Top Stories
ప్రధాన వార్తలు

కేంద్ర నిధులను మింగేద్దాం ‘టీవీ’గా..
అంగన్వాడీ కేంద్రాలకు వస్తువుల కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా మింగేసేందుకు కూటమి కీలక నేతలు పెద్ద స్కెచ్ వేశారు. ‘సాక్షం అంగన్వాడీ పోషన్-2‘ అభియాన్ ద్వారా.. ఆరేళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహార పంపిణీ, వస్తువుల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని అంగన్వాడీల బలోపేతానికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం రూ.100 కోట్లు ఇచ్చింది. ఈ మొత్తంలో రూ.25 కోట్లతో అంగన్వాడీల్లో స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇక్కడే అసలు తంతు మొదలైంది. కేంద్ర నిధుల్లో స్మార్ట్‌గా కమీషన్లు కొట్టేసేందుకు కూటమి నేతలు పథక రచన చేశారు. - సాక్షి, అమరావతి » రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 9,664 సెంటర్లలో కేంద్ర నిధులతో తొలి దశలో స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కొక్క టీవీకి రూ.25 వేల చొప్పున కేటాయించారు. ఇందుకోసం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ (జీఈఎం) పోర్టల్ ద్వారా గత ఏడాది అక్టోబరులో టెండర్ పిలిచారు. » పేరున్న కంపెనీలకు చెందిన 11 సంస్థలు బిడ్స్ దాఖలు చేశాయి. వాటిలో 6 సంస్థలను టెక్నికల్‌గా టెండర్ కమిటీ అనర్హమైనవి (డిస్ క్వాలిఫై) చేసింది. ఇక మిగిలినవారిలో ఎవరికైనా టెండర్ ఖరారు చేశారా? అంటే అదీ లేదు. కారణం చెప్పకుండానే అర్థంతరంగా టెండర్‌ను రద్దు చేశారు. కమీషన్లకు సంబంధించిన డీల్ కుదరకపోవడమే దీనికి కారణమని విశ్వసనీయంగా తెలిసింది. ముందస్తు ఒప్పందాలతో మళ్లీ టెండర్ ప్రక్రియ రెండోసారి అనుకూలమైన కాంట్రాక్ట్ సంస్థలతో కొందరు కీలక నేతలు, అధికారులు కలిసి ముందస్తు ఒప్పందాలతోనే మళ్లీ టెండర్ ప్రక్రియ చేపట్టినట్టు విమర్శలు వస్తున్నాయి. కేంద్రం నిధులు సకాలంలో ఖర్చు చేయకుంటే మురిగిపోతాయనే సాకుతో మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి రూ.25 కోట్లను ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్)కి ఈ ఏడాది ఫిబ్రవరిలో బదిలీ చేశారు. దీన్ని అడ్డుపెట్టుకుని ఏపీటీఎస్ ద్వారా మార్చిలో మళ్లీ టెండర్ ప్రక్రియ చేపట్టారు. ఇదిగో అసలు కథ ముందస్తు ఒప్పందాలతో తమకు నచ్చిన సంస్థలకు టెండర్ కట్టబెట్టేలా నిబంధనలను మార్చేశారు. మొదటి టెండర్ నిబంధనల్లో ప్రస్తావించిన బిడ్స్ దాఖలు చేసే కంపెనీలు డీఎల్ఈడీ, ఈఎల్‌ఈడీ అనేది ఉండాలని, మూడేళ్లలో 9,800 టీవీలు సరఫరా చేసిన అనుభవం ఉండాలని, తాము చెప్పిన ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) మాత్రమే ఉండాలనే తదితర కీలక షరతులను రెండో టెండర్ ప్రక్రియలో లేకుండా చేశారు. దీంతో మొదటి టెండర్ ప్రక్రియలో 11 సంస్థలు బిడ్స్ వేస్తే.. రెండో టెండర్లో మూడు సంస్థలు మాత్రమే బిడ్స్ వేశాయి. ఇదంతా ముందుగా ఎంచుకున్న సంస్థకు లబ్ధి చేకూర్చడానికేనని స్పష్టమవుతోంది.

Goa: దేవాలయంలో తొక్కిసలాట.. ఆరుగురు భక్తులు మృతి
ఢిల్లీ: గోవాలో విషాదం చోటు చేసుకుంది. శిర్గావ్ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ విషాదంలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. 30 మందికి పైగా త్రీవ గాయాలయ్యాయి. గాయపడ్డ బాధితుల్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. Goa Congress is deeply saddened by the stampede at Jatrotsav of Shree Lairai Devi,Shirgao. We condemn this tragic incident and offer heartfelt condolences to the families who lost their loved ones. Wishing a speedy recovery to all those injured. 🙏@DrAnjaliTai @ViriatoFern pic.twitter.com/7kL6uNkBEi— Goa Congress (@INCGoa) May 3, 2025ఉత్తర గోవాలోని బిచ్లిమ్ జిల్లా తాలూకా శిర్గావ్ గ్రామంలో ప్రతీ ఏడాది మే 2న ఘనంగా నిర్వహించే పార్వతి దేవి(Shri Lairai Zatra) జాతర ఈ ఏడాది విషాదాన్ని నింపింది. ఈ శుక్రవారం (మే2) జాతర జరిగే సమయంలో తొక్కిసలాట ఆరుగు భక్తుల ప్రాణాల్ని తీసింది. పోలీసుల సమాచారం మేరకు శుక్రవారం జాతరను నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఈ జాతరలో పాల్గొని, అమ్మవారికి మొక్కులు తీర్చుకునేందుకు సమారు 50వేల నుంచి 70 వేల మంది భక్తులు హాజరయ్యారు. జాతర ప్రారంభమైంది. సరిగ్గా జాతర జరిగే మార్గంలో ఎతైన ప్రదేశంలో ఉన్న భక్తులు ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చారు. అదుపు తప్పి భక్తులు ఒకరిపై ఒకరు మీద పడ్డారు. దీంతో ఊపిరాడక ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. 30 మందికి తీవ్రగాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు గోవా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.(బాధితుల్ని పరామర్శిస్తున్న గోవా సీఎం ప్రమోద్ సావంత్)ప్రమాదంపై సమాచారం అందుకున్న గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు. ఘటన జరిగిన ప్రదేశంలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

పాక్‌పై భారత్ దాడికి సాక్ష్యం ఏది?.. కాంగ్రెస్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇలాంటి తరుణంలో 2016లో పాకిస్తాన్‌పై నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ విషయమై కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించి రుజువు చూపించాలని అడగటం తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతకు మరోసారి బీజేపీ కౌంటరిచ్చింది.వివరాల ప్రకారం.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం తర్వాత పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఎంపీ చరణ్‌జీత్ సింగ్ చన్నీ మీడియాతో మాట్లాడుతూ..‘పహల్గాం దాడి తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలకు మేము కట్టుబడి ఉన్నాం. ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం. దాడి వెనుక ఉన్న వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ పాకిస్తాన్ హస్తం ఉంటే వారికి తగిన బుద్ది చెప్పాలని కోరుతున్నాం. కానీ, 2016లో పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్, 2019 బాలాకోట్ వైమానిక దాడులకు సంబంధించి మాత్రం మాకు అనుమానాలు ఉన్నాయి. ఈ దాడుల విషయంలో గందరగోళం కనిపిస్తోంది. మన దేశంపై బాంబు వేస్తే మనకు తెలియదా?. పాకిస్తాన్లో సర్జికల్ స్ట్రైక్ నిర్వహించామని వారు అంటున్నారు. కానీ, అక్కడ ఇలాంటిదేమీ జరగలేదు. ఎవరూ దీని గురించి మాట్లాడలేదు. సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. దీనిపై నేను మొదటి నుండి డిమాండ్ చేస్తున్నాను. మన దేశ ప్రజలకు అన్ని విషయాలు తెలియాలి’ అని కామెంట్స్ చేశారు.SICK!Rahul Gandhi's Congress continues to defend Pakistani terror!Now Charanjeet Singh Channi questions our forces.Why is Congress demoralising our forces at this critical time.Congress is taking orders directly from Pakistan!#PehalgamTerroristAttack pic.twitter.com/b2MIexdAQA— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) May 2, 2025ఇక, కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తూ కౌంటరిచ్చింది. కాంగ్రెస్ పార్టీ నేతలు మన దేశ సాయుధ దళాల పనితీరును ప్రశ్నిస్తున్నారని ఆరోపించింది. ఆయన వ్యాఖ్యలపై ఢిల్లీ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా స్పందిస్తూ..‘కాంగ్రెస్ మళ్లీ మన దేశ సైన్యాన్ని మరియు వైమానిక దళాన్ని ప్రశ్నించింది. సర్జికల్ స్ట్రైక్ జరిగిందని తాను నమ్మడం లేదని.. తనకు రుజువు కావాలని చన్నీ అన్నారు. కాంగ్రెస్, గాంధీ కుటుంబం ఎలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉందో ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలి. వారు భారత సైన్యం, వైమానిక దళం అబద్ధాలు చెబుతున్నారని, పాకిస్తాన్ నిజం చెబుతోందని పదే పదే ఆరోపిస్తున్నారు. పాకిస్తాన్ స్వయంగా సర్జికల్ స్ట్రైక్ నిర్వహించిందని చెప్పినప్పటికీ వీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు. సర్జికల్ స్ట్రైక్‌పై మీకు నిజంగా రుజువు కావాలంటే.. రాహుల్ గాంధీతో కలిసి చన్నీ.. పాకిస్తాన్ సందర్శించి దాడి ఎక్కడ జరిగిందో తనిఖీ చేయండి అంటూ కౌంటరిచ్చారు.మరోవైపు.. సదరు కాంగ్రెస్ ఎంపీ చన్నీకి బీజేపీ నుంచి కౌంటర్ రావడంతో ఆయన మాట మార్చారు. తాను సర్జికల్ దాడుల గురించి ఆధారాలు అడగలేదని మాట మార్చారు. అనంతరం, పాకిస్తాన్ విషయంలో భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతు ఇస్తానని ప్రకటించారు. అయితే, ఆయన వ్యాఖ్యల కారణంగా కాంగ్రెస్ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది.

ఈ రాశి వారు కొత్త కార్యక్రమాలు చేపడతారు.. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు.
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: శు.షష్ఠి ప.1.20 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: పునర్వసు సా.5.47 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం: ఉ.6.03 నుండి 7.37 వరకు, తదుపరి రా.1.46 నుండి 3.22 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.03 నుండి 7.14 వరకు, అమృతఘడియలు: ప.3.27 నుండి 5.02 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.37, సూర్యాస్తమయం: 6.15.మేషం: కొన్ని పనుల్లో ప్రతిబంధకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. శ్రమాధిక్యం. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.వృషభం: ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. స్వల్ప ధనలాభం. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రగతి కనిపిస్తుంది.మిథునం: మిత్రులతో విభేదాలు. ప్రయాణాలలో అవాంతరాలు. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు కలసిరావు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.కర్కాటకం: శుభవార్తా శ్రవణం. కుటుంబంలో ఉత్సాహవంతంగా ఉంటుంది. ఏ పని చేపట్టినా విజయమే. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. దైవచింతన.సింహం: వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. శ్రమ తప్పదు. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.కన్య: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలను సమయానికి పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.తుల: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.వృశ్చికం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో వివాదాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.ధనుస్సు: వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆత్మీయులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.మకరం: సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. దైవదర్శనాలు. శుభవర్తమానాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు.కుంభం: సన్నిహితులతో విభేదిస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చిక్కులు.మీనం: కార్యజయం. ధనలాభ సూచనలు. ప్రముఖులతో పరిచయాలు. నూతన ఉద్యోగలాభం. సోదరుల నుంచి పిలుపు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

‘పాక్‌పై భారత్ దాడి చేస్తే ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమిస్తాం’
ఢాకా/న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు పాకిస్తాన్‌పై భారత్ దాడి చేసిన పక్షంలో చైనా సాయంతో ఏడు ఈశాన్య రాష్ట్రాలను స్వాధీనం చేసుకుంటామని బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు యూనుస్ సలహాదారు ఏఎల్ఎం ఫజ్రుల్ రెహ్మన్ బెదిరింపులకు దిగారు. ఈ మేరకు ఆయన తన ఫేస్బుక్ ఖాతాలో మంగళవారం బెంగాలీలో రాసుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.ఈ సందర్భంగా ఏఎల్ఎం ఫజ్రుల్ రెహ్మన్..‘భారత ఈశాన్య రాష్ట్రాల ఆక్రమణకు సంయుక్త సైనిక ఏర్పాట్ల కోసం చైనాతో చర్చలు జరపాల్సిన అవసరం చాలా ఉందని అందులో సూచించారు. ఇక, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహ్మద్ యూనస్‌కు రహ్మాన్ అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. అయితే, ఈ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని విదేశాంగ శాఖ తెలిపింది. ఇటువంటి వాటిని తాము ప్రోత్సహించం, బలపరచం అని స్పష్టం చేసింది. వ్యక్తిగత అభిప్రాయాలను ప్రభుత్వంతో ముడిపెట్టవద్దని కూడా కోరింది. పొరుగుదేశాలతో శాంతియుత సంబంధాలను కొనసాగించాలన్నదే తమ అభిమతమని వివరించింది.ఇదిలా ఉండగా.. భారత్ విషయంలో పాకిస్తాన్ మరో స్టాండ్ తీసుకున్నట్టు సమాచారం. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు భారత్ ప్రకటించడాన్ని నిరసిస్తూ ఢిల్లీకి లాంఛనంగా దౌత్య నోటీసు ఇవ్వాలని పాకిస్తాన్ యోచిస్తోంది. ఈ మేరకు శుక్రవారం ఎక్స్‌ప్రెస్ న్యూస్ వార్తా కథనం వెల్లడించింది. పాక్ విదేశీ, న్యాయ, జలవనరుల మంత్రిత్వశాఖల మధ్య జరిగిన ప్రాథమిక చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపింది.

ఫోర్త్ సిటీ ముచ్చర్లలో 200 ఎకరాల జూ పార్కు.. అందుబాటులోకి ఎప్పుడంటే?
విదేశీ జంతు జాతులను కనులారా చూసి ఆనందించాలని ఉందా? వేరే దేశంలోనో, దూర ప్రాంతాలకు వెళ్లో ఈ వన్యప్రాణులను చూసి రావటం అసాధ్యమని భావిస్తున్నారా? అయితే.. మీరు ఏమాత్రం చింతించనవసరంలేదు. రెండేళ్లు ఆగితే మన వద్దే ఎగ్జోటిక్ జూ పార్కు (విదేశీ జంతు ప్రదర్శన శాల) అందుబాటులోకి వచ్చే అవకాశముంది. నగర శివారులోని ముచ్చర్లలో ఇది ఏర్పాటు కానుంది. 200 ఎకరాల్లో విదేశీ (అన్యజాతి) జంతు ప్రదర్శన శాల సందర్శకులకు కనువిందు చేయనుంది. సింగపూర్ జూ తరహాలో దీనిని రూపుదిద్దనున్నారు. పీపీపీ పద్ధతిలో తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీఎఫ్‌డీసీ) ఆధ్వర్యంలో ఈ జూ పార్కును ఏర్పాటు చేయనున్నారు.రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్ల గ్రామ శివారు అటవీ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం స్థలం కేటాయించింది. ప్రపంచంలోని ఇతర దేశాలకు చెందిన జంతువులను మాత్రమే ఇక్కడ ఉంచుతారు. ఇతర జూ పార్కులతో పాటు పెద్ద పెద్ద ఫామ్స్‌లలో పెంపకం చేపట్టే వారి వద్ద నుంచి వివిధ రకాల జంతువులను ఇక్కడికి తరలించి సందర్శకులకు అందుబాటులో ఉంచనున్నారు. రానున్న రెండేళ్లలో ఈ ఎగ్జోటిక్ యానిమల్ జూ పార్కు అందుబాటులోకి రానుంది. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ నగరాలకు తోడు నాలుగో సిటీగా ఏర్పడనున్న ఫ్యూచర్ సిటీకి దగ్గరల్లో విదేశీ జంతు ప్రదర్శన శాల అందుబాటులోకి రానుంది. పాతబస్తీ చాంద్రాయణగుట్ట మీదుగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కలుపుతూ ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రైలు కారిడార్ ఎక్స్టెన్షన్ ఏర్పాటు కానున్న దృష్ట్యా కొత్తగా ఏర్పడనున్న ఈ జూ పార్కుకు రోడ్డు మార్గంతో పాటు మెట్రో రైలు సేవలు కూడా అందుబాటులో ఉండనున్నాయి. అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్)తో పాటు రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) తదితర అత్యంత సౌకర్యవంతమైన రవాణా సౌకర్యం సందర్శకులకు అందుబాటులో ఉంటుంది. ఈ జూ పార్కుతో పాటు మరో 1,500 ఎకరాల అటవీ ప్రాంతాన్ని జూ సఫారీ పార్కు ఏర్పాటు చేయడానికి అధికారులు పరిశీలిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం 380 ఎకరాల్లో 2,200 జంతువులతో కొనసాగుతున్న నెహ్రూ జూ పార్కుకు అదనంగా ఈ విదేశీ జంతు ప్రదర్శన శాల అందుబాటులోకి రానుంది. ఏయే దేశాల నుంచి.. ఆఫ్రికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆ్రస్టేలియా దేశాలకు చెందిన జంతు జాతులను ఎగ్జోటిక్ యానిమల్ జూ పార్కుకు తరలించనున్నారు. నెహ్రూ జూ పార్కులోని జంతువులు అక్కడే ఉండనున్నాయి. ఒకవైళ ఇప్పటికే ఇక్కడ ఉన్న విదేశీ జంతువుల సంతానం పెరిగితే వాటిని మాత్రమే అక్కడికి తరలించనున్నారు. జంతు మార్పిడిలో భాగంగా ఇతర దేశాల్లోని జూ పార్కుల నుంచి అవసరమైన జంతు జాతులను కొత్త జూ పార్కుకు తరలించనున్నారు. అలాగే.. ప్రైవేట్ యాజమాన్యాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఫామ్స్ నుంచి జంతువులను ఖరీదు చేసి ఇక్కడికి తీసుకురానున్నారు. నెహ్రూ జూ పార్కులో కొనసాగుతున్న ప్రస్తుత జంతు సేకరణకు భిన్నంగా ఈ ప్రక్రియ కొనసాగనుంది. దేశంలోనే అతిపెద్దగా.. 200 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఎగ్జోటిక్ యానిమల్ జూ పార్కు దేశంలో అతి పెద్దది కానుందని జూ పార్కు అధికారులు తెలిపారు. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రం మైసూర్‌లోని శ్రీ చామరాజేంద్ర జంతు ప్రదర్శన శాల (మైసూర్ జూ)లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర దేశాల జంతువులకు ఆవాసంగా కొనసాగుతోంది. అంతరించిపోతున్న జంతు జాతుల పరిరక్షణ జరుగుతోంది. దీనికి తోడు ఆదాయంతో పాటు సందర్శకులకు వినోదం లభిస్తోంది. ఈ తరహాలోనే నగర శివారు ముచ్చర్లలో విదేశీ జంతు ప్రదర్శన శాల ఏర్పాటు కానుంది. అయితే ముచ్చర్ల జూ పార్కు మైసూర్ జూ పార్కు కన్నా.. విశాలంగా ఏర్పాటు కానుంది.పనులు చకచకా.. విదేశీ జంతు ప్రదర్శన శాల ఏర్పాటుకు పనులు చకచకా జరుగుతున్నాయి. ముచ్చర్లలో ఈ జూ పార్కు రూపుదిద్దుకోనుంది. దీంతో పాటు అక్కడే దాదాపు 1,500 ఎకరాల అటవీ స్థలాన్ని సైతం సఫారీ పార్కుకు కోసం పరిశీలిస్తున్నాం. రానున్న రెండేళ్లలో కొత్త జూ పార్కు సందర్శకులకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.– డాక్టర్ సునీల్ ఎస్.హీరేమత్, డైరెక్టర్, తెలంగాణ జూ పార్క్స్.

అమెరికాలో ఇక మేడిన్ ఇండియా ఐఫోన్లే!
న్యూఢిల్లీ: జూన్ త్రైమాసికంలో అమెరికాలో విక్రయించే మెజారిటీ ఐఫోన్లు భారత్‌లో తయారైనవే ఉంటాయని టెక్ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. ఐప్యాడ్, మ్యాక్, యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ మొదలైనవి వియత్నాంలో తయారైనవి ఉంటాయని పేర్కొన్నారు. ఇతరత్రా దేశాల్లో విక్రయించే ఉత్పత్తులు మాత్రమే అత్యధికంగా చైనాలో తయారవుతాయని పేర్కొన్నారు.చైనా నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై అమెరికా భారీగా టారిఫ్‌లు ప్రకటించిన నేపథ్యంలో కుక్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొంత మినహాయింపులున్నా, వివిధ టారిఫ్‌లను కలిపితే చైనా నుంచి ఎగుమతి చేసే తమ ఉత్పత్తులపై ఏకంగా 145 శాతం సుంకాలు వర్తిస్తాయని కుక్ తెలిపారు.ఎస్అండ్పీ గ్లోబల్ విశ్లేషణ ప్రకారం 2024లో అమెరికాలో ఐఫోన్ విక్రయాలు 7.59 కోట్లుగా ఉండగా, మార్చిలో భారత్ నుంచి 31 లక్షలు ఎగుమతయ్యాయి. టారిఫ్ రేట్లు, పాలసీలు ప్రస్తుతం ఉన్నట్లుగానే కొనసాగితే జూన్ త్రైమాసికంలో తమ వ్యయాలపై రూ. 900 మిలియన్ డాలర్ల మేర ప్రతికూల ప్రభావం పడుతుందని కుక్ చెప్పారు.

టైటాన్స్ ఏడో గెలుపు.. రైజర్స్ ఏడో ఓటమి
ఐపీఎల్లో గత సీజన్ రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ‘ప్లే ఆఫ్స్’ వెళ్లే అవకాశాలకు దాదాపు తెరపడినట్లే! హైదరాబాద్ జట్టు అధికారికంగా ఇంకా నిష్క్రమించకపోయినా ఏడో ఓటమితో సమీకరణాలన్నీ సంక్లిష్టంగా మారిపోయాయి. ఆశలు నిలవాలంటే గుజరాత్‌పై కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ పేలవ బౌలింగ్‌తో ఓటమిని మూటగట్టుకుంది. సొంత మైదానంలో గిల్, బట్లర్, సుదర్శన్ బ్యాటింగ్‌తో భారీ స్కోరు నమోదు చేసిన టైటాన్స్ దానిని నిలబెట్టుకుంది. ఏడో విజయంతో గుజరాత్ మరో మెట్టు పైకెక్కి ప్లే ఆఫ్స్‌కు చేరువైంది. అహ్మదాబాద్: ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఆడిన రెండు మ్యాచ్‌లలో నెగ్గిన గుజరాత్ టైటాన్స్ 2–0తో పైచేయి సాధించింది. శుక్రవారం జరిగిన పోరులో గుజరాత్ 38 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (38 బంతుల్లో 76; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), జోస్ బట్లర్ (37 బంతుల్లో 64; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేయగా... సాయి సుదర్శన్ (23 బంతుల్లో 48; 9 ఫోర్లు) మరో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులే చేయగలిగింది. అభిషేక్ శర్మ (41 బంతుల్లో 74; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యారు. పరుగుల వరద... తొలి 2 ఓవర్లలో 16 పరుగులతో గుజరాత్ ఇన్నింగ్స్ నెమ్మదిగా మొదలైంది. అయితే తర్వాతి 4 ఓవర్లలో ఏకంగా 66 పరుగులు వచ్చాయి. షమీ ఓవర్లో సుదర్శన్ 5 ఫోర్లతో (4, 0, 4, 4, 4, 4) చెలరేగిపోగా, కమిన్స్ ఓవర్లో గిల్ 2 ఫోర్లు, సిక్స్ బాదాడు. హర్షల్ ఓవర్లోనూ సుదర్శన్ 4 ఫోర్లతో దూకుడు ప్రదర్శించాడు. పవర్‌ప్లే ముగిసేసరికి టైటాన్స్ 82 పరుగులు చేసింది. ఆ జట్టుకు ఐపీఎల్లో ఇదే అత్యధిక పవర్‌ప్లే స్కోరు కావడం విశేషం. తొలి వికెట్‌కు గిల్‌తో 41 బంతుల్లోనే 87 పరుగులు జోడించిన అనంతరం సుదర్శన్ వెనుదిరిగాడు. ఆ తర్వాత 25 బంతుల్లో గిల్ అర్ధ సెంచరీ పూర్తయింది. మరోవైపు బట్లర్ కూడా దూకుడు కనబర్చాడు. 22 పరుగుల వద్ద అతను ఇచ్చిన క్యాచ్‌ను కమిన్స్ వదిలేయడం కూడా కలిసొచ్చింది. అన్సారీ ఓవర్లో 6, 4 కొట్టిన బట్లర్ 31 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఉనాద్కట్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్ ఆసక్తికరంగా సాగింది. ఈ ఓవర్లో 2 సిక్స్‌లు బాదిన గుజరాత్...3 వికెట్లు కోల్పోయింది. అభిషేక్ పోరాటం వృథా... భారీ ఛేదనలో తొలి వికెట్‌కు 49 పరుగులు జత చేశాక ట్రవిస్ హెడ్ (16 బంతుల్లో 20; 4 ఫోర్లు) వెనుదిరిగాడు. అభిషేక్ సిక్సర్లతో ధాటిగా ఆడటంతో పవర్‌ప్లేలో 57 పరుగులు వచ్చాయి. ఇషాన్ కిషన్ (13) పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడగా, అభిషేక్‌కు క్లాసెన్ (18 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్) సహకరించాడు. 28 బంతుల్లోనే అభిషేక్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అభిషేక్ , క్లాసెన్ మూడో వికెట్‌కు 33 బంతుల్లో 57 పరుగులు జత చేసినా... చేయాల్సిన రన్‌రేట్ పైపైకి వెళ్లడంతో బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది. 31 బంతుల్లో 86 పరుగులు చేయాల్సిన స్థితిలో అభిషేక్ అవుట్ కాగా... మరో మూడు బంతులకే క్లాసెన్ కూడా వెనుదిరగడంతో హైదరాబాద్ ఆశలు గల్లంతయ్యాయి. చివర్లో నితీశ్ కుమార్ రెడ్డి (10 బంతుల్లో 21 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు), ప్యాట్ కమిన్స్ (10 బంతుల్లో 19 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) కొన్ని షాట్లు ఆడినా అది సరిపోలేదు. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సుదర్శన్ (సి) క్లాసెన్ (బి) అన్సారీ 48; గిల్ (రనౌట్) 76; బట్లర్ (సి) అభిషేక్ (బి) కమిన్స్ 64; సుందర్ (సి) నితీశ్ రెడ్డి (బి) ఉనాద్కట్ 21; షారుఖ్ (నాటౌట్) 6; తెవాటియా (సి) అనికేత్ (బి) ఉనాద్కట్ 6; రషీద్ (సి) అండ్ (బి) ఉనాద్కట్ 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 224. వికెట్ల పతనం: 1–87, 2–149, 3–206, 4–218, 5–224, 6–224. బౌలింగ్: షమీ 3–0–48–0, ఉనాద్కట్ 4–0–35–3, కమిన్స్ 4–0–40–1, హర్షల్ 3–0–41–0, అన్సారీ 4–0–42–1, కమిందు 2–0–18–0. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (సి) రషీద్ (బి) ప్రసిధ్ 20; అభిషేక్ (సి) సిరాజ్ (బి) ఇషాంత్ 74; ఇషాన్ కిషన్ (సి) ప్రసిధ్ (బి) కొయెట్జీ 13; క్లాసెన్ (సి) బట్లర్ (బి) ప్రసిధ్ 23; అనికేత్ (సి) షారుఖ్ (బి) సిరాజ్ 3; నితీశ్ రెడ్డి (నాటౌట్) 21; కమిందు (సి) బట్లర్ (బి) సిరాజ్ 0; కమిన్స్ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1–49, 2–82, 3–139, 4–141, 5–145, 6–145, బౌలింగ్: సిరాజ్ 4–0–33–2, ఇషాంత్ 3.2–0–35–1, ప్రసిధ్ 4–0–19–2, కొయెట్జీ 4–0–36–1, సుందర్ 1–0–6–0, రషీద్ 3–0–50–0, సాయికిషోర్ 0.4–0–1–0. ఐపీఎల్లో నేడుబెంగళూరు X చెన్నై వేదిక: బెంగళూరురాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

ఆసక్తి గొలిపే చర్చలతో వేవ్స్
‘వేవ్స్’లో హీరో నాగార్జున మాట్లాడుతూ– ‘‘పుష్ప’ సిరీస్ సినిమాలు తెలుగు కంటే వేరే భాషల్లో ఎక్కువగా వసూళ్లు సాధించాయి. వందలో దాదాపు తొంభై మంది తమ ఒత్తిడి పొంగొట్టుకునేందుకు తెరపై జరిగే మ్యాజిక్ (సినిమాలు) చూసేందుకు ఇష్టపడుతుంటారు. నేటితరం ప్రేక్షకులు కథానాయకులను పుష్పరాజ్ (‘పుష్ప’లో అల్లు అర్జున్), రాఖీ భాయ్ (‘కేజీయఫ్’లో యశ్), బాహుబలి (‘బాహుబలి’లో ప్రభాస్) లాంటి లార్జర్ దేన్ లైఫ్ రోల్స్‌లో చూడాలనుకుంటున్నారు. నేనూ దాన్నే ఇష్టపడతాను. కేవలం హీరోల ఎలివేషన్ ఒక్కటే కాదు.. బలమైన కథలతోనే ఆయా చిత్రాలు బ్లాక్‌బస్టర్ అయ్యాయి. రాజమౌళి ‘బాహుబలి’ సినిమాని తెలుగులోనే తెరకెక్కించినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఆదరించారు’’ అన్నారు.భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న నాలుగు రోజుల వరల్డ్ ఆడియో, విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్) – 2025 రెండో రోజు సైతం అట్టహాసంగా సాగింది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ వేదికగా జాతీయ, అంతర్జాతీయ సినీ ప్రముఖులు, దర్శక, నిర్మాతలు, ఔత్సాహిక సినీ రూపకర్తలు శుక్రవారం పెద్ద ఎత్తున సమ్మిట్‌కు హాజరయ్యారు. వివిధ వేదికలపై చర్చాగోష్ఠులు, ముఖాముఖీలు కొనసాగాయి.మీడియా – వినోద రంగంలో వివిధ దేశాల్లో అనుసరిస్తున్న విధానాలనూ, వ్యూహాలనూ పరస్పరం పంచుకొనేందుకు వీలుగా గ్లోబల్ మీడియా డైలాగ్ అలాగే, క్రియేట్ ఇండియా ఛాలెంజ్ పొంటీలోని విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. వేవ్స్ బజార్ వేదికగా వివిధ చిత్ర నిర్మాణ సంస్థలు, వ్యక్తుల మధ్య కంటెంట్ మార్కెటింగ్ అవకాశాల అన్వేషణ నడిచింది.భవిష్యత్తులో స్టూడియోలు, సాఫ్ట్ పవర్‌గా సినిమా, డిజిటల్ యుగంలో మారుతున్న కథాకథన రీతులు, మారుతున్న భారతీయ సినిమా ముఖచిత్రం తదితర అంశాలపై చర్చాగోష్ఠులు జరిగాయి. దక్షిణాది సినీ ప్రముఖులు నాగార్జున, విజయ్ దేవరకొండ, అమల అక్కినేని, సుప్రియ యార్లగడ్డ, ఖుష్బూ, కార్తి, రవి మోహన్, హిందీ చిత్ర సీమ నుంచి అనుపమ్ ఖేర్, ఆమిర్ ఖాన్, కరణ్ జోహార్, కరీనా కపూర్, సోనాలీ కులకర్ణి, ‘ఆదిపురుష్’ చిత్రదర్శకుడు ఓం రౌత్, ఆస్కార్ అవార్డు గెల్చిన మహిళా నిర్మాత గునీత్ మోంగా సదస్సుప్రాంగణంలో ఉత్సాహంగా చర్చల్లో పాల్గొన్నారు.కృత్రిమ మేధ (ఏఐ) రాకపై ఆసిడెంట్ రిచర్డ్ జి. కెర్రీస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో ఆసక్తికరంగా వివరించారు. హాలు మొత్తం ప్రేక్షకులతో కిక్కిరిసి పొంగా, మీడియా దిగ్గజం అరుణ్ పురీ సహా పలువురు కెర్రీస్ తెరపై చూపిన ఏఐ ఆధారిత సినిమా వీడియోలను చూశారు. ఫుగటో లాంటి సాఫ్ట్ వేర్లతో ఆడియోలో సౌండ్ ఎఫెక్ట్‌ల మొదలు సంగీత బాణీల దాకా ఎలా మార్చుకోవచ్చో సమావేశంలో వివరించిన తీరు హర్షధ్వానాలు అందుకుంది. భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చేరువ చేయడమనే అంశంపై నీతా అంబానీ ఇచ్చిన కీలకోపన్యాసం ఓ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.‘‘ఇవాళ మన దేశానికి అతి పెద్ద మార్కెటింగ్ సాధనం... సినిమా. నేను కశ్మీర్లో షూటింగ్ చేస్తున్నా, నన్ను జనం గుర్తు పడుతున్నారంటే దానికి సినిమాయే కారణం! మనం మన (సినీ) సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకోవాల్సి ఉంది. దేశం సరిహద్దులు దాటి మన సినిమా ముందుకు వెళ్ళాలంటే, అక్కడా మన సినిమాల డిస్ట్రిబ్యూషన్‌ను పెంచుకోవడమే మార్గం. అలాగే, బాక్సాఫీస్ వద్ద మన సినిమాల జోరు పెరగాలంటే, వివిధ భాషల నటులు కలసి సినిమాలు చేయాలి’’. – హీరో విజయ్ దేవరకొండహీరో ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ– ‘‘ఇండియాలోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా మంచి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉండాలి. విదేశాల్లో డిస్ట్రిబ్యూషన్ గురించి మన నిర్మాతలు ఆలోచిస్తే మార్పు మొదలవుతుంది. దేశవ్యాప్తంగా మరిన్ని స్క్రీన్ ్స పెంచేందుకు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది’’ అన్నారు.‘‘లార్జర్ దేన్ లైఫ్ పాత్రలతో పాటు కుటుంబాన్ని ప్రేమిస్తూ, కుటుంబ సభ్యుల కోసం ఏమైనా చేసే పాత్రలనూ ప్రేక్షకులు ఇవాళ ప్రేమిస్తున్నారు. ఇవాళ ప్యాన్ ఇండియా అనేది ఫ్యాషన్ అయిపొంయింది. అసలు ఈ కంగాళీ పదం రాక ముందే మన మణిరత్నం తీసిన ‘రోజా, బొంబాయి’ లాంటివి అఖిల భారత చిత్రాలే కదా. అవన్నీ భాష,ప్రాంతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకున్నాయి’’. – నటి ఖుష్బూ‘‘ఇవాళ ఓటీటీ సహా అనేక రకాల కంటెంట్ అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రేక్షకులు హీరో వీరోచిత విన్యాసాలు, ఊహల్లో విహరింపజేసే భారీ పాటలు, డ్యాన్సులు చూసేందుకు సినిమా హాళ్ళకు వస్తున్నారు. అయితే, ప్రతిదీ భారీ, ప్యాన్ ఇండియా సినిమా కావాల్సిన పని లేదు. మంచి కథతో, చిన్న సినిమాలూ రావాలి’’. – హీరో కార్తి‘‘ఏ తెరపై ఏ కథ చెప్పినా... నిజాయతీగా, భావోద్వేగభరితంగా చెప్పడం కీలకం. ప్రేక్షకులు తెరపై ఎంత భారీతనాన్ని ఇష్టపడినప్పటికీ, సినిమా రూపకర్తలోని ఆ నిజాయతీ, నిబద్ధతను ఇట్టే గమనిస్తారు. ఆస్వాదిస్తారు, అభినందిస్తారు. సినిమా విజయానికి అదే ప్రధాన సూత్రం’’. – నటుడు అనుపమ్ ఖేర్‘‘స్టోరీ టెల్లింగ్, కంటెంట్ క్రియేషన్ లాంటి పెద్ద పెద్ద మాటలు చెబుతాం కానీ, ప్రేక్షకులకు నచ్చిందా, లేదా అన్నదే ఆఖరికి మిగిలే అసలు పాయింట్. అంతే. ఎంచుకున్న ఆలోచనను బలంగా నమ్మాలి. అలా నమ్మిన ఆలోచనతో ముందుకు వెళ్ళాలి’’. – సుప్రియ యార్లగడ్డ, నిర్మాత, అన్నపూర్ణా స్టూడియోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‘‘ఉత్తరాది, దక్షిణాది లాంటి చీలికలు, భేదాల చుట్టూ తిరగకుండా, ఏది గొప్ప, ఏది తక్కువ అనే వాదన కన్నా, మనది భారతీయ సినిమా అనే భావన చాలా ముఖ్యం. భారతీయ సినిమా అంటే ఇదీ అని చూపాలంటే, నేను గురుదత్ తీసిన ‘కాగజ్ కే ఫూల్, ప్యాసా’ లాంటి సినిమాలు ప్రపంచానికి చూపాలంటాను’’. – దర్శక – నిర్మాత కరణ్ జోహార్‘‘కరోనా తర్వాత తమిళ సినిమాను తీసే విధానం, జనం చూసే విధానం కూడా మారాయి. రకరకాల వేదికలపై ఇప్పుడు కంటెంట్ అందుబాటులో ఉంది. మొబైల్‌తో కూడా సినిమా తీసేయచ్చు. అందులోనే రిలీజ్ చేయవచ్చు. చూడవచ్చు. అది ఒక మార్గం, అదనపు చేర్పు. అంతే తప్ప భారీ వెండితెర వినోదం మాత్రం ఎన్నటికీ చెరిగిపొందు, కరిగిపొందు’’. – తమిళ హీరో ‘జయం’ రవి

ఏపీ సీఐడీ పరిధి సంగతి తేలుస్తాం
సాక్షి, అమరావతి: ఏపీ సీఐడీ పరిధి సంగతిని తేలుస్తామని, సీఐడీ కూడా చట్ట నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని పేర్కొంది. మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో విచారణకు హాజరు కావాలంటూ బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 179 కింద ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు తనకు నోటీసులు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ రాజ్ కేసిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.సీఐడీ నోటీసుల్లో జోక్యానికి నిరాకరిస్తూ హైకోర్టు గత నెల 4న ఇచ్చిన ఉత్తర్వులపై స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్ ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, సీఐడీ స్టేషన్ హౌజ్ ఆఫీసర్, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారి, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది.తెలంగాణ పరిధిలో జోక్యం చేసుకునే అధికారం ఏపీ సీఐడీకి లేదుఅంతకుముందు రాజ్ కేసిరెడ్డి తరఫు న్యాయవాది శ్రీహర్ష పీచర వాదనలు వినిపించారు. రాజ్ హైదరాబాద్‌లో నివాసం ఉంటారని, అందువల్ల ఆయనకు నోటీసులు జారీ చేసే పరిధి ఏపీ సీఐడీకి లేదని వివరించారు. ఒక రాష్ట్రం తన పరిధిలోని ప్రాంతాలకు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రమే కలగజేసుకునే వీలుంటుందని తెలిపారు. తాము సీఐడీ నోటీసులను సవాలు చేస్తూ మొదట ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశామని, అయితే ఏపీ సీఐడీ పరిధిలోకి తెలంగాణ రాష్ట్రం వస్తుందంటూ 2022లో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా తమ పిటిషన్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించిందని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ సీఐడీలకు ఇరు రాష్ట్రాలు కూడా ఒకదానికొకటి పొరుగు పోలీస్ స్టేషన్లు అవుతాయన్న తీర్పు ఇవ్వడం ద్వారా హైకోర్టు పొరపాటు చేసిందని వివరించారు. సీఐడీ పరిధి విషయంలో హైకోర్టు చెప్పిన భాష్యం వల్ల సెక్షన్ 179 నిరర్థకం అవుతోందన్నారు. హైకోర్టు తీర్పుతో ఏపీ సీఐడీకి అపరిమిత అధికారులు దఖలు పడ్డాయన్నారు. దీంతో పొరుగు రాష్ట్రంలోని వారికి సైతం నోటీసులు ఇచ్చే అధికారం సీఐడీకి కలిగిందని తెలిపారు. అందులో భాగంగానే పిటిషనర్ రాజ్ కేసిరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చిందని అన్నారు. కేవలం రాజకీయ కారణాలతోనే పిటిషనర్‌ను తప్పుడు కేసులో ఇరికించినట్లు చెప్పారు.ఇప్పటికే అరెస్ట్ చేశారు.. ఈ వ్యాజ్యం నిరర్థకంరాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ, సీఐడీ పరిధి విషయంలో ఏపీ హైకోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చిందని.. పిటిషనర్‌ను సీఐడీ ఇప్పటికే అరెస్ట్ చేసిందని తెలిపారు. కాబట్టి నోటీసులను సవాలు చేస్తూ దాఖలు చేసిన ఈ వ్యాజ్యం నిరర్థకం అవుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఐడీ పరిధిని తేలుస్తాం అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సీఐడీ స్టేషన్ హౌజ్ ఆఫీసర్, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు అధికారి, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది. మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోరుతూ ఎంపీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంతో కలిపి ఈ వ్యాజ్యాన్ని విచారిస్తామని తెలిపింది.
అమ్మానాన్నే నాకు ప్రేరణ..
ఫోర్త్ సిటీ ముచ్చర్లలో 200 ఎకరాల జూ పార్కు.. అందుబాటులోకి ఎప్పుడంటే?
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
అందాల ఆతిథ్యం.. అంతర్జాతీయ గౌరవం..
ఏడాదిలో రూ.70.12 లక్షల కోట్ల ఎగుమతులు
30 ఏళ్ల క్రితం కబ్జా.. మూడ్రోజుల్లో విముక్తి
Banjara Hills: బాలుడిపై బాలిక లైంగికదాడి
నాలుగుగంటలపాటు అఘోరి విచారణ
కెమెరా వెనక వాళ్ల అసలు బుద్ధి ఏంటో చూపిస్తారు: హీరోయిన్
స్టాక్ మార్కెట్లో కొత్త ఇండెక్స్
నా కొడుకును సంపేయండి
13ఏళ్లకే హీరో, 15ఏళ్లకే టాలీవుడ్ స్టార్..ఒక్క యాక్సిడెంట్‌తో తెరమరుగు..
సూర్యవంశీపై గిల్ కామెంట్స్.. జడేజా కౌంటర్
ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
ఆ హీరోయిన్ల పేర్లు కలిసేలా విజయ్ (TVK) పార్టీ ఉంది: మంత్రి
తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్
మార్కెట్లోకి సరికొత్త హైటెక్ ఫ్యాన్: ధర ఎంతంటే?
IND vs ENG: ఇంగ్లండ్ టూర్‌కు వైభవ్ సూర్యవంశీ..
Smita Sabharwal: స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్
TG: హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు ఐపీఎస్‌లు
Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
అందరి అనుమానం అదే.. NIA ప్రశ్నకు తడబడ్డ జిప్‌లైన్ ఆపరేటర్
'ప్రవస్తి' నీకు నేను ఉన్నా.. మేము ఉన్నాం: గీతా మాధురి
‘ఎల్లమ్మ’ దొరకట్లేదు.. ఇప్పుడెలా?
ఫెన్సింగ్ కింద పాక్కుంటూ వెళ్లి.. గుంతలో దాక్కుని
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
మహేశ్ బాబు నయా లుక్.. ఎప్పుడు లేనంతగా
ఈ స్కూటర్లపై రూ.40000 డిస్కౌంట్: అదే రోజు డెలివరీ..
వివాహేతర సంబంధం.. శైలజ నుంచి ఫోన్ వచ్చిందని..!
నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా
నా కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తా..!
అక్షయ తృతీయ రోజు బంగారు నగలే కొనాలా?
ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో
ముక్కోణపు వన్డే సిరీస్.. టీమిండియా భారీ స్కోర్
ప్రస్తుతం మన దగ్గర ఉన్నవి ఇవే సార్! క్షిపణుల బదులు 130 ఇవే బిగించాం!
'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
బాలకృష్ణ విలన్‌ను ఎంపిక చేసుకున్న పూరీ జగన్నాథ్
1925లో బంగారం రేటు ఇంత తక్కువా?
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
బంగారం భారీగా పడిపోతుంది!
వీళ్లు ఐదురూపాయలు బిచ్చమేశార్రా! దీంతో వైజాగ్‌లో ఐదెకరాల భూమి కొనేయవచ్చు... మనకూ ‘ఉర్సా’ లాంటి కంపెనీ ఉంటే!
ఆర్మూరు–జగిత్యాల హైవేకు ఓకే
ఇంట్లో పాముల కలకలం
‘ఛీ’నా రాజకీయం...
మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని భావన యాదవ్
కొందరికే ‘భరోసా’
శ్రీకృష్ణ లీలలు
భారత్‌తో జాగ్రత్త.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హెచ్చరిక
నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..
ఈ ఐపీఎల్ సీజన్లో సెంచరీలు చేసిన నలుగురిలో ఓ 'కామన్ పాయింట్' ఉంది.. అదేంటి..?
హైదరాబాద్‌లో హై అలర్ట్
బ్రదర్ కేటీఆర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: వైఎస్ జగన్
ఎంత పనైపాయే..! పిల్లిలా కనిపించాలని సర్జరీ చేయించుకుంటే చివరికి..
RR VS GT: ఇది నా కల.. నాకు భయం లేదు: వైభవ్ సూర్యవంశీ
మూడో పంటగా సౌర విద్యుత్తు!
ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
ప్రొటోకాల్ రగడ.. తుమ్మల సమక్షంలో అధికారులపై ఎమ్మెల్యే ఫైర్
నచ్చిన వారితో శృంగారం.. అజిత్‌పై నటి 'హీరా' సెన్సేషనల్ కామెంట్
3 నిమిషాలకో మరణం
'లాహోర్‌ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
జాబ్ చేస్తానంటే ఇంట్లోకి రమ్మంటారు.. బాధ చెప్పుకున్న దీపిక
బెల్లంకొండ హీరో దెయ్యం సినిమా.. గ్లింప్స్ రిలీజ్
భద్రత కోసం రూ.70 కోట్లు!.. సుందర్ పిచాయ్ జీతం ఎంతంటే?
అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి..?
త్రివిధ దళాలకు ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్.. సైన్యమే స్థలం,టైం చూసి..
వామ్మో.. ఇదేం ట్రాఫిక్!
పాక్ నడ్డి విరిగేలా..
సంధ్య థియేటర్ ఘటన.. బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
ఉత్కంఠపోరు.. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
తండ్రికి బైక్‌ను బహుమతిగా ఇవ్వాలని బయలుదేరి..
కొత్త రేషన్ కార్డు దేవుడెరుగు..!
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
‘ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్‌నే’
సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రత్యేకం
బాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు : వైఎస్ జగన్
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి
నీట్–2025కు పకడ్బందీ ఏర్పాట్లు
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
అందంలోనే కాదు.. చదువులోనూ అదుర్స్
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
మైక్రోసాఫ్ట్ సీఈవో, టెక్కీ తండ్రుల ఆవేదన ఫలితం..ఏఐ హెల్త్‌కేర్ రివల్యూషన్..!
ఒకే ఇల్లు.. ఒకే వంట
ఏప్రిల్‌లో విడుదలైన టాప్ 10 మొబైల్స్
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
‘పెగాసస్’పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
IPL 2025: ఒక్క విజయం.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ
మళ్లీ ఉగ్ర కాండ!
రెడ్ మిర్చిలా రెజీనా... విష్ణుప్రియ మౌంటైన్ ట్రిప్
వాడికి ఏడాదిన్నర వయసు.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్
బ్యాంకులో క్యాష్ వేస్తున్నారా..? జాగ్రత్త!!
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
చిన్నప్పటి నుంచి చదువులో టాప్
మొక్కుబడిగా ఏసీ కొనవద్దు..
చిరంజీవి స్ఫూర్తితోనే ప్రారంభించా.. అంతా తెలుగు వారి సహకారమే: సూర్య
తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరు
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
ఈపీఎఫ్ క్లెయిమ్‌కు వెళ్తున్నారా..?
అమ్మానాన్నే నాకు ప్రేరణ..
ఫోర్త్ సిటీ ముచ్చర్లలో 200 ఎకరాల జూ పార్కు.. అందుబాటులోకి ఎప్పుడంటే?
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
అందాల ఆతిథ్యం.. అంతర్జాతీయ గౌరవం..
ఏడాదిలో రూ.70.12 లక్షల కోట్ల ఎగుమతులు
30 ఏళ్ల క్రితం కబ్జా.. మూడ్రోజుల్లో విముక్తి
Banjara Hills: బాలుడిపై బాలిక లైంగికదాడి
నాలుగుగంటలపాటు అఘోరి విచారణ
కెమెరా వెనక వాళ్ల అసలు బుద్ధి ఏంటో చూపిస్తారు: హీరోయిన్
స్టాక్ మార్కెట్లో కొత్త ఇండెక్స్
నా కొడుకును సంపేయండి
13ఏళ్లకే హీరో, 15ఏళ్లకే టాలీవుడ్ స్టార్..ఒక్క యాక్సిడెంట్‌తో తెరమరుగు..
సూర్యవంశీపై గిల్ కామెంట్స్.. జడేజా కౌంటర్
ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
ఆ హీరోయిన్ల పేర్లు కలిసేలా విజయ్ (TVK) పార్టీ ఉంది: మంత్రి
తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్
మార్కెట్లోకి సరికొత్త హైటెక్ ఫ్యాన్: ధర ఎంతంటే?
IND vs ENG: ఇంగ్లండ్ టూర్‌కు వైభవ్ సూర్యవంశీ..
Smita Sabharwal: స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్
TG: హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు ఐపీఎస్‌లు
Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
అందరి అనుమానం అదే.. NIA ప్రశ్నకు తడబడ్డ జిప్‌లైన్ ఆపరేటర్
'ప్రవస్తి' నీకు నేను ఉన్నా.. మేము ఉన్నాం: గీతా మాధురి
‘ఎల్లమ్మ’ దొరకట్లేదు.. ఇప్పుడెలా?
ఫెన్సింగ్ కింద పాక్కుంటూ వెళ్లి.. గుంతలో దాక్కుని
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
మహేశ్ బాబు నయా లుక్.. ఎప్పుడు లేనంతగా
ఈ స్కూటర్లపై రూ.40000 డిస్కౌంట్: అదే రోజు డెలివరీ..
వివాహేతర సంబంధం.. శైలజ నుంచి ఫోన్ వచ్చిందని..!
నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా
నా కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తా..!
అక్షయ తృతీయ రోజు బంగారు నగలే కొనాలా?
ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో
ముక్కోణపు వన్డే సిరీస్.. టీమిండియా భారీ స్కోర్
ప్రస్తుతం మన దగ్గర ఉన్నవి ఇవే సార్! క్షిపణుల బదులు 130 ఇవే బిగించాం!
'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
బాలకృష్ణ విలన్‌ను ఎంపిక చేసుకున్న పూరీ జగన్నాథ్
1925లో బంగారం రేటు ఇంత తక్కువా?
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
బంగారం భారీగా పడిపోతుంది!
వీళ్లు ఐదురూపాయలు బిచ్చమేశార్రా! దీంతో వైజాగ్‌లో ఐదెకరాల భూమి కొనేయవచ్చు... మనకూ ‘ఉర్సా’ లాంటి కంపెనీ ఉంటే!
ఆర్మూరు–జగిత్యాల హైవేకు ఓకే
ఇంట్లో పాముల కలకలం
‘ఛీ’నా రాజకీయం...
మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని భావన యాదవ్
కొందరికే ‘భరోసా’
శ్రీకృష్ణ లీలలు
భారత్‌తో జాగ్రత్త.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హెచ్చరిక
నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..
ఈ ఐపీఎల్ సీజన్లో సెంచరీలు చేసిన నలుగురిలో ఓ 'కామన్ పాయింట్' ఉంది.. అదేంటి..?
హైదరాబాద్‌లో హై అలర్ట్
బ్రదర్ కేటీఆర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: వైఎస్ జగన్
ఎంత పనైపాయే..! పిల్లిలా కనిపించాలని సర్జరీ చేయించుకుంటే చివరికి..
RR VS GT: ఇది నా కల.. నాకు భయం లేదు: వైభవ్ సూర్యవంశీ
మూడో పంటగా సౌర విద్యుత్తు!
ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
ప్రొటోకాల్ రగడ.. తుమ్మల సమక్షంలో అధికారులపై ఎమ్మెల్యే ఫైర్
నచ్చిన వారితో శృంగారం.. అజిత్‌పై నటి 'హీరా' సెన్సేషనల్ కామెంట్
3 నిమిషాలకో మరణం
'లాహోర్‌ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
జాబ్ చేస్తానంటే ఇంట్లోకి రమ్మంటారు.. బాధ చెప్పుకున్న దీపిక
బెల్లంకొండ హీరో దెయ్యం సినిమా.. గ్లింప్స్ రిలీజ్
భద్రత కోసం రూ.70 కోట్లు!.. సుందర్ పిచాయ్ జీతం ఎంతంటే?
అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి..?
త్రివిధ దళాలకు ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్.. సైన్యమే స్థలం,టైం చూసి..
వామ్మో.. ఇదేం ట్రాఫిక్!
పాక్ నడ్డి విరిగేలా..
సంధ్య థియేటర్ ఘటన.. బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
ఉత్కంఠపోరు.. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
తండ్రికి బైక్‌ను బహుమతిగా ఇవ్వాలని బయలుదేరి..
కొత్త రేషన్ కార్డు దేవుడెరుగు..!
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
‘ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్‌నే’
సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రత్యేకం
బాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు : వైఎస్ జగన్
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి
నీట్–2025కు పకడ్బందీ ఏర్పాట్లు
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
అందంలోనే కాదు.. చదువులోనూ అదుర్స్
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
మైక్రోసాఫ్ట్ సీఈవో, టెక్కీ తండ్రుల ఆవేదన ఫలితం..ఏఐ హెల్త్‌కేర్ రివల్యూషన్..!
ఒకే ఇల్లు.. ఒకే వంట
ఏప్రిల్‌లో విడుదలైన టాప్ 10 మొబైల్స్
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
‘పెగాసస్’పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
IPL 2025: ఒక్క విజయం.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ
మళ్లీ ఉగ్ర కాండ!
రెడ్ మిర్చిలా రెజీనా... విష్ణుప్రియ మౌంటైన్ ట్రిప్
వాడికి ఏడాదిన్నర వయసు.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్
బ్యాంకులో క్యాష్ వేస్తున్నారా..? జాగ్రత్త!!
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
చిన్నప్పటి నుంచి చదువులో టాప్
మొక్కుబడిగా ఏసీ కొనవద్దు..
చిరంజీవి స్ఫూర్తితోనే ప్రారంభించా.. అంతా తెలుగు వారి సహకారమే: సూర్య
తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరు
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
ఈపీఎఫ్ క్లెయిమ్‌కు వెళ్తున్నారా..?
సినిమా

కొత్త కారు కొన్న 'బిగ్ బాస్ 8' నైనిక.. రేటు ఎంతంటే?
బిగ్ బాస్ కొత్త సీజన్ త్వరలో మొదలుకానుంది. ఇప్పటివరకు 8 సీజన్లు జరగ్గా.. కంటెస్టెంట్ వాళ్లలో చాలామంది గుర్తింపు తెచ్చుకున్నారు. మరీ సినిమా అవకాశాలైతే రావట్లేదు గానీ షోలు చేస్తూ సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే గతేడాది 8వ సీజన్ లో పాల్గొన్న డ్యాన్సర్ నైనిక ఇప్పుడు కొత్త కారు కొనుగోలు చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే) ఢీ షోతో డ్యాన్సర్ గా కెరీర్ ప్రారంభించిన నైనిక.. ఒకటి రెండు సీజన్లలో పాల్గొంది. మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా వచ్చిన ఫేమ్ తో బిగ్ బాస్ అవకాశం దక్కించుకుంది. కానీ ఎన్ని వారాలు ఉండలేకపోయింది. ఫెర్ఫార్మెన్స్ సరిగా లేకపోవడం వల్ల కొన్ని వారాలకే ఎలిమినేట్ అయిపోయింది. షో నుంచి బయటకొచ్చిన తర్వాత అప్పుడప్పుడు షోల్లో కనిపించిన నైనిక.. మరోవైపు ప్రమోషన్స్ కూడా చేస్తూ సంపాదించుకుంటోంది. ఇప్పుడు అలా దాచుకున్న డబ్బుతో టాటా కారుని కొనుక్కుంది. దీని ధర మార్కెట్ లో రూ.10-15 లక్షల మధ్యలో ఉండొచ్చని తెలుస్తోంది.(ఇదీ చదవండి: చేసిన ప్రతి సినిమా హిట్.. ఎవరీ శ్రీనిధి శెట్టి?) View this post on Instagram A post shared by Nainika Anasuru (@nainika.anasuru26)

ఓటీటీలో మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక ఏడాపెడా వెబ్ సిరీస్‌లు వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ఈ నేపథ్యంలో వెబ్ సిరీస్‌లు ఎక్కువగా ఆ జోనర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ జోనర్ ఇష్టపడే వారికోసం మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ త్వరలోనే అలరించనుంది.రోషన్ మాథ్యూ , మోహిత్ రైనా, త్రినేత్ర ప్రధాన పాత్రల్లో నటించిన తాజా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'కంకాజుర'. ఈ సిరీస్‌కు చందన్ అరోరా దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సిరీస్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ థ్రిల్లర్ సిరీస్ సోనీలివ్‌లో ఈనెల 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇజ్రాయెల్ సిరీస్ మ్యాగ్పీ ఆధారంగా ఈ సిరీస్నును హిందీలో తెరకెక్కించారు. టీజర్ చూస్తే తనను అవమానించిన వారిపై పగతీర్చుకునే ఓ యువకుడి కథ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. It’s fragile. It’s fatal. It’s coming.Kankhajura — Streaming on 30th May on Sony LIV.#KanKhajura #SoFragileYetSoFatal#MohitRaina @roshanmathew22 @sarahjanedias03 #TrinetraHaldarGummaraju #NinadKamat #MaheshShetty #HeebaShah pic.twitter.com/FxUDjHUsaW— Sony LIV (@SonyLIV) May 2, 2025

గలీజ్ మాటలు.. నా జీవితంతో ఆడుకుంటున్నారు.. బతకను: జానులిరి
జాను లిరి (Janu Lyri).. జానపద పాటలతో చాలా ఫేమస్ అయింది. యూట్యూబ్‌లో ఫోక్ సాంగ్స్‌కు హుషారుగా స్టెప్పులేసే జాను.. తర్వాత ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 షో విన్నర్‌గానూ నిలిచింది. పదో తరగతిలోనే పెళ్లి చేసుకున్న ఈ డ్యాన్సర్‌కు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. భర్తతో విభేదాల కారణంగా వీరు విడిపోయారు. అయితే జాను ఏం చేసినా సరే కొందరు తనను విమర్శిస్తూనే ఉన్నారు. ఈ మధ్య ఓసారి మంచి వ్యక్తి దొరికితే రెండో పెళ్లికి కూడా సిద్ధమే అంది. దాన్ని కూడా తప్పుపడుతూ తనను ట్రోల్ చేస్తున్నారు.గుక్కపెట్టి ఏడ్చిన జానుఈ విమర్శలను జాను లిరి భరించలేకపోయింది. నన్ను టార్గెట్ చేయడం ఆపండి అంటూ బోరుమని ఏడుస్తోంది. ఈ మేరకు పలు వీడియోలు షేర్ చేసింది. నా జీవితంతో ఆడుకుంటున్నారు. నేను నవ్వితే ఓవరాక్షన్.. నాకు పద్ధతి తెలీదు..కదా? ఫోక్ ఇండస్ట్రీలో పద్ధతిగా చీర కట్టుకుని డ్యాన్స్ చేస్తుంది నేనే. కెమెరా ముందు ఒకలా, వెనక ఒకలా ఉండను. అందరితో నవ్వుతూ ఉంటాను. నేనేం చేసినా తప్పే అంటున్నారు.బతకాలని లేదుఇన్‌స్టాగ్రామ్‌లో నా వాయిస్‌కు గలీజ్ మాటలు యాడ్ చేస్తున్నారు. అవి నా కొడుకు చూడడా? ఎక్కడికైనా వెళ్లి చచ్చిపోవాలనిపిస్తోంది. ఒకవేళ నేను నిజంగా చచ్చిపోతే మాత్రం మీరే కారణం. ఇంత నరకమా? మీ వ్యూస్ కోసం ఒకమ్మాయి జీవితాన్ని రోడ్డుమీద పడేస్తున్నారు. మా అమ్మానాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఒక్క మాట అనకుండా పెంచారు. కానీ ఈరోజు అడ్డమైన వెధవలతో మాటలు పడుతున్నాను. సూసైడ్ తప్పు అని నలుగురికీ చెప్పేదాన్ని.. కానీ ఇప్పుడర్థమవుతోంది.నా వల్ల కావట్లేదువాళ్లు పడే బాధల వల్ల చనిపోవట్లేదు. మీరు చేసే రచ్చ తట్టుకోలేక చనిపోతున్నారని! నా వల్ల కావట్లేదు. నా ఓపిక నశించింది. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అన్నయ్యతో మాట్లాడినా, అక్కతో మాట్లాడినా, నవ్వినా, కూర్చున్నా.. ఎందుకు నిందలేస్తున్నారు? నా గురించి మంచి పెట్టొచ్చు కదా.. బాధ తట్టుకోలేకపోతున్నా.. నా జీవితంతో ఆడుకోవడం ఎందుకు? నా వల్ల మీకేమైనా హాని జరిగిందా? నా కొడుకును బాగా చదివించి మంచి స్థాయిలో చూడాలనుకున్నాను. అప్పటివరకు నేను బతకనని నాకర్థమవుతోంది. నేను మధ్యలోనే పోతాను అంటూ జాను వెక్కి వెక్కి ఏడ్చేసింది. View this post on Instagram A post shared by Jimmidi Jhansi - Janulyri (@janulyri_official) ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: హీరోయిన్ రెచ్చగొట్టింది.. అందుకే సిక్స్ ప్యాక్ చేశా: అల్లు అర్జున్

బలవంతంగానైనా సినిమాలకు గుడ్‌బై చెప్తా..: అజిత్
ముందుగా ప్లాన్ చేసుకోకుండా సినిమాల్లోకి వచ్చినవారిలో అజిత్ (Ajith Kumar) ఒకరు. అనుకోకుండా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తమిళంలో బిగ్గెస్ట్ స్టార్‌గా ఎదిగారు. ఈ మధ్యే పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చిన ఆయన హఠాత్తుగా సినిమాలను ఎప్పుడు వదిలేసేది కూడా తెలీదంటున్నారు.రిటైర్ అవొచ్చేమో..తాజాగా ఓ ఇంటర్వ్యూలో అజిత్ మాట్లాడుతూ.. 'ఎప్పుడేం జరుగుతుందో మనకు తెలీదు. రిటైర్మెంట్ నేను ప్లాన్ చేసుకోవాల్సిన పని లేదు. బలవంతంగా కూడా రిటైర్ అయిపోవచ్చేమో! చెప్పలేం.. ఈరోజుకు మనమింకా బతికున్నామన్నదే పెద్ద ఆశీర్వాదంలా భావించాలి. నేనేం ఫిలాసఫీలు చెప్పడం లేదు. ఈ ప్రయాణంలో ఎన్నో దెబ్బలు తగిలాయి, అవి సర్జరీల వరకు కూడా వెళ్లాయి. ఇకపోతే నా ఫ్రెండ్స్, చుట్టాల్లో క్యాన్సర్‌ను జయించినవాళ్లు కూడా ఉన్నారు. కాలాన్ని వృథాగా పోనివ్వనుజీవితం ఎంత విలువైనదో మాకు బాగా తెలుసు. అందుకే ఈ లైఫ్‌లో ప్రతి సెకనును వృథాగా పోనివ్వదల్చుకోలేదు. వీలైనంతవరకు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటాను. సినిమాల్లోకి రావాలని నేనెన్నడూ అనుకోలేదు. అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చాను. స్కూల్ అయిపోయాక ఆటోలు తయారుచేసే కంపెనీలో ఆరు నెలలు పని చేశాను. 18 ఏళ్ల వయసులో రేసింగ్ మొదలుపెట్టాను. ఆ తర్వాత వాణిజ్య ప్రకటనలు చేశాను. అలా సినిమాల్లోకి వచ్చాను' అని చెప్పుకొచ్చారు. అజిత్ చివరగా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాతో మెప్పించాడు. ఈ మూవీ కేవలం రెండు వారాల్లోనే రూ.200 కోట్లు రాబట్టింది.చదవండి: గలీజ్ మాటలు.. నా జీవితంతో ఆడుకుంటున్నారు.. బతకను: జానులిరి
న్యూస్ పాడ్‌కాస్ట్

వణుకుతున్న పాకిస్తాన్. భారత్‌ను నిలువరించాలని అరబ్ దేశాలను వేడుకుంటున్న పాకిస్తాన్. తమకు ఉగ్రచరిత్ర ఉందని అంగీకరించిన బిలావల్ భుట్టో

ప్రతి ఇంటినీ చంద్రబాబు మోసం చేశారు: వైఎస్ జగన్ ఆగ్రహం

దేశవ్యాప్తంగా జనగణనతో పాటే కులగణన: కేంద్రం కీలక నిర్ణయం

ఏపీలో అంతులేని అవినీతి, అంతా అరాచకమే: వైఎస్ జగన్

రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం

ఏపీలో కేంద్ర సంస్థలకైతే కోట్లు.. ఉర్సా సంస్థకైతే ఊరకే!

పాక్ కాల్పుల పోరు.. బదులిచ్చిన భారత బలగాలు.

ఏపీ రాజధానిలో దోపిడీ ఐకానిక్.. 5 టవర్ల నిర్మాణ వ్యయం పెంపు

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు.. తీవ్రస్థాయికి ఉద్రిక్తతలు

పాకిస్తాన్‌కు భారత్ పంచ్.. పహల్గాం దాడిపై కేంద్రం సీరియస్
క్రీడలు

టైటాన్స్ ఏడో గెలుపు.. రైజర్స్ ఏడో ఓటమి
ఐపీఎల్లో గత సీజన్ రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ‘ప్లే ఆఫ్స్’ వెళ్లే అవకాశాలకు దాదాపు తెరపడినట్లే! హైదరాబాద్ జట్టు అధికారికంగా ఇంకా నిష్క్రమించకపోయినా ఏడో ఓటమితో సమీకరణాలన్నీ సంక్లిష్టంగా మారిపోయాయి. ఆశలు నిలవాలంటే గుజరాత్‌పై కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ పేలవ బౌలింగ్‌తో ఓటమిని మూటగట్టుకుంది. సొంత మైదానంలో గిల్, బట్లర్, సుదర్శన్ బ్యాటింగ్‌తో భారీ స్కోరు నమోదు చేసిన టైటాన్స్ దానిని నిలబెట్టుకుంది. ఏడో విజయంతో గుజరాత్ మరో మెట్టు పైకెక్కి ప్లే ఆఫ్స్‌కు చేరువైంది. అహ్మదాబాద్: ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఆడిన రెండు మ్యాచ్‌లలో నెగ్గిన గుజరాత్ టైటాన్స్ 2–0తో పైచేయి సాధించింది. శుక్రవారం జరిగిన పోరులో గుజరాత్ 38 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (38 బంతుల్లో 76; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), జోస్ బట్లర్ (37 బంతుల్లో 64; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేయగా... సాయి సుదర్శన్ (23 బంతుల్లో 48; 9 ఫోర్లు) మరో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులే చేయగలిగింది. అభిషేక్ శర్మ (41 బంతుల్లో 74; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యారు. పరుగుల వరద... తొలి 2 ఓవర్లలో 16 పరుగులతో గుజరాత్ ఇన్నింగ్స్ నెమ్మదిగా మొదలైంది. అయితే తర్వాతి 4 ఓవర్లలో ఏకంగా 66 పరుగులు వచ్చాయి. షమీ ఓవర్లో సుదర్శన్ 5 ఫోర్లతో (4, 0, 4, 4, 4, 4) చెలరేగిపోగా, కమిన్స్ ఓవర్లో గిల్ 2 ఫోర్లు, సిక్స్ బాదాడు. హర్షల్ ఓవర్లోనూ సుదర్శన్ 4 ఫోర్లతో దూకుడు ప్రదర్శించాడు. పవర్‌ప్లే ముగిసేసరికి టైటాన్స్ 82 పరుగులు చేసింది. ఆ జట్టుకు ఐపీఎల్లో ఇదే అత్యధిక పవర్‌ప్లే స్కోరు కావడం విశేషం. తొలి వికెట్‌కు గిల్‌తో 41 బంతుల్లోనే 87 పరుగులు జోడించిన అనంతరం సుదర్శన్ వెనుదిరిగాడు. ఆ తర్వాత 25 బంతుల్లో గిల్ అర్ధ సెంచరీ పూర్తయింది. మరోవైపు బట్లర్ కూడా దూకుడు కనబర్చాడు. 22 పరుగుల వద్ద అతను ఇచ్చిన క్యాచ్‌ను కమిన్స్ వదిలేయడం కూడా కలిసొచ్చింది. అన్సారీ ఓవర్లో 6, 4 కొట్టిన బట్లర్ 31 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఉనాద్కట్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్ ఆసక్తికరంగా సాగింది. ఈ ఓవర్లో 2 సిక్స్‌లు బాదిన గుజరాత్...3 వికెట్లు కోల్పోయింది. అభిషేక్ పోరాటం వృథా... భారీ ఛేదనలో తొలి వికెట్‌కు 49 పరుగులు జత చేశాక ట్రవిస్ హెడ్ (16 బంతుల్లో 20; 4 ఫోర్లు) వెనుదిరిగాడు. అభిషేక్ సిక్సర్లతో ధాటిగా ఆడటంతో పవర్‌ప్లేలో 57 పరుగులు వచ్చాయి. ఇషాన్ కిషన్ (13) పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడగా, అభిషేక్‌కు క్లాసెన్ (18 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్) సహకరించాడు. 28 బంతుల్లోనే అభిషేక్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అభిషేక్ , క్లాసెన్ మూడో వికెట్‌కు 33 బంతుల్లో 57 పరుగులు జత చేసినా... చేయాల్సిన రన్‌రేట్ పైపైకి వెళ్లడంతో బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది. 31 బంతుల్లో 86 పరుగులు చేయాల్సిన స్థితిలో అభిషేక్ అవుట్ కాగా... మరో మూడు బంతులకే క్లాసెన్ కూడా వెనుదిరగడంతో హైదరాబాద్ ఆశలు గల్లంతయ్యాయి. చివర్లో నితీశ్ కుమార్ రెడ్డి (10 బంతుల్లో 21 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు), ప్యాట్ కమిన్స్ (10 బంతుల్లో 19 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) కొన్ని షాట్లు ఆడినా అది సరిపోలేదు. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సుదర్శన్ (సి) క్లాసెన్ (బి) అన్సారీ 48; గిల్ (రనౌట్) 76; బట్లర్ (సి) అభిషేక్ (బి) కమిన్స్ 64; సుందర్ (సి) నితీశ్ రెడ్డి (బి) ఉనాద్కట్ 21; షారుఖ్ (నాటౌట్) 6; తెవాటియా (సి) అనికేత్ (బి) ఉనాద్కట్ 6; రషీద్ (సి) అండ్ (బి) ఉనాద్కట్ 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 224. వికెట్ల పతనం: 1–87, 2–149, 3–206, 4–218, 5–224, 6–224. బౌలింగ్: షమీ 3–0–48–0, ఉనాద్కట్ 4–0–35–3, కమిన్స్ 4–0–40–1, హర్షల్ 3–0–41–0, అన్సారీ 4–0–42–1, కమిందు 2–0–18–0. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (సి) రషీద్ (బి) ప్రసిధ్ 20; అభిషేక్ (సి) సిరాజ్ (బి) ఇషాంత్ 74; ఇషాన్ కిషన్ (సి) ప్రసిధ్ (బి) కొయెట్జీ 13; క్లాసెన్ (సి) బట్లర్ (బి) ప్రసిధ్ 23; అనికేత్ (సి) షారుఖ్ (బి) సిరాజ్ 3; నితీశ్ రెడ్డి (నాటౌట్) 21; కమిందు (సి) బట్లర్ (బి) సిరాజ్ 0; కమిన్స్ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1–49, 2–82, 3–139, 4–141, 5–145, 6–145, బౌలింగ్: సిరాజ్ 4–0–33–2, ఇషాంత్ 3.2–0–35–1, ప్రసిధ్ 4–0–19–2, కొయెట్జీ 4–0–36–1, సుందర్ 1–0–6–0, రషీద్ 3–0–50–0, సాయికిషోర్ 0.4–0–1–0. ఐపీఎల్లో నేడుబెంగళూరు X చెన్నై వేదిక: బెంగళూరురాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

గుజరాత్ చేతిలో ఓటమి.. సన్‌రైజర్స్ ప్లే ఆశలు గల్లంతు!
ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కథ దాదాపు ముగిసినట్లే. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ తేలిపోయింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 38 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. 225 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేయగల్గింది. లక్ష్య చేధనలో ఓపెనర్లు మంచి అరంభం ఇచ్చినప్పటికి, మిడిలార్డర్ విఫలమం కావడంతో ఆరెంజ్ ఆర్మీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ(74) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, సిరాజ్ తలా రెండు వికెట్లు సాధించగా.. ఇషాంత్ శర్మ, కోయిట్జీ తలా వికెట్ సాధించారు. గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్..అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్(76) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జోస్ బట్లర్(64), సుదర్శన్(48) పరుగులతో రాణించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో జయ్‌దేవ్ ఉనద్కట్ మూడు వికెట్లు పడగొట్టగా.. కమ్మిన్స్, అన్సారీ తలా వికెట్ సాధించారు. కాగా ఇప్పటివరకు పది మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ కేవలం మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండోస్దానంలో కొనసాగుతోంది.

IPL 2025: శుబ్‌మన్ గిల్ది ఔటా? నాటౌటా?
ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో భాగంగా శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి ఓవర్ నుంచే ఎస్ఆర్హెచ్ బౌలర్లను ఊతికారేశాడు.మహ్మద్ షమీ, కమ్మిన్స్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం గిల్ వదలేదు. ఈ క్రమంలో కేవలం 25 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత కూడా గిల్ ఎక్కడ తగ్గలేదు. దీంతో అతడు దూకుడు చూసి మూడెంకల స్కోర్‌ను అందుకుంటాడని అంతా భావించారు. సరిగ్గా ఇదే సమయంలో గిల్‌ను దురదృష్టం వెంటాడింది. అనుహ్యంగా గిల్ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. దీంతో కేవలం 38 బంతుల్లోనే 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 76 పరుగులు చేసిన గిల్.. తీవ్ర నిరాశతో డగౌట్‌కు చేరాల్సి వచ్చింది. అయితే గిల్ ఔటైన తీరు వివాదస్పదమైంది.ఏమి జరిగిందంటే?గుజరాత్ ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన జీషన్ అన్సారీ బౌలింగ్‌లో ఆఖరి బంతికి జోష్ బట్లర్.. షార్ట్ ఫైన్ లెగ్ దిశగా ఆడాడు. ఆ బంతికి బట్లర్, గిల్ క్విక్ సింగిల్ తీసేందుకు ప్రయత్నించారు. నాన్‌స్ట్రైక్ నుంచి గిల్ వికెట్ కీపర్ వైపు వచ్చేటప్పటికి బంతిని హర్షల్ పటేల్ త్రో చేశాడు. అయితే గిల్ క్రీజులోకి వచ్చేటప్పుడు వికెట్ కీపర్ క్లాసెన్ స్టంప్ట్స్ ను పడగొట్టాడు. అయితే క్లాసెన్ బంతితో కాకుండా తన గ్లౌవ్స్‌తో స్టంప్స్‌ను పడగొట్లు అన్పించింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు అంత ఉత్సాహంగా అప్పీల్ చేయలేదు. ఏదేమైనప్పటికి ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. రీప్లేలు గిల్ క్రీజుకు షార్ట్‌గా ఉన్నప్పటికీ, క్లాసెన్ తన గ్లోవ్స్‌తో బెయిల్స్‌ను పడగొట్టినట్లు కన్పించింది. కానీ పలు కోణాల్లో రిప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ఔట్‌గా ప్రకటించి అందరికి షాకిచ్చాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంపై గిల్ కూడా అసహనం వ్యక్తం చేస్తూ మైదానాన్ని వీడాడు. Shubman Gill robbed of a century here due to a terrible decision by the Umpire 💔The bails are clearly dislodged by the gloves !#ShubmanGill #IPL2025 #GTvSRH pic.twitter.com/aTXAA7Gr4Q— Prateek (@prateek_295) May 2, 2025

అందుకే అప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాను: విరాట్ కోహ్లి
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గతేడాది అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్‌కప్-2024 విజయం అనంతరం కోహ్లి తన నిర్ణయాన్ని వెల్లడించి అందరికి షాకిచ్చాడు. అతడితో పాటు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు కూడా ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే తాజాగా తన రిటైర్మెంట్ వెనక గల కారణాన్ని కోహ్లి వెల్లడించాడు. యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చేందుకు ఆ నిర్ణయం తీసుకున్నట్లు కోహ్లి చెప్పుకొచ్చాడు. "టీ20లకు రిటైర్మెంట్ అన్ని ఆలోచించాకే ప్రకటించాను. కొత్త ఆటగాళ్లు జట్టులోకి రావాలని, వారు సిద్దమయ్యేందుకు కాస్త సమయం అవసరమని భావించాను.వారు తదుపరి టీ20 వరల్డ్‌కప్‌కు సిద్దంగా ఉండేందుకు కనీసం రెండేళ్ల సమయమైనా కావాలి. అందుకే వరల్డ్‌కప్ అనంతరం టీ20 క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లి పేర్కొన్నాడు. కాగా కోహ్లి అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటి ఐపీఎల్లో మాత్రం దుమ్ములేపుతున్నాడు. ఐపీఎల్-2025లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 138.87 స్ట్రైక్ రేట్‌తో 443 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆరెంజ్ క్యాప్ జాబితాలో మూడవ స్థానంలో కోహ్లి కొనసాగుతున్నాడు.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్.. సచిన్ రికార్డు బద్దలు
బిజినెస్

అమెరికాలో ఇక మేడిన్ ఇండియా ఐఫోన్లే!
న్యూఢిల్లీ: జూన్ త్రైమాసికంలో అమెరికాలో విక్రయించే మెజారిటీ ఐఫోన్లు భారత్‌లో తయారైనవే ఉంటాయని టెక్ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. ఐప్యాడ్, మ్యాక్, యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ మొదలైనవి వియత్నాంలో తయారైనవి ఉంటాయని పేర్కొన్నారు. ఇతరత్రా దేశాల్లో విక్రయించే ఉత్పత్తులు మాత్రమే అత్యధికంగా చైనాలో తయారవుతాయని పేర్కొన్నారు.చైనా నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై అమెరికా భారీగా టారిఫ్‌లు ప్రకటించిన నేపథ్యంలో కుక్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొంత మినహాయింపులున్నా, వివిధ టారిఫ్‌లను కలిపితే చైనా నుంచి ఎగుమతి చేసే తమ ఉత్పత్తులపై ఏకంగా 145 శాతం సుంకాలు వర్తిస్తాయని కుక్ తెలిపారు.ఎస్అండ్పీ గ్లోబల్ విశ్లేషణ ప్రకారం 2024లో అమెరికాలో ఐఫోన్ విక్రయాలు 7.59 కోట్లుగా ఉండగా, మార్చిలో భారత్ నుంచి 31 లక్షలు ఎగుమతయ్యాయి. టారిఫ్ రేట్లు, పాలసీలు ప్రస్తుతం ఉన్నట్లుగానే కొనసాగితే జూన్ త్రైమాసికంలో తమ వ్యయాలపై రూ. 900 మిలియన్ డాలర్ల మేర ప్రతికూల ప్రభావం పడుతుందని కుక్ చెప్పారు.

చిన్న సంస్థలపై తీవ్ర ఒత్తిడి
ప్రతీకార టారిఫ్‌లతో చిన్న, మధ్య తరహా సంస్థలపై (ఎంఎస్ఎంఈ) ఒత్తిడి మరింత పెరిగిపోవచ్చని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్–రా) ఒక నివేదికలో తెలిపింది. అయితే, మధ్య స్థాయి కార్పొరేట్లకు (ఎంసీ) మాత్రం అనూహ్య ఆర్థిక షాక్‌ల నుంచి కాస్తంత రక్షణ ఉంటుందని పేర్కొంది. టారిఫ్‌ల ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉండే సెగ్మెంట్లకు చెందిన ఎంఎస్ఎంఈల నిర్వహణ పరిస్థితులు దిగజారవచ్చని వివరించింది. 2024 మార్చి 31 నాటి గణాంకాల ప్రకారం ఒత్తిడిలో ఉన్న ఎంసీల సంఖ్య 11 శాతమే ఉండగా, ఎంఎస్ఎంఈలు మాత్రం 23 శాతంగా ఉన్నాయి. కోవిడ్ పూర్వ స్థాయితో పోలిస్తే ఎంసీలు వ్యాపార పరిస్థితులను మెరుగ్గా నిర్వహించుకోగలిగే స్థితిలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. 1,898 లిస్టెడ్, అన్‌లిస్టెడ్ ఎంఎస్ఎంఈలు, 1,055 ఎంసీలపై ఈ అధ్యయనం నిర్వహించారు.‘సాధారణంగా ఎంసీలతో పోలిస్తే ఎంఎస్ఎంఈలు నిర్వహణ మూలధనం విషయంలో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంటాయి. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లపై వాటికి తగినంత స్థాయిలో రుణాలు అవసరమవుతాయి. ఎంసీల్లాగా కాకుండా చాలా మటుకు ఎంఎస్ఎంఈలు ప్రమోటర్ల సారథ్యంలో ఉంటాయి. రుణదాతలు / సరఫరాదారులు / కస్టమర్లతో బేరమాడే పరిజ్ఞానం, నైపుణ్యాలు ఉన్నవారు రెండో అంచె మేనేజ్మెంట్లో అంతగా ఉండరు’ అని ఇండ్–రా అసోసియేట్ డైరెక్టర్ నిర్మయ్ షా తెలిపారు. రూ.250 కోట్ల లోపు సంస్థలపై ప్రభావం..రూ.250 కోట్ల లోపు ఆదాయం ఉండి, ప్లాంటు..మెషినరీపై రూ.5 కోట్ల లోపు పెట్టుబడులు ఉన్న ఎంఎస్ఎంఈలపై ప్రతీకార టారిఫ్‌ల ప్రభావం ఒక మోస్తరు నుంచి తీవ్ర స్థాయి వరకు ఉంటుందని ఇండ్–రా తెలిపింది. డిమాండ్ ఏమాత్రం మందగించినా ఎంసీలకన్నా ఎంఎస్ఎంఈలపైనే ఎక్కువగా ప్రభావం ఉండొచ్చని పేర్కొంది. అయితే, వడ్డీ రేట్ల తగ్గుదల, వ్యవస్థలో లిక్విడిటీ మెరుగుపడటం వంటి అంశాలు కాస్త సానుకూలంగా ఉండొచ్చని వివరించింది.ఇదీ చదవండి: మూడు రోజుల్లో స్కైప్ కనుమరుగుఎస్ఎంఈల పెట్టుబడి వ్యయాలు కోవిడ్ తర్వాత కాస్త పుంజుకున్నప్పటికీ చారితక్ర స్థాయులతో పోలిస్తే ఇంకా తక్కువగానే ఉన్నాయని నివేదిక వివరించింది. సుంకాలపరంగా అసమానతలున్న దేశాలపై ఏప్రిల్ 2న అమెరికా ప్రతీకార టారిఫ్‌లు ప్రకటించడం, ఆ తర్వాత వాటిని 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేయడం తెలిసిందే.

వాణిజ్య ఒప్పందంపై ఆశలతో లాభాలు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాలతో ముగిసింది. అమెరికా – భారత్ వాణిజ్య ఒప్పందంపై ఆశలు, రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్ల అంశాలు కలిసొచ్చాయి. సెన్సెక్స్ 260 పాయింట్లు పెరిగి 80,502 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 13 పాయింట్లు బలపడి 24,347 వద్ద నిలిచింది. ఉదయం సానుకూలంగా మొదలైన సూచీలు ట్రేడింగ్ ప్రారంభంలోనే భారీ లాభాలు ఆర్జించాయి.ఐటీ, బ్యాంకుల షేర్లకు డిమాండ్ లభించడంతో ఒక దశలో సెన్సెక్స్ 936 పాయింట్లు బలపడి 81,178 వద్ద గరిష్టాన్ని అందుకుంది. నిఫ్టీ 255 పాయింట్లు ఎగసి 24,589 వద్ద ఈ ఏడాది గరిష్టాన్ని నమోదు చేసింది. అయితే ద్వితీయార్ధంలో గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో లాభాలు తగ్గాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. ⇒ బీఎస్ఈలో రంగాల వారీగా సూచీల్లో సర్వీసెస్ 1.67%, ఆయిల్‌అండ్‌గ్యాస్ 0.69%, ఇంధన 0.57%, ఐటీ ఇండెక్సు అరశాతం పెరిగాయి. టెలికమ్యూనికేషన్ 2%, కన్జూమర్ డ్యూరబుల్స్ 1.66%, విద్యుత్, యుటిలిటీ 1%, మెటల్, రియల్టీ సూచీలు అరశాతం నష్టపోయాయి. మిడ్‌క్యాప్ 1.67%, స్మాల్ క్యాప్ సూచీ 0.07 శాతం పతనమయ్యాయి. ⇒ మార్చి క్వార్టర్ నికరలాభం 4% వృద్ధి నమోదుతో అదానీ పోర్ట్స్–సెజ్ షేరు 4% పెరిగి రూ.1,267 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 6% ఎగసి రూ.1,295 వద్ద గరిష్టాన్ని తాకింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో అత్యధికంగా లాభపడిన షేరు ఇదే. కంపెనీ మార్కెట్ విలువ రూ.10,812 కోట్లు పెరిగి రూ.2.73 లక్షల కోట్లకు చేరింది. ⇒ భూషణ్ స్టీల్ అండ్ పవర్‌ను దక్కించుకునేందుకు సమర్పించిన ప్రణాళికలు దివాలా పరిష్కార ప్రక్రియ చట్టాలకు విరుద్ధంగా ఉన్నాయంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడంతో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేరు 5.5% నష్టపోయి రూ.972 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 8% క్షీణించి రూ.948 వద్ద కనిష్టాన్ని తాకింది. షేరు భారీ పతనంతో కంపెనీకి రూ.13,731 కోట్ల నష్టం వాటిల్లింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.2.37 లక్షల కోట్లకు దిగివచి్చంది.

బంగారం @ 96,800
న్యూఢిల్లీ: బంగారం మళ్లీ మెరిసింది. జ్యువెలర్లు కొనుగోళ్లకు ముందుకు రావడంతో శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాములకు (99.9 శాతం స్వచ్ఛత) రూ.1,080 పెరిగి రూ.96,800 వద్ద స్థిరపడింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం కేవలం రూ.180 లాభపడి రూ.96,350 వద్ద ముగిసింది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం పట్ల సానుకూల ధోరణి కనిపించింది. ఔన్స్‌కు 47 డాలర్లు పెరిగి 3,269 డాలర్ల స్థాయికి చేరింది. మరోవైపు వెండి ధర సైతం దేశీయంగా కిలోకి రూ.1,600 ఎగసి రూ.97,100 స్థాయి వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల ధోరణితో జ్యువెలర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించినట్టు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది.యూఎస్ వాణిజ్య ఒప్పందాలపై తాజాగా నెలకొన్న సందిగ్ధతతో బంగారం పట్ల సానుకూల సెంటిమెంట్ ఏర్పడినట్టు ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ వైస్ ప్రెసిడెంట్ జతీన్ త్రివేది తెలిపారు. అస్పష్టతకు తోడు వాణిజ్య సంప్రదింపులపై మారుతున్న అమెరికా వైఖరితో ఇన్వెస్టర్లు బంగారంలో షార్ట్ పొజిషన్లను కవర్ చేసుకునేందుకు మొగ్గు చూపించినట్టు చెప్పారు.
ఫ్యామిలీ

Summer Vacation వాయిద్యాలను పలికించడం ఆరోగ్యకరం
నగరంలో సంగీత వాయిద్యాలలో ప్రావీణ్యం సంపాదించడం పట్ల ఆసక్తి బాగా పెరుగుతోంది. సెలవుల్లో అందివచ్చిన సమయాన్ని సది్వనియోగం చేసుకునే క్రమంలో మ్యూజిక్‌కి జై కొడుతున్నారు స్టూడెంట్స్.. ముఖ్యంగా కోవిడ్ సమయంలో లాక్డౌన్ సమయం సంగీత వాయిద్యాల సాధనను ఎంచుకోవడానికి లేదా తిరిగి తమ అభిరుచులను సానబట్టడానికి దారితీసింది. అదే సమయంలో ఆన్లైన్ అభ్యాస వేదికలు విరివిగా అందుబాటులోకి రావడం ఈ అభిరుచికి ఆజ్యం పోసింది. దీని వలన విద్యార్థులు ఇంట్లో నుంచి కదలకుండానే వాయిద్యాలను నేర్చుకోవడం సులభమైంది. -సాక్షి,సిటీబ్యూరో ప్రపంచీకరణ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో సంగీత శైలులపై అవగాహన పెరిగింది. వాయిద్యాల సాధనపై ఆసక్తికి పాశ్చాత్య సంగీతానికి పెరుగుతున్న ఆదరణ కూడా కారణమే. రాక్, పాప్, జాజ్ వంటి పాశ్చాత్య శైలులకు పెరుగుతున్న ప్రజాదరణ గిటార్లు, కీబోర్డులు, డ్రమ్స్ వంటి వాయిద్యాలకు డిమాండ్ పెంచింది. అదేవిధంగా కొరియన్ పాప్ కల్చర్ పట్ల పెరుగుతున్న మోజు కూడా మరో కారణం. పాశ్చాత్య వాయిద్యాలు ప్రజాదరణ పొందుతున్నప్పటికీ, ముఖ్యంగా ఫ్యూజన్ సంగీతాన్ని అన్వేషించే యువతలో భారతీయ శాస్త్రీయ వాయిద్యాలపైనా బలమైన ఆసక్తి ఉంది.సాధనకు సరైన సమయం.. తల్లిదండ్రులు సంగీత విద్య ప్రయోజనాలను గతంలో కన్నా ఎక్కువగా తెలుసుకున్నారు. వేసవి సెలవుల్లో తమ పిల్లలను అర్థవంతమైన కార్యకలాపాల్లో నిమగ్నం చేయడంలో సంగీతాన్ని మించింది లేదని భావిస్తున్నారు. విద్యార్థులకు అత్యంత ఆసక్తి ఉన్న వాయిద్యం కీబోర్డ్ కాగా ఆ తర్వాత స్థానాల్లో గిటార్, డ్రమ్స్, వయోలిన్, పియానోలు ఉన్నాయి. ఇక గాత్ర శిక్షణ పట్ల కూడా ఆసక్తి పెరుగుతోంది.పరికరం.. ఆరోగ్యకరం..సంగీత వాయిద్యం పలికించడం ద్వారా మెదడు ఆరోగ్యం బలోపేతమై ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరిగి పనితీరుపై సానుకూల ప్రభావాలను చూపుతుందని, అభ్యాస ఆసక్తిని మరింత ప్రోత్సహిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఎక్సెటర్ విశ్వవిద్యాలయం చేసిన ఒక అధ్యయనంలో సంగీత వాయిద్యం వాయించడం తదుపరి జీవితంలో మెరుగైన మెదడు ఆరోగ్యం ఏర్పడటం మధ్య సంబంధం ఉందని కనుగొంది. సంగీతానికి విశ్రాంతి కలిగించే శక్తి ఉంది. అందుకే చాలా మంది ఒత్తిడికి గురైనప్పుడు లేదా ఆందోళన చెందుతున్నప్పుడు వాయిద్యం వాయించడం వైపు మొగ్గు చూపుతారు. ఫ్లూట్ నేర్చుకుంటున్న నగరానికి చెందిన ఎంఎస్సీ కెమిస్ట్రీ విద్యారి్థని లక్ష్మీ ‘వేణువు ఒక మధురమైన విశ్రాంతినిచ్చే వాయిద్యం’ అంటోంది. వేణువు వాయించడం మానసిక ఉద్రిక్తతను తగ్గిస్తుందని ఆమె చెప్పింది. ప్రతిరోజూ అరగంట సాధన చేస్తానని.. అది తన చదువుపై మరింత దృష్టి పెట్టడానికి సహాయ పడిందని చెప్పింది. వాయిద్యం వాయించడం భావోద్వేగ వ్యక్తీకరణకు సహాయపడుతోంది. భావోద్వేగాలకు ఒక మార్గాన్ని అందించడం ద్వారా ఆందోళనను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది అని మానసిక వైద్యులు డా.పరమేష్ వివరించారు. ఇదీ చదవండి: Good Health: వెజ్ తినాలా? నాన్ వెజ్ తినాలా?వేసవిలో సంగీత ప్రయాణం చదువుకునే ఒత్తిడి లేని వేసవిలో విద్యార్థులు సంగీత ప్రయాణాన్ని ప్రారంభించడం చాలా మంది. ఇది సరైన ప్రారంభంగా ఉపకరిస్తుంది. అంతేకాకుండా, ప్రస్తుత సంగీత వేసవి కోర్సులు సాధారణ పాఠ్యాంశాల్లో అనుసంధానించడానికి అనుకూలంగా రూపొందిస్తున్నారు. ఇది స్కూల్స్/కాలేజీలు ప్రారంభింన తర్వాత కూడా విద్యార్థులు ఎటువంటి అంతరాయం లేకుండా సాధన కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది. – లక్ష్మీనారాయణ యేలూరి, వ్యవస్థాపకులు ముజిగల్ అకాడమీ గిటార్ సాధన చేస్తున్నా.. పాశ్చాత్య సంగీతం అంటే ఇష్టం. రాక్ బ్యాండ్స్ ప్రదర్శనలకు హాజరవుతుంటాను. మంచి రాక్ బ్యాండ్ లో చేరాలని ఆలోచన ఉంది. అయితే కాలేజీలో క్లాసెస్ ఉన్నప్పుడు కుదరదు కాబట్టి.. ప్రస్తుతం ఆన్లైన్ క్లాసెస్‌లో గిటార్ నేర్చుకుంటున్నా. – విప్లవ్, విద్యార్థి మణికొండచదవండి: Vaibhav Gautam వైకల్యానికి ‘చెక్’ పెట్టాడు!

స్లిమ్‌గా బాలీవుడ్ చిత్ర నిర్మాత హన్సల్ మెహతా.. మౌంజారోతో పది కిలోలు..!
ఇంతవరకు ఎందరో వెయిట్ లాస్ జర్నీలు ప్రేరణగా నిలిచాయి. ఒక్కోక్కరిది ఒక్కో నేపథ్యంతో బరువు తగ్గేందుకు ఉపక్రమించారు. అయితే వారంతా డైట్లు వర్కౌట్లతో బరువు తగ్గితే. ఈ బాలీవుడ్ చిత్ర నిర్మాత హన్సల్ మెహతా మాత్రం మందులతోనే బరువు తగ్గానంటూ కుండబబ్దలు కొట్టినట్లుగా చెప్పేశారు. అందరు ఆ మందులు దుష్ప్రభావాలు చూపుతాయనే దుష్ప్రచారంతో వాడేందుకు జంకుతున్నారని, అందులో వాస్తవం లేదని మరీ చెబుతున్నారు. తాను ఆ మందులు వాడుతూనే ఎలా ఆర్యోకరంగా బరువు తగ్గారో కూడా వెల్లడించారు. ఇదేంటి మందుల వద్దనే అంటారు కదా నిపుణులు అనే సందేహంతో ఆగిపోకండి అసలు కథేంటో తెలుసుకోండి మరీ..!.బాలీవుడ్ నిర్మాత హన్సల్ మెహతా టెలివిజన్ షోలు తీస్తూ నెమ్మదిగా మంచి బ్లాక్‌బస్టర్ మూవీలు తీసి మంచి నిర్మాతగా పేరుతెచ్చుకున్నారు. ఉత్తమ చలన చిత్ర నిర్మాతగా అవార్డులు కూడా దక్కించుకున్నారు. ఆయన డయాబెటిస్తో బాధపడుతున్నారు. ఓ పక్క అధిక బరువుతో పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు కూడా. అయితే మెహతా బరువు తగ్గేందుకు తన ఆరోగ్య సమస్యల రీత్యా డయాబెటిస్ చికిత్సకు ఉపయోగించే మౌంజారో మందులను వాడానని అన్నారు. దానివల్లే బరువు తగ్గానని చెప్పారు. బరువు తగ్గాడానికి సెలబ్రిటీలు ఉపయోగిచే మౌజరోని తాను వాడానని మెహతా నిర్భయంగా చెప్పడమే గాక ఏకంగా పదికిలోలు తగ్గినట్లు తెలిపారు. అలాగే దీంతోపాటు సరైన జీవనశైలిని పాటించానని అన్నారు. అధిక ప్రోటీన్ భోజనం, చక్కెరను తగ్గించడం, మెడిటేరియన్ డైట్ వంటివి అనుసరించానని అన్నారు. ఆల్కహాల్ సేవించడం కూడా తగ్గించినట్లు తెలిపారు. సరైన జీవనశైలిని అనుసరించడం తోపాటు వర్కౌట్లు, అడదడపా ఉపవాసం, హైడ్రేటెడ్ ఉండేలా తగినంత నీరు తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు. దాంతో తన రక్తంలోని చక్కెర స్థాయిలు సాధారణ స్థాయికి రావడమే గాక, ఇన్సులిన్ నిరోధకత తగ్గిందన్నారు. ఇప్పుడు యంగ్ ఏజ్‌లో వేసుకున్న పాత బట్టలు అన్ని సరిపోతున్నాయని ఆనందంగా చెప్పారు. ఆ మందులపై అపోహ ఎక్కువ..ఓజెంపిక్, మౌంజారో వంటి జీఎల్పీ-1 మందులు బరువు తగ్గడానికి పేరుగాంచినవి. కొద్దిమేర బరువుత తగ్గాలనుకునేవారికి, దీర్ఘకాలిక బరువుతో సతమతమవుతున్న వారికి ఇవి మంచివే అనేది నిపుణులు అభిప్రాయం. అయితే అనుసరించేటప్పుడు వైద్యులు లేదా వ్యక్తిగత నిపుణుల పరివేక్షణలోప్రారంభించాలట. ఇలాంటి వాడటానికి సిగ్గపడాల్సిన పనిలేదంటున్నారు మెహతా. అయితే వాటితోపాటు సరైన జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లు అవలంభిస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవని చెబుతున్నారు. భారత్‌లో ఎలి లిల్లీ లాంఛ్ చేసిన ఈ ఔషధం మౌంజారో గేమ్-ఛేంజర్ కావచ్చని..భవిష్యత్తులో మరిన్ని సంచలనాలను సృష్టిస్తుందని చెబుతున్నారు నిపుణులు.Under medical guidance, I began Mounjaro to address rising blood sugar levels in the pre-diabetic range and to manage my steadily increasing weight. Paired with a committed lifestyle shift—high-protein meals, minimal sugar and alcohol, regular strength training, proper hydration,… pic.twitter.com/R0GnHuEcl7— Hansal Mehta (@mehtahansal) May 1, 2025గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: శరీరానికి సరిపడే ఆహారాలే తీసుకోవాలి..! పోషకాలపై దృష్టి పెట్టాలి..)

Good Health: వెజ్ తినాలా? నాన్ వెజ్ తినాలా?
ఓ మహిళ.. ఎదురుగా ఉన్న ఓ వ్యక్తితో.. జంతుబలి చేసే హక్కు మీకు ఎవరిచ్చారు..? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. మా ఇష్టం మాకు నచ్చింది మేం తింటాం.. అంటూ అవతలి వ్యక్తి సమాధానం ఇస్తున్నాడు. మాంసాహారం తింటాం అంటే కుదరదు.. ఎందుకు కుదరదో చెబుతాను వినండి.. అంటూ ఆమె శాకాహారం గొప్పతనం, మన సైక్లింగ్ ప్రకృతి నియమాలు ఇతర అంశాలను వివరించారు. మీరు ప్యూర్ వెజిటేరియన్‌గా మారతారా? అని హామీ తీసుకుంది. ఇంత చెప్పిన తర్వాత ఆ మనిషిలో ఆలోచన మొదలైంది. ఇంతకీ ఎవరా మహిళ.. ఆమె చేస్తున్న ప్రచారం ఏమిటి..? ఆమె పేరే విజయలక్ష్మి.. మియాపూర్‌లో నివాసం ఉంటున్నారు. ఓ కార్పొరేట్ స్కూల్లో కంప్యూటర్ సైన్స్ టీచర్. ప్రవృత్తి.. పది మంది గుమిగూడి ఉండే చోట శాకాహారంతో ప్రయోజనాలను వివరిస్తూ శాకాహారమే తినాలంటూ ప్రచారం చేయడం. ఎంతలా వారికి అవగాహన కల్పిస్తున్నారంటే ఆమె మాటలు విన్న తర్వాత చాలా మంది ఇక మాంసాహారం జోలికి వెళ్లకూడదని నిర్ణయం కూడా తీసుకుంటున్నారు. – సికింద్రాబాద్ శాకాహారంలో అనుభూతిని ఆస్వాదిద్దామా..? అంటూ మొదలవుతుంది ఆమె ప్రచారం. యునైటెడ్ వెజిటేరియన్స్ ఫోరం పేరుతో సోషల్ మీడియా వేదికగా ఓ పేజీ క్రియేట్ చేశారు. తనలాంటి భావజాలం ఉన్న వ్యక్తుల్ని ఆ వేదికపైకి రమ్మని పిలుపునిచ్చారు. ఒకరు, ఇద్దరు, ముగ్గురు.. అలా 200లకు చేరింది ఆ సంఖ్య. వీలున్నప్పుడల్లా పదిమంది జనం ఉండే చోట ప్రత్యక్షమవుతారు. శాఖాహారంలోని గొప్పతనాన్ని.. అది తీసుకోవడం వల్ల శరీర అవయవాల మీద పనితీరును.. ఇతర అంశాల్ని చక్కగా వివరించి మాంసాహారానికి దూరం చేసే ప్రయత్నం చేస్తారు. ఆ మాటలు విన్న ఎవరైనా క్చతంగా ఆకుకూరలు, కూరగాయలు గొప్పతనాన్ని ‘వంట’ పట్టించుకోవడం నిజం. పక్కా ప్రణాళికతో ప్రచారం.. యునైటెడ్ వెజిటేరియన్స్ ఫోరం వ్యవస్థాపకురాలైన ఎన్వీ విజయలక్ష్మి పనితీరు చాలా ఆసక్తికరం. స్వచ్ఛందంగా సేవలందించేందుకు సిద్ధమైన వలంటీర్లు ఎంతమంది అందుబాటులో ఉన్నారో తెలుసుకుంటారు. ఫలానా రోజు ఫలానా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఓ చిన్న పోస్టులు పెడతారు. ఆ ఏరియాలో ఉండే వలంటీర్లు.. అందుబాటులో ఉండే వారంతా సుముఖత వ్యక్తం చేస్తే వెంటనే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేస్తారు. తక్కువలో తక్కువ కనీసం 50 నుం 60 మంది ఆ కార్యక్రమానికి హాజరయ్యేలా చూసుకుంటారు. అక్కడికి వచ్చిన వారంతా బృందాలుగా విడిపోయి నాలుగైదు ప్రదేశాలకు వెళ్లి తమ సంస్థ లక్ష్యాన్ని వివరిస్తారు.మారేందుకు మీరు సిద్ధమా..? సోషల్ మీడియా వేదికగా యునైటెడ్ వెజిటేరియన్స్ ఫోరంలో చేరాలని ఉందా? అయితే అదే పేరుతో ఉన్న ఫేస్బుక్, ఇస్ట్రాగామ్ పేజీల ద్వారా గానీ.. సభ్యులుగా చేరిపోవచ్చు. ఆ మీదట వలంటీర్లుగా సేవలు అందించవచ్చు. ఆ మీదట శాకాహారం గొప్పతనాన్ని తెలుసుకొని మీరు శాకాహార ప్రియులుగా మారిపోవచ్చు. పాఠశాలలే టార్గెట్‌గా.. శాకాహారం వినియోగించాలనే ప్రచారాలను జనం రద్దీ ఉండే అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలను టార్గెట్ చేసుకుని ఎక్కువ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. చదువుకునే వయసు నుంచే జంతువధ చేయకూడన్న లక్ష్యాన్ని విద్యార్థుల్లో ఇనుమడింపజేయడం ద్వారా ఎక్కువ ఫలితాలు రాబట్టవచ్చన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. సదస్సులు, సమావేశాలు నిర్వహించడం, పవర్‌పాయింగ్ ప్రెజెంటేషన్లు ఇవ్వడం, కరపత్రాలు, స్టిక్కర్ల ద్వారా వీలున్న అన్ని మార్గాల్లో ప్రచారాలు కొనసాగించి శాకాహార భోజన ప్రియులను రూపొందిస్తున్నాం. పాఠశాలల్లో యునైటెడ్ వెజిటేరియన్స్ ఫోరం కమిటీలు ఏర్పాటు చేయడం, పోటీలు నిర్వహిస్తూ వారికి బహుమతులు, జ్ఞాపికలు అందజేసి ప్రోత్సహిస్తున్నాం. – ఎన్వీ విజయలక్ష్మి, వ్యవస్థాపకురాలు దేశమంతా ఒకే వేదికగా.. యునైటెడ్ వెజిటేరియన్ ఫోరం అనేది ఒక తెలంగాణకు మాత్రమే కాకుండా.. అన్ని రాష్ట్రాల్లోనూ విస్తరింపజేసి.. వీలైనంత ఎక్కువ మంది జనాభాను శాకాహారం వైపు తిప్పటిమే తమ ధ్యేయమని చెబుతున్నారు విజయలక్షి్మ. ఆ దిశగా విస్తృతంగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు చెప్పారామే. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఉండే తమ వాళ్ళ ద్వారా అవగాహన కార్యక్రమాల ద్వారా అవగాహన కార్యక్రమాలను ఫోకస్ చేస్తున్నారు ఈ వెజిటేరియన్ విజయక్ష్మిఆరోగ్య సూత్రాలు వివరిస్తూఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని పాటించడానికి శాకాహారం పాత్ర ఏంటో యునైటెడ్ వెజిటేరియన్స్ ఫోరం ప్రతినిధులు వివరిస్తారు. ఎదుటివారు మాంసాహార ప్రియులైన వారు అడిగే ప్రశ్నలకి శాకాహార పూరితమైన సమాధానాలు ఇచ్చి వెజిటేరియన్స్‌గా మారాలంటూ రిక్వెస్ట్ చేస్తారు. ఒక నెల రోజులు టైం తీసుకోండి.. పప్పు దినుసుల మీద దృష్టి పెట్టండి ఆకుకూరల్లో బలమైన పోషకాల కోసం మీరే తెలుసుకోండి.. మీరు తీసుకునే మాంసాహారాన్ని మేము చెప్పే శాకాహారాన్ని బేరీజు వేసుకోండి అంటూ జనం మెదడుల్లోకి శాఖాహార గొప్పతనాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చేయడమేంటి చాలామందిని మార్చి చూపించారు కూడా..

Dharmakirti గెలిచేది..నిలిచేది ధర్మమే...సత్యమే!
బౌద్ధమతాన్ని తార్కికంగా వివరించిన ప్రముఖ ఆచార్యుల్లో ధర్మకీర్తి ఒకడు. నలందా విశ్వవిద్యాలయంలో ఆచార్య ధర్మపాలునికి శిష్యుడై విద్యను ఆర్జిం భిక్షువయ్యాడు. దేశమంతా పర్యటించి అనేక చర్చల్లో, సదస్సుల్లో, సమావేశాల్లో పాల్గొన్నాడు. వాదంలో ధర్మ కీర్తిచే ఓడింపబడినవారు తమ ఓటమిని హుందాగా అంగీకరించకపోగా అవమానించడానికి పూనుకున్నారు. ఆయన రంన తాళపత్ర గ్రంథాలను సేకరిం, వాటిని కట్టగా కట్టి, కుక్క తోకకు ముడివేసి ఆ కుక్క పరుగులు తీసేట్టు దాన్ని గట్టి గట్టిగా కేకలు వేశారు. భయంతో ఆ కుక్క విచ్చలవిడిగా అటూ, ఇటూ పరుగులు పెట్టింది. దాని తోకకు కట్టిన ధర్మకీర్తి రచనలున్న తాళ పత్రాలు చిందరవందరై గాలి వీచి అన్ని దిక్కులకు ఎగిరిపోయాయి. ఆ దృశ్యాన్ని చూసి ధర్మ కీర్తి ప్రత్యర్థులు పగలబడి నవ్వుతూ ధర్మకీర్తిని హేళన చేసి, చులకనగా మాట్లాడారు. ఈ దెబ్బకు ఆయన దిగులు పడి కాళ్ళ బేరానికి వస్తాడని వారు ఆశించారు. కానీ ఆయన చాలా ప్రశాంతంగా, ‘ఈనాడు, ఈ నా గ్రంథాలు ఎలాగైతే అన్ని దిక్కులకు ఎగిరిపోతున్నవో, అలాగే ఒక నాటికి నా భావాలు, నా కీర్తి దశ దిశలకు వ్యాపించి తీరుతుంది’ అన్నాడు. అది అక్షరాలా నిజమైంది. ధర్మమే జయించింది. సత్యమే గెలిచింది.టిబెట్‌లో నేటికీ బౌద్ధ భిక్షువులు ధర్మకీర్తి రచనలను పరమ ప్రామాణికమైనవిగా భావించి ఆయనను గౌరవిస్తారు. రాహుల్ సాంకృత్యాయన్ ధర్మకీర్తిని శ్లాఘిస్తూ ‘విమర్శనాత్మకమైన వాదనా పటిమలోనూ, విస్పష్టమైన విశ్లేషణలోనూ, స్పష్టమైన భావుకతలోనూ ఆయనను మించిన వారు లేరు’ అంటారు. ‘న్యాయ బిందు’, ‘హేతుబిందు’ వంటి ఎనిమిది గ్రంథాలు ధర్మకీర్తి కీర్తి ప్రతిష్ఠలను గగనానికి చేర్చాయి.– రాచమడుగు శ్రీనివాసులు
ఫొటోలు


హైదరాబాద్ : గోల్కొండ కోటలో పర్యాటకుల సందడి (ఫొటోలు)


యువరాణిలా ముస్తాబైన హీరోయిన్ నభా నటేష్ (ఫొటోలు)


వేవ్స్ సమ్మిట్ లో శోభిత.. ఎంత అందంగా ఉందో? (ఫొటోలు)


దిల్ రాజు కూతురి 10వ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)


పూర్ణ కుమారుడి సెకండ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)


శిఖర్ ధావన్‌తో ప్రేమలో ఐరిష్ బ్యూటీ.. ఈమె గురించి తెలుసా? (ఫొటోలు)


స్టెప్పులేస్తే ఆ సంతోషమే వేరంటున్న నిక్కీ గల్రానీ (ఫోటోలు)


'మ్యాడ్ స్క్వేర్' స్వాతిరెడ్డికి పెళ్లయిపోయిందా? భర్త ఇతడే (ఫొటోలు)


న్యూయార్క్ వీధుల్లో హీరో రానా దంపతులు (ఫోటోలు)


సమ్మర్లో చిల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ (ఫోటోలు)
అంతర్జాతీయం

పహల్గాం ఉగ్రదాడి.. పాకిస్తాన్‌కు షాకిచ్చిన అమెరికా!
వాషింగ్టన్ : జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి అంశంపై పాకిస్తాన్‌కు అమెరికా షాకిచ్చింది. మతిలేని చర్యను వెనకేసుకు రావొద్దని హెచ్చరించింది. పహల్గాం దాడి విషయంలో చేపట్టే దర్యాప్తులో భారత్‌కు సహకరించాలని సూచించింది. పహల్గాం ఉగ్రదాడితో భారత్ - పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో బుధవారం.. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, పాక్ ప్రధాని హహబాద్ షరీఫ్‌తో ఫోన్లో మాట్లాడారు.ఫోన్ సంభాషణలో రూబియో.. ఉగ్రవాదంపై భారత్ తీసుకునే ప్రతి చర్యలో అమెరికా పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. అదే సమయంలో పహల్గాంలో 26 మంది ప్రాణాలు తీసిన అమానుష చర్యపై భారత్ చేపట్టే దర్యాప్తుకు సహకరించాలని సూచించినట్లు సమాచారం.Today, Secretary Marco Rubio spoke with Pakistan's Prime Minister Muhammad Shehbaz Sharif and encouraged Pakistan to work with India to de-escalate tensions, re-establish direct communications, and maintain peace and security in South Asia: US State Department spokesperson Tammy…— ANI (@ANI) April 30, 2025Secretary of State Marco Rubio spoke with Indian External Affairs Minister Dr S Jaishankar today. The Secretary expressed his sorrow for the lives lost in the horrific terrorist attack in Pahalgam, and reaffirmed the United States' commitment to cooperation with India against…— ANI (@ANI) April 30, 2025 జైశంకర్‌తో మాట్లాడిన సమయంలో మార్కో రూబియో పహల్గాం దాడి బాధితులకు సంతాపం తెలిపారు. ఉగ్రవాదంపై జరిపే పోరాటంలో భారత్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ముందు నుంచి పహల్గాం ఉగ్రదాడి విషయంలో పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని భారత్ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ఈ విషయంలో ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. దక్షిణాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడానికి, శాంతి భద్రతలను కాపాడుకోవడానికి పాకిస్తాన్‌తో కలిసి పనిచేయాలని భారత్ కృషి చేయాలని కోరారు. Discussed the Pahalgam terrorist attack with US @SecRubio yesterday. Its perpetrators, backers and planners must be brought to justice.— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 1, 2025అందుకు ప్రతిస్పందనగా ఎక్స్ వేదికగా జైశంకర్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో దాడికి పాల్పడ ఉగ్రవాదుల్ని, వాళ్లను పెంచి పోషిస్తున్న వారిని, పహల్గాం ఉగ్రదాడికి ప్రణాళిక వేసిన వారిని న్యాయం ముందు నిలబెట్టాలి’ అని పేర్కొన్నారు. రుబియో పాకిస్తాన్ ప్రధాని షరీఫ్‌తో జరిపిన సంభాషణల్లో పాకిస్తాన్ పహల్గాం దాడిని ఖండించాలని, దర్యాప్తులో సహకరించాలని కోరారు. ఈ దాడిపై పాకిస్తాన్ బాధ్యత వహించాలని, భారత్‌తో నేరుగా సంభాషణలు పునరుద్ధరించి శాంతి దిశగా కృషి చేయాలని సూచించినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. మరి తాజా పరిణామలపై భారత్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

భయపెట్టిన భారత్.. పాక్ సైన్యంలో పెను మార్పులు
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ తరుణంలో పాక్ సైన్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ అసిమ్ మాలిక్‌ను ఆ దేశ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (ఎన్ఎస్ఏ)గా నియమిస్తూ పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. 2024 సెప్టెంబర్ నుంచి ఐఎస్ఐ చీఫ్‌గా వ్యవహరిస్తున్న లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ అసిమ్ మాలిక్‌కు ఎన్ఎస్ఏగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడితో పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పేలా భారత్ సామ, ధాన ,బేధ దండోపాయలను ఉపయోగిస్తోంది. వరుస కఠిన నిర్ణయాలతో అంతకంత దెబ్బతీస్తూనే ఉంది. ఈ క్రమంలో భారత ప్రధాని మోదీ బీహార్ వేదికగా బహిరంగంగా ఉగ్రమూకలకు హెచ్చరికలు జారీ చేశారు. పహల్గాంలో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల్ని, వారిని పెంచి పోషిస్తున్నది ఎంతటి వారినైనా ఉపేక్షించబోమన్నారు. సప్త సముద్రాల అవతల దాక్కున్నా సరే వెలికి తీసి మట్టిలో కలిపేస్తామన్నారు. అందుకు ఊతం ఇచ్చేలా ప్రధాని మోదీ నివాసంలో రక్షణశాఖ, భారత సైన్యంలో త్రివిధ దళాలతో జరిపిన కీలక సమావేశంలో సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఉగ్రవాదం అణచివేతలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు వెల్లడించారు. దీంతో పాక్ సైన్యంలో ఆందోళన మొదలైంది. భారత్.. తమపై ఏ క్షణంలోనైనా దాడి చేయొచ్చని పాక్ మంత్రులు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. దీనికి తోడు ఆ దేశ సైన్యాధిపతి జనరల్ సయీద్ అసిమ్ మునీర్ ఆచూకీ గల్లంతైంది. భారత్ దెబ్బకు దెబ్బ తీయొచ్చనే ఊహాగానాల నడుమ మునీర్ దేశం విడిచి భార్య పిల్లలతో పరాయి దేశంలో తలదాచుకుంటున్నట్లు తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం కొనసాగుతున్న వరుసర పరిణామలు, యుద్ధ భయాలతో పాక్ సైన్యంలో సైతం భయాందోళనలు మొదలయ్యాయి. బతికుంటే బలుసాకు తిని బతుకొచ్చు.. భారత్‌తో తలపడలేమనే సంకేతాలిస్తూ రెండు రోజుల వ్యవధిలో పాకిస్తాన్ ఆర్మీలో 4500 మంది సైనికులు, 250 మంది అధికారులు తమ పదవులకు రాజీనామ చేశారు. ఈ క్రమంలో రక్షణ పరంగా పాక్ ప్రధాని,రాష్ట్రపతులకు సలహాలు, పాక్ సైన్యం, ఇతర దర్యాప్తు, ఇంటెలిజెన్స్ సంస్థల్ని సమన్వయం చేసేలా అసిమ్ మాలిక్‌కు పాక్ ప్రభుత్వం ఎన్ఎస్ఏ అడ్వైజర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించడం గమనార్హం.

తల్లి మరో దేశంలో.. తండ్రి జైలులో...అనాథైన చిన్నారి!
అమెరికాలోని వలసదారులపై ట్రంప్ ప్రభుత్వ కఠిన వైఖరి ఓ కుటుంబాన్ని ముక్కలు చేసింది. తల్లిని వెనిజులాకు, తండ్రిని సాల్వడార్ జైలుకు పంపిన ప్రభుత్వం వారి రెండేళ్ల పసిబిడ్డను అమెరికాలోనే సంరక్షణ పేరిట వారినుంచి దూరం చేసింది. తల్లిదండ్రు లు లేక చిన్నారి, తనకు దూరమై వాళ్లు దుఃఖిస్తున్నారు. రెండేళ్ల చిన్నారిని మానవతా దృక్పథంతో తల్లితో కలపాలని కుటుంబం డిమాండ్ చేస్తోంది. వెనిజులాలో ఆర్థిక, రాజకీయ సంక్షోభాల కారణంగా దేశం వీడిన ఎస్పినోజా, బెర్నాల్ పెరూలో ఒక్కటయ్యారు. బెర్నా ల్ ఫాస్ట్‌ఫుడ్ స్టాండ్‌లో, ఎస్పినోజా బార్బర్ దుకాణంలో పని చేశారు. అక్కడే పెళ్లి చేసుకున్నారు. 2023 ఫిబ్ర వరి 8న లిమాలో వారికి మైకెలిస్ ఆంటోనెల్లా ఎస్పినోజా పుట్టింది. పాపకు ఏడాది ఉండగా అమెరికాకు వచ్చారు. బిడ్డతో సహా ఈక్వెడార్, కొలంబియా, దక్షిణ అమెరికాలోని భయంకరమైన డేరియన్ అడవి గుండా 2024 మేలో అమెరికా చేరారు. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టాక వారికి కష్టకాలం మొదలైంది. అనుమానంతోనే..ఎస్పినోజా దంపతులను అమెరికా అధికారులు నిర్బంధించా రు. అతన్ని మార్చి 30న వెనిజులా సైనికులను తీసుకెళ్తున్న ఐదు విమానాల్లో ఎల్ సాల్వడార్‌కు పంపారు. బెర్నాల్ను కూతురితో సహా వెనిజులా తిప్పి పంపుతున్నట్టు ఆమె తల్లికి ఫోన్ చేసి చెప్పారు. ఇమిగ్రేషన్ పత్రాల్లోనూ పాప పేరుంది. తీరా ఏప్రిల్ 25న వెనిజులా రాజధాని కారకాస్‌కు వెళ్లే విమానంలో మాత్రం పాపను ఎక్కించలేదు. చిన్నారి అమెరికాలోనే సంరక్షణ కేంద్రంలో ఉందని హోమ్‌ల్యాండ్ విభాగం తెలిపింది. ‘‘చిన్నారి తల్లిదండ్రులు వెనిజులాలోని ట్రెన్ డి అరగువా ముఠా సభ్యులనే అనుమానం మీద వారిని దేశం నుంచి బహిష్కరించాం. చిన్నారి వారి దగ్గరుంటే వేధింపులకు గురయ్యే ప్రమాదముంది. అందుకు అనుమతించబోం’’అని పేర్కొంది. కుటుంబం చెంతకు చేర్చాలి తన సోదరుడు నేరస్తుడు కాదని, చాలామంది యువకుల్లాగే ఉపాధి కోసం వెనిజులా వీడాడని ఎస్పినోజా సోదరి చెబుతోంది. ‘‘సంరక్షణ పేరిట నా మనవరాలిని అమెరికాలో రోజుకో కుటుంబం వద్ద వదులుతున్నారు. తల్లిదండ్రులు కనబడక చిన్నారి రోదిస్తోంది’’అని బెర్నాల్ తల్లి ఆవేదన చెందుతోంది. తనను వెనిజులాలోని తల్లి చెంతకు చేర్చాలని డిమాండ్ చేస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్

లాహోర్ నడిబొడ్డున సయీద్ అడ్డా!
హఫీజ్ సయీద్.. కరడుగట్టిన పాకిస్తాన్ ఉగ్రవాది. లష్కరే తోయిబా అధినేతగా భారత్‌లో రక్తపుటేరులు పారిస్తున్నాడు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో గతవారం జరిగిన ఉగ్రదాడికి కర్త, కర్మ, క్రియ అతడేనని నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుపై అమెరికా ప్రభుత్వం 10 మిలియన్ డాలర్ల (రూ.84.58 కోట్లు) రివార్డు ప్రకటించింది. ఎన్నో ఉగ్రవాద దాడుల వెనుక మాస్టర్‌మైండ్‌గా వ్యవహరించిన హఫీజ్ సయీద్ పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. పాక్ ప్రభుత్వం ఈగ కూడా వాలనివ్వడం లేదు. ఎలాంటి ఆంక్షలు లేకుండా నిర్భయంగా తన పని తాను చేసుకుపోతున్నాడు. పాకిస్తాన్లో రెండో పెద్దనగరమైన లాహోర్‌లో ఓ ఖరీదైన ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఇంటి శాటిలైట్ చిత్రాలను, వీడియోలను ‘ఇండియా టుడే’ వార్తాసంస్థ తాజాగా బహిర్గతం చేసింది. లాహోర్‌లో జోహర్ టౌన్ అనే ప్రాంతంలో ఉన్న ఈ భవనం సాధారణంగా ఉగ్రవాద నేతల ఇళ్ల కంటే భిన్నంగా కనిపిస్తోంది. శత్రువులు దాడి చేయకుండా ఎత్తుగడ అంతర్జాతీయ ఉగ్రవాదులైన అల్–ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్, జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్ సాధారణ జనావాసాలకు దూరంగా నివసించారు. ఒంటరి ఇళ్లలోనే వారు మకాం వేశారు. పాకిస్తాన్‌లోని అబోతాబాద్ ఇంటిపై అమెరికా సేనలు దాడి చేసి, లాడెన్‌ను అంతం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇంటి చుట్టూ ఖాళీ స్థలమే ఉండడం అమెరికా జవాన్లకు బాగా కలిసొచ్చిoది. 2019లో పుల్వామా దాడికి కారకుడైన మరో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని బహల్వపూర్‌లో ఓ ఒంటరి ఇంట్లో నివసిస్తున్నట్లు భారత నిఘా వర్గాలు పసిగట్టాయి. ప్రధాన రహదారి పక్కనే ఈ ఇల్లు ఉంది కానీ చుట్టూ జనావాసాలేవీ లేవు. సామాన్య ప్రజలకు దూరంగా రహస్య ప్రాంతాల్లో ఉండడానికి ఉగ్రవాదులు ఇష్టపడుతుండగా, హఫీజ్ సయీద్ వ్యూహం మరోలా ఉండడం గమనార్హం. లాహోర్ నడిబొడ్డున అత్యంత రద్దీగా ఉండే చోట తన స్థావరం ఏర్పాటు చేసుకున్నాడు. శత్రువులు దాడి చేయకుండా ఈ జాగ్రత్త తీసుకున్నట్లు తెలుస్తోంది. సామాన్య ప్రజల నివాసాలు ఉన్నచోట దాడులు చేస్తే ప్రాణనష్టం అధికంగా జరిగే ప్రమాదం ఉంటుంది. ప్రపంచ దేశాల నుంచి విమర్శలు రావొచ్చు. అందువల్ల ప్రత్యర్థులు దాడులు చేయడానికి వెనుకాడవచ్చు. లాహోర్‌లో హఫీజ్ సయీద్ ఇల్లు శత్రుదుర్భేద్యంగా కనిపిస్తోంది. ఇదొక కాంపౌండ్ అని చెప్పొచ్చు. ఈ ప్రాంగణంలోనే ఒక పాత భవనంతోపాటు మరికొన్ని ఇళ్లు, మసీదు, మదర్సా(హఫీజ్ సయీద్ కార్యాలయం), ఒక ప్రైవేట్ పార్కు ఉన్నాయి. హఫీజ్ కుటుంబం కూడా ఇక్కడే ఉంటోంది. అతడికి పాకిస్తాన్ సైన్యంతోపాటు సొంత ప్రైవేట్ సైన్యం పటిష్టమైన భద్రత కల్పిస్తున్నాయి. ఇక్కడి మసీదులోనే హఫీజ్ సయీద్ ఎక్కువ సమయం గడుపుతుంటాడు. విద్యార్థుల ముసుగులో అతడి అనుచరులు సైతం ఇందులోనే ఆశ్రయం పొందుతున్నారు. ఇంటి కింద బంకర్ లాహోర్‌లోని అల్–ఖద్సియా మసీదు గతంలో హఫీజ్ సయీద్ కార్యకలాపాలకు అడ్డాగా ఉండేది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం బాలాకోట్‌లో భారత సైన్యం సర్జికల్ స్రైక్ చేయడంతో అతడిలో భయం మొదలైంది. అల్–ఖద్సియా మసీదులో ఉండడం సురక్షితం కాదని ఇప్పుడున్న కాంపౌండ్‌కు మకాం మార్చాడు. 2021లో ఈ ఇంటికి సమీపంలో కారుబాంబు పేలుడు సంభవించింది. ముగ్గురు మరణించారు. దాంతో హఫీజ్ సయీద్ భద్రతను మరింత పటిష్టం చేశారు. ఈ కాంపౌండ్ లోపల, బయట గట్టి నిఘా ఉంటుంది. సాయుధులు రోజంతా నిర్విరామంగా పహారా కాస్తుంటారు. స్థానికులను కాంపౌండ్ సమీపంలోకి కూడా అనుమతించరు. అనుమతి ఉన్న వ్యక్తులు రావాలంటే రకరకాల తనిఖీలు ఉంటాయి. అంతేకాదు ఇక్కడ డ్రోన్లు ఎగురవేయడం నిషేధించారు. ఫొటోలు, వీడియోలు చిత్రీకరించడం కుదరదు. హఫీజ్ సయీద్ నివాసం కింద ఉక్కు కోట లాంటి బంకర్ ఉన్నట్లు తెలుస్తోంది. జైల్లో ఉన్నాడంటూ కల్లబొల్లి కబుర్లు ఉగ్రవాద కార్యాకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో హఫీజ్ సయీద్‌కు 31 ఏళ్ల జైలుశిక్ష పడిందని, జైల్లో పెట్టామని పాకిస్తాన్ పైకి నమ్మబలుకుతోంది. కానీ, అందులో ఎంతమాత్రం నిజం లేదని స్పష్టమతోంది. సయీద్‌ను ఐక్యరాజ్యసమితి, అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాయి. అతడిపై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఆదేశించాయి. అయినప్పటికీ ఫలితం శూన్యం. స్వయంగా పాక్ సైన్యమే అతడిని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. పహల్గాంలో ఉగ్రవాద దాడికి పాల్పడింది తామేనని లష్కరే తోయిబా ముసుగు సంస్థ ద రెసిస్టెన్స్ ఫోర్స్(టీఆర్ఎఫ్) స్వయంగా ప్రకటించింది. ఈ దాడి వెనుక అసలు సూత్రదారి హఫీజ్ సయీద్ అని భారత దర్యాప్తు సంస్థలు ఇప్పటికే తేల్చాయి. ముష్కరుడి కోసం కోసం వేట మొదలుపెట్టినట్లు సమాచారం. ఒకవేళ లాహోర్‌లోని అతడి ఇంటిపై దాడి చేయాలన్నా అది సులభం కాదని చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్
జాతీయం

కమ్ముకున్న యుద్ధ మేఘాలు.. పాక్‌కు వెయ్యి కిలోమీటర్ల దూరంలో భారత్ ఫైటర్ జెట్లు
లక్నో: పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో పాకిస్తాన్‌కు కేవలం వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్ గంగా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఫైటర్ జెట్లు విన్యాసాలు చేయడం చర్చాంశనీయంగా మారింది.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు చేస్తున్నయుద్ధ విమానాల్లో రాఫెల్, మిగ్-29, మిరాజ్ 2000 ఉన్నాయి. ఈ యుద్ధ విమానాల్ని రాత్రి వేళ్లల్లో ల్యాండ్ చేసేలా అందుబాటులోకి తెచ్చిన యూపీ షాజహాన్పూర్లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై నిర్మించిన నైట్ ల్యాండింగ్ స్ట్రిప్‌పై విన్యాసాలు ప్రదర్శిస్తున్నాయి. 3.5 కిలోమీటర్ల పొడవు గల ఈ ఎయిర్‌స్ట్రిప్ రాత్రి సమయంలో ఫైటర్ జెట్లు ల్యాండింగ్లకు అనుకూలంగా ఉంటుంది. ఇది ఎయిర్ ఫోర్స్ జెట్లు 24 గంటలూ ఆపరేషన్లకు వీలు కల్పించడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో ఎక్స్‌ప్రెస్‌వేను ప్రత్యామ్నాయ రన్‌వేగా ఉపయోగించగల సామర్థ్యాన్ని అంచనా వేయడంలో సహాయపడుతుంది.దీంతో, ఉత్తరప్రదేశ్‌లో మొత్తం నాలుగు ఎక్స్‌ప్రెస్‌వే ల్యాండింగ్ స్ట్రిప్‌లు అందుబాటులో ఉండగా.. షాజహాన్పూర్లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై ల్యాండింగ్ స్ట్రిప్ మాత్రమే రాత్రివేళల్లో ఫైటర్ జెట్లను ల్యాండ్ చేసుకోవచ్చు. ఈ ఆధునిక ఎయిర్‌స్ట్రిప్ ఎక్స్‌ప్రెస్‌వేపై నిర్మించబడిన భారత్‌లో తొలి రన్‌వేగా నిలిచింది. ఇది రాత్రింబవళ్ళూ మిలిటరీ ఆపరేషన్లకు అనుకూలంగా రూపొందించింది. భద్రతను నిర్ధారించేందుకు రన్‌వే ఇరుప్రక్కల 250 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. Indian Air Force jets are carrying out a flypast on the Ganga Expressway airstrip.3.5 kms long airstrip is India’s first night landing airstrip on an expressway - night landing trials scheduled today evening. pic.twitter.com/AaJt9RoTEv— The Uttar Pradesh Index (@theupindex) May 2, 2025గంగా ఎక్స్‌ప్రెస్‌వే ఎయిర్‌స్ట్రిప్‌పై ల్యాండింగ్ చేసే ఇండియన్ ఎయిర్స్ యుద్ధ విమానాల ప్రత్యేకతలు రాఫెల్: ఆధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, లాంగ్-రేంజ్ మీటియర్ క్షిపణులతో నిండి ఉంది. పరిస్థితులు ఎలా ఉన్నా సరే 100 కిలో మీటర్ల నుంచి 150 కిలోమీటర్ల శత్రు స్థావరాల్ని నేలమట్టం చేయడంలో దిట్టఎస్‌యు-30 ఎంకేఐ: ఇండియా-రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ట్విన్-సీటర్ యుద్ధవిమానం. ఈ ఎస్‌యూ-30 ఎంకేఐ దూరంలో ఉన్న లక్ష్యాల్ని దాడులు చేయగలిగే సామర్థ్యంతో పాటు బ్రహ్మోస్ వంటి క్షిపణులను మోసుకెళ్లగలదు.మిరాజ్ 2000: ఫ్రెంచ్ మూలాలున్న, హై-స్పీడ్ డీప్ స్ట్రైక్ మిషన్స్‌కు అనువైన యుద్ధవిమానం, ఇది అణ్వాయుధ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఫిబ్రవరి 2019లో జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు భారత వైమానిక దళానికి చెందిన 12 మిరాజ్-2000 యుద్ధ విమానాలను వినియోగించింది.మిగ్-29: వేగం, ఎత్తు పరంగా అత్యుత్తమ ప్రదర్శనతో పాటు రాడార్ల కళ్లుగప్పి శుత్రు స్థావరాల్ని నాశనం చేస్తుంది. జాగ్వార్: గ్రౌండ్ అటాక్, యాంటీ-షిప్ మిషన్ల కోసం రూపొందించబడిన ప్రిసిషన్ స్ట్రైక్ ఎయిర్‌క్రాఫ్ట్. దీని ప్రత్యేకతలు.. శత్రు నౌకలను గుర్తించడం, లక్ష్యంగా చేసుకోవడం, నాశనం చేస్తుంది. ఈ యాంటీ-షిప్ మిషన్లు సాధారణంగా విమానాలు, జలాంతర్గాములు, ఉపరితల నౌకలు లేదా నావికా ముప్పు నుంచి తప్పించుకునేందుకు ఉపయోగిస్తారు. సి-130 జె సూపర్ హెర్కులిస్: హెవీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్, స్పెషల్ ఫోర్స్ మిషన్లు, విపత్తు సహాయం, రక్షణ కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తుంది.ఏఎన్-32: ఎత్తైన ప్రాంతాల్లో సైనికులు, సరఫరాలు తరలించేందుకు అనుకూలమైన ట్రాన్స్పోర్ట్ విమానం.ఎంఐ-17 వి5 హెలికాప్టర్: సెర్చ్ అండ్ రిస్క్యూ, మెడికల్ ఎవాక్యుయేషన్, మానవతా సహాయం వంటి బహుళ పనుల కోసం ఉపయోగించే హెలికాప్టర్.

Rajasthan: జైసల్మేర్‌లో పాక్ గూఢచారి అరెస్ట్
పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేస్తున్నట్లు ఆరోపణలపై 40 ఏళ్ల జైసల్మేర్ నివాసి పఠాన్ ఖాన్‌ను రాజస్థాన్ ఇంటెలిజెన్స్ అరెస్ట్ చేసింది. భారత సైన్యం కదలికల సమాచారం పంపినట్లు విచారణలో తేలింది. జైసల్మేర్.. పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉండటం వల్ల గూఢచర్యకు కేంద్రంగా మారిందని అధికారులు గుర్తించారు.2022లో ఆపరేషన్ సర్హద్‌లో 36 మంది అనుమానిత గూఢచారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఐఎస్ఐ.. భారత సైనిక కార్యకలాపాల సమాచారం సేకరించేందుకు పదేపదే ప్రయత్నిస్తోందని గుర్తించారు. భారత దేశ జాతీయ భద్రతను దెబ్బతీసేందుకు గూఢచర్యం పాకిస్తాన్‌కు ఒక సాధనంగా మారింది. భారత్-పాకిస్థాన్‌ల భౌగోళిక-రాజకీయ పోరాటంలో భాగంగా ఈ సంఘటనలు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు.

భారత్ భారీ వ్యూహం.. పాక్‌కు కోలుకోలేని దెబ్బ!
ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి ఘటన భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం చెప్పేలా భారత్ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక, తాజాగా పాక్‌పై రెండు ఆర్థిక దాడులకు భారత్ ప్రణాళికలు చేసినట్టు సమాచారం.కాగా, పాకిస్తాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా భారత్ ప్రణాళికలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(FATF) గ్రేలిస్టులోకి పాకిస్తాన్‌ను తిరిగి చేర్చడానికి భారత్ ప్రయత్నిస్తోంది. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహాయాన్ని అరికట్టడంలో విఫలమయ్యే దేశాలను ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లో చేరుస్తుంది. గతంలో ఈ జాబితాలో ఉన్న పాకిస్తాన్‌ను తిరిగి అందులోకి చేర్చడం ద్వారా ఉగ్రవాదానికి నిధులు అందకుండా అంతర్జాతీయంగా ఆ దేశంపై ఒత్తిడి పెంచాలని భారత్ భావిస్తోంది. రెండో చర్యగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఇటీవల పాకిస్థాన్‌కు మంజూరు చేసిన 7 బిలియన్ డాలర్ల భారీ ఆర్థిక సాయ ప్యాకేజీ వినియోగంపై భారత్ తన ఆందోళనలను వ్యక్తం చేయనున్నట్టు సమాచారం. ఈ నిధులను పాకిస్తాన్ ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాల కోసం దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ సంబంధిత అంతర్జాతీయ వేదికలపై ఈ అంశాన్ని లేవనెత్తాలని భారత్ యోచిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. భారత్ ప్లాన్ చేసిన చర్యల కారణంగా పాకిస్తాన్‌కు కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఈ ద్వంద్వ వ్యూహం ద్వారా పాకిస్థాన్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు ఆర్థిక మార్గాలను మూసివేయాలని, తద్వారా సరిహద్దు ఉగ్రవాదాన్ని కట్టడి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. పహల్గామ్ దాడి వంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు ఈ ఆర్థికపరమైన ఒత్తిడిని ఒక మార్గంగా భారత్ పరిగణిస్తున్నట్టు సమాచారం.2022లో విముక్తి..కాగా, 2022లో అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్‌కు కాస్త ఊరట లభించింది. ఉగ్రవాద సంస్థలకు నిధులు సరఫరా చేస్తోందన్న కారణంతో పాక్‌ను గ్రే లిస్టులో ఉంచిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(FATF) ఆ జాబితా నుంచి తొలగించింది. మనీలాండరింగ్ నిరోధక చర్యలను పాకిస్థాన్ పటిష్ఠంగా అమలు చేస్తోందని, సాంకేతిక లోపాలను పరిష్కరిస్తూ ఉగ్రసంస్థలకు నిధుల సరఫరా విషయంలోనూ పోరాటం చేసిందని ఎఫ్ఏటీఎఫ్ వెల్లడించింది. దీంతో పాక్‌ను గ్రే లిస్టు నుంచి తప్పించినట్లు తెలిపింది. గ్రే లిస్టులో ఉన్న దేశాలు అంతర్జాతీయ సంస్థల నుంచి నిధుల పొందడం చాలా కష్టం. ఈ దేశాలకు ముఖ్యంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎప్), ప్రపంచ బ్యాంక్, ఏడీబీ, యూరోపియన్ యూనియన్ వంటి సంస్థలు ఆర్థిక సాయం చేసేందుకు వెనకాడుతాయి.ఉగ్రవాదానికి ఊతమిచ్చే అతి ప్రమాదకర దేశాలను ఎఫ్ఏటీఎఫ్ బ్లాక్ లిస్ట్ జాబితాలోకి చేరుస్తుంది. కాగా, ఇప్పటివరకు ఇరాన్, ఉత్తర కొరియా మాత్రమే బ్లాక్ లిస్ట్ జాబితాలో ఉన్నాయి. బ్లాక్ లిస్ట్ నుంచి తప్పించుకోవడానికి మూడుదేశాల మద్దతు అవసరం. అయితే, చైనా, టర్కీ, మలేషియా దేశాలు పాక్‌కు మద్దతు ఇవ్వడంతో బ్లాక్ లిస్ట్‌లోకి వెళ్లకుండా బయటపడింది. తొలిసారిగా 2018 జూన్‌లో ఎఫ్ఏటీఎఫ్ పాకిస్తాన్‌ను గ్రే లిస్ట్‌లో ఉంచింది. అనంతరం వీటి నుంచి బయటపడేందుకు పాకిస్తాన్‌కు రెండు సార్లు సమయమిచ్చింది. వీటిలో భాగంగా ఉగ్రవాదులకు అందుతున్న నిధుల మూలాలను కనిపెట్టే దిశగా పాక్ చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఐరాస ఉగ్రవాదులుగా గుర్తించిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలి. అలాగే పట్టుబడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు నిరూపించగలగాలి. ఐరాస గుర్తించిన ఉగ్రవాదులకు నిధులు అందకుండా ఆర్థికపరమైన ఆంక్షలు విధించాలి. ఎఫ్ఏటీఎఫ్ నిర్దేశించిన ఈ లక్ష్యాలను చేరుకోవడంలో పాక్ ఇప్పటివరకు విఫలమవుతూనే వచ్చింది. కానీ, జూన్ నెలలో ఎఫ్ఏటీఎఫ్ ప్లీనరీ సమావేశంలో పాక్‌కు అనుకూలంగా ప్రకటన విడుదల చేసింది. ధరలతో పాక్ అతలాకుతలం..మరోవైపు.. ఇప్పటికే తీవ్ర ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌కు ఇప్పుడు మరో తలనొప్పి వచ్చి పడింది. పాక్‌తో వాణిజ్య సంబంధాలు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించడంతో పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ క్రమంలోనే అట్టారీ సరిహద్దును భారత్ మూసివేసింది. దీంతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం నిలిచిపోయింది. దీంతో ఇప్పటికే తీవ్రంగా కుదేలైన పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై ఇది మరింత తీవ్ర ప్రభావం చూపనుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో పాక్‌లో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకింది. భారీగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో పాక్ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో ప్రస్తుతం పాక్‌లో ఆహార ధరలు భారీగా పెరిగాయి.పాకిస్తాన్లో ప్రస్తుతం కొన్ని ఆహార పదార్థాల ధరలుకిలో చికెన్: రూ. 798.89 పాకిస్తాన్ రూపాయలుకిలో బియ్యం: రూ. 339.56 పాకిస్తాన్ రూపాయలుడజను గుడ్లు: రూ. 332 పాకిస్తాన్ రూపాయలులీటర్ పాలు: రూ. 224 పాకిస్తాన్ రూపాయలుఅరకిలో బ్రెడ్: రూ. 161.28 పాకిస్తాన్ రూపాయలుకిలో టమాట: రూ. 150 పాకిస్తాన్ రూపాయలుకిలో బంగాళాదుంప: రూ. 105 పాకిస్తాన్ రూపాయలు.

ఒడిశాలో నేపాల్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. హాస్టల్లో ఏం జరిగింది?
భువనేశ్వర్: ఒడిశాలో దారుణ ఘటన వెలుగు చూసింది. భువనేశ్వర్‌లోని ప్రతిష్ఠాత్మక కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కిట్)లో విద్యార్థిని మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సదరు విద్యార్థిని నేపాల్‌కు చెందిన యువతిగా గుర్తించారు. ఇక, మూడు నెలల వ్యవధిలో ఇదే క్యాంపస్‌లో ఇద్దరు విద్యార్థులు మృతిచెందడం అనుమానాలను తావిస్తోంది.వివరాల ప్రకారం.. కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కిట్)లో కంప్యూటర్ సైన్స్ బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి(22)ని మృతిచెందింది. ఆమె స్వస్థలం నేపాల్ రాజధాని ఖాట్మాండుకు సుమారు 135 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీర్గంజ్. సదరు విద్యార్ధిని గురువారం రాత్రి 8 గంటల సమయంలో బాలికల హాస్టల్లోని తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న స్థితిలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. దీంతో, యూనివర్సిటీ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.మూడు నెలల్లో ఇద్దరు మృతి..ఇక, గత మూడు నెలల్లో కిట్ యూనివర్సిటీలో నేపాల్ విద్యార్థిని మరణించడం ఇది రెండోసారి. ఫిబ్రవరి 16న బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న ప్రకృతి లమ్సాల్ అనే నేపాల్ విద్యార్థిని కూడా ఇదే విధంగా హాస్టల్ గదిలో విగతజీవిగా కనిపించింది. ఆ సమయంలో సహచర విద్యార్థి ఒకరు తనను లైంగికంగా వేధించారని యూనివర్సిటీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆఫీస్ (ఐఆర్వో) కు ఫిర్యాదు చేసినట్టు తర్వాత వెలుగులోకి వచ్చింది. అయితే, యూనివర్సిటీ యాజమాన్యం తక్షణ చర్యలు తీసుకోలేదని, ఇది ‘తీవ్ర నిర్లక్ష్యం’ అని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) వ్యాఖ్యానించింది. విద్యార్థి సంఘాలు, పౌర సమాజం తీవ్రంగా స్పందించడంతో, ఆమె మరణించిన మరుసటి రోజే నిందితుడిని అరెస్టు చేశారు. బీజేడీ నేత, మాజీ ఎంపీ అచ్యుత సమంత స్థాపించి, నిర్వహిస్తున్న ఈ యూనివర్సిటీపై అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.A Nepali undergraduate student was found dead in her hostel room in Bhubaneswar’s Kalinga Institute of Industrial Technology (KIIT) on Thursday (May 1) evening. This is the second such case in less than three months.Prisha Shah was studying computer science and hails from… pic.twitter.com/XcCVY9vM6X— News9 (@News9Tweets) May 2, 2025
ఎన్ఆర్ఐ

డల్లాస్‌లో నిరాశ్రయుల ఆశ్రయ గృహంలో పేదలకు ఆహారం
తెలంగాణా పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (Telangana Peoples Association of Dallas) మరో సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో 'ఫుడ్ డ్రైవ్'తో అన్నార్తుల ఆకలి తీర్చింది. Austin Street Homeless Shelter లో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఒక రోజంతా సాగిన ఈ కార్యక్రమంలో TPAD సభ్యులు స్వయంగా పాస్తా, చికెన్, మాష్డ్ పొటాటో తదితర వంటకాలు తయారు చేసి.. అన్నార్తులకు వడ్డించారు. 450 మందికి పైగా నిరాశ్రయుల ఆకలి తీర్చారు. అనురాధ మేకల (ప్రెసిడెంట్), రావు కల్వల (FC చైర్), పాండు పాల్వే (BOT చైర్), రమణ లష్కర్ (కోఆర్డినేటర్), దీపికా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఫుడ్ డ్రైవ్‌లో 450 మందికి పైగా నిరాశ్రయులకు ఆహారం వడ్డించామని, టీప్యాడ్ చెందిన 50 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు తెలియజేశారు. టీప్యాడ్ సీనియర్ నాయకుడు రఘువీర్ బండారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. (మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Texas: మృత్యువుతో పోరాడి ఓడిన దీప్తి
ఆస్టిన్: అమెరికా టెక్సాస్‌లో తెలుగు విద్యార్థిని హిట్ అండ్ రన్ కేసు విషాదాంతంగా ముగిసింది. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వంగవోలు దీప్తి(Deepthi Vangavolu)కన్నుమూశారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు ఇచ్చిన సమాచారం ద్వారా కుటుంబ సభ్యులు ధృవీకరించారు. దీంతో గుంటూరులోని ఆమె స్వస్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీప్తి(23) తండ్రి హనుమంత రావు చిరువ్యాపారి. ఆమె కుటుంబం గుంటూరు(Guntur) రాజేంద్రనగర్ రెండో లైనులో నివాసం ఉంటోంది. టెక్సాస్‌లోని డెంటన్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో ఎంఎస్ చేసేందుకు వెళ్లారు. మరో నెల రోజుల్లో కోర్సు పూర్తి కావాల్సి ఉంది. అయితే ఈలోపు రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆమెను కబళించింది. ఈ నెల 12వ తేదీన స్నేహితురాలైన మేడికొండూరుకు చెందిన స్నిగ్ధతో కలిసి రోడ్డుపై నడచి వెళ్తుండగా వేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. దీప్తి తలకు తీవ్ర గాయమైంది. స్నిగ్ధకు కూడా గాయాలయ్యాయి. దీప్తి స్నేహితురాళ్లు ప్రమాద విషయాన్ని ఆమె తండ్రి హనుమంతరావుకు తెలిపారు. క్రౌడ్ ఫండింగ్(Crowd Funding) ద్వారా ఆమె చికిత్స కోసం ప్రయత్నాలు కొనసాగగా.. మంచి స్పందన లభించింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నెల 15న దీప్తి చికిత్స పొందుతూ కన్నుమూసింది. శనివారం(ఏప్రిల్ 19) నాటికి మృతదేహం గుంటూరుకు వచ్చే అవకాశం ఉంది. మరో బాధితురాలు స్నిగ్ధ ప్రస్తుతం అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. అవే ఆమె చివరి మాటలు..దీప్తి మృతి వార్త విని ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసెలా రోదిస్తున్నారు. చదువులో చాలా చురుకైన విద్యార్థిని అని, అందుకే పొలం అమ్మి మరీ అమెరికాకు పంపించామని చెప్పారు. నెల రోజుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి కావాల్సి ఉందని, ఆ టైంకి మమ్మల్ని అమెరికాకు రావాలని ఆమె కోరిందని, అందుకు ఏర్పాట్లలో ఉండగానే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 10వ తేదీన దీప్తి చివరిసారిగా తమతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. కాలేజీకి టైం అవుతోందని.. ఆదివారం మాట్లాడతానని చెప్పి హడావిడిగా ఫోన్ పెట్టేసిందని.. అవే తమ బిడ్డ మాట్లాడిన చివరి మాటలని గుర్తు చేసుకుని బోరున విలపించారు.

దుబాయి హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
ఇటీవల దుబాయిలో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ యువకుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇవ్వాలని జపాన్ పర్యటన నుంచి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పోరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టపు ప్రేమ్ సాగర్‌తో పాటు, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట కు చెందిన స్వర్గం శ్రీనివాస్ లు దుబాయి లో హత్యకు గురైన విషయం తెలిసిందే. దుబాయి నుంచి మృత దేహాలను త్వరగా స్వదేశానికి తెప్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం అధికారుల్ని ఆదేశించినట్లు అనిల్ తెలిపారు.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దుబాయి లోని భారత రాయబార కార్యాలయానికి, ఢిల్లీ లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖలు రాసినట్లు వెల్లడించారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:ఎన్నారై అడ్వయిజరీ కమిటీ చైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్ బృందం, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి లు మృతుల కుటుంబాలను పరామర్శించారు.

రాయలసీమ ప్రగతికి డాలస్‌లో జీఆర్ఏడీఏ అడుగులు
గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఏరియా (GRADA) ఆధ్వర్యంలో ఏప్రిల్ 13న ఫ్రిస్కో, టెక్సాస్‌లో రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం జరిగింది. రాయలసీమ సమస్యలు, అభివృద్ధి అవకాశాలు, తెలుగు భాషా సాహిత్యాల ప్రాముఖ్యతపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి రాయలసీమకు చెందిన రచయిత భూమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగంలో రాయలసీమ ప్రస్తుత పరిస్థితి, ముఖ్యంగా దీర్ఘకాలంగా వేధిస్తున్న నీటి సమస్యలు, వెనుకబాటుతనం గురించి ఎంతో ఆవేదనతో, స్పష్టంగా వివరించారు.మన ప్రాంత సహజ సంపద అయిన శేషాచలం అడవుల గురించి, ముఖ్యంగా ఎర్రచందనం చెట్ల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ విలువైన సంపదను అక్రమ మార్గాల్లో ఇతర దేశాలకు తరలించి లాభం పొందకుండా, స్థానికంగానే వాటి ఆధారిత పరిశ్రమలను స్థాపించి, ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా మన ప్రాంతాన్ని ఎలా ఆర్ధికంగా బలోపేతం చేయవచ్చో ఆయన చక్కగా వివరించారు. ఆయన మాటలు మనందరిలో కొత్త ఆలోచనలను రేకెత్తించాయి. సహజ వనరులను సక్రమంగా వినియోగించుకుంటే రాయలసీమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే ఆశాభావాన్ని ఆయన కలిగించారు.మరో గౌరవ అతిథిగా కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ఛాన్సలర్, ప్రఖ్యాత విద్యావేత్త ప్రొఫెసర్ పి. కుసుమ కుమారి హాజరయ్యారు. ఆమె తన ప్రసంగంలో తెలుగు భాష మాధుర్యం, సాహిత్యం గొప్పదనం, పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. నంద కోర్వి, అనిత నాగిరెడ్డి, సతీష్ సీరం, బ్రహ్మ చిరా, హరినాథ్ పొగకు, హేమంత్ కాకుట్ల, జగదీశ్వర నందిమండలం, జగదీష్ తుపాకుల, పవన్ పల్లంరెడ్డి, ప్రసాద్ నాగారపు, రాజు కంచం, శివ అద్దేపల్లి, శివ వల్లూరు, శ్రీధర్ బొమ్ము, శ్రీకాంత్ దొంత, సురేష్ మోపూరు, ఉమా గొర్రెపాటి, మరియు కార్తీక్ మేడపాటి ఈ సమావేశానికి హాజరయ్యారు.
క్రైమ్

యువతి దారుణ హత్య.. ఉలిక్కిపడ్డ విశాఖ
సాక్షి,విశాఖ: కూటమి పాలనలో మహిళలు,చిన్నారులకు రక్షణ లేకుండా పోతుంది. రాష్ట్రంలో మహిళలపై రోజుకో దాడులు, హత్యలు, హత్యాచారాలు జరుగుతున్నాయి. తాజాగా, విశాఖలో దారుణం చోటు చేసుకుంది. యువతి దారుణ హత్యకు గురైంది. హత్య అనంతరం యువతిని పెట్రోల్ పోసి తగలబెట్టారు దుండగులు.బీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని దాకమర్రి ఫార్చ్యూన్ లే అవుట్ సమీపంలో చోటు చేసుకుంది. ఈ దారుణంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Hit And Run: పూటుగా మద్యం సేవించి బాలిక ప్రాణం తీసిన యువతి
జైపూర్ : రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. పీకల దాకా మద్యం తాగిన ఓ యువతి ఓ మైనర్ బాలిక ప్రాణం తీసింది. తన కారుతో బాలిక వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలిక ప్రాణాలు కోల్పోయింది.పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి జైపూర్‌లోని సంగనీర్ గేట్ సమీపంలో హిట్ అండ్ రన్ ఘటన చోటు చేసుకుంది. 14 ఏళ్ల ఆసిమా తన తండ్రితో పాటు కజిన్‌తో కలిసి బైక్‌పై ఇంటికి వెళ్తున్నారు.సరిగ్గా సంగనీర్ గేటు సమీపంలో పూటుగా మద్యం సేవించిన ఓ యువతి ఆసిమా బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆసిమా మృతి చెందింది. ఆమె తండ్రి, బంధువు తీవ్రంగా గాయపడ్డారు. అయితే బైక్‌ను ఢీకొట్టిన అనంతరం యువతి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. రాంగ్ రూట్లో వెళుతూ మరో బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనతో అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. నిందితులు ప్రయాణిస్తున్న కారును అడ్డగించారు.ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారమైన యువతిని, ఆమెతో పాటు కారులో ప్రయాణిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. బ్రీత్ ఎనలైజర్ టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టులో కారు డ్రైవ్ చేసిన యువతి అతిగా మద్యం సేవించినట్లు నిర్ధారించారు.जयपुर में एक बार फिर हिट एंड रन का दर्दनाक मामला सामने आया है, सांगानेरी गेट के पास शराब के नशे में दो लड़के और दो लड़कियां कार से तेज रफ्तार में जा रहे थे !!इसी दौरान उनकी कार ने एक बाइक को जोरदार टक्कर मार दी, हादसे में बाइक पर सवार 14 साल की बच्ची असीमा की मौके पर ही मौत हो… pic.twitter.com/JyHUT9PMt7— MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) April 29, 2025 పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నిస్తుండగా సదరు యువతి పోలీసుల్ని వేడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. కారు నడిపిన యువతి నాగ్‌పూర్‌కు చెందిన సంస్కృతిగా గుర్తించారు. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని మెడికల్ పరీక్ష నిర్వహించి అరెస్టు చేశారు. కారు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, లోతైన విచారణ ప్రారంభించారు.

ఐదు ఫుల్ బాటిళ్లు కచ్చా తాగేసి.. విషాదం నింపిన పందెం
మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అనే చెప్పే వైద్యులు.. పరిమితంగా తాగాలంటూ మరోవైపు సూచించడం ఆశ్చర్యం కలిగించేదే!. అయితే.. డబ్ల్యూహెచ్‌వో గణాంకాల ప్రకారం ప్రపంచంలో ఏడాదిలో నమోదు అయ్యే మరణాల్లో 4.7 శాతం మరణాలు మద్యానికి సంబంధించినవే ఉంటున్నాయట. ఏడాదికి సుమారు 26 లక్షల మంది మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఇదిలా ఉంటే..కర్ణాటకలోని కోలార్ జిల్లా ములబాగిల్‌లో ఘోరం జరిగింది. స్నేహితులతో రూ.10 వేల కోసం పందెం కాసిన ఓ యువకుడు 5 ఫుల్ బాటిళ్ల లిక్కర్‌ను.. అదీ నీరు కలపకుండా(కచ్చాగా) గడగడా తాగేశాడు. ఆపై తీవ్ర అస్వస్థతకు గురికాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం.. స్నేహితులతో సిట్టింగ్ వేసిన టైంలో తాను ఐదు సీసాల మద్యాన్ని నీరు కలపకుండా తాగగలనని కార్తీక్ (21) అనే యువకుడు సవాల్ విసిరాడు. దానికి స్పందించిన స్నేహితులు.. అలా తాగితే రూ. 10 వేలు ఇస్తానని పందెం కాశారు. దీంతో.. కార్తీక్ ఐదు బాటిళ్ల మద్యాన్ని నీరు కలపకుండా గడగడా తాగేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతడిని ములబాగిల్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కార్తీక్ ప్రాణాలు కోల్పోయాడు. కార్తీక్‌కు ఏడాది క్రితమే వివాహమైంది. అతడి భార్య ఎనిమిది రోజుల క్రితమే బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.ఈ ఘటనపై సమాచారం అందుకున్న నాన్‌గలి పోలీసులు కార్తీక్ స్నేహితులు వెంకటరెడ్డి, సుబ్రమణి సహా ఆరుగురిపై కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. పరారీలో మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.

పెళ్లికి ముందే చెప్పా.. నాకు లవర్ ఉన్నాడని..
విజయపుర(కర్ణాటక): వధువు మెడలో వరుడు తాళి కట్టే క్షణాల కోసం అందరూ ఎదురు చూస్తుండగా వరుడు మంటపం నుంచి లేచి పూలదండను విసిరేసి పెళ్లిని ఆపేశాడు. ఈ ఘటన చెన్నరాయపట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని దేవనహళ్లి తాలూకా బాలెపురలోని కల్యాణ మంటపంలో జరిగింది. యువతి మీద అనుమానంతో చివరి క్షణంలో వరుడు పెళ్లికి నిరాకరించాడు. వేణు అనే యువకుడు తన వివాహాన్ని రద్దు చేసుకున్నాడు. గతంలో సదరు వధువు వేరే యువకుడితో ప్రేమాయాణం నడిపిందని ఆరోపించాడు. అయితే పెళ్లికి ముందే అన్ని విషయాలు వరుడికి చెప్పానని వధువు తెలిపింది. అప్పుడు అన్నింటికి సరేనని, రాత్రి రిసెప్షన్ కూడా చేసుకుని, సరిగ్గా మంటపానికి వచ్చేసరికి పెళ్లికి వరుడు నిరాకరించాడని వధువు కన్నీటి పర్యంతమయింది. దీంతో వధువరులు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తమ వధువుకు న్యాయం చేయాలని ఆమె తరపు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
వీడియోలు


భారత్ దెబ్బకు వణుకుతున్న పాక్


CID పరిధి తేలుస్తాం !


హైదరాబాద్ ను చిత్తు చిత్తుగా ఓడించిన గుజరాత్


పెద్దా రెడ్డి తాడిపత్రికి వస్తే తిరిగి వెళ్లడు.. జేసీ వివాదాస్పద వ్యాఖ్యలు..


సింహాచలం ఘటన నుంచి తప్పించుకునేందుకు కూటమి సర్కారు ప్రయత్నాలు


Big Question: మన రాజధానికి అడ్డెవరు? ప్రధాని ముందే పచ్చి అబద్దాలు


పొగడ్తలేనా.. ప్రయోజనాలు పట్టవా..!


ప్రమాదానికి కారణమైన గోడను నోటి మాటతో కట్టేశారు


Pahalgam : ఒక్కడి కుట్ర సంక్షోభంలోకి పాకిస్తాన్


అమరావతిలో మోదీ స్పీచ్