Top Stories
ప్రధాన వార్తలు
బాబు డ్రామాలో పవన్ బకరా!
తిరుపతిలో జరిగిన ఘోరమైన తప్పిదాన్ని కూటమి ప్రభుత్వం ‘సారీ’లతో ముగించేస్తోందా?. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇప్పటికే తన వంతు పాత్ర పోషించి పరువు పోగొట్టుకుంటే.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఏకంగా పవన్ గాలి తీసేందుకే ప్రాధాన్యమిచ్చి అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. దీంతో మొత్తం కథ అడ్డం తిరిగినట్లు అయ్యింది. చివరకు బీఆర్ నాయుడు చర్యతో టీడీపీ అధిష్టానం కూడా కంగు తినాల్సిన పరిస్థితి. అయితే..స్వయంగా రంగంలోకి దిగి ఆయనతోనూ ఓ సారీ చెప్పించాల్సి వచ్చింది. మొత్తమ్మీద చూస్తే.. ఈ వ్యవహారంలో అసలు ఎవరి తప్పూ లేనట్టుగా తేల్చేసి అటు ప్రభుత్వాధినేతలు.. ఇటు టీటీడీ ఉన్నతాధికారులూ జారుకున్నారు. స్వామివారిపై భక్తితో భక్తులు తిరుమతి రావడమే తప్పు అని చెప్పడమే తరువాయి!!.వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారి దర్శనం టోకన్ల జారీ కాస్తా తొక్కిసలాటకు దారితీయడం ఆరుగురు మరణించడం వెనుక టీటీడీ, పోలీసుల వైఫల్యం, అలసత్వం సుస్పష్టం. పైరవీలతో టీటీడీ ఛైర్మన్, బోర్డు సభ్యులను నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రభుత్వాన్ని పరోక్షంగా నడుపుతున్న లోకేష్‌ల బాధ్యతారాహిత్యం కూడా కనపడతూనే ఉంది. అంత పెద్ద ఘోరం జరిగినా దాన్ని చిన్నదిగా చూపేందుకు ప్రయత్నించారు. ఇతర అంశాలను తెరపైకి తెచ్చి ప్రజల దృష్టి మరల్చేందుకూ చూశారు. సహకరించే మీడియా ఉండనే ఉంది. దానికి అనుగుణంగానే టీడీపీ జాకీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి తమ వంతు పాత్ర పోషించాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అనవసరంగా అప్రతిష్టపాలైంది పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. ఆటలో అరటి పండు చందంగా ఎవరూ పట్టించుకోనిది.. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి!. అందుకేనేమో.. ఆయన తన ఉనికి కాపాడుకోవడానికి ఏవో పిచ్చి ఆరోపణలు చేశారు.గాయపడ్డ వారిని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వేర్వేరుగా వెళ్లారు. సాధారణంగా ముఖ్యమంత్రి వెంటే మంత్రులు ఉండటం రివాజు. కానీ వేరే పార్టీ అధినేతగా ఉన్న పవన్ కల్యాణ్ విడిగా వెళ్లి కొంత స్వతంత్రంగా వ్యవహరించారని చాలామంది భావించారు. జరిగిన తప్పుకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు భక్తులకు క్షమాపణ చెప్పాలని పవన్ డిమాండ్ చేయడమే కాకుండా, ప్రభుత్వం తరుఫున తాను క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించారు కూడా. అంతా ఓకే అనుకుంటున్న సమయంలోనే పవన్.. తొక్కిసలాటలో కుట్ర కోణం ఉందా? అని ప్రశ్నించి బాబు దగ్గర మార్కులు కొట్టేసే ప్రయత్నం చేశారు.భక్తులకు క్షమాపణ చెప్పాలన్న పవన్ మాటలను టీటీడీ బాధ్యులు ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. దాంతో పవన్ పిఠాపురంలో సభలో కూడా మళ్లీ అదే డిమాండ్ చేశారు. అప్పుడే పవన్ ఈ ఉదంతం నుంచి చంద్రబాబును, టీడీపీని రక్షించే యత్నం చేస్తున్నారన్న సందేహం కలిగింది. కాకపోతే ఈ విషయం అర్థం బీఆర్ నాయుడు పవన్ కల్యాణ్ ఎవరో అన్నట్లుగా మాట్లాడి గాలి తీశారు. ఎవరో ఏదో చెప్పారని తానెందుకు స్పందిస్తానని అనడం ద్వారా ఈ వ్యవహారానికి కొత్త ట్విస్టు ఇచ్చారు. ఇది కాస్తా పవన్ వర్గానికి చిర్రెత్తించింది. చంద్రబాబుకు వెంటనే నిరసన చెప్పి ఉండాలి. ఆ వెంటనే చంద్రబాబు రంగంలో దిగి బీఆర్ నాయుడును ఆదేశించడంతో ఆయన తప్పనిసరి స్థితిలో సారీ చెప్పి, తన వ్యాఖ్యలు పవన్‌ను ఉద్దేశించి కాదని బుకాయించే యత్నం చేశారు.నిజానికి పవన్ కళ్యాణ్ కూడా ఇతర మంత్రుల మాదిరే ఒక మంత్రి. కాకపోతే ఉప ముఖ్యమంత్రి. ఈయనకేమీ ప్రత్యేక అధికారాలు ఉండవు. ఇతర మంత్రులపై, తనకు సంబంధం లేని ప్రభుత్వ సంస్థలపై అధికారం ఉండదు. అయితే ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించవచ్చు. ఈ అవకాశాన్ని వాడుకుని స్వతంత్రంగా వ్యక్తిత్వంతో తిరుపతిలో తొక్కిసలాటపై మాట్లాడారులే అనుకున్న వారికి కొద్ది గంటలలోనే ఆయన అసలు స్వరూపం తెలిసిపోయింది.చంద్రబాబు నాయుడు సూచనల మేరకే పవన్ ఈ కథ నడిపారన్న విశ్లేషణ వస్తోంది. లేకుంటే పవన్ తిరుపతి ఆస్పత్రిలోని బాధితులను సందర్శించి టీటీడీ చైర్మన్ తదితరులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం ఏమిటి? ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఎవరెవరు బాధ్యులో వారందరిపై కేసులు పెట్టి అరెస్టు చేయాలని అడగాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని అనాలి. అవేవి చేయకుండా క్షమాపణల డ్రామా ఆరంభించారు. దీంతో తనకేదో పేరు వస్తుందని కూడా అనుకుని ఉండవచ్చు. కానీ అసలు విషయం బయటపడ్డాక, పవన్ కల్యాణ్ మళ్లీ భక్తులను, ప్రజలను మోసం చేశారని తేటతెల్లమవుతోందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు చెప్పిన అబద్ధాలను భుజాన వేసుకుని ప్రాయశ్చిత్త దీక్ష చేసిన పవన్ కళ్యాణ్ ఆరుగురు మరణించిన ఘటనలో ఆ ఊసే ఎత్తకపోవడాన్ని అంతా గుర్తిస్తున్నారు. అప్పుడు వేసుకున్న సనాతని వేషాన్ని ఇప్పుడు ఎందుకు ధరించలేదని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా హైందవ ధర్మాన్ని రక్షించడమా అని అడుగుతున్నారు.గతంలో చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ యావ కారణంగా రాజమండ్రి వద్ద గోదావరి పుష్కరాలలో తొక్కిసలాట జరిగి 29 మంది మరణిస్తే కూడా పవన్ నోరు విప్పలేదు. ఇప్పుడేమో తిరుపతిలో ఎన్నడూ జరగని దారుణ ఘటన జరిగితే, దానిని సైడ్ ట్రాక్ చేయడానికి అన్నట్లుగా అదేదో తనకు పవర్ ఉన్నట్లుగా హడావుడి చేసి చివరికి సారీలతో తుస్సుమనిపించారు. విశాఖ ప్రధాని సభలో తనతో సమానంగా లోకేష్ కు కూడా ప్రాధాన్యత ఇవ్వడంపై, ప్రచార ప్రకటనలలో లోకేష్ ఫోటో కూడా వేయడంపై పవన్ కు కొంత అసంతృప్తి ఉందని, దానిని పరోక్షంగా వ్యక్తం చేయడానికి తిరుపతి వెళ్లి తొక్కిసలాటకు తానే బాధ్యుడిని అన్నట్లు క్షమాపణ చెప్పారని కొందరు అనుకుంటున్నారు. పవన్ చర్య కొంత మంది టీడీపీ వారికి కూడా కోపం తెప్పించింది.ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు, పవన్ లు కలిసే ఈ కథ నడిపించారన్న అభిప్రాయం చివరికి కలుగుతుంది. కాకపోతే బీఆర్ నాయుడు తెలివితక్కువ వల్ల ఈ విషయం అంతా గందరగోళమై పవన్ పరువు పోయినట్లయింది. ఈ మొత్తం వ్యవహారంలో కులాల గొడవ రావడం కూడా గమనించవలసిన అంశమే. కమ్మ సామాజిక వర్గం వారిని కాపాడుకుని మిగిలిన వారిని బలి చేస్తారా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.తాజాగా పాలక మండలి సమావేశంలో టీటీడీ ఈవో శ్యామలరావును ఒంటరి చేసి బోర్డు ఛైర్మన్, సభ్యులు మాటల దాడి చేశారట. అంతేకాక ,శ్యామలరావు దేవాలయానికి వెళ్లినా అధికారులు ఎవరూ ఆయనతో మాట కలపలేదట!. దీనిని బట్టి ఆయనను బదిలీ చేస్తున్నారన్న ప్రచారం ఆరంభమైంది. బీసీ వర్గానికి చెందిన శ్యామలరావును అవమానించి బలి చేస్తారా? ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మరో సంగతి చెప్పాలి. తానేదో మానవత్వం ఉన్న వ్యక్తిగాను, అల్లు అర్జున్ వంటివారికి అది తెలియనట్లుగాను మాట్లాడిన పవన్ పిఠాపురంలో వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళుతూ ప్రమాదంలో మరణించిన ఇద్దరు యువకుల కుటుంబాలను వారి ఇళ్లకు వెళ్లి పవన్ పరామర్శిస్తారని అనుకున్నారు. కానీ ఆయన అలా చేయలేదు. వారి గ్రామాల నుంచి పిఠాపురం రప్పించారట. పవన్ సంక్రాంతి సంబరాలలో పాల్గొంటే బాధిత కుటుంబాల వారు ఆయన కోసం ఎదురు చూస్తూ ఉసూరు మంటూ ఉదయం నుంచి అక్కడే కూర్చున్నారట. అయినా అంతిమంగా ఆయన వారిని పలకరించకుండానే వెళ్లిపోయారు. దాంతో బాధిత కుటుంబాలు తమవాళ్లు పోయారన్న విషాదంతో పాటు, ఈ అవమానపు బాధను కూడా భరించవలసి వచ్చింది.ఏది ఏమైనా రాజకీయాలలో ఎల్లప్పుడూ డ్రామానే పండదు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నట్లు ఆంధ్ర ప్రజలకు సినిమా వైబ్ అనండి.. పిచ్చి అనండి ఎక్కువగానే ఉండవచ్చు. వారివల్లే పవన్ వంటివారు అధికారంలోకి వచ్చి ఉండవచ్చు. కానీ సినిమా పిచ్చే ఎప్పటికీ ఉంటుందా? అనేది ఇక్కడ అసలు ప్రశ్న. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
రవీంద్ర జడేజా రిటైర్మెంట్..! హింట్ ఇచ్చిన స్టార్ ఆల్‌రౌండర్
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్టులకు గుడ్‌బై చెప్పనున్నాడా? అంటే అవును అనే సమాధనమే ఎక్కువ విన్పిస్తోంది. ఆస్ట్రేలియాతో సిడ్నీలో ఆడిన టెస్టే తన చివరి మ్యాచ్, త్వరలోనే జడ్డూ రెడ్ బాల్ క్రికెట్‌కు విడ్కోలు పలకనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.తాజాగా జడేజా పెట్టిన ఓ పోస్ట్ ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది. సిడ్నీ టెస్టు మ్యాచ్‌లో మూడో ధరించిన జెర్సీ ఫొటోను ఈ సౌరాష్ట్ర క్రికెటర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో అతడు టెస్టులకు గుడ్‌బై చెప్పనున్నాడనే ప్రచారం మరింత ఊపందుకుంది.ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో జడేజా పర్వాలేదన్పించాడు. మిగితా క్రికెటర్లతో పోలిస్తే కాస్త మెరుగ్గానే కన్పించాడు. ఈ సిరీస్‌లో మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడిన జడ్డూ.. 27 సగటుతో 135 పరుగులు చేశాడు.అదే విధంగా బౌలింగ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా ఇప్పటి వరకు 80 టెస్ట్‌లు ఆడిన జడేజా 3, 370 పరుగులు చేసి 323 వికెట్లు పడగొట్టాడు. కాగా సిరీస్‌ను 3-1 తేడాతో భారత్ కోల్పోయిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఈ సిరీస్ మధ్యలోనే స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. వన్డేల్లో డౌటే..ఇక ఇప్పటికే టీ20లకు విడ్కోలు పలికిన రవీంద్ర జడేజా.. వన్డేల్లో ఆడేది కూడా అనుమానమే. ప్రస్తుత పరిస్థితుల దృష్టా భారత వన్డే జట్టులో జడేజా చోటు ప్రశ్నర్ధాకంగా మారింది. జడేజా వన్డే కెరీర్ ముగిసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఇంగ్లండ్‌తో వన్డేలు, ఛాంపియన్స్ ట్రోఫీకి అతడి స్దానంలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ పేర్లను సెలక్టర్లు పరిశీలిస్తున్నారు. వీరిద్దరూ ఇప్పటికే తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరుచుకున్నారు. ఇంగ్లీష్ జట్టుతో సిరీస్‌కు, ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును బీసీసీఐ ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముంది. ఒకవేళ ఈ జట్టులో జడ్డూ చోటు దక్కకపోతే పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికే అవకాశముందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు 197 వన్డేలు ఆడిన జడేజా 2756 పరుగులతో పాటు 220 వికెట్లు తీసుకున్నాడు.చదవండి: CT 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్..
మెట్రో వెంట.. సొంతింటి ప్రయాణం!
హైదరాబాద్ స్థిరాస్తి రంగాన్ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లింది మెట్రో, ఔటర్ ప్రాజెక్ట్‌లే.. మెట్రో రైలుతో ప్రధాన నగరంలో, ఓఆర్ఆర్తో శివారు ప్రాంతాలతో కనెక్టివిటీ పెరిగింది. దీంతో నగరంలో రియల్ బూమ్ ఏర్పడింది. తాజాగా ప్రభుత్వం రెండో దశలో ఔటర్ రింగ్ రోడ్డు వరకూ మెట్రో విస్తరించాలని నిర్ణయించింది. దీంతో మెట్రో మార్గంలో చుట్టూ 10 కి.మీ. వరకూ స్థిరాస్తి అవకాశాలు మెరుగవుతాయి. ఇదే సమయంలో మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లను అనుసంధానిస్తే నగరం నలువైపులా ప్రయాణం సులువవుతుంది. బడ్జెట్ గృహాల లభ్యత పెరిగి, ఐటీ ఉద్యోగ వర్గాల సొంతింటి కల సాకారమవుతుందని జనప్రియ అప్స్కేల్ ఎండీ క్రాంతి కిరణ్‌రెడ్డి అన్నారు. – సాక్షి, సిటీబ్యూరోప్రజల దైనందిన జీవితంలో ప్రజారవాణా అత్యంత కీలకం. దీంతో ప్రభుత్వం మెట్రోని పొడిగించాలని నిర్ణయించింది. వచ్చే 5–10 ఏళ్లలో దశలవారీగా మెట్రో 2.0 అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ రియల్టీ మరింత దూరం విస్తరిస్తోంది. సాధారణంగా ప్రజలు మెరుగైన రవాణా సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లోనే ఉండేందుకు ఇష్టపడతారు.ఐటీ కేంద్రాల చుట్టుపక్కల ఇళ్ల ధరలు రూ.కోటి దాటిపోయాయి. ఐటీ ఉద్యోగ వర్గాలకు అందనంత ఎత్తుకు ఎగబాకాయి. మెట్రోతో శివార్లకు రవాణా సౌకర్యం రావడంతో ఐటీ కారిడార్‌లో పనిచేసే ఉద్యోగులు ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటూ రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో వీరంతా తమ బడ్జెట్లో నివాసాలు దొరికే తూర్పు హైదరాబాద్‌లో కొనుగోలు చేశారు.విదేశాల్లో ప్రైవేట్‌కే స్టేషన్ల బాధ్యత.. సింగపూర్, న్యూయార్క్ వంటి దేశాల్లో మాదిరిగా నగరంలోనూ భూగర్భ మెట్రో ఉంటే మేలు. విదేశాలలో భూగర్భ మెట్రో స్టేషన్ నిర్మాణ వ్యయాన్ని స్థానికంగా హోటల్స్, మాల్స్ వంటి వాణిజ్య సముదాయాలకే అప్పగిస్తారు. స్టేషన్ నుంచి వచ్చిపోయే ప్రయాణికులకు ఆయా వాణిజ్య సముదాయాలకు యాక్సెస్ ఉంటుంది. దీంతో యజమానులకు బిజినెస్ అవుతుంది. ప్రతిఫలంగా స్టేషన్ నిర్మాణ వ్యయాన్ని వాణిజ్య యజమానులే భరిస్తారు. దీంతో అటు ప్రభుత్వం, ఇటు యజమానికి ఇద్దరికీ లాభమే.ఇదీ చదవండి: వెస్ట్ హైదరాబాద్.. వామ్మో ఎంత ఎత్తో..చిత్తడి, వదులుగా ఉండే నేలలో భూగర్భ మెట్రో కష్టమవుతుంది. కానీ, మనది రాతి భూభాగం. భూగర్భ మెట్రో లైన్ కోసం సొరంగం తవ్వడం కష్టమవుతుందేమో.. కానీ ఒకసారి తవ్వాక నియంత్రణ సులువు. రోడ్డు మార్గం ఎలా ఉంటుందో మెట్రో లైన్ కూడా అలాగే వేయాల్సి ఉంటుంది. పైగా వంకర్లు ఉండే మార్గంలో ఎక్కువ బోగీలతో మెట్రోను నడపడం కుదరదు. కానీ, భూగర్భ మెట్రోను ఏ నుంచి బీ పాయింట్‌కు సరళ రేఖ మాదిరిగా వేయవచ్చు. దీంతో మెట్రో రైలు వేగం పెరగడంతో పాటు ఎక్కువ బోగీలతో మెట్రో నడపొచ్చు.భవిష్యత్తు ఈ ప్రాంతాలదే.. ఇప్పటి వరకు ఐటీ, ఫార్మా రంగాల బహుళ జాతి సంస్థలే నగరానికి ప్రాధాన్యం ఇచ్చాయి. కానీ, కొన్నేళ్లుగా తయారీ రంగంలో కూడా మల్టీనేషనల్ కంపెనీలు విస్తరిస్తున్నాయి. ఫాక్స్‌కాన్, టాటా ఎయిరోస్పేస్ వంటి సంస్థలు ఆదిభట్ల, శంషాబాద్ ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఐటీ అంతా వెస్ట్‌లోనే ఉంది కాబట్టి ఈ ప్రాంతాలకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. కానీ, ఇప్పటికే ఆయా ప్రాంతాలలో నివాస, వాణిజ్య భవనాలతో కిక్కిరిసిపోవడంతో ఈ అభివృద్ధి చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరిస్తుంది. కొంగరకలాన్, ఆదిభట్ల, శంషాబాద్, కొల్లూరు, శామీర్‌పేట వంటి ప్రాంతాల్లో మార్కెట్ ఊపందుకుంటుంది.హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు.. ఐటీలోనే కాదు రియల్ ఎస్టేట్‌లోనూ హైదరాబాద్, బెంగళూరు పోటీ పడుతున్నాయి. రెండు నగరాలకు ఉన్న తేడా.. రోడ్ల వెడల్పు. బెంగళూరులో ఎయిర్‌పోర్టు రోడ్డు తప్ప అన్నీ దాదాపు 60 ఫీట్ల రోడ్లే.. కానీ, మన దగ్గర 100, 140 ఫీట్ల రోడ్లు కూడా ఉన్నాయి. నగరంలో అంత పెద్ద రోడ్లు ఎలా వచ్చాయి? రోడ్డు వెడల్పుగా ఉంటే అపరిమిత ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(ఎఫ్ఎస్ఐ) ఉంటుందని యజమానులు రోడ్ల కోసం భూములు ఇచ్చారు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో అక్కడ.. కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు..!దీంతో భారీ టౌన్‌షిప్‌లు, స్కై స్క్రాపర్లు వస్తున్నాయి. తాజాగా హైరైజ్ ప్రాజెక్ట్‌లతో ట్రాఫిక్ పెరుగుతోందని ఎఫ్ఎస్ఐపై ఆంక్షలు పెట్టాలనే ప్రతిపాదనకు బదులుగా రోడ్లను ఇంకా వెడల్పు చేయడం ఉత్తమం. హైదరాబాద్ రియల్టీకి వరమైన జీవో–86 వల్లే దేశ, విదేశీ పెట్టుబడులు వచ్చాయి. అలాంటి సమర్థవంతమైన జీవోపై ఆంక్షలు పెట్టాలనుకోవడం సరైన నిర్ణయం కాదు.
ఆయన అరెస్టుకు ఆధారాలిస్తే రూ.215 కోట్ల రివార్డు!
వెనిజులా అధ్యక్షునిగా నికోలస్ మదురో మూడవసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే వెనిజులా ఎన్నికల్లో ఆయన ఓడిపోయారనడానికి స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఈ నేపధ్యంలో మదురోను అరెస్టు చేసేందుకు తగిన అధారాలు అందించినవారికి ఇచ్చే బహుమతి మొత్తాన్ని 25 మిలియన్ డాలర్లకు(సుమారు 215 కోట్ల రూపాయలు) పెంచినట్లు బైడెన్ పరిపాలనా విభాగం ప్రకటించింది.మదురోను వెనిజులాకు అధ్యక్షునిగా అమెరికా గుర్తించలేదు. 2024, జూలై జరిగిన ఎన్నికల్లో తాను గెలిచినట్లు మదురో(Nicolás Maduro) ఎటువంటి ఆధారాలను సమర్పించలేదు. అయితే అతని ప్రత్యర్థి ఎడ్ముండో గొంజాలెజ్ అందుబాటులోవున్న ఓట్ల లెక్కింపు ఆధారాలను సమర్పించారు. ఇవి అతను అత్యధిక ఓట్లు గెలుచుకున్నారని స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో గొంజాలెజ్.. వెనిజులా అధ్యక్షునిగా ఎన్నికయ్యారని యునైటెడ్ స్టేట్స్ ప్రకటించింది. అలాగే మదురోను పదవి నుంచి తప్పుకోవాలని కోరింది.కాగా తాత్కాలిక రక్షిత హోదాతో యునైటెడ్ స్టేట్స్లో నివసిస్తున్న దాదాపు 600,000 మంది వెనిజులా వలసదారులకు మరింత రక్షణ కల్పిస్తున్నట్లు బైడెన్ పరిపాలనా విభాగం ప్రకటించింది. ఈ వలసదారులు అదనంగా మరో 18 నెలలు ఉండడానికి బైడెన్ హామీనిచ్చారు. జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ(John Kirby) మీడియాతో మాట్లాడుతూ మదురో అరెస్టుకు ఆధారాలు సమర్పించినవారికి బహుమతిని పెంచే నిర్ణయం వెనుక వెనిజులా ప్రజలకు సంఘీభావం అందించడమే ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ఈ బహుమతిని పెంచడం ద్వారా మదురోతో పాటు అతని ప్రతినిధులపై ఒత్తిడిని కొనసాగించడానికి అంతర్జాతీయ ప్రయత్నాలను మరింత పెంచామన్నారు.కాగా వెనిజులా వలసదారులకు తాత్కాలిక రక్షిత హోదా పొడిగింపును వారికి మద్దతు ఇచ్చే ప్రయత్నంగా బైడెన్(Biden) పరిపాలన ప్రతినిధి అభివర్ణించారు. 2020లో మదురోపై అమెరికాలో పలు కేసులు నమోదయ్యాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న నార్కో-టెర్రరిజం, అంతర్జాతీయ కొకైన్ అక్రమ రవాణా కుట్రలో మదురో నిందితుడు. మదురో తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నిమిషాలకే, అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ ఎనిమిది మంది వెనిజులా అధికారులపై పలు ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది.ఇది కూడా చదవండి: అయోధ్యలో ఘనంగా ప్రాణప్రతిష్ఠ వార్షికోత్సవాలు
'గేమ్ ఛేంజర్' కలెక్షన్స్ ప్రకటన.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
'గేమ్ ఛేంజర్' మొదటిరోజు కలెక్షన్స్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే, బాక్సాఫీస్ కలెక్షన్స్ వివరాలను ఎప్పటికప్పుడు ప్రకటించే ప్రముఖ సంస్థలు కూడా ఇప్పటికే గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ రిలీజ్ చేశాయి. కానీ, వారి ఊహలకు కూడా అందని విధంగా రామ్ చరణ్ సినిమా కలెక్షన్స్ రాబట్టింది. ఈమేరకు దిల్ రాజు నిర్మాణ సంస్థ అధికారికంగా ఒక పోస్టర్‌తో గేమ్ ఛేంజర్ లెక్కల వివరాలను ప్రకటించింది.రామ్ చరణ్ (Ram Charan), శంకర్ (Shankar) కాంబినేషన్లో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా చిత్రం 'గేమ్ ఛేంజర్'. జనవరి 10న సంక్రాంతి కానుకగా భారీ అంచనాలతో విడుదలైంది. ఈ చిత్రం తొలిరోజే రూ. 186 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రాల జాబితాలో గేమ్ ఛేంజర్ (Game Changer) చేరిపోయింది. మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా పుష్ప2 రూ. 294 కోట్లతో టాప్ వన్‌లో ఉంది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ రూ. 223 కోట్లు, బాహుబలి2 రూ. 210 కోట్లు, కల్కి 2898AD రూ. 191 కోట్లుతో ఉంటే.. గేమ్ ఛేంజర్ రూ. 186 కోట్ల కలెక్షన్స్‌తో టాప్ ఫైవ్‌లో చేరిపోయింది. ఎన్టీఆర్ దేవరకు తొలి రోజు రూ.172 కోట్లు వచ్చిన విషయం తెలిసిందే.బాక్సాఫీస్ ట్రేడ్ వర్గాల లెక్కలు ఇలా'గేమ్ ఛేంజర్' తొలిరోజు కేవలం రూ. 51 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. గ్రాస్ పరంగా అయితే సుమారు రూ. 80 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో రూ.42 కోట్లు రాబట్టినట్లు సమాచారం. హిందీ వర్షన్లో అయితే రూ. 7 కోట్లతోనే ఈ చిత్రం సరిపెట్టుకుంది. తమిళ్ రూ.2.1 కోట్లు, కన్నడ రూ. 10 లక్షలు, మలయాళం రూ. 5 లక్షలు వరకు గేమ్ ఛేంజర్ రాబట్టింది. Sacnilk ప్రకారం గేమ్ ఛేంజర్ దేశవ్యాప్తంగా 17,161 షోలలో 9.39 లక్షల టిక్కెట్లను బుక్ మై షో విక్రయించింది. కేవలం ముందస్తు బుకింగ్‌లతో ప్రపంచవ్యాప్తంగా రూ. 26.8 కోట్లు ఈ చిత్రం ఆర్జించింది.(ఇదీ చదవండి: ‘గేమ్ ఛేంజర్’ మూవీ రివ్యూ)గేమ్ ఛేంజర్ సినిమా మొదటిరోజే ప్రేక్షకులను నిరుత్సాహ పరచడంతో ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ మీద పడింది అనేది అందరి అభిప్రాయం. దీంతో మొదటిరోజు రూ. 100 కోట్లు కూడా దాటడం కష్టం అని భావించారు. అయితే, తాజాగా చిత్ర యూనిట్ మాత్రం రూ. 186 కోట్లు ఫస్ట్ డే రాబట్టినట్లు పోస్టర్ విడుదల చేయడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అపద్దం చేప్పడానికి కూడా ఒక హద్దు అనేది ఉండాలని కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఎకంగా రూ. 100 కోట్లు పెంచడం ఏంటయ్యా అంటూ ట్వీట్లు చేస్తున్నారు. కనీసం కాస్త నమ్మేలా కలెక్షన్స్ ప్రకటించాలని నెటిజన్లు కోరుతున్నారు. ఇంకో రూ. 100 కోట్లు కలిపి పుష్ప2 రికార్డ్ బద్దలు అయిపోయిందని పోస్టర్ రిలీజ్ చేసి ఉంటే బాగుండేది కదా అని ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.King size entertainment unleashes in theatres 🔥#GameChanger takes a blockbuster opening at the BOX OFFICE 💥💥#BlockbusterGameChanger GROSSES 186 CRORES WORLDWIDE on Day 1 ❤🔥Book your tickets now on @bookmyshow🔗 https://t.co/ESks33KFP4Global Star @AlwaysRamCharan… pic.twitter.com/NqiqvscgR8— Sri Venkateswara Creations (@SVC_official) January 11, 2025Bro this is to much lie ki koda limit untadi bro dill raju garu— Balayya USA Fans (@BalayyaUsa) January 11, 2025Sare, ippudu original collections cheppandi...— నాని (@nani_SSMBfan) January 11, 2025Bayata rc midha jalikuda poindhi i poster chusi 😂😂😂— Ⲛ𝐚ᥒꭵ𝑇𝐚𝑟𝐚ķᵀᴹ (@taraknani_) January 11, 2025100 cr fake Ela chesaraa 🙏 only mega ke sadhyam 🙏— NTR ADMIRE 🌊 (@NTRADMIRE) January 11, 2025
నల్గొండ ఇంటలిజెన్స్ ఎస్పీ కవితపై వేటు
నల్గొండ, సాక్షి: జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీ గంజి కవితపై వేటు పడింది. ఆమెను డీజీపీ కార్యాలయానికి ఎటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అక్రమాలు, వసూళ్ల ఆరోపణల మీద ఆమెపై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. సొంత సిబ్బందిని సైతం వదలకుండా ఆమె భారీగా డబ్బు వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. ఆమె అవినీతి(Corruption)పై సొంత శాఖ సిబ్బందే ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఆ అక్రమాలపై బాధితులు 9 పేజీల లేఖను విడుదల చేశారు. ఇంటెలిజెన్స్ విభాగంలో పోస్టింగ్‌ల కోసం లంచం వసూలు చేసినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా సిబ్బందితో అధిక వడ్డీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులు సైతం చేయించినట్లు లేఖలో తెలిపారు. దీని ఆధారంగా అధికారులు విచారణ చేపట్టగా.. గంజి కవిత బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ అధికారిగా గంజి కవిత(Ganji Kavitha) ఏడేళ్లు పని చేశారు. ఈ ఏడేళ్లలో ఆమె రేషన్, గుట్కా మాఫియాల నుంచి భారీగా ఆమె వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. అలాగే సొంత సిబ్బందిని ఆమె వదల్లేదని తేలింది. ఎస్సైతో పాటు నలుగురు కానిస్టేబుళ్లతో కవిత ఈ దందా నడిచిపించినట్లు సమాచారం. దీంతో ఆమె షాడో టీంపైనా విచారణ కొనసాగుతోంది. సమగ్ర విచారణ తర్వాత ఆమెను సస్పెండ్ చేసే అవకాశం ఉంది.
ఇలాంటి పీడ కలలు మీకూ వచ్చాయా? అర్థం, అనర్థాలేమిటి?
పీడకలలు (Nightmares) ప్రతి ఒక్కరికీ తమ జీవితంలోని ఏదో ఒక సమయంలో రావడం మామూలే. తీవ్రమైన మానసిక ఒత్తిడికీ, ఆవేదనకు గురైన / గురవుతున్న వారితో పాటు ఆర్థిక, సామాజిక కారణాలతో బాధపడుతూ ఉండేవారికి ఇలా పీడకలలు వచ్చే అవకాశం ఎక్కువ. ఇక మరికొందరిలో సుదీర్ఘ విమాన ప్రయాణం తర్వాత జెట్లాగ్ టైమ్‌లో లేదా ఆ తర్వాత కూడా పీడకలలు రావచ్చు. ఇవి అదేపనిగా వస్తుంటే అందుకు కారణాలేమిటి, వాటికి చికిత్స ఏమిటన్న విషయాలను తెలుసుకుందాం.అందరి జీవితాల్లో ఏదో ఒక సమయంలో పీడకలలు రావడం అన్నది సాధారణమే అయినా... కొందరిలో రోజూ అలాంటి కలలే వస్తూ ఉండటం వల్లా... అలాగే వాటి దుష్ప్రభావం వారి దైనందిన జీవితంపై పడటంతో సామాజికంగా, వృత్తిపరంగా, ఆర్థికంగా దెబ్బతినడం జరగవచ్చు. దాంతో తమకు సంబంధించిన ఇతరత్రా పనులేవీ చేసుకోలేని విధంగా తీవ్రమైన మానసిక ఆందోళనకూ, తీవ్రమైన ఒత్తిడికీ, ఆందోళనకూ గురయ్యే అవకాశాలు ఎక్కువ. మాటిమాటికీ పీడకలలు వచ్చే కండిషన్‌ను ‘నైట్మేర్ డిజార్డర్’(Nightmare disorder)గా చెబుతారు. గతంలో ఈ మానసిక సమస్యను ‘డ్రీమ్ యాంగ్జైటీ డిజార్డర్’(Dream anxiety disorder) అనే వారు. అయితే ఇప్పుడు ఈ సమస్యను ‘నైట్మేర్ డిజార్డర్’ లేదా ‘రిపీటెడ్ నైటమేర్స్’ (Repeated nightmares) అంటున్నారు. (కాలుష్యం కాటేస్తది.. చెవి, ముక్కు, గొంతు జాగ్రత్త!)సాధారణంగా ‘నైట్మేర్ డిజార్డర్’ సమస్యకు మందుల అవసరం పెద్దగా ఉండకపోవచ్చు. అయితే ఇలాంటి బాధితులకు ధైర్య వచనాలు చెప్పి సాంత్వన కలిగించడం అవసరం. అలాగే వాళ్లకు యాంగై్జటీ, ఒత్తిడి కలిగించే అంశాల విషయంలో కౌన్సెలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి చర్యలతో ఈ సమస్యను చాలావరకు పరిష్కరించవచ్చు. అయితే కొంతమందిలో పదే పదే ఇలాంటి కలలు రావడానికి మరో అంతర్గత కారణం ఏదో ఉండి ఉంటుంది. అలాంటి అండర్లైయింగ్ మెడికల్ సమస్యలకు తగిన మందులు ఇవ్వడం ద్వారా కూడా ఇలాంటి కలలు రాకుండా చూడవచ్చు. మానసిక వైద్యనిపుణుల పర్యవేక్షణలో స్ట్రెస్ రెడ్యూసింగ్ టెక్నిక్‌లతో బాధితుల్లో ఒత్తిడి తగ్గించడం వల్ల కూడా ఇవి తగ్గిపోవచ్చు. అయితే భయంకరమైన యుద్ధం, కుటుంబంపై దాడి, కుటుంబ పెద్ద మరణం... ఇలాంటి ఏవైనా కారణాలతో కుటుంబమంతా అల్లకల్లోలం కావడం వంటి అత్యంత తీవ్రమైన వేదన కలిగించే దుర్ఘటన తర్వాత కలిగే... పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్’కు లోనైనవారిలో ‘ఇమేజరీ రిహార్సల్ థెరపీ’ అనే చికిత్సను అందిస్తారు. ఇందులో బాధితుల్లో వచ్చే పీడకల చివర్లో అంతా సుఖాంతమైనట్లుగా బాధితుల మనసులో నాటుకుపోయేలా చేస్తారు. ఫలితంగా పీడకలలు క్రమంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి: భరించలేని మోకాళ్ల నొప్పులకు.. సూపర్ ఫుడ్ ఈ లడ్డూ...అంతేనా!
ఆప్ ఎమ్మెల్యే మృతి కేసులో ట్విస్ట్
ఛండీగఢ్: లూథియానా ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే మృతి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. గుర్తు తెలియనిక్తులుల్పులు జరపడంతో ఆయన మృతి చెందినట్లు తొలుత కథనాలు వెడ్డాయి. అయితే ఆయన కుటుంబ సభ్యులు మాత్రం మరోలా చెబుతున్నట్లు పోలీసులు ప్రకటించారు.అర్ధరాత్రి ఆప్(AAP) ఎమ్మెల్యే గుర్ప్రీత్ గోగి మృతి చెందడం అక్కడ సంచలనంగా మారింది. శుక్రవారం అర్ధరాత్రి బుల్లెట్ గాయాల పాలైన ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఎమ్మెల్యే మృతి చెందినట్టుగా వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే.. ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఎవరూ కాల్చలేదు.. ఆ టైంలో ఆయన గదిలో ఒంటరిగానే ఉన్నారని.. అది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన కావొచ్చని చెబుతున్నారు. తుపాకీని గురుప్రీత్ శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తూ పేలి బుల్లెట్ గాయమైందని పోలీసులను వాంగ్మూలం ఇచ్చారు. శవ పరీక్ష(autopsy) నివేదిక వచ్చాక ఘటనపై మరింత స్పష్టత రావొచ్చని అధికారులు అంటున్నారు. ఇక, 2022లో ఆప్‌లో చేరిన గురుప్రీత్.. అసెంబ్లీ ఎన్నికల్లో లూథియానా వెస్ట్ నుంచి పోటీ చేసి మాజీ మంత్రి భరత్ భూషణ్ అషూని ఓడించారు. తాజాగా శుక్రవారంనాడు ఆయన పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండ వాటినిక సంబంధించిన వివరాలను తన ఫేస్బుక్ ఖాతాలోనూ పోస్ట్ చేశారు.Breaking: AAP MLA from Ludhiana West, Gurpreet Gogi, has died from a gunshot wound to the head. He was at his home when the incident occurred and was taken to DMC Hospital, where he was declared dead. The cause of death and further details are awaited. pic.twitter.com/7FfIafyksZ— Gagandeep Singh (@Gagan4344) January 10, 2025
సంక్రాంతి రద్దీ.. ప్రయాణికులకు చుక్కలే!
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి రద్దీ మొదలైంది. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో నగర వాసులు సొంత ఊళ్లకు తరలివెళ్తున్నారు. నగరం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని రెగ్యులర్ రైళ్లలో రిజర్వేషన్లు పూర్తిగా నిలిచిపోయి రిగ్రేట్ దశకు చేరాయి. కొత్తగా అందుబాటులోకి వచ్చిన చర్లపల్లి టెర్మినల్ నుంచి కాకినాడ, తిరుపతి, విశాఖ, విజయవాడ తదితర ప్రాంతాలకు కొన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. లక్షలాది మంది నగరవాసులు సొంత ఊళ్లకు తరలి వెళ్తుండగా.. అరకొరగా ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లు ఏ మాత్రం ప్రయాణికుల డిమాండ్లను భర్తీ చేయడం లేదు. మరోవైపు అన్ని ప్రత్యేక రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తూ ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు అతికష్టంగా బెర్తులు సంపాదించి రైలెక్కినా గంటల తరబడి పట్టాలపైనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. సికింద్రాబాద్ నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరితే మరుసటి రోజు మధ్యాహ్నం 12 దాటినా విశాఖకు చేరుకోలేకపోయామని కూకట్‌పల్లికి చెందిన కృష్ణారావు విస్మయం వ్యక్తం చేశారు. మరోవైపు నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి శబరిమలకు నడిచే రైళ్లు కూడా అయ్యప్ప భక్తులకు నరకం చూపుతున్నాయి. రెండు రోజులు గడిచినా హైదరాబాద్ నుంచి శబరిమలకు, తిరిగి అక్కడి నుంచి ఇక్కడికి చేరుకోలేకపోతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చార్జీలు కూడా ‘ప్రత్యేకమే’.. ⇒నగరం నుంచి ప్రతి రోజు సుమారు వందకు పైగా రెగ్యులర్ రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. సుమారు 2.5 లక్షల మంది ప్రయాణం చేస్తారు. ప్రస్తుతం రోజుకు మరో 50 వేల మంది అదనంగా బయలుదేరే అవకాశం ఉంది. ఈ డిమాండ్ మేరకు అదనపు రైళ్లు లేవు. కొన్ని రైళ్లలో బెర్తులు, అదనపు బోగీలు ఏర్పాటు చేశారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు మాత్రం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. కానీ ఈ రైళ్లలో చార్జీలు కూడా ఎక్కువే. సాధారణ చార్జీలపై 25 శాతం వరకు అదనపు చార్జీలు విధిస్తారు. అయినప్పటికీ మరో గత్యంతరం లేక ప్రత్యేక రైళ్లను ఆశ్రయించే ప్రయాణికులకు రైళ్లలో పడిగాపులు తప్పడం లేదు. ⇒ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పట్టాలపై రైళ్ల ఒత్తిడి పెరిగిందని, దీంతో సకాలంలో సిగ్నల్స్ లభించకపోవడం వల్ల జాప్యం చోటుచేసుకుంటోందని అధికారులు చెబుతున్నారు. కానీ ఈ ఆలస్యం ప్రయాణికుల పండగ సంతోషాన్ని ఆవిరి చేస్తోంది. కనిష్టంగా 3 నుంచి గరిష్టంగా 12 గంటల వరకు కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. గతంలో ఇలాంటి ఫిర్యాదులు పెద్ద ఎత్తున వెల్లువెత్తినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. సంక్రాంతి సందర్భంగా బయలుదేరిన ప్రయాణికులు భోగి పండగ రోజు కూడా సొంత ఊళ్లకు చేరుకోలేకపోయారు. ప్రస్తుతం మరోసారి అదే పరిస్థితి నెలకొందని పేర్కొంటున్నారు. ఆర్టీసీ సైతం అదే బాటలో.. ఆర్టీసీ సైతం ప్రత్యేక బస్సుల పేరిట 50 శాతం అదనపు దోపిడీకి దిగింది. ఏపీతో పాటు, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో కూడా 25 శాతం నుంచి 50 శాతం వరకు అదనపు వసూళ్లకు పాల్పడుతోంది. చివరకు దివ్యాంగుల పాస్‌లను అనుమతించకుండా ఇష్టారాజ్యంగా చార్జీలు విధిస్తున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని సుమారు 6 వేలకు పైగా అదనపు బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. రెండు రోజులుగా ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఎల్బీనగర్, ఉప్పల్, హయత్‌నగర్, ఎంజీబీఎస్, జేబీఎస్ తదితర ప్రాంగణాలుప్రయాణికులతో సందడిగా మారాయి.ప్రైవేట్ బస్సుల దోపిడీ.. సంక్రాంతి రద్దీని సొమ్ము చేసుకొనేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ అడ్డగోలుగా దారి దోపిడీకి పాల్పడుతున్నాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి విశాఖకు లగ్జరీ రూ.1800 వరకు ఉంటుంది. ఇప్పుడు ఆ చార్జీ రూ.3000 వరకు చేరింది. అలాగే ఏసీ బస్సుల్లో రూ.2500 నుంచి ఏకంగా రూ.5000 వరకు పెరిగినట్లు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటిల్లిపాదీ కలిసి వెళితే చార్జీల కోసమే రూ.వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తోందని ఏఎస్రావు నగర్‌కు చెందిన మల్లికార్జున్‌రావు చెప్పారు. అలాగే.. హైదరాబాద్ నుంచి కాకినాడ, విజయవాడ, తిరుపతి తదితర ప్రాంతాలకు సైతం ప్రైవేట్ బస్సుల దోపిడీ విమాన చార్జీలను తలపిస్తోంది.సాక్షి ఎఫెక్ట్.. బస్సులు సీజ్‌అధిక ఛార్జీలు వసూళ్లు చేస్తున్నప్రైవేట్ వాహనాల దందాపై సాక్షి వరుస కథనాలు ఇచ్చింది. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. ఎల్బీనగర్ లో ప్రైవేట్ వాహనాలపై ఆర్టిఏ అధికారుల కొరడా జులిపించారు. సంక్రాంతికి అధిక బస్సు చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ వాహనాలపై ఆర్టిఏ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలోని టీం అడ్డుకుంది. దాదాపు 20 బస్సులపై కేసు నమోదు చేశారు. ఇక.. పెద్ద అంబర్ పేట్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 10 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారుల సీజ్ చేశారు. మరోవైపు.. రాజేంద్రనగర్ ఆరాంఘడ్ చౌరస్తా వద్ద రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారుల ఈ ఉదయం 4 గంటల నుంచే తనిఖీ చేపట్టారు. చెన్నై, తిరువంతపురం, పాండిచ్చేరి, మంగళూరు, మైసూరు, కన్యాకుమారి నుండి హైదరాబాద్ వస్తున్న బస్సులను తనిఖీలు చేస్తున్నారు . ఈ క్రమంలో నిబంధనలకు తూట్లు పొడుస్తున్నట్రావెల్స్‌పై కేసులు నమోదు చేస్తున్నారు. 11 బస్సుల పై కేసు నమోదు అయినట్లు సమాచారం.
మహా కుంభమేళాలో తెలుగు కీర్తి
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక కుంభమేళా. 144 ఏళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళాకు సర్వం సన్నద్దమైంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో ఈనెల 13 నుంచి వచ్చే నెల 26వ తేదీ వరకు అంటే 45 రోజుల పాటు జరిగే ఈ వేడుకకు ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాగరాజ్ వేదికగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పలు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్దమయ్యాయి. ఇందులో భాగంగా భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్, మణిపూరి, సిత్రియా తదితర నాట్యాలతో పాటు సంగీత కచేరీలు నిర్వహిస్తున్నారు. ఇందుకు దేశవ్యాప్తంగా 160 మంది నృత్యకాళాకారులను ఎంపిక చేశారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన నలుగురు ఉండటం విశేషం. పద్మశ్రీ, ఎస్ఎన్ఏ అవార్డు గ్రహీత పద్మజా రెడ్డి, పద్మశ్రీ, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత ఆనంద శంకర్ జయంత్, కేంద్ర సంగీత నాటక అకాడెమీ పురస్కార గ్రహీత దీపికా రెడ్డి, ఎస్ఎన్ఏ అవార్డు గ్రహీత కళాకృష్ణ మహా కుంభమేళాలో నృత్య ప్రదర్శన చేయనున్నారు. ‘శివోహం’తో ఆనంద ‘శివోహం’ ఇతివృత్తంతో లక్షలాది మంది భక్తులను అలరించనున్నారు పద్మశ్రీ గ్రహీత ఆనంద శంకర్ జయంత్. దశబ్థాలుగా భరతనాట్యంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్న ఆనంద శంకర్ జయంత్ 144 ఏళ్ల మహా కుంభమేళాలో తెలుగు వారిలో తొలి ప్రదర్శన ఇవ్వనున్నారు. ‘గణేశ తాళనం, స్కంధ మయుర, దేవీ ఉపాసకం, శివోహం’లపై 45 నిమిషాల పాటు 17మంది నృత్య కళాకారులతో కలిసి ఆమె నాట్యమాడనున్నారు. ఇటువంటి మహోత్సవాల్లో ప్రదర్శన ఇవ్వడం అనేది జన్మధన్యంగా భావిస్తున్నారు భారతనాట్య నృత్య కళాకారిణి ఆనంద శంకర్ జయంత్. ‘శివసతాయం’తో దీపికా రెడ్డి ‘కూచిపూడి కళ కోసం జీవితాన్ని అంకితం చేశా’అనే మాట ముమ్మాటికీ నిజం అంటారు కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత, తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ మాజీ చైర్ పర్సన్’దీపికా రెడ్డి. నాట్యమే ఊపిరిగా అనేక ప్రదర్శనలు ఇచ్చిన దీపికా రెడ్డి మహా కుంభమేళాలో ఆమె తన ప్రదర్శనను ఇవ్వనున్నారు. ‘శివ సతాయం’అనే థీంతో దాదాపు 50 నిమిషాల పాటు 12మంది నృత్య కళాకారులతో కలిసి ప్రదర్శన చేయనున్నారు. ఈ నృత్యం ద్వారా గంగ అవతరణ, గంగ ద్వారా అందరికీ మంచి జరగాలనే కాన్సెప్ట్‌తో ఈనెల 26వ తేదీన దీపికా రెడ్డి మహా కుంభమేళాలో ప్రదర్శన ఇవ్వనున్నారు. ‘శివపల్లవి’తో కళాకృష్ణ తెలుగు సాంప్రదాయ నృత్యాలైన ఆంధ్ర నాట్యం, పేరిణి వంటి వాటిలో ప్రపంచస్థాయిలో విశేష ఆదరణ సొంతం చేసుకున్న కళాకారుడు కళాకృష్ణ. ఎస్ఎన్ఏ అవార్డుతో పాటు, రాష్ట్రప్రభుత్వం పలు అవార్డులతో ఆయనను సత్కరించింది. 24.02.2025 న మహా కుంభమేళాలో ‘శివపల్లవి’థీంతో ఐదుగురుతో కలిసి ప్రదర్శన చేయనున్నారు. గంగ, పంచముఖస్త్రోత్రాలు, నీలకంఠ మహాదేవ కీర్తన ఈ మూడు అంశాలను 30 నిమిషాల్లో కళ్లకు కట్టినట్లుగా తన అపారమైన అనుభవంతో కుంభమేళాలో భక్తులను అలరించనున్నారు. ‘నమామి గంగే’తో పద్మజా రెడ్డి కూచిపూడి నృత్యంతో కళాప్రపంచంలో తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కళాకారిణి, పద్మశ్రీ అవార్డు గ్రహీత పద్మజా రెడ్డి ఈ మహాకుంభా మేళాలో నృత్యప్రదర్శన చేయనున్నారు. దాదాపు 3వేలకు పైగా ప్రదర్శనలు ఇచి్చన పద్మజా రెడ్డి ‘ప్రణవ్’ఇన్స్టిట్యూట్ ద్వారా అనేక మందికి నృత్యాన్ని పరిచయం చేస్తున్నారు. 10.02.2025న 30 నృత్యకళాకారులతో కుంభమేళాలో ‘నమామి గంగే’అనే థీంతో ప్రదర్శన చేయనున్నారు. ఇటీవల కాలంలో గంగానది కలుíÙతానికి గురైంది, గంగను ఎలా పరిరక్షించుకోవాలి, భావితరాలకు గంగ ప్రాముఖ్యతను వివరించాలనే అంశాలపై సుమారు గంట పాటు ‘నమామి గంగే’అనే ఇతివృత్తంతో అక్కడ ప్రదర్శన ఇవ్వనున్నారు.
అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టులో ఊరట
సీఎంకు, డిప్యూటీ సీఎంకు ఇంకా బుద్ధి రాలేదు: ఆర్కే రోజా
సాక్షి కార్టూన్ 11-01-2025
కిడ్స్ లెట్స్ క్రూజ్ టు ఆఫ్రికా...
సందర్శకులను ఆకర్శించేలా మహా ‘బ్రాండ్’ మేళా!
బాబు డ్రామాలో పవన్ బకరా!
మాయదారి గుండెపోటు : చిన్నారి ‘గుండెల్ని’ పిండేస్తున్న వీడియో
'ముమ్మాటికీ కోహ్లిదే తప్పు.. అతడిపై నిషేధం పడాల్సింది'
ఎంఎఫ్ఐలకు ఆర్థిక సహకారం అవసరం
ప్రియురాలి మృతదేహాన్ని 9 నెలలుగా ఫ్రిడ్జ్‌లో దాచి..
భారీ ‘ఎత్తున’ చార్జీలు పెట్టినాఇంత ఎత్తున కూర్చోవాల్సి వస్తుంది!
స్పందించాల్సిన అవసరం లేదు.. పవన్‌కు టీటీడీ ఛైర్మన్ కౌంటర్
ఈ రాశి వారికి పనులు సజావుగా సాగుతాయి
వైఎస్ అభిషేక్‌రెడ్డి కన్నుమూత
ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
వీళ్లా ‘పాలకులు’?
బీఆర్ నాయుడే ముంచేశారు: అధికారుల సంచలన ఆరోపణలు
అహం దెబ్బతిన్న డిప్యూటీ సీఎం?
'గేమ్ ఛేంజర్' ఫస్ట్ డే కలెక్షన్స్.. ఫ్యాన్స్‌లో నిరాశ
భరించలేని మోకాళ్ల నొప్పులకు.. సూపర్ ఫుడ్ ఈ లడ్డూ...అంతేనా!
అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టులో ఊరట
సీఎంకు, డిప్యూటీ సీఎంకు ఇంకా బుద్ధి రాలేదు: ఆర్కే రోజా
సాక్షి కార్టూన్ 11-01-2025
కిడ్స్ లెట్స్ క్రూజ్ టు ఆఫ్రికా...
సందర్శకులను ఆకర్శించేలా మహా ‘బ్రాండ్’ మేళా!
బాబు డ్రామాలో పవన్ బకరా!
మాయదారి గుండెపోటు : చిన్నారి ‘గుండెల్ని’ పిండేస్తున్న వీడియో
'ముమ్మాటికీ కోహ్లిదే తప్పు.. అతడిపై నిషేధం పడాల్సింది'
ఎంఎఫ్ఐలకు ఆర్థిక సహకారం అవసరం
ప్రియురాలి మృతదేహాన్ని 9 నెలలుగా ఫ్రిడ్జ్‌లో దాచి..
భారీ ‘ఎత్తున’ చార్జీలు పెట్టినాఇంత ఎత్తున కూర్చోవాల్సి వస్తుంది!
స్పందించాల్సిన అవసరం లేదు.. పవన్‌కు టీటీడీ ఛైర్మన్ కౌంటర్
ఈ రాశి వారికి పనులు సజావుగా సాగుతాయి
వైఎస్ అభిషేక్‌రెడ్డి కన్నుమూత
ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
వీళ్లా ‘పాలకులు’?
బీఆర్ నాయుడే ముంచేశారు: అధికారుల సంచలన ఆరోపణలు
అహం దెబ్బతిన్న డిప్యూటీ సీఎం?
'గేమ్ ఛేంజర్' ఫస్ట్ డే కలెక్షన్స్.. ఫ్యాన్స్‌లో నిరాశ
భరించలేని మోకాళ్ల నొప్పులకు.. సూపర్ ఫుడ్ ఈ లడ్డూ...అంతేనా!
సినిమా
ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
మీకు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు అంటే అంచే ఇష్టమా..? అయితే, మలయాళ ( Malayalam) ఇండస్ట్రీలో గదేడాదిలో వచ్చిన ఈ చిత్రాన్ని వదులుకోకండి. కేవలం 1:40 గంటల పాటు ఉండే ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ ఈ చిత్రం మలయాళ వర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, తాజాగా తెలుగు వర్షన్‌ను ఉచితంగా చూసే అవకాశం వచ్చింది. అది కూడా యూట్యూబ్‌లో కావడంతో ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.మలయాళంతో తెరకెక్కిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా 'కురుక్కు' (Kurukku) తెలుగులో 'V2 డబుల్ మర్డర్' ( V2 Double Murder) అనే టైటిల్‌తో డబ్ అయ్యింది. తాజాగా ఈ హిట్ మూవీ తెలుగు వెర్షన్‌ను ఉచితంగా యూట్యూబ్‌లో (YouTube) చూడొచ్చు. ఈ మూవీలో పెద్ద స్టార్స్ లేరు. అనిల్ ఆంటో, బాలాజీ శర్మ, మీరా నాయర్, శ్రీజీత్ కీలక పాత్రలు పోషించారు. అభిజీత్ నూరానీ దర్శకత్వం వహించాడు. గతేడాది జూన్‌లో చిన్న సినిమాగా థియేటర్లలో రిలీజైన కురుక్కు బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకుంది.కురుక్కు ప్రేక్షకులను మెప్పింస్తుంది. ఇందులో ఎలాంటి కామెడీ, సాంగ్స్ అనేవి ఉండవు.. కేవలం యాక్షన్ సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అంతేకాకుండా సినిమా నిడివి తక్కువ. దీంతో ప్రేక్షకులలో ఎక్కడా కూడా బోర్ ఫీల్ కలగకుండా సినిమా సాగుతుంది. ఒక డబుల్ మర్డర్ కేసును పోలీస్ టీమ్ ఎలా ఛేదించింది అన్నదే 'వీ2 డబుల్ మర్డర్' కథ. పోలీసుల ఇన్విస్టిగేషన్లో కిల్లర్ ఎవరన్నది చివరి వరకు రివీల్ కాదు. వరుస ట్విస్ట్‌లతో దర్శకుడు ఈ మూవీని నడిపించిన తీరును ఎవరైనా ప్రశంసించాల్సిందే.(ఇదీ చదవండి: గేమ్ ఛేంజర్ తర్వాత స్టార్ హీరో బయోపిక్ ప్లాన్ చేస్తున్న శంకర్)ఈ సినిమా కథలో రూబిన్, అతడి వైఫ్ స్నేహ ఇద్దరు అతి దారుణంగా హత్యకు గురువుతారు. ఇద్దరి మృతదేహాలు వేరువేరు చోట్ల ఉంటాయి. అయితే, వారి హత్యను జార్జ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రత్యక్షంగా చూస్తాడు. కానీ, అతను మద్యం మత్తులో ఉండటంతో హంతకుడిని సరిగ్గా గుర్తు పట్టకలేక పోతాడు. సంచలనంగా మారిని ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా మారుతాడు. ఈ కేసు ఇన్వేస్టిగేషన్ చేసే బాధ్యతను సజన్ అనే పోలీస్ ఆఫీసర్ చేస్తుంటాడు. ఈ హత్యలో జార్జ్ నిరపరాధి అని సజన్ నమ్ముతాడు. కానీ, సాక్ష్యాలు మాత్రం అతడే హత్య చేసినట్లుగా కనిపిస్తాయి. చివరికి ఈ హత్య కేసును పోలీసులు ఎలా ఛేదించారు అనేది స్టోరీ. మర్డర్ మిస్టరీగా మారిన కురుక్కు తెలుగులో 'V2 డబుల్ మర్డర్' చిత్రాన్ని యూట్యూబ్‌లో ఉచితంగా చూసేయండి.
'గేమ్ ఛేంజర్' తర్వాత స్టార్ హీరో బయోపిక్ ప్లాన్ చేస్తున్న శంకర్
పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల జీవిత చరిత్రతో చిత్రాలు రూపొందాయి. ఇందిరాగాంధీ, జయలలిత, కామరాజర్, భారత క్రికెట్ క్రీడాకారుడు ఎంఎస్ ధోనీ వంటి ప్రముఖుల జీవిత చరిత్రతో చిత్రాలు రూపొందిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల సంగీత దర్శకుడు ఇళయరాజా బయోపిక్‌ను తెరకెక్కించడానికి ప్రయత్నాలు జరిగాయి. నటుడు ధనుష్ ఈ చిత్రంలో ఇళయరాజాగా నటించనున్నట్లు ప్రకటించారు కూడా. అయితే ఈ చిత్రం ఇప్పుడు డ్రాప్ అయ్యిందనే ప్రచారం జరుగుతోంది. ఇకపోతే ఇప్పుడు నటుడు రజనీకాంత్ (Rajinikanth) బయోపిక్ గురించి చర్చ జరుగుతోంది. దీనికి కారణం దర్శకుడు శంకర్ (Shankar) చేసిన వ్యాఖ్యలే. ఆయన ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ (Game Changer) చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. చాలా ఏళ్ల పాటు తెరకెక్కిన ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో మెప్పించలేదు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం తొలిరోజే డిజాస్టర్ టాక్‌ను తెచ్చుకుంది. అయితే, ఈ చిత్రం తర్వాత దర్శకులు శంకర్ మరో సినిమాపై అడుగులు వేస్తున్నారు.తన తదుపరి చిత్రం గురించి శంకర్ ఒక భేటీలో పేర్కొంటూ నటుడు రజనీకాంత్ బయోపిక్‌ను తెరకెక్కించాలన్న కోరికను వ్యక్తం చేశారు. కోలీవుడ్‌లో 50 ఏళ్లుగా కథానాయకుడిగా ఏకచత్రాధిపత్యాన్ని సాగిస్తున్న రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కుతుందా..? అన్న చర్చ సామాజిక మాధ్యమాల్లో జరుగుతోంది. కాగా దర్శకుడు శంకర్ ఇప్పటికే రజనీకాంత్ హీరోగా శివాజీ, రోబో, 2.ఓ చిత్రాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. దీంతో ఈయన రజనీకాంత్ బయోపిక్‌ను చిత్రంగా చేస్తే కచ్చితంగా సక్సెస్ అవుతుందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ( ఇదీ చదవండి: ఊహలకు మించి డాకు మహారాజ్ ఉంటుంది: బాలకృష్ణ)కాగా రజనీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి నెల్సన్ దర్శకత్వంలో జైలర్– 2 చిత్రాన్ని సిద్ధం అవుతారని తెలుస్తోంది. అదేవిధంగా దర్శకుడు శంకర్ వెల్పారి చిత్రాన్ని తెర రూపం ఇవ్వడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రం గురించి గతంలో ప్రకటన కూడా వచ్చింది. అయితే, ఇందులో సూర్య, విక్రమ్‌లు నటించనున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన రజనీకాంత్ బయోపిక్ ఎప్పుడు తెరకెక్కిస్తారు ? అన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనికి సమాధానం రావాలంటే కొంత కాలం ఆగాల్సిందే.
ఒక పథకం ప్రకారం....
సాయిరామ్ శంకర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతీ సోది, ఆషిమా నర్వాల్ హీరోయిన్లుగా నటించారు. సముద్ర ఖని కీలక పాత్ర చేశారు. వినోద్ కుమార్ విజయన్, గార్లపాటి రమేశ్ నిర్మించారు. ఫిబ్రవరి 7న ఈ చిత్రం విడుదల కానుంది. శుక్రవారం ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. వినోద్ కుమార్ విజయన్ మాట్లాడుతూ– ‘‘ఇదొక విభిన్నమైన కథ. అడ్వొకేట్ పాత్రలో సాయిరామ్ శంకర్, పోలీసు పాత్రలో సముద్ర ఖని నటన పోటాపోటీగా ఉంటుంది. ఊహించని మలుపులతో సాగే క్రైమ్, మిస్టరీ కథనాలతో మా సినిమా ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది’’ అని పేర్కొన్నారు.
నాటి రామాయణం నేటి పాత్రలతో.....
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం సింగమ్ ఎగైన్ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.మన ఇతిహాసాలలో గొప్ప విలువలతో కూడుకున్న కథ రామాయణం. నాటి రామాయణాన్ని నేటి నేటివిటీతో ప్రస్తుత ప్రముఖ నటీనటులతో మళ్లీ మన ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి. ఇదే ప్రయత్నాన్ని గతంలో చాలా మందే చేసినా యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ‘సింగమ్’ సిరీస్ చిత్రానికి ఈ తరహా ప్రయోగం చేయడం మొదటిసారి. అందులోనూ బాలీవుడ్లో భారీ తారాగణంతో ఇలాంటి అంశంతో కూడిన కథ తీయడమనేది నిజంగా సాహసమనే చెప్పాలి. ముందుగా ‘సింగమ్’ సిరీస్ గురించి చెప్పుకుందాం. ఈ సిరీస్‌లో వచ్చిన మూడో చిత్రం ‘సింగమ్ ఎగైన్’. సిరీస్‌లో ఈ భాగం ప్రేక్షకుల ముందు రావడా నికి దాదాపు పదేళ్లు పట్టింది. 2011లో ‘సింగమ్’ మొదటి చిత్రం రాగా 2014లో రెండో భాగంగా ‘సింగమ్ రిటర్న్స్’ విడుదలైంది. ఆ తరువాత మూడో భాగం 2024లో ‘సింగమ్ ఎగైన్’గా వచ్చింది.అన్ని సిరీస్‌లలో కథానాయకుడిగా ప్రముఖ స్టార్ అజయ్ దేవగన్ నటించారు. ఇకపోతే ప్రస్తుత ‘సింగమ్ అగైన్’ చిత్రంలో అజయ్ దేవగన్‌తో పాటు కరీనా కపూర్, దీపికా పదుకోన్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్ తదితర ప్రముఖ నటులు నటించారు. రామాయణ కథనే ఇతివృత్తంగా అల్లుకున్న కథ ఇది. రామాయణంలోని పాత్రలను రిలేట్ చేస్తూ ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ స్క్రీన్‌ప్లే కొనసాగుతుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే సినిమాలో రామాయణ కథను టీవీ షో రూపంలో చూపిస్తూ కథను నడిపిస్తారు. అప్పటి రామాయణ కథ చరిత్రతో మనకు పరిచయం.అందుకే అది రమణీయ కావ్యం. కానీ ఇప్పటి ‘సింగమ్ ఎగైన్’ రణరంగమే ప్రధాన సూత్రంగా నడిచిన కథ. ఆఖరుగా ఒక్క మాట... రామాయణ కథను నేటి తరానికి మళ్లీ చెప్పడమనేది మంచిదే కానీ, ఎన్నో భావావేశాలున్న రామాయణ మూల కథలోంచి ఒక్క శౌర్య, వీర రసం మాత్రం తీసుకుని సినిమా రూ΄పొందించడం ఏమాత్రం సమంజసమో సినిమా తీసిన దర్శక–నిర్మాతలు, చూస్తున్న మనలాంటి ప్రేక్షకులు ఆలోచించాల్సిందే. ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. మీరు కూడా చూసి ఆలోచించడం మొదలు పెట్టండి. – ఇంటూరు హరికృష్ణ
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్..
బంగ్లాదేశ్ స్టార్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్(Tamim Iqbal) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తమీమ్ రెండోసారి అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ఇక్బాల్ అందుబాటులో ఉంటాడని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భావించింది. కానీ అంతలోనే తమీమ్ రిటైర్మెంట్ ప్రకటించి బంగ్లా క్రికెట్‌కు షాకిచ్చాడు. 34 ఏళ్ల తమీమ్ తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు."నేను గత కొంతకాలంగా ఇంటర్ననేషనల్ క్రికెట్‌కు దూరంగా ఉన్నాను. చాలా గ్యాప్ వచ్చింది. దీంతో నా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాను. ఈ నిర్ణయం చాలా రోజుల కిందటే తీసుకున్నాను. నా నిర్ణయం ప్రకటించడానికి ఇదే సరైన సమయం. ఎందుకంటే మరి కొన్ని రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ టోర్నీ ముందు నాపై చర్చలు ఉండకూడదు అని ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను ఎప్పుడో బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకున్నాను. కానీ మీడియా మాత్రం నాపై అనవసర చర్చలు పెట్టింది.కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో నన్ను జట్టులోకి తిరిగి రావాలని అభ్యర్థించాడు. నేను సెలక్షన్ ప్యానెల్‌తో కూడా మాట్లాడాను. నాలో ఇంకా సత్తువ తగ్గలేదని నమ్ముతున్నందుకు ధన్యవాదాలు. కానీ నేను నా మనసు చెప్పిన మాటే వింటాను. అంతర్జాతీయ క్రికెట్లో నా అధ్యాయం ముగిసింది" అని తన రిటైర్మెంట్ నోట్లో తమీమ్ పేర్కొన్నాడు.రెండో సారి.. కాగా తమీమ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం రెండోసారి. గతంలో 2023 జూలైలో తొలిసారి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. అయితే అప్పటి బంగ్లా ప్రధాని షేక్ హసీనా సూచన మెరకు తన ఇక్భాల్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్-2023 దృష్ట్యా అతడు తన మనసును మార్చుకున్నాడు.కానీ అనూహ్యంగా ప్రపంచకప్ జట్టులో తమీమ్‌కు జట్టులో చోటు దక్కలేదు. అప్పటి నుంచి అతడు తిరిగి జట్టులోకి రాలేదు. ఇక తమీమ్ ఇక్బాల్ బంగ్లా తరఫున 70 టెస్ట్‌లు, 241 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు.లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్ అయిన తమీమ్.. టెస్ట్‌ల్లో 10 సెంచరీలు, 31 అర్ధసెంచరీల సాయంతో 5134 పరుగులు.. వన్డేల్లో 14 సెంచరీలు, 56 అర్ధసెంచరీల సాయంతో 8313 పరుగులు.. టీ20ల్లో సెంచరీ, 7 అర్ధసెంచరీల సాయంతో 1758 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో తమీమ్ అత్యుత్తమ ఆటగాడిగా పేరుగాంచాడు.చదవండి: అతడి డిఫెన్స్ అద్భుతం.. 200 బంతులు కూడా ఆడగలడు: అశ్విన్
అతడి డిఫెన్స్ అద్భుతం.. 200 బంతులు కూడా ఆడగలడు: అశ్విన్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ దూకుడైన బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. ఫార్మాట్ ఏదైనా పంత్ బ్యాటింగ్ స్టైల్ ఒకటే. క్రీజులో వచ్చినప్పటి నుంచే ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడడం రిషబ్‌కు వెన్నతో పెట్టిన విద్య. అయితే ఈ ఢిల్లీ చిచ్చరపిడుగులో దూకుడైన బ్యాటింగ్‌తో పాటు అద్భుతమైన డిఫెన్స్ స్కిల్స్‌ను కూడా టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ గుర్తించాడు.ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న అశ్విన్ తన సహచరుడి బ్యాటింగ్‌పై ప్రశంసలు కురిపించాడు. పంత్ డిఫెన్స్ అభేద్యమని, అతను పట్టుదలగా నిలబడితే ఎన్ని బంతులైనా ఆడగలడని అశ్విన్ కొనియాడాడు.పంత్ డిఫెన్స్ అద్భుతం..‘రిషభ్ పంత్‌లో అన్ని రకాల షాట్లు ఆడే సామర్థ్యం ఉంది. అయితే అతడి నుంచి మనం ఏం ఆశిస్తున్నామో అతనికి స్పష్టంగా చెప్పాలి. అతడి డిఫెన్స్ కూడా ఎంత బాగుంటుందంటే 200 బంతులు కూడా ఆడగలడు. ప్రపంచంలోనే అద్బుతంగా డిఫెన్స్ ఆడే బ్యాటర్లలో రిషబ్ ఒకడు.తన బలమేంటో తనకే పూర్తిగా తెలీదు. మిడిల్ గేమ్‌లో పరిస్థితికి తగినట్లుగా ఆడటం అలవాటు చేసుకుంటే ప్రతీ మ్యాచ్‌లో పంత్ సెంచరీ కొట్టగలడు. డిఫెన్స్ ఆడుతూ అతను అవుట్ కావడం చాలా అరుదు. నెట్స్‌లో నేను ఎన్నోసార్లు అతనికి బౌలింగ్ చేశాను.అతడు ఎల్బీడబ్ల్యూగా లేదా బంతి ఎడ్జ్ తీసుకుంటూ ఎప్పుడూ అవుట్ కాలేదు. గత కొన్నేళ్లుగా టెస్టుల్లో బ్యాటింగ్ చాలా కష్టంగా మారిపోయింది. అలాంటి సమయంలో పంత్ ఆడుతున్నాడు. సిడ్నీలో అతడి ఆడిన ఇన్నింగ్స్‌లు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.ఒకే ఒకే గేమ్‌లో రెండు వేర్వేరు నాక్‌లు ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో డిఫెన్స్ ఆడితే, రెండో ఇన్నింగ్స్‌లో తన విశ్వరూపం చూపించాడు’ అని అశ్విన్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. సిడ్నీ టెస్టులో భారత్ ఓటమి పాలైనప్పటికి పంత్ మాత్రం తన ఆటతీరుతో అందరిని ఆకట్టుకున్నాడు.తొలి ఇన్నింగ్స్‌లో 40 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో 61 పరుగులతో సూపర్ నాక్ ఆడాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో మొత్తం 9 ఇన్నింగ్స్‌లో పంత్.. 28.33 సగటుతో 255 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు 43 టెస్టులు ఆడిన పంత్.. 42.11 సగటుతో 2948 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఆరు సెంచరీలు చేశాడు.చదవండి: క్రికెట్ ‘మనసు’ చదివింది!
2024 ప్రపంచ ఉత్తమ జావెలిన్ త్రోయర్ నీరజ్
న్యూఢిల్లీ: భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా 2024 సంవత్సరానికిగానూ ప్రపంచ ఉత్తమ జావెలిన్ త్రోయర్‌గా ఎంపికయ్యాడు. అమెరికాకు చెందిన ప్రముఖ మేగజైన్ ‘ట్రాక్ అండ్ ఫీల్డ్ న్యూస్’ ప్రకటించిన ర్యాంకింగ్స్ జాబితాలో... పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన 27 ఏళ్ల నీరజ్ చోప్రా అగ్రస్థానం దక్కించుకున్నాడు. ‘ట్రాక్ అండ్ ఫీల్డ్ న్యూస్’ మేగజైన్‌కు 78 ఏళ్ల చరిత్ర ఉంది. 2024లో డైమండ్ లీగ్‌లో ఒక్క విజయం కూడా సాధించని నీరజ్... దోహా, లుసానే, బ్రస్సెల్స్ ఈవెంట్లలో రెండో స్థానంలో నిలిచాడు. ఫిన్లాండ్లో జరిగిన పావో నుర్మీ గేమ్స్‌లో నీరజ్ టైటిల్ సాధించాడు. రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా)తో పోటీపడి నీరజ్ ఈ జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నాడు. పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన పీటర్స్... గత ఏడాది డైమండ్ లీగ్ మూడు ఈవెంట్లలో విజేతగా నిలిచాడు. 2023లోనూ నీరజ్ ఈ జాబితాలో ‘టాప్’ ప్లేస్‌లో నిలిచాడు. ‘అగ్రస్థానం కోసం నీరజ్ చోప్రా, పీటర్స్ మధ్య గట్టి పోటీ సాగింది.గత ఏడాది నీరజ్ డైమండ్ లీగ్ టైటిల్ నెగ్గకపోయినా 3–2తో పీటర్స్‌పై ఆధిక్యంలో నిలిచాడు. ఒలింపిక్ చాంపియన్, పాకిస్తాన్ త్రోయర్ అర్షద్ నదీమ్ ఐదో స్థానం దక్కించుకున్నాడు’ అని మేగజైన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
క్రికెట్ ‘మనసు’ చదివింది!
చిన్నప్పటి నుంచి చదువులో చురుకైన అమ్మాయి... మరోవైపు అంతే స్థాయిలో క్రికెట్ అంటే విపరీతమైన ఇష్టం... ఈ రెండింటిని సమన్వయం చేసుకోవడం అంత సులువు కాదు కాబట్టి ఏదో ఒకదానిని ఎంచుకోమని సన్నిహితులు చెప్పారు. కానీ ఇష్టంలో కష్టం ఉండదని ఆ అమ్మాయి నమ్మింది. అందుకే ఒకవైపు చదువులో ఉత్తమ విద్యారి్థనిగా ఉంటూనే తనకు నచ్చిన రీతిలో క్రికెట్లో కూడా సాధనను కొనసాగించింది. ఫలితంగా ప్లస్ టు స్థాయిలో మంచి మార్కులు సాధించడం మాత్రమే కాదు... ప్రొఫెషనల్ క్రికెటర్‌గా కూడా మారింది. ఇప్పుడు సైకాలజీ చదువుతూనే ఏకంగా భారత సీనియర్ జట్టులోకి ఎంపికైంది. ఓపెనర్‌గా భారత్ తరఫున ఆడిన 4 వన్డేల్లో 2 అర్ధసెంచరీలు సాధించిన ఢిల్లీ అమ్మాయి ప్రతీక రావల్ భవిష్యత్తులో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. –సాక్షి క్రీడా విభాగం భారత జట్టులో స్మృతి మంధానతో పాటు మరో ఓపెనర్‌గా షఫాలీ వర్మ ఐదేళ్ల పాటు రెగ్యులర్‌గా జట్టులో ఉంది. 16 ఏళ్లు పూర్తి కాక ముందే జట్టులోకి వచ్చిన షఫాలీ సంచలన బ్యాటింగ్, దూకుడైన శైలితో దూసుకుపోయింది. అయితే వరుస వైఫల్యాల తర్వాత సెలక్టర్లు షఫాలీపై వేటు వేసి కొత్త ఓపెనర్‌గా ప్రతీక రావల్‌ను ఎంపిక చేశారు. షఫాలీ స్థానంలో వచ్చిన ప్లేయర్ నుంచి సహజంగానే అలాంటి ధాటిని అంతా ఆశిస్తారు. ఇప్పుడు నిలకడైన ప్రదర్శనతో 24 ఏళ్ల ప్రతీక తాను అందుకు తగిన దానినే అని నిరూపించుకునే ప్రయత్నంలో ఉంది. ఆడిన 4 వన్డేల్లో ఆమె 82 స్ట్రయిక్‌రేట్‌తో వరుసగా 40, 76, 18, 89 పరుగులు సాధించి కెరీర్లో శుభారంభం చేసింది. దేశవాళీలో నిలకడైన ప్రదర్శన ఆమెకు ఈ అవకాశం కల్పించింది. మూడేళ్ల క్రితం వన్డే టోర్నీలో 155 బంతుల్లో 161 పరుగులు చేసి ఢిల్లీని నాకౌట్ చేర్చడంతో ప్రతీకకు తొలిసారి గుర్తింపు లభించింది. ఆ తర్వాత బీసీసీఐ అండర్–23 టోర్నీలో 7 ఇన్నింగ్స్‌లలో 411 పరుగులతో టోర్నీలో రెండో అత్యధిక స్కోరర్‌గా నిలవడంతో పాటు ఢిల్లీ సెమీఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించింది. తండ్రి అండదండలతో... ఢిల్లీలోని పశ్చిమ పటేల్ నగరంలో ఉండే ప్రదీప్ రావల్ కుటుంబం కేబుల్ టీవీ వ్యాపారంలో ఉంది. ప్రదీప్ అటు బిజినెస్‌లో భాగం కావడంతో పాటు ఢిల్లీ క్రికెట్ సంఘంలో బీసీసీఐ సర్టిఫైడ్ అంపైర్‌గా కూడా పని చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి తండ్రితో కలిసి చాలాసార్లు మైదానానికి వెళ్లిన ప్రతీకకు సహజంగానే క్రికెట్‌పై ఆసక్తి ఏర్పడింది.దాంతో 10 ఏళ్ల వయసు ఉన్న తన కూతురిని కోచ్ శ్రవణ్ కుమార్ వద్ద శిక్షణ కోసం ప్రదీప్ చేరి్పంచారు. భారత ఆటగాళ్లు ఇషాంత్ శర్మ, నితీశ్ రాణా తదితరులకు కోచ్‌గా వ్యవహరించిన శ్రవణ్‌కు మంచి గుర్తింపు ఉంది. శ్రవణ్ శిక్షణ ఇచి్చన తొలి అమ్మాయి ప్రతీకనే కావడం విశేషం. ఆ తర్వాత స్కూల్ స్థాయి నుంచి కాలేజీ వరకు వేర్వేరు చోట్ల చక్కటి ప్రదర్శనలతో ఆమె ఆకట్టుకుంది. క్రికెట్‌తో పాటు బాస్కెట్‌బాల్ కూడా బాగా ఆడుతూ వచ్చిన ప్రతీక 2019 జాతీయ క్రీడల్లో స్వర్ణం గెలిచిన ఢిల్లీ జట్టులో సభ్యురాలిగా కూడా ఉంది. సీబీఎస్ఈ ప్లస్ 2 పరీక్షల్లో 92.5 శాతం మార్కులతో ఆమె ఉత్తీర్ణురాలు కావడం విశేషం. నిలకడైన ప్రదర్శనతో... భిన్న రంగాల్లో సత్తా చాటుతున్నా... ప్రతీక అసలు లక్ష్యం మాత్రం క్రికెట్ వైపే సాగింది. దాంతో అండర్–17 స్థాయిలో మరింత మెరుగైన శిక్షణ అవసరమని భావించిన ఆమె రైల్వే కోచ్ ధ్యాని వద్ద చేరి తన ఆటకు మరింత మెరుగులు దిద్దుకుంది. 2022–23 దేశవాళీ వన్డే సీజన్లో 14 మ్యాచ్‌లలో కలిపి 552 పరుగులు చేయడం ద్వారా తన స్థాయిని పెంచుకుంది. మరోవైపు ఢిల్లీ మహిళల జట్టు కోచ్, మాజీ ఆటగాడు దిశాంత్ యాజ్ఞిక్ కూడా ఆమె ఆటను తీర్చిదిద్దడంలో సహకరించాడు. బీసీసీఐ అండర్–23 స్థాయి టి20 టోర్నీలో కూడా రాణించిన ప్రతీక ఢిల్లీ ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించింది. ఈ ప్రదర్శనలు చూస్తే జాతీయ జట్టుకు ఎంతో దూరంలో లేదని అందరికీ అర్థమైంది. మానసికంగా దృఢంగా... ‘నేను ఒకప్పుడు క్రికెటర్ కావాలని కలగన్నాను గానీ అది సాధ్యం కాలేదు. ఇప్పుడు నా కూతురి రూపంలో నా కోరిక తీరింది’ అని ప్రదీప్ రావల్ గర్వంగా చెప్పుకుంటున్నారు. బీసీసీఐ విధుల్లో భాగంగా తండ్రి వడోదరలో ఉన్న సమయంలోనే ఆమెకు తొలి వన్డే ఆడే అవకాశం రావడం యాదృచ్చికం. తన కళ్ల ముందు భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ప్రతీకను చూస్తూ ఆ తండ్రి పుత్రికోత్సాహంతో కన్నీళ్లపర్యంతమయ్యారు. సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతీక... తన చదువు క్రికెట్ కెరీర్‌కూ ఉపయోగపడుతోందని చెప్పుకుంది. ‘మనుషుల మనస్తత్వాలను చదవడం గురించి నాకు బాగా తెలుసు. దానిని అర్థం చేసుకోగలిగితే అటు మైదానంలో, మైదానం బయట కూడా పని సులువవుతుంది. మ్యాచ్‌కు ముందు ఇప్పుడు ఏం చేయాలో, తర్వాత ఏం చేయాలో అనే విషయంపై నాతో నేను సానుకూలంగా మాట్లాడుకుంటా. బ్యాటింగ్ చేసేటప్పుడు కూడా నేను అత్యుత్తమ ప్లేయర్‌గా, ఏదైనా చేయగలనని భావించుకుంటా. అది నాకు సైకాలజీనే నేర్పింది’ అని ఆమె వ్యాఖ్యానించింది. ప్రస్తుత జోరును కొనసాగించి ఈ ఏడాది స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ టీమ్‌లో భాగం కావాలని ప్రతీక ప్రస్తుత లక్ష్యంగా పెట్టుకుంది.
బిజినెస్
ఆర్బీఐ అంచనాలకు డేటా ఆధారిత విధానం
ద్రవ్యోల్బణం, వృద్ధిని అంచనా వేసే సాధనాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా సమగ్ర సమీక్షను ప్రారంభించారు. గత నెలలో బాధ్యతలు స్వీకరించిన మల్హోత్రా కొత్త డేటా పాయింట్లు, విశ్లేషణలు, అంచనా ప్రక్రియలను చేర్చడం ద్వారా ఆర్బీఐ నివేదికలను మరింత స్పష్టతతో ముందుంచాలని నిర్దేశించారు. సమీక్షలో భాగంగా మల్హోత్రా(Sanjay Malhotra) అనుసరిస్తున్న కొన్ని విధానాల గురించి తెలుసుకుందాం.డేటాసెట్లను చేర్చడం..ఆర్బీఐ నివేదికలను మరింత లోతుగా అంచనా వేయడానికి ఉపయోగించే డేటాసెట్లను విస్తరించడంపై మల్హోత్రా దృష్టి సారించారు. ఇందులో స్మాల్ టికెట్ డిజిటల్ చెల్లింపులు, ఫుడ్ డెలివరీ యాప్‌ల డేటా, ఆన్లైన్ ట్యాక్సీ అగ్రిగేటర్ల నుంచి డేటా సేకరించడం వంటి అంశాలున్నాయి. ఈ కొత్త డేటా పాయింట్లు ఆదాయం, వ్యయ ధోరణుల స్పష్టమైన వైఖరిని తెలియజేస్తాయని నమ్ముతున్నారు.మెషిన్ లెర్నింగ్ టూల్స్ద్రవ్యోల్బణ అంచనాలను మెరుగుపరచడానికి, ఆహారం వంటి అస్థిర వస్తువులలో ధరల హెచ్చుతగ్గులను ముందుగానే అంచనా వేయడానికి ఆర్బీఐ మెషిన్ లెర్నింగ్ సాధనాలను ఉపయోగిస్తుంది. ఈ విధానం ద్రవ్యోల్బణ(inflation) అంచనాలను మరింత ఖచ్చితత్వంతో తెలియజేస్తుంది.మరింత సమాచార సేకరణభారతదేశ అనధికారిక ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మరింత సమగ్ర డేటాను సేకరించడానికి ఆర్బీఐ ప్రయత్నిస్తోంది. అసంఘటిత రంగాల నుంచి సమకూరే ఆదాయంపై ఖచ్చితమైన డేటా పాయింట్లు లేవు. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. అందుకోసం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అధికారిక డేటా వనరుల నుంచి సంగ్రహించబడని ఆర్థిక కార్యకలాపాలను మెరుగ్గా అర్థం చేసుకునేందుకు మరిన్ని ప్రయత్నాలు జరగాలి.ఇదీ చదవండి: కొన్నేళ్లలోనే రూ.8.6 లక్షల కోట్లకు చేరే ఎగుమతులుసవాళ్లు.. అంచనాలుప్రస్తుత అంచనా లోపాలు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చాలా వరకు దేశ వృద్ధి, ద్రవ్యోల్బణ అంచనా(growth forecasting)లపై ఆర్బీఐ అంచనాలు విడుదల చేసింది. ఉదాహరణకు, ఆర్బీఐ దేశ ఆర్థిక వృద్ధి అంచనాను 2024-25 సంవత్సరానికి 7.2 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గించాల్సి వచ్చింది. రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను మాత్రం 4.5 శాతం నుంచి 4.8 శాతానికి పెంచింది. రెండు డేటా పాయింట్లు విభిన్నంగా ఉండడం కొంత చర్చకు దారి తీసింది.కొత్త మార్పుల ప్రభావం: కొత్తగా తీసుకురాబోయే మార్పులు, డేటాసెట్ల చేర్పులు ఆర్థిక వృద్ధికి సంబంధించి ఖచ్చితమైన అంచనాలకు హామీ ఇవ్వనప్పటికీ, గతంలో కంటే మెరుగైన ఫలితాలు తెలుసుకునేందుకు దోహదం చేస్తాయని నిపుణులు విశ్వసిస్తున్నారు. ఈ మార్పుల ప్రభావం ఫిబ్రవరి పాలసీ అంచనాల్లో కనిపిస్తుందని భావిస్తున్నారు.
ఈఎంఐ ఇక మారదు! ఆర్బీఐ కీలక ఆదేశాలు
నెలవారీ సమాన వాయిదాలపై (EMI) మంజూరు చేసే అన్ని వ్యక్తిగత రుణాల్లో బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు తప్పనిసరిగా స్థిర వడ్డీ రేటు ఉత్పత్తిని అందించాల్సిందేనని ఆర్బీఐ (RBI) ప్రకటించింది. వడ్డీ రేటు ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ విధానంతో లేక ఇంటర్నల్ బెంచ్‌మార్క్ విధానంతో అనుసంధానమైనదా? అన్న దానితో సంబంధం లేకుండా అన్ని ఈఎంఐ ఆధారిత వ్యక్తిగత రుణాలకు ఇది అమలవుతుందని స్పష్టం చేసింది.రుణాన్ని మంజూరు చేసే సమయంలోనే వర్తించే వార్షిక వడ్డీ రేటు (ఏపీఆర్)ను కీలక సమాచార నివేదిక (కేఎఫ్ఎస్), రుణ ఒప్పంద పత్రాల్లో బ్యాంక్‌లు, ఇతర నియంత్రిత సంస్థలు (ఎన్బీఎఫ్సీలు)వెల్లడించాల్సి ఉంటుందని పేర్కొంది. రుణ కాల వ్యవధిలో ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ రేటు కారణంగా ఈఎంఐ/లేదా కాల వ్యవధిని పెంచేట్టు అయితే ఆ విషయాన్ని తప్పకుండా రుణగ్రహీతకు తెలియజేయాలని తెలిపింది.ప్రతి త్రైమాసికానికి ఒకసారి లోన్ అకౌంట్ స్టేట్మెంట్ను జారీ చేయాలని, అందులో అప్పటి వరకు చెల్లించిన వడ్డీ, అసలు ఎంత?, ఇంకా ఎన్ని ఈఎంఐలు మిగిలి ఉన్నాయనే సమాచారం ఉండాలని పేర్కొంది. ఈఎంఐ ద్వారా రుణాన్ని చెల్లించే వారికి స్థిర వడ్డీ రేటును లేదా కాల వ్యవధిని పెంచుకునే అవకాశం కల్పించానలి 2023 ఆగస్ట్‌లోనే బ్యాంక్‌లను ఆర్బీఐ ఆదేశించడం గమనార్హం. దీనికి సంబంధించి సందేహాలపై తాజా స్పష్టతనిచ్చింది. ఫిబ్రవరిలో ఆర్బీఐ ఎంపీసీ సమావేశంరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) పరపతి విధాన కమిటీ సమావేశం ఫిబ్రవరి 5-7 తేదీల్లో జరగనుంది. ఈ సమావేశంలో ఈసారి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కీలక వడ్డీరేట్లలో కోత విధిస్తారని పరిశ్రమల సంఘం సీఐఐ అంచనా వేసింది. ఇప్పటికే అమెరికాకు చెందిన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్(US Fed) యూఎస్‌లో వడ్డీరేట్లను తగ్గించింది. ఈ తరుణంలో భారత్‌లోనూ వడ్డీరేట్లను తగ్గించాలనే డిమాండ్ ఉంది.ఇదీ చదవండి: ఈ క్రెడిట్ కార్డులు కనిపించవు! కానీ ఖర్చు చేయొచ్చు..ఆర్బీఐ వచ్చే ఎంపీసీ సమావేశంలో 50 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత మానిటరీ ఎంపీసీ సమావేశంలో ఆర్బీఐ నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ను 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనుందని చెబుతున్నారు. ఆర్బీఐ దేశంలో పెట్టుబడులు పెంచేలా నిర్ణయం తీసుకోవాలి. అందులో భాగంగా వడ్డీరేట్లను తగ్గించాల్సి ఉంది.
కొన్నేళ్లలోనే రూ.8.6 లక్షల కోట్లకు చేరే ఎగుమతులు
వచ్చే నాలుగైదేళ్లలో ఆహారం, పానీయాలు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను 100 బిలియన్ డాలర్ల(రూ.8.6 లక్షల కోట్లు)కు పెంచాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. గ్రేటర్ నోయిడాలో జరిగిన ఇండస్‌ఫుడ్ 2025 ఎగ్జిబిషన్ సందర్భంగా ఆయన మాట్లాడారు.‘భారతీయ ఆహారం, పానీయాలు, సముద్ర ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లలో భారీ డిమాండ్ ఉంది. ఉత్పత్తిలో నాణ్యత, పౌష్టికాహారం, సుస్థిరతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఉత్పత్తుల నాణ్యతను పెంచడానికి, దేశవ్యాప్తంగా టెస్టింగ్ ప్రయోగశాలలను విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వచ్చే నాలుగైదేళ్లలో ఈ విభాగాల నుంచి ఎగుమతులను 100 బిలియన్ డాలర్ల(రూ.8.6 లక్షల కోట్లు)కు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించాం. ఆహారం, పానీయాల రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐలను ప్రభుత్వం అనుమతించింది. ఈ పరిశ్రమలో విదేశీ పెట్టుబడులు, యాజమాన్యాన్ని ప్రోత్సహిస్తోంది’ అన్నారు.ఇదీ చదవండి: రూపాయి ఢమాల్.. నేల చూపులకు కారణాలుఅంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఇన్నోవేషన్, మెరుగైన ప్యాకేజింగ్, యాంత్రీకరణలో పెట్టుబడులు పెట్టేందుకు భారతీయ కంపెనీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వం ఏర్పరుచుకున్న లక్ష్యాన్ని సాధించడం భారత ఆర్థిక వ్యవస్థను గణనీయంగా పెంచుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎగుమతులు పెరగడం వల్ల ఫుడ్ అండ్ బేవరేజెస్ రంగంలో ఉద్యోగాల కల్పనకు దారితీస్తుందని చెబుతున్నారు.
2025లో ఐపీవోల వెల్లువ
ప్రైమరీ మార్కెట్ల జోరు ఈ కేలండర్ ఏడాది(2025)లోనూ సరికొత్త రికార్డులను నెలకొల్పనున్నట్లు కొటక్ మహీంద్రా క్యాపిటల్ (Kotak Mahindra Capital) కంపెనీ అభిప్రాయపడింది. పలు దిగ్గజాలు స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యేందుకు సన్నాహాలు చేపట్టడంతో 2025లో 35 బిలియన్ డాలర్ల సమీకరణకు వీలున్నట్లు అంచనా వేసింది.2024లో 91 కంపెనీలు ఐపీవోల (IPO) ద్వారా రూ. 1.67 లక్షల కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. ఇది ప్రైమరీ మార్కెట్ల చరిత్రలోనే అత్యధికంకాగా.. ఈ ఏడాది మరిన్ని కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు రానున్నాయి. జాబితాలో ఫైనాన్షియల్ సర్వీసుల రంగం టాప్ ర్యాంకులో నిలవనున్నట్లు కొటక్ మహీంద్రా క్యాపిటల్ పేర్కొంది.హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, అవాన్సే ఫైనాన్షియల్ సర్వీసెస్, టాటా క్యాపిటల్ తదితర దిగ్గజాలు ఉమ్మడిగా 9 బిలియన్ డాలర్లు సమీకరించే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించింది. ఈ బాటలో డిజిటల్ టెక్ కంపెనీలు ఈకామ్ ఎక్స్‌ప్రెస్, ఓలా, జెప్టో, పెప్పర్ఫ్రై తదితరాలు 5 బిలియన్ డాలర్లపై కన్నేసినట్లు తెలియజేసింది. ఇష్యూ పరిమాణం అప్ పలు కంపెనీలు ఐపీవోల ద్వారా పెట్టుబడుల సమీకరణపై దృష్టి పెట్టడంతో ఇష్యూ పరిమాణంసైతం పెరిగే వీలున్నట్లు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ కొటక్ మహీంద్రా క్యాపిటల్ వివరించింది. ప్రైమరీ, సెకండరీ మార్కెట్ల జోరు కారణంగా 2024లో లిస్టింగ్ రోజు సగటు ప్రీమియం 33 శాతానికి ఎగసినట్లు వెల్లడించింది.గతేడాది విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు సెకండరీ మార్కెట్లకంటే పబ్లిక్ ఇష్యూలపట్లే అత్యంత మక్కువ చూపినట్లు పేర్కొంది. ఆటో రంగ దిగ్గజం హ్యుందాయ్ చేపట్టిన రూ. 27,000 కోట్ల పబ్లిక్ ఇష్యూ నేపథ్యంలో పలు ఎంఎన్‌సీలు సైతం దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్‌వైపు ఆకర్షితమవుతున్నట్లు వివరించింది.
ఫ్యామిలీ
ఆ మెడిసిన్‌తో దుష్ప్రభావాలే ఎక్కువ..!: టెక్ మిలియనీర్
వృద్ధాప్యాన్ని(Anti-ageing) తిప్పికొట్టే ప్రాజెక్ట్ బ్లూప్రింట్ పేరుతో అమెరికన్ టెక్ వ్యవస్థాపకుడు బ్రయాన్ జాన్సన్(Bryan Johnson) కోట్లకొద్దీ డబ్బుని ఖర్చు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. యవ్వనంగా ఉండేలా జీవసంబంధమైన వయసును తిప్పికొట్టేందుకు నిత్యం వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ..అత్యంత కఠినమైన డైట్‌ని అవలంభించేవాడు. ఇది ఒక రకంగా మనిషి దీర్ఘాయవుని పెంచడం ఎలా అనేదాన్ని సుగమం చేస్తుందని తరుచుగా చెప్పేవాడు బ్రయాన్. కానీ ఈ క్రమంలో కొన్ని చికిత్సలు వికటించి ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు బ్రయాన్ స్వయంగా సోషల్‌మీడియాలో పేర్కొన్నారు కూడా. ఇప్పుడు తాజాగా మరో షాకింగ్ విషయాలన్ని వెల్లడించారు. తాను జీవ సంబంధ వయసును తిప్పికొట్టేలా తీసుకునే దీర్ఘాయువు(Longevity) మెడిసిన్ రాపామైసిన్(rapamycin)తో ప్రయోజనాలకంటే దుష్ప్రభావాలే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. అందువల్ల తాను దీన్ని తీసుకోవడం ఆపేసినట్లు తెలిపారు. నిజానికి ఆయన గత ఐదు ఏళ్లుగా యవ్వనంగా ఉండేలా దీర్ఘాయువు కోసం ఈ రాపామైసిన్ను 13 మిల్లీ గ్రాముల చొప్పున తీసుకుంటున్నారు. ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. వైద్యులు ఈ మెడిసిన్‌ని అవయవాల మార్పిడి చేయించుకున్న రోగులకు ఇస్తారు. ఎందుకంటే శరీరం కొత్తగా మార్పిడి చేసిన అవయవాన్ని తిరస్కరించకుండా.. వ్యాధి నిరోధక శక్తిని తగ్గించేలా ఈ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ మెడిసిన్ వల్ల దీర్ఘకాలం ఉండేలా చేసే ప్రయోజనాలకంటే దుష్ప్రభావాలే అధికంగా ఉన్నాయని పరిశోధన(research)లో తేలడంతో ఈ రాపామైసిన్ మెడిసిన్‌ను ఉపయోగించడం ఆపేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తన ప్రీ క్లినికల్ ట్రయల్స్‌లో ఈ మెడిసిన్ జీవితాంతం తీసుకుంటే..భారీ దుష్ప్రభావాలు తప్పవని వెల్లడవ్వడంతో తన వైద్య బృందం తక్షణమే ఆపేయాలనే నిర్థారణకు వచ్చిందని చెప్పుకొచ్చారు. అంతేగాదు ఈ రాపామైసిన్ మెడిసిన్ వల్ల లిపిడ్ జీవక్రియను దెబ్బతీసి ఇన్సులిన్‌పై ప్రభావం చూపుతుందని బ్రయాన్ వైద్య బృందం చెబుతోంది. తద్వారా గ్లూకోజ్‌ని బాడీ యాక్సెప్ట్ చేయకపోవడం లేదా పడకపోవడం జరుగుతుందన్నారు. తన వైద్య బృందం చేస్తున్న ఈ ప్రయోగాలన్నీ దీర్ఘాయువు పరిశోధనను అభివృద్ధి చేయడమేనని చెప్పారు. కాగా, ఈ వృద్ధాప్యాన్ని తిప్పి కొట్టే ప్రయోగంలో భాగంగా ఇటీవలే కొన్ని నెలల క్రితం ప్లాస్మా మార్పిడి చేయించుకున్నారు. దీనికంటే ముందుకు కొడుకు రక్తాన్ని ఎక్కించుకున్నారు. ఇలా యవ్వనంగా ఉండేందుకు రకరకాల ప్రయోగాలకు, చికిత్సలకు ఇప్పటి వరకు దాదాపు రూ.17 కోట్లు పైనే ఖర్చు పెట్టారు బ్రయాన్.(చదవండి: నో డౌట్ ఇలా చేస్తే..చచ్చినట్లు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారు..!)
బెంచింగ్ డేటింగ్ గురించి తెలుసా, ఇలా అయితే డేంజరే!
డేటింగ్ అనేది సక్రమ మార్గంలో వాడుకుంటే మంచిదే. ఒకర్నొకరు అర్థం చేసుకోవడానికి, ఒకరి అభిరుచులు మరొకరికి తెలియడానికి, ఇద్దరి మధ్యా మంచి సాంగత్యానికి ఉపయోపడుతుంది. కానీ ప్రస్తుత సాంకేతిక యుగం, సోషల్ మీడియా విశృంఖలత్వంతోపాటు, డేటింగ్ యాప్‌లు ఈ అర్థాన్ని మార్చి పారేశాయి.హానికరమైన, విషపూరితమైన సంబంధాలకు నాంది పలుకుతూ కొత్త డేటింగ్ ట్రెండ్లు ఉద్భవించాయి. అలాంటి వాటిల్లో ఒకటి బెంచింగ్ డేటింగ్. అసలేంటి బెంచింగ్ డేటింగ్? దీనివలన లాభమా? నష్టమా? తెలుసుకుందాం ఈ కథనంలో.ఆధునిక డేటింగ్ పదం బెంచింగ్ డేటింగ్. అంటే పేరుకు తగ్గట్టే భాగస్వాముల్లో ఒకర్ని హోల్డ్‌లో ఉంచి, మరొకరిపై ఆసక్తిగా ఉండటం. ప్రేమ భాగస్వామిని 'బెంచ్ మీద' ఉంచడం అంటే మరో బెస్ట్ ఆప్షన్ కోసం అన్వేషించడమే. అచ్చం ఒక ఆటగాడిని బెంచి మీద ఉంచడం లాంటిదన్నమాట. అంటే మెయిన్ టీంలో లేకుండా, ఆటలో పాల్గొనకుండా,సందర్భం కోసం వాడుకునేందుకు బెంచ్ మీద ఉండే ప్లేయర్ లాంటి వారు. ఈ డేటింగ్లో బెంచింగ్ చేస్తున్న వారు, తోటి భాగస్వామితో స్నేహం చేస్తారు కానీ మనస్సు పూర్తిగా పూర్తిగా సంబంధానికి కట్టుబడి ఉండరు. అలాగే ఈ డేటింగ్లో బెంచ్‌మార్కింగ్" అంటే ఎవరైనా తమ ప్రస్తుత భాగస్వామితో, గతంలోని వారితో పోల్చపుడు, నెగెటివ్‌గా కమెంట్ చేయడం లాంటివి కూడా ఉంటాయి. అంతిమంగా ఇది రెండో వ్యక్తిలో (బెంచ్‌మీద ఉన్న) గందరగోళానికి మానసిక వేదనకు గురి చేస్తుంది. నిజాయితీ, నిబద్ధత లోపించడంతో అవతలి వారిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. ఒకరిమీద ఒకరికి విశ్వాసం, నమ్మకం లేనపుడు ఇక ప్రేమకు తావు ఎక్కడ ఉంటుంది. మోసపోయామన్న నిరాశ, నిస్పృహతోపాటు కొన్ని అనారోగ్యకరమైన, పెడధోరణులకు దారి తీయవచ్చు.బెంచ్‌మార్కింగ్ సంకేతాలుప్రస్తుత భాగస్వామిని మాజీలు లేదా గత సంబంధాలతో క్రమం తప్పకుండా పోల్చడం.అవాస్తవిక అంచనాలతో ఉండటం, వాళ్లు చెప్పినట్టే వినాలని అన్యాయంగా పట్టుబట్టటంఎపుడూ అసంతృప్తిగా ఉండటం, మరొకరితో పోల్చి, ఉద్దేశపూర్వకంగా అవమానించడం.నమ్మకం లేకపోవడం, ఎపుడూ విమర్శిస్తూ ఉండటం తమ రిలేషన్‌ను మరింత ఆరోగ్యకరంగా ముందుకు తీసుకెళ్లేందుకు సుతరామూ అంగీకరించకపోవడంఇదీ చదవండి : భరించలేని మోకాళ్ల నొప్పులకు.. సూపర్ ఫుడ్ ఈ లడ్డూ...అంతేనా! జాగ్రత్తలుపైన పేర్కొన్న అనుమానాస్పద లక్షణాలు కనిపించినపుడు అప్రమత్తం కావడం మంచిది. వీటిని గమనించి నపుడు అపార్థాలకు, అపోహలకు తావులేకుండా భాగస్వామితో మనసు విప్పి మాట్లాడుకొని, బంధం ముందుకు సాగే ప్రయత్నం చేయాలి. లేదా గతాన్ని వదిలేసి, బలమైన, ఆరోగ్యకరమైన సంబంధాలపై దృష్టి పెట్టడం ఉత్తమం. సిమ్మర్ డేటింగ్ఒకపుడు ద్దలు కుదుర్చుకునే పెళ్లిళ్లకే ప్రాధాన్యత ఉండేది. కాల క్రమంలో ప్రేమ వివాహాలపై యువతకు ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సిమ్మర్ డేటింగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ప్రధానంగా జనరేషన్ జెడ్ దీనిని ఎక్కువగా ఫాలో అవుతున్నారు. అసలు ఈ సిమ్మర్ డేటింగ్ అంటే ఏమిటి? సుదీర్ఘ సంబంధాలపై దృష్టి పెట్టడమే దీని ప్రత్యేకత. చాలా కాలంపాటు బంధంలో కొనసాగడం వల్ల ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుందట. ఒకరిపై ఒకరికి అవగాహన, నమ్మకం పెరిగిన తరువాత లైంగిక బంధంలోకి అడుగుపెట్టడం మంచిదని, తద్వారా బంధం బలపడుతుందని నేటియువత భావిస్తోంది.
నో డౌట్ ఇలా చేస్తే..చచ్చినట్లు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారు..!
ఇటీవల కాలంలో ఎంతలా ట్రాఫిక్ నిబంధలు పెట్టినా..ఘెరమైన యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రమాదాల్లో అభం శుభం తెలియని చిన్నారులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. వీటి కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అంతేగాదు ఎందరో తల్లులకు కడుపుకోత, తీరని వ్యథ మిగులుతుంది. ప్రధానంగా మొబైల్ ఫోన్లు, నిర్లక్ష్య ధోరణి, తొందరపాటులే ఈ రోడ్డు ప్రమాదానికి కారణాలు. అక్కడికి దీనిపై ట్రాఫిక్ పోలీసుల అవగాహన కార్యక్రమాలు చేపట్టినా.. పెద్దగా ప్రయోజనం లేదు. ఏం చేస్తే ఈ సమస్యని నివారించగలమని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ రేంజ్‌లోనే హైవేలపై స్పీడ్ ఉండాలని నియంత్రించినా..ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. అయితే ఇదే సమస్యను ఫేస్ చేస్తున్న వియత్నాం దేశం అమలు చేస్తున్న ట్రాఫిక్ చట్టాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇలా అయినా ప్రమాదాలు తగ్గుతాయేమో అనే ఆశను రేకెత్తించింది. ఇంతకీ ఆ దేశం ఎలాంటి ట్రాఫిక్ చట్టాలను తీసుకొచ్చింది..? మన దేశంలో సాధ్యమేనా..?వియత్నాం(Vietnam) రోడ్డు ప్రమాదాలను నివారించేలా ట్రాఫిక్ ఉల్లంఘనలు నియంత్రించేందుకు ప్రోత్సాహకాలను అందజేస్తామని ప్రకటించింది. ఎవ్వరైన ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారి గురించి సమాచారం అందిచినట్లయితే వారికి ప్రభుత్వం దాదాపు రూ. 17 వేలు వరకు ప్రోత్సహకాన్ని అందుకోవచ్చు. ప్రజా భద్రతను పెంచేలా ట్రాఫిక్ క్రమశిక్షణ(Traffic Rules) అమలయ్యేందుకు ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది వియత్నాం. నిజానికి గతేడాది ప్రారంభ నుంచే వియత్నాం ట్రాపిక్ ఉల్లంఘనలకు పాల్పడేవారికి భరించలేని స్థాయిలో జరిమానాలు పెంచేసింది. రెడ్ సిగ్నల్ ఉండగానే పట్టించుకోకుండా వెళ్లిపోవడం, మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేయడం తదితరాలకు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. అయితే ఇలాంటి వ్యక్తుల గురించి ఏ పౌరుడైనా సమాచారం(reporting) అందిస్తే..వారి గోప్యతను భద్రంగా ఉంచడమే గాక వాళ్లకి పడిన జరిమానా నుంచి మినహాయింపు లేదా తగిన విధంగా ప్రోత్సాహకం ఇవ్వడం వంటివి చేస్తోంది. అంతేగాదు వారు నడిపే వాహనం అనుసరించి జరిమానాలను భారీగా పెంచింది. అలాగే పారితోషకం కూడా ఆ విధమైన డిఫరెన్స్తోనే భారీగా ముట్టచెబుతోంది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది.దీంతో నెటిజన్లు ఆ దేశానికి దాదాపు ఐదు వేల కిలోమీటర్లు ఉన్న మనదేశంలో కూడా వాటిని అమలు చేస్తే చాలామంది మిలియనీర్లుగా మారతారని కామెంట్లు చేస్తున్నారు. అలాగే ప్రముఖ ఆర్థికవేత్త, నీతి ఆయోగ్ సభ్యుడు(NITI Aayog member) అరవింద్ విర్మాణితో సహా చాలామంది మాత్రం తప్పనిసరిగా భారత్‌లో కూడా ఇలాంటి రూల్స్‌ని అమలు చేయాలని వాదిస్తూ పోస్టులు పెట్టారు. ఇలా చేస్తే సంపాదన సామర్థ్యం కష్టమైపోతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కూడా. ఒకకంగా ఇది ఇరు దేశాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలు ఎంతలా ఉన్నాయనేది హైలెట్ చేసిందని చెప్పొచ్చు. అయితే ఇది ఒకరకంగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ ఉల్లంఘనలు వంటి సమస్యలకు చక్కటి పరిష్కారన్ని అందించిందని చెప్పొచ్చు.We should definitely introduce this for major traffic offenses like going the wrong way on a divided highway/street, and jumping red lights https://t.co/tTkpwoIXck— Dr Arvind Virmani (Phd) (@dravirmani) January 5, 2025 (చదవండి: గోల్డెన్ గ్లోబ్స్ 2025 అవార్డుల వేడుకలో మెనూ ఇలా ఉంటుందా..! 24 క్యారెట్ల బంగారం..)
భరించలేని మోకాళ్ల నొప్పులకు.. సూపర్ ఫుడ్ ఈ లడ్డూ...అంతేనా!
శీతాకాలం ప్రారంభం కాగానే కొన్ని రకాల శ్వాసకోస వ్యాధులు, కీళ్లు, మోకాళ్ల నొప్పులు మొదలవుతాయి. అందుకే ఈ సీజన్లో రుచితో పాటు,ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఆహారంపై దృష్టి పెట్టాలి. అలాంటి ఒక గొప్ప సూపర్ ఫుడ్ అవిశె, నువ్వుల లడ్డు. పోషకాలతోపాటు అనేక రకాలుగా మనకు లాభాలను చేకూర్చే అవిశె గింజలు, నువ్వుల లడ్డూ(Flax Seeds And Sesame Seeds Laddu) ఎలా తయారు చేయాలో చూద్దాం.ఈ లడ్డూలు తినడానికి ఎంత రుచికరంగా ఉంటాయో, ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తాయి. అంతేకాకుండా, వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. నువ్వులలో విటమిన్ బి, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, రాగి, మాంగనీస్, భాస్వరం, జింక్, మాలిబ్డినం, సెలీనియం మొదలైనవి పుష్కలంగా ఉన్నాయి. ఇక అవిశె గింజలు ఆరోగ్యకరమైన కొవ్వులకు అద్భుతమైన మూలం. పోషకాలకు శక్తివంతమైనది కూడా. వీటి ద్వారా విటమిన్ బి, సి, డైటరీ ఫైబర్, సోడియం, ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ , ఫోలేట్ వంటి విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా అందుతాయి. బెల్లంతో మంచి ఐరన్ లభిస్తుంది. అంతటి శ్రేష్టమైన వీటికి దేశీ నెయ్యి , సేంద్రీయ బెల్లంతో కలిసి లడ్డూలను తయారు చేసుకుంటే అది సూపర్ ఫుడ్ కాక ఏమవుతుంది.అవిశె గింజలు - నువ్వుల లడ్డు తయారీకావాల్సిన పదార్థాలునువ్వులు, అవిశెగింజలు, బెల్లం, కొద్దిగా బాదం, జీడింపప్పులు, బెల్లం, కొద్దిగా నెయ్యి, చిటికెడు యాలకుల పొడిముందుగా రెండు కప్పుల అవిశె గింజలు( Flax Seeds) దోరగా వేయించిన, అలాగే ఒక కప్పు నువ్వులను కూడా దోరంగా వేయించుకోవాలి. దీంతోపాటు బాదం, జీడి పప్పులను కూడా నూనె లేదా నెయ్యి లేకుండానే వేయించుకోవాలి. ఇవి గోరు వెచ్చగా ఉండగానే మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ,రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి (Ghee) ఒకటిన్నర కప్పు ఆర్గానిక్ బెల్లం తురుము వేసి పాకం పట్టుకోవాలి. పాకం వచ్చినాక, ముందుగా పొడి చేసిపెట్టుకున్న అవిశె, నువ్వుల పొడిని వేసుకుంటూ బాగా కలపాలి. కావాలంటే ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు. ఇందులో చిటికెడ్ యాలకుల పొడి, బాదం, జీడిపప్పుల పొడి వేసుకోవాలి. కొద్దిసేపాక దింపేసుకుని కొంచెం వేడిగా ఉండగానే చేతులకు నెయ్యి రాసుకొని ఉండలుగా చుట్టుకోవాలి. ఈ లడ్డూ వలన ఎముకలు బలోపేతమవుతాయి. ఇదీ చదవండి: వింటర్ కేర్ : పాదాల పగుళ్లకు స్ప్రేఅవిశె గింజలు - నువ్వుల లడ్డు లాభాలుశీతాకాలంలో చలి నుండి రక్షిస్తుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది.బరువు నిర్వహణలో సహాయపడుతుంది. బరువు తగ్గాలన్నా, పెరగాలన్నా రెండు విషయాల్లోనూ ప్రయోజనకరంగా ఉంటుంది.క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.అధిక రక్తపోటును తగ్గించడంలో, శరీరంలో సాధారణ బీపీ నిర్వహణలో సహాయపడుతుంది.కడుపుకు చాలా ప్రయోజనకరం. డైటరీ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . జీవక్రియను కూడా పెంచుతుంది.ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ,మంచి కొలెస్ట్రాల్ ( HDL)ను పెంచడంలో సహాయపడుతుంది.రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది కాబట్టి ఇది డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది.హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది.ఎముకలు ,కండరాలను బలపరుస్తుంది.మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది .నిద్ర సంబంధిత సమస్యలను కూడా తొలగిస్తుంది.అలసటను తొలగించి శరీరాన్ని శక్తివంతం చేస్తుంది.అనేక చర్మ, జుట్టు సమస్యలను తొలగించి ఆరోగ్యంగా ఉంచుతుంది.గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.థైరాయిడ్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.ఇంకా మోకాళ్లు , కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామందిని మోకాళ్ళ నొప్పులు(Knee Pain) వేధిస్తున్నాయి. అలాంటి వారికి ఇది చాలా మేలు చేస్తుంది.(37 కిలోలు తగ్గి, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్గా మారిన గృహిణి)నోట్: వయసుతోపాటు వచ్చే మోకాళ్ల నొప్పులకు జీవన శైలిమార్పులు, కండరాలను బలోపేతం చేసే కొన్ని రకాల వ్యాయామాలు తప్పనిసరి. దీంతోపాటు వైద్యుల సలహా ప్రకారం అవసరమైతే కొన్ని మందులను వాడాల్సి ఉంటుంది.
ఫొటోలు
National View all
రూ.2026 కోట్ల నష్టం.. ఢిల్లీ మద్యం పాలసీపై కాగ్ తాజా రిపోర్టు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ప్రియురాలి మృతదేహాన్ని 9 నెలలుగా ఫ్రిడ్జ్‌లో దాచి..
దేశంలోని పలు ప్రాంతాల్లో హృదయవిదారక దారుణాలు చోటుచేసుకుంటున్నాయి.
అయోధ్యలో ఘనంగా ప్రాణప్రతిష్ఠ వార్షికోత్సవాలు
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యంలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన మొదటి వార్షికోత్స
Delhi Election: 29 సవాల్
దేశరాజధాని ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి.
Lal Bhadur Shastri: నాటి ప్రధాని అభ్యర్థనతో దేశమంతా ఉపవాసం
దేశానికి సేవలు అందించిన మహనీయులను స్మరించుకోవడం దేశవాసులుగా మన కర్తవ్యం.
International View all
ట్రంప్‌ను ఓడించేవాడిని: బైడెన్ పశ్చాత్తాపం
వాషింగ్టన్: ఇలీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై అధ్యక్షుడు జో
ఆయన అరెస్టుకు ఆధారాలిస్తే రూ.215 కోట్ల రివార్డు!
వెనిజులా అధ్యక్షునిగా నికోలస్ మదురో మూడవసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఇంటర్‌పోల్ మొట్టమొదటి సిల్వర్ నోటీస్
న్యూఢిల్లీ: సభ్య దేశాలకు రంగుల కోడ్ కలిగిన నోటీసులు జారీ చే
అక్కడ అనారోగ్యం నిషిద్ధం
నిషిద్ధ ప్రకటనలంటే ఎలా ఉంటాయి? చెత్త వేయొద్దనో, ఫలానా ప్రాంతంలోకి ప్రవేశించొద్దనో ఉంటాయి. కదా!
10 వేల ఇళ్లు బుగ్గి
లాస్ ఏంజెలెస్: కార్చిచ్చుల ధాటికి అమెరికాలోని లాస్ ఏంజెలె
NRI View all
17 ప్రేమ జంటలకు టోకరా ఇచ్చిన ఎన్ఆర్ఐ మహిళ : 20 ఏళ్ల నుంచి దందా
ఎదుటి వారి అమాయకత్వాన్ని, అవకాశాన్ని స్మార్ట్‌గా సొమ్ము చేసుకునే కంత్రీగాళ్
యాపిల్‌లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్‌బీఐ కన్ను?!
అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై టెక్ దిగ్గజం యాపిల్ 185 మంది ఉద్యోగులను త
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి కార్యక్రమం ఘనంగా
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి (నూతన సంవత్సరంలో జరిగే తొలి కార్యక్రమము) ని జనవరి 5న ఘనంగా నిర్వహి
జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు న్యాయం!
భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula)
న్యూయార్క్‌లో డబ్బావాలా బిజినెస్..!అచ్చం భారత్‌లో..
ముంబైలో కనిపిస్తాయి డబ్బావాలా ఫుడ్ బిజినెస్‌లు.
క్రైమ్
పండుగ ముందు పెను విషాదం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే వేర్వేరు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 17 మంది మరణించారు. పొట్ట చేతపట్టుకొని బతుకుదెరువు కోసం బయలుదేరిన కూలీలు గమ్యం చేరకముందే అనంతలోకాలకు చేరుకున్నారు. పుట్టినరోజు వేడుకలు జరుపుకొని సోదరుడితో తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఆ ఇద్దరు యువకులు మరణించగా.. స్కూటీపై వెళ్తున్న భార్యాభర్తలను లారీ ఢీకొనటంతో భార్య కళ్లెదుటే భర్త దుర్మరణం చెందాడు. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు చనిపోయారు. దీంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొన్నది.ఐదుగురు వలస కూలీలు దుర్మరణంరోడ్డుపై ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా ఐదుగురు మృతిచెందారు. 15 మంది గాయపడ్డారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఒడిశాకు చెందిన 32 మంది వలస కూలీలు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గుప్త ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్‌కు గురువారం సాయంత్రం 4 గంటలకు బయలు దేరారు.ఐలాపురం గ్రామ శివారులో ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వూరు నుంచి సంగారెడ్డికి వెళ్తున్న ఇసుక లారీ టైరు పంక్చర్ కావడంతో పక్కకు నిలిపారు. ఆ లారీని ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ గరడ సునీల్ (40), ఒడిశాకు చెందిన కూలీలు రూపు హరిజన్ (51), సుల హరిజన్ (46), సునమని హరిజన్ (61) అక్కడికక్కడే మృతిచెందగా, ప్రత్యూష్ ప్రభాత్ హరిజన్ (17) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. గాయపడ్డవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ పరిశీలించారు. బస్సు ఢీకొట్టిన వేగానికి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైపోయాయి. జన్మదినం రోజే మృత్యు ఒడిలోకి..పెద్దపల్లి మండలం రంగాపూర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన అనవేన అభిలాష్ (19), కాల్వ శ్రీరాంపూర్ మండలం మంగపేటకు చెందిన చుంచు రాజ్‌కుమార్ (20) మరణించారు. వీరిద్దరూ అక్కాచెల్లెళ్ల కొడుకులు. చుంచు రాజ్‌కుమార్ జన్మదినం కావడంతో అప్పన్నపేటలోని అభిలాష్‌తో కలిసి బైక్‌పై గుండారంలోని స్నేహితుల వద్దకు వెళ్లారు. అక్కడ వేడుక చేసుకొని తిరిగి వస్తుండగా రంగాపూర్ శివారులో ట్రాన్స్‌కోకు చెందిన బొలేరో వాహనాన్ని బైక్‌తో బలంగా ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో అభిలాష్ అక్కడికక్కడే మరణించగా, రాజ్‌కుమార్‌ను కరీంనగర్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. జగిత్యాల – ధర్మపురి జాతీయ రహదారిపై తక్కళ్లపల్లి శివారులో రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన బూతగడ్డ అరవింద్ (21), బత్తుల సాయి (22), మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన దయ్యాల వంశీ (22) దుర్మరణం చెందారు. వంశీ 15 రోజుల క్రితమే దుబాయ్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. మనుమడి బారసాలకు వెళ్లి వస్తూ.. మనుమడి బారసాల వేడుకలు జరుపుకొని తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు మరణించగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. జనగామ – సూర్యాపేట రహదారిపై కొడకండ్ల మండలం మైదంచెరువు తండ వద్ద గురువారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. నాగారం మండలం ఈటూరుకు చెందిన పేరాల వెంకన్నలక్ష్మి దంపతుల కుమారుడైన యుగంధర్‌కు కుమారుడు జన్మించగా గురువారం దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో బారసాల వేడుక జరిగింది.ఈ వేడుకకు వెంకన్న కుటుంబసభ్యులు, బంధువులంతా తుఫాన్ వాహనంలో వెళ్లారు. వేడుకల అనంతరం అదే వాహనంలో రాత్రి ఈటూరుకు తిరిగి వస్తుండగా మైదంచెరువు తండా శివారులో జాతీయ రహదారిపై నిలిపి ఉన్న డీసీఎం వాహనాన్ని తుపాన్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో పేరాల వెంకన్న (45) అతని తమ్ముడి భార్య పేరాల జ్యోతి (35) అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడ్డ పేరాల ఊషయ్య, పేరాల లక్ష్మి, వంగూరి నర్సమ్మ, పేరాల లావణ్య, ఉప్పలమ్మ, ముత్యాలును జనగామ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పేరాల లక్ష్మి, పేరాల ఊషయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. స్నేహితులను కబలించిన లారీ మెదక్ జిల్లా నర్సాపూర్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మరణించారు. శివ్వంపేట మండలం అల్లీపూర్‌కు చెందిన పిట్ల నాగరాజు (25), కమ్మరి దుర్గాప్రసాద్(25) స్నేహితులు. నాగరాజు తాను పనిచేసే కొంపల్లిలోని ఓ పౌల్ట్రీ కార్యాలయానికి దుర్గాప్రసాద్‌తో కలసి బైక్‌పై వెళ్లాడు. తిరిగి వస్తుండగా నర్సాపూర్ ఎస్బీఐ సమీపంలో జాతీయ రహదారిపై వెనుక నుంచి వచ్చిన లారీ వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో దుర్గాప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాగరాజు తుదిశ్వాస విడిచాడు. ఈ రెండు కుటుంబాలకు వీరు ఒక్కొక్కరే సంతానం కావటం గమనార్హంభార్య కళ్లెదుటే భర్త మృతిస్కూటీని లారీ ఢీకొట్టడంతో భార్య కళ్లెదుటే భర్త మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట కలెక్టరేట్ వద్ద రాజీవ్ రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. కోహెడ మండలం తంగళ్లపల్లి గ్రామానికి చెందిన ఎర్రవెళ్లి బాలకిష్టయ్య (59)కు బెజ్జంకి మండలం గుగ్గిళ్లకు చెందిన ఓ వ్యక్తితో వ్యవసాయ బావి విషయంలో భూ వివాదం ఉంది. వివాదం పరిష్కారం కోసం 20 రోజులుగా కలెక్టరేట్ చుట్టూ దంపతులిద్దరూ తిరుగుతున్నారు. శుక్రవారం అదే పని మీద వీరు స్కూటీపై కలెక్టరేట్‌కు వెళ్తుండగా, కలెక్టరేట్ ఎదుట వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టి.. స్కూటీని కొంత దూరం ఈడ్చుకెళ్లింది. తీవ్ర గాయాలై బాలకిష్టయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న రేణుకకు స్వల్ప గాయాలయ్యాయి. రేణుక ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్ల జైలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఫోక్సో కోర్టు సంచలన తీర్పు చెప్పింది. బాలికను గర్భవతిని చేసిన కేసులో ఫన్ బకెట్ భార్గవ్(Fun Bucket Bhargav)కు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 2021లో పెందుర్తి పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. టిక్ టాక్‌తో ఫేమస్ అయిన ఫన్ బకెట్ భార్గవ్.. వెబ్ సిరీస్‌లలో ఆఫర్ ఇప్పిస్తానని చెప్పి బాలికను మోసం చేశాడు. దీంతో విశాఖ పోక్సో కోర్టు.. భార్గవ్‌కి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.4 లక్షల జరిమానా విధించింది.14 ఏళ్ల బాలికను అత్యాచారం చేసిన కేసులో భార్గవ్‌ను టిక్‌టాక్ ఫేం ఫన్ బకెట్ భార్గవ్‌ను 2021లో పోలీసులు అరెస్ట్ చేశారు. టిక్‌టాక్ వీడియోల పేరుతో బాలికను లోబర్చుకొని, పలుమార్లు అత్యాచారం చేసినట్లు విశాఖ పీస్‌లో భార్గవ్‌పై కేసు నమోదయ్యింది.విజయనగరం జిల్లా కొత్తవలస ప్రాంతానికి చెందిన భార్గవ్ టిక్‌టాక్ వీడియోలతో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. అతనికి విశాఖ జిల్లా సింహగిరి కాలనీకి చెందిన 14 ఏళ్ల యువతితో చాటింగ్‌లో పరిచయం ఏర్పడింది. ఆ యువతికి సైతం టిక్‌టాక్ వీడియోలపై ఆసక్తి ఉండటంతో తరుచూ మాట్లాడుకునేవాళ్లు. విశాఖ విజయనగరం సరిహద్దులో ఉన్న సింహగిరి కాలనీ... భార్గవ్ గతంలో నివాసం ఉన్న ప్రాంతానికి దగ్గర కావడంతో వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.ఇదీ చదవండి: పుష్ప భామ శ్రీవల్లికి గాయం.. అసలేం జరిగిందంటే?ఈ పరిచయంతో మైనర్ బాలిక భార్గవ్‌ను అన్నయ్య అని పిలిచేది. అయితే ఇద్దరూ తరుచూ చాటింగ్ చేయడం, కలుసుకుంటుండంతో సాన్నిహిత్యం పెరిగింది. టిక్‌టాక్ వీడియోల పేరుతో భార్గవ్ ఆమెను లోబర్చుకున్నాడు. ఇటీవలె బాలిక శారీరక అంశాల్లో మార్పు గమనించిన ఆమె తల్లి డాక్టర్‌ను సంప్రదించగా యువతి అప్పటికే నాలుగు నెలల గర్భిణి అని తేలింది. ఇందుకు కారణం ఫన్ బకెట్ భార్గవ్ అని ఆరోపిస్తూ బాలిక తల్లి ఏప్రిల్ 16, 2021న పెందుర్తి పోలీసులను ఆశ్రయించింది. విశాఖ సిటీ దిశ ఏసిపి ప్రేమ్ కాజల్ ఆధ్వర్యంలో కేసు విచారణ కొనసాగింది. బాలికను భార్గవ్.. చెల్లి పేరుతో లోబర్చుకొని గర్భవతిని చేసినట్లు తేలింది. దీంతో ఇవాళ విశాఖ పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.ఇదీ చదవండి: అల్లు అరవింద్ బర్త్ డే సెలబ్రేట్ చేసిన పుష్పరాజ్.. పోస్ట్ వైరల్
కాళ్లూ.. చేతులు కట్టేసి.. ఫ్యాన్‌కు ఉరేశారు
జీడిమెట్ల: కాళ్లు, చేతులు కట్టేసి.. నోట్లో దుస్తులు కుక్కి ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ చెప్పిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా తొండూరు మండలం గోటూరు గ్రామానికి చెందిన మనోహర్‌రెడ్డి కుమారుడు లింగాల శివకుమార్‌రెడ్డి (26) నాలుగు నెలల క్రితం నగరానికి వచ్చి కుత్బుల్లాపూర్‌లోని అయోధ్యనగర్‌లో అదే గ్రామానికే చెందిన ప్రసాద్‌రెడ్డితో కలిసి ఉంటూ ర్యాపిడో నడుపుతున్నాడు. బుధవారం రాత్రి ప్రసాద్‌రెడ్డి విధులకు వెళ్లగా గదిలో శివకుమార్‌రెడ్డి ఒక్కడే ఉన్నాడు. గురువారం ఉదయం విధుల ముగించుకుని గదికి వచ్చిన ప్రసాద్‌రెడ్డి తలుపు తట్టి ఎంత పిలిచినా శివకుమార్ పలకలేదు. దీంతో అనుమానం వచ్చి ఇంటి యజమాని తిరుపతి కార్పెంటర్ సహాయంతో తలుపులు తెరవగా శివకుమార్‌రెడ్డి నైలాన్ తాడుతో ఫ్యాన్‌కు ఉరితో మృతి చెంది ఉన్నాడు. వెంటనే మృతుడి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. శివకుమార్‌రెడ్డి చిన్నాన్న విశ్వకళాధర్రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.గది లోపలి నుంచి తాడుతో కిటికీకి కట్టి..శివకుమార్‌రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంతదారుణంగా చంపి ఉరి వేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు తెలివిగా తలుపు గడియకు తాడు కట్టి గది లోపలి నుంచి గడియ పడేలా తాడును కిటికీలోంచి లాగారు. గడియకు కట్టి ఉన్న తాడు అలాగే ఉండిపోయింది. గదిలో ఉన్న దుప్పట్లు, వస్తువులను బట్టి చూస్తే ఎలాంటి పెనుగులాట జరిగిన ఆనవాళ్లు లేవని పోలీసులు గుర్తించారు. శివకుమార్ రెడ్డి మెడకు నైలాన్ తాడుతో ఉరి వేసి చంపినట్లు భావిస్తున్నారు. ఈ హత్యకు కుటుంబ తగాదాలా? లేక ఇతరేతర కారణాలు ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. నలుగురు మృతి
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. మరో 17 మంది గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలం ఐలాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. అలాగే, 17 మంది కూలీలు గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. కూలీలు పనుల కోసం ఒడిశా నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.