Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

India plans twin financial strikes on Pakistan1
భారత్‌ భారీ వ్యూహం.. పాక్‌కు కోలుకోలేని దెబ్బ!

ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి ఘటన భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలను క్రియేట్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం చెప్పేలా భారత్‌ ప్లాన్‌ చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక, తాజాగా పాక్‌పై రెండు ఆర్థిక దాడులకు భారత్‌ ప్రణాళికలు చేసినట్టు సమాచారం.కాగా, పాకిస్తాన్‌ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా భారత్‌ ప్రణాళికలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌(FATF) గ్రేలిస్టులోకి పాకిస్తాన్‌ను తిరిగి చేర్చడానికి భారత్‌ ప్రయత్నిస్తోంది. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహాయాన్ని అరికట్టడంలో విఫలమయ్యే దేశాలను ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లో చేరుస్తుంది. గతంలో ఈ జాబితాలో ఉన్న పాకిస్తాన్‌ను తిరిగి అందులోకి చేర్చడం ద్వారా ఉగ్రవాదానికి నిధులు అందకుండా అంతర్జాతీయంగా ఆ దేశంపై ఒత్తిడి పెంచాలని భారత్ భావిస్తోంది. రెండో చర్యగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఇటీవల పాకిస్థాన్‌కు మంజూరు చేసిన 7 బిలియన్ డాలర్ల భారీ ఆర్థిక సాయ ప్యాకేజీ వినియోగంపై భారత్ తన ఆందోళనలను వ్యక్తం చేయనున్నట్టు సమాచారం. ఈ నిధులను పాకిస్తాన్‌ ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాల కోసం దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ సంబంధిత అంతర్జాతీయ వేదికలపై ఈ అంశాన్ని లేవనెత్తాలని భారత్ యోచిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. భారత్‌ ప్లాన్‌ చేసిన చర్యల కారణంగా పాకిస్తాన్‌కు కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఈ ద్వంద్వ వ్యూహం ద్వారా పాకిస్థాన్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు ఆర్థిక మార్గాలను మూసివేయాలని, తద్వారా సరిహద్దు ఉగ్రవాదాన్ని కట్టడి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. పహల్గామ్ దాడి వంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు ఈ ఆర్థికపరమైన ఒత్తిడిని ఒక మార్గంగా భారత్ పరిగణిస్తున్నట్టు సమాచారం.2022లో విముక్తి..కాగా, 2022లో అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్‌కు కాస్త ఊరట లభించింది. ఉగ్రవాద సంస్థలకు నిధులు సరఫరా చేస్తోందన్న కారణంతో పాక్‌ను గ్రే లిస్టులో ఉంచిన ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌(FATF) ఆ జాబితా నుంచి తొలగించింది. మనీలాండరింగ్‌ నిరోధక చర్యలను పాకిస్థాన్‌ పటిష్ఠంగా అమలు చేస్తోందని, సాంకేతిక లోపాలను పరిష్కరిస్తూ ఉగ్రసంస్థలకు నిధుల సరఫరా విషయంలోనూ పోరాటం చేసిందని ఎఫ్‌ఏటీఎఫ్‌ వెల్లడించింది. దీంతో పాక్‌ను గ్రే లిస్టు నుంచి తప్పించినట్లు తెలిపింది. గ్రే లిస్టులో ఉన్న దేశాలు అంతర్జాతీయ సంస్థల నుంచి నిధుల పొందడం చాలా కష్టం. ఈ దేశాలకు ముఖ్యంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎప్‌), ప్రపంచ బ్యాంక్‌, ఏడీబీ, యూరోపియన్‌ యూనియన్‌ వంటి సంస్థలు ఆర్థిక సాయం చేసేందుకు వెనకాడుతాయి.ఉగ్రవాదానికి ఊతమిచ్చే అతి ప్రమాదకర దేశాలను ఎఫ్‌ఏటీఎఫ్ బ్లాక్‌ లిస్ట్‌ జాబితాలోకి చేరుస్తుంది. కాగా, ఇప్పటివరకు ఇరాన్‌, ఉత్తర కొరియా మాత్రమే బ్లాక్‌ లిస్ట్‌ జాబితాలో ఉన్నాయి. బ్లాక్‌ లిస్ట్‌ నుంచి తప్పించుకోవడానికి మూడుదేశాల మద్దతు అవసరం. అయితే, చైనా, టర్కీ, మలేషియా దేశాలు పాక్‌కు మద్దతు ఇవ్వడంతో బ్లాక్‌ లిస్ట్‌లోకి వెళ్లకుండా బయటపడింది. తొలిసారిగా 2018 జూన్‌లో ఎఫ్‌ఏటీఎఫ్‌ పాకిస్తాన్‌ను గ్రే లిస్ట్‌లో ఉంచింది. అనంతరం వీటి నుంచి బయటపడేందుకు పాకిస్తాన్‌కు రెండు సార్లు సమయమిచ్చింది. వీటిలో భాగంగా ఉగ్రవాదులకు అందుతున్న నిధుల మూలాలను కనిపెట్టే దిశగా పాక్‌ చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఐరాస ఉగ్రవాదులుగా గుర్తించిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలి. అలాగే పట్టుబడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు నిరూపించగలగాలి. ఐరాస గుర్తించిన ఉగ్రవాదులకు నిధులు అందకుండా ఆర్థికపరమైన ఆంక్షలు విధించాలి. ఎఫ్‌ఏటీఎఫ్‌ నిర్దేశించిన ఈ లక్ష్యాలను చేరుకోవడంలో పాక్‌ ఇప్పటివరకు విఫలమవుతూనే వచ్చింది. కానీ, జూన్‌ నెలలో ఎఫ్‌ఏటీఎఫ్‌ ప్లీనరీ సమావేశంలో పాక్‌కు అనుకూలంగా ప్రకటన విడుదల చేసింది. ధరలతో పాక్‌ అతలాకుతలం..మరోవైపు.. ఇప్పటికే తీవ్ర ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌కు ఇప్పుడు మరో తలనొప్పి వచ్చి పడింది. పాక్‌తో వాణిజ్య సంబంధాలు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించడంతో పాక్‌ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ క్రమంలోనే అట్టారీ సరిహద్దును భారత్ మూసివేసింది. దీంతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం నిలిచిపోయింది. దీంతో ఇప్పటికే తీవ్రంగా కుదేలైన పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై ఇది మరింత తీవ్ర ప్రభావం చూపనుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో పాక్‌లో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకింది. భారీగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో పాక్ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో ప్రస్తుతం పాక్‌లో ఆహార ధరలు భారీగా పెరిగాయి.పాకిస్తాన్‌లో ప్రస్తుతం కొన్ని ఆహార పదార్థాల ధరలుకిలో చికెన్: రూ. 798.89 పాకిస్తాన్ రూపాయలుకిలో బియ్యం: రూ. 339.56 పాకిస్తాన్ రూపాయలుడజను గుడ్లు: రూ. 332 పాకిస్తాన్ రూపాయలులీటర్ పాలు: రూ. 224 పాకిస్తాన్ రూపాయలుఅరకిలో బ్రెడ్: రూ. 161.28 పాకిస్తాన్ రూపాయలుకిలో టమాట: రూ. 150 పాకిస్తాన్ రూపాయలుకిలో బంగాళాదుంప: రూ. 105 పాకిస్తాన్ రూపాయలు.

Fighter Jets Landing In 1st Night Landing Airstrip On Ganga Expressway In Up2
కమ్ముకున్న యుద్ధ మేఘాలు.. పాక్‌కు వెయ్యి కిలోమీటర్ల దూరంలో భారత్‌ ఫైటర్‌ జెట్‌లు

లక్నో: పహల్గాం ఉగ్రదాడితో భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో పాకిస్తాన్‌కు కేవలం వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌ గంగా ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ఫైటర్‌ జెట్‌లు విన్యాసాలు చేయడం చర్చాంశనీయంగా మారింది.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు చేస్తున్నయుద్ధ విమానాల్లో రాఫెల్, మిగ్-29, మిరాజ్ 2000 ఉన్నాయి. ఈ యుద్ధ విమానాల్ని రాత్రి వేళ్లల్లో ల్యాండ్‌ చేసేలా అందుబాటులోకి తెచ్చిన యూపీ షాజహాన్‌పూర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై నిర్మించిన నైట్ ల్యాండింగ్ స్ట్రిప్‌పై విన్యాసాలు ప్రదర్శిస్తున్నాయి. 3.5 కిలోమీటర్ల పొడవు గల ఈ ఎయిర్‌స్ట్రిప్ రాత్రి సమయంలో ఫైటర్‌ జెట్‌లు ల్యాండింగ్‌లకు అనుకూలంగా ఉంటుంది. ఇది ఎయిర్ ఫోర్స్ జెట్లు 24 గంటలూ ఆపరేషన్లకు వీలు కల్పించడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో ఎక్స్‌ప్రెస్‌వేను ప్రత్యామ్నాయ రన్‌వేగా ఉపయోగించగల సామర్థ్యాన్ని అంచనా వేయడంలో సహాయపడుతుంది.దీంతో, ఉత్తరప్రదేశ్‌లో మొత్తం నాలుగు ఎక్స్‌ప్రెస్‌వే ల్యాండింగ్ స్ట్రిప్‌లు అందుబాటులో ఉండగా.. షాజహాన్‌పూర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై ల్యాండింగ్‌ స్ట్రిప్‌ మాత్రమే రాత్రివేళల్లో ఫైటర్‌ జెట్‌లను ల్యాండ్‌ చేసుకోవచ్చు. ఈ ఆధునిక ఎయిర్‌స్ట్రిప్ ఎక్స్‌ప్రెస్‌వేపై నిర్మించబడిన భారత్‌లో తొలి రన్‌వేగా నిలిచింది. ఇది రాత్రింబవళ్ళూ మిలిటరీ ఆపరేషన్లకు అనుకూలంగా రూపొందించింది. భద్రతను నిర్ధారించేందుకు రన్‌వే ఇరుప్రక్కల 250 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. Indian Air Force jets are carrying out a flypast on the Ganga Expressway airstrip.3.5 kms long airstrip is India’s first night landing airstrip on an expressway - night landing trials scheduled today evening. pic.twitter.com/AaJt9RoTEv— The Uttar Pradesh Index (@theupindex) May 2, 2025గంగా ఎక్స్‌ప్రెస్‌వే ఎయిర్‌స్ట్రిప్‌పై ల్యాండింగ్ చేసే ఇండియన్‌ ఎయిర్స్‌ యుద్ధ విమానాల ప్రత్యేకతలు రాఫెల్: ఆధునిక ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్స్, లాంగ్-రేంజ్ మీటియర్ క్షిపణులతో నిండి ఉంది. పరిస్థితులు ఎలా ఉన్నా సరే 100 కిలో మీటర్ల నుంచి 150 కిలోమీటర్ల శత్రు స్థావరాల్ని నేలమట్టం చేయడంలో దిట్టఎస్‌యు-30 ఎంకేఐ: ఇండియా-రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ట్విన్-సీటర్ యుద్ధవిమానం. ఈ ఎస్‌యూ-30 ఎంకేఐ దూరంలో ఉన్న లక్ష్యాల్ని దాడులు చేయగలిగే సామర్థ్యంతో పాటు బ్రహ్మోస్ వంటి క్షిపణులను మోసుకెళ్లగలదు.మిరాజ్ 2000: ఫ్రెంచ్ మూలాలున్న, హై-స్పీడ్ డీప్ స్ట్రైక్ మిషన్స్‌కు అనువైన యుద్ధవిమానం, ఇది అణ్వాయుధ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఫిబ్రవరి 2019లో జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు భారత వైమానిక దళానికి చెందిన 12 మిరాజ్-2000 యుద్ధ విమానాలను వినియోగించింది.మిగ్-29: వేగం, ఎత్తు పరంగా అత్యుత్తమ ప్రదర్శనతో పాటు రాడార్‌ల కళ్లుగప్పి శుత్రు స్థావరాల్ని నాశనం చేస్తుంది. జాగ్వార్: గ్రౌండ్ అటాక్, యాంటీ-షిప్ మిషన్ల కోసం రూపొందించబడిన ప్రిసిషన్ స్ట్రైక్ ఎయిర్‌క్రాఫ్ట్. దీని ప్రత్యేకతలు.. శత్రు నౌకలను గుర్తించడం, లక్ష్యంగా చేసుకోవడం, నాశనం చేస్తుంది. ఈ యాంటీ-షిప్ మిషన్లు సాధారణంగా విమానాలు, జలాంతర్గాములు, ఉపరితల నౌకలు లేదా నావికా ముప్పు నుంచి తప్పించుకునేందుకు ఉపయోగిస్తారు. సి-130 జె సూపర్ హెర్కులిస్: హెవీ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్, స్పెషల్ ఫోర్స్ మిషన్లు, విపత్తు సహాయం, రక్షణ కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తుంది.ఏఎన్-32: ఎత్తైన ప్రాంతాల్లో సైనికులు, సరఫరాలు తరలించేందుకు అనుకూలమైన ట్రాన్స్‌పోర్ట్ విమానం.ఎంఐ-17 వి5 హెలికాప్టర్: సెర్చ్ అండ్ రిస్క్యూ, మెడికల్ ఎవాక్యుయేషన్, మానవతా సహాయం వంటి బహుళ పనుల కోసం ఉపయోగించే హెలికాప్టర్.

Amaravati Relaunch: Chandrababu Govt Is Moving Massive People3
అమరావతి రీలాంచ్‌.. పరువు కోసం బాబు సర్కార్‌ పాట్లు

సాక్షి, విజయవాడ: పరువు నిలుపుకోవడం కోసం చంద్రబాబు ప్రభుత్వం పాట్లు పడుతోంది. అమరావతి పునః ప్రారంభ కార్యక్రమానికి ప్రజలను బలవంతంగా తరలింపునకు ప్రభుత్వం నానా తిప్పలు పడుతోంది. 5 లక్షల మందిని తరలించే బాధ్యత అధికారులు, ఉద్యోగులకు అప్పగించింది. రాష్ట్ర వ్యాప్తంగా 6500 బస్సులు ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం.. అన్ని ప్రాంతాల నుంచి ప్రజలను తరలించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.ప్రతి డ్వాక్రా గ్రూపు నుంచి ఏడుగురు సభ్యులు తప్పక హాజరు కావాలంటూ హుకుం జారీ చేసింది. హాజరుకాని డ్వాక్రా గ్రూపులను ఆన్‌లైన్‌లో తొలగిస్తామంటూ హెచ్చరికలిచ్చిన సర్కార్‌.. సంక్షేమ పథకాలు అమలు నిలిపివేస్తామంటూ ఆదేశాలిచ్చింది. యనిమేటర్ల ఆడియో లీక్‌తో చంద్రబాబు సర్కార్‌ బండారం బట్టబయలైంది. సచివాలయ ఉద్యోగులు, అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.5 లక్షల మంది తరలిస్తామని ప్రభుత్వం ప్రకటించగా.. ప్రభుత్వం.. పి4 బహిరంగ సభ ప్లాప్ కావడంతో ప్రభుత్వంలో గుబులు పుట్టిస్తోంది. ప్రధాని మోదీ రాక నేపథ్యంలో భారీగా ప్రజల తరలింపుకు ప్రయత్నాలు చేస్తోది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు నిన్నటి నుండి బస్సుల్లో జనం, డ్వాక్రా మహిళలు తరలింపు కొనసాగుతోంది. అన్ని ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సుల్లో తరలిస్తున్నారు.

Shouldn't Have Bought Suryavanshi, Ex CSK Opener Bold Remark After RR IPL 2025 Exit4
IPL 2025: వైభవ్‌ సూర్యవంశీపై సీఎస్‌కే మాజీ ఓపెనర్‌ సంచలన కామెంట్స్‌

ఐపీఎల్‌లో తన మూడో ఇన్నింగ్స్‌లోనే విధ్వంసకర శతకం (35 బంతుల్లో) బాది బేబీ బాస్‌గా గుర్తింపు తెచ్చుకున్న 14 ఏళ్ల రాజస్థాన్‌ రాయల్స్‌ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీపై చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాజీ ఓపెనర్‌ అభినవ్‌ ముకుంద్‌ సంచలన కామెంట్స్‌ చేశాడు. రాయల్స్‌ సూర్యవంశీని వేలంలో కొనుగోలు చేయాల్సింది కాదని అభినవ్‌ అభిప్రాయపడ్డాడు. రాయల్స్‌ యాజమాన్యం సూర్యవంశీతో పాటు నితీశ్‌ రాణాపై అనవసర పెట్టుబడి పెట్టిందని అన్నాడు. తానైతే సూర్యవంశీని రూ. 1.1 కోట్లకు, నితీశ్‌ రాణాను రూ. 4.2 కోట్లకు కొనుగోలు చేసేవాడిని కాదని తెలిపాడు.వైభవ్‌, నితీశ్‌పై పెట్టిన పెట్టుబడిని మంచి బౌలర్ల కోసం వినియోగించుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. రాయల్స్‌ మేనేజ్‌మెంట్‌ బ్యాటర్ల మోజులో పడి బౌలింగ్‌ విభాగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని అన్నాడు. ఈ సీజన్‌లో ఆర్చర్‌ ఒక్కడే తీసుకున్న డబ్బుకు న్యాయం చేశాడని పేర్కొన్నాడు. రాయల్స్‌ యాజమాన్యం ఎంపిక చేసుకున్న భారత్‌ బౌలర్లలో (తుషార్‌ దేశ్‌పాండే, యుద్ద్‌వీర్‌ సింగ్‌, ఆకాశ్‌ మధ్వాల్‌, కుమార్‌ కార్తికేయ) ఒక్కరు కూడా సత్తా చాటలేకపోయారని అన్నాడు. తుషార్‌ దేశ్‌పాండేపై రూ. 6.75 కోట్ల పెట్టుబడి పెట్టి అనవసరంగా డబ్బును వృధా చేసుకున్నారని అన్నాడు. గత సీజన్‌లో తమ పంచన ఉన్న బౌల్ట్‌, చహల్‌, ఆవేశ్‌ ఖాన్‌, అశ్విన్‌ను వదిలేసి రాయల్స్‌ యాజమాన్యం మూల్యం చెల్లించుకుందని అభిప్రాయపడ్డాడు. మొత్తంగా మెగా వేలంలో రాయల్స్‌ ఎంపికలను తప్పుబట్టాడు.కాగా, ఈ సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ యాజమాన్యం ఇదివరకే సత్తా చాటిన ఆటగాళ్లను వేలానికి వదిలేసి పెద్ద తప్పిదం చేసింది. బ్యాటింగ్‌లో బట్లర్‌, బౌలింగ్‌లో చహల్‌, బౌల్ట్‌ ఆ జట్టుకు ఎన్నో అపురూప విజయాలు అందించారు. వీరిని కాదని రాయల్స్‌ యాజమాన్యం యువ ఆటగాళ్లపై పెట్టుబడి పెట్టి చేతులు కాల్చుకుంది. ఎన్నో అంచనాలు పెట్టి కొనుగోలు చేసిన లంక స్పిన్‌ ద్వయం హసరంగ, తీక్షణ ఆశించిన ప్రభావం చూపలేకపోయారు. రిటైన్‌ చేసుకున్న వారిలో కెప్టెన్‌ శాంసన్‌ గాయంతో సైడ్‌ అయిపోగా.. జురెల్‌, హెట్‌మైర్‌ దారుణంగా విఫలమయ్యారు. నితీశ్‌ రాణా ఒక్క మంచి ఇన్నింగ్స్‌కే పరిమితమయ్యాడు. పరాగ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పి అతడి కాస్తో కూస్తో ఫామ్‌ను చెడగొట్టుకున్నారు. సూర్యవంశీ ఫేట్‌ను నాలుగు మ్యాచ్‌లకే డిసైడ్‌ చేయలేని పరిస్థితి.ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ 2025లో రాజస్థాన్‌ రాయల్స్‌ కథ ముగిసింది. నిన్న (మే 1) ముంబై ఇండియన్స్‌ చేతిలో ఓటమితో ఆ జట్లు ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన రాయల్స్‌ ఏకంగా 8 పరాజయాలు మూటగట్టుకుంది. కేవలం మూడే విజయాలు సాధించింది. కొన్ని గెలవాల్సిన మ్యాచ్‌ల్లో అనూహ్యంగా ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో రాయల్స్‌ మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. తమ తదుపరి మ్యాచ్‌ల్లో కేకేఆర్‌ (మే 4), సీఎస్‌కే (మే 12), పంజాబ్‌ (మే 16) జట్లను ఢీకొట్టనుంది.

NIA Preliminary Report On Pahalgam Incident5
పహల్గాం ఉగ్రదాడిపై విస్తుపోయే వాస్తవాలు.. NIA చేతికి చిక్కిన కీలక ఆధారాలు

ఢిల్లీ : జమ్మూకశ్మీర్‌ పహల్గాం ఉగ్రదాడిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పహల్గాం ఉగ్రదాడి ఆర్మీ, లష్కరే తోయిబా కన్నుసన్నల్లో జరిగినట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) నిర్ధారించింది. పహల్గాం ఉగ్రదాడిలో ఎన్‌ఐఏ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ ఎన్‌ఐఏ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాక్‌ ఐఎస్‌ఐ,ఉగ్రసంస్థ లష్కరే తోయిబాలు కలిసి ఈ కిరాతక దాడికి పాల్పడినట్లు ఎన్‌ఐఏ తేల్చింది. పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబా ఆఫీస్‌లో పహల్గాం ఉగ్రదాడికి కుట్ర జరిగినట్లు ప్రాథమిక నివేదికల్లో పేర్కొంది.ఇక పహల్గాంలో దాడికి పాల్పడ్డ ఇద్దరు ఉగ్రవాదుల్ని ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. షమీమ్‌ మూసా అలియాస్‌ అస్మీన్‌ మూసా,అలీబాయ్‌ అలియాస్‌ తల్హా నేరుగా ఉగ్రదాడికి పాల్పడినట్లు ఎన్‌ఐఏ తెలిపింది. ఎన్‌ఐఏ దర్యాప్తు.. శాటిలైట్‌ ఫోన్ల వినియోగంపాకిస్తాన్‌ పౌరులైన ఆ ఇద్దరు ఉగ్రవాదులు పహల్గాం ఉగ్రదాడికి కొన్ని వారాల ముందు భారత్‌ భూభాగంలోకి ప్రవేశించినట్లు ఎన్‌ఐఏ విచారణలో తేలింది. వారికి ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ (OGWs) సహాయం చేసినట్లు నిర్ధారించింది. అదే సమయంలో పహల్గాంలో కాల్పులు జరిగిన ప్రాంతంలో ఎన్‌ఐఏ ఫోరెన్సిక్, ఎలక్ట్రానిక్ డేటా సేకరించింది. ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న 40కి పైగా తుపాకుల బాలిస్టిక్‌, కెమికల్‌ టెస్టులు జరిపేందుకు ల్యాబ్‌కు పంపింది. 3డీ మ్యాపింగ్‌ సాయంతో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డ తీరును గుర్తించేందుకు లేజర్‌ స్కానర్ల సాయంతో త్రీడీ మ్యాపింగ్ చేసింది. ఈ 3డీ మ్యాపింగ్‌ సాయంతో కాల్పుల జరిగే సమయంలో ఉగ్రవాదులు పొజీషన్‌తో పాటు టూరిస్టులు ఎలా కుప్పకూలారు. బ్లడ్‌ శాంపిల్స్‌, కాల్పులు జరిగినప్పుడు బుల్లెట్ల నుంచి వెలువడ్డ రసాయనాలు వంటి వాటిని సేకరించారు. లోయ చుట్టూ ఉన్న మొబైల్ టవర్ల నుండి డంప్ డేటాను కలెక్ట్‌ చేశారు. ఈ డేటా ఆధారంగా ఉగ్రదాడి ముందు రోజుల్లో కాల్పులకు తెగ బడ్డ ప్రదేశం నుంచి శాటిలైట్‌ ఫోన్‌లను వినియోగించారని, ముఖ్యంగా బైసరీన్‌, దాని చుట్టు పక్కల ప్రదేశాల్లో కనీసం మూడు శాటిలైట్‌ ఫోన్లను నిందితులు వినియోగించగా.. రెండు శాటిలైట్ ఫోన్ల సిగ్నల్స్‌ను గుర్తించారు. 2,800 మందిని విచారించి ఉగ్రదాడిపై మొత్తం 2,800 మందికి పైగా ఎన్‌ఐఏ, భద్రతా సంస్థలు ప్రశ్నించాయి. మే2 నాటికి మరో 150 మందిని విచారించేందుకు కస్టడీలోకి తీసుకున్నాయి. వీరిలో అనుమానిత ఓజీడబ్ల్యూ, జమాత్-ఇ-ఇస్లామి వంటి నిషేధిత గ్రూపులు, హురియత్ కాన్ఫరెన్స్‌లోని వివిధ వర్గాలతో సంబంధాలు ఉన్న వ్యక్తులు ఉన్నారు.ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటే ఉగ్రవాద సంస్థలు, తిరుగుబాటు గ్రూపులకు సాయుధ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొనకుండా లాజిస్టికల్, ఆర్థిక సమాచార సహాయాన్ని అందించే వ్యక్తులను ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ (OGWలు) అంటారు.కార్ట్రిడ్జ్‌ అంటేకాల్పులు జరిపిన తరువాత మిగిలి ఉన్న మందుగుండు సామాగ్రి భాగాన్ని కార్ట్రిడ్జ్ అంటారు. వాటిల్లో బుల్లెట్‌లు,మందుగుండు సామగ్రిలో చేర్చే షెల్, గన్‌ పౌడర్‌, గన్‌లో ఉండే బులెట్లను మండించే ప్రైమర్ల అనే భాగాలున్నాయి.

Chandrababu Naidu Yet to Visit Victims of Simhachalam Temple Tragedy6
పరామర్శకూ తీరికలేదా బాబూ!

సింహాచలం అప్పన్న ఆలయంలో హాహాకారాలు.. మృత్యు ఘోష.. ఎవరికైనా బాధనిపిస్తుంది. కాని ఆంధ్రప్రదేశ్‌ సర్కారుకు మాత్రం అవేమీ పట్టినట్లు లేదు. కూటమి నేతలందరూ అమరావతి సంబరంలో మునిగి తేలుతున్నారు. పలుమార్లు శంకుస్థాపనలు జరిగిన అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఇంకోసారి శంకుస్థాపన చేయిస్తున్నారు.సింహాచలంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలి అయింది సామాన్యులే.. అమరావతి హంగామాతో తీవ్రంగా నష్టపోతున్నదీ పేదలే. హిందూ మతంలో ఒక నమ్మకం ఉంటుంది. ఏదైనా ఒక కుటుంబంలో అశుభం జరిగితే నిర్దిష్టంగా కొన్నాళ్లపాటు ఎలాంటి శుభ కార్యక్రమాలు జరపరు. హిందూ మతోద్దారకులమని ప్రచారం చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సనాతన హిందూ అని చెప్పుకునే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు. శంకుస్థాపన కార్యక్రమాలను వాయిదా వేసుకోలేదు. పాలకులు రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను కుటుంబంలా పరిగణిస్తారు. ఆ ప్రకారం చూస్తే ఒక ప్రముఖ ఆలయంలో జరిగిన ఈ దుర్ఘటనలో కొత్తగా కట్టిన గోడ కూలి ఏడుగురు మరణించినా తమ ప్రోగ్రాం ఆపుకోవడానికి ఇష్టపడలేదు. సింహాచలం మృతుల కుటుంబాలను పరామర్శించడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు వెళ్లలేదు.అంటే వారికి ఏదో అనుమానం ఉండబట్టే అటువైపు వెళ్లకుండా ఉన్నట్లు అనిపిస్తుంది.మామూలుగా అయితే ఒక ప్రసిద్ద పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఘటనలు సంభవిస్తే వెంటనే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు అంతా వెళ్లి సహాయ చర్యలను పర్యవేక్షించి బాధితులకు స్వాంతన చేకూర్చడానికి యత్నిస్తారు. కాని వీరిద్దరూ ఆ పని చేయలేదు. కొద్ది నెలల క్రితం వైకుంఠ ఏకాదశి టిక్కెట్ల కోసం తిరుపతి వెళ్లిన వేలాది భక్తులు తొక్కిసలాటకు గురయ్యారు. ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఆ తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు. ఆ సమాచారం వచ్చిన వెంటనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు పోటీ పడి తిరుపతి వెళ్లారు.ఏదో చేస్తున్నట్లు హడావుడి చేశారు. అలాంటి వారు సింహాచలం ఎందుకు వెళ్లలేదు? ప్రధాని మోడీ అమరావతి వస్తున్నందున వెళ్లలేక పోయారని చెప్పవచ్చు కానీ మూడు గంటల ఖాళీ కూడా లేదనడం అతిశయోక్తి అవుతుంది. పైగా ఇప్పుడు వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కడ నుంచైనా పర్యవేక్షణ చేయవచ్చు. పవన్ కళ్యాణ్ కు ఆ ఇబ్బంది లేదు కదా?మరి ఆయన ఎందుకు సింహాచలం వెళ్లలేదు? దీనికి రెండు,మూడు కారణాలు చెబుతున్నారు. అక్కడకు వెళ్లితే భక్తులలో ఉన్న కోపం అంతా తమపై చూపే అవకాశం ఉందని, వారు ప్రభుత్వ నిర్వాకంపై నిలదీస్తే ఇబ్బంది అవుతుందని అనుకుని ఉండవచ్చ అంటున్నారు. అమరావతి పునః శంకుస్థాపన పనుల పేరుతో తప్పించుకునే అవకాశం ఉండడం. మరొకటి చావుల వద్దకు వెళ్లి రావడం అశుభం అని ఎవరైనా సలహా ఇచ్చారేమో తెలియదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు నిజంగానే హిందూ మతాచారాలపై అంత శ్రద్దగా ఉంటారా అంటే అదీ గ్యారంటీ లేదు. ఏ మతం వారివద్దకు వెళ్లితే ఆ మతమే గొప్పదని చెప్పి వస్తుంటారు. రాజకీయాల కోసం మతాన్ని వాడుకుంటారు.గత గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబు కుటుంబం స్నానమాచరించే ఘట్టాన్ని సినిమా తీయడం కోసం సామాన్య భక్తులను నిలిపి వేయడం, ఒక్కసారిగా గేటు తెరవడం వల్ల తొక్కిసలాట జరిగి 29 మంది మరణించడం జరిగింది. అప్పుడు చంద్రబాబు తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో యత్నాలు చేశారు. చివరికి రోడ్డు ప్రమాదాలలో చనిపోవడం లేదా? కుంభమేళాలో చనిపోలేదా? అంటూ వితండ వాదం చేశారు. అంతే తప్ప అంత పెద్ద ఘటన జరిగితే మామూలుగా అయితే పదవి నుంచి తప్పుకుంటారు. ప్రాంతీయ పార్టీ కనుక ఆయనను పార్టీలో ఎవరూ ప్రశ్నించరు కనుక ఆ ప్రస్తావనే ఉండదు. పోనీ కనీసం ఒక కానిస్టేబుల్ పై కూడా చర్య తీసుకోకపోవడం విశేషం. తిరుపతి తొక్కిసలాట ఘటన జరిన తర్వాత పవన్ కళ్యాణ్ క్షమాపణల డ్రామా తెలిసిన సంగతే.చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌లు ఏమి మాట్లాడింది అందరికి తెలుసు. అక్కడ చైర్మన్ లేదా, అధికారులపై చర్య తీసుకోలేదు. వారిని పదవుల నుంచి తప్పించలేదు. నిజంగా హిందూ మత విశ్వాసాలు నమ్మేవారైతే అలా చేస్తారా? అన్న విమర్శలను పలువురు చేశారు. చివరికి ఒక రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. గోదావరి పుష్కరాల మరణాలపై వేసిన కమిషన్ ఏ తరహా రిపోర్టు ఇచ్చిందో, తిరుపతి ఘటనపై కూడా రిపోర్టు అందుకు భిన్నంగా వస్తుందా అన్నది కొందరి సందేహం. పుష్కరాల తొక్కిసలాటలో తప్పు భక్తులదే అని ఆ కమిషన్ తేల్చింది. ఇప్పుడు సింహాచలం ఘటనపై కూడా విచారణ కమిటీని నియమించినా, ఎంతవరకు ప్రయోజనం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. గోడ కూలడానికి నాణ్యత లోపమని కాకుండా, భక్తుల రద్దీ, తోపులాట అని నివేదికలు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో ఆలయాలలో ఏ చిన్న ఘటన జరిగినా, దాని వెనుక టీడీపీ, జనసేన రాజకీయ శక్తుల ప్రమేయం ఉన్నా, దానినంతటిని జగన్ కు ఆపాదించి ఎంత రచ్చ చేసేవారో గుర్తు చేసుకుంటేనే కంపరం కలుగుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత సైతం అదే ధోరణి ప్రదర్శించారు. తిరుమల లడ్డూ లో జంతు కొవ్వు కలిసిదంటూ దారుణమైన అసత్యాన్ని చంద్రబాబు, పవన్ లు ప్రజలకు చెప్పారు. దీనివల్ల కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని, దైవానికి అపచారం చేసినట్లు అవుతుందని వారు ఫీల్ కాలేదు. తమ రాజకీయ ప్రయోజనం కోసం ఎంతకైనా దిగజారతామన్నట్లుగా వారు వ్యవహరించారు. ఈ ఘటన తర్వాత పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకు వేసి తాను అన్ అప్పాలజిటిక్ సనాతన హిందూ అని ప్రకటించుకుని కొత్త వేషం కట్టారు.అసలు సనాతన హిందూయిజం ఏమి చెబుతుందో తెలియకుండానే, తానేదో వేద శాస్త్రాలు అన్నిటిని పుక్కిట పట్టినట్లుగా మాట్లాడారు. విశేషం ఏమిటంటే ఆయన భార్య విదేశీయురాలు. క్రైస్తవ మతానికి చెందిన వారు.అలాగే పవన్ కు పుట్టిన వారు సైతం క్రైస్తవమే తీసుకున్నారు. మరి అక్కడ ఈయన సనాతనమేమైందో తెలియదు. అనవసరంగా సినిమా డైలాగులు చదివితే ఇలాంటి అప్రతిష్టే వస్తుంది. చంద్రబాబు తన రాజకీయం కోసం ఏ మతాన్ని అయినా వాడుకోగలరు.ఆయన తెలివితేటలు వేరు.ఆయనను మించి ఏదో చేసి బీజేపీ వారి మెప్పు పొందాలని పవన్ చేస్తున్న ఈ ప్రయత్నాల వల్ల ఆయన పరువు పోగొట్టుకుంటున్నారు. పోనీ నిజంగానే అంత సనాతన హిందూ అయితే సింహాచలం ఎందుకు వెళ్లలేదు.ఒక సంతాప సందేశం ఇచ్చి వదలివేశారే.అమరావతి కార్యక్రమ ఆహ్వానంలో తన పేరు వేయలేదని మొదట అలిగారని, దాంతో ప్రభుత్వం మరో కార్డు వేసిందని చెబుతున్నారు. తన డిమాండ్ నెరవేరకపోతే ఏమైనా సింహాచలం వెళ్లేవారేమో. తిరుమల గోవుల మరణాలు, కాశీనాయన క్షేత్రంలో భవనాల కూల్చివేత, తిరుమల, బ్రహ్మం గారి మఠం తదితర ఆధ్యాత్మిక కేంద్రాలలో మత్తు పదార్ధాల వాడకం వంటి ఆరోపణలు వస్తున్నా ఈ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టలేక పోతోందన్న విమర్శలు వస్తున్నాయి. సింహాచలంలో చందనోత్సవానికి ఐదుగురు మంత్రుల కమిటీ కూడా ఉందట. వారంతా ఏమి చేశారో తెలియదు. కాని గోడ కూలి ఏడుగురు మరణించారు. చిన్న ఆలయ గోడ నిర్మాణమే చేయలేని వారు రాజధాని నిర్మాణం చేస్తారట అంటూ సోషల్ మీడియాలో వ్యంగ్య వ్యాఖ్యానాలు వచ్చాయి.అదే టైమ్ లో జగన్ విజయవాడ వద్ద కృష్ణానదికి కట్టిన రిటైనింగ్ వాల్ ఏ రకంగా స్ట్రాంగ్ గా ఉందీ వివరిస్తూ కూడా వీడియోలు వచ్చాయి. సింహాచలం ఘటన తర్వాత జగన్ వెంటనే అక్కడకు వెళ్లి మృతుల కుటుంబాలకు భరోసా ఇచ్చివచ్చారు. చంద్రబాబు, పవన్ లు మాత్రం సాకులు వెతుక్కుంటూ కూర్చున్నారు. ఎల్లో మీడియా మాత్రం సింహాచలం ప్రమాదాన్ని తగ్గించి చూపడానికి నానా పాట్లు పడింది. ఏది ఏమైనా మత సెంటిమెంటును రాజకీయాలకు వాడుకోవడం మంచిది కాదు.అది ఎప్పటికైనా వారికే తగులుతుంది.ఈ నేపథ్యంలో పాలకులు చేసే పాపాలు తమకు శాపాలుగా మారుతున్నాయని ప్రజలు సెంటిమెంట్ గా భావించే పరిస్థితి ఏర్పడింది. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Veg or non-veg food, which is good for health?7
Good Health: వెజ్‌ తినాలా? నాన్‌ వెజ్‌ తినాలా?

ఓ మహిళ.. ఎదురుగా ఉన్న ఓ వ్యక్తితో.. జంతుబలి చేసే హక్కు మీకు ఎవరిచ్చారు..? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. మా ఇష్టం మాకు నచ్చింది మేం తింటాం.. అంటూ అవతలి వ్యక్తి సమాధానం ఇస్తున్నాడు. మాంసాహారం తింటాం అంటే కుదరదు.. ఎందుకు కుదరదో చెబుతాను వినండి.. అంటూ ఆమె శాకాహారం గొప్పతనం, మన సైక్లింగ్‌ ప్రకృతి నియమాలు ఇతర అంశాలను వివరించారు. మీరు ప్యూర్‌ వెజిటేరియన్‌గా మారతారా? అని హామీ తీసుకుంది. ఇంత చెప్పిన తర్వాత ఆ మనిషిలో ఆలోచన మొదలైంది. ఇంతకీ ఎవరా మహిళ.. ఆమె చేస్తున్న ప్రచారం ఏమిటి..? ఆమె పేరే విజయలక్ష్మి.. మియాపూర్‌లో నివాసం ఉంటున్నారు. ఓ కార్పొరేట్‌ స్కూల్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ టీచర్‌. ప్రవృత్తి.. పది మంది గుమిగూడి ఉండే చోట శాకాహారంతో ప్రయోజనాలను వివరిస్తూ శాకాహారమే తినాలంటూ ప్రచారం చేయడం. ఎంతలా వారికి అవగాహన కల్పిస్తున్నారంటే ఆమె మాటలు విన్న తర్వాత చాలా మంది ఇక మాంసాహారం జోలికి వెళ్లకూడదని నిర్ణయం కూడా తీసుకుంటున్నారు. – సికింద్రాబాద్‌ శాకాహారంలో అనుభూతిని ఆస్వాదిద్దామా..? అంటూ మొదలవుతుంది ఆమె ప్రచారం. యునైటెడ్‌ వెజిటేరియన్స్‌ ఫోరం పేరుతో సోషల్‌ మీడియా వేదికగా ఓ పేజీ క్రియేట్‌ చేశారు. తనలాంటి భావజాలం ఉన్న వ్యక్తుల్ని ఆ వేదికపైకి రమ్మని పిలుపునిచ్చారు. ఒకరు, ఇద్దరు, ముగ్గురు.. అలా 200లకు చేరింది ఆ సంఖ్య. వీలున్నప్పుడల్లా పదిమంది జనం ఉండే చోట ప్రత్యక్షమవుతారు. శాఖాహారంలోని గొప్పతనాన్ని.. అది తీసుకోవడం వల్ల శరీర అవయవాల మీద పనితీరును.. ఇతర అంశాల్ని చక్కగా వివరించి మాంసాహారానికి దూరం చేసే ప్రయత్నం చేస్తారు. ఆ మాటలు విన్న ఎవరైనా క్చతంగా ఆకుకూరలు, కూరగాయలు గొప్పతనాన్ని ‘వంట’ పట్టించుకోవడం నిజం. పక్కా ప్రణాళికతో ప్రచారం.. యునైటెడ్‌ వెజిటేరియన్స్‌ ఫోరం వ్యవస్థాపకురాలైన ఎన్‌వీ విజయలక్ష్మి పనితీరు చాలా ఆసక్తికరం. స్వచ్ఛందంగా సేవలందించేందుకు సిద్ధమైన వలంటీర్లు ఎంతమంది అందుబాటులో ఉన్నారో తెలుసుకుంటారు. ఫలానా రోజు ఫలానా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ఓ చిన్న పోస్టులు పెడతారు. ఆ ఏరియాలో ఉండే వలంటీర్లు.. అందుబాటులో ఉండే వారంతా సుముఖత వ్యక్తం చేస్తే వెంటనే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేస్తారు. తక్కువలో తక్కువ కనీసం 50 నుం 60 మంది ఆ కార్యక్రమానికి హాజరయ్యేలా చూసుకుంటారు. అక్కడికి వచ్చిన వారంతా బృందాలుగా విడిపోయి నాలుగైదు ప్రదేశాలకు వెళ్లి తమ సంస్థ లక్ష్యాన్ని వివరిస్తారు.మారేందుకు మీరు సిద్ధమా..? సోషల్‌ మీడియా వేదికగా యునైటెడ్‌ వెజిటేరియన్స్‌ ఫోరంలో చేరాలని ఉందా? అయితే అదే పేరుతో ఉన్న ఫేస్‌బుక్, ఇస్ట్రాగామ్‌ పేజీల ద్వారా గానీ.. సభ్యులుగా చేరిపోవచ్చు. ఆ మీదట వలంటీర్లుగా సేవలు అందించవచ్చు. ఆ మీదట శాకాహారం గొప్పతనాన్ని తెలుసుకొని మీరు శాకాహార ప్రియులుగా మారిపోవచ్చు. పాఠశాలలే టార్గెట్‌గా.. శాకాహారం వినియోగించాలనే ప్రచారాలను జనం రద్దీ ఉండే అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలను టార్గెట్‌ చేసుకుని ఎక్కువ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. చదువుకునే వయసు నుంచే జంతువధ చేయకూడన్న లక్ష్యాన్ని విద్యార్థుల్లో ఇనుమడింపజేయడం ద్వారా ఎక్కువ ఫలితాలు రాబట్టవచ్చన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. సదస్సులు, సమావేశాలు నిర్వహించడం, పవర్‌పాయింగ్‌ ప్రెజెంటేషన్లు ఇవ్వడం, కరపత్రాలు, స్టిక్కర్ల ద్వారా వీలున్న అన్ని మార్గాల్లో ప్రచారాలు కొనసాగించి శాకాహార భోజన ప్రియులను రూపొందిస్తున్నాం. పాఠశాలల్లో యునైటెడ్‌ వెజిటేరియన్స్‌ ఫోరం కమిటీలు ఏర్పాటు చేయడం, పోటీలు నిర్వహిస్తూ వారికి బహుమతులు, జ్ఞాపికలు అందజేసి ప్రోత్సహిస్తున్నాం. – ఎన్‌వీ విజయలక్ష్మి, వ్యవస్థాపకురాలు దేశమంతా ఒకే వేదికగా.. యునైటెడ్‌ వెజిటేరియన్‌ ఫోరం అనేది ఒక తెలంగాణకు మాత్రమే కాకుండా.. అన్ని రాష్ట్రాల్లోనూ విస్తరింపజేసి.. వీలైనంత ఎక్కువ మంది జనాభాను శాకాహారం వైపు తిప్పటిమే తమ ధ్యేయమని చెబుతున్నారు విజయలక్షి్మ. ఆ దిశగా విస్తృతంగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు చెప్పారామే. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఉండే తమ వాళ్ళ ద్వారా అవగాహన కార్యక్రమాల ద్వారా అవగాహన కార్యక్రమాలను ఫోకస్‌ చేస్తున్నారు ఈ వెజిటేరియన్‌ విజయక్ష్మిఆరోగ్య సూత్రాలు వివరిస్తూఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని పాటించడానికి శాకాహారం పాత్ర ఏంటో యునైటెడ్‌ వెజిటేరియన్స్‌ ఫోరం ప్రతినిధులు వివరిస్తారు. ఎదుటివారు మాంసాహార ప్రియులైన వారు అడిగే ప్రశ్నలకి శాకాహార పూరితమైన సమాధానాలు ఇచ్చి వెజిటేరియన్స్‌గా మారాలంటూ రిక్వెస్ట్‌ చేస్తారు. ఒక నెల రోజులు టైం తీసుకోండి.. పప్పు దినుసుల మీద దృష్టి పెట్టండి ఆకుకూరల్లో బలమైన పోషకాల కోసం మీరే తెలుసుకోండి.. మీరు తీసుకునే మాంసాహారాన్ని మేము చెప్పే శాకాహారాన్ని బేరీజు వేసుకోండి అంటూ జనం మెదడుల్లోకి శాఖాహార గొప్పతనాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చేయడమేంటి చాలామందిని మార్చి చూపించారు కూడా..

Heavy Rain, Dust Storm In Delhi NCR8
ఢిల్లీలో వర్ష బీభత్సం.. తల్లి, ముగ్గురు పిల్లలు మృతి

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం సృష్టించిన వర్షం బీభత్సంలో కుటుంబంలో నలుగురు మృతి చెందారు. వర్ష కారణంగా ద్వారాకాలో ఓ ఇంటిపై చెల్లి కూలింది. ఈ దుర్ఘటనలో తల్లి, ఆమె ముగ్గురు పిల్లలు మరణించారు. శుక్రవారం తెల్లవారు జామున ఢిల్లీ వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు చోటు చేసుకున్నాయి. దుమ్ముతో పాటు భారీ వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. వర్షం కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాతావరణ శాఖ సైతం ఢిల్లీలో రెడ్‌ జోన్‌ ప్రకటించింది. భారీ వర్షం కారణంగా ఏర్పడిన ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. వర్షం దెబ్బకు విమానాల సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు ఆయా విమానయాన సంస్థలు అధికారికంగా ప్రకటించాయి. Severe thunderstorms and rain lash Delhi and NCR.IMD forecasts heavy rainfall, thunderstorms, and gusty winds for the next two days, issuing a yellow alert for the national capital.#Rain #IMD #DelhiRains #rainfall #thunderstorms #Weather pic.twitter.com/fiZb2DPJJS— All India Radio News (@airnewsalerts) May 2, 2025 ఎయిర్‌ పోర్టుకు వెళ్లే ముందు ప్రయాణికులు తమ విమానాల రాకపోకల్ని పరిశీలించాలని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రయాణికుల్ని కోరింది. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేసింది #TravelAdvisoryThunderstorms and gusty winds have affected flight operations in parts of Northern India. Some of our flights to and from Delhi are being delayed, which is likely to impact our overall flight schedule. We are doing our best to minimise disruptions.We advise our…— Air India (@airindia) May 2, 2025‘ఢిల్లీకి వెళ్లే, బయల్దేరే ఎయిరిండియా విమానాల సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలో దుమ్ము తుఫాను, వర్షం కారణంగా విమానాల్ని దారి మళ్లిస్తున్నాం. ఫలితంగా మొత్తం విమానాల రాకపోకలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. అంతరాయాలను తగ్గించడానికి మా వంతు మేం కృషి చేస్తున్నాం’ అంటూ ఎయిరిండియా ట్వీట్‌లో పేర్కొంది.

WAVES 2025: Allu Arjun Shares About An Accident He Had9
ఆ యాక్సిడెంట్‌ నా జీవితంలో పెద్ద గిఫ్ట్‌ : అల్లు అర్జున్‌

ప్రమాదం జరిగితే కష్టం, నష్టమే. కానీ, అనుకోకుండా కొన్ని ప్రమాదాలు మంచి కూడా చేస్తాయి. ప్రముఖ హీరో అల్లు అర్జున్‌(Allu Arjun) స్వయంగా ఈ మాట అంటున్నారు. ముంబైలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరుగుతున్న ‘వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సమ్మిట్‌ (వేవ్స్‌)(WAVES 2025)లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ– ‘‘కెరీర్‌ తొలి రోజుల్లో నా దృష్టి అంతా ఫిజికల్‌ ఫిట్‌నెస్, ఎజిలిటీ మీదే ఉండేది. కానీ, జీవితంలో ఒక ఘటన నా ఆలోచననే మార్చేసింది. నా పదో సినిమా తర్వాత నా భుజానికి దెబ్బ తగిలి, ఆస్ట్రేలియాలో సర్జరీ చేయించుకున్నా. అంతా బాగైపోయి, నాలుగో వారం నుంచి సెట్స్‌ మీదకు వెళ్ళిపోవచ్చనుకున్నా. డాక్టర్లు 6 నెలలు రెస్ట్‌ తప్పనిసరి అన్నారు. నాకు కొత్తగా పెళ్ళయింది. ఓ సినిమా సగంలో ఉంది. అప్పటి దాకా ఫిజికల్‌ ఫిట్‌నెస్‌కే ప్రాధాన్యం ఇస్తూ వచ్చిన నాకు ఒక్కసారిగా జ్ఞానోదయం అయింది.వయసు పెరిగే కొద్దీ ఫిట్‌నెస్, ఎజిలిటీ తగ్గుతాయి. కానీ, నటనపై దృష్టి పెడితే అది చిరకాలం మిగిలిపోతుందని గ్రహించా. అక్కడి నుంచి నా ఆలోచనే మారిపోయింది’’ అని వివరించారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘పదో సినిమా దగ్గర మొదలైన ఆ ఆలోచన ఇరవయ్యో సినిమా ‘పుష్ప–1’ దగ్గరకు వచ్చేసరి కల్లా నన్ను జాతీయ ఉత్తమ నటుడిగా, అందులోనూ తెలుగు సినీరంగం నుంచి ఆ ఘనత అందుకున్న తొట్ట తొలి నటుడిగా నిలిపింది. పదో సినిమా సమయంలో ఆ యాక్సిడెంట్‌ జరగకపోతే... నా దృక్పథం ఇలా మారేది కాదు.అందుకే, కొన్ని యాక్సిడెంట్లు అనుకోకుండా మన మంచికే జరుగుతాయి. మొత్తం నా ఆలోచనలు, కెరీర్‌నే మార్చేసిన ఆ యాక్సిడెంట్‌ నా జీవితంలో పెద్ద గిఫ్ట్‌’’ అని అల్లు అర్జున్‌ వివరించారు. ‘సాక్షి’ ఆయనను పలకరించినప్పుడు ‘‘మెడిసిన్, టెక్నాలజీ లాంటి అనేక రంగాలలో చాలా కాలంగా జరుగుతున్న సమ్మిట్‌లు చూసి, అలాంటివి మన సినీ, వినోద రంగంలో కూడా జరగాలనుకున్నాను. ప్రధాని మోదీ చొరవతో తొలిసారిగా వేవ్స్‌ సదస్సు జరగడం శుభారంభం’’ అన్నారు.

Cognizant to hire 20000 freshers in 202510
కాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు 20 వేల కొలువులు

అమెరికన్‌ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌ ఈ ఏడాది సుమారు 20,000 మంది ఫ్రెషర్లను రిక్రూట్‌ చేసుకునే యోచనలో ఉంది. ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, మేనేజ్డ్‌ సర్వీసెస్‌ విభాగాల్లో ఈ కొలువులు ఉండనున్నాయి. ప్రస్తుతం కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,36,300గా ఉంది.‘ఇన్వెస్టర్‌ డే సందర్భంగా చెప్పినట్లు మా వ్యూహంలో భాగంగా 20,000 మంది ఫ్రెషర్లను తీసుకోబోతున్నాం. గతేడాదితో పోలిస్తే ఇది రెట్టింపు‘ అని కంపెనీ సీఈవో ఎస్‌ రవి కుమార్‌ తెలిపారు. ఫ్రెషర్లను తీసుకోవడం, ఏఐ ద్వారా ఉత్పాదకతను పెంచుకోవడం, మానవ వనరుల వ్యయాలను తగ్గించుకునేలా సామర్థ్యాల వినియోగాన్ని మెరుగుపర్చుకోవడం వంటి మూడు అంశాలపై కంపెనీ ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు వివరించారు.ఈ ఏడాది జనవరి–మార్చ్‌ త్రైమాసికంలో కాగ్నిజెంట్‌ ఆదాయం సుమారు 7 శాతం పెరిగి 5.1 బిలియన్‌ డాలర్లకు చేరింది. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో టాప్‌ ఐదు ఐటీ కంపెనీలు మొత్తంగా 80 వేల నుంచి 84 మందిని కొత్తగా నియమించుకోనున్నట్లు సంకేతాలిచ్చాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement