Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

Train passengers Interest in AC coaches in hot weather1
బోగీలు భగభగ.. ఏసీలో చల్లగా..

సికింద్రాబాద్‌–హౌరా మధ్య తిరిగే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ థర్డ్‌ ఏసీ ఎకానమీలో నెల క్రితం వరకు 15 రోజుల ముందు కూడా టికెట్లు అందుబాటులో ఉండేవి. కానీ ప్రస్తుతం మే 15న ప్రయాణానికి వెయిటింగ్‌ జాబితా 85గా ఉంది. ఇక 31వ తేదీన వెళ్లాలంటే అసలు బుకింగ్‌కే వీల్లేకుండా ఉంది.ఈస్ట్‌ కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో మే 15న వెళ్లాలంటే వెయిటింగ్‌ లిస్ట్‌లో 47వ నంబర్‌ చూపుతోంది. నెలాఖరుకు ‘రిగ్రెట్‌’ అని చూపుతోంది. దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో ఈనెల మొత్తం వెయిటింగే చూపుతోంది. వీటిల్లో కేవలం థర్డ్‌ ఎకానమీ క్లాస్‌ మాత్రమే కాదు, ఏసీ కేటగిరీలోని ఏ తరగతిలోనూ వచ్చే నెల రోజుల్లో టికెట్లు అందుబాటులో లేవు. కానీ అల్పాదాయ వర్గాలకు అందనంత దూరంలో ఉండే వందేభారత్‌ రైళ్లలో మాత్రం 15 రోజుల ముందు కూడా టికెట్లు లభిస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్‌: రైలు ప్రయాణం అంటే ప్రజలు హడలిపోతున్నారు. నడి వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పగటి వేళ రైలు ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది. తీవ్రమైన ఎండలతో కోచ్‌లు కొలిమిలా మారుతున్నాయి. ఫ్యాన్ల నుంచి వచ్చే వేడి గాలి, కిటికీల్లోంచి వీచే వడగాడ్పులు ప్రయాణికులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చల్లటి వేళ రైలెక్కుతున్నప్పటికీ సుదూర ప్రాంతానికి ప్రయాణం చేసేవారు పగటి వేళ రైలు బోగీల్లో వేడి, ఉక్కపోతతో వడదెబ్బకు సైతం గురవుతున్నారు.పేద, అల్పాదాయ, మధ్య తరగతి వర్గాలు రైలు ప్రయాణానికి సాధారణంగా చార్జీ తక్కువగా ఉండే జనరల్‌ లేదా స్లీపర్‌ కోచ్‌లనే ఎంచుకోవటం కద్దు. కాని వేసవి భగ భగలతో బోగీలు ఉడికిపోతున్న నేపథ్యంలో చార్జీ భారమైనా చాలామంది ఇప్పుడు ఏసీ కోచ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో అన్ని రైళ్లలో ఏసీ కోచ్‌లు నెల ముందే నిండిపోతున్నాయి.దాదాపుగా అన్ని రైళ్లలోనూ నెల తర్వాత వెయిటింగ్‌ జాబితా చూపిస్తోంది. ఏసీ కోచ్‌లకు రోజురోజుకూ డిమాండ్‌ పెరుగుతుండటంతో రైల్వే శాఖ దీనిపై దృష్టి సారించింది. ప్రయాణికులకు సౌకర్యం కల్పించడంతో పాటు ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చనే ఉద్దేశంతో ఏసీ ఎకానమీ క్లాస్‌ కోచ్‌ల సంఖ్య పెంచుతోంది. కొత్తగా మరిన్ని రైళ్లలో ఆ కేటగిరీని ప్రవేశపెడుతోంది. రెండేళ్ల క్రితం నుంచి థర్డ్‌ ఏసీ ఎకానమీ రైళ్లలో గతంలో ఫస్ట్‌ ఏసీ, సెకెండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీ.. ఇలా మూడు రకాల ఏసీ కోచ్‌లు మాత్రమే ఉండేవి. పేద, మధ్య తరగతి వర్గాలను దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ రెండేళ్ల క్రితం కొత్తగా థర్డ్‌ ఏసీ ఎకానమీ కోచ్‌లను/ ప్రవేశపెట్టింది. సాధారణ థర్డ్‌ ఏసీ కోచ్‌లోని ఓ కూపేలో 8 బెర్త్‌లుంటే, ఎకానమీ ఏసీ కోచ్‌లో తొమ్మిదుంటాయి. కూపేల వైశాల్యం కూడా తగ్గించడం వల్ల ఇలాంటి ఓ కోచ్‌లో అదనంగా మరో కూపే ఉంటోంది. అంటే ఈ కూపే ద్వారా అదనంగా తొమ్మిది బెర్తులు అందుబాటులో ఉంటాయన్నమాట. సాధారణ కోచ్‌ కంటే తక్కువ చార్జీ సాధారణ థర్డ్‌ ఏసీ కోచ్‌ కంటే ఎకానమీ కోచ్‌ టికెట్‌ ధర తక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే అల్పాదాయ వర్గాలు వేసవి వేడిని దృష్టిలో పెట్టుకుని ఈ ఎకానమీ ఏసీ కోచ్‌లలో ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే దక్షిణ మధ్య రైల్వేలో వీటి సంఖ్యను పెంచుతున్నారు. స్లీపర్‌ కోచ్‌ల సంఖ్యను కుదించటం ద్వారా ఈ తరహా కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. గత వేసవిలో జోన్‌ పరిధిలో ఎకానమీ కోచ్‌లు కేవలం 20 రైళ్లలోనే ఉండగా, ప్రస్తుతం 30కి చేరాయి.అయినా రద్దీని తట్టుకునే పరిస్థితి లేకపోవడంతో త్వరలో మరిన్ని రైళ్లలో కూడా వీటిని ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుత డిమాండ్‌ నేపథ్యంలో ప్రయాణ తేదీకి 15 రోజులకు చేరువకాగానే కొన్ని ముఖ్యమైన రైళ్లలో ఏసీ కోచ్‌లకు టికెట్ల విక్రయం ఆపేసే పరిస్థితి నెలకొంది. ఆన్‌లైన్‌లో ‘రిగ్రెట్‌’ (ఐఆర్‌సీటీసీ పరిభాషలో బెర్తులు లేవు అని అర్ధం) అని చూపుతోంది. సరిపడా రేక్స్‌ లేవు వేసవి రద్దీ నేపథ్యంలో వివిధ ప్రాంతాలకు 100కు పైగా ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే చర్యలు చేపట్టింది. ఇప్పటికే కొన్ని నడుస్తున్నాయి. జూన్‌ వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. వాస్తవానికి మరో 200 ప్రత్యేక రైళ్లను నడిపినా కూడా రద్దీకి సరిపోయే పరిస్థితి లేదు. కానీ అన్ని రేక్స్‌ అందుబాటులో లేవు. దీంతో అదనపు రైళ్ల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని రైల్వే బోర్డు స్థానిక అధికారులకు సూచించింది. వేరే ప్రాంతాల నుంచి కూడా కోచ్‌లను కేటాయించే పరిస్థితి లేకపోవటంతో ఈ అలర్డ్‌ జారీ చేసింది. రాష్ట్రంలో 230 రైళ్ల రాకపోకలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం 230 వరకు ప్రయాణికుల రైళ్లు తిరుగుతుంటాయి. వేసవి సెలవుల నేపథ్యంలో వీటిల్లో ప్రయాణానికి ప్రతిరోజూ 30 వేల మంది వరకు అదనంగా ప్రయత్నిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో రిజర్వేషన్లు దొరక్క చాలామంది జనరల్‌ కోచ్‌లలో కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. చాలామంది అనధికారికంగా స్లీపర్‌ కోచ్‌లలో కూడా ఎక్కేస్తున్నారు. ఎండలతో ఉడికిపోతున్న బోగీలు ప్రయాణికుల కిటకిట మరింత వేడెక్కిపోతున్నాయి. థర్డ్‌ ఏసీ దొరక్క పోవడంతో ఏసీ స్లీపర్‌ బస్సులో తీసుకున్నామార్చి ప్రారంభంలో కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్లొచ్చాం. కేవలం వారం రోజుల వ్యవధిలోనే థర్డ్‌ ఏసీ టికెట్లు లభించాయి. కానీ ఇప్పుడు బెంగుళూరు వెళ్లాల్సి రావటంతో, ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ కోసం ప్రయతి్నస్తే రిగ్రెట్‌ చూపుతోంది. అసలు టికెట్లే లేవని చూపిస్తోంది. నెలన్నర ముందే ఏసీ టికెట్లు అయిపోతున్నాయి. ఎండాకాలంలో మామూలు బోగీల్లో వెళ్లాలంటే భయం వేస్తోంది. గత్యంతరం లేక ఎక్కువ చార్జీ చెల్లించి ఏసీ స్లీపర్‌ బస్సులో బుక్‌ చేసుకున్నాం. రైళ్లలో ఏసీ కోచ్‌ల సంఖ్య పెంచటమో, అదనపు రైళ్లను నడపటమో చేస్తే బాగుంటుంది. – జి.రవికుమార్, బాగ్‌లింగంపల్లి (హైదరాబాద్‌)

Rasi Phalalu: Daily Horoscope On 03-05-2025 In Telugu2
ఈ రాశి వారు కొత్త కార్యక్రమాలు చేపడతారు.. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు.

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: శు.షష్ఠి ప.1.20 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: పునర్వసు సా.5.47 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం: ఉ.6.03 నుండి 7.37 వరకు, తదుపరి రా.1.46 నుండి 3.22 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.03 నుండి 7.14 వరకు, అమృతఘడియలు: ప.3.27 నుండి 5.02 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.37, సూర్యాస్తమయం: 6.15.మేషం: కొన్ని పనుల్లో ప్రతిబంధకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. శ్రమాధిక్యం. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.వృషభం: ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. స్వల్ప ధనలాభం. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రగతి కనిపిస్తుంది.మిథునం: మిత్రులతో విభేదాలు. ప్రయాణాలలో అవాంతరాలు. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు కలసిరావు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.కర్కాటకం: శుభవార్తా శ్రవణం. కుటుంబంలో ఉత్సాహవంతంగా ఉంటుంది. ఏ పని చేపట్టినా విజయమే. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. దైవచింతన.సింహం: వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. శ్రమ తప్పదు. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.కన్య: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలను సమయానికి పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.తుల: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.వృశ్చికం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో వివాదాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.ధనుస్సు: వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆత్మీయులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.మకరం: సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. దైవదర్శనాలు. శుభవర్తమానాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు.కుంభం: సన్నిహితులతో విభేదిస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చిక్కులు.మీనం: కార్యజయం. ధనలాభ సూచనలు. ప్రముఖులతో పరిచయాలు. నూతన ఉద్యోగలాభం. సోదరుల నుంచి పిలుపు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

Australia to hold general election on May 33
నిర్బంధ ఓటింగ్‌కు వందేళ్లు

ఆ్రస్టేలియా పార్లమెంటుకు శనివారం ఎన్నికలు జరుగుతున్నాయి. దేశంలోని 1.8 కోట్ల మంది అర్హులైన ఓటర్లు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నారు. ఆ దేశంలో ఓటేయడం కేవలం నచ్చిన అభ్యరి్థని ఎన్నుకునే ప్రక్రియ మాత్రమే కాదు.. తప్పనిసరిగా పాటించి తీరాల్సిన చట్టపరమైన బాధ్యత. ఎందుకంటే ఆ్రస్టేలియాలో 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు వేయాలని చట్టముంది. దాంతో అనేక దేశాలు ప్రజలను పోలింగ్‌ కేంద్రాలకు తీసుకురావడానికి నానా కష్టాలు పడుతుంటే ఆస్ట్రేలియా మాత్రం ప్రపంచంలోనే అత్యధిక ఓటింగ్‌ నమోదయ్యే దేశాల్లో ఒకటిగా ఉంది. 2022 ఎన్నికల్లో ఏకంగా 90 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు! బ్రిటన్‌లో 2024 ఎన్నికల్లో కేవలం 60 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. అమెరికాలో ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో 64 శాతం నమోదైంది. చట్ట సవరణ ఆ్రస్టేలియాలో 1924లో ఎన్నికల చట్టాన్ని సవరించి ఫెడరల్‌ ఎన్నికల్లో ఓటేయడాన్ని తప్పనిసరి చేశారు. దానిప్రకారం ఫెడరల్‌ ఎన్నికల్లో ఓటు వేయకపోతే 20 డాలర్లు, రాష్ట్ర ఎన్నికల్లో ఓటేయకపోతే 79 డాలర్ల దాకా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ చట్టం బాగానే పనిచేసింది. 1922 ఎన్నికల్లో 60 శాతం కూడా లేని ఓటింగ్‌ చట్టం తర్వాత 1925 ఎన్నికల్లో ఏకంగా 91 శాతం దాటేసింది. నిర్బంధ ఓటింగ్‌ వల్ల గెలిచినవారు మరింత బాధ్యతాయుతంగా ఉంటారనే వాదన కూడా ఉంది.నిర్బంధ ఓటు అట్టడుగు వర్గాలకు మెరుగైన ప్రాతినిధ్యం కల్పించడానికి కూడా సహాయపడుతుందని, ఇది మరింత సమసమాజ ప్రజా విధానాలను రూపొందిస్తుందని నిపుణుల విశ్లేషణ. నిర్బంధ ఓటింగ్‌ విధానంలో మధ్యతరగతి పౌరులు, వారి ఆందోళనలు, సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటారని, ఇది ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో కనిపించే పోలరైజేషన్‌ రాజకీయాలను నిరోధించి భిన్నమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందనే అభిప్రాయం ఉంది. ప్రత్యేక పరిస్థితుల్లో ఓటు వేయలేకపోతే ఏంటి పరిస్థితి? సరైన కారణం ఉంటే మినహాయింపు ఉంటుంది.ఆ్రస్టేలియన్లు ఏమంటున్నారు?నిర్బంధ ఓటింగ్‌ గురించి ఆస్ట్రేలియాలో ఎలాంటి వివాదం లేదు. ఈ చట్టానికి ప్రజల గట్టి మద్దతుంది. దీనికి 70 శాతం ఆమోదం ఉందని 1967 నుంచి జరిగిన పలు జాతీయ సర్వేలు తేల్చాయి. అయితే నిర్బంధ ఓటింగ్‌ను రద్దు చేయాలని దశాబ్దాలుగా డిమాండ్, ఆందోళనలు చేస్తున్న వాళ్లూ ఉన్నారు. ఓటేయాలో వద్దో ఎంచుకునే హక్కు పౌరులకు ఉండాలన్నది వారి వాదన. వాళ్లకు ప్రజాదరణ అంతంతే. నిర్బంధ ఓటింగ్‌ ద్వారా యువకులు మనమందరం ఎలాగైనా ఓటు వేయాలి అనే అవగాహనకు వస్తున్నారు. రాజకీయ ప్రక్రియలో పాల్గొనడంతోపాటు ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. నిర్బంధ ఓటు లేకపోయినా స్వచ్ఛందంగా ఓటేసే వాళ్లమేనని 2022లో 77 శాతం మంది ఆ్రస్టేలియన్లు చెప్పడం విశేషం!వేతనంతో కూడిన సెలవుఓటింగ్‌కు అడ్డంకులు తొలగించడానికి, ప్రజలంతా ఓటింగ్‌లో పాల్గొనేలా చూడటానికి అధికారులు పలు విధానాలను అమలు చేశారు. ఆస్ట్రేలియాలో శనివారాల్లోనే ఎన్నికలు జరుగుతాయి. వీకెండ్‌ కావడంతో ఎక్కువ మంది స్వేచ్ఛగా పోలింగ్‌ కేంద్రాలకు వెళ్తారు. యాజమాన్యాలు ఎన్నికల రోజున కార్మి కులకు వేతనంతో కూడిన సెలవు ఇస్తాయి.పోలింగ్‌ బూత్‌ల దగ్గర బార్బెక్యూలపై కాల్చిన డెమోక్రసీ సాసేజ్‌లు అదనపు ప్రోత్సాహం. ఎన్నికల రోజు పోలింగ్‌ కేంద్రాల దగ్గర నిధుల సేకరణ కోసం ఏర్పాటు చేసే ఈ స్నాక్స్‌ ఆ్రస్టేలియా ఎన్నికలకు చిహ్నాలుగా మారాయి. ఇవి స్థానిక పాఠశాలలు, కమ్యూనిటీలకు అతి పెద్ద నిధుల సేకరణ కార్యక్రమాలుగా మారా యి. మొత్తంగా ఎన్నికల రోజు ఆ్రస్టేలియాలో పండుగ వాతావరణం ఉంటుంది. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Pakistan asks Gulf allies to help ease India tensions following Kashmir attack4
వణుకుతున్న దాయాది

ఇస్లామాబాద్‌/వాషింగ్టన్‌/శ్రీనగర్‌/న్యూఢిల్లీ: భార త ‘పహల్గాం ప్రతీకార’ప్రయత్నాలు చూసి పాకిస్తాన్‌ బెదిరిపోతోంది. ఉద్రిక్తతలను ఎలాగైనా తగ్గించేలా భారత్‌ను ఒప్పించాలంటూ అరబ్‌ దేశాలను ఆశ్రయించింది. సౌదీ అరేబియా, యూఈఏ, కువైట్‌ తదితర దేశాలకు పాక్‌ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ శుక్రవారం ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పాక్‌లోని ఆ దేశాల రాయబారులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దక్షిణాసియాలో సుస్థిరతనే కోరుతున్నామంటూ శాంతి వచనాలు వల్లెవేశారు. పహల్గాం దాడితో పాక్‌కు ఏ సంబంధమూ లేదంటూ పాతపాటే పాడారు.పాక్‌లో చైనా రాయబారి జియాంగ్‌ జైడాంగ్‌తో కూడా షహబాజ్‌ భేటీ అయ్యారు. ఉగ్రవాదంపై పోరుతో భారత్‌కు తాము పూర్తిస్థాయిలో దన్నుగా నిలుస్తామని అమెరికా పునరుద్ఘాటించింది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి తమ పూర్తి మద్దతుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టామీ బ్రూస్‌ స్పష్టం చేశారు. భారత్, పాక్‌ మధ్య నెలకొన్న పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్టు చెప్పారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఈ విషయమై నిర్ణాయక వ్యాఖ్యలు చేశారు. పాక్‌ భూభాగం నుంచి మారణకాండకు దిగుతున్న ఉగ్రవాదులను వెదికి పట్టుకోవడంలో భారత్‌కు సహకరించాలని దాయాదికి హితవు పలికారు.‘‘ఇరుదేశాల మధ్య పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. అవి రెండు అణుదేశాల ప్రాంతీయ యుద్ధంగా మారొద్దన్నదే మా ఉద్దేశం. ఏం జరుగుతుందో చూద్దాం’’అని గురువారం ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అభిప్రాయపడ్డారు. పహల్గాం దాడి సమయంలో వాన్స్‌ కుటుంబంతో పాటు భారత్‌లోనే ఉండటం తెలిసిందే. దాయాదుల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలని బ్రిటన్‌ ఆకాంక్షించింది. పహల్గాం దాడిని హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌ తీవ్రంగా ఖండించినట్టు పేర్కొంది. వాటిని నిరసిస్తూ బ్రిటన్‌లో కొద్ది రోజులుగా శాంతియుత ఆందోళనలు జరుగుతున్న వైనం కూడా సభలో చర్చకు వచ్చినట్టు పేర్కొంది. అదేమీ రహస్యం కాదు: బిలావల్‌ పాక్‌ ఉగ్రవాదులకు ఆశ్రయంగా మారడం నిజమేనని ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి, పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ చైర్‌పర్సన్‌ బిలావల్‌ భుట్టో కూడా అంగీకరించారు. మూడు దశాబ్దాలుగా పాక్‌ ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ ఇటీవల అంతర్జాతీయ మీడియా సాక్షిగా అంగీకరించడం తెలిసిందే. దీనిపై స్కై న్యూస్‌ ఇంటర్వ్యూలో బిలావల్‌ ఈ మేరకు స్పందించారు. రక్షణ మంత్రి వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా అని ప్రశ్నించగా, ‘అది పెద్ద రహస్యమేమీ కాదు. పాక్‌ది ఉగ్రవాద గతమే’’అంటూ పాక్‌ నిర్వాకాన్ని బాహాటంగా అంగీకరించారు. అయితే దానివల్ల దేశం ఎంతగానో నష్టపోయిందని వాపోయారు.‘‘ఉగ్రవాదం పాక్‌కే కాదు, అంతర్జాతీయ సమాజానికి కూడా పెనుబెడదగా పరిణమించింది. పాక్‌ దశలవారీగా ఉగ్రవాదానికి మద్దతిస్తూ వచ్చింది. మా సమాజం ఇస్లామీకరణ, సైనికీకరణ దశల గుండా సాగింది. వీటన్నింటివల్లా మేం నష్టపోతూ వచ్చాం. అయితే వాటినుంచి పాఠాలు నేర్చుకున్నాం. సింధూ పరివాహక నదులకు భారత్‌ నీరు వదలకుంటే రక్తం పారుతుందంటూ బిలావల్‌ ఇటీవల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. తన ఉద్దేశం అది కాదని ఆయన తాజాగా చెప్పుకొచ్చారు. ‘‘నీటిని ఆపడాన్ని యుద్ధ చర్యగానే పరిగణిస్తామని మా ప్రభుత్వమే చెప్పింది. యుద్ధం జరిగితే పారేది రక్తమేగా. అదే నేనూ చెప్పా’’అన్నారు. మరోవైపు సింధూ జల ఒప్పందం నిలుపుదలను నిరసిస్తూ భారత్‌కు దౌత్య నోటీసులివ్వాలని పాక్‌ యోచిస్తోంది. ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికల మీదా లేవనెత్తేందుకు సిద్ధమవుతోంది. హాకింగ్‌కు విఫలయత్నాలు పాక్‌ ప్రేరేపిత హాకర్‌ గ్రూపులు భారత వెబ్‌సైట్లపై శుక్రవారం మరోసారి భారీగా సైబర్‌ దాడులకు దిగాయి. జమ్మూలోని ఆర్మీ స్కూల్స్, రిటైర్డ్‌ సైనికుల ఆరోగ్య సేవలు తదితరాలకు సంబంధించిన సైట్లను హాక్‌ చేసేందుకు విఫలయత్నం చేశాయి. సైబర్‌ గ్రూప్‌ హోక్స్‌1337, నేçషనల్‌ సైబర్‌ క్రూ పేరిట దాడులు జరిగినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ‘‘పాక్‌తో పాటు పలు పశ్చిమాసియా దేశాలు, ఇండొనేసియా, మొరాకో తదితర చోట్ల నుంచి ఈ సైబర్‌ దాడులు జరిగాయి. వాటికి పాల్పడ్డ పలు సంస్థలు ఇస్లామిక్‌ భావజాలానికి మద్దతు పలుకుతున్నట్టు చెప్పుకున్నాయి. వాటన్నింటినీ సమర్థంగా తిప్పికొట్టాం’’అని తెలిపాయి. పహల్గాం దాడి నుంచీ ఈ తరహా దాడులు విపరీతంగా పెరిగిపోయినట్టు వెల్లడించాయి. ఇదంతా పాక్‌ హైబ్రిడ్‌ యుద్ధతంత్రంలో భాగమని అనుమానిస్తున్నారు. ఐదు సెక్ట్టర్లలో కాల్పులుపాక్‌ వరుసగా ఎనిమిదో రోజు కాల్పుల విరమణకు తూట్లు పొడిచింది. జమ్మూ కశ్మీర్‌లో ఐదు జిల్లాల వెంబడి నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి గురువారం రాత్రి కూడా కాల్పులకు తెగబడింది. కుప్వారా, బారాముల్లా, పూంచ్, నౌషేరా, అఖూ్నర్‌ ప్రాంతాల్లో ఎలాంటి కవ్వింపులూ లేకుండానే పాక్‌ దళాలు తేలికపాటి ఆయుధాలతో కాల్పులకు దిగినట్టు సైన్యం అధికార ప్రతినిధి వెల్లడించారు. ‘‘తొలుత ఉత్తర కశ్మీర్‌లో కుప్వారా, బారాముల్లా జిల్లాల్లో మొదలైన కాల్పులు జమ్మూ ప్రాంతంలోని పూంచ్, అఖ్నూర్‌ సెక్టర్లకు విస్తరించాయి.అనంతరం నౌషేరాలోని సుందర్బనీ, జమ్మూ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు గుండా పర్‌గ్వాల్‌ సెక్టర్లోనూ కాల్పులకు తెగబడ్డాయి. వాటిని భారత సైన్యం దీటుగా తిప్పికొట్టింది’’అని తెలిపారు. ఉద్రిక్తతలు మరింత పెరగవచ్చన్న అంచనాల నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లోని సరిహద్దు గ్రామాల ప్రజలు సురక్షితంగా తలదాచుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన కమ్యూనిటీ, వ్యక్తిగత బంకర్లను సిద్ధం చేసుకుంటున్నారు.కథువా, సాంబా, రాజౌరీ, పూంచ్‌ జిల్లాల్లో ఇంకా పంటకోతలు జరగాల్సి ఉంది. పాక్‌తో భారత్‌ 3,323 కి.మీ. మేరకు సరిహద్దును పంచుకుంటోంది. ఇందులో 2,400 కి.మీ. మేరకు అంతర్జాతీయ సరిహద్దు గుజరాత్‌ నుంచి జమ్మూ దాకా విస్తరించింది. 740 కి.మీ. నియంత్రణ రేఖ, యాక్చ్యువల్‌ గ్రౌండ్‌ పొజిషన్‌ లైన్‌ (ఏజీపీఎల్‌)తో పాటు మరో 110 కి.మీ. సియాచిన్‌ ప్రాంతంలో విస్తరించి ఉంది.

Vizhinjam port inauguration by PM Modi5
సీపోర్ట్‌తో కేరళలో ఆర్థిక స్థిరత్వం

తిరువనంతపురం: కంటైనర్ల ద్వారా సరుకు రావాణా కోసం ప్రత్యేకంగా నిర్మించిన అతిపెద్ద విఝింజమ్‌ అంతర్జాతీయ సీపోర్ట్‌తో కేరళ రాష్ట్రంలో ఆర్థిక స్థిరత్వం సుసాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అభిలషించారు. భవిష్యత్తులో ఈ సీపోర్ట్‌ సామర్థ్యం మూడు రెట్లు పెరుగుతుందని, దాంతో కంటైనర్‌ కార్గో రవాణా విభాగంలో భారత సామర్థ్యం మరింత ఇనుమడిస్తుందని ప్రధాని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని శుక్రవారం కేరళలోని తిరువనంతపురం జిల్లా కేంద్రంలోని విఝింజమ్‌ వద్ద రూ.8,686 కోట్ల వ్యయంతో నిర్మించిన డీప్‌వాటర్‌ సీపోర్ట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించారు.అప్పుడలా.. ఇప్పుడిలా‘‘గతంలో భారత కంటైనర్ల రవాణా వ్యవహారంలో 75 శాతం విదేశీ పోర్టుల్లో జరిగేది. దాని వల్ల దేశం భారీ స్థాయిలో ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అప్పటి పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారుతున్నాయి. ఇప్పుడు దేశ సంపద భారత్‌కే ఉపయోగపడుతోంది. గతంలో భారత్‌ను దాటిపోయిన నిధులు ఇప్పడు స్వదేశంలోనే నూతన ఆర్థిక అవకాశాలను సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా కేరళలోని విఝింజమ్‌ ప్రజలకు అవకాశాలు పెరిగాయి.అంతర్జాతీయ వాణిజ్యంలో తొలినాళ్ల నుంచీ కేరళ నౌకలు భారత్‌కు సరుకు రవాణాలో కీలక భూమిక పోషించాయి. సముద్ర మార్గంలో అంతర్జాతీయ వాణిజ్యంలో భారత హబ్‌గా కేరళ ఎదుగుతోంది. ఇప్పుడు కేరళను మెరుగైన ఆర్థికశక్తిగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది’’ అని మోదీ అన్నారు. అదానీని పొగిడిన మోదీఅదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌(ఏపీసెజ్‌) ఈ డీప్‌వాటర్‌ పోర్ట్‌ను నిర్మించింది. ఈ నేపథ్యంలో ఈ సంస్థ అధినేత గౌతమ్‌ అదానీని మోదీ పొగిడారు. ‘‘ అదానీ గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. సొంత రాష్ట్రంలోనూ ఓడరేవులున్నాయి. అయినాసరే గుజరాత్‌ను కాదని కేరళలో ఇంత పెద్ద సీపోర్ట్‌ను కట్టాడని తెలిస్తే గుజరాత్‌ ప్రజలు సైతం అసూయపడతారు’’ అని సరదాగా అదానీని మోదీ పొగిడారు.‘‘2014లో సరుకు రవాణా నౌకలు, ప్రజారవాణా, ఇతర పడవల ద్వారా 1.25 లక్షల మంది కార్మికులు ఉపాధి పొందితే ఇప్పుడు వాళ్ల సంఖ్య 3.25 లక్షలకు పెరిగింది. ఈ కార్మికుల సంఖ్యపరంగా భారత్‌ ప్రపంచ టాప్‌–3 స్థానం పొందింది. సరుకు రవాణా విషయంలో టాప్‌–30లో రెండు భారతీయ నౌకాశ్రయాలు స్థానం దక్కించుకున్నాయి’’ అని మోదీ అన్నారు.స్వప్నం సాకారమైంది‘‘కేరళ స్వప్నం సాకారమైంది. అంతర్జాతీయ జలరవాణా, వాణిజ్యం, సరుకు రవాణా చిత్రపటంలో ఈ సీపోర్ట్‌ భారత్‌కు కొత్త దారులు తెరిచింది’’ అని మోదీ అన్నారు. కార్యక్రమంలో కేరళ గవర్నర్‌ రాజేంద్ర అర్లేకర్, సీఎం విజయన్, గౌతమ్‌ అదానీ, శశిథరూర్‌ పాల్గొన్నారు. ‘‘ మూడో మిలీనియంలో వృద్ధి అవకాశాలకు విఝింజమ్‌ సీపోర్ట్‌ సింహద్వారంగా నిలవనుంది’’ అని సీఎం విజయన్‌ అన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, అదానీ సంస్థ సంయుక్తంగా ప్రభుత్వ ప్రైవేట్‌ భాగస్వామ్యంలో ఓడరేవును నిర్మించారు.ఈ ఇద్దరిని నా పక్కన చూశాకకొందరికి అస్సలు నిద్రపట్టదువిపక్షాల ‘ఇండియా’ కూటమిలో కీలక భాగస్వామి అయిన సీపీఎం సీనియర్‌ నేత, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ మోదీతోపాటు వేదికను పంచుకున్నారు. దీంతో కాంగ్రెస్‌నుద్దేశిస్తూ మోదీ సరదా వ్యాఖ్యలు చేశారు. ‘‘సీఎం విజయన్‌కు నేనో విషయం చెప్పదల్చుకున్నా. విపక్షాల ఇండియా కూటమిలో మీరూ ఒక మూలస్తంభం. ఇక కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ సైతం వేదికపైనే ఉన్నారు. మీ ఇద్దరినీ నా పక్కన చూశాక కొందరికి అస్సలు నిద్ర పట్టదు. మలయాళంలోకి నా ప్రసంగాన్ని తర్జుమా చేస్తున్న వ్యక్తి సరిగా చెప్తున్నారో లేదో నాకు తెలీదుగానీ నా ఈ సందేశం చేరాల్సిన వారికి ఇప్పటికే చేరిపోయింది’’ అని వ్యాఖ్యానించారు.దీనిపై కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. ‘‘పహల్గాం తర్వాత కూడా విపక్ష నేతల నిద్రలు పాడుచేయడం మీదే మోదీ దృష్టిపెట్టారు. మేం మాత్రం నిద్రలేని రాత్రులు గడిపైనాసరే మిమ్మల్ని మీ ప్రభుత్వ తప్పులకు బా«ధ్యులను చేస్తాం’’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ అన్నారు. సొంత కాంగ్రెస్‌ పార్టీ నేతలతో శశిథరూర్‌ ఇటీవల అంటీముట్టనట్లు వ్యవహరించడం తెల్సిందే. ‘‘శుక్రవారం నా సొంత నియోజకవర్గం తిరువనంతపురంలో ప్రధానికి స్వాగతం పలికా. సీపోర్ట్‌ ప్రారంభంకావడం మాకెంతో గర్వకారణం’’ అని శశిథరూర్‌ అంతకుముందు ‘ఎక్స్‌’లో పోస్ట్‌చేశారు.

Gujarat beat Hyderabad by 38 runs6
టైటాన్స్‌ ఏడో గెలుపు రైజర్స్‌ ఏడో ఓటమి

ఐపీఎల్‌లో గత సీజన్‌ రన్నరప్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ‘ప్లే ఆఫ్స్‌’ వెళ్లే అవకాశాలకు దాదాపు తెరపడినట్లే! హైదరాబాద్‌ జట్టు అధికారికంగా ఇంకా నిష్క్రమించకపోయినా ఏడో ఓటమితో సమీకరణాలన్నీ సంక్లిష్టంగా మారిపోయాయి. ఆశలు నిలవాలంటే గుజరాత్‌పై కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ పేలవ బౌలింగ్‌తో ఓటమిని మూటగట్టుకుంది. సొంత మైదానంలో గిల్, బట్లర్, సుదర్శన్‌ బ్యాటింగ్‌తో భారీ స్కోరు నమోదు చేసిన టైటాన్స్‌ దానిని నిలబెట్టుకుంది. ఏడో విజయంతో గుజరాత్‌ మరో మెట్టు పైకెక్కి ప్లే ఆఫ్స్‌కు చేరువైంది. అహ్మదాబాద్‌: ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై ఆడిన రెండు మ్యాచ్‌లలో నెగ్గిన గుజరాత్‌ టైటాన్స్‌ 2–0తో పైచేయి సాధించింది. శుక్రవారం జరిగిన పోరులో గుజరాత్‌ 38 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (38 బంతుల్లో 76; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), జోస్‌ బట్లర్‌ (37 బంతుల్లో 64; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేయగా... సాయి సుదర్శన్‌ (23 బంతుల్లో 48; 9 ఫోర్లు) మరో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అనంతరం హైదరాబాద్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులే చేయగలిగింది. అభిషేక్‌ శర్మ (41 బంతుల్లో 74; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యారు. పరుగుల వరద... తొలి 2 ఓవర్లలో 16 పరుగులతో గుజరాత్‌ ఇన్నింగ్స్‌ నెమ్మదిగా మొదలైంది. అయితే తర్వాతి 4 ఓవర్లలో ఏకంగా 66 పరుగులు వచ్చాయి. షమీ ఓవర్లో సుదర్శన్‌ 5 ఫోర్లతో (4, 0, 4, 4, 4, 4) చెలరేగిపోగా, కమిన్స్‌ ఓవర్లో గిల్‌ 2 ఫోర్లు, సిక్స్‌ బాదాడు. హర్షల్‌ ఓవర్లోనూ సుదర్శన్‌ 4 ఫోర్లతో దూకుడు ప్రదర్శించాడు. పవర్‌ప్లే ముగిసేసరికి టైటాన్స్‌ 82 పరుగులు చేసింది. ఆ జట్టుకు ఐపీఎల్‌లో ఇదే అత్యధిక పవర్‌ప్లే స్కోరు కావడం విశేషం. తొలి వికెట్‌కు గిల్‌తో 41 బంతుల్లోనే 87 పరుగులు జోడించిన అనంతరం సుదర్శన్‌ వెనుదిరిగాడు. ఆ తర్వాత 25 బంతుల్లో గిల్‌ అర్ధ సెంచరీ పూర్తయింది. మరోవైపు బట్లర్‌ కూడా దూకుడు కనబర్చాడు. 22 పరుగుల వద్ద అతను ఇచ్చిన క్యాచ్‌ను కమిన్స్‌ వదిలేయడం కూడా కలిసొచ్చింది. అన్సారీ ఓవర్లో 6, 4 కొట్టిన బట్లర్‌ 31 బంతుల్లో హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. ఉనాద్కట్‌ వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ ఆసక్తికరంగా సాగింది. ఈ ఓవర్లో 2 సిక్స్‌లు బాదిన గుజరాత్‌...3 వికెట్లు కోల్పోయింది. అభిషేక్‌ పోరాటం వృథా... భారీ ఛేదనలో తొలి వికెట్‌కు 49 పరుగులు జత చేశాక ట్రవిస్‌ హెడ్‌ (16 బంతుల్లో 20; 4 ఫోర్లు) వెనుదిరిగాడు. అభిషేక్‌ ‌ సిక్సర్లతో ధాటిగా ఆడటంతో పవర్‌ప్లేలో 57 పరుగులు వచ్చాయి. ఇషాన్‌ కిషన్‌ (13) పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడగా, అభిషేక్‌కు క్లాసెన్‌ (18 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్‌) సహకరించాడు. 28 బంతుల్లోనే అభిషేక్‌ ‌ హాఫ్‌ సెంచరీ పూర్తయింది. అభిషేక్‌ , క్లాసెన్‌ మూడో వికెట్‌కు 33 బంతుల్లో 57 పరుగులు జత చేసినా... చేయాల్సిన రన్‌రేట్‌ పైపైకి వెళ్లడంతో బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది. 31 బంతుల్లో 86 పరుగులు చేయాల్సిన స్థితిలో అభిషేక్‌ ‌ అవుట్‌ కాగా... మరో మూడు బంతులకే క్లాసెన్‌ కూడా వెనుదిరగడంతో హైదరాబాద్‌ ఆశలు గల్లంతయ్యాయి. చివర్లో నితీశ్‌ కుమార్‌ రెడ్డి (10 బంతుల్లో 21 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు), ప్యాట్‌ కమిన్స్‌ (10 బంతుల్లో 19 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) కొన్ని షాట్లు ఆడినా అది సరిపోలేదు. స్కోరు వివరాలు గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సుదర్శన్‌ (సి) క్లాసెన్‌ (బి) అన్సారీ 48; గిల్‌ (రనౌట్‌) 76; బట్లర్‌ (సి) అభిషేక్‌ ‌ (బి) కమిన్స్‌ 64; సుందర్‌ (సి) నితీశ్‌ రెడ్డి (బి) ఉనాద్కట్‌ 21; షారుఖ్‌ (నాటౌట్‌) 6; తెవాటియా (సి) అనికేత్‌ (బి) ఉనాద్కట్‌ 6; రషీద్‌ (సి) అండ్‌ (బి) ఉనాద్కట్‌ 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 224. వికెట్ల పతనం: 1–87, 2–149, 3–206, 4–218, 5–224, 6–224. బౌలింగ్‌: షమీ 3–0–48–0, ఉనాద్కట్‌ 4–0–35–3, కమిన్స్‌ 4–0–40–1, హర్షల్‌ 3–0–41–0, అన్సారీ 4–0–42–1, కమిందు 2–0–18–0. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: హెడ్‌ (సి) రషీద్‌ (బి) ప్రసిధ్‌ 20; అభిషేక్‌ ‌ (సి) సిరాజ్‌ (బి) ఇషాంత్‌ 74; ఇషాన్‌ కిషన్‌ (సి) ప్రసిధ్‌ (బి) కొయెట్జీ 13; క్లాసెన్‌ (సి) బట్లర్‌ (బి) ప్రసిధ్‌ 23; అనికేత్‌ (సి) షారుఖ్‌ (బి) సిరాజ్‌ 3; నితీశ్‌ రెడ్డి (నాటౌట్‌) 21; కమిందు (సి) బట్లర్‌ (బి) సిరాజ్‌ 0; కమిన్స్‌ (నాటౌట్‌) 19; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1–49, 2–82, 3–139, 4–141, 5–145, 6–145, బౌలింగ్‌: సిరాజ్‌ 4–0–33–2, ఇషాంత్‌ 3.2–0–35–1, ప్రసిధ్‌ 4–0–19–2, కొయెట్జీ 4–0–36–1, సుందర్‌ 1–0–6–0, రషీద్‌ 3–0–50–0, సాయికిషోర్‌ 0.4–0–1–0. ఐపీఎల్‌లో నేడుబెంగళూరు X చెన్నై వేదిక: బెంగళూరురాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Stock Market: Nifty holds at 24347 and Sensex rises 260 pts7
వాణిజ్య ఒప్పందంపై ఆశలతో లాభాలు

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం లాభాలతో ముగిసింది. అమెరికా – భారత్‌ వాణిజ్య ఒప్పందంపై ఆశలు, రికార్డు స్థాయిలో జీఎస్‌టీ వసూళ్లు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్ల అంశాలు కలిసొచ్చాయి. సెన్సెక్స్‌ 260 పాయింట్లు పెరిగి 80,502 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 13 పాయింట్లు బలపడి 24,347 వద్ద నిలిచింది. ఉదయం సానుకూలంగా మొదలైన సూచీలు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే భారీ లాభాలు ఆర్జించాయి.ఐటీ, బ్యాంకుల షేర్లకు డిమాండ్‌ లభించడంతో ఒక దశలో సెన్సెక్స్‌ 936 పాయింట్లు బలపడి 81,178 వద్ద గరిష్టాన్ని అందుకుంది. నిఫ్టీ 255 పాయింట్లు ఎగసి 24,589 వద్ద ఈ ఏడాది గరిష్టాన్ని నమోదు చేసింది. అయితే ద్వితీయార్ధంలో గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో లాభాలు తగ్గాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. ⇒ బీఎస్‌ఈలో రంగాల వారీగా సూచీల్లో సర్వీసెస్‌ 1.67%, ఆయిల్‌అండ్‌గ్యాస్‌ 0.69%, ఇంధన 0.57%, ఐటీ ఇండెక్సు అరశాతం పెరిగాయి. టెలికమ్యూనికేషన్‌ 2%, కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ 1.66%, విద్యుత్, యుటిలిటీ 1%, మెటల్, రియల్టీ సూచీలు అరశాతం నష్టపోయాయి. మిడ్‌క్యాప్‌ 1.67%, స్మాల్‌ క్యాప్‌ సూచీ 0.07 శాతం పతనమయ్యాయి. ⇒ మార్చి క్వార్టర్‌ నికరలాభం 4% వృద్ధి నమోదుతో అదానీ పోర్ట్స్‌–సెజ్‌ షేరు 4% పెరిగి రూ.1,267 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 6% ఎగసి రూ.1,295 వద్ద గరిష్టాన్ని తాకింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో అత్యధికంగా లాభపడిన షేరు ఇదే. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.10,812 కోట్లు పెరిగి రూ.2.73 లక్షల కోట్లకు చేరింది. ⇒ భూషణ్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ను దక్కించుకునేందుకు సమర్పించిన ప్రణాళికలు దివాలా పరిష్కార ప్రక్రియ చట్టాలకు విరుద్ధంగా ఉన్నాయంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడంతో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేరు 5.5% నష్టపోయి రూ.972 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 8% క్షీణించి రూ.948 వద్ద కనిష్టాన్ని తాకింది. షేరు భారీ పతనంతో కంపెనీకి రూ.13,731 కోట్ల నష్టం వాటిల్లింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.2.37 లక్షల కోట్లకు దిగివచి్చంది.

Pandemic Treaty was signed on April 16th8
మరో మహమ్మారిని ఎదుర్కొనేలా...

కోవిడ్‌ వంటి మహమ్మారిని మరింత సమ ర్థంగా ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సిద్ధమయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నేతృత్వంలో ఏప్రిల్‌ 16న ఈ మేరకు ‘ద పాండెమిక్‌ ట్రీటీ’ ఒప్పందం కుదిరింది. డబ్ల్యూహెచ్‌ఓ నేతృత్వంలో కుదిరిన రెండో అంతర్జాతీయ ప్రజారోగ్య ఒప్పందం ఇది. 2003లో ‘ఫ్రేమ్‌వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్ టొబాకో కంట్రోల్‌’ చర్చల్లో నేను భారత్‌కు ప్రాతినిధ్యం వహించాను. పొగాకు నియంత్రణకు సంబంధించిన ఈ ఒప్పందాన్ని అమెరికా, జపాన్ , అర్జెంటీనా వ్యతిరే కించినా, యూరోపియన్ యూనియన్ తటపటాయించినా చివరకు వాణిజ్య ప్రయోజనాల కంటే ప్రజారోగ్యమే ముఖ్యమని గుర్తించారు. ‘ద పాండెమిక్‌ ట్రీటీ’ విషయంలోనూ వాణిజ్య ప్రయోజనాలు కొందరి ప్రాధాన్యంగా ఉండింది. ఫలితంగా ఈ ఒప్పందంపై నాలు గేళ్లుగా చర్చలు, వాద ప్రతివాదాలూ నడిచాయి. కోవిడ్‌ వంటి మహ మ్మారి విషయంలో ఎదురైన వైఫల్యాలను మాత్రం ప్రపంచ దేశా లన్నీ గుర్తించాయి. విపత్కర పరిస్థితుల్లో దేశాల మధ్య మరింత సమ న్వయం, సహకారం అవసరమనీ, వట్టిమాటలు, సంఘీభావాలతో ప్రయోజనం తక్కువేననీ అర్థం చేసుకుని అందుకు తగ్గట్టుగా ఒక ఒప్పందం అవసరాన్ని కూడా గుర్తించాయి. వాస్తవానికి ఈఒప్పందం గత ఏడాదే అమల్లోకి రావాల్సింది. ఒప్పంద ప్రతిలోని భాష విషయంలో కొన్ని దేశాలు విభేదించడంతో ఈ ఏడాదికి పొడిగించాల్చి వచ్చింది. ధనిక దేశాల మొండిపట్టు‘ద పాండెమిక్‌ ట్రీటీ’ ఏడాది క్రితమే కుదరకపోవడానికి రెండు ప్రధానమైన అంశాలు కారణం. ప్రపంచం మొత్తానికి టీకాలు,మందులు, టెక్నాలజీలు అందరికీ సమానంగా అందుబాటులో ఉండేలా హామీ పొందడం ఒకటైతే... ప్రమాదకరమైన సూక్ష్మజీవులను మొట్టమొదట గుర్తించిన దేశం దాన్ని ఇతర దేశాలతో పంచుకోవడం (టీకా, మందులపై ప్రయోగాలు, నిర్ధారణ పరీక్షల అభివృద్ధి వంటి వాటికోసం) రెండో విషయం. ధనిక దేశాలు తమ ఫార్మా కంపెనీల ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఈ విషయాలపై పేటెంట్‌ హక్కులను రక్షించుకునే ప్రయత్నం చేశాయి. అదే సమయంలో తమకు టీకాలు, మందులు, టెక్నాలజీలు అందుబాటు ధరల్లోఉండేలా చూడాలని పేద, మధ్యస్థాయి దేశాలు పట్టుబట్టాయి. హాని కారక సూక్ష్మజీవులను ఇతర దేశాలతో పంచుకుంటున్నందుకు, క్లినికల్‌ ట్రయల్స్‌ ద్వారా తమ జనాభాల్లో టీకా, మందులను ప్రయో గించి చూస్తున్నందుకు తమకు ఈ వెసలుబాటు కల్పించాలని కోరాయి. ఈ వైరుధ్యం కారణంగా చర్చలు దీర్ఘకాలం కొనసాగాయి. ఒప్పందంలోని పదాలను కూడా అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో మార్చాల్సి వచ్చింది. చివరకు ఈ 2 వివాదాస్పద అంశాలను కాన్ఫరెన్స్ ఆఫ్‌ పార్టీస్‌ సమావేశాల్లో చర్చలు కొనసాగించాలని నిర్ణ యించారు. వరల్డ్‌ హెల్త్‌ అసెంబ్లీ సమావేశాల్లో ఈ ట్రీటీని ప్రవేశ పెట్టిన తరువాత ఇది అమల్లోకి వస్తుంది. ఫార్మా కంపెనీల ప్రయోజనాలను కాపాడేందుకు ధనిక దేశాలు ఎంత మూర్ఖంగా బేరాలాడాయి అంటే... సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకునే విషయంలో ‘పరస్పర అంగీకారం ఆధారంగా’ అన్న వాక్యాన్ని ‘స్వచ్ఛంద పరస్పర అంగీకారం’ అని మార్చేంత వరకూ ఒప్పుకోలేదు. సానుకూలతలుకోవిడ్‌ సమయంలో ధనిక దేశాలు టీకాలను నిల్వ చేసుకున్న దాఖలాలు ఇంకా తాజాగానే ఉన్నాయి. టీకాలు అందుబాటులో లేని చోట్ల కోవిడ్‌ వైరస్‌ వేగంగా రూపాంతరం చెందిన విషయమూ తెలిసిందే. ఒక్క విషయమైతే స్పష్టం. ద పాండెమిక్‌ ట్రీటీ విషయంలో ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా 193 దేశాలు కొన్ని కీలకఅంశాల విషయంలోనైతే ఏకాభిప్రాయానికి వచ్చాయి. కోవిడ్‌ వంటి మహమ్మారులు ప్రబలుతున్న సమయంలో సమాచారాన్ని వేగంగా, తగిన సమయంలో పంచుకోవాలన్నది వీటిల్లో ఒకటి. అలాగే టీకాలు, మందులు, వ్యాధి నిర్ధారణ పరీక్షల తయారీదారులు తమ ఉత్పత్తిలో కనీసం 20 శాతాన్ని అందుబాటు ధరల్లో డబ్ల్యూహెచ్‌ఓకు అందించాలన్నది రెండోది. వ్యాధిని సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడం మూడోది. మాస్కులు, పీపీఐ కిట్ల వంటి వాటి సరఫరా, లభ్యతల విషయంలో డబ్ల్యూహెచ్‌ఓకు పర్యవేక్షణ అధికారం దక్కడం ఒక విశేషం.ఈ ఒప్పందం కోవిడ్‌ లాంటి మహమ్మారుల నివారణపై కూడా దృష్టి పెడుతోంది. వన్ హెల్త్‌ పద్ధతిని అనుసరించాలని సూచిస్తోంది. భౌగోళికంగా వేర్వేరు ప్రాంతాల్లో పరిశోధనలు చేపట్టాలనీ, ప్రమాద కర సూక్ష్మజీవులు పరిశోధనలకు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలనీ, మందులు, ఇతర ఆరోగ్య సంబంధిత ఉత్పత్తుల తయారీకి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవాలనీ కూడా ఈ ఒప్పందం ప్రస్తావిస్తోంది. అంతేకాకుండా... అంతర్జాతీయ స్థాయిలో వేర్వేరు రంగాలకు చెందిన నిపుణులను అరోగ్య అత్యవసర పరిస్థితులకు దీటుగా స్పందించేలా సిద్ధం చేయాలని, ఈ కార్యకలా పాలకు అవసరమైన ఆర్థిక వనరుల సమన్వయానికి, ఆరోగ్య వ్యవస్థ లను బలోపేతం చేసేందుకూ, అంతర్జాతీయంగా సప్లై చెయిన్, లాజి స్టిక్స్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది.ప్రజారోగ్యం విషయంలో దేశాలకు ఉన్న సార్వభౌమ అధికారా లను గుర్తించే ఈ ఒప్పందం, అందులోని అంశాలు ఏ రకంగానూ డబ్ల్యూహెచ్‌ఓ ఇస్తున్న ఆదేశాలుగా భావించరాదని స్పష్టం చేస్తోంది. దేశీ విధానాలు, కార్యక్రమాలను మార్చుకోవాల్సిన అవసరమూ లేదని తెలిపింది. అంటే ప్రయాణీకుల నిలిపివేత, టీకాలు తప్పనిసరి చేయడం, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేపట్టడం వంటివి.నిపుణుల ఆమోదం...ఈ ఒప్పందంపై ఏకాభిప్రాయం కుదరడంపై అంతర్జాతీయ నిపుణులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజారోగ్య చట్టాల విషయంలో నిపుణుడైన అమెరికా న్యాయవాది లారెన్స్ గోస్టిన్‌దృష్టిలో ఈ ఒప్పందం ఒక ఘన విజయం. ఈ ఒప్పందంపై విమర్శకులు కూడా లేకపోలేదు. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్‌ఉండగా... రిపబ్లికన్ పార్టీ నేతలు, ఒక వర్గం మీడియా వ్యాఖ్యాతలు అమెరికా ఈ చర్చల్లో పాల్గొనడాన్నే తప్పుపట్టారు. డబ్ల్యూహెచ్‌ఓ అమెరికా సార్వభౌమత్వంలో జోక్యం చేసుకుంటోందని ఆరోపిస్తూ ముసాయిదా ఒప్పందాన్ని తిరస్కరించారు. వాణిజ్యం, పర్యాటకరంగాలపై దీని ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేశారు. డబ్ల్యూహెచ్‌ఓ ప్రపంచ ప్రభుత్వంగా మారే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత డబ్ల్యూహెచ్‌ఓ నుంచిట్రంప్‌ వైదొలగడంతో ఈ ఒప్పందంపై చర్చలు వేగవంత మయ్యాయి. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సాగాయని కూడా చెప్పాలి. ఇక్కడ ఒక కీలకమైన విషయం గురించి చెప్పుకోవాలి. ఒప్పందాన్ని ఆమోదించిన దేశాల జాబితాలో అమెరికా లేకపోవడం హానికారక సూక్ష్మజీవులపై ప్రపంచవ్యాప్త నిఘా అన్న అంశాన్ని బలహీన పరిచేదే. సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి కూడా ఎంతవరకూ సాధ్యమవుతుందన్నది చూడాలి. కాబట్టి ఆ యా దేశాల స్థాయిలో వనరుల నిర్మాణం, ప్రాంతీయ స్థాయిలో సహకారం వంటి ఇతర మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ స్థాయి సవాళ్లకు అంతే స్థాయి స్పందన కూడా అవసరమవుతుంది. పాండె మిక్‌ ట్రీటీ ఈ దిశగా వెళ్లేందుకు తగిన చోదక శక్తిని ఇస్తోంది!-వ్యాసకర్త ‘పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా’,‘ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ’ డిస్టింగ్విష్డ్‌ ప్రొఫెసర్‌(‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)- కె. శ్రీనాథ్‌ రెడ్డి

Disturbance at Simhachalam temple during Chandan festival9
అప్పన్న సన్నిధిలో అపచారం!

శ్రీమహావిష్ణువు వరాహ లక్ష్మీ నృసింహస్వామి రూపంలో వెలిశాడని లక్షలాదిమంది భక్తులు విశ్వ సించే సింహాచల క్షేత్రం గురించి తెలియని వారెవరూ లేరు. ఏటా గంధం అమావాస్య తర్వాత వచ్చే అక్షయ తృతీయనాడు ఎంతో వేడుకగా జరిగే చందనోత్సవం సందర్భంగా భక్తజనం పోటెత్తుతారు. భక్తుల విశ్వాసాలతో అంతగా ముడిపడి వుండే ఈ చందనోత్సవ సమయంలో చిన్న దుర్ఘటనైనా చోటుచేసుకున్న ఉదంతం ఆలయ చరిత్రలో లేదు. అలాంటిచోట కళ్లుమూసుకుపోయిన పాలకుల సాక్షిగా అపచారం జరిగిపోయింది. కొత్తగా నిర్మించిన గోడ కూలి బుధవారం వేకువజామున ఏడు గురు భక్తులు మరణించటం అందరినీ కలచివేసింది. అసలు చందనోత్సవంనాడు అడుగడుగునా చోటుచేసుకున్న అరాచకం గమనిస్తేనే ఈ ప్రభుత్వానికి పవిత్రోత్సవాలపై భక్తిశ్రద్ధల మాటఅటుంచి ఏదైనా అనుకోనిది సంభవిస్తుందేమోనన్న భయం కూడా లేదని అందరికీ అర్థమైంది. వీఐపీ టిక్కెట్లు, పాస్‌లు పంచుకోవటానికి పెట్టిన శ్రద్ధలో వెయ్యోవంతైనా భక్తులకు సౌకర్యాల కల్పనలో, వారి భద్రతకు చర్యలు తీసుకోవటంలో లేవు. ప్రమాదాలు చెప్పి రావు. అందుకేముందస్తు ఏర్పాట్లు చేసుకుంటారు. అంబులెన్స్‌లు, పారా మెడికల్‌ సిబ్బంది, ఎన్‌డీఆర్‌ఎఫ్‌బృందాలు అందుబాటులో ఉంచుతారు. కానీ విషాదం సంభవించిన క్షణాల్లో బాధితులది అరణ్య రోదనే అయింది. ప్రమాదంలో చిక్కుకున్నవారూ, ఇతరులూ ఆర్తనాదాలు చేస్తుండగా అరగంటకు అధికారులు వచ్చారు. ప్రయోజనం ఏముంది? 3.05 గంటలకు ప్రమాదం జరిగితే ఆ తర్వా తెప్పుడో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది అడుగుపెట్టారు. ముందస్తు ఏర్పాట్లుంటే ఆ ఏడుగురూ... లేదా కనీసం వారిలో కొందరైనా ప్రాణాలతో బయటపడేవారు. వెనక్కి తిరిగిచూస్తే ఈ తరహా విషాద ఉదంతాలు ఆయన అధికారం వెలగబెట్టే సమయంలో ఎన్నో జరిగాయని తెలుస్తుంది. 2015లో రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కరాల ప్రారంభంనాడే తీవ్ర తొక్కిసలాట జరిగి 29 మంది భక్తులు ప్రాణాలు కోల్పోవటం ఎవరూ మరిచిపోలేరు. చిన్నపిల్లలూ, వృద్ధులూ తెల్లారుజామున 4 గంటలనుంచి స్నానాల కోసం నిరీక్షిస్తుండగా చంద్ర బాబు సకుటుంబ సమేతంగా ఉదయం 8.30కు స్నానాదికాలు ముగించుకుని నిష్క్రమించేవరకూ ఎవరినీ అనుమతించలేదు. తర్వాత హఠాత్తుగా స్నానఘట్టానికున్న ఏకైక ప్రవేశ ద్వారాన్ని తెరి చారు. తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకొని భక్తులు కన్నుమూశారు. కృష్ణా పుష్కరాల్లో సుందరీకరణ పేరిట వందల ఆలయాలను కూల్చి, వాటిల్లోని విగ్రహాలను చెత్తబండ్లలో తరలించటం కూడా బాబు హయాంలోని ముచ్చటే. మళ్లీ ఈ పదకొండు నెలల కాలంలో వరస విషాద ఉదంతాలు చోటుచేసుకున్నాయి. బాధ్యతాయుత స్థానంలో వున్నానన్న ఇంగితం కూడా లోపించి తిరుమల వేంకటేశుని లడ్డూ కల్తీ జరిగిందంటూ ఆయనే తప్పుడు ప్రచారాన్ని లంకించుకున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన ముందస్తు ఏర్పాట్ల వైఫల్యం కారణంగా తొక్కిసలాట జరిగి తిరుమల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఆరుగురు భక్తులు మరణించారు. ఇక టీటీడీ గోశాలలో గోవుల మృతిఉదంతం సాధారణ భక్తుల ఊహకందనిది. అసలు అలాంటిదేమీ లేదని బాబు బుకాయించగా టీటీడీ చైర్మన్, ఈవోలు మృతిచెందిన గోవుల సంఖ్య గురించి తోచిన అంకెలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. దశాబ్దాలుగా హైందవ ధర్మానికీ, దాతృత్వానికీ ప్రతీకగా వున్న కాశీ నాయన ఆశ్రమాన్ని ఈ ప్రభుత్వమే స్వహస్తాలతో నేలమట్టం చేసింది. పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీకూర్మం క్షేత్రంలో ఇటీవల తాబేళ్లు చనిపోవటం అందరినీ ఆశ్చర్యంలో ముంచింది. ఏమైంది ఈ సర్కారుకు? పగలూ, ప్రతీకారాలూ తీర్చుకోవటానికి పదకొండు నెలల సమయం చాల్లేదా? పాలనపై దృష్టి పెట్టేదెప్పుడు? అసలు చందనోత్సవం వంటి ముఖ్య ఘట్టం కోసం ప్రభుత్వపరంగా చేసిందేమిటి? ఇందుకోసం నియమించిన కమిటీలో మంత్రులకు లోటులేదు. అయిదుగురున్నారు. హైలెవెల్‌ కమిటీ అన్నారు. అందులో ఒక్కరంటే ఒక్కరికి కొత్తగా కట్టిన గోడ ఎలా వుంటుందో తెలియదు. ఎలాంటిచోట నిర్మించారో, దేంతో నిర్మించారో, నిర్మించి ఎన్నాళ్ల యిందో అంతకన్నా తెలియదు. చందనోత్సవంనాడు వాన పడటం అక్కడ రివాజని కూడా తెలిసి వుండదు. కొండధారలు, ఆకాశగంగ, మాడవీధుల్లో పడిన వర్షమంతా ఇప్పుడు ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతంలోని మెట్లపై నుంచి కిందకు పోతుందని తెలిసే గతంలోనే రిటైనింగ్‌ వాల్‌ నిర్మించారు. కానీ పునర్నిర్మాణం పేరిట పాత గోడను తొలగించి అత్యంత నాసిరకంగా నిర్మించిన పర్యవసానంగా ఘోరం జరిగిపోయింది. ఒకరిద్దరు పెద్దలతోపాటు బంగారు భవిష్యత్తుగల యువభక్తులు కూడా తప్పించుకునే మార్గం దొరక్క సజీవసమాధి అయ్యారు. కూలిన గోడ వెనకున్న గూడుపుఠాణీ కథే వేరు. సొంత మీడియా సైతం దాచలేని కంతలు అందులో ఎన్నెన్నో! మంత్రులు దీనికి బాధ్యత వహించాలి. కానీ, వర్షం మీదా, చిన్న ఉద్యోగుల మీదా దీనిని నెట్టివేసే ప్రయత్నం జరుగుతోంది. తీరి కూర్చుని ఇలాంటి వరస విషాద ఉదంతాలకు కారణమవుతున్న సర్కారుకు ఒక్కరోజైనా అధికారంలో కొనసాగే నైతికార్హత వుందా? లక్షలాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతిని, మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొని రెండ్రోజులైనా గడవకముందే ఆర్భాటంగా అమరావతి పునఃశంకుస్థాపన కార్యక్రమం జరిపారు. కానీ మరణించిన భక్తులస్మృతిలో ఒక్క నిమిషం మౌనం పాటించాలన్న స్పృహ, కనీసం నివాళులర్పించాలన్న ఇంగితం ఒక్కరికీ లేకపోయింది. ఇదే అసలైన విషాదం.

Massive Earthquake Strikes Argentina10
అర్జెంటీనాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

బ్యూనోస్ ఎయిర్స్: అర్జెంటీనాలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. అర్జెంటీనాలో వచ్చిన భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 7.4గా నమోదైంది. దాంతో చిలీ, అర్జెంటీనా, దక్షిణ అమెరికా తీరాలను భూకంపం కుదిపేసింది. మరో రెండు భూప్రకంపనలు కూడా నమోదయ్యాయి. ఫలితంగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు.దక్షిణ అర్జెంటీనాలోని ఉషుయాకు దక్షిణంగా 219 కి.మీ దూరంలో ఉన్న డ్రేక్ పాసేజ్ వద్ద ఉదయం 9 సమయంలో ప్రకంపనలు సంభవించాయని యూఎస్ జియోలాజికల్ సర్వే స్పష్టం చేసింది. చిలీ తీరంలోని కొన్ని ప్రాంతాలను సాధారణ అలల స్థాయి కంటే 3 నుండి 10 అడుగుల ఎత్తులో అలలు తాకవచ్చని అమెరికా సునామీ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. ఒక మీటర్ ఎత్తు వరకు చిన్న అలలు కూడా అంటార్కిటికా తీరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రభావితం చూపే అవకాశం ఉందని పేర్కొంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement