Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

India plans twin financial strikes on Pakistan1
భారత్‌ భారీ వ్యూహం.. పాక్‌కు కోలుకోలేని దెబ్బ!

ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి ఘటన భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలను క్రియేట్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం చెప్పేలా భారత్‌ ప్లాన్‌ చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక, తాజాగా పాక్‌పై రెండు ఆర్థిక దాడులకు భారత్‌ ప్రణాళికలు చేసినట్టు సమాచారం.కాగా, పాకిస్తాన్‌ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా భారత్‌ ప్రణాళికలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌(FATF) గ్రేలిస్టులోకి పాకిస్తాన్‌ను తిరిగి చేర్చడానికి భారత్‌ ప్రయత్నిస్తోంది. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహాయాన్ని అరికట్టడంలో విఫలమయ్యే దేశాలను ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లో చేరుస్తుంది. గతంలో ఈ జాబితాలో ఉన్న పాకిస్తాన్‌ను తిరిగి అందులోకి చేర్చడం ద్వారా ఉగ్రవాదానికి నిధులు అందకుండా అంతర్జాతీయంగా ఆ దేశంపై ఒత్తిడి పెంచాలని భారత్ భావిస్తోంది. రెండో చర్యగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఇటీవల పాకిస్థాన్‌కు మంజూరు చేసిన 7 బిలియన్ డాలర్ల భారీ ఆర్థిక సాయ ప్యాకేజీ వినియోగంపై భారత్ తన ఆందోళనలను వ్యక్తం చేయనున్నట్టు సమాచారం. ఈ నిధులను పాకిస్తాన్‌ ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాల కోసం దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ సంబంధిత అంతర్జాతీయ వేదికలపై ఈ అంశాన్ని లేవనెత్తాలని భారత్ యోచిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. భారత్‌ ప్లాన్‌ చేసిన చర్యల కారణంగా పాకిస్తాన్‌కు కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఈ ద్వంద్వ వ్యూహం ద్వారా పాకిస్థాన్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు ఆర్థిక మార్గాలను మూసివేయాలని, తద్వారా సరిహద్దు ఉగ్రవాదాన్ని కట్టడి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. పహల్గామ్ దాడి వంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు ఈ ఆర్థికపరమైన ఒత్తిడిని ఒక మార్గంగా భారత్ పరిగణిస్తున్నట్టు సమాచారం.2022లో విముక్తి..కాగా, 2022లో అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్‌కు కాస్త ఊరట లభించింది. ఉగ్రవాద సంస్థలకు నిధులు సరఫరా చేస్తోందన్న కారణంతో పాక్‌ను గ్రే లిస్టులో ఉంచిన ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌(FATF) ఆ జాబితా నుంచి తొలగించింది. మనీలాండరింగ్‌ నిరోధక చర్యలను పాకిస్థాన్‌ పటిష్ఠంగా అమలు చేస్తోందని, సాంకేతిక లోపాలను పరిష్కరిస్తూ ఉగ్రసంస్థలకు నిధుల సరఫరా విషయంలోనూ పోరాటం చేసిందని ఎఫ్‌ఏటీఎఫ్‌ వెల్లడించింది. దీంతో పాక్‌ను గ్రే లిస్టు నుంచి తప్పించినట్లు తెలిపింది. గ్రే లిస్టులో ఉన్న దేశాలు అంతర్జాతీయ సంస్థల నుంచి నిధుల పొందడం చాలా కష్టం. ఈ దేశాలకు ముఖ్యంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎప్‌), ప్రపంచ బ్యాంక్‌, ఏడీబీ, యూరోపియన్‌ యూనియన్‌ వంటి సంస్థలు ఆర్థిక సాయం చేసేందుకు వెనకాడుతాయి.ఉగ్రవాదానికి ఊతమిచ్చే అతి ప్రమాదకర దేశాలను ఎఫ్‌ఏటీఎఫ్ బ్లాక్‌ లిస్ట్‌ జాబితాలోకి చేరుస్తుంది. కాగా, ఇప్పటివరకు ఇరాన్‌, ఉత్తర కొరియా మాత్రమే బ్లాక్‌ లిస్ట్‌ జాబితాలో ఉన్నాయి. బ్లాక్‌ లిస్ట్‌ నుంచి తప్పించుకోవడానికి మూడుదేశాల మద్దతు అవసరం. అయితే, చైనా, టర్కీ, మలేషియా దేశాలు పాక్‌కు మద్దతు ఇవ్వడంతో బ్లాక్‌ లిస్ట్‌లోకి వెళ్లకుండా బయటపడింది. తొలిసారిగా 2018 జూన్‌లో ఎఫ్‌ఏటీఎఫ్‌ పాకిస్తాన్‌ను గ్రే లిస్ట్‌లో ఉంచింది. అనంతరం వీటి నుంచి బయటపడేందుకు పాకిస్తాన్‌కు రెండు సార్లు సమయమిచ్చింది. వీటిలో భాగంగా ఉగ్రవాదులకు అందుతున్న నిధుల మూలాలను కనిపెట్టే దిశగా పాక్‌ చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఐరాస ఉగ్రవాదులుగా గుర్తించిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలి. అలాగే పట్టుబడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు నిరూపించగలగాలి. ఐరాస గుర్తించిన ఉగ్రవాదులకు నిధులు అందకుండా ఆర్థికపరమైన ఆంక్షలు విధించాలి. ఎఫ్‌ఏటీఎఫ్‌ నిర్దేశించిన ఈ లక్ష్యాలను చేరుకోవడంలో పాక్‌ ఇప్పటివరకు విఫలమవుతూనే వచ్చింది. కానీ, జూన్‌ నెలలో ఎఫ్‌ఏటీఎఫ్‌ ప్లీనరీ సమావేశంలో పాక్‌కు అనుకూలంగా ప్రకటన విడుదల చేసింది. ధరలతో పాక్‌ అతలాకుతలం..మరోవైపు.. ఇప్పటికే తీవ్ర ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌కు ఇప్పుడు మరో తలనొప్పి వచ్చి పడింది. పాక్‌తో వాణిజ్య సంబంధాలు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించడంతో పాక్‌ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ క్రమంలోనే అట్టారీ సరిహద్దును భారత్ మూసివేసింది. దీంతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం నిలిచిపోయింది. దీంతో ఇప్పటికే తీవ్రంగా కుదేలైన పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై ఇది మరింత తీవ్ర ప్రభావం చూపనుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో పాక్‌లో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకింది. భారీగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో పాక్ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో ప్రస్తుతం పాక్‌లో ఆహార ధరలు భారీగా పెరిగాయి.పాకిస్తాన్‌లో ప్రస్తుతం కొన్ని ఆహార పదార్థాల ధరలుకిలో చికెన్: రూ. 798.89 పాకిస్తాన్ రూపాయలుకిలో బియ్యం: రూ. 339.56 పాకిస్తాన్ రూపాయలుడజను గుడ్లు: రూ. 332 పాకిస్తాన్ రూపాయలులీటర్ పాలు: రూ. 224 పాకిస్తాన్ రూపాయలుఅరకిలో బ్రెడ్: రూ. 161.28 పాకిస్తాన్ రూపాయలుకిలో టమాట: రూ. 150 పాకిస్తాన్ రూపాయలుకిలో బంగాళాదుంప: రూ. 105 పాకిస్తాన్ రూపాయలు.

PM Narendra Modi AP Tour Updates2
వెలగపూడిలో ప్రధాని నరేంద్ర మోదీ

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రాష్ట్రానికి వచ్చారు. అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. శుక్రవారం మధ్యా­హ్నం 2.50 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు మోదీ,. ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయమునకు చేరుకున్న భారత ప్రధానికి ప్రజా ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో వెలగపూడి చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో వెలగపూడి సభా ప్రాంగణానికి బయల్దేరి వెళ్లారు. పలు కేంద్ర ప్రాజెక్ట్‌ లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మోదీ పాల్గొననున్నారు. దీనిలో భాగంగా 18 ప్రాజెక్ట్‌ లకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయ­­ంత్రం 4.55 గంటలకు గన్న­వరం చేరుకొని.. తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.భారీ భద్రత ఏర్పాట్లు..ప్రధాని పర్యటనకు పోలీ­సు­లు భారీ భద్రతా ఏర్పా­ట్లు చేస్తున్నారు. 6 వేల మందికి పైగా పోలీస్‌ బలగా­లను మోహ­రించారు. భద్రతను పర్యవేక్షించేందుకు 19 మంది ఐపీఎస్‌ అధికారులను నియమించారు. అమరావతి­లోని సభా ప్రాంగణానికి చేరుకునేందుకు 11 మార్గా­ల­ను ఖరారు చేశారు. వాటిలో రెండు మార్గాలను ప్రముఖులకు కేటాయించారు. సభా ప్రాంగణం పరిసరాలను ఎన్‌ఎస్‌జీ కమెండోలు ఆ«దీనంలోకి తీసుకున్నారు. సభ కోసం 5 లక్షల మందిని సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బాధ్యత రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్‌ అధికారులకు అప్పగించింది. జన సమీకరణ కోసం 4,500 ఆర్టీసీ బస్సులను కేటాయించింది.

Rs 21000 Crore YouTube Paid Indian Content Creators in Last 3 Years Says CEO Neal Mohan3
రూ.21000 కోట్లు: మూడేళ్ళలో యూట్యూబర్ల సంపాదన..

టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో చాలామంది సొంతంగా సంపాదించడానికి మార్గాలను వెతుకుతున్నారు. పెట్టుబడి లేకుండా సంపాదించడానికి యూట్యూబ్ ఓ మంచి ఫ్లాట్‌ఫామ్. దీనిని దృష్టిలో ఉంచుకుని చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానెల్స్ ప్రారంభిస్తున్నారు, ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. యూట్యూబ్ ద్వారా గత మూడేళ్ళలో కంటెంట్ క్రియేటర్లు ఎంత సంపాదించారనే విషయాన్ని సీఈఓ నీల్ మోహన్ వెల్లడించారు.గత మూడు సంవత్సరాలలో యూట్యూబ్.. భారతీయ క్రియేటర్లకు, మీడియా సంస్థలు మొదలైన వాటికి రూ. 21,000 కోట్లకు పైగా చెల్లించింది. ఈ విషయాన్ని సీఈఓ నీల్ మోహన్ ముంబైలో జరిగిన ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES)లో స్పష్టం చేశారు. అంతే కాకుండా.. యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సహించడానికి రాబోయే రెండు సంవత్సరాలలో.. రూ.850 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ పెట్టుబడి ప్రత్యేకంగా భారతదేశ కంటెంట్ క్రియేటర్ల ఆర్థిక వ్యవస్థను పెంచుతుందని ఆయన అన్నారు.ఇదీ చదవండి: 1925లో బంగారం రేటు ఇంత తక్కువా?: అదే ధర ఇప్పుడుంటే..భారతదేశంలోని సుమారు 100 మిలియన్ల కంటే ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ లేదా యూట్యూబర్లు కంటెంట్ అప్లోడ్ చేశారు. సుమారు 15,000 మంది యూట్యూబర్లు ఒక ఏడాదిలోనే 10 లక్షల సబ్‌స్క్రైబర్‌లను పొందిన రికార్డును సొంతం చేసుకున్నారు. కాగా 2005 ఫిబ్రవరి 14న ప్రారంభమైన యూట్యూబ్ 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

Sreesanth Suspended For 3 years Over Controversial Remarks In Sanju Row4
సంజూ శాంసన్‌కు మద్దతు!.. శ్రీశాంత్‌పై వేటు.. ప్రకటన విడుదల

టీమిండియా మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌ (Sreesanth)కు కేరళ క్రికెట్‌ అసోసియేషన్‌ (KCA) భారీ షాకిచ్చింది. కేరళ క్రికెట్‌ వ్యవహారాలతో సంబంధం లేకుండా.. అతడిని మూడేళ్లపాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. సంజూ శాంసన్‌ (Sanju Samson) విషయంలో శ్రీశాంత్‌ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణమని తెలుస్తోంది.సంజూకు కేసీఏతో విభేదాలు?కాగా కేరళకు చెందిన శ్రీశాంత్‌ మాదిరే సంజూ శాంసన్‌ కూడా టీమిండియా తరఫున రాణిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025కి ముందు సంజూకు కేసీఏతో విభేదాలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. శిక్షణా శిబిరానికి హాజరు కానందున ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ను కేసీఏ సెలక్టర్లు దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీకి ఎంపిక చేయలేదు.కేసీఏ బారి నుంచి కాపాడుతానంటూదీంతో ఐసీసీ మెగా వన్డే టోర్నీకి ముందు సంజూ ఇలా దేశీ ఈవెంట్‌కు దూరం కావడంతో సెలక్టర్లు అతడి పేరును పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో సంజూ శాంసన్‌కు మద్దతుగా మాట్లాడుతూ శ్రీశాంత్‌ కేసీఏను విమర్శించాడు.అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్న ఆటగాళ్లకు మద్దతుగా ఉండాల్సిన అసోసియేషన్‌ ఇలా చేయడం సరికాదని.. తాను స్థానిక కేరళ క్రికెటర్లను కేసీఏ బారి నుంచి కాపాడుతానంటూ శ్రీశాంత్‌ వ్యాఖ్యలు చేశాడు. స్థానిక ఆటగాళ్లను కాదని.. వేరే రాష్ట్రాల వారికి కేసీఏ అవకాశాలు ఇస్తోందని ఆరోపించాడు. ఎంతో మంది అనుభవజ్ఞులైన, నైపుణ్యాలు ఉన్న ఆటగాళ్లను కూడా ఎదగనివ్వడం లేదంటూ ఆరోపణలు చేశాడు.మూడేళ్ల పాటు సస్పెండ్‌ఇక శ్రీశాంత్‌ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కేసీఏ అతడిపై చర్యలు చేపట్టింది. ఈ మేరకు.. అసత్యపు, నిరాధార వ్యాఖ్యలతో మా పరువుకు భంగం కలిగించేలా మాట్లాడిన శ్రీశాంత్‌ను మూడేళ్ల పాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలిపింది. సంజూకు మద్దతుగా ఉన్నందుకు తాము ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని.. అసోసియేషన్‌ను కించపరిచేలా మాట్లాడినందుకే ఇలా చేశామని స్పష్టం చేసింది.కాగా కేరళ క్రికెట్‌ లీగ్‌లో భాగంగా ఏరీస్‌ కొల్లామ్‌ సెయిలర్స్‌ ఫ్రాంఛైజీకి శ్రీశాంత్‌ సహ యజమానిగా ఉన్నాడు. అయితే, తమను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గానూ.. కేసీఏ శ్రీశాంత్‌తో పాటు కొల్లామ్‌ ఫ్రాంఛైజీతో పాటు అలెప్పీ టీమ్‌. కంటెంట్‌ క్రియేటర్‌ సాయి క్రిష్ణన్‌, అలెప్పీ రిపుల్స్‌కు కూడా నోటీసులు ఇచ్చింది.అయితే, షోకాజ్‌ నోటీసులకు శ్రీశాంత్‌ మినహా వీళ్లంతా తమకు సంతృప్తికర సమాధానాలు ఇచ్చారని కేసీఏ పేర్కొంది. అందుకే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని జనరల్‌ బాడీ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపింది.టీమిండియా తరఫున సత్తా చాటుతూ.. ఇద్దరూ ఇద్దరేకాగా శ్రీశాంత్‌ 2005 నుంచి 2011 వరకు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో ఈ రైటార్మ్‌ ఫాస్ట్‌ మీడియం పేసర్‌.. 27 టెస్టులు, 53 వన్డేలు. 10 అంతర్జాతీయ టీ20లు ఆడాడు. టెస్టుల్లో 87, వన్డేల్లో 75, టీ20లలో ఏడు వికెట్లు కూల్చాడు. టీ20 ప్రపంచకప్‌-2007, వన్డే వరల్డ్‌కప్‌-2011 గెలిచిన భారత జట్టలో అతడు సభ్యుడు.మరోవైపు.. కేరళ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ 2015లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు భారత్‌ తరఫున 16 వన్డేలు, 42 టీ20 మ్యాచ్‌లు ఆడి.. 510, 861 పరుగులు చేశాడు. అతడి అంతర్జాతీయ కెరీర్‌లో ఒక వన్డే, మూడు టీ20 శతకాలు ఉండటం విశేషం. టీ20 ప్రపంచకప్‌-2024 గెలిచిన భారత జట్టులో సంజూ ఉన్నాడు.చదవండి: వైభవ్‌ వయసు పిల్లలంతా హ్యాపీ.. ఎందుకింత ఓర్వలేని తనం?

Shashi Tharoor Is Here: Pm Sleepless Nights Jibe At Congress5
‘శశి థరూర్‌ నా పక్కన ఉన్నారు.. వారికి నిద్రలేని రాత్రులే’

తిరువనంతపురం: కేరళ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విజింజం అంతర్జాతీయ ఓడరేవును ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఓడరేవును ఆయన జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో మోదీతో పాటు కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై ప్రధాని మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు.‘‘ఇవాళ శశి థరూర్ ఇక్కడ కూర్చున్నారు. ఈ వేదికపై ఆయన ఉండటం కొందరికి నచ్చదు. కొందరికి ఇది నిద్రలేని రాత్రులను మిగులుస్తుంది. ఈ సందేశం ఎక్కడికి వెళ్లాలో అక్కడికి చేరుకుంటుంది’’ అంటూ మోదీ చురకలు అంటించారు. కేరళ సీఎం విజయన్‌ సమక్షంలోనే ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.కాగా.. గురువారం రాత్రి కేరళ చేరుకున్న ప్రధానిని.. శశి థరూర్‌ స్వయంగా వెళ్లి స్వాగతించిన సంగతి తెలిసిందే. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో కూడా వైరల్‌గా మారాయి. ‘‘ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానాల ఆలస్యం ఉన్నప్పటికీ.. సమయానికి తిరువనంతపురం చేరుకోగలిగా.. నా నియోజకవర్గానికి వచ్చిన మోదీని సాదరంగా స్వాగతించా’’ అంటూ శశి థరూర్‌ ట్వీట్‌ కూడా చేశారు.శశిథరూర్‌ గత కొన్ని నెలలుగా తన సొంత పార్టీపై అసంతృప్తిగా ఉన్న తెలిసిందే. ఇటీవల ఓ కేంద్ర మంత్రితో ఆయన సెల్ఫీ దిగడంతో థరూర్‌ పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. భారత విదేశాంగ విధానాన్ని ప్రశంసిస్తూ కూడా ఆయన ప్రశంసించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంతో ఇవాళ ఆయన ప్రధాని మోదీతో వేదిక పంచుకోవడం చర్చనీయాంశంగా మారింది.కాగా, భారత సముద్ర వాణిజ్య చరిత్రలో కొత్త చరిత్రను లిఖించిన విజింజం అంతర్జాతీయ ఓడరేవు.. సముద్ర రవాణాకు కీలకమైన కేంద్రంగా మారనుంది. దేశంలో మొట్టమొదటి సెమీ ఆటోమేటెడ్‌ ఓడరేవు అయిన విజింజం ఓడరేవు ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాంకేతికంగా అధునాతనమైన ట్రాన్స్‌షిప్‌మెంట్ ఓడరేవులలో ఒకటిగా నిలిచింది.

Fighter Jets Landing In 1st Night Landing Airstrip On Ganga Expressway In Up6
కమ్ముకున్న యుద్ధ మేఘాలు.. పాక్‌కు వెయ్యి కిలోమీటర్ల దూరంలో భారత్‌ ఫైటర్‌ జెట్‌లు

లక్నో: పహల్గాం ఉగ్రదాడితో భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో పాకిస్తాన్‌కు కేవలం వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌ గంగా ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ఫైటర్‌ జెట్‌లు విన్యాసాలు చేయడం చర్చాంశనీయంగా మారింది.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు చేస్తున్నయుద్ధ విమానాల్లో రాఫెల్, మిగ్-29, మిరాజ్ 2000 ఉన్నాయి. ఈ యుద్ధ విమానాల్ని రాత్రి వేళ్లల్లో ల్యాండ్‌ చేసేలా అందుబాటులోకి తెచ్చిన యూపీ షాజహాన్‌పూర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై నిర్మించిన నైట్ ల్యాండింగ్ స్ట్రిప్‌పై విన్యాసాలు ప్రదర్శిస్తున్నాయి. 3.5 కిలోమీటర్ల పొడవు గల ఈ ఎయిర్‌స్ట్రిప్ రాత్రి సమయంలో ఫైటర్‌ జెట్‌లు ల్యాండింగ్‌లకు అనుకూలంగా ఉంటుంది. ఇది ఎయిర్ ఫోర్స్ జెట్లు 24 గంటలూ ఆపరేషన్లకు వీలు కల్పించడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో ఎక్స్‌ప్రెస్‌వేను ప్రత్యామ్నాయ రన్‌వేగా ఉపయోగించగల సామర్థ్యాన్ని అంచనా వేయడంలో సహాయపడుతుంది.దీంతో, ఉత్తరప్రదేశ్‌లో మొత్తం నాలుగు ఎక్స్‌ప్రెస్‌వే ల్యాండింగ్ స్ట్రిప్‌లు అందుబాటులో ఉండగా.. షాజహాన్‌పూర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై ల్యాండింగ్‌ స్ట్రిప్‌ మాత్రమే రాత్రివేళల్లో ఫైటర్‌ జెట్‌లను ల్యాండ్‌ చేసుకోవచ్చు. ఈ ఆధునిక ఎయిర్‌స్ట్రిప్ ఎక్స్‌ప్రెస్‌వేపై నిర్మించబడిన భారత్‌లో తొలి రన్‌వేగా నిలిచింది. ఇది రాత్రింబవళ్ళూ మిలిటరీ ఆపరేషన్లకు అనుకూలంగా రూపొందించింది. భద్రతను నిర్ధారించేందుకు రన్‌వే ఇరుప్రక్కల 250 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. Indian Air Force jets are carrying out a flypast on the Ganga Expressway airstrip.3.5 kms long airstrip is India’s first night landing airstrip on an expressway - night landing trials scheduled today evening. pic.twitter.com/AaJt9RoTEv— The Uttar Pradesh Index (@theupindex) May 2, 2025గంగా ఎక్స్‌ప్రెస్‌వే ఎయిర్‌స్ట్రిప్‌పై ల్యాండింగ్ చేసే ఇండియన్‌ ఎయిర్స్‌ యుద్ధ విమానాల ప్రత్యేకతలు రాఫెల్: ఆధునిక ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్స్, లాంగ్-రేంజ్ మీటియర్ క్షిపణులతో నిండి ఉంది. పరిస్థితులు ఎలా ఉన్నా సరే 100 కిలో మీటర్ల నుంచి 150 కిలోమీటర్ల శత్రు స్థావరాల్ని నేలమట్టం చేయడంలో దిట్టఎస్‌యు-30 ఎంకేఐ: ఇండియా-రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ట్విన్-సీటర్ యుద్ధవిమానం. ఈ ఎస్‌యూ-30 ఎంకేఐ దూరంలో ఉన్న లక్ష్యాల్ని దాడులు చేయగలిగే సామర్థ్యంతో పాటు బ్రహ్మోస్ వంటి క్షిపణులను మోసుకెళ్లగలదు.మిరాజ్ 2000: ఫ్రెంచ్ మూలాలున్న, హై-స్పీడ్ డీప్ స్ట్రైక్ మిషన్స్‌కు అనువైన యుద్ధవిమానం, ఇది అణ్వాయుధ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఫిబ్రవరి 2019లో జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు భారత వైమానిక దళానికి చెందిన 12 మిరాజ్-2000 యుద్ధ విమానాలను వినియోగించింది.మిగ్-29: వేగం, ఎత్తు పరంగా అత్యుత్తమ ప్రదర్శనతో పాటు రాడార్‌ల కళ్లుగప్పి శుత్రు స్థావరాల్ని నాశనం చేస్తుంది. జాగ్వార్: గ్రౌండ్ అటాక్, యాంటీ-షిప్ మిషన్ల కోసం రూపొందించబడిన ప్రిసిషన్ స్ట్రైక్ ఎయిర్‌క్రాఫ్ట్. దీని ప్రత్యేకతలు.. శత్రు నౌకలను గుర్తించడం, లక్ష్యంగా చేసుకోవడం, నాశనం చేస్తుంది. ఈ యాంటీ-షిప్ మిషన్లు సాధారణంగా విమానాలు, జలాంతర్గాములు, ఉపరితల నౌకలు లేదా నావికా ముప్పు నుంచి తప్పించుకునేందుకు ఉపయోగిస్తారు. సి-130 జె సూపర్ హెర్కులిస్: హెవీ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్, స్పెషల్ ఫోర్స్ మిషన్లు, విపత్తు సహాయం, రక్షణ కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తుంది.ఏఎన్-32: ఎత్తైన ప్రాంతాల్లో సైనికులు, సరఫరాలు తరలించేందుకు అనుకూలమైన ట్రాన్స్‌పోర్ట్ విమానం.ఎంఐ-17 వి5 హెలికాప్టర్: సెర్చ్ అండ్ రిస్క్యూ, మెడికల్ ఎవాక్యుయేషన్, మానవతా సహాయం వంటి బహుళ పనుల కోసం ఉపయోగించే హెలికాప్టర్.

India taught me lessons Canadian vlogger reflects on 5 week Journey7
‘భారత్‌.. నాకెన్నో పాఠాలు నేర్పింది.. కానీ ఇక్కడే ఉండలేను కదా!’

భారతదేశం విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలతో కలగలిసిన దేశం. ఈ దేశం తీరు నచ్చిందని ఎందరో విదేశీయులు తన పర్యాటన అనుభవాలను షేర్‌ చేసుకున్నారు. కొందరు ఇక్కడే ఉండాలని డిసైడ్‌ అయ్యారు కూడా. తాజాగా మరో విదేశీయుడు మన భారత్‌ని ఆకాశానికి ఎత్తేలా ప్రశంసల జల్లు కురిపించాడు. అంతేగాదు తాను కచ్చితంగా నేర్చుకోవాల్సిన పాఠాలను ఎన్నో నేర్పిందని చెబుతున్నాడు. అవేంటో అతడి మాటల్లోనే చూద్దామా..!.కెనడియన్ ట్రావెల్ కంటెంట్ సృష్టికర్త విలియం రోస్సీ మన భారతదేశం అంతటా ఐదు రోజులు పర్యటించాడు. ఈ సుడిగాలి పర్యటనలో తాను ఎలాంటి అనుభవాన్ని పొందానో సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకున్నాడు. తాను 37 దేశాలకు పైగా పర్యటించాను గానీ భారత్‌ లాంటి ఆశ్చర్యకరమైన దేశాన్ని చూడలేదన్నారు. ఇక్కడ పీల్చే గాలి, వాసన, కనిపించే దృశ్యాలు, రుచి అన్ని అనుభూతి చెందేలా.. ఆలోచించేలా ఉంటాయని అన్నాడు. అలా అని ఈ దేశంలోనే శాశ్వత నివాసం ఏర్పరుచుకోలేనని అన్నారు. అయితే ఈ ఐదురోజుల సుదీర్ఘ జర్నీలో భారతదేశ పర్యటన భావోద్వేగ, మానసిక మేల్కొలుపులా అనిపించదని చెప్పారు. ఇక్కడ ఉండాలని భావించలేకపోయినా..ఏదో తెలియని భావోద్వేగం.. ఉండిపోవాలనే అనుభూతి అందిస్తోందన్నారు. వ్యక్తిగతంగా తాను తప్పక నేర్చుకోవాల్సిన పాఠాలను కూడా బోధించిందన్నారు. ఇక్కడ పర్యటించడంతోనే తన జీవితాన్ని పూర్తిగా మార్చేసేలా ప్రభావితం చేసిందన్నారు. ఇక్కడి కొత్త ప్రదేశాలు వాటి మాయజాలంతో కట్టిపడేశాయి. భారత్‌ ప్రజల దినచర్యలు అలవాటు చేసుకోమనేలా ఫోర్స్‌చేస్తున్నట్లు అనిపిస్తాయన్నారు. కృతజ్ఞత..ఒకే ప్రపంచంలో రెండు వాస్తవాలను చూపిస్తుందన్నాడు. ఇక్కడ ప్రజలందరూ భిన్నమైన పరిస్థితుల్లో జీవిస్తునన్నారు. ఒక్కరోజు సెలవుతో మిగతా రోజులన్ని కష్టపడి పనిచేయడం తనని ఆశ్చర్యపరిచిందన్నారు. అప్పుడే తనకు కృతజ్ఞత విలువ తెలిసిందన్నారు. ఎందుకంటే విశ్రాంతి తీసుకోవడం పట్ల చాలా కృతజ్ఞతగా ఉండాలని గట్టిగా తెలుసుకున్నా అన్నారు. అంతేగాదు సురక్షితమైన నిద్రస్థలం, ఆహారం నిల్వ చేసుకునే ఫ్రిడ్జ్‌ తదితరాలతో హాయిగా జీవితం గడిపేయగలమనే విషయం కూడా తెలుసుకున్నాని అన్నారు. షాకింగ్‌ గురిచేసే సంస్కృతులు ఆచారాలు.. ఇక్కడ ఉండే విభిన్న సంస్కృతులు ఆచారాలు గందరగోళానికి గురిచేసేలా షాకింగ్‌ ఉంటాయి. అయితే ఒక సంబరం లేదా వేడుక ఇచ్చే అందం, ప్రత్యేకత చాలా గొప్పదని అన్నారు. స్థానిక వంటకాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. ఇక్కడ భారతీయ సుగంధద్రవ్యాలు ఇంతకు ముందెన్నడూ అనుభవించని శక్తిని అందిస్తాయని అన్నారు. ఐకానిక్‌ తాజ్‌మహల్‌ గురించి ఒక పట్టాన అంచనా వేయడం సాధ్యం కాదన్నారు. అయితే ఇక్క ఏ ఫోటో అయినా అద్భుతంగా ఉంటుందన్నారు. మరో ముఖ్యమైన విషయం ప్రజల దయ తనని ఎంతగానో ఆకట్టుకుందని చెప్పారు. ఇక్కడ ఆతిథ్యం మాత్రం సాటిలేనిదని ప్రశంసించాడు. ఎవరీ విలియం రోస్సీలింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, విలియం ఒకప్పుడూ ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌గా ఆరు అంకెలా జీతంతో పనిచేసేవారు. తర్వాత పూర్తి సమయం పర్యాటనలు, కంటెంట్‌ క్రియేటర్‌గా రాణించేందుకు మంచి ఉద్యోగ ఆఫర్‌లను వదులుకున్నాడు. ప్రస్తుతం తన వ్యక్తిగత అభివృద్ధి బ్రాండ్‌ స్ప్రౌట్ నడుపుతూ..వృద్ధి, మనస్తత్వం, అనుభవాల శక్తిపై దృష్టిసారిస్తున్నాడు. కాగా, నెటిజన్లు మా భారతదేశ సంక్లిష్టతను గౌరవించినందుకు ధన్యవాదాలు. అలాగే నిజాయితీగా అనుభవాలను పంచుకున్నందుకు అభినందించకుండా ఉండలేకపోతున్నాం అంటూ విలియంపై ప్రశంసల జల్లు కురిపించారు. View this post on Instagram A post shared by William Rossy (@sprouht) (చదవండి: స్లిమ్‌గా బాలీవుడ్‌ చిత్ర నిర్మాత హన్సల్ మెహతా.. మౌంజారోతో పది కిలోలు..!)

Chandrababu Naidu Yet to Visit Victims of Simhachalam Temple Tragedy8
పరామర్శకూ తీరికలేదా బాబూ!

సింహాచలం అప్పన్న ఆలయంలో హాహాకారాలు.. మృత్యు ఘోష.. ఎవరికైనా బాధనిపిస్తుంది. కాని ఆంధ్రప్రదేశ్‌ సర్కారుకు మాత్రం అవేమీ పట్టినట్లు లేదు. కూటమి నేతలందరూ అమరావతి సంబరంలో మునిగి తేలుతున్నారు. పలుమార్లు శంకుస్థాపనలు జరిగిన అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఇంకోసారి శంకుస్థాపన చేయిస్తున్నారు.సింహాచలంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలి అయింది సామాన్యులే.. అమరావతి హంగామాతో తీవ్రంగా నష్టపోతున్నదీ పేదలే. హిందూ మతంలో ఒక నమ్మకం ఉంటుంది. ఏదైనా ఒక కుటుంబంలో అశుభం జరిగితే నిర్దిష్టంగా కొన్నాళ్లపాటు ఎలాంటి శుభ కార్యక్రమాలు జరపరు. హిందూ మతోద్దారకులమని ప్రచారం చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సనాతన హిందూ అని చెప్పుకునే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు. శంకుస్థాపన కార్యక్రమాలను వాయిదా వేసుకోలేదు. పాలకులు రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను కుటుంబంలా పరిగణిస్తారు. ఆ ప్రకారం చూస్తే ఒక ప్రముఖ ఆలయంలో జరిగిన ఈ దుర్ఘటనలో కొత్తగా కట్టిన గోడ కూలి ఏడుగురు మరణించినా తమ ప్రోగ్రాం ఆపుకోవడానికి ఇష్టపడలేదు. సింహాచలం మృతుల కుటుంబాలను పరామర్శించడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు వెళ్లలేదు.అంటే వారికి ఏదో అనుమానం ఉండబట్టే అటువైపు వెళ్లకుండా ఉన్నట్లు అనిపిస్తుంది.మామూలుగా అయితే ఒక ప్రసిద్ద పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఘటనలు సంభవిస్తే వెంటనే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు అంతా వెళ్లి సహాయ చర్యలను పర్యవేక్షించి బాధితులకు స్వాంతన చేకూర్చడానికి యత్నిస్తారు. కాని వీరిద్దరూ ఆ పని చేయలేదు. కొద్ది నెలల క్రితం వైకుంఠ ఏకాదశి టిక్కెట్ల కోసం తిరుపతి వెళ్లిన వేలాది భక్తులు తొక్కిసలాటకు గురయ్యారు. ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఆ తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు. ఆ సమాచారం వచ్చిన వెంటనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు పోటీ పడి తిరుపతి వెళ్లారు.ఏదో చేస్తున్నట్లు హడావుడి చేశారు. అలాంటి వారు సింహాచలం ఎందుకు వెళ్లలేదు? ప్రధాని మోడీ అమరావతి వస్తున్నందున వెళ్లలేక పోయారని చెప్పవచ్చు కానీ మూడు గంటల ఖాళీ కూడా లేదనడం అతిశయోక్తి అవుతుంది. పైగా ఇప్పుడు వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కడ నుంచైనా పర్యవేక్షణ చేయవచ్చు. పవన్ కళ్యాణ్ కు ఆ ఇబ్బంది లేదు కదా?మరి ఆయన ఎందుకు సింహాచలం వెళ్లలేదు? దీనికి రెండు,మూడు కారణాలు చెబుతున్నారు. అక్కడకు వెళ్లితే భక్తులలో ఉన్న కోపం అంతా తమపై చూపే అవకాశం ఉందని, వారు ప్రభుత్వ నిర్వాకంపై నిలదీస్తే ఇబ్బంది అవుతుందని అనుకుని ఉండవచ్చ అంటున్నారు. అమరావతి పునః శంకుస్థాపన పనుల పేరుతో తప్పించుకునే అవకాశం ఉండడం. మరొకటి చావుల వద్దకు వెళ్లి రావడం అశుభం అని ఎవరైనా సలహా ఇచ్చారేమో తెలియదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు నిజంగానే హిందూ మతాచారాలపై అంత శ్రద్దగా ఉంటారా అంటే అదీ గ్యారంటీ లేదు. ఏ మతం వారివద్దకు వెళ్లితే ఆ మతమే గొప్పదని చెప్పి వస్తుంటారు. రాజకీయాల కోసం మతాన్ని వాడుకుంటారు.గత గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబు కుటుంబం స్నానమాచరించే ఘట్టాన్ని సినిమా తీయడం కోసం సామాన్య భక్తులను నిలిపి వేయడం, ఒక్కసారిగా గేటు తెరవడం వల్ల తొక్కిసలాట జరిగి 29 మంది మరణించడం జరిగింది. అప్పుడు చంద్రబాబు తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో యత్నాలు చేశారు. చివరికి రోడ్డు ప్రమాదాలలో చనిపోవడం లేదా? కుంభమేళాలో చనిపోలేదా? అంటూ వితండ వాదం చేశారు. అంతే తప్ప అంత పెద్ద ఘటన జరిగితే మామూలుగా అయితే పదవి నుంచి తప్పుకుంటారు. ప్రాంతీయ పార్టీ కనుక ఆయనను పార్టీలో ఎవరూ ప్రశ్నించరు కనుక ఆ ప్రస్తావనే ఉండదు. పోనీ కనీసం ఒక కానిస్టేబుల్ పై కూడా చర్య తీసుకోకపోవడం విశేషం. తిరుపతి తొక్కిసలాట ఘటన జరిన తర్వాత పవన్ కళ్యాణ్ క్షమాపణల డ్రామా తెలిసిన సంగతే.చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌లు ఏమి మాట్లాడింది అందరికి తెలుసు. అక్కడ చైర్మన్ లేదా, అధికారులపై చర్య తీసుకోలేదు. వారిని పదవుల నుంచి తప్పించలేదు. నిజంగా హిందూ మత విశ్వాసాలు నమ్మేవారైతే అలా చేస్తారా? అన్న విమర్శలను పలువురు చేశారు. చివరికి ఒక రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. గోదావరి పుష్కరాల మరణాలపై వేసిన కమిషన్ ఏ తరహా రిపోర్టు ఇచ్చిందో, తిరుపతి ఘటనపై కూడా రిపోర్టు అందుకు భిన్నంగా వస్తుందా అన్నది కొందరి సందేహం. పుష్కరాల తొక్కిసలాటలో తప్పు భక్తులదే అని ఆ కమిషన్ తేల్చింది. ఇప్పుడు సింహాచలం ఘటనపై కూడా విచారణ కమిటీని నియమించినా, ఎంతవరకు ప్రయోజనం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. గోడ కూలడానికి నాణ్యత లోపమని కాకుండా, భక్తుల రద్దీ, తోపులాట అని నివేదికలు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో ఆలయాలలో ఏ చిన్న ఘటన జరిగినా, దాని వెనుక టీడీపీ, జనసేన రాజకీయ శక్తుల ప్రమేయం ఉన్నా, దానినంతటిని జగన్ కు ఆపాదించి ఎంత రచ్చ చేసేవారో గుర్తు చేసుకుంటేనే కంపరం కలుగుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత సైతం అదే ధోరణి ప్రదర్శించారు. తిరుమల లడ్డూ లో జంతు కొవ్వు కలిసిదంటూ దారుణమైన అసత్యాన్ని చంద్రబాబు, పవన్ లు ప్రజలకు చెప్పారు. దీనివల్ల కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని, దైవానికి అపచారం చేసినట్లు అవుతుందని వారు ఫీల్ కాలేదు. తమ రాజకీయ ప్రయోజనం కోసం ఎంతకైనా దిగజారతామన్నట్లుగా వారు వ్యవహరించారు. ఈ ఘటన తర్వాత పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకు వేసి తాను అన్ అప్పాలజిటిక్ సనాతన హిందూ అని ప్రకటించుకుని కొత్త వేషం కట్టారు.అసలు సనాతన హిందూయిజం ఏమి చెబుతుందో తెలియకుండానే, తానేదో వేద శాస్త్రాలు అన్నిటిని పుక్కిట పట్టినట్లుగా మాట్లాడారు. విశేషం ఏమిటంటే ఆయన భార్య విదేశీయురాలు. క్రైస్తవ మతానికి చెందిన వారు.అలాగే పవన్ కు పుట్టిన వారు సైతం క్రైస్తవమే తీసుకున్నారు. మరి అక్కడ ఈయన సనాతనమేమైందో తెలియదు. అనవసరంగా సినిమా డైలాగులు చదివితే ఇలాంటి అప్రతిష్టే వస్తుంది. చంద్రబాబు తన రాజకీయం కోసం ఏ మతాన్ని అయినా వాడుకోగలరు.ఆయన తెలివితేటలు వేరు.ఆయనను మించి ఏదో చేసి బీజేపీ వారి మెప్పు పొందాలని పవన్ చేస్తున్న ఈ ప్రయత్నాల వల్ల ఆయన పరువు పోగొట్టుకుంటున్నారు. పోనీ నిజంగానే అంత సనాతన హిందూ అయితే సింహాచలం ఎందుకు వెళ్లలేదు.ఒక సంతాప సందేశం ఇచ్చి వదలివేశారే.అమరావతి కార్యక్రమ ఆహ్వానంలో తన పేరు వేయలేదని మొదట అలిగారని, దాంతో ప్రభుత్వం మరో కార్డు వేసిందని చెబుతున్నారు. తన డిమాండ్ నెరవేరకపోతే ఏమైనా సింహాచలం వెళ్లేవారేమో. తిరుమల గోవుల మరణాలు, కాశీనాయన క్షేత్రంలో భవనాల కూల్చివేత, తిరుమల, బ్రహ్మం గారి మఠం తదితర ఆధ్యాత్మిక కేంద్రాలలో మత్తు పదార్ధాల వాడకం వంటి ఆరోపణలు వస్తున్నా ఈ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టలేక పోతోందన్న విమర్శలు వస్తున్నాయి. సింహాచలంలో చందనోత్సవానికి ఐదుగురు మంత్రుల కమిటీ కూడా ఉందట. వారంతా ఏమి చేశారో తెలియదు. కాని గోడ కూలి ఏడుగురు మరణించారు. చిన్న ఆలయ గోడ నిర్మాణమే చేయలేని వారు రాజధాని నిర్మాణం చేస్తారట అంటూ సోషల్ మీడియాలో వ్యంగ్య వ్యాఖ్యానాలు వచ్చాయి.అదే టైమ్ లో జగన్ విజయవాడ వద్ద కృష్ణానదికి కట్టిన రిటైనింగ్ వాల్ ఏ రకంగా స్ట్రాంగ్ గా ఉందీ వివరిస్తూ కూడా వీడియోలు వచ్చాయి. సింహాచలం ఘటన తర్వాత జగన్ వెంటనే అక్కడకు వెళ్లి మృతుల కుటుంబాలకు భరోసా ఇచ్చివచ్చారు. చంద్రబాబు, పవన్ లు మాత్రం సాకులు వెతుక్కుంటూ కూర్చున్నారు. ఎల్లో మీడియా మాత్రం సింహాచలం ప్రమాదాన్ని తగ్గించి చూపడానికి నానా పాట్లు పడింది. ఏది ఏమైనా మత సెంటిమెంటును రాజకీయాలకు వాడుకోవడం మంచిది కాదు.అది ఎప్పటికైనా వారికే తగులుతుంది.ఈ నేపథ్యంలో పాలకులు చేసే పాపాలు తమకు శాపాలుగా మారుతున్నాయని ప్రజలు సెంటిమెంట్ గా భావించే పరిస్థితి ఏర్పడింది. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Case Filed Against Vijay Devarakonda Over His Speech in Retro Pre Release Event9
విజయ్‌ దేవరకొండపై కేసు! ఎందుకంటే?

సాక్షి, హైదరాబాద్‌: హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) చిక్కుల్లో పడ్డాడు. గిరిజన ప్రజల గురించి తప్పుగా మాట్లాడారంటూ ట్రైబల్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ కిషన్‌ రాజ్‌ చౌహాన్‌.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే విజయ్‌పై కేసు నమోదైనట్లు తెలుస్తోంది.ఏం జరిగిందంటే?సూర్య హీరోగా నటించిన రెట్రో సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు విజయ్‌ దేవరకొండ ముఖ్య అతిథిగా వెళ్లాడు. అతడు మాట్లాడుతూ.. ఏప్రిల్‌ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కశ్మీర్‌ ఇండియాది. కశ్మీరీలు మనవాళ్లే.. రెండేళ్ల క్రితం ఖుషీ సినిమా షూటింగ్‌ అక్కడే జరిపాం. అక్కడ చాలామంచి జ్ఞాపకాలున్నాయి. పాకిస్తాన్‌ వాళ్లు.. అక్కడి ప్రజలనే చూసుకోలేరు.. అలాంటిది ఇక్కడేం చేయాలని చూస్తున్నారో!ఇండియా.. పాకిస్తాన్‌పై దాడి చేయాల్సిన అవసరం లేదు. అక్కడి ప్రజలకే విరక్తి వచ్చి పాక్‌ ప్రభుత్వంపై తిరగబడతారు. 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్‌ (గిరిజనులు) కొట్టుకున్నట్లు.. బుద్ధి లేకుండా, కనీస కామన్‌ సెన్స్‌ లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు. మనమంతా ఐకమత్యంగా ఉండాలి అని స్పీచ్‌ ఇచ్చాడు. ఉగ్రవాదులను గిరిజనులతో పోల్చడంపై వ్యతిరేకత వచ్చింది. What a speech anna @TheDeverakonda ❤️🙌🏻#RetrofromMay01 #VijayDevarakonda #KINGDOM pic.twitter.com/653qCLhlu8— The Revanth (@Revanth__7) April 26, 2025 చదవండి: 21 రోజుల్లో 15 కిలోలు తగ్గా.. ఆ సీక్రెట్‌ మాత్రం చెప్పను: రకుల్‌ భర్త

haldi ceremony Bride to be enters dressed as dinosaur viral video10
హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్‌!

పెళ్లి అంటే ఆ సందడే వేరుంటుంది. నిశ్చితార్థం దగ్గర్నుంచి, పసుపుకొట్టడం, పెళ్లి కూతుర్ని చేయడం, హల్దీ, సంగీత్‌, బారాత్‌ ఇలా ప్రతీదీ చాలా ఘనంగా ఉండాలని ప్లాన్‌ చేసుకుంటారు. ఆకాశమంత పందిరి, భూదేవి అంత పీట అన్నట్టు సాగుతుంది ఈ సందడి. అలాగే బంధువులు, సన్నిహితులు, వధూవరుల ఫ్రెండ్స్‌ చేసే అల్లరి, అనుకోని సర్‌ప్రైజ్‌లు, సరదా సరదా సంఘటనలు చాలా కామన్‌. కానీ స్వయంగా పెళ్లి కూతురే అక్కడున్న వారందరికీ షాకిస్తే... పదండి అదేంటో చూద్దాం.న్యూఢిల్లీకి చెందిన ఓ జంట పెళ్లి వేడుకల్లో భాగంగా జరిగిన హల్దీ వేడుక (haldi ceremony) నెట్టింట సందడిగా మారింది. వధువు చేసిన సర్ప్రైజ్ అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ అవుతోంది. అక్కడంతా పెళ్ళికి వచ్చిన అతిథులతో అంతా హడావిడిగా ఉంది. హల్దీ వేడుకలో అందరూ పెళ్లికూతురి రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలోనూ ఉన్నట్టుండి డైనోసార్‌ ఎంట్రీ ఇవ్వడంతో అతిథులంతా షాక్‌ అయ్యారు. అందర్నీ పలకరిస్తూ తెగ సందడి చేసింది. అందరితో కలిసి డ్యాన్స్‌ చేసింది. పెళ్లి కొడుకును కూడా కవ్వించి, సరదాగా ఆటపట్టిస్తూ కాసేను స్టెప్పులేసింది. ఆ తరువాత అసలు విషయం తెలిసాక వేదిక అంతా అందమైన నవ్వులు పూసాయి. అలా వచ్చింది మరెవ్వరో కాదు స్వయంగా వధువే. ఊహించని విధంగా విచిత్రమైన అలంకరణతో రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. View this post on Instagram A post shared by Malkeet Shergill | Anchor | Wedding Host (@malkeetshergill)తనకు కాబోయే భార్య చిలిపితనం, ఊహించని గెటప్ చూసి వరుడు కూడా నవ్వుతూ, సిగ్గుల మొగ్గయ్యాడు. ఆ తరువాత ముసి ముసి నవ్వులతో కాబోయే జంట స్టెప్పులేయడం విశేషం. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ మల్కీత్ షెర్గిల్ అప్‌లోడ్ చేసిన వీడియోలో, "కభీ ఐసా కుచ్ దేఖా హై?" అనే క్యాప్షన్‌తో ఈ వీడియో షేర్‌ అయింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. మీ క్రియేటివిటీకి ఓ దండం రా బాబూ అని ఒకరంటే, ఇలా ఉన్నారేంట్రా బాబూ అని మరికొందరు కామెంట్ చేశారు. గాడ్జిల్లా కాదు బ్రైడ్జిల్లా అని కామెంట్‌ చేయడం విశేషం.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement