Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

Canada PM Mark Carney powerful victory speech Slams Trump1
ట్రంప్‌ కోరుకునేది ఎన్నటికీ జరగదు.. విక్టరీ స్పీచ్‌లో మార్క్‌ కార్నీ

టొరంటో: కెనడాలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అధికార లిబరల్‌ పార్టీ(Liberal Party of Canada) విజయం దిశగా దూసుకెళ్తోంది. వరుసగా నాలుగోసారి అధికారం చేపట్టడం దాదాపు ఖాయం కావడంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. ఈ క్రమంలో మార్క్‌ కార్నీ(Mark Carney) మద్ధతుదారుల్ని ఉద్దేశిస్తూ విజయ ప్రసంగం చేస్తూ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు.‘‘కెనడా చరిత్రలో కీలకమైన క్షణం ఇది. అమెరికా(America)తో మన పాత ఏకీకరణ సంబంధం ఇప్పుడు ముగిసింది. ఇకపై అమెరికాను స్థిరమైన మిత్రదేశంగా నమ్మలేం. అమెరికా చేసిన ద్రోహం నుండి మనం తేరుకుంటున్నాం. నెలల తరబడి నుంచి నేను ఈ విషయంలో హెచ్చరిస్తూ వస్తున్నా. అమెరికా మన భూమిని, మన వనరులను, మన నీటిని, మన దేశాన్ని కోరుకుంటోంది. మనల్ని విచ్ఛిన్నం చేసి తద్వారా కెనడాను సొంతం చేసుకోవాలని ట్రంప్‌ ప్రయత్నించారు. కానీ, అది ఎప్పటికీ జరగదు’’ అని కార్నీ అన్నారు.అమెరికాతో సుంకాల యుద్ధం, కెనడా యూఎస్‌లో 51వ రాష్ట్రంగా చేరాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) బెదిరింపుల వేళ ఈ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కెనడా పార్లమెంట్‌లో 343 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటునకు 172 మెజారీటీ అవసరం. ఇప్పటికే కన్జర్వేటివ్‌ పార్టీ నేత పియరీ పొయిలివ్రా ఓటమిని అంగీకరించారు. అయితే లిబరల్‌ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోయినప్పటికీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో మిత్రపక్షాలతో కలిసి మార్క్‌ కార్నీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.ఈ ఏడాది జనవరిలో జస్టిన్‌ ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో లిబరల్‌ పార్టీ సభ్యులు తదుపరి ప్రధానిగా ఆర్థిక వేత్త అయిన మార్క్‌ కార్నీని ఎన్నుకున్నారు. ప్రధాని బాధ్యతలు చేపట్టిన కార్నీ.. ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.ఇదీ చదవండి: ట్రంప్‌తో కయ్యం.. ఎవరీ మార్క్‌ కార్నీ?

Kharge Rahul Special Parliament Request to Modi on Pahalgam2
ఐక్యత చాటాల్సిన తరుణమిది.. మోదీకి ఖర్గే, రాహుల్‌ లేఖ

న్యూఢిల్లీ: పహల్గాం దాడి నేపథ్యంతో ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే.. ఇటు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు వేర్వేరు ఈ ఇద్దరూ ప్రధాని నరేంద్ర మోదీ(Narendra modi)కి లేఖలు రాశారు.2025 ఏప్రిల్ 22న పహల్గాం ఘటన(Pahalgam Incident)లో అమాయక పౌరులపై జరిగిన క్రూరమైన ఉగ్రవాద దాడి జరిగింది. ఈ తరుణంలో ఐక్యత, సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉంది. అందుకే పార్లమెంట్‌ ఉభయ సభలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయించండి. తద్వారా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలనే మన సమిష్టి సంకల్పానికి ఇది శక్తివంతమైన ప్రదర్శన అవుతుంది అని ఖర్గే(Kharge) తన లేఖలో ప్రస్తావించారు.Congress President and Leader of the Opposition in the Rajya Sabha Shri Mallikarjun Kharge has written to the PM last night requesting that a special session of both Houses of Parliament be convened at the earliest to demonstrate a collective will to deal with the situation… pic.twitter.com/v3F5unn6I8— Jairam Ramesh (@Jairam_Ramesh) April 29, 2025ఇక తన లేఖలో రాహుల్‌ గాంధీ.. ప్రియమైన ప్రధానిగారూ.. పహల్గాం ఉగ్రదాడితో ప్రతీ భారతీయుడు రగిలిపోతున్నాడు. ఇలాంటి క్లిష్టతరుణంలో ఉగ్రవాదానికి మనమెంత వ్యతిరేకమో చాటిచెప్పాల్సిన అవసరం ఉంది. ఐక్యత ప్రదర్శించాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయి. అది పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల మాత్రమే సాధ్యపడుతుందని ప్రతిపక్షంగా మేం భావిస్తున్నాం. ఇక్కడే ప్రజాప్రతినిధులు తమ ఐక్యతను, దృఢ సంకల్పాన్ని ప్రదర్శించగలరు. కాబట్టి వీలైనంత త్వరగా సమావేశం నిర్వహిస్తారని ఆశిస్తున్నాం అని రాహుల్‌ గాంధీ(Rahul gandhi) రాశారు. My letter to PM Modi requesting a special session of both houses of Parliament to be convened at the earliest. At this critical time, India must show that we always stand together against terrorism. pic.twitter.com/7AIXGqBqTl— Rahul Gandhi (@RahulGandhi) April 29, 2025ఇదిలా ఉంటే.. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్‌ 4వ తేదీల మధ్య రెండు దఫాలుగా జరిగాయి. ఇక తరువాత జులైలో వర్షాకాల సమావేశాలు జరగాల్సి ఉంది. ఈ తరుణంలో ప్రతిపక్ష విజ్ఞప్తికి కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.పహల్గాం దాడి తర్వాత జరిగిన అఖిలపక్ష సమావేశంలో.. విపక్షాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతుగా నిలుస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

India Army Effect 4500 Pakistani Soldiers And Officers Resign3
భారత్‌తో యుద్ధ భయం.. పాక్‌ సైన్యంలో భారీ రాజీనామాలు

ఇస్లామాబాద్‌: కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత భారత్‌, పాకిస్తాన్‌ మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. భారత్‌ ఎప్పుడు, ఎలా దాడి చేస్తుందోనన్న భయంతో పాకిస్తాన్‌ వణికిపోతోంది. తమపై భారత్‌ వైమానిక దాడులకు దిగొచ్చని పాకిస్తాన​్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత వైమానిక దాడులను పసిగట్టడానికి సియాల్‌కోట్‌ ప్రాంతానికి పాక్‌ సైన్యం తన రాడార్‌ వ్యవస్థలను తరలిస్తున్నట్లు సమాచారం. అలాగే, అత్యవసరంగా తమ దేశ గగనతలాన్ని సైతం మూసివేసింది.ఇదిలా ఉండగా.. పహల్గాం దాడి తర్వాత భారత్‌ తీసుకుంటున్న చర్యలు, హెచ్చరికల కారణంగా పాకిస్తాన్‌కు టెన్షన్‌ మొదలైంది. ఈ క్రమంలో పాక్‌ ఆర్మీ కూడా భయాందోళనకు గురైనట్టు తెలుస్తోంది. ఈ ఉగ్రదాడి తర్వాత.. కేవలం రెండు రోజుల వ్యవధిలో పాకిస్తాన్‌ ఆర్మీలో 4500 మంది సైనికులు, 250 మంది అధికారులు తమ పదవులను విడిచిపెట్టి వెళ్లిపోయినట్టు ‘ది డేలీ గార్డియన్‌’ ఓ కథనంలో వెల్లడించింది. ఈ మేరకు పాక్‌ 11వ దళ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉమర్ బుఖారీ లేఖను బయటపెట్టింది.కథనం ప్రకారం.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌కు బుఖారీ ఒక లేఖ రాశారు. ఈ లేఖలో తమ దేశ సైనికుల ఆత్మస్థైర్యం వేగంగా క్షీణిస్తోందని హెచ్చరించారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే.. ఒకవేళ భారత్‌తో యుద్ధం చేయాల్సి వస్తే.. పాకిస్తాన్ సైన్యం అసమర్థమైన ప్రతిఘటనను ప్రదర్శించవచ్చు. కొంతమంది సైనికులు ఇప్పటికే క్రియాశీల విధులను విడిచిపెట్టినప్పటికీ, మరికొందరు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది పాకిస్తాన్ సైనిక ర్యాంకుల్లో తీవ్ర సంక్షోభాన్ని సూచిస్తోంది. ఈ పరిణామం తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు.. సామూహిక రాజీనామాలపై పాకిస్తాన్ సీనియర్ అధికారులు ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. పహల్గాం దాడి తర్వాత బలమైన భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంటుందనే భయమే రాజీనామాలకు ముఖ్య కారణంగా తెలుస్తోంది. భారత్‌ ఎప్పుడైనా దాడి చేయవచ్చనే భయంతో సైనికులు కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు సైనికులు రాజీనామాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 🚨 Breaking News.4500 Soldiers and 250 Officers of Pakistan Army resigned from service amid arising tension with India after #PahalgamTerroristAttackLt. Gen Umar Ahmad Bukhari, 11 Corp Cdr has written this letter to the Chief of army Staff. This letter is being circulated on… pic.twitter.com/XLE1G84rrY— JK CHANNEL (@jkchanneltv) April 28, 2025మునీర్‌ ఎక్కడ?మరోవైపు.. సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ సైన్యాధిపతి జనరల్‌ సయీద్‌ అసిమ్‌ మునీర్‌ కనిపించడం లేదన్న వార్తలు పాకిస్తాన్‌లో కలకలం రేపుతున్నాయి. కుటుంబంతో పాటుగా ఆయన దేశం వీడి పారిపోయారని స్థానిక మీడియాలో ఆదివారం వార్తలొచ్చాయి. ‘తొలుత కుటుంబాన్ని విదేశాలకు తరలించారు. తర్వాత తానూ పాక్‌ వీడారు’ అన్నది వాటి సారాంశం. కొద్ది రోజులుగా, ఆ మాటకొస్తే పహల్గాం దాడి జరిగినప్పటి నుంచీ మునీర్‌ బయట ఎక్కడా కన్పించడం లేదని ఆ కథనాలు చెబుతున్నాయి. దాడిపై ఆగ్రహంతో రగిలిపోతున్న భారత్‌ తీవ్రస్థాయిలో ప్రతీకార చర్యలకు దిగుతుందని పాక్‌ ఆందోళన చెందుతోంది. అందుకు తానే బాధ్యుడిని అవుతానని మునీర్‌ భయపడ్డారు. అందుకే దేశం నుంచి జారుకున్నట్టు కనిపిస్తోంది’ అని కథనాలు పేర్కొంటున్నాయి

YS Jagan Wishing speedy recovery For KTR4
బ్రదర్‌ కేటీఆర్‌.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: జిమ్‌లో వర్కౌట్‌ చేస్తుండగా గాయపడిన మాజీ మంత్రి కేటీఆర్‌(KTR) త్వరగా కోలుకోవాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. బ్రదర్‌ కేటీఆర్‌.. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని వైఎస్‌ జగన్‌ పోస్టు చేశారు. ఇక, బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR) జిమ్‌లో వర్కౌట్‌ చేస్తుండగా గాయపడ్డారు. దీంతో, కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని కేటీఆర్‌కు వైద్యులు ఆయనకు సూచించారు. ఈ విషయాన్ని కేటీఆర్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. వైద్యుల పర్యవేక్షణలో రికవరీ అవుతున్నట్లు పేర్కొన్నారు. త్వరగా కోలుకొని రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న పలువురు నేతలు, అభిమానులు కేటీఆర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు.Wishing you a speedy recovery, brother. Get well soon! @KTRBRS— YS Jagan Mohan Reddy (@ysjagan) April 29, 2025 Picked up a slip disc injury during a gym workout session. Have been advised a few days of bed rest and recovery by my doctorsHope to be back on my feet soon— KTR (@KTRBRS) April 28, 2025

Security concerns 48 Resorts And Tourist Sites Shut Down In Kashmir5
కశ్మీర్‌లో స్లీపర్‌సెల్స్‌ యాక్టివ్‌.. ఇంటెలిజెన్స్‌ హెచ్చరిక

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం దాడి ఘటనతో అక్కడ భారత ఆర్మీ హైఅలర్ట్‌లో ఉంది. మరోవైపు.. కశ్మీర్‌లో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో 48 టూరిస్టు కేంద్రాలను జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం మూసివేసింది.వివరాల ప్రకారం.. పహల్గాం దాడి అనంతరం కశ్మీర​్‌ లోయలో స్లీపర్‌సెల్స్‌ యాక్టివేట్‌ అయినట్లు నిఘావర్గాలు తెలిపాయి. దీంతో, కశ్మీర్‌లో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. అనంతరం, కశ్మీర్‌లో ఉన్న 48 టూరిస్టు కేంద్రాలను ప్రభుత్వం మూసివేసింది. కశ్మీర్‌ వ్యాప్తంగా ఉన్న మొత్తం 87 టూరిస్టు కేంద్రాల్లో వీటిని మూసివేస్తున్నట్లు పేర్కొన్న అధికారులు వెల్లడించారు.ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రదాడి ఘటనపై జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. పర్యాటకులను పాశవికంగా హతమార్చిన ఘటనపై చర్చించేందుకు జమ్ముకశ్మీర్‌ శాసనసభ సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఉగ్రదాడి మృతులకు సంతాపసూచకంగా సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండించింది. పాశవికదాడిపై తీవ్ర దిగ్భ్రాంతిని, ఆవేదనను వ్యక్తం చేస్తూ ఏకగ్రీవంగా ఓ తీర్మానాన్ని ఆమోదించింది.దానికి ముందు సీఎం ఒమర్‌ అబ్దుల్లా మాట్లాడుతూ..‘బైసరన్‌లో ఇంత పెద్ద స్థాయిలో దాడి చేయడం మాత్రం 21 ఏళ్లలో ఇదే తొలిసారి. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఎలా క్షమాపణలు చెప్పాలో తెలియడం లేదు. రాష్ట్రానికి వచ్చిన పర్యాటకులను సురక్షితంగా తిరిగి పంపాల్సిన బాధ్యత మాదే. నేను ఆ పనిచేయలేకపోయాను. పహల్గాం ఘటన తర్వాత ఏ ముఖం పెట్టుకొని రాష్ట్ర హోదాను డిమాండ్‌ చేయాలి. నా రాజకీయాలు అంత చౌకబారువి కాదు. గతంలో రాష్ట్ర హోదా అడిగాం.. భవిష్యత్తులో కూడా అడుగుతాం. కానీ, 26 మంది చనిపోయారు.. ఇప్పుడు రాష్ట్ర హోదా ఇవ్వండి అని కేంద్రాన్ని అడగడం సిగ్గుచేటు. ప్రజలు మాకు మద్దతు ఇస్తే.. ఉగ్రవాదం అంతమవుతుంది’ అని పేర్కొన్నారు.

IPL Star Vaibhav Suryavanshi success story even Father Sold Off His Land6
తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్‌!

వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఐపీఎల్‌ 2025 (Indian Premier League 2025) సీజన్‌లో ఒక సంచలనం. చిచ్చర పిడుగు.14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో అడుగుపెట్టి చర్రితను తిరగరాసిన అద్భుత ప్రతిభావంతుడు. ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కుడైన క్రికెటర్,ప్రపంచ రికార్డును బద్దలు కొట్టేశాడు. అయితే ఎవరి విజయమైనా అంత సులువుగా రాదు. కష్టాలు కన్నీళ్లు, కఠోర శ్రమతో తన కలను సాకారం చేసుకున్నాడు. అద్భుత ఇన్నింగ్స్‌ తరువాత తన జర్నీ గురించి మాట్లాడిన తీరు అమోఘంగా నిలిచింది. ఈ సందర్బంగా వైభవ్‌ సక్సెస్‌ జన్నీ ఎలా సాగింది, దేశంలోని అత్యుత్తమ క్రికెటర్‌గా తీర్చిదిద్దేందుకు వైభవ్‌ కుటుంబం చేసిన త్యాగం, కృషి ఏంటి అనేది నెట్టింట చర్చకు దారి తీసింది.వైభవ్‌ తండ్రి త్యాగం, పట్టుదల14 ఏళ్ల క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ, T20లలో అర్ధశతకం సాధించిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడి ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. దీంతో యువ క్రికెటర్‌పై ప్రశంసలు వెల్లువెత్తాయి. కొడుకు స్వయంగా గ్రౌండ్‌, నాలుగేళ్ల క్రితం పొలం అమ్మేశాడువైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ సూర్యవంశీ తన కొడుకు క్రికెటర్ కావాలనే కలను నెరవేర్చడానికి నాలుగు సంవత్సరాల క్రితం తన వ్యవసాయ భూమిని అమ్మేశాడు. 2011 మార్చి 27న బిహార్‌లోని తాజ్‌పూర్ అనే ఓ మారుమూల గ్రామంలో జన్మించాడు వైభవ్ సూర్యవంశీ. నాలుగేళ్ల వయసులోనే క్రికెట్‌ అంటే ఇష్టాన్ని, అతనిలోని ప్రతిభను తండ్రి , స్వయంగా క్రికెటర్‌ అయిన సంజీవ్ సూర్యవంశీ ‌ గుర్తించాడు. అంతే తనకున్న కొద్దిపాటి స్థలంలోనే వైభవ్ కోసం ఒక చిన్న ఆట స్థలాన్ని ఏర్పాటు చేశాడు. స్వయంగా ఆయన చేతుల మీదిగా ఆ నేలను చదును చేసి కొడుకు కోసం చిన్న ప్లే గ్రౌండ్‌ తయారు చేసి ఇచ్చాడు. అదే అతని కరియర్‌కు నాంది పలికింది. తొమ్మిదేళ్లు నిండగానే సమస్తిపూర్ పట్టణంలోని క్రికెట్ అకాడమీలో చేర్పించారు సంజీవ్‌. అంతేకాదు కొడుకును క్రికెటర్‌గా తీర్చిదిద్దాలన్న కోరిక, కొడుకు క్రికెట్ కలను సాకారం కావాలనే ఆశయంతో తన పొలాన్ని అమ్మేశారు. తండ్రి నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయలేదు కొడుకు. రెండున్నరేళ్ల శిక్షణ తరువాత విజయ్ మర్చంట్ ట్రోఫీ కోసం అండర్-16లో సత్తా చాటాడు వైభవ్‌. అలాగే ప్రతి రోజు సమస్తిపూర్ నుండి పాట్నాకు 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి మరీ మాజీ రంజీ ఆటగాడు మనీష్ ఓజా శిక్షణలో మరింత రాటు దేలాడు. అలా గత ఏడాది ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ అతి పిన్న వయస్కుడైన క్రికెటర్ ఎంపిక చేయడం వరకు అతని జర్నీ సాగింది. వైభవ్‌ తనకొడుకు మాత్రమే కాదని, మొత్తం బిహార్‌కు కొడుకునని సంతోషంగా ప్రకటించారు తండ్రి సంజీవ్‌.చదవండి : ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్‌డోరేమాన్ నుంచి 13 ఏళ్లకే కోటీశ్వరుడుగాతాను కష్టపడి పనిచేసి వైభవ్‌కు శిక్షణ ఇప్పించాననీ, ఎనిమిదేళ్ల వయస్సు నుండి, క్రికెటర్ కావాలనే తన కలను సాధించేందుకు చాలా కష్టపడ్డాడంటూ కొడుకు పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు సంజీవ్‌. చిన్నపుడు డోరేమాన్‌ చూసేవాడు.. ఆ తరువాత క్రికెట్‌ ఒకటే.. అదే అతని ప్రాణం. ఎనిమిదేళ్లకే U-16 జిల్లా ట్రయల్స్‌లో రాణించాడన్నారు. క్రికెట్ కోచింగ్ కోసం సమస్తిపూర్‌కు తీసుకెళ్లి, తీసుకొచ్చేవాడినంటూ ఆయన తన శ్రమను గుర్తు చేసుకున్నారు. తన శ్రమ, త్యాగం వృధా కాలేదు అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. వైభవ్‌ను క్రికెటర్‌గా చూడాలన్న ఆశయంకోసం వ్యవసాయ భూమిని అమ్మేశాను.ఇప్పటికీ ఆర్థిక సమస్యలున్నాయని చెప్పుకొచ్చారు.IPL 2025 వేలం రెండవ రోజున, రాజస్థాన్ రాయల్స్ వైభవ్‌ను రూ. 1.10 కోట్లు వెచ్చింది. ఈ ఎన్నిక అంత ఆషామాషీగా ఏం జరగలేదు. ఈ మెగా వేలానికి ముందు, రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్‌ నాగ్‌పూర్‌లో ఏర్పాటు చేసిన ట్రయల్స్‌ క్యాంప్‌లో సత్తా చాటుకున్నాడు. చిచ్చర పిడుగు సిక్సర్ల టాలెంట్‌ అప్పుడే బైటపడింది. ఇపుడు చరిత్రలో అతి పిన్న వయస్కుడైన ఆటగాడి తన పేరును లిఖించుకున్నాడు. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేసి తొలి బాల్‌ సిక్స్‌కొట్టి ఔరా అనిపించుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ చరిత్రలో మొదటి బంతికి సిక్స్ కొట్టిన పదో ఆటగాడిగా నిలిచాడు. అతని దూడుకును గమనిస్తే.. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు రానున్నాయో అనిపించక మానదు. అందుకే యావత్‌ క్రికెట్‌ అభిమానులు ఆల్‌ ది బెస్ట్‌ అంటూ అభినందిస్తున్నారు.

today gold and silver rates on telugu states7
రేపే అక్షయ తృతీయ.. భగ్గుమంటున్న పసిడి ధరలు!

స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టినట్లే పట్టి తిరిగి ఈరోజు మళ్లీ పెరిగింది. త్వరలో తులం రూ.ఒక లక్షకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో మంగళవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.89,800 (22 క్యారెట్స్), రూ.97,970 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవార ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.400, రూ.440 పెరిగింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.400, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.440 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.89,800 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.97,970 (24 క్యారెట్స్ 10 గ్రామ్‌ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.400 పెరిగి రూ.89,950కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.440 పెరిగి రూ.98,120 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగా కాకుండా మంగళవారం వెండి ధర(Silver Prices)ల్లో ఎలాంటి మార్పులు కనిపించలేదు. నిన్నటి ధరలతో వెండి ధర స్థిరంగా ఉంది. దాంతో కేజీ వెండి ధర రూ.1,11,000 వద్ద నిలిచింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

These Top Two Cool Drinks Companies Have Appointed Allu Arjun, Ram Charan As Their Brand Ambassadors8
బన్నీ,చెర్రీ ఫైట్‌..ఫ్యాన్స్‌ ‘కోలా’హలం తప్పదా?

ఇది వేసవి సూర్యుడు ప్రచండ భానుడై ప్రతాపం చూపే సమయం. దాంతో జనమంతా చల్లని పానీయాలకు జై కొట్టే సమయం. సాధారణంగానే కూల్‌ డ్రింక్స్‌ అమ్మకాలు పీక్స్‌లో ఉండే ఈ టైమ్‌లో అత్యధిక వ్యాపారాన్ని దక్కించుకోవాలని కోలా బ్రాండ్స్‌ తహతహలాడుతాయి. రకరకాల ప్రకటనల ద్వారా దాహార్తి నిండిన గొంతులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాయి. దాంతో ఈ సీజన్‌ ఆసాంతం ప్రకటనల ‘కోలా’హలంతో నిండిపోతుంది.వేసవి వచ్చినప్పుడల్లా కూల్‌ డ్రింక్స్‌ బ్రాండ్స్‌ మధ్య ఆధిపత్య పోరు ఆటోమేటిక్‌గా వేడెక్కడం కోలా కంపెనీల్లో రివాజు. అది ఈ సంవత్సరం ఇప్పటికే ప్రారంభమైంది. అయితే ఈ సారి ఆధిపత్య పోరు బ్రాండ్స్‌తో ఆగేటట్టుగా లేదు. ఇప్పటికే ఇద్దరు టాలీవుడ్‌ అగ్రనటుల మధ్య సాగుతున్న ఆధిపత్యపోరు దీనికి జతయ్యేట్టుగా ఉంది. దానికి కారణం పుష్ప, పెద్దిలే...అదేనండీ.. అల్లు అర్జున్, రామ్‌చరణ్‌లే.పుష్ప తో ఆల్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్‌ (Allu Arjun) ఇమేజ్‌ని క్యాష్‌ చేసుకోవాలని ఎన్నో కంపెనీలు ఉవ్విళ్లూరాయి. అదే క్రమంలో ప్రముఖ కూల్‌ డ్రింక్‌ బ్రాండ్‌ థమ్స్‌ అప్‌ తన దక్షిణాది బ్రాండ్‌ అంబాసిడర్‌గా అల్లు అర్జున్‌ ని ఎంచుకుంది. పుష్పరాజ్‌తో... చాలా ఉత్తేజకరమైన ఎనర్జిటిక్‌ వీడియోలను తయారు చేసి విడుదల చేసింది. అవి బాగా జనంలోకి దూసుకెళ్లాయి కూడా. అయితే ఇప్పుడు థమ్స్‌ అప్‌కి ప్రత్యర్ధిగా ఉన్న క్యాంపా కోలా...బన్నీకి ధీటైన మరో నటుడి గురించి సాగించిన అన్వేషణ మరో టాలీవుడ్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ దగ్గర ఆగింది. తాజా ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా ఈ కోలా బ్రాండ్‌ ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించింది.ఆర్‌ఆర్‌ఆర్‌తో గ్లోబల్‌ స్టార్‌ అనిపించుకున్న రామ్‌చరణ్‌ (Ram Charan) ను క్యాంపాకోలా తన బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకోవడం కూల్‌గా మాట్లాడుకోవాల్సిన కూల్‌ టాపిక్‌ను వేడి వేడిచర్చలకు కేంద్ర బిందువైన హాట్‌ టాపిక్‌గా మార్చింది.ప్రస్తుతం మెగా , అల్లు కుటుంబాల బంధం మధ్య బన్నీ, చెర్రీలనే అడ్డుగీతలు ఉన్నాయనేది బహిరంగ రహస్యమే. రామ్‌ చరణ్, అల్లు అర్జున్‌ పరస్పరం ఎడముఖం పెడముఖంగా ఉన్నారు అనడం చాలా చిన్నమాట. బయటకు చెప్పకున్నా, సోషల్‌ మీడియాలో అన్‌ఫాలోల దగ్గర నుంచి ఫాలోయర్స్, ఫ్యాన్స్‌ మధ్య సాగుతున్న మాటల యుద్ధం వరకూ బన్నీ, చెర్రీల వార్‌... గట్టిగా నడుస్తూనే ఉంది. ఈ నేపధ్యంలో రెండు బలమైన కూల్‌ డ్రింక్‌ బ్రాండ్స్‌ కాంపా కోలా, థమ్స్‌ అప్‌ లకు వారు అంబాసిడర్‌లుగా ఎంపిక కావడంతో ఈ వైరం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నేపధ్యంలో ఈ రెండు బ్రాండ్స్‌ భవిష్యత్తులో రూపొందించే ప్రకటనలు ఫ్యాన్స్‌ మధ్య ఎలాంటి ప్రకంపనలు పుట్టిస్తాయో.. ఎంత హీట్‌ తెస్తాయో.....చూడాలి.మరోవైపు క్యాంపా కోలా ప్రకటనలు రామ్‌ చరణ్‌ స్టార్‌ స్టేటస్‌పై ఎక్కువగా ఆధారపడి రూపుదిద్దుకుంటున్నాయి. ముఖ్యంగా మగధీర, ఆర్‌ఆర్‌ఆర్‌ లలోని ప్రసిద్ధ సినిమా సన్నివేశాలను ఇవి వాడుకుంటున్నాయి.

IPL 2025: Vaibhav Suryavanshi Comments After Record Making Hundred Over Gujarat9
RR VS GT: ఇది నా కల.. నాకు భయం లేదు: వైభవ్‌ సూర్యవంశీ

ఐపీఎల్‌ 2025లో నిన్న (ఏప్రిల్‌ 28) గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ కుర్రాడు వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసకర శతకంతో (35 బంతుల్లో) విరుచుకుపడ్డాడు. ఈ సెంచరీతో (38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు) వైభవ్‌ చాలా రికార్డులు కొల్లగొట్టాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్‌ విధ్వంసకాండ దెబ్బకు రాయల్స్‌ 15.5 ఓవర్లలోనే గుజరాత్‌ నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి అద్భుత విజయం సాధించింది.వైభవ్‌ సాధించిన రికార్డులు..ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన భారత ఆటగాడు (35 బంతుల్లో)ఐపీఎల్‌లో సెకెండ్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన ఆటగాడు (క్రిస్‌ గేల్‌ (30 బంతుల్లో) తర్వాత)ఐపీఎల్‌లో సెంచరీ, హాఫ్‌ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడు (14 ఏళ్ల 32 రోజులు)ఐపీఎల్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (11) కొట్టిన ఆటగాడు (మురళీ విజయ్‌తో కలిసి)టీ20 క్రికెట్‌ చరిత్రలో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడు (14 ఏళ్ల 32 రోజులు)ఐపీఎల్‌లో హాఫ్‌ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడు (14 ఏళ్ల 32 రోజులు)ఐపీఎల్‌ 2025లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ (17 బంతుల్లో)ఐపీఎల్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్న అతి పిన్న వయస్కుడుమ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌.. శుభ్‌మన్‌ గిల్‌ (50 బంతుల్లో 84; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), జోస్‌ బట్లర్‌ (26 బంతుల్లో​ 50 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు‌), సాయి సుదర్శన్‌ (30 బంతుల్లో 39; 4 ఫోర్లు, సిక్స్‌) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్‌.. వైభవ్‌ రికార్డు సెంచరీతో (38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు) చెలరేగడంతో మరో 25 మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. రాయల్స్‌ గెలుపులో వైభవ్‌తో పాటు మరో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (40 బంతుల్లో 70 నాటౌట్‌; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా కీలకపాత్ర పోషించాడు. ఆఖర్లో రియాన్‌ పరాగ్‌ (15 బంతుల్లో 32 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు.మ్యాచ్‌ అనంతరం వైభవ్‌ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఇది చాలా మంచి అనుభూతి. ఐపీఎల్‌లో సెంచరీ సాధించాలనేది నా కల. దీన్ని నా మూడో మ్యాచ్‌లోనే సాకారం చేసుకున్నాను. సీజన్‌ ప్రారంభానికి ముందు చేసిన కఠోర సాధనకు ఈ మ్యాచ్‌లో ఫలితం పొందాను. నేను బంతిని బాగా గమనించి ఆడతాను. నాకు భయం లేదు. నేను పెద్దగా ఆలోచించను. కేవలం ఆడటంపైనే దృష్టి పెడతాను. జైస్వాల్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా బాగుంది. అతను నాకు ప్రతి విషయంలో గైడ్‌ చేస్తాడు. ఏమి చేయాలో, ఎలా ఆడాలో చెబుతాడు. నాలో సానుకూల విషయాలను నింపుతాడు.కాగా, రాజస్థాన్‌ రాయల్స్‌ యాజమాన్యం వైభవ్‌ను ఎంతో నిశితంగా పరిశీలించి, ఈ సీజన్‌ మెగా వేలంలో రూ. 1.1 కోట్లకు కొనుక్కుంది. ఊహించినట్లుగానే వైభవ్‌ తొలి మ్యాచ్‌లోనే (లక్నోతో) విధ్వంకర ఇన్నింగ్స్‌ (20 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆడి ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో వైభవ్‌ తొలి బంతికే సిక్సర్‌ బాది అందరినీ ఆశ్యర్యపరిచాడు. ఆతర్వాతి మ్యాచ్‌లో (ఆర్సీబీ) కాస్త నిరాశపరిచినా (12 బంతుల్లో 16; 2 సిక్సర్లు).. కెరీర్‌లో మూడో మ్యాచ్‌లోనే విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు.

Nawaz Sharif Warns Pakistan PM Shehbaz Sharif Over India10
భారత్‌తో జాగ్రత్త.. పాక్‌ ప్రధానికి నవాజ్‌ షరీఫ్‌ హెచ్చరిక

లాహోర్‌: పహల్గాం అమానవీయ ఉగ్రదాడి ఘటనను ప్రపంచ దేశాలు ఖండించాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల సమసిపోవాలంటే దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని తమ్ముడు, పాక్‌ ప్రధాని షెహబాజ్‌కు నవాజ్‌ సలహా ఇచ్చారు.పాకిస్తాన్‌ స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. లాహోర్‌లో నవాజ్‌ షరీఫ్‌తో షహబాజ్‌ ఆదివారం భేటీ అయ్యారు. పహల్గాం దాడి తర్వాత భారత్‌ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా తన ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆయనకు వివరించారు. సింధూ నదీజలాల ఒప్పందం నుంచి భారత్‌ వైదొలిగిన విషయాలను వెల్లడించారు. భారత్‌ తీరు వల్లే ఉద్రిక్తతలు పెరిగాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నవాజ్‌ షరీఫ్‌ స్పందించి.. దూకుడుగా వ్యవహరించకుండా, భారత్‌తో శాంతి పునరుద్ధరణ కోసం అందుబాటులో ఉన్న అన్ని దౌత్య మార్గాలను వినియోగించుకోవాలని తన తమ్ముడికి సూచించినట్టు చెప్పుకొచ్చింది. మరోవైపు.. షరీఫ్‌ కుమార్తె, పంజాబ్‌ ప్రావిన్స్‌ ముఖ్యమంత్రి మర్యమ్‌ సైతం ఇంతవరకు ఉగ్రదాడి ఘటనను ఖండిస్తూ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌ విషయంలో భారత్‌ కఠిన చర్యలు తీసుకుంది. దీనిపై దాయాది దేశం అక్కసు వెళ్లగక్కుతోంది. ఈ పరిణామాల నడుమ పాకిస్తాన్‌(Pakistan) రక్షణశాఖ మంత్రి ఖవాజా మహమ్మద్‌ ఆసిఫ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఘటన నేపథ్యంలో భారత్‌ ప్రతీకార దాడి చేపడుతుందని, త్వరలోనే ఇది జరిగే అవకాశం ఉందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రతీకార దాడి జరగనున్న విషయం కాబట్టి.. మా బలగాలను అప్రమత్తం చేశాం. దాడుల జరిగే పరిస్థితుల్లో కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆ మేరకు చర్యలు తీసుకున్నామని అన్నారు. అయితే, తన అంచనాలకు దారి తీసిన వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. భారత్‌ దాడులకు పాల్పడే అవకాశం ఉందని తమ సైన్యం ప్రభుత్వానికి వివరించిందని తెలిపారు. ఈ విషయమై పాక్‌ అత్యంత అప్రమత్తంగా ఉందని, తమ ఉనికికి ప్రత్యక్ష ముప్పు ఉందని భావిస్తే అణ్వాయుధాలను ప్రయోగిస్తామని పేర్కొన్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement