Top Stories
ప్రధాన వార్తలు

కుట్టు స్కీమ్.. రూ. 150 కోట్ల స్కామ్!
తొలుత రూ.వంద కోట్లతో మాత్రమే ప్రతిపాదన..! ఆపై అంచనాలు అమాంతం రూ.257 కోట్లకు పెంపు..! టెండర్ నుంచి శిక్షణ వరకు దోపిడీకి వీలుగా పథకం..! అనంతరం పదుల సంఖ్యలో కూడా లేని లబ్ధిదారులను భారీగా ఉన్నట్టు చూపించి.. అరకొరగా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి.. వారికి పరికరాలు, మెషిన్ ఇవ్వకుండానే ఇచ్చినట్టు చెప్పుకొంటూ చంద్రబాబు ప్రభుత్వం భారీ కుంభకోణానికి తెరలేపింది. దాదాపు రూ.154 కోట్లకు పైగా దండుకోవడానికి సిద్ధమైంది. కంకిపాడు నుంచి సాక్షి ప్రతినిధి: చంద్రబాబు ప్రభుత్వం తన అవినీతికి కాదేదీ అనర్హం అన్నట్టు వ్యవహరిస్తోంది. బీసీలు, ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలు (ఈడబ్ల్యూఎస్), కాపు మహిళలకు ఇచ్చే కుట్టు శిక్షణలోనూ రూ.154 కోట్లకు పైగా కొల్లగొట్టడానికి పథకం వేసింది. రాష్ట్రంలో 1,02,832 మంది మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు అందించే పేరుతో చేపట్టిన స్కీమ్‌లో దోపిడీకి తెగబడుతోంది. ముఖ్య నేత సమక్షంలో జరిగిన ముందస్తు ఒప్పందాలతోనే ఈ స్కీమ్‌ను తెరమీదకు తెచ్చారని తెలుస్తోంది. ఇందులో ముఖ్య నేత నుంచి సంబంధిత శాఖ మంత్రి, అధికారుల వరకు ఎవరి వాటా ఎంత అనేది ఒప్పందాలు కుదుర్చుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలకు కుట్టు శిక్షణ పథకానికి సంబంధించి ‘సాక్షి’ క్షేత్ర స్థాయి పరిశోధనలో విస్మయకర అంశాలు వెలుగుచూశాయి. – అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న రాష్ట్రంలో లక్ష మందికి పైగా మహిళలకు శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లు అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. 175 నియోజకవర్గాల్లోనూ మూడు నుంచి ఐదు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎంపిక చేసిన మహిళలకు శిక్షణ ఇస్తామన్నారు. ఇది జరిగి 45 రోజులు దాటినా 50 నియోజకవర్గాల్లో కూడా శిక్షణ మొదలుకాలేదు. ఆ పేరుతో రూ.వంద కోట్లకుపైగా కొల్లగొట్టే కార్యక్రమం మాత్రం నిర్విఘ్నంగా సాగుతోంది.టెండర్ల దశ నుంచే మాయాజాలంటెండర్లలో తక్కువ మొత్తానికి కోట్ చేసిన సంస్థకు కాంట్రాక్టును ఖరారు చేస్తారని తెలిసిందే. కానీ, అందుకు విరుద్ధంగా.. తక్కువ కోట్ చేసినవారితో పాటు అంతకంటే ఎక్కువకు కోట్ చేసిన మరో రెండు సంస్థలను కలిపి రంగంలోకి దించారు. ప్రి బిడ్‌లో మొత్తం 65 కంపెనీలు పాల్గొంటే 56 సంస్థలను ముందే తిరస్కరించారు. విచిత్రం ఏమంటే.. కుట్టు శిక్షణలో విశేష అనుభవంతో పాన్ ఇండియా కంపెనీగా గుర్తింపున్న ఐసీఏ కూడా ఇందులో ఉండడం. మిగిలిన 9 కంపెనీల్లో ఆరు సంస్థల టెండర్లను తెరవకముందే తమదైన శైలిలో పక్కకు తప్పించేశారు. అంటే.. మొత్తం 65 కంపెనీల్లో 62ను తొలగించేశారు. ఇది కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం కావడం గమనార్హం.ఎల్1కు 5 శాతమే పని.. చంద్రబాబు ప్రభుత్వం తమవారికి శిక్షణ కాంట్రాక్టు అప్పగించడానికి ఇన్ని అడ్డంకులు పెట్టినా తట్టుకుని.. శ్రీ టెక్నాలజీ తక్కువ మొత్తానికి కోట్ చేసి ఎల్1గా నిలిచింది. కానీ, దానిని బెదిరించి 5 శాతం పని మాత్రమే అప్పగించారు. కీలక నేత ప్రమేయంతో.. ఎల్2, ఎల్3గా నిలిచిన సంస్థలకు మాత్రం 95 శాతం పని ఇచ్చారు. ఈ రెండు సంస్థలు (ఎల్2, ఎల్3) సిండికేట్ కావడం మరో ట్విస్ట్.శిక్షణ ముసుగులో..ఒక్కో మహిళ (యూనిట్) శిక్షణకు రూ.21,798 కేటాయించారు. ఇందులో టైలరింగ్‌లో శిక్షణ, టైలరింగ్ కేంద్రానికి అద్దె, మహిళకు కుట్టు మిషన్, ఇతర పరికరాల పంపిణీ వంటివి ఉన్నాయి. ఒక్కో మహిళకు 360 గంటల పాటు ఉచిత శిక్షణ ఇవ్వాలి. రోజుకు 4 గంటలు చొప్పున 90 రోజులు, 6 గంటలు చొప్పున 60 రోజులు, 8 గంటలు చొప్పున 45 రోజులు శిక్షణ ఇవ్వాల్సి ఉంది. కానీ, ఎక్కడా ఇది అమలవడం లేదు. పైగా శిక్షణకు అవసరమైన టేప్, కత్తెర, స్కేల్ తదితర పరికరాల కిట్‌ను కూడా లబ్ధిదారులనే తెచ్చుకోమంటున్నారు.–కుట్టు మిషన్లు కూడా ప్రముఖ కంపెనీలైన ఉషా, మెరిట్, సింగార్, పూజా తదితర కంపెనీలవి కాకుండా అతి తక్కువ ధరకు గుజరాత్లో తయారు చేసినవి అంటగడుతున్నారు. ఈ మొత్తాన్ని కాంట్రాక్టర్లే మిగుల్చుకుంటున్నారు.–శిక్షణ కేంద్రాలను ప్రభుత్వ భవనాల్లోనే ఏర్పాటు చేశారు. కానీ, వాటిని అద్దెకు తీసుకుని నడుపుతున్నట్లు చెబుతూ కాంట్రాక్టర్లు భారీగా వెనకేసుకుంటున్నారు. శిక్షణ కేంద్రాల్లో మహిళలకు తాగు నీరు, బాత్రూమ్ కూడా లేవు. –శిక్షణ చాలాచోట్ల శిక్షణ అంతంతమాత్రంగానే జరుగుతోంది. శిక్షకులు లేరనో.. లబ్ధిదారులు తగినంతమంది లేరనో చెబుతున్నారు. వాస్తవం ఏమంటే.. అరకొర సెంటర్లు ఏర్పాటు చేసి, అంతంతమాత్రంగా శిక్షణ ఇచ్చి ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టడమే లక్ష్యంగా కాంట్రాక్టర్లు కథ నడిపిస్తున్నారు.ప్రముఖ సంస్థలను తోసిరాజని..కుట్టు శిక్షణ ఇచ్చేందుకు సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (సీడాప్), ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, సాంకేతిక కన్సల్టెన్సీ సంస్థ (ఏపీఐటీసీవో)తో పాటు కేంద్ర సంస్థ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్ యోజన (డీడీయూజీకేవై) ఉన్నాయి. వీటికి శిక్షణ కేంద్రాలు, శిక్షణ భాగస్వాములు ఉన్నారు. స్కిల్ పోర్టల్స్, అన్ని జిల్లాల్లో పర్యవేక్షణ వ్యవస్థ, సిబ్బంది సైతం ఉన్నారు. అయినా వాటిని కాదని ఆంధ్రప్రదేశ్ బీసీ సహకార ఆర్థిక సంస్థ ద్వారా స్కీమ్‌ను చేపట్టడం భారీ స్కామ్‌కు మార్గం సుగమం చేసుకోవడమేననే ఆరోపణలు వస్తున్నాయి.ప్రభుత్వ వైఫల్యం.. నిర్లక్ష్యానికి నిలువుటద్దం–సాక్షి క్షేత్ర స్థాయి పరిశీలనలో తేటతెల్లంకృష్ణా జిల్లా కంకిపాడులోని మహిళా శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్) ప్రాజెక్ట్ కార్యాలయం పై అంతస్తులోని టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని ‘సాక్షి’ పరిశీలించింది. ఇక్కడ 140 మందిని ఎంపిక చేసి ఉదయం 70, మధ్యాహ్నం 70 మందికి శిక్షణ ఇస్తున్నట్టు చెబుతున్నారు. ‘సాక్షి’ ప్రతినిధి ఏప్రిల్ 19న ఉదయం 11 గంటలకు వెళితే 16 మందే ఉన్నారు. మిషన్లు కూడా 20 మాత్రమే. బాగా పాతవైన ఇవి తుప్పుపట్టాయి. వచ్చినవారిలో ముగ్గురు అరగంటలోనే వెళ్లిపోయారు. మరో అరగంటకు 9 మంది వచ్చారు. శిక్షణ లేకపోవడంతో కబుర్లు చెప్పుకొంటూ కనిపించారు. కనీసం క్లాత్ కటింగ్‌కు బల్ల కూడా లేదు. కోలవెన్ను నుంచి రోజూ ఆటోలో వచ్చి వెళ్లడానికి రూ.వంద అవుతోందని పలువురు వాపోయారు. – కృష్ణా జిల్లా బంటుమిల్లిలో 138 మందిని ఎంపిక చేసినట్టు చెబుతున్నా.. కనీసం కుట్టు మిషన్లు కూడా లేవు. ఈ సెంటర్‌కు ఒక శిక్షకురాలితో పాటు వచ్చింది ఇద్దరే. మచిలీపట్నంలో మరీ చిత్రం ఐదు సెంటర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ ఏ ఒక్క కేంద్రంలోనూ శిక్షణ మొదలులేదు.ఎమ్మెల్యే కార్యాలయంలోనే శిక్షణ కేంద్రం పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఏకంగా తన కార్యాలయంలోనే దర్జీ శిక్షణ కేంద్రం పెట్టుకున్నారు. శిక్షణ ఇవ్వకున్నా ఎవరూ అడగరని, తమ పార్టీ వాళ్లకే ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వొచ్చని ఇలా చేశారని అంటున్నారు. కుట్టు శిక్షణ కేంద్రం ఎక్కడుందని పెనమలూరు ఎంపీడీవో బండి ప్రణవిని వివరణ కోరగా ఎమ్మెల్యే కార్యాలయంలో అని చెప్పడం గమనార్హం.రూ.257 కోట్లు స్కీ (స్కా)మ్ ఇలా.. –మొదట యూనిట్‌కు రూ.25 వేలు చొప్పున మొత్తం రూ.257 కోట్లు ప్రతిపాదించారు–టెండర్లో యూనిట్‌కు రూ.21,500 వంతున 1,02,832 మంది మహిళలకు మొత్తం రూ.221,08,88,000–ఇందులో ఒక్కో కుట్టు మిషన్ రూ.4,300 లెక్కన: రూ.44,21,77,600–ఒక్కొక్కరికి శిక్షణ కోసం రూ.3 వేలు చొప్పున: రూ.30,84,96,000–ఒక్కొక్కరికి కుట్టు మిషన్, శిక్షణ కలిపి: రూ.7,300. ఈ ప్రకారం మొత్తం అయ్యేది 75,06,73,600.–రూ.221,08,88,000 కోట్లలో రూ.75,06,73,600 కోట్లు పోగా 146,02,14,400 స్కామ్ ఒక్క కుట్టు మిషన్‌కు ఏ సంస్థ ఎంతకు కోట్ చేసిందంటే..?–శ్రీ టెక్నాలజీ ఇండియా(ఎల్ఎల్పీ)–హైదరాబాద్ రూ.21,798–సోషల్ ఏజెన్సీ ఫర్ పీపుల్స్ ఎంపవర్మెంట్–హైదరాబాద్ రూ.23,400–సెంటర్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్–హైదరాబాద్ రూ.23,500మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వండి.. పంచుకుందాంనిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్లకు ముందస్తు చెల్లింపునకు సిద్ధంఒప్పందంలో లేకున్నా రూ.25 కోట్ల అడ్వాన్సులకు ప్రతిపాదనలుమంత్రి సంతకం మాత్రమే మిగిలింది.. తర్వాత పంచుకు తినడమే శిక్షణ పేరుతో 50 రోజుల్లోనే మొత్తం దండుకునేందుకు సిద్ధంరాష్ట్రవ్యాప్తంగా ఇంకా పూర్తిస్థాయిలో కుట్టు శిక్షణే ప్రారంభం కాలేదు. మొబిలైజేషన్ అడ్వాన్సు కింద రూ.25 కోట్లను కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. స్కీమ్‌కు సంబంధించి టెండర్ ఖరారై ఒప్పందం కుదిరిన మరుక్షణం నుంచే అడ్వాన్సుల కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. తొలుత రూ.60 కోట్ల అడ్వాన్సుల కోసం ప్రయత్నించి భంగపడిన కాంట్రాక్టర్లు తాజాగా రూ.25 కోట్లను రాబట్టుకోబోతున్నారు. ఈ మేరకు కాంట్రాక్టర్లు పొలిటికల్ బాస్‌కు రాయబారం పంపి అనుకున్నది సాధించారు. తద్వారా తమ వాటాల వసూలుకు ముఖ్య నేతలు మార్గం సుగమం చేసుకుంటున్నారని సమాచారం. నీకింత.. నాకింత తరహాలో పంచుకోవడానికి కాంట్రాక్టర్లతో కలిసి ముఖ్య నేతలు సిద్ధమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అడ్వాన్సులిస్తే తమ మెడకు చుట్టుకుంటుందని అధికారులు ససేమిరా అంటున్నా.. వారిని దారికి తెచ్చుకుని పని చక్కబెట్టడానికి ‘పొలిటికల్ బాస్’ సరే అన్నారని సమాచారం. టెండర్ నిబంధనలకు విరుద్ధంగా..వాస్తవానికి బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు మహిళలకు టైలరింగ్ శిక్షణ ప్రారంభమైన 15 రోజులకు 33 శాతం, 30 రోజులకు మరో 33 శాతం, 50 రోజులకు మిగిలిన 33 శాతం బిల్లులు చెల్లించేలా టెండర్లో పేర్కొన్నారు. అంటే.. శిక్షణ పేరుతో 50 రోజుల్లోనే మొత్తం బిల్లులు కింద లాగేసేందుకు పథకం రూపొందించారు. పై నుంచి ఆమోదం లభించడంతో బీసీ, కాపు కార్పొరేషన్ల అధికారులు మొబిలైజేషన్ అడ్వాన్సుల కోసం ఫైల్ పెట్టారు. ఉన్నతాధికారులు సైతం రూల్ పొజిషన్‌కు సంబంధించి ఏ కామెంట్లు లేకుండానే యథాతథంగా మంత్రి సవితకు పంపారు. ఆమె సంతకం చేస్తే కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లిస్తారు. ఇక నీకింత.. నాకింత అని పంచుకోవడమే అని పలు శాఖల సిబ్బంది చెబుతున్నారు.

ఏంటి డ్రామాలా?.. టీడీపీ నేతలకు షాక్
వైఎస్సార్ జిల్లా, సాక్షి: కడపలో తెలుగు దేశం పార్టీ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన లాంగ్ మార్చ్‌కు మద్దతు తెలిపేందుకు వెళ్లగా.. టీడీపీ నేతలు డ్రామాలు ఆపాలంటూ నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టానికి మద్దతు తెలిపి టీడీపీ ముస్లింల గొంతు కోసిందని మండిపడ్డారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కడపలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ లాంగ్ మార్చ్ చేపట్టింది. అయితే ర్యాలీ ప్రారంభం కాకముందే.. టీడీపీ నేత అమీర్ బాబు కొందరు కార్యకర్తలతో అక్కడికి చేరుకున్నారు. అయితే వాళ్లను నిర్వాహకులు అడ్డుకున్నారు. పార్లమెంటులో బిల్లుకు మద్దతు తెలిపి ఇక్కడ డ్రామాలు వద్దంటూ నినాదాలు చేశారు. టీడీపీ ఎంపీలు రాజీనామా చేశాకే ఇలాంటి ర్యాలీలకు రావాలంటూ స్పష్టం చేశారు. ఈ క్రమంలో.. నినాదాలు హోరెత్తడంతో చేసేదేమీ లేక అమీర్‌బాబు తన అనుచర గణంతో వెనుదిరిగి వెళ్లిపోయారు.

IMF నుంచి కృష్ణమూర్తిని తొలగించిన భారత్
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) బోర్డు నుంచి డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్(dr krishnamurthy subramanian)ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా ఆ పోస్టు ఖాళీగా ఉన్నట్లు ఐఎంఎఫ్ వెబ్సైట్ ప్రకటించింది.ఐఎంఎఫ్(IMF) బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఆగష్టు 2022లో భారత్ కృష్ణమూర్తిని నామినేట్ చేసింది. నవంబర్ 1, 2022లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది నవంబర్‌తో ఆయన పదవీ కాలపరిమితి ముగియనుంది. ఈ లోపే భారత ప్రభుత్వం ఆయన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం.కృష్ణమూర్తి సుబ్రమణియన్ కేవలం భారత్‌కు మాత్రమే కాదు.. బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంకకు సైతం ప్రాతినిధ్యం వహించారు. మే 2వ తేదీతో ఆయన పదవి కాలపరిమితి ముగిసినట్లు ఐఎంఎఫ్ అధికారిక వెబ్సైట్ ప్రకటించింది. అంతకు ముందు కృష్ణమూర్తి భారత్‌కు ప్రధాన ఆర్థిక సలహాదారుగా (2018-2021)గా వ్యవహరించారు. అయితే ఆ టైంలోనూ ఆరు నెలల కంటే ముందు ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.ప్రస్తుతం ఆర్థిక కార్యదర్శిగా ఉన్న అజయ్ సేత్.. ఈ జూన్‌లో రిటైర్ కాబోతున్నారు. ఈయన పేరును ఐఎంఎఫ్ బోర్డుకు భారత్ నామినేట్ చేసే అవకాశం ఉందని సమాచారం. మే 9వ తేదీన ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో పాక్‌కు ఇవ్వబోయే ఆర్థిక సాయం గురించి చర్చించబోతున్నారు. పాక్‌కు ఎట్టి పరిస్థితుల్లో ఫండింగ్ ఇవ్వొద్దని.. ఆ నిధులను ఉగ్రవాదులకు తరలిస్తోందంటూ భారత్ వాదిస్తున్ను సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. కృష్ణమూర్తిని బోర్డు నుంచి తొలగిస్తూ భారత్ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.కారణాలేంటో?ఐఎంఎఫ్ నుంచి కృష్ణమూర్తి తొలగింపుపై ఆర్థిక నిపుణలు విశ్లేషణలు జరుపుతున్నారు. ఐఎంఎఫ్ పని తీరుపై.. దాని డాటా మెకానిజంపై ఆయన చేస్తున్న తీవ్ర విమర్శలే అందుకు కారణమై ఉండొచ్చనే భావిస్తున్నారు. అలాగే.. ఆర్థిక శక్తిగా భారత్ ఎదిగే అవకాశాలను విశ్లేషిస్తూ ఆయన రాసిన India@100 పుస్తకం కోసం ఆయన చేస్తున్న ప్రమోషన్ కూడా మితిమీరడం కూడా కారణం అయ్యి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

సీమా హైదర్ ఇంట్లోకి చొరబడి మరీ..
న్యూఢిల్లీ: పహల్గాం దాడి తర్వాత పాక్-భారత్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఇరు దేశాల పౌరులను సొంత దేశాలకు వెళ్లాలంటూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.సరిగ్గా రెండేళ్ల కిందట.. భారతదేశంలోని ప్రియుడి కోసం భర్తను వదిలేసి నలుగురు పిల్లలతో మరీ భారత్‌కు వచ్చేసింది సీమా హైదర్(37). అంతేకాదు.. ప్రియుడు సచిన్ మీనాను పెళ్లాడి ఓ బిడ్డను సైతం కన్నది. అయితే ప్రస్తుత పరిస్థితుల నడుమ ఆమెను పాక్‌కు పంపించాలా? వద్దా? అనేదానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. అయితే తాను మాత్రం ఇక్కడి కోడలినేనని, తనను వెనక్కి పంపించొద్దంటూ ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిని ఆమె వేడుకుంటోంది. ఈలోపు..ఓ వ్యక్తి సీమా హైదర్ ఇంట్లోకి చొరబడ్డాడు. వెనుక నుంచి వెళ్లి ఆమెపై దాడికి ప్రయత్నించబోయాడు. అయితే అది గమనించిన ఆమె భర్త సచిన్.. ఆ ఆగంతకుడ్ని నిలువరించగలిగాడు. స్థానికుల సాయంతో పోలీసులకు అప్పగించాడు. సదరు నిందితుడి తేజాస్‌గా పోలీసులు నిర్ధారించారు.గుజరాత్ సురేందర్ నగర్‌కు చెందిన తేజస్.. న్యూఢిల్లీకి రైలు ద్వారా వచ్చాడు. అక్కడి నుంచి బస్సులోసీమా హైదర్ ఉంటున్న గ్రేటర్ నోయిడా ప్రాంతానికి చేరాడు. అతని ఫోన్లో సీమా హైదర్‌కు చెందిన ఫొటోల స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. అతను ఏ ఉద్దేశంతో ఆ ఇంట్లోకి చొరబడ్డాడు అనేది తెలియాల్సి ఉంది అని పోలీసులు చెబుతున్నారు. అయితే సీమా హైదర్ తనపై చేతబడి చేస్తోందని.. అందుకే ఆమెను కట్టడి చేయడానికి ఇచ్చానని తేజస్ చెబుతున్నాడు. ఇది నమ్మశక్యంగా లేదని పోలీసులు చెబుతున్నారు. అతని మానసిక స్థితి బాగోలేదా? కావాలనే ఇలా చేస్తున్నాడా? అనేది నిర్ధారించుకోవాల్సి ఉందని చెబుతున్నారు.

RCB VS CSK: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి
రికార్డుల రారాజు విరాట్ కోహ్లి మరో భారీ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు 500 కంటే ఎక్కువ పరుగులు (ఓ సీజన్లో) చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్‌తో కలుపుకుని విరాట్ మొత్తం ఎనిమిది సీజన్లలో 500 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. విరాట్ తర్వాత అత్యధిక సీజన్లలో 500 ప్లస్ పరుగులు సాధించిన ఘనత డేవిడ్ వార్నర్‌కు దక్కుతుంది. వార్నర్ ఏడు సీజన్లలో ఈ ఘనత సాధించాడు. విరాట్, వార్నర్ తర్వాత కేఎల్ రాహుల్, శిఖర్ ధవన్ అత్యధిక సీజన్లలో 500 ప్లస్ స్కోర్లు చేశారు. రాహుల్ 6, ధనవ్ 5 సీజన్లలో 500 ప్లస్ స్కోర్లు చేశాడు. నిన్న (మే 3) సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ ఎనిమిదో సారి ఓ సీజన్లో 500 ప్లస్ పరుగులు పూర్తి చేశాడు.విరాట్ 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన సీజన్లు..2015- 505 పరుగులు2025- 505*2018- 5302011- 5572013- 6342023- 6392024- 7412016- 973కాగా, నిన్నటి మ్యాచ్‌లో 33 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేసిన విరాట్.. ఐపీఎల్లో ఎనిమిదో సారి 500 ప్లస్ పరుగులు సాధించడంతో పాటు మరిన్ని రికార్డులు సాధించాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన విరాట్.. ఏడు అర్ద సెంచరీల సాయంతో 505 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ (సీజన్లో లీడింగ్ రన్ స్కోరర్) సొంతం చేసుకున్నాడు.ఈ మ్యాచ్‌లో విరాట్ సాధించిన మరిన్ని రికార్డులు..👉ఐపీఎల్లో ఒక జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు. కోహ్లి ఇప్పటివరకు సీఎస్కేపై 1146 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్ పేరిట ఉండేది. వార్నర్ పంజాబ్ కింగ్స్‌పై 1134 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో వార్నర్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు.👉 సీఎస్కేపై అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ప్లేయర్‌గా కోహ్లి నిలిచాడు. కోహ్లి ఇప్పటివరకు సీఎస్కేపై 10 సార్లు యాబైకిపైగా పరుగులు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు శిఖర్ ధవన్ పేరిట ఉండేది. ధవన్ సీఎస్కేపై 9 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు నమోదు చేశాడు.👉వరల్డ్ ఫ్రాంచైజీ క్రికెట్లో ఒకే జట్టు తరపున 300 సిక్సర్లు కొట్టిన ఏకైక ప్లేయర్‌గా విరాట్ నిలిచాడు. ఐపీఎల్లో ఆర్సీబీ తరపున కోహ్లి 300 సిక్స్‌లు బాదాడు. కోహ్లి తర్వాతి స్దానంలో క్రిస్ గేల్(263) ఉన్నాడు.👉టీ20 క్రికెట్లో ఒకే వేదికలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో కోహ్లి 154 సిక్స్‌లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ కూడా చిన్నస్వామి స్టేడియంలో 151 కొట్టాడు.👉ఐపీఎల్లో 8500 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ప్లేయర్‌గా కోహ్లి రికార్డులెక్కాడు.మ్యాచ్ విషయానికొస్తే.. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన సమరంలో సీఎస్కేపై ఆర్సీబీ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. సీఎస్కే గెలుపుకు చివరి ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా.. ఆర్సీబీ విజయవంతంగా కాపాడుకుంది. యశ్ దయాల్ చివరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసి 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించిన సీఎస్కే ఈ ఓటమితో చివరి స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఈ గెలుపుతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ దాదాపుగా ఖరారైనట్లే.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. జేకబ్ బేతెల్ (33 బంతుల్లో 55; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లి (33 బంతుల్లో 62; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), రొమారియో షెపర్ట్ (14 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.సీఎస్కే బౌలర్లలో పతిరణ (4-0-36-3), నూర్ అహ్మద్ (4-0-26-1) అద్భుతంగా బౌలింగ్ చేయగా.. ఖలీల్ అహ్మద్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు (3-0-65-0). ఖలీల్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో షెపర్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి 4 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 33 పరుగులు పిండుకున్నాడు. పతిరణ వేసిన చివరి ఓవర్లోనూ అదే జోరు కొనసాగించిన షెపర్డ్ ఆ ఓవర్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రాబట్టాడు.అనంతరం 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్కే.. చివరి బంతి వరుకు పోరాడి నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేయగలిగింది. ఆయుశ్ మాత్రే (48 బంతుల్లో 94; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), రవీంద్ర జడేజా (45 బంతుల్లో 77 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) సీఎస్కేను గెలిపించేందుకు సర్వ శక్తులు ఒడ్డారు. ఈ మ్యాచ్‌లో మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్ వరుస బంతుల్లో ఔట్ కావడం సీఎస్కేకు టర్నింగ్ పాయింట్. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ఎంగిడి ఈ ఇద్దరి వికెట్లు తీసి ఆర్సీబీని గేమ్‌లోకి తెచ్చాడు.చివరి మూడు ఓవర్లలో (సుయాశ్, భువీ, దయాల్) ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో సీఎస్కే లక్ష్యానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆర్సీబీ బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు తీయగా.. సీజన్లో తొలిసారి భువీ వికెట్ లేకుండా అత్యంత ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు (4-0-55-0).

ఏపీటీడీసీలో ఉద్యోగి రాసలీలలు
సాక్షి, విజయవాడ: ఏపీటీడీసీ డివిజనల్ కార్యాలయంలో ఓ అధికారి రాసలీలల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఆఫీసు వేళలు ముగిసిన తర్వాత సదరు అధికారి.. ఓ మహిళతో ఏకాంతంగా గడిపిన విషయం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆఫీసులో సీసీ ఫుటేజీని పరిశీలించిన అధికారులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు.వివరాల ప్రకారం.. విజయవాడలోని బందరురోడ్డు వెంబడి లైలా కాంప్లెక్స్‌లో ఏపీటీడీసీ డివిజనల్ కార్యాలయంలోని కీలక విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగి రాసలీలల వ్యవహారం బయటకు వచ్చింది. సదరు ఉద్యోగి.. ఆఫీసు వేళలు ముగిసిన తర్వాత ప్రతీ రోజూ రాత్రిపూట తన ద్విచక్రవాహనంపై ఓ మహిళను తీసుకుని ఆఫీసుకు రావడం పలు అనుమానాలకు తావిచ్చింది. అయితే, పర్యాటకాభివృద్ధి సంస్థ ఉద్యోగి కావటంతో సెక్యూరిటీ సిబ్బంది.. ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.రోజూ ఇలాగే చేస్తున్న క్రమంలో అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది విషయాన్ని ఏపీటీడీసీ అధికారులకు తెలియజేశారు. దీంతో, రంగంలోకి దిగిన అధికారులు.. ఆఫీసులో ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేశారు. అనంతరం, ఆఫీసులో ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలించగా వారిద్దరూ అడ్డంగా దొరికిపోయారు. రాత్రి సమయంలో ఉద్యోగి బైకుపై ఓ మహిళ రావడం రికార్డు అయ్యింది. ఆఫీసు వద్ద బైక్ పార్కు చేసి ఆమెను లోపలికి తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. కార్యాలయం తాళం తెరిచి, ఆ మహిళను లోపలికి తీసుకెళ్లి తిరిగి తలుపులు వేయడం, అరగంట తర్వాత బయటకు రావడాన్ని అధికారులు గుర్తించారు. అనంతరం, వారిద్దరూ బైక్‌పై వెళ్లిన ఆధారాలను సీసీ ఫుటేజీ ద్వారా సేకరించారు. దీంతో, ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది.ఇదిలా ఉండగా.. గతంలోనూ సదరు అధికారిపై ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. హరిత బెర్మ్‌పార్క్‌లోని స్టాఫ్ రూమ్‌లో కూడా ఇలాంటి వ్యవహారమే నడిపినట్టు తెలిసింది. పార్క్‌లో వాకింగ్ కోసం వచ్చిన మహిళను తరచూ స్టాఫ్‌రూమ్‌లోకి తీసుకెళ్లేవాడు. సిబ్బందిని బయటకు పంపేసి రాసలీలలు సాగించేవాడని సిబ్బంది చెప్పుకొచ్చారు. అనంతరం, సీక్రెట్ కెమెరా పెట్టి మరీ ఈ విషయాన్ని సిబ్బందే వెలుగులోకి తెచ్చారు. ఇక, ఈయన విషయంలో ఇంత జరుగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

'హిట్3' కలెక్షన్స్ ప్రకటన.. రూ. 100 కోట్లకు చేరువలో నాని
'హిట్3: ది థర్డ్ కేస్' సినిమా మూడురోజుల్లోనే భారీ కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. వీకెండ్లో బాక్సాఫీస్ వద్ద హీరో నాని దుమ్మురేపుతున్నాడు. మొదటిరోజే భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ మూవీ రెండోరోజు కూడా సత్తా చాటింది. అయితే, తాజాగా మూడోరోజు కలెక్షన్స్ వివరాలను మేకర్స్ ప్రకటించారు. ఈమేరకు తాజాగా ఒక పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రోడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదలైంది. ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటించారు.హిట్3 సినిమా మూడురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 82 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ఫస్ట్ డే రూ. 43 కోట్లు, సెకండ్ డే రూ. 19 కోట్లు రాబడితే.. మూడోరోజు రూ. 20 కోట్లు రాబట్టింది. నేడు ఆదివారం సెలవు కాబట్టి సులువుగా రూ. 100 కోట్లు సాధించే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. గత రెండు రోజులుగా థియేటర్స్ ఫ్యామిలీ ఆడియెన్స్ వస్తున్నారు. నానీని అర్జున్ సర్కార్‌లాంటి వైవిధ్యమైన పాత్రలో చూడటానికి వారు ఆసక్తి చూపుతున్నారు. చిత్ర యూనిట్ అంచనాలకు మించి కుటుంబ ప్రేక్షకులు రావడం, వారి స్పందనను చూసి దర్శకుడు, నిర్మాతలు సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతున్నారు.చాగంటి కోటేశ్వరరావుగారికి నచ్చి వాయిస్ ఇచ్చారు: శైలేష్ కొలను‘హిట్: ది థర్డ్ కేస్’లో అర్జున్ సర్కార్‌గా నాని పాత్ర ఎలా ఉంటుందో ‘హిట్ 2’ చివర్లో గ్లింప్స్‌లా చూపించా. అప్పుడే ఆడియన్స్‌కి ఓ అవగాహన వచ్చింది. అర్జున్ సర్కార్ పాత్రపై నాకు, నానీగారికి మొదటినుంచీ నమ్మకం ఉంది. ఇక మా మూవీ ఐడియాని చాగంటి కోటేశ్వరరావుగారికి చెబితే నచ్చి, వాయిస్ ఓవర్ ఇచ్చారు. డార్క్ వెబ్ అనేది ప్రస్తుతం ఇండియాలో పెద్ద సమస్య. ఎన్నో చట్టవ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. సైబర్ డిపార్ట్మెంట్ దీని మీద వర్క్ చేస్తోంది. తెలంగాణ, ఏపీ పోలీసులు డార్క్ వెబ్ గురించి మాకు చాలా సమాచారం ఇచ్చారు. 82+ CRORES GROSS WORLDWIDE for #HIT3 in 3 days ❤🔥It's SARKAAR SHOW at the box office 💥💥Book your tickets now!🎟️ https://t.co/8HrBsV0jItA sensational Sunday loading with massive bookings all over. #BoxOfficeKaSarkaar pic.twitter.com/dsRvH3lpFG— Wall Poster Cinema (@walpostercinema) May 4, 2025

వేదనలో రాజ్యం... వేడుకలో రాజధాని!
‘‘ఠండా మతలబ్ కోకాకోలా...’’ ఇండియాలో బాగా పాపులరయిన వాణిజ్య ప్రకటనల్లో ఒకటి. మరి కోకాకోలా మతలబు? రెండొందల మిల్లీలీటర్ల కోక్ తయారు చేయడానికి గరిష్ఠంగా యాభై పైసలు ఖర్చవుతాయని మార్కెట్ టాక్. పది పైసల కంటే ఎక్కువ కాదనే వాళ్లు కూడా ఉన్నారు. కానీ మనం గరిష్ఠాన్నే లెక్కేసుకుందాం. దానికి పదింతలు ఎక్కువ ఖర్చు పెట్టి మార్కెటింగ్ నైపుణ్యాన్ని జోడిస్తారు. వినియోగదారుకు ఇరవై రూపాయలకు అమ్ముతారు. రవాణా ఖర్చులు, కమీషన్లు తీసేసినా మినిమమ్ నూటా యాభై శాతం లాభాలు కంపెనీ గల్లా పెట్టెలో పడతాయి. దీన్నే బ్రాండ్ బిల్డింగ్, మార్కెటింగ్ టెక్నిక్ వంటి పేర్లతో ఘనంగా చెప్పుకుంటారు.ఈ ధోరణి రాజకీయాల్లోకి, ప్రభుత్వ పాలనలోకి కూడా దిగుమతయింది. ఇందులో ఉద్దండులైన ఇద్దరు అగ్ర నాయ కులు నిన్న ఉద్దండరాయునిపాలెం సమీపంలో అమరావతి బ్రాండ్ షూటింగ్‌ను పునఃపునఃప్రారంభించారు. ప్రధాని సంగతి తెలిసిందే. భారతీయ వ్యాపార రంగంలో ఆరితేరిన వారైన గుజరాతీల ముద్దుబిడ్డ. అంతటా దొరికే వస్తువుపై కూడా అరుదైన సరుకుగా ముద్రవేసి అమ్మగల నేర్పరులు వారు. లేకపోతే, ఓ పిడికెడు మంది మినహా సమస్త ప్రజల్లో ఉండే సహజ లక్షణాలైన దేశభక్తి, దైవభక్తి వంటి అంశాలపై కూడా తమకే పేటెంట్ హక్కులున్నాయని ఎలా ప్రకటించు కోగలరు?ఏపీ ముఖ్యమంత్రి కూడా ప్రధానికి దీటైనవారే. నిజం చెప్పాలంటే కొంచెం ఎక్కువ కూడా! మీడియా ప్రచారంతో ముఖ్యమంత్రి స్థాయికి ఎదగవచ్చన్న కిటుకును ఆయన తొలి రోజుల్లోనే కనిపెట్టారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద, సెల్ఫోన్ల మీదా తనకే పేటెంట్ దక్కాలని చిరకాలంగా ఆయన పోరాటం చేస్తున్నారు. ఇద్దరూ కలిసి అమరావతి షోలో పాల్గొని అమరా వతి బ్రాండ్ వ్యాల్యూ పెంచే ప్రయత్నాన్ని చేశారు. ఈ షో జరగడానికి ముందునుంచే అమరావతి ప్రమోషన్ కార్యక్రమాన్ని ఏకసూత్ర పథకంగా భావించి, పరిపాలన సైతం పక్కన పెట్టి చంద్రబాబు ప్రయాసపడుతున్నారు. అప్పిచ్చువాడి కోసం డప్పు కొడుతూనే ఉన్నారు. ప్రపంచబ్యాంకూ, మరో రెండు సంస్థలూ 31 వేల కోట్ల షరతులతో కూడిన అప్పును మంజూరు చేసిన వెంటనే 47 వేల కోట్లకు టెండర్లను పిలవనే పిలిచారు. ఇందులో భారీ కమీషన్ల కోసం అంచనాలను అసహజంగా పెంచేశారన్న విమర్శలు వినిపించాయి.ఇందులో చాలా పనులకు ఏడేళ్ల కింద కూడా టెండర్లను పిలిచారు. అప్పటి అంచనా వ్యయానికీ, ప్రస్తుతానికీ పోలికే లేదు. ఒక్క సెక్రటేరియట్ టవర్ల అంచనాయే నూరు శాతం పెరిగింది. 2018లో సెక్రటేరియట్ నాలుగు టవర్లూ, సీఎం కార్యాలయానికి కలిపి అంచనా వ్యయం 2,271 కోట్లుంటే ఇప్పుడది 4,688 కోట్లకు ఎగబాకింది. ఏడేళ్లలో నూరు శాతం ద్రవ్యోల్బణం పెరిగిందా? నిర్మాణ రంగంలో ప్రధాన పద్దులైన సిమెంటు, ఇనుము ధరలు పెరక్కపోగా అంతో ఇంతో తగ్గాయని మార్కెట్ సమాచారం. అమరావతి బ్రాండ్ బాజా మిరు మిట్లలో ఇటువంటి వాస్తవాలు మరుగున పడిపోవాలని పాల కుల ఉద్దేశం కావచ్చు.అమరావతి కాసుల వేటలో పడి ప్రజాపాలనను పడకేయించిన పర్యవసానం ఎలా ఉన్నదో మచ్చుకు ఒక సన్నివేశాన్ని పరిశీలిద్దాం. రైతు పండించిన పంటలకు మార్కెట్లో పలికిన ధరలేమిటో ఒకసారి గమనించండి. మిరపకు జగన్ పాలనలో పలికిన సగటు ధర 24 వేల రూపాయలైతే, ఇప్పుడు 6,500. పత్తికి నాడు 10,500 పలికితే నేటి సగటు ధర 4,900. కందులు నాడు 11 వేలు, నేడు 5,850. పసుపు, మినుము, పెసలు, శనగలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, పొగాకు, చీనీపండ్లు, అరటి, బొప్పాయి, టమాటా, ఉల్లి... ఇలా ఏ వ్యవసాయిక ఉత్పత్తినైనా తీసుకొని పరిశీలించండి. ఒకే రకమైన రాజధాని పనులకు ఏడేళ్ల కాలంలో కాంట్రాక్టర్లకు ఇస్తున్న సొమ్ము నూరు శాతం ఎట్లా పెరిగింది? ఆరుగాలం కష్టించిన రైతన్నకు లభిస్తున్న ధర ఏడాది కాలంలోనే నూరు శాతం ఎట్లా పడి పోయింది? ఇదేమి రాజ్యం? అదేమి రాజధాని? పైగా అది ప్రజా రాజధానట! జన జీవితాల మీద ఇంతకంటే క్రూరమైన పరిహాసం ఇంకొకటి ఉంటుందా?ఈ రాజధాని నిర్మాణానికి అర్జెంటుగా ఇంకో 47 వేల కోట్లు కావాలట! మరో 44 వేల ఎకరాలు సమీకరించాలట! అప్పుడు గానీ ఈ వ్యవహారం ఓ కొలిక్కి రాదట! పనుల పునఃప్రారంభం నాటికే రాష్ట్ర వ్యవసాయ రంగం వెన్ను విరిగింది. ఆ పనులన్నీ కొలిక్కి వస్తే ఇంకెన్ని దారుణాలు చూడాలో! గిట్టుబాటు ధర లేకపోవడం ఒక్కటే కాదు. రైతు కుటుంబాల మీద ఏడాది పొడుగునా పిడుగులే కురుస్తున్నాయి. రైతు భరోసా లేదు. అప్పిచ్చువాడి గడప తొక్కక తప్పలేదు. పంటల బీమా లేదు. దేవుడి మీదే భారం. ఇన్పుట్ సబ్సిడీ, కరువు సాయం బకాయీల ఊసెత్తితే ఒట్టు. ఆర్బీకేలు అలంకార ప్రాయంగా మారి ఆసరా ఇవ్వడం లేదు. ఒక్క అమరావతి కలవరింత తప్ప, సాధారణ పరిపాలనపైన కూడా ఈ ప్రభుత్వం పట్టు కోల్పో యింది. విజయవాడ వరదలు, తిరుపతి తొక్కిసలాట, సింహా చలం దుర్ఘటన వగైరాలు పాలనా వైఫల్యానికి నిదర్శనాలు.అదే రాష్ట్రం, అవే వనరులు, అదే ఆదాయం. ఏ ఖర్చయినా అందులోంచే పెట్టాలి. ఏ అప్పయినా అందులోంచే చెల్లించాలి. లేదంటే మరిన్ని అప్పులు చేయాలి. ఎన్నికల ముందు చంద్ర బాబు హామీ ఇచ్చిన అద్భుతం ఆవిష్కృతం కాలేదు. సంపద సృష్టి జరగలేదు. ఎప్పుడు సృష్టిస్తారో కూడా చెప్పడం లేదు. రాజధాని మీద లక్ష కోట్ల దాకా ఖర్చు పెట్టాలని చెబుతున్నారు. ఆ ఖర్చుకు అప్పులే మార్గం. ఉన్న ఆదాయ వనరుల్లోంచే ఈ అప్పులు తీర్చాలి. అమరావతే తన అప్పుల్ని తీర్చుకుంటుందని మొదట్లో ఊదరగొట్టారు. ఎన్ని వేల ఎకరాలను అభివృద్ధి చేసి అమ్మితే అంత అప్పును తీర్చాలి? అన్ని వేల ఎకరాలను ఎగబడి కొనేందుకు ఎవరు ముందుకొస్తారు? ఇది జరగడానికి ఎన్ని పుష్కరాలు పడుతుంది? ఇటువంటి సందేహాలకు సమాధానా లేవీ ఇంతవరకు రాలేదు.ఈలోగా ఒక్క ఏడాదిలోనే వ్యవసాయ రంగం కుదేలైంది. రాజధాని కోసం భూములను ‘త్యాగం’ చేసిన 28 వేల మంది రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లయినా దక్కుతాయని చెబు తున్నారు. కానీ, అమరావతి పేరుతో ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతున్న రాష్ట్రంలోని 60 లక్షల మంది రైతుల త్యాగానికి ఎవరు వెల కట్టాలి? వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధినిస్తున్న ఎం.ఎస్. ఎం.ఈ. రంగంలో ఈ సంవత్సరం 20 లక్షల మంది ఉపాధి కోల్పోయారని పార్లమెంటుకిచ్చిన సమా ధానంలో కేంద్రం తెలియజేసింది. ఈ లెక్కన అమరావతి నిర్మాణం కోసం ఇంకెన్ని సెక్షన్లు బలవ్వాలి? ఎంత విధ్వంసం జరగాలి? ‘‘మా కండలు పిండిన నెత్తురు, మీ పెండ్లికి చిలికిన అత్తరు’’ అన్నాడు ఒక కవి. అమరావతి కోసం ఆంధ్రదేశమంతా ఈ పాట పాడుకోవాలేమో?శుభమా అని రాజధాని పనులు ప్రారంభిస్తుంటే ఈ కుశంకలేమిటనే వారు లేకపోలేదు. కుశంకలు కావు, వాస్తవాల పునా దులపై తలెత్తుతున్న సందేహాలు ఇవి. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, ఇల్లాలు ఏడ్చిన ఇల్లు బాగుపడవంటారు. రైతు ఇప్పుడు దుఃఖిస్తున్నాడు అన్నది ఒక వాస్తవం. రాష్ట్రంలోని మహిళలకు ‘సూపర్ సిక్స్’ పేరుతో పాలక కూటమి ఎన్నో ఆశలు పెట్టిందన్నది ఒక వాస్తవం. ఏడాది తర్వాత కూడా వారి ఆశలు అడియాసలుగానే మిగిలాయన్నది ఒక వాస్తవం. సంపద సృష్టి పేరు చెప్పి ఎడాపెడా అప్పులతో రాష్ట్రాన్ని ఊబి లోకి తోస్తున్న మాట వాస్తవం. ఈ అప్పుల ఊబి నుంచి బయట పడే మార్గం ఏమిటో ఇప్పటిదాకా ప్రభుత్వం విడమరచి చెప్ప లేకపోయిన మాట కూడా వాస్తవం.రమారమి 500 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి నిన్న అమరా వతిలో ‘పునరపి జననం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రిని తీసుకొచ్చి పొగడ్తల్లో ముంచారు. స్తోత్రకై వారాలు గావించారు. ఈ దేశ ప్రధానిని గౌరవించడం తప్పేమీ కాదు. గౌరవించాలి కూడా! అదే సందర్భంలో రాష్ట్ర ముఖ్య మంత్రి కూడా రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా నిలబడాలి. తమ నాయకుడు సాగిలపడ్డంత పనిచేయడాన్ని, నంగి నంగి మాట్లాడటాన్ని ప్రజలు హర్షించరు. బిల్లు మంజూరు చేసే అధి కారి తనిఖీకి వచ్చినప్పుడు చిన్నపాటి కాంట్రాక్టర్లు వ్యవహరించినట్టుగా బాడీ లాంగ్వేజ్ ఉండకూడదు. బహిరంగ సభల్లో బీజేపీ నాయకులు జనం చేత మూడుసార్లు ‘వందేమాతరం’ అనిపించడం చాలాకాలంగా వస్తున్న సంప్రదాయం. ఆ దీక్షను కూడా చంద్రబాబు ఈ సభలో స్వీకరించారు. నిజానికి తెలుగు దేశం పార్టీలో ఈ ఆచారం లేదు.ఆరేళ్ల క్రింద నరేంద్ర మోదీని ఉద్దేశించి చంద్రబాబు చేసిన విపరీత విమర్శలు చాలామందికి ఇంకా గుర్తున్నాయి. కానీ, అటువంటిదేమీ జరగనట్టుగానే సభలో ఆయన ప్రవర్తన కనిపించింది. సాధారణంగా ఐటీ రంగానికి సంబంధించినంత వరకు ఘనత అంతా తనకే దక్కాలని కోరుకుంటారు. దాన్ని ఇంకెవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. కానీ ఆశ్చర్యకరంగా నిన్నటి సభలో ‘‘టెక్నాలజీ అంటే మోదీ, మోదీ అంటే టెక్నాలజీ’’ అని పొగిడేశారు. ఈ భజన కార్యక్రమం వెనుకనున్న ఉద్దేశం ఏమిటో గాని ప్రధాని మాట్లాడుతున్నప్పుడు అమరావతి కోసం అదనంగా తానేం చేస్తానన్నది మాత్రం చెప్పలేదు. చంద్రబాబు పొగడ్తలకు పొగడ్తలతోనే ఆయన సమాధానం చెప్పారు. మొదటి ప్రారంభానికి వచ్చినప్పుడు మట్టి–నీళ్లు తెచ్చిన ప్రధాని, ఈసారి పవన్ కల్యాణ్‌కు మాత్రమే ఒక చాక్లెట్ తీసుకువచ్చారు.ఏదో వ్యూహం ప్రకారమే లోకేశ్‌తో ఈ సభలో మాట్లాడించి నట్టుగా కనిపించింది. తన కుమారుడికి మోదీ ఆశీస్సులు లభించవలసిన సమయం ఆసన్నమైందని బాబు భావిస్తుండవచ్చు. ప్రసంగం ప్రారంభానికి ముందు లోకేశ్ ‘నమో నమః’ అంటూ మూడుసార్లు సంబోధించారు. ఆ నమస్కారం మోదీ కోసమే అనే సంగతి ఆయనకు అర్థమైందో లేదోనన్న అనుమానం కలిగి నట్టుంది. మోదీని గురించి చెప్పాల్సిన ప్రతి చోట ‘నమో గారు, నమో గారు’ అంటూనే మాట్లాడారు. ‘‘వంద పాకిస్తాన్‌లు దండెత్తి వచ్చినా నమో మిస్సైల్ ముందు బలాదూర్’’ అన్నారు. ప్రధాన మంత్రిని లోకేశ్ పొగుడుతున్నంతసేపు చంద్రబాబు ఉత్కంఠగా కనిపించారు. లోకేశ్ పొగడ్తలు ప్రధానికి అర్థమవుతున్నాయో లేదో తెలుసుకోవాలన్న కుతూహలం ఆయన మోములో కనిపించింది. అనూహ్యంగా ఆయన చాలాసార్లు చిరునవ్వులు చిందించారు. ఇటువంటి సైడ్ లైట్స్ తప్ప ఈ సభ గురించి చెప్పు కోవడానికి ఇంకో విశేషం లేదు. అమరావతికి బ్రాండ్ వ్యాల్యూ పెంచడానికి జరిగిన ఒక ఈవెంట్‌గా మాత్రమే ఇది చరిత్రలో మిగిలిపోతుంది. రాజ్యమంతటా ఆవేదన అలుముకుంటున్న వేళ వేడుకలు చేసుకున్న రాజధానిగా కూడా చరిత్రలో అమరా వతి స్థానం సంపాదించుకుంటుంది.వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com

జీడీపీ వృద్ధిపై అంచనాలు ఎలా ఉన్నాయంటే..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 6.5–6.7 శాతం మేర వృద్ధిని నమోదు చేస్తుందని డెలాయిట్ అంచనా వేసింది. అంతర్జాతీయంగా అనిశ్చితులు నెలకొన్నప్పటికీ బడ్జెట్లో ప్రకటించిన పన్ను మినహయింపు చర్యలు దేశీ డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తాయని తెలిపింది. అంతర్జాతీయంగా వాణిజ్య సంబంధాల్లో వస్తున్న మార్పులు, దేశీ వినియోగ డిమాండ్ పెంపు మధ్య ప్రభుత్వం ఎలా సమతూకాన్ని తీసుకొస్తుందన్న దానిపైనే 2025–26 వృద్ధి ఆధారపడి ఉంటుందని పేర్కొంది. రెండు వ్యతిరేక శక్తుల మధ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి ఆధారపడి ఉంటుందని తెలిపింది.అంతర్జాతీయ అనిశ్చితులు మన ఆర్థిక వ్యవస్థపై ఏ మేరకు ప్రభావం చూపిస్తాయి.. అదే సమయంలో పన్ను రాయితీలు దేశీ వినియోగాన్ని ఏ మేరకు పెంచుతాయో చూడాల్సి ఉందని పేర్కొంది. వీటి ఆధారంగా జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతం నుంచి 6.7 శాతం మధ్య ఉండొచ్చని తెలిపింది. 2025–26 బడ్జెట్లో కేంద్రం రూ.లక్ష కోట్ల మేర పన్ను రాయితీలను ప్రకటించడం తెలిసిందే. మధ్యతరగతి కుటుంబాలకు దీంతో ప్రయోజనం చేకూరనుంది.ఇదీ చదవండి: తగ్గిన మొండిబాకీలు.. పెరిగిన ఆదాయంపన్ను రాయితీలతో యువత చేతుల్లో ఖర్చు చేసే మిగులు ఆదాయం పెరుగుతుందని డెలాయిట్ ఇండియా ఆర్థికవేత్త రుమ్కి ముజుందార్ తెలిపారు. అమెరికా ప్రతీకార సుంకాలను భారత్ ఎలా ఎదుర్కొంటుంది? ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో ఏ మేరకు పురోగతి సాధిస్తుందన్నది కీలకమన్నారు. ప్రతీకార సుంకాలతో భారత జీడీపీ 0.1–0.3 శాతం తగ్గిపోవచ్చని ముజుందార్ అభిప్రాయపడ్డారు. వాణిజ్య ఒప్పందం కుదిరితే భారత్ కొత్త అవకాశాలను సొంతం చేసుకోగలదన్నారు.

పాము విషానికి తిరుగులేని విరుగుడు.. మనిషి రక్తం నుంచే..
హీరోకు వాళ్ల నాన్నో, తాతయ్యో చిన్నప్పటి నుంచే కొద్దిపాటి మోతాదులో విషం తినిపిస్తారు. దాంతో పెరిగి పెద్దయ్యాక ఎలాంటి పాము కరిచినా మనవాడికి ఏమీ కాదు. ఈ ఫార్మూలాతో సూపర్‌డూపర్ హిట్టైన సినిమాలు అన్నీ ఇన్నీ కావు. అమెరికాలోనూ కాలిఫోర్నియాలో ఉండే తిమోతీ ఫ్రైడ్ అనే వ్యక్తి అచ్చం అలాగే చేశాడు. ఒకటీ రెండూ సార్లు కాదు, 18 ఏళ్ల వ్యవధిలో ఏకంగా 200 సార్లకు పైగా పాములతో కరిపించుకున్నాడు. 700 సార్లకు పైగా పాము విషాన్ని ఒంట్లోకి ఎక్కించుకున్నాడు!.గుర్రం వంటి బలిష్టమైన జంతువులను కూడా ఒకే కాటుకు బలి తీసుకునే 16 ప్రాణాంతక పాము జాతుల విషాలూ వాటిలో ఉన్నాయి. ఫలితంగా తిమోతీ ఎలాంటి పాము కరిచినా ఏమీ కాని స్థితికి చేరుకున్నాడు! మనవాడి రక్తం నుంచి సైంటిస్టులు తాజాగా పాము విషానికి విరుగుడు తయారు చేశారు. ఇప్పటిదాకా తయారైన వాటిల్లోకెల్లా అత్యంత ప్రభావవంతమైన యాంటీ వెనమ్ ఇదేనని చెబుతుండటం విశేషం! దీన్ని పాముకాటు చికిత్సలోనే అత్యంత విప్లవాత్మక మలుపుగా చెబుతున్నారు!!ఇలా చేశారు... బ్లాక్‌మాంబా. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటి. రాచనాగు, టైగర్ స్నేక్, రాటిల్ స్నేక్ వంటివీ ఈ కోవలోకే వస్తా యి. ఇలాంటి విషపూరిత పాములతో పదేపదే కరిపించుకున్న తిమోతీ గురించి అమెరికాకు చెందిన వ్యాక్సీన్ కంపెనీ సెంటివాక్స్ సీఈఓ జాకబ్ గ్లెన్‌విల్లే 2017లో ఎక్కడో చదివారు. వాటి విషాన్ని వందలాదిసార్లు ఒంట్లోకి ఎక్కించుకున్నాడని తెలిసి ఆశ్చర్యపోయారు. తిమోతీ ట్రక్ మెకానిక్‌గా చేసేవాడు. తర్వాత రకరకాల పాములను గురించి ఆసక్తికరమైన వీడియోలు చేసి ఫేమస్ అయ్యాడు. ఆ క్రమంలో ఒకసారి రెండు నాగుపాములు వెంటవెంటనే కరవడంతో కోమాలోకి వెళ్లిపోయాడు.మరోసారి అలాంటి పరిస్థితి రాకుండా ఇలా విషం పుచ్చుకోవడం మొదలుపెట్టాడు. తిమోతీ అంగీకారంతో గ్లెన్‌విల్లే అతని రక్త నమూనాలు సేకరించారు. ఎలాంటి పాము విషాన్నైనా తట్టుకోగలిగే తిరుగులేని యాంటీబాడీలు వాటిలో పుష్కలంగా ఉన్నట్టు తేల్చారు. కొలంబియా వర్సటీకి చెందిన మెడికల్ సైన్సెస్ నిపుణుడు రిచర్డ్ స్టాక్ తదితరుల సాయంతో సైంటిస్టులు ఆ యాంటీబాడీలను సేకరించారు. ఎనిమిదేళ్లపాటు సుదీర్ఘ శ్రమకోర్చి వాటి సాయంతో అత్యంత ప్రభావవంతమైన యాంటీ వెనమ్ ఇంజక్షన్ తయారు చేశారు. దానికి ఎల్‌ఎన్‌ఎక్స్–డీ09 అని పేరు పెట్టారు.ప్రయోగాత్మకంగా బ్లాక్మాంబాతో పాటు 19 అత్యంత విషపూరిత పాముల విషాన్ని ఒక్కొక్కటిగా ఎలుకలకు ఎక్కించి, అనంతరం వాటికి ఈ విరుగుడు ఇచ్చారు. బ్లాక్మాంబాతో పాటు 13 రకాల విషాల బారినుంచి ఎలుకలను ఈ యాంటీ వెనమ్ కాపాడటం చూసి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు! ఆరు అత్యంత విషపూరిత పాముల విషాన్ని కలగలిపి ఇచ్చినా అదే ఫలితం వచి్చంది. మిగతా 6 రకాల విషాలకు కూడా ఎల్‌ఎన్‌ఎక్స్–డీ09 పాక్షికంగా విరుగుడుగా పని చేసింది. ఇది ప్రస్తుతానికి ప్రయోగాల దశలోనే ఉన్నట్టు గ్లెన్‌విల్లే చెప్పారు. ఈ పరిశోధన ఫలితాలను తాజాగా సైంటిఫిక్ జర్నల్ ‘సెల్’లో ప్రచురించారు.శ్రమతో కూడిన ప్రక్రియ యాంటీ వెనమ్ తయారీ ఓ సంక్లిష్ట ప్రక్రియ. పాముల నుంచి సేకరించిన విషయాన్ని చిన్న డోసుల్లో గుర్రాల వంటి జంతువులకు ఎక్కిస్తారు. ఆ విషానికి రోగనిరోధకత సమకూరాక వాటి రక్తం నుంచి సేకరించిన యాంటీబాడీలతో విరుగుడు తయారు చేస్తారు. అయితే ఇది శ్రమతో కూడినదే గాక ప్రమాదకరమైన ప్రక్రియ కూడా. చాలాసార్లు సరిగా పని చేయకపోవడంతో పాటు సీరియస్ సైడ్ ఎఫెక్టులు కూడా తలెత్తుతాయి. పాముకాటుకు ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.4 లక్షల మంది బలవుతున్నట్టు అంచనా. 4 లక్షల మంది దాకా వికలాంగులుగా మారుతున్నారు. గ్వాటెమాలా గ్రామాల్లో పెరిగిన గ్లెన్‌విల్లే ఈ సమస్యకు మెరుగైన, శాశ్వత పరిష్కారం కోసం చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. అది ఎల్‌ఎన్‌ఎక్స్–డీ09 కాగలదని ఆయన ధీమాగా చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్.
Summer Holidays: శిక్షాకాలం కాదు..శిక్షణ కాలం..!
Nalgonda: రాపిడో రయ్ రయ్!
RCB VS CSK: ఓటమికి నాదే బాధ్యత.. అతను గొప్పగా ఆడాడు: ధోని
నోటి కేన్సర్ నిర్ధారణ ఇలా!
'హిట్3' కలెక్షన్స్ ప్రకటన.. రూ. 100 కోట్లకు చేరువలో నాని
బరువు తగ్గేందుకు బెస్ట్ సీజన్..! ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే..
భర్తను సర్జికల్ బ్లేడుతో హత్య చేసిన భార్య..!
బుల్లితెర నటి అస్మిత హెల్దీ డైట్ ప్లాన్ ఇదే..! 20 ఏళ్లుగా..
ఏంటి డ్రామాలా?.. టీడీపీ నేతలకు షాక్
మాజీ మంత్రి జవహర్ ఇంట్లో చోరీ
సూర్యవంశీపై గిల్ కామెంట్స్.. జడేజా కౌంటర్
13ఏళ్లకే హీరో, 15ఏళ్లకే టాలీవుడ్ స్టార్..ఒక్క యాక్సిడెంట్‌తో తెరమరుగు..
నా కొడుకును సంపేయండి
ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
ఆ హీరోయిన్ల పేర్లు కలిసేలా విజయ్ (TVK) పార్టీ ఉంది: మంత్రి
తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్
మార్కెట్లోకి సరికొత్త హైటెక్ ఫ్యాన్: ధర ఎంతంటే?
Smita Sabharwal: స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్
IND vs ENG: ఇంగ్లండ్ టూర్‌కు వైభవ్ సూర్యవంశీ..
Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
TG: హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు ఐపీఎస్‌లు
అందరి అనుమానం అదే.. NIA ప్రశ్నకు తడబడ్డ జిప్‌లైన్ ఆపరేటర్
'ప్రవస్తి' నీకు నేను ఉన్నా.. మేము ఉన్నాం: గీతా మాధురి
ఫెన్సింగ్ కింద పాక్కుంటూ వెళ్లి.. గుంతలో దాక్కుని
‘ఎల్లమ్మ’ దొరకట్లేదు.. ఇప్పుడెలా?
చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
మహేశ్ బాబు నయా లుక్.. ఎప్పుడు లేనంతగా
ఈ స్కూటర్లపై రూ.40000 డిస్కౌంట్: అదే రోజు డెలివరీ..
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
నా కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తా..!
వివాహేతర సంబంధం.. శైలజ నుంచి ఫోన్ వచ్చిందని..!
నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో
అక్షయ తృతీయ రోజు బంగారు నగలే కొనాలా?
ముక్కోణపు వన్డే సిరీస్.. టీమిండియా భారీ స్కోర్
ప్రస్తుతం మన దగ్గర ఉన్నవి ఇవే సార్! క్షిపణుల బదులు 130 ఇవే బిగించాం!
బంగారం భారీగా పడిపోతుంది!
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
బాలకృష్ణ విలన్‌ను ఎంపిక చేసుకున్న పూరీ జగన్నాథ్
1925లో బంగారం రేటు ఇంత తక్కువా?
ఇంట్లో పాముల కలకలం
వీళ్లు ఐదురూపాయలు బిచ్చమేశార్రా! దీంతో వైజాగ్‌లో ఐదెకరాల భూమి కొనేయవచ్చు... మనకూ ‘ఉర్సా’ లాంటి కంపెనీ ఉంటే!
ఆర్మూరు–జగిత్యాల హైవేకు ఓకే
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని భావన యాదవ్
‘ఛీ’నా రాజకీయం...
కొందరికే ‘భరోసా’
శ్రీకృష్ణ లీలలు
నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..
3 నిమిషాలకో మరణం
ఈ ఐపీఎల్ సీజన్లో సెంచరీలు చేసిన నలుగురిలో ఓ 'కామన్ పాయింట్' ఉంది.. అదేంటి..?
భారత్‌తో జాగ్రత్త.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హెచ్చరిక
హైదరాబాద్‌లో హై అలర్ట్
బ్రదర్ కేటీఆర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: వైఎస్ జగన్
ఎంత పనైపాయే..! పిల్లిలా కనిపించాలని సర్జరీ చేయించుకుంటే చివరికి..
ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
మూడో పంటగా సౌర విద్యుత్తు!
RR VS GT: ఇది నా కల.. నాకు భయం లేదు: వైభవ్ సూర్యవంశీ
నచ్చిన వారితో శృంగారం.. అజిత్‌పై నటి 'హీరా' సెన్సేషనల్ కామెంట్
'లాహోర్‌ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
ప్రొటోకాల్ రగడ.. తుమ్మల సమక్షంలో అధికారులపై ఎమ్మెల్యే ఫైర్
జాబ్ చేస్తానంటే ఇంట్లోకి రమ్మంటారు.. బాధ చెప్పుకున్న దీపిక
బెల్లంకొండ హీరో దెయ్యం సినిమా.. గ్లింప్స్ రిలీజ్
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
భద్రత కోసం రూ.70 కోట్లు!.. సుందర్ పిచాయ్ జీతం ఎంతంటే?
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి..?
త్రివిధ దళాలకు ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్.. సైన్యమే స్థలం,టైం చూసి..
వామ్మో.. ఇదేం ట్రాఫిక్!
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
పాక్ నడ్డి విరిగేలా..
సంధ్య థియేటర్ ఘటన.. బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్
తండ్రికి బైక్‌ను బహుమతిగా ఇవ్వాలని బయలుదేరి..
ఉత్కంఠపోరు.. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
కొత్త రేషన్ కార్డు దేవుడెరుగు..!
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
‘ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్‌నే’
తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
నీట్–2025కు పకడ్బందీ ఏర్పాట్లు
బాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు : వైఎస్ జగన్
సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం
శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రత్యేకం
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
అందంలోనే కాదు.. చదువులోనూ అదుర్స్
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి
ఏప్రిల్‌లో విడుదలైన టాప్ 10 మొబైల్స్
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
మైక్రోసాఫ్ట్ సీఈవో, టెక్కీ తండ్రుల ఆవేదన ఫలితం..ఏఐ హెల్త్‌కేర్ రివల్యూషన్..!
ఒకే ఇల్లు.. ఒకే వంట
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
‘పెగాసస్’పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
IPL 2025: ఒక్క విజయం.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ
బ్యాంకులో క్యాష్ వేస్తున్నారా..? జాగ్రత్త!!
మళ్లీ ఉగ్ర కాండ!
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
రెడ్ మిర్చిలా రెజీనా... విష్ణుప్రియ మౌంటైన్ ట్రిప్
ఈపీఎఫ్ క్లెయిమ్‌కు వెళ్తున్నారా..?
చిరంజీవి స్ఫూర్తితోనే ప్రారంభించా.. అంతా తెలుగు వారి సహకారమే: సూర్య
మొక్కుబడిగా ఏసీ కొనవద్దు..
వాడికి ఏడాదిన్నర వయసు.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్
వన్నెతగ్గుతోన్న .. పాలిటెక్నిక్ విద్య
తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరు
చిన్నప్పటి నుంచి చదువులో టాప్
Summer Holidays: శిక్షాకాలం కాదు..శిక్షణ కాలం..!
Nalgonda: రాపిడో రయ్ రయ్!
RCB VS CSK: ఓటమికి నాదే బాధ్యత.. అతను గొప్పగా ఆడాడు: ధోని
నోటి కేన్సర్ నిర్ధారణ ఇలా!
'హిట్3' కలెక్షన్స్ ప్రకటన.. రూ. 100 కోట్లకు చేరువలో నాని
బరువు తగ్గేందుకు బెస్ట్ సీజన్..! ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే..
భర్తను సర్జికల్ బ్లేడుతో హత్య చేసిన భార్య..!
బుల్లితెర నటి అస్మిత హెల్దీ డైట్ ప్లాన్ ఇదే..! 20 ఏళ్లుగా..
ఏంటి డ్రామాలా?.. టీడీపీ నేతలకు షాక్
మాజీ మంత్రి జవహర్ ఇంట్లో చోరీ
సూర్యవంశీపై గిల్ కామెంట్స్.. జడేజా కౌంటర్
13ఏళ్లకే హీరో, 15ఏళ్లకే టాలీవుడ్ స్టార్..ఒక్క యాక్సిడెంట్‌తో తెరమరుగు..
నా కొడుకును సంపేయండి
ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
ఆ హీరోయిన్ల పేర్లు కలిసేలా విజయ్ (TVK) పార్టీ ఉంది: మంత్రి
తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్
మార్కెట్లోకి సరికొత్త హైటెక్ ఫ్యాన్: ధర ఎంతంటే?
Smita Sabharwal: స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్
IND vs ENG: ఇంగ్లండ్ టూర్‌కు వైభవ్ సూర్యవంశీ..
Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
TG: హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు ఐపీఎస్‌లు
అందరి అనుమానం అదే.. NIA ప్రశ్నకు తడబడ్డ జిప్‌లైన్ ఆపరేటర్
'ప్రవస్తి' నీకు నేను ఉన్నా.. మేము ఉన్నాం: గీతా మాధురి
ఫెన్సింగ్ కింద పాక్కుంటూ వెళ్లి.. గుంతలో దాక్కుని
‘ఎల్లమ్మ’ దొరకట్లేదు.. ఇప్పుడెలా?
చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
మహేశ్ బాబు నయా లుక్.. ఎప్పుడు లేనంతగా
ఈ స్కూటర్లపై రూ.40000 డిస్కౌంట్: అదే రోజు డెలివరీ..
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
నా కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తా..!
వివాహేతర సంబంధం.. శైలజ నుంచి ఫోన్ వచ్చిందని..!
నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో
అక్షయ తృతీయ రోజు బంగారు నగలే కొనాలా?
ముక్కోణపు వన్డే సిరీస్.. టీమిండియా భారీ స్కోర్
ప్రస్తుతం మన దగ్గర ఉన్నవి ఇవే సార్! క్షిపణుల బదులు 130 ఇవే బిగించాం!
బంగారం భారీగా పడిపోతుంది!
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
బాలకృష్ణ విలన్‌ను ఎంపిక చేసుకున్న పూరీ జగన్నాథ్
1925లో బంగారం రేటు ఇంత తక్కువా?
ఇంట్లో పాముల కలకలం
వీళ్లు ఐదురూపాయలు బిచ్చమేశార్రా! దీంతో వైజాగ్‌లో ఐదెకరాల భూమి కొనేయవచ్చు... మనకూ ‘ఉర్సా’ లాంటి కంపెనీ ఉంటే!
ఆర్మూరు–జగిత్యాల హైవేకు ఓకే
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని భావన యాదవ్
‘ఛీ’నా రాజకీయం...
కొందరికే ‘భరోసా’
శ్రీకృష్ణ లీలలు
నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..
3 నిమిషాలకో మరణం
ఈ ఐపీఎల్ సీజన్లో సెంచరీలు చేసిన నలుగురిలో ఓ 'కామన్ పాయింట్' ఉంది.. అదేంటి..?
భారత్‌తో జాగ్రత్త.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హెచ్చరిక
హైదరాబాద్‌లో హై అలర్ట్
బ్రదర్ కేటీఆర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: వైఎస్ జగన్
ఎంత పనైపాయే..! పిల్లిలా కనిపించాలని సర్జరీ చేయించుకుంటే చివరికి..
ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
మూడో పంటగా సౌర విద్యుత్తు!
RR VS GT: ఇది నా కల.. నాకు భయం లేదు: వైభవ్ సూర్యవంశీ
నచ్చిన వారితో శృంగారం.. అజిత్‌పై నటి 'హీరా' సెన్సేషనల్ కామెంట్
'లాహోర్‌ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
ప్రొటోకాల్ రగడ.. తుమ్మల సమక్షంలో అధికారులపై ఎమ్మెల్యే ఫైర్
జాబ్ చేస్తానంటే ఇంట్లోకి రమ్మంటారు.. బాధ చెప్పుకున్న దీపిక
బెల్లంకొండ హీరో దెయ్యం సినిమా.. గ్లింప్స్ రిలీజ్
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
భద్రత కోసం రూ.70 కోట్లు!.. సుందర్ పిచాయ్ జీతం ఎంతంటే?
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి..?
త్రివిధ దళాలకు ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్.. సైన్యమే స్థలం,టైం చూసి..
వామ్మో.. ఇదేం ట్రాఫిక్!
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
పాక్ నడ్డి విరిగేలా..
సంధ్య థియేటర్ ఘటన.. బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్
తండ్రికి బైక్‌ను బహుమతిగా ఇవ్వాలని బయలుదేరి..
ఉత్కంఠపోరు.. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
కొత్త రేషన్ కార్డు దేవుడెరుగు..!
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
‘ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్‌నే’
తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
నీట్–2025కు పకడ్బందీ ఏర్పాట్లు
బాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు : వైఎస్ జగన్
సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం
శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రత్యేకం
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
అందంలోనే కాదు.. చదువులోనూ అదుర్స్
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి
ఏప్రిల్‌లో విడుదలైన టాప్ 10 మొబైల్స్
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
మైక్రోసాఫ్ట్ సీఈవో, టెక్కీ తండ్రుల ఆవేదన ఫలితం..ఏఐ హెల్త్‌కేర్ రివల్యూషన్..!
ఒకే ఇల్లు.. ఒకే వంట
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
‘పెగాసస్’పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
IPL 2025: ఒక్క విజయం.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ
బ్యాంకులో క్యాష్ వేస్తున్నారా..? జాగ్రత్త!!
మళ్లీ ఉగ్ర కాండ!
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
రెడ్ మిర్చిలా రెజీనా... విష్ణుప్రియ మౌంటైన్ ట్రిప్
ఈపీఎఫ్ క్లెయిమ్‌కు వెళ్తున్నారా..?
చిరంజీవి స్ఫూర్తితోనే ప్రారంభించా.. అంతా తెలుగు వారి సహకారమే: సూర్య
మొక్కుబడిగా ఏసీ కొనవద్దు..
వాడికి ఏడాదిన్నర వయసు.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్
వన్నెతగ్గుతోన్న .. పాలిటెక్నిక్ విద్య
తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరు
చిన్నప్పటి నుంచి చదువులో టాప్
సినిమా

టెక్నాలజీతో కొత్త అవకాశాలు వస్తాయి: మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు
‘‘ఏఐ (కృత్రిమ మేధ) ఆధారంగా చాలా సినిమాలు వస్తున్నాయి. క్రియేటివిటీని డూప్లికేట్ చేయలేం గానీ, క్రియేటివిటీని టెక్నాలజీతో మెరుగుపరచవచ్చు. టెక్నాలజీ వల్ల కొత్త కొత్త అవకాశాలు, ఉద్యోగాలు వస్తాయి. ప్రతి రంగంలో మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తెలిపారు. నిర్మాత ‘దిల్’ రాజు నెలకొల్పిన ‘లోర్వెన్ ఏఐ’ స్టూడియో లాంచ్ ఈవెంట్‌ని శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ– ‘‘మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతున్న టెక్నాలజీని సినీ రంగానికి పరిచయం చేయాలనే సంకల్పంతో ‘దిల్’ రాజుగారు ‘లోర్వెన్ ఏఐ’ స్టూడియోని లాంచ్ చేయడం అభినందనీయం. ఎంటర్టైన్ మెంట్ వరల్డ్‌ని ఈ స్టూడియో నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ‘క్వాంటం నెక్ట్స్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ’ వారు ‘లోర్వెన్ ఏఐ’ స్టూడియోలో భాగస్వామ్యం కావడం అభినందనీయం. హాలీవుడ్‌కి దీటుగా హైదరాబాద్ ఎదుగుతోంది. ఈరోజు జరిగిన నాలుగు ప్రొడక్ట్స్ లాంచ్ ఎంటర్టైన్మెంట్లో గేమ్ చేంజర్స్ అనిపిస్తున్నాయి’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఏఐ గురించి రెండేళ్లుగా చర్చలుప్రారంభించాం. మా కంపెనీ నుంచి స్టార్ట్ అయిన టీం, క్వాంటంతో కలసి సినిమా గురించి డెవలప్ చేయాలని నిర్ణయించుకున్నాం. 360 డిగ్రీస్ సినిమాని ఎలా చేయొచ్చు అనేది క్రియేటివ్‌గా డెవలప్ చేయడం జరిగింది. స్క్రిప్ట్ ఐడియా, ప్రీ ప్రొడక్షన్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్... ఇలా స్టెప్ బై స్టెప్‌గా డెవలప్ చేశాం. టైమ్ సేవ్ అవ్వడం వల్ల దర్శకులు ఎక్కువ సినిమాలు తీస్తారు, ప్రొడ్యూసర్స్‌కి డబ్బులు ఆదా అవుతాయి. ‘లోర్వెన్ ఏఐ’ అనేది ఎమోషన్ లేని ఒక ఫస్ట్ ఏడీగా భావించవచ్చు. మా బ్యానర్లో విజయ్ దేవరకొండ హీరోగా ‘రౌడీ జనార్ధన’ సినిమా తీస్తున్న డైరెక్టర్ రవికిరణ్ ఇందులో వర్క్ చేస్తున్నారు. తన స్క్రిప్టు ప్రీ ప్రొడక్షన్ ‘లోర్వెన్ ఏఐ’లోనే జరుగుతోంది. మిగతా ప్రొడ్యూసర్స్, ప్రొడక్షన్ హౌసెస్ ‘లోర్వెన్ ఏఐ’ కావాలనుకుంటే సంప్రదించవచ్చు’’ అన్నారు.‘‘దిల్’ రాజు ప్రతిదాంట్లో ముందు వరుసలో ఉంటారు. ఇప్పుడు అదే క్రమంలో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి ఏఐని ప్రవేశపెట్టడంలోనూ ముందడుగు వేశారు’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. ఈ వేడుకలో పలువురు దర్శక–నిర్మాతలు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

సంకెళ్ళ నుంచి స్వేచ్ఛ వచ్చింది!
ఓటీటీ వేదికలు వచ్చాక వినోద రంగంలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. నటుడు సైఫ్ అలీ ఖాన్ ఆ మాటే అంగీకరించారు. ముంబైలో జరుగుతున్న ‘వరల్డ్ ఆడియో – విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్’ (వేవ్స్)లో మూడో రోజైన శనివారం సైఫ్ మెరిశారు. స్ట్రీమింగ్ వేదికలతో ఆవిర్భవించిన నవభారతం గురించి జరిగిన చర్చావేదికలో ఆయన పాల్గొన్నారు. ‘‘సినీ రంగానికి చెందిన మేము గతంలో గిరి గీసుకొని నిర్ణీత విధానాలకే కట్టుబడాల్సి వచ్చేది. కానీ, స్ట్రీమింగ్ వేదికలు అందుబాటులోకి వచ్చాక నటీనటులకూ, సినీ రూపకర్తలకూ మునుపటి సంకెళ్ళ నుంచి స్వేచ్ఛ లభించింది. మా కథలను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జనం చూసే వీలు చిక్కింది. సాంప్రదాయిక సినిమా మీడియమ్‌లో అయితే ఆ వీలుండేది కాదు’’ అని సైఫ్ అభి్రపాయపడ్డారు. నెట్‌ఫ్లిక్స్ కో–సీఈఓ టెడ్ సరండోస్ సైతం, ‘‘స్ట్రీమింగ్ వేదికల వల్ల భారత్‌లో సినీ రూపకల్పనలో ప్రజాస్వామ్యం సాధ్యమైంది’’ అన్నారు. డిజిటల్ యుగంలో కథాకథనంలో వస్తున్న మార్పులు, సృజనాత్మక స్వేచ్ఛపై స్ట్రీమింగ్ ప్రభావం, ప్రపంచ వినోదపటంలో పెరుగుతున్న భారత్ స్థానం లాంటి పలు అంశాలపై ఈ గోష్ఠిలో దృష్టి సారించారు.‘‘ఇప్పుడు ప్రేక్షకులు చూసేందుకు విభిన్నమైన కథలు అనేకం ఏకకాలంలో అందుబాటులో ఉన్నాయి. అంతటి వైవిధ్యమైన కథలను తెరపై చెప్పే స్వేచ్ఛ సృజనశీలురకు దక్కింది. సినిమా రూపకల్పనలో ప్రజాస్వామ్యమంటే ఇదే’’ అని సైఫ్ అన్నారు. ‘‘ఎన్ని మార్పులు వచ్చినా, సినిమాలకు కాలం చెల్లదు. ఇంకా చె΄్పాలంటే, స్ట్రీమింగ్, థియేటర్లు... రెండూ పరస్పరం పోటీదారులు కావు. ముందున్న మార్కెట్ పెద్దది గనక, రెండూ ఏకకాలంలో కొనసాగుతాయి’’ అని టెడ్ విశ్లేషించారు. కోవిడ్ అనంతరం భారతదేశ వ్యాప్తంగా వందకు పైగా పట్టణాలు, నగరాల్లో, దాదాపు పాతిక వేల మంది స్థానిక నటీనటులు, సాంకేతిక వర్గంతో నెట్‌ఫ్లిక్స్ చిత్రీకరణ సాగించిందనీ, తద్వారా ఎందరికో ఉపాధి కల్పించిందనీ ఆయన వివరించారు.నటించే ముందు ఊహించుకోవాలి! – హీరో ఆమిర్ ఖాన్ ‘‘పాత్రను పూర్తిగా అవగాహన చేసుకొని, దానిలోకి పరకాయ ప్రవేశం చేయాలి. నా వరకు నేను స్క్రిప్టుతో చాలా సమయం గడుపుతాను. పదే పదే స్క్రిప్టు చదువుతాను. స్క్రిప్టు బాగుంటే, ఆ పాత్ర, దాని రూపురేఖలు, మానసిక వైఖరి అన్నీ దాని నుంచే అర్థమైపోతాయి. పాత్ర, కథ గురించి దర్శకుడితో చర్చల వల్ల కూడా ఓ అవగాహన వస్తుంది’’ అన్నారు ఆమిర్ ఖాన్. ‘వేవ్స్’లో భాగంగా శనివారం ఆయన తన సుదీర్ఘ నటనా జీవితం నుంచి కొత్తవాళ్ళకు పనికొచ్చే పలు సూచనలు చె΄్పారు. ‘‘నాకు జ్ఞాపకశక్తి తక్కువ. అందుకే, చేతితో డైలాగులు రాసుకుంటా.కష్టమైన సీన్లు ముందుగా చేస్తా. డైలాగులు కంఠస్థం చేస్తా. డైలాగులు నోటికి వచ్చాక, వాటిని నాదైన పద్ధతిలో సొంతం చేసుకుంటా. అదే డైలాగును వల్లె వేస్తున్నప్పుడు దాన్ని అనేక విధాలుగా ఎలా చేయవచ్చో మనకే అర్థమవుతుంది’’ అని ఆమిర్ వివరించారు. ‘‘చేస్తున్న పనిలో ఎంత నిజాయతీగా ఉంటే, అంత బాగా నటించగలుగుతాం. సీన్లుప్రాక్టీస్ చేసేటప్పుడు నేను అద్దంలో చూస్తూ చేయను. నటించే ముందు ఆ సన్నివేశాన్ని మనసులో ఊహించుకుంటా’’ అని చె΄్పారు. ‘‘సన్నివేశం డిమాండ్ చేసింది చేయాలే తప్ప, అందులో నా వంతు ఏమిటి, నాకెంత పేరొస్తుందని చూస్తే దెబ్బతింటాం’’ అని విశ్లేషించారు.70 కోట్ల మంది చూస్తున్నారు!గత పాతిక ఏళ్ళ పైచిలుకు కాలంలో భారత మీడియా సాధించిన పురోగతి, మరీ ముఖ్యంగా వీడియో కంటెంట్ సృష్టి, ఆ కంటెంట్‌ను జనం చూడడం పెరిగిన తీరు అనూహ్యమని మీడియా నిపుణుడు, జియో స్టార్ వైస్‌ఛైర్మన్ ఉదయ్ శంకర్ విశ్లేషించారు. ఒకప్పుడు టీవీకే పరిమితమైతే... ఇప్పుడు 4జీ విప్లవం, హాట్‌స్టార్ సహా వివిధ వేదికల ఆవిర్భావంతో దాదాపు 70 కోట్ల మంది స్ట్రీమింగ్ కంటెంట్ చూస్తున్నారని అంచనా వేశారు.‘వేవ్స్’లో ఆయన మాట్లాడుతూ, ‘‘హిందీ సినిమా ఇప్పటికీ పాతకాలంలోనే ఆగిపోవడం వల్ల థియేటర్లలో వసూళ్ళు తగ్గాయనీ, తమిళ – తెలుగు సహా దక్షిణాది సినీ పరిశ్రమల్లో సృజనాత్మక ప్రయోగాలు, వాటితో పాటు వసూళ్ళు పెరిగాయనీ గుర్తు చేశారు. ‘‘అన్ని తెరలూ ఒకటే కావు. వెండితెర, బుల్లితెర, డిజిటల్ ... దేనికవే భిన్నమైనవి. ఒక్కోటీ ఒక్కో పరిణామ దశలో ఉన్నాయి. దేని ప్రయోజనం దానిదే. అది తెలుసుకోకుండా అన్నిటితో ఒకేలా వ్యవహరిస్తే వ్యాపారంలో దెబ్బ తింటాం’’ అని ఆయన వివరించారు.నాగపూర్‌లో ప్రపంచపు అతి పెద్ద స్క్రీన్‘‘ఇండియన్ ఎంటర్టైన్మెంట్ని ప్రపంచ స్థాయిలోకి తీసుకెళ్లాలన్నది ప్రధాని మోదీగారి లక్ష్యం. ఈ దిశలో వరల్డ్స్ బిగ్గెస్ట్ సినిమా స్క్రీన్ నిర్మించే అవకాశం మాకు దక్కడం గర్వకారణం. మా విజన్‌ని అర్థం చేసుకుని, నమ్మిన ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌గారికి కృతజ్ఞతలు’’ అని అభిషేక్ అగర్వాల్ అన్నారు. నాగపూర్‌లో వరల్డ్స్ బిగ్గెస్ట్ సినిమా స్క్రీన్‌ప్రాజెక్ట్‌ను రూపకల్పన చేయనున్నట్లు ‘వేవ్స్–2025’ వేదికగా నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. ‘‘గొప్ప సినిమాలు తీయడమే కాదు, అద్భుతమైన థియేటర్లు నిర్మించాలన్నది మా ధ్యేయం. సినిమాను మరింత గొప్పగా మార్చడమే మా యూవీ క్రియేషన్స్ లక్ష్యం. ప్రపంచపు అతిపెద్ద స్క్రీన్ ని నాగపూర్‌లో నిర్మించ నున్నాం. మా సామర్థ్యాలపై నమ్మకం ఉంచిన మోదీగారికి కృతజ్ఞతలు’’ అన్నారు విక్రమ్ రెడ్డి. – సాక్షి ప్రత్యేక ప్రతినిధి

జన్మ జన్మల బంధం
హీరోయిన్గా ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్నారు సమంత. ఆమె నిర్మాతగా మారి రూపొందించిన తొలి చిత్రం ‘శుభం’. హర్షిత్ రెడ్డి, సి. మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలినీ కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి ముఖ్య తారలుగా నటించారు. ఈ చిత్రంలో సమంత కూడా నటించారు. ‘సినిమా బండి’ మూవీ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత నిర్మించిన ‘శుభం’ ఈ నెల 9న రిలీజ్ కానుంది.ఈ క్రమంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా మొదటి సింగిల్ ‘జన్మ జన్మల బంధం...’ అనే పాటని శనివారం విడుదల చేశారు. ‘‘ఇది ప్రమోషనల్ వైబ్ కోసం రూపొందించిన ఓ ఎనర్జిటిక్ రీమిక్స్ పాట. ఈ సాంగ్‌లో సమంతతో పాటు ప్రధాన తారాగణం కనిపిస్తారు. ఈ ప్రమోషనల్ సాంగ్ బీట్ చాలా హుషారుగా ఉంటుంది. నవ్వు, భయం.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌తో ‘శుభం’ రూపొందింది. ఈ వేసవికి ప్రేక్షకులను పూర్తిగా సంతృప్తిపరిచే చిత్రం అవుతుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి నేపథ్య సంగీతం: వివేక్ సాగర్, సంగీతం: క్లింటన్ సెరెజో.

ట్రైనింగ్ షురూ
క్యారెక్టర్ ఎలా డిమాండ్ చేస్తే అలా మారిపోవడానికి అల్లు అర్జున్ ఏ మాత్రం వెనకాడరు. కెరీర్ తొలి నాళ్లల్లో ‘దేశ ముదురు’ (2007) కోసం సిక్స్ ప్యాక్ చేశారు అల్లు అర్జున్. ఆ తర్వాత క్యారెక్టర్లకు తగ్గట్టుగా తనని తాను మలచుకుంటూ వచ్చారు. తాజాగా తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్లో చేయనున్న సినిమా కోసం ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నారు. ఈ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఫిట్నెస్ ట్రైనర్ లాయిడ్స్ స్టీవెన్‌ని నియమించుకున్నారు.ఈ విషయాన్ని లాయిడ్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించి, అల్లు అర్జున్, తానూ ఉన్న ఫొటోని షేర్ చేశారు. లాయిడ్స్ మామూలు ట్రైనర్ కాదు. ఇప్పటికే మహేశ్‌బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్స్‌కి ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పుడు అల్లు అర్జున్ కోసం రంగంలోకి దిగారు. సో.. అట్లీ సినిమాలో అల్లు అర్జున్ కొత్తగా కనిపిస్తారని ఊహించవచ్చు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారు.
న్యూస్ పాడ్‌కాస్ట్

అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెడతారా?... కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

వణుకుతున్న పాకిస్తాన్. భారత్‌ను నిలువరించాలని అరబ్ దేశాలను వేడుకుంటున్న పాకిస్తాన్. తమకు ఉగ్రచరిత్ర ఉందని అంగీకరించిన బిలావల్ భుట్టో

ప్రతి ఇంటినీ చంద్రబాబు మోసం చేశారు: వైఎస్ జగన్ ఆగ్రహం

దేశవ్యాప్తంగా జనగణనతో పాటే కులగణన: కేంద్రం కీలక నిర్ణయం

ఏపీలో అంతులేని అవినీతి, అంతా అరాచకమే: వైఎస్ జగన్

రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం

ఏపీలో కేంద్ర సంస్థలకైతే కోట్లు.. ఉర్సా సంస్థకైతే ఊరకే!

పాక్ కాల్పుల పోరు.. బదులిచ్చిన భారత బలగాలు.

ఏపీ రాజధానిలో దోపిడీ ఐకానిక్.. 5 టవర్ల నిర్మాణ వ్యయం పెంపు

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు.. తీవ్రస్థాయికి ఉద్రిక్తతలు
క్రీడలు

మా ప్రయాణం అద్భుతం ఒలింపిక్ పతకమే లక్ష్యం
భారత బ్యాడ్మింటన్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ రాటుదేలుతూ వస్తోంది. గతేడాది పారిస్ ఒలింపిక్స్ అవకాశం తృటిలో కోల్పోయినా... ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్–10లోకి దూసుకొచ్చింది. 9వ ర్యాంకుతో ఈ ఘనతకెక్కిన తొలి భారత మహిళల జంటగా నిలిచింది. బిజీగా గడిచిన గత సీజన్లో విజయాలు ఆత్మవిశ్వాసాన్ని పెంచితే... వరల్డ్ టూర్ ఫైనల్స్ లాంటి మేజర్ టోర్నీలు పాఠాలు నేర్పాయని ఇద్దరు చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఇద్దరు తాము జోడీకట్టిన తీరు నుంచి విజయాలు, సాఫల్యాల దాకా తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు. 2021లో మొదలైన మీ ప్రయాణం ఎలా సాగుతోంది? గాయత్రి: మొదట్లో నేను సింగిల్స్ ఆడేదాన్ని. కానీ డబుల్స్ అయితే ఇంకా బాగా ఆడతాననిపించింది. దీంతో ట్రెసాతో జోడీ కట్టాను. నేను అనుకున్నట్లుగానే కొన్ని టోర్నీల్లోనే డబుల్స్‌లో రాణించగలగడం మరింత ఆనందాన్నిచ్చింది. తర్వాత ఏడాదే ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ (2022) ఆడి సెమీస్ చేరాం. అలాంటి ప్రతిష్టాత్మక టోర్నీల్లో ఇంత త్వరగా ఆడతామనుకోలేదు. అక్కడి నుంచే మా జోడీ మరింత బలపడింది. మా పయనం అద్భుతంగా సాగుతోంది. మేటి ప్రత్యర్థులతో ఎన్నో మ్యాచ్‌లు గెలిచాం. ఎంతో నేర్చుకున్నాం. ట్రెసా: 2021లో మేమిద్దరం కలిసి ఆడటం మొదలుపెట్టాం. అప్పటినుంచే గాయత్రి గురించి తెలుసుకున్నాను. కోర్టులో జోడీగా, కోర్టు బయట స్నేహితులుగా మా బంధం పటిష్టమైంది. ఆటలోనే కాదు... అవసరమైన ప్రతీసారి నాకు చాలా మద్దతుగా నిలుస్తుంది. నాకు ఏదైనా సాయం అవసరమైనా గాయత్రి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. గతేడాది సాధించిన సయ్యద్ మోడి టైటిల్ ఎలాంటి సంతృప్తినిచ్చింది? గాయత్రి: బీడబ్ల్యూఎఫ్ సర్క్యూట్లో భాగమైన సయ్యద్ మోడి టైటిల్‌ను సాధించేవరకు తెలియదు... మేమే ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళల జోడీ అని! అందుకే ఆ విజయం ఎప్పటికీ ప్రత్యేకమైంది. దేశానికి ట్రోఫీ తెచ్చిపెట్టడం గొప్ప అనుభూతినిచ్చింది. ఆ విజయానందంలో మేమిద్దరం భావోద్వేగానికి గురయ్యాం. అది ఇప్పటికీ గుర్తుంది. ట్రెసా: ఇలాంటి మేజర్ టోర్నీ టైటిల్స్ గెలుపొందాలన్నదే మా ఉమ్మడి కల. ఫైనల్లో గెలిచి... పోడియంపై నిలిచి... గర్వంగా బంగారు పతకాల్ని అందుకోవడం మంచి అనుభూతినిచి్చంది. ఇలాంటి సంతోషాన్ని మాటల్లో చెప్పలేం. పారిస్ ఒలింపిక్స్ అవకాశాన్ని కోల్పోయిన మీరు లాస్ ఏంజెలిస్ లక్ష్యాన్ని ఎలా చేరుకుంటారు? గాయత్రి: పారిస్ ఛాన్స్ చేజార్చుకోవడంతోనే మా ఒలింపిక్స్ కల అంతమవలేదు. మా మనోధైర్యం కోల్పోలేదు. తదుపరి లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ రూపంలో మరో అవకాశముంది. మరింత కష్టపడతాం. ప్రతి టోర్నీని అనుకూలంగా మలచుకుంటాం. ఒక్క ఒలింపిక్సే టోర్నమెంట్ కాదు. ఎన్నో ముఖ్యమైన టోర్నీలూ ఉన్నాయి. అన్నింటా సత్తా చాటడమే మా లక్ష్యం. ట్రెసా: అవును... ఆ ఒలింపిక్స్‌కు దూరమయ్యాం. మేం అర్హత సాధించలేకపోవడం మమ్మల్ని నిరాశపరిచింది. కానీ వచ్చే ఒలింపిక్స్ కోసం ఇప్పటినుంచే శ్రమిస్తాం. ప్రతి క్యాలెండర్ ఇయర్‌లోని టోర్నీలన్నీ ఆడటం ద్వారా ర్యాంకింగ్‌కు మెరుగుపర్చుకొని అర్హత సాధిస్తాం. గతేడాది బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ అనుభవం గురించి చెబుతారా? గాయత్రి: హాంగ్జౌలో జరిగిన ఈ టోర్నీలో తొలి పోరులో చైనాకు చెందిన లియు–తన్ జంటను ఎదుర్కొన్న మాకు పరాజయం తప్పలేదు. అయితే రెండో మ్యాచ్‌లో మలేసియన్ జోడీ పిర్లి తన్–తినాలపై గెలుపొందడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. కానీ మూడో మ్యాచ్‌లో నమీ మత్సుయమ–చిహరు షిదా (జపాన్) జోడీ చేతిలో ఓడటంతో ముందుకెళ్లే అవకాశాల్ని కోల్పోయాం. అయితే అనుభవ పాఠాలైతే నేర్చుకోగలిగాం. ట్రెసా: సీజన్ ముగింపు టోర్నీలో అంతా మేటి ప్రత్యర్థులే ఎదురవుతారు. రెడ్ మ్యాట్‌పై ఆడే మ్యాచ్‌ల్ని టీవీల్లో చూశాను. గతేడాది ప్రత్యక్షంగా ఆడాను. చైనాలోని స్టేడియాలు, మ్యాచ్‌లపై ఉండే అంచనాలు నిజంగా గొప్పగా ఉంటాయి. అక్కడ మేం ఆడిన మ్యాచ్‌లు, అనుభవం చాలా దోహదపడుతుందని అనుకుంటున్నా. గుత్తా జోడీ ర్యాంకింగ్‌ను అధిగమించడం ఎలా అనిపిస్తోంది?గాయత్రి: గుత్తా జ్వాల–అశ్విని పొన్నప్పల 10వ ర్యాంకును అధిగమించిన భారత మహిళల ద్వయంగా నిలువడం చాలా ఆనందాన్నిచ్చింది. మొదట ఈ ర్యాంకు ఘనత తెలియదు. నిజానికి మా లక్ష్యం గుత్తా జోడీ ర్యాంకింగ్‌ను చెరిపేయడం కాదు. మేం టాప్–10లోకి దూసుకెళ్లడం. మొత్తానికి భారత మహిళల డబుల్స్‌లో ఇలా మెరుగైన ర్యాంకింగ్ సాధించడం మా శ్రమకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నాం. ట్రెసా: నిజానికి గత క్యాలెండర్ ఇయర్ చాలా బిజీగా గడిచింది. అందుకే కఠినమైన టోర్నీలను ఎంపిక చేసుకొని ఆడటం. విజయాలు సాధించడం వల్లే మా ర్యాంకుల్లో మెరుగుదల కనిపించింది. ఇలాంటి మైలురాళ్లు ఎవరికైనా ఆనందాన్నే ఇస్తాయి.

‘హ్యాట్రిక్’పై భారత్ గురి
కొలంబో: ముక్కోణపు వన్డే సిరీస్‌లో వరుస విజయాల ఆధిపత్యాన్ని కొనసాగించాలని భారత మహిళల జట్టు పట్టుదలతో ఉంది. ఇప్పటికే ఆతిథ్య శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లను ఓడించిన హర్మన్‌ప్రీత్ సేన ఇప్పుడు ‘హ్యాట్రిక్’ విజయంపై కన్నేసింది. టోర్నీలో భాగంగా ఆదివారం భారత అమ్మాయిల జట్టు... లంకతో తలపడనుంది. వన్డే క్రికెట్లో వరుసగా 8 మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచిన టీమిండియాను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓడించడమంటే లంకకు శక్తికి మించిని పనే అవుతుంది. ఈ నేపథ్యంలో భారత్‌కు ‘హ్యాట్రిక్’ కష్టం కాకపోవచ్చు. అన్ని రంగాల్లో ఆధిపత్యం బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని రంగాల్లోను భారత్ అసాధారణ ప్రదర్శన కనబరుస్తోంది. బ్యాటింగ్‌లో ఓపెనర్లు ప్రతీక, స్మృతి మంధాన ఫామ్‌లో ఉన్నారు. వన్‌డౌన్‌లో హర్లీన్ డియోల్ నిలకడగా రాణిస్తుండగా, కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్‌లతో కూడిన మిడిలార్డర్ దీటుగా ఉంది. బౌలింగ్ విభాగంలో ప్రత్యేకించి ఈ సిరీస్‌లో మాత్రం స్పిన్ విభాగం ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపుతోంది. దీప్తిశర్మ, స్నేహ్ రాణా, శ్రీచరణిల ఉచ్చులో బ్యాటర్లు చిత్తవుతున్నారు. పేసర్లు కాశ్వీ గౌతమ్, అరుంధతీ పరుగుల పరంగా కట్టడి చేస్తున్నారు. ఇక ఈ టోర్నీలో సఫారీలాంటి గట్టి ప్రత్యర్థి జట్టు ఫీల్డర్ల కంటే కూడా మన ఫీల్డింగే ఎంతో మెరుగ్గా ఉంది. దీంతో భారత్ ఎదురు లేని విజయాలతో దూసుకెళుతోంది. సఫారీపై గెలిచిన ఉత్సాహంతో... మరోవైపు ఆతిథ్య లంక జట్టు గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై గెలిచిన ఉత్సాహంతో ఉంది. హాసిని పెరీరా, హర్షిత, కవిశా దిల్హరి అర్ధసెంచరీలతో లక్ష్యాన్ని ఛేదించి విజయాన్నందుకున్న శ్రీలంక... ఇదే పట్టుదలను భారత్‌పై కనబరచాలని భావిస్తోంది. కెపె్టన్ చమరి ఆటపట్టు, విష్మీ గుణరత్నేలు టాపార్డర్‌లో రాణిస్తే కాస్త మెరుగైన స్కోరు చేయగలుగుతుంది. బౌలింగ్ దళంలో మాల్కి మదర, సుగంధిక కుమారి, దేవ్మి విహంగ, ఐనొక రణవీర నిలకడగా వికెట్లను పడగొడుతున్నారు. అయితే వీరంతా భారత్‌లాంటి మేటి ప్రత్యర్థిపై ఏమేరకు రాణిస్తారనే దానిపై ఆతిథ్య జట్టు విజయావకాశాలు ఆధారపడివున్నాయి. తుది జట్లు (అంచనా) భారత్: ప్రతిక, స్మృతి, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్, జెమీమా, రిచా ఘోష్, దీప్తి శర్మ, కాశ్వీ గౌతమ్, అరుంధతి, స్నేహ్ రాణా, శ్రీచరణి. శ్రీలంక: చమరి ఆటపట్టు (కెపె్టన్), హాసిని, విష్మీ, హర్షిత, కవీశ, నీలాక్షిక సిల్వా, అనుష్క సంజీవని, దేవ్మి, మాల్కి మదర, సుగంధిక, ఐనొక రణవీర.

బెంగళూరు బ్రహ్మాండంగా...
బెంగళూరు: కోహ్లి ఉన్న బెంగళూరు, ధోని ఆడుతున్న చెన్నై మధ్య మ్యాచ్ ఎలా జరిగితే బాగుంటుందో అలా జరిగిందీ మ్యాచ్. పెద్ద స్కోర్లు... మెరుపు ఇన్నింగ్స్‌లు, ఆఖరి ఓవర్ ఉత్కంఠ ఇవన్నీ కలగలిపి ప్రేక్షకులకు క్రికెట్ విందు ఇచ్చిన ఐపీఎల్ పోరులో యశ్ దయాళ్ ఆఖరి 3 బంతులే చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఓడించాయి. 3 బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన చెన్నైకి యశ్ చెక్ పెట్టి 3 సింగిల్సే ఇవ్వడం విశేషం. ఒత్తిడిని జయించిన అతని బౌలింగే చివరకు బెంగళూరును 2 పరుగుల తేడాతో గెలిపించింది. ముందుగా ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రొమారియో షెఫర్డ్ (14 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఉప్పెనల్లే ఉరిమాడు. ఓపెనర్లు కోహ్లి (33 బంతుల్లో 62; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), జాకబ్ బెథెల్ (33 బంతుల్లో 55; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచేశారు. తర్వాత చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసి ఓడింది. ఆయుశ్ మాత్రే (48 బంతుల్లో 94; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు), జడేజా (45 బంతుల్లో 77 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడారు.బెథెల్, కోహ్లిల ‘పవర్’ ప్లే బెంగళూరు ఓపెనర్లు బెథెల్, కోహ్లి మెరుపులు మెరిపించడంతో ‘పవర్ ప్లే’ పరుగెత్తిపోయింది. ఇద్దరి జోరుకు 4.3 ఓవర్లలోనే జట్టు స్కోరు 50 దాటింది. 6 ఓవర్లలో 73/0 స్కోరు చేసింది. బెథెల్ 28 బంతుల్లో అర్థసెంచరీ సాధించాడు. ఓపెనర్లు తొలి వికెట్‌కు 97 పరుగులు జతచేశారు. ఆ తర్వాత కోహ్లి 29 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. ఒకే ఓవర్లో 33 పరుగులు... 18 ఓవర్లలో స్కోరు 159/5. ఆ తర్వాత ఒకే ఒక్కడి వీరబాదుడుతో స్టేడియమంతా ఊగిపోయింది. ఖలీల్ వేసిన 19వ ఓవర్లో ప్రతీ బంతిని దంచికొట్టిన షెఫర్డ్ 4 సిక్స్‌లు, 2 బౌండరీలతో 32 పరుగులు (6, 6, 4, 6, 6 నోబాల్, 0, 4) బాదేశాడు. నోబాల్‌తో కలిపి మొత్తం 33 పరుగులు వచ్చాయి. పతిరణ వేసిన ఆఖరి ఓవర్లో కూడా షెఫర్డ్ దంచుడుకు 4, 0, 4, 6, 6లతో 21 పరుగులు వచ్చాయి. ఈ రెండు ఓవర్లలోనే 54 పరుగులు వచ్చాయి. చెన్నై శరవేగంగా... సూపర్‌కింగ్స్ పరుగుల వేట మూడో ఓవర్ నుంచి ఊపందుకుంది. భువనేశ్వర్ నాలుగో ఓవర్లో ఆయుశ్ 5 ఫోర్లు, ఓ సిక్స్‌తో 26 పరుగులు వచ్చాయి. 4.1 ఓవర్లలో జట్టు స్కోరు 50 దాటింది. స్వల్ప వ్యవధిలో షేక్ రషీద్ (14), స్యామ్ కరన్ (5) అవుటైనా... ఆయుశ్‌కు జడేజా జతయ్యాక చెన్నై శరవేగంగా లక్ష్యం వైపు సాగిపోయింది. 25 బంతుల్లోనే ఆయుశ్ ఫిఫ్టీ పూర్తయ్యింది. 29 బంతుల్లో అతని అర్ధసెంచరీ సాధించాడు. ఆయుశ్ జోరుకు ఇన్‌గిడి కళ్లెం వేయగా, మరుసటి బంతికి బ్రెవిస్ (0) ఎల్బీ అయ్యాడు. అక్కడినుంచి ఫలితం ఇరు జట్లతో దోబూచులాడింది. యశ్ దయాళ్ 2 సింగిల్స్ ఇచ్చి ధోని (12)ని అవుట్ చేశాడు. శివమ్ దూబే (8 నాటౌట్) వచ్చీ రాగానే సిక్సర్ బాదాడు. నోబాల్ కావడంతో అదనంగా మరో పరుగు, ఓ బంతి కలిసొచ్చినా...దయాళ్ ఆఖరి 3 బంతుల్ని అద్భుతంగా వేయడంతో దూబే, జడేజాలు సింగిల్స్ మాత్రమే తీయగలిగారు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: బెథెల్ (సి) బ్రెవిస్ (బి) పతిరణ 55; కోహ్లి (సి) అహ్మద్ (బి) స్యామ్ కరన్ 62; పడిక్కల్ (సి) జడేజా (బి) పతిరణ 17; పటిదార్ (సి) స్యామ్ కరన్ (బి) పతిరణ 11; జితేశ్ (సి) బ్రెవిస్ (బి) నూర్ అహ్మద్ 7; టిమ్ డేవిడ్ నాటౌట్ 2; షెఫర్డ్ నాటౌట్ 53; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 213. వికెట్ల పతనం: 1–97, 2–121, 3–144, 4–154, 5–157. బౌలింగ్: ఖలీల్ 3–0–65–0, అన్షుల్ 3–0–25–0, నూర్ 4–0–26–1, జడేజా 3–0–26 –0, కరన్ 3–0–34–1, పతిరణ 4–0–36–3. చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: ఆయుశ్ (సి) కృనాల్ (బి) ఇన్‌గిడి 94; రషీద్ (సి) షెఫర్డ్ (బి) కృనాల్ 14; కరన్ (సి) జితేశ్ (బి) ఇన్‌గిడి 5; జడేజా నాటౌట్ 77; బ్రెవిస్ (ఎల్బీ) (బి) ఇన్‌గిడి 0; ధోని (ఎల్బీ) (బి) దయాళ్ 12; దూబే నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 211. వికెట్ల పతనం: 1–51, 2–58, 3–172, 4–172, 5–201 బౌలింగ్: కృనాల్ 3–0–24–1, భువనేశ్వర్ 4–0–55–0, దయాళ్ 4–0–41–1, ఇన్‌గిడి 4–0–30–3, సుయశ్ 4–0–43–0, షెఫర్డ్ 1–0–18–0. ఆలస్యంగా అప్పీల్ చేసి... అద్భుతంగా ఆడుతున్న ఆయుశ్ వెనుదిరిగిన తర్వాత డెవాల్డ్ బ్రెవిస్ క్రీజ్‌లోకి వచ్చాడు. విజయానికి 22 బంతుల్లో 42 పరుగులు కావాలి. దూకుడుకు మారుపేరైన బ్రెవిస్ చెలరేగితే చెన్నై గెలిచేందుకు మంచి అవకాశాలున్నాయి. ఇన్‌గిడి వేసిన బంతి అతని ప్యాడ్స్‌కు తాకడంతో అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు.సందేహంగా ఉండటంతో వెంటనే అతను ‘రివ్యూ’ కోరాల్సింది. కానీ సింగిల్ కూడా పూర్తి చేసిన అతను ఆ తర్వాత కాస్త ఆలోచించి ‘రివ్యూ’ కోసం సైగ చేశాడు. కానీ అప్పటికే నిర్ణీత 15 సెకన్లు పూర్తి అయిపోయాయి. దాంతో అంపైర్ నితిన్ మేనన్ ఆ రివ్యూను తిరస్కరించాడు. అయితే తర్వాతి రీప్లేలో అది ‘అంపైర్స్ కాల్’గా చూపించింది. అంటే రివ్యూ తీసుకున్నా బ్రెవిస్ అవుటయ్యేవాడే! 14 అర్ధ సెంచరీకి షెఫర్డ్ తీసుకున్న బంతులు. ఐపీఎల్లో ఇది రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. గతంలో యశస్వి జైస్వాల్ 13 బంతుల్లో అర్ధసెంచరీ చేయగా... కేఎల్ రాహుల్, ప్యాట్ కమిన్స్ కూడా 14 బంతుల్లోనే ఈ మార్క్‌ను అందుకున్నారు. 62 ఐపీఎల్లో కోహ్లి అర్ధ సెంచరీల సంఖ్య. వార్నర్ (62)తో సమంగా అగ్రస్థానానికి చేరాడు. ఐపీఎల్లో నేడుకోల్‌కతా X రాజస్తాన్ వేదిక: కోల్కతామధ్యాహ్నం 3: 30 గంటల నుంచి పంజాబ్ X లక్నో వేదిక: ధర్మశాల రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

IPL 2025: ఉత్కంఠ పోరు.. ఆర్సీబీ థ్రిల్లింగ్ విక్టరీ
ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఉత్కంఠపోరులో 2 పరుగుల తేడాతో సీఎస్కే ఓటమి పాలైంది. 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 5 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేయగల్గింది. ఆఖరి ఓవర్లో సీఎస్కే విజయానికి 15 పరుగులు అవసరమయ్యాయి. అయితే 20 ఓవర్ వేసిన యశ్ దయాల్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. తొలి రెండు బంతుల సింగిల్స్ ఇచ్చిన దయాల్.. మూడో బంతికి ధోనిని ఔట్ చేశాడు. ఆ తర్వాత నాలుగో బంతికి దయాల్ సిక్స్ ఇచ్చాడు. అంతకు తోడు ఆ బంతి నో బాల్ కావడంతో మ్యాచ్ సీఎస్కే వైపు మలుపు తిరిగింది. చివరి మూడు బంతుల్లో సీఎస్కే విజయానికి కేవలం 6 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. ఈ సమయంలో దయాల్ అద్బుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు. మూడు బంతుల్లో కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. సీఎస్కే బ్యాటర్లలో యువ ఆటగాడు అయూష్ మాత్రే(48 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 94) తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు.అతడితో పాటు రవీంద్ర జడేజా(77 నాటౌట్) రాణించాడు. సీఎస్కే ఓడిపోవడంతో వీరిద్దరి ఇన్నింగ్స్ వృథా అయిపోయాయి. ఆర్సీబీ బౌలర్లలో ఎంగిడీ మూడు వికెట్లు పడగొట్టగా.. దయాల్, పాండ్యా తలా వికెట్ సాధించారు.కోహ్లి, షెపెర్డ్ మెరుపు ఇన్నింగ్స్‌లు..ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(62) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జాకబ్ బెతల్(55), రొమారియో షెపర్డ్(53) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. షెపర్డ్ కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. సీఎస్కే బౌలర్లలో పతిరాన మూడు వికెట్లు పడగొట్టగా.. కుర్రాన్, నూర్ అహ్మద్ తలా వికెట్ సాధించారు. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్దానానికి చేరుకుంది.
బిజినెస్

ఏప్రిల్‌లో ఎక్కువ అమ్ముడైన ఎలక్ట్రిక్ స్కూటర్లు
భారతీయ మార్కెట్లో.. ఎలక్ట్రిక్ వాహనాలకు (ఫోర్ వీలర్స్, టూ వీలర్స్) డిమాండ్ పెరుగుతోంది. అమ్మకాల్లో కంపెనీల మధ్య పోటీ పెరుగుతోంది. గత నెలలో (2025 ఏప్రిల్) దేశీయ విఫణిలో ఎక్కువ అమ్మకాలు జరిపిన ఐదు కంపెనీల గురించి తెలుసుకుందాం.వాహన్ రిజిస్ట్రేషన్ డేటా ప్రకారం ఏప్రిల్ 2025లో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన బ్రాండ్‌గా టీవీఎస్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ కంపెనీ గత నెలలో 19,736 యూనిట్లను విక్రయించి 154 వృద్ధిని పొందింది. 2024 ఏప్రిల్‌లో కంపెనీ మొత్తం సేల్స్ 7,762 యూనిట్లు.ఓలా ఎలక్ట్రిక్ 2025 ఏప్రిల్‌లో 19,709 యూనిట్ల అమ్మకాలు సాధించింది. ఈ అమ్మకాలు 2024 ఏప్రిల్ (34163 యూనిట్లు) కంటే 42 శాతం తక్కువ.ఇదీ చదవండి: లాంచ్‌కు సిద్దమవుతున్న కార్లు ఇవే.. వివరాలు2025 ఏప్రిల్‌లో బజాజ్ అమ్మకాలు 19,001 యూనిట్లు కాగా.. ఏథర్, హీరో కంపెనీల సేల్స్ వరుసగా 13,167 యూనిట్లు, 6,123 యూనిట్లు. ఈ మూడు కంపెనీలు అమ్మకాలు వరుసగా 151 శాతం, 218 శాతం, 540 శాతం వృద్ధిని నమోదు చేశాయి. దీన్ని బట్టి చూస్తే ఈ మూడు కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు స్పష్టమవుతోంది.

ఫార్మా జీసీసీలకు హబ్‌గా భారత్
సాక్షి, సిటీబ్యూరో: ఫార్మా రంగంలో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ)కు హబ్‌గా భారత్ అవతరిస్తోంది. అంతర్జాతీయ ఫార్మా దిగ్గజాలు ఇండియాలో జీసీసీల ఏర్పాటుపైనే దృష్టి సారిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు తిరోగమనంలో ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండటం,వినియోగం కూడా బాగుంటుండటంతో అవి భారత్ వైపే మొగ్గు చూపిస్తున్నాయి. 2,500లకు పైగా సెంటర్లు, 45 లక్షల మందికి పైగా నిపుణులతో త్వరలోనే భారత జీసీసీ మార్కెట్ పరిమాణం 100 బిలియన్ డాలర్ల మార్క్‌ను అధిగమిస్తోందని ఎర్నెస్ట్ అండ్ యంగ్ నివేదిక పేర్కొంది.లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ విభాగాలలో 2024లో 100 సెంటర్లు ఉండగా.. 2030 నాటికి వీటి సంఖ్య 160కి, వీటిలో ఉద్యోగుల సంఖ్య 4,20,000కి చేరనుందని అంచనా వేసింది. భారత్‌లో టెక్నాలజీ నిపుణుల లభ్యత గ్లోబల్ కంపెనీలకు ఆకర్షణీయంగా ఉంటుండగా.. ఇక్కడ వర్ధమాన స్టార్టప్ వ్యవస్థ కూడా జీసీసీల ఏర్పాటుకు మరో సానుకూలాంశంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు వివరించాయి. దిగ్గజ కంపెనీల జీసీసీల నియామకాలు కూడా భారీగానే ఉంటున్నాయి. డిమాండ్, వ్యూహాత్మక ప్రాధాన్యం పెరుగుతుండటం వంటి అంశాల కారణంగా ఫార్మా దిగ్గజాలు భారత్‌లోని తమ హబ్‌లలో జోరుగా నియామకాలు చేపడుతున్నాయి.

మంచంలో సగం అద్దెకు.. ఆశ్చర్యపడే ఆదాయం సంపాదిస్తున్న మహిళ!
అద్దెకు తీసుకోవడం అనే మాట వినిపిస్తే.. సాధారణంగా ఇల్లు, కారు, బైకు మొదలైనవి రెంటుకు తీసుకోవడం అని అనుకుంటారు. కానీ ఒక మనిషి ఉపయోగించే మంచంలో సగం అద్దెకు తీసుకుంటారా?, ఇది వినడానికి కొత్తగా అనిపించినా.. ఇదే ఆలోచనతో ఓ మహిళ నెలకు రూ. 54,000 సంపాదిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు క్లుప్తంగా ఈ కథనంలో తెలుసుకుందాం.క్వీన్స్‌ల్యాండ్‌కు చెందిన 38 ఏళ్ల మహిళ 'మోనిక్ జెరెమియా'.. "హాట్ బెడ్డింగ్" అనే కొత్త ట్రెండ్ ద్వారా అదనపు డబ్బు సంపాదించడం మొదలుపెట్టింది. ఆమె తన మంచంలో సగం అద్దెకు ఇస్తూ నెలకు 985 ఆస్ట్రేలియా డాలర్లను (రూ.54,000) వసూలు చేస్తోంది. ఎటువంటి భావోద్వేగ సంబంధాలు లేకుండా ఎవరి పక్కనైనా పడుకోవాలనేది ఆమె ఆలోచన.హాట్ బెడ్డింగ్ ద్వారా బెడ్ షేర్ చేసుకునే వ్యక్తులు ఇద్దరూ నియమాలను అర్థం చేసుకుంటే డబ్బు సంపాదించడానికి ఇది మంచి మార్గమని జెరెమియా నమ్మింది. మీరు నాలాగే సాపియోసెక్సువల్ అయితే, శారీరక సాన్నిహిత్యం కంటే.. మానసిక సాంగత్యాన్ని ఇష్టపడితే.. ఒకే బెడ్ మీద ఇద్దరు నిద్రపోవచ్చని చెబుతోంది.2020 కరోనావైరస్ మహమ్మారి సమయంలో ఉద్యోగ కోల్పోయి.. ఒంటరిగా ఉన్నప్పుడు ఈ "హాట్ బెడ్డింగ్" ఆలోచన వచ్చింది. తన మొదటి బెడ్ క్లయింట్ తనకు తెలిసినవాడేనని.. అందువల్ల ప్రారంభంలో అంత ఇబ్బంది ఏమీ అనిపించలేదని మోనిక్ జెరెమియా చెప్పింది. ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ.. నియమాలను గౌరవించుకుంటే.. ఒక రూమ్ షేర్ చేసుకున్నట్లు, బెడ్ షేర్ చేసుకోవచ్చు అని అంటోంది. కష్ట సమయంలో.. డబ్బు సంపాదించడానికి హాట్ బెడ్ ఐడియా ఒక స్మార్ట్ మార్గం అని జెరెమియా చెబుతోంది.ఇదీ చదవండి: 'అతిపెద్ద మార్కెట్ క్రాష్ జరుగుతుంది': జాగ్రత్తగా ఉండండి

మూడు ముక్కల్లో అంబానీ 'సక్సెస్ మంత్ర'
భారతదేశంలో అత్యంత సంపన్నుడు, రిలయన్స్ అధినేత 'ముకేశ్ అంబానీ' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే వ్యాపార సామ్రాజ్యంలో తిరుగులేని వ్యక్తిగా ఎదిగిన ఈయన ఎంతో మందికి ఆదర్శప్రాయం. ఇటీవల ముకేశ్ అంబానీని పెట్టుబడి ఆధారిత కంపెనీ వ్యవస్థాపకుడు 'అనంత్ లాధా' కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అనంత్ లాధా.. ముకేశ్ అంబానీని కలిసి కొంతసేపు ముచ్చటించారు. ఆ సమయంలో 'విజయం సాధించడానికి ఏమి కావాలి?' అని ప్రశ్నించారు. 'ఫోకస్, డెలిగేట్, డైవర్సిఫై' ఈ మూడు ఉంటే తప్పకుండా సక్సెస్ సాధించవచ్చని రిలయన్స్ అధినేత సింపుల్‌గా సమాధానం ఇచ్చారు. ఈ సమాధానం లాధాను ఎంతగానో ఆకట్టుకుంది.ఇదీ చదవండి: 'అతిపెద్ద మార్కెట్ క్రాష్ జరుగుతుంది': జాగ్రత్తగా ఉండండిముకేశ్ అంబానీ చెప్పిన సక్సెస్ ఫార్ములాను.. అనంత్ లాధా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది అతి తక్కువ సమయంలోనే తెగ వైరల్ అయింది. ఇది నెటిజన్లను కూడా ఎంతంగానో ఆకట్టుకుంది. ఇది చాలా గొప్ప సలహా అని ఒక నెటిజన్ వెల్లడించగా.. ఇది బంగారం లాంటి సలహా అని మరో నెటిజన్ పేర్కొన్నాడు. ఇలా అంబానీ ఇచ్చిన సలహా ఎంతోమందిని ఫిదా చేసింది. View this post on Instagram A post shared by Anant Ladha (@anantladha1234)
ఫ్యామిలీ

వీగన్..వీగన్.. : ముద్దముద్దకీ ఆరోగ్యం, ఉల్లాసంగా, ఉత్సాహంగా!
‘ఒక వ్యక్తి మొక్కల ఆధారిత ఆహారాన్ని (plant-based food) ఎంచుకుంటే రోజుకు 1,100 గ్యాలన్ల నీటిని ఆదా చేసినట్టే. పది కేజీల కార్బన్ ఉద్గారాలను తగ్గించి భూమికి మేలు చేసినట్టే. ఒక జంతువు జీవితాన్ని కాపాడిన వారవుతారు. మీ భోజన ఎంపిక మీ ఆరోగ్యం గురించే కాదు, భూమిపైన జంతుజాలం నివసించడానికి, ఆరోగ్యకరమైన భూమి కోసం కూడా’ అంటున్నారు వీగన్ ప్రేమికులు. ‘ఉత్సాహంగా తినండి. ఉత్సాహంగా జీవించండి. ఉత్సాహంగా ఉండండి! పోషకాలతో ఉండండి, దయతో ఉండండి, ఆకుపచ్చగా ఉండండి!’ అనేది వీగన్ ప్రేమికుల మాట.మన ఆహారాల్లో శాకాహారం, మాంసాహారం గురించి తెలుసు. కొన్నాళ్లుగా వినిపిస్తున్నది వీగన్ (Vegan) ఆహారం. జంతు సంబంధిత ఆహారాలకు దూరంగా ఉంటూ మొక్కల ఆధారిత ఆహారాన్ని ఎంచుకోవడం. వీటిలో.. పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు, గింజలు మొదలైనవి ఉంటాయి. ‘వీగన్ డైట్ ఎంపికలో సవాళ్లెన్నో ఉంటాయి. ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్ బి12 పోషకాల కోసం ఆహార ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకు.. ఉడికించిన శనగలను తీసుకుంటే ప్రొటీన్లు, విటమిన్లు, ఐరన్.. వంటి ΄ోషకాలు లభిస్తాయి. శనగలను ఉడకబెట్టి, కూర లేదా సలార్ రూపంలో తయారుచేసి తీసుకోవచ్చు. సోయాబీన్స్‌లో మాంసాహారంతో సమానంగా ప్రొటీన్లు లభిస్తాయి. ఇందులోని ఐరన్, జింక్, క్యాల్షియం, విటమిన్లు, ఫ్యాటీ యాసిడ్స్.. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించి బీపీని కంట్రోల్లో ఉంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు మహిళల్లో మెనోపాజ్ లక్షణాలను తగ్గిస్తాయి. వేరుశనగలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు,ఫైబర్ లభిస్తాయి. బరువును కంట్రోల్లో ఉంచడానికి సహకరిస్తాయి. ఇదీ చదవండి: నా డ్రీమ్స్.. కరియర్ : ఇపుడు కొత్తగా, ప్రతీక్షణం ఆస్వాదిస్తున్నాక్వినోవాలో ప్రొటీన్ సమృద్ధిగా లభిస్తుంది. మాంగనీస్, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ బి6 వంటి ΄ోషకాలు మెండుగా ఉంటాయి. చిక్కుడు జాతికి చెందిన రాజ్మా, బ్లాక్ బీన్స్ వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి. విటమిన్ బి, ఫైబర్, ప్రొటీన్లు లభించే ఈ చిక్కుళ్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బాదంపప్పు, పిస్తా, అక్రోట్ వంటి నట్స్ రోజూ కొన్ని తీసుకుంటే గుండెకు మేలు చేస్తాయి. నట్స్‌లో క్యాలరీలు ఎక్కువ కాబట్టి మితంగా తీసుకోవాలి. ఇలా మొక్కల ఆధారిత గింజలు, మొలకెత్తిన విత్తనాలను ఆహారంలో భాగం చేసుకోవచ్చు. రుచికరంగా, ఆరోగ్యకరంగా జీవనశైలిని మార్చుకోవచ్చు.’– శారద, ప్లాంట్ప్రెన్యూర్, సిమీస్ వరల్డ్, హైదరాబాద్చదవండి: హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్!

బొమ్మను చూస్తే నీలా ఉంది! అమ్మాయికి సంబరమంట!
సాక్షి, వరంగల్: పుట్టినరోజు కోసం ప్రత్యేకమైన చాక్లెట్లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఎవరైనా పుట్టినరోజు స్నేహితులకు చాక్లెట్లు ఇవ్వడం సాధారణమే. ఇందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా? నిజంగానే ఈ చాక్లెట్లలో ప్రత్యేకత ఉంది. పుట్టినరోజు చేసుకుంటున్న వారి ఫొటోలను చాక్లెట్ కవర్‌పై ముద్రిస్తున్నారు. వాటిని స్నేహితులు, తోటి విద్యార్థులకు ఇస్తూ తెగ ఆనందపడుతున్నారు. ఇప్పుడు ఈ సంస్కృతి వరంగల్ నగరంలో రోజురోజుకూ విస్తరిస్తోంది. వీటిని ఇక్కడ తయారు చేస్తున్న సంస్థ.. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వారి నుంచి ఆర్డర్ తీసుకుంటూ.. పిల్లలకు మరిచిపోలేని జ్ఞాపకాలను అందిస్తోంది. దీంతో పాఠశాల విద్యార్థులు తమ ఫొటోతో ముద్రించిన చాక్లెట్లు మిత్రులకు ఇస్తూ సంబర పడిపోతున్నారు. అందరికీ నచ్చేలా.. టేస్టీగా.. ఈ చాక్లెట్లు పిల్లల్నే కాదు.. పెద్దలను కూడా ఆకట్టుకుంటున్నాయి. కొబ్బరిపొడి, కొబ్బరి నూనె, తేనె కలిపి వివిధ పద్ధతుల్లో తయారు చేసే ఈ చాక్లెట్ల రుచికి అందరూ ఫిదా అవుతుండటంతో వీటికి మార్కెట్లో యమ డిమాండ్ పెరుగుతోంది. వరంగల్ కేంద్రంగా ప్రారంభమైన ఓరుగల్లు హోంమేడ్ చాక్లెట్ల (ఓరుగల్లు ఫొటోస్ ర్యాపర్ హోంమేడ్ చాక్లెట్లు) గురించి సామాజిక మాధ్యమాలు ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా తెలుసుకుంటున్న ప్రజలు వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు. తమ పిల్లల పుట్టినరోజుల్ని ఘనంగా నిర్వహించుకునేందుకు వెనుకాడడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ పట్టణాల నుంచే కాకుండా రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయని ఈ స్చంస్థ నిర్వాహకులు కరుణాకర్, సందీప్ చెబుతున్నారు.చదవండి: హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్! మా అమ్మాయి సంబరపడిందిపరకాలలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మా కుమార్తె ఆరుషి ఒకటో తరగతి చదువుతోంది. ఓరుగల్లు హోంమేడ్ చాక్లెట్ల గురించి ఇన్‌స్ట్రాగామ్ ద్వారా తెలుసుకొని ఆర్డర్ ఇచ్చాం. పాప ఆరుషి ఫొటో చాక్లెట్ల కవర్‌పై ఉండటంతో తెగ సంబరపడిపోయింది. వారి పాఠశాలల్లోని ఇతర పిల్లల తల్లిదండ్రులు కూడా ఈ చాక్లెట్ల గురించి వాకబు చేశారు. – డి.రవళి, పరకాల

అందాల ఆతిథ్యం.. అంతర్జాతీయ గౌరవం..
ప్రస్తుతం ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపే చూస్తోంది. మరి కొద్ది రోజుల్లో నగర వేదికగా ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో హైదరాబాద్ విశిష్టత విశ్వవ్యాప్తం కానుంది. ఈ నేపథ్యంలో దేశానికే తలమానికమైన భాగ్యనగరాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ నెల 10 నుంచి 31వ తేదీ వరకూ జరగనున్న 72వ మిస్ వరల్డ్–2025 పోటీల్లో భాగంగా తెలంగాణ ప్రత్యేకతలను ప్రపంచానికి తెలిపేలా, అంతర్జాతీయంగా తెలంగాణకు బ్రాండ్ ఇమేజ్ పెంచేలా కార్యాచరణ సిద్ధం చేసింది తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం. అయితే 7వ తేదీ నుంచే సన్నాహక కార్యక్రమాలు ప్రారంభం కానుండగా 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ మిస్ వరల్డ్ పోటీల కంటెస్టెంట్లు హైదరాబాద్ చేరుకోనున్నారు. ఇందులో భాగంగా మిస్ వరల్డ్ చైర్పర్సన్, సీఈఓ జూలియా ఎవెలిన్ మోర్లీ శుక్రవారం నగరంలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకోగా.. వారికి ఘన స్వాగతం పలికారు.జూలియాతో పాటు విచ్చేసిన మిస్ వరల్డ్ అధికారిణి కెర్రీ ఇతర అధికారులకు భారతీయ సంప్రదాయం పద్దతిలో ఘన స్వాగతం పలికారు. సుమారు 120 దేశాల నుంచి కంటెస్టెంట్లు పాల్గొననున్న ఈ మెగా ఈవెంట్‌ను సువర్ణ అవకాశంగా మలుచుకొని రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ‘ప్రపంచం కళ్లన్నీ తెలంగాణవైపే!’ అనే స్లోగన్‌తో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం చరిత్రలో మైలురాయిగా నిలువనుంది. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి, చరిత్ర, పర్యాటక ఆకర్షణలు, మెడికల్, సేఫ్టీ టూరిజం, తెలంగాణ గ్రోత్ స్టోరీ, ఇతర ప్రత్యేకతలు ప్రపంచానికి పరిచయం చేయడానికి ప్రత్యేక థీమ్స్, టూరిస్ట్ సర్క్యూట్లు రూపొందించారు. ఇందులో భాగంగా మిస్ వరల్డ్–2025 (Miss World 2025) కార్యక్రమం ప్రయాణ ప్రణాళికలు, వేదికలను తెలంగాణతో పాటు హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా రూపొందించారు.నగర వేదికగా మిస్ వరల్డ్ థీమ్స్, టూరిస్ట్ సర్క్యూట్స్.. హైదరాబాద్ హెరిటేజ్ వాక్.. (మే 12న..) హైదరాబాద్ సాంస్కృతిక వారసత్వం, గొప్పదనం ప్రపంచానికి తెలియజేసేలా నగరంలోని చారిత్రాత్మక ఆనవాలైన చారి్మనార్, లాడ్ బజార్లలో ప్రత్యేకంగా ‘హెరిటేజ్ వాక్’ నిర్వహిస్తారు. చౌమహల్లా ప్యాలెస్ సందర్శన.. (మే 13న..) హైదరాబాద్ (Hyderabad) నగరానికే తలమానికమైన చౌమహల్లా ప్యాలెస్ సందర్శిస్తారు. అక్కడ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌ను తిలకిస్తారు. ఎక్స్‌పీరియా ఎకో పార్క్ సందర్శన.. (మే 16న..) గ్రూప్–2 మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు మే 16 సాయంత్రం.. హైదరాబాదు నగరానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న ఎక్సీ్పరియన్ ఎకో పార్కును సందర్శిస్తారు. మెడికల్ టూరిజం పై పరిచయం.. (మే 16న..) వివిధ దేశాల నుంచి రోగులను ఆకర్షించే ఉద్దేశంతో మెడికల్ టూరిజాన్ని సైతం పరిచయం చేయనున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్లో నిర్వహించే మెడికల్ టూరిజం ఈవెంట్‌కు గ్రూప్–1 మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు హాజరవుతారు. హైదరాబాద్‌లోని ఆధునిక ఆస్పత్రుల ప్రత్యేకతలను వారికి వివరిస్తారు. ఘనంగా గ్రాండ్ ఫినాలే.. మే 22న నిర్వహించే మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలేలో.. 23న హెచ్ 2 హెచ్ ఛాలెంజ్ ఫినాలేలో కంటెస్టెంట్లు పాల్గొంటారు. 24న మిస్ వరల్డ్ టాప్ మోడల్, ఫ్యాషన్ ఫినాలే – జ్యువెలరీ/పెర్ల్ గది షో మిస్ వరల్డ్ టాప్ మోడల్, ఫ్యాషన్ ఫినాలే కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. 26న బ్యూటీ విత్ ఫ్యాషన్ కాంటెస్ట్ నిర్వహిస్తారు. చివరగా 31వ తేదీన మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే నిర్వహిస్తారు. ఇవే కాకుండా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని నాగార్జునసాగర్, బౌద్ధవనం ప్రాజెక్టు, వరంగల్ వెయ్యి స్థంభాల గుడి, వరంగల్ పోర్ట్, యునెస్కో గర్తింపు పొందిన రామప్ప ఆలయం, ప్రతిష్టాత్మక యాదగిరి గుట్ట దేవాలయం తదితర ప్రదేశాలను సందర్శిస్తారు. మిస్ వరల్డ్ ఆటల తుది పోటీలు.. (మే 17న..) మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించే మిస్ వరల్డ్ స్పోర్ట్స్ ఫైనల్ పోటీల్లో పాల్గొంటారు. రామోజీ ఫిలిం సిటీ సందర్శన.. (మే 17న..) ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీలో ఒకటిగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీని మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శిస్తారు. సేఫ్టీ టూరిజం.. (మే 18న..) మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించి తెలంగాణ ప్రభుత్వం పౌరుల భద్రతకు తీసుకుంటున్న చర్యలను, ప్రభుత్వం సేఫ్టీ టూరిజం ఇనీషియేటివ్‌ను పరిశీలిస్తారు. సచివాలయ సందర్శన.. (మే 18న..) మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు అధికారులు తెలంగాణ రాష్ట్ర గ్రోత్ స్టోరీ, చరిత్రను తెలియజేస్తారు. ట్యాంక్ బండ్ పైన ప్రతి ఆదివారం ఏర్పాటు చేసే సండే ఫండే కారి్నవాల్ను కూడా సందర్శిస్తారు. ఐపీఎల్ మ్యాచ్‌కు హాజరు.. (మే 20 లేదా 21..) ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌కు గ్రూప్–1 కంటెస్టెంట్లు హాజరవుతారు. తెలంగాణ కళాకారులచే ఆర్ట్స్, క్రాఫ్ట్స్ వర్క్ షాప్.. (మే 21న..) గ్రూప్–2 కంటెస్టెంట్లు శిల్పారామంలో తెలంగాణ కళాకారులచే నిర్వహించే ఆర్ట్స్, క్రాఫ్ట్స్ వర్క్ షాప్స్‌కు హాజరవుతారు. స్వయంగా వాటి తయారీలో భాగమై ప్రత్యక్షంగా తయారీ గురించి తెలుసుకుంటారు.

న్యాయపీఠంపై మహిళా తేజం
‘నాన్న జడ్జి. చెల్లి కూడా జడ్జే. వారే నాకు స్ఫూర్తి’ అంటుంది నిఖిషా. జడ్జి కావాలనేది కీర్తన హైస్కూల్ నాటి కల. ‘మా కుటుంబం, బంధువులలో న్యాయవాదులు, జడ్జీలు ఎవరూ లేరు. అందుకే జడ్జి కావాలనుకున్నాను’ అంటుంది మధులిక. ‘పట్టుదల గట్టిగా ఉంటే తొలి ప్రయత్నంలోనే బ్రహ్మాండంగా విజయం సాధించవచ్చు’ అంటుంది సాహితి....తెలంగాణ హైకోర్టు జూనియర్ సివిల్ జడ్జి పోస్ట్‌లకు ఎంపికైన విజేతలు వీరు. న్యాయమూర్తి కావాలనుకోవడానికి వారికి స్ఫూర్తి వేర్వేరుగా ఉండవచ్చు. అయితే పడిన కష్టం మాత్రం ఒక్కటే. ‘న్యాయవ్యవస్థలో ఉన్నత స్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి’ అని జాతీయ స్థాయిలో నివేదికలు నొక్కి చెబుతున్న నేపథ్యంలో ఈ మహిళల విజయం... ఆశా కిరణం – అరవింద్ గండ్రాతి, ‘సాక్షి’ నెట్వర్క్1. ఎన్నో సవాళ్లు... అయినా సరే...న్యాయవాది కావాలనేది నా చిన్నప్పటి కల. జూనియర్ సివిల్ జడ్జి పోస్టుకు ఎంపికైనందుకు సంతోషంగా ఉంది. మధ్యతరగతి కుటుంబాల్లో ప్రత్యేకంగా స్టడీ రూమ్స్ లేకపోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఏకాంతంగా చదువుకునే అవకాశం ఉండదు. లైబ్రరీలలో రాత్రి ΄÷ద్దుపోయే వరకు చదువుకునే వీలు అమ్మాయిలకు ఉండదు. మెటీరియల్ కలెక్ట్ చేసుకోవడం నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రిపేర్ కావడం వరకు...పేద, మధ్యతరగతి అమ్మాయిలకు ఎన్నో సమస్యలు ఉంటాయి. అయితే లక్ష్యాన్ని మాత్రమే చూస్తే ఆ సమస్యలు కనిపించవు. – గంగిశెట్టి ప్రసీద, వరంగల్ సిటీ2. పుట్టెడు దుఃఖంతో... తిరుగులేని పట్టుదలతో...తెలంగాణ ఉద్యమంలో నర్సంపేట పట్టణం నుండి ముందు వరుసలో ఉండి ఉద్యమాన్ని నడిపించారు నాన్న. 2020లో నాన్న హత్యకు గురయ్యారు. నా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. నా కాళ్లపై నేను నిలబడి అమ్మకు అండగా ఉండాలనుకున్నాను. నాన్న ఆలోచనలకు అనుగుణంగా ఎల్ఎల్బీలో చేరినప్పటి నుంచి జడ్జి కావాలనే పట్టుదలతో చదివాను. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించడం సంతోషంగా ఉంది. – అంబటి ప్రణయ, నర్సంపేట, వరంగల్3. తొలి ప్రయత్నంలోనే... ‘లక్ష్యం ఏర్పర్చుకున్నప్పుడు ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురొచ్చినా పట్టుదలను వదలవద్దు. జూనియర్ సివిల్ జడ్జి పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యేవారు సొంత నోట్స్ తయారు చేసుకోవడమే ఉత్తమం. ఇది ఒక హ్యాపీ మూమెంట్. నా పేరెంట్స్‌కు ఒక గిఫ్ట్.– సాహితి, నంగనూరు, సిద్దిపేట జిల్లా (తొలి ప్రయత్నంలోనే, 26 ఏళ్ల వయసులో జూనియర్ సివిల్ జడ్జి పోస్ట్‌కు ఎంపికైంది)ఇదీ చదవండి: నా డ్రీమ్స్.. కరియర్ : ఇపుడు కొత్తగా, ప్రతీక్షణం ఆస్వాదిస్తున్నా4.ఉద్యోగం కాదు... బాధ్యతమా కుటుంబంలో ఎవరూ న్యాయవాదులు, జడ్జిలు లేరు. అదే నన్ను న్యాయమూర్తి కావాలనే లక్ష్యం వైపు నడిపించింది. కొంతకాలం న్యాయవాదిగా చేసిన అనుభవం జేసీజే పరీక్షలో తోడ్పడింది. జడ్జి పోస్ట్ అనేది ఉద్యోగం కాదు. విలువైన బాధ్యత. – డాకన్నగారి మధులిక తేజ, హైదరాబాద్5. చిన్ననాటి కల... తొలి ప్రయత్నంలోనే చిన్ననాటి నుంచి జడ్జి అవ్వాలనేది నా కల. నా కల నెరవేరినందుకు సంతోషంగా ఉంది. హైకోర్టు, కరీంనగర్ కోర్టుల్లో న్యాయవాదిగా పలు కేసులు వాదించాను. రెండేళ్ల క్రితం నుంచి జేసీజే పరీక్షలకు సిద్ధమయ్యాను. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా క్రమపద్ధతిలో పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యాను. – కట్ట కీర్తన, ఆరెపల్లి, కరీంనగర్జడ్జిల కుటుంబం...తండ్రి కె. ఖుషా హైదరాబాద్ సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జి. చెల్లి భావన మహబూబ్‌నగర్‌లో 4వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి. తాజాగా అక్క నిఖీషా జూనియర్ సివిల్ జడ్జి పోస్ట్‌కు ఎంపికైంది. తండ్రి, ఇద్దరు కూతుళ్లతో వారిది జడ్జిల కుటుంబంగా మారింది. ఐటీ ఉద్యోగం వచ్చినా చట్టంపై అవగాహన ఉండాలని న్యాయమూర్తి కె. ఖుషా తన కూతుళ్లను న్యాయ విద్య చదివించారు.అసలైన లక్ష్యం అదే...కోవిడ్ లాక్డౌన్ సమయంలో నిఖీషా వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగంలో చేరింది. ఐటీ రంగంలో అనుభవం కోసం ఉద్యోగంలో చేరింది. అయితే ఆ ఉద్యోగం ఆశించిన స్థాయిలో సంతృప్తి ఇవ్వలేదు. ఆ సమయంలోనే ‘నేను చేయాల్సిన ఉద్యోగం ఇది కాదు’ అనుకుంది. ‘నాన్నలాగే న్యాయమూర్తి కావాలి’ అని తనలో నిద్రాణంగా ఉన్న లక్ష్యంపై దృష్టి పెట్టింది.మానసిక స్థైర్యం... హరే కృష్ణ మంత్రంమెయిన్స్ ఎగ్జామ్స్ సమయంలో నిఖీషా తల్లి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ఇంటర్వ్యూకు ముందు నాన్నకు బై΄ాస్ సర్జరీ జరిగింది. కవలబిడ్డలకు అప్పటికి సంవత్సరం కూడా నిండలేదు. ఇలా ఎన్నో ఒడిదొడుకులు వచ్చినా మానసికంగా కుంగిపోకుండా లక్ష్యాన్ని పదేపదే గుర్తు తెచ్చుకునేది. ‘హరే కృష్ణ మంత్రం జపిస్తూ మానసిక స్థైర్యాన్ని పొందాను. విజయం సాధించాను. మా కుటుంబం నుంచి నేను కూడా న్యాయమూర్తిగా అడుగుపెడుతున్నందుకు ఎంతో గర్వం ఉంది’ అంటుంది నిఖీషా. చదవండి : నిశ్చితార్థం రద్దు, ప్రేమ వివాహం, డైమండ్స్ షూస్ : ఎవరీ అందాల రాణి?
ఫొటోలు


Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 04-11)


మాకేం తక్కువ, మేమేం తీసిపోయాం : నవ్వుల రేరాణులు (ఫొటోలు)


బర్త్‌డే స్పెషల్..త్రిష గురించి 10 ఆసక్తికర విషయాలు!


చెన్నైలో గ్రాండ్‌గా నటి అభినయ రిసెప్షన్ వేడుక (ఫొటోలు)


కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ సింగర్ ఉష (ఫొటోలు)


శ్రీవిష్ణు #Single మూవీ ట్రైలర్ ఈవెంట్లో కేతిక శర్మ సందడి (ఫొటోలు)


హైదరాబాద్ : గోల్కొండ కోటలో పర్యాటకుల సందడి (ఫొటోలు)


యువరాణిలా ముస్తాబైన హీరోయిన్ నభా నటేష్ (ఫొటోలు)


వేవ్స్ సమ్మిట్ లో శోభిత.. ఎంత అందంగా ఉందో? (ఫొటోలు)


దిల్ రాజు కూతురి 10వ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
అంతర్జాతీయం

వణుకుతున్న దాయాది
ఇస్లామాబాద్/వాషింగ్టన్/శ్రీనగర్/న్యూఢిల్లీ: భార త ‘పహల్గాం ప్రతీకార’ప్రయత్నాలు చూసి పాకిస్తాన్ బెదిరిపోతోంది. ఉద్రిక్తతలను ఎలాగైనా తగ్గించేలా భారత్‌ను ఒప్పించాలంటూ అరబ్ దేశాలను ఆశ్రయించింది. సౌదీ అరేబియా, యూఈఏ, కువైట్ తదితర దేశాలకు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ శుక్రవారం ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పాక్‌లోని ఆ దేశాల రాయబారులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దక్షిణాసియాలో సుస్థిరతనే కోరుతున్నామంటూ శాంతి వచనాలు వల్లెవేశారు. పహల్గాం దాడితో పాక్‌కు ఏ సంబంధమూ లేదంటూ పాతపాటే పాడారు.పాక్‌లో చైనా రాయబారి జియాంగ్ జైడాంగ్‌తో కూడా షహబాజ్ భేటీ అయ్యారు. ఉగ్రవాదంపై పోరుతో భారత్‌కు తాము పూర్తిస్థాయిలో దన్నుగా నిలుస్తామని అమెరికా పునరుద్ఘాటించింది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి తమ పూర్తి మద్దతుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టామీ బ్రూస్ స్పష్టం చేశారు. భారత్, పాక్ మధ్య నెలకొన్న పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్టు చెప్పారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ విషయమై నిర్ణాయక వ్యాఖ్యలు చేశారు. పాక్ భూభాగం నుంచి మారణకాండకు దిగుతున్న ఉగ్రవాదులను వెదికి పట్టుకోవడంలో భారత్‌కు సహకరించాలని దాయాదికి హితవు పలికారు.‘‘ఇరుదేశాల మధ్య పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. అవి రెండు అణుదేశాల ప్రాంతీయ యుద్ధంగా మారొద్దన్నదే మా ఉద్దేశం. ఏం జరుగుతుందో చూద్దాం’’అని గురువారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అభిప్రాయపడ్డారు. పహల్గాం దాడి సమయంలో వాన్స్ కుటుంబంతో పాటు భారత్‌లోనే ఉండటం తెలిసిందే. దాయాదుల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలని బ్రిటన్ ఆకాంక్షించింది. పహల్గాం దాడిని హౌస్ ఆఫ్ లార్డ్స్ తీవ్రంగా ఖండించినట్టు పేర్కొంది. వాటిని నిరసిస్తూ బ్రిటన్‌లో కొద్ది రోజులుగా శాంతియుత ఆందోళనలు జరుగుతున్న వైనం కూడా సభలో చర్చకు వచ్చినట్టు పేర్కొంది. అదేమీ రహస్యం కాదు: బిలావల్ పాక్ ఉగ్రవాదులకు ఆశ్రయంగా మారడం నిజమేనని ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్పర్సన్ బిలావల్ భుట్టో కూడా అంగీకరించారు. మూడు దశాబ్దాలుగా పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇటీవల అంతర్జాతీయ మీడియా సాక్షిగా అంగీకరించడం తెలిసిందే. దీనిపై స్కై న్యూస్ ఇంటర్వ్యూలో బిలావల్ ఈ మేరకు స్పందించారు. రక్షణ మంత్రి వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా అని ప్రశ్నించగా, ‘అది పెద్ద రహస్యమేమీ కాదు. పాక్‌ది ఉగ్రవాద గతమే’’అంటూ పాక్ నిర్వాకాన్ని బాహాటంగా అంగీకరించారు. అయితే దానివల్ల దేశం ఎంతగానో నష్టపోయిందని వాపోయారు.‘‘ఉగ్రవాదం పాక్‌కే కాదు, అంతర్జాతీయ సమాజానికి కూడా పెనుబెడదగా పరిణమించింది. పాక్ దశలవారీగా ఉగ్రవాదానికి మద్దతిస్తూ వచ్చింది. మా సమాజం ఇస్లామీకరణ, సైనికీకరణ దశల గుండా సాగింది. వీటన్నింటివల్లా మేం నష్టపోతూ వచ్చాం. అయితే వాటినుంచి పాఠాలు నేర్చుకున్నాం. సింధూ పరివాహక నదులకు భారత్ నీరు వదలకుంటే రక్తం పారుతుందంటూ బిలావల్ ఇటీవల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. తన ఉద్దేశం అది కాదని ఆయన తాజాగా చెప్పుకొచ్చారు. ‘‘నీటిని ఆపడాన్ని యుద్ధ చర్యగానే పరిగణిస్తామని మా ప్రభుత్వమే చెప్పింది. యుద్ధం జరిగితే పారేది రక్తమేగా. అదే నేనూ చెప్పా’’అన్నారు. మరోవైపు సింధూ జల ఒప్పందం నిలుపుదలను నిరసిస్తూ భారత్‌కు దౌత్య నోటీసులివ్వాలని పాక్ యోచిస్తోంది. ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికల మీదా లేవనెత్తేందుకు సిద్ధమవుతోంది. హాకింగ్‌కు విఫలయత్నాలు పాక్ ప్రేరేపిత హాకర్ గ్రూపులు భారత వెబ్సైట్లపై శుక్రవారం మరోసారి భారీగా సైబర్ దాడులకు దిగాయి. జమ్మూలోని ఆర్మీ స్కూల్స్, రిటైర్డ్ సైనికుల ఆరోగ్య సేవలు తదితరాలకు సంబంధించిన సైట్లను హాక్ చేసేందుకు విఫలయత్నం చేశాయి. సైబర్ గ్రూప్ హోక్స్1337, నేçషనల్ సైబర్ క్రూ పేరిట దాడులు జరిగినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ‘‘పాక్‌తో పాటు పలు పశ్చిమాసియా దేశాలు, ఇండొనేసియా, మొరాకో తదితర చోట్ల నుంచి ఈ సైబర్ దాడులు జరిగాయి. వాటికి పాల్పడ్డ పలు సంస్థలు ఇస్లామిక్ భావజాలానికి మద్దతు పలుకుతున్నట్టు చెప్పుకున్నాయి. వాటన్నింటినీ సమర్థంగా తిప్పికొట్టాం’’అని తెలిపాయి. పహల్గాం దాడి నుంచీ ఈ తరహా దాడులు విపరీతంగా పెరిగిపోయినట్టు వెల్లడించాయి. ఇదంతా పాక్ హైబ్రిడ్ యుద్ధతంత్రంలో భాగమని అనుమానిస్తున్నారు. ఐదు సెక్ట్టర్లలో కాల్పులుపాక్ వరుసగా ఎనిమిదో రోజు కాల్పుల విరమణకు తూట్లు పొడిచింది. జమ్మూ కశ్మీర్లో ఐదు జిల్లాల వెంబడి నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి గురువారం రాత్రి కూడా కాల్పులకు తెగబడింది. కుప్వారా, బారాముల్లా, పూంచ్, నౌషేరా, అఖూ్నర్ ప్రాంతాల్లో ఎలాంటి కవ్వింపులూ లేకుండానే పాక్ దళాలు తేలికపాటి ఆయుధాలతో కాల్పులకు దిగినట్టు సైన్యం అధికార ప్రతినిధి వెల్లడించారు. ‘‘తొలుత ఉత్తర కశ్మీర్లో కుప్వారా, బారాముల్లా జిల్లాల్లో మొదలైన కాల్పులు జమ్మూ ప్రాంతంలోని పూంచ్, అఖ్నూర్ సెక్టర్లకు విస్తరించాయి.అనంతరం నౌషేరాలోని సుందర్బనీ, జమ్మూ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు గుండా పర్గ్వాల్ సెక్టర్లోనూ కాల్పులకు తెగబడ్డాయి. వాటిని భారత సైన్యం దీటుగా తిప్పికొట్టింది’’అని తెలిపారు. ఉద్రిక్తతలు మరింత పెరగవచ్చన్న అంచనాల నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లోని సరిహద్దు గ్రామాల ప్రజలు సురక్షితంగా తలదాచుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన కమ్యూనిటీ, వ్యక్తిగత బంకర్లను సిద్ధం చేసుకుంటున్నారు.కథువా, సాంబా, రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో ఇంకా పంటకోతలు జరగాల్సి ఉంది. పాక్‌తో భారత్ 3,323 కి.మీ. మేరకు సరిహద్దును పంచుకుంటోంది. ఇందులో 2,400 కి.మీ. మేరకు అంతర్జాతీయ సరిహద్దు గుజరాత్ నుంచి జమ్మూ దాకా విస్తరించింది. 740 కి.మీ. నియంత్రణ రేఖ, యాక్చ్యువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ (ఏజీపీఎల్)తో పాటు మరో 110 కి.మీ. సియాచిన్ ప్రాంతంలో విస్తరించి ఉంది.

నిర్బంధ ఓటింగ్‌కు వందేళ్లు
ఆ్రస్టేలియా పార్లమెంటుకు శనివారం ఎన్నికలు జరుగుతున్నాయి. దేశంలోని 1.8 కోట్ల మంది అర్హులైన ఓటర్లు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నారు. ఆ దేశంలో ఓటేయడం కేవలం నచ్చిన అభ్యరి్థని ఎన్నుకునే ప్రక్రియ మాత్రమే కాదు.. తప్పనిసరిగా పాటించి తీరాల్సిన చట్టపరమైన బాధ్యత. ఎందుకంటే ఆ్రస్టేలియాలో 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు వేయాలని చట్టముంది. దాంతో అనేక దేశాలు ప్రజలను పోలింగ్ కేంద్రాలకు తీసుకురావడానికి నానా కష్టాలు పడుతుంటే ఆస్ట్రేలియా మాత్రం ప్రపంచంలోనే అత్యధిక ఓటింగ్ నమోదయ్యే దేశాల్లో ఒకటిగా ఉంది. 2022 ఎన్నికల్లో ఏకంగా 90 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు! బ్రిటన్‌లో 2024 ఎన్నికల్లో కేవలం 60 శాతం పోలింగ్ నమోదయ్యింది. అమెరికాలో ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో 64 శాతం నమోదైంది. చట్ట సవరణ ఆ్రస్టేలియాలో 1924లో ఎన్నికల చట్టాన్ని సవరించి ఫెడరల్ ఎన్నికల్లో ఓటేయడాన్ని తప్పనిసరి చేశారు. దానిప్రకారం ఫెడరల్ ఎన్నికల్లో ఓటు వేయకపోతే 20 డాలర్లు, రాష్ట్ర ఎన్నికల్లో ఓటేయకపోతే 79 డాలర్ల దాకా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ చట్టం బాగానే పనిచేసింది. 1922 ఎన్నికల్లో 60 శాతం కూడా లేని ఓటింగ్ చట్టం తర్వాత 1925 ఎన్నికల్లో ఏకంగా 91 శాతం దాటేసింది. నిర్బంధ ఓటింగ్ వల్ల గెలిచినవారు మరింత బాధ్యతాయుతంగా ఉంటారనే వాదన కూడా ఉంది.నిర్బంధ ఓటు అట్టడుగు వర్గాలకు మెరుగైన ప్రాతినిధ్యం కల్పించడానికి కూడా సహాయపడుతుందని, ఇది మరింత సమసమాజ ప్రజా విధానాలను రూపొందిస్తుందని నిపుణుల విశ్లేషణ. నిర్బంధ ఓటింగ్ విధానంలో మధ్యతరగతి పౌరులు, వారి ఆందోళనలు, సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటారని, ఇది ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో కనిపించే పోలరైజేషన్ రాజకీయాలను నిరోధించి భిన్నమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందనే అభిప్రాయం ఉంది. ప్రత్యేక పరిస్థితుల్లో ఓటు వేయలేకపోతే ఏంటి పరిస్థితి? సరైన కారణం ఉంటే మినహాయింపు ఉంటుంది.ఆ్రస్టేలియన్లు ఏమంటున్నారు?నిర్బంధ ఓటింగ్ గురించి ఆస్ట్రేలియాలో ఎలాంటి వివాదం లేదు. ఈ చట్టానికి ప్రజల గట్టి మద్దతుంది. దీనికి 70 శాతం ఆమోదం ఉందని 1967 నుంచి జరిగిన పలు జాతీయ సర్వేలు తేల్చాయి. అయితే నిర్బంధ ఓటింగ్‌ను రద్దు చేయాలని దశాబ్దాలుగా డిమాండ్, ఆందోళనలు చేస్తున్న వాళ్లూ ఉన్నారు. ఓటేయాలో వద్దో ఎంచుకునే హక్కు పౌరులకు ఉండాలన్నది వారి వాదన. వాళ్లకు ప్రజాదరణ అంతంతే. నిర్బంధ ఓటింగ్ ద్వారా యువకులు మనమందరం ఎలాగైనా ఓటు వేయాలి అనే అవగాహనకు వస్తున్నారు. రాజకీయ ప్రక్రియలో పాల్గొనడంతోపాటు ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. నిర్బంధ ఓటు లేకపోయినా స్వచ్ఛందంగా ఓటేసే వాళ్లమేనని 2022లో 77 శాతం మంది ఆ్రస్టేలియన్లు చెప్పడం విశేషం!వేతనంతో కూడిన సెలవుఓటింగ్‌కు అడ్డంకులు తొలగించడానికి, ప్రజలంతా ఓటింగ్‌లో పాల్గొనేలా చూడటానికి అధికారులు పలు విధానాలను అమలు చేశారు. ఆస్ట్రేలియాలో శనివారాల్లోనే ఎన్నికలు జరుగుతాయి. వీకెండ్ కావడంతో ఎక్కువ మంది స్వేచ్ఛగా పోలింగ్ కేంద్రాలకు వెళ్తారు. యాజమాన్యాలు ఎన్నికల రోజున కార్మి కులకు వేతనంతో కూడిన సెలవు ఇస్తాయి.పోలింగ్ బూత్‌ల దగ్గర బార్బెక్యూలపై కాల్చిన డెమోక్రసీ సాసేజ్లు అదనపు ప్రోత్సాహం. ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రాల దగ్గర నిధుల సేకరణ కోసం ఏర్పాటు చేసే ఈ స్నాక్స్ ఆ్రస్టేలియా ఎన్నికలకు చిహ్నాలుగా మారాయి. ఇవి స్థానిక పాఠశాలలు, కమ్యూనిటీలకు అతి పెద్ద నిధుల సేకరణ కార్యక్రమాలుగా మారా యి. మొత్తంగా ఎన్నికల రోజు ఆ్రస్టేలియాలో పండుగ వాతావరణం ఉంటుంది. – సాక్షి, నేషనల్ డెస్క్

ట్రంపే బదులివ్వాలి
వాషింగ్టన్: స్టూడెంట్ వీసాల రద్దు, విదేశీ విద్యార్థుల చట్టపరమైన హోదాను రద్దు చేస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై భారత సంతతికి చెందిన డెమొక్రాట్ ప్రమీలా జయపాల్ మండిపడ్డారు. ఏ ప్రాతిపదికన ఈ చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలన్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ, హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగాలకు లేఖ రాశారు. దానిపై 130 మందికి పైగా డెమొక్రాట్లు సంతకాలు చేశారు. విద్యా సంవత్సరం మధ్యలో అకస్మాత్తుగా వీసాల రద్దు వల్ల విద్యార్థుల భవిష్యత్ గందరగోళంలో పడుతుందని జయపాల్ అన్నారు.వీసా హోదా అనిశ్చితి అమెరికా విశ్వవిద్యాలయాలను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘రద్దు చేసిన కొందరు విద్యార్థుల వీసాలను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించినా అదింకా అమలు కాలేదు. కొందరు విద్యార్థులు ఇంకా ఇమిగ్రేషన్ నిర్బంధంలో ఉన్నారు. భవిష్యత్‌లో మరిన్ని వీసా రద్దులు జరుగుతాయనే భయాందోళనలు నెలకొన్నాయి’’అని లేఖలో పేర్కొన్నారు.‘‘ఇది స్టూడెంట్ వీసా హోల్డర్లపై దాడి. ఈ భారీ, రాజకీయ ప్రేరేపిత ఇమ్మిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ విశ్వవిద్యాలయాలను భయానక ప్రదేశాలుగా మారుస్తోంది’అని జయపాల్ హెచ్చరించారు. ఆమె ఇమ్మిగ్రేషన్ ఇంటిగ్రిటీ, సెక్యూరిటీ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సబ్ కమిటీలో సభ్యురాలు. కొన్ని వారాల్లో గ్రాడ్యుయేషన్ ఉండగా ఆకస్మిక వీసాల రద్దు పలువురు విద్యార్థులను అయోమయంలో పడేసింది. తమ వీసా హోదాను పునరుద్ధరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా 100 మందికి పైగా విద్యార్థులు కోర్టులను ఆశ్రయించారు. ఎవరీ ప్రమీలా జయపాల్? అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్ మహిళగా జయపాల్ రికార్డు సృష్టించారు. 1965 సెప్టెంబర్ 21న చెన్నైలో జన్మించిన ఆమె వాషింగ్టన్ 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ సంస్కరణలు, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక న్యాయం, వాతావరణం మార్పులు వంటి అంశాలపై ఎంతోకాలంగా క్రియాశీలకంగా పని చేస్తున్నారు. విద్యార్థి హక్కులు, వలస సంస్కరణల కోసం గళమెత్తుతున్నారు.

అర్జెంటీనాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
బ్యూనోస్ ఎయిర్స్: అర్జెంటీనాలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. అర్జెంటీనాలో వచ్చిన భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 7.4గా నమోదైంది. దాంతో చిలీ, అర్జెంటీనా, దక్షిణ అమెరికా తీరాలను భూకంపం కుదిపేసింది. మరో రెండు భూప్రకంపనలు కూడా నమోదయ్యాయి. ఫలితంగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు.దక్షిణ అర్జెంటీనాలోని ఉషుయాకు దక్షిణంగా 219 కి.మీ దూరంలో ఉన్న డ్రేక్ పాసేజ్ వద్ద ఉదయం 9 సమయంలో ప్రకంపనలు సంభవించాయని యూఎస్ జియోలాజికల్ సర్వే స్పష్టం చేసింది. చిలీ తీరంలోని కొన్ని ప్రాంతాలను సాధారణ అలల స్థాయి కంటే 3 నుండి 10 అడుగుల ఎత్తులో అలలు తాకవచ్చని అమెరికా సునామీ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. ఒక మీటర్ ఎత్తు వరకు చిన్న అలలు కూడా అంటార్కిటికా తీరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రభావితం చూపే అవకాశం ఉందని పేర్కొంది.
జాతీయం

పాకిస్తాన్ ఓడలపై భారత్ నిషేధం
ఢిల్లీ: పాకిస్తాన్‌కు భారత్ వరుస షాకులిస్తోంది. ఇవాళ పాకిస్తాన్ ఓడలపై కేంద్రం నిషేధం విధించింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఆ నోటిఫకేషన్‌లో పాకిస్తాన్ జెండా ఉన్న ఏ ఓడ భారత జలాలలోకి, పోర్టుల్లోకి ప్రవేశించవద్దని ఆదేశించింది. భారత ఓడలేవి పాకిస్తాన్ పోర్టుల్లోకి వెళ్ళొద్దని సూచించింది. భారత్ ఆస్తులను, కార్గో , మౌలిక సదుపాయాలను రక్షించే క్రమంలో ఓడరేవుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. పాకిస్తాన్ విమానాలకు ఇప్పటికే గగనతలం నిషేధం విధించింది భారత్. తాజాగా సముద్ర మార్గాన్ని సైతం బ్యాన్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇలా పాక్ అన్ని మార్గాల్లో నిషేధం విధిస్తూ అష్ట దిగ్బంధనం చేసే ప్రయత్నాల్ని భారత్ కొనసాగిస్తోంది.

సలాల్ డ్యామ్ గేట్లు ఎత్తివేత.. వరద భయంతో పాక్ గగ్గోలు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ చినాబ్ నదిలో వరద ప్రవాహాం పెరుగుతుండడంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. సలాల్ డ్యామ్ గేట్లు ఎత్తేసి నీటిని దిగువకు విడుదల చేశారు.చినాబ్‌లో నీటి ప్రవాహం డేంజర్ మార్క్‌కు చేరుకోవడంతో సలాల్ డ్యామ్ గేట్లు తెరిచారు జమ్మూకశ్మీర్ అధికారులు. దీంతో పాకిస్తాన్లో వరద భయాలు మరింత పెరిగిపోయాయి. భారత్ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గేట్లు ఎత్తివేసిందంటూ పాక్ అధికారులు గగ్గోలు పెడుతున్నారు. ఇది వాటర్ సర్జికల్ స్ట్రైక్స్ అంటూ తప్పుడు ప్రచారానికి దిగారు. అయితే, గత రెండు రోజులుగా జమ్మూకశ్మీర్‌లో క్లౌడ్ బస్టర్ కారణంగా భారీ వర్షాలు కురిశాయి. వెరసీ సలాల్ డ్యామ్ గేట్లు ఎత్తకపోతే వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే సలాల్ డ్యామ్ గేట్లు ఎత్తారు.

పహల్గాం ఉగ్రదాడి: పాకిస్తాన్‌కు ప్రధాని మోదీ మరో షాక్
ఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ ఎగుమతులు, దిగుమతులపై నిలిపివేస్తున్నట్లు ప్రధాని మోదీ సర్కార్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వుల్ని జారీ చేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ ఆర్థిక మూలాలను చావు దెబ్బ తీసే ప్రయత్నాల్ని భారత్ ముమ్మరం చేసింది. తాజాగా పాకిస్తాన్ అధికారిక, అనధికారిక దిగుమతులు, ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ పరిమితిని విధించింది. అయితే, ఈ నిషేధం నుంచి మినహాయింపు పొందాలంటే భారత ప్రభుత్వం ముందస్తు అనుమతి అవసరం’ అని వాణిజ్య మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది.ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదులు అమానుషంగా 26 మంది టూరిస్టుల ప్రాణాల్ని బలితీసుకున్నారు. ఈ దాడి తర్వాత భారత్,పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. నాటి నుంచి వరుస కఠిన నిర్ణయాలతో పాకిస్తాన్‌ను భారత్ దెబ్బకు దెబ్బ తీస్తోంది. ముందుగా సరిహద్దు దాటిన ఉగ్రవాదం అని పేర్కొంటూ సింధు జల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ జాతీయుల అన్ని వీసాలను రద్దు చేసింది. పాక్ పౌరులు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. భారత గగనతలంలో పాక్ విమానాలపై నిషేధం విధించింది. భారత్‌లో పాక్ దేశ మీడియా,సోషల్ మీడియా అకౌంట్స్‌పై బ్యాన్ విధించింది. ఇప్పుడు పాకిస్తాన్‌పై వాణిజ్య యుద్ధం ప్రకటించింది. విదేశీ వాణిజ్య విధానంలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్లో పేర్కొన్న కేంద్రం పేర్కొంది.

బాంబులు పెట్టాం, పేలతాయి
మైసూరు: మైసూరు నగరంలో శుక్రవారం బాంబు బెదిరింపు మెయిల్ అందరినీ పరుగులు పెట్టించింది. పోలీసు కమిషనర్ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తి ఈ మెయిల్ చేశాడు. నగరంలో పలుచోట్ల బాంబులు పెట్టామని, అవి పేలిపోతాయని అందులో రాసి ఉంది. వెంటనే పోలీసులు ప్రముఖ స్థలాల్లో బాంబు నిరీ్వర్యక దళాలు, శునకాలతో సోదాలు ఆరంభించారు. లలిత మహల్ ప్యాలెస్, మైసూరు ప్యాలెస్, రైల్వే స్టేషన్, బస్టాండుతో పాటు పలు ముఖ్య ప్రదేశాల్లో తనిఖీలు చేశారు. ఎక్కడా పేలుడు వస్తువులు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అంతటా ఉత్కంఠ కొన్ని గంటల సేపు ఉత్కంఠ నెలకొంది. పర్యాటకులు టెన్షన్ పడ్డారు. చివరకు నకిలీ బెదిరింపు మెయిల్ అని తేల్చారు, దానిని పంపినవారి కోసం గాలిస్తున్నట్లు కమిషనర్ పోలీస్ సీమా లాట్కర్ తెలిపారు.
ఎన్ఆర్ఐ

డల్లాస్‌లో నిరాశ్రయుల ఆశ్రయ గృహంలో పేదలకు ఆహారం
తెలంగాణా పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (Telangana Peoples Association of Dallas) మరో సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో 'ఫుడ్ డ్రైవ్'తో అన్నార్తుల ఆకలి తీర్చింది. Austin Street Homeless Shelter లో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఒక రోజంతా సాగిన ఈ కార్యక్రమంలో TPAD సభ్యులు స్వయంగా పాస్తా, చికెన్, మాష్డ్ పొటాటో తదితర వంటకాలు తయారు చేసి.. అన్నార్తులకు వడ్డించారు. 450 మందికి పైగా నిరాశ్రయుల ఆకలి తీర్చారు. అనురాధ మేకల (ప్రెసిడెంట్), రావు కల్వల (FC చైర్), పాండు పాల్వే (BOT చైర్), రమణ లష్కర్ (కోఆర్డినేటర్), దీపికా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఫుడ్ డ్రైవ్‌లో 450 మందికి పైగా నిరాశ్రయులకు ఆహారం వడ్డించామని, టీప్యాడ్ చెందిన 50 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు తెలియజేశారు. టీప్యాడ్ సీనియర్ నాయకుడు రఘువీర్ బండారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. (మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Texas: మృత్యువుతో పోరాడి ఓడిన దీప్తి
ఆస్టిన్: అమెరికా టెక్సాస్‌లో తెలుగు విద్యార్థిని హిట్ అండ్ రన్ కేసు విషాదాంతంగా ముగిసింది. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వంగవోలు దీప్తి(Deepthi Vangavolu)కన్నుమూశారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు ఇచ్చిన సమాచారం ద్వారా కుటుంబ సభ్యులు ధృవీకరించారు. దీంతో గుంటూరులోని ఆమె స్వస్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీప్తి(23) తండ్రి హనుమంత రావు చిరువ్యాపారి. ఆమె కుటుంబం గుంటూరు(Guntur) రాజేంద్రనగర్ రెండో లైనులో నివాసం ఉంటోంది. టెక్సాస్‌లోని డెంటన్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో ఎంఎస్ చేసేందుకు వెళ్లారు. మరో నెల రోజుల్లో కోర్సు పూర్తి కావాల్సి ఉంది. అయితే ఈలోపు రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆమెను కబళించింది. ఈ నెల 12వ తేదీన స్నేహితురాలైన మేడికొండూరుకు చెందిన స్నిగ్ధతో కలిసి రోడ్డుపై నడచి వెళ్తుండగా వేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. దీప్తి తలకు తీవ్ర గాయమైంది. స్నిగ్ధకు కూడా గాయాలయ్యాయి. దీప్తి స్నేహితురాళ్లు ప్రమాద విషయాన్ని ఆమె తండ్రి హనుమంతరావుకు తెలిపారు. క్రౌడ్ ఫండింగ్(Crowd Funding) ద్వారా ఆమె చికిత్స కోసం ప్రయత్నాలు కొనసాగగా.. మంచి స్పందన లభించింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నెల 15న దీప్తి చికిత్స పొందుతూ కన్నుమూసింది. శనివారం(ఏప్రిల్ 19) నాటికి మృతదేహం గుంటూరుకు వచ్చే అవకాశం ఉంది. మరో బాధితురాలు స్నిగ్ధ ప్రస్తుతం అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. అవే ఆమె చివరి మాటలు..దీప్తి మృతి వార్త విని ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసెలా రోదిస్తున్నారు. చదువులో చాలా చురుకైన విద్యార్థిని అని, అందుకే పొలం అమ్మి మరీ అమెరికాకు పంపించామని చెప్పారు. నెల రోజుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి కావాల్సి ఉందని, ఆ టైంకి మమ్మల్ని అమెరికాకు రావాలని ఆమె కోరిందని, అందుకు ఏర్పాట్లలో ఉండగానే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 10వ తేదీన దీప్తి చివరిసారిగా తమతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. కాలేజీకి టైం అవుతోందని.. ఆదివారం మాట్లాడతానని చెప్పి హడావిడిగా ఫోన్ పెట్టేసిందని.. అవే తమ బిడ్డ మాట్లాడిన చివరి మాటలని గుర్తు చేసుకుని బోరున విలపించారు.

దుబాయి హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
ఇటీవల దుబాయిలో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ యువకుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇవ్వాలని జపాన్ పర్యటన నుంచి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పోరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టపు ప్రేమ్ సాగర్‌తో పాటు, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట కు చెందిన స్వర్గం శ్రీనివాస్ లు దుబాయి లో హత్యకు గురైన విషయం తెలిసిందే. దుబాయి నుంచి మృత దేహాలను త్వరగా స్వదేశానికి తెప్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం అధికారుల్ని ఆదేశించినట్లు అనిల్ తెలిపారు.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దుబాయి లోని భారత రాయబార కార్యాలయానికి, ఢిల్లీ లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖలు రాసినట్లు వెల్లడించారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:ఎన్నారై అడ్వయిజరీ కమిటీ చైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్ బృందం, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి లు మృతుల కుటుంబాలను పరామర్శించారు.

రాయలసీమ ప్రగతికి డాలస్‌లో జీఆర్ఏడీఏ అడుగులు
గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఏరియా (GRADA) ఆధ్వర్యంలో ఏప్రిల్ 13న ఫ్రిస్కో, టెక్సాస్‌లో రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం జరిగింది. రాయలసీమ సమస్యలు, అభివృద్ధి అవకాశాలు, తెలుగు భాషా సాహిత్యాల ప్రాముఖ్యతపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి రాయలసీమకు చెందిన రచయిత భూమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగంలో రాయలసీమ ప్రస్తుత పరిస్థితి, ముఖ్యంగా దీర్ఘకాలంగా వేధిస్తున్న నీటి సమస్యలు, వెనుకబాటుతనం గురించి ఎంతో ఆవేదనతో, స్పష్టంగా వివరించారు.మన ప్రాంత సహజ సంపద అయిన శేషాచలం అడవుల గురించి, ముఖ్యంగా ఎర్రచందనం చెట్ల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ విలువైన సంపదను అక్రమ మార్గాల్లో ఇతర దేశాలకు తరలించి లాభం పొందకుండా, స్థానికంగానే వాటి ఆధారిత పరిశ్రమలను స్థాపించి, ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా మన ప్రాంతాన్ని ఎలా ఆర్ధికంగా బలోపేతం చేయవచ్చో ఆయన చక్కగా వివరించారు. ఆయన మాటలు మనందరిలో కొత్త ఆలోచనలను రేకెత్తించాయి. సహజ వనరులను సక్రమంగా వినియోగించుకుంటే రాయలసీమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే ఆశాభావాన్ని ఆయన కలిగించారు.మరో గౌరవ అతిథిగా కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ఛాన్సలర్, ప్రఖ్యాత విద్యావేత్త ప్రొఫెసర్ పి. కుసుమ కుమారి హాజరయ్యారు. ఆమె తన ప్రసంగంలో తెలుగు భాష మాధుర్యం, సాహిత్యం గొప్పదనం, పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. నంద కోర్వి, అనిత నాగిరెడ్డి, సతీష్ సీరం, బ్రహ్మ చిరా, హరినాథ్ పొగకు, హేమంత్ కాకుట్ల, జగదీశ్వర నందిమండలం, జగదీష్ తుపాకుల, పవన్ పల్లంరెడ్డి, ప్రసాద్ నాగారపు, రాజు కంచం, శివ అద్దేపల్లి, శివ వల్లూరు, శ్రీధర్ బొమ్ము, శ్రీకాంత్ దొంత, సురేష్ మోపూరు, ఉమా గొర్రెపాటి, మరియు కార్తీక్ మేడపాటి ఈ సమావేశానికి హాజరయ్యారు.
క్రైమ్

ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌పై కేసు
హైదరాబాద్, క్రైమ్: ప్రముఖ యూట్యూబర్ ‘నా అన్వేషణ’ అన్వేష్ (Na Anvesh)పై సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తెలంగాణ డీజీపీతో పాటు పలువురు ప్రముఖులపై తప్పుడు వ్యాఖ్యలు చేశాడనే అభియోగం అతనిపై నమోదు అయినట్లు సమాచారం.ప్రపంచ దేశాలన్నీ చుట్టేస్తూ.. తెగ ఎంజాయ్ చేసేస్తూ.. ఆ వీడియోలను అప్లోడ్ చేస్తూ పాపులారిటీతో పాటు డబ్బూలు సంపాదించుకుంటున్నాడు అన్వేష్. అయితే.. తాజాగా బెట్టింగ్ యాప్‌ల ప్రచారం పేరుతో.. తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్రెడ్డి, ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దాన కిశోర్, వికాస్‌రాజు తదితరులు రూ.300 కోట్లు కొట్టేశారంటూ ఓ వీడియో ద్వారా అతను వ్యాఖ్యలు చేశారట. అయితే అన్వేష్ అవాస్తవ, తప్పుడు సమాచారం ప్రచారం చేశారంటూ పోలీసులు సుమోటో(Suo moto)గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రజల్లో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులు, చట్టబద్ధమైన సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు.. పరువుకు భంగం కలిగించేలా వీడియో ఉంది. అధికారుల విశ్వసనీయతను దెబ్బతీసేలా.. ప్రభుత్వం మీద వ్యతిరేకత, ద్వేషాన్ని కలిగించేలా ఆ వీడియో ఉంది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా వీడియో చేసిన కంటెంట్ క్రియేటర్ అన్వేష్ మీద చర్యలు తీసుకోవాలి అని సైబర్‌క్రైమ్ ఠాణా కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ పోలీసులు అన్వేష్‌పై కేసు నమోదు చేశారు. దీనిపై అన్వేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

పిల్లలు పుట్టలేదు అని భార్యని చంపి తన ఇంట్లోనే..
జగిత్యాలక్రైం: నిండునూరేళ్లు కలిసి ఉంటామని.. ఏడడుగులు నడిచి ప్రమాణం చేసిన భర్తే కాలయముడై భార్యను హత్య చేసిన ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలకేంద్రంలో జరిగింది. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించగా ఎట్టకేలకు పోలీసులు కేసును ఛేదించారు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ వివరాలు వెల్లడించారు.ఇరవై ఏళ్ల క్రితం వివాహంకరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్‌కు చెందిన మమతను (35) ఇరవై ఏళ్ల క్రితం జగి త్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన అవుదుర్తి మహేందర్‌కు ఇచ్చి వివాహం చేశా రు. వివాహ సమయంలో కట్నకానుకలు ముట్టజెప్పారు. కానీ, ఆర్థిక సమస్యలు తలెత్తడంతో కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. మహేందర్ మద్యానికి బానిసై అప్పులు చేశాడు. రోజూ తాగి వచ్చి మమతను వివాహ సమయంలో కట్నం తక్కువగా ఇచ్చారని, పిల్లలు పుట్టడం లేదని తీవ్రంగా వేధించాడు. అతడితోపాటు తల్లి వజ్రవ్వ, తండ్రి లక్ష్మణ్, తమ్ముళ్లు అ నిల్, వెంకటేశ్ కూడా వేధింపులకు గురిచేసేవారు. మహేందర్ ఏ పని చేయకపోవడంతో మమత కరీంనగర్‌లోని ఓషాపింగ్‌మాల్‌లో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.ఇరవై రోజుల క్రితం పంచాయితీతరుచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో 20 రోజుల క్రితం మల్లాపూర్‌లో పంచాయితీ నిర్వహించారు. దీంతో మమతను బాగా చూసుకుంటానని మహేందర్ కరీంనగర్‌లోని అద్దె ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం పుస్తెలతాడు ఇవ్వాలని మమతను కోరగా నిరాకరించింది. ఈనేపథ్యంలో మహేందర్ గతనెల 26న నల్లగొండ, వేములవాడ దైవ దర్శనానికని నమ్మించి, దైవ దర్శనం అనంతరం కొడిమ్యాలకు తీసుకెళ్లాడు. అదేరోజు నైలాన్ తాడును ఆమె మెడ చుట్టూ బిగించి హత్య చేశాడు. ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించేందుకు ఆమె మెడకు నైలాన్‌తాడు చుట్టి ఇంటి స్లాబ్‌కు కట్టాడు. పుస్తెలతాడు తీసుకొని గంగాధరలోని ఓ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి డబ్బు తీసుకుని అప్పులు తీర్చాడు. ఈక్రమంలో పోలీసులు లోతుగా విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. శనివారం నిందితుడు మోటారుసైకిల్‌పై పారిపోతుండగా చెప్యాల ఎక్స్‌రోడ్ వద్ద అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడితో పాటు అతడి తల్లిదండ్రులు, తమ్ములపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో మల్యాల సీఐ రవి, కొడిమ్యాల ఎస్సై సందీప్ పాల్గొన్నారు.

టీచర్‌తో వివాహేతర సంబంధం.. భార్యను..!
హోసూరు(తమిళనాడు): ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కానీ భర్త తప్పుదారి పట్టాడు, ప్రశ్నించిన భార్యను హతమార్చాడు. హోసూరు పారిశ్రామికవాడలో భార్యను హత్య చేశాడో భర్త. వివరాల మేరకు హోసూరు జూజువాడి ఉప్కర్ నగర్ రాజేశ్వరిలేఔట్కు చెందిన భాస్కర్ (34), భార్య శశికళ (33). గత 2018న ఫేస్బుక్లో పరిచయమై ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. ఈ దంపతులకు ఆరూష్ (4), శ్రీషా (2) అనే పిల్లలున్నారు. దంపతులు హోసూరులోని సీతారామ్‌దిన్న , కామరాజ్‌నగర్, జూజువాడి, రాజేశ్వరిలేఔట్ ప్రాంతాల్లో జిమ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. టీచర్‌తో అక్రమ సంబంధం ఈ నేపథ్యంలో భాస్కర్‌కు ఓ టీచర్‌తో అక్రమ సంబంధం ఏర్పడింది. ఆమెకు అలసనత్తం ప్రాంతంలో అద్దె గదిలో ఉంచాడు. విషయం తెలుసుకొన్న భార్య శశికళ భర్తతో గొడవపడుతూ వచ్చింది.గత 30వ తేదీన రాత్రి భార్యతో ఏకాంతంగా ఉన్న సమయంలో దుస్తులతో గొంతు పిసికి హత్య చేశాడు. మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లి ఆమెకు ముక్కులో రక్తం కారుతోందని, వైద్యం చేయాలని తెలిపాడు. పరిశీలించిన డాక్టర్లు శశికళ చనిపోయిందని ధృవీకరించారు. ఈ ఘటనపై శశికళ బంధువుల ఫిర్యాదు మేరకు సిఫ్‌కాట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని నింధితుడు భాస్కర్‌ను అదుపులోకి తీసుకొన్నారు. శవపరీక్ష కోసం మృతదేహాన్ని క్రిష్ణగిరి ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. హత్య చేసినట్లు రుజువు కావడంతో నిందితున్ని అరెస్ట్ చేశారు.

భీమిలి వివాహిత కేసు.. బయటపడ్డ సంచలన నిజాలు
సాక్షి, విశాఖపట్నం: భీమిలి మండలం దాకమర్రి వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన క్రాంతి కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం ఆరు బృందాలు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. కేసు వివరాలను విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి మీడియాకు వెల్లడించారు. దాకమర్రి పంచాయతీ శివారు 26వ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఫార్చ్యూన్ హిల్స్ వుడా లేఅవుట్లో నిన్న(శుక్రవారం) ఉదయం సగం కాలిన మహిళ మృతదేహాన్ని భీమిలి పోలీసులు గుర్తించారు.ఆ మహిళను హంతకులు గొంతు కోసి తరువాత పెట్రోల్‌తో దహనం చేసినట్టు గుర్తించారు. మెడలో కాలిన నల్లపూసల గొలుసు ఉండటంతో మృతురాలు వివాహితగా గుర్తించారు. ఆరు ప్రత్యేక బృందాలుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ కేసు మిస్టరీని ఛేదించారు. మృతురాలు వెంకటలక్ష్మికి క్రాంతి కుమార్‌తో అనే వ్యక్తికి అక్రమ సంబంధం ఉన్నట్లు పోలీసులు తేల్చారు.క్రాంతి కుమార్‌కు ఇద్దరు భార్యలు ఉండగా, అతడు రెండో భార్యతో మృతురాలి ఇంటి పక్కన ఉండేవాడు. క్రాంతికుమార్, మృతురాలికి మధ్య స్నేహం కుదిరింది. అతనికి వెంకటలక్ష్మితో వివాహేతర సంబంధం ఏర్పడటంతో రెండో భార్యకు, వెంకటలక్ష్మికి మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో రెండో భార్యను వేరే బ్లాక్‌కు మార్చాడు. అయినా వెంకటలక్ష్మితో వివాహేతర సంబంధం కొనసాగించాడు.ఈ విషయంలో మొదటి భార్య, రెండో భార్యతో తరచు గొడవలు జరుగుతున్నాయి. మరో వైపు వెంకటలక్ష్మి.. తనతోనే ఎక్కువసేపు గడపాలని తనతోనే ఉండాలంటూ క్రాంతికుమార్‌పై ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో ఎలాగైన వెంకటలక్ష్మిని వదిలించుకోవాలని.. ప్లాన్ చేశాడు. వెంకటలక్ష్మిని బయటకు తీసుకెళ్లాడు. ఇద్దరు ఐస్‌క్రీమ్ తిన్నారు. అనంతరం బైక్‌లో పెట్రోల్ కొట్టించి.. బాటిల్లో కూడా కొట్టించాడు. ఇంటి వద్ద పెట్రోల్ దొంగలు ఉన్నారని.. అందుకే బాటిల్లో పెట్రోల్ కొట్టించానంటూ వెంకటలక్ష్మితో చెప్పాడు.శారీరకంగా కలుద్దామని చెప్పి దాకమర్రి లేవట్‌కి తీసుకెళ్లి వెంకటలక్ష్మిని కత్తితో గొంతు కోసి చంపేశాడు. తరువాత ఆమె ఒంటిపై ఉన్న నగలు తీసుకుని.. తరువాత పెట్రోల్ పోసి తగలుపెట్టాడు. కేసు విచారణలో మొదట వెంకటలక్ష్మిని గుర్తించాము. తర్వాత కాంత్రితో వెళ్తున్నట్లు తన తల్లి చెప్పిందని కొడుకు పోలీసులకు చెప్పారు. ఆ కోణంలో విచారణ చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.
వీడియోలు


మళ్ళీ కలిసి నటిస్తున్న లవ్ బర్డ్స్?


చంద్రబాబు అమరావతి గ్రాఫిక్స్ పై శైలజానాథ్ మాస్ ర్యాగింగ్


మీ ఉద్యోగాలు తీసేస్తాం.. CHOలకు మంత్రి బెదిరింపులు


భారత్ దెబ్బకు షేకవుతున్న పాకిస్తాన్


పిల్లి యాత్ర


బీఎస్ఎఫ్ అదుపులో పాక్ రేంజర్


తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పై కేసు నమోదు


చెన్నైతో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ విజయం


కుట్టు స్కీమ్ లో స్కామ్


కూటమి ప్రభుత్వం రైతుల గోడు పట్టించుకోవడంలేదు: వైఎస్ జగన్