Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Serious Comments On CM Chandrababu1
చంద్రబాబూ.. రైతుల గోడు వినిపించడం లేదా?: వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: ఏపీలో రైతుల ఆందోళనలపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ స్పందించారు. కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. ఇది న్యాయమేనా? అని ప్రశ్నించారు. జిల్లాల్లో రైతులు ఆందోళనలు చేస్తుంటే, ఇప్పటికీ రోమ్‌ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా..‘చంద్రబాబు.. కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా వారి గోడు పట్టించుకోవడం లేదు. కనీస మద్దతు ధరలు లభించక, పెట్టిన పెట్టుబడులూ రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్నారు. మీరు, మీ మంత్రులు, యంత్రాంగం కనీసం వారివైపు కన్నెత్తికూడా చూడకపోవడం ధర్మమేనా?మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, వేరుశెనగ, టమోటా, అరటి, చీని, పొగాకు ఇలా ఏ పంట చూసినా కనీస మద్దతు ధరలు రావడం లేదు. చొరవ చూపి, మార్కెట్లో జోక్యం చేసుకోవాలన్న కనీస బాధ్యతను విస్మరించారు. పైగా డ్రామాలతో ఆ రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. ఇది న్యాయమేనా?మిర్చి విషయంలో కూడా మీరు రైతులను నమ్మించి మోసం చేశారు. మిర్చి కొనుగోలు అంశం కేంద్రం పరిధిలో లేకపోయినా, నాఫెడ్‌ కొనుగోలు చేస్తుందని మొదట నమ్మబలికారు. క్వింటాలు రూ.11,781కు కొంటామని చెప్పి, ఒక్కపైసా కూడా ఖర్చు పెట్టకుండా, ఒక్క రైతు నుంచి కాని, ఒక్క ఎకరాకు సంబంధించి కాని, ఒక్క క్వింటాల్‌ గాని కొనకుండా అన్నం పెట్టే రైతులకు సున్నం రాశారు. మా హయాంలో ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3వేల కోట్లు పెట్టి, ఐదేళ్లలో రూ.7, 796 కోట్లు ఖర్చుచేశాం. చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని కనీస మద్దతు ధరల జాబితాలో లేని పొగాకు సహా అనేక పంటల రైతులను ఆదుకున్నాం. మీరు కొత్తగా ఏమీ చేయకపోయినా, కనీసం మా విధానాన్ని కొనసాగించి ఉంటే రైతులకు ఊరట లభించేది కదా? పైగా ఈ ఏడాది బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించడం దారుణం కాదా? ఇందులో కూడా కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయా?.ధాన్యం, కోకో, పొగాకు, ఆక్వా రైతులు ఆయా జిల్లాల్లో ఆందోళనలు చేస్తుంటే, ఇప్పటికీ రోమ్‌ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారు. జనాభాలో 60శాతం మంది ప్రజలు ఆధారపడే వ్యవసాయరంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అది తీవ్ర సంక్షోభానికి దారితీస్తే, లక్షల మంది ఉపాధికి గండిపడితే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? వెంటనే ప్రభుత్వం తరఫున మార్కెట్లో జోక్యం చేసుకోవాలని, కనీస ధరలు లభించని పంటల విషయంలో ప్రభుత్వమే జోక్యంచేసుకుని, మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు..@ncbn గారూ… కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా వారి గోడు పట్టించుకోవడం లేదు. కనీస మద్దతు ధరలు లభించక, పెట్టిన పెట్టుబడులూ రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్నారు. మీరు, మీ మంత్రులు, యంత్రాంగం కనీసం వారివైపు కన్నెత్తికూడా చూడకపోవడం… pic.twitter.com/cW0REI1bV6— YS Jagan Mohan Reddy (@ysjagan) May 3, 2025

CRPF sacks jawan for concealing his marriage with Pak woman2
పాకిస్తాన్ ‘నీడ’ను దాచిపెట్టాడు.. మూల్యం చెల్లించుకున్నాడు!

న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ నీడలు ఎక్కడున్నా పసిగట్టే పనిలో పడింది కేంద్రం. ఈ క్రమంలోనే ఒక భారత జవాన్ దొరికేశాడు. పాకిస్తాన్ మహిళను వివాహం చేసుకుని, ఆ విషయాన్ని తెలియకుండా గుట్టుగా ఉంచాడు. ప్రత్యేకంగా ద సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)కు తెలియకుండా అత్యంత జాగ్రత్త పడ్డాడు.ఇప్పుడు విషయం బయటపడటంతో సదరు జవాన్ ఉద్యోగం పోగొట్టుకోవాల్సి వచ్చింది. సీఆర్పీఎఫ్ 41 బెటాలియన్ కు చెందిన మునీర్ అహ్మద్.. పాకిస్తాన్ మహిళను వివాహం చేసుకుని దాన్ని సీక్రెట్ గా ఉంచడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ విషయాన్ని సీఆర్పీఎఫ్ ధృవీకరించింది. దేశ భద్రతకు సంబంధించి నియమావళిని అహ్మద్ అతిక్రమించడంతో చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఇలా చేయడం దేశ భద్రతకు అత్యంత హానికరం కావడంతోనే జవాన్ అహ్మద్ పై చర్యలు తీసుకోవాల్సినట్లు సీఆర్పీఎఫ్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.పాక్‌ పంజాబ్‌కు చెందిన మినాల్‌ ఖాన్‌కు జమ్ము కశ్మీర్లో డ్యూటీ చేసే సీఆర్పీఎఫ్ జవాన్ మునీర్ ఖాన్ కు కిందటి ఏడాది మేలో ఆన్‌లైన్‌లో వివాహం(నిఖా) జరిగింది. ఈ ఏడాది మార్చిలో షార్ట్ టర్మ్ వీసా మీద ఆమె భారత్‌కు వచ్చింది. మార్చి 22వ తేదీతో ముగిసినప్పటికీ ఇక్కడే ఉండిపోయింది. అయితే ఆమె ఎలా ఉండగలిగిందో ఇప్పటికీ అర్థం కావట్లేదని అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈలోపు పహల్గాం దాడి తర్వాత పాకిస్థానీలు భారత్ ను వీడాలని కేం‍ద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో మినాల్ కు కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఏప్రిల్ 29వ తేదీలోపు పాక్ పౌరులు వెనక్కి వెల్లిపోవాలని కేంద్రం డెడ్ లైన్ విధించింది. ఈ క్రమంలో.. అట్టారీ వాఘా సరిహద్దుకు చేరుకుని బస్సులో కూర్చుందామె. అంతలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది.పూర్తి కథనం కోసం కింద ఆర్టికల్‌ను క్లిక్‌ చేయండిభారత జవాన్‌కు భార్యగా పాకిస్తానీ మహిళా

Virat Kohli Creates World Record, Becomes First Batter To Achieve Huge Milestone3
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

ఐపీఎల్‌-2025లో టీమిండియా స్టార్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో మ‌రో హాఫ్ సెంచ‌రీని కోహ్లి త‌న ఖాతాలో వేసుకున్నాడు. చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో కోహ్లి అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులో ఉన్నంత‌సేపు కింగ్ కోహ్లి బౌండ‌రీల వ‌ర్షం కురిపించాడు. కేవ‌లం 33 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 62 ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలో కోహ్లి ప‌లు అరుదైన రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు.కోహ్లి సాధించిన రికార్డులు ఇవే..👉ఐపీఎల్‌లో ఒక జ‌ట్టుపై అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా కోహ్లి రికార్డుల‌కెక్కాడు. కోహ్లి ఇప్ప‌టివ‌ర‌కు సీఎస్‌కేపై 1146 ప‌రుగ‌లు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గ‌జం డేవిడ్ వార్న‌ర్ పేరిట ఉండేది. వార్న‌ర్ పంజాబ్ కింగ్స్‌పై 1134 ప‌రుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో వార్న‌ర్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు.👉అదేవిధంగా సీఎస్‌కేపై అత్య‌ధిక ఫిప్టీ ప్ల‌స్ స్కోర్లు సాధించిన ప్లేయ‌ర్‌గా కోహ్లి నిలిచాడు. కోహ్లి ఇప్ప‌టివ‌ర‌కు సీఎస్‌కేపై 10 సార్లు ఏభైకి పైగా ప‌రుగులు సాధించాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు శిఖ‌ర్ ధావ‌న్ పేరిట ఉండేది. ధావ‌న్ సీఎస్‌కేపై 9 సార్లు ఫిప్టీ ప్ల‌స్ ప‌రుగులు న‌మోదు చేశాడు.👉వరల్డ్ ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఒకే జట్టు తరపున 300 సిక్సర్లు కొట్టిన ఏకైక ప్లేయర్‌గా విరాట్ నిలిచాడు. ఐపీఎల్‌లో ఆర్సీబీ తరపున కోహ్లి 300 సిక్స్‌లు బాదాడు. కోహ్లి తర్వాతి స్దానంలో క్రిస్ గేల్‌(263) ఉన్నాడు.👉టీ20 క్రికెట్‌లో ఒకే వేదిక‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. బెంగ‌ళూరు చిన్న‌స్వామి స్టేడియంలో కోహ్లి 154 సిక్స్‌లు బాదాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ కూడా చిన్న‌స్వామి స్టేడియంలో 151 కొట్టాడు.👉ఐపీఎల్‌లో 8500 ప‌రుగుల మైలు రాయిని అందుకున్న తొలి ప్లేయ‌ర్‌గా కోహ్లి రికార్డులెక్కాడు.చ‌ద‌వండి: #Kagiso Rabada: కగిసో ర‌బాడపై సస్పెన్షన్ వేటు.. ఐపీఎల్‌కు దూరం?

Police Crack Bheemili Dakamarri Married Woman Case4
భీమిలి వివాహిత కేసు.. బయటపడ్డ సంచలన నిజాలు

సాక్షి, విశాఖపట్నం: భీమిలి మండలం దాకమర్రి వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన క్రాంతి కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం ఆరు బృందాలు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. కేసు వివరాలను విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి మీడియాకు వెల్లడించారు. దాకమర్రి పంచాయతీ శివారు 26వ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఫార్చ్యూన్‌ హిల్స్‌ వుడా లేఅవుట్‌లో నిన్న(శుక్రవారం) ఉదయం సగం కాలిన మహిళ మృతదేహాన్ని భీమిలి పోలీసులు గుర్తించారు.ఆ మహిళను హంతకులు గొంతు కోసి తరువాత పెట్రోల్‌తో దహనం చేసినట్టు గుర్తించారు. మెడలో కాలిన నల్లపూసల గొలుసు ఉండటంతో మృతురాలు వివాహితగా గుర్తించారు. ఆరు ప్రత్యేక బృందాలుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ కేసు మిస్టరీని ఛేదించారు. మృతురాలు వెంకటలక్ష్మికి క్రాంతి కుమార్‌తో అనే వ్యక్తికి అక్రమ సంబంధం ఉన్నట్లు పోలీసులు తేల్చారు.క్రాంతి కుమార్‌కు ఇద్దరు భార్యలు ఉండగా, అతడు రెండో భార్యతో మృతురాలి ఇంటి పక్కన ఉండేవాడు. క్రాంతికుమార్‌, మృతురాలికి మధ్య స్నేహం కుదిరింది. అతనికి వెంకటలక్ష్మితో వివాహేతర సంబంధం ఏర్పడటంతో రెండో భార్యకు, వెంకటలక్ష్మికి మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో రెండో భార్యను వేరే బ్లాక్‌కు మార్చాడు. అయినా వెంకటలక్ష్మితో వివాహేతర సంబంధం కొనసాగించాడు.ఈ విషయంలో మొదటి భార్య, రెండో భార్యతో తరచు గొడవలు జరుగుతున్నాయి. మరో వైపు వెంకటలక్ష్మి.. తనతోనే ఎక్కువసేపు గడపాలని తనతోనే ఉండాలంటూ క్రాంతికుమార్‌పై ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో ఎలాగైన వెంకటలక్ష్మిని వదిలించుకోవాలని.. ప్లాన్‌ చేశాడు. వెంకటలక్ష్మిని బయటకు తీసుకెళ్లాడు. ఇద్దరు ఐస్‌క్రీమ్ తిన్నారు. అనంతరం బైక్‌లో పెట్రోల్ కొట్టించి.. బాటిల్లో కూడా కొట్టించాడు. ఇంటి వద్ద పెట్రోల్ దొంగలు ఉన్నారని.. అందుకే బాటిల్లో పెట్రోల్ కొట్టించానంటూ వెంకటలక్ష్మితో చెప్పాడు.శారీరకంగా కలుద్దామని చెప్పి దాకమర్రి లేవట్‌కి తీసుకెళ్లి వెంకటలక్ష్మిని కత్తితో గొంతు కోసి చంపేశాడు. తరువాత ఆమె ఒంటిపై ఉన్న నగలు తీసుకుని.. తరువాత పెట్రోల్ పోసి తగలుపెట్టాడు. కేసు విచారణలో మొదట వెంకటలక్ష్మిని గుర్తించాము. తర్వాత కాంత్రితో వెళ్తున్నట్లు తన తల్లి చెప్పిందని కొడుకు పోలీసులకు చెప్పారు. ఆ కోణంలో విచారణ చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.

Queensland Entrepreneur Monique Jeremiah Earned Extra Money By Renting Out Half Of Her Bed5
మంచంలో సగం అద్దెకు.. ఆశ్చర్యపడే ఆదాయం సంపాదిస్తున్న మహిళ!

అద్దెకు తీసుకోవడం అనే మాట వినిపిస్తే.. సాధారణంగా ఇల్లు, కారు, బైకు మొదలైనవి రెంటుకు తీసుకోవడం అని అనుకుంటారు. కానీ ఒక మనిషి ఉపయోగించే మంచంలో సగం అద్దెకు తీసుకుంటారా?, ఇది వినడానికి కొత్తగా అనిపించినా.. ఇదే ఆలోచనతో ఓ మహిళ నెలకు రూ. 54,000 సంపాదిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు క్లుప్తంగా ఈ కథనంలో తెలుసుకుందాం.క్వీన్స్‌ల్యాండ్‌కు చెందిన 38 ఏళ్ల మహిళ 'మోనిక్ జెరెమియా'.. "హాట్ బెడ్డింగ్" అనే కొత్త ట్రెండ్ ద్వారా అదనపు డబ్బు సంపాదించడం మొదలుపెట్టింది. ఆమె తన మంచంలో సగం అద్దెకు ఇస్తూ నెలకు 985 ఆస్ట్రేలియా డాలర్లను (రూ.54,000) వసూలు చేస్తోంది. ఎటువంటి భావోద్వేగ సంబంధాలు లేకుండా ఎవరి పక్కనైనా పడుకోవాలనేది ఆమె ఆలోచన.హాట్ బెడ్డింగ్ ద్వారా బెడ్ షేర్ చేసుకునే వ్యక్తులు ఇద్దరూ నియమాలను అర్థం చేసుకుంటే డబ్బు సంపాదించడానికి ఇది మంచి మార్గమని జెరెమియా నమ్మింది. మీరు నాలాగే సాపియోసెక్సువల్ అయితే, శారీరక సాన్నిహిత్యం కంటే.. మానసిక సాంగత్యాన్ని ఇష్టపడితే.. ఒకే బెడ్ మీద ఇద్దరు నిద్రపోవచ్చని చెబుతోంది.2020 కరోనావైరస్ మహమ్మారి సమయంలో ఉద్యోగ కోల్పోయి.. ఒంటరిగా ఉన్నప్పుడు ఈ "హాట్ బెడ్డింగ్" ఆలోచన వచ్చింది. తన మొదటి బెడ్ క్లయింట్ తనకు తెలిసినవాడేనని.. అందువల్ల ప్రారంభంలో అంత ఇబ్బంది ఏమీ అనిపించలేదని మోనిక్ జెరెమియా చెప్పింది. ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ.. నియమాలను గౌరవించుకుంటే.. ఒక రూమ్ షేర్ చేసుకున్నట్లు, బెడ్ షేర్ చేసుకోవచ్చు అని అంటోంది. కష్ట సమయంలో.. డబ్బు సంపాదించడానికి హాట్ బెడ్ ఐడియా ఒక స్మార్ట్ మార్గం అని జెరెమియా చెబుతోంది.ఇదీ చదవండి: 'అతిపెద్ద మార్కెట్ క్రాష్ జరుగుతుంది': జాగ్రత్తగా ఉండండి

Pahalgam: Sri Lankan Airlines Flight From Chennai Searched At Colombo6
పహల్గాం ఉగ్రదాడి.. చెన్నై నుంచి కొలంబో.. విమానంలో అనుమానితులు?

కొలంబో: పహల్గాంలో కాల్పులు జరిపిన ఉగ్రవాదులు కొలంబో చేరుకున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. కొలంబో ఎయిర్‌పోర్టులో భారీ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. చెన్నై నుంచి కొలంబో వెళ్లిన విమానంలో ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది, స్థానిక పోలీసులు తనిఖీలు చేపట్టారు. భారత్‌ నిఘా వర్గాల సమాచారంతో సోదాలు చేపట్టారు. శ్రీలంక ఎయిర్‌లైన్స్ చెందిన యూఎల్‌ 122 విమానంలో చేపట్టిన విస్తృత తనిఖీల్లో ఆరుగురు అనుమానితులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. పహల్గాం దాడితో సంబంధాలున్నట్లు అనుమానం వ్యక్తమవుతున్నాయి.కాగా, పహల్గాం ఉగ్రదాడిపై ఎన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటివరకు 3వేల మందికి పైగా ఎన్‌ఐఏ విచారించింది. ఇప్పటికే 90 మంది ఓవర్‌ గ్రౌండ్‌ వర్కర్లపై కేసులు నమోదుచేసింది. 100కుపైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. రేపు(ఆదివారం) కేంద్ర హోంశాఖకు నివేదిక ఇవ్వనుంది. ఈ కేసులో భాగంగా 2023లో రాజౌరీలో జరిగిన ఉగ్రదాడి కేసులో అరెస్టయిన ఇద్దరు వ్యక్తుల్ని ప్రశ్నించింది. ప్రస్తుతం జమ్ములోని కోట్‌ భల్వాల్‌ జైల్లో ఉన్న లష్కరే తోయిబా ఓవర్‌ గ్రౌండ్‌ వర్కర్స్‌ నిస్సార్‌ అహ్మద్‌, ముస్తాక్‌ హుస్సేన్‌ను విచారించింది. పహల్గాం ఉగ్రదాడిలో వీరికి సంబంధాలు ఉన్నాయా? అనే అనుమానంతోనే వారిని ఎన్‌ఐఏ అధికారులు విచారించినట్లు సమాచారం.పహల్గాం దాడి ఘటనపై ఎన్‌ఐఏ దర్యాప్తులోపలు సంచలన విషయాలు వెలుగులో వస్తున్నాయి. ఈ దాడి వెనుక పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా, పాక్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ హస్తం ఉన్నట్లు ప్రాథమిక నివేదికలో పేర్కొంది. లష్కరే తోయిబా ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్లు తేల్చింది. ఈ దాడికి పాకిస్థాన్‌లోని లష్కరే ప్రధాన కార్యాలయంలోనే ప్లాన్‌ చేసినట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది.

Police Detained Accused Of Vizag Incident7
విశాఖ జంట హత్యల కేసు.. వివాహేతర సంబంధమే కారణం!

విశాఖ: నగరంలో కలకలం సృష్టించిన జంట హత్యల కేసులో పురోగతి సాధించారు పోలీసులు. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వృద్ధ దంపతుల డబుల్ మర్డర్ కేస్ లో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రసన్న కుమార్ మిశ్రాను అదుపులోకి తీసుకున్నారు. అప్పు తీర్చాలని అడిగినందుకు యోగేంద్ర బాబు, లక్ష్మీల హత్య చేసినట్లు విచారణలో తేలింది. ఆర్థిక లావాదేవీలతో పాటు వివాహేతర సంబంధం కూడా కారణమని పోలీసులు తేల్చారు. నిందితుడు ప్రసన్న కుమార్‌ మిశ్రా.. హత్య గావించబడ్డ లక్ష్మీతో అత్యంత సన్నిహితంగా ఉంటూ వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యగావించబడ్డ యోగేంద్ర కుటుంబంతో నమ్మకంటూ వారిని మిశ్రా హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.హత్యకు గురైన దంపతులు ఏప్రిల్ 24వ తేదీ గురువారం ఉదయం హైదరాబాద్‌ నుంచి తిరిగి వచ్చారు. అక్కడ గ్లోరియా పాఠశాల అడ్మిన్‌కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని వచ్చారు. అదే సమయంలో రాజీవ్‌నగర్‌లో గ్రామదేవత పండగ జరుగుతుండటంతో ఆ పరిసరాలు కాస్త సందడిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హత్య పథకాన్ని ప్రసన్న కుమార్ మిశ్రా అమలు చేశాడు. దీనిపై విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి మాట్లాడారు. డబుల్ మర్డర్ కేసు గురుంచి సీఎం కూడా మమ్మల్ని అడిగారు. అంతర్జాతీయ స్థాయిలో నేరాలకు పాల్పడ్డ వ్యక్తి నిందితుడు. హత్యలకు వివాహేతర సంబంధమే కారణం. నిందితుడు ప్రసన్న కుమార్ మిస్రాకు యోగి బాబు దంపతులతో కొన్ని ఏళ్లుగా పరిచయం. మిశ్రా భార్యకు లక్ష్మితో స్నేహం ఉంది. కోవిడ్ సమయంలో మిశ్రా భార్య మృతి చెందింది. అనంతరం లక్ష్మితో సాన్నిహిత్యం ఏర్పరుచుకున్నాడు మిశ్రా.నిందితుడు ఒరిస్సా రాష్ట్రం పూరీకి చెందినవాడు. 2012 లో దుబాయిలో ఓ జ్యువెలరీ షాప్ లో పని చేస్తూ దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు మిశ్రా. 5 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి ఇండియాకు తిరిగి వచ్చాడు. ఐదు లక్షల రూపాయల అప్పు తీర్చుటకు ఈ ఘాతుకానికి పాల్పడ్డ నిందితుడు. అంతర్జాతీయ స్థాయిలో నేరాలకు పాల్పడ్డ వ్యక్తి నిందితుడులక్ష్మి మృతదేహం నుండి 4.5 తులాల బంగార ఆభరణాలు, స్కూటీ దొంగలించాడు నిందితుడు. దొంగలించిన సొత్తును పూరీలో అమ్మి సొమ్ము చేసుకొన్న నిందితుడు. నిందితుడు వద్ద నుండి నాలుగు లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. కేసు చేదించడానికి పది బృందాలు నియమించాం’ అని సీపీ తెలిపారు.

Will Strike Any Structure Built To Divert Indus Water: Pak Minister8
మరింత అగ్గి రాజేసేలా.. పాక్‌ మంత్రి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

తీరుమార్చుకోని పాకిస్థాన్‌ మరోసారి బెదిరింపులకు దిగింది. సింధూ జలాలను మళ్లించే ఏ నిర్మాణమైనా పేల్చేస్తామంటూ పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ వ్యాఖ్యానించారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందాన్ని భారత్‌ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై మాట్లాడిన పాక్‌ రక్షణ మంత్రి.. సింధూ జలాలను మళ్లించేందుకు భారత్‌ ఏ నిర్మాణం చేపట్టినా ధ్వంసం చేస్తామంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. పాక్ నేత చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరింత అగ్గిని రాజేస్తున్నాయి.తాజాగా పాకిస్థాన్‌ ఓడలపై భారత్‌ నిషేధం విధించింది. పాకిస్థాన్‌ జెండా ఉన్న ఏ ఓడ కూడా భారత జలాలలోకి, పోర్టుల్లోకి ప్రవేశించకూడదని స్పష్టం చేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్‌పై కఠిన వైఖరి అవలంబిస్తోంది. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలే తీసుకుంటోంది.అన్ని రకాల మెయిల్స్‌, పార్సిళ్ల ఎక్స్ఛేంజీ నిలిపివేసింది. పాక్‌ నుంచి వాయు, ఉపరితల మార్గాల్లో వచ్చే మెయిల్స్‌, పార్సిళ్లపై ఆంక్షలు విధించింది. కాగా, భారత్‌లో ఉన్న పాక్ జాతీయులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలంటూ వీసాలను కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌తో 1960లో కుదిరిన సింధు జలాల నదీ ఒప్పందం నిలిపివేత నేపథ్యంతో భారత్‌ను ఉద్దేశించి పలువురు పాక్‌ నేతలు అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.

farmer turned entrepreneur earns rs 7 lakhs per month by millet idli9
దిల్‌ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలు

ఫుడ్‌ బిజినెస్‌కు ఎపుడూ మంచి డిమాండ్‌ ఉంటుంది. శుభ్రత, రుచిని అందిస్తే ఆహార వ్యాపారానికి మించింది లేదు. కొంతమంది ఏ వంట చేసినా భలే రుచిగా ఉంటుంది. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. అంత మహాత్యం ఉంటుంది వారి చేతి వంటలో. బహుశా వారు చేసే పని పట్ల శ్రద్ద, నైపుణ్యం దీనికి కారణం కావచ్చు. ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యతనిస్తూ, ఫుడ్‌ బిజినెస్‌లో రాణిస్తున్నవారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు తెలుగు రాష్ట్రానికి చెందిన చిట్టెం సుధీర్. దక్షాణాది వంటకమైన ఇడ్లీకి మరింత ఆరోగ్యంగా, రుచిగా అందిస్తూ తెలుగోడి సత్తా చాటుకున్నాడు. పదండి సుధీర్‌ సక్సెస్‌ గురించి తెలుసుకుందాం.చిట్టెం సుధీర్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం. అగ్రికల్చర్ ఎకనామిక్స్‌లో ఎంఏ చేసిన సుధీర్, మంచి ఉద్యోగాన్ని వదిలి 2018లో మిల్లెట్ ఇడ్లీ అమ్మడం ప్రారంభించాడు. ఉన్నత విద్య పూర్తి చేసిన సుధీర్ మంచి ఉద్యోగం చేసే వాడు, మంచి ఉద్యోగం. సౌకర్యవంతైన జీవితం. అయితే వ్యవసాయంపై మక్కువ, వ్యాపారం చేయాలన్న ఆలోచనతో సుధీర్ భిన్నంగా ఆలోచించాడు. పట్టణ ప్రాంతాల ప్రజలకు ఆరోగ్యకరమైన మిల్లెట్ ఇడ్లీలను అందించాలని నిర్ణయించుకున్నాడు. రూ.50 వేలతో ప్రారంభించాడు. అనతి కాలంలోనే అతని ఇడ్లీ బహుళ ప్రజాదరణకు నోచుకుంది. సరసమైన ధర, రుచికి రుచి దీంతో అతని దుకాణం ముందు ఇప్పుడు జనం క్యూలో ఉన్నారు. విశాఖపట్నంలోని ఎంవిపి కాలనీలో ఆరోగ్యమైన చిరు ధాన్యాలతో, సరసమైన ధరలో రుచికరమైన ఇడ్లీలు అమ్మడం ద్వారా అతని సంపాదన నెలకు 7 లక్షల రూపాయలు.ఇదీ చదవండి: నా డ్రీమ్స్‌.. కరియర్‌ : ఇపుడు కొత్తగా, ప్రతీక్షణం ఆస్వాదిస్తున్నాఎనిమిది రకాల చిరుధాన్యాల మిశ్రమాన్ని ఉపయోగించి ఇడ్లీలను తయారు చేస్తారు. అల్లం, క్యారెట్ వంటి కూరగాయలతో తయారు చేసిన చట్నీలతో వడ్డిస్తారు. పట్టణ ప్రాంత ప్రజలకు ఆరోగ్య కరమైన ఆహారాన్ని అందించడంమాత్రమే కాదు, మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు చిరుధాన్యాలను కొనుగోలు చేయడం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లోని గిరిజన రైతుల నుంచి ప్రతినెలా 700 కిలోల మినుము కొనుగోలు చేస్తూ వారి చేయూత నందించడం విశేషం.అయితే ది మిల్లెట్ మ్యాన్ సుధీర్‌ సక్సెస్‌ జర్నీ అంత ఈజీగా ఏమీ సాగలేదు. ప్రారంభంలో చాలా కష్టాలను సవాళ్లను, ఎదుర్కొన్నాడు. సుధీర్ కుటుంబం అతనికి మద్దతు ఇవ్వలేదు. కానీ సుధీర్ వెనక్కి తగ్గలేదు. అతనికి సంకల్పానికి కృషికి, చివరికి ఫలితం దక్కింది. ‘వాసేనా పోలి’ స్టాల్‌ విశాఖపట్నంలో ఒక ల్యాండ్‌మార్క్‌గా మారింది, ఉదయం 6:30 గంటల నుండే క్యూలో ఉండే కస్టమర్లకు ప్రతిరోజూ 200 కంటే ఎక్కువ ప్లేట్‌లను అందిస్తోంది. చిట్టెం సుధీర్ స్టాల్‌ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దృష్టిని కూడా ఆకర్షించింది. ఆయన సుధీర్‌ స్టాల్‌ను సందర్శించారు కూడా. ఇదీ చదవండి: స్కూటీపై కన్నేసిన ఎద్దు : ఇది టెస్ట్‌ రైడ్‌ బ్రో..!

Vijay Devarakonda Clarifies Tribes Remarks10
‘గిరిజన’ వివాదంపై స్పందించిన విజయ్‌ దేవరకొండ

గిరిజనులను కించపరిచేలా మాట్లాడారంటూ విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda)పై ట్రైబల్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ కిషన్‌ రాజ్‌ చౌహాన్..పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రెట్రో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో హీరో విజయ్‌ మాట్లాడుతూ..గిరిజనులను ఉగ్రవాదులతో పోల్చారని, అతనిపై చర్యలు తీసుకోవాలని కిషన్‌ రాజ్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా ఈ వివాదంపై హీరో విజయ్‌ దేవరకొండ స్పందించారు. తాను ఏ కమ్యూనిటీనీ కించపరిచేలా మాట్లాడలేదని, దేశం మొత్తం ఒక్కటే అని, మనమంతా ఒకే కుటుంబం అని తెలియజేయడానికే ఆ వ్యాఖ్యలు చేశానని చెప్పారు. తన మాటలు ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే.. చింతిస్తున్నానని సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశారు.ఇంతకీ ఏం జరిగింది?తమిళ హీరో సూర్య హీరోగా నటించిన రెట్రో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి విజయ్‌ దేవరకొండ ముఖ్య అతిథిగా వెళ్లాడు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి గురించి మాట్లాడుతూ.. ఇండియా పాకిస్తాన్‌పై దాడి చేయాల్సిన అవసరం లేదు.. క్కడి ప్రజలకే విరక్తి వచ్చి పాక్‌ ప్రభుత్వంపై తిరగబడతారు. 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్‌ కొట్టుకున్నట్లు.. బుద్ధి లేకుండా, కనీస కామన్‌ సెన్స్‌ లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు. మనమంతా ఐకమత్యంగా ఉండాలి’ అని విజయ్‌ అన్నారు. ఈ వ్యాఖ్యలు గిరిజనులను ఉగ్రవాదులతో పోల్చాయని, వారిని అవమానించాయని కిషన్ రాజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయ్‌పై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా ఉద్దేశం అది కాదు: విజయ్‌అయితే విజయ్‌ మాత్రం ట్రైబ్స్‌ అనే పదం వాడిన మాట నిజమే కానీ.. దాని అర్థం గిరిజనులు కాదని అంటున్నాడు. ‘వందల ఏళ్ల కిందట సమాజం, ప్రజలు గుంపులుగా వ్యవస్థీకృతమై ఉండేవాళ్లని నా ఉద్దేశం. అలాంటి సమయంలో రెండు వర్గాల మధ్య తరచూ ఘర్షణలు చోటు చేసుకునేవి. ఆ సెన్స్‌లోనే ట్రైబ్స్‌ అనే పదం వాడాను. అంతేకానీ, ఇప్పుడున్న షెడ్యూల్‌ ట్రైబ్‌ని ఉద్దేశించి నేను వ్యాఖ్యలు చేయలేదు. అయినా కూడా నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకొని హర్ట్ అయితే విచారం వ్యక్తం చేస్తున్నాను’ అని విజయ్‌ తన ఎక్స్‌ ఖాతాలోరాసుకొచ్చాడు. శాంతి, అభివృద్ధి, ఐక్యత గురించి మాత్రమే తాను మాట్లాడనని, మనమంతా ఒక్కటే అని చెప్పడమే తన ఉద్దేశం అన్నారు. ఈ మాటకు ఎ‌వరైనా To my dear brothers ❤️ pic.twitter.com/QBGQGOjJBL— Vijay Deverakonda (@TheDeverakonda) May 3, 2025

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement