Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

YSRCP President YS Jagan Mohan Reddy Tweets For Party Victory1
‘ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా’

తాడేపల్లి : స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఈ మేరకు వైఎస్ జగన్ తన సోషల్ మీడియా అకౌంట్‘ఎక్స్’ ద్వారా వైఎస్సార్‌సీపీ విజయంపై హర్షం వ్యక్తం చేశారు.‘స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు పనిచేయటం హర్షించదగ్గ విషయం. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఎలాంటి బలం లేకపోయినా.. చంద్రబాబు గారు అధికార అహంకారాన్ని చూపి, పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినా..కేసులు పెట్టినా, ఆస్తులు ధ్వంసం చేస్తామని, బంధువుల ఉద్యోగాలు తీసేస్తామని..జీవనోపాథి దెబ్బతీస్తామని భయపెట్టినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా వాటన్నింటినీ బేఖాతరు చేస్తూ మన పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ధైర్యంగా నిలబడి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించుకున్నారు.విలువలకు, విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, నాయకులను చూసి గర్వపడుతున్నాను. క్లిష్ట సమయంలో వీరు చూపించిన ధైర్యం పార్టీకి మరింత ఉత్తేజాన్ని ఇచ్చింది. ఈ ఎన్నికలను సమన్వయ పరుస్తూ గెలుపునకు బాటలు వేసిన వివిధ నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు, జిల్లా అధ్యక్షులు, రీజినల్‌ కో-ఆర్డినేటర్లు మరియు పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బంది అందర్నీ అభినందిస్తున్నాను. పార్టీకి అప్పుడూ, ఇప్పుడూ, ఎల్లప్పుడూ వెన్నుముకలా నిలుస్తున్న కార్యకర్తలకు నా హ్యాట్సాఫ్’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఎలాంటి బలం లేకపోయినా, @ncbn గారు అధికార అహంకారాన్ని చూపి, పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినా, కేసులు పెట్టినా, ఆస్తులు ధ్వంసం చేస్తామని, బంధువుల ఉద్యోగాలు తీసేస్తామని, జీవనోపాథి దెబ్బతీస్తామని భయపెట్టినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా…— YS Jagan Mohan Reddy (@ysjagan) March 28, 2025 స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయకేతనం

AP Govt Released Payment of Rs 2 86 crore to Siddharth Luthra2
AP Govt: లాయర్ సిద్ధార్థ్‌ లూథ్రాకు రూ.2.86 కోట్లు చెల్లింపు

విజయవాడఛ కూటమి సర్కారు కేసులు వాదిస్తున్న అత్యంత ఖరీదైన సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రాకు ఏపీ ప్రభుత్వం రూ. 2.86 కోట్లు చెల్లించింది. ఏపీ ప్రభుత్వం కేసులు వాదించిందుకు గాను ఈ మొత్తాన్ని చెల్లించింది. హైకోర్టులో నాలుగు కేసులు వాదించినందుకు రూ. 2.86 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. ఈ మేరకు నిధులు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. గతంలో అవినీతి కేసులను సిద్థార్థ్ లూథ్రా వాదించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు స్కిల్ స్కామ్, అమరావతి స్కామ్ కేసులు వాదించారు సిద్ధార్థ్ లూథ్రా.. చంద్రబాబు సీఎం అయ్యాక ప్రభుత్వం తరఫున కేసులకు ఆయన్ను నియమించుకుంది కూటమి సర్కారు.సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా ప్రస్తుతం ఆంధ్ర­ప్రదేశ్‌లో యావత్‌ రాష్ట్ర ప్రభుత్వ వ్య­వస్థకు సూపర్‌ బాస్‌గా అవతరించారు. గతంలో చంద్ర­బాబు స్కిల్‌ కేసులో అరెస్టు కాగానే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడలో వాలి­పోయిన ఆ సీనియర్‌ న్యాయ­వాది వ్యవహారం అప్పట్లోనే తీవ్ర చర్చనీయాంశమైంది. రోజుకు రూ.కోటి ఫీజుతోపాటు అదనపు ఖర్చులు వసూలు చేసే లూథ్రా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తరఫున కేసులు వాదిస్తున్నారు.

SC asks HC CJ not to assign judicial work to Justice Varma3
జస్టిస్ యశ్వంత్‌కు ఏ పనీ ఇవ్వొద్దు: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలతో చిక్కుల్లో పడ్డ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాసేపటికి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ యశ్వంత్ వర్మ కేవలం బదిలీపై మాత్రమే అలహాబాద్ హైకోర్టుకు వస్తున్నారని, ఆయనకు ప్రస్తుతానికి ఏ విధమైన జ్యుడిషియల్ వర్క్ అప్పచెప్పవద్దని సీజేఐ సంజీవ్ ఖన్నా కోరారు. ఈ మేరకు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జస్టిస్ యశ్వంత్ పై విచారణ పెండింగ్ లో ఉన్న క్రమంలోనే ఆయనకు ఏ పనీ అప్పచెప్పవద్దని సీజేఐ సూచించారు. అంతకుముందు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా ఈ తరహా ఆదేశాలనే జారీ చేశారు సీజేఐ.కేంద్రానికి సిఫార్సు.. గ్రీన్ సిగ్నల్‌జస్టిస్ యశ్వంత్ వర్మ బదిలీ అంశానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసే క్రమంలో కేంద్రానికి ప్రతిపాదన పంపింది సీజేఐ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం. దీనికి ఈరోజు(శుక్రవారం) గ్రీన్ సిగ్నల్ లభించడంతో యశ్వంత్ వర్మ.. అలహాబాద్ హైకోర్టుకు వెళ్లనున్నారు. 2021లో అలహాబాద్ హైకోర్టు నుంచి బదిలీపై ఢిల్లీ హైకోర్టుకు వచ్చిన యశ్వంత్ మళ్లీ అక్కడికే వెళ్లనున్నారు.ఆరు రాష్ట్రాల బార్ అసోసియేన్స్ తో సీజేఐ భేటీఅయితే యశ్వంత్ వర్మ సచ్ఛీలురుగా బయటకొచ్చేవరకూ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయొద్దంటూ అక్కడ బార్ అసోసియేషన్ తో పలు రాష్ట్రాల బార్‌ అసోయేషన్స్‌ కూడా కోరాయి. గుజరాత్ హైకోర్టు బార్ అసోసియేషన్, కేరళ హైకోర్టు బార్ అసోసియేషన్, కర్ణాటక హైకోర్టు బార్ అసోసియేషన్, లక్నో బార్ అసోసియేషన్స్‌ డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై సీజేఐ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే పలు బార్ అసోసియేషన్ హెడ్స్ తో సీజేఐ సంజీవ్ ఖన్నా నిన్న(గురువారం)ఢిల్లీలో సమావేశమయ్యారు. ప్రస్తుతానికి జస్టిస్ యశ్వంత్ బదిలీని నిలుపుదల చేయాలని సదరు బార్‌ అసోసియేషన్స్‌ కోరిన తరుణంలో వారితో సీజేఐ భేటీ అయ్యారు. ఆయా రాష్ట్రాల బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులతో సీజేఐ సమావేశమై వారితో చర్చించారు. వారి డిమాండ్‌ ను పరిగణలోకి తీసుకుంటామని సీజేఐ సంజీవ్ ఖన్నా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇంట్లో నోట్ల కట్టలు..!కాగా, ఇటీవల జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. దాని విలువ సుమారు రూ. 15 కోట్లు ఉంటుందని అంచనాలు కూడా వేశారు. ఒక న్యాయమూర్తి వద్ద అంత డబ్బు ఎలా వచ్చిందంటూ చర్చ మొదలైంది. అదే సమయంలో ఇది కచ్చితంగా అవినీతి చేసే కూడపెట్టిందని వాదన బలంగా వినిపించింది.ఈ క్రమంలోనే ఆరు రాష్ట్రాలకు చెందిన బార్ అసోసియేషన్ అధ్యక్షులతో సీజేఐ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జస్టిస్ యశ్వంత్ వర్మ బదిలీని కొన్నాళ్లపాటు నిలుపుదల చేయడమే సమంజసమా?, బదిలీ చేసి అక్కడ జ్యుడిషియల్ వ్యవహారాలు అప్పగించకుండా ఉండేలా చేయడమే కరెక్టా అనే కోణంలో వీరు చర్చించినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే జస్టిస్ యశ్వంత్ పై విచారణ పూర్తయ్యేవరకూ ఎటువంటి బాధ్యతలు కేటాయించవద్దని అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సూచించినట్లు సమాచారం.

Union Cabinet Approves 2% Increase In DA For Central Government Employees4
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. అదనపు 2 శాతం డీఏ పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.దీంతో ప్రస్తుతం ఉన్న డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) 53 శాతం నుంచి 55 శాతానికి పెరిగినట్లైంది. రెండు శాతం డీఏ పెంపు ద్వారా 48.56 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 66.55 లక్షల మంది పెన్షనర్లకు లాభం చేకూరనుంది. తాజా కేబినెట్‌ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వంపై రూ.6వేల 614 కోట్ల భారం పడనుండగా.. పెరిగిన డీఏ జనవరి 2025 నుంచి అమల్లోకి రానుంది. రైతులపై భారం తగ్గించేందుకు రైతులపై భారం తగ్గించేందుకు పోషక ఆధారిత ఎరువులపై సబ్సిడీ ఇస్తున్న కేంద్రం ఇస్తుంది. అయితే, ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో పోషక ఆధారిత పీఅండ్‌కే ఎరువులకు సబ్సిడీ (రూ. 37,216 కోట్లు) మంజూరు చేసింది. న్యూట్రియంట్ బేస్డ్ సబ్సీడీ పథకం కింద 28 రకాల పోషక ఆధారిత ఎరువుల గరిష్ట చిల్లర ధరను తయారీదారులు/దిగుమతిదారులు తగినంత స్థాయిలో నిర్ణయించేందుకు అనుమతి ఇచ్చింది. కోవిడ్ సంవత్సరాల నుండి, అంతర్జాతీయ మార్కెట్‌లో అధిక స్థాయికి డీఏపీ ధరలు పెరిగాయి. తాజాగా, కేబినెట్‌లో రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు, ధరల అస్థిరత ప్రభావాన్ని తగ్గించేందుకు డీఏపీ గరిష్ట చిల్లర ధర 50 కిలోల బ్యాగ్‌కు రూ.1,350 కు పరిమితం చేసింది.

Chennai super kings vs royal challengers Bengaluru live Updates and Highlights5
సీఎస్‌కేపై ఆర్సీబీ ఘ‌న విజ‌యం..

