Top Stories
ప్రధాన వార్తలు

భారత్ భారీ వ్యూహం.. పాక్‌కు కోలుకోలేని దెబ్బ!
ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి ఘటన భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం చెప్పేలా భారత్ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక, తాజాగా పాక్‌పై రెండు ఆర్థిక దాడులకు భారత్ ప్రణాళికలు చేసినట్టు సమాచారం.కాగా, పాకిస్తాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా భారత్ ప్రణాళికలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(FATF) గ్రేలిస్టులోకి పాకిస్తాన్‌ను తిరిగి చేర్చడానికి భారత్ ప్రయత్నిస్తోంది. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహాయాన్ని అరికట్టడంలో విఫలమయ్యే దేశాలను ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లో చేరుస్తుంది. గతంలో ఈ జాబితాలో ఉన్న పాకిస్తాన్‌ను తిరిగి అందులోకి చేర్చడం ద్వారా ఉగ్రవాదానికి నిధులు అందకుండా అంతర్జాతీయంగా ఆ దేశంపై ఒత్తిడి పెంచాలని భారత్ భావిస్తోంది. రెండో చర్యగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఇటీవల పాకిస్థాన్‌కు మంజూరు చేసిన 7 బిలియన్ డాలర్ల భారీ ఆర్థిక సాయ ప్యాకేజీ వినియోగంపై భారత్ తన ఆందోళనలను వ్యక్తం చేయనున్నట్టు సమాచారం. ఈ నిధులను పాకిస్తాన్ ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాల కోసం దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ సంబంధిత అంతర్జాతీయ వేదికలపై ఈ అంశాన్ని లేవనెత్తాలని భారత్ యోచిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. భారత్ ప్లాన్ చేసిన చర్యల కారణంగా పాకిస్తాన్‌కు కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఈ ద్వంద్వ వ్యూహం ద్వారా పాకిస్థాన్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు ఆర్థిక మార్గాలను మూసివేయాలని, తద్వారా సరిహద్దు ఉగ్రవాదాన్ని కట్టడి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. పహల్గామ్ దాడి వంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు ఈ ఆర్థికపరమైన ఒత్తిడిని ఒక మార్గంగా భారత్ పరిగణిస్తున్నట్టు సమాచారం.2022లో విముక్తి..కాగా, 2022లో అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్‌కు కాస్త ఊరట లభించింది. ఉగ్రవాద సంస్థలకు నిధులు సరఫరా చేస్తోందన్న కారణంతో పాక్‌ను గ్రే లిస్టులో ఉంచిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(FATF) ఆ జాబితా నుంచి తొలగించింది. మనీలాండరింగ్ నిరోధక చర్యలను పాకిస్థాన్ పటిష్ఠంగా అమలు చేస్తోందని, సాంకేతిక లోపాలను పరిష్కరిస్తూ ఉగ్రసంస్థలకు నిధుల సరఫరా విషయంలోనూ పోరాటం చేసిందని ఎఫ్ఏటీఎఫ్ వెల్లడించింది. దీంతో పాక్‌ను గ్రే లిస్టు నుంచి తప్పించినట్లు తెలిపింది. గ్రే లిస్టులో ఉన్న దేశాలు అంతర్జాతీయ సంస్థల నుంచి నిధుల పొందడం చాలా కష్టం. ఈ దేశాలకు ముఖ్యంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎప్), ప్రపంచ బ్యాంక్, ఏడీబీ, యూరోపియన్ యూనియన్ వంటి సంస్థలు ఆర్థిక సాయం చేసేందుకు వెనకాడుతాయి.ఉగ్రవాదానికి ఊతమిచ్చే అతి ప్రమాదకర దేశాలను ఎఫ్ఏటీఎఫ్ బ్లాక్ లిస్ట్ జాబితాలోకి చేరుస్తుంది. కాగా, ఇప్పటివరకు ఇరాన్, ఉత్తర కొరియా మాత్రమే బ్లాక్ లిస్ట్ జాబితాలో ఉన్నాయి. బ్లాక్ లిస్ట్ నుంచి తప్పించుకోవడానికి మూడుదేశాల మద్దతు అవసరం. అయితే, చైనా, టర్కీ, మలేషియా దేశాలు పాక్‌కు మద్దతు ఇవ్వడంతో బ్లాక్ లిస్ట్‌లోకి వెళ్లకుండా బయటపడింది. తొలిసారిగా 2018 జూన్‌లో ఎఫ్ఏటీఎఫ్ పాకిస్తాన్‌ను గ్రే లిస్ట్‌లో ఉంచింది. అనంతరం వీటి నుంచి బయటపడేందుకు పాకిస్తాన్‌కు రెండు సార్లు సమయమిచ్చింది. వీటిలో భాగంగా ఉగ్రవాదులకు అందుతున్న నిధుల మూలాలను కనిపెట్టే దిశగా పాక్ చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఐరాస ఉగ్రవాదులుగా గుర్తించిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలి. అలాగే పట్టుబడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు నిరూపించగలగాలి. ఐరాస గుర్తించిన ఉగ్రవాదులకు నిధులు అందకుండా ఆర్థికపరమైన ఆంక్షలు విధించాలి. ఎఫ్ఏటీఎఫ్ నిర్దేశించిన ఈ లక్ష్యాలను చేరుకోవడంలో పాక్ ఇప్పటివరకు విఫలమవుతూనే వచ్చింది. కానీ, జూన్ నెలలో ఎఫ్ఏటీఎఫ్ ప్లీనరీ సమావేశంలో పాక్‌కు అనుకూలంగా ప్రకటన విడుదల చేసింది. ధరలతో పాక్ అతలాకుతలం..మరోవైపు.. ఇప్పటికే తీవ్ర ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌కు ఇప్పుడు మరో తలనొప్పి వచ్చి పడింది. పాక్‌తో వాణిజ్య సంబంధాలు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించడంతో పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ క్రమంలోనే అట్టారీ సరిహద్దును భారత్ మూసివేసింది. దీంతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం నిలిచిపోయింది. దీంతో ఇప్పటికే తీవ్రంగా కుదేలైన పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై ఇది మరింత తీవ్ర ప్రభావం చూపనుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో పాక్‌లో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకింది. భారీగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో పాక్ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో ప్రస్తుతం పాక్‌లో ఆహార ధరలు భారీగా పెరిగాయి.పాకిస్తాన్లో ప్రస్తుతం కొన్ని ఆహార పదార్థాల ధరలుకిలో చికెన్: రూ. 798.89 పాకిస్తాన్ రూపాయలుకిలో బియ్యం: రూ. 339.56 పాకిస్తాన్ రూపాయలుడజను గుడ్లు: రూ. 332 పాకిస్తాన్ రూపాయలులీటర్ పాలు: రూ. 224 పాకిస్తాన్ రూపాయలుఅరకిలో బ్రెడ్: రూ. 161.28 పాకిస్తాన్ రూపాయలుకిలో టమాట: రూ. 150 పాకిస్తాన్ రూపాయలుకిలో బంగాళాదుంప: రూ. 105 పాకిస్తాన్ రూపాయలు.

‘శశి థరూర్ నా పక్కన ఉన్నారు.. వారికి నిద్రలేని రాత్రులే’
తిరువనంతపురం: కేరళ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విజింజం అంతర్జాతీయ ఓడరేవును ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఓడరేవును ఆయన జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో మోదీతో పాటు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై ప్రధాని మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు.‘‘ఇవాళ శశి థరూర్ ఇక్కడ కూర్చున్నారు. ఈ వేదికపై ఆయన ఉండటం కొందరికి నచ్చదు. కొందరికి ఇది నిద్రలేని రాత్రులను మిగులుస్తుంది. ఈ సందేశం ఎక్కడికి వెళ్లాలో అక్కడికి చేరుకుంటుంది’’ అంటూ మోదీ చురకలు అంటించారు. కేరళ సీఎం విజయన్ సమక్షంలోనే ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.కాగా.. గురువారం రాత్రి కేరళ చేరుకున్న ప్రధానిని.. శశి థరూర్ స్వయంగా వెళ్లి స్వాగతించిన సంగతి తెలిసిందే. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారాయి. ‘‘ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానాల ఆలస్యం ఉన్నప్పటికీ.. సమయానికి తిరువనంతపురం చేరుకోగలిగా.. నా నియోజకవర్గానికి వచ్చిన మోదీని సాదరంగా స్వాగతించా’’ అంటూ శశి థరూర్ ట్వీట్ కూడా చేశారు.శశిథరూర్ గత కొన్ని నెలలుగా తన సొంత పార్టీపై అసంతృప్తిగా ఉన్న తెలిసిందే. ఇటీవల ఓ కేంద్ర మంత్రితో ఆయన సెల్ఫీ దిగడంతో థరూర్ పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. భారత విదేశాంగ విధానాన్ని ప్రశంసిస్తూ కూడా ఆయన ప్రశంసించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంతో ఇవాళ ఆయన ప్రధాని మోదీతో వేదిక పంచుకోవడం చర్చనీయాంశంగా మారింది.కాగా, భారత సముద్ర వాణిజ్య చరిత్రలో కొత్త చరిత్రను లిఖించిన విజింజం అంతర్జాతీయ ఓడరేవు.. సముద్ర రవాణాకు కీలకమైన కేంద్రంగా మారనుంది. దేశంలో మొట్టమొదటి సెమీ ఆటోమేటెడ్ ఓడరేవు అయిన విజింజం ఓడరేవు ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాంకేతికంగా అధునాతనమైన ట్రాన్స్షిప్మెంట్ ఓడరేవులలో ఒకటిగా నిలిచింది.

కమ్ముకున్న యుద్ధ మేఘాలు.. పాక్‌కు వెయ్యి కిలోమీటర్ల దూరంలో భారత్ ఫైటర్ జెట్లు
లక్నో: పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో పాకిస్తాన్‌కు కేవలం వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్ గంగా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఫైటర్ జెట్లు విన్యాసాలు చేయడం చర్చాంశనీయంగా మారింది.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు చేస్తున్నయుద్ధ విమానాల్లో రాఫెల్, మిగ్-29, మిరాజ్ 2000 ఉన్నాయి. ఈ యుద్ధ విమానాల్ని రాత్రి వేళ్లల్లో ల్యాండ్ చేసేలా అందుబాటులోకి తెచ్చిన యూపీ షాజహాన్పూర్లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై నిర్మించిన నైట్ ల్యాండింగ్ స్ట్రిప్‌పై విన్యాసాలు ప్రదర్శిస్తున్నాయి. 3.5 కిలోమీటర్ల పొడవు గల ఈ ఎయిర్‌స్ట్రిప్ రాత్రి సమయంలో ఫైటర్ జెట్లు ల్యాండింగ్లకు అనుకూలంగా ఉంటుంది. ఇది ఎయిర్ ఫోర్స్ జెట్లు 24 గంటలూ ఆపరేషన్లకు వీలు కల్పించడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో ఎక్స్‌ప్రెస్‌వేను ప్రత్యామ్నాయ రన్‌వేగా ఉపయోగించగల సామర్థ్యాన్ని అంచనా వేయడంలో సహాయపడుతుంది.దీంతో, ఉత్తరప్రదేశ్‌లో మొత్తం నాలుగు ఎక్స్‌ప్రెస్‌వే ల్యాండింగ్ స్ట్రిప్‌లు అందుబాటులో ఉండగా.. షాజహాన్పూర్లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై ల్యాండింగ్ స్ట్రిప్ మాత్రమే రాత్రివేళల్లో ఫైటర్ జెట్లను ల్యాండ్ చేసుకోవచ్చు. ఈ ఆధునిక ఎయిర్‌స్ట్రిప్ ఎక్స్‌ప్రెస్‌వేపై నిర్మించబడిన భారత్‌లో తొలి రన్‌వేగా నిలిచింది. ఇది రాత్రింబవళ్ళూ మిలిటరీ ఆపరేషన్లకు అనుకూలంగా రూపొందించింది. భద్రతను నిర్ధారించేందుకు రన్‌వే ఇరుప్రక్కల 250 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. Indian Air Force jets are carrying out a flypast on the Ganga Expressway airstrip.3.5 kms long airstrip is India’s first night landing airstrip on an expressway - night landing trials scheduled today evening. pic.twitter.com/AaJt9RoTEv— The Uttar Pradesh Index (@theupindex) May 2, 2025గంగా ఎక్స్‌ప్రెస్‌వే ఎయిర్‌స్ట్రిప్‌పై ల్యాండింగ్ చేసే ఇండియన్ ఎయిర్స్ యుద్ధ విమానాల ప్రత్యేకతలు రాఫెల్: ఆధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, లాంగ్-రేంజ్ మీటియర్ క్షిపణులతో నిండి ఉంది. పరిస్థితులు ఎలా ఉన్నా సరే 100 కిలో మీటర్ల నుంచి 150 కిలోమీటర్ల శత్రు స్థావరాల్ని నేలమట్టం చేయడంలో దిట్టఎస్‌యు-30 ఎంకేఐ: ఇండియా-రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ట్విన్-సీటర్ యుద్ధవిమానం. ఈ ఎస్‌యూ-30 ఎంకేఐ దూరంలో ఉన్న లక్ష్యాల్ని దాడులు చేయగలిగే సామర్థ్యంతో పాటు బ్రహ్మోస్ వంటి క్షిపణులను మోసుకెళ్లగలదు.మిరాజ్ 2000: ఫ్రెంచ్ మూలాలున్న, హై-స్పీడ్ డీప్ స్ట్రైక్ మిషన్స్‌కు అనువైన యుద్ధవిమానం, ఇది అణ్వాయుధ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఫిబ్రవరి 2019లో జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు భారత వైమానిక దళానికి చెందిన 12 మిరాజ్-2000 యుద్ధ విమానాలను వినియోగించింది.మిగ్-29: వేగం, ఎత్తు పరంగా అత్యుత్తమ ప్రదర్శనతో పాటు రాడార్ల కళ్లుగప్పి శుత్రు స్థావరాల్ని నాశనం చేస్తుంది. జాగ్వార్: గ్రౌండ్ అటాక్, యాంటీ-షిప్ మిషన్ల కోసం రూపొందించబడిన ప్రిసిషన్ స్ట్రైక్ ఎయిర్‌క్రాఫ్ట్. దీని ప్రత్యేకతలు.. శత్రు నౌకలను గుర్తించడం, లక్ష్యంగా చేసుకోవడం, నాశనం చేస్తుంది. ఈ యాంటీ-షిప్ మిషన్లు సాధారణంగా విమానాలు, జలాంతర్గాములు, ఉపరితల నౌకలు లేదా నావికా ముప్పు నుంచి తప్పించుకునేందుకు ఉపయోగిస్తారు. సి-130 జె సూపర్ హెర్కులిస్: హెవీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్, స్పెషల్ ఫోర్స్ మిషన్లు, విపత్తు సహాయం, రక్షణ కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తుంది.ఏఎన్-32: ఎత్తైన ప్రాంతాల్లో సైనికులు, సరఫరాలు తరలించేందుకు అనుకూలమైన ట్రాన్స్పోర్ట్ విమానం.ఎంఐ-17 వి5 హెలికాప్టర్: సెర్చ్ అండ్ రిస్క్యూ, మెడికల్ ఎవాక్యుయేషన్, మానవతా సహాయం వంటి బహుళ పనుల కోసం ఉపయోగించే హెలికాప్టర్.

అమరావతి రీలాంచ్.. పరువు కోసం బాబు సర్కార్ పాట్లు
సాక్షి, విజయవాడ: పరువు నిలుపుకోవడం కోసం చంద్రబాబు ప్రభుత్వం పాట్లు పడుతోంది. అమరావతి పునః ప్రారంభ కార్యక్రమానికి ప్రజలను బలవంతంగా తరలింపునకు ప్రభుత్వం నానా తిప్పలు పడుతోంది. 5 లక్షల మందిని తరలించే బాధ్యత అధికారులు, ఉద్యోగులకు అప్పగించింది. రాష్ట్ర వ్యాప్తంగా 6500 బస్సులు ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం.. అన్ని ప్రాంతాల నుంచి ప్రజలను తరలించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.ప్రతి డ్వాక్రా గ్రూపు నుంచి ఏడుగురు సభ్యులు తప్పక హాజరు కావాలంటూ హుకుం జారీ చేసింది. హాజరుకాని డ్వాక్రా గ్రూపులను ఆన్లైన్లో తొలగిస్తామంటూ హెచ్చరికలిచ్చిన సర్కార్.. సంక్షేమ పథకాలు అమలు నిలిపివేస్తామంటూ ఆదేశాలిచ్చింది. యనిమేటర్ల ఆడియో లీక్‌తో చంద్రబాబు సర్కార్ బండారం బట్టబయలైంది. సచివాలయ ఉద్యోగులు, అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.5 లక్షల మంది తరలిస్తామని ప్రభుత్వం ప్రకటించగా.. ప్రభుత్వం.. పి4 బహిరంగ సభ ప్లాప్ కావడంతో ప్రభుత్వంలో గుబులు పుట్టిస్తోంది. ప్రధాని మోదీ రాక నేపథ్యంలో భారీగా ప్రజల తరలింపుకు ప్రయత్నాలు చేస్తోది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు నిన్నటి నుండి బస్సుల్లో జనం, డ్వాక్రా మహిళలు తరలింపు కొనసాగుతోంది. అన్ని ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సుల్లో తరలిస్తున్నారు.

IPL 2025: వైభవ్ సూర్యవంశీపై సీఎస్కే మాజీ ఓపెనర్ సంచలన కామెంట్స్
ఐపీఎల్లో తన మూడో ఇన్నింగ్స్‌లోనే విధ్వంసకర శతకం (35 బంతుల్లో) బాది బేబీ బాస్‌గా గుర్తింపు తెచ్చుకున్న 14 ఏళ్ల రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీపై చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఓపెనర్ అభినవ్ ముకుంద్ సంచలన కామెంట్స్ చేశాడు. రాయల్స్ సూర్యవంశీని వేలంలో కొనుగోలు చేయాల్సింది కాదని అభినవ్ అభిప్రాయపడ్డాడు. రాయల్స్ యాజమాన్యం సూర్యవంశీతో పాటు నితీశ్ రాణాపై అనవసర పెట్టుబడి పెట్టిందని అన్నాడు. తానైతే సూర్యవంశీని రూ. 1.1 కోట్లకు, నితీశ్ రాణాను రూ. 4.2 కోట్లకు కొనుగోలు చేసేవాడిని కాదని తెలిపాడు.వైభవ్, నితీశ్‌పై పెట్టిన పెట్టుబడిని మంచి బౌలర్ల కోసం వినియోగించుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. రాయల్స్ మేనేజ్మెంట్ బ్యాటర్ల మోజులో పడి బౌలింగ్ విభాగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని అన్నాడు. ఈ సీజన్లో ఆర్చర్ ఒక్కడే తీసుకున్న డబ్బుకు న్యాయం చేశాడని పేర్కొన్నాడు. రాయల్స్ యాజమాన్యం ఎంపిక చేసుకున్న భారత్ బౌలర్లలో (తుషార్ దేశ్‌పాండే, యుద్ద్‌వీర్ సింగ్, ఆకాశ్ మధ్వాల్, కుమార్ కార్తికేయ) ఒక్కరు కూడా సత్తా చాటలేకపోయారని అన్నాడు. తుషార్ దేశ్‌పాండేపై రూ. 6.75 కోట్ల పెట్టుబడి పెట్టి అనవసరంగా డబ్బును వృధా చేసుకున్నారని అన్నాడు. గత సీజన్లో తమ పంచన ఉన్న బౌల్ట్, చహల్, ఆవేశ్ ఖాన్, అశ్విన్‌ను వదిలేసి రాయల్స్ యాజమాన్యం మూల్యం చెల్లించుకుందని అభిప్రాయపడ్డాడు. మొత్తంగా మెగా వేలంలో రాయల్స్ ఎంపికలను తప్పుబట్టాడు.కాగా, ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఇదివరకే సత్తా చాటిన ఆటగాళ్లను వేలానికి వదిలేసి పెద్ద తప్పిదం చేసింది. బ్యాటింగ్‌లో బట్లర్, బౌలింగ్‌లో చహల్, బౌల్ట్ ఆ జట్టుకు ఎన్నో అపురూప విజయాలు అందించారు. వీరిని కాదని రాయల్స్ యాజమాన్యం యువ ఆటగాళ్లపై పెట్టుబడి పెట్టి చేతులు కాల్చుకుంది. ఎన్నో అంచనాలు పెట్టి కొనుగోలు చేసిన లంక స్పిన్ ద్వయం హసరంగ, తీక్షణ ఆశించిన ప్రభావం చూపలేకపోయారు. రిటైన్ చేసుకున్న వారిలో కెప్టెన్ శాంసన్ గాయంతో సైడ్ అయిపోగా.. జురెల్, హెట్‌మైర్ దారుణంగా విఫలమయ్యారు. నితీశ్ రాణా ఒక్క మంచి ఇన్నింగ్స్‌కే పరిమితమయ్యాడు. పరాగ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పి అతడి కాస్తో కూస్తో ఫామ్‌ను చెడగొట్టుకున్నారు. సూర్యవంశీ ఫేట్‌ను నాలుగు మ్యాచ్‌లకే డిసైడ్ చేయలేని పరిస్థితి.ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ కథ ముగిసింది. నిన్న (మే 1) ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమితో ఆ జట్లు ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన రాయల్స్ ఏకంగా 8 పరాజయాలు మూటగట్టుకుంది. కేవలం మూడే విజయాలు సాధించింది. కొన్ని గెలవాల్సిన మ్యాచ్‌ల్లో అనూహ్యంగా ఓటమిపాలైంది. ఈ సీజన్లో రాయల్స్ మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. తమ తదుపరి మ్యాచ్‌ల్లో కేకేఆర్ (మే 4), సీఎస్కే (మే 12), పంజాబ్ (మే 16) జట్లను ఢీకొట్టనుంది.

‘భారత్.. నాకెన్నో పాఠాలు నేర్పింది.. కానీ ఇక్కడే ఉండలేను కదా!’
భారతదేశం విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలతో కలగలిసిన దేశం. ఈ దేశం తీరు నచ్చిందని ఎందరో విదేశీయులు తన పర్యాటన అనుభవాలను షేర్ చేసుకున్నారు. కొందరు ఇక్కడే ఉండాలని డిసైడ్ అయ్యారు కూడా. తాజాగా మరో విదేశీయుడు మన భారత్‌ని ఆకాశానికి ఎత్తేలా ప్రశంసల జల్లు కురిపించాడు. అంతేగాదు తాను కచ్చితంగా నేర్చుకోవాల్సిన పాఠాలను ఎన్నో నేర్పిందని చెబుతున్నాడు. అవేంటో అతడి మాటల్లోనే చూద్దామా..!.కెనడియన్ ట్రావెల్ కంటెంట్ సృష్టికర్త విలియం రోస్సీ మన భారతదేశం అంతటా ఐదు రోజులు పర్యటించాడు. ఈ సుడిగాలి పర్యటనలో తాను ఎలాంటి అనుభవాన్ని పొందానో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. తాను 37 దేశాలకు పైగా పర్యటించాను గానీ భారత్ లాంటి ఆశ్చర్యకరమైన దేశాన్ని చూడలేదన్నారు. ఇక్కడ పీల్చే గాలి, వాసన, కనిపించే దృశ్యాలు, రుచి అన్ని అనుభూతి చెందేలా.. ఆలోచించేలా ఉంటాయని అన్నాడు. అలా అని ఈ దేశంలోనే శాశ్వత నివాసం ఏర్పరుచుకోలేనని అన్నారు. అయితే ఈ ఐదురోజుల సుదీర్ఘ జర్నీలో భారతదేశ పర్యటన భావోద్వేగ, మానసిక మేల్కొలుపులా అనిపించదని చెప్పారు. ఇక్కడ ఉండాలని భావించలేకపోయినా..ఏదో తెలియని భావోద్వేగం.. ఉండిపోవాలనే అనుభూతి అందిస్తోందన్నారు. వ్యక్తిగతంగా తాను తప్పక నేర్చుకోవాల్సిన పాఠాలను కూడా బోధించిందన్నారు. ఇక్కడ పర్యటించడంతోనే తన జీవితాన్ని పూర్తిగా మార్చేసేలా ప్రభావితం చేసిందన్నారు. ఇక్కడి కొత్త ప్రదేశాలు వాటి మాయజాలంతో కట్టిపడేశాయి. భారత్ ప్రజల దినచర్యలు అలవాటు చేసుకోమనేలా ఫోర్స్‌చేస్తున్నట్లు అనిపిస్తాయన్నారు. కృతజ్ఞత..ఒకే ప్రపంచంలో రెండు వాస్తవాలను చూపిస్తుందన్నాడు. ఇక్కడ ప్రజలందరూ భిన్నమైన పరిస్థితుల్లో జీవిస్తునన్నారు. ఒక్కరోజు సెలవుతో మిగతా రోజులన్ని కష్టపడి పనిచేయడం తనని ఆశ్చర్యపరిచిందన్నారు. అప్పుడే తనకు కృతజ్ఞత విలువ తెలిసిందన్నారు. ఎందుకంటే విశ్రాంతి తీసుకోవడం పట్ల చాలా కృతజ్ఞతగా ఉండాలని గట్టిగా తెలుసుకున్నా అన్నారు. అంతేగాదు సురక్షితమైన నిద్రస్థలం, ఆహారం నిల్వ చేసుకునే ఫ్రిడ్జ్ తదితరాలతో హాయిగా జీవితం గడిపేయగలమనే విషయం కూడా తెలుసుకున్నాని అన్నారు. షాకింగ్ గురిచేసే సంస్కృతులు ఆచారాలు.. ఇక్కడ ఉండే విభిన్న సంస్కృతులు ఆచారాలు గందరగోళానికి గురిచేసేలా షాకింగ్ ఉంటాయి. అయితే ఒక సంబరం లేదా వేడుక ఇచ్చే అందం, ప్రత్యేకత చాలా గొప్పదని అన్నారు. స్థానిక వంటకాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. ఇక్కడ భారతీయ సుగంధద్రవ్యాలు ఇంతకు ముందెన్నడూ అనుభవించని శక్తిని అందిస్తాయని అన్నారు. ఐకానిక్ తాజ్‌మహల్ గురించి ఒక పట్టాన అంచనా వేయడం సాధ్యం కాదన్నారు. అయితే ఇక్క ఏ ఫోటో అయినా అద్భుతంగా ఉంటుందన్నారు. మరో ముఖ్యమైన విషయం ప్రజల దయ తనని ఎంతగానో ఆకట్టుకుందని చెప్పారు. ఇక్కడ ఆతిథ్యం మాత్రం సాటిలేనిదని ప్రశంసించాడు. ఎవరీ విలియం రోస్సీలింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, విలియం ఒకప్పుడూ ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా ఆరు అంకెలా జీతంతో పనిచేసేవారు. తర్వాత పూర్తి సమయం పర్యాటనలు, కంటెంట్ క్రియేటర్‌గా రాణించేందుకు మంచి ఉద్యోగ ఆఫర్లను వదులుకున్నాడు. ప్రస్తుతం తన వ్యక్తిగత అభివృద్ధి బ్రాండ్ స్ప్రౌట్ నడుపుతూ..వృద్ధి, మనస్తత్వం, అనుభవాల శక్తిపై దృష్టిసారిస్తున్నాడు. కాగా, నెటిజన్లు మా భారతదేశ సంక్లిష్టతను గౌరవించినందుకు ధన్యవాదాలు. అలాగే నిజాయితీగా అనుభవాలను పంచుకున్నందుకు అభినందించకుండా ఉండలేకపోతున్నాం అంటూ విలియంపై ప్రశంసల జల్లు కురిపించారు. View this post on Instagram A post shared by William Rossy (@sprouht) (చదవండి: స్లిమ్‌గా బాలీవుడ్ చిత్ర నిర్మాత హన్సల్ మెహతా.. మౌంజారోతో పది కిలోలు..!)

పరామర్శకూ తీరికలేదా బాబూ!
సింహాచలం అప్పన్న ఆలయంలో హాహాకారాలు.. మృత్యు ఘోష.. ఎవరికైనా బాధనిపిస్తుంది. కాని ఆంధ్రప్రదేశ్ సర్కారుకు మాత్రం అవేమీ పట్టినట్లు లేదు. కూటమి నేతలందరూ అమరావతి సంబరంలో మునిగి తేలుతున్నారు. పలుమార్లు శంకుస్థాపనలు జరిగిన అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఇంకోసారి శంకుస్థాపన చేయిస్తున్నారు.సింహాచలంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలి అయింది సామాన్యులే.. అమరావతి హంగామాతో తీవ్రంగా నష్టపోతున్నదీ పేదలే. హిందూ మతంలో ఒక నమ్మకం ఉంటుంది. ఏదైనా ఒక కుటుంబంలో అశుభం జరిగితే నిర్దిష్టంగా కొన్నాళ్లపాటు ఎలాంటి శుభ కార్యక్రమాలు జరపరు. హిందూ మతోద్దారకులమని ప్రచారం చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సనాతన హిందూ అని చెప్పుకునే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు. శంకుస్థాపన కార్యక్రమాలను వాయిదా వేసుకోలేదు. పాలకులు రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను కుటుంబంలా పరిగణిస్తారు. ఆ ప్రకారం చూస్తే ఒక ప్రముఖ ఆలయంలో జరిగిన ఈ దుర్ఘటనలో కొత్తగా కట్టిన గోడ కూలి ఏడుగురు మరణించినా తమ ప్రోగ్రాం ఆపుకోవడానికి ఇష్టపడలేదు. సింహాచలం మృతుల కుటుంబాలను పరామర్శించడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు వెళ్లలేదు.అంటే వారికి ఏదో అనుమానం ఉండబట్టే అటువైపు వెళ్లకుండా ఉన్నట్లు అనిపిస్తుంది.మామూలుగా అయితే ఒక ప్రసిద్ద పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఘటనలు సంభవిస్తే వెంటనే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు అంతా వెళ్లి సహాయ చర్యలను పర్యవేక్షించి బాధితులకు స్వాంతన చేకూర్చడానికి యత్నిస్తారు. కాని వీరిద్దరూ ఆ పని చేయలేదు. కొద్ది నెలల క్రితం వైకుంఠ ఏకాదశి టిక్కెట్ల కోసం తిరుపతి వెళ్లిన వేలాది భక్తులు తొక్కిసలాటకు గురయ్యారు. ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఆ తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు. ఆ సమాచారం వచ్చిన వెంటనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు పోటీ పడి తిరుపతి వెళ్లారు.ఏదో చేస్తున్నట్లు హడావుడి చేశారు. అలాంటి వారు సింహాచలం ఎందుకు వెళ్లలేదు? ప్రధాని మోడీ అమరావతి వస్తున్నందున వెళ్లలేక పోయారని చెప్పవచ్చు కానీ మూడు గంటల ఖాళీ కూడా లేదనడం అతిశయోక్తి అవుతుంది. పైగా ఇప్పుడు వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కడ నుంచైనా పర్యవేక్షణ చేయవచ్చు. పవన్ కళ్యాణ్ కు ఆ ఇబ్బంది లేదు కదా?మరి ఆయన ఎందుకు సింహాచలం వెళ్లలేదు? దీనికి రెండు,మూడు కారణాలు చెబుతున్నారు. అక్కడకు వెళ్లితే భక్తులలో ఉన్న కోపం అంతా తమపై చూపే అవకాశం ఉందని, వారు ప్రభుత్వ నిర్వాకంపై నిలదీస్తే ఇబ్బంది అవుతుందని అనుకుని ఉండవచ్చ అంటున్నారు. అమరావతి పునః శంకుస్థాపన పనుల పేరుతో తప్పించుకునే అవకాశం ఉండడం. మరొకటి చావుల వద్దకు వెళ్లి రావడం అశుభం అని ఎవరైనా సలహా ఇచ్చారేమో తెలియదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు నిజంగానే హిందూ మతాచారాలపై అంత శ్రద్దగా ఉంటారా అంటే అదీ గ్యారంటీ లేదు. ఏ మతం వారివద్దకు వెళ్లితే ఆ మతమే గొప్పదని చెప్పి వస్తుంటారు. రాజకీయాల కోసం మతాన్ని వాడుకుంటారు.గత గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబు కుటుంబం స్నానమాచరించే ఘట్టాన్ని సినిమా తీయడం కోసం సామాన్య భక్తులను నిలిపి వేయడం, ఒక్కసారిగా గేటు తెరవడం వల్ల తొక్కిసలాట జరిగి 29 మంది మరణించడం జరిగింది. అప్పుడు చంద్రబాబు తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో యత్నాలు చేశారు. చివరికి రోడ్డు ప్రమాదాలలో చనిపోవడం లేదా? కుంభమేళాలో చనిపోలేదా? అంటూ వితండ వాదం చేశారు. అంతే తప్ప అంత పెద్ద ఘటన జరిగితే మామూలుగా అయితే పదవి నుంచి తప్పుకుంటారు. ప్రాంతీయ పార్టీ కనుక ఆయనను పార్టీలో ఎవరూ ప్రశ్నించరు కనుక ఆ ప్రస్తావనే ఉండదు. పోనీ కనీసం ఒక కానిస్టేబుల్ పై కూడా చర్య తీసుకోకపోవడం విశేషం. తిరుపతి తొక్కిసలాట ఘటన జరిన తర్వాత పవన్ కళ్యాణ్ క్షమాపణల డ్రామా తెలిసిన సంగతే.చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌లు ఏమి మాట్లాడింది అందరికి తెలుసు. అక్కడ చైర్మన్ లేదా, అధికారులపై చర్య తీసుకోలేదు. వారిని పదవుల నుంచి తప్పించలేదు. నిజంగా హిందూ మత విశ్వాసాలు నమ్మేవారైతే అలా చేస్తారా? అన్న విమర్శలను పలువురు చేశారు. చివరికి ఒక రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. గోదావరి పుష్కరాల మరణాలపై వేసిన కమిషన్ ఏ తరహా రిపోర్టు ఇచ్చిందో, తిరుపతి ఘటనపై కూడా రిపోర్టు అందుకు భిన్నంగా వస్తుందా అన్నది కొందరి సందేహం. పుష్కరాల తొక్కిసలాటలో తప్పు భక్తులదే అని ఆ కమిషన్ తేల్చింది. ఇప్పుడు సింహాచలం ఘటనపై కూడా విచారణ కమిటీని నియమించినా, ఎంతవరకు ప్రయోజనం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. గోడ కూలడానికి నాణ్యత లోపమని కాకుండా, భక్తుల రద్దీ, తోపులాట అని నివేదికలు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో ఆలయాలలో ఏ చిన్న ఘటన జరిగినా, దాని వెనుక టీడీపీ, జనసేన రాజకీయ శక్తుల ప్రమేయం ఉన్నా, దానినంతటిని జగన్ కు ఆపాదించి ఎంత రచ్చ చేసేవారో గుర్తు చేసుకుంటేనే కంపరం కలుగుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత సైతం అదే ధోరణి ప్రదర్శించారు. తిరుమల లడ్డూ లో జంతు కొవ్వు కలిసిదంటూ దారుణమైన అసత్యాన్ని చంద్రబాబు, పవన్ లు ప్రజలకు చెప్పారు. దీనివల్ల కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని, దైవానికి అపచారం చేసినట్లు అవుతుందని వారు ఫీల్ కాలేదు. తమ రాజకీయ ప్రయోజనం కోసం ఎంతకైనా దిగజారతామన్నట్లుగా వారు వ్యవహరించారు. ఈ ఘటన తర్వాత పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకు వేసి తాను అన్ అప్పాలజిటిక్ సనాతన హిందూ అని ప్రకటించుకుని కొత్త వేషం కట్టారు.అసలు సనాతన హిందూయిజం ఏమి చెబుతుందో తెలియకుండానే, తానేదో వేద శాస్త్రాలు అన్నిటిని పుక్కిట పట్టినట్లుగా మాట్లాడారు. విశేషం ఏమిటంటే ఆయన భార్య విదేశీయురాలు. క్రైస్తవ మతానికి చెందిన వారు.అలాగే పవన్ కు పుట్టిన వారు సైతం క్రైస్తవమే తీసుకున్నారు. మరి అక్కడ ఈయన సనాతనమేమైందో తెలియదు. అనవసరంగా సినిమా డైలాగులు చదివితే ఇలాంటి అప్రతిష్టే వస్తుంది. చంద్రబాబు తన రాజకీయం కోసం ఏ మతాన్ని అయినా వాడుకోగలరు.ఆయన తెలివితేటలు వేరు.ఆయనను మించి ఏదో చేసి బీజేపీ వారి మెప్పు పొందాలని పవన్ చేస్తున్న ఈ ప్రయత్నాల వల్ల ఆయన పరువు పోగొట్టుకుంటున్నారు. పోనీ నిజంగానే అంత సనాతన హిందూ అయితే సింహాచలం ఎందుకు వెళ్లలేదు.ఒక సంతాప సందేశం ఇచ్చి వదలివేశారే.అమరావతి కార్యక్రమ ఆహ్వానంలో తన పేరు వేయలేదని మొదట అలిగారని, దాంతో ప్రభుత్వం మరో కార్డు వేసిందని చెబుతున్నారు. తన డిమాండ్ నెరవేరకపోతే ఏమైనా సింహాచలం వెళ్లేవారేమో. తిరుమల గోవుల మరణాలు, కాశీనాయన క్షేత్రంలో భవనాల కూల్చివేత, తిరుమల, బ్రహ్మం గారి మఠం తదితర ఆధ్యాత్మిక కేంద్రాలలో మత్తు పదార్ధాల వాడకం వంటి ఆరోపణలు వస్తున్నా ఈ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టలేక పోతోందన్న విమర్శలు వస్తున్నాయి. సింహాచలంలో చందనోత్సవానికి ఐదుగురు మంత్రుల కమిటీ కూడా ఉందట. వారంతా ఏమి చేశారో తెలియదు. కాని గోడ కూలి ఏడుగురు మరణించారు. చిన్న ఆలయ గోడ నిర్మాణమే చేయలేని వారు రాజధాని నిర్మాణం చేస్తారట అంటూ సోషల్ మీడియాలో వ్యంగ్య వ్యాఖ్యానాలు వచ్చాయి.అదే టైమ్ లో జగన్ విజయవాడ వద్ద కృష్ణానదికి కట్టిన రిటైనింగ్ వాల్ ఏ రకంగా స్ట్రాంగ్ గా ఉందీ వివరిస్తూ కూడా వీడియోలు వచ్చాయి. సింహాచలం ఘటన తర్వాత జగన్ వెంటనే అక్కడకు వెళ్లి మృతుల కుటుంబాలకు భరోసా ఇచ్చివచ్చారు. చంద్రబాబు, పవన్ లు మాత్రం సాకులు వెతుక్కుంటూ కూర్చున్నారు. ఎల్లో మీడియా మాత్రం సింహాచలం ప్రమాదాన్ని తగ్గించి చూపడానికి నానా పాట్లు పడింది. ఏది ఏమైనా మత సెంటిమెంటును రాజకీయాలకు వాడుకోవడం మంచిది కాదు.అది ఎప్పటికైనా వారికే తగులుతుంది.ఈ నేపథ్యంలో పాలకులు చేసే పాపాలు తమకు శాపాలుగా మారుతున్నాయని ప్రజలు సెంటిమెంట్ గా భావించే పరిస్థితి ఏర్పడింది. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

విజయ్ దేవరకొండపై కేసు! ఎందుకంటే?
సాక్షి, హైదరాబాద్: హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) చిక్కుల్లో పడ్డాడు. గిరిజన ప్రజల గురించి తప్పుగా మాట్లాడారంటూ ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిషన్ రాజ్ చౌహాన్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే విజయ్‌పై కేసు నమోదైనట్లు తెలుస్తోంది.ఏం జరిగిందంటే?సూర్య హీరోగా నటించిన రెట్రో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా వెళ్లాడు. అతడు మాట్లాడుతూ.. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కశ్మీర్ ఇండియాది. కశ్మీరీలు మనవాళ్లే.. రెండేళ్ల క్రితం ఖుషీ సినిమా షూటింగ్ అక్కడే జరిపాం. అక్కడ చాలామంచి జ్ఞాపకాలున్నాయి. పాకిస్తాన్ వాళ్లు.. అక్కడి ప్రజలనే చూసుకోలేరు.. అలాంటిది ఇక్కడేం చేయాలని చూస్తున్నారో!ఇండియా.. పాకిస్తాన్‌పై దాడి చేయాల్సిన అవసరం లేదు. అక్కడి ప్రజలకే విరక్తి వచ్చి పాక్ ప్రభుత్వంపై తిరగబడతారు. 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ (గిరిజనులు) కొట్టుకున్నట్లు.. బుద్ధి లేకుండా, కనీస కామన్ సెన్స్ లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు. మనమంతా ఐకమత్యంగా ఉండాలి అని స్పీచ్ ఇచ్చాడు. ఉగ్రవాదులను గిరిజనులతో పోల్చడంపై వ్యతిరేకత వచ్చింది. What a speech anna @TheDeverakonda ❤️🙌🏻#RetrofromMay01 #VijayDevarakonda #KINGDOM pic.twitter.com/653qCLhlu8— The Revanth (@Revanth__7) April 26, 2025 చదవండి: 21 రోజుల్లో 15 కిలోలు తగ్గా.. ఆ సీక్రెట్ మాత్రం చెప్పను: రకుల్ భర్త

ఢిల్లీలో వర్ష బీభత్సం.. తల్లి, ముగ్గురు పిల్లలు మృతి
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం సృష్టించిన వర్షం బీభత్సంలో కుటుంబంలో నలుగురు మృతి చెందారు. వర్ష కారణంగా ద్వారాకాలో ఓ ఇంటిపై చెల్లి కూలింది. ఈ దుర్ఘటనలో తల్లి, ఆమె ముగ్గురు పిల్లలు మరణించారు. శుక్రవారం తెల్లవారు జామున ఢిల్లీ వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు చోటు చేసుకున్నాయి. దుమ్ముతో పాటు భారీ వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. వర్షం కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాతావరణ శాఖ సైతం ఢిల్లీలో రెడ్ జోన్ ప్రకటించింది. భారీ వర్షం కారణంగా ఏర్పడిన ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వర్షం దెబ్బకు విమానాల సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు ఆయా విమానయాన సంస్థలు అధికారికంగా ప్రకటించాయి. Severe thunderstorms and rain lash Delhi and NCR.IMD forecasts heavy rainfall, thunderstorms, and gusty winds for the next two days, issuing a yellow alert for the national capital.#Rain #IMD #DelhiRains #rainfall #thunderstorms #Weather pic.twitter.com/fiZb2DPJJS— All India Radio News (@airnewsalerts) May 2, 2025 ఎయిర్ పోర్టుకు వెళ్లే ముందు ప్రయాణికులు తమ విమానాల రాకపోకల్ని పరిశీలించాలని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రయాణికుల్ని కోరింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది #TravelAdvisoryThunderstorms and gusty winds have affected flight operations in parts of Northern India. Some of our flights to and from Delhi are being delayed, which is likely to impact our overall flight schedule. We are doing our best to minimise disruptions.We advise our…— Air India (@airindia) May 2, 2025‘ఢిల్లీకి వెళ్లే, బయల్దేరే ఎయిరిండియా విమానాల సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలో దుమ్ము తుఫాను, వర్షం కారణంగా విమానాల్ని దారి మళ్లిస్తున్నాం. ఫలితంగా మొత్తం విమానాల రాకపోకలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. అంతరాయాలను తగ్గించడానికి మా వంతు మేం కృషి చేస్తున్నాం’ అంటూ ఎయిరిండియా ట్వీట్లో పేర్కొంది.

కాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు 20 వేల కొలువులు
అమెరికన్ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ ఈ ఏడాది సుమారు 20,000 మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకునే యోచనలో ఉంది. ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, మేనేజ్డ్ సర్వీసెస్ విభాగాల్లో ఈ కొలువులు ఉండనున్నాయి. ప్రస్తుతం కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,36,300గా ఉంది.‘ఇన్వెస్టర్ డే సందర్భంగా చెప్పినట్లు మా వ్యూహంలో భాగంగా 20,000 మంది ఫ్రెషర్లను తీసుకోబోతున్నాం. గతేడాదితో పోలిస్తే ఇది రెట్టింపు‘ అని కంపెనీ సీఈవో ఎస్ రవి కుమార్ తెలిపారు. ఫ్రెషర్లను తీసుకోవడం, ఏఐ ద్వారా ఉత్పాదకతను పెంచుకోవడం, మానవ వనరుల వ్యయాలను తగ్గించుకునేలా సామర్థ్యాల వినియోగాన్ని మెరుగుపర్చుకోవడం వంటి మూడు అంశాలపై కంపెనీ ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు వివరించారు.ఈ ఏడాది జనవరి–మార్చ్ త్రైమాసికంలో కాగ్నిజెంట్ ఆదాయం సుమారు 7 శాతం పెరిగి 5.1 బిలియన్ డాలర్లకు చేరింది. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో టాప్ ఐదు ఐటీ కంపెనీలు మొత్తంగా 80 వేల నుంచి 84 మందిని కొత్తగా నియమించుకోనున్నట్లు సంకేతాలిచ్చాయి.
కొందరు కావాలంటే.. ఇంకొందరు వద్దంటున్నారు!
యువతి దారుణ హత్య.. ఉలిక్కిపడ్డ విశాఖ
బీజేపీ మహిళా మంత్రికి వేధింపులు.. మేసేజ్‌లు.. యువకుడు అరెస్ట్
సూర్య 'రెట్రో' Day 1 కలెక్షన్.. నాని కంటే తక్కువే
ఐపీఎల్ ప్రారంభం నుండి మొదట నిష్క్రమించిన జట్లు ఇవే..!
విజయ్ దేవరకొండపై కేసు! ఎందుకంటే?
‘భారత్.. నాకెన్నో పాఠాలు నేర్పింది.. కానీ ఇక్కడే ఉండలేను కదా!’
‘శశి థరూర్ నా పక్కన ఉన్నారు.. వారికి నిద్రలేని రాత్రులే’
అవును.. ప్రేమలో ఉన్నాం!.. ఇంతకీ ఎవరీమె?
మంగళూరులో హై అలర్ట్.. పోలీసుల కంట్రోల్లో సిటీ
13ఏళ్లకే హీరో, 15ఏళ్లకే టాలీవుడ్ స్టార్..ఒక్క యాక్సిడెంట్‌తో తెరమరుగు..
సూర్యవంశీపై గిల్ కామెంట్స్.. జడేజా కౌంటర్
ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
నా కొడుకును సంపేయండి
తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్
ఆ హీరోయిన్ల పేర్లు కలిసేలా విజయ్ (TVK) పార్టీ ఉంది: మంత్రి
మార్కెట్లోకి సరికొత్త హైటెక్ ఫ్యాన్: ధర ఎంతంటే?
IND vs ENG: ఇంగ్లండ్ టూర్‌కు వైభవ్ సూర్యవంశీ..
అందరి అనుమానం అదే.. NIA ప్రశ్నకు తడబడ్డ జిప్‌లైన్ ఆపరేటర్
TG: హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు ఐపీఎస్‌లు
Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
Smita Sabharwal: స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్
ఫెన్సింగ్ కింద పాక్కుంటూ వెళ్లి.. గుంతలో దాక్కుని
'ప్రవస్తి' నీకు నేను ఉన్నా.. మేము ఉన్నాం: గీతా మాధురి
‘ఎల్లమ్మ’ దొరకట్లేదు.. ఇప్పుడెలా?
చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ఈ స్కూటర్లపై రూ.40000 డిస్కౌంట్: అదే రోజు డెలివరీ..
వివాహేతర సంబంధం.. శైలజ నుంచి ఫోన్ వచ్చిందని..!
నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
నా కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తా..!
అక్షయ తృతీయ రోజు బంగారు నగలే కొనాలా?
ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో
మహేశ్ బాబు నయా లుక్.. ఎప్పుడు లేనంతగా
ప్రస్తుతం మన దగ్గర ఉన్నవి ఇవే సార్! క్షిపణుల బదులు 130 ఇవే బిగించాం!
బాలకృష్ణ విలన్‌ను ఎంపిక చేసుకున్న పూరీ జగన్నాథ్
ముక్కోణపు వన్డే సిరీస్.. టీమిండియా భారీ స్కోర్
1925లో బంగారం రేటు ఇంత తక్కువా?
‘ఛీ’నా రాజకీయం...
'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్
బంగారం భారీగా పడిపోతుంది!
కొందరికే ‘భరోసా’
మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని భావన యాదవ్
శ్రీకృష్ణ లీలలు
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
ఇంట్లో పాముల కలకలం
ఆర్మూరు–జగిత్యాల హైవేకు ఓకే
బ్రదర్ కేటీఆర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: వైఎస్ జగన్
హైదరాబాద్‌లో హై అలర్ట్
ఎంత పనైపాయే..! పిల్లిలా కనిపించాలని సర్జరీ చేయించుకుంటే చివరికి..
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
భారత్‌తో జాగ్రత్త.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హెచ్చరిక
నచ్చిన వారితో శృంగారం.. అజిత్‌పై నటి 'హీరా' సెన్సేషనల్ కామెంట్
వీళ్లు ఐదురూపాయలు బిచ్చమేశార్రా! దీంతో వైజాగ్‌లో ఐదెకరాల భూమి కొనేయవచ్చు... మనకూ ‘ఉర్సా’ లాంటి కంపెనీ ఉంటే!
'లాహోర్‌ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
RR VS GT: ఇది నా కల.. నాకు భయం లేదు: వైభవ్ సూర్యవంశీ
నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..
మూడో పంటగా సౌర విద్యుత్తు!
జాబ్ చేస్తానంటే ఇంట్లోకి రమ్మంటారు.. బాధ చెప్పుకున్న దీపిక
బెల్లంకొండ హీరో దెయ్యం సినిమా.. గ్లింప్స్ రిలీజ్
ప్రొటోకాల్ రగడ.. తుమ్మల సమక్షంలో అధికారులపై ఎమ్మెల్యే ఫైర్
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
ఈ ఐపీఎల్ సీజన్లో సెంచరీలు చేసిన నలుగురిలో ఓ 'కామన్ పాయింట్' ఉంది.. అదేంటి..?
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
భద్రత కోసం రూ.70 కోట్లు!.. సుందర్ పిచాయ్ జీతం ఎంతంటే?
అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
3 నిమిషాలకో మరణం
సంధ్య థియేటర్ ఘటన.. బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్
ఉత్కంఠపోరు.. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
త్రివిధ దళాలకు ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్.. సైన్యమే స్థలం,టైం చూసి..
కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి..?
వామ్మో.. ఇదేం ట్రాఫిక్!
పాక్ నడ్డి విరిగేలా..
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
కొత్త రేషన్ కార్డు దేవుడెరుగు..!
‘ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్‌నే’
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రత్యేకం
తండ్రికి బైక్‌ను బహుమతిగా ఇవ్వాలని బయలుదేరి..
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం
అందంలోనే కాదు.. చదువులోనూ అదుర్స్
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
నీట్–2025కు పకడ్బందీ ఏర్పాట్లు
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
ఒకే ఇల్లు.. ఒకే వంట
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
మైక్రోసాఫ్ట్ సీఈవో, టెక్కీ తండ్రుల ఆవేదన ఫలితం..ఏఐ హెల్త్‌కేర్ రివల్యూషన్..!
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
‘పెగాసస్’పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
IPL 2025: ఒక్క విజయం.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ
మళ్లీ ఉగ్ర కాండ!
రెడ్ మిర్చిలా రెజీనా... విష్ణుప్రియ మౌంటైన్ ట్రిప్
ఏప్రిల్‌లో విడుదలైన టాప్ 10 మొబైల్స్
బాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు : వైఎస్ జగన్
చిన్నప్పటి నుంచి చదువులో టాప్
బ్యాంకులో క్యాష్ వేస్తున్నారా..? జాగ్రత్త!!
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరు
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!
పహల్గామ్ దాడి.. నా పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు: విజయ్ ఆంటోనీ క్లారిటీ!
మొక్కుబడిగా ఏసీ కొనవద్దు..
సల్మాన్ ‘సౌత్’ వ్యాఖ్యలపై స్పందించిన నాని!
ముష్కర మూకలకు ముచ్చెమటలు
చిరంజీవి స్ఫూర్తితోనే ప్రారంభించా.. అంతా తెలుగు వారి సహకారమే: సూర్య
కొందరు కావాలంటే.. ఇంకొందరు వద్దంటున్నారు!
యువతి దారుణ హత్య.. ఉలిక్కిపడ్డ విశాఖ
బీజేపీ మహిళా మంత్రికి వేధింపులు.. మేసేజ్‌లు.. యువకుడు అరెస్ట్
సూర్య 'రెట్రో' Day 1 కలెక్షన్.. నాని కంటే తక్కువే
ఐపీఎల్ ప్రారంభం నుండి మొదట నిష్క్రమించిన జట్లు ఇవే..!
విజయ్ దేవరకొండపై కేసు! ఎందుకంటే?
‘భారత్.. నాకెన్నో పాఠాలు నేర్పింది.. కానీ ఇక్కడే ఉండలేను కదా!’
‘శశి థరూర్ నా పక్కన ఉన్నారు.. వారికి నిద్రలేని రాత్రులే’
అవును.. ప్రేమలో ఉన్నాం!.. ఇంతకీ ఎవరీమె?
మంగళూరులో హై అలర్ట్.. పోలీసుల కంట్రోల్లో సిటీ
13ఏళ్లకే హీరో, 15ఏళ్లకే టాలీవుడ్ స్టార్..ఒక్క యాక్సిడెంట్‌తో తెరమరుగు..
సూర్యవంశీపై గిల్ కామెంట్స్.. జడేజా కౌంటర్
ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
నా కొడుకును సంపేయండి
తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్
ఆ హీరోయిన్ల పేర్లు కలిసేలా విజయ్ (TVK) పార్టీ ఉంది: మంత్రి
మార్కెట్లోకి సరికొత్త హైటెక్ ఫ్యాన్: ధర ఎంతంటే?
IND vs ENG: ఇంగ్లండ్ టూర్‌కు వైభవ్ సూర్యవంశీ..
అందరి అనుమానం అదే.. NIA ప్రశ్నకు తడబడ్డ జిప్‌లైన్ ఆపరేటర్
TG: హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు ఐపీఎస్‌లు
Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
Smita Sabharwal: స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్
ఫెన్సింగ్ కింద పాక్కుంటూ వెళ్లి.. గుంతలో దాక్కుని
'ప్రవస్తి' నీకు నేను ఉన్నా.. మేము ఉన్నాం: గీతా మాధురి
‘ఎల్లమ్మ’ దొరకట్లేదు.. ఇప్పుడెలా?
చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ఈ స్కూటర్లపై రూ.40000 డిస్కౌంట్: అదే రోజు డెలివరీ..
వివాహేతర సంబంధం.. శైలజ నుంచి ఫోన్ వచ్చిందని..!
నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
నా కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తా..!
అక్షయ తృతీయ రోజు బంగారు నగలే కొనాలా?
ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో
మహేశ్ బాబు నయా లుక్.. ఎప్పుడు లేనంతగా
ప్రస్తుతం మన దగ్గర ఉన్నవి ఇవే సార్! క్షిపణుల బదులు 130 ఇవే బిగించాం!
బాలకృష్ణ విలన్‌ను ఎంపిక చేసుకున్న పూరీ జగన్నాథ్
ముక్కోణపు వన్డే సిరీస్.. టీమిండియా భారీ స్కోర్
1925లో బంగారం రేటు ఇంత తక్కువా?
‘ఛీ’నా రాజకీయం...
'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్
బంగారం భారీగా పడిపోతుంది!
కొందరికే ‘భరోసా’
మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని భావన యాదవ్
శ్రీకృష్ణ లీలలు
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
ఇంట్లో పాముల కలకలం
ఆర్మూరు–జగిత్యాల హైవేకు ఓకే
బ్రదర్ కేటీఆర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: వైఎస్ జగన్
హైదరాబాద్‌లో హై అలర్ట్
ఎంత పనైపాయే..! పిల్లిలా కనిపించాలని సర్జరీ చేయించుకుంటే చివరికి..
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
భారత్‌తో జాగ్రత్త.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హెచ్చరిక
నచ్చిన వారితో శృంగారం.. అజిత్‌పై నటి 'హీరా' సెన్సేషనల్ కామెంట్
వీళ్లు ఐదురూపాయలు బిచ్చమేశార్రా! దీంతో వైజాగ్‌లో ఐదెకరాల భూమి కొనేయవచ్చు... మనకూ ‘ఉర్సా’ లాంటి కంపెనీ ఉంటే!
'లాహోర్‌ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
RR VS GT: ఇది నా కల.. నాకు భయం లేదు: వైభవ్ సూర్యవంశీ
నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..
మూడో పంటగా సౌర విద్యుత్తు!
జాబ్ చేస్తానంటే ఇంట్లోకి రమ్మంటారు.. బాధ చెప్పుకున్న దీపిక
బెల్లంకొండ హీరో దెయ్యం సినిమా.. గ్లింప్స్ రిలీజ్
ప్రొటోకాల్ రగడ.. తుమ్మల సమక్షంలో అధికారులపై ఎమ్మెల్యే ఫైర్
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
ఈ ఐపీఎల్ సీజన్లో సెంచరీలు చేసిన నలుగురిలో ఓ 'కామన్ పాయింట్' ఉంది.. అదేంటి..?
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
భద్రత కోసం రూ.70 కోట్లు!.. సుందర్ పిచాయ్ జీతం ఎంతంటే?
అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
3 నిమిషాలకో మరణం
సంధ్య థియేటర్ ఘటన.. బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్
ఉత్కంఠపోరు.. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
త్రివిధ దళాలకు ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్.. సైన్యమే స్థలం,టైం చూసి..
కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి..?
వామ్మో.. ఇదేం ట్రాఫిక్!
పాక్ నడ్డి విరిగేలా..
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
కొత్త రేషన్ కార్డు దేవుడెరుగు..!
‘ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్‌నే’
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రత్యేకం
తండ్రికి బైక్‌ను బహుమతిగా ఇవ్వాలని బయలుదేరి..
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం
అందంలోనే కాదు.. చదువులోనూ అదుర్స్
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
నీట్–2025కు పకడ్బందీ ఏర్పాట్లు
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
ఒకే ఇల్లు.. ఒకే వంట
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
మైక్రోసాఫ్ట్ సీఈవో, టెక్కీ తండ్రుల ఆవేదన ఫలితం..ఏఐ హెల్త్‌కేర్ రివల్యూషన్..!
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
‘పెగాసస్’పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
IPL 2025: ఒక్క విజయం.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ
మళ్లీ ఉగ్ర కాండ!
రెడ్ మిర్చిలా రెజీనా... విష్ణుప్రియ మౌంటైన్ ట్రిప్
ఏప్రిల్‌లో విడుదలైన టాప్ 10 మొబైల్స్
బాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు : వైఎస్ జగన్
చిన్నప్పటి నుంచి చదువులో టాప్
బ్యాంకులో క్యాష్ వేస్తున్నారా..? జాగ్రత్త!!
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరు
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!
పహల్గామ్ దాడి.. నా పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు: విజయ్ ఆంటోనీ క్లారిటీ!
మొక్కుబడిగా ఏసీ కొనవద్దు..
సల్మాన్ ‘సౌత్’ వ్యాఖ్యలపై స్పందించిన నాని!
ముష్కర మూకలకు ముచ్చెమటలు
చిరంజీవి స్ఫూర్తితోనే ప్రారంభించా.. అంతా తెలుగు వారి సహకారమే: సూర్య
సినిమా

చికిత్సకు డబ్బుల్లేవ్.. నటుడు కన్నుమూత
కొచ్చి: మలయాళ నటుడు విష్ణుప్రసాద్ (Vishnu Prasad) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కేరళలోని ఓ ఆస్పత్రిలో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. బుల్లితెర, వెండితెరపై అలరించిన విష్ణు ప్రసాద్ కొన్ని నెలల క్రితం అస్వస్థతకు లోనయ్యారు. వైద్యులను సంప్రదించగాక కాలేయ సమస్య ఉన్నట్లు తేలింది. దీంతో ఆయన కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. వీలైనంత త్వరగా కాలేయ మార్పిడి చేయాలని వైద్యులు సూచింరు. దీంతో అతడి కూతురు తండ్రికి కాలేయదానం చేయడానికి సిద్ధమైంది. కానీ ఆపరేషన్‌కు దాదాపు రూ.30 లక్షల మేర ఖర్చవుతుందని, సాయం చేసి ఆదుకోమని అతడి కుటుంబసభ్యులు ఆర్థిక సాయం కోసం అర్థించారు. ఆ డబ్బు సేకరించేలోపే విష్ణుప్రసాద్ కన్నుమూశారు.విష్ణు ప్రసాద్.. కాశీ, కై ఎతుం దూరత్, రన్‌వే, మంగోకాళం, లయన్, లోకనాథన్ IAS, పటాకా, మరాఠా నాడు వంటి పలు మలయాళ చిత్రాల్లో నటించారు. సీరియల్స్‌లోనూ కనిపించాడు. ఇతడికి అభిరామి, అనానిక అని ఇద్దరు కూతుర్లున్నారు.చదవండి: నా కొడుక్కి 'ఆదిపురుష్' చూపించి సారీ చెప్పా: దేవర విలన్

'హిట్ 3' ఫస్ట్ డే కలెక్షన్స్.. నాని కెరీర్లో ఇదే టాప్
నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘హిట్3: ది థర్డ్ కేస్’ బాక్సాఫీస్ వద్ద మొదటిరోజే భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఈమేరకు అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రోడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదలైంది. ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటించారు. నానీకి ఓవర్సీస్లో హయ్యెస్ట్ గ్రాసర్ ఫిల్మ్‌గా హిట్-3 రికార్డ్ క్రియేట్ చేసింది.ప్రపంచవ్యాప్తంగా హిట్-3 సినిమా రూ. 43 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. నాని కెరీర్లోనే తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. సులువుగా రూ. 150 కోట్ల మార్క్‌ను ఈ చిత్రం అందుకుంటుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశవ్యాప్తంగానే కాకుండా ఓవర్సీస్లోనూ అర్జున్ సర్కార్ దుమ్మురేపుతున్నాడు. ఓవర్సీస్లో తొలిరోజే 1.2 మిలియన్ డాలర్ల క్లబ్లో ఈ మూవీ చేరింది. ఆపై ‘బుక్‌మై షో’లోనూ ఈ చిత్రం పలు రికార్డులు క్రియేట్ చేసింది. 24గంటల్లోనే 2.70 లక్షల టికెట్స్ అమ్ముడుపోయాయి. నాని కెరీర్లో ఇంతమొత్తంలో టికెట్స్ సేల్ కావడం ఇదే తొలిసారి.కథేంటంటే..ఎస్పీ అర్జున్ సర్కార్(నాని) జమ్ము కశ్మీర్ నుంచి ఏపీకి బదిలీపై వస్తారు. డ్యూటీలో జాయిన్ అయ్యే కంటే ముందే అడవిలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేస్తారు. తర్వాత ఆ కేసును ఆయనే విచారణ చేస్తారు. అలా రెండో హత్య చేస్తున్న సమయంలో అర్జున్ సర్కార్ టీం సభ్యురాలు వర్ష(కోమలి ప్రసాద్) అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటుంది. దీంతో అర్జున్ సర్కార్ హత్యలు ఎందుకు చేస్తున్నాడో ఆమెకు వివరిస్తూ.. సీటీకే(కాప్చర్ టార్చర్ కిల్) డార్క్ వెబ్సైట్ గురించి చెబుతాడు. అసలు సీటీకే ఉద్దేశం ఏంటి? ఆ డార్క్ వెబ్సైట్ రన్ చేస్తున్నదెవరు? వారి లక్ష్యం ఏంటి? అర్జున్ సర్కార్ సీటీకే గ్యాంగ్ ఆటలకు ఎలా అడ్డుకట్ట వేశాడు? ఈ క్రమంలో ఆయనకు ఎదురైన సవాళ్లు ఏంటి? తల్లిలేని అర్జున్ సర్కార్ జీవితంలోకి మృదుల(శ్రీనిధి శెట్టి) ఎలా వచ్చింది? ఆమె నేపథ్యం ఏంటి? అర్జున్ సర్కార్ ఆపరేషన్‌కి ఆమె ఎలా సహాయపడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.SARKAAR'S BOX OFFICE MAYHEM collects a whopping 43+ CRORES GROSS WORLDWIDE on DAY 1 💥💥Natural Star @NameisNani's HIGHEST DAY 1 GROSSER 🔥#HIT3 is the #1 INDIAN FILM WORLDWIDE YESTERDAY ❤🔥Book your tickets now!🎟️ https://t.co/8HrBsV0Ry1#BoxOfficeKaSarkaar… pic.twitter.com/IEuNsxZ5Sn— Wall Poster Cinema (@walpostercinema) May 2, 2025

నా కొడుక్కి 'ఆదిపురుష్' చూపించి సారీ చెప్పా: దేవర విలన్
ప్రభాస్ తీవ్ర విమర్శలు మూటగట్టుకున్న చిత్రం ఆదిపురుష్ (Adipurush Movie). ఈ సినిమాలో ప్రభాస్ లుక్ నుంచి వానరాలను చూపించిన విధానం వరకు ప్రతిదానిపైనా ట్రోలింగ్ జరిగింది. వీఎఫ్ఎక్స్ బాలేవని, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan)కు ముందు ఐదు తలలు, దానిపైన ఐదు తలలు పెట్టడమేంటన్న కామెంట్లు వినిపించాయి. మొత్తంగా ఓంరౌత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతోపాటు ట్రోలింగ్ మెటీరియల్‌గా మారిపోయింది.సినిమా చూపించా.. రియాక్షనే లేదుమూడు గంటల నిడివి ఉన్న ఈ సినిమాను తన కుమారుడిని కూర్చోబెట్టి చూపించానంటున్నాడు ఆదిపురుష్ రావణ్ అలియాస్ సైఫ్ అలీ ఖాన్. తాజా నెట్‌ఫ్లిక్స్ ఇండియా యూట్యూబ్ ఛానల్లో సైఫ్ మాట్లాడుతూ.. నేను సినిమాల్లో విభిన్న పాత్రలు చేస్తూ ఉంటాను. అవి చూసి నా 9 ఏళ్ల కుమారుడు తైమూర్.. నువ్వసలు మంచివాడివా? చెడ్డవాడివా? అని అడుగుతుంటాడు. ఈ మధ్యే వాడికి ఆదిపురుష్ చూయించాను. వాడి నుంచి నాకు ఎటువంటి ఆహ్లాదకరమైన స్పందన రాలేదు. కాసేపటికి నన్నో చూపు చూశాడు. నాకు తన ఫీలింగ్ అర్థమై సారీ చెప్పా.. ఇట్స్ ఓకేలే అని నన్ను క్షమించేశాడు అని చెప్పుకొచ్చాడు.పర్సనల్ లైఫ్సైఫ్ అలీ ఖాన్.. నటి అమృత సింగ్‌ను 1991లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు సారా, కుమారుడు ఇబ్రహీమ్ సంతానం. దశాబ్దానికి పైగా అన్యోన్యంగా ఉన్న దంపతులు 2004లో విడిపోయారు. తర్వాత హీరోయిన్ కరీనా కపూర్‌తో ప్రేమలో పడ్డాడు. దాదాపు ఐదేళ్లపాటు జంటగా కలిసున్న వీరు 2012లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 2016లో తైమూర్, 2021లో జెహ్ జన్మించారు. సైఫ్.. దేవర: పార్ట్ 1 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.చదవండి: 'క' చిత్రానికి దక్కిన 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డ్

ప్రభాస్ సినిమాపై పుకార్లు.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
‘రాజాసాబ్’తర్వాత ప్రభాస్(Prabhas) నటించబోయే సినిమా ఏంటి? అనేదానిపై రకరకాల చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఈ సినిమా తర్వాత ప్రభాస్ స్పిరిట్(Spirit) సినిమా చేయాల్సింది. ఈ మేరకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పనులు కూడా ప్రారంభించారు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లాల్సింది. కానీ ప్రభాస్ మనసు మార్చుకున్నాడని, స్పిరిట్‌ని పక్కకు పెట్టి ప్రశాంత్ వర్మతో సినిమా చేయబోతున్నాడనే వార్త గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అలాగే సందీప్ రెడ్డి వంగా కూడా స్పిరిట్ కంటే ముందే ‘యానిమల్’ సీక్వెల్ చేయబోతున్నారనే వార్తలు కూడా వినిపించాయి. తాజాగా ఈ రూమర్స్‌పై స్పిరిట్ సినిమా నిర్మాత క్లారిటీ ఇచ్చారు. సందీప్‌రెడ్డి వంగా ‘స్పిరిట్’ చేసిన తర్వాతనే ‘యానిమల్ పార్క్’ తెరకెక్కిస్తాడని చెప్పాడు. మరో రెండు మూడు నెలల్లో ‘స్పిరిట్’ షూటింగ్ ప్రారంభం కానుందన్నారు. 2027లో ఈ చిత్రం విడుదల చేస్తామని ప్రకటించారు. భూషన్ కుమార్ ప్రకటనతో ప్రభాస్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.కాగా, ప్రభాస్ ప్రస్తుతం ఇటలీలో టూర్లో ఉన్నాడు. తిరిగి ఇండియాకు వచ్చిన తర్వాత రాజాసాబ్ షూటింగ్లో పాల్గొంటారు. ఆ తర్వాత భూషన్ చెప్పినట్లుగా స్పిరిట్ చేస్తారు. సందీప్ కోరిక మేరకు ఈ సినిమా కోసం ప్రభాస్ వరుసగా 65 రోజుల కాల్షీట్స్ ఇచ్చారట.ఈ మూవీ తర్వాత హనురాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’(ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్లో కూడా పాల్గొనే అవకాశం ఉంది. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం స్పిరిట్, పౌజీతో పాటు ప్రశాంత్ వర్మ సినిమా కూడా ఉంది. అలాగే ప్రశాంత్ నీల్‌తో సలార్ 2, నాగ్ అశ్విన్‌తో ‘కల్కి 2’ చేయాల్సి ఉంది.
న్యూస్ పాడ్‌కాస్ట్

ప్రతి ఇంటినీ చంద్రబాబు మోసం చేశారు: వైఎస్ జగన్ ఆగ్రహం

దేశవ్యాప్తంగా జనగణనతో పాటే కులగణన: కేంద్రం కీలక నిర్ణయం

ఏపీలో అంతులేని అవినీతి, అంతా అరాచకమే: వైఎస్ జగన్

రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం

ఏపీలో కేంద్ర సంస్థలకైతే కోట్లు.. ఉర్సా సంస్థకైతే ఊరకే!

పాక్ కాల్పుల పోరు.. బదులిచ్చిన భారత బలగాలు.

ఏపీ రాజధానిలో దోపిడీ ఐకానిక్.. 5 టవర్ల నిర్మాణ వ్యయం పెంపు

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు.. తీవ్రస్థాయికి ఉద్రిక్తతలు

పాకిస్తాన్‌కు భారత్ పంచ్.. పహల్గాం దాడిపై కేంద్రం సీరియస్

జమ్మూకశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి... కాల్పులకు 26 మంది బలి, మరో 20 మందికి పైగా గాయాలు.. మృతుల్లో ఇద్దరు విదేశీయులు
క్రీడలు

RR VS MI: చాలా తప్పులు చేశాం.. నిజాయితీగా ఒప్పుకున్న రాజస్థాన్ కెప్టెన్
ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ కథ ముగిసింది. నిన్న (మే 1) ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమితో ఆ జట్లు ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన రాయల్స్ ఏకంగా 8 పరాజయాలు మూటగట్టుకుంది. కేవలం మూడే విజయాలు సాధించింది. కొన్ని గెలవాల్సిన మ్యాచ్‌ల్లో అనూహ్యంగా ఓటమిపాలైంది. ఈ సీజన్లో ఆ జట్టు మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లు గెలిచినా, ఓడినా రాయల్స్‌కు ఒరిగేది ఏమీ లేదు. అయితే ప్రత్యర్థి జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. రాయల్స్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో కేకేఆర్ (మే 4), సీఎస్కే (మే 12), పంజాబ్ (మే 16) జట్లను ఢీకొట్టనుంది.ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి అనంతరం రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ నిజాయితీగా తమ తప్పిదాలను ఒప్పుకున్నాడు. ఈ సీజన్లో చాలా పొరపాట్లు చేశామని అంగీకరించాడు. తప్పిదాలపై దృష్టి సారిస్తామని చెప్పాడు. తప్పులతో పాటు కొన్ని మంచి పనులు కూడా చేశామని అన్నాడు. తదుపరి మూడు మ్యాచ్‌ల్లో సత్తా చాటుతామని ఆశాభావం వ్యక్తం చేశాడు.ముంబై ఇండియన్స్‌కు క్రెడిట్ ఇచ్చాడు. వారు బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతమని కొనియాడాడు. ఓవర్‌కు 10 పరుగుల చొప్పున రన్‌రేట్ మెయిన్టైన్ చేస్తూ చివర్లో చెలరేగారని అన్నాడు. తమ జట్టు బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ.. ఈ రోజు మాది కాదని అన్నాడు. పిచ్‌పై స్పందిస్తూ.. 190-200 ఛేజింగ్‌కు అనువైన స్కోర్ అని తెలిపాడు. ముంబై అదనపు పరుగులు సాధించినందుకు హార్దిక్, సూర్యకుమార్‌కు క్రెడిట్ ఇచ్చాడు. తమ ఆటతీరు మెరుగ్గా ఉండాల్సిందని ఒప్పుకున్నాడు.ఈ సీజన్లో బ్యాటింగ్‌లో మంచి ఆరంభాలు లభించినా మిడిలార్డర్ సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయిందని తెలిపాడు. తాను, జురెల్ మిడిలార్డర్లో బాధ్యత తీసుకోవాల్సిందని అన్నాడు. ఈ రోజు వచ్చిన అవకాశం మరోసారి వస్తే తమ సత్తా చాటుతామని తెలిపాడు.కాగా, నిన్న జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ ముంబై ఇండియన్స్ చేతిలో 100 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమైంది. తొలుత ముంబై బ్యాటర్లను కట్టడి చేయలేకపోయిన ఆ జట్టు.. ఆతర్వాత బ్యాటింగ్‌లో తొలి బంతి నుంచే చేతులెత్తేసింది. గత మ్యాచ్‌లో 35 బంతుల్లోనే సెంచరీ చేసి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్శించిన 14 ఏళ్ల చిచ్చరపిడుగు వైభవ్ ఈ మ్యాచ్‌లో డకౌటయ్యాడు. బౌల్ట్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాది జోష్‌గా కనిపించిన జైస్వాల్ అదే ఓవర్లో ఔటయ్యాడు. ముంబై బౌలర్లు చెలరేగడంతో రాణా, పరాగ్, జురెల్, హెట్‌మైర్ వికెట్లు కోల్పోయారు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో రాయల్స్ తమ స్థాయి ఆటతీరు ప్రదర్శించలేక చిత్తుగా ఓడింది.

నేడు (మే 2) సన్‌రైజర్స్‌తో తలపడనున్న గుజరాత్.. గిల్ గాయంపై అప్డేట్
ఐపీఎల్ 2025లో ఇవాళ (మే 2) గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. గుజరాత్ హోం గ్రౌండ్ అహ్మదాబాద్‌లో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ సన్‌రైజర్స్‌కు అత్యంత కీలకంగా పరిగణించబడుతుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతైరనట్లే. ఈ సీజన్లో ఇప్పటికే సీఎస్కే, రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.సన్‌రైజర్స్ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. గుజరాత్ విషయానికొస్తే.. 9 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో నాలుగో స్థానంలో కొనసాగుతూ, ప్లే ఆఫ్స్ బెర్త్‌కు ప్రధాన పోటీదారుగా ఉంది. ప్రస్తుత పాయింట్ల పట్టికలో ముంబై, ఆర్సీబీ, పంజాబ్ టాప్-3లో ఉన్నాయి. ఢిల్లీ, లక్నో, కేకేఆర్ ఐదు నుంచి ఏడు స్థానాల్లో ఉన్నాయి.గిల్ గాయంపై అప్డేట్గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. గిల్ ఆ మ్యాచ్‌లో వెన్ను సమస్య కారణంగా ఫీల్డింగ్‌కు (బ్యాటింగ్ చేశాడు) దిగలేదు. అతడి గైర్హాజరీలో రషీద్ ఖాన్ గుజరాత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. గిల్ గాయంపై గుజరాత్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ విక్రమ్ సోలంకి తాజాగా అప్డేట్ ఇచ్చాడు. గిల్ ఇవాళ సన్‌రైజర్స్‌తో జరుగబోయే మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడని స్పష్టం చేశాడు.గిల్ గాయంపై సానుకూల అప్డేట్ రావడంతో గుజరాత్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. లీగ్ కీలక దశలో గిల్ అందుబాటులో ఉండకపోతే అది గుజరాత్ ప్లే ఆఫ్స్ అవకాశాలను భారీగా ప్రభావితం చేస్తుంది. ఈ సీజన్లో గిల్ వ్యక్తిగతంగా అద్భుతమై ఫామ్‌లో కొనసాగుతూ (9 మ్యాచ్‌ల్లో 4 హాఫ్ సెంచరీల సాయంతో 389 పరుగులు చేసి ఈ సీజన్ లీడింగ్ రన్ స్కోరర్ల జాబితలో ఏడో స్థానంలో ఉన్నాడు), తన జట్టును కూడా విజయవంతంగా నడిపిస్తున్నాడు. రాజస్థాన్ మ్యాచ్‌లో గిల్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఆ మ్యాచ్‌లో రషీద్ అనుభవారాహిత్యం కారణంగా గుజరాత్ ఓటమిపాలైంది. రషీద్ కీలక సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం కావడంతో పాటు బౌలర్లను సరిగ్గా మేనేజ్ చేయలేకపోయాడు.నేటి మ్యాచ్‌కు గిల్ అందుబాటులోకి రావడం గుజరాత్లో జోష్ నింపనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే ఆ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకడంతో పాటు ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంటుంది. ఈ సీజన్లో గుజరాత్ నేటి మ్యాచ్‌తో కలుపుకుని మరో ఐదు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మే 6న ముంబై ఇండియన్స్‌తో, మే 11న ఢిల్లీ క్యాపిటల్స్‌తో, మే 14న లక్నోతో, మే 18న సీఎస్కేతో తలపడనుంది.నేటి మ్యాచ్‌కు తుది జట్లు (అంచనా)గుజరాత్: శుభ్‌మన్ గిల్ (C), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (WK), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మసన్‌రైజర్స్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (WK), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్ (C), హర్షల్ పటేల్, సిమర్జీత్ సింగ్, జీషన్ అన్సారీ, మహమ్మద్ షమీ

ట్రెంట్ బౌల్ట్ ట్రిపుల్ సెంచరీ
ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ టీ20ల్లో అరుదైన మైలురాయిని తాకాడు. పొట్టి ఫార్మాట్లో ఈ కివీ బౌలర్ 300 వికెట్ల క్లబ్లో చేరాడు. తద్వారా టీ20 క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన 36వ బౌలర్‌గా, మూడో న్యూజిలాండ్ బౌలర్‌గా (టిమ్ సౌథీ, ఐష్ సోధి తర్వాత) నిలిచాడు. బౌల్ట్ ఈ ఫార్మాట్లో 257 మ్యాచ్‌లు ఆడి 302 వికెట్లు తీశాడు. ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 1) రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌల్ట్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు (జైస్వాల్, నితీశ్ రాణా, జోఫ్రా ఆర్చర్) తీసిన బౌల్ట్ ముంబై విజయంలో కీలకపాత్ర పోషించాడు. బౌల్ట్‌తో పాటు కర్ణ్ శర్మ (4-0-23-3), బుమ్రా (4-0-15-2), హార్దిక్ పాండ్యా (1-0-2-1), దీపక్ చాహర్ (2-0-13-1) కూడా సత్తా చాటడంతో ముంబై 217 పరుగుల భారీ లక్ష్యాన్ని విజయవంతగా కాపాడుకోగలిగింది. ముంబై బౌలర్లు మూకుమ్మడిగా రెచ్చిపోవడంతో రాజస్థాన్ రాయల్స్ 16.1 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది. తద్వారా ముంబై 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. రికెల్టన్ (61), రోహిత్ (53), సూర్యకుమార్ (48 నాటౌట్), హార్దిక్ (48 నాటౌట్) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది.భీకర ఫామ్‌లో బౌల్ట్ఈ సీజన్లో ఆరంభ మ్యాచ్‌ల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన బౌల్ట్.. గత ఐదు మ్యాచ్‌లుగా చెలరేగి బౌలింగ్ చేస్తున్నాడు. తొలి 6 మ్యాచ్‌ల్లో కేవలం 5 వికెట్లు తీసిన బౌల్ట్.. చివరి 5 మ్యాచ్‌ల్లో ఏకంగా 11 వికెట్లు తీసి ఈ సీజన్ లీడింగ్ వికెట్ టేకర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్లో ముంబై వరుస విజయాల బాట పట్టడానికి బౌల్ట్ కూడా ఓ ప్రధాన కారకుడు. బౌల్ట్‌తో పాటు బుమ్రా, చాహర్ ఫామ్‌లోకి రావడంతోనే ముంబై డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించింది. బౌలర్లకు తోడు బ్యాటర్లు (రోహిత్, రికెల్టన్, స్కై) కూడా చెలరేగుతుండటంతో ముంబై తిరుగులేని విజయాలు సాధిస్తుంది.ముంబై డబుల్ హ్యాట్రిక్.. రాజస్తాన్ ఔట్రాజస్థాన్పై గెలుపుతో ముంబై డబుల్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఈ పరాజయంతో రాజస్థాన్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన రెండో జట్టుగా నిలిచింది. రాజస్థాన్‌కు ముందు సీఎస్కే కూడా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.టాప్‌లో రషీద్ ఖాన్టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ పేరిట ఉంది. రషీద్ 471 టీ20 మ్యాచ్‌ల్లో 641 వికెట్లు తీశాడు. రషీద్ తర్వాత డ్వేన్ బ్రావో (631), సునీల్ నరైన్ (584) అత్యధిక టీ20 వికెట్లు తీశారు. భారత్ తరఫున అత్యధిక టీ20 వికెట్లు తీసిన రికార్డు చహల్ (377) పేరిట ఉంది.

RR VS MI: కంటిపై 7 కుట్లు పడినా అదిరిపోయే ప్రదర్శన చేసిన హార్దిక్
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 1) రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా డబుల్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్‌లో ముంబై అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి ఏకపక్ష విజయం సాధించింది.ఈ గెలుపులో కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీలకపాత్ర పోషించాడు. తొలుత బ్యాట్‌తో చెలరేగి (23 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్), ఆతర్వాత బంతితోనూ రాణించాడు (1-0-2-1). వాస్తవానికి ఈ మ్యాచ్‌కు హార్దిక్ అందుబాటులో ఉండాల్సింది కాదు. అతడికి ప్రాక్టీస్ సందర్భంగా తీవ్రమైన రక్తస్రావంతో కూడిన గాయమైంది. అతడి ఎడమ కంటి పైభాగంలో ఏడు కుట్లు పడ్డాయి. అయినా హార్దిక్ ఈ మ్యాచ్ బరిలోకి దిగి సత్తా చాటాడు.ఈ సీజన్లో హార్దిక్ మొదటి నుంచి చాలా కమిట్మెంట్తో ఉన్నాడు. ఎలాగైనా ముంబై ఇండియన్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టాలని కసితో రగిలిపోతున్నాడు. గత సీజన్లో ఎదురైన పరాభవానికి ఈ సీజన్లో ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. అనుకున్నట్లుగానే వరుస పరాజయాల బాట పట్టిన జట్టును డబుల్ హ్యాట్రిక్ విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలబెట్టాడు. వ్యక్తిగతంగానూ హార్దిక్ రాణించాడు. 9 మ్యాచ్‌ల్లో 172.5 స్ట్రయిక్ రేట్‌తో 157 పరుగులు చేసి, 13 వికెట్లు తీశాడు.రోహిత్ శర్మ నుంచి ముంబై ఇండియన్స్ పగ్గాలు చేపట్టిన హార్దిక్ గత సీజన్లో కెప్టెన్‌గా, ఆటగాడిగా దారుణంగా విఫలమయ్యాడు. గత సీజన్లో ముంబై 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.ఈ సీజన్ తొలి 5 మ్యాచ్‌ల్లోనూ ముంబై అదే పేలవ ప్రదర్శన కొనసాగించింది. కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించి, పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉండింది. అయితే సీజన్ గడిచే కొద్ది ముంబై ఇండియన్స్ ఆటతీరులో అనూహ్య మార్పు వచ్చింది. స్టార్ ఆటగాళ్లంతా టచ్‌లోకి రావడంతో ఒక్కసారిగా గెలుపు బాట పట్టింది. మూడు వారాలు తిరక్కుండానే తొమ్మిదో స్థానం నుంచి అగ్రస్థానానికి దూసుకొచ్చింది.వాస్తవానికి ముంబై ఇండియన్స్‌ను ఇలా పడి లేవడం కొత్తేమీ కాదు. గతంలో చాలా సీజన్లలో ఇలాగే ఆరంభంలో వరుస పరాజయాలు ఎదుర్కొని, ఆతర్వాత ఏకంగా టైటిల్‌నే ఎగరేసుకుపోయింది. ముంబై ఇండియన్స్ చరిత్రలో ఇలా వరుసగా 6 మ్యాచ్‌లు గెలవడం ఇది మూడో సారి. లీగ్ ఆరంభ సీజన్లో ఈ జట్టు తొలిసారి వరుసగా ఆరు విజయాలు సాధించింది. అయితే ఆ సీజన్లో లీగ్ దశలోనే నిష్క్రమించింది. తిరిగి 2017 సీజన్లో వరుసగా ఆరు విజయాలు సాధించింది. అయితే ఈ సారి ఛాంపియన్‌గా అవతరించింది.2017 సీజన్ తరహాలోనే ఆరు వరస విజయాల సెంటిమెంట్ ఈ సీజన్లోనూ కలిసొస్తుందని ముంబై ఇండియన్స్ భావిస్తుంది. ఈసారి కూడా తాము టైటిల్ ఎగరేసుకుపోతామని ఆ జట్టు అభిమానులు ధీమాగా ఉన్నారు. ఈ సీజన్లో టైటిల్ గెలిస్తే ముంబై చరిత్ర సృష్టించినట్లవుతుంది. ఐపీఎల్లో ఇప్పటివరకు ఏ జట్టు ఆరు టైటిళ్లు సాధించలేదు. ముంబై, సీఎస్కే సంయుక్తంగా ఐదు టైటిళ్లు సాధించాయి.ఈ సీజన్లో ముంబై తదుపరి టార్గెట్ అన్ని మ్యాచ్‌లు పూర్తయ్యే సరికి టేబుల్ టాపర్‌గా నిలవడం. ఈ సీజన్లో ముంబై ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మే 6న గుజరాత్, మే 11న పంజాబ్, మే 15న ఢిల్లీతో తలపడాల్సి ఉంది.
బిజినెస్

పోస్టాఫీస్ స్కీములకు కొత్త విధానం
పోస్టాఫీస్ పొదుపు పథకాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంటుంది. ఈ స్కీములు మారుమూల గ్రామీణులకు సైతం అందుబాటులో ఉన్నప్పటికీ వీటిని తెరిచేందుకు అనుసరించే పేపర్ వర్క్ సామాన్యులకు కాస్త ఇబ్బందిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఎంపిక చేసిన పొదుపు పథకాలను తెరవడానికి తపాలా శాఖ ఇప్పుడు పూర్తి డిజిటల్ ప్రక్రియను ప్రవేశపెట్టింది.మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (ఎంఐఎస్), టైమ్ డిపాజిట్ (టీడీ), కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్సీ) వంటి పొదుపు పథకాలను తెరవడానికి పేపర్లతో పనిలేకుండా ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణను తపాలా శాఖ అమలుచేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తిగా కాగిత రహితంగా, వేగంగా ఉంటుంది. ఫిజికల్ డిపాజిట్ స్లిప్ అవసరం ఉండదు.మంత్లీ ఇన్కమ్ స్కీమ్, టైమ్ డిపాజిట్, కిసాన్ వికాస్ పత్ర, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వంటి ప్రసిద్ధ చిన్న పొదుపు పథకాలను తెరవడానికి ఆధార్ ఆధారిత వీ-కేవైసీ ప్రక్రియను ఏప్రిల్ 23 నుండి తపాలా శాఖ అమలు చేస్తోంది. పోస్టాఫీస్ పొదుపు ఖాతాలు తెరవడం, నిర్వహించడం కోసం ఆధార్ ఆధారిత ఈ-కేవైసీని ఇదివరకే జనవరి 6 నుండి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు డిపాజిట్ వోచర్లు, భౌతిక ఫారాలు నింపే సాంప్రదాయ పద్ధతి కూడా అందుబాటులో ఉంది. కస్టమర్లు తమకు అనువైన విధానాన్ని ఎంచుకోవచ్చు.ఆధార్ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ద్వారా ఖాతా మూసివేత, ఖాతా బదిలీలు, నామినేషన్ అప్డేట్స్ వంటి ఫీచర్లు ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నాయని, త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. అప్పటి వరకు ఈ సేవలు సంప్రదాయ ప్రక్రియలోనే కొనసాగుతాయి. పేపర్‌లెస్ కేవైసీ ప్రక్రియను కొత్త కస్టమర్లతోపాటు ఇప్పటికే ఉన్న ఖాతాదారులందరూ వినియోగించుకునేలా చూడాలని అన్ని సర్కిళ్ల సిబ్బందికి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

గ్రీన్‌లో కదలాడుతున్న సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 133 పాయింట్లు పెరిగి 24,473కు చేరింది. సెన్సెక్స్(Sensex) 595 పాయింట్లు పుంజుకుని 80,854 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.14 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 62.63 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.23 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో గతంతో పోలిస్తే లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.63 శాతం లాభపడింది. నాస్డాక్ 1.52 శాతం ఎగబాకింది.ఇదీ చదవండి: మేలో లాంచ్ అయ్యే టాప్ 5 స్మార్ట్ఫోన్లుఆసియా మార్కెట్లలో సానుకూల ధోరణులు, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం మార్కెట్ సెంటిమెంట్‌కు దోహదపడుతుంది. ఇండియా-పాక్ ఉద్రిక్తతలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. దీంతోపాటు అమెరికా-చైనా ట్రేడ్‌వార్‌ను మార్కెట్లు గమనిస్తున్నాయి. తగ్గిన చమురు ధరలు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించి, ఆర్థిక వృద్ధికి తోడ్పడుతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

మేలో లాంచ్ అయ్యే టాప్ 5 స్మార్ట్ఫోన్లు
మొబైల్ యూజర్లు వాటి పనితీరు మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగా టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లలో మార్పులు వస్తున్నాయి. మొబైల్ తయారీ కంపెనీలు వినియోగదారుల అభిరుచుల మేరకు వినూత్న మోడళ్లను నిత్యం ఆవిష్కరిస్తున్నారు. అందులో భాగంగా మే, 2025లో లాంచ్ అవ్వనున్న టాప్ 5 కంపెనీల ఉత్పత్తుల గురించి కింద తెలుసుకుందాం.1. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్మే 13, 2025 నాటికి విడుదలవుతుందని అంచనా.6.6 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్.స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్. అల్ట్రా స్లిమ్ డిజైన్ (5.84 మిల్లీమీటర్ మందం, 162 గ్రాముల బరువు).25వాట్ ఛార్జింగ్‌తో 3,900 ఎంఏహెచ్ బ్యాటరీ.2. వన్‌ప్లస్ 13ఎస్విడుదల తేదీ మే 2025లో అంచనా.6.32 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే.స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్.కాంపాక్ట్ ఫ్లాగ్ షిప్ డిజైన్.బ్లాక్, పింక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.ధర సుమారు రూ.55 వేలు.3. రియల్మీ జీటీ 7విడుదల తేదీ మే 2025లో అంచనా.మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ చిప్ సెట్.16 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్.120 ఎఫ్‌పీఎస్ కలిగిన గేమింగ్ స్మార్ట్‌ఫోన్.రియల్మీ యూఐ 6.0 (ఆండ్రాయిడ్ 15)తో వస్తుంది.4. పోకో ఎఫ్7విడుదల తేదీ మే 2025లో అంచనా.స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 4 చిప్ సెట్.6.8 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే.90 వాట్ ఛార్జింగ్‌తో 7,550 ఎంఏహెచ్ బ్యాటరీ.ఇదీ చదవండి: రూ.5,830 కోట్ల ప్రాజెక్ట్‌ను నిలిపేసిన జోహో5. ఐకూ నియో 10విడుదల తేదీ మే 2025లో అంచనా.6.78 అంగుళాల 144 హెర్ట్జ్ ఎల్టీపీఓ అమోలెడ్ డిస్ప్లేడైమెన్సిటీ 9400 చిప్ సెట్.6,100 ఎంఏహెచ్ బ్యాటరీ, 120వాట్ వైర్డ్ ఛార్జింగ్.ధర సుమారు రూ.40 వేలు.

రూ.5,830 కోట్ల ప్రాజెక్ట్‌ను నిలిపేసిన జోహో
సెమీ కండక్టర్ తయారీలో సంక్లిష్టమైన ఫ్యాబ్రికేషన్ ప్రక్రియలకు సాంకేతిక భాగస్వామిని పొందడంలో ఇబ్బందులు పడుతున్నట్లు జోహో తెలిపింది. ఈ కారణంగా 700 మిలియన్ డాలర్ల(సుమారు రూ.5,830 కోట్లు) చిప్ తయారీ ప్రణాళికలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా నిలదొక్కుకోవాలన్న భారత్ ఆకాంక్షలకు ఇలాంటి సంఘటనలు సవాలుగా మారుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.టెక్నాలజీ భాగస్వామిని కనుగొనడంలో సవాళ్లుసెమీకండక్టర్ తయారీలోకి ప్రవేశించడానికి, మార్గనిర్దేశం చేయడానికి జోహో వ్యూహాత్మక భాగస్వామి కోసం అన్వేషిస్తోంది. ఈమేరకు కంపెనీ విస్తృతమైన ప్రయత్నాలు చేసినప్పటికీ తగిన పార్ట్నర్ను కనుగొనలేకపోయినట్లు సంస్థ తెలిపింది. సెమీకండక్టర్ పరిశ్రమకు అత్యంత ప్రత్యేకమైన నైపుణ్యం అవసరమని భావిస్తోంది. నమ్మకమైన భాగస్వామి లేకపోవడంతో చిప్ తయారీ ప్రణాళికలను నిలిపివేయాలని నిర్ణయించింది.ముందుగా కర్ణాటకలో సెమీకండక్టర్ ఫెసిలిటీలో 400 మిలియన్ డాలర్లు(సుమారు రూ.3,332 కోట్లు) పెట్టుబడి పెట్టాలని కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇది 460 మందికి ఉపాధి సృష్టిస్తుందని, రాష్ట్రంలో మొదటి చిప్ తయారీ ప్రాజెక్టుగా మారుతుందని భావిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం 2024 డిసెంబర్లో ఈ ప్రాజెక్ట్‌కు అనుమతులు కూడా ఇచ్చింది. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టును నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.ఇదీ చదవండి: బంగారమా..? మాకొద్దు బాబోయ్..!భారత్ లక్ష్యాలపై ప్రభావం..?సెమీకండక్టర్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, ప్రపంచ చిప్ పరిశ్రమలో కీలక పాత్ర పోషించేందుకు భారత్ కృషి చేస్తోంది. పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం బిలియన్ల విలువైన ప్రోత్సాహక పథకాలను ప్రవేశపెట్టింది. కానీ జోహో ఎదుర్కొంటున్న సవాళ్లు దేశీయ సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను స్థాపించడంలో నిర్మాణాత్మక అడ్డంకులను హైలైట్ చేస్తున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని చిప్ తయారీకి ముందుకువస్తున్న కంపెనీలకు అవి ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు చూపేలా ప్రభుత్వాలు ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఫ్యామిలీ

నటి రెజీనా ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..! రెండు వారాలకోసారి కలబంద గుజ్జు..
‘‘నా ఉదయం వేడి వేడి మసాలా టీతో మొదలవుతుంది. ఆ ఎనర్జీతో మొదలయ్యాక రోజంతా అదే ఉత్సాహం, శక్తితో ఉండటానికి నాకు సరిపడే ఆరోగ్యవంతమైన డైట్‌ని తీసుకుంటాను’’ అని రెజీనా కాసాండ్రా పేర్కొన్నారు. హీరోయిన్గా పలు భాషల్లో సినిమాలు చేస్తూ... బిజీ బిజీగా ఉండే రెజీనా కాసాండ్రా డైట్ విషయం లో స్ట్రిక్ట్‌గా ఉంటానంటున్నారు. కానీ వారంలో ఒక్కరోజు మాత్రం ‘చీట్ డే’ అని నవ్వేశారు. ఇక ఆ రోజు ఆయిల్ అని, ఫ్యాట్ అని నియమాలేం పెట్టుకోకుండా అన్నీ తింటానన్నారు. ఇంకా రెజెనా చెప్పిన విశేషాలు ఈ విధంగా... ఉదయం మసాలా టీ తాగిన కాసేపటికి అల్పాహారానికి మొలకలు, బాదంలాంటి డ్రై ఫ్రూట్స్ (పొట్టు తీసినవి), పండ్ల రసం తీసుకుంటాను. బ్రేక్‌ఫాస్ట్ బాగా తినాలి. అందుకే వీటితోపాటు ఇడ్లీ, దోసె తింటాను. సాంబార్ కాంబినేషన్ ఉండాల్సిందే. మధ్యాహ్నం భోజనంలో కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారానికి ప్రాధాన్యం ఇస్తాను. బీన్స్, క్యారెట్, ఇంకా ఉడికించిన కూరగాయలు, పప్పు తప్పకుండా ఉండాల్సిందే. అన్నంతోపాటు ఇవన్నీ తింటే ఇటు కార్బోహైడ్రేట్స్ అటు ప్రోటీన్ రెండూ అందుతాయి. బ్రౌన్రైస్ని ప్రిఫర్ చేస్తాను. మన రోజుని మనం హెవీ బ్రేక్‌ఫాస్ట్‌తో మొదలుపెట్టి, రాత్రి వరకూ క్రమ క్రమంగా తగ్గించుకుంటూ తినాలి. డిన్నర్ ఎంత లైట్ అయితే అంత బెటర్. అందుకే నేను సూప్ లాంటి వాటిని ప్రిఫర్ చేస్తాను. ఇప్పటివరకూ చెప్పినది ఒక రోజులో తీసుకునే డైట్ అయితే నా వారం ప్లాన్ ఎలా ఉంటుందంటే... వారంలో ఒక రోజంతా కేవలం పండ్ల రసాలతోనే సరిపెట్టేస్తాను. ఒక రోజంతా పండ్ల రసాలు మాత్రమే తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న మలినాలు పోతాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు ఇలా మలినాలను పోగొట్టుకోవడం కూడా చాలా ముఖ్యం. అలాగే రెండు వారాలకోసారి కలబంద గుజ్జు తింటాను. దీనికోసం పొట్ట ఖాళీగా ఉంచుకుంటాను. అలా ఎమ్టీ స్టమక్‌తో తింటేనే మంచిది. కలబంద గుజ్జు చర్మానికి నిగారింపుని ఇస్తుంది. ఇక ఒకేసారి కాకుండా రోజు మొత్తంలో కొంచెం కొంచెంగా నీళ్లు తాగుతుంటాను. చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్‌కి నేను దూరం. ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే... ఎక్సర్సైజ్లు చేయడటం, ఆహారం విషయంలో నియమాలు పాటించడం వంటివి స్లిమ్‌గా ఉండటం కోసమే కాదు... ఆరోగ్యంగా ఉండటం కోసం కూడా. సన్నగా ఉండాలని కడుపు మాడ్చుకున్నా ప్రమాదమే. అందుకే చక్కగా తినాలి... వ్యాయామాలు చేయాలి. అప్పుడు ఫిట్ అండ్ ఫైన్‌గా ఉంటాం’’ అంటూ ముగించారు రెజీనా.నేను, యోగా వేరు కాదని అనుకుంటాను. అంతలా యోగాని ఇష్టపడతాను. నేను ఫిట్ అండ్ ఫైన్‌గా ఉండటానికి యోగా ఓ కారణం. సూర్య నమస్కారాలతో మొదలుపెట్టి, భుజంగాసనం, సర్వాంగాసనం... ఇలా చాలా చేస్తాను. అలాగే ఇతర వ్యాయామాలు కూడా చేస్తుంటాను. నా ఎక్సర్సైజ్ ప్లాన్ ఎలా ఉంటుందంటే... ఒకరోజు అప్పర్ బాడీ చేస్తే తర్వాతి రోజు లోయర్ బాడీ వర్కవుట్స్ చేస్తాను. – డి.జి. భవాని(చదవండి:

ఆడుతూ పాడుతూ మార్కులు
బుధవారం ఐ.ఎస్.సి. ఇంటర్ ఫలితాలు వచ్చాయి. బెంగళూరులో టాపర్స్‌గా నిలిచిన ముగ్గురూ తమ కాలేజీల్లో సాంస్కృతిక కార్యకలాపాలలో చురుగ్గా ఉన్నారు. చదువు మిస్ కాలేదు. అలాగే ఉల్లాసాన్నిచ్చే కళలను కూడా! ‘మాకు కళలే చదువులో రిలాక్స్ అయ్యేలా చేశాయి’ అని వారు అన్నారు. తల్లిదండ్రులూ, విద్యార్థులూ ఈ విషయాన్ని వింటారా మరి? క్రీడలూ, కళలు చదువును చెడగొట్టవని! ఈ సెలవుల్లో అయినా వాటిని నేర్చుకుందామని!పూర్వం స్కూళ్లల్లో పాతజోకు ఉండేది.స్టూడెంటు ‘హోమ్‌వర్క్ చేయడం మర్చిపోయాను సార్’ అని అంటే ‘అన్నం తినడం మర్చిపోలేదు కదా. ఇదెలా మర్చిపోయావు‘ అని బెత్తంతో ఒక్కటి వేసేవాడు సారు.స్టూడెంట్స్‌కు అన్నం తినడానికి, నిద్ర పోవడానికి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి తప్పక సమయం ఉంటుంది. అలాగే ఇష్టమైన ఆసక్తి నెరవేర్చుకోవడానికి కూడా టైమ్ ఉంటుంది. ఇవన్నీ చేసి బ్రహ్మాండం గా చదవగలరు పిల్లలు. గతంలో అలా చదివి, ఇంకా చె΄్పాలంటే ఏ సౌకర్యాలు లేకపోయినా కరెంటు స్తంభాల వెలుతురులో చదివి గొప్ప విద్యార్థులు అయిన వారు ఉన్నారు. తల్లిదండ్రులకు అది తెలుసు. అయితే తల్లిదండ్రులు ఆ సంగతి మర్చిపోయారు.కొడుకులు, కూతుళ్లు నేడు అన్ని సౌకర్యాలతో ఉన్నా ఫ్యాను, లైటు, స్కూల్ బస్సు, టిఫిన్ బాక్స్, మంచి స్కూలు ఉన్నా కేవలం చదువుకు మాత్రమే అంకితమైతే తప్ప గొప్ప మార్కులు తెచ్చుకోలేరని భావిస్తున్నారు. పుస్తకం ముందేసుకుని ఉంటేనే ర్యాంకులు వస్తాయని అభిప్రాయపడుతున్నారు. అప్పట్లో కాసేపు చదివినా మంచి మార్కులే వచ్చేవి. కాని ఇప్పటి విద్యార్థులు స్కూలు/కాలేజీ మొదలైన రోజు నుంచే చదువుతున్నారు. అంటే వారు ఎంత లేదన్నా పరీక్ష బాగా రాస్తారు. అయినా సరే వారికి ఆట వద్దు, పాట వద్దు, సినిమా వద్దు, బంధువులు వద్దు అనడం వల్ల పిల్లలను ఐసొలేట్ చేయడమా కాదా అని తల్లిదండ్రులు ఆలోచించాలి.ఇదిగోండి ఉదాహరణ‘ది కౌన్సిల్ ఫర్ ది స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్’ (సి.ఐ.ఎస్.సి.ఇ.) బోర్డ్ వారు ఇంటర్ విద్యార్థులకు నిర్వహించే ‘స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్’ (ఐ.ఎస్.సి) రిజల్ట్స్ బుధవారం వెలువడ్డాయి. దేశవ్యాప్తంగా విడుదలైన ఈ రిజల్ట్స్‌లో టాపర్‌గా నిలిచిన విద్యార్థులు రేయింబవళ్లు చదువుకే అంకితమైన వారు కాదు. ముఖ్యంగా బెంగళూరుకు టాపర్లు ఆటకూ పాటకూ చోటిచ్చి ఈ మార్కులు తెచ్చుకున్నారు. వీరిలో శామ్యూల్ పింటోకు 96 పర్సెంట్ వచ్చింది. బెంగళూరు కోరమండల లోని బెతాని స్కూల్లో ఇంటర్ చదివిన పింటో ‘నేను స్కూల్ కల్చరల్ యాక్టివిటీస్‌కి సెక్రటరీని.అంతేకాదు వ్యక్తిగతంగా పాము విషానికి విరుగుడు మందు విషయంలో నాదైన పరిశోధన చేస్తున్నాను. ఈ రెంటికీ సమయం ఇచ్చినా స్కూల్ చదువును టైమ్‌టేబుల్ ప్రకారం చదువుకున్నాను. నేను భవిష్యత్తులో యాంటీ వీనమ్ టెక్నాలజీలో పని చేస్తాను’ అన్నాడు. హ్యుమానిటీస్‌లో టాపర్‌గా వచ్చిన నటాలీ కూడా అదే స్కూల్లో చదివి 98.2 పర్సెంట్ తెచ్చుకుంది. నేను నా పదో ఏట నుంచి సింగర్‌గా, డాన్సర్‌గా, యాక్టర్‌గా కృషి చేస్తున్నాను. అవి నా చదువుకు అడ్డు కాలేదు. చదువుకు సమయం తప్పకుండా కేటాయించి చదివాను’ అంది.ఐ.సి.ఎస్ ఎగ్జామ్స్‌లో కామర్స్‌లో టాపర్‌గా నిలిచిన సాన్నిధ్య బెంగళూరు గ్రీన్వుడ్ స్కూల్ విద్యార్థిని. 98.75 పర్సెంట్ తెచ్చుకుంది. ‘కథక్ నా స్ట్రెస్ బస్టర్. బాడ్మింటన్ ఆడతాను. ఈ రెంటికీ 3 గంటల సమయం ఇచ్చి మిగిలింది చదువుకు ఇస్తాను’ అని చెప్పింది. ఇప్పుడు చెప్పండి తల్లిదండ్రులూ... అన్ని సౌకర్యాలు ఇచ్చి పిల్లలను చదివిస్తున్న మీరు వారికి ఆట పాటలు ఆసక్తులు ఇవ్వలేరా? బడి జరుగుతున్నప్పుడు సరే. కనీసం ఈ వేసవి సెలవుల్లో అయినా. సెలవులను ఆనందాలుగా చేసి వారి దోసిళ్లలో పోయండి. – కె.ఈ పుస్తకం చదవండికొందరు తమకు రెక్కలున్నాయనే గుర్తించరు. మరికొందరు రెక్కలున్నది ఇంతవరకు ఎగిరేందుకే అనుకుంటారు. కాని ప్రయత్నం చేయాలి... ఉన్నదానిని పెంచి సాధించుకోవాలి అని పట్టుపడ్డ సముద్ర పక్షి కథే ‘జోనాథన్ లివింగ్స్టన్ సీగల్’. జోనాథన్ అనే పేరున్న సీగల్ మన కాకిస్థాయి పక్షి. ఎక్కువ ఎత్తు ఎగరలేదు. 500 అడుగుల ఎత్తులోపే ఎగరగలదు. ఎగిరినా ఆహార అన్వేషణ కోసమే. కాని జోనాథన్‌కు ‘నాకు రెక్కలున్నాయి. గద్దలాగా మరింత ఎత్తుకు ఎందుకు ఎగరకూడదు’ అనిపిస్తుంది. అలాంటి ఆలోచనకే భయపడే సీగల్స్ మధ్య 5000 అడుగుల ఎత్తుకు ఎగిరి చరిత్ర సృష్టిస్తాడు జోనాథన్ రిచర్డ్ బాక్ రాసిన ఈ చిన్న నవలకు ప్రపంచ ప్రఖ్యాతి ఉంది. పిల్లలు తప్పక చదవాలి. తాము కేవలం ర్యాంకులు తెచ్చుకోవడానికే పుట్టలేదు... వాటితో పాటు అనేక పనులు చేయగలం... సాధించగలం... అనే ఆత్మవిశ్వాసం పొందుతారు.

తొమ్మిది గజాల చీరలో మహారాష్ట్ర అమ్మాయిలా స్టార్ హీరోయిన్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తన సింపుల్, ట్రెడిషనల్ ఫ్యాషన్‌తో అభిమానుల హృదయాలను గెల్చుకుంది. వేవ్స్ సమ్మిట్ 2025 ( WAVES Summit 2025) లో ఉత్సాహభరితమైన మహారాష్ట్ర రాష్ట్రంలో మహిళలు ధరించే ఒక ప్రత్యేకమైన నౌవారీ చీరలో అద్భుతంగా కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.అలియా వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్‌కు హాజరైంది. ఈ సందర్భంగా తనదైన మినిమలిస్టిక్ ఫ్యాషన్, స్టేట్మెంట్ లుక్‌తో 'వావ్' అనిపించిందిముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మే 1న జరిగిన ఈవెంట్లో మహారాష్ట్ర అమ్మాయిగా మారిపోయింది. తొమ్మిది గజాల నౌవారీ చీరలో ట్రెడిషనల్‌గా చాలా అందంగా కనిపించింది. "నౌ" అంటే తొమ్మిది, తొమ్మిది గజాల నౌవారీ చీర స్టైల్ మహారాష్ట్రలో ప్రసిద్ధి. పీచ్, నారింజ రంగుల కలయితో గులాబీ రంగు అంచుతో వచ్చిన ఈ చీరకు, పూల డిజైన్‌తో హైలైట్ చేశారు. హిందీ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన నటీమణులలో ఒకరైన అలియా భట్, తన నటనా నైపుణ్యాలు, అందం, ఫ్యాషన్ స్టేట్మెంట్లు, అది సాంప్రదాయమైనా లేదా పాశ్చాత్యమైనా ఫ్యాన్స్‌ను ఫిదా చేయాల్సిందే.కాగా 2024లో మెట్ గాలాలో అరంగేట్రం చేసిన ఆలియా భట్, తన లుక్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. సబ్యసాచి ముఖర్జీ నుండి అందమైన చీరలో బ్యూటిఫుల్‌గా కనిపించింది. నటిగాస్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రంతో తన కెరీర్‌ను ప్రారంభించి బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. బాలీవుడ్లో విలక్షణమైన పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. 2022 ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రి ఇచ్చింది. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌ని పెళ్లాడినా అలియా ఒక ఆడబిడ్డకు తల్లి కూడా. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)

సహజ యోగతో ఆత్మసాక్షాత్కారం
ఒకప్పుడు ఋషులు, మహర్షులు కఠోరమైన తపస్సులు చేస్తేనే కానీ సాధ్యం కాని కుండలినీ శక్తి జాగృతి నేడు సాధారణమైన గృహస్థ జీవితం గడుపుతున్న సామాన్యులకు ఎలా సాధ్యమయిందని అడిగితే శ్రీ మాతాజీ నిర్మలా దేవి ఇలా వివరిస్తారు‘ఇప్పుడు ఆ సమయం ఆసన్నమయింది. మొత్తం మానవాళి తమ పరిణామ క్రమంలో తదుపరి దశ అయిన మానవాతీత స్థాయిని చేరుకోవలసిన సమయం ఆసన్నమయ్యింది. అనాది కాలంగా అరణ్యాలు, పర్వతాలలో తపస్సులు చేసి భగవంతుని కోసం పరితపింmrన ఋషి పుంగవులంతా నేడు సామాన్యులుగా జన్మిం ఆత్మ సాక్షాత్కారం పొందుతున్నారు. వారి పూర్వ జన్మల పుణ్యఫలం నేడు అనుభవిస్తున్నారు. వారి లోపల ఉన్న దానినే వారికి పరిచయం చేశాను కానీ నేను కొత్తగా ఏమీ ఇవ్వడం లేదు‘ అని చెప్పారు.ఈనాడు ప్రపంచవ్యాప్తంగా 120 దేశాలలో ఉన్న సహజ యోగ సాధకులు వివిధ రకాల వ్యాధులను, అవి ఇంకా భౌతిక శరీరానికి రావడానికి ముందే చైతన్య తరంగాల సహాయంతో సూక్ష్మ శరీరంలోనే వాటిని గుర్తించి, నయం చేసుకోగలుగుతున్నారు. ఈ విధంగా సహజ యోగం మరింతగా వ్యాప్తి చెందితే, మానవులకు ఇక ఆసుపత్రుల అవసరం ఉండదు అనేది సత్యదూరం కాదు.ఇదీ చదవండి: Dharmakīrti గెలిచేది, నిలిచేది ధర్మమే...సత్యమే!ఇప్పటికే పలు విశ్వవిద్యాలయాలు ‘సహజ యోగం‘ మీద జరిపిన పరిశోధనకి గాను డాక్టరేట్ డిగ్రీలు ప్రదానం చేయడం జరిగింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం వారు దీనిని ఒక ‘ప్రత్యామ్నాయ వైద్యం‘ గా గుర్తించి గౌరవించారు. ఇంకా శ్రీ మాతాజీ నిర్మలాదేవి చెప్పిన పలు విషయాల మీద పరిశోధన జరుగుతుంది. రష్యాలో శాస్త్రవేత్తలు ‘వెగా మెషీన్‘ అనే మెషీన్ ద్వారా సహజ యోగ ధ్యానం చేయటానికి ముందు, ఆ తర్వాత మనిషి శరీరంలో జరుగుతున్న మార్పులను నమోదు చేసి ఆసక్తికరమైన ఫలితాలను వెల్లడించారు. భవిష్యత్తులో సహజ యోగం మరింతగా వ్యాప్తి చెంది, భృగు మహర్షి తెలియజేసిన విధంగా మొత్తం మానవాళి బ్రహ్మానంద అనుభూతిలో ఓలలాడుతుందని ఆశిద్దాం.– డా. పి. రాకేశ్( పరమ పూజ్య శ్రీ మాతాజీనిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా)
ఫొటోలు


న్యూయార్క్ వీధుల్లో హీరో రానా దంపతులు (ఫోటోలు)


సమ్మర్లో చిల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ (ఫోటోలు)


ఏప్రిల్ నెల స్వీట్ మెమొరీస్ అంటూ ఫోటోలు షేర్ చేసిన 'అల్లు స్నేహ'


RR vs MI: ముంబై ‘సిక్సర్’ రాజస్తాన్ ‘అవుట్’ మ్యాచ్ హైలైట్స్ (ఫోటోలు)


జూ పార్క్‌లో పర్యాటకుల సందడి.. వన్యప్రాణులను కెమెరాల్లో బంధిస్తూ! (ఫోటోలు)


వేవ్స్ సమ్మిట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నాగచైతన్య- శోభిత దూళిపాల (ఫోటోలు)


రామ్ చరణ్ మదర్ ఆవకాయ పచ్చడి.. మరో స్పెషల్ అంటూ మెగా కోడలు ఉపాసన పోస్ట్ (ఫోటోలు)


రెట్రో లుక్‌లో పూజా హెగ్డే.. సింప్లీ సూపర్ (ఫోటోలు)


కృతీ శెట్టిని ఇలా చూస్తే అభిమానులు ఫుల్ ఖుషీ (ఫోటోలు)


CSK vs PBKS : చహల్ హ్యాట్రిక్, చెన్నై ఖేల్ ఖతం (ఫోటోలు)
అంతర్జాతీయం

పాక్‌కు భారత్ సీరియస్ వార్నింగ్
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి (Terrorist attack) నేపథ్యంలో భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆ దాడి తర్వాత నియంత్రణ రేఖ వెంట పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఈ క్రమంలో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్, భారత్‌కు చెందిన మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్స్ హాట్లైన్లో మాట్లాడుకున్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ సైన్యం కాల్పులకు పాల్పడుతున్న విషయాన్ని ప్రస్తావించిన భారత్.. దాయాది దేశాన్ని హెచ్చరించినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. ఏయే రోజు ఎక్కడెక్కడ పాక్ కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడిందో వివరించిన భారత సైనిక అధికారులు.. ఇకపై కొనసాగిస్తే చర్యలు తప్పవని.. దీటుగా బదులిస్తామని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు.. యుద్ధ వాతావరణం నెలకొనడంతో సరిహద్దు ప్రజలు అప్రమత్తమవుతున్నారు. ఇదే సమయంలో పాకిస్థాన్ (Pakistan) కూడా భద్రతాపరంగా పలు చర్యలు తీసుకుంటోంది. తాజాగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిత్, స్కర్దు తదితర ప్రాంతాలకు విమాన సర్వీసులను పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA) రద్దు చేసింది. సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాకిస్థాన్ కూడా గగనతలాన్ని నిఘాను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే లాహోర్, కరాచీ నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లోని స్కర్దు, గిల్గిత్‌కు నడిచే విమాన సర్వీసులను పీఐఏ నిలిపివేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

చిగురిస్తున్న ఇండో-కెనడా స్నేహం
భారత్-కెనడా మధ్య సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ స్నేహం కొత్త చివుళ్లు వేస్తోందా? ఏడాదిన్నర కాలానికి పైగా గాడి తప్పిన భారత్, కెనడా దౌత్య సంబంధాలు పట్టాలెక్కబోతున్నాయా... అంటే అవుననే చెప్పాలి. కెనడా సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన లిబరల్ పార్టీ నేత, ఆ దేశ ప్రస్తుత తాత్కాలిక ప్రధాని, కాబోయే పూర్తికాలపు ప్రధాని మార్క్ కార్నీకి భారత్ ప్రధాని మోదీ పంపిన అభినందన సందేశానికి సంకేతం అదే. మార్క్ కార్నీకి ముందు కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో ఉన్నప్పుడు గత అక్టోబరులో రెండు దేశాలూ పరస్పరం హై కమిషనర్లను బహిష్కరించాయి. ఈ ఏడాది జూన్ మాసానికల్లా హై కమిషనర్ల వ్యవస్థను పునరుద్ధరించాలని ఉభయ దేశాలు తలపోస్తున్నాయి. ప్రస్తుతం ‘స్పెయిన్’లో భారత రాయబారిగా వ్యవహరిస్తున్న దినేష్ కుమార్ పట్నాయక్ ను కెనడాలో తదుపరి హై కమిషనరుగా భారత్ నియమించే అవకాశముందని, ఇందుకు సంబంధించిన ప్రక్రియ త్వరలో ఆరంభమవనుందని తెలుస్తోంది. కెనడా ఎన్నికల ఓట్ల లెక్కింపు దాదాపు పూర్తయింది. 343 స్థానాలున్న పార్లమెంటు దిగువ సభలో లిబరల్ పార్టీ 168 సీట్లు, కన్జర్వేటివ్ పార్టీ 144 సీట్లు గెలుచుకున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తి మెజారిటీ రావాలంటే లిబరల్ పార్టీ 172 సీట్లు గెలవాలి. కానీ ఆ మేజిక్ నంబరుకు కొద్ది దూరంలో అది ఆగిపోయింది. చిన్న పార్టీల సహకారంతో లిబరల్ పార్టీ మైనారిటీ సర్కారు ఏర్పాటు చేసే అవకాశముంది. ఖలిస్థాన్ వేర్పాటువాద నేత హరదీప్ సింగ్ నిజ్జర్ 2023లో కెనడాలో హత్యకు గురయ్యాడు. భారత ప్రభుత్వ ఏజెంట్లే అతడిని హతమార్చారని కెనడా ఆరోపించడంతో ఆ దేశంతో భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయి. తదనంతర పరిణామాల్లో కెనడాలో భారత హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మను కెనడా వెళ్లగొట్టడం, ప్రతిగా కెనడా దౌత్యవేత్తలను ఇండియా బహిష్కరించడం చకచకా జరిగిపోయాయి. దరిమిలా చాలినంత మంది దౌత్యవేత్తలు లేక కెనడా కాన్సులేట్లు మూతపడ్డాయి. నాటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పదవి నుంచి దిగిపోయారు. మరోవైపు కెనడా ఎన్నికల్లో ఖలిస్థాన్ సానుకూల నేత, న్యూ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడు జగ్మీత్ సింగ్ కూడా ఓటమి పాలయ్యాడు. ఈ రెండు పరిణామాలు ఇండో-కెనడా బంధం మళ్లీ మొగ్గ తొడిగేందుకు పరిస్థితులను అనుకూలంగా మార్చాయి. ట్రూడోలా కాకుండా మార్క్ కార్నీ మరింత పరిణతితో వ్యవహరిస్తారని భారత్ అభిప్రాయపడుతోంది. - జమ్ముల శ్రీకాంత్

Bangladesh: చిన్మయ్ కృష్ణదాస్‌కు ఊరట
ఢాకా: ఇస్కాన్ మాజీ ప్రతినిధి, బంగ్లాదేశ్‌లో మైనారిటీ హక్కుల సాధన ఉద్యమకారుడు చిన్మయ్ కృష్ణదాస్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. బంగ్లాదేశ్ హైకోర్టు బుధవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రాజద్రోహం కేసులో కిందటి ఏడాది నవంబర్‌లో ఆయన్ని బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ ప్రచారకర్తగా పనిచేస్తున్న చిన్మయ్ కృష్ణదాస్ గతేడాది నవంబరులో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. అక్కడ బంగ్లా జాతీయజెండాను అగౌరవపరిచారనే అభియోగాలపై 2024 నవంబరు 25న ఢాకా హజారత్ షాహ్జలాల్ ఎయిర్‌పోర్టులో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అనంతరం జైలుకు తరలించారు. ఆయన తరఫున వాదనలు వినిపించేందుకు న్యాయవాదులను సైతం అక్కడి ఆందోళనకారులు అనుమతించలేదు. చివరకు చిన్మయ్ భాగస్వామిగా ఉన్న బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతన జాగరణ్ జోతే అనే సంస్థ.. 11 మందితో లాయర్ల బృందాన్ని ఏర్పాటుచేసింది. అయినా కూడా ఆయనకు బెయిల్ దక్కలేదు. మరోవైపు భారత్ సహా అంతర్జాతీయ సమాజం చిన్మయ్ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించింది. శాంతియుతంగా నిరసన తెలిపే మైనారిటీల హక్కులను కాలరాయడం సరికాదంటూ భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. చిన్మయ్ కృష్ణదాస్ స్వస్థలం చిట్టాగాంగ్‌లోని సట్కానియా ఉపజిల. 2016-2022 మధ్య ఇస్కాన్ చిట్టాగాంగ్ డివిజనల్ సెక్రటరీగా దాస్ పని చేశారు. ఆపై హిందూ మైనారిటీల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పడిన బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతన జాగరణ్ జోతే తరఫున ప్రతినిధిగా దాస్ పని చేశారు. సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఆయనకంటూ అక్కడ ఓ పేరుంది. బంగ్లా మీడియా ఆయన్ని శిశు బోక్తాగా అభివర్ణిస్తుంటుంది. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో పాటు మైనారిటీ ప్రోటెక్షన్ లా తేవడంంలోనూ దాస్ కృషి ఎంతో ఉంది. కిందటి ఏడాది.. అక్టోబర్ 25న చిట్టాగాంగ్‌లో, నవంబర్ 22వ తేదీన రంగ్‌పూర్‌లో ఆయన నిర్వహించిన ర్యాలీలు దేశవ్యాప్త చర్చకు దారి తీశాయి. చిట్టాగాంగ్‌లో నిర్వహించిన ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాకు పైన కాషాయ జెండాను ఎగరేయడంతోనే ఆయనపై రాజద్రోహం కేసు నమోదు అయ్యింది.

ప్రధాని మోదీ రష్యా పర్యటన రద్దు
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన రద్దైంది. మే 9వ తేదీ మాస్కోలో జరగాల్సిన విక్టరీ డే వేడుకలకు ప్రధాని మోదీ బదులు.. భారత దౌత్య ప్రతినిధి హాజరవుతారని క్రెమ్లిన్ వర్గాలు ఇవాళ ప్రకటించాయి. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ మీద సోవియట్ యూనియన్ విజయానికి గుర్తుగా రష్యా ప్రతీ ఏటా మే 9వ తేదీని విక్టరీ డేగా నిర్వహిస్తుంటుంది. ఈ ఏడాది 80వ వార్షికోత్సవం సందర్భంగా పలు ప్రపంచ దేశాల అధినేతలకు ఆహ్వానం పంపింది. అందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ వర్గాలు ధృవీకరించాయి కూడా.అయితే ఆయన బదులు.. ప్రతినిధి హాజరవుతారని ఇప్పుడు ప్రకటన వెలువడింది. అయితే పహల్గాం ఘటన తర్వాత.. పాక్‌తో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలోనే మోదీ పర్యటన రద్దై ఉండొచ్చని పలు ఆంగ్ల మీడియా ఛానెల్స్ కథనాలు ఇస్తున్నాయి.
జాతీయం

పెళ్లి నగలు స్త్రీ ధనమే
తిరువనంతపురం: పెళ్లి సమయంలో వధువుకు బహుమతిగా ఇచ్చే బంగారు నగలు, నగదుపై హక్కెవరిదనే అంశంపై కేరళ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వాటిని స్త్రీ ధనంగా పరిగణించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అవి పూర్తిగా ఆ మహిళకే చెందుతాయని, చట్టబద్ధమైన పూర్తి హక్కులు ఆమెకే ఉంటాయని జస్టిస్ దివాన్ రామచంద్రన్, జస్టిస్ ఎంబీ స్నేహలతల ధర్మాసనం తెలిపింది. విడాకుల తర్వాత పెళ్లినాటి బంగారు నగలపై మహిళకు ఎలాంటి హక్కులేదంటూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎర్నాకులంలోని కలమసెర్రికి చెందిన మహిళ వేసిన పిటిషన్‌పై ఈ మేరకు తీర్పు వెలువరించింది.దురదృష్టవశాత్తూ భర్త, అత్తింటి వారు అలాంటి విలువైన ఆస్తులను బలవంతంగా స్వాధీనం చేసుకున్న అనేక సందర్భాలున్నాయని కూడా ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అనధికారికంగా చేతులు మారే ఇటువంటి ప్రైవేటు ఆస్తులపై తమకు హక్కుందని ప్రకటించుకునేందుకు అవసరమైన పత్రాలు మహిళల వద్ద ఉండవని, ఇలాంటి సందర్భాల్లో కోర్టులు విచక్షణను ఉపయోగించాల్సి ఉంటుందని తెలిపింది. 2010లో వివాహం సమయంలో పుట్టింటి వారు తమకు 63 సవర్ల బంగారంతోపాటు, రెండు సవర్ల గొలుసును, బంధువుల నుంచి అదనంగా మరో 6 సవర్ల ఆభరణాలు బహుమతిగా వచ్చాయని పిటిషనర్ తెలిపారు.వీటిలో మంగళసూత్రం, ఒక బంగారు గాజు, రెండు రింగులను మాత్రమే తనవద్ద ఉంచి మిగతా అన్నిటినీ భద్రత కోసమంటూ అత్తింటి వారు తీసుకున్నారని తెలిపారు. అదనంగా మరో రూ.5 లక్షలు డిమాండ్ చేయడంతో పుట్టింటికి వెళ్లగొట్టారని తెలిపారు. భర్త తన నగలను బ్యాంకులో ఉంచినట్లు తెలిపే పత్రాలను ఆమె కోర్టుముందుంచారు. పరిశీలించిన ధర్మాసనం 59.5 సవర్ల బంగారాన్ని లేదా మార్కెట్ విలువ ప్రకారం డబ్బు ఇవ్వాలని భర్తను ఆదేశించింది. బంధువులిచ్చిన నగలు, ఇతర విలువైన వస్తువులను కూడా ఇప్పించాలంటూ పిటిషనర్ చేసిన వినతిపై ధర్మాసనం.. తగు ఆధారాలు లేనందున తామేమీ చేయలేమని తెలిపింది.

భారత్ వీడే పాక్ పౌరులకు మరింత గడువు
న్యూఢిల్లీ: భారత్‌లో ఉంటున్న పాక్ పౌరులకు కొంచెం ఉపశమనం కలిగింది. దేశం వీడేందుకు ఇచ్చిన గడువును కేంద్రం గురువారం సడలించింది. ఏప్రిల్ 30న సరిహద్దును మూసివేస్తామని గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరిస్తున్నట్లు హోం శాఖ తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు వాఘా–అటారీ సరిహద్దు గుండా తిరిగి వెళ్లేందుకు అనుమతించింది. ‘ఈ ఉత్తర్వులను సమీక్షించాం.తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ పాక్ పౌరులు అటారీలోని ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ నుంచి భారత్ విడిచి పాకిస్తాన్‌కు వెళ్లొచ్చు’అని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. కేంద్రం ఆదేశించిన ఆరు రోజుల్లో 55 మంది దౌత్యవేత్తలు, వారి సహాయక సిబ్బంది సహా 911 మంది పాకిస్తానీయులు అటారీ–వాఘా సరిహద్దు పోస్ట్ ద్వారా భారత్‌ను వీడారు. ఇక పాకిస్తాన్ నుంచి 1,617 మంది భారతీయులు స్వదేశానికి వచ్చారు. వీరిలో దీర్ఘకాలం వీసా కలిగిన 224 మంది ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరికొందరు విమానాశ్రయాల ద్వారా మూడో దేశం గుండా పాక్ వెళ్లిపోయారని అధికార వర్గాలు తెలిపాయి.

ఇంట్లోకి చొరబడండి!
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి ప్రవేశించి, అక్కడే బైఠాయించాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. పీఓకేను స్వాదీనం చేసుకోవాలని కోరారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నిర్ణయాత్మక సైనిక, వ్యూహాత్మక చర్యలు చేపట్టాలని అన్నారు. ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. భారత సైన్యం దాడులు చేస్తుందన్న భయంతో పాకిస్తాన్ సైనికాధికారులు విదేశాలకు పారిపోతుండడంపై స్పందించారు. అది చాలా మంచి పరిణామం అని చెప్పారు.పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి చొరబడి, అక్కడే మకాం వేయడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. ఈ అవకాశం వదులుకోవద్దని స్పష్టంచేశారు. ఉగ్రవాదుల ఇళ్లలోకి ప్రవేశించి మరీ దాడులు చేస్తామంటూ ప్రధాని మోదీ గతంలో హెచ్చరించారని, ఇప్పుడు ఆ పని చేసి చూపించాలని అన్నారు. పీఓకేను మన అ«దీనంలోకి తెచ్చుకోవాల్సిందేనని అసదుద్దీన్ ఒవైసీ తేల్చిచెప్పారు. పీఓకే భారత్‌కే చెందుతుందంటూ పార్లమెంట్లో ఇప్పటికే ఒక తీర్మానం ఆమోదించినట్లు గుర్తుచేశారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. పార్లమెంట్ మద్దతు ఉంది కాబట్టి వెనుకంజ వేయాల్సిన అవసరం లేదన్నారు. ఉగ్రదాడులకు చరమగీతం పాడాలి హైదరాబాద్‌లో లుంబినీ పార్కులో, దిల్‌సుఖ్‌నగర్‌లో ఉగ్రవాద దాడులు జరిగాయని అసదుద్దీన్ ఓవైసీ ప్రస్తావించారు. ఉగ్రవాదులు ముంబైలో భీకర దాడులకు పాల్పడ్డారని, 2019లో పుల్వామాలో మన జవాన్లను ముష్కరులు బలి తీసుకున్నారని చెప్పారు. ముంబైలో వీటీ స్టేషన్లో జరిగిన ఉగ్రవాద దాడుల్లో ఓ తెలుగు పండితుడు నవ వధువు అయిన తన కుమార్తెను పోగొట్టుకున్నాడని తెలిపారు. నిజామాబాద్‌కు చెందిన ఆ నవ వధువు చేతికి గోరింటాకు ఉందన్నారు. గత ఏడాది వైష్ణోదేవి ఆలయం వద్ద జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు పర్యాటకులు మరణించారని వెల్లడించారు. ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించాలని ప్రతిపక్షాలు తరచుగా కోరుతూనే ఉన్నాయని చెప్పారు. ‘‘అధికారంలో మీ చేతుల్లోనే ఉంది, ఇలాంటి దాడులకు చరమగీతం పాడండి’’ అని కేంద్ర ప్రభుత్వానికి ఒవైసీ విజ్ఞప్తి చేశారు.

ఎవరినీ వదిలిపెట్టం!
న్యూఢిల్లీ: ప్రతి ఉగ్రవాద చర్యకూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత్ తగిన సమాధానం ఇస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. పిరికిపందల్లా దాడులకు పాల్పడి అదే గొప్ప విజయంగా భావిస్తూ పొంగిపోవద్దని ఉగ్రవాదులకు హితవు పలికారు. ఇది నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత్ అనే సంగతి గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. ఒకరి తర్వాత ఒకరిపై వరుసగా ప్రతీకారం తీర్చుకుంటామని ఉగ్రవాదులను ఘాటుగా హెచ్చరించారు. దేశంలో ఉగ్రవాదాన్ని ప్రతి మూల నుంచీ అంతం చేస్తామని పునరుద్ఘాటించారు. ఒక్క అంగుళం భూభాగంలోనూ ఉగ్రవాదం అనేది లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.అనుకున్నది సాధించి తీరుతామని ప్రతిజ్ఞ చేశారు. ఆయన గురువారం ఢిల్లీలో ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. ఉగ్రవాదంపై తాము ప్రారంభించిన పోరాటానికి అంతర్జాతీయ సమాజం మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ పోరాటంలో 140 కోట్ల మంది భారతీయుల మద్దతే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరి మద్దతు కావాలని చెప్పారు. ఉగ్రవాదాన్ని నామరూపాల్లేకుండా చేయడానికి ప్రపంచమంతా ఒక్కతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. మనమంతా చేతులు కలిపి పనిచేస్తే ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేయొచ్చని తెలిపారు.ఇండియాలో దాడులకు పాల్పడి, ప్రజల ప్రాణాలను బలితీసుకున్న ముష్కరులకు తగిన శిక్ష విధించడం తథ్యమని అన్నారు. ఉగ్రవాదం పూర్తిగా అంతమయ్యే దాకా తమ పోరాటం ఆగదని వెల్లడించారు. పహల్గాంలో దాడికి పాల్పడిన ప్రతి ఒక్క ముష్కరుడినీ వేటాడుతామని అమిత్ షా స్పష్టంచేశారు. వారు శిక్ష నుంచి ఎప్పటికీ తప్పించుకోలేరని అన్నారు. మోదీ ప్రభుత్వం ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోదని చెప్పారు. 26 మందిని హత్య చేసి, గెలిచామనుకుంటే అది పొరపాటే అవుతుందని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదుల అరాచకాలను సహించే ప్రసక్తే లేదన్నారు.
ఎన్ఆర్ఐ

డల్లాస్‌లో నిరాశ్రయుల ఆశ్రయ గృహంలో పేదలకు ఆహారం
తెలంగాణా పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (Telangana Peoples Association of Dallas) మరో సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో 'ఫుడ్ డ్రైవ్'తో అన్నార్తుల ఆకలి తీర్చింది. Austin Street Homeless Shelter లో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఒక రోజంతా సాగిన ఈ కార్యక్రమంలో TPAD సభ్యులు స్వయంగా పాస్తా, చికెన్, మాష్డ్ పొటాటో తదితర వంటకాలు తయారు చేసి.. అన్నార్తులకు వడ్డించారు. 450 మందికి పైగా నిరాశ్రయుల ఆకలి తీర్చారు. అనురాధ మేకల (ప్రెసిడెంట్), రావు కల్వల (FC చైర్), పాండు పాల్వే (BOT చైర్), రమణ లష్కర్ (కోఆర్డినేటర్), దీపికా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఫుడ్ డ్రైవ్‌లో 450 మందికి పైగా నిరాశ్రయులకు ఆహారం వడ్డించామని, టీప్యాడ్ చెందిన 50 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు తెలియజేశారు. టీప్యాడ్ సీనియర్ నాయకుడు రఘువీర్ బండారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. (మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Texas: మృత్యువుతో పోరాడి ఓడిన దీప్తి
ఆస్టిన్: అమెరికా టెక్సాస్‌లో తెలుగు విద్యార్థిని హిట్ అండ్ రన్ కేసు విషాదాంతంగా ముగిసింది. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వంగవోలు దీప్తి(Deepthi Vangavolu)కన్నుమూశారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు ఇచ్చిన సమాచారం ద్వారా కుటుంబ సభ్యులు ధృవీకరించారు. దీంతో గుంటూరులోని ఆమె స్వస్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీప్తి(23) తండ్రి హనుమంత రావు చిరువ్యాపారి. ఆమె కుటుంబం గుంటూరు(Guntur) రాజేంద్రనగర్ రెండో లైనులో నివాసం ఉంటోంది. టెక్సాస్‌లోని డెంటన్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో ఎంఎస్ చేసేందుకు వెళ్లారు. మరో నెల రోజుల్లో కోర్సు పూర్తి కావాల్సి ఉంది. అయితే ఈలోపు రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆమెను కబళించింది. ఈ నెల 12వ తేదీన స్నేహితురాలైన మేడికొండూరుకు చెందిన స్నిగ్ధతో కలిసి రోడ్డుపై నడచి వెళ్తుండగా వేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. దీప్తి తలకు తీవ్ర గాయమైంది. స్నిగ్ధకు కూడా గాయాలయ్యాయి. దీప్తి స్నేహితురాళ్లు ప్రమాద విషయాన్ని ఆమె తండ్రి హనుమంతరావుకు తెలిపారు. క్రౌడ్ ఫండింగ్(Crowd Funding) ద్వారా ఆమె చికిత్స కోసం ప్రయత్నాలు కొనసాగగా.. మంచి స్పందన లభించింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నెల 15న దీప్తి చికిత్స పొందుతూ కన్నుమూసింది. శనివారం(ఏప్రిల్ 19) నాటికి మృతదేహం గుంటూరుకు వచ్చే అవకాశం ఉంది. మరో బాధితురాలు స్నిగ్ధ ప్రస్తుతం అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. అవే ఆమె చివరి మాటలు..దీప్తి మృతి వార్త విని ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసెలా రోదిస్తున్నారు. చదువులో చాలా చురుకైన విద్యార్థిని అని, అందుకే పొలం అమ్మి మరీ అమెరికాకు పంపించామని చెప్పారు. నెల రోజుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి కావాల్సి ఉందని, ఆ టైంకి మమ్మల్ని అమెరికాకు రావాలని ఆమె కోరిందని, అందుకు ఏర్పాట్లలో ఉండగానే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 10వ తేదీన దీప్తి చివరిసారిగా తమతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. కాలేజీకి టైం అవుతోందని.. ఆదివారం మాట్లాడతానని చెప్పి హడావిడిగా ఫోన్ పెట్టేసిందని.. అవే తమ బిడ్డ మాట్లాడిన చివరి మాటలని గుర్తు చేసుకుని బోరున విలపించారు.

దుబాయి హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
ఇటీవల దుబాయిలో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ యువకుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇవ్వాలని జపాన్ పర్యటన నుంచి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పోరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టపు ప్రేమ్ సాగర్‌తో పాటు, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట కు చెందిన స్వర్గం శ్రీనివాస్ లు దుబాయి లో హత్యకు గురైన విషయం తెలిసిందే. దుబాయి నుంచి మృత దేహాలను త్వరగా స్వదేశానికి తెప్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం అధికారుల్ని ఆదేశించినట్లు అనిల్ తెలిపారు.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దుబాయి లోని భారత రాయబార కార్యాలయానికి, ఢిల్లీ లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖలు రాసినట్లు వెల్లడించారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:ఎన్నారై అడ్వయిజరీ కమిటీ చైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్ బృందం, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి లు మృతుల కుటుంబాలను పరామర్శించారు.

రాయలసీమ ప్రగతికి డాలస్‌లో జీఆర్ఏడీఏ అడుగులు
గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఏరియా (GRADA) ఆధ్వర్యంలో ఏప్రిల్ 13న ఫ్రిస్కో, టెక్సాస్‌లో రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం జరిగింది. రాయలసీమ సమస్యలు, అభివృద్ధి అవకాశాలు, తెలుగు భాషా సాహిత్యాల ప్రాముఖ్యతపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి రాయలసీమకు చెందిన రచయిత భూమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగంలో రాయలసీమ ప్రస్తుత పరిస్థితి, ముఖ్యంగా దీర్ఘకాలంగా వేధిస్తున్న నీటి సమస్యలు, వెనుకబాటుతనం గురించి ఎంతో ఆవేదనతో, స్పష్టంగా వివరించారు.మన ప్రాంత సహజ సంపద అయిన శేషాచలం అడవుల గురించి, ముఖ్యంగా ఎర్రచందనం చెట్ల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ విలువైన సంపదను అక్రమ మార్గాల్లో ఇతర దేశాలకు తరలించి లాభం పొందకుండా, స్థానికంగానే వాటి ఆధారిత పరిశ్రమలను స్థాపించి, ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా మన ప్రాంతాన్ని ఎలా ఆర్ధికంగా బలోపేతం చేయవచ్చో ఆయన చక్కగా వివరించారు. ఆయన మాటలు మనందరిలో కొత్త ఆలోచనలను రేకెత్తించాయి. సహజ వనరులను సక్రమంగా వినియోగించుకుంటే రాయలసీమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే ఆశాభావాన్ని ఆయన కలిగించారు.మరో గౌరవ అతిథిగా కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ఛాన్సలర్, ప్రఖ్యాత విద్యావేత్త ప్రొఫెసర్ పి. కుసుమ కుమారి హాజరయ్యారు. ఆమె తన ప్రసంగంలో తెలుగు భాష మాధుర్యం, సాహిత్యం గొప్పదనం, పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. నంద కోర్వి, అనిత నాగిరెడ్డి, సతీష్ సీరం, బ్రహ్మ చిరా, హరినాథ్ పొగకు, హేమంత్ కాకుట్ల, జగదీశ్వర నందిమండలం, జగదీష్ తుపాకుల, పవన్ పల్లంరెడ్డి, ప్రసాద్ నాగారపు, రాజు కంచం, శివ అద్దేపల్లి, శివ వల్లూరు, శ్రీధర్ బొమ్ము, శ్రీకాంత్ దొంత, సురేష్ మోపూరు, ఉమా గొర్రెపాటి, మరియు కార్తీక్ మేడపాటి ఈ సమావేశానికి హాజరయ్యారు.
క్రైమ్

పెళ్లికి ముందే చెప్పా.. నాకు లవర్ ఉన్నాడని..
విజయపుర(కర్ణాటక): వధువు మెడలో వరుడు తాళి కట్టే క్షణాల కోసం అందరూ ఎదురు చూస్తుండగా వరుడు మంటపం నుంచి లేచి పూలదండను విసిరేసి పెళ్లిని ఆపేశాడు. ఈ ఘటన చెన్నరాయపట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని దేవనహళ్లి తాలూకా బాలెపురలోని కల్యాణ మంటపంలో జరిగింది. యువతి మీద అనుమానంతో చివరి క్షణంలో వరుడు పెళ్లికి నిరాకరించాడు. వేణు అనే యువకుడు తన వివాహాన్ని రద్దు చేసుకున్నాడు. గతంలో సదరు వధువు వేరే యువకుడితో ప్రేమాయాణం నడిపిందని ఆరోపించాడు. అయితే పెళ్లికి ముందే అన్ని విషయాలు వరుడికి చెప్పానని వధువు తెలిపింది. అప్పుడు అన్నింటికి సరేనని, రాత్రి రిసెప్షన్ కూడా చేసుకుని, సరిగ్గా మంటపానికి వచ్చేసరికి పెళ్లికి వరుడు నిరాకరించాడని వధువు కన్నీటి పర్యంతమయింది. దీంతో వధువరులు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తమ వధువుకు న్యాయం చేయాలని ఆమె తరపు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

భూమికపై విచక్షణా రహితంగా దాడి చేసిన భర్త
గుడివాడరూరల్: అనుమానం పెనుభూతమై భార్యపై కత్తితో భర్త విచక్షణా రహితంగా దాడి చేసిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన మట్టా అశోక్, భూమికలకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న అశోక్ చెడు అలవాట్లకు బానిసై తరచూ అనుమానంతో భార్యను వేధిస్తుండేవాడు. ఇటీవల జరిగిన గొడవతో భార్య భూమిక పిల్లలను తీసుకుని సమీపంలో నివాసముంటున్న తల్లి రాణి ఇంటికి వెళ్లింది. ఈక్రమంలో మంగళవారం తన బట్టలు తీసుకునేందుకు చెల్లి అనుష్కతో కలిసి భర్త అశోక్ ఇంటికి వెళ్లిన భూమికపై భర్త కత్తితో విచక్షణా రహితంగా మొఖంపై దాడి చేసి పొట్టలో పొడిచాడు. అడ్డుకోబోయిన చెల్లిపై కూడా దాడి చేయడంతో ఆమె చేతికి తీవ్ర గాయమైంది. అనంతరం అశోక్ పరారయ్యాడు. గాయపడిన వారు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి వారిని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు. భూమిక పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య సేవల నిమిత్తం విజయవాడ తరలించారు. బాధితురాలి తల్లి రాణి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్పీ వి.దీరజ్ వినీల్, స్థానిక పోలీస్ అధికారులతో కలిసి గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వచ్చి ఘటనపై ఆరా తీశారు. అనంతరం ఇందిరానగర్ కాలనీలోని సంఘటనా స్థలానికి డీఎస్పీ వెళ్లి పరిశీలించారు.

అరెస్ట్ చేసిన బాలుడు ఎక్కడ?
హైదరాబాద్: ఎలాంటి తప్పు చేయని తన కుమారుడిని పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి అక్రమంగా నిర్బంధించారని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ మహిళ రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌కు బుధవారం ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కమిషన్..పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశిస్తూ మే 5వ తేదీకి వాయిదా వేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఏప్రిల్ 28న మహబూబ్‌నగర్ జిల్లా కడ్తాల్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసులు తన కమారుడు మేకల కళ్యాణ్‌పై ఎలాంటి కేసు నమోదు చేయకుండా, నోటీసులు ఇవ్వకుండా, కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం కూడా ఇవ్వకుండా బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని ఆరోపిస్తూ అలివేలు అనే మహిళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు దాఖలు చేసింది. పోలీసులు అక్రమ కస్టడీకి తీసుకున్న వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి చూడగా అక్కడ తన కుమారుడు కనిపించలేదని పిటిషన్లో పేర్కొన్నారు.తర్వాత మూడు గంటల సమయంలో తన కుమారుడి ఫోన్ నుంచి కాల్ రాగా అతన్ని కోర్టులో హాజరు పరుస్తున్నామని చెప్పిన పోలీసులు కోర్టు ఎదుట కూడా హాజరు పర్చకుండా ఎక్కడికి తీసుకెళ్లారో కూడా సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. దీంతో న్యాయవాది అమర్నాథ్ ఆధ్వర్యంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేస్తూ తనకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కమిషన్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేస్తూ ఈ కేసుపై విచారణ జరిపించి మే 5వ తేదీలోపు పూర్తి నివేదిక అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆ రోజుకు వాయిదా వేసింది.

థాయ్‌లాండ్‌లో హ్యాండ్లర్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు మంగళవారం అరెస్టు చేసిన అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా కేసు దర్యాప్తు ముమ్మరమైంది. ఈ దందాలో కీలక వ్యక్తిగా భావిస్తున్న ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’ థాయ్‌లాండ్‌లో ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. హవాలా నెట్వర్క్ మీద దృష్టి పెట్టిన పోలీసులు సహకరించిన వారి కోసం ఆరా తీస్తున్నారు. తదుపరి విచారణ నిమిత్తం జ్యుడీíÙయల్ రిమాండ్‌లో ఉన్న అభిష్ క్, హర్షవర్థన్, ధావల్, రాహుల్‌లను పోలీసు కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. దీనికి అనుమతి కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఓజీ కుష్ పండించేదీ అతడేనా..? ఓరిజినల్ గ్యాంగ్‌స్టర్, మారువానా, హైడ్రాపోనిక్ గాంజా, ఓజీ కుష్ ఇలా వివిధ పేర్లతో పిలిచే గంజాయితో పాటు మ్యాజిక్ మష్రూమ్స్‌ను ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’ సరఫరా చేస్తున్నాడు. ఈ గంజాయి థాయ్లాండ్లోనే ఎక్కువగా పండుతుంది. జబల్పూర్కు చెందిన హర్షవర్థన్‌కు ఓడల ద్వారా చేరింది కూడా థాయ్‌లాండ్ నుంచే. దీన్నిబట్టి ఈ ఓజీ కుష్‌ను హ్యాండ్లరే పండించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ నుంచి ఈ ఓజీ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు ఎగుమతి అవుతోంది. హైడ్రోఫోనిక్ టెక్నిక్ విధానంలో కృత్రిమ కాంతితో పండిస్తుంటారు. ఆన్లైన్లో విత్తనాలు ఖరీదు చేసి, ఎల్ఈడీ లైట్లను ఉపయోగించి గంజాయి మొక్కలను పెంచుతారు. ఏమాత్రం మట్టితో అవసరం లేకుండా ప్రత్యేకంగా తయారు చేసిన కుండీలు, ట్రేల్లో ఇసుక, కంకర లేదా నీటిలో అదనపు పోషకాలతో ఉపయోగించి సాగు చేస్తుంటారు. కొందరు మాత్రం కొబ్బరి పొట్టు నారలు, గులకరాళ్లు కూడా వాడతారు. నేలమీద పండే గంజాయి కంటే ఈ ఓజీ నాణ్యత ఎక్కువగా ఉంటుందని చెప్తుంటారు. ఈ మొక్కలు ఓపెన్–రూట్ వ్యవస్థ ద్వారా పోషకాలు, ఆక్సిజన్‌ను నేరుగా తీసుకోవడమే దీనికి కారణం. వ్యవస్థీకృతంగా సాగుతున్న వ్యాపారం... ఈ డ్రగ్స్ క్రమవిక్రయాల దందా మొత్తం పక్కా వ్యవస్థీకృతంగా సాగుతోందని పోలీసులు చెప్తున్నారు. ఎన్‌క్రిపె్టడ్ యాప్స్ ద్వారా ఇండియా నుంచి తనకు వచ్చిన ఆర్డర్ల విషయాన్ని ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’ ఆయా యాప్స్ ద్వారానే హర్షవర్థన్‌కు చేరవేస్తాడు. ఇతడు జబల్పూర్లో ఉన్న హవాలా ఏజెంట్‌కు ఆ కస్టమర్ వివరాలు పంపిస్తాడు. అతగాడు సదరు కస్టమర్ నివసించే ప్రాంతానికి చెందిన మరో హవాలా ఏజెంట్‌కు ఇవి అందిస్తాడు. ఆ వినియోగదారుడిని సంప్రదించే ఈ ఏజెంట్ డబ్బు ముట్టిన తర్వాత జబల్పూర్ ఏజెంట్‌కు బదిలీ చేస్తాడు. అతడి ద్వారా విషయం తెలుసుకునే హర్షవర్థన్ విషయాన్ని ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’కు చెప్తాడు. ఔన్స్ (28.34 గ్రాములు) డ్రగ్‌కు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు క్రిప్టో కరెన్సీ రూపంలో అతడికి పంపిస్తాడు. ఆపై డ్రగ్ హ్యాండ్లర్ నుంచి హర్షవర్థన్‌కు వచి్చ... అక్కడ నుంచి డీటీడీసీ, శ్రీ తిరుపతి, శ్రీ ఆంజనేయులు కొరియర్స్‌లో కస్టమర్‌కు చేరుతుంది. హర్షవర్థన్ కూడా పోలీసుల నిఘాకు చిక్కకుండా ఈ పార్శిల్ బుక్ చేస్తున్నాడు. అక్కడ కస్టమర్ చిరునామా, ఫోన్ నెంబర్ తప్పుగా ఇస్తాడు. దాని ట్రాకింగ్ ఐడీని వినియోగదారుడికి పంపిస్తాడు. దీని ద్వారా ట్రాక్ చేసే కస్టమర్ ఆ పార్శిల్ కొరియర్ ఆఫీసుకు చేరిందని గుర్తించిన వెంటనే అక్కడకు వెళ్లి తీసుకుంటారు. ఈ హవాలా, కొరియర్ నెట్వర్క్ పైనా హెచ్–న్యూ దృష్టి పెట్టింది. ఈ ముఠాలో కీలక పెడ్లర్‌గా ఉన్న హర్షవర్థన్‌కు చెందిన క్రిప్టో వాలెట్లో రోజుకు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు విలువైన బిట్కాయిన్లు డిపాజిట్ అవుతున్నట్లు గుర్తించామని అధికారులు చెప్తున్నారు.
వీడియోలు


మోదీ సభలో కాంగ్రెస్ నేత శశిథరూర్


అక్రమంగా ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్న ఎల్లో బ్యాచ్


పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఢిల్లీలో హైఅలర్ట్


పహల్గాం ఉగ్రదాడులకు పాకిస్థాన్ లోనే ట్రైనింగ్.. సాక్ష్యాలు ఇవే!


నిప్పుతో చెలగాటం


Varikuti Ashok: 99 రూపాయల బాటిల్ కొనడానికి వెళ్తే నా మీద కేసు పెట్టారు..


నెలరోజుల్లో పూర్తి నివేదిక.. సింహాచలం ఘటనపై త్రిసభ్య విచారణ కమిటీ


Narayana Swamy : పెళ్ళికి వెళ్లడంపై పెట్టిన శ్రద్ధ సింహాచలంలో 8మంది చనిపోతే ఉండదా?


AP Govt: పరువు కోసం ప్రభుత్వం పాట్లు


పహల్గాం ఉగ్రదాడి కేసు.. NIA విచారణలో సంచలన నిజాలు