Top Stories
ప్రధాన వార్తలు

అమరావతి రీలాంచ్.. పరువు కోసం బాబు సర్కార్ పాట్లు
సాక్షి, విజయవాడ: పరువు నిలుపుకోవడం కోసం చంద్రబాబు ప్రభుత్వం పాట్లు పడుతోంది. అమరావతి పునః ప్రారంభ కార్యక్రమానికి ప్రజలను బలవంతంగా తరలింపునకు ప్రభుత్వం నానా తిప్పలు పడుతోంది. 5 లక్షల మందిని తరలించే బాధ్యత అధికారులు, ఉద్యోగులకు అప్పగించింది. రాష్ట్ర వ్యాప్తంగా 6500 బస్సులు ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం.. అన్ని ప్రాంతాల నుంచి ప్రజలను తరలించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.ప్రతి డ్వాక్రా గ్రూపు నుంచి ఏడుగురు సభ్యులు తప్పక హాజరు కావాలంటూ హుకుం జారీ చేసింది. హాజరుకాని డ్వాక్రా గ్రూపులను ఆన్లైన్లో తొలగిస్తామంటూ హెచ్చరికలిచ్చిన సర్కార్.. సంక్షేమ పథకాలు అమలు నిలిపివేస్తామంటూ ఆదేశాలిచ్చింది. యనిమేటర్ల ఆడియో లీక్‌తో చంద్రబాబు సర్కార్ బండారం బట్టబయలైంది. సచివాలయ ఉద్యోగులు, అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.5 లక్షల మంది తరలిస్తామని ప్రభుత్వం ప్రకటించగా.. ప్రభుత్వం.. పి4 బహిరంగ సభ ప్లాప్ కావడంతో ప్రభుత్వంలో గుబులు పుట్టిస్తోంది. ప్రధాని మోదీ రాక నేపథ్యంలో భారీగా ప్రజల తరలింపుకు ప్రయత్నాలు చేస్తోది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు నిన్నటి నుండి బస్సుల్లో జనం, డ్వాక్రా మహిళలు తరలింపు కొనసాగుతోంది. అన్ని ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సుల్లో తరలిస్తున్నారు.

పహల్గాం ఉగ్రదాడిపై విస్తుపోయే వాస్తవాలు.. NIA చేతికి చిక్కిన కీలక ఆధారాలు
ఢిల్లీ : జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పహల్గాం ఉగ్రదాడి ఆర్మీ, లష్కరే తోయిబా కన్నుసన్నల్లో జరిగినట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) నిర్ధారించింది. పహల్గాం ఉగ్రదాడిలో ఎన్ఐఏ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ ఎన్ఐఏ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాక్ ఐఎస్ఐ,ఉగ్రసంస్థ లష్కరే తోయిబాలు కలిసి ఈ కిరాతక దాడికి పాల్పడినట్లు ఎన్ఐఏ తేల్చింది. పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబా ఆఫీస్‌లో పహల్గాం ఉగ్రదాడికి కుట్ర జరిగినట్లు ప్రాథమిక నివేదికల్లో పేర్కొంది.ఇక పహల్గాంలో దాడికి పాల్పడ్డ ఇద్దరు ఉగ్రవాదుల్ని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. షమీమ్ మూసా అలియాస్ అస్మీన్ మూసా,అలీబాయ్ అలియాస్ తల్హా నేరుగా ఉగ్రదాడికి పాల్పడినట్లు ఎన్ఐఏ తెలిపింది.

భారత్, పాక్ మధ్య యుద్ధమే.. ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
శ్రీనగర్: పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశం లేకపోలేదని చెప్పుకొచ్చారు. అలాగే, ఈ ఘటనకు భద్రత, నిఘా లోపాలు కూడా ఒక కారణమని అన్నారు.పహల్గాం ఘటనపై తాజాగా ఫరూక్ అబ్దుల్లా స్పందిస్తూ ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ..‘పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోంది. రేపటి రోజు ఎలా ఉండబోతోందో ఎవరికీ తెలియదు. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగే అవకాశం లేకపోలేదు. ఇరు దేశాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పహల్గాం ఉగ్ర దాడి జరగడానికి కారణమైన ఉగ్రవాదులను పట్టుకోవాలి. అలాగే, ఈ ఘటన వెనక ఉన్న వారిని వీలైనంత తొందరగా పట్టుకోవాలి. అప్పుడే యుద్ధాన్ని నివారించే దిశగా ప్రయత్నాలు జరుగుతాయి. భద్రత, నిఘా లోపాలు కూడా ఉగ్ర దాడి జరిగేందుకు ఒక కారణమని అనడంలో సందేహం లేదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. అంతకుముందు.. పహల్గాం ఘటనపై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. ఉగ్రవాదుల బారి నుంచి అతిథుల(పర్యాటకులు)ను కాపాడటంలో తాను విఫలమయ్యానని రాష్ట్ర శాసనసభ వేదికగా ప్రకటించారు. బైసరన్‌లో ఇంత పెద్ద స్థాయిలో దాడి చేయడం మాత్రం 21 ఏళ్లలో ఇదే తొలిసారి. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఎలా క్షమాపణలు చెప్పాలో తెలియడం లేదు. రాష్ట్రానికి వచ్చిన పర్యాటకులను సురక్షితంగా తిరిగి పంపాల్సిన బాధ్యత మాదే. నేను ఆ పనిచేయలేకపోయాను. పహల్గాం ఘటన తర్వాత ఏ ముఖం పెట్టుకొని రాష్ట్ర హోదాను డిమాండ్ చేయాలి. నా రాజకీయాలు అంత చౌకబారువి కాదు. గతంలో రాష్ట్ర హోదా అడిగాం.. భవిష్యత్తులో కూడా అడుగుతాం. కానీ, 26 మంది చనిపోయారు.. ఇప్పుడు రాష్ట్ర హోదా ఇవ్వండి అని కేంద్రాన్ని అడగడం సిగ్గుచేటు. ప్రజలు మాకు మద్దతు ఇస్తే.. ఉగ్రవాదం అంతమవుతుంది’ అని పేర్కొన్నారు.

RR VS MI: చాలా తప్పులు చేశాం.. నిజాయితీగా ఒప్పుకున్న రాజస్థాన్ కెప్టెన్
ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ కథ ముగిసింది. నిన్న (మే 1) ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమితో ఆ జట్లు ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన రాయల్స్ ఏకంగా 8 పరాజయాలు మూటగట్టుకుంది. కేవలం మూడే విజయాలు సాధించింది. కొన్ని గెలవాల్సిన మ్యాచ్‌ల్లో అనూహ్యంగా ఓటమిపాలైంది. ఈ సీజన్లో ఆ జట్టు మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లు గెలిచినా, ఓడినా రాయల్స్‌కు ఒరిగేది ఏమీ లేదు. అయితే ప్రత్యర్థి జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. రాయల్స్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో కేకేఆర్ (మే 4), సీఎస్కే (మే 12), పంజాబ్ (మే 16) జట్లను ఢీకొట్టనుంది.ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి అనంతరం రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ నిజాయితీగా తమ తప్పిదాలను ఒప్పుకున్నాడు. ఈ సీజన్లో చాలా పొరపాట్లు చేశామని అంగీకరించాడు. తప్పిదాలపై దృష్టి సారిస్తామని చెప్పాడు. తప్పులతో పాటు కొన్ని మంచి పనులు కూడా చేశామని అన్నాడు. తదుపరి మూడు మ్యాచ్‌ల్లో సత్తా చాటుతామని ఆశాభావం వ్యక్తం చేశాడు.ముంబై ఇండియన్స్‌కు క్రెడిట్ ఇచ్చాడు. వారు బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతమని కొనియాడాడు. ఓవర్‌కు 10 పరుగుల చొప్పున రన్‌రేట్ మెయిన్టైన్ చేస్తూ చివర్లో చెలరేగారని అన్నాడు. తమ జట్టు బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ.. ఈ రోజు మాది కాదని అన్నాడు. పిచ్‌పై స్పందిస్తూ.. 190-200 ఛేజింగ్‌కు అనువైన స్కోర్ అని తెలిపాడు. ముంబై అదనపు పరుగులు సాధించినందుకు హార్దిక్, సూర్యకుమార్‌కు క్రెడిట్ ఇచ్చాడు. తమ ఆటతీరు మెరుగ్గా ఉండాల్సిందని ఒప్పుకున్నాడు.ఈ సీజన్లో బ్యాటింగ్‌లో మంచి ఆరంభాలు లభించినా మిడిలార్డర్ సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయిందని తెలిపాడు. తాను, జురెల్ మిడిలార్డర్లో బాధ్యత తీసుకోవాల్సిందని అన్నాడు. ఈ రోజు వచ్చిన అవకాశం మరోసారి వస్తే తమ సత్తా చాటుతామని తెలిపాడు.కాగా, నిన్న జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ ముంబై ఇండియన్స్ చేతిలో 100 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమైంది. తొలుత ముంబై బ్యాటర్లను కట్టడి చేయలేకపోయిన ఆ జట్టు.. ఆతర్వాత బ్యాటింగ్‌లో తొలి బంతి నుంచే చేతులెత్తేసింది. గత మ్యాచ్‌లో 35 బంతుల్లోనే సెంచరీ చేసి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్శించిన 14 ఏళ్ల చిచ్చరపిడుగు వైభవ్ ఈ మ్యాచ్‌లో డకౌటయ్యాడు. బౌల్ట్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాది జోష్‌గా కనిపించిన జైస్వాల్ అదే ఓవర్లో ఔటయ్యాడు. ముంబై బౌలర్లు చెలరేగడంతో రాణా, పరాగ్, జురెల్, హెట్‌మైర్ వికెట్లు కోల్పోయారు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో రాయల్స్ తమ స్థాయి ఆటతీరు ప్రదర్శించలేక చిత్తుగా ఓడింది.

పరామార్శకూ తీరకలేదా బాబూ!
సింహాచలం అప్పన్న ఆలయంలో హాహాకారాలు.. మృత్యు ఘోష.. ఎవరికైనా బాధనిపిస్తుంది. కాని ఆంధ్రప్రదేశ్ సర్కారుకు మాత్రం అవేమీ పట్టినట్లు లేదు. కూటమి నేతలందరూ అమరావతి సంబరంలో మునిగి తేలుతున్నారు. పలుమార్లు శంకుస్థాపనలు జరిగిన అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఇంకోసారి శంకుస్థాపన చేయిస్తున్నారు.సింహాచలంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలి అయింది సామాన్యులే.. అమరావతి హంగామాతో తీవ్రంగా నష్టపోతున్నదీ పేదలే. హిందూ మతంలో ఒక నమ్మకం ఉంటుంది. ఏదైనా ఒక కుటుంబంలో అశుభం జరిగితే నిర్దిష్టంగా కొన్నాళ్లపాటు ఎలాంటి శుభ కార్యక్రమాలు జరపరు. హిందూ మతోద్దారకులమని ప్రచారం చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సనాతన హిందూ అని చెప్పుకునే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు. శంకుస్థాపన కార్యక్రమాలను వాయిదా వేసుకోలేదు. పాలకులు రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను కుటుంబంలా పరిగణిస్తారు. ఆ ప్రకారం చూస్తే ఒక ప్రముఖ ఆలయంలో జరిగిన ఈ దుర్ఘటనలో కొత్తగా కట్టిన గోడ కూలి ఏడుగురు మరణించినా తమ ప్రోగ్రాం ఆపుకోవడానికి ఇష్టపడలేదు. సింహాచలం మృతుల కుటుంబాలను పరామర్శించడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు వెళ్లలేదు.అంటే వారికి ఏదో అనుమానం ఉండబట్టే అటువైపు వెళ్లకుండా ఉన్నట్లు అనిపిస్తుంది.మామూలుగా అయితే ఒక ప్రసిద్ద పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఘటనలు సంభవిస్తే వెంటనే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు అంతా వెళ్లి సహాయ చర్యలను పర్యవేక్షించి బాధితులకు స్వాంతన చేకూర్చడానికి యత్నిస్తారు. కాని వీరిద్దరూ ఆ పని చేయలేదు. కొద్ది నెలల క్రితం వైకుంఠ ఏకాదశి టిక్కెట్ల కోసం తిరుపతి వెళ్లిన వేలాది భక్తులు తొక్కిసలాటకు గురయ్యారు. ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఆ తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు. ఆ సమాచారం వచ్చిన వెంటనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు పోటీ పడి తిరుపతి వెళ్లారు.ఏదో చేస్తున్నట్లు హడావుడి చేశారు. అలాంటి వారు సింహాచలం ఎందుకు వెళ్లలేదు? ప్రధాని మోడీ అమరావతి వస్తున్నందున వెళ్లలేక పోయారని చెప్పవచ్చు కానీ మూడు గంటల ఖాళీ కూడా లేదనడం అతిశయోక్తి అవుతుంది. పైగా ఇప్పుడు వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కడ నుంచైనా పర్యవేక్షణ చేయవచ్చు. పవన్ కళ్యాణ్ కు ఆ ఇబ్బంది లేదు కదా?మరి ఆయన ఎందుకు సింహాచలం వెళ్లలేదు? దీనికి రెండు,మూడు కారణాలు చెబుతున్నారు. అక్కడకు వెళ్లితే భక్తులలో ఉన్న కోపం అంతా తమపై చూపే అవకాశం ఉందని, వారు ప్రభుత్వ నిర్వాకంపై నిలదీస్తే ఇబ్బంది అవుతుందని అనుకుని ఉండవచ్చ అంటున్నారు. అమరావతి పునః శంకుస్థాపన పనుల పేరుతో తప్పించుకునే అవకాశం ఉండడం. మరొకటి చావుల వద్దకు వెళ్లి రావడం అశుభం అని ఎవరైనా సలహా ఇచ్చారేమో తెలియదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు నిజంగానే హిందూ మతాచారాలపై అంత శ్రద్దగా ఉంటారా అంటే అదీ గ్యారంటీ లేదు. ఏ మతం వారివద్దకు వెళ్లితే ఆ మతమే గొప్పదని చెప్పి వస్తుంటారు. రాజకీయాల కోసం మతాన్ని వాడుకుంటారు.గత గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబు కుటుంబం స్నానమాచరించే ఘట్టాన్ని సినిమా తీయడం కోసం సామాన్య భక్తులను నిలిపి వేయడం, ఒక్కసారిగా గేటు తెరవడం వల్ల తొక్కిసలాట జరిగి 29 మంది మరణించడం జరిగింది. అప్పుడు చంద్రబాబు తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో యత్నాలు చేశారు. చివరికి రోడ్డు ప్రమాదాలలో చనిపోవడం లేదా? కుంభమేళాలో చనిపోలేదా? అంటూ వితండ వాదం చేశారు. అంతే తప్ప అంత పెద్ద ఘటన జరిగితే మామూలుగా అయితే పదవి నుంచి తప్పుకుంటారు. ప్రాంతీయ పార్టీ కనుక ఆయనను పార్టీలో ఎవరూ ప్రశ్నించరు కనుక ఆ ప్రస్తావనే ఉండదు. పోనీ కనీసం ఒక కానిస్టేబుల్ పై కూడా చర్య తీసుకోకపోవడం విశేషం. తిరుపతి తొక్కిసలాట ఘటన జరిన తర్వాత పవన్ కళ్యాణ్ క్షమాపణల డ్రామా తెలిసిన సంగతే.చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌లు ఏమి మాట్లాడింది అందరికి తెలుసు. అక్కడ చైర్మన్ లేదా, అధికారులపై చర్య తీసుకోలేదు. వారిని పదవుల నుంచి తప్పించలేదు. నిజంగా హిందూ మత విశ్వాసాలు నమ్మేవారైతే అలా చేస్తారా? అన్న విమర్శలను పలువురు చేశారు. చివరికి ఒక రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. గోదావరి పుష్కరాల మరణాలపై వేసిన కమిషన్ ఏ తరహా రిపోర్టు ఇచ్చిందో, తిరుపతి ఘటనపై కూడా రిపోర్టు అందుకు భిన్నంగా వస్తుందా అన్నది కొందరి సందేహం. పుష్కరాల తొక్కిసలాటలో తప్పు భక్తులదే అని ఆ కమిషన్ తేల్చింది. ఇప్పుడు సింహాచలం ఘటనపై కూడా విచారణ కమిటీని నియమించినా, ఎంతవరకు ప్రయోజనం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. గోడ కూలడానికి నాణ్యత లోపమని కాకుండా, భక్తుల రద్దీ, తోపులాట అని నివేదికలు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో ఆలయాలలో ఏ చిన్న ఘటన జరిగినా, దాని వెనుక టీడీపీ, జనసేన రాజకీయ శక్తుల ప్రమేయం ఉన్నా, దానినంతటిని జగన్ కు ఆపాదించి ఎంత రచ్చ చేసేవారో గుర్తు చేసుకుంటేనే కంపరం కలుగుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత సైతం అదే ధోరణి ప్రదర్శించారు. తిరుమల లడ్డూ లో జంతు కొవ్వు కలిసిదంటూ దారుణమైన అసత్యాన్ని చంద్రబాబు, పవన్ లు ప్రజలకు చెప్పారు. దీనివల్ల కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని, దైవానికి అపచారం చేసినట్లు అవుతుందని వారు ఫీల్ కాలేదు. తమ రాజకీయ ప్రయోజనం కోసం ఎంతకైనా దిగజారతామన్నట్లుగా వారు వ్యవహరించారు. ఈ ఘటన తర్వాత పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకు వేసి తాను అన్ అప్పాలజిటిక్ సనాతన హిందూ అని ప్రకటించుకుని కొత్త వేషం కట్టారు.అసలు సనాతన హిందూయిజం ఏమి చెబుతుందో తెలియకుండానే, తానేదో వేద శాస్త్రాలు అన్నిటిని పుక్కిట పట్టినట్లుగా మాట్లాడారు. విశేషం ఏమిటంటే ఆయన భార్య విదేశీయురాలు. క్రైస్తవ మతానికి చెందిన వారు.అలాగే పవన్ కు పుట్టిన వారు సైతం క్రైస్తవమే తీసుకున్నారు. మరి అక్కడ ఈయన సనాతనమేమైందో తెలియదు. అనవసరంగా సినిమా డైలాగులు చదివితే ఇలాంటి అప్రతిష్టే వస్తుంది. చంద్రబాబు తన రాజకీయం కోసం ఏ మతాన్ని అయినా వాడుకోగలరు.ఆయన తెలివితేటలు వేరు.ఆయనను మించి ఏదో చేసి బీజేపీ వారి మెప్పు పొందాలని పవన్ చేస్తున్న ఈ ప్రయత్నాల వల్ల ఆయన పరువు పోగొట్టుకుంటున్నారు. పోనీ నిజంగానే అంత సనాతన హిందూ అయితే సింహాచలం ఎందుకు వెళ్లలేదు.ఒక సంతాప సందేశం ఇచ్చి వదలివేశారే.అమరావతి కార్యక్రమ ఆహ్వానంలో తన పేరు వేయలేదని మొదట అలిగారని, దాంతో ప్రభుత్వం మరో కార్డు వేసిందని చెబుతున్నారు. తన డిమాండ్ నెరవేరకపోతే ఏమైనా సింహాచలం వెళ్లేవారేమో. తిరుమల గోవుల మరణాలు, కాశీనాయన క్షేత్రంలో భవనాల కూల్చివేత, తిరుమల, బ్రహ్మం గారి మఠం తదితర ఆధ్యాత్మిక కేంద్రాలలో మత్తు పదార్ధాల వాడకం వంటి ఆరోపణలు వస్తున్నా ఈ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టలేక పోతోందన్న విమర్శలు వస్తున్నాయి. సింహాచలంలో చందనోత్సవానికి ఐదుగురు మంత్రుల కమిటీ కూడా ఉందట. వారంతా ఏమి చేశారో తెలియదు. కాని గోడ కూలి ఏడుగురు మరణించారు. చిన్న ఆలయ గోడ నిర్మాణమే చేయలేని వారు రాజధాని నిర్మాణం చేస్తారట అంటూ సోషల్ మీడియాలో వ్యంగ్య వ్యాఖ్యానాలు వచ్చాయి.అదే టైమ్ లో జగన్ విజయవాడ వద్ద కృష్ణానదికి కట్టిన రిటైనింగ్ వాల్ ఏ రకంగా స్ట్రాంగ్ గా ఉందీ వివరిస్తూ కూడా వీడియోలు వచ్చాయి. సింహాచలం ఘటన తర్వాత జగన్ వెంటనే అక్కడకు వెళ్లి మృతుల కుటుంబాలకు భరోసా ఇచ్చివచ్చారు. చంద్రబాబు, పవన్ లు మాత్రం సాకులు వెతుక్కుంటూ కూర్చున్నారు. ఎల్లో మీడియా మాత్రం సింహాచలం ప్రమాదాన్ని తగ్గించి చూపడానికి నానా పాట్లు పడింది. ఏది ఏమైనా మత సెంటిమెంటును రాజకీయాలకు వాడుకోవడం మంచిది కాదు.అది ఎప్పటికైనా వారికే తగులుతుంది.ఈ నేపథ్యంలో పాలకులు చేసే పాపాలు తమకు శాపాలుగా మారుతున్నాయని ప్రజలు సెంటిమెంట్ గా భావించే పరిస్థితి ఏర్పడింది. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

కుల గణనపై మాజీ సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: దేశంలో జనాభా లెక్కలతో పాటు కుల గణన చేపట్టాలన్న కేంద్రం నిర్ణయంపై మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్పందించారు. జనగణనలో భాగంగా కుల గణన చేయడం చారిత్రక అవసరం అని ఎన్వీ రమణ అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే, జనగణనలో ప్రతి సామాజిక సూచికను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.తాజాగా మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘కులం, కులం ఆధారిత వివక్ష ఒక కఠినమైన వాస్తవం. చాలా కాలం పాటు మనం ఈ వాస్తవాన్ని అంగీకరించకుండా విస్మరించడానికే ప్రాధాన్యం ఇచ్చాం. ఇప్పుడు మనం చైతన్యంతో ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైంది. కుల గణన నిర్ణయం తీసుకున్న భారత ప్రభుత్వానికీ హృదయపూర్వక అభినందనలు. కులాన్ని ఒక గుర్తింపుగా తీసుకుని జనగణన (Census)లో భాగం కుల గణన నిర్వహించడం సరైన నిర్ణయం.ప్రామాణికమైన డేటాను సేకరించకపోతే సమగ్ర కోణంలో అభివృద్ధి కార్యాచరణను రూపొందించడం సాధ్యపడదు. కుల గణనతో మన సమాజంలోని అన్ని వర్గాలకు అధికారంలో, ఆర్థిక అభివృద్ధిలోను వారికి రావాల్సిన వాటా లభించేలా చేయడంలో తోడ్పడుతుంది. సామాజిక, ఆర్థిక, ఇతరత్రా అసమానతలను తగ్గించడంలో కూడా కుల గణన ఎంతో దోహదపడుతుంది. జనగణనలో ప్రతి సామాజిక సూచికను కూడా పరిగణనలోకి తీసుకోవాలి అని అన్నారు.

Good Health: వెజ్ తినాలా? నాన్ వెజ్ తినాలా?
ఓ మహిళ.. ఎదురుగా ఉన్న ఓ వ్యక్తితో.. జంతుబలి చేసే హక్కు మీకు ఎవరిచ్చారు..? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. మా ఇష్టం మాకు నచి్చంది మేం తింటాం.. అంటూ అవతలి వ్యక్తి సమాధానం ఇస్తున్నాడు. మాంసాహారం తింటాం అంటే కుదరదు.. ఎందుకు కుదరదో చెబుతాను వినండి.. అంటూ ఆమె శాకాహారం గొప్పతనం, మన సైక్లింగ్ ప్రకృతి నియమాలు ఇతర అంశాలను వివరించారు. మీరు ప్యూర్ వెజిటేరియన్‌గా మారతారా? అని హామీ తీసుకుంది. ఇంత చెప్పిన తర్వాత ఆ మనిషిలో ఆలోచన మొదలైంది. ఇంతకీ ఎవరా మహిళ.. ఆమె చేస్తున్న ప్రచారం ఏమిటి..? ఆమె పేరే విజయలక్ష్మి.. మియాపూర్‌లో నివాసం ఉంటున్నారు. ఓ కార్పొరేట్ స్కూల్లో కంప్యూటర్ సైన్స్ టీచర్. ప్రవృత్తి.. పది మంది గుమిగూడి ఉండే చోట శాకాహారంతో ప్రయోజనాలను వివరిస్తూ శాకాహారమే తినాలంటూ ప్రచారం చేయడం. ఎంతలా వారికి అవగాహన కల్పిస్తున్నారంటే ఆమె మాటలు విన్న తర్వాత చాలా మంది ఇక మాంసాహారం జోలికి వెళ్లకూడదని నిర్ణయం కూడా తీసుకుంటున్నారు. – సికింద్రాబాద్ శాకాహారంలో అనుభూతిని ఆస్వాదిద్దామా..? అంటూ మొదలవుతుంది ఆమె ప్రచారం. యునైటెడ్ వెజిటేరియన్స్ ఫోరం పేరుతో సోషల్ మీడియా వేదికగా ఓ పేజీ క్రియేట్ చేశారు. తనలాంటి భావజాలం ఉన్న వ్యక్తుల్ని ఆ వేదికపైకి రమ్మని పిలుపునిచ్చారు. ఒకరు, ఇద్దరు, ముగ్గురు.. అలా 200లకు చేరింది ఆ సంఖ్య. వీలున్నప్పుడల్లా పదిమంది జనం ఉండే చోట ప్రత్యక్షమవుతారు. శాఖాహారంలోని గొప్పతనాన్ని.. అది తీసుకోవడం వల్ల శరీర అవయవాల మీద పనితీరును.. ఇతర అంశాల్ని చక్కగా వివరించి మాంసాహారానికి దూరం చేసే ప్రయత్నం చేస్తారు. ఆ మాటలు విన్న ఎవరైనా క్చతంగా ఆకుకూరలు, కూరగాయలు గొప్పతనాన్ని ‘వంట’ పట్టించుకోవడం నిజం. పక్కా ప్రణాళికతో ప్రచారం.. యునైటెడ్ వెజిటేరియన్స్ ఫోరం వ్యవస్థాపకురాలైన ఎన్వీ విజయలక్ష్మి పనితీరు చాలా ఆసక్తికరం. స్వచ్ఛందంగా సేవలందించేందుకు సిద్ధమైన వలంటీర్లు ఎంతమంది అందుబాటులో ఉన్నారో తెలుసుకుంటారు. ఫలానా రోజు ఫలానా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఓ న్న పోస్టులు పెడతారు. ఆ ఏరియాలో ఉండే వలంటీర్లు.. అందుబాటులో ఉండే వారంతా సుముఖత వ్యక్తం చేస్తే వెంటనే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేస్తారు. తక్కువలో తక్కువ కనీసం 50 నుం 60 మంది ఆ కార్యక్రమానికి హాజరయ్యేలా చూసుకుంటారు. అక్కడికి వచ్చిన వారంతా బృందాలుగా విడిపోయి నాలుగైదు ప్రదేశాలకు వెళ్లి తమ సంస్థ లక్ష్యాన్ని వివరిస్తారు.మారేందుకు మీరు సిద్ధమా..? సోషల్ మీడియా వేదికగా యునైటెడ్ వెజిటేరియన్స్ ఫోరంలో చేరాలని ఉందా? అయితే అదే పేరుతో ఉన్న ఫేస్బుక్, ఇస్ట్రాగామ్ పేజీల ద్వారా గానీ.. సభ్యులుగా చేరిపోవచ్చు. ఆ మీదట వలంటీర్లుగా సేవలు అందించవచ్చు. ఆ మీదట శాకాహారం గొప్పతనాన్ని తెలుసుకొని మీరు శాకాహార ప్రియులుగా మారిపోవచ్చు. టీచర్ పాఠశాలలే టార్గెట్‌గా.. శాకాహారం వినియోగించాలనే ప్రచారాలను జనం రద్దీ ఉండే అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలను టార్గెట్ చేసుకుని ఎక్కువ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. చదువుకునే వయసు నుంచే జంతువధ చేయకూడన్న లక్ష్యాన్ని విద్యార్థుల్లో ఇనుమడింపజేయడం ద్వారా ఎక్కువ ఫలితాలు రాబట్టవచ్చన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. సదస్సులు, సమావేశాలు నిర్వహించడం, పవర్‌పాయింగ్ ప్రెజెంటేషన్లు ఇవ్వడం, కరపత్రాలు, స్టిక్కర్ల ద్వారా వీలున్న అన్ని మార్గాల్లో ప్రచారాలు కొనసాగించి శాకాహార భోజన ప్రియులను రూపొందిస్తున్నాం. పాఠశాలల్లో యునైటెడ్ వెజిటేరియన్స్ ఫోరం కమిటీలు ఏర్పాటు చేయడం, పోటీలు నిర్వహిస్తూ వారికి బహుమతులు, జ్ఞాపికలు అందజేసి ప్రోత్సహిస్తున్నాం. – ఎన్వీ విజయలక్ష్మి, వ్యవస్థాపకురాలు దేశమంతా ఒకే వేదికగా.. యునైటెడ్ వెజిటేరియన్ ఫోరం అనేది ఒక తెలంగాణకు మాత్రమే కాకుండా.. అన్ని రాష్ట్రాల్లోనూ విస్తరింపజేసి.. వీలైనంత ఎక్కువ మంది జనాభాను శాకాహారం వైపు తిప్పటిమే తమ ధ్యేయమని చెబుతున్నారు విజయలక్షి్మ. ఆ దిశగా విస్తృతంగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు చెప్పారామే. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఉండే తమ వాళ్ళ ద్వారా అవగాహన కార్యక్రమాల ద్వారా అవగాహన కార్యక్రమాలను ఫోకస్ చేస్తున్నారు ఈ వెజిటేరియన్ విజయక్ష్మిఆరోగ్య సూత్రాలు వివరిస్తూఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని పాటించడానికి శాకాహారం పాత్ర ఏంటో యునైటెడ్ వెజిటేరియన్స్ ఫోరం ప్రతినిధులు వివరిస్తారు. ఎదుటివారు మాంసాహార ప్రియులైన వారు అడిగే ప్రశ్నలకి శాకాహార పూరితమైన సమాధానాలు ఇచ్చి వెజిటేరియన్స్‌గా మారాలంటూ రిక్వెస్ట్ చేస్తారు. ఒక నెల రోజులు టైం తీసుకోండి.. పప్పు దినుసుల మీద దృష్టి పెట్టండి ఆకుకూరల్లో బలమైన పోషకాల కోసం మీరే తెలుసుకోండి.. మీరు తీసుకునే మాంసాహారాన్ని మేము చెప్పే శాకాహారాన్ని బేరీజు వేసుకోండి అంటూ జనం మెదడుల్లోకి శాఖాహార గొప్పతనాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చేయడమేంటి చాలామందిని మార్చి చూపించారు కూడా..

ఢిల్లీలో వర్ష బీభత్సం.. తల్లి, ముగ్గురు పిల్లలు మృతి
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం సృష్టించిన వర్షం బీభత్సంలో కుటుంబంలో నలుగురు మృతి చెందారు. వర్ష కారణంగా ద్వారాకాలో ఓ ఇంటిపై చెల్లి కూలింది. ఈ దుర్ఘటనలో తల్లి, ఆమె ముగ్గురు పిల్లలు మరణించారు. శుక్రవారం తెల్లవారు జామున ఢిల్లీ వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు చోటు చేసుకున్నాయి. దుమ్ముతో పాటు భారీ వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. వర్షం కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాతావరణ శాఖ సైతం ఢిల్లీలో రెడ్ జోన్ ప్రకటించింది. భారీ వర్షం కారణంగా ఏర్పడిన ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వర్షం దెబ్బకు విమానాల సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు ఆయా విమానయాన సంస్థలు అధికారికంగా ప్రకటించాయి. Severe thunderstorms and rain lash Delhi and NCR.IMD forecasts heavy rainfall, thunderstorms, and gusty winds for the next two days, issuing a yellow alert for the national capital.#Rain #IMD #DelhiRains #rainfall #thunderstorms #Weather pic.twitter.com/fiZb2DPJJS— All India Radio News (@airnewsalerts) May 2, 2025 ఎయిర్ పోర్టుకు వెళ్లే ముందు ప్రయాణికులు తమ విమానాల రాకపోకల్ని పరిశీలించాలని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రయాణికుల్ని కోరింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది #TravelAdvisoryThunderstorms and gusty winds have affected flight operations in parts of Northern India. Some of our flights to and from Delhi are being delayed, which is likely to impact our overall flight schedule. We are doing our best to minimise disruptions.We advise our…— Air India (@airindia) May 2, 2025‘ఢిల్లీకి వెళ్లే, బయల్దేరే ఎయిరిండియా విమానాల సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలో దుమ్ము తుఫాను, వర్షం కారణంగా విమానాల్ని దారి మళ్లిస్తున్నాం. ఫలితంగా మొత్తం విమానాల రాకపోకలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. అంతరాయాలను తగ్గించడానికి మా వంతు మేం కృషి చేస్తున్నాం’ అంటూ ఎయిరిండియా ట్వీట్లో పేర్కొంది.

ఆ యాక్సిడెంట్ నా జీవితంలో పెద్ద గిఫ్ట్ : అల్లు అర్జున్
ప్రమాదం జరిగితే కష్టం, నష్టమే. కానీ, అనుకోకుండా కొన్ని ప్రమాదాలు మంచి కూడా చేస్తాయి. ప్రముఖ హీరో అల్లు అర్జున్(Allu Arjun) స్వయంగా ఈ మాట అంటున్నారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న ‘వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్)(WAVES 2025)లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ– ‘‘కెరీర్ తొలి రోజుల్లో నా దృష్టి అంతా ఫిజికల్ ఫిట్నెస్, ఎజిలిటీ మీదే ఉండేది. కానీ, జీవితంలో ఒక ఘటన నా ఆలోచననే మార్చేసింది. నా పదో సినిమా తర్వాత నా భుజానికి దెబ్బ తగిలి, ఆస్ట్రేలియాలో సర్జరీ చేయించుకున్నా. అంతా బాగైపోయి, నాలుగో వారం నుంచి సెట్స్ మీదకు వెళ్ళిపోవచ్చనుకున్నా. డాక్టర్లు 6 నెలలు రెస్ట్ తప్పనిసరి అన్నారు. నాకు కొత్తగా పెళ్ళయింది. ఓ సినిమా సగంలో ఉంది. అప్పటి దాకా ఫిజికల్ ఫిట్‌నెస్‌కే ప్రాధాన్యం ఇస్తూ వచ్చిన నాకు ఒక్కసారిగా జ్ఞానోదయం అయింది.వయసు పెరిగే కొద్దీ ఫిట్నెస్, ఎజిలిటీ తగ్గుతాయి. కానీ, నటనపై దృష్టి పెడితే అది చిరకాలం మిగిలిపోతుందని గ్రహించా. అక్కడి నుంచి నా ఆలోచనే మారిపోయింది’’ అని వివరించారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘పదో సినిమా దగ్గర మొదలైన ఆ ఆలోచన ఇరవయ్యో సినిమా ‘పుష్ప–1’ దగ్గరకు వచ్చేసరి కల్లా నన్ను జాతీయ ఉత్తమ నటుడిగా, అందులోనూ తెలుగు సినీరంగం నుంచి ఆ ఘనత అందుకున్న తొట్ట తొలి నటుడిగా నిలిపింది. పదో సినిమా సమయంలో ఆ యాక్సిడెంట్ జరగకపోతే... నా దృక్పథం ఇలా మారేది కాదు.అందుకే, కొన్ని యాక్సిడెంట్లు అనుకోకుండా మన మంచికే జరుగుతాయి. మొత్తం నా ఆలోచనలు, కెరీర్‌నే మార్చేసిన ఆ యాక్సిడెంట్ నా జీవితంలో పెద్ద గిఫ్ట్’’ అని అల్లు అర్జున్ వివరించారు. ‘సాక్షి’ ఆయనను పలకరించినప్పుడు ‘‘మెడిసిన్, టెక్నాలజీ లాంటి అనేక రంగాలలో చాలా కాలంగా జరుగుతున్న సమ్మిట్లు చూసి, అలాంటివి మన సినీ, వినోద రంగంలో కూడా జరగాలనుకున్నాను. ప్రధాని మోదీ చొరవతో తొలిసారిగా వేవ్స్ సదస్సు జరగడం శుభారంభం’’ అన్నారు.

కాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు 20 వేల కొలువులు
అమెరికన్ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ ఈ ఏడాది సుమారు 20,000 మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకునే యోచనలో ఉంది. ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, మేనేజ్డ్ సర్వీసెస్ విభాగాల్లో ఈ కొలువులు ఉండనున్నాయి. ప్రస్తుతం కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,36,300గా ఉంది.‘ఇన్వెస్టర్ డే సందర్భంగా చెప్పినట్లు మా వ్యూహంలో భాగంగా 20,000 మంది ఫ్రెషర్లను తీసుకోబోతున్నాం. గతేడాదితో పోలిస్తే ఇది రెట్టింపు‘ అని కంపెనీ సీఈవో ఎస్ రవి కుమార్ తెలిపారు. ఫ్రెషర్లను తీసుకోవడం, ఏఐ ద్వారా ఉత్పాదకతను పెంచుకోవడం, మానవ వనరుల వ్యయాలను తగ్గించుకునేలా సామర్థ్యాల వినియోగాన్ని మెరుగుపర్చుకోవడం వంటి మూడు అంశాలపై కంపెనీ ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు వివరించారు.ఈ ఏడాది జనవరి–మార్చ్ త్రైమాసికంలో కాగ్నిజెంట్ ఆదాయం సుమారు 7 శాతం పెరిగి 5.1 బిలియన్ డాలర్లకు చేరింది. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో టాప్ ఐదు ఐటీ కంపెనీలు మొత్తంగా 80 వేల నుంచి 84 మందిని కొత్తగా నియమించుకోనున్నట్లు సంకేతాలిచ్చాయి.
నేచర్ క్యాంప్, ఫారెస్ట్ ట్రెకింగ్ అంటే ఇష్టమా..?
21 రోజుల్లో 15 కిలోలు తగ్గా.. ఆ సీక్రెట్ మాత్రం చెప్పను: రకుల్ భర్త
‘డీఓజే ప్రతిపాదనలు పూర్తి ప్రతికూలం’
నానికి బిగ్ షాక్.. ఆన్లైన్లో హిట్ 3 హెచ్డీ ప్రింట్ లీక్!
Rajasthan: జైసల్మేర్‌లో పాక్ గూఢచారి అరెస్ట్
భారత్ భారీ వ్యూహం.. పాక్‌కు కోలుకోలేని దెబ్బ!
Summer Vacation వాయిద్యాలను పలికించడం ఆరోగ్యకరం
స్లిమ్‌గా బాలీవుడ్ చిత్ర నిర్మాత హన్సల్ మెహతా.. మౌంజారోతో పది కిలోలు..!
ఒడిశాలో నేపాల్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. హాస్టల్లో ఏం జరిగింది?
RR VS MI: చాలా తప్పులు చేశాం.. నిజాయితీగా ఒప్పుకున్న రాజస్థాన్ కెప్టెన్
13ఏళ్లకే హీరో, 15ఏళ్లకే టాలీవుడ్ స్టార్..ఒక్క యాక్సిడెంట్‌తో తెరమరుగు..
సూర్యవంశీపై గిల్ కామెంట్స్.. జడేజా కౌంటర్
ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
నా కొడుకును సంపేయండి
తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్
ఆ హీరోయిన్ల పేర్లు కలిసేలా విజయ్ (TVK) పార్టీ ఉంది: మంత్రి
మార్కెట్లోకి సరికొత్త హైటెక్ ఫ్యాన్: ధర ఎంతంటే?
IND vs ENG: ఇంగ్లండ్ టూర్‌కు వైభవ్ సూర్యవంశీ..
TG: హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు ఐపీఎస్‌లు
అందరి అనుమానం అదే.. NIA ప్రశ్నకు తడబడ్డ జిప్‌లైన్ ఆపరేటర్
Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
Smita Sabharwal: స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్
ఫెన్సింగ్ కింద పాక్కుంటూ వెళ్లి.. గుంతలో దాక్కుని
'ప్రవస్తి' నీకు నేను ఉన్నా.. మేము ఉన్నాం: గీతా మాధురి
‘ఎల్లమ్మ’ దొరకట్లేదు.. ఇప్పుడెలా?
చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ఈ స్కూటర్లపై రూ.40000 డిస్కౌంట్: అదే రోజు డెలివరీ..
వివాహేతర సంబంధం.. శైలజ నుంచి ఫోన్ వచ్చిందని..!
నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
నా కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తా..!
అక్షయ తృతీయ రోజు బంగారు నగలే కొనాలా?
ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో
మహేశ్ బాబు నయా లుక్.. ఎప్పుడు లేనంతగా
ప్రస్తుతం మన దగ్గర ఉన్నవి ఇవే సార్! క్షిపణుల బదులు 130 ఇవే బిగించాం!
బాలకృష్ణ విలన్‌ను ఎంపిక చేసుకున్న పూరీ జగన్నాథ్
ముక్కోణపు వన్డే సిరీస్.. టీమిండియా భారీ స్కోర్
1925లో బంగారం రేటు ఇంత తక్కువా?
‘ఛీ’నా రాజకీయం...
'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్
కొందరికే ‘భరోసా’
బంగారం భారీగా పడిపోతుంది!
మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని భావన యాదవ్
శ్రీకృష్ణ లీలలు
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
ఇంట్లో పాముల కలకలం
ఆర్మూరు–జగిత్యాల హైవేకు ఓకే
బ్రదర్ కేటీఆర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: వైఎస్ జగన్
హైదరాబాద్‌లో హై అలర్ట్
ఎంత పనైపాయే..! పిల్లిలా కనిపించాలని సర్జరీ చేయించుకుంటే చివరికి..
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
భారత్‌తో జాగ్రత్త.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హెచ్చరిక
నచ్చిన వారితో శృంగారం.. అజిత్‌పై నటి 'హీరా' సెన్సేషనల్ కామెంట్
వీళ్లు ఐదురూపాయలు బిచ్చమేశార్రా! దీంతో వైజాగ్‌లో ఐదెకరాల భూమి కొనేయవచ్చు... మనకూ ‘ఉర్సా’ లాంటి కంపెనీ ఉంటే!
'లాహోర్‌ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
RR VS GT: ఇది నా కల.. నాకు భయం లేదు: వైభవ్ సూర్యవంశీ
నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..
మూడో పంటగా సౌర విద్యుత్తు!
జాబ్ చేస్తానంటే ఇంట్లోకి రమ్మంటారు.. బాధ చెప్పుకున్న దీపిక
ప్రొటోకాల్ రగడ.. తుమ్మల సమక్షంలో అధికారులపై ఎమ్మెల్యే ఫైర్
బెల్లంకొండ హీరో దెయ్యం సినిమా.. గ్లింప్స్ రిలీజ్
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
ఈ ఐపీఎల్ సీజన్లో సెంచరీలు చేసిన నలుగురిలో ఓ 'కామన్ పాయింట్' ఉంది.. అదేంటి..?
భద్రత కోసం రూ.70 కోట్లు!.. సుందర్ పిచాయ్ జీతం ఎంతంటే?
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
3 నిమిషాలకో మరణం
సంధ్య థియేటర్ ఘటన.. బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్
ఉత్కంఠపోరు.. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
త్రివిధ దళాలకు ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్.. సైన్యమే స్థలం,టైం చూసి..
కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి..?
వామ్మో.. ఇదేం ట్రాఫిక్!
పాక్ నడ్డి విరిగేలా..
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
కొత్త రేషన్ కార్డు దేవుడెరుగు..!
‘ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్‌నే’
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రత్యేకం
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి
తండ్రికి బైక్‌ను బహుమతిగా ఇవ్వాలని బయలుదేరి..
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
అందంలోనే కాదు.. చదువులోనూ అదుర్స్
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
నీట్–2025కు పకడ్బందీ ఏర్పాట్లు
ఒకే ఇల్లు.. ఒకే వంట
మైక్రోసాఫ్ట్ సీఈవో, టెక్కీ తండ్రుల ఆవేదన ఫలితం..ఏఐ హెల్త్‌కేర్ రివల్యూషన్..!
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
‘పెగాసస్’పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
IPL 2025: ఒక్క విజయం.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ
మళ్లీ ఉగ్ర కాండ!
రెడ్ మిర్చిలా రెజీనా... విష్ణుప్రియ మౌంటైన్ ట్రిప్
ఏప్రిల్‌లో విడుదలైన టాప్ 10 మొబైల్స్
బాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు : వైఎస్ జగన్
చిన్నప్పటి నుంచి చదువులో టాప్
బ్యాంకులో క్యాష్ వేస్తున్నారా..? జాగ్రత్త!!
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరు
తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
పహల్గామ్ దాడి.. నా పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు: విజయ్ ఆంటోనీ క్లారిటీ!
మొక్కుబడిగా ఏసీ కొనవద్దు..
సల్మాన్ ‘సౌత్’ వ్యాఖ్యలపై స్పందించిన నాని!
ముష్కర మూకలకు ముచ్చెమటలు
చిరంజీవి స్ఫూర్తితోనే ప్రారంభించా.. అంతా తెలుగు వారి సహకారమే: సూర్య
నేచర్ క్యాంప్, ఫారెస్ట్ ట్రెకింగ్ అంటే ఇష్టమా..?
21 రోజుల్లో 15 కిలోలు తగ్గా.. ఆ సీక్రెట్ మాత్రం చెప్పను: రకుల్ భర్త
‘డీఓజే ప్రతిపాదనలు పూర్తి ప్రతికూలం’
నానికి బిగ్ షాక్.. ఆన్లైన్లో హిట్ 3 హెచ్డీ ప్రింట్ లీక్!
Rajasthan: జైసల్మేర్‌లో పాక్ గూఢచారి అరెస్ట్
భారత్ భారీ వ్యూహం.. పాక్‌కు కోలుకోలేని దెబ్బ!
Summer Vacation వాయిద్యాలను పలికించడం ఆరోగ్యకరం
స్లిమ్‌గా బాలీవుడ్ చిత్ర నిర్మాత హన్సల్ మెహతా.. మౌంజారోతో పది కిలోలు..!
ఒడిశాలో నేపాల్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. హాస్టల్లో ఏం జరిగింది?
RR VS MI: చాలా తప్పులు చేశాం.. నిజాయితీగా ఒప్పుకున్న రాజస్థాన్ కెప్టెన్
13ఏళ్లకే హీరో, 15ఏళ్లకే టాలీవుడ్ స్టార్..ఒక్క యాక్సిడెంట్‌తో తెరమరుగు..
సూర్యవంశీపై గిల్ కామెంట్స్.. జడేజా కౌంటర్
ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
నా కొడుకును సంపేయండి
తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్
ఆ హీరోయిన్ల పేర్లు కలిసేలా విజయ్ (TVK) పార్టీ ఉంది: మంత్రి
మార్కెట్లోకి సరికొత్త హైటెక్ ఫ్యాన్: ధర ఎంతంటే?
IND vs ENG: ఇంగ్లండ్ టూర్‌కు వైభవ్ సూర్యవంశీ..
TG: హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు ఐపీఎస్‌లు
అందరి అనుమానం అదే.. NIA ప్రశ్నకు తడబడ్డ జిప్‌లైన్ ఆపరేటర్
Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
Smita Sabharwal: స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్
ఫెన్సింగ్ కింద పాక్కుంటూ వెళ్లి.. గుంతలో దాక్కుని
'ప్రవస్తి' నీకు నేను ఉన్నా.. మేము ఉన్నాం: గీతా మాధురి
‘ఎల్లమ్మ’ దొరకట్లేదు.. ఇప్పుడెలా?
చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ఈ స్కూటర్లపై రూ.40000 డిస్కౌంట్: అదే రోజు డెలివరీ..
వివాహేతర సంబంధం.. శైలజ నుంచి ఫోన్ వచ్చిందని..!
నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
నా కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తా..!
అక్షయ తృతీయ రోజు బంగారు నగలే కొనాలా?
ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో
మహేశ్ బాబు నయా లుక్.. ఎప్పుడు లేనంతగా
ప్రస్తుతం మన దగ్గర ఉన్నవి ఇవే సార్! క్షిపణుల బదులు 130 ఇవే బిగించాం!
బాలకృష్ణ విలన్‌ను ఎంపిక చేసుకున్న పూరీ జగన్నాథ్
ముక్కోణపు వన్డే సిరీస్.. టీమిండియా భారీ స్కోర్
1925లో బంగారం రేటు ఇంత తక్కువా?
‘ఛీ’నా రాజకీయం...
'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్
కొందరికే ‘భరోసా’
బంగారం భారీగా పడిపోతుంది!
మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని భావన యాదవ్
శ్రీకృష్ణ లీలలు
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
ఇంట్లో పాముల కలకలం
ఆర్మూరు–జగిత్యాల హైవేకు ఓకే
బ్రదర్ కేటీఆర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: వైఎస్ జగన్
హైదరాబాద్‌లో హై అలర్ట్
ఎంత పనైపాయే..! పిల్లిలా కనిపించాలని సర్జరీ చేయించుకుంటే చివరికి..
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
భారత్‌తో జాగ్రత్త.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హెచ్చరిక
నచ్చిన వారితో శృంగారం.. అజిత్‌పై నటి 'హీరా' సెన్సేషనల్ కామెంట్
వీళ్లు ఐదురూపాయలు బిచ్చమేశార్రా! దీంతో వైజాగ్‌లో ఐదెకరాల భూమి కొనేయవచ్చు... మనకూ ‘ఉర్సా’ లాంటి కంపెనీ ఉంటే!
'లాహోర్‌ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
RR VS GT: ఇది నా కల.. నాకు భయం లేదు: వైభవ్ సూర్యవంశీ
నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..
మూడో పంటగా సౌర విద్యుత్తు!
జాబ్ చేస్తానంటే ఇంట్లోకి రమ్మంటారు.. బాధ చెప్పుకున్న దీపిక
ప్రొటోకాల్ రగడ.. తుమ్మల సమక్షంలో అధికారులపై ఎమ్మెల్యే ఫైర్
బెల్లంకొండ హీరో దెయ్యం సినిమా.. గ్లింప్స్ రిలీజ్
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
ఈ ఐపీఎల్ సీజన్లో సెంచరీలు చేసిన నలుగురిలో ఓ 'కామన్ పాయింట్' ఉంది.. అదేంటి..?
భద్రత కోసం రూ.70 కోట్లు!.. సుందర్ పిచాయ్ జీతం ఎంతంటే?
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
3 నిమిషాలకో మరణం
సంధ్య థియేటర్ ఘటన.. బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్
ఉత్కంఠపోరు.. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
త్రివిధ దళాలకు ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్.. సైన్యమే స్థలం,టైం చూసి..
కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి..?
వామ్మో.. ఇదేం ట్రాఫిక్!
పాక్ నడ్డి విరిగేలా..
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
కొత్త రేషన్ కార్డు దేవుడెరుగు..!
‘ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్‌నే’
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రత్యేకం
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి
తండ్రికి బైక్‌ను బహుమతిగా ఇవ్వాలని బయలుదేరి..
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
అందంలోనే కాదు.. చదువులోనూ అదుర్స్
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
నీట్–2025కు పకడ్బందీ ఏర్పాట్లు
ఒకే ఇల్లు.. ఒకే వంట
మైక్రోసాఫ్ట్ సీఈవో, టెక్కీ తండ్రుల ఆవేదన ఫలితం..ఏఐ హెల్త్‌కేర్ రివల్యూషన్..!
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
‘పెగాసస్’పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
IPL 2025: ఒక్క విజయం.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ
మళ్లీ ఉగ్ర కాండ!
రెడ్ మిర్చిలా రెజీనా... విష్ణుప్రియ మౌంటైన్ ట్రిప్
ఏప్రిల్‌లో విడుదలైన టాప్ 10 మొబైల్స్
బాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు : వైఎస్ జగన్
చిన్నప్పటి నుంచి చదువులో టాప్
బ్యాంకులో క్యాష్ వేస్తున్నారా..? జాగ్రత్త!!
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరు
తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
పహల్గామ్ దాడి.. నా పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు: విజయ్ ఆంటోనీ క్లారిటీ!
మొక్కుబడిగా ఏసీ కొనవద్దు..
సల్మాన్ ‘సౌత్’ వ్యాఖ్యలపై స్పందించిన నాని!
ముష్కర మూకలకు ముచ్చెమటలు
చిరంజీవి స్ఫూర్తితోనే ప్రారంభించా.. అంతా తెలుగు వారి సహకారమే: సూర్య
సినిమా

ప్రభాస్ సినిమాపై పుకార్లు.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
‘రాజాసాబ్’తర్వాత ప్రభాస్(Prabhas) నటించబోయే సినిమా ఏంటి? అనేదానిపై రకరకాల చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఈ సినిమా తర్వాత ప్రభాస్ స్పిరిట్(Spirit) సినిమా చేయాల్సింది. ఈ మేరకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పనులు కూడా ప్రారంభించారు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లాల్సింది. కానీ ప్రభాస్ మనసు మార్చుకున్నాడని, స్పిరిట్‌ని పక్కకు పెట్టి ప్రశాంత్ వర్మతో సినిమా చేయబోతున్నాడనే వార్త గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అలాగే సందీప్ రెడ్డి వంగా కూడా స్పిరిట్ కంటే ముందే ‘యానిమల్’ సీక్వెల్ చేయబోతున్నారనే వార్తలు కూడా వినిపించాయి. తాజాగా ఈ రూమర్స్‌పై స్పిరిట్ సినిమా నిర్మాత క్లారిటీ ఇచ్చారు. సందీప్‌రెడ్డి వంగా ‘స్పిరిట్’ చేసిన తర్వాతనే ‘యానిమల్ పార్క్’ తెరకెక్కిస్తాడని చెప్పాడు. మరో రెండు మూడు నెలల్లో ‘స్పిరిట్’ షూటింగ్ ప్రారంభం కానుందన్నారు. 2027లో ఈ చిత్రం విడుదల చేస్తామని ప్రకటించారు. భూషన్ కుమార్ ప్రకటనతో ప్రభాస్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.కాగా, ప్రభాస్ ప్రస్తుతం ఇటలీలో టూర్లో ఉన్నాడు. తిరిగి ఇండియాకు వచ్చిన తర్వాత రాజాసాబ్ షూటింగ్లో పాల్గొంటారు. ఆ తర్వాత భూషన్ చెప్పినట్లుగా స్పిరిట్ చేస్తారు. సందీప్ కోరిక మేరకు ఈ సినిమా కోసం ప్రభాస్ వరుసగా 65 రోజుల కాల్షీట్స్ ఇచ్చారట.ఈ మూవీ తర్వాత హనురాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’(ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్లో కూడా పాల్గొనే అవకాశం ఉంది. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం స్పిరిట్, పౌజీతో పాటు ప్రశాంత్ వర్మ సినిమా కూడా ఉంది. అలాగే ప్రశాంత్ నీల్‌తో సలార్ 2, నాగ్ అశ్విన్‌తో ‘కల్కి 2’ చేయాల్సి ఉంది.

'క' చిత్రానికి దక్కిన 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డ్
టాలీవుడ్ నటుడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా నటించిన‘క’ (KA) సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీ వేదికగా జరిగిన ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’(Dada Saheb Phalke Film Festival)లో ఉత్తమ చిత్రంగా 'క' అవార్డు దక్కించుకుంది. ఒక తెలుగు సినిమాకు ఈ అవార్డ్ రావడంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. కొత్త దర్శకులు సుజిత్, సందీప్ సంయుక్తంగా ఈ మూవీని తెరకెక్కించారు. గతేడాదిలో వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు.పీరియాడికల్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంగా 'క' ప్రేక్షకులను అలరించింది. పార్ట్ 1 విజయం సాధించడంతో పార్ట్ 2ను మరింత ఉత్కంఠగా తెరకెక్కిస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. 'క' చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీ నుంచి ఓటీటీలోకి వచ్చిన ఫస్ట్ తెలుగు సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. సైకలాజికల్ సస్పెన్స్‌తో మెప్పించిన ఈ చిత్రానికి భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు. చూడని వారు ఉంటే అమెజాన్ ప్రైమ్‌లో కూడా ఈ క చిత్రాన్ని చూడొచ్చు.‘క’ కథేంటంటే..ఈ సినిమా కథంతా 1977లో జరుగుతుంది. అభినయ వాసుదేవ్(కిరణ్ అబ్బవరం) అనాథ. చిన్నప్పటి నుంచి పక్కవాళ్ల ఉత్తరాలు చదివే అలవాటు ఉంటుంది. తన వయసుతో పాటు ఈ అలవాటు కూడా పెరుగుతూ వస్తుంది. పోస్ట్ మ్యాన్ అయితే అన్ని ఉత్తరాలు చదువొచ్చు అనే ఆశతో ఆ ఉద్యోగంలో చేరుతాడు. జాబ్ కోసం రామ్(పెంపుడు కుక్క)తో కలిసి కృష్ణగిరి అనే గ్రామానికి వెళ్తాడు. అక్కడ పోస్ట్ మాస్టర్ రామారావు(అచ్చుత్ కుమార్) అనుమతితో పోస్ట్ మ్యాన్ అసిస్టెంట్‌గా జాయిన్ అవుతాడు. అదే గ్రామంలో ఉంటూ..రామారావు గారి అమ్మాయి సత్యభామ(నయని సారిక)తో ప్రేమలో పడతాడు.అనాథ అయిన వాసుదేవ్‌కి ఆ ఊరి ప్రజలే తన కుటుంబంగా బతుకుతుంటాడు. అయితే ఆ గ్రామంలో వరుసగా అమ్మాయిలు మిస్ అవుతుంటారు. వారిని కిడ్నాప్ చేసేదెవరు? కృష్ణగిరి గ్రామానికి చెందిన అమ్మాయిలే ఎందుకు మిస్ అవుతున్నారు? ఉత్తరాలు చదివే అలవాటు ఉన్న వాసుదేవ్‌కి తెలిసిన నిజమేంటి? వాసుదేవ్ ను ఓ ముసుగు వ్యక్తి, అతని గ్యాంగ్ ఎందుకు వెంటాడుతున్నారు ? లాలా, అబిద్ షేక్ ఎవరు? వారికి ఈ కథతో ఉన్న సంబంధం ఏంటి? చీకటి గదిలో బంధించిబడిన రాధ( తన్వి రామ్) ఎవరు? ఆమెకు వాసుదేవ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఆ యాక్సిడెంట్ నా జీవితంలో పెద్ద గిఫ్ట్ : అల్లు అర్జున్
ప్రమాదం జరిగితే కష్టం, నష్టమే. కానీ, అనుకోకుండా కొన్ని ప్రమాదాలు మంచి కూడా చేస్తాయి. ప్రముఖ హీరో అల్లు అర్జున్(Allu Arjun) స్వయంగా ఈ మాట అంటున్నారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న ‘వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్)(WAVES 2025)లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ– ‘‘కెరీర్ తొలి రోజుల్లో నా దృష్టి అంతా ఫిజికల్ ఫిట్నెస్, ఎజిలిటీ మీదే ఉండేది. కానీ, జీవితంలో ఒక ఘటన నా ఆలోచననే మార్చేసింది. నా పదో సినిమా తర్వాత నా భుజానికి దెబ్బ తగిలి, ఆస్ట్రేలియాలో సర్జరీ చేయించుకున్నా. అంతా బాగైపోయి, నాలుగో వారం నుంచి సెట్స్ మీదకు వెళ్ళిపోవచ్చనుకున్నా. డాక్టర్లు 6 నెలలు రెస్ట్ తప్పనిసరి అన్నారు. నాకు కొత్తగా పెళ్ళయింది. ఓ సినిమా సగంలో ఉంది. అప్పటి దాకా ఫిజికల్ ఫిట్‌నెస్‌కే ప్రాధాన్యం ఇస్తూ వచ్చిన నాకు ఒక్కసారిగా జ్ఞానోదయం అయింది.వయసు పెరిగే కొద్దీ ఫిట్నెస్, ఎజిలిటీ తగ్గుతాయి. కానీ, నటనపై దృష్టి పెడితే అది చిరకాలం మిగిలిపోతుందని గ్రహించా. అక్కడి నుంచి నా ఆలోచనే మారిపోయింది’’ అని వివరించారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘పదో సినిమా దగ్గర మొదలైన ఆ ఆలోచన ఇరవయ్యో సినిమా ‘పుష్ప–1’ దగ్గరకు వచ్చేసరి కల్లా నన్ను జాతీయ ఉత్తమ నటుడిగా, అందులోనూ తెలుగు సినీరంగం నుంచి ఆ ఘనత అందుకున్న తొట్ట తొలి నటుడిగా నిలిపింది. పదో సినిమా సమయంలో ఆ యాక్సిడెంట్ జరగకపోతే... నా దృక్పథం ఇలా మారేది కాదు.అందుకే, కొన్ని యాక్సిడెంట్లు అనుకోకుండా మన మంచికే జరుగుతాయి. మొత్తం నా ఆలోచనలు, కెరీర్‌నే మార్చేసిన ఆ యాక్సిడెంట్ నా జీవితంలో పెద్ద గిఫ్ట్’’ అని అల్లు అర్జున్ వివరించారు. ‘సాక్షి’ ఆయనను పలకరించినప్పుడు ‘‘మెడిసిన్, టెక్నాలజీ లాంటి అనేక రంగాలలో చాలా కాలంగా జరుగుతున్న సమ్మిట్లు చూసి, అలాంటివి మన సినీ, వినోద రంగంలో కూడా జరగాలనుకున్నాను. ప్రధాని మోదీ చొరవతో తొలిసారిగా వేవ్స్ సదస్సు జరగడం శుభారంభం’’ అన్నారు.

వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి 'మెగా' గుడ్‌న్యూస్..?
మెగాకపుల్ వరుణ్ తేజ్(Varun Tej)-లావణ్య త్రిపాఠి శుభవార్త చెప్పబోతున్నారని తెలుస్తోంది. ఈమేరకు సోషల్‌మీడియాలో పలు కథనాలు వైరల్ అవుతున్నాయి. ఈ దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నట్లు సమాచారం. మెగా ఇంటికి వారసుడు రాబోతున్నాడు అంటూ అభిమానులు కూడా పోస్టులు పెడుతున్నారు. 2023లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట మొదటి బిడ్డను ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నట్లు నెట్టింట వైరల్ అవుతుంది.పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi) మళ్లీ షూటింగ్స్‌లలో పాల్గొంటూ వచ్చారు. ఈ క్రమంలోనే ఒక వెబ్ సిరీస్‌ను ఆమె విడుదల చేశారు. ఆపై సతీ లీలావతితో పాటు కోలీవుడ్ మూవీ థనల్‌ను ఆమె పూర్తి చేశారు. అయితే, ఈ రెండు ప్రాజెక్ట్‌లను పూర్తి చేసిన తర్వాత ఆమె మళ్లీ కాస్త బ్రేక్ ఇచ్చారు. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాలని ఆమె భావించారని తెలుస్తోంది. దీనికి కారణం ఆమె ప్రెగ్నెన్సీ అని అందుకే ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్‌లను ఒప్పకోవడం లేదని టాక్. అయితే, ఈ విషయంపై వారి నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.వాస్తవానికి 2017లో వరుణ్, లావణ్యల మధ్య స్నేహం ఏర్పడింది. వీరిద్దరు కలిసి అప్పుడు ‘మిస్టర్’ అనే సినిమాలో నటించారు. ఆ సమయంలోనే వరుణ్, లావణ్య త్రిపాఠి క్లోజ్ అయ్యారు. మొదట్లో స్నేహం.. ఆ తర్వాత అది ప్రేమగా మార్చుకొని డేటింగ్ వరకు వెళ్లారు. కానీ ఈ విషయం బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా పర్సనల్ లైఫ్‌ని ఎంజాయ్ చేశారు. సరిగ్గా పెళ్లికి కొద్దిరోజులు ముందు వారి ప్రేమ విషయాన్ని అందరికీ తెలిపారు. అలా వరుణ్, లావణ్యల పెళ్లి ఇటలీలో జరగగా.. హైదరాబాద్‌లో రిసెప్షన్ ఘనంగా జరిగింది.
న్యూస్ పాడ్‌కాస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల కంచం లాగేసిన చంద్రబాబు... ప్రతి ఇంటినీ మోసం చేశారు... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం

దేశవ్యాప్తంగా జనగణనతో పాటే కులగణన... కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో అంతులేని అవినీతి, అంతా అరాచకమే... చంద్రబాబు కూటమి ప్రభుత్వ పాలనపై వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం

ఏపీలో కేంద్ర సంస్థలకైతే కోట్లు.. ఉర్సా సంస్థకైతే ఊరకే!

పాక్ కాల్పుల పోరు.. బదులిచ్చిన భారత బలగాలు.

ఏపీ రాజధానిలో దోపిడీ ఐకానిక్.. 5 టవర్ల నిర్మాణ వ్యయం పెంపు

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు.. తీవ్రస్థాయికి ఉద్రిక్తతలు

పాకిస్తాన్‌కు భారత్ పంచ్. పహల్గాం దాడిపై కేంద్రం సీరియస్. దౌత్య సంబంధాలకు కత్తెర. సింధూ ఒప్పందం సస్పెన్షన్. ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్న భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ

జమ్మూకశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి... కాల్పులకు 26 మంది బలి, మరో 20 మందికి పైగా గాయాలు.. మృతుల్లో ఇద్దరు విదేశీయులు
క్రీడలు

SRH Vs GT: సన్‌రైజర్స్‌కు కౌంట్‌డౌన్...
అహ్మదాబాద్: సీజన్లో ఐదు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి...అన్నీ గెలిస్తే ఎలాంటి ఇబ్బందీ లేకుండా ప్లే ఆఫ్స్‌కు చేరవచ్చు. నాలుగు గెలిస్తే వేర్వేరు సమీకరణాలు, ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఆశలు పెట్టుకోవచ్చు... ఐపీఎల్–2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తాజా పరిస్థితి ఇది. పూర్తిగా దారులు మూసుకుపోకుండా రేసులో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో నేడు హైదరాబాద్ బరిలోకి దిగుతోంది. గుజరాత్ టైటాన్స్‌ను వారి సొంతగడ్డపై సన్‌రైజర్స్ ఎదుర్కొంటుంది. ఇరు జట్ల మధ్య ఉప్పల్‌లో జరిగిన గత మ్యాచ్‌లో టైటాన్స్ 7 వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించింది. నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ సీజన్లో జరిగిన ఎనిమిది ఇన్నింగ్స్‌లలో ఐదుసార్లు 200 పరుగులకంటే ఎక్కువ స్కోర్లు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో కూడా భారీ స్కోరుకు అవకాశం ఉంది. శుక్రవారం దాదాపు 42 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య ఆటగాళ్లు పోరాడాల్సి రావచ్చు. సమష్టిగా రాణిస్తేనే... గత ఏడాదితో పోలిస్తే ఈసారి సన్‌రైజర్స్ బ్యాటింగ్ చాలా వరకు విఫలమైంది. అక్కడక్కడ కొన్ని మెరుపులు కనిపించినా ఓవరాల్‌గా ఆశించిన ప్రదర్శన రాలేదు. అయితే ఇప్పటికీ జట్టు విజయావకాశాలు ముగ్గురు బ్యాటర్లు హెడ్, అభిషేక్, క్లాసెన్లపైనే ఆధారపడి ఉన్నాయి. వీరు బాగా ఆడినప్పుడు మాత్రమే టీమ్‌కు సానుకూల ఫలితం వచి్చంది. ఓపెనర్లుగా హెడ్, అభిషేక్ ఈ సీజన్లో ఓవర్‌కు 10.89 రన్‌రేట్‌తో 316 పరుగులు జోడించారు. మరోసారి వీరిద్దరు సత్తా చాటాల్సి ఉంది. మిడిలార్డర్లో 156.52 స్ట్రయిక్ రేట్‌తో క్లాసెన్ ధాటిని చూపిస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో సెంచరీ తర్వాత వరుసగా విఫలమై గత మ్యాచ్‌లో రాణించిన ఇషాన్ కిషన్ అదే జోరును కొనసాగించాల్సి ఉంది. మరీ పేలవంగా ఆడుతున్న నితీశ్ కుమార్ రెడ్డి ఈ సారైనా దూకుడును ప్రదర్శిస్తాడా చూడాలి. బౌలింగ్‌లో హైదరాబాద్ పరిస్థితి ఏమాత్రం గొప్పగా లేదు. హర్షల్ పటేల్ 13 వికెట్లు తీసినా అందులో లోయర్ ఆర్డర్‌వే ఎక్కువగా ఉన్నాయి. కమిన్స్, షమీ, మలింగ పూర్తిగా విఫలమయ్యారు. స్పిన్నర్లు అన్సారీ, కమిందు మాత్రమే కాస్త ఫర్వాలేదనిపిస్తున్నారు. ఇలాంటి స్థితిలో ప్రత్యర్థి వేదికపై విజయం దక్కాలంటే సన్‌రైజర్స్ రెట్టింపు శ్రమించాల్సి ఉంటుంది. చెన్నైపై విజయం సాధించిన తర్వాత విహారయాత్రకు వెళ్లి కొత్త ఉత్సాహంతో తిరిగొచి్చన ఆటగాళ్లు మైదానంలో ఎలా చెలరేగుతారనేది ఆసక్తికరం. సొంతగడ్డపై ఉత్సాహంగా...రాజస్తాన్‌తో ఆడిన గత మ్యాచ్‌లో 209 పరుగులు చేసిన కూడా వైభవ్ సూర్యవంశీ దెబ్బకు గుజరాత్ అనూహ్యంగా ఓటమి పాలైంది. అయితే సీజన్లో ఇప్పటి వరకు టీమ్ నిలకడైన ప్రదర్శనను కనబరుస్తోంది. చక్కటి ఓపెనింగ్ భాగస్వామ్యంతో సాయిసుదర్శన్ (456 పరుగులు), శుబ్‌మన్ గిల్ (389) శుభారంభాలు అందిస్తుండగా, మూడో స్థానంలో బట్లర్ (406) చెలరేగిపోతున్నాడు. ఈ ముగ్గురితో పాటు చివర్లో రూథర్‌ఫర్డ్ కూడా 150కి పైగా స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించడం విశేషం. టాప్–3 కలిసి ఈ సీజన్లో 13 అర్ధ సెంచరీలు నమోదు చేయడం విశేషం. వీరు తమ ఫామ్‌ను కొనసాగిస్తే సన్‌రైజర్స్‌కు ఇబ్బందులు తప్పకపోవచ్చు. బౌలింగ్ విభాగంలోనూ టైటాన్స్ పటిష్టంగా ఉంది. ప్రసిధ్ కృష్ణ (17 వికెట్లు), సాయికిషోర్ (12), సిరాజ్ (12) ప్రత్యర్థి బ్యాటర్లను నిలువరించడంలో సఫలమయ్యారు. లెగ్‌స్పిన్నర్ రషీద్ ఖాన్ పెద్ద సంఖ్యలో వికెట్లు తీయలేకపోయినా... భారీ స్కోర్లు నమోదవుతున్న ఈ సీజన్లో 9కంటే తక్కువ ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. ఈ మైదానంలో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో గుజరాత్ మూడు విజయాలు సాధించింది.

లార్డ్స్‌లో మరో ఫైనల్
దుబాయ్: సుప్రసిద్ధ క్రికెట్ మైదానం ‘లార్డ్స్’ మరో విశ్వవిజేతను తేల్చనుంది. వచ్చే ఏడాది జరిగే మహిళల టి20 ప్రపంచకప్ ఫైనల్ లార్డ్స్‌లో జరుగుతుందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గురువారం ప్రకటించింది. 12 జట్లు పాల్గొనే మహిళల మెగా ఈవెంట్ వచ్చే ఏడాది జూన్ 12న మొదలై జూలై 5వ తేదీన జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. టోర్నీలో మొత్తం 33 మ్యాచ్‌లు జరుగుతాయి. ఓల్డ్ ట్రాఫోర్డ్, హెడింగ్లీ, ఎడ్జ్‌బాస్టన్, ద ఓవల్, హ్యాంప్‌షైర్ బౌల్, బ్రిస్టల్ కౌంటీ ఇలా ఆరు వేదికల్లో లీగ్, సహా సెమీఫైనల్స్ మ్యాచ్‌లు జరుగుతాయి. కానీ గ్రాండ్ ఫైనల్ మాత్రం విఖ్యాత లార్డ్స్ మైదానంలో జరుగుతుందని ఐసీసీ వెల్లడించింది. 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించి మ్యాచ్‌లను నిర్వహిస్తారు. పూర్తి షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తామని ఐసీసీ తెలిపింది. క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే ఇంగ్లండ్‌లో ప్రేక్షకులు ప్రపంచకప్‌కు బ్రహ్మరథం పడతారని ఐసీసీ చైర్మన్ జై షా తెలిపారు. ‘ఉత్కంఠ భరితంగా సాగిన 2017 మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ నాకు ఇంకా గుర్తుంది. మెరుపుల టి20 మెగా ఈవెంట్ మరింత ఆసక్తిగా సాగుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మేం ఇక టోర్నీ ఏర్పాట్లపై నిమగ్నమవుతాం. రోమాంఛకరమైన క్రికెట్ ఆట లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ (2028)లో మరో దశకు చేరుతుంది’ అని అన్నారు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గౌల్ మాట్లాడుతూ మొత్తం ఏడు వేదికల్లో మహిళల టి20 ప్రపంచకప్ మ్యాచ్‌లు నిర్వహిస్తామని చెప్పారు. ఈ టోర్నీలో భారత్, మాజీ చాంపియన్ ఆ్రస్టేలియా, డిఫెండింగ్ చాంపియన్ న్యూజిలాండ్, ఆతిథ్య ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్తాన్, శ్రీలంక ఈ ఎనిమిది జట్లు ఇదివరకే అర్హత సంపాదించాయి. మిగతా నాలుగు జట్లు మాత్రం ఈ ఏడాది జరిగే ప్రపంచకప్ క్వాలిఫయర్స్ ద్వారా అర్హత సాధిస్తాయి. లార్డ్స్‌లో 2017లో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత్ రన్నరప్‌గా నిలిచింది. ఆతిథ్య ఇంగ్లండ్‌పై గెలిచే స్థితిలో కనిపించిన మిథాలీ రాజ్ బృందం అనూహ్యంగా 9 పరుగుల తేడాతో ప్రపంచకప్‌ను చేజార్చుకుంది. పురుషుల క్రికెట్ స్థాయి ఉత్కంఠకు ఏమాత్రం తీసిపోని ఈ ఫైనల్‌కు రికార్డు స్థాయిలో టీవీ ప్రేక్షకులు తిలకించారు. అప్పటి నుంచి అమ్మాయిల క్రికెట్‌పై ఆసక్తి క్రమంగా పెరుగుతూ వచ్చింది. మెల్బోర్న్లో భారత్, ఆ్రస్టేలియాల మధ్య 2020లో జరిగిన టి20 ప్రపంచకప్ ఫైనల్‌ను 86,174 మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా తిలకించారు. తదనంతరం కేప్‌టౌన్ (2023), దుబాయ్ (2024)లలో జరిగిన మెగా ఈవెంట్లకు టికెట్లన్నీ ముందస్తుగానే ‘సోల్డ్ అవుట్’ అయ్యాయి.

మ్యాచ్ రిఫరీ అంటే ఆషామాషీ కాదు!
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు రిఫరీగా వ్యవహరించడం కుర్చీలో కూర్చున్నంత సులువు కాదని, సవాళ్లు ఎదుర్కొన్న సందర్భాలెన్నో ఉన్నాయని ఇటీవలే రిటైరైన మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ అన్నారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో తన 14 ఏళ్ల కెరీర్లో బాల్ టాంపరింగ్, భద్రతా సవాళ్లు క్లిష్టమైనవని చెప్పుకొచ్చారు. ఆ్రస్టేలియాకు చెందిన మాజీ ఓపెనర్, 64 ఏళ్ల బూన్ పురుషుల క్రికెట్లో 87 టెస్టులు, 183 వన్డేలు, 112 టి20లకు... మహిళల క్రికెట్లో ఏడు టి20లకు మ్యాచ్ రిఫరీగా వ్యవహరించారు. అచ్చం క్రికెటర్లలాగానే కెరీర్‌కు టాటా చెప్పినా... కోచ్, మెంటార్లుగా ఆటతో అనుబంధాన్ని కొనసాగించినట్లే, ఈ వెటరన్ ఆస్ట్రేలియన్ కూడా రిఫరీగా రిటైర్మెంట్ ప్రకటించినా క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) డైరెక్టర్‌గా బంధాన్ని కొనసాగించనున్నారు. ‘రిఫరీ పనంటే అంతా సులువు కాదు. క్లిష్ట పరిస్థితులు, సవాళ్లు మాకు ఎదురవుతాయి. చాలా సార్లు బాల్ టాంపరింగ్‌పై వచ్చిన ఫిర్యాదులు, పరిష్కరించడంలో పడిన ఇబ్బందులు ఎన్నో ఉంటాయి. ఢాకా (బంగ్లాదేశ్), క్రైస్ట్‌చర్చ్ (న్యూజిలాండ్) వేదికల్లో జరిగిన మ్యాచ్‌కు సరిగ్గా ఇలాంటి కఠిన పరిస్థితుల్నే ఎదర్కొన్నాను. కొన్ని చోట్ల భద్రతా సవాళ్లు తప్పలేదు. ఏదేమైనా... బిజీ క్రికెట్ పెరిగినా... జెంటిల్మెన్ క్రికెట్ స్థాయి పెంచేందుకే రిఫరీ నిర్ణయాలుంటాయి. 14 ఏళ్ల రిఫరీ కెరీర్లో సాఫల్యాలు చూసుకుంటే సంతోషంగా ఉంటుంది’ అని 396 మ్యాచ్‌లకు రిఫరీగా వ్యవహరించిన బూన్ వివరించారు. జింబాబ్వే, బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌తో ఆయన కెరీర్‌కు వీడ్కోలు పలికారు. ఆట ప్రతిష్టను పెంచుతూనే సుదీర్ఘ సేవలందించిన బూన్‌ను ఐసీసీ చైర్మన్ జై షా ప్రశంసిస్తూ ఆయన సేవల్ని కొనియాడారు. రిఫరీ కాకముందు క్రికెటర్‌గా బూన్ ఆ్రస్టేలియా తరఫున 107 టెస్టులు ఆడి 7422 పరుగులు, 181 వన్డేలు ఆడి 5964 పరుగులు సాధించారు.

‘ఖేల్‌రత్న’ అందుకున్న సాత్విక్–చిరాగ్
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ఎట్టకేలకు జాతీయ అత్యున్నత క్రీడా పురస్కారం ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’ను స్వీకరించారు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం ఈ అవార్డును వీరిద్దరికి అందజేశారు. 2023 ఏడాదికిగాను ప్రకటించిన ఈ అవార్డును సాత్విక్–చిరాగ్ తీసుకోవడంలో చాలా ఆలస్యమైంది. రాష్ట్రపతి భవన్లో అధికారికంగా నిర్వహించిన కార్యక్రమ సమయంలో మరో చోట టోర్నీలు ఆడుతున్న ఈ డబుల్స్ జోడీ గైర్హాజరైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అందుకోవడానికి సిద్ధమైన తరుణంలో సాత్విక్ తండ్రి కాశీవిశ్వనాథ్ అనూహ్య మృతితో అవార్డు కార్యక్రమం వాయిదా పడింది. ‘ఈ ఇద్దరు షట్లర్ల అత్యుత్తమ ప్రదర్శన, అంకితభావానికి దక్కిన గౌరవమిది. భవిష్యత్తులో వీరు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా’ అంటూ మాండవీయ ట్వీట్ చేశారు. ‘ఎట్టకేలకు అవార్డును అందుకున్నాం. మేమిద్దరం జోడీగా మారిన సమయం నుంచి ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తూ అండగా నిలిచింది. మా విజయాల్లో వారి సహకారం ఎంతో ఉంది. గత కొద్ది రోజులుగా మేం ఆశించిన ప్రదర్శన ఇవ్వలేదు. అయితే ఇప్పుడు మళ్లీ చెలరేగి కొత్త విజయాలు సాధించేందుకు ఈ అవార్డు మాకు ప్రేరణనిస్తుంది’ అని సాత్విక్–చిరాగ్ చెప్పారు. గత కొన్నేళ్లుగా ప్రపంచ బ్యాడ్మింటన్‌లో సాత్విక్–చిరాగ్ అగ్రశ్రేణి జోడీగా ఎదిగారు. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో 3 స్వర్ణాలు, 3 రజతాలు గెలుచుకున్న ఈ జంట 2022 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించింది. ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ స్థానానికి చేరిన తొలి భారత జోడీగా నిలవడంతో పాటు టీమ్ ఈవెంట్ థామస్ కప్‌ను భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది. అనారోగ్య కారణాలతో ప్రస్తుతం జరుగుతున్న సుదిర్మన్ కప్ నుంచి వీరిద్దరు తప్పుకున్నారు.
బిజినెస్

రూ.5,830 కోట్ల ప్రాజెక్ట్‌ను నిలిపేసిన జోహో
సెమీ కండక్టర్ తయారీలో సంక్లిష్టమైన ఫ్యాబ్రికేషన్ ప్రక్రియలకు సాంకేతిక భాగస్వామిని పొందడంలో ఇబ్బందులు పడుతున్నట్లు జోహో తెలిపింది. ఈ కారణంగా 700 మిలియన్ డాలర్ల(సుమారు రూ.5,830 కోట్లు) చిప్ తయారీ ప్రణాళికలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా నిలదొక్కుకోవాలన్న భారత్ ఆకాంక్షలకు ఇలాంటి సంఘటనలు సవాలుగా మారుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.టెక్నాలజీ భాగస్వామిని కనుగొనడంలో సవాళ్లుసెమీకండక్టర్ తయారీలోకి ప్రవేశించడానికి, మార్గనిర్దేశం చేయడానికి జోహో వ్యూహాత్మక భాగస్వామి కోసం అన్వేషిస్తోంది. ఈమేరకు కంపెనీ విస్తృతమైన ప్రయత్నాలు చేసినప్పటికీ తగిన పార్ట్నర్ను కనుగొనలేకపోయినట్లు సంస్థ తెలిపింది. సెమీకండక్టర్ పరిశ్రమకు అత్యంత ప్రత్యేకమైన నైపుణ్యం అవసరమని భావిస్తోంది. నమ్మకమైన భాగస్వామి లేకపోవడంతో చిప్ తయారీ ప్రణాళికలను నిలిపివేయాలని నిర్ణయించింది.ముందుగా కర్ణాటకలో సెమీకండక్టర్ ఫెసిలిటీలో 400 మిలియన్ డాలర్లు(సుమారు రూ.3,332 కోట్లు) పెట్టుబడి పెట్టాలని కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇది 460 మందికి ఉపాధి సృష్టిస్తుందని, రాష్ట్రంలో మొదటి చిప్ తయారీ ప్రాజెక్టుగా మారుతుందని భావిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం 2024 డిసెంబర్లో ఈ ప్రాజెక్ట్‌కు అనుమతులు కూడా ఇచ్చింది. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టును నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.ఇదీ చదవండి: బంగారమా..? మాకొద్దు బాబోయ్..!భారత్ లక్ష్యాలపై ప్రభావం..?సెమీకండక్టర్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, ప్రపంచ చిప్ పరిశ్రమలో కీలక పాత్ర పోషించేందుకు భారత్ కృషి చేస్తోంది. పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం బిలియన్ల విలువైన ప్రోత్సాహక పథకాలను ప్రవేశపెట్టింది. కానీ జోహో ఎదుర్కొంటున్న సవాళ్లు దేశీయ సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను స్థాపించడంలో నిర్మాణాత్మక అడ్డంకులను హైలైట్ చేస్తున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని చిప్ తయారీకి ముందుకువస్తున్న కంపెనీలకు అవి ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు చూపేలా ప్రభుత్వాలు ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు.

‘మన టాలెంట్ పోతోంది’.. సీఈవో వార్నింగ్
స్టార్టప్ బూమ్‌లో భారత్ దూసుకుపోతున్నప్పటికీ, యూపీఐ వంటి ఫిన్‌టెక్ విజయగాథలు మనకు ఉన్నప్పటికీ వాస్తవ పరిస్థితిని సమీక్షించుకోవాల్సిన అవసరముందని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు అభిప్రాయపడ్డారు. ప్రత్యేకించి దేశంలోని ఉత్తమ సాంకేతిక మేధావులు విదేశాలకు వెళ్లకుండా ఉండాలంటే దేశానికి తీవ్రమైన రియాలిటీ చెక్ అవసరమని చెప్పారు.ఈ మేరకు ‘ఎక్స్’లో ఆయన ఒక వివరమైన పోస్ట్ పెట్టారు. భారత ఇన్నోవేషన్ సామర్థ్యాలను నాలుగు కేటగిరీలుగా విశదీకరించారు. ఒక్కో అంశానికి మార్కులు సైతం ఇచ్చారు. దేశంలో ప్రైవేట్ రంగం ధృడంగా వ్యవహరించాలని, స్వదేశంలో నిజమైన ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని సూచించారు. విమానయాన సంస్థలు, బ్యాంకింగ్, రిటైల్ వంటి ప్రాసెస్ ఆధారిత రంగాల్లో భారత్ ప్రకాశిస్తున్నప్పటికీ, ప్రపంచ స్థాయి ఉత్పత్తులు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సృష్టించడంలో వెనుకబడి ఉందని, మన టాలెంట్ (ప్రతిభావంతులు) విదేశాలకు వెళ్లిపోతోందని శ్రీధర్ వెంబు హెచ్చరించారు.ప్రాసెస్ ఇన్నోవేషన్ లో భారత్ 70 శాతం మంచి స్కోర్ సాధిస్తుందని వెంబు అన్నారు. కానీ ప్రొడక్ట్ ఇన్నోవేషన్ విషయషంలో మాత్రం కేవలం 35% మాత్రమే రేటింగ్ ఇచ్చారు. ఇది ఆశాజనకంగా ఉండవచ్చంటూ యూపీఐ ఆవిష్కరణను ఉదహరించారు. దేశానికి సమర్థవంతమైన ప్రాజెక్ట్ మేనేజర్లు మాత్రమే కాకుండా మరింత దూరదృష్టి కలిగిన ఉత్పత్తి సృష్టికర్తలు అవసరమని నొక్కి చెప్పారు.ఇక టెక్నాలజీ విషయంలో శ్రీధర్ వెంబు అసలు స్కోరే ఇవ్వలేదు. అంతటితో ఆగకుండా తీవ్రమైన ఆందోళన వెలిబుచ్చారు. భారతదేశపు టాప్ టెక్ టాలెంట్ ను విదేశీ సంస్థలు తీసేసుకుంటున్నాయని, టెక్ టాలెంట్‌ను నిలుపుకోవడం, వెనక్కి తీసుకురావడం కోసం దేశ ప్రైవేటు రంగం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అందు కోసం ఇక్కడ ప్రతిష్టాత్మక అవకాశాలను సృష్టించాల్సిన అవసరం ఉందని సూచించారు.సైంటిఫిక్ పురోగతుల కేటగిరీకి స్కోర్ ఇవ్వడానికి ఈ విషయంలో "మనం కనీసం పరీక్ష కూడా రాయలేదు" అంటూ కఠువుగా వ్యాఖ్యానించారు. ఉత్పత్తులు, సాంకేతిక రంగాల్లో ప్రైవేటు సంస్థలు ముందంజలో ఉండాలని, డీప్ సైన్స్ కు ప్రభుత్వ నిధులు అవసరమని ఆయన అన్నారు. 20వ శతాబ్దపు అనేక ఆవిష్కరణలకు నాంది పలికిన ప్రఖ్యాత అమెరికన్ రీసెర్చ్ హబ్ బెల్ ల్యాబ్స్ వంటిది భారత్‌లోనూ రావాల్సిన అవసరం ఉందన్నారు.

కాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు 20 వేల కొలువులు
అమెరికన్ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ ఈ ఏడాది సుమారు 20,000 మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకునే యోచనలో ఉంది. ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, మేనేజ్డ్ సర్వీసెస్ విభాగాల్లో ఈ కొలువులు ఉండనున్నాయి. ప్రస్తుతం కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,36,300గా ఉంది.‘ఇన్వెస్టర్ డే సందర్భంగా చెప్పినట్లు మా వ్యూహంలో భాగంగా 20,000 మంది ఫ్రెషర్లను తీసుకోబోతున్నాం. గతేడాదితో పోలిస్తే ఇది రెట్టింపు‘ అని కంపెనీ సీఈవో ఎస్ రవి కుమార్ తెలిపారు. ఫ్రెషర్లను తీసుకోవడం, ఏఐ ద్వారా ఉత్పాదకతను పెంచుకోవడం, మానవ వనరుల వ్యయాలను తగ్గించుకునేలా సామర్థ్యాల వినియోగాన్ని మెరుగుపర్చుకోవడం వంటి మూడు అంశాలపై కంపెనీ ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు వివరించారు.ఈ ఏడాది జనవరి–మార్చ్ త్రైమాసికంలో కాగ్నిజెంట్ ఆదాయం సుమారు 7 శాతం పెరిగి 5.1 బిలియన్ డాలర్లకు చేరింది. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో టాప్ ఐదు ఐటీ కంపెనీలు మొత్తంగా 80 వేల నుంచి 84 మందిని కొత్తగా నియమించుకోనున్నట్లు సంకేతాలిచ్చాయి.

వినోద రంగం@ 100 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: వచ్చే పదేళ్లలో దేశీ మీడియా, వినోద పరిశ్రమ మూడు రెట్లు పెరిగి, 100 బిలియన్ డాలర్లకు చేరనుందని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. దీనితో లక్షల కొద్దీ ఉద్యోగావకాశాలు వస్తాయని, ఇతర రంగాలూ ప్రయోజనాలను పొందుతాయని వేవ్స్ 2025 సదస్సు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు. డిజిటల్ సాంకేతికతతో కథలను ఆసక్తికరంగా చెప్పే విశిష్ట సామర్థ్యాలు భారత్‌కి సొంతమని అంబానీ వివరించారు. మనకు సాటిలేదు..ప్రపంచంలో సంక్షోభం, అనిశ్చితి పెరిగిపోతున్న నేపథ్యంలో స్ఫూర్తివంతమైన మన కథలు భవిష్యత్తుపై ఆశాభావం కల్పిస్తాయని ఆయన పేర్కొన్నారు. వేల కొద్దీ సంవత్సరాలుగా మన పురాణేతిహాసాలు సౌభ్రాతృత్వం, సాహసం, ప్రకృతిపై ప్రేమను చాటి చెప్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రజల మనస్సులను గెలుచుకున్నాయని అంబానీ వివరించారు. ఈ విషయంలో మరే దేశమూ మనకు సాటిరాదన్నారు. ముక్కలు చెక్కలవుతున్న ప్రపంచాన్ని తిరిగి బాగుచేయడానికి మన కథలను ఆత్మవిశ్వాసంతో మరోసారి పరిచయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు పహల్గాం ఉగ్రదాడికి సంతాపం తెలిపారు. 90 దేశాల నుంచి 10,000 మంది పైగా ప్రతినిధులు వేవ్స్ సదస్సులో పాల్గొంటున్నారు.
ఫ్యామిలీ

ఆడుతూ పాడుతూ మార్కులు
బుధవారం ఐ.ఎస్.సి. ఇంటర్ ఫలితాలు వచ్చాయి. బెంగళూరులో టాపర్స్‌గా నిలిచిన ముగ్గురూ తమ కాలేజీల్లో సాంస్కృతిక కార్యకలాపాలలో చురుగ్గా ఉన్నారు. చదువు మిస్ కాలేదు. అలాగే ఉల్లాసాన్నిచ్చే కళలను కూడా! ‘మాకు కళలే చదువులో రిలాక్స్ అయ్యేలా చేశాయి’ అని వారు అన్నారు. తల్లిదండ్రులూ, విద్యార్థులూ ఈ విషయాన్ని వింటారా మరి? క్రీడలూ, కళలు చదువును చెడగొట్టవని! ఈ సెలవుల్లో అయినా వాటిని నేర్చుకుందామని!పూర్వం స్కూళ్లల్లో పాతజోకు ఉండేది.స్టూడెంటు ‘హోమ్‌వర్క్ చేయడం మర్చిపోయాను సార్’ అని అంటే ‘అన్నం తినడం మర్చిపోలేదు కదా. ఇదెలా మర్చిపోయావు‘ అని బెత్తంతో ఒక్కటి వేసేవాడు సారు.స్టూడెంట్స్‌కు అన్నం తినడానికి, నిద్ర పోవడానికి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి తప్పక సమయం ఉంటుంది. అలాగే ఇష్టమైన ఆసక్తి నెరవేర్చుకోవడానికి కూడా టైమ్ ఉంటుంది. ఇవన్నీ చేసి బ్రహ్మాండం గా చదవగలరు పిల్లలు. గతంలో అలా చదివి, ఇంకా చె΄్పాలంటే ఏ సౌకర్యాలు లేకపోయినా కరెంటు స్తంభాల వెలుతురులో చదివి గొప్ప విద్యార్థులు అయిన వారు ఉన్నారు. తల్లిదండ్రులకు అది తెలుసు. అయితే తల్లిదండ్రులు ఆ సంగతి మర్చిపోయారు.కొడుకులు, కూతుళ్లు నేడు అన్ని సౌకర్యాలతో ఉన్నా ఫ్యాను, లైటు, స్కూల్ బస్సు, టిఫిన్ బాక్స్, మంచి స్కూలు ఉన్నా కేవలం చదువుకు మాత్రమే అంకితమైతే తప్ప గొప్ప మార్కులు తెచ్చుకోలేరని భావిస్తున్నారు. పుస్తకం ముందేసుకుని ఉంటేనే ర్యాంకులు వస్తాయని అభిప్రాయపడుతున్నారు. అప్పట్లో కాసేపు చదివినా మంచి మార్కులే వచ్చేవి. కాని ఇప్పటి విద్యార్థులు స్కూలు/కాలేజీ మొదలైన రోజు నుంచే చదువుతున్నారు. అంటే వారు ఎంత లేదన్నా పరీక్ష బాగా రాస్తారు. అయినా సరే వారికి ఆట వద్దు, పాట వద్దు, సినిమా వద్దు, బంధువులు వద్దు అనడం వల్ల పిల్లలను ఐసొలేట్ చేయడమా కాదా అని తల్లిదండ్రులు ఆలోచించాలి.ఇదిగోండి ఉదాహరణ‘ది కౌన్సిల్ ఫర్ ది స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్’ (సి.ఐ.ఎస్.సి.ఇ.) బోర్డ్ వారు ఇంటర్ విద్యార్థులకు నిర్వహించే ‘స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్’ (ఐ.ఎస్.సి) రిజల్ట్స్ బుధవారం వెలువడ్డాయి. దేశవ్యాప్తంగా విడుదలైన ఈ రిజల్ట్స్‌లో టాపర్‌గా నిలిచిన విద్యార్థులు రేయింబవళ్లు చదువుకే అంకితమైన వారు కాదు. ముఖ్యంగా బెంగళూరుకు టాపర్లు ఆటకూ పాటకూ చోటిచ్చి ఈ మార్కులు తెచ్చుకున్నారు. వీరిలో శామ్యూల్ పింటోకు 96 పర్సెంట్ వచ్చింది. బెంగళూరు కోరమండల లోని బెతాని స్కూల్లో ఇంటర్ చదివిన పింటో ‘నేను స్కూల్ కల్చరల్ యాక్టివిటీస్‌కి సెక్రటరీని.అంతేకాదు వ్యక్తిగతంగా పాము విషానికి విరుగుడు మందు విషయంలో నాదైన పరిశోధన చేస్తున్నాను. ఈ రెంటికీ సమయం ఇచ్చినా స్కూల్ చదువును టైమ్‌టేబుల్ ప్రకారం చదువుకున్నాను. నేను భవిష్యత్తులో యాంటీ వీనమ్ టెక్నాలజీలో పని చేస్తాను’ అన్నాడు. హ్యుమానిటీస్‌లో టాపర్‌గా వచ్చిన నటాలీ కూడా అదే స్కూల్లో చదివి 98.2 పర్సెంట్ తెచ్చుకుంది. నేను నా పదో ఏట నుంచి సింగర్‌గా, డాన్సర్‌గా, యాక్టర్‌గా కృషి చేస్తున్నాను. అవి నా చదువుకు అడ్డు కాలేదు. చదువుకు సమయం తప్పకుండా కేటాయించి చదివాను’ అంది.ఐ.సి.ఎస్ ఎగ్జామ్స్‌లో కామర్స్‌లో టాపర్‌గా నిలిచిన సాన్నిధ్య బెంగళూరు గ్రీన్వుడ్ స్కూల్ విద్యార్థిని. 98.75 పర్సెంట్ తెచ్చుకుంది. ‘కథక్ నా స్ట్రెస్ బస్టర్. బాడ్మింటన్ ఆడతాను. ఈ రెంటికీ 3 గంటల సమయం ఇచ్చి మిగిలింది చదువుకు ఇస్తాను’ అని చెప్పింది. ఇప్పుడు చెప్పండి తల్లిదండ్రులూ... అన్ని సౌకర్యాలు ఇచ్చి పిల్లలను చదివిస్తున్న మీరు వారికి ఆట పాటలు ఆసక్తులు ఇవ్వలేరా? బడి జరుగుతున్నప్పుడు సరే. కనీసం ఈ వేసవి సెలవుల్లో అయినా. సెలవులను ఆనందాలుగా చేసి వారి దోసిళ్లలో పోయండి. – కె.ఈ పుస్తకం చదవండికొందరు తమకు రెక్కలున్నాయనే గుర్తించరు. మరికొందరు రెక్కలున్నది ఇంతవరకు ఎగిరేందుకే అనుకుంటారు. కాని ప్రయత్నం చేయాలి... ఉన్నదానిని పెంచి సాధించుకోవాలి అని పట్టుపడ్డ సముద్ర పక్షి కథే ‘జోనాథన్ లివింగ్స్టన్ సీగల్’. జోనాథన్ అనే పేరున్న సీగల్ మన కాకిస్థాయి పక్షి. ఎక్కువ ఎత్తు ఎగరలేదు. 500 అడుగుల ఎత్తులోపే ఎగరగలదు. ఎగిరినా ఆహార అన్వేషణ కోసమే. కాని జోనాథన్‌కు ‘నాకు రెక్కలున్నాయి. గద్దలాగా మరింత ఎత్తుకు ఎందుకు ఎగరకూడదు’ అనిపిస్తుంది. అలాంటి ఆలోచనకే భయపడే సీగల్స్ మధ్య 5000 అడుగుల ఎత్తుకు ఎగిరి చరిత్ర సృష్టిస్తాడు జోనాథన్ రిచర్డ్ బాక్ రాసిన ఈ చిన్న నవలకు ప్రపంచ ప్రఖ్యాతి ఉంది. పిల్లలు తప్పక చదవాలి. తాము కేవలం ర్యాంకులు తెచ్చుకోవడానికే పుట్టలేదు... వాటితో పాటు అనేక పనులు చేయగలం... సాధించగలం... అనే ఆత్మవిశ్వాసం పొందుతారు.

తొమ్మిది గజాల చీరలో మహారాష్ట్ర అమ్మాయిలా స్టార్ హీరోయిన్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తన సింపుల్, ట్రెడిషనల్ ఫ్యాషన్‌తో అభిమానుల హృదయాలను గెల్చుకుంది. వేవ్స్ సమ్మిట్ 2025 ( WAVES Summit 2025) లో ఉత్సాహభరితమైన మహారాష్ట్ర రాష్ట్రంలో మహిళలు ధరించే ఒక ప్రత్యేకమైన నౌవారీ చీరలో అద్భుతంగా కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.అలియా వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్‌కు హాజరైంది. ఈ సందర్భంగా తనదైన మినిమలిస్టిక్ ఫ్యాషన్, స్టేట్మెంట్ లుక్‌తో 'వావ్' అనిపించిందిముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మే 1న జరిగిన ఈవెంట్లో మహారాష్ట్ర అమ్మాయిగా మారిపోయింది. తొమ్మిది గజాల నౌవారీ చీరలో ట్రెడిషనల్‌గా చాలా అందంగా కనిపించింది. "నౌ" అంటే తొమ్మిది, తొమ్మిది గజాల నౌవారీ చీర స్టైల్ మహారాష్ట్రలో ప్రసిద్ధి. పీచ్, నారింజ రంగుల కలయితో గులాబీ రంగు అంచుతో వచ్చిన ఈ చీరకు, పూల డిజైన్‌తో హైలైట్ చేశారు. హిందీ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన నటీమణులలో ఒకరైన అలియా భట్, తన నటనా నైపుణ్యాలు, అందం, ఫ్యాషన్ స్టేట్మెంట్లు, అది సాంప్రదాయమైనా లేదా పాశ్చాత్యమైనా ఫ్యాన్స్‌ను ఫిదా చేయాల్సిందే.కాగా 2024లో మెట్ గాలాలో అరంగేట్రం చేసిన ఆలియా భట్, తన లుక్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. సబ్యసాచి ముఖర్జీ నుండి అందమైన చీరలో బ్యూటిఫుల్‌గా కనిపించింది. నటిగాస్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రంతో తన కెరీర్‌ను ప్రారంభించి బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. బాలీవుడ్లో విలక్షణమైన పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. 2022 ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రి ఇచ్చింది. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌ని పెళ్లాడినా అలియా ఒక ఆడబిడ్డకు తల్లి కూడా. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)

సహజ యోగతో ఆత్మసాక్షాత్కారం
ఒకప్పుడు ఋషులు, మహర్షులు కఠోరమైన తపస్సులు చేస్తేనే కానీ సాధ్యం కాని కుండలినీ శక్తి జాగృతి నేడు సాధారణమైన గృహస్థ జీవితం గడుపుతున్న సామాన్యులకు ఎలా సాధ్యమయిందని అడిగితే శ్రీ మాతాజీ నిర్మలా దేవి ఇలా వివరిస్తారు‘ఇప్పుడు ఆ సమయం ఆసన్నమయింది. మొత్తం మానవాళి తమ పరిణామ క్రమంలో తదుపరి దశ అయిన మానవాతీత స్థాయిని చేరుకోవలసిన సమయం ఆసన్నమయ్యింది. అనాది కాలంగా అరణ్యాలు, పర్వతాలలో తపస్సులు చేసి భగవంతుని కోసం పరితపింmrన ఋషి పుంగవులంతా నేడు సామాన్యులుగా జన్మిం ఆత్మ సాక్షాత్కారం పొందుతున్నారు. వారి పూర్వ జన్మల పుణ్యఫలం నేడు అనుభవిస్తున్నారు. వారి లోపల ఉన్న దానినే వారికి పరిచయం చేశాను కానీ నేను కొత్తగా ఏమీ ఇవ్వడం లేదు‘ అని చెప్పారు.ఈనాడు ప్రపంచవ్యాప్తంగా 120 దేశాలలో ఉన్న సహజ యోగ సాధకులు వివిధ రకాల వ్యాధులను, అవి ఇంకా భౌతిక శరీరానికి రావడానికి ముందే చైతన్య తరంగాల సహాయంతో సూక్ష్మ శరీరంలోనే వాటిని గుర్తించి, నయం చేసుకోగలుగుతున్నారు. ఈ విధంగా సహజ యోగం మరింతగా వ్యాప్తి చెందితే, మానవులకు ఇక ఆసుపత్రుల అవసరం ఉండదు అనేది సత్యదూరం కాదు.ఇదీ చదవండి: Dharmakīrti గెలిచేది, నిలిచేది ధర్మమే...సత్యమే!ఇప్పటికే పలు విశ్వవిద్యాలయాలు ‘సహజ యోగం‘ మీద జరిపిన పరిశోధనకి గాను డాక్టరేట్ డిగ్రీలు ప్రదానం చేయడం జరిగింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం వారు దీనిని ఒక ‘ప్రత్యామ్నాయ వైద్యం‘ గా గుర్తించి గౌరవించారు. ఇంకా శ్రీ మాతాజీ నిర్మలాదేవి చెప్పిన పలు విషయాల మీద పరిశోధన జరుగుతుంది. రష్యాలో శాస్త్రవేత్తలు ‘వెగా మెషీన్‘ అనే మెషీన్ ద్వారా సహజ యోగ ధ్యానం చేయటానికి ముందు, ఆ తర్వాత మనిషి శరీరంలో జరుగుతున్న మార్పులను నమోదు చేసి ఆసక్తికరమైన ఫలితాలను వెల్లడించారు. భవిష్యత్తులో సహజ యోగం మరింతగా వ్యాప్తి చెంది, భృగు మహర్షి తెలియజేసిన విధంగా మొత్తం మానవాళి బ్రహ్మానంద అనుభూతిలో ఓలలాడుతుందని ఆశిద్దాం.– డా. పి. రాకేశ్( పరమ పూజ్య శ్రీ మాతాజీనిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా)

'షాడో తోలు బొమ్మలాట'ను సజీవంగా నిలిపింది..! రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
మన సాంప్రదాయ కళకు కొద్దిమంది ప్రాణం పోసి సజీవంగా నిలుపుతారు. వాటిని బావితరాలకు తెలిసేలా కృషి చేస్తారు. ప్రస్తుత ట్రెండ్ కాకపోయినా..ఎవ్వరో ఒక్కరైనా ఆదరించకపోదురా అనే ఆశతో కొనసాగిస్తున్న వారి ఓపిక, పట్టుదల ఎవ్వరినైనా కదిలిస్తాయి. దాన్ని ప్రభుత్వం గుర్తించి అత్యున్నత పురస్కారంతో గుర్తిస్తే..అది వారి కృషికి తగిన గుర్తింపే గాక, మరికొన్ని కళలు కనుమరగవ్వకుండా నిలుస్తాయి కూడా. అందుకు ఉదాహరణే ఈ కన్నడ బామ్మ భీమవ్వ దొడ్డబాలప్ప శిల్లెక్యతార. కర్ణాటకకు చెందిన 96 ఏళ్ల భీమవ్వ దొడ్డబాలప్ప శిల్లెక్యతార(Bhimavva Doddabalappa Shillekyathara) షాడో తోలుబొమ్మలాట(shadow puppetry) కళాకారిణి. కన్నడకు చెందిన ఈ సాంప్రదాయ తోలుబొమ్మలాటను ప్రపంచానికి తెలిసేలా చాలాకృషి చేసింది. నీడ సాయంతో తోలుబొమ్మలాటను ప్రదర్శిస్తారు. అది గొప్ప నైపుణ్యానికి సంబంధించిన కళ. దాన్ని వినోదాత్మకంగా అందరికి తెలిసేలా నిరంతరం ప్రదర్శిస్తూనే ఉంది. సుమారు 80 ఏళ్లుగా ఈ భీమవ్వ షాడో బొమ్మలాట కళా నైపుణ్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. చేతులతో అద్భుతం సృష్టించే కళకు ఆధారం పురాణాలు. ప్రజలను ఆకట్టుకునేలా రంజింప చేసే సంగీతంతో కట్టిపడేసే కదలికలతో ప్రదర్శనలు ఇచ్చేది. ప్రజలు ఆదరించకపోతున్నా..తన కళా ప్రస్థానాన్ని ఆపకుండా..అవిరాళంగా ప్రదర్శిస్తూ..బావితరాలు గుర్తించి తెలుసుకునేలా ఈ విద్య గురించి బోధిస్తూనే ఉంది. మన దేశంలోని జానపద మూలాలతో లోతైన సంబంధం ఉన్న కళ ఇది. పరిమిత వనురులే ఉన్న..అంతమేర మంచి కళాత్మకంగా ప్రదర్శంచేది. దీన్ని కన్నడలో 'తొగలు గొంబెయాట'గా పిలచే నీడ తోలుబొమ్మల నాటకం. భీమవ్వ సాంప్రదాయ నీడ తోలుబొమ్మలాటతో పౌరాణిక కథలు జానపద కథలను ప్రదర్శించేది. ముఖ్యంగా అది సంతానోత్పత్తికి ప్రతీకగా ముడిపడి ఉన్న కళ. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా మన సంప్రదాయ తోలుబొమ్మలాటతో ముడిపడి ఉన్న షాడో తోలుబొమ్మలాట ఇది. మత సంబంధాలకు అతీతంగా కూడా ప్రదర్శనలిచ్చేవారు కూడా. ఇన్నాళ్లుకు ఆమె కృషికి తగిని గుర్తింపు లభించింది. సంప్రదాయ కళను బతికిస్తూ వస్తున్న భీమవ్వకు పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఆమె భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన 'పద్మ శ్రీ'(Padma Shri ) అవార్డుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) చేతుల మీదుగా అందుకున్నారామె. శతాబ్దాల నాటి కథలకు ప్రాణం పోసి.. తోలుబొమ్మలను పట్టుకున్న చేతులతో, ఆమె ఇప్పుడు భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారాన్ని వణుకుతున్న చేతులతో అందుకుంది. ఆమె ఆ రాష్ట్రపతి భవన్ హాలులోకి నిశబ్దంగా వస్తూ..ఆ అత్యున్నత పురస్కారాన్ని అందుకోగానే ఒక్కసారిగా హాలంతా చప్పట్లతో మారుమ్రోగింది. అంతేగాదు ఆమె పురస్కారం తీసుకుంటుండగా..అంతా స్టాండింగ్ ఒవేషన్‌తో గౌరవించి మరీ సత్కరించారు. ఇది నిజంగా కళకు ప్రాణం పోసినవారికే దక్కే అసలైన గౌరవం కదా..! .#WATCH | 96-year-old puppeteer Bhimavva Doddabalappa Shillekyathara receives Padma Shri award from President Droupadi Murmu for her contribution to the field of Art. (Video Source: President of India/YouTube) pic.twitter.com/4PVvqSI9YL— ANI (@ANI) April 28, 2025 (చదవండి: Kilimanjaro Diet: 'కిలిమంజారో డైట్' అంటే..? శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..)
ఫొటోలు


సమ్మర్లో చిల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ (ఫోటోలు)


ఏప్రిల్ నెల స్వీట్ మెమొరీస్ అంటూ ఫోటోలు షేర్ చేసిన 'అల్లు స్నేహ'


RR vs MI: ముంబై ‘సిక్సర్’ రాజస్తాన్ ‘అవుట్’ మ్యాచ్ హైలైట్స్ (ఫోటోలు)


జూ పార్క్‌లో పర్యాటకుల సందడి.. వన్యప్రాణులను కెమెరాల్లో బంధిస్తూ! (ఫోటోలు)


వేవ్స్ సమ్మిట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నాగచైతన్య- శోభిత దూళిపాల (ఫోటోలు)


రామ్ చరణ్ మదర్ ఆవకాయ పచ్చడి.. మరో స్పెషల్ అంటూ మెగా కోడలు ఉపాసన పోస్ట్ (ఫోటోలు)


రెట్రో లుక్‌లో పూజా హెగ్డే.. సింప్లీ సూపర్ (ఫోటోలు)


కృతీ శెట్టిని ఇలా చూస్తే అభిమానులు ఫుల్ ఖుషీ (ఫోటోలు)


CSK vs PBKS : చహల్ హ్యాట్రిక్, చెన్నై ఖేల్ ఖతం (ఫోటోలు)


బాబే అన్నింటికీ దోషి.. సింహాచలం బాధిత కుటుంబానికి వైఎస్ జగన పరామర్శ (ఫొటోలు)
అంతర్జాతీయం

పాక్‌కు భారత్ సీరియస్ వార్నింగ్
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి (Terrorist attack) నేపథ్యంలో భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆ దాడి తర్వాత నియంత్రణ రేఖ వెంట పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఈ క్రమంలో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్, భారత్‌కు చెందిన మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్స్ హాట్లైన్లో మాట్లాడుకున్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ సైన్యం కాల్పులకు పాల్పడుతున్న విషయాన్ని ప్రస్తావించిన భారత్.. దాయాది దేశాన్ని హెచ్చరించినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. ఏయే రోజు ఎక్కడెక్కడ పాక్ కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడిందో వివరించిన భారత సైనిక అధికారులు.. ఇకపై కొనసాగిస్తే చర్యలు తప్పవని.. దీటుగా బదులిస్తామని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు.. యుద్ధ వాతావరణం నెలకొనడంతో సరిహద్దు ప్రజలు అప్రమత్తమవుతున్నారు. ఇదే సమయంలో పాకిస్థాన్ (Pakistan) కూడా భద్రతాపరంగా పలు చర్యలు తీసుకుంటోంది. తాజాగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిత్, స్కర్దు తదితర ప్రాంతాలకు విమాన సర్వీసులను పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA) రద్దు చేసింది. సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాకిస్థాన్ కూడా గగనతలాన్ని నిఘాను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే లాహోర్, కరాచీ నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లోని స్కర్దు, గిల్గిత్‌కు నడిచే విమాన సర్వీసులను పీఐఏ నిలిపివేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

చిగురిస్తున్న ఇండో-కెనడా స్నేహం
భారత్-కెనడా మధ్య సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ స్నేహం కొత్త చివుళ్లు వేస్తోందా? ఏడాదిన్నర కాలానికి పైగా గాడి తప్పిన భారత్, కెనడా దౌత్య సంబంధాలు పట్టాలెక్కబోతున్నాయా... అంటే అవుననే చెప్పాలి. కెనడా సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన లిబరల్ పార్టీ నేత, ఆ దేశ ప్రస్తుత తాత్కాలిక ప్రధాని, కాబోయే పూర్తికాలపు ప్రధాని మార్క్ కార్నీకి భారత్ ప్రధాని మోదీ పంపిన అభినందన సందేశానికి సంకేతం అదే. మార్క్ కార్నీకి ముందు కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో ఉన్నప్పుడు గత అక్టోబరులో రెండు దేశాలూ పరస్పరం హై కమిషనర్లను బహిష్కరించాయి. ఈ ఏడాది జూన్ మాసానికల్లా హై కమిషనర్ల వ్యవస్థను పునరుద్ధరించాలని ఉభయ దేశాలు తలపోస్తున్నాయి. ప్రస్తుతం ‘స్పెయిన్’లో భారత రాయబారిగా వ్యవహరిస్తున్న దినేష్ కుమార్ పట్నాయక్ ను కెనడాలో తదుపరి హై కమిషనరుగా భారత్ నియమించే అవకాశముందని, ఇందుకు సంబంధించిన ప్రక్రియ త్వరలో ఆరంభమవనుందని తెలుస్తోంది. కెనడా ఎన్నికల ఓట్ల లెక్కింపు దాదాపు పూర్తయింది. 343 స్థానాలున్న పార్లమెంటు దిగువ సభలో లిబరల్ పార్టీ 168 సీట్లు, కన్జర్వేటివ్ పార్టీ 144 సీట్లు గెలుచుకున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తి మెజారిటీ రావాలంటే లిబరల్ పార్టీ 172 సీట్లు గెలవాలి. కానీ ఆ మేజిక్ నంబరుకు కొద్ది దూరంలో అది ఆగిపోయింది. చిన్న పార్టీల సహకారంతో లిబరల్ పార్టీ మైనారిటీ సర్కారు ఏర్పాటు చేసే అవకాశముంది. ఖలిస్థాన్ వేర్పాటువాద నేత హరదీప్ సింగ్ నిజ్జర్ 2023లో కెనడాలో హత్యకు గురయ్యాడు. భారత ప్రభుత్వ ఏజెంట్లే అతడిని హతమార్చారని కెనడా ఆరోపించడంతో ఆ దేశంతో భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయి. తదనంతర పరిణామాల్లో కెనడాలో భారత హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మను కెనడా వెళ్లగొట్టడం, ప్రతిగా కెనడా దౌత్యవేత్తలను ఇండియా బహిష్కరించడం చకచకా జరిగిపోయాయి. దరిమిలా చాలినంత మంది దౌత్యవేత్తలు లేక కెనడా కాన్సులేట్లు మూతపడ్డాయి. నాటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పదవి నుంచి దిగిపోయారు. మరోవైపు కెనడా ఎన్నికల్లో ఖలిస్థాన్ సానుకూల నేత, న్యూ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడు జగ్మీత్ సింగ్ కూడా ఓటమి పాలయ్యాడు. ఈ రెండు పరిణామాలు ఇండో-కెనడా బంధం మళ్లీ మొగ్గ తొడిగేందుకు పరిస్థితులను అనుకూలంగా మార్చాయి. ట్రూడోలా కాకుండా మార్క్ కార్నీ మరింత పరిణతితో వ్యవహరిస్తారని భారత్ అభిప్రాయపడుతోంది. - జమ్ముల శ్రీకాంత్

Bangladesh: చిన్మయ్ కృష్ణదాస్‌కు ఊరట
ఢాకా: ఇస్కాన్ మాజీ ప్రతినిధి, బంగ్లాదేశ్‌లో మైనారిటీ హక్కుల సాధన ఉద్యమకారుడు చిన్మయ్ కృష్ణదాస్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. బంగ్లాదేశ్ హైకోర్టు బుధవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రాజద్రోహం కేసులో కిందటి ఏడాది నవంబర్‌లో ఆయన్ని బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ ప్రచారకర్తగా పనిచేస్తున్న చిన్మయ్ కృష్ణదాస్ గతేడాది నవంబరులో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. అక్కడ బంగ్లా జాతీయజెండాను అగౌరవపరిచారనే అభియోగాలపై 2024 నవంబరు 25న ఢాకా హజారత్ షాహ్జలాల్ ఎయిర్‌పోర్టులో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అనంతరం జైలుకు తరలించారు. ఆయన తరఫున వాదనలు వినిపించేందుకు న్యాయవాదులను సైతం అక్కడి ఆందోళనకారులు అనుమతించలేదు. చివరకు చిన్మయ్ భాగస్వామిగా ఉన్న బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతన జాగరణ్ జోతే అనే సంస్థ.. 11 మందితో లాయర్ల బృందాన్ని ఏర్పాటుచేసింది. అయినా కూడా ఆయనకు బెయిల్ దక్కలేదు. మరోవైపు భారత్ సహా అంతర్జాతీయ సమాజం చిన్మయ్ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించింది. శాంతియుతంగా నిరసన తెలిపే మైనారిటీల హక్కులను కాలరాయడం సరికాదంటూ భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. చిన్మయ్ కృష్ణదాస్ స్వస్థలం చిట్టాగాంగ్‌లోని సట్కానియా ఉపజిల. 2016-2022 మధ్య ఇస్కాన్ చిట్టాగాంగ్ డివిజనల్ సెక్రటరీగా దాస్ పని చేశారు. ఆపై హిందూ మైనారిటీల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పడిన బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతన జాగరణ్ జోతే తరఫున ప్రతినిధిగా దాస్ పని చేశారు. సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఆయనకంటూ అక్కడ ఓ పేరుంది. బంగ్లా మీడియా ఆయన్ని శిశు బోక్తాగా అభివర్ణిస్తుంటుంది. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో పాటు మైనారిటీ ప్రోటెక్షన్ లా తేవడంంలోనూ దాస్ కృషి ఎంతో ఉంది. కిందటి ఏడాది.. అక్టోబర్ 25న చిట్టాగాంగ్‌లో, నవంబర్ 22వ తేదీన రంగ్‌పూర్‌లో ఆయన నిర్వహించిన ర్యాలీలు దేశవ్యాప్త చర్చకు దారి తీశాయి. చిట్టాగాంగ్‌లో నిర్వహించిన ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాకు పైన కాషాయ జెండాను ఎగరేయడంతోనే ఆయనపై రాజద్రోహం కేసు నమోదు అయ్యింది.

ప్రధాని మోదీ రష్యా పర్యటన రద్దు
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన రద్దైంది. మే 9వ తేదీ మాస్కోలో జరగాల్సిన విక్టరీ డే వేడుకలకు ప్రధాని మోదీ బదులు.. భారత దౌత్య ప్రతినిధి హాజరవుతారని క్రెమ్లిన్ వర్గాలు ఇవాళ ప్రకటించాయి. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ మీద సోవియట్ యూనియన్ విజయానికి గుర్తుగా రష్యా ప్రతీ ఏటా మే 9వ తేదీని విక్టరీ డేగా నిర్వహిస్తుంటుంది. ఈ ఏడాది 80వ వార్షికోత్సవం సందర్భంగా పలు ప్రపంచ దేశాల అధినేతలకు ఆహ్వానం పంపింది. అందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ వర్గాలు ధృవీకరించాయి కూడా.అయితే ఆయన బదులు.. ప్రతినిధి హాజరవుతారని ఇప్పుడు ప్రకటన వెలువడింది. అయితే పహల్గాం ఘటన తర్వాత.. పాక్‌తో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలోనే మోదీ పర్యటన రద్దై ఉండొచ్చని పలు ఆంగ్ల మీడియా ఛానెల్స్ కథనాలు ఇస్తున్నాయి.
జాతీయం

ఎవరినీ వదిలిపెట్టం!
న్యూఢిల్లీ: ప్రతి ఉగ్రవాద చర్యకూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత్ తగిన సమాధానం ఇస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. పిరికిపందల్లా దాడులకు పాల్పడి అదే గొప్ప విజయంగా భావిస్తూ పొంగిపోవద్దని ఉగ్రవాదులకు హితవు పలికారు. ఇది నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత్ అనే సంగతి గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. ఒకరి తర్వాత ఒకరిపై వరుసగా ప్రతీకారం తీర్చుకుంటామని ఉగ్రవాదులను ఘాటుగా హెచ్చరించారు. దేశంలో ఉగ్రవాదాన్ని ప్రతి మూల నుంచీ అంతం చేస్తామని పునరుద్ఘాటించారు. ఒక్క అంగుళం భూభాగంలోనూ ఉగ్రవాదం అనేది లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.అనుకున్నది సాధించి తీరుతామని ప్రతిజ్ఞ చేశారు. ఆయన గురువారం ఢిల్లీలో ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. ఉగ్రవాదంపై తాము ప్రారంభించిన పోరాటానికి అంతర్జాతీయ సమాజం మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ పోరాటంలో 140 కోట్ల మంది భారతీయుల మద్దతే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరి మద్దతు కావాలని చెప్పారు. ఉగ్రవాదాన్ని నామరూపాల్లేకుండా చేయడానికి ప్రపంచమంతా ఒక్కతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. మనమంతా చేతులు కలిపి పనిచేస్తే ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేయొచ్చని తెలిపారు.ఇండియాలో దాడులకు పాల్పడి, ప్రజల ప్రాణాలను బలితీసుకున్న ముష్కరులకు తగిన శిక్ష విధించడం తథ్యమని అన్నారు. ఉగ్రవాదం పూర్తిగా అంతమయ్యే దాకా తమ పోరాటం ఆగదని వెల్లడించారు. పహల్గాంలో దాడికి పాల్పడిన ప్రతి ఒక్క ముష్కరుడినీ వేటాడుతామని అమిత్ షా స్పష్టంచేశారు. వారు శిక్ష నుంచి ఎప్పటికీ తప్పించుకోలేరని అన్నారు. మోదీ ప్రభుత్వం ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోదని చెప్పారు. 26 మందిని హత్య చేసి, గెలిచామనుకుంటే అది పొరపాటే అవుతుందని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదుల అరాచకాలను సహించే ప్రసక్తే లేదన్నారు.

రిజిస్ట్రార్ జనరల్ నుంచే నేరుగా తాజా జాబితా
న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు పాత పేర్ల తొలగింపు, సవరణలతో అత్యంత కచ్చితత్వంతో ఆధునీకరించిన ఓటర్ల జాబితాను సిద్ధంచే సేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మృతిచెందిన ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితా నుంచి వెనువెంటనే తొలగించాలని నిర్ణయించింది. ఎవరైనా ఓటర్ మృతిచెందితే అధికారికంగా తమకు సమాచారం వచ్చేదాకా వేచిచూడకుండా నేరుగా ‘రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా’నుంచి మరణాల తాజా జాబితాను తెప్పించుకుని ప్రస్తుత ఓటర్ల జాబితాతో సరిపోల్చి మృతుల పేర్లను తొలగించనుంది. దీంతో మృతుల పేరిట మరొకరు ఓటు వేసే ఆస్కారం లేకుండా చేయాలని ఎలక్షన్ కమిషన్ భావిస్తోంది. దీంతోపాటు మరికొన్ని కీలక నిర్ణయాలను ఈసీ తీసుకుంది. అవి.. 1. నమోదిత మరణాల తాజా జాబితా రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అందగానే బూత్ స్థాయి అధికారి(బీఎల్ఓ)కి సమాచారం ఇస్తారు. ఫామ్–7 అభ్యర్థన కోసం వేచిచూడకుండా నేరుగా రిజిస్ట్రార్ జనరల్ నుంచి ఈ జాబితా తెప్పించుకోవచ్చు. తర్వాత మరణాన్ని ధృవీకరించుకునేందుకు ఆ బీఎల్ఓ సదరు ప్రాంతానికి వెళ్లి మృతి విషయాన్ని ఖరారుచేసుకుంటారు. ఓటర్ల నమోదు నియమావళి–1960లోని 9వ నిబంధన, 2023లో సవరించిన జనన, మరణాల నమోదు చట్టం–1969లోని 3(5)(బీ) సెక్షన్ ప్రకారం ఆయా జనన, మరణాల వివరాలు అడిగి తీసుకునే హక్కు ఈసీకి ఉంది. 2. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్(వీఐఎస్) మరింత స్పష్టంగా ఉండేందుకు ప్రస్తుతమున్న దాని డిజైన్‌ను మార్చనున్నారు. ఇకపై పెద్ద అక్షరాలతో డిజైన్ చేయడం వల్ల వీఐఎస్ సీరియల్ నంబర్, ఓటర్ పార్ట్‌నంబర్ మరింత స్పష్టంగా కనిపిస్తాయి. దీంతో తమ పోలింగ్ స్టేషన్ ఎక్కడుందో ఓటర్ మరింత తేలిగ్గా చూసుకోగలడు. పోలింగ్ అధికారులు సైతం ఆయా ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితాలో ఏ పేజీలో ఉన్నాయో సులభంగా గుర్తుపట్టగలరు. 3. ప్రజా ప్రతినిధుల చట్టం,1950లోని 13బీ(2) సెక్షన్ ప్రకారం ఎలక్టోరల్ రిజి్రస్టేషన్ ఆఫీసర్ నియమించిన బీఎల్ఓలు అందరికీ ప్రామాణికమైన ఫొటో గుర్తింపు కార్డులను జారీచేయనున్నారు. ఓటర్ వెరిఫికేషన్, నమోదు కార్యక్రమాల్లో బీఎల్ఓలను ఓటర్లు సులభంగా గుర్తించడానికి, వారితో ఎలాంటి నిర్మొహమాటం లేకుండా సందేహాలు నివృత్తిచేసుకోవడానికి, అభ్యంతరాలు వ్యక్తంచేయడానికి వీలు చిక్కుతుంది. ముఖ్యంగా బీఎల్ఓలు ఇంటింటికీ తిరిగే క్రమంలో వారిని ఓటర్లు తేలిగ్గా గుర్తుపట్టడానికి ఈ నూతన ప్రామాణిక గుర్తింపు కార్డు తప్పనిసరి అని ఈసీ భావిస్తోంది.

కర్రెగుట్టలపై సాయుధ బలగాలు.. మావోయిస్టులు ఎక్కడ?
ములుగు, సాక్షి: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రె గుట్టలను భద్రతా బలగాలు పూర్తిగా స్వాధీనపర్చుకున్నాయి. మావోయిస్టుల కోసం అన్నివైపులా నుంచి గాలింపు కొనసాగిస్తున్నాయి. వేల సంఖ్యలో మావోయిస్టులు తలదాచుకున్నారన్న సమాచారంతో.. ఆపరేషన్ కగార్‌లో భాగంగా పది రోజులుగా సాయుధ బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. కర్రెగుట్టలలో 20వేల మంది సాయుధ బలగాలు అన్ని వైపుల నుంచి భారీగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో కర్రెగుట్టలో పై భాగంలో బేస్ క్యాంపు ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. ఈ క్యాంప్‌లో 10 వేల మంది సిబ్బంది భాగం అవుతారని సమాచారం. ఇప్పటికే ఈ క్యాంపు సమీపంలో భారీ సెల్ టవర్స్ నెలకొల్పారు. అలాగే.. బేస్ క్యాంపు వద్దకు డాగ్ స్క్వాడ్, మైన్ ప్రూఫ్ చేరుకోగా.. భారీగా ఆయుధాలలను తరలించారు. కర్రేగుట్టలోని దోబి కొండ నీలం సారాయి కొండలను పూర్తిగా సీఆర్పీఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే ఈ పది రోజుల్లో మావోయిస్టుల జాడ లభ్యం కాకపోవడం గమనార్హం. ఒకవైపు కర్రెగుట్టని మావోయిస్టులు ఖాళీ చేసి సేఫ్ జోన్లోకి వెళ్లిపోయి ఉంటారని ఏజెన్సీలో ప్రచారం భారీ ఎత్తున జరుగుతోంది. మరోవైపు భద్రతా బలగాలు మాత్రం మావోయిస్టులు వదిలేసిన బంకర్లు, షెల్టర్ జోన్లను బలగాలు గుర్తించాయి. దీంతో భూగర్భంలో రహస్య స్థావరాలలో దాక్కుని ఉంటారని భావిస్తున్నాయి. అందుకు నిటారుగా ఉన్న కర్రెగుట్టలే కారణమని చెబుతున్నాయి. ఈ క్రమంలో.. మావోయిస్టులు స్థావరాల నుండి బయటకి వచ్చే వరకు వేచి చూడాలని భావిస్తున్నాయి.

మీకు అండగా ఉంటాం: అమెరికా
ఢిల్లీ: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకునే చర్యలకు తాము అండగా ఉంటామని అమెరికా స్పష్టం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేకు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్ చేశారు. ఈ రోజు(గురువారం) హెగ్సే కు ఫోన్ చేసి మాట్లాడారు రాజ్‌నాథ్ సింగ్ .ఈ క్రమంలోనే పాకిస్తాన్ కు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుందనే చరిత్ర ఉందనే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు రాజ్ నాథ్. ఉగ్రవాదంపై ప్రపంచం గుడ్డిగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెగ్సే కు తెలిపారు రాజ్ నాథ్. దీనిలో భాగంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకునే చర్యలను తాము మద్దతిస్తామన్నారు హెగ్సే. ఉగ్రవాదంపై భారత్ కు రక్షణ చర్యలు తీసుకునే హక్కు ఉందని హెగ్సే పేర్కొన్నారు. భారత్ కు అమెరికా అండగా నిలబడుతుందని ఆ దేశ రక్షణ కార్యదర్శి స్పష్టం చేసిన సంగతిని రాజ్ నాథ్ సింగ్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. The U.S. Secretary of Defence @PeteHegseth spoke to Raksha Mantri Shri @rajnathsingh earlier today and expressed his deepest sympathies for the tragic loss of innocent civilians in the dastardly terror attack in Pahalgam, Jammu & Kashmir.Secretary Hegseth said that the U.S.…— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) May 1, 2025 పాకిస్తాన్ కవ్వింపు చర్యలు..కాగా, నియంత్రణ రేఖ(ఎల్ఓసీ)తోపాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ సైన్యం కవ్వింపు చర్యలు ఆగడం లేదు. భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. ఎల్వోసీ దగ్గర వరుసగా ఏడోరోజూ(గురువారం) పాక్ కాల్పులు జరిపింది. కుప్వారా, యూరి, అఖ్నూర్ సెక్టార్లో పాక్ కాల్పులను భారతసెన్యం సమర్థంగా తిప్పికొట్టింది. ఎల్ఓసీ వెంబడి పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది వరుసగా ఏడోరోజు కావడం గమనార్హం.మరో వైపు అరేబియా సముద్రంలో యుద్ధవాతావరణం నెలకొంది. భారత్, పాకిస్థాన్‌లు యుద్ధనౌకలను మోహరించాయి. గుజరాత్ పోరుబందర్ వద్ద భారత్ యుద్ధనౌకలు.. సైనిక సన్నద్ధతలో భాగంగా విన్యాసాలు చేస్తున్నాయి. నిన్న(బుధవారం) సైతం ఎల్ఓసీలో పాక్ కాల్పులు కొనసాగగా... భారత జవాన్లు ప్రభావవంతంగా బదులిచ్చారు. జమ్మూకశ్మీర్‌లో నాలుగు సరిహద్దు జిల్లాల్లో కవ్వింపు చర్యలు కొనసాగాయి. చిన్నపాటి ఆయుధాలతో కాల్పులు జరుపుతుండడంతో ప్రాణనష్టం జరగడం లేదని అధికారులు పేర్కొన్నారు.పహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్‌పై భారత ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. సింధూనది జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. దాంతో పాక్ సైన్యం ఆగ్రహంతో రగిలిపోతోంది. సరిహద్దులో భారత సైన్యమే లక్ష్యంగా నిత్యం కాల్పులకు దిగుతోంది. దీన్ని భారత్ సైన్యం ధీటుగా తిప్పికొడుతోంది. అదే సమయంలో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది.
ఎన్ఆర్ఐ

డల్లాస్‌లో నిరాశ్రయుల ఆశ్రయ గృహంలో పేదలకు ఆహారం
తెలంగాణా పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (Telangana Peoples Association of Dallas) మరో సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో 'ఫుడ్ డ్రైవ్'తో అన్నార్తుల ఆకలి తీర్చింది. Austin Street Homeless Shelter లో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఒక రోజంతా సాగిన ఈ కార్యక్రమంలో TPAD సభ్యులు స్వయంగా పాస్తా, చికెన్, మాష్డ్ పొటాటో తదితర వంటకాలు తయారు చేసి.. అన్నార్తులకు వడ్డించారు. 450 మందికి పైగా నిరాశ్రయుల ఆకలి తీర్చారు. అనురాధ మేకల (ప్రెసిడెంట్), రావు కల్వల (FC చైర్), పాండు పాల్వే (BOT చైర్), రమణ లష్కర్ (కోఆర్డినేటర్), దీపికా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఫుడ్ డ్రైవ్‌లో 450 మందికి పైగా నిరాశ్రయులకు ఆహారం వడ్డించామని, టీప్యాడ్ చెందిన 50 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు తెలియజేశారు. టీప్యాడ్ సీనియర్ నాయకుడు రఘువీర్ బండారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. (మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Texas: మృత్యువుతో పోరాడి ఓడిన దీప్తి
ఆస్టిన్: అమెరికా టెక్సాస్‌లో తెలుగు విద్యార్థిని హిట్ అండ్ రన్ కేసు విషాదాంతంగా ముగిసింది. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వంగవోలు దీప్తి(Deepthi Vangavolu)కన్నుమూశారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు ఇచ్చిన సమాచారం ద్వారా కుటుంబ సభ్యులు ధృవీకరించారు. దీంతో గుంటూరులోని ఆమె స్వస్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీప్తి(23) తండ్రి హనుమంత రావు చిరువ్యాపారి. ఆమె కుటుంబం గుంటూరు(Guntur) రాజేంద్రనగర్ రెండో లైనులో నివాసం ఉంటోంది. టెక్సాస్‌లోని డెంటన్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో ఎంఎస్ చేసేందుకు వెళ్లారు. మరో నెల రోజుల్లో కోర్సు పూర్తి కావాల్సి ఉంది. అయితే ఈలోపు రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆమెను కబళించింది. ఈ నెల 12వ తేదీన స్నేహితురాలైన మేడికొండూరుకు చెందిన స్నిగ్ధతో కలిసి రోడ్డుపై నడచి వెళ్తుండగా వేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. దీప్తి తలకు తీవ్ర గాయమైంది. స్నిగ్ధకు కూడా గాయాలయ్యాయి. దీప్తి స్నేహితురాళ్లు ప్రమాద విషయాన్ని ఆమె తండ్రి హనుమంతరావుకు తెలిపారు. క్రౌడ్ ఫండింగ్(Crowd Funding) ద్వారా ఆమె చికిత్స కోసం ప్రయత్నాలు కొనసాగగా.. మంచి స్పందన లభించింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నెల 15న దీప్తి చికిత్స పొందుతూ కన్నుమూసింది. శనివారం(ఏప్రిల్ 19) నాటికి మృతదేహం గుంటూరుకు వచ్చే అవకాశం ఉంది. మరో బాధితురాలు స్నిగ్ధ ప్రస్తుతం అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. అవే ఆమె చివరి మాటలు..దీప్తి మృతి వార్త విని ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసెలా రోదిస్తున్నారు. చదువులో చాలా చురుకైన విద్యార్థిని అని, అందుకే పొలం అమ్మి మరీ అమెరికాకు పంపించామని చెప్పారు. నెల రోజుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి కావాల్సి ఉందని, ఆ టైంకి మమ్మల్ని అమెరికాకు రావాలని ఆమె కోరిందని, అందుకు ఏర్పాట్లలో ఉండగానే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 10వ తేదీన దీప్తి చివరిసారిగా తమతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. కాలేజీకి టైం అవుతోందని.. ఆదివారం మాట్లాడతానని చెప్పి హడావిడిగా ఫోన్ పెట్టేసిందని.. అవే తమ బిడ్డ మాట్లాడిన చివరి మాటలని గుర్తు చేసుకుని బోరున విలపించారు.

దుబాయి హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
ఇటీవల దుబాయిలో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ యువకుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇవ్వాలని జపాన్ పర్యటన నుంచి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పోరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టపు ప్రేమ్ సాగర్‌తో పాటు, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట కు చెందిన స్వర్గం శ్రీనివాస్ లు దుబాయి లో హత్యకు గురైన విషయం తెలిసిందే. దుబాయి నుంచి మృత దేహాలను త్వరగా స్వదేశానికి తెప్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం అధికారుల్ని ఆదేశించినట్లు అనిల్ తెలిపారు.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దుబాయి లోని భారత రాయబార కార్యాలయానికి, ఢిల్లీ లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖలు రాసినట్లు వెల్లడించారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:ఎన్నారై అడ్వయిజరీ కమిటీ చైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్ బృందం, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి లు మృతుల కుటుంబాలను పరామర్శించారు.

రాయలసీమ ప్రగతికి డాలస్‌లో జీఆర్ఏడీఏ అడుగులు
గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఏరియా (GRADA) ఆధ్వర్యంలో ఏప్రిల్ 13న ఫ్రిస్కో, టెక్సాస్‌లో రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం జరిగింది. రాయలసీమ సమస్యలు, అభివృద్ధి అవకాశాలు, తెలుగు భాషా సాహిత్యాల ప్రాముఖ్యతపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి రాయలసీమకు చెందిన రచయిత భూమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగంలో రాయలసీమ ప్రస్తుత పరిస్థితి, ముఖ్యంగా దీర్ఘకాలంగా వేధిస్తున్న నీటి సమస్యలు, వెనుకబాటుతనం గురించి ఎంతో ఆవేదనతో, స్పష్టంగా వివరించారు.మన ప్రాంత సహజ సంపద అయిన శేషాచలం అడవుల గురించి, ముఖ్యంగా ఎర్రచందనం చెట్ల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ విలువైన సంపదను అక్రమ మార్గాల్లో ఇతర దేశాలకు తరలించి లాభం పొందకుండా, స్థానికంగానే వాటి ఆధారిత పరిశ్రమలను స్థాపించి, ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా మన ప్రాంతాన్ని ఎలా ఆర్ధికంగా బలోపేతం చేయవచ్చో ఆయన చక్కగా వివరించారు. ఆయన మాటలు మనందరిలో కొత్త ఆలోచనలను రేకెత్తించాయి. సహజ వనరులను సక్రమంగా వినియోగించుకుంటే రాయలసీమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే ఆశాభావాన్ని ఆయన కలిగించారు.మరో గౌరవ అతిథిగా కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ఛాన్సలర్, ప్రఖ్యాత విద్యావేత్త ప్రొఫెసర్ పి. కుసుమ కుమారి హాజరయ్యారు. ఆమె తన ప్రసంగంలో తెలుగు భాష మాధుర్యం, సాహిత్యం గొప్పదనం, పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. నంద కోర్వి, అనిత నాగిరెడ్డి, సతీష్ సీరం, బ్రహ్మ చిరా, హరినాథ్ పొగకు, హేమంత్ కాకుట్ల, జగదీశ్వర నందిమండలం, జగదీష్ తుపాకుల, పవన్ పల్లంరెడ్డి, ప్రసాద్ నాగారపు, రాజు కంచం, శివ అద్దేపల్లి, శివ వల్లూరు, శ్రీధర్ బొమ్ము, శ్రీకాంత్ దొంత, సురేష్ మోపూరు, ఉమా గొర్రెపాటి, మరియు కార్తీక్ మేడపాటి ఈ సమావేశానికి హాజరయ్యారు.
క్రైమ్

భూమికపై విచక్షణా రహితంగా దాడి చేసిన భర్త
గుడివాడరూరల్: అనుమానం పెనుభూతమై భార్యపై కత్తితో భర్త విచక్షణా రహితంగా దాడి చేసిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన మట్టా అశోక్, భూమికలకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న అశోక్ చెడు అలవాట్లకు బానిసై తరచూ అనుమానంతో భార్యను వేధిస్తుండేవాడు. ఇటీవల జరిగిన గొడవతో భార్య భూమిక పిల్లలను తీసుకుని సమీపంలో నివాసముంటున్న తల్లి రాణి ఇంటికి వెళ్లింది. ఈక్రమంలో మంగళవారం తన బట్టలు తీసుకునేందుకు చెల్లి అనుష్కతో కలిసి భర్త అశోక్ ఇంటికి వెళ్లిన భూమికపై భర్త కత్తితో విచక్షణా రహితంగా మొఖంపై దాడి చేసి పొట్టలో పొడిచాడు. అడ్డుకోబోయిన చెల్లిపై కూడా దాడి చేయడంతో ఆమె చేతికి తీవ్ర గాయమైంది. అనంతరం అశోక్ పరారయ్యాడు. గాయపడిన వారు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి వారిని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు. భూమిక పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య సేవల నిమిత్తం విజయవాడ తరలించారు. బాధితురాలి తల్లి రాణి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్పీ వి.దీరజ్ వినీల్, స్థానిక పోలీస్ అధికారులతో కలిసి గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వచ్చి ఘటనపై ఆరా తీశారు. అనంతరం ఇందిరానగర్ కాలనీలోని సంఘటనా స్థలానికి డీఎస్పీ వెళ్లి పరిశీలించారు.

అరెస్ట్ చేసిన బాలుడు ఎక్కడ?
హైదరాబాద్: ఎలాంటి తప్పు చేయని తన కుమారుడిని పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి అక్రమంగా నిర్బంధించారని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ మహిళ రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌కు బుధవారం ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కమిషన్..పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశిస్తూ మే 5వ తేదీకి వాయిదా వేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఏప్రిల్ 28న మహబూబ్‌నగర్ జిల్లా కడ్తాల్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసులు తన కమారుడు మేకల కళ్యాణ్‌పై ఎలాంటి కేసు నమోదు చేయకుండా, నోటీసులు ఇవ్వకుండా, కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం కూడా ఇవ్వకుండా బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని ఆరోపిస్తూ అలివేలు అనే మహిళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు దాఖలు చేసింది. పోలీసులు అక్రమ కస్టడీకి తీసుకున్న వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి చూడగా అక్కడ తన కుమారుడు కనిపించలేదని పిటిషన్లో పేర్కొన్నారు.తర్వాత మూడు గంటల సమయంలో తన కుమారుడి ఫోన్ నుంచి కాల్ రాగా అతన్ని కోర్టులో హాజరు పరుస్తున్నామని చెప్పిన పోలీసులు కోర్టు ఎదుట కూడా హాజరు పర్చకుండా ఎక్కడికి తీసుకెళ్లారో కూడా సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. దీంతో న్యాయవాది అమర్నాథ్ ఆధ్వర్యంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేస్తూ తనకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కమిషన్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేస్తూ ఈ కేసుపై విచారణ జరిపించి మే 5వ తేదీలోపు పూర్తి నివేదిక అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆ రోజుకు వాయిదా వేసింది.

థాయ్‌లాండ్‌లో హ్యాండ్లర్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు మంగళవారం అరెస్టు చేసిన అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా కేసు దర్యాప్తు ముమ్మరమైంది. ఈ దందాలో కీలక వ్యక్తిగా భావిస్తున్న ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’ థాయ్‌లాండ్‌లో ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. హవాలా నెట్వర్క్ మీద దృష్టి పెట్టిన పోలీసులు సహకరించిన వారి కోసం ఆరా తీస్తున్నారు. తదుపరి విచారణ నిమిత్తం జ్యుడీíÙయల్ రిమాండ్‌లో ఉన్న అభిష్ క్, హర్షవర్థన్, ధావల్, రాహుల్‌లను పోలీసు కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. దీనికి అనుమతి కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఓజీ కుష్ పండించేదీ అతడేనా..? ఓరిజినల్ గ్యాంగ్‌స్టర్, మారువానా, హైడ్రాపోనిక్ గాంజా, ఓజీ కుష్ ఇలా వివిధ పేర్లతో పిలిచే గంజాయితో పాటు మ్యాజిక్ మష్రూమ్స్‌ను ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’ సరఫరా చేస్తున్నాడు. ఈ గంజాయి థాయ్లాండ్లోనే ఎక్కువగా పండుతుంది. జబల్పూర్కు చెందిన హర్షవర్థన్‌కు ఓడల ద్వారా చేరింది కూడా థాయ్‌లాండ్ నుంచే. దీన్నిబట్టి ఈ ఓజీ కుష్‌ను హ్యాండ్లరే పండించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ నుంచి ఈ ఓజీ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు ఎగుమతి అవుతోంది. హైడ్రోఫోనిక్ టెక్నిక్ విధానంలో కృత్రిమ కాంతితో పండిస్తుంటారు. ఆన్లైన్లో విత్తనాలు ఖరీదు చేసి, ఎల్ఈడీ లైట్లను ఉపయోగించి గంజాయి మొక్కలను పెంచుతారు. ఏమాత్రం మట్టితో అవసరం లేకుండా ప్రత్యేకంగా తయారు చేసిన కుండీలు, ట్రేల్లో ఇసుక, కంకర లేదా నీటిలో అదనపు పోషకాలతో ఉపయోగించి సాగు చేస్తుంటారు. కొందరు మాత్రం కొబ్బరి పొట్టు నారలు, గులకరాళ్లు కూడా వాడతారు. నేలమీద పండే గంజాయి కంటే ఈ ఓజీ నాణ్యత ఎక్కువగా ఉంటుందని చెప్తుంటారు. ఈ మొక్కలు ఓపెన్–రూట్ వ్యవస్థ ద్వారా పోషకాలు, ఆక్సిజన్‌ను నేరుగా తీసుకోవడమే దీనికి కారణం. వ్యవస్థీకృతంగా సాగుతున్న వ్యాపారం... ఈ డ్రగ్స్ క్రమవిక్రయాల దందా మొత్తం పక్కా వ్యవస్థీకృతంగా సాగుతోందని పోలీసులు చెప్తున్నారు. ఎన్‌క్రిపె్టడ్ యాప్స్ ద్వారా ఇండియా నుంచి తనకు వచ్చిన ఆర్డర్ల విషయాన్ని ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’ ఆయా యాప్స్ ద్వారానే హర్షవర్థన్‌కు చేరవేస్తాడు. ఇతడు జబల్పూర్లో ఉన్న హవాలా ఏజెంట్‌కు ఆ కస్టమర్ వివరాలు పంపిస్తాడు. అతగాడు సదరు కస్టమర్ నివసించే ప్రాంతానికి చెందిన మరో హవాలా ఏజెంట్‌కు ఇవి అందిస్తాడు. ఆ వినియోగదారుడిని సంప్రదించే ఈ ఏజెంట్ డబ్బు ముట్టిన తర్వాత జబల్పూర్ ఏజెంట్‌కు బదిలీ చేస్తాడు. అతడి ద్వారా విషయం తెలుసుకునే హర్షవర్థన్ విషయాన్ని ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’కు చెప్తాడు. ఔన్స్ (28.34 గ్రాములు) డ్రగ్‌కు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు క్రిప్టో కరెన్సీ రూపంలో అతడికి పంపిస్తాడు. ఆపై డ్రగ్ హ్యాండ్లర్ నుంచి హర్షవర్థన్‌కు వచి్చ... అక్కడ నుంచి డీటీడీసీ, శ్రీ తిరుపతి, శ్రీ ఆంజనేయులు కొరియర్స్‌లో కస్టమర్‌కు చేరుతుంది. హర్షవర్థన్ కూడా పోలీసుల నిఘాకు చిక్కకుండా ఈ పార్శిల్ బుక్ చేస్తున్నాడు. అక్కడ కస్టమర్ చిరునామా, ఫోన్ నెంబర్ తప్పుగా ఇస్తాడు. దాని ట్రాకింగ్ ఐడీని వినియోగదారుడికి పంపిస్తాడు. దీని ద్వారా ట్రాక్ చేసే కస్టమర్ ఆ పార్శిల్ కొరియర్ ఆఫీసుకు చేరిందని గుర్తించిన వెంటనే అక్కడకు వెళ్లి తీసుకుంటారు. ఈ హవాలా, కొరియర్ నెట్వర్క్ పైనా హెచ్–న్యూ దృష్టి పెట్టింది. ఈ ముఠాలో కీలక పెడ్లర్‌గా ఉన్న హర్షవర్థన్‌కు చెందిన క్రిప్టో వాలెట్లో రోజుకు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు విలువైన బిట్కాయిన్లు డిపాజిట్ అవుతున్నట్లు గుర్తించామని అధికారులు చెప్తున్నారు.

ఫ్రెండ్‌కి సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు వెళ్తూ..
మక్కువ(విజయనగరం): మండలంలోని తూరుమామిడి గ్రామానికి చెందిన నూకమ్మ అలియాస్ ఉమ మంగళవారం తమ ఇంట్లో జరిగిన శుభ కార్యక్రమానికి తనతోపాటు డిగ్రీ చదువుతున్న ఫ్రెండ్స్‌ను ఆహ్వానించింది. స్నేహితులంతా కలిసి మంగళవారం ఆటపాటల్లో మునిగితేలారు. బుధవారం తన ఫ్రెండ్ షర్మిలకు సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు గ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై మక్కువ వెళ్తుండగా టాక్టర్ రూపంలో మత్యువు నూకమ్మను కబళించింది. అంతవరకు గ్రామంలో అందరితో కలివిడిగా ఉండి, ఫ్రెండ్‌ను మక్కువలో డ్రాప్ చేసి వస్తానని చెప్పి, తిరిగిరాని లోకానికి వెళ్లిపోయిందంటూ గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. తూరుమామిడి గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థినికురసాన నూకమ్మ అలియాస్ ఉమ(20) రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై హెడ్ కానిస్టేబుల్ ఎస్. శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నూకమ్మ తన ఫ్రెండ్ షర్మిలకు సెండాఫ్ ఇచ్చేందుకు గ్రామం నుంచి మక్కువకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, మార్గమధ్యంలోని శాంతేశ్వరం గ్రామం సమీపంలో ఎదురుగా ట్రాక్టర్ మితిమీరిన వేగంతో వచ్చింది. టాక్టర్ను తప్పించే ప్రయత్నంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి పడిపోవడంతో నూకమ్మ తలపై నుంచి ట్రాక్టర్ టైర్ వెళ్లగా అక్కడికక్కడే మృతిచెందింది. నూకమ్మ బొబ్బిలిలోని ఓ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. తండ్రి జనార్దనరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సాలూరు ఆస్పత్రికి తరలించారు.
వీడియోలు


Hit 3: ఈ సినిమా వాళ్లకు నచ్చదు..


పవన్ గురించి రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు బొత్స దిమ్మతిరిగే సమాధానం


అక్షయపాత్ర అమరావతి ఎవరి కోసం ? పవన్ తో పాటు లోకేష్ ఫోటో కారణం ఇదేనా!


అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి బలవంతంగా ప్రజల తరలింపు


సింహాచలం గోడ కూలిన ఘటనపై రెండో రోజు త్రీమెన్ కమిటీ విచారణ


ఏపీలో ప్రధాని మోదీ టూర్ షెడ్యూల్


కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు YSRCP ఎంపీ గురుమూర్తి లేఖ


మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడికి జేసీ స్కెచ్


భారత్ వీడే పాక్ పౌరులకు నిబంధనలు సడలింపు


తెరుచుకున్న కేదార్ నాథ్ ఆలయం