IPL2025 Csk Vs Rcb live Updates and Highlights: సీఎస్‌కేపై ఆర్సీబీ ఘ‌న విజ‌యం..ఐపీఎల్‌-2025లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు వ‌రుస‌గా రెండో విజ‌యం సాధించింది. ఈ టోర్నీలో భాగంగా చెపాక్ వేదిక‌గా జ‌రిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 50 ప‌రుగుల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. 197 ప‌రుగుల భారీ లక్ష్యంతో బ‌రిలోకి సీఎస్‌కే నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 146 ప‌రుగులు చేసింది. సీఎస్‌కే బ్యాట‌ర్ల‌లో ర‌చిన్ ర‌వీంద్ర‌(41) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. ఆఖ‌రిలో ధోని(16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో 30) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్సీబీ బౌల‌ర్ల‌లో జోష్ హాజిల్ వుడ్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. యశ్ ద‌యాల్‌, లివింగ్‌స్టోన్ త‌లా రెండు వికెట్లు సాధించారు. చెపాక్‌లో సీఎస్‌కేపై ఆర్సీబీ విజ‌యం సాధించ‌డం 2008 సీజ‌న్ త‌ర్వాత ఇదే తొలిసారి కావ‌డం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 7 వికెట్ల న‌ష్టానికి 196 ప‌రుగులు చేసింది. ఆర్సీబీ బ్యాట‌ర్ల‌లో ర‌జిత్ పాటిదార్‌(51) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడ‌గా.. ఫిల్ సాల్ట్‌(32), విరాట్ కోహ్లి(31), ప‌డిక్క‌ల్‌(27) రాణించారు. ఆఖ‌రి ఓవ‌ర్‌లో టిమ్ డేవిడ్‌( 8 బంతుల్లో 1ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 22) మెరుపులు మెరిపించాడు. సీఎస్‌కే బౌల‌ర్ల‌లో నూర్ ఆహ్మ‌ద్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ప‌తిరానా రెండు, ఖాలీల్ అహ్మ‌ద్‌, అశ్విన్ త‌లా వికెట్ సాధించారు. క‌ష్టాల్లో సీఎస్‌కే.. 81 ప‌రుగుల‌కే 6 వికెట్లుసీఎస్‌కే 81 ప‌రుగుల‌కే 6 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. 13వ ఓవ‌ర్ వేసిన య‌శ్ ద‌యాల్ బౌలింగ్‌లో తొలి బంతికి ర‌చిన్ ర‌వీంద్ర‌(41).. ఐదో బంతికి శివ‌మ్ దూబే(19) ఔట‌య్యాడు. 14 ఓవ‌ర్లు ముగిసే స‌రికి సీఎస్‌కే 6 వికెట్ల న‌ష్టానికి 89 ప‌రుగులు చేసింది.సీఎస్‌కే నాలుగో వికెట్ డౌన్‌.. సామ్ కుర్రాన్ రూపంలో సీఎస్‌కే నాలుగో వికెట్ కోల్పోయింది. 8 ప‌రుగులు చేసిన సామ్ కుర్రాన్‌.. లివింగ్ స్టోన్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులోకి శివ‌మ్ దూబే వ‌చ్చాడు. 10 ఓవ‌ర్లు ముగిసే స‌రికి సీఎస్‌కే 4 వికెట్ల న‌ష్టానికి 65 ప‌రుగులు చేసింది.సీఎస్‌కే మూడో వికెట్ డౌన్‌.. దీప‌క్ హుడా ఔట్‌దీప‌క్ హుడా రూపంలో సీఎస్‌కే మూడో వికెట్ కోల్పోయింది. 4 ప‌రుగులు చేసిన హుడా.. భువ‌నేశ్వ‌ర్ కుమార్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 4.4 ఓవ‌ర్ల‌కు ఆర్సీబీ స్కోర్‌: 26/3సీఎస్‌కేకు భారీ షాక్‌.. ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు197 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన సీఎస్‌కేకు ఆదిలోనే భారీ షాక్ త‌గిలింది. రెండో ఓవ‌ర్ వేసిన జోష్ హాజిల్ వుడ్ బౌలింగ్‌లో రెండో బంతికి రాహుల్ త్రిపాఠి(5) ఔట్ కాగా.. ఆఖ‌రి బంతికి రుతురాజ్ గైక్వాడ్‌(0) పెవిలియ‌న్‌కు చేరాడు.పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్‌.. సీఎస్‌కే ముందు భారీ టార్గెట్‌చెపాక్ వేదిక‌గా చెన్నైసూప‌ర్ కింగ్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాట‌ర్లు చెల‌రేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 7 వికెట్ల న‌ష్టానికి 196 ప‌రుగులు చేసింది. ఆర్సీబీ బ్యాట‌ర్ల‌లో ర‌జిత్ పాటిదార్‌(51) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడ‌గా.. ఫిల్ సాల్ట్‌(32), విరాట్ కోహ్లి(31), ప‌డిక్క‌ల్‌(27) రాణించారు. ఆఖ‌రి ఓవ‌ర్‌లో టిమ్ డేవిడ్‌( 8 బంతుల్లో 1ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 22) మెరుపులు మెరిపించాడు. సీఎస్‌కే బౌల‌ర్ల‌లో నూర్ ఆహ్మ‌ద్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ప‌తిరానా రెండు, ఖాలీల్ అహ్మ‌ద్‌, అశ్విన్ త‌లా వికెట్ సాధించారు.ఆర్సీబీ ఐదో వికెట్ డౌన్‌..జితేశ్ కుమార్ రూపంలో ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. 12 ప‌రుగులు చేసిన జితేశ్‌.. ఖాలీల్ అహ్మ‌ద్ బౌలింగ్‌లో పెవిలియ‌న్‌కు చేరాడు. క్రీజులోకి టిమ్ డేవిడ్ వ‌చ్చాడు.16 ఓవ‌ర్ల‌కు ఆర్సీబీ స్కోర్‌16 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఆర్సీబీ 4 వికెట్ల న‌ష్టానికి 153 ప‌రుగులు చేసింది. క్రీజులో జితేశ్ శ‌ర్మ‌(7), ర‌జిత్ పాటిదార్‌(38) ఉన్నారు.ఆర్సీబీ మూడో వికెట్ డౌన్‌.. విరాట్ కోహ్లి ఔట్‌విరాట్ కోహ్లి రూపంలో ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. 31 ప‌రుగులు చేసిన విరాట్ కోహ్లి.. నూర్ ఆహ్మ‌ద్ బౌలింగ్‌లో పెవిలియ‌న్‌కు చేరాడు. 13 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఆర్సీబీ మూడు వికెట్ల న‌ష్టానికి 119 ప‌రుగులు చేసింది. క్రీజులో పాటిదార్‌(21), లివింగ్ స్టోన్‌(1) ఉన్నారు.హిట్టింగ్ మొద‌లెట్టిన‌ కోహ్లి11 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఆర్సీబీ రెండు వికెట్ల న‌ష్టానికి 109 ప‌రుగులు చేసింది. క్రీజులో ర‌జిత్ పాటిదార్‌(16), విరాట్ కోహ్లి(27) ఉన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు నెమ్మదిగా ఆడిన కోహ్లి.. త‌న హిట్టింగ్‌ను మొద‌లుపెట్టాడు.ఆర్సీబీ రెండో వికెట్ డౌన్‌.. ప‌డిక్క‌ల్ ఔట్‌దేవ‌ద‌త్త్ ప‌డిక్కల్ రూపంలో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 27 ప‌రుగులతో దూకుడుగా ఆడిన ప‌డిక్క‌ల్‌.. అశ్విన్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 8 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఆర్సీబీ 2 వికెట్ల న‌ష్టానికి 77 ప‌రుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(12) ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. సాల్ట్ ఔట్‌.. ఫిల్ సాల్ట్ రూపంలో ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 32 పరుగులు చేసిన సాల్ట్‌.. నూర్ ఆహ్మద్ బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. వికెట్ల వెనక ధోని మరోసారి అద్భుతం చేశాడు. క్రీజులోకి దేవదత్త్ పడిక్కల్ వచ్చాడు. 6 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(11), పడిక్కల్‌(9) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న ఆర్సీబీ ఓపెన‌ర్లు..టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ ఓపెన‌ర్లు దూకుడుగా ఆడుతున్నారు. 2 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఆర్సీబీ వికెట్ న‌ష్ట‌పోకుండా 25 ప‌రుగులు చేసింది. క్రీజులో ఫిల్ సాల్ట్‌(24), విరాట్ కోహ్లి(1) ఉన్నారు.ఐపీఎల్‌-2025లో మ‌రో కీల‌క పోరుకు స‌మ‌యం అస‌న్న‌మైంది. చెపాక్ వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సీఎస్‌కే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జ‌ట్లు చెరో మార్పుతో బ‌రిలోకి దిగాయి. సీఎస్‌కే జ‌ట్టులోకి మ‌తీషా ప‌తిరానా రాగా.. ఆర్సీబీ జ‌ట్టులోకి భువ‌నేశ్వ‌ర్ కుమార్ వ‌చ్చాడు.తుది జ‌ట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్(కెప్టెన్‌), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీప‌ర్‌), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్‌), రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(వికెట్ కీప‌ర్‌), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, మతీషా పతిరణ, ఖలీల్ అహ్మద్

Telangana High Court Denies Anticipatory Bail for Vishnu Priya6
Vishnu Priya: విష్ణు ప్రియకు ముందస్తు బెయిల్‌ ఇవ్వడం కుదరదు

సాక్షి,హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్ని కుదిపేస్తున్నే బెట్టింగ్‌ యాప్స్‌ వ్యవహారంలో నటి విష్ణు ప్రియాకు (Vishnupriya) భారీ షాక్‌ తగిలింది. బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో ఆమెకు ముందస్తు బెయిల్‌ ఇవ్వడం కుదరదని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది.బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ విష్ణు ప్రియ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సమయంలో ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు విష్ణు ప్రియకు ముందుస్తు బెయిల్‌ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. విచారణ అధికారి ఎదుట హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖులపై కేసులుబెట్టింగ్ యాప్ వివాదంలో తెలంగాణ పోలీసులు బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేస్తున్న ప్రముఖులపై కేసులు న‌మోదు చేశారు. విచారిస్తున్నారు. వారిలో విష్ణు ప్రియా సైతం ఉన్నారు. అయితే ఈ వివాదంలో నటి విష్ణుప్రియ మార్చి 20 పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు.ఈ తరుణంలో విష్ణుప్రియ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముందుస్తు బెయిల్‌ కావాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన కోర్టు ఆమెకు ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు అంగీకరించలేదు. ఈ రోజు ఆమె పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయడానికి మరియు దర్యాప్తును నిలిపివేయడానికి హైకోర్టు తిరస్కరించింది. అదే సమయంలో ఈ కేసులో పోలీసులతో సహకరించాలని విష్ణుప్రియకు హైకోర్టు సూచించింది. చట్టబద్ధంగా దర్యాప్తు కొనసాగించాలని పోలీసులకు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Special Story On Chandrababu Naidu Agreement With Rapido7
చంద్రబాబు హైటెక్ తెలివిలో డొల్లతనం బయటపడిందిలా?

ఓలా, ఊబర్ ట్యాక్సీల తరహాలో ‘సహకార్ ట్యాక్సీ’ అనే విధానాన్ని తీసుకురావడం గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం లోక్ సభలో ప్రకటించారు. ప్రజలకు స్థానిక ప్రయాణ అవసరాలను తీర్చడంలో ఇలాంటి యాప్ ల నిర్వాహకులు ఒక సరికొత్త విప్లవాన్ని తీసుకువచ్చిన సంగతి అందరికీ తెలుసు. ఎంతో విస్తృతంగా ఇవి సేవలందిస్తున్నాయి. అదే సమయంలో.. ఈ సంస్థలు వాహన డ్రైవర్లనుంచి భారీగా కమిషన్లు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి దోపిడీకి విరుగుడు అన్నట్టుగా.. అమిత్ షా ఈ విధానాన్ని ప్రకటించారు. దీనిప్రకారం స్థానికంగా సహకార సంస్థల వద్ద వాహనాల వారు రిజిస్టరు చేసుకోవాలి. నిర్వహణ మొత్తం ఆ సహకార సంస్థలే చూస్తుంటాయి. ఇది పారదర్శకంగా నడిచే అవకాశం ఉంది. ఇదే సమయంలో చంద్రబాబునాయుడు మాటల్లోని కపటత్వం, ఆయన హైటెక్ తెలివితేటల్లోని డొల్లతనం కూడా బయటపడుతున్నాయి. ఇటీవల చంద్రబాబునాయుడు.. ర్యాపిడో అనే అగ్రిగేటర్ సంస్థతో ఒప్పందం చేసుకుని.. మహిళలను స్వయం ఉపాధి దిశగా నడిపిస్తూ ర్యాపిడో డ్రైవర్లుగా మార్చేస్తానని వారికి ఈ బైక్ లు, ఈ ఆటోలు ఇస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రభుత్వం ఈ వాహనాల కొనుగోలులో ఎన్ని దందాలకు పాల్పడుతుందో తెలియదు గానీ.. మొత్తానికి ర్యాపిడో వ్యాపారాన్ని విస్తరించడానికి చంద్రబాబు తన వంతు కృషి చేయడం తప్ప కొత్తగా ఇందులో కనిపిస్తున్న సంగతేం లేదు. నిజంగా మహిళలకే మేలు చేయదలచుకుంటే.. వారికి ఈ బైకులు, ఈ ఆటోలు కొనుగోలు చేసుకోవడానికి వడ్డీలేని రుణ సదుపాయం ప్రభుత్వం కల్పించవచ్చు. వారు ర్యాపిడోకు డ్రైవర్లుగా పనిచేస్తారో మరో సంస్థకు పనిచేస్తారో వారి ఇష్టానికి వదిలేస్తే బాగుండేది. ఒక సంస్థ దోపిడీకి ప్రభుత్వం సహకరిస్తున్నదనే ఆరోపణలు లేకుండా ఉండేవి. చంద్రబాబు అలా చేయలేదు. పైగా అమిత్ షా ప్రకటన తర్వాత.. దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో అమల్లో ఉన్న కొన్ని యాప్ ల గురించి కూడా కొత్త వివరాలు తెలుస్తున్నాయి. వారు నిజంగా.. దోపిడీని అడ్డుకునే యాప్ లను తయారు చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే అక్కడి మమతా దీదీ ప్రభుత్వం యాత్రీ సాథీ పేరుతో ఒక యాప్ తీసుకువచ్చింది. ఇందులో కమిషన్ల రూపేణా డ్రైవర్లను దోచుకోవడం, టైమింగులను బట్టి, మొబైల్ లో చార్జింగును బట్టి ప్రయాణికులను దోచుకోవడం వంటి వక్రమార్గాలు ఉండవు. యాత్రీ సాథీ యాప్ లో రిజిస్టరు చేసుకున్న క్యాబ్ డ్రైవర్లు ఒక రోజులో తొలి పది రైడ్ లకు ఒక్కోదానికి రూ.10 వంతున చెల్లించాలి. ఒక రోజులో ఒక రైడ్ మాత్రమే వెళితే.. 10 చెల్లిస్తే చాలు. పది రైడ్లకు రూ100 చెల్లించిన తర్వాత ఎన్ని రైడ్లు చేసుకున్నా ఆరోజుకు ఇక ఏం చెల్లించక్కర్లేదు. అలాంటి మంచి విధానం మమత ప్రభుత్వం తెచ్చింది. ఓలా, ఊబర్ దోపిడీలతో విసిగిపోయిన కర్ణాటకలోని ఆటో డ్రైవర్లు తామే స్వయంగా ఒక సాఫ్ట్ వేర్ సంస్థను ఆశ్రయించి ఒక యాప్ డిజైన్ చేయించుకున్నారు. ‘నమ్మ యాత్రి’ పేరుతో ఉండే ఆ యాప్ లో కూడా ఇదే మాదిరిగా రైడ్ లను బట్టి చెల్లిస్తే సరిపోతుంది. నిజం చెప్పాలంటే.. టెక్నాలజీ మీద అవగాహన ఉండే పాలకులైతే ఇలాంటి కొత్త విధానాలు తీసుకురావడం ద్వారా.. అటు వాహన డ్రైవర్లు, ఇటు ప్రయాణికులు అగ్రిగేటర్ సంస్థల దోపిడీకి గురికాకుండా చూసుకోవాలి. కానీ చంద్రబాబు తనను తాను హైటెక్ ముఖ్యమంత్రి అని చాటుకుంటూ ఉంటారు. కంప్యూటరును నేనే కనిపెట్టానని చెప్పుకుంటూ ఉంటారు. ఏఐను తానే కనుగొని ప్రపంచానికి పరిచయం చేస్తున్నానని కూడా చెప్పుకోగలరు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి.. తిరిగి అగ్రిగేర్ సంస్థకు దోచిపెట్టే ఒప్పందమే చేసుకుంటున్నారు. ఆయన చెప్పుకునే హైటెక్ తెలివితేటల్లో డొల్లతనం బయటపడుతోందే తప్ప.. మంచి నాణ్యమైన ఆలోచన చేయలేకపోతున్నారనే విమర్శలు ప్రజల్లో వినవస్తున్నాయి...ఎం. రాజేశ్వరి

Can Home Insurance Protect During Earthquakes What You Need to Know After Myanmar Tragedy8
భూకంపాలకు హోమ్ ఇన్సూరెన్స్ పనికొస్తుందా?

మయన్మార్‌, థాయ్‌ల్యాండ్‌ దేశాలలో ఇటీవల అధిక తీవ్రతతో సంభవించిన వినాశకరమైన భూకంపం విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో ఇంటి యజమానుల సన్నద్ధతపై ఆందోళనలను రేకెత్తించింది. భూకంపాలు ఊహించలేనప్పటికీ, సరైన బీమా పాలసీతో మీ ఇంటిని సురక్షితం చేసుకోవడం ఇలాంటి విపత్తుల సమయంలో ఆర్థిక ఉపశమనం కలిగిస్తుంది.హోమ్ ఇన్సూరెన్స్ భూకంపాలను కవర్ చేస్తుందా?ప్రామాణిక గృహ బీమా పాలసీలు సాధారణంగా భూకంప నష్టాన్ని కవర్ చేయవు. అయితే, చాలా బీమా సంస్థలు భూకంప బీమాను యాడ్-ఆన్ లేదా ప్రత్యేక పాలసీగా అందిస్తున్నాయి. ఈ కవరేజీ మీ ఇంటి నిర్మాణం, దాని విషయాలు రెండింటినీ భూకంప కార్యకలాపాల వల్ల కలిగే నష్టాల నుండి రక్షించగలదు.భూకంప బీమా ముఖ్య లక్షణాలుస్ట్రక్చరల్ కవరేజ్: భూకంపాల వల్ల కలిగే నష్టాల నుండి భవనాన్ని రక్షిస్తుంది.కంటెంట్ కవరేజీ: ఇంట్లోని విలువైన వస్తువులు, వస్తువులను కవర్ చేస్తుంది.అదనపు జీవన ఖర్చులు: మీ ఇల్లు నివాసం ఉండలేని విధంగా మారితే తాత్కాలిక వసతి కోసం ఆర్థిక సహాయం అందిస్తుంది.భూకంప బీమా ఎందుకు ముఖ్యం?మయన్మార్‌, థాయ్‌ల్యాండ్‌తోపాటు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లోనూ భూకంప ప్రభావం కనిపించింది. మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో గతంలోనూ భూకంప ప్రమాదాలు సంభవించాయి. ఇలాంటి ప్రాంతాలలో భూకంప ప్రభావానికి ఇల్లు కూలిపోతే తరువాత పునర్నిర్మించడానికి ఆర్థిక భారం అధికంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో భూకంప బీమా నిశ్చింతను ఇస్తుంది. ఇంటి యజమానులకు ఆర్థిక భారం లేకుండా నష్టాల నుండి కోలుకునేలా చేస్తుంది.ఇవి పరిగణనలోకి తీసుకోవాలిమినహాయింపులు: భూకంప బీమా పాలసీలు సాధారణంగా అధిక మినహాయింపులతో వస్తాయి. ఇది క్లెయిమ్ చెల్లింపులను ప్రభావితం చేస్తుంది.కవరేజ్ పరిమితులు: ఇంటి నిర్మాణంతోపాటు ఇంట్లోని వస్తువులకూ గరిష్ట కవరేజీ ఉందో లేదో సరిచూసుకోండి.పాలసీ నిబంధనలు: చేరికలు, మినహాయింపులు, అందుబాటులో ఉన్న ఏదైనా అదనపు రైడర్లను సమీక్షించండి.

Strong Earthquake Hits Myanmar bangkok Other Parts Updates9
మయన్మార్‌లో భారీ భూకంపం.. 200 చేరిన మృతుల సంఖ్య

Myanmar, Thailand Earthquake Live Updates: మయన్మార్‌: మయన్మార్‌లో 200 దాటిన భూకంప మృతుల సంఖ్యమృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశంభారీగా కుప్పకూలిన 40 అపార్ట్‌మెంట్‌లు శిధిలాల కింద వెయ్యిమందికి పైగా ఉన్నారని అంచనాకొనసాగుతున్న సహాయక చర్యలు రోడ్లపైనే క్షతగాత్రులకు కొనసాగుతున్న చికిత్సమయన్మార్‌శిధిలాల కింద వందల మంది ప్రజలు మయన్మార్‌లో అంతకంతకూ పెరుగుతున్న మృతుల సంఖ్యఇప్పటి వరకు భూకంపం ధాటికి 103 మరణించినట్లు అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వంమృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశంభూకంపంతో కూలిన భారీగా సముదాయాలుశిధిలాల కింద వందల మంది ప్రజలు అంతర్జాతీయ సాయం కోరిన మయన్మార్‌ ప్రభుత్వం థాయ్‌లాండ్‌లో భారతీయుల సహాయార్థం హెల్ప్‌లైన్‌భారతీయుల కోసం ఇండియన్‌ ఎంబసీ హెల్ప్‌లైన్‌థాయ్‌లాండ్‌లో హెల్ప్‌లైన్‌ నంబర్‌+66618819218థాయ్‌లాండ్‌లో ఎయిర్‌పోర్ట్‌ లాక్‌డౌన్‌అన్ని విమానసర్వీలు రద్దుథాయ్‌లాండ్‌కు వచ్చే విమానాలు దారి మళ్లింపుథాయ్‌లాండ్‌ లో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రకటించిన షినవ్రతమయన్మార్‌, బ్యాంకాక్‌ో కుప్పకూలిన వందల భవనాలుభయంతో రోడ్డపైకి వచ్చిన వేలాది మంది జనంశిథిలాల కింద వేలమంది ఉన్నట్లు అధికారులు ప్రకటనమృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశంబ్యాంకాక్‌ో మెట్రో రైలు ేసేవలు నిలిపివేతబ్యాంకాక్‌లో శిథిలాల్లో చిక్కుకున్న పలువురుఓ భవనంలో 50 మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు వెల్లడిబ్యాంకాక్‌లో భవనాలను ఖాళీ చేయిస్తున్న అధికారులు Over 40 construction workers are reported missing, following the collapse of an under construction high-rise building in the Thai capital of Bangkok, as a result of today’s 7.7 magnitude earthquake in Myanmar. pic.twitter.com/ydkbxExorf— OSINTdefender (@sentdefender) March 28, 2025 భారీ భూకంపంతో మయన్మార్‌ శుక్రవారం చిగురుటాకులా వణికిపోయింది. ప్రకంపనల ధాటికి బహుళ అంతస్తుల భవనాలు ఊగిపోయి కుప్ప​కూలిపోయాయి. ప్రాణ, ఆస్తి నష్టాలు భారీగా సంభవించి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ భూకంపం ధాటికి పొరుగున ఉన్న థాయ్‌లాండ్‌లోనూ భారీగా భూమి భారీగా కంపించింది. చైనా, భారత్‌, లావోస్‌, బంగ్లాదేశ్‌లోనూ ఈ ప్రకంపనల ప్రభావం కనిపించింది.మయన్మార్‌లో శుక్రవారం మధ్యాహ్నాం 12గం.50ని. ప్రాంతంలో తొలుత భూమి భారీగా కంపించింది. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే మరో రెండుసార్లు కంపించింది. మొదటిసారి రిక్టర్‌ స్కేల్‌పై 7.7 తీవ్రతతో.. రెండోసారి 6.4 తీవ్రత.. మూడోసారి 4.9 తీవ్రత నమోదైంది. సెంట్రల్‌ మయన్మార్‌లోని సగైంగ్‌కు 16 కిలోమీటర్ల దూరంలో.. సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర నమోదైంది. మరోసారి భూకంపం వస్తాయన్న హెచ్చరికలు అక్కడి అధికారులు భవనాల నుంచి జనాల్ని ఖాళీ చేయిస్తున్నారు.భూకంపం ధాటికి జనం రోడ్ల మీదకు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. కొందరు తమ ఫోన్లలో వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో వదిలారు. నిర్మాణంలో ఉన్న ఓ భారీ భవనం కుప్పకూలిపోవడం, ప్రకంపనల ధాటికి పైఅంతస్తుల్లోని స్విమ్మింగ్‌ పూల్స్‌ నుంచి నీరు కిందకు పడడం, నేల మీద ఉన్న పూల్స్‌లోని నీరు కూడా బయటకు ఉబికిరావడం లాంటి దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మండాలెలో ఇర్రవడ్డీ నదిపై ఉన్న చారిత్రక వంతెన అవా బ్రిడ్జి కుప్పకూలిపోయింది.#BREAKING A 7.9-magnitude earthquake struck Myanmar, according to the China Earthquake Networks Center. Neighboring regions, including Thailand and China's Yunnan Province, felt significant tremors. #Myanmar #earthquake pic.twitter.com/qgRHQ7ltjl— 鳳凰資訊 PhoenixTV News (@PhoenixTV_News) March 28, 2025మరోవైపు థాయ్‌లాండ్‌ ఉత్తర భాగం మొత్తం భూకంపంతో వణికిపోయింది. రాజధాని బ్యాంకాక్‌లో 7.3 తీవ్రతతో భూమి కంపించడంతో భవనాలు ఊగిపోయాయి. ప్రాణభయంతో జనాలు పరుగులు తీసిన దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి. అక్కడి నష్టం వివరాలపైనా స్పష్టత రావాల్సి ఉంది. ఇంకోవైపు చైనా సరిహద్దు ప్రావిన్స్‌తో పాటు బంగ్లాదేశ్‌, లావోస్‌, భారత్‌లోనూ భూమి కంపించింది. భారత్‌లో మణిపూర్‌, కోల్‌కతా, మేఘాలయా ప్రాంతాల్లో ఈ ప్రభావం కనిపించింది. ఇటు మయన్మార్‌, అటు థాయ్‌లాండ్‌లోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 🚨 7.7 Magnitude Earthquake Hits Mandalay, MyanmarMultiple buildings destroyed in devastating quake.#Myanmar #Earthquake #แผ่นดินไหว pic.twitter.com/fgQTBlUqjw— Weather Monitor (@WeatherMonitors) March 28, 2025 Under construction building collapses in Myanmar following 7.7 scale #earthquake pic.twitter.com/8yzH8UFvjk— The Raisina Hills (@theraisinahills) March 28, 2025 1930 నుంచి 1956 మధ్య 7 తీవ్రతతో మయన్మార్‌లో భారీ భూకంపాలే సంభవించాయి. అయితే ఈ మధ్య కాలంలో ఇంత శక్తివంతమైన ప్రకంపనలు సంభవించడం ఇదే. చివరిసారిగా.. 206లో 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి పాత రాజధాని బాగన్‌లో ముగ్గురు మరణించారు. A massive 7.6m earthquake that just hit Thailand minutes ago. This caused a new skyscraper under construction to collapse in downtown Bangkok. https://t.co/0TF79rqqIq pic.twitter.com/RpzLKwQPvW— RyanMatta 🇺🇸 🦅 (@RyanMattaMedia) March 28, 2025 🚨 Strong 7.7 Earthquake shakes Bangkok: People run out onto the streets, water splashes out of swimming pools.pic.twitter.com/U4nlcRGaT0— Gems (@gemsofbabus_) March 28, 2025

Robinhood Movie Review And Rating In Telugu10
‘రాబిన్‌హుడ్‌’ మూవీ రివ్యూ

నితిన్‌ ఖాతాలో హిట్‌ పడి చాలా కాలమైంది. భీష్మ(2020) తర్వాత ఆయనకు ఆ స్థాయి విజయం లభించలేదు.దీంతో మళ్లీ భీష్మ దర్శకుడు వెంకీ కుడుములనే నమ్ముకున్నాడు. ఆయన దర్శకత్వంలో ‘రాబిన్‌హుడ్‌’(Robinhood Review) అనే సినిమాతో నితిన్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి చిత్రంతో నితిన్‌ హిట్‌ ట్రాక్‌ ఎక్కడా? లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ‍రామ్‌ (నితిన్‌) అనాథ. చిన్నప్పుడు అతన్ని ఓ పెద్దాయన హైదరాబాద్‌లోని ఓ అనాథ ఆశ్రమంలో చేర్పిస్తాడు. అక్కడ తినడానికి తిండిలేక ఇబ్బందిపడుతున్న తోటి పిల్లల కోసం దొంగగా మారతాడు. పెద్దయ్యాక ‘రాబిన్‌హుడ్‌’ పేరుతో ధనవంతుల ఇళ్లలో చోరీలు చేస్తుంటాడు. అతన్ని పట్టుకోవడం కోసం రంగంలోకి దిగిన పోలీసు అధికారి విక్టర్‌(షైన్‌ చాం టాకో) ఈగోని దెబ్బతీస్తూ ప్రతిసారి దొరికినట్లే దొరికి తప్పించుకుంటాడు. దీంతో విక్టర్‌ రాబిన్‌ని పట్టుకోవడమే టార్గెట్‌గా పెట్టుకుంటాడు. రాబిన్‌కి ఈ విషయం తెలిసి..దొంగతనం మానేసి జనార్ధన్ సున్నిపెంట అలియాస్ జాన్ స్నో(రాజేంద్రప్రసాద్‌) నడిపే ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అవుతాడు.(Robinhood Review). అదే సమయంలో ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఇండియన్ ఫార్మా కంపెనీ అధినేత కుమార్తె నీరా వాసుదేవ్ (శ్రీలీల) ఇండియాకు వస్తుంది. ఆమెకు సెక్యూరిటీగా రాబిన్‌ వెళ్తాడు. ఇండియాకు వచ్చిన నీరాను గంజాయి దందా చేసే రౌడీ సామి(దేవదత్తా నాగే) మనుషులు బంధించి రుద్రకొండ అనే ప్రాంతానికి తీసుకెళ్తారు? సామి వలలో చిక్కుకున్న నీరాను రాబిన్‌హుడ్‌ ఎలా రక్షించాడు? నిరాను రుద్రకొండకు ఎందుకు రప్పించారు? రాబిన్‌హుడ్‌ సడెన్‌గా సెక్యూరిటీ ఏజెన్సీలో ఎందుకు చేరాల్సివచ్చింది? ఈ కథలో ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..రాబిన్‌హుడ్ కథ అంటే ధనవంతుల నుంచి దొంగిలించి పేదవాళ్లకు పంచే ఒక నీతిగల దొంగ స్టోరీ అందరికి తెలిసిందే. తెలుగు సినిమాల్లో ఈ తరహా కథలు చాలానే వచ్చాయి. కానీ ప్రతి సినిమా దానికి తగ్గట్టుగా కొత్త రంగు, రుచి జోడించి ప్రేక్షకులను అలరించింది. రాబిన్‌హుడ్‌ కూడా టైటిల్‌కి తగ్గట్టే రాబిన్‌హుడ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం. కథ పరంగా చూస్తే ఇందులో కొత్తదనం ఏది కనిపించదు. శారీరక బలం కంటే, మానసిక బలాన్ని ఎక్కువగా నమ్ముకునే హీరో.. దొంగతనం చేసి అవసరం ఉన్నవాళ్లకు పంచడం..కథ ఇదే లైన్‌లో సాగుతుంది. ఇక్కడ హీరో అనాథ పిల్లల కోసం దొంగతనం చేస్తుంటాడు. ఆ పాయింట్‌ వినగానే అందరికి రవితేజ ‘కిక్‌’ గుర్తొస్తుంది. కానీ పూర్తిగా ‘కిక్‌’ థీమ్‌ని అనుసరించలేదు. ( ఇదీ చదవండి: Mad Square Movie Review: 'మ్యాడ్ స్క్వేర్‌' మూవీ రివ్యూ)కథలో డిఫరెంట్‌ డిఫరెంట్‌ లేయర్స్‌ ఉంటాయి. చివరకు వాటి మధ్య ఉన్న సంబంధం రివీల్‌ అవుతుంది. ఈ ట్విస్టులు సాధారణ ప్రేక్షకులకు కిక్‌ ఇస్తాయి. ఫస్టాప్‌ మొత్తం ఫన్‌జోన్‌లో సాగుతుంది. హీరో చిన్నప్పుడే ఎందుకు దొంగగా మారాల్సి వచ్చిందో తెలియజేస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. హీరోను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులను బురిడి కొట్టించే సీన్లన్ని పాత సినిమాను గుర్తు చేస్తాయి. హీరోయిన్‌ ఎంట్రీ తర్వాత కథనం కామెడీతో పరుగులు పెడుతుంది. వెన్నెల కిశోర్‌, రాజేంద్రప్రసాద్‌ మధ్య వచ్చే సన్నివేశాలల్లో కామెడీ బాగా పండింది(Robinhood Review)ముఖ్యంగా నీరా దగ్గర మంచి మార్కులు కొట్టేసేందుకు జాన్ స్నో చేసే ప్రయత్నాలు నవ్వులు పూయిస్తాయి. కామెడీ సీన్లతో ఫస్టాఫ్‌ ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ బాగుంటుంది. ఇక సెకండాఫ్‌లో కథనం కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. విలన్‌ చుట్టూ సాగే సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేవు. కథనం కూడా కొంతవరకు ఊహకందేలా సాగుతుంది. కొన్ని ట్విస్టులు ఆకట్టుకున్నప్పటికీ.. రాబిన్‌ అసలు రుద్రకోండకు ఎందుకు వచ్చాడనేది తెలిసిన తర్వాత మళ్లీ రొటీన్‌ మూడ్‌లోకి వెళ్లిపోతాం. అదే సమయంలో వచ్చిన అదిదా సర్‌ప్రైజ్‌ సాంగ్‌ కాస్త ఉపశమనం కలిగిస్తుంది. ‘ట్రూత్ ఆర్ డేర్‌’ సీన్ ఒక‌టి న‌వ్వులు పంచుతుంది. డేవిడ్‌ వార్నర్‌ పాత్ర మినహా క్లైమాక్స్‌ రొటీన్‌గానే ఉంటుంది. అయితే వార్నర్‌ పాత్రను సరైన ముగింపు ఇవ్వకుండా.. పార్ట్‌ 2 కూడా ఉంటుందని హింట్‌ ఇచ్చేశారు. ఎవరెలా చేశారంటే..రాబిన్‌హుడ్‌ పాత్రలో నితిన్‌ చక్కగా నటించాడు. అతని కామెడీ టైమింగ్‌ సినిమాకు ప్లస్‌ అయింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో పలు సన్నివేశాల్లో అతని నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. శ్రీలీల పాత్ర పరిమితంగా ఉన్నప్పటికీ, తెరపై చాలా అందంగా కనిపించింది. నటనపరంగా ఆమెకు పెద్దగా స్కోప్‌ ఉన్న పాత్రమేది కాదు. దేవదత్త పాత్ర మొదట్లో భయపెట్టేలా అనిపించినా, చివర్లో కాస్త నీరసంగా మారి ప్రేక్షకులను నిరాశపరిచింది.రాజేంద్రప్రసాద్‌, వెన్నెల కిశోర్‌ల కామెడీ బాగా వర్కౌట్‌ అయింది. ఇద్దరు తమదైనశైలీలో నటించి నవ్వులు పూయించారు.డేవిడ్ వార్నర్ స్క్రీన్‌పై చాలా తక్కువ సమయం కనిపించినప్పటికీ, అతని ఎంట్రీతో థియేటర్లలో విజిల్స్ మారుమోగేలా అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ చూపించాడు. శుభలేక సుధాకర్‌, షైన్‌ చాం టాకోతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. జీవి ప్రకాశ్‌ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్లస్‌ పాయింట్‌. పాటలు వినడానికి బాగున్నా..తెరపై చూస్తే అంతగా ఆకట్టుకోలేవు. కథలో వాటిని ఇరికించినట్లుగా అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ పర్వాలేదు. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాకు భారీగానే ఖర్చు చేసినట్లు సినిమా చూస్తే అర్థమవుతుంది. సినిమాను చాలా రిచ్‌గా తీర్చిదిద్దారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement