityzinta) April 28, 2025

అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్
నాగిని పాత్రలో నటించి యమ క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ మౌనీ రాయ్. తొలుత టీవీ సీరియల్స్ చేసినప్పటికీ.. ప్రస్తుతం సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటోంది. ఈమె చేసిన లేటెస్ట్ మూవీ 'భూత్ని'. మే 1న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉన్న మౌనీ.. తనకెదురైన భయంకరమైన అనుభవాన్ని బయటపెట్టింది.'సరిగా గుర్తులేదు. ఓసారి ఒక ఊరికి వెళ్లాం. ఎవరో వ్యక్తి నా హోటల్ రూం తాళం దొంగింలించాడు. అర్థరాత్రి తాళం ఉపయోగించి నా రూంలోకి రావాలని తెగ ప్రయత్నించాడు. అదే టైంలో నా మేనేజర్ తో కలిసి నేను గదిలోనే ఉన్నాను. తొలుత షాకయ్యాం గానీ తర్వాత గట్టిగా అరిచాం'(ఇదీ చదవండి: యువ నటి ఇంట్లో భారీ దొంగతనం) 'ఈ సంఘటన గురించి హోటల్ రిసెప్షనిస్ట్ ని అడిగితే.. హౌస్ కీపింగ్ వాళ్లు అయ్యింటారని సమాధానమిచ్చారు. అర్థరాత్రి 12:30 గంటలకు హౌస్ కీపింగ్ ఏంటి? అని గట్టిగా అడిగా. అదే చాలా భయంకరమైన అనుభవం' అని మౌనీ రాయ్ చెప్పుకొచ్చింది.మౌనీ రాయ్ వ్యక్తిగత విషయానికొస్తే.. 2022లో సూరజ్ నంబియార్ అనే కేరళకు చెందిన బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ ని అలరిస్తూ ఉంటుంది.(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్)

యువ నటి ఇంట్లో భారీ దొంగతనం
ప్రమఖ నటి నేహా మాలిక్ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. దాదాపు రూ.34 లక్షలు విలువ చేసే నగలు మాయమయ్యాయని సదరు నటి, ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తన పనిమనిషి ఈ పని చేసి ఉంటుందని ఫిర్యాదులో పేర్కొంది.(ఇదీ చదవండి: కుర్రాళ్ల సినిమా.. మనోళ్లకు ఎక్కేసింది!) ఎఫ్ఐఆర్ ప్రకారం.. నేహా మాలిక్ తల్లి మంజు పలు వేడుకలకు నగలు ధరించుకుని వెళ్లేది. తర్వాత తన రూంలోని చెక్క డ్రాయర్ లో వాటిని పెట్టేది. నేహా ఇంటి పనిమనిషి షహనాజ్ ముస్తాఫా ముందే చాలాసార్లు మంజు నగలు మార్చుకునేది. ఏప్రిల్ 25న ఉదయం నేహా మాలిక్ షూటింగ్ కి వెళ్లిపోగా.. ఈమె తల్లి మంజు గురుద్వార వెళ్లింది. దీంతో ఇంటిని శుభ్రం చేసేందుకు వచ్చిన పనిమనిషి తన దగ్గరున్న తాళంతో ఇంటిని క్లీన్ చేసి వెళ్లిపోయింది. తర్వాత రోజు పనికిరాలేదు. ఈ క్రమంలోనే నేహా మాలిక్ ఇంట్లో ఓసారి వెతకగా నగలు కనిపించలేదు. వీటి విలువ దాదాపు రూ.34 లక్షలకు పైనే.(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్) దీంతో నేహా మాలిక్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పని మనిషిపై అనుమానం వ్యక్తం చేసింది. అందుకు తగ్గట్లే దర్యాప్తు చేసిన పోలీసులు సదరు పనిమనిషిని అరెస్ట్ కూడా చేశారు.నేహా మాలిక్ విషయానికొస్తే.. 2012 నుంచి ఇండస్ట్రీలో ఉంది. గాంధీ ఫేర్ ఆగయా, ముసాఫిర్ 2020, పింకీ మోగే వాలి 2 తదితర చిత్రాల్లో నటించింది. ఇన్ స్టాలో మాత్రం ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలు పెడుతూ హల్ చల్ చేస్తూ ఉంటుంది.(ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా)

అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఎన్టీఆర్
ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా (#NTRNEEL) నుంచి కీలకమైన అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా ఎన్టీఆర్ ప్రకటించారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) మూవీని అత్యంత భారీ బడ్జెట్‌తో పీరియాడికల్ స్టోరీతో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది . ఇందులో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఏప్రిల్ 22 నుంచి షూటింగ్లో ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘దేవర’ తర్వాత ఎన్టీఆర్.. ‘సలార్’ తర్వాత ప్రశాంత్ నీల్ ఇలా ఇద్దరూ తెలుగులో కలిసి చేస్తున్న చిత్రమిదే కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.అభిమానులకు ఎన్టీఆర్ శుభవార్త చెప్పారు. (#NTRNEEL) చిత్రాన్ని 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా మే 20న ఈ మూవీ నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇద్దరు డైనమిక్ వ్యక్తుల కాంబినేషన్‌తో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద విధ్వంసమే జరగనుంది. ఆ అనుభూతి పొందేందుకు సిద్ధకండి అంటూ మైత్రీ మూవీ మేకర్స్ పేర్కొంది. వచ్చే సమ్మర్లో బాక్సాఫీస్ వద్ద ఫుల్ సందడి వాతావరణం కనిపించడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. ప్రస్తుతం కర్ణాటకలో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది.మొదట వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే, కథ వల్ల వీఎఫ్ఎక్స్ పనులతో పాటు చిత్రీకరణ విషయంలోనూ మరింత స్ట్రాంగ్‌గా ప్లాన్ చేయడం వల్లే కాస్త ఎక్కువ సమయం పడుతుందని తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు కూడా మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే.. తారక్ నటిస్తోన్న 31వ చిత్రమిది. షూటింగ్లో భాగంగా కొద్దిరోజుల క్రితమే రామోజీ ఫిల్మ్ సిటీలో ఓల్డ్ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఓ ప్రత్యేక సెట్‌ను సిద్ధం చేసి అక్కడ కొన్ని సీన్స్ చిత్రీకరించారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పనులు కూడా పూర్తి అయ్యాయి. అయితే, ఎన్టీఆర్‌తో తెరకెక్కించబోయే సీన్లు మాత్రం కాస్త ఆలస్యంగా ప్రారంభించారు. శ్రీలంకలోని కొలంబోలో కూడా ఎన్టీఆర్‌తో షూటింగ్ షెడ్యూల్స్ ఉన్నాయి. ఆల్రెడీ యూనిట్‌లోని కీలక సాంకేతిక నిపుణులు కొలంబో వెళ్లి, అక్కడి లొకేషన్స్‌ను ఫైనల్ చేశారని తెలిసింది. See you in cinemas on 25 June 2026…. #NTRNeel pic.twitter.com/SkMhyaF71c— Jr NTR (@tarak9999) April 29, 2025
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

ముక్కోణపు వన్డే సిరీస్.. టీమిండియా భారీ స్కోర్
శ్రీలంకతో జరుగుతున్న మహిళల ముక్కోణపు వన్డే సిరీస్-2025లో భారత్ ఇవాళ (ఏప్రిల్ 29) సౌతాఫ్రికాతో తలపడుతుంది (కొలొంబో వేదికగా). ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ప్రతిక రావల్ (78) అర్ద సెంచరీతో.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (41), జెమీమా రోడ్రిగెజ్ (41), స్మృతి మంధన (36), హర్లీన్ డియోల్ (29), రిచా ఘోష్ (24) ఓ మోస్తరు స్కోర్లతో రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో దీప్తి శర్మ (9) ఒక్కరే సింగిల్ డిజిట్ స్కోర్‌కు ఔట్ కాగా.. కశ్వీ గౌతమ్ 5 పరుగులతో అజేయంగా నిలిచింది. సౌతాఫ్రికా బౌలర్లలో మ్లాబా 2, ఖాకాచ, క్లాస్, డి క్లెర్క్, డెర్క్సెన్ తలో వికెట్ పడగొట్టారు.కాగా, ఈ ట్రై నేషన్ సిరీస్‌లో భారత్, సౌతాఫ్రికాతో పాటు శ్రీలంకు కూడా పాల్గొంటుంది. ఈ టోర్నీ ఏప్రిల్ 27న ప్రారంభం కాగా.. తొలి మ్యాచ్‌లో భారత్, శ్రీలంక తలపడ్డాయి. వర్షం కారణంగా 39 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను భారత బౌలర్లు 147 పరుగులకే ఆలౌట్ (38.1 ఓవర్లలో) చేశారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా 3, నల్లపురెడ్డి చరణి, దీప్తి శర్మ తలో 2, అరుంధతి రెడ్డి ఓ వికెట్ పడగొట్టారు. శ్రీలంక ఇన్నింగ్స్‌లో హాసిని పెరీరా (30) టాప్ స్కోరర్‌గా నిలిచింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. 29.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఆ మ్యాచ్‌లో కూడా ప్రతిక రావల్ (50 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించింది. స్మృతి మంధన 43, హర్లీన్ డియోల్ 48 (నాటౌట్) పరుగులతో సత్తా చాటారు. ఈ టోర్నీలో భారత్ సౌతాఫ్రికా, శ్రీలంకతో మరో మ్యాచ్ ఆడుతుంది. అన్ని మ్యాచ్‌ల తర్వాత మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు మే 11న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.

ఇంకెంత దిగజారుతారు.. కార్గిల్‌లో ఓడించినా బుద్ధి రాలేదా.. అఫ్రిది వ్యాఖ్యలకు ధవన్ కౌంటర్
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఇండియన్ ఆర్మీపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిది అఫ్రిది చేసిన అనుచిత వ్యాఖ్యలకు టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ గట్టి కౌంటరిచ్చాడు. అఫ్రిదిని ట్యాగ్ చేస్తూ తన ఎక్స్ ఖాతాలో ఇలా రాసుకొచ్చాడు. కార్గిల్‌లో ఓడించినా ఇంకా బుద్ధి రాలేదా..? ఇప్పటికే చాలా దిగజారారు. ఇంకెంత దిగజారుతారు. ఇలాంటి అర్ధరహిత వ్యాఖ్యలు చేసే బదులు మీ దేశ అభివృద్ధిపై దృష్టి పెట్టండి. మాకు ఇండియన్ ఆర్మీ పట్ల చాలా గర్వంగా ఉంది. భారత్ మాతా కి జై. జై హింద్ అంటూ ట్వీట్ చేశాడు. Kargil mein bhi haraya tha, already itna gire hue ho aur kitna giroge, bewajah comments pass karne se acha hai apne desh ki taraqqi mai dimag lagao @SAfridiOfficial. Humein hamari Indian Army par bohot garv hai. Bharat Mata Ki Jai! Jai Hind!https://t.co/5PVA34CNSe— Shikhar Dhawan (@SDhawan25) April 28, 2025అఫ్రిదికి చురకలంటిస్తూ ధవన్ చేసిన ఈ ట్వీట్ సోషల్‌మీడియాలో వైరలవుతుంది. పాకీలకు ఈసారి మాటలతో బుద్ధి చెప్పినా ఉపయోగం లేదు. వారి అంతు చూడాల్సిందే అంటూ చాలా మంది భారతీయులు ధవన్ ట్వీట్‌కు రీట్వీట్ చేస్తున్నారు. ఇంకొంతమంది అఫ్రిది వ్యాఖ్యలపై ధవన్ స్పందించిన వైనాన్ని మెచ్చుకుంటున్నారు.కాగా, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అఫ్రిది ఓ టెలివిజన్ కార్యక్రమంలో మాట్లాడుతూ భారత ఆర్మీని కించపరిచే వ్యాఖ్యలు చేశాడు. భారత సైన్యం వైఫల్యం కారణంగానే పహల్గామ్ ఉగ్రదాడి జరిగిందని అన్నాడు. కశ్మీర్లో 8 లక్షల మందితో కూడిన పటిష్టమైన సైన్యం ఉన్నప్పుడు ఈ దాడి ఎలా జరిగిందని ప్రశ్నించాడు. దీని అర్థం మీరంతా పనికిరాని వాళ్లనేగా అంటూ భారత సైన్యంపై అవాక్కులు చవాక్కులు పేలాడు.తమ సైన్యం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు భారత్ పాకిస్తాన్‌పై నిందలు వేస్తోందని ఆరోపించాడు. భారత్‌లో చిన్న టపాసు పేలినా పాక్‌ను నిందించడం పరిపాటిగా మారిందని విమర్శించాడు. దమ్ముంటే ఈ దాడిలో పాక్ ప్రమేయాన్నిఆధారాల సహా నిరూపించాలని సవాల్ విసిరాడు.అఫ్రిది చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపాయి. అఫ్రిదిపై చాలామంది భారతీయులు సోషల్‌మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. భారత సైన్యంపై నోరు పారేసుకున్న ఆఫ్రిదిపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తనదైన స్టయిల్లో కౌంటరిచ్చాడు. అఫ్రిది ఓ జోకర్, పనికిరాని వాడంటూ విమర్శించారు. పనికిరాని వాళ్ల వ్యాఖ్యలపై స్పందించడం అనవసరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో గల ప్రశాంత బైసరన్ లోయలో పాక్ ఉగ్రమూకలు కాల్పులకు తెగబడి 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారు. ఈ ఉగ్రదాడిని యావత్ ప్రపంచం ఖండించింది. ఈ దాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు తగు రీతిలో బుద్ధి చెబుతుంది. సింధు జలాల ఒప్పందం సహా చాలా విషయాల్లో పాక్‌ను కోలుకోలేని దెబ్బలు కొట్టింది. ఆ దేశ ట్విటర్, సినిమాలపై నిషేధం విధించింది. తాజాగా పాక్‌కు చెందిన 16 యూట్యూబ్ చానెళ్లను, ఆ దేశ జర్నలిస్ట్‌లను కూడా బ్యాన్ చేసింది.

RR VS GT: ఇది నా కల.. నాకు భయం లేదు: వైభవ్ సూర్యవంశీ
ఐపీఎల్ 2025లో నిన్న (ఏప్రిల్ 28) గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకంతో (35 బంతుల్లో) విరుచుకుపడ్డాడు. ఈ సెంచరీతో (38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు) వైభవ్ చాలా రికార్డులు కొల్లగొట్టాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ విధ్వంసకాండ దెబ్బకు రాయల్స్ 15.5 ఓవర్లలోనే గుజరాత్ నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి అద్భుత విజయం సాధించింది.వైభవ్ సాధించిన రికార్డులు..ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ఆటగాడు (35 బంతుల్లో)ఐపీఎల్లో సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడు (క్రిస్ గేల్ (30 బంతుల్లో) తర్వాత)ఐపీఎల్లో సెంచరీ, హాఫ్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడు (14 ఏళ్ల 32 రోజులు)ఐపీఎల్లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (11) కొట్టిన ఆటగాడు (మురళీ విజయ్‌తో కలిసి)టీ20 క్రికెట్ చరిత్రలో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడు (14 ఏళ్ల 32 రోజులు)ఐపీఎల్లో హాఫ్ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడు (14 ఏళ్ల 32 రోజులు)ఐపీఎల్ 2025లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (17 బంతుల్లో)ఐపీఎల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న అతి పిన్న వయస్కుడుమ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. శుభ్‌మన్ గిల్ (50 బంతుల్లో 84; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), జోస్ బట్లర్ (26 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), సాయి సుదర్శన్ (30 బంతుల్లో 39; 4 ఫోర్లు, సిక్స్) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. వైభవ్ రికార్డు సెంచరీతో (38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు) చెలరేగడంతో మరో 25 మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. రాయల్స్ గెలుపులో వైభవ్‌తో పాటు మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (40 బంతుల్లో 70 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా కీలకపాత్ర పోషించాడు. ఆఖర్లో రియాన్ పరాగ్ (15 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు.మ్యాచ్ అనంతరం వైభవ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఇది చాలా మంచి అనుభూతి. ఐపీఎల్లో సెంచరీ సాధించాలనేది నా కల. దీన్ని నా మూడో మ్యాచ్‌లోనే సాకారం చేసుకున్నాను. సీజన్ ప్రారంభానికి ముందు చేసిన కఠోర సాధనకు ఈ మ్యాచ్‌లో ఫలితం పొందాను. నేను బంతిని బాగా గమనించి ఆడతాను. నాకు భయం లేదు. నేను పెద్దగా ఆలోచించను. కేవలం ఆడటంపైనే దృష్టి పెడతాను. జైస్వాల్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా బాగుంది. అతను నాకు ప్రతి విషయంలో గైడ్ చేస్తాడు. ఏమి చేయాలో, ఎలా ఆడాలో చెబుతాడు. నాలో సానుకూల విషయాలను నింపుతాడు.కాగా, రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం వైభవ్‌ను ఎంతో నిశితంగా పరిశీలించి, ఈ సీజన్ మెగా వేలంలో రూ. 1.1 కోట్లకు కొనుక్కుంది. ఊహించినట్లుగానే వైభవ్ తొలి మ్యాచ్‌లోనే (లక్నోతో) విధ్వంకర ఇన్నింగ్స్ (20 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆడి ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో వైభవ్ తొలి బంతికే సిక్సర్ బాది అందరినీ ఆశ్యర్యపరిచాడు. ఆతర్వాతి మ్యాచ్‌లో (ఆర్సీబీ) కాస్త నిరాశపరిచినా (12 బంతుల్లో 16; 2 సిక్సర్లు).. కెరీర్లో మూడో మ్యాచ్‌లోనే విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు.

RR VS GT: వైభవ్ సృష్టించిన బీభత్సం మాటల్లో వర్ణించలేనిది: రాజస్థాన్ కెప్టెన్
ఐపీఎల్ 2025లో నిన్న (ఏప్రిల్ 28) గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకంతో (35 బంతుల్లో) విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ సెంచరీతో వైభవ్ చాలా రికార్డులను కొల్లగొట్టాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ విధ్వంసకాండ దెబ్బకు రాయల్స్ 15.5 ఓవర్లలోనే గుజరాత్ నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి అద్భుత విజయం సాధించింది. రాయల్స్ గెలుపులో వైభవ్‌లో పాటు (38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు) మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (40 బంతుల్లో 70 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా కీలకపాత్ర పోషించాడు. ఆఖర్లో రియాన్ పరాగ్ (15 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు.అంతకుముందు శుభ్‌మన్ గిల్ (50 బంతుల్లో 84; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), జోస్ బట్లర్ (26 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), సాయి సుదర్శన్ (30 బంతుల్లో 39; 4 ఫోర్లు, సిక్స్) సత్తా చాటడంతో గుజరాత్ 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.ఈ మ్యాచ్‌లో వైభవ్ సృష్టించిన బీభత్సం పొట్టి క్రికెట్ బ్రతికున్నంతవరకు గుర్తుంటుంది. వైభవ్ కేవలం 14 ఏళ్ల 32 రోజుల వయసులో ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొంటూ చేసిన విలయ తాండవాన్ని క్రికెట్ అభిమానులు ఎన్నటికి మర్చిపోరు. ఈ ఇన్నింగ్స్ తర్వాత వైభవ్‌పై యావత్ క్రికెట్ ప్రపంచం ప్రశంసల వర్షం కురిపిస్తుంది. పాల బుగ్గల కుర్రాడు ఇలాంటి విలయాన్ని సృష్టించడమేంటని జనాలు ఆశ్చర్యపోతున్నారు.నిన్నటి మ్యాచ్ తర్వాత అందరి లాగే రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా వైభవ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. పరాగ్ మాటల్లో.. ఇది చాలా అద్భుతంగా ఉంది. మేము వైభవ్‌తో 2 నెలలు గడిపాము. అతను ఏమి చేయగలడో చూశాము. మాకందరికీ తెలుసు వైభవ్ నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ వస్తుందని. ప్రపంచ స్థాయి బౌలర్లైన గుజరాత్ బౌలర్లపై వైభవ్ సృష్టించిన బీభత్సకాండను మాటల్లో వర్ణించలేను.గత మూడు మ్యాచ్‌ల్లో స్వయంకృతాపరాధాల చేత చివరి నిమిషంలో మ్యాచ్‌లు కోల్పోయాము. ఈ మ్యాచ్‌లో అలా జరగకూడదనే మా ఆటతీరును మార్చాము. వీలైనంత త్వరగా మ్యాచ్‌ను ముగించాలని అనుకున్నాము. ఈ ఫలితం కోసం మేము చాలా కష్టపడ్డాము. మా ప్రణాళికలను విజయవంతంగా అమలు చేయగలిగాము. ఐపీఎల్లో ప్రతి రోజు ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ఈ సీజన్లో ఆర్సీబీ ప్రయాణం. సూర్య భాయ్ ఆటతీరు. ఇలా చాలా విషయాలను గమనిస్తున్నాము. ఈ విజయం చాలా పెద్దది. ఇలాంటి విజయాల కోసమే మేము అన్వేషిస్తున్నాము. ఈ విజయం ఏకపక్షంగా వచ్చింది. ఇది చాలా సంతోషాన్నిస్తుంది. తదుపరి మ్యాచ్‌లో ఎలాంటి వికెట్ లభిస్తుందో చూడాలి.
బిజినెస్

మొక్కుబడిగా ఏసీ కొనవద్దు..
భానుడి ప్రకోపం మరింత ముదురుతోంది. ఈ ఏడాది భారీగానే వేసవి తాపం ఉంటుందని కొన్ని సంస్థలు ఇప్పటికే అంచనా వేశాయి. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరగనున్నాయి. ఇంట్లో తీవ్ర ఉక్కపోత మొదలైంది. ఫ్యానులు, కూలర్లు ఉన్నా గది అంతా చల్లదనం రాక ఇబ్బందులు పడుతున్నారు. దాంతో చాలా మంది ఏసీలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి సంస్థల నుంచి, రిటైల్ స్టోర్‌ల్లో వీటి అమ్మకాలు ఇప్పటికే ఊపందుకున్నాయి. అయితే వాటిని కొనుగోలు చేసేపుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ఐసెర్ రేటింగ్సరైన అవగాహన లేక కొందరు పెద్ద గదులకు తక్కువ సామర్థ్యం ఉన్న ఏసీలు కొనుగోలు చేస్తారు. 110 చదరపు అడుగులు పరిమాణంలో గది ఉంటే 1 టన్ను, 110-150 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన గదికి 1.5 టన్నులు, 150-190 చదరపు అడుగుల గదికి 2 టన్నుల సామర్థ్యమున్న ఏసీని ఎంచుకోవాలి. ఏసీ కొనుగోలు చేసేటప్పుడు ముఖ్యంగా ఐసెర్ (ఐఎస్‌ఈఈఆర్) రేటింగ్ చూడాలి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ ప్రమాణాల ప్రకారం ప్రతి రెండు సంవత్సరాలకు ఐసెర్ రేటింగ్ మారుతుంది. ప్రస్తుతం ఐసెర్ రేట్ 5 అంత కంటే ఎక్కువ ఉంటే ఫైవ్ స్టార్ ఉంటుంది. రేటింగ్ 4.4- 4.99 మధ్య ఉంటే ఫోర్ స్టార్ రేటింగ్ ఉంటుంది. రేటింగ్‌లో తేడా వల్ల విద్యుత్తు వినియోగంలో మార్పు ఉంటుందని గమనించాలి.ఇన్వర్టర్తో మేలుచాలా ఇళ్లల్లో నిత్యం ఏసీని ఉపయోగించే వారు ఇన్వర్టర్తో కూడిన ఏసీ కొనుగోలు చేసుకోవాలి. ఇది విద్యుత్తును పొదుపు చేస్తుంది. మోటారు వేగాన్ని నియంత్రిస్తూ గది ఉష్ణోగ్రతను సర్దుబాటు చేస్తుంది. నాన్ ఇన్వర్టర్ ఏసీల్లో ఈ వెసులుబాటు ఉండదు. కేవలం ఆన్, ఆఫ్ మాత్రమే ఉంటాయి. కేవలం వేసవిలో మాత్రమే రోజుకు మూడు నుంచి నాలుగు గంటలు ఉపయోగించేవారు నాన్ ఇన్వర్టర్ ఏసీ కొనుక్కోవచ్చు. మార్కెట్లో చాలా వరకు కన్వర్ట్‌బుల్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. చిన్న గదిలో 1.5 టన్నుల సామర్థ్యం కలిగిన వాటిని ఏర్పాటు చేసినా.. అవసరం మేరకు 1 టన్ను, 0.8 టన్ను ఇలా సమర్థ్యాన్ని మార్చుకోవచ్చు. సామర్థ్యం తగ్గించడం వల్ల ఫ్యాన్ వేగం తగ్గి విద్యుత్తు పొదుపు అవుతుంది.ఇదీ చదవండి: అక్షయ తృతీయ రోజు బంగారు నగలే కొనాలా?ధరల మధ్య వ్యత్యాసంఏసీ కొనుగోలు చేసేప్పుడే తప్పకుండా స్టెబిలైజర్ కొనాలి. వోల్టేజ్ హెచ్చుతగ్గుల పరిధి దాటినప్పుడు స్టెబిలైజర్ లేకుంటే ఏసీ పాడవుతుంది. వోల్టేజ్ హెచ్చుతగ్గుల వల్ల పాడైతే వారంటీ ఉండదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. చాలా కంపెనీలు స్మార్ట్ ఏసీలను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. వాటిని యాప్‌ల ద్వారానూ నిర్వహించవచ్చు. ఏసీ కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా వారంటీ చూసుకోవాలి. ఈ-కామర్స్ సంస్థల మధ్య ధరల విషయంలో తేడాలు ఉంటాయి. ఆఫర్లు ఉంటే గమనించాలి. కొన్ని సందర్భాల్లో ఈ-కామర్స్ సంస్థల కంటే కంపెనీల డీలర్ల వద్ద కూడా తక్కువ ధరకు లభిస్తాయి.

అక్షయ తృతీయ రోజు బంగారు నగలే కొనాలా?
భారత్‌లో బంగరానికి ఉన్న విలువ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. తరాలుగా పసిడి సంపదకు గుర్తుగా ఉంటోంది. సంపద ఉంటే ఆర్థిక ఇబ్బందులు దరిచేరకుండా హ్యాపీగా ఉండవచ్చు. కాబట్టి ఏటా అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు చేయాలని చాలామంది భావిస్తారు. ఆరోజు పసిడి కొంటే ఆ ఏడాదంతా సంపద సొంతం అవుతుందని అనుకుంటారు. రేపు అక్షయ తృతీయ సందర్భంగా సాధారణంగా బంగారం షాపులు కిక్కిరిసిపోతాయి. అయితే బంగారాన్ని కేవలం నగల రూపంలోనే కొనుగోలు చేయాలని చాలామంది అనుకుంటారు. కానీ మార్కెట్లో వివిధ మార్గాల ద్వారా కూడా బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETF)ఫిజికల్ గోల్డ్ సొంతం చేసుకోవాలనే ఇబ్బంది లేకుండా బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) మంచి ఎంపిక. గోల్డ్ ఈటీఎఫ్‌లు ఫిజికల్ గోల్డ్ ధరను ట్రాక్ చేసే ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. షేర్ల మాదిరిగానే వీటిని స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడ్ చేస్తారు. గోల్డ్ ఈటీఎఫ్ ప్రతి యూనిట్ సాధారణంగా ఒక గ్రాము బంగారం లేదా దానిలో కొంత భాగాన్ని సూచిస్తుంది. వీటివల్ల కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో సులభంగా కొనడం, విక్రయించడం చేయవచ్చు. ఫిజికల్ గోల్డ్ మాదిరిగా కాకుండా మేకింగ్ ఛార్జీలు లేదా నిల్వ ఖర్చులు ఉండవు. ధరలు నేరుగా బంగారం రేట్లతో ముడిపడి ఉంటాయి. ద్రవ్యోల్బణం, మార్కెట్ అస్థిరతకు వ్యతిరేకంగా పెట్టుబడికి రక్షణ కవచంగా పనిచేస్తుంది. గోల్డ్ ఈటీఎఫ్‌లను ట్రేడ్ చేయడానికి డీమ్యాట్ ఖాతా అవసరం ఉంటుంది. మార్కెట్లో చాలా స్టాక్ బ్రోకింగ్ కంపెనీల నుంచి ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు.డిజిటల్ గోల్డ్ (Digital Gold)డిజిటల్ గోల్డ్ అనేది భౌతికంగా బంగారాన్ని సొంతం చేసుకోకుండా అందులో పెట్టుబడి పెట్టడానికి ఒక ఆధునిక మార్గం. ఇది ఆన్లైన్లో బంగారాన్ని కొనడానికి, విక్రయించడానికి, నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు కొనుగోలు చేసే బంగారానికి సురక్షితమైన వాల్ట్‌ల్లో నిల్వ చేసిన భౌతిక బంగారం మద్దతుగా నిలుస్తుంది. కనీసం రూ.10 నుంచి ఎప్పుడైనా, ఎక్కడైనా బంగారంపై ఇన్వెస్ట్ చేయవచ్చు. 24 క్యారెట్ల బంగారం నాణ్యతకు సర్టిఫికేట్ ఇస్తారు. ఈ డిజిటల్ గోల్ట్కు బీమా చేసిన వాల్ట్‌ల ద్వారా భద్రత కల్పిస్తారు. దాంతో దొంగతనం జరుగుతుందేమోనని ఆందోళన చెందనవసరం లేదు. అవసరమైనప్పుడల్లా డిజిటల్ బంగారాన్ని ఫిజికల్ గోల్డ్ లేదా క్యాష్‌గా మార్చుకోవచ్చు. పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే వంటి ప్లాట్‌ఫామ్‌లతోపాటు ప్రముఖ బ్యాంకులు ఈ డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లను అందిస్తున్నాయి. ఎంఎంటీసీ-పీఏఎంపీ, సేఫ్గోల్డ్ ఆగ్మాంట్ గోల్డ్ లిమిటెడ్ వంటి సంస్థలు ఈ పెట్టుబడులకు మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాయి. ఫిజికల్ గోల్డ్ మాదిరిగానే డిజిటల్ గోల్డ్ కూడా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌కు లోబడి ఉంటుంది.ఇదీ చదవండి: భగ్గుమంటున్న పసిడి ధరలు! తులం ఎంతంటే..చివరగా.. అప్పు చేసి వద్దు!అక్షయ తృతీయ మంచి రోజు.. ఏది కొన్నా కలిసి వస్తుందని భావించి అప్పులు చేసి మరీ బంగారం కొనేవారూ ఉన్నారు. కానీ అప్పు చేసి కొంటే రుణాలు పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే బంగారం కొనకపోయినా పర్లేదు.. ఉన్నంతలో ఆ రోజున నలుగురికి సాయపడితే.. అంతకు మించిన పుణ్యం మరొకటి ఉండదు! అప్పు మాత్రం చేయకండి.

రేపే అక్షయ తృతీయ.. భగ్గుమంటున్న పసిడి ధరలు!
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టినట్లే పట్టి తిరిగి ఈరోజు మళ్లీ పెరిగింది. త్వరలో తులం రూ.ఒక లక్షకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో మంగళవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.89,800 (22 క్యారెట్స్), రూ.97,970 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవార ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.400, రూ.440 పెరిగింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.400, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.440 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.89,800 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.97,970 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.400 పెరిగి రూ.89,950కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.440 పెరిగి రూ.98,120 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగా కాకుండా మంగళవారం వెండి ధర(Silver Prices)ల్లో ఎలాంటి మార్పులు కనిపించలేదు. నిన్నటి ధరలతో వెండి ధర స్థిరంగా ఉంది. దాంతో కేజీ వెండి ధర రూ.1,11,000 వద్ద నిలిచింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

‘ఏటీఎంల్లో రూ.100, 200 నోట్లను పెంచండి’
ప్రజలకు రూ.100, రూ.200 నోట్లు మరింతగా అందుబాటులో ఉండేలా ఏటీఎంలలో ఆయా డినామినేషన్ నోట్ల లభ్యతను మరింతగా పెంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. దశలవారీగా ఈ ఆదేశాలను అమలు చేయాలని బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లకు ఒక సర్క్యులర్‌లో సూచించింది. 2025 సెప్టెంబర్ 30 నాటికి 75 శాతం ఏటీఎంలలో కనీసం ఒక్క క్యాసెట్(ఏటీఎంలో డబ్బు స్టోర్ చేసే కంటైనర్)లోనైనా రూ.100 లేదా రూ.200 నోట్లు ఉండేలా చూడాలని తెలిపింది. 2026 మార్చి 31 నాటికి దీన్ని 90 శాతం ఏటీఎంలకు పెంచాలని పేర్కొంది.డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న కొద్దీ ఫిజికల్ క్యాష్ వినియోగం తగ్గుతుందని కొందరు భావిస్తున్నారు. కానీ నిత్యం ఫిజికల్ క్యాష్ అవసరాలు ప్రత్యేకంగా ఉంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో డబ్బు లభ్యతకు పెద్దపీట వేయాలని ఆర్బీఐ ఇటీవల బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇటీవల ఏటీఎంల్లో నగదు లభ్యత తగ్గడానికిగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఇదీ చదవండి: ప్రముఖ ఆర్థిక సంస్థల పనితీరు ఇలా..దేశంలో ప్రధాన ఏటీఎం సర్వీస్ ప్రొవైడర్ అయిన ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ పతనం అనేక బ్యాంకులకు నగదు రీఫిల్లింగ్ సేవలకు అంతరాయం కలిగించింది. యూపీఐ వంటి డిజిటల్ చెల్లింపు పద్ధతులను ఎక్కువగా అవలంబించడం వల్ల నగదుకు డిమాండ్ తగ్గింది. ఇది బ్యాంకులు తమ ఏటీఎం నెట్‌వర్క్‌లను ఆప్టిమైజ్ చేయడానికి దారితీసింది. కొత్త ఆర్బీఐ నిబంధనలు, ఇంటర్‌ఛేంజ్ ఫీజు స్ట్రక్చర్లు ఏటీఎం మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టకుండా అడ్డుకట్ట వేస్తున్నాయి. నగదు భర్తీలో లాజిస్టిక్ సమస్యలు కూడా తాత్కాలిక కొరతకు కారణం అవుతున్నాయి.
ఫ్యామిలీ

మూడో పంటగా సౌర విద్యుత్తు!
మెట్ట భూముల్లో సోలార్ ప్యానెళ్లను నేలపైనే ఏర్పాటు చేసి సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయటం తెలిసిందే. అయితే, వ్యవసాయ భూమిని ఇలా సోలార్ ప్యానళ్ల మయం చేస్తూ పోతే సాగు విస్తీర్ణం తగ్గిపోతుందన్న భయాందోళనలు లేకపోలేదు. అందుకే, పంటలను సాగు చేస్తూ అదే పొలంలోనే సోలార్ ప్యానళ్లతో విద్యుత్తు ఉత్పత్తి చేస్తే మేలు కదా! ప్యానళ్ల ఏర్పాటులో కొన్ని మార్పులు చేసుకుంటే పొలాల్లో పంటలతో పాటు పనిలో పనిగా సౌర విద్యుత్తును కూడా నిక్షేపంగా పండించుకోవచ్చని విదేశీ అనుభవాలు చెబుతున్నాయి. వ్యవసాయ రంగంలో ఇది సరికొత్త ట్రెండ్. అదే ‘అగ్రివొల్టాయిక్స్’! ఏడాదికి రెండు (ఖరీఫ్, రబీ) పంటలతో పాటే అదే పొలంలో మూడో పంటగా సౌర విద్యుత్తు ఉత్పత్తిపై మన దేశంలోనూ ప్రయోగాలు జరుగుతున్నాయి. అనేక చోట్ల పైలట్ ప్రాజెక్టులు నడుస్తున్నాయి. ఆ సంగతులేమిటో చూద్దాం..!సోలార్ ప్యానళ్ల పక్కన పంటలునేలకు ఒకటి, రెండు అడుగుల ఎత్తులో గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ ప్యానళ్లను వరుసలుగా ఏర్పాటు చేసుకొని, ఆ వరుసల మధ్యలో ఎక్కువ దూరం ఉండేలా చూసుకొని.. ఆ ఖాళీలో పంటలను పండిస్తున్న సంస్థలు ఉన్నాయి. కేరళలోని కొచ్చిన్ విమానాశ్రయంలో, గుజరాత్‌లోని సర్దోయ్లో కూడా ఇలాంటి ప్రయోగాత్మక సోలార్‌లో అంతర సాగు జరుగుతోంది. ప్యానళ్ల వరుసల మధ్యలో గోరింటాకు మొక్కలు సాగు చేస్తున్నారు. బలమైన గాలుల నుంచి సోలార్ ప్యానళ్లను రక్షించడానికి కూడా ఈ మొక్కలు ఉపయోగంగా ఉన్నాయంటున్నారు. ప్యానళ్లను కడిగే నీటిని ఈ మొక్కలకు మళ్లిస్తూ నీటిని పునర్వినియోగిస్తున్నారు.ప్యానళ్ల నీడలో పంటలుమహారాష్ట్రలోని పర్బనిలో 5 ఎకరాల్లో ఒక మోస్తరు ఎత్తున ఏర్పాటు చేసిన సోలార్ ప్యానళ్ల కింద తక్కువ ఎత్తు పెరిగే అల్లం, పసుపు, పెసలు, బెండ వంటి పంటలు పండిస్తున్నారు. 50 మెగావాట్ల ప్రాజెక్టును సన్‌సీడ్ ఎపివి, కనొడా ఎనర్జీ, జిఐజడ్ జెర్మన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉమ్మడిగా నెలకొల్పాయి. ‘సోలార్ ప్యానళ్ల కింద మేం పెట్టిన పంటలు బాగానే పెరుగుతున్నాయి. మామూలు పొలాల్లో సమానంగానే దిగుబడి వస్తోంది. అయితే, చెరకు వంటి బాగా ఎత్తుగా పెరిగే పంటలను సోలార్ ప్యానళ్ల కింద పెంచలేం’ అన్నారు ఈ క్షేత్రాన్ని నిర్వహిస్తున్న యువ రైతు గోవింద్ రసవె.ద్రాక్ష తోట కూడా,.మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న దేశంలోనే అతి పెద్ద రైతు ఉత్పత్తిదారుల సంఘం(ఎఫ్పిఓ) సహ్యాద్రి ఫామ్స్ కూడా ప్రయోగాత్మకంగా సోలార్ సేద్యం చేస్తోంది. ఒక ఎకరంలో సోలార్ ప్యానళ్లను 3.75 మీటర్ల ఎత్తున ఏర్పాటు చేసి, వాటి నీడన రకరకాల పంటలను సాగు చేస్తోంది. 250 కె.డబ్ల్యూ. సామర్థ్యంతో కూడిన బై–ఫేసియల్ ప్యానళ్లను ఏర్పాటు చేశారు. ఈ ప్యానళ్ల కింద ద్రాక్ష తోటలు పెంచుతున్నారు. ప్రత్యేకంగా పందిళ్లు వేయాల్సిన అవసరం లేకుండా ప్యానళ్ల కోసం ఏర్పాటు చేసే ఫ్రేమ్‌లకే ద్రాక్ష తీగలను పాకించవచ్చు. కీర, టొమాటో వంటి పంటలకు కూడా ప్రత్యేకంగా స్టేకింగ్ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉండదు. ఆ ఖర్చు తగ్గుతుందని సహ్యాద్రి ఫామ్స్ ప్రోగ్రామ్ డైరెక్టర్ మహేశ్ షెల్కె చెప్పారు.బెండ, సొర, కొత్తిమీర..రాజస్థాన్‌లోని జో«ద్పుర్లో కేంద్రీయ మెట్ట ప్రాంత వ్యవసాయ పరిశోధనా సంస్థలో, గుజరాత్‌లోని జామ్‌నగర్ జిల్లాలోనూ 3 మీటర్ల ఎత్తున పెట్టిన సోలార్ ప్యానళ్ల నీడన బెండ, సొర, కొత్తిమీర, గోరుచిక్కుడు పండిస్తున్నారు. శీతాకాలంలో టొమాటోలు, కీరదోస, జుకిని, మిరప పంటలు పండిస్తున్నారు. మరో పద్ధతి ఏమిటంటే.. సోలార్ ప్యానళ్లను బల్లపరుపుగా కాకుండా, నిట్ట నిలువుగా ఏర్పాటు చేసి, వాటి మధ్యలో ధాన్యపు పంటలు పండించుకోవటం. మహారాష్ట్రలో ఇటువంటి వర్టికల్ బైఫేషియల్ సోలార్ అగ్రివొట్లాయిక్స్ ప్రాజెక్టును నెక్ట్స్2సన్, వాట్కార్ట్ సంస్థలు నెలకొల్పాయి. ఇలా 90% భూమిలో పంటలు పండించుకోవచ్చు. పది శాతం నేల మాత్రమే సోలార్ ప్యానళ్లకు సరిపోతుంది.ప్యానళ్ల కింద పశువుల పెంపకంమారుమూల ప్రాంతాల్లో వ్యవసాయానికి విద్యుత్తు దొరకదు. సోలార్ ప్యానళ్ల కింద పంటలు పండించుకుంటే, విద్యుత్తు సమస్య తీరుతుంది, పంటలపై కూడా ఆదాయం వస్తుంది. ఆ విధంగా రైతులకు అగ్రివోల్టాయిక్స్ ద్వారా అనేక ప్రయోజనాలు నెరవేరుతాయని మహేశ్ సంతృప్తిగా చెప్పారు. ఎలివేటెడ్ సోలార్ ప్యానళ్ల కింద పంటలనేæ పండించాలనేం లేదు, పశువులను కూడా పెంచుకోవచ్చు. ఢిల్లీ పరిసరాల్లో 2.5 ఎం.డబ్ల్యూ. సామర్థ్యం గల ఎలివేటెడ్ సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి, అందులో పశువులను మేపితే మంచి ఆదాయం వచ్చిందని రుజువైందని ఆయన అన్నారు.రైతులకు రిస్క్ లేదుసన్సీడ్ ఎపివి సంస్థ అధిపతి వివేక్ సరఫ్ మాట్లాడుతూ ‘ఈ అగ్రివొల్టాయిక్స్ ప్రాజెక్టులో రైతులకు ఎటువంటి రిస్క్ లేదు. పెట్టుబడి మాది. పెట్టుబడి రిస్క్ మాకే ఉంటుంది. భూములు కౌలుకు ఇచ్చిన రైతులకు రిస్క్ ఏమీ లేదు. సాధారణ పంటలు సాగు చేస్తే రైతుకు ఎకరానికి ఏడాదికి రూ. 50 వేల వరకు వస్తాయి. అగ్రివొల్టాయిక్స్కు ఇస్తే ఆ పంట దిగుబడులతో పాటు కౌలు రూ. 50 వేల వరకు అదనపు ఆదాయం వస్తుంది. ఈ వ్యవసాయ పనులు చేసే రైతులకు ఇంకా అదనపు ఆదాయం కూడా వస్తుంది’ అన్నారు. అయితే, విడిగా రైతులు దీర్ఘకాలిక కౌలుకు ఇవ్వాలంటే వెనుకాడతారు. రైతులు బృందంగా, ఎఫ్పిఓగా ఏర్పాడితే అప్పుడు ఆ సంకోచం ఉండదు అన్నారాయన. సౌరవిద్యుత్తు ఉత్పత్తితో పాటు పంటల సాగులో వున్న సమస్యలు మున్ముందు తీరిపోతాయి. రైతులకు ఏటా రెండు పంటలతో పాటు సౌర విద్యుత్తును మూడో పంటగా పండించుకోవటం సులభ సాధ్యమవుతుందని, రైతుల ఆదాయం పెరుగుతుందని ఆశిద్దాం.

హిమాచలంలో ఉమెన్ పవర్
పర్యాటక ప్రేమికులకు సుపరిచితమైన పేరు... లాహౌల్ స్పితి. చుట్టూ హిమాలయ పర్వతాలతో మంత్రముగ్ధులను చేసే ప్రకృతి అందాలతో కనువిందు చేసే ఈ జిల్లా హిమాచల్‌ప్రదేశ్‌లో ఎక్కువ మంది సందర్శించేప్రాంతం. దేశంలోనే అతి తక్కువ జనాభా ఉన్న జిల్లాల్లో ఒకటి. ఉపాధికోసం పురుషులు ఎక్కువగా వలస పోవడంతో ఈప్రాంతంలో మహిళల జనాభా ఎక్కువ. 2024 ఉపఎన్నికల్లో అనురాధ రాణా శాసనసభ్యురాలిగా ఎన్నికైంది. జిల్లాలో ఆమె రెండో మహిళా శాసనసభ్యురాలు. రాజకీయాల్లో పెరిగిన మహిళలప్రాతినిధ్యానికి ఆమె విజయం అద్దం పడుతుంది.ఇక జిల్లా పాలనా యంత్రాంగం విషయానికి వస్తే... జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్... ఇల్మా ఆఫ్రోజ్, ఐఏఎస్ ఆఫీసర్ కిరణ్ బదన జిల్లా కలెక్టర్, ఆకాంక్ష శర్మ ‘సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్’గా కీలకమైన బాధ్యతలను నిర్వహిస్తున్నారు... ఇలా ఎంతోమంది మహిళలు జిల్లా పాలన యంత్రాంగంలో కీలకమైన స్థానాల్లో ఉన్నారు.కఠినమైన వాతావరణం, సుదూరప్రాంతం కారణంగా పోస్టింగ్‌కు ఎక్కువమంది ఇష్టపడని జిల్లాగా ఒకప్పుడు లాహౌల్ స్పితికి పేరుండేది. అయితే ఆ తరువాత సంప్రదాయ ఇమేజ్ చెరిగిపోవడం మొదలైంది. దీనికి కారణం... మహిళా అధికారులు. వృత్తిపరమైన సంతృప్తి,ప్రత్యేకమైన సవాళ్లను ఇష్టపడే మహిళా అధికారులు ఎక్కువగా ఇష్టపడే జిల్లాగా ‘లాహౌల్ స్పితి’ గుర్తింపు పొందింది.

72 ఏళ్ల వయసులో... కిలిమంజారోపైకి
‘వయసు పరిమితులు’ అంటుంటాం. అయితే క్రమశిక్షణ, సంకల్పబలం ఆ పరిమితులను తొలగించి గెలుపుదారిని చూపుతాయి. అందుకు తాజా ఉదాహరణ విద్యాసింగ్.72 ఏళ్ల వయసులో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన ఓల్డెస్ట్ ఇండియన్ ఉమన్‌గా చరిత్ర సృష్టించింది...విద్యాసింగ్ పారిశ్రామికవేత్త, దాత, అథ్లెట్‌గా ప్రసిద్ధురాలు. 2013 నుంచి ట్రెక్కింగ్‌పై ఆసక్తి పెంచుకుంది. భారతదేశం, భూటాన్, దక్షిణ అమెరికా... 19 ట్రెక్కింగ్‌లను పూర్తి చేసింది. విజయనగరం రాజకుటుంబానికి చెందిన విద్యాసింగ్ మద్రాస్‌లో పెరిగింది. చర్చ్ పార్క్, స్టెల్లా మేరీస్ కాలేజి వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదువుకుంది. ఆమె తండ్రి గోల్ఫ్, టెన్నిస్ క్రీడాకారుడు. గుర్రపు స్వారీ చేసేవాడు. తల్లి అద్భుతమైన టెన్నిస్ క్రీడాకారిణి.పదమూడు సంవత్సరాల వయసు నుంచే తల్లితో కలిసి టెన్నిస్ టోర్నమెంట్లలో పాల్గొనేది విద్యాసింగ్. ‘టోర్నమెంట్ గెలిచిన తల్లీకూతుళ్ల జట్టు’ అని పత్రికల పతాక శీర్షికలలో వచ్చేది. మద్రాస్ యూనివర్శిటీ మహిళల టెన్నిస్ జట్టుకు విద్యాసింగ్ కెప్టెన్‌గా వ్యవహరించింది. మాస్టర్స్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో పతకాలు గెలుచుకుంది. ప్రతి వారాంతంలో తన బృందంతో కలిసి 50–60 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తుంది. మారథాన్లలో పాల్గొనడం, గుర్రపు స్వారీ చేయడం ఆమెకు ఇష్టం. కిలిమంజారో ‘ట్రెక్కింగ్ శిఖరం’ అయినప్పటికీ తీవ్రమైన పరిస్థితులు, తీవ్రమైన ప్రమాదాలు పొంచి ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని చెన్నైకి చెందిన ‘గెట్ అప్ అండ్ గో’ అనే ట్రెక్కింగ్ కంపెనీతో కలిసి ట్రెక్కింగ్ చేసింది. ఈ బృందంలో 10 మంది ట్రెక్కర్లు ఉన్నారు.ఆరో రోజు రాత్రి 10.30 గంటలకు పర్వతారోహణ ప్రారంభమైంది. గంటల తరబడి కఠినమైన పర్వతారోహణ తరువాత తెల్లావారేసరికి ఈ బృందం స్టెల్లా పాయింట్‌కు చేరుకుంది. ఆపై మరో 45 నిమిషాలు ట్రెక్కింగ్ చేసి కిలిమంజారో ఉహురు శిఖరానికి చేరుకున్నారు. ‘రోజంతా ఆకాశంలో గడపడం అద్భుతంగా అనిపించింది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి’ అని ఆరోజును గుర్తు చేసుకుంది విద్యాసింగ్. వయసు పరిమితిని అధిగమించి విద్యాసింగ్ అపూర్వ విజయాన్ని సాధించడానికి కారణం ఏమిటి? ఆమె మాటల్లో చెప్పాలంటే... ‘గుడ్ జీన్స్’ ఇంకా చెప్పాలంటే క్రమశిక్షణతో కూడిన జీవనవిధానం, క్రమం తప్పని వ్యాయామాలు.

సజీవ కళ.. ఆదరణ లేక!
‘వాద్య వైఖరి కడు నెరవాది యనగా ఏకవీర మహాదేవి ఎదుట నిల్చి పరుశరాముని కథలెల్ల ఫ్రౌడి పాడె చారుతర కీర్తి భవనీల చక్రవర్తి’.. అని 13వ శతాబ్దం నాటి గ్రంథం ‘క్రీడాభిరామం’లో బైండ్ల కళ గొప్పతనం గురించి ఉంది. ‘‘శివుని చిన్న బిడ్డవమ్మ ఎల్లమ్మా.. నీవు శివులెల్లి మాతవమ్మ ఎల్లమ్మా.. పుట్టలోన పుట్టినావు ఎల్లమ్మ.. నీవు పుడమిపై బడ్డవమ్మా ఎల్లమ్మా.. నాగవన్నె చీరలమ్మ ఎల్లమ్మ.. నీకు నెమలికండ్ల రవికలమ్మ ఎల్లమ్మా.. రావె రావె ఎల్లమ్మా... నిన్ను రాజులు కొలిచేరెల్లమ్మా..’’ తొర్రూరు: ఒంటి నిండా రంగు.. గంభీరమైన ఆకారంతో.. ఇలాంటి పాటలు పాడుతూ గ్రామ దేవతలకు పూజలు చేసే కళాకారులే బైండ్ల కళాకారులు. జమిడిక తంత్రిని మునివేళ్లతో మీటుతూ రకరకాల శబ్దాలను పలికిస్తారు. ఒకప్పుడు రాజులకు వినోదాన్ని పంచిన ఈ కళ ప్రజలందరికీ చేరువలో ఉండేది. వంశపారంపర్యంగా వచ్చిన కళను కాపాడుతూ జీవం పోస్తున్నారు. నేడు జమిడిక నాదం మూగబోయే స్థితికి.. అలాంటి జమిడిక నాదం ప్రస్తుతం మూగబోయే పరిస్థితి కనిపిస్తోంది. పల్లెలు, పట్టణాల్లో డీజేల హోరు పెరగడంతో భవిష్యత్తులో బైండ్ల కళా ప్రదర్శన కనుమరుగయ్యే దుస్థితి నెలకొందని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బైండ్ల కళాకారులను భవానీలు అని కూడా పిలుస్తారు. వీళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లోనూ ఉన్నారు. వీరి పూజా విధానం కాస్త కష్టంగానే ఉన్నా.. ప్రజలను ఉర్రూతలూగిస్తుంది. గ్రామ దేవతలకు పూజలు చేస్తూ.. తెలుగు చరిత్రలో బైండ్ల కులస్తులకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ కళాకారులు మాదిగ కులస్తులకు పూజారులుగా, శక్తి ఆరాధకులుగా పేరొందారు. పూర్వం మాదిగ కులస్తులు (Madiga Community) జరుపుకొనే శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టడమే కాకుండా పెళ్లితంతు జరిపేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. పెళ్లిళ్లు, పండుగలు ఇతర కులాల వారితో చేయించడం వల్ల వారి ఉపాధి దెబ్బ తింది. ప్రస్తుతం వారు వంశానుక్రమంగా సంక్రమించిన గ్రామాలకు వెళ్లి ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ కథలు చెప్పి దేవతలను కొలిచే పూజారులుగా, కళాకారులుగానే మిగిలారు. ‘జమిడిక’ విన్యాసాలు బైండ్ల కళాకారులు ఉపయోగించే వాయిద్యాన్ని ‘జమిడిక’ అంటారు. దీన్ని ఇత్తడితో తయారు చేస్తారు. జమిడికతో అనేక రకాల సంగీత ధ్వనులు పలికిస్తారు. పాట వరుసను అనుసరించి లయ మారుస్తుంటారు. కథకుడు కథాగానం చేస్తుంటే.. పక్కనున్న కళాకారులు వంత పాడుతూ జమిడిక వాయిస్తుంటారు. పల్లెల్లో ఎక్కువగా చేసుకునే రేణుకా ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, పోలేరమ్మ పండుగలప్పుడు పసుపు, కుంకుమలతో పట్నాలు వేసి దేవతలను కొలుస్తారు. దేవుళ్లకు బోనాలు సమర్పించిన రాత్రంతా గుడి దగ్గరే ఉంటారు. తెల్లవారుజాము వరకు ఆటపాటలతో దేవతల చరిత్ర చెబుతారు. పరశురాముడు, మాందాత, పోతరాజు, ఎల్లమ్మతో పాటు పలు రకాల వేషధారణలతో ఆకట్టుకుంటారు.నేడు ఉపాధి కరువై.. ప్రస్తుతం తెలంగాణలో కథాగానం చేసే బైండ్ల కళాకారులు (Baindla Artists) స్వల్ప సంఖ్యలో ఉన్నారు. ఆయా గ్రామాల్లో పండుగలు జరిగినప్పుడే వీరికి ఉపాధి దొరుకుతోంది. ఏటా కేవలం ఆషాఢం, శ్రావణ మాసాల్లోనే వీరికి ఉపాధి దొరుకుతోంది. మిగతా రోజులు కూలీ పనులు, వేరే వృత్తులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నారు. కొత్త తరం ఈ కళారూపాన్ని నేర్చుకోవడానికి ముందుకు రావడం లేదు. అక్కడక్కడా కళాకారులు తమ వారసత్వ కళా సంస్కృతిని కొనసాగించాలనే పట్టుదలతో తమ పిల్లలను చదివిస్తూనే సందర్భాన్ని బట్టి వారికి కథలను నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు.ప్రభుత్వ చేయూత కోసం.. శక్తి దేవతలైన ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ వంటి దేవతల కథలు చెప్పే సంస్కృతి బైండ్ల కళాకారుల నుంచి అనాదిగా వస్తోంది. ఈ ఆలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం ధూపదీప నైవేద్య పథకం కింద బైండ్ల కళాకారులను చేర్చి అర్చకులుగా అవకాశమివ్వాలని వారు కోరుతున్నారు. దాంతో పాటు కళనే నమ్ముకుని వయోభారంతో ఇబ్బంది పడుతున్న వారికి.. ప్రభుత్వం ప్రత్యేక పథకాలు వర్తింపజేయాలని, కళాకారుల పింఛన్లు (Pensions) అందించాలని కోరుతున్నారు. భావితరాలకు ఈ కళను పరిచయం చేసేందుకు డాక్యుమెంటేషన్ చేయాలని కళాకారులు విజ్ఞప్తి చేస్తున్నారు. చదవండి: పిలిచిన పలికేవు స్వామి!
ఫొటోలు
అంతర్జాతీయం

ఉక్రెయిన్‌లో రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ
మాస్కో: ఉక్రెయిన్‌లో రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ (Ceasefire)ను ప్రకటించింది. విక్టరీ డే నేపథ్యంలో వచ్చే నెల 8 నుంచి 10వ తేదీవరకు పూర్తిస్థాయి కాల్పుల విరమణ పాటిస్తామని క్రెమ్లిన్ వెల్లడించింది.మానవతా దృక్పథంతో దేశాధ్యక్షుడు పుతిన్ ఈమేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వేళ ఈ ప్రకటన వెలువడింది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా రష్యా ప్రభుత్వం ఏటా మే 9న విక్టరీ డే వేడుకలు నిర్వహిస్తుంది.అమెరికా నుంచి శాశ్వత కాల్పుల విరమణ, శాంతి చర్చల ఒప్పందంపై ఒత్తిడి పెరుగుతున్న వేళ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ నిర్ణయం ప్రకటించారు. ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ మీద దాడులు ఆపాలంటూ రష్యాను కోరిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు జరుపుతున్న భీకరదాడులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారాయన. అదే సమయంలో.. శాంతి ఒప్పందంలో భాగంగా క్రిమియాను వదులుకోవాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీకి సూచించారు కూడా.

Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
న్యూఢిల్లీ: సింధు జలాల నదీ ఒప్పందం నిలిపివేత నేపథ్యంతో భారత్‌ను ఉద్దేశించి పలువురు పాక్ నేతలు అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. వారిలో బిలావల్ భుట్టో జర్దారీ చేసిన వ్యాఖ్యలకు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నీ తాత, తల్లిని చంపిందెవరో ఒక్కసారి గుర్తు తెచ్చుకో అంటూ బిలావల్‌ను ఉద్దేశించి ప్రశ్న సంధించారాయన.‘‘ఇవన్నీ పిల్ల మాటలు. అతని తాతకు ఏం జరిగిందో అతనికి తెలియదా? అతని తల్లిని ఉగ్రవాదులేగా చంపేశారు. కనీసం అది గుర్తున్నా? అతను అలా మాట్లాడి ఉండడు. అమెరికా సాయం చేస్తేనేగానీ ముందుకు నడవలేని దేశం పాకిస్తాన్. అలాంటిది మీరా మనల్ని చిన్నచూపు చూస్తోంది? అంటూ బిలావల్‌ను ఉద్దేశించి ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.అతని తల్లిని చంపినప్పుడు అది ఉగ్రవాదం.. అదే మన అమ్మలను, బిడ్డలను చంపినప్పుడు అది ఉగ్రవాదం కాదా?. ఇది కూడా అర్థం చేసుకోలేనివాడికి మనం ఏం చెప్పినా వ్యర్థమే’’ అని ఒవైసీ వ్యాఖ్యానించారు.పనిలో పనిగా పాక్ నేతలకూ ఆయన చురకలంటించారు. ‘‘ పాక్‌లో కూర్చుని అడ్డగోలుగా మాట్లాడొద్దు. పాక్ దేశ మొత్తం బడ్జెట్.. మా దేశ రక్షణ బడ్జెట్ కంటే తక్కువే.మీరు ఏ దేశంలోకి చొరబడి అమాయకుల ప్రాణాలు తీస్తుంటే ఎవరూ మౌనంగా ఉండరు. మతం అడిగి మరీ చంపడం.. వికృతమైన పని. ఉగ్రవాదులు మరోసారి దాడి చేసే సాహసం చేయకుండా ప్రధాని మోదీ కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని ఒవైసీ అన్నారు. 2007 డిసెంబర్ 30వ తేదీన రావల్పిండిలో జరిగిన ర్యాలీలో.. ఆత్మాహుతి దాడి జరిగి బెనజీర్ భుట్టోతో పాటు మరో 20 మంది బలయ్యారు. ఇక..పాక్ మాజీ అధ్యక్షుడు, ప్రధాని అయిన ఆమె తండ్రి జుల్ఫీకర్ అలీ భుట్టోను ఓ హత్య కేసుకుగానూ 1979 ఏప్రిల్ 4వ తేదీన ఉరి తీశారు. అయితే అది రాజకీయ ప్రేరేపిత కేసు అనే అభియోగాలు ఉన్నాయి. 2023 దాకా విదేశాంగ మంత్రిగా పని చేసిన పీపీపీ నేత బిలావల్ భుట్టో.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. ‘‘సింధూ నది మాదే. ఎప్పటికీ మాదే. నదిలో నీరైనా పారుతుంది లేదా వారి రక్తమైనా పారుతుంది. పాకిస్థాన్ గానీ అంతర్జాతీయ సమాజం కానీ ఈ యుద్ధ కాంక్షను అస్సలు సహించదు. వేల ఏళ్ల నాటి సింధూ నాగరికతకు తాము వారసులమని మోదీ అంటుంటారు. కానీ ఈ సంస్కృతికి పరిరక్షకులము మేమే. ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుంటాము’’ అంటూ ఓ ర్యాలీలో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను కేంద్ర మంత్రులు సహా భారత్‌లోని పలువురు నేతలు ఇప్పటికే ఖండించారు కూడా.

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. దాయాదితో టచ్‌లోకి చైనా
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడి ఘటన భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను పెంచింది. ఇందులో భాగంగా పాకిస్తాన్ విషయంలో భారత్ పలు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో పొరుగు దేశం చైనా ఆచితూచి అడుగులు వేస్తోంది. తాజాగా ప్రస్తుత పరిస్థితుల్లో భారత్- పాకిస్థాన్‌లు సంయమనం పాటించాలని చైనా భావిస్తోంది అంటూ ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి చెప్పుకొచ్చారు.తాజాగా చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ, పాకిస్తాన్ విదేశాంగ మంత్రితో మాట్లాడారు. ఈ క్రమంలో వాంగ్ యీ మాట్లాడుతూ..‘పాకిస్తాన్, భారత్ మధ్య పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాం. ఉగ్రదాడిపై నిష్పక్షపాత దర్యాప్తునకు మద్దతు ఇస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు దేశాలు సంయమనం పాటించాలని బీజింగ్ భావిస్తోంది. పరస్పరం ముందుకు సాగాలని, ఉద్రిక్తతలను తగ్గించేందుకు కృషి చేయాలని ఆశిస్తోంది’ అని చెప్పినట్లు చైనా మీడియా ఓ ప్రకటనలో పేర్కొంది. ఉగ్రవాదంపై పోరాటం అన్ని దేశాల ఉమ్మడి బాధ్యత అని స్పష్టం చేసినట్లు వెల్లడించింది.ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తు వ్యవహారంలో రష్యా, చైనాలు జోక్యం చేసుకోవాలని పాకిస్థాన్ కోరుకుంటున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ‘ఈ ఘటన దర్యాప్తు విషయంలో రష్యా, చైనా లేదా పశ్చిమ దేశాలు సానుకూల పాత్ర పోషించగలవు. భారత్, మోదీ అబద్ధం చెబుతున్నారా? లేదా.. పాకిస్తాన్ నిజం చెబుతుందా? అనేది వెలికితీసేందుకు దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేయవచ్చు’ అని కథనాలు వెలువడ్డాయి.China breaks its silence on the ongoing tensions between India and Pakistan.Chinese Foreign Minister Wang Yi spoke with Pakistan’s Deputy PM Ishaq Dar today and said that China supports Pakistan in safeguarding its sovereignty and security interests. pic.twitter.com/wIUt1Yz0UJ— Salt News (@SaltNews_) April 27, 2025మరోవైపు.. పహల్గాంలో ఉగ్ర దాడిని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ ఖండించారు. ఈ విషయంలో భారత్‌కు పూర్తి మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేశారు. ఉగ్రవాదం నుంచి ప్రపంచం ఎదుర్కొంటున్న బెదిరింపులను ఈ దాడి గుర్తు చేసిందని పేర్కొన్నారు. దాడి అనంతరం భద్రతా దళాలు స్పందించిన తీరును ప్రశంసించారు. ‘కశ్మీర్లో ఇటీవల జరిగిన దాడిలో మరణించిన వారికి ఎఫ్‌బీఐ సంతాపం తెలుపుతోంది. భారత్ ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా నిలుస్తోంది’ అని వ్యాఖ్యానించారు.పహల్గాం ఉగ్ర దాడిని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఖండించారు. ఉగ్రవాదాన్ని అడ్డుకోవడానికి ప్రాంతీయ సమన్వయం అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీకి తాను ఫోన్ చేసి దాడిని ఖండించినట్లు ఆయన ప్రకటించారు. పహల్గాం దుర్ఘటనలను ఈ ప్రాంతంలోని దేశాలు ఉమ్మడి బాధ్యతగా తీసుకుని స్పందించాలని సూచించారు. ఇరాన్లో పర్యటించాలని ప్రధాని మోదీకి ఆయన ఆహ్వానం పలికారు.

పాక్ ఆర్మీ చీఫ్ ఎక్కడ?
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ సైన్యాధిపతి జనరల్ సయీద్ ఆసిఫ్ మునీర్ కనిపించడం లేదన్న వార్తలు పాకిస్తాన్లో కలకలం రేపుతున్నాయి. కుటుంబంతో పాటుగా ఆయన దేశం వీడి పారిపోయారని స్థానిక మీడియాలో ఆదివారం వార్తలొచ్చాయి. ‘‘తొలుత కుటుంబాన్ని విదేశాలకు తరలించారు. తర్వాత తానూ పాక్ వీడారు’’ అన్నది వాటి సారాంశం. కొద్ది రోజులుగా, ఆ మాటకొస్తే పహల్గాం దాడి జరిగినప్పటి నుంచీ మునీర్ బయట ఎక్కడా కని్పంచడం లేదని ఆ కథనాలు చెబుతున్నాయి. మునీర్‌కు తీవ్ర భారత విద్వేషిగా పేరుంది. కొద్ది రోజులుగా భారత వ్యతిరేక వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. పాక్‌కు కశ్మీర్ జీవనాడి అని, దాన్ని వదులుకునే ప్రసక్తే లేదని, హిందువులు, ముస్లింలు భిన్న జాతులని ఇటీవలే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తర్వాత రెండు రోజులకే పహల్గాం ఉగ్ర దాడి జరిగింది. ‘‘దాడిపై ఆగ్రహంతో రగిలిపోతున్న భారత్ తీవ్రస్థాయిలో ప్రతీకార చర్యలకు దిగుతుందని పాక్ ఆందోళన చెందుతోంది. అందుకు తానే బాధ్యుడిని అవుతానని మునీర్ భయపడ్డారు. అందుకే దేశం నుంచి జారుకున్నట్టు కనిపిస్తోంది’’ అని కథనాలు పేర్కొంటున్నాయి. మునీర్ పాక్‌లోనే ఉన్నారని, రావలి్పండి బంకర్లో తలదాచుకున్నారని మరికొందరు చెబుతున్నారు. ఈ పుకార్లలో సైన్యం మనోబలం దెబ్బ తింటుందని గ్రహించిన పాక్ ప్రభుత్వం నష్ట నివారణకు దిగింది. ప్రధాని షహబాజ్ షరీఫ్, ఉన్నత సైనికాధికారులతో శనివారం మునీర్ దిగిన గ్రూప్ ఫొటో అంటూ పాక్ పీఎంఓ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. దాన్ని నమ్మలేమని, శనివారం సైనిక కాలేజీ ఉత్సవాల్లో ప్రధానితో పాటు మునీర్ పాల్గొన్నట్టుగా వచి్చన వార్తలూ నమ్మశక్యంగా లేవని మీడియా అభిప్రాయపడింది. మరోవైపు పాక్ సైన్యంలోని జనరల్స్, ఉన్నతాధికారులు తమ కుటుంబాలను ఉన్నపళంగా దేశం దాటిస్తున్నట్టు చెబుతున్నారు.
జాతీయం

బీబీసీది పక్షపాత రిపోర్టింగ్
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడిపై బీబీసీ కవరేజ్ పట్ల కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీబీసీది పక్షపాత రిపోర్టింగ్ అని విమర్శించింది. పాక్ జాతీయుల వీసాల రద్దుపై బీబీసీ రాసిన కథనంలో ఉగ్రదాడిని మిలిటెంట్ అటాక్‌గా పేర్కొనడంపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇది దేశం మనోభావాలను దెబ్బతీస్తుందని బీబీసీ ఇండియా హెడ్ జాకీ మార్టిన్‌కు విదేశాంగశాఖ లేఖ రాసింది. బీబీసీ రిపోర్టింగ్‌ను విదేశాంగ శాఖ పర్యవేక్షిస్తుందని లేఖలో పేర్కొంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సరిహద్దు వెంబడి తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే సందేశాలను నిరోధించడానికి 16 పాకిస్తాన్ యూట్యూబ్ చానళ్లను భారత్ నిషేధించింది. నిషేధానికి గురైన చానళ్లలో పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ యూట్యూబ్ ఛానల్ ఉండటం గమనార్హం.

రఫేల్ ఒప్పందంపై భారత్, ఫ్రాన్స్ సంతకాలు
న్యూఢిల్లీ: భారత నావికాదళం కోసం ఫ్రాన్సు నుంచి 26 రఫేల్ (మెరైన్)యుద్ధ విమానాలను రూ.64 వేల కోట్లతో కేంద్రం కొనుగోలు చేయనుంది. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సోమవారం వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఫ్రాన్స్ రక్షణ రంగ కంపెనీ డసో ఏవియేషన్ నుంచి కొనుగోలు చేయనున్న విమానాలను ఐఎన్ఎస్ అరిహంత్‌పై మోహరించనున్నారు. ప్రధాని మోదీ సారథ్యంలోని కేబినెట్ కమిటీ ఈ డీల్‌కు మూడు వారాల క్రితమే పచ్చజెండా ఊపింది. ఐదేళ్ల తర్వాత యుద్ధ విమానాల రాక మొదలు కానుంది. అనుబంధ ఆయుధ వ్యవస్థలు, విడిభాగాలతోపాటు విమానాల తయారీ సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం భారత్‌కు బదిలీ చేయనుంది.

తహవ్వుర్ రాణా కస్టడీ పొడిగింపు
న్యూఢిల్లీ: ముంబై ఉగ్రదాడుల కేసులో కీలక నిందితుడు తహవ్వుర్ రాణా కస్టడీని ఎన్ఐఏ కోర్టు మరో 12 రోజులు పొడిగించింది. 18 రోజుల కస్టడీ గడువు ముగియడంతో సోమవారం ప్రత్యేక కోర్టు జడ్జి చందర్ జిత్ సింగ్ ఎదుట ఎన్ఐఏ హాజరు పరిచింది. ముఖానికి ముసుగు తొడిగిన రాణాను అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కోర్టుకు తీసుకువచ్చారు. తమ వద్ద ఉన్న కీలకమైన పత్రాలపై అతడి నుంచి సమాచారం రాబట్టాల్సి ఉందని ఎన్ఐఏ తెలిపింది. కస్టడీ సమయంలో సాధించిన దర్యాప్తు పురోగతిని జడ్జికి ప్రత్యేకంగా వివరించింది. విచారణలో అతడు తమకు సహకరించడం లేదని ఎన్ఐఏ లాయర్లు వాదించారు. ఎన్ఐఏ అధికారుల సమక్షంలోనే అతడు లాయర్‌ను కలుసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.

జేఎన్‌యూలో పట్టు నిలబెట్టుకున్న వామపక్షం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (జేఎన్‌యూఎస్‌యూ) ఎన్నికల్లో వామపక్షాలు మరోమారు సత్తా చాటాయి. కీలకమైన నాలుగు పదవులకు గాను మూడింటిని కైవసం చేసుకున్నాయి. ఆర్ఎస్ఎస్ అనుబంధ ఏబీవీపీకి తొమ్మిదేళ్ల తర్వాత జాయింట్ సెక్రటరీ పోస్టు దక్కించుకోగలిగింది. జేఎన్‌యూఎస్‌యూ ఎన్నికల కమిషన్ సోమవారం ఉదయం ప్రకటించిన ఫలితాల్లో ప్రెసిడెంట్ పదవిని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ)కు చెందిన నితీశ్ కుమార్ గెలుచుకున్నారు. ఈయనకు 1,702 ఓట్లు పడగా సమీప ప్రత్యర్థి ఏబీవీపీకి చెందిన శిఖా స్వరాజ్‌కు 1,430 ఓట్లు దక్కాయి. ఎస్ఎఫ్ఐకి చెందిన తయ్యబా అహ్మద్ 918 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. వైస్ ప్రెసిడెంట్‌గా డెమోక్రాటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్(డీఎస్ఎఫ్)బలపరిచిన మనీ షా 1,150 ఓట్లతో విజయం సాధించారు. ఏబీవీపీ అభ్యర్థికి 1,116 ఓట్లు దక్కాయి. జనరల్ సెక్రటరీ పదవిని గెలుచుకున్న డీఎస్‌ఎఫ్‌కు చెందిన ముంతేహా ఫతిమాకు 1,520 ఓట్లు రాగా ప్రత్యర్థి, ఏబీవీపీకి చెందిన కునాల్ రాయ్‌కి 1,406 ఓట్లొచ్చాయి. అదేవిధంగా, ఏబీవీపీ అభ్యర్థి వైభవ్ మీనా 1,518 ఓట్లతో జాయింట్ సెక్రటరీ పదవిని గెలుచుకున్నారు. సమీప ప్రత్యర్థి ఏఐఎస్ఏకు చెందిన నరేశ్ కుమార్‌కు 1,433 ఓట్లు, ప్రోగ్రెసివ్ స్టూడెంట్ అసోసియేషన్(పీఎస్ఏ) అభ్యర్థి నిగమ్ కుమారికి 1,256 ఓట్లు పడ్డాయి.2015–16 తర్వాతచిట్టచివరిసారిగా 2015–16 జేఎన్‌యూఎస్‌యూ ఎన్నికల్లో ఏబీవీపీ అభ్యర్థి సౌరవ్ శర్మ జాయింట్ సెక్రటరీగా గెలుపొందారు. ఆ తర్వాత ఆ పదవి దక్కడం ఇదే మొదటిసారి. అదేవిధంగా, 2000–01 ఎన్నికల్లో ఏబీవీపీకి చెందిన సందీప్ మహాపాత్ర జేఎన్‌యూఎస్‌యూ ప్రెసిడెంట్ అయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఏబీవీపీ ఆ పదవిని ఇప్పటి వరకు గెలుచుకోలేకపోయింది.
ఎన్ఆర్ఐ

రాయలసీమ ప్రగతికి డాలస్‌లో జీఆర్ఏడీఏ అడుగులు
గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఏరియా (GRADA) ఆధ్వర్యంలో ఏప్రిల్ 13న ఫ్రిస్కో, టెక్సాస్‌లో రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం జరిగింది. రాయలసీమ సమస్యలు, అభివృద్ధి అవకాశాలు, తెలుగు భాషా సాహిత్యాల ప్రాముఖ్యతపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి రాయలసీమకు చెందిన రచయిత భూమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగంలో రాయలసీమ ప్రస్తుత పరిస్థితి, ముఖ్యంగా దీర్ఘకాలంగా వేధిస్తున్న నీటి సమస్యలు, వెనుకబాటుతనం గురించి ఎంతో ఆవేదనతో, స్పష్టంగా వివరించారు.మన ప్రాంత సహజ సంపద అయిన శేషాచలం అడవుల గురించి, ముఖ్యంగా ఎర్రచందనం చెట్ల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ విలువైన సంపదను అక్రమ మార్గాల్లో ఇతర దేశాలకు తరలించి లాభం పొందకుండా, స్థానికంగానే వాటి ఆధారిత పరిశ్రమలను స్థాపించి, ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా మన ప్రాంతాన్ని ఎలా ఆర్ధికంగా బలోపేతం చేయవచ్చో ఆయన చక్కగా వివరించారు. ఆయన మాటలు మనందరిలో కొత్త ఆలోచనలను రేకెత్తించాయి. సహజ వనరులను సక్రమంగా వినియోగించుకుంటే రాయలసీమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే ఆశాభావాన్ని ఆయన కలిగించారు.మరో గౌరవ అతిథిగా కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ఛాన్సలర్, ప్రఖ్యాత విద్యావేత్త ప్రొఫెసర్ పి. కుసుమ కుమారి హాజరయ్యారు. ఆమె తన ప్రసంగంలో తెలుగు భాష మాధుర్యం, సాహిత్యం గొప్పదనం, పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. నంద కోర్వి, అనిత నాగిరెడ్డి, సతీష్ సీరం, బ్రహ్మ చిరా, హరినాథ్ పొగకు, హేమంత్ కాకుట్ల, జగదీశ్వర నందిమండలం, జగదీష్ తుపాకుల, పవన్ పల్లంరెడ్డి, ప్రసాద్ నాగారపు, రాజు కంచం, శివ అద్దేపల్లి, శివ వల్లూరు, శ్రీధర్ బొమ్ము, శ్రీకాంత్ దొంత, సురేష్ మోపూరు, ఉమా గొర్రెపాటి, మరియు కార్తీక్ మేడపాటి ఈ సమావేశానికి హాజరయ్యారు.

సింగపూర్‌లో ‘అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం’
'వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా' 'శ్రీ సాంస్కృతిక కళాసారథి - సింగపూర్' మరియు 'వంశీ ఇంటర్నేషనల్ - ఇండియా' సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, ఆదివారం 13వ తేదీ హైదరాబాద్ , శ్రీ త్యాగరాయ గానసభలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 12 గంటల పాటు నిర్విరామంగా "అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం" కార్యక్రమం అద్వితీయంగా నిర్వహించబడింది.ఈ మూడు సంస్థలు కలసి విశ్వావసు నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని 80 మంది కవులతో 'అంతర్జాతీయ కవి సమ్మేళనము', 20 నూతన గ్రంధావిష్కరణలు, ఆచార్య శలాక రఘునాథ శర్మ 'రాయప్రోలు వంశీ జాతీయ సాహితీ జీవన సాఫల్య పురస్కార' ప్రదానము డా. బులుసు అపర్ణచే ప్రత్యేక 'మహిళా అష్టావధానము' మొదలైన అంశాలతో ఈ 'అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం' కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించి నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్, విశిష్ట అతిథులుగా కవి జొన్నవిత్తుల, కిమ్స్ ఆస్పత్రి వ్యవస్థాపకులు బొల్లినేని కృష్ణయ్య, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానంద రావు, ప్రముఖ రాజకీయవేత్త వామరాజు సత్యమూర్తి తదితరులు హాజరయ్యారు.ఉదయం 9 గంటలకు డా వంశీ రామరాజు అందించిన స్వాగతోపన్యాసంతో ఆరంభమైన ప్రారంభోత్సవ సభలో, కార్యక్రమ ప్రధాన సమన్వయకర్త రాధిక మంగిపూడి సభా నిర్వహణలో, మండలి బుద్ధ ప్రసాద్, కవి జొన్నవిత్తుల, బొల్లినేని కృష్ణయ్య, వామరాజు సత్యమూర్తి, డా. జననీ కృష్ణ తదితరుల ప్రసంగాలు అందరినీ ఆకర్షించాయి.తదనంతరం ఖతార్ నుండి విచ్చేసిన విక్రమ్ సుఖవాసి నిర్వహణలో అతిథుల చేతుల మీదుగా 18 తెలుగు నూతన గ్రంథాలు ఆవిష్కరించబడ్డాయి. వాటిలో కథల కవితల సంకలనాలు, వ్యాస సంపుటాలు, జెవి పబ్లికేషన్స్, మిసిమి మాసపత్రిక వారి ప్రచురణలు, సిద్ధాంత గ్రంథాలు మాత్రమే కాకుండా, ప్రతిష్టాత్మకంగా 2024 నవంబర్‌లో ఖతార్ దేశ రాజధాని దోహా మహానగరంలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో జరిగిన "9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సభా విశేష సంచిక" కూడా ఆవిష్కరించబడడం ఈ సభకు మరింత శోభను చేకూర్చింది.మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు కొనసాగిన "అంతర్జాతీయ కవి సమ్మేళనం"లో ఆస్ట్రేలియా, ఖతార్, దక్షిణాఫ్రికా, అమెరికా మొదలైన దేశాలనుండి, ఉభయ తెలుగు రాష్ట్రాలనుండి, ముంబై, అండమాన్ దీవులు మొదలైన ప్రాంతాలనుండి కూడా వచ్చిన సుమారు 80 మంది కవులు కవయిత్రులు పాల్గొని తమ కవితలు వినిపించారు. వంశీ అధ్యక్షురాలు డా. తెన్నేటి సుధాదేవి, రేవూరు అనంత పద్మనాభరావు, జి భగీరథ, గుండు వల్లీశ్వర్, ప్రొ. రామా చంద్రమౌళి మహెజబీన్, ప్రొ. త్రివేణి వంగారి, డా కేతవరపు రాజ్యశ్రీ, డా. చిల్లర భవానీ దేవి, డా. శంకరనారాయణ, అంబల్ల జనార్ధన్, డా చాగంటి కృష్ణకుమారి మొదలైన ఎందరో కవులు కవయిత్రులు ఈ కవిసమ్మేళనంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం కొందరు రచయితలు ప్రసంగవ్యాసాలు వినిపించారు. సభా వ్యాఖ్యాతలుగా పేరి, కృష్ణవేణి, రాధిక వ్యవహరించారు.అనంతరం సాయంత్రం ఆచార్య శలాక రఘునాథ శర్మను ఘనంగా సత్కరించి, వారికి మూడు నిర్వాహక సంస్థల తరఫున "రాయప్రోలు వంశీ జాతీయ సాహితీ జీవన సాఫల్య పురస్కారం" అందించారు. దీనికి తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానందరావు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. అనంతరం శలాక మాట్లాడుతూ తెలుగువారికి సొంతమైన అవధాన ప్రక్రియలో 'సమస్యా పూరణం' అనే అంశంలో ఉండే చమత్కారాలు వివరణలు తెలియజేస్తూ "అవధాన కవిత్వం - సమస్యలు" అనే అంశంపై ప్రత్యేక ప్రసంగాన్ని అందించారు.సాయంత్రం 5:30 గంటల నుండి ద్విశతావధాని డా. బులుసు అపర్ణ చేసిన అష్టావధానం ఈ సదస్సుకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాధిక మంగిపూడి సంచాలకత్వంలో అమెరికా, యుగాండా, ఆస్ట్రేలియా, ఖతార్, అండమాన్ దీవులు, ముంబై, విశాఖపట్నం, విజయవాడ నుండి వచ్చిన 8 మంది మహిళలు పృచ్ఛకులుగా పాల్గొనడంతో ఇది "సంపూర్ణ మహిళా అష్టావధానం"గా ప్రశంసలు అందుకుంది.ఈ కార్యక్రమానికి ప్రధాన నిర్వాహకులుగా వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. వంగూరి చిట్టెన్ రాజు, వంశీ వ్యవస్థాపకులు డా. వంశీ రామరాజు, సింగపూర్ సంస్థ వ్యవస్థాపకులుకవుటూరు రత్నకుమార్ వ్యవహరించగా, వంగూరి ఫౌండేషన్ భారతదేశ ట్రస్టీ శైలజ సుంకరపల్లి ఆధ్వర్యంలో వేదిక ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పంచవ్యాప్తంగా సాహిత్య అభిమానుల మన్ననలు అందుకుంది.

టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదం, ప్రాణాపాయ స్థితిలో తెలుగు విద్యార్థిని దీప్తి
ఉన్నత చదువులకోసం అమెరికాకు వెళ్లిన తెలుగు విద్యార్థిని ప్రాణలతో పోరాడుతోంది. అమెరికాలోని టెక్సాస్‌లోని డెంటన్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు అమ్మాయిలు గాయపడ్డారు. వీరిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని దీప్తి వంగవోలుగా గుర్తించారు. మరో విద్యార్థినికి కూడా తీవ్రంగా గాయపడిందని అయితే ఆమెకు ప్రాణాపాయం లేదని అమెరికా మీడియా నివేదికలు తెలిపాయి.ఈ ప్రమాదం శనివారం (ఏప్రిల్ 12) తెల్లవారుజామున, ఎన్. బోనీ బ్రే స్ట్రీ మరియు డబ్ల్యు. యూనివర్శిటీ డ్రైవ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన దీప్తి వంగవోలు ,ఆమె స్నేహితురాలు కాలినడకన ఇంటికి చేరుకోబోతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. వెంటనే ఆ వాహనం డ్రైవర్ని అక్కడినుంచి పారిపోయాడు. దీప్తికి తలకు లోతైన గాయం అయిందని, ఆమెకు శస్త్రచికిత్స జరుగుతోందని స్థానిక మీడియా తెలిపింది. ప్రస్తుతం డెంటన్ పోలీసులు ఈ హిట్ అండ్ రన్ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న డ్రైవర్‌ను, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు ప్రజల సహాయం కోరుతూ ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ ఘటనపై మరిన్నివివరాలు అందాల్సి ఉంది. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, దీప్తి వంగవోలు నార్త్ టెక్సాస్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్స్ చదువుతోంది. 2023లో నరసరావు పేట ఇంజనీరింగ్ కళాశాల నుండి బీటెక్ పూర్తి చేసింది.

సింగపూర్ ఎన్నికల్లో సత్తా చాటనున్న భారతీయులు: హింటిచ్చిన పీఎం
సింగపూర్‌లో ( Singapore ) సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ (Lawrence Wong) తన పార్టీ పీపుల్స్ యాక్షన్ పార్టీ (PAP) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన అభ్యర్థులను పోటీలో నిలపబోతున్నామని ప్రకటించారు. త్వరలో ఎన్నికలకు నగారా మోగనున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.ఆదివారం భారతీయ యువతతో సింగపూర్ ప్రధానమంత్రి ముచ్చటించారు. భారతీయ సమాజం చిన్నదే అయినా ప్రభావం చాలా గొప్పదని, పీఎం అన్నారు. మీరు ఇప్పటికే ఆ సింగపూర్ స్పూర్తిని ప్రతిబింబిస్తున్నారనీ, అది ప్రభావంతమైందన్న వాంగ్ వ్యాఖ్యలను ది స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారత సంతతికి చెందిన కొత్త అభ్యర్థులను ఎంపిక చేస్తుందని హామీ ఇచ్చారు. 2020 ఎన్నికల్లో భారతీయులకు చోటు దక్కలేదని గుర్తు చేసిన ఆయన ఈ సారి 30కంటే ఎక్కువమంది భారతీయులు కూడా ఉంటారన్నారు. ది ఇటీవలి చరిత్రలో అతిపెద్దదని పీఎం వాంగ్ వ్యాఖ్యానించారు. వాణిజ్యం, వ్యాపారం, పరిశ్రమలు, ప్రజా సేవ సహా అనేక రంగాలలో భారతీయ కమ్యూనిటీ దేశానికి చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. అయితే, PM వాంగ్ గత శనివారం వెల్లడించిన ఎనిమిది కొత్త ముఖాల్లో భారత సంతతికి చెందిన వైద్యుడు హమీద్ రజాక్ కూడా ఉన్నారని ది స్ట్రెయిట్ టైమ్స్ నివేదిక పేర్కొంది. అయితే, రాబోయే సార్వత్రిక ఎన్నికలలో వారు ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారో వెల్లడించలేదు.చదవండి: Amarnath Yatra 2025 రిజిస్ట్రేషన్లు షురూ! త్వరపడండి!సింగపూర్ నివేదికల ప్రకారం. 2004లో సింగపూర్ పౌరులలో భారతీయులు 7.6 శాతం మంది ఉండగా , మలయ్, చైనీయులు వరుసగా 15.1 శాతం, 75.6 శాతం మంది ఉన్నారు. 2024 డేటా ప్రకారం, ఆగ్నేయాసియా దేశ జనాభాలో వరుసగా 15శాతం, 75శాతం మంది మలేషియన్లు , చైనీయులు ఉన్నారు.90 నిమిషాల పాటు వాంగా ఇప్పో పెసలామ్ చాట్ (రండి, తమిళంలో చాట్ చేద్దాం) అనే వీఐపీ చాట్‌ను తమిళ్ మరసు వార్తాపత్రికి నిర్వహించింది.భారత సంతతికి చెందిన డిజిటల్ అభివృద్ధి, సమాచార శాఖ సీనియర్ సహాయ మంత్రి జనిల్ పుతుచ్చేరి సహా దాదాపు 130 మంది యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.2020 సార్వత్రిక ఎన్నికల్లో పీఏపీ 93 స్థానాల్లో 83 స్థానాలను గెలుచుకుని, ఎన్నికలను కైవసం చేసుకుంది. వీరిలో 27 మంది కొత్త అభ్యర్ధులకు అవకాశం కల్పించగా. వీరిలో భారతీయులెవ్వరూ లేరు. ఇది పార్లమెంటులో సమాజ ప్రాతినిధ్యంపై విమర్శలకు తావిచ్చింది. అమెరికా, కెనడా రాజకీయాల్లో భారతీయ సంతతి అభ్యర్తులు సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. మరి తాజా పరిణామాలతో ఎంతమంది భారత సంతతి వారు గెలుపు గుర్రాలుగా నిలవనున్నారో చూడాలి.
క్రైమ్

ఊపిరితిత్తుల్లో వేరుశనక్కాయ ఇరుక్కుని..
అబ్దుల్లాపూర్‌మెట్(రంగారెడ్డి జిల్లా): ఊపిరితిత్తుల్లో వేరుశనగ కాయ ఇరుక్కోవడంతో ఓ చిన్నారి ప్రాణం కోల్పోయింది. పోలీసులు, బాధి త కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లష్కర్‌గూడకు చెందిన బండారి శ్యామ్‌సుందర్, మహేశ్వరి దంపతుల కూతురు తన్విక (4) ఆదివారం సాయంత్రం వేరుశనగ కాయలు తింటుండగా.. ప్రమాదవశాత్తు ఓ కాయ ఊపిరితిత్తుల్లో ఇరుక్కుంది. దీంతో శ్వాస తీసుకునేందుకు చిన్నారి ఆయాస పడింది. వెంటనే తల్లిదండ్రులు ఆమెను చికిత్స నిమిత్తం నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ఎక్స్‌రే తీయించిన వైద్యులు తని్వక ఊపిరితిత్తుల్లో వేరుశనగ కాయ ఉన్నట్లు గుర్తించారు. ఆపరేషన్ ద్వారా తొలగించాలని సూచించడంతో తల్లిదండ్రులు ఇందుకు అంగీకరించారు. సోమవారం శస్త్రచికిత్స చేస్తామని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా ఉదయం 7.55 గంటల సమయంలో బాలిక మృతిచెందింది. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు.

నా కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తా..!
బంజారాహిల్స్(హైదరాబాద్): వివాహితపై కన్నేసిన ఆమెకు వరుసకు సోదరుడైన యువకుడు తన గదికి వచ్చి కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తానంటూ బెదిరించిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జూబ్లీహిల్స్‌లోని నందగిరిహిల్స్‌లో నివసించే మహిళకు (26)కు ముగ్గురు సంతానం. ఆమెకు భర్తకు దూరపు బంధువైన నవీన్ అనే యువకుడు నగరంలోనే ఉంటూ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తరచూ ఇంటికి వచ్చే అతను ఆమెతో మాటలు కలుపుతూ తన కోరికను బయటపెట్టేవాడు. తాను అడిగింది ఇవ్వకపోతే పరువు తీస్తానంటూ బెదిరించేవాడు. రెండు నెలల క్రితం బాధితురాలు ఈ విషయం తనకు భర్తకు చెప్పడంతో అప్పటి నుంచి నవీన్ ఆమెకు ఫోన్ చేయడం మానేశాడు. ఈ నెల 26న కొందరి వద్ద నవీన్ ఆమెపై అసభ్యకరంగా ప్రచారం చేశాడు. ఆమె పనిచేస్తున్న సెలూన్‌కు వెళ్లి నువ్వు బయటకు వస్తావా..? నన్ను లోపలికి రమ్మంటావా? అంటూ బెదిరించాడు. తాను బయటకు రానని చెప్పడంతో నువ్వు నా గదికి రాకపోతే మొహంపై యాసిడ్ పోసి చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో ఆందోళనకు గురైన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు నవీన్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చంపేసి..లిఫ్ట్ గుంతలో పడేసి..
కవాడిగూడ: గుర్తుతెలియని ఓ యువకుడిని దారుణంగా హత్య చేసి...సమీప భవనంలోని లిఫ్ట్ గుంతలో శవాన్ని పడేసి వెళ్లిన ఘటన దోమలగూడ పీఎస్ పరిధిలోని హిమాయత్‌నగర్ స్ట్రీట్ నెంబర్ 8లో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి ఆ యువకుడిని గుర్తు తెలియని దుండగలు ముందుగా బండరాయితో మోది హత్య చేశారు. అనంతరం మృతదేహన్ని బట్టలో చుట్టి ప్లాజా అపార్ట్మెంట్లోని పంజాబ్ నేషనల్ బ్యాంకు పక్కనే ఉన్న లిఫ్ట్ గుంతలో పడేసి పారిపోయారు. సోమవారం ఉదయం అపార్ట్మెంట్ ప్రాంగణాన్ని శుభ్రం చేసేందుకు వచ్చిన సిబ్బంది రక్తపు మరకలు, దుస్తులు పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే దోమలగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా అపార్ట్మెంట్లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ పక్కనే ఉన్న లిఫ్ట్‌లో 32 సంవత్సరాల యువకుడి మృతదేహం నగ్నంగా పడి ఉంది. వెంటనే సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి, గాందీనగర్ డివిజన్ ఇన్చార్జీ ఏసీపీ గురురాఘవేంద్ర దోమలగూడ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐలు నిరంజన్, సాయిచంద్‌లు, క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి తనిఖీలు చేశారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరిలించారు. ఇదిలా ఉండగా ప్రతి నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో హత్య జరగడం సంచలనం సృష్టించింది. కాగా స్థానికుల వివరాల ప్రకారం..గుర్తుతెలియని యువకుడు ఆదివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో భోజనం చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ షట్టర్ ముందు నిద్రపోగా..మద్యం లేదా గంజాయి మత్తులో ఉన్నకొంత మంది దుండగులు అతని వద్దకు వచ్చి నిద్రలేపి పక్క వీధిలోకి తీసుకెళ్లి ఘర్షణ పడ్డారని తెలిసింది. ఈ క్రమంలోనే హత్య జరిగినట్లు భావిస్తున్నారు. ఈ సంఘటన అర్ధరాత్రి రెండు నుంచి మూడు గంటల మధ్య జరిగినట్లు సమాచారం.

భార్య కళ్లెదుటే ప్రియుడ్ని?.. పట్టపగలే పెద్దపల్లిలో దారుణం
సాక్షి, క్రైమ్: పట్టపగలే.. అదీ అంతా చూస్తుండగానే పెద్దపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మరో వ్యక్తిని కిరాతకంగా పొడిచి చంపడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. సోమవారం వ్యవసాయ మార్కెట్లో చోటు చేసుకున్న ఘటన వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి మండలం అప్పన్నపేటకు చెందిన పొలం కుమార్ అనే యువకుడు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో దారుణ హత్యకు గురయ్యాడు. ధర్మారం మండలం దొంగతుర్తికి చెందిన రైలుకుల సంతోష్(సతీష్) అనే వ్యక్తి కుమార్‌ను కత్తితో పొడిచి హతమార్చాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. అయితే.. ఆ మహిళ సంతోష్ భార్యగా నిర్ధారణ అయ్యింది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని.. అందుకే భార్య కళ్ల ముందే ప్రియుడ్ని హతమార్చి ఉంటాడని భావిస్తున్నారు. నిందితుడు సంతోష్‌ను పోలీసులు అక్కడికక్కడే అరెస్ట్ చేశారు. అయితే కేసు విచారణ చేపట్టిన పోలీసులు.. హత్యకు గల పూర్తి వివరాలు తెలియజేయాల్సి ఉంది.