Top Stories
ప్రధాన వార్తలు

ఈ అరెస్టులు అప్రజాస్వామికం: వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: చంద్రబాబు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని.. మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, మాజీ ప్రభుత్వాధికారి కృష్ణమోహన్‌రెడ్డి అరెస్టులను ఖండిస్తున్నామని శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు కక్ష రాజకీయాల వల్ల వ్యవస్థలు దెబ్బతింటున్నాయన్నారు. తప్పుడు కేసులు పెట్టి తప్పుడు సాక్ష్యాలు, వాంగ్మూలాలు సృష్టిస్తున్నారని.. ప్రభుత్వాధికారులను, మాజీ ప్రభుత్వాధికారులపై కూడా రాజకీయ విరోధం చూపిస్తున్నారంటూ బొత్స మండిపడ్డారు.చంద్రబాబు తీసుకొచ్చిన తప్పుడు సంప్రదాయాలు రాష్ట్రానికి చేటు చేస్తాయి. లిక్కర్ వ్యవహారంలో ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు చూపడం లేదు. కాని.. బెదిరించి, భయపెట్టి తప్పుడు వాంగ్మూలాలు తీసుకుని, అరెస్టులు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం కల్తీ జరుగుతోందని ఆరోపించారు. మరి ఇప్పుడు అవే డిస్టలరీల నుంచి మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఖజానా వల్ల నష్టం వచ్చిందన్నారు. మరి ఈ ప్రభుత్వంలో విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నా ఆదాయాలు ఎందుకు పెరగడంలేదు?’’ అంటూ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.కక్ష రాజకీయాలు తార స్థాయికి.. గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో కక్ష రాజకీయాలు తార స్థాయికి చేరాయని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘ఐఏఎస్‌లను, ఐపీఎస్‌లను ఇప్పటికే టార్గెట్‌చేసి వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇప్పుడు మాజీ ఐఏఎస్, మాజీ ప్రభుత్వాధికారులపైనా చంద్రబాబు కక్ష రాజకీయం చేస్తున్నారు. ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్‌కు మంచివి కావు. చంద్రబాబు కక్ష రాజకీయాలు రాష్ట్రాన్ని, ప్రజలను దెబ్బతీస్తాయి...పరిపాలనలో చంద్రబాబు ఘోరంగా విఫలం కావడంవల్లే ప్రజల దృష్టిని మళ్లించేందుకు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. వాగ్దానాల అమలు లేదు, ఏ వర్గంకూడా సంతోషంగా లేరు. రాష్ట్రంలో ఎవ్వరికీ భద్రతలేదన్న సంకేతాన్ని చంద్రబాబు ఇస్తున్నారు. మాజీ ఐఏఎస్ ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. తప్పుడు రాజకీయాలు మాని, రాష్ట్రంపై చంద్రబాబు దృష్టిపెట్టాలి. అణచివేసినంత మాత్రాన ప్రభుత్వంపై వ్యతిరేకత సద్దుమణగదు’’ అని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు.అరెస్ట్ క్రూరమైన రాజకీయ కక్ష సాధింపు.. మేరుగ నాగార్జునధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ క్రూరమైన రాజకీయ కక్ష సాధింపు అని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. కూటమి ప్రభుత్వం తప్పుడు చర్య అని.. ప్రతిపక్ష పార్టీపై ప్రతీకారం తీర్చుకోవడానికి కూటమి ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ ప్రైవేట్ సైన్యంలా పనిచేస్తోంది. ఈ అరెస్ట్‌లకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అని మేరుగ నాగార్జున హెచ్చరించారు.చంద్రబాబువి కక్ష రాజకీయాలు: మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుమాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ ప్రభుత్వ అధికారి కృష్టమోహన్ రెడ్డిల అరెస్టును ఖండిస్తున్నాను. ఈ అరెస్టులు అప్రజాస్వామికం. ప్రజలకిచ్చిన హామీల అమల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు. విపక్ష పార్టీ నేతలతో పాటు ప్రభుత్వాధికారులతో పాటు మాజీ అధికారులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. లిక్కర్ వ్యవహారంలో ఆధారాలు లేకపోయినా అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయం. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహనరెడ్డిల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాను.వైఎస్సార్సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం.. మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ధనుంజయ రెడ్డి, క్రిష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు. వైఎస్సార్సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం. రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు. ఆ ప్రక్రియలో అంతులేని దారుణ వేధింపులు. ఇది ఇంకా కొనసాగితే ఏ మాత్రం సహించబోము. ప్రభుత్వ తీరును కచ్చితంగా ప్రజల్లో ఎండగడతాం. అక్రమ కేసుల్లో అరెస్టయిన వారికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. తగిన న్యాయ సహాయం అందిస్తాం.పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే.. తిరుపతి ఎంపీ గురుమూర్తిచంద్రబాబువి కక్ష రాజకీయాలు. మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ ప్రభుత్వ అధికారి కృష్టమోహన్ రెడ్డిల అరెస్టును ఖండిస్తున్నాను. చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్‌కు చేస్తున్నారు. లిక్కర్ వ్యవహారంలో ఆధారాలు లేకపోయినా అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వ అరాచకాలను ప్రజలు చూస్తున్నారు.

BSF Jawan: బ్రష్ చేసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వలేదట..!
న్యూఢిల్లీ: గత నెల 23వ తేదీన పాకిస్తాన్‌కు బందీగా చిక్కిన భారత బీఎస్ఎఫ్ జవాన్ పీకే(పూర్ణం కుమార్) షాను రెండు రోజుల క్రితం విడుదల చేసిన సంగతి తెలిసిందే. 20 రోజుల తర్వాత భారత జవాన్‌ను పాకిస్తాన్ విడిచిపెట్టింది. బీఎస్ఎఫ్కు చెందిన భారత జవాన్ పీకే షా అనుకోకుండా పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించారు. దీంతో, పీకే షాన్ పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్ 23వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతరం, దౌత్యపరంగా భారత్.. పాకిస్తాన్‌పై ఒత్తిడి తెచ్చింది. దాంతో పాకిస్తాన్ ఆ బీఎస్ఎప్ జవాన్ విడిచిపెట్టక తప్పలేదునిద్రలేని రాత్రులు.. మానసిక వేధన!జవాన్ పీకే షా పాక్ చెర నుంచి విడుదలైన తర్వాత జాతీయ మీడియా సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియా ఆ కుటుంబాన్ని సంప్రదించగా ఆ జవాన్ భార్య పలు విషయాలను వెల్లడించారు. పీకే షా భార్య రజని మాట్లాడుతూ.. ‘ నా భర్తను శారీకంగా హింసించలేదని, ప్రతీ రాత్రి విచారించారని, ఇది మానసికంగా కుంగదీసిందని భర్త చెప్పినట్లు భార్య రజనీ తెలిపింది.మూడు వారాలకు పైగా పాక్ కస్టడీలో ఉన్న షాను సైనికుడిలా కాకుండా గూఢచారిలా చూశారని, మూడు వేర్వేరు ప్రదేశాలకు తరలించారని చెప్పినట్లు ఆమె స్పష్టం చేసింది. ఆ ప్రదేశాలల్లో ఒకటి ఎయిర్ బేస్ అయి ఉండొచ్చనే అనుమానం కల్గిందని భర్త చెప్పిన విషయాన్ని ఆమె వెల్లడించింది.భర్త పీకే షాకు తిండి పెట్టడంలో ఎటువంటి ఇబ్బంది పెట్టకపోయినా, బ్రష్ చేసుకోవడానికి అనుమతించే వారు కాదని. భర్త నిద్రలేమితో ఉన్నట్లు తనతో మాట్లాడినప్పుడు అర్థమైందని ఆమె పేర్కొంది.

నీరజ్ 90.23 మీటర్లు
దోహా: 90 మీటర్లు... ఇంకెప్పుడు..? ఇంకెప్పుడు..? ఇంకెప్పుడు..? అని కొన్నేళ్లుగా అందరి నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా శుక్రవారం సమాధానం ఇచ్చాడు. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు భారత స్టార్ తన కెరీర్లో తొలిసారి 90 మీటర్ల మైలురాయిని అధిగమించాడు. శుక్రవారం ఖతర్ రాజధాని దోహాలో జరిగిన డైమండ్ లీగ్ మీట్లో నీరజ్ చోప్రా తన కెరీర్ బెస్ట్ ప్రదర్శనను నమోదు చేశాడు.27 ఏళ్ల నీరజ్ తన మూడో ప్రయత్నంలో జావెలిన్‌ను 90.23 మీటర్ల దూరం విసిరాడు. ఈ క్రమంలో నీరజ్ తన పేరిటే ఉన్న (2022 స్టాక్‌హోమ్ డైమండ్ లీగ్ మీట్లో 89.94 మీటర్లు) జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. విఖ్యాత కోచ్ జాన్ జెలెజ్నీ వద్ద శిక్షణ ప్రారంభించాక బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్‌లోనే నీరజ్ తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం విశేషం. 11 మంది మేటి జావెలిన్ త్రోయర్లు పోటీపడ్డ దోహా డైమండ్ లీగ్ మీట్లో జూలియన్ వెబెర్ (జర్మనీ; 91.06 మీటర్లు) అగ్రస్థానాన్ని క్కించుకున్నాడు. నీరజ్ చోప్రా (90.23 మీటర్లు) రెండో స్థానం సంపాదించగా... అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా; 86.64 మీటర్లు) మూడో స్థానాన్ని పొందాడు. భారత్‌కే చెందిన కిశోర్ కుమార్ జేనా (78.60 మీటర్లు) ఎనిమిదో స్థానంతో సంతృప్తి పడ్డాడు. డైమండ్ లీగ్ మీట్లలో అథ్లెట్లకు పతకాలు బదులుగా పాయింట్లు కేటాయిస్తారు. టాప్–8లో నిలిచిన వారికి వరుసగా 8, 7, 6, 5, 4, 3, 2, 1 పాయింట్లు లభిస్తాయి. వెబెర్‌కు 8 పాయింట్లు, నీరజ్‌కు 7 పాయింట్లు, పీటర్స్‌కు 6 పాయింట్లు దక్కాయి.నిర్ణిత నాలుగు మీట్లు ముగిశాక టాప్–7లో నిలిచిన వారు ఫైనల్ మీట్లో పోటీపడతారు. సీజన్ తొలి మీట్లో నీరజ్ తొలి ప్రయత్నంలో జావెలిన్‌ను 88.44 మీటర్ల దూరం విసిరి శుభారంభం చేశాడు. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో అతను ఫౌల్ చేశాడు. మూడో ప్రయత్నంలో నీరజ్ జావెలిన్ 90.23 మీటర్లకు వెళ్లింది. నాలుగో ప్రయత్నంలో నీరజ్ జావెలిన్‌ను 80.56 మీటర్ల దూరం విసరగా... ఐదో ప్రయత్నంలో ఫౌల్ చేశాడు. చివరిదైన ఆరో ప్రయత్నంలో నీరజ్ జావెలిన్‌ను 88.20 మీటర్లు విసిరాడు. 3 ఆసియా నుంచి జావెలిన్‌ను 90 మీటర్లకంటే ఎక్కువ దూరం విసిరిన మూడో ప్లేయర్‌గా నీరజ్ చోప్రా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో అర్షద్ నదీమ్ (పాకిస్తాన్; 92.97 మీటర్లు), చావో సున్ చెంగ్ (చైనీస్ తైపీ; 91.36 మీటర్లు) ఉన్నారు. ఓవరాల్‌గా 25 మంది క్రీడాకారులు జావెలిన్‌ను 90 మీటర్ల కంటే ఎక్కువ దూరం విసిరారు.

‘ఇది ప్రభుత్వంపై ఉద్యోగులు సాధించిన అతిపెద్ద విజయం’
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ బకాయిలను చెల్లించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలపై ఆ రాష్ట్ర బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. ఎప్పట్నుంచో మమతా ప్రభుత్వం నాన్చుతూ వస్తున్న పెండింగ్ డీఏను చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగుల విజయంగా బీజేపీ పేర్కొంది. ఈరోజు(శుక్రవారం) దీనికి సంబంధించి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ప్రభుత్వ ఉద్యోగుల 25 శాతం డీఏ బకాయిలను మూడు నెలల నిర్ణీత వ్యవధిలో చెల్లించాలని సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.దీనిపై వెస్ట్ బెంగాల్ బీజేపీ అధికార ప్రతినిధి అమిత మాలవియా మాట్లాడుతూ.. ‘ ఇది ప్రభుత్వంపై ఉద్యోగులు సాధించిన అతిపెద్ద విజయం. సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం జరిగింది. ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నా మమతా సర్కారు దీన్ని పట్టించుకోవడం లేదు. 17 వాయిదాలు, విచారణలో ఆటంకాల తర్వాత సుప్రీంకోర్టుల చివరకు తన తీర్పును వెల్లడించడం హర్షించదగ్గ విషయం. ఇది ప్రభుత్వంపై ఉద్యోగులు, బీజేపీ సాధించిన అతిపెద్ద విజయం. ఇది ఒక మైలురాయి లాంటి తీర్పు’ అని పేర్కొన్నారు.కాగా, 2022, మే నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్న విధానం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ చెల్లించాలని ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రావడంతో ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు.

రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి అరెస్ట్
విజయవాడ: మద్యం కేసులో రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మూడు రోజుల విచారణ అనంతరం సిట్ అరెస్ట్ చేసింది. ఈ అరెస్టులు కక్ష పూరితమని.. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను అరెస్టు చేసే సంస్కృతి సరికాదని ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి తరపు అడ్వకేట్ సుదర్శన్ రెడ్డి అన్నారు. లిక్కర్ కేసులో రిటైర్డు ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను ఇవాళ రాత్రి 7.15కి అరెస్టు చేశారని.. రేపు(శనివారం) ఉదయం వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.కాగా, మద్యం విధానంపై చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసుకు అనుకూలంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని సిట్ తీవ్ర వేధింపులకు గురి చేసిన సంగతి తెలిసిందే. నిన్న (గురువారం) 13 గంటలకుపైగా విచారణ పేరుతో ప్రహసనం సాగించడం సిట్ కుట్రలకు అద్దం పడుతోంది.సిట్ చీఫ్‌గా ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్‌బాబు, ఇతర అధికారులు వారిని విడివిడిగా రోజంతా విచారించారు. మొదటి రోజు అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడగడం గమనార్హం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంతో తమకు ఏమాత్రం సంబంధం లేదని ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. సీఎంవో కార్యదర్శి, ఓఎస్డీలకు మద్యం విధానం రూపకల్పన, అమలుతో ఎలాంటి సంబంధం ఉండదని నిబంధనలను ఉటంకిస్తూ తేల్చి చెప్పారు.ఆ అంశం పూర్తిగా ఎక్సైజ్ శాఖ, బెవరేజస్ కార్పొరేషన్‌కు సంబంధించినదని పేర్కొన్నారు. అయినా సరే సిట్ అధికారులు పదే పదే అవే ప్రశ్నలు వేస్తూ వారిని వేధించారు. ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తూ వారిపై మానసిక ఒత్తిడికి గురి చేసేందుకు యత్నించారు. ఇక మెయిల్ ఐడీలు, పాస్ వర్డ్ చెప్పమని సిట్ అధికారులు అడిగారు. అందుకు వారిద్దరూ సున్నితంగా తిరస్కరించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు.

వీరజవాన్ కుటుంబానికి వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం.. రూ.25 లక్షల చెక్కు అందజేత
శ్రీసత్యసాయి జిల్లా: ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా దేశ సరిహద్దుల్లోని కశ్మీర్లో ఈనెల 8న పాకిస్తాన్‌తో జరిగిన కాల్పుల్లో వీర మరణం పొందిన అగ్నివీర్ మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. దేశం కోసం ప్రాణాలర్పించిన మురళీ నాయక్ కుటుంబాన్ని ఈ నెల 13న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించిన సంగతి తెలిసిందే.. పార్టీ తరపున ఆయన రూ.25 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు.రూ.25 లక్షల రూపాయల చెక్కును వీర జవాను మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ అందజేశారు. గోరంట్ల మండలం కల్లి తండాకు వెళ్లి వీర జవాన్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం చెక్కును ఆమె అందించారు. కాగా, మూడు రోజల క్రితం (13వ తేదీన) మురళీ నాయక్ కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. మురళీనాయక్ స్వగ్రామమైన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చేరుకుని.. మురళీనాయక్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.మురళి తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరామ్ నాయక్‌లకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారు భావోద్వేగానికి గురయ్యారు. ‘మురళీ.. లే మురళీ.. జగన్ సార్ వచ్చారు.. లేచి సెల్యూట్ చేయి మురళీ’ అంటూ తండ్రి శ్రీరామ్ నాయక్ భావోద్వేగంతో పలికిన మాటలు అక్కడ ఉన్న వారందరికీ కన్నీళ్లు తెప్పించాయి. యావత్ దేశం గర్వపడేలా దేశ రక్షణలో విధులు నిర్వర్తించిన మురళీ కుటుంబానికి యావత్ దేశం రుణపడి ఉంటుందని వైఎస్ జగన్ అన్నారు.

‘పాకిస్తాన్ వద్దే కాదు.. చైనాకు కూడా ఆ సామర్థ్యం లేదు’
వాషింగ్టన్: ప్రపంచ దేశాల్లో అత్యంత శక్తిమంతమైన రక్షణ వ్యవస్థ కల్గిన దేశాల జాబితాలో భారత్ కు ప్రత్యేక స్థానం ఉందనే విషయం ఆపరేషన్ సిందూర్ తో మరోసారి నిరూపితమైంది. అత్యంత శక్తిమంతమైన ఆర్మీ కల్గిన దేశాల జాబితాలో భారత్‌ది నాల్గో స్థానం. ఇక్కడ చైనా కంటే భారత్ ఒక స్థానం కిందే ఉంది. టాప్ 5లో ఉన్న దేశాల్లో అమెరికా, రష్యా, చైనా, భారత్, దక్షిణకొరియాలు ఉన్నాయి. అయితే పాకిస్తాన్‌తో ఉద్రిక్త పరిస్థితుల నడుమ భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో భారత్ బలం మరింత పెరిగిందని అంటున్నారు యుద్ధ రంగ నిపుణులు. అది కూడా అమెరికాకు చెందిన యుద్ధ రంగ నిపుణుడు రిటైర్డ్ కల్నల్ జాన్ స్పెన్సాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.పాకిస్తాన్‌తో యుద్ధంలో భారత్ యుద్ధ నైపుణ్యంలో తిరుగులేదని నిరూపించుకుందన్నారు. అటు ఎఫెన్స్, ఇటు డిఫెన్స్ అయినా భారత్ శక్తి అమోఘమని కొనియాడారు. ఇక్కడ ప్రధానంగా భారత్ కు చెందిన బ్రహ్మోస్ క్షిపణిపై ప్రశంసలు కురిపించారు. భారత్ రక్షణ అమ్ముల పొదిలో ఉన్న బ్రహ్మోస్ పని తీరును ఎంత పొగిడినా తక్కువే అంటూ కితాబిచ్చారు. బ్రహ్మోస్ తరహా క్షిపణులు అటు పాకిస్తాన్ లోనే కాదు, చైనాకు కూడా లేవని బల్లగుద్దీ మరీ చెప్పారు. చైనా, పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలో భారత్ లో ఉన్న బ్రహ్మోస్ తో సరిపోల్చే క్షిపణులు కానీ ఆయుధ సామాగ్రి గానీ లేవన్నారు జాన్ స్పెన్సార్.. ఈ విషయాల్ని జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడేకు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు జాన్ స్పెన్సార్.‘ చైనా వైమానికి రక్షణ వ్యవస్థలు కానీ పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలు కానీ భారతదేశ రక్షణ వ్యవస్థలతో పోలిస్తే చాలా తక్కువ సామర్థ్యం కల్గి ఉన్నాయి. భారత్ బ్రహ్మోస్ క్షిపణి.. చైనా, పాకిస్తాన్ రక్షణ వ్యవస్థల్లో ఉన్న దానికంటే అధికరెట్లు బలంగా ఉంది. పాకిస్తాన్ లో ఉగ్ర స్థావరాలను, ఎయిర్ బేస్ లను భారత్ సునాయాసంగా ఛేదించడంలో బ్రహ్మోస్ కీలక పాత్ర పోషించింది. ఇక్కడ భారత్ క్లియర్ మెస్సేజ్ ఇచ్చింది. పాకిస్తాన్ లోని ఏ ప్రదేశాన్నైనా సునాయాసంగా ఛేదించగలదనే సందేశాన్ని భారత్ చాలా క్లియర్ గా పంపింది’ అని ఆయన పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: మోస్ట్ పవర్ ఫుల్ ఆర్మీ కల్గిన దేశాలు ఇవే..

ఉన్నదంతా ఇచ్చేస్తున్న జుకర్‌బర్గ్!
ప్రపంచ కుబేరులు అపర దానకర్ణులుగా మారుతున్నారు. తమ సంపదను దాతృత్వ కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ మాతృసంస్థ టెక్ దిగ్గజం మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రకారం.. మెటా సీఈవో తన సంపదలో 90 శాతానికి పైగా దానధర్మాలకు ఇచ్చేస్తున్నారు.సుదీర్ఘకాలంగా పెద్ద ఎత్తున దాతృత్వ కార్యక్రమాలు చేస్తున్న బిల్ గేట్స్ ఫార్చ్యూన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆలోచనలను పంచుకున్నారు. జుకర్‌బర్గ్ దాతృత్వ సంస్థ చాన్ జుకర్ బర్గ్ ఇనిషియేటివ్ ను ఆయన తీవ్రమైన ఉద్దేశానికి సంకేతంగా పేర్కొన్నారు. జుకర్ బర్గ్ దాతృత్వ ప్రణాళికలను ప్రస్తావిస్తూ, "అతను చాలా మంచి ప్రారంభానికి వెళ్తున్నాడు" అని బిల్ గేట్స్ అన్నారు. తామిద్దరం తరచుగా దాతృత్వానికి సంబంధించిన అంశాలను మాట్లాడుకుంటామన్నారు.మార్క్ జుకర్‌బర్గ్, ఆయన సతీమణి ప్రిస్కిల్లా చాన్ తమ జీవితకాలంలో 99 శాతం ఫేస్బుక్ షేర్లను విరాళంగా ఇస్తామని హామీ 2015లోనే ప్రకటించారు.అప్పటి నుంచి వారి ఫౌండేషన్ విద్య, వైద్యం, సైన్స్ రంగాల్లో ప్రాజెక్టులపై పనిచేస్తోంది.దాతృత్వ దృశ్యం ఎలా మారుతోందో గేట్స్ ఎత్తిచూపారు. వారెన్ బఫెట్, మెలిందా ఫ్రెంచ్ గేట్స్ తో కలిసి తాను 2010లో ప్రారంభించిన గివింగ్ ప్లెడ్జ్ క్యాంపెయిన్ ద్వారా తమ సంపదలో అధిక భాగాన్ని దాతృత్వానికి ఇచ్చేందుకు టెక్ పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ఆర్మీపై మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు
జబల్పూర్: యావత్ భారతదేశం, ఆర్మీ ప్రధాని నరేంద్ర మోదీ పాదాల ముందు మోకరిల్లాయంటూ మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జగదీశ్ దేవ్డా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రధాని మోదీకి మనం కృతజ్ఞతలు చెప్పాలి. మొత్తం దేశంతో పాటు మన సైన్యం ఆయన పాదాలకు నమస్కరిస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. శుక్రవారం జబల్పూర్లో జరిగిన సివిల్ డిఫెన్స్ వాలంటీర్స్ శిక్షణా కార్యక్రమంలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారాయన.జగదీశ్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు సిగ్గు చేటు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలకు పిలుపునిచ్చింది. సైనికాధికారిణి కల్నల్ సోఫియా ఖురేషీని ఉద్దేశిస్తూ ఆ రాష్ట్ర మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగిన సంగతి తెలిసిందే.విజయ్ షా చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతగల పదవుల్లో ఉండి దేశానికి రక్షణ కల్పిస్తున్న మహిళా అధికారుల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, మరోసారి వివాదంలో బీజేపీ నేత చిక్కుకోవడంతో మధ్యప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కాయి. తన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించిందని జగదీష్ దేవ్డా మండిపడ్డారు.

టాలీవుడ్ మూవీలో అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్.. ఈవెంట్లో సందడి!
గత కొద్దిరోజులుగా 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్ సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కాసారిగా వీళ్లు స్టార్స్ అయిపోయారు. పచ్చళ్ల బిజినెస్ మూతపడినప్పటికీ వీరికి ఫాలోయింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఓ కస్టమర్‌తో వీరి సంభాషణ వైరల్ కావడంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన వీరి మాట్లాడిన డైలాగ్స్‌పై మీమ్స్, ట్రోల్స్ ఓ రేంజ్లో వచ్చాయి.ఇదంతా పక్కనపెడితే అలేఖ్య సిస్టర్స్‌లో ఒకరైన రమ్య సడన్‌లో సినిమా ఈవెంట్లో కనిపించింది. టాలీవుడ్ హీరో అశ్విన్ బాబు నటించిన తాజా చిత్రం వచ్చినవాడు గౌతమ్. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఈవెంట్లోనే రమ్య సందడి చేసింది. వేదికపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పక్కనే కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను సైతం రమ్య సోషల్ మీడియాలో షేర్ చేసింది.అయితే ఈవెంట్‌కు రమ్య హాజరు కావడంపై భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. పచ్చళ్ల బిజినెస్‌తో ఫేమస్ అయి.. ఏకంగా సినిమా ఛాన్స్ కొట్టేసిందా అంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరేమో ఏకంగా సెలబ్రిటీ అయిపోయారా? అంటూ కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఏదేమైనా రమ్య టాలీవుడ్ మూవీ ఈవెంట్లో కనిపించడంతో మరోసారి అలేఖ్య చిట్టి పికిల్స్ టాపిక్ తెరపైకి వచ్చింది. మరి అందరూ ఊహించినట్లుగానే రమ్య ఈ సినిమాలో నటించిందా? లేదా అన్నది తెలియాలంటే ఆమె దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిందే.గతంలో అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్‌లలో ఒకరికి తప్పుకుండా బిగ్‌బాస్‌లోకి ఛాన్స్ వస్తుందని నెట్టింట వైరలైంది. కానీ, రమ్యకు ఛాన్స్ దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని టాక్ వినిపించింది. మోడ్రన్ డ్రెస్‌లతో ఆమె రీల్స్ ఎక్కువగా ట్రెండ్ అవుతుంటాయి కూడా.. గతంలో జియోహాట్‌స్టార్‌లో పికిల్స్‌కు సంబంధించిన ఒక సీన్‌ను వారు షేర్ చేశారు. ప్రభాస్ ఛత్రపతి సినిమా నుంచి ఒక వీడియోను విడుదల చేశారు. ఇదే విషయంపై బిగ్‌బాస్ ఆదిరెడ్డి కూడా తన యూట్యూబ్ ఛానల్లో అభిప్రాయం చెప్పాడు. వారిలో ఒకరు బిగ్‌బాస్‌కు రావచ్చని ఆయన అభిప్రాయ పడ్డారు. View this post on Instagram A post shared by Ramya moksha kancharla 👻🌸 (@ramyagopalkancharla)
మళ్లీ కరోనా మహమ్మారీ పలుదేశాల్లో హై అలర్ట్
పవర్‌ఫుల్‌గా ఉండాలి
సారీ.. నో లారీ!
కేంద్రం దౌత్యమార్గం
ఏంట్రీ.. 700 ఏళ్లా..?
రూ.50 వేల కోట్లు!
జరిమానా విధిస్తాం జాగ్రత్త
ట్రంప్ మరో పిడుగు
28న పోలవరంపై ప్రధాని మోదీ సమీక్ష
అందాల పోటీలు.. అధికారుల సిగపట్లు
పెళ్లి పెద్దగా పెద్దపల్లి కలెక్టర్
ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన..
మన వేలితో మన కన్నే..!
ఏపీ పోలీస్ ఆఫీసర్‌గా బాలకృష్ణ
పసిడి ఢమాల్.. రూ.వేలల్లో తగ్గిన బంగారం
‘పాకిస్తాన్ వద్దే కాదు.. చైనాకు కూడా ఆ సామర్థ్యం లేదు’
కోటి ఇస్తావా.. ఫొటోలు అప్లోడ్ చేయమంటావా?
ఈ రాశి వారికి ముఖ్యమైన పనులలో విజయం.. ఉద్యోగలాభం
అలాగే ‘మన టెర్రరిస్టులు’ కూడా 100 మంది పోయారని చెప్పండి!
..పన్లోపని తుర్కియే అధ్యక్షుడిని కూడా పిలుద్దాం సార్! కొంతకాలం పాలన చూసుకోమని చెబుదాం!
'పద్మ భూషణ్' చేయాల్సిన పనులేనా..? బాలకృష్ణపై విమర్శలు
ఈ రాశి వారికి వ్యాపారాలలో ఊహించని లాభాలు.. ఉద్యోగాలలో హోదాలు
బర్త్ డే పార్టీ ఫోటోలు షేర్ చేసిన యాంకర్ రష్మీ గౌతమ్ (ఫొటోలు)
ఇప్పటికైనా తెలిసిందా సార్!.. మీరెంత పేదరికంలో బతుకుతున్నారో!
వాళ్లు ఇస్తానన్న విమానం ఇదేనట సార్!
నెల్లూరులో ప్రసిద్ధ ఆలయం..శనివారం ఒక్కరోజే భక్తులకు దర్శనం (ఫొటోలు)
ఈ తీపి గుర్తులు మరిచిపోలేను.. ఫోటోలు విడుదల చేసిన శ్రీనిధి శెట్టి (ఫొటోలు)
IPL 2025 Resumption: ఆసక్తి రేపుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ఆటగాడి పోస్ట్
రాజ్ భుజంపై వాలిన సమంత.. దర్శకుడి భార్య పోస్ట్ వైరల్!
వరంగల్ : కాకతీయ వైభవాన్ని చూసి మురిసిన విదేశీ వనితలు (ఫొటోలు)
మళ్లీ కరోనా మహమ్మారీ పలుదేశాల్లో హై అలర్ట్
పవర్‌ఫుల్‌గా ఉండాలి
సారీ.. నో లారీ!
కేంద్రం దౌత్యమార్గం
ఏంట్రీ.. 700 ఏళ్లా..?
రూ.50 వేల కోట్లు!
జరిమానా విధిస్తాం జాగ్రత్త
ట్రంప్ మరో పిడుగు
28న పోలవరంపై ప్రధాని మోదీ సమీక్ష
అందాల పోటీలు.. అధికారుల సిగపట్లు
పెళ్లి పెద్దగా పెద్దపల్లి కలెక్టర్
ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన..
మన వేలితో మన కన్నే..!
ఏపీ పోలీస్ ఆఫీసర్‌గా బాలకృష్ణ
పసిడి ఢమాల్.. రూ.వేలల్లో తగ్గిన బంగారం
‘పాకిస్తాన్ వద్దే కాదు.. చైనాకు కూడా ఆ సామర్థ్యం లేదు’
కోటి ఇస్తావా.. ఫొటోలు అప్లోడ్ చేయమంటావా?
ఈ రాశి వారికి ముఖ్యమైన పనులలో విజయం.. ఉద్యోగలాభం
అలాగే ‘మన టెర్రరిస్టులు’ కూడా 100 మంది పోయారని చెప్పండి!
..పన్లోపని తుర్కియే అధ్యక్షుడిని కూడా పిలుద్దాం సార్! కొంతకాలం పాలన చూసుకోమని చెబుదాం!
'పద్మ భూషణ్' చేయాల్సిన పనులేనా..? బాలకృష్ణపై విమర్శలు
ఈ రాశి వారికి వ్యాపారాలలో ఊహించని లాభాలు.. ఉద్యోగాలలో హోదాలు
ఇప్పటికైనా తెలిసిందా సార్!.. మీరెంత పేదరికంలో బతుకుతున్నారో!
వాళ్లు ఇస్తానన్న విమానం ఇదేనట సార్!
IPL 2025 Resumption: ఆసక్తి రేపుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ఆటగాడి పోస్ట్
రాజ్ భుజంపై వాలిన సమంత.. దర్శకుడి భార్య పోస్ట్ వైరల్!
ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా.. క్లాప్ కొట్టిన రష్మిక!
జూమ్ కాల్‌తో భార్య రెండో పెళ్లి గుట్టురట్టు.. నాలుగేళ్ల కోర్టు పోరాటంలో భర్త విజయం
డ్రోన్ ఫుటేజ్.. ఉగ్రవాదుల్ని ఎంత క్లియర్‌గా రికార్డు చేసిందో..!
ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లింగ్ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
సినిమా

'బిగ్ బాస్'తో బలుపు పెరిగింది.. నా ఫ్రెండ్సే నన్ను..: సొహెల్
బిగ్ బాస్.. ఓ రియాలిటీ షో మాత్రమే. గత కొన్ని సీజన్లపై దారుణమైన విమర్శలు వచ్చాయి. వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఏడో సీజన్ విజేతగా నిలిచిన రైతుబిడ్డ అని చెప్పుకొనే పల్లవి ప్రశాంత్ వల్ల షోకి చాలా చెడ్డ పేరు వచ్చింది. దీనంతటికీ కూడా సదరు కంటెస్టెంట్స్ కి ఉండే బలుపే కారణం. ఇదేదో మేం చెబుతున్న మాట కాదు. స్వయనా సొహెల్ చెప్పాడు. ఈ షో వల్ల తనకు ఎంత మైనస్ అయిందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి :రెండు రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) 'బిగ్ బాస్ తర్వాత నాకు చాలా మైనస్ అయింది. ప్లస్ కూడా అయింది. ముఖ్యంగా మైనస్ గురించి చెప్పుకొంటే.. ఆ టైంలో నాకు విపరీతంగా బలుపు పెరిగింది. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది. అస్సలు కంట్రోల్ లో లేను. కొన్ని మాటలు నోరు జారాను. నా ఫ్రెండ్సే.. నన్ను అలా మాట్లాడేలా చేశారు. ఏందన్నా నువ్వు కానియ్ అనేవారు. అప్పట్లో నా ముందు ఎవరైనా మైక్ పెడితే నోటికొచ్చింది మాట్లాడేవాడిని. కప్పుది ఏముంది చేయించుకుందాం లాంటి అతి మాటలు మాట్లాడేవాడిని. దీనంతటికీ పక్క వాళ్ల ప్రభావమే కారణం''జీరోగా బిగ్ బాస్ షోకి వెళ్లాను. బయటకు వచ్చిన తర్వాత క్రేజ్ చూసేసరికి బలుపు పెరిగిపోయింది. కానీ నేను కావాలని నోరు జారలేదు. 'లక్కీ లక్ష్మణ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా.. 'నా కొడకల్లారా ఇంటికి వచ్చి కొడతా' అని వార్నింగ్స్ ఇవ్వడం చేశా. ఇప్పుడు ఆ బలుపు మొత్తం తగ్గిపోయింది. సమయం రావాలంతే. అదే మొత్తం సెట్ చేస్తుంది. నాకు ఇప్పుడు టైమ్ వచ్చింది'(ఇదీ చదవండి: శవంతో కామెడీ.. క్రేజీ డార్క్ కామెడీ మూవీ రివ్యూ (ఓటీటీ)) 'చాలామంది బిగ్ బాస్ షోని తిట్టుకుంటారు కానీ.. అది నాకు చాలా నేర్పించింది. అక్కడ రియల్ గానే ఉన్నాను. బిగ్ బాస్ సీజన్ 4 బెస్ట్ అంటారు. గెలవాలనే తపన అక్కడ నేర్చుకున్నాను. ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ మా సీజన్ మాత్రం విలువలతో కూడిన సీజన్' అని సొహెల్ చెప్పుకొచ్చాడు.సొహెల్ మాటల బట్టి చూస్తే అతడు చెప్పింది అక్షరాలా నిజమేననిపిస్తుంది. ఎందుకంటే తొలి సీజన్ నుంచి ఇప్పటివరకు గెలిచిన ఎవరూ కూడా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. పైపెచ్చు పూర్తిగా కనుమరుగైపోయారు కూడా. ఇకపై వచ్చే సీజన్లలో పాల్గొనే కంటెస్టెంట్స్ సొహెల్ మాటలు ఓసారి వింటే బెటర్ ఏమో?(ఇదీ చదవండి: 'రామాయణ్'లో కాజల్ అగర్వాల్.. అలాంటి పాత్రలోనా?)

వీర జవాన్ మురళి నాయక్‌కు టాలీవుడ్ కమెడియన్ నివాళి
టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ శివారెడ్డి వీరజవాన్‌కు నివాళులర్పించారు. ఇండియా-పాకిస్తాన్ మధ్య జరిగిన వార్‌లో అమరుడైన మురళి నాయక్‌కు చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. జవాన్ స్వగ్రామం శ్రీసత్యసాయి జిల్లా కల్లి తండాలో వెళ్లిన శివారెడ్డి వీర జవాన్‌ను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జవాన్ మాతృమూర్తి కాళ్లకు ఆయన నమస్కరించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది భారతీయులు మరణించారు. ఆ తర్వాత పాకిస్తాన్‌పై భారత్ మెరుపు దాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లో ఉగ్ర స్థావరాలపై వరుస దాడులతో విరుచుకుపడింది. ఈ యుద్ధ సమయంలోనే మన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. ఆ వీరుడిని తలచుకుంటూ భారతీయులంతా దేశవ్యాప్తంగా నివాళులర్పించారు.

'రామాయణ్'లో కాజల్ అగర్వాల్.. అలాంటి పాత్రలోనా?
రామాయణం ఆధారంగా మన దేశంలో చాలా సినిమాలు ఇదివరకే తీశారు. తీస్తూనే ఉన్నారు. కొన్నాళ్ల క్రితం ప్రభాస్ 'ఆదిపురుష్' ఇలానే తీశారు. కానీ గ్రాఫిక్స్, పాత్రల తీరుతెన్నులు దారుణంగా ఉండేసరికి విపరీతమైన విమర్శలు వచ్చాయి. కట్ చేస్తే ఇప్పుడు 'రామాయణ్' పేరుతో హిందీలో మళ్లీ సినిమా తీస్తున్నారు.ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమాలో 'యానిమల్' ఫేమ్ రణ్ బీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా, సాయిపల్లవి సీత పాత్ర చేస్తోంది. 'కేజీఎఫ్' యష్ రావణుడిగా నటిస్తున్నాడు. మిగిలిన పాత్రల కోసం పలు పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఎవరిని ఫైనల్ చేశారనేది ఇంకా బయటపెట్టలేదు.(ఇదీ చదవండి: శవంతో కామెడీ.. క్రేజీ డార్క్ కామెడీ మూవీ రివ్యూ (ఓటీటీ )) ప్రస్తుతానికైతే మండోదరి పాత్ర కోసం కాజల్ అగర్వాల్ ని తీసుకున్నారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. రావణుడి భార్య పేరు మండోదరి. రామాయణ్ మూవీలో ఈమె పాత్రకు చాలా తక్కువ ప్రాధాన్యం ఉండొచ్చు. మరి కాజల్ నిజంగా ఒప్పుకొందా? లేదంటే ఇవి రూమర్స్ మాత్రమేనా అనేది మరికొన్ని రోజుల్లో క్లారిటీ రావొచ్చు.నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నారు. 2026 దీపావళికి తొలి భాగం, 2027లో రెండో భాగం రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ మూవీతో దర్శకనిర్మాతలు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి?(ఇదీ చదవండి :రెండు రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు)

సతీమణి కోసం మెగా హీరో కొత్త అవతారం.. తానే స్వయంగా!
మెగా హీరో వరుణ్ తేజ్ ఇటీవలే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాను త్వరలోనే తండ్రిగా ప్రమోట్ కాబోతున్నట్లు ప్రకటించారు. తన భార్య లావణ్య త్రిపాఠితో కలిసి ఈ శుభవార్తను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ఇక తన భార్య ప్రస్తుతం ప్రెగ్నెన్సీ ధరించడంతో మెగా హీరో కొత్త అవతారం ఎత్తాడు. తన ముద్దుల సతీమణి కోసం చెఫ్‌గా మారిపోయారు. స్వయంగా తానే పిజ్జా తయారు చేసి తన భార్యకు సర్ప్రైజ్ ఇచ్చాడు మెగా హీరో. వరుణ్ తేజ్ పిజ్జా తయారు చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. 2023లో వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. త్వరలోనే ఈ జంట మొదటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించనున్నారు. 2017లో వరుణ్, లావణ్యల మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది.వీరిద్దరు కలిసి ‘మిస్టర్’ అనే సినిమాలో తొలిసారి నటించారు. ఆ సమయంలోనే వీరికి పరిచయం ఏర్పడింది. చివరికీ వీరిద్దరి ప్రేమ సక్సెస్ కావడంతో కుటుంబ సభ్యుల ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. వరుణ్, లావణ్యల పెళ్లి ఇటలీలో జరగగా.. హైదరాబాద్‌లో రిసెప్షన్ ఘనంగా జరిగింది.(ఇది చదవండి: మెగా కోడలిగా తొలి సినిమా.. లేటేస్ట్ అప్డేట్ వచ్చేసింది!)ఇక సినిమాల విషయానికొస్తే వరుణ్ తేజ్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ డైరెక్షన్లో నటిస్తున్నారు. మెగా కోడలు లావణ్య త్రిపాఠి సైతం సతీ లీలావతి అనే సినిమాలో కనిపించనుంది. వరుణ్‌తేజ్‌తో పెళ్లి తర్వాత మెగా కోడలిగా లావణ్య త్రిపాఠి నటిస్తోన్న మొదటి చిత్రం కావడం విశేషం. View this post on Instagram A post shared by Lavanyaa konidela tripathhi (@itsmelavanya)
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

కలలో కూడా ఊహించలేదు.. మాటల్లో వర్ణించలేను: రోహిత్ శర్మ భావోద్వేగం
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)ను ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) ఘనంగా సత్కరించింది. వాంఖడే స్టేడియం (Wankhede Stadium)లో రోహిత్ శర్మ పేరిట ఉన్న స్టాండ్‌ను శుక్రవారం ఆరంభించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలిసి రోహిత్ తల్లిదండ్రులు పూర్ణిమా శర్మ- గురునాథ్ శర్మ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్టేడియంలో రోహిత్ శర్మ స్టాండ్‌ను ఆవిష్కరించారు.ప్రతి ఒక్కరికి ధన్యవాదాలుఆ సమయంలో సీనియర్ నేత శరద్ పవార్, భారత జట్టు మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్‌లతో పాటు హిట్‌మ్యాన్ సతీమణి రితికా సజ్దే కూడా అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ‘‘ఇక్కడి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.అసలు ఇలాంటి ఓ రోజు వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. ముంబైకి.. టీమిండియాకు ఆడాలని కలలు కంటూ పెరిగాను. దేశానికి నా వంతు సేవ చేయాలని భావించాను. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలు సాధించాను.కఠిన సవాళ్లు ఎదుర్కొంటూ ఎన్నెన్నో మైలురాళ్లు అధిగమించాను. అయితే, వాటన్నింటికంటే ఈరోజు ఎంతో ప్రత్యేకమైనది. వాంఖడే వంటి ప్రసిద్ధ స్టేడియంలో నా పేరు ఇలా.. ఈ మైదానంతో నాకెన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి.మాటల్లో వర్ణించలేనుప్రపంచంలోని పేరెన్నికగన్న రాజకీయ నాయకులతో పాటు నా పేరు ఉండటం.. హో.. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేను. ఎంసీఏ సభ్యులు, యాజమాన్యానికి నేను కృతజ్ఞుడిని. నేను ఇంకా క్రికెటర్‌గా కొనసాగుతున్న సమయంలోనే ఇలాంటి గౌరవం దక్కడం ఎంతో ఎంతో ప్రత్యేకం.రెండు ఫార్మాట్ల నుంచి రిటైర్ అయ్యాను. ఇంకో ఫార్మాట్ ఆడుతూనే ఉన్నాను. నిజంగా ఈ భావనను మాటల్లో ఎలా చెప్పాలో తెలియడం లేదు. టీమిండియా తరఫున, ఐపీఎల్లో ముంబై తరఫున ఇక్కడికే వచ్చి మళ్లీ ఆడబోతున్నా. ఇంతకంటే గొప్పది నా జీవితంలో మరొకటి ఉండదు.వారి త్యాగాలు మరువలేనివిమా అమ్మానాన్న, నా భార్య, తమ్ముడు, మరదలు.. ఇలా కుటుంబమంతా ఇక్కడే ఉంది. వారందరి సమక్షంలో ఈ గౌరవం అందుకోవడం నాకు ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. నా కోసం వారంతా తమ జీవితంలోని చాలా సంతోషాలను త్యాగం చేశారు.మా ముంబై ఇండియన్స్ జట్టు కూడా ఇక్కడే ఉంది. నా ప్రసంగం ముగిసిన వెంటనే వాళ్లు మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెడతారు’’ అంటూ రోహిత్ శర్మ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. ఇటీవలే టెస్టులకు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, వన్డేల్లో మాత్రం కొనసాగనున్నాడు.ఇక టీ20 ప్రపంచకప్-2024తో పాటు టీమిండియాకు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 అందించిన ఘనత రోహిత్ సొంతం. తద్వారా మహేంద్ర సింగ్ ధోని (3) తర్వాత భారత్‌కు అత్యధిక (రెండు) ఐసీసీ టైటిళ్లు అందించిన కెప్టెన్‌గా రికార్డు సాధించాడు.ఇదిలా ఉంటే.. వాంఖడేలో ఇప్పటి వరకు సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్, వినోద్ మన్కడ్, దిలీప్ వెంగ్‌సర్కార్ పేరిట స్టాండ్స్ ఉన్నాయి. తాజాగా రోహిత్ కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. చదవండి: ‘రోహిత్ జట్టులో లేకపోయినా నష్టమేమీ లేదు.. అది పెద్ద విషయమే కాదు’𝗧𝗛𝗘 𝗥𝗢𝗛𝗜𝗧 𝗦𝗛𝗔𝗥𝗠𝗔 𝗦𝗧𝗔𝗡𝗗 🫡🏟#MumbaiIndians #PlayLikeMumbai #RohitSharmaStand | @ImRo45 pic.twitter.com/dqdWu6YSQ5— Mumbai Indians (@mipaltan) May 16, 2025

ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్ న్యూస్.. స్టార్ ప్లేయర్ రాకకు లైన్ క్లియర్!
ఐపీఎల్ 2025 పునఃప్రారం వేళ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓ గుడ్ న్యూస్ అందింది. ఐపీఎల్ మిగిలిన మ్యాచ్‌లో ఆడేందుకు ముస్తఫిజుర్ రెహ్మాన్‌కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) మంజూరు చేసినట్లు తెలుస్తోంది. అతడు శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ వారం రోజులు వాయిదా పడడంతో చాలా మంది ఫారన్ ప్లేయర్లు తమ స్వదేశానికి వెళ్లిపోయారు. అయితే ఐపీఎల్ రీ స్టార్ట్ అవుతుండడంతో కొంతమంది తిరిగి భారత్‌కు రావడానికి సిద్దపడితే, మరి కొంతమంది నిరాకరించారు. అందులో ఒకరు ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రెజర్ మెక్‌గర్క్.ఐపీఎల్ 16వ సీజన్లో మిగిలిన మ్యాచ్‌లకు తన అందుబాటులో ఉండడని మెక్‌గర్క్ ఢిల్లీ ఫ్రాంచైజీకి తెలియజేశాడు. ఈ క్రమంలో మెక్‌గర్క్ స్ధానంలో బంగ్లాపేసర్ ముస్తఫిజుర్ రెహ్మాన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. అయితే ఇక్కడే అస్సలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ముస్తఫిజుర్‌తో ఢిల్లీ ఒప్పందం కుదుర్చుకున్నప్పటికి అతడు యూఏఈతో టీ20 సిరీస్ ఆడేందుకు దుబాయ్‌కు పయనమయ్యాడు.యాదృచ్ఛికంగా యూఏఈ-బంగ్లా సిరీస్ కూడా మే 17 నుంచి ప్రారంభం కానుంది. దీంతో అతడు తిరిగి భారత్‌కు వస్తాడా లేదా అన్న సందిగ్ధం నెలకొంది. ఎట్టకేలకు బంగ్లా క్రికెట్ బోర్డు అతడికి ఎన్వోసీ మంజారు చేయడంతో ఢిల్లీ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.కాగా ఈ ఏడాది సీజన్లో మిగిలిన మ్యాచ్‌లకు ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్లు మిచెల్ స్టార్క్, ఫాఫ్ డుప్లెసిస్ సైతం దూరమయ్యారు. ఈ ఏడాది సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ మూడు మ్యాచ్‌లలోనూ ఢిల్లీ విజయం సాధిస్తే ఎటువంటి సమీకరణాలు అవసరం లేకుండా ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధిస్తోంది.

‘ఇక్కడి నుంచి పో..’: సహనం కోల్పోయిన స్టార్క్.. వీడియో వైరల్
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) సహనం కోల్పోయాడు. ‘‘ఇక్కడి నుంచి వెళ్లిపో’’ అంటూ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. కాగా ఐపీఎల్-2025 (IPL 2025) మెగా వేలంలో భాగంగా ఢిల్లీ స్టార్క్‌ను రూ. 11. 75 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది.ఈ క్రమంలో ఈ సీజన్లో ఢిల్లీ (Delhi Capitals) తరఫున పదకొండు మ్యాచ్‌లు ఆడి పద్నాలుగు వికెట్లు పడగొట్టాడు స్టార్క్. చివరగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా అతడు బరిలోకి దిగాడు. అయితే, భారత్- పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ధర్మశాలలో బ్లాక్ అవుట్ (విద్యుత్ సరఫరా నిలిపివేయడం) విధించడంతో పంజాబ్- ఢిల్లీ మ్యాచ్ అర్దంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే.భార్య అలిసా హేలీతో కలిసిఈ నేపథ్యంలో బీసీసీఐ ఆటగాళ్లను వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించి.. ఆపై కట్టుదిట్టమైన భద్రత నడుమ ఢిల్లీకి చేర్చింది. ఈ పరిణామాలతో తీవ్ర భయాందోళనకు లోనైన స్టార్క్, అతడి భార్య అలిసా హేలీ ఢిల్లీకి చేరుకుని.. వెంటనే స్వదేశానికి పయనమయ్యారు.ఇక్కడి నుంచి పో..ఈ క్రమంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఓ వ్యక్తి స్టార్క్ దగ్గరగా వెళ్లి వీడియో తీసే ప్రయత్నం చేశాడు. దీంతో అతడు పక్కకు వెళ్లిపో అంటూ సైగ చేశాడు. అయితే, కాసేపటి తర్వాత సదరు వ్యక్తి మరోసారి స్టార్క్ దగ్గరికి వెళ్లి పలకరించాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఆసీస్ బౌలర్.. ‘‘పో.. పో.. ఇక్కడి నుంచి దూరంగా వెళ్లిపో’’ అన్నట్లుగా విసుక్కున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో చాలా మంది స్టార్క్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. అసలే భయపడిన వాడిని మరింత భయపెట్టడం సరికాదంటూ సెటైర్లు వేస్తుండగా... మరికొందరు మాత్రం స్టార్క్ అంతలా విసుక్కోవాల్సిన అవసరం లేదని.. ఏదేమైనా ఒకరి గోప్యతకు భంగం వాటిల్లేలా ప్రవర్తించడం ఏమిటని సదరు వ్లాగర్‌కు చివాట్లు పెడుతున్నారు.మే 17 నుంచి తిరిగి ప్రారంభంఇదిలా ఉంటే... మే 17 నుంచి ఐపీఎల్-2025 తిరిగి ప్రారంభం కానుంది. అయితే, ఢిల్లీకి ఆడుతున్న ఆసీస్ స్టార్లు స్టార్క్, జేక్ ఫ్రేజర్-మెగర్క్ తిరిగి ఇండియాకు వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఇష్టమైతేనే భారత్‌కు తిరిగి వెళ్లవచ్చు అని క్రికెట్ ఆస్ట్రేలియా తమ ఆటగాళ్లకు సూచించగా.. స్వదేశంలోనే ఉండేందుకు వీరిద్దరు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.మరోవైపు.. ఢిల్లీకి లీగ్ దశలో ఇంకో మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని 13 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతున్న అక్షర్ సేన.. ప్లే ఆఫ్స్‌నకు గురిపెట్టింది. అయితే, స్టార్క్, మెగర్క్ వంటి కీలక ఆటగాళ్లు లేకపోవడం తీవ్ర ప్రభావం చూపనుంది.చదవండి: మాట తప్పారు!.. ఆర్సీబీకి తిరిగి ఆడాలని అనుకోలేదు: పాటిదార్Go away😭pic.twitter.com/hqkyHzCEg4— Ghar Ke Kalesh (@gharkekalesh) May 15, 2025

నేను కోచ్‌గా ఉండుంటే.. రోహిత్‌కు అలా జరిగేది కాదు: రవిశాస్త్రి
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవలే తన 12 ఏళ్ల టెస్టు కెరీర్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ తన రిటైర్మెంట్కు ముందు టెస్టు క్రికెట్లో కెప్టెన్‌గా, ఆటగాడిగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడు. న్యూజిలాండ్ చేతిలో భారత్ తొలిసారి టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్ కావడం, ఆస్ట్రేలియాతో బీజీటీలో చిత్తుగా ఓడి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు దూరం కావడం వంటివి రోహిత్‌ను మానసికంగా దెబ్బతీశాయనే చెప్పుకోవాలి. రోహిత్ తన కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాపై ఆడాడు. ఆ తర్వాత బీజీటీలోని ఆఖరి మ్యాచ్ నుంచి హిట్ మ్యాన్ స్వచ్ఛందంగా తానంతట తనే తప్పుకున్నాడు. దీంతో కనీసం ఫేర్వెల్ మ్యాచ్ లేకుండానే రోహిత్ తన కెరీర్‌ను ముగించాడు. ఈ క్రమంలో భారత మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తను కోచ్‌గా ఉండుంటే, సిడ్నీ టెస్టులో రోహిత్ ఆడేవాడని రవిశాస్త్రి వెల్లడించాడు."ఐపీఎల్-2025 సీజన్ టాస్ సమయంలో రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేస్తుండగా చాలాసార్లు చూశాను. కానీ ఆ సమయంలో అతడితో మాట్లాడటానికి తగినంత సమయం దొరకలేదు. ఓసారి మాత్రం అతడి దగ్గరకు వెళ్లి భుజంపై చేయి వేసి మాట్లాడాను. నేను కోచ్‌గా ఉండుంటే సిడ్నీ టెస్టు(బీజీటీలో ఆఖరి టెస్టు)లో ఆడకుండా ఉండేవాడివి కాదు అని చెప్పా. సిరీస్ అప్పటికి ఇంకా ముగియలేదు కాబట్టి కచ్చితంగా మిమ్మల్ని ఆడించేవాడిని. ఎందుకంటే 2-1తో ప్రత్యర్ధి జట్టు ముందుంజలో ఉన్నా, నేను వెనకడుగు వేసే వ్యక్తిని కాదు. ఆఖరి టెస్టు మ్యాచ్ 30-40 పరుగుల తేడాతో సాగింది. సిడ్నీ పిచ్ చాలా ట్రిక్కీగా ఉంది. రోహిత్ ఫామ్‌లో ఉన్న లేకపోయానా జట్టులో కచ్చితంగా ఉండాల్సిందే.ఎందుకంటే అతడు మ్యాచ్ విన్నర్. సరిగ్గా ఇదే విషయం రోహిత్ కూడా చెప్పాను. ఒకవేళ రోహిత్ ఆ మ్యాచ్‌లో ఆడి అక్కడ పరిస్థితులకు తగ్గట్టు జట్టును నడిపించి ఉంటే సిరీస్ సమమయ్యేది. అయితే ప్రతీ కోచ్‌కు వేర్వేరు స్టైల్స్ ఉంటాయి. ఇది నా శైలి. కేవలం నా ఆలోచిన విధానాన్ని మాత్రమే రోహిత్‌కు తెలియజేశాను. ఎప్పటి నుంచో ఇది నా మనసులో ఉంది. ఎట్టకేలకు అతడికి తెలియజేశాను" అని ఐసీసీ రివ్యూలో రవిశాస్త్రి పేర్కొన్నాడు. కాగా రవిశాస్త్రి వ్యాఖ్యలు బట్టి చూస్తే ప్రస్తుత భారత హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌కు పరోక్షంగా కౌంటరిచ్చినట్లు అన్పిస్తోంది. గంభీర్‌తో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికి విభేదాలు తలెత్తినట్లు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో రో-కో టెస్టులకు వీడ్కోలు పలికినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
బిజినెస్

ఆఫీస్‌కు రాకపోతే వేరే ఉద్యోగం చూసుకోండి..
రిమోట్ వర్క్.. అదేనండి వర్క్ ఫ్రమ్ హోమ్. చాలా మంది ఉద్యోగులకు ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. ఓపక్క కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే మరో వైపు ఉద్యోగాన్ని చూసుకుంటున్న వారికి ఈ విధానం చాలా అనువుగా ఉంటోంది. అయితే కోవిడ్-19 మహమ్మారి విజృంభణ సందర్భంగా అమలులోకి వచ్చిన ఈ రిమోట్ వర్క్ విధానం నెమ్మదిగా తొలగిపోతోంది. చాలా కంపెనీలు ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు పిలుస్తున్నాయి.సౌకర్యవంతమైన ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి అలవాటు పడినవారు ఆఫీసులకు తిరిగివెళ్లడానికి ఇష్టపడటం లేదు. చాలా కంపెనీలు ఉద్యోగులను బలవంతంగానైనా ఆఫీసులకు రప్పిస్తున్నాయి. ఇలాగే ఉద్యోగులను ఆఫీసులకు రావాలని ఆదేశించడం ఓ ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీలో ఎలా బెడిసికొట్టిందో.. ఉద్యోగులు ఏం చేశారో చెబుతూ ఆ కంపెనీలో పనిచేసే వ్యక్తి రెడ్డిట్‌లో షేర్ చేసిన స్టోరీ ఆసక్తికరంగా మారంది.ఆఫీస్‌కు రాకపోతే ఏం చేస్తారు?కోవిడ్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేసిన కంపెనీ.. ఆ సమయంలో చాలా మందిని రిమోట్ వర్క్ విధానంలోనే నియమించుకుంది. కానీ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అందరూ క్రమంగా ఆఫీసులకు రావాలని యాజమాన్యం ఆదేశించింది. అసలు సమస్య ఏంటంటే.. దాదాపు చాలా మంది రిమోట్ వర్క్ విధానంలోనే ఉద్యోగాల్లో చేరారు. కొంత మంది తమ ప్రాంతాలకు మకాం మార్చారు. ఇప్పుడు వీళ్లకు ఎటువంటి ఆర్థిక సహకారం అందించకుండా ఏడాదిలోగా ఆఫీసులకు వచ్చేయాలని కంపెనీ చెబుతోంది.దీంతో ఉద్యోగులు గందరగోళంలో పడిపోయారు. ఈక్రమంలో కంపెనీ వైడ్ టౌన్ హాల్ సమావేశంలో ఆఫీస్‌కు రావడానికి అయిష్టంగా ఉన్నవారికి మినహాయింపులేమైనా ఉంటాయా అని ఓ ఉద్యోగి నేరుగా సీఈవోనే అడిగేశారు. దానికి సీఈవో స్పందిస్తూ "మీరు ఇంటి నుండి పని చేయాలనుకుంటే, వేరే చోట ఉద్యోగం చూసుకోండి" అంటూ బదులిచ్చారు. దీంతో అవాక్కైన ఉద్యోగులు ఆన్లైన్ కాల్స్‌లోకి రావడం మానేశారు. చాలా మంది వెంటనే రాజీనామా చేశారు. ఎక్కువ మంది వెళ్లిపోవడంతో కంపెనీకి షాక్ తగిలింది. క్యూసీ ఉద్యోగులతోనే యాప్ డెవలప్మెంట్ చేయించాల్సి వచ్చింది.

కేటీఎం బైక్‌ల ధరలు పెరిగాయ్..
ప్రముఖ ప్రీమియం బైక్‌ల తయారీ సంస్థ కేటీఎం ఇండియన్ మార్కెట్లో విక్రయించే తమ ద్విచక్ర వాహనాల ధరలను సవరించింది. ఈ మార్పులతో వివిధ బైక్‌ల ధర రూ.12,000 వరకు పెరిగింది. ఆయా మోడళ్లపై కనీసం రూ.1,000 మేర ధరలను కంపెనీ పెంచేసింది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులతోపాటు ద్రవ్యోల్బణ వ్యత్యాసానికి అనుగుణంగా సర్దుబాటు చేయడంలో భాగంగా ఇతర కంపెనీలతోపాటు కేటీఎం కూడా తమ బైక్‌ల ధరలను పెంచింది.ఏ బైక్‌పై ఎంత పెరిగింది?🔺కేటీఎం 390 డ్యూక్‌పై అత్యల్పంగా రూ .1,000 పెరిగింది. దీంతో ఈ బైక్ ధర రూ.2.96 లక్షలకు (ఎక్స్ షోరూమ్) చేరింది. అయితే ఇంతకుముందు ఈ బైక్ ధరను రూ.18,000 తగ్గించింది. దాంతో అప్పుడు ఈ ద్విచక్ర వాహనం ధర రూ.3.13 లక్షల నుంచి రూ.2.95 లక్షలకు (ఎక్స్ షోరూమ్) తగ్గింది.🔺 ఇక కేటీఎం 250 డ్యూక్, ఆర్సీ 390 మోడళ్ల ధరలు రూ .5,000 కంటే ఎక్కువ పెరిగాయి. దీంతో 250 డ్యూక్ ధర రూ.2.30 లక్షలకు చేరగా, ఆర్సీ 390 ధర రూ.3.23 లక్షలకు (రెండూ ఎక్స్-షోరూమ్ ధరలు) చేరింది. ఇండియన్ మార్కెట్లో బజాజ్ పల్సర్ ఎన్ 250, హీరో ఎక్స్ ట్రీమ్ 250ఆర్, సుజుకి జిక్సర్ 250 వంటి ప్రసిద్ధ మోడళ్లలో కేటీఎం 250 డ్యూక్ కూడా ఒకటి.🔺కేటీఎం ఆర్సీ 200 బైక్ ధర అత్యధికంగా రూ .12,000 పెరిగింది. ఈ మార్పుతో, ఈ బైక్ ప్రారంభ ధర రూ .2.21 లక్షల నుండి రూ .2.33 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరింది. ఈ బైక్ హీరో కరిజ్మా ఎక్స్ఎంఆర్, బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200, సుజుకి ఎస్ఎఫ్ 250, యమహా ఆర్ 15 వీ4 వంటి మోడళ్లకు పోటీగా ఉంది.

ఈ దేశాలు బంగారానికి పుట్టిళ్లు..!!
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన లోహాల్లో బంగారం ఒకటి. బంగారాన్ని వేలాది సంవత్సరాలుగా ఐశ్వర్యానికి, హోదాకు ప్రతిరూపంగా పరిగణిస్తూ వస్తున్నారు. బంగారం మంచి విద్యుత్ వాహకం. దీని ఉపయోగాలు ఎలా ఉన్నా మృదువైన, అరుదైన, సులభంగా ఆకృతులు చేసేందుకు అనువైన ఈ లోహాన్ని ముఖ్యంగా ఆభరణాలలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. డిమాండ్ కారణంగా బంగారం విలువ అంతకంతకూ పెరుగుతూ అత్యంత ఖరీదైన లోహంగా మారింది. అందుకే దీన్ని పెట్టుబడి సాధనంగా కూడా భావిస్తారు. శతాబ్దాలుగా మాంద్యం సమయంలో మంచి పెట్టుబడి మార్గంగా బంగారం కొనసాగుతోంది.ఈ దేశం బంగారు భూమిఘనాను బంగారు భూమి అంటారు. ఈ ప్రదేశం పశ్చిమ ఆఫ్రికాలో ఉంది. వైవిధ్యమైన బంగారు వనరులు, అభివృద్ధి చెందుతున్న వాణిజ్యం కారణంగా అరబ్ వ్యాపారులు ఘనాకు ఆ పేరు పెట్టారు. బంగారం ఈ ప్రాంత అత్యంత ముఖ్యమైన వస్తువుగా మారింది.అంతేకాకుండా జపాన్ లోని సాడో ద్వీపాన్ని కూడా ఎడో కాలంలో బంగారు భూమిగా పిలిచేవాళ్లు. ఎందుకంటే ఈ ప్రదేశం ఆ సమయంలో జపాన్ మొత్తం బంగారు ఉత్పత్తిలో దాదాపు సగం ఉత్పత్తి చేసేది. అపారమైన సంపదకు, బంగారానికి నిలయంగా ఉండే ఇండోనేషియాలోని ఒకప్పటి శ్రీవిజయ నగరాన్ని కూడా బంగారు ద్వీపంగా పరిగణించేశాళ్లు.👉ఇది చదవారా? బంగారం మాయలో పడొద్దు..టాప్ 10 అతిపెద్ద బంగారం ఉత్పత్తి దేశాలువరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇచ్చిన గణాంకాల ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే టాప్ 10 దేశాల జాబితా ఇలా ఉంది. దేశం బంగారం ఉత్పత్తి (టన్నులు)1 చైనా 378.22 రష్యన్ ఫెడరేషన్ 321.83 ఆస్ట్రేలియా 293.84 కెనడా 191.95 యునైటెడ్ స్టేట్స్ 166.76 ఘనా 135.17 ఇండోనేషియా 132.58 పెరూ 128.89 మెక్సికో 126.610 ఉజ్బెకిస్తాన్ 119.6

ఉన్నట్టుండి భారీగా పెరిగిన బంగారం ధరలు
దేశంలో బంగారం ధరలు తగ్గుతున్నాయి అనుకునే లోపే.. ఈ రోజు (మే 16) మళ్ళీ భారీగా పెరిగాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 87,200 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 95,130 వద్ద నిలిచాయి. నిన్న భారీగా తగ్గిన ధరలు.. ఈ రోజు భారీగా పెరిగాయి. ఈ రోజు కూడా రూ. 1100 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 1200 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 1100 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 1200 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 87,200 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 95,130 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 87,350 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 95,280 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 1100, రూ. 1200 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు భారీగా పెరిగినప్పటికీ.. వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. ఈ రోజు (శుక్రవారం) కేజీ సిల్వర్ రేటు రూ.1,08,000 వద్దకు చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 97,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).ఇదీ చదవండి: జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్: 365 రోజుల వ్యాలిడిటీ కోసం..
ఫ్యామిలీ

గురి తప్పని విజయం... భళా ముఖేశ్!
వెంట్రుక వాసిలో పతకాలు చేజారిపోయే పిస్టల్ షూటింగ్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ గుంటూరుకు చెందిన ముఖేశ్ నేలపల్లి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు. జూనియర్ పిస్టల్ షూటింగ్లో పతకాలతో భవిష్యత్ తారగా ఎదిగాడు.... గత ఏడాది పెరూలో జరిగిన వరల్డ్ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో మొత్తం 5 బంగారు, 2 కాంస్య పతకాలు సాధించి ముఖేశ్ రికార్డు సృష్టించాడు. ఈ నెల 17 నుంచి 26 వరకు జర్మనీలోని సుహుల్లో జరగనున్న జూనియర్ వరల్డ్ కప్ షూటింగ్ పోటీలకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ఢిల్లీలో నిర్వహిస్తున్న జాతీయ శిక్షణ శిబిరంలో ముఖేశ్ సాధన చేస్తున్నాడు. 11 ఏళ్ల వయస్సులో స్కూల్ నిర్వహించిన వేసవి శిబిరంలో బాస్కెట్‌బాల్ సాధన కోసం ముఖేశ్ చేరాడు. కోచ్ సూచనతో అనుకోని విధంగా పిస్టల్ షూటింగ్ శిక్షణలో అన్న హితేశ్‌తో కలిసి సాధన ప్రారంభించాడు. కొద్ది రోజులకే ముఖేశ్ పతకాలు సాధించడంతో తండ్రి శ్రీనివాసరావు 2018లో స్థానికంగా అందుబాటులో ఉన్న అంతర్జాతీయ కోచ్, ఇండియన్ అకాడమీ ఆఫ్ షూటింగ్ స్పోర్ట్ చీఫ్ కోచ్ నగిశెట్టి సుబ్రమణ్యం దగ్గర శిక్షణలో చేర్పించారు. తన ప్రతిభకు మరింత మెరుగులు దిద్దుకునేందుకు ముఖేశ్పుణేకు మకాం మార్చాడు. లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్ పుణేలో నిర్వహిస్తున్న ‘గన్ ఫర్ గ్లోరీ’ షూటింగ్ అకాడమీలో చేరాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్, ర్యాపిడ్ ఫైర్ పిస్టల్, స్టాండర్డ్ పిస్టల్, 50 మీటర్ల పిస్టల్‌లో విభాగాలలో ముఖేశ్ నిలకడగా రాణిస్తున్నాడు. జాతీయ స్థాయిలో 80కుపైగా పతకాలు సాధించిన ముఖేష్ భారత రైఫిల్ షూటింగ్ శిబిరానికి ఎంపికయ్యాడు.ఒలింపిక్స్ లక్ష్యంభారత జట్టు తరపున సీనియర్ విభాగంలో ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే నా లక్ష్యం. జర్మనీలో జరగనున్న పోటీల్లో 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో పోటీపడుతున్నాను. పతకాలతో తిరిగి వస్తానని ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. – ముఖేశ్– మురమళ్ళశ్రీనివాసరావు, సాక్షి స్పోర్ట్స్, గుంటూరు

ట్రావెల్ ఎక్స్పీరియన్స్: ఎందుకు రాయాలో తెలుసా..?
బస్సెక్కినా రైలెక్కినా విమానం ఎక్కినా మనకు కావలసింది ఏది? కిటికీ పక్కన సీటు? ఎందుకు? బయటకు చూస్తుంటే బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది? కొత్త ప్రాంతాలు కాబట్టి. పిల్లలూ... మనిషి పుట్టింది ఉన్న చోట ఉండటానికి కాదు. ప్రయాణించడానికి. తిరిగి లోకం చూడాలి. కొత్త మనుషులను కలవాలి. ప్రయాణాల్లో ఏం చూశారో, ఏం తెలుసుకున్నారో రాయాలి. అప్పుడు మీరు ‘ట్రావెల్ రైటర్’ అవుతారు. ‘యాత్రికుడు’ అనిపించుకుంటారు.పిల్లలూ! వేసవి సెలవుల్లో అమ్మా నాన్నలు మిమ్మల్ని ఏదో ఒక ఊరు తీసుకెళతారు. కొత్త ప్రదేశాలు చూపిస్తారు. మీరు అక్కడి వింతలు, విశేషాలు చూసి ఆనందిస్తారు. కొన్ని ఫొటోలు దిగి, తర్వాత ఇంటికి వచ్చేస్తారు. అక్కడితో ఆ పర్యటన ఓ గుర్తుగా మారుతుంది. అంతటితో సరేనా? దాన్ని మరింత పదిలం చేసుకోవాలని మీకు ఉండదా? మరి దానికేంటి మార్గం? ఒక్కటే. మీ పర్యటనలో మీకు ఎదురైన అనుభవాలను రాయడం. వాటిని రికార్డు చేసి పదిలంగా దాచుకోవడం.ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఎందుకు రాయాలి?ట్రావెలర్స్ ట్రావెల్ చేసి పొందిన అనుభవాలను రాయడం కొత్త విషయమేమీ కాదు. గతంలో ఎంతోమంది తాము చేసిన యాత్రల వివరాలు, విశేషాలను పుస్తకాల రూపంలో రాశారు. వాటిని ‘యాత్రా కథనాలు’ అంటారు. వాటిని చదవడం వల్ల అక్కడకు పోలేని వారికి ఆ ప్రాంతాల చరిత్ర, విశిష్టత, కల్చర్, లైఫ్‌స్టైల్ గురించి అవగాహన ఏర్పడుతుంది. కొత్త ప్రదేశాల్లో ఉండే వైవిధ్యం తెలుస్తుంది. ఇదే మీరూ చేయొచ్చు. మీరు చూసిన ప్రదేశాల తాలూకు విశేషాలను వ్యాసంగా రాయొచ్చు. దాన్ని మీ స్నేహితులకు, టీచర్లకు చూపించొచ్చు. దీనివల్ల మీ అనుభవాలకు విలువ ఏర్పడుతుంది. అందరిలోనూ ప్రత్యేకంగా నిలుస్తారు.యాత్రాకథనాలు రాయడం వల్ల కలిగే లాభాలుయాత్రాకథనాలు రాయడంలో మీ ఎక్స్ప్రెషన్దీ లాంగ్వేజ్దీ కీలకమైన పాత్ర. కొత్త ప్రాంతంలో మనకు ఎదురైన అనుభవాలను మన మాటల్లో పెట్టడం వల్ల మనసులోని భావాలను ఎలా వ్యక్తీకరించాలో తెలుస్తుంది. దీనివల్ల స్పష్టమైన దృక్పథం ఏర్పడుతుంది. నచ్చింది నచ్చనిది చెప్పడం చేతనవుతుంది. ఉదాహరణకు మీరు ఊటీ వెళ్లారనుకోండి. క్యాబ్‌డ్రైవర్ మీతో మంచిగా వ్యవహరిస్తే ఆ సంగతి రాస్తారు. ర్యాష్‌గా ఉంటే ‘ఊటి వెళ్లినప్పుడు మీరు సరైన డ్రైవర్‌ను ఎంచుకోండి. లేకుంటే ఇబ్బంది పడతారు’ అని రాస్తారు. అది చదివి మిగిలిన వారు అలర్ట్ అవుతారు.జ్ఞాపకశక్తి పెరుగుతుందిమీరు ట్రావెలింగ్‌లో చూసిన విషయాలు అప్పటికప్పుడు పుస్తకంలో రాసుకోవచ్చు లేదా వాటిని గుర్తు పెట్టుకొని ఇంటికి వచ్చాక రాసుకోవచ్చు. లేదా అక్కడే చిన్నచిన్న పాయింట్ల రూపంలో రాసుకొని, ఇంటికి వచ్చాక విస్తరించి రాయొచ్చు. ఇలా చేయడం వల్ల మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మీ ఆలోచనాధోరణి పదునెక్కుతుంది.చారిత్రక, సాంస్కృతిక అవగాహనమీరు చూసిన ప్రదేశాల గురించి రాయాలని అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఆ ప్రదేశాల గురించి గూగుల్ చేస్తారు. మీరు చూసిన చోటు గురించి మరిన్ని విషయాలు తెలుసుకుంటారు. ఉదాహరణకు రెండు రోజులు హంపీ చూసి వస్తారు. ఆ ప్లేస్ మీద మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. గూగుల్ చేసి యూట్యూబ్ ద్వారా హంపి గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకుంటారు. దీనివల్ల ఆ ప్రదేశాల చరిత్ర, సాంస్కృతిక విశేషాలు తెలుసుకుంటారు. ఇది మీకెంతో మేలు చేస్తుంది. నేరుగా తెలుస్తుందిఎప్పుడూ స్వీట్ తినని వారికి ఎంత చెప్పినా స్వీట్ అంటే ఏంటో తెలియదు. కేరళ ఎలా ఉంటుందో ఎన్ని వీడియోలు చూసినా నేరుగా చూడటంలోని మజా రాదు. కేరళ వెళితే హౌస్‌బోట్‌లో తిరుగుతున్నప్పుడు ఆ బ్యాక్‌వాటర్స్‌లో ఎంత బాగుంటుందో అనుభవించి రాస్తే ఆ ఫీలింగ్ వేరేగా ఉంటుంది. ప్రపంచంలో గొప్ప వారంతా నెలలో, మూడు నెలలకోసారి ఏదో ఒక కొత్త ప్రాంతానికి వెళతారు. ఎందుకంటే తిరిగితే నాలుగు విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు యూట్యూబ్ ట్రావెలర్స్ ఎందరో తిరుగుతూ వీడియోలు చేస్తూ సంపాదిస్తున్నారు కూడా. వేసవి సెలవులన్నీ నెక్స్ట్ క్లాస్ సబ్జెక్ట్స్ చదువుతూ వృథా చేయకండి. కిటికీ పక్కన ఒక్కసారైనా కూచోండి. కదలండి.– కె. (చదవండి: కళ్లకు గంతలు.. ‘కళ’అద్దే వింతలు..)

మాయమైపోతున్న మనిషి కోసం.. శాలిని
కళ్లెదుటే తండ్రి మరణాన్ని చూసి తట్టుకోలేకపోయింది సాగయా ఏంజిలిన్ శాలిని. తండ్రితో కలిసి హాస్టల్‌కు వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. సహాయం కోసం ఎంతోమందిని వేడుకుంది. సహాయం చేసే బదులు తనని ఆశ్చర్యంగా చూస్తూ ఎవరి దారిలో వారు వెళుతున్నారు.కొందరైతే తన విషాదాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి వీడియోలు తీస్తున్నారు!‘సాటి మనిషి బాధను పంచుకునే టైమ్, దయ మానవులలో ఎందుకు మాయం అవుతుంది?’ అనే కోణంలో ఆలోచించింది. ఆ విషాద సంఘటన శాలినిని మానసికంగా, ఆర్థికంగా కృంగదీసింది. రెండు నెలల పాటు బయటి ప్రపంచంలోకి రాలేదు. ‘జీవితంలో విషాదం ఒక భాగం అని అర్థం చేసుకునే పరిణతి నాలో ఆ సమయంలో లేదు’ అని గతాన్ని గుర్తు చేసుకుంది శాలిని. తన దుఃఖాన్ని ఇతరులతో పంచుకొని మనసు తేలిక చేసుకోవడానికి ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా తన బాధనే కాదు ఇతరుల బాధను కూడా పంచుకుంటుంది. యాక్సిడెంట్ సంఘటన తరువాత తనకు ఎదురైన చేదు అనుభవం గురించి శాలిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోకు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఆ స్పందనే ఒక కమ్యూనిటీ ఏర్పాటుకు దారి తీసింది.ఇదీ చదవండి: Cannes: అరంగేట్రంలోనే ఎదురు దెబ్బ, లగేజీ మొత్తం గాయబ్! View this post on Instagram A post shared by Shalini (@shalini_robert_) బాధితులకు తమ వంతు సహాయపడడానికి కమ్యూనిటీ ఏర్పాటైంది. తమిళనాడు నలుమూలల నుంచి ఈ కమ్యూనిటీలో వందలాది సభ్యులు ఉన్నారు. బాధితులకు నైతికస్థైర్యం ఇవ్వడం నుంచి ఆర్థిక సహాయం అందించడం వరకు ఈ కమ్యూనిటీ పనిచేస్తోంది. చెన్నైలోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది శాలిని. తమ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా అనాథాశ్రమాలకు వెళ్లడం, అక్కడి పిల్లలతో గడపడం శాలిని కటుంబ సభ్యులకు సంప్రదాయంగా వస్తుంది. ఆ సంప్రదాయమే శాలినిని సామాజిక సేవ వైపు అడుగులు వేసేలా చేసింది. సివిల్ ఇంజనీరింగ్ చేసిన శాలిని ΄ార్ట్ టైమ్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తూ వచ్చిన డబ్బులతో పిల్లలకు సహాయపడేది. తరచుగా అనాథాశ్రమాలకు వెళుతూ పిల్లల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరిస్తుంటుంది. ‘నేను మీకు సహాయం చేస్తాను’ అని హామీ ఇవ్వడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంది. ‘నిలబెట్టుకోలేని హామీని ఇచ్చి వారిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు’ అంటుంది శాలిని. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం నుంచి ఎవరైన చిన్న షాప్ పెట్టుకోవడం వరకు తనవంతుగా సహాయం చేస్తుంటుంది. చదవండి: తీవ్ర నష్టాల్లో లగ్జరీ ఫ్యాషన్ హౌస్, 1700 మందికి ఉద్వాసన‘ఆర్థిక సహాయం మాత్రమే కాదు.. ప్రేమ పంచుకోవడం, ఎమోషనల్ సపోర్ట్‌తో ఎందరో జీవితాల్లో మార్పు తేవచ్చు’ అంటుంది శాలిని. ‘నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు నాన్న చనిపోయారు. ఎప్పుడూ బాధలో ఉండేదాన్ని. ఆత్మవిశ్వాసం కోల్పోయాను. ఆ సమయంలో శాలిని అక్క నాలో ధైర్యం నింపింది. ఉత్సాహాన్ని ఇచ్చింది. నేను తిరిగి చదువుకునేలా చేసింది. ఆమె నా వెనకాల ఉంది అనే భావన ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది’ అంటుంది తెన్కాశీకి చెందిన పద్దెనిమిది సంవత్సరాల ఆశ్మీ. శాలినిని అభిమానించే వాళ్లలో ఆశ్మీలాంటి వాళ్లు ఎంతోమంది ఉన్నారు. వారి అభిమానమే తన బలం.రోడ్డు ప్రమాదంలో తండ్రి... సహాయం కోసం అరుస్తూనే ఉంది శాలిని. ఇలా చూసి అలా వెళ్లిపోతున్నారు కొందరు. కొందరైతే ఫోన్లో వీడియోలు తీస్తున్నారు. ...తన బాధను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది శాలిని. మాయమై΄ోతున్న మనిషి కోసం, మానవత్వం కోసం, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం కోసం ఆన్లైన్ కమ్యూనిటీని ఏర్పాటు చేయడంలో కీలక ΄ పాత్ర పోషించింది తమిళనాడుకు చెందిన శాలిని... అలా ఎప్పుడూ చేయలేదుఇతరుల బాధలను సొమ్ము చేసుకోవాలని, నేను చేసిన వీడియోలు వైరల్ కావాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు. నేను పోస్టు చేసిన 190 వీడియోలు నిజాయితీతో చేసినవి మాత్రమే. బాధితుల సమస్యలు నా దృష్టిలో కంటెంట్ కాదు. ఏదో విధంగా వీడియోలు చేసి సొమ్ము చేసుకోవడం తేలికైన విషయం కావచ్చు. అయితే అలాంటి వారు వేగంగా నమ్మకంగా కోల్పోవడానికి ఎంతో సమయం పట్టదు. – శాలిని

జస్ట్ డ్రెస్సింగ్ మాత్రమే కాదు..ట్రెండ్‌కి తగ్గ ఆభరణాలతో మెరవండిలా..!
చక్కటి ఆభరణాలు వస్త్రధారణలో ఒక ముఖ్యమైన భాగం, ఇది దుస్తులను మెరిపించడం మాత్రమే కాదు డ్రెస్సింగ్ వెలవెల పోయేలా చేసే శక్తి కూడా కలిగి ఉంటుంది. మెరవాలంటే ట్రెండ్‌కు అనుగుణంగా ఉంటే మాత్రమే సాధ్యం. అయితే ప్రతి సీజన్లో రకరకాల ట్రెండ్లు వస్తుండటంతో, ఏది అనుసరించాలో, ఏది వదిలివేయాలో ? అనే గందరగోళం తప్పదు. ఈ నేపథ్యంలో సిటీ జ్యువెలరీ డిజైనర్లు అందిస్తున్న సూచనలివి.. లేయరింగ్, స్టాకింగ్.. పలు రకాల లెంగ్త్ ఉన్న చైన్ పెండెంట్లను లేయర్‌లాగా ధరించవచ్చు. లేదా ఒకే వైపు పలు బ్రేస్లెట్లను ఒకటిగా పేర్చవచ్చు. ఆల్ పీసెస్ రంగులు కలిసి కనబడేలా చూసుకోవడమే ఖచి్చతమైన స్టాక్‌కు కీలకం. ఇవి ఒక సాధారణ బైండింగ్ కారకంగా ఉండాలి. షాండ్లియర్ చెవిపోగులు.. ఈ షాండ్లియర్ శైలి చెవిపోగులు అత్యధికంగా మహిళల్ని ఆకట్టుకుంటాయి. దుస్తులకు నప్పేలా అలంకరణకు ఇది సరైన మార్గం. వీటిని మరే ఇతర ఆభరణాలూ లేకుండా ధరించవచ్చు. డైమండ్ షాండ్లియర్స్ కావచ్చు లేదా జడౌ చంద్బాలిస్ కావచ్చు చెవిపోగులు మాత్రం తప్పనిసరిగా ఉండాలి. బోల్డ్ రింగులు.. ఒక పెద్ద డేరింగ్ రింగ్ ధరించడం రూపానికి అత్యాధునికతను జోడిస్తుంది. దీని కోసం ఓ అసాధారణమైన డిజైన్లను ఎంచుకోవాలి. రత్నం, సిగ్నెట్ పెద్ద వాస్తవిక పువ్వులు వంటివి మరింత అందాన్నిస్తాయి. జడౌ..జతగా.. ఏదైనా భారతీయ ఆభరణాల శైలిలో జడౌ నెక్లెస్ ధారణ తరతరాల వారసత్వంగా వస్తోంది. పూర్వ కాలంలో చాలా ఆభరణాలు మొఘల్ ఇతివృత్తంతో ప్రభావితమయ్యాయి, అయితే ప్రస్తుతం ఆధునిక ఆభరణాల తయారీలో పురాతన పద్ధతుల్లో ఏదైనా ఒకదానిని జత కలపడం ఒక ప్రత్యేకమైన కొత్త సంప్రదాయంగా మారింది. ఆ విధంగా జడౌ నెక్లెస్‌కు ఆదరణ పెరిగింది. ఆమె..ఆభరణం.. కాబోయే వధువు అయితే, పెళ్లి రోజు లుక్‌లో ఆభరణాలు అతి ముఖ్యమైన భాగం. పెళ్లి ఆభరణాలు, అవి ఏ వధువునైనా యువరాణిగా చూపించగలవు. పెళ్లి వేడుకల్లో భారీ నెక్‌పీస్ ఎంచుకుంటారు. అయితే ఇవి విడదీసి, ధరించగలిగేలా ప్రత్యేకంగా రూపొందుతాయి. అన్నీ కలిపినప్పుడు అవి గ్రాండ్‌లుక్‌ని సంతరించుకుంటాయి. అలాగే వివాహానంతరం కూడా వాటిని సందర్భానుసారం ధరించవచ్చు. ఆఫీస్..డైమండ్ పీస్.. పని విధానాలకు అనుగుణంగా అలాగే సాయంత్రం సమావేశాల్లో సమర్థవంతంగా మమేకమయ్యే అందమైన పీసెస్, సెన్సిటివ్ డైమండ్ హగ్గీలు లేదా సాలిటైర్ స్టడ్లు రోజువారీ డ్రెస్సింగ్‌కు సరైన ఎంపిక. ఆఫీసుకు ఇండియన్ ఫార్మల్స్ ధరించడం ఇష్టపడితే, డైమండ్ సరౌండ్‌తో లేదా ఒక జత సింగిల్ పోల్కీ ఇయర్ స్టడ్‌తో సరిపెట్టొచ్చు. (చదవండి: కళ్లకు గంతలు.. ‘కళ’అద్దే వింతలు..)
ఫొటోలు
అంతర్జాతీయం

అమెరికా ఉత్పత్తులకు భారత్‌లో జీరో టారిఫ్!
దోహా: భారత్, పాక్ పరస్పర సైనిక చర్యలతో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా ఉన్న వేళ కాల్పుల విరమణకు ఇరుదేశాలు సమ్మతించాయని అందరికంటే ముందే ప్రకటించి అభాసుపాలైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోమారు తొందరపాటు ప్రకటన చేశారు. టారిఫ్‌లు విధించకుండానే అమెరికా నుంచి వస్తూత్పత్తుల దిగుమతికి భారత్ అత్యుత్సాహం చూపిస్తోందని ట్రంప్ గురువారం అనూహ్య ప్రకటన చేశారు. దీంతో వెంటనే భారత్ స్పందించింది. అలాంటిదేమీ లేదని, టారిఫ్‌ల ఖరారుపై విస్తృతస్థాయిలో చర్చలు జరుగుతు న్నాయని, చర్చలు ఇప్పట్లో ముగిసిపోవని భారత్ స్పష్టంచేసింది. జీరో టారిఫ్ ప్రతిపాదన లేదని కుండబద్దలు కొట్టింది.మోదీ మౌనమేల?: కాంగ్రెస్ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఎందుకు స్పందించట్లేరని విపక్ష కాంగ్రెస్ ప్రశ్నించింది. ‘‘ అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఖరారు చర్చల కోసం మన వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వాషింగ్టన్ డీసీలో పర్యటిస్తున్నారు. ఇదే సమయంలో ట్రంప్ జీరో టారిఫ్ అంటూ ప్రకటన చేశారు. ఈ సున్నా టారిఫ్‌కు, ఆపరేషన్ సిందూర్ ఆగిపోవడానికి మధ్య సంబంధమేంటి?. ఈ అంశంలో మోదీ ఎందుకు మౌనం వహించారు?. అమెరికాతో డీల్ కుదుర్చుకునేందుకు మోదీ ఏమేం అంశాల్లో తలూపారు?’’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాంరమేశ్ ‘ఎక్స్’లో ప్రశ్నించారు.ట్రంప్ ఏం మాట్లాడారు?గురువారం ఖతార్ రాజధాని దోహాలో వ్యాపారదిగ్గజాలు, సంస్థలతో ట్రంప్ సమావేశమయ్యారు. చైనా, అమెరికా టారిఫ్‌ల యుద్ధం నేపథ్యంలో భారత్‌లో అత్యధికంగా ఐఫోన్లను తయారుచేసి అమెరికాకు ఎగుమతి చేయబోతున్నట్లు యాపిల్ సంస్థ ఇటీవల ప్రకటించడం తెల్సిందే. ఈ విషయం నచ్చని ట్రంప్ ఇదే అంశాన్ని దోహా భేటీలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ వద్ద ప్రస్తావించారు. ‘‘అమెరికాలో యాపిల్ సంస్థను ఇంతబాగా చూసుకుంటున్నా మీరేమో భారత్‌లో ఐఫోన్లను మరింత ఎక్కువగా తయారుచేస్తామంటున్నారు. అక్కడే కర్మాగారాలను విస్తరిస్తున్నారు. ఇది నాకు అస్సలు నచ్చలేదు. అమెరికా ఉత్పత్తులపై భారత్ చాలా ఎక్కువ టారిఫ్‌లు విధిస్తోంది. ప్రపంచంలో అధిక టారిఫ్‌లు విధించే దేశాల్లో భారత్ కూడా ఉంది. టారిఫ్‌లు పెంచాక అత్యధిక ధరలకు మీరు భారత్‌లో వస్తువులను విక్రయించడం చాలా కష్టమవుతుంది. మీకో విషయం చెప్పనా. అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి భారత్ ఒక చక్కని ప్రతిపాదన తెచ్చింది. అసలు టారిఫ్‌లే లేకుండా వస్తువులను భారత్‌లోకి దిగుమతి చేసుకోవడానికి వాళ్లు దాదాపు అంగీకారం తెలిపారు. మీరు భారత్‌లో ఐఫోన్ల తయారీ కర్మాగారాలను నిర్మించినా అక్కడి సర్కార్ మిమ్మల్ని అస్సలు పట్టించుకోలేదు. వాళ్లకు స్వప్రయోజనాలే ముఖ్యం’’ అని టిమ్‌కుక్‌తో ట్రంప్ మాట్లాడారు. ఈ విషయాలను మీడియాకు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. తనతో మాట్లాడిన తర్వాత అమెరికాలో ఉత్పత్తి పెంచేందుకు టిమ్‌కుక్ అంగీకారం తెలిపారని ట్రంప్ ప్రకటించారు. భారతీయ ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్ విధిస్తామని ట్రంప్ ఏప్రిల్ 9వ తేదీన ప్రకటించారు. అయితే 90 రోజులపాటు ఈ పెంపును తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు తర్వాత ట్రంప్ వెల్లడించడం తెల్సిందే.ఖండించిన భారత్ట్రంప్ మాటల్లో వాస్తవం లేదని భారత్ గురువారం ప్రకటించింది. ఈ విషయమై భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పందించారు. ‘‘ టారిఫ్లుసహా సమగ్ర వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికా మధ్య విస్తృతస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఇవి సంక్లిష్టమైనవి. చర్చలు ముగిసిపోలేదు. ప్రతి అంశంపైనా కూలంకషంగా చర్చ జరుగుతోంది. ఇప్పటిదాకా ఏ అంశంపైనా తుది నిర్ణయాలు వెలువడలేదు. ఒప్పందం కుదుర్చుకుంటే అది ఇరుపక్షాలకు ప్రయోజనకారిగా ఉండాలి. రెండు దేశాలకూ లబ్ధిచేకూరాలి. మేం ఇదే కోరుకుంటున్నాం. చర్చలు పూర్తికాకుండానే దీనిపై మాట్లాడటం తొందరపాటు చర్యే అవుతుంది’’ అని జైశంకర్ వ్యాఖ్యానించారు. 2024లో ఇరుదేశాల మధ్య 129 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యం జరిగింది.

తుర్కియేను కుదిపేసిన భూకంపం.. భయంతో జనం పరుగులు
తుర్కియేలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.2గా నమోదైయినట్లు ఆ దేశ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ భూకంపం కారణంగా ఇస్తాంబుల్‌లో బలమైన ప్రకంపనలు రాగా, ఇళ్లలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా భయందోళనకు గురై.. ప్రాణ భయంతో ప్రజలంతా రోడ్లపైకి పరుగులు పెట్టారు. ఈ క్రమంలో రహదారులపై వెళ్తున్న కార్లు భూకంప తీవ్రతకు ఊగిపోయాయి.ఈ భూకంపం టర్కీలోని సెంట్రల్ అనటోలియా ప్రాంతంలోని కోన్యా ప్రావిన్స్‌ను తాకినట్లు సమాచారం. భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని సమాచారం. భూకంపానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలొ వైరల్‌గా మారాయి. భూకంపం కారణంగా భయాందోళనలకు గురైన కొందరు భవనాల నుండి దూకడానికి ప్రయత్నించగా.. కొందరు గాయపడినట్లు సమాచారం. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.🚨BIG BREAKING: Earthquake HITS Turkey🇹🇷 pic.twitter.com/Hd6NEFu15t— Manobala Vijayabalan (@ManobalaV) May 15, 2025

బహమాస్‌లో భారత విద్యార్థి మృతి
బోస్టన్: భారత సంతతికి చెందిన ఓ అమెరికా విద్యార్థి బహమాస్ ద్వీపంలో ప్రమాదవశాత్తూ మరణించాడు. 25 ఏళ్ల గౌరవ్ జైసింగ్ అమెరికాలో బెంట్లీ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ చదువుతున్నాడు. శనివారం వర్సిటీ అండర్ గ్రాడ్యుయేషన్ వేడుక నేపథ్యంలో సీనియర్ విద్యార్థులు బహమాస్ పర్యటనకు వెళ్లారు. అట్లాంటిస్ ప్యారడైజ్ ఐలాండ్ రిసార్ట్ అండ్ క్యాసినోలో బస చేశారు. మే 11 రాత్రి హోటల్ గదిలో మిత్రులతో కలిసి గడుపుతున్న గౌరవ్ పై అంతస్తు బాల్కనీ నుంచి పడిపోయాడు. అత్యవసర వైద్యం అందించి ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించినట్టు పోలీసులు తెలిపారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందని ధ్రువీకరించారు. దర్యాప్తు కొనసాగు తోంది. బోస్టన్‌కు 12 మైళ్ల దూరంలో ఉండే బెంట్లీ ఓ చిన్న ప్రైవేట్ విశ్వవిద్యాలయం.

ఇవేంటి! ఇంత అద్భుతంగా ఉన్నాయ్!
దోహా: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశానికి అధ్యక్షుడు. అపర కుబేరుడు. అలాంటి ట్రంప్ సౌదీ అరేబియా, ఖతార్ అధినేతల ప్రాభవం చూసి నోరెళ్లబెట్టారు. వారి రాజభవనాలను చూసి అసూయపడ్డానని స్వయంగా చెప్పారు. ఖతార్ రాజప్రాసాదాల ఠీవి, సౌకర్యాలు చూసి, ‘‘ఇవేంటి ఇంత అద్భుతంగా ఉన్నాయి! వీటిని జీవితంలో కొనలేం’’ అని వ్యాఖ్యానించారు. తన అత్యాధునిక ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విమానం కంటే అత్యంత విలాసవంత, అధునాతన బోయింగ్–747 రకం విమానాలను ఖతార్, సౌదీల్లో చూశానని చెప్పుకొచ్చారు. ఖతార్ నుంచి విమానాన్ని కానుకగా తీసుకోవడానికి సంకోచించబోనని బల్లగుద్దిమరీ చెప్పారు. ఖతార్ పాలకుడు అమీర్ తమీమ్ బిన్ హమాద్ అల్ థానీ రాజభవనం ‘అమీర్ దివాన్’ను చూసి దిగ్భ్రాంతికి లోనయ్యానని వెల్లడించారు. ‘‘స్వతహాగా నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని. నిర్మాణ నైపుణ్యం, కట్టడాల నేర్పు ఇట్టే పసిగడతా. మీ నివాసాలు భూలోక స్వర్గాలు. ఇంద్రభవనాలు. ఎంత పర్ఫెక్ట్గా కట్టారో!’’ అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు.
జాతీయం

కళ్లకు గంతలు కట్టారు.. దూషించారు..
న్యూఢిల్లీ: అనుకోకుండా సరిహద్దు దాటి పాక్ రేంజర్ల చేతికి చిక్కిన బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షాను భారత్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. విడుదల అనంతరం పాకిస్తాన్ కస్టడీలో ఉన్న 21 రోజుల అనుభవాలను బీఎస్ఎఫ్ అధికారులతో షా పంచుకున్నారు. షా నిర్బంధంలో ఉన్నంత కాలం, పాకిస్తాన్‌లోని మూడు గుర్తుతెలియని ప్రదేశాలకు తీసుకెళ్లారు. ఆ ప్రదేశాల్లో ఒకటి ఎయిర్‌బేస్ సమీపంలో ఉంది. కళ్లకు గంతలు కట్టి ఉంచడంతో.. విమాన శబ్దాలను బట్టి అది ఎయిర్‌బేస్‌గా షా గుర్తించారు. ఇక మరో ప్రదేశంలో జైలు గదిలో కొన్ని రోజులు ఉంచారు. కస్టడీలో ఉన్నన్ని రోజులు కళ్లకు గంతలు కట్టారు. నిద్రలేకుండా చేశారు. దూషించారు. కనీసం పళ్లు తోముకోవడానికి కూడా అనుమతించలేదు. శారీరకంగా హింసించకపోయినా.. సరిహద్దు వెంబడి బీఎస్ఎఫ్ భద్రతాదళాల గురించి ప్రశ్నించారు. అంతర్జాతీయ సరిహద్దులో ఉన్న సీనియర్ అధికారుల వివరాలు చెప్పాలంటూ ఆయనపై ఒత్తిడి తెచ్చారు. అయినా షా వేటికీ సమాధానం ఇవ్వలేదు. బీఎస్ఎఫ్ ప్రోటోకాల్ ప్రకారం.. విధుల్లో ఉండగా సెల్‌ఫోన్ వినియోగం నిషేధం. అందుకే షా పట్టుబ డిన సమయంలో అతని దగ్గర మొబైల్ ఫోన్ లేదు. దీంతో వివరాలేవీ పాకిస్తాన్ అధికారులకు దొరకలేదు. పాక్ కస్టడీ నుంచి వచి్చన షాపై బీఎస్ఎఫ్ అధికారులు విచారణ, వైద్య పరీక్షలు పూర్తి చేశారు. ప్రోటోకాల్ ప్రకారం, పాకిస్తాన్ కస్టడీలో ఉండగా ఆయన ధరించి ఉన్న దుస్తులను తనిఖీ చేసి, పారవేశారు. ఆయన శారీరకంగా, మానసికంగా స్థిరంగా ఉన్నారని సమాచారం. ఏప్రిల్ 23న విశ్రాంతికోసం ఓ చెట్టునీడకు చేరిన షా.. అనుకోకుండా సరిహద్దు దాటాడు.

ఆ భయంతోనే కులగణనకు మోదీ అంగీకారం
దర్భంగా/పట్నా: దేశంలో అణగారిన వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందన్న భయంతోనే కులగణనకు ప్రధాని నరేంద్ర మోదీ అంగీకారం తెలిపారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. కులగణనకు మద్దతుగా ప్రజల తరఫున ప్రతిపక్షాలు గళం విప్పాయని అన్నారు. గురువారం బిహార్ రాష్ట్రం దర్భంగా జిల్లాలోని మిథిలా యూనివర్సిటీ అంబేడ్కర్ హాస్టల్లో ‘శిక్షా న్యాయ్ సంవాద్’లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. దళిత, వెనుకబడిన వర్గాల విద్యార్థులతో సమావేశమయ్యారు. అంతకుముందు యూనివర్సిటీకి చేరుకోకుండా అధికారులు అడ్డంకులు సృష్టించినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. యూనివర్సిటీ గేటు వద్ద తన వాహనాన్ని నిలిపివేశారని, దాంతో వాహనం దిగి మరో మార్గంలో నడుచుకుంటూ వచ్చానని రాహుల్ తెలిపారు. ప్రజలు తనకు కొండంత బలం ఇచ్చారని, అందుకే బిహార్ ప్రభుత్వం తనను అడ్డుకోలేకపోయిందని అన్నారు. ఈ ప్రజాబలం ముందు ప్రధాని మోదీ సైతం తలవంచాల్సిందేనని స్పష్టంచేశారు. భారత రాజ్యాంగాన్ని తలతో తాకాలని మోదీకి చెప్పామని, చివరకు ఆయన ఆ పని చేయక తప్పలేదని అన్నారు. దేశమంతటా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశామని, దానికి కూడా ఒప్పుకున్నారని గుర్తుచేశారు. పేదలు, అణగారిన వర్గాల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందన్న భయంతోనే మోదీ ఈ రెండింటికీ అంగీకరించారని రాహుల్ గాంధీ వెల్లడించారు. అంబానీ, అదానీల సేవలో మోదీ సర్కారు తరిస్తోందని మండిపడ్డారు. దేశంలో కేవలం ఐదు శాతం ఉన్న ధనవంతుల బాగు కోసమే మన వ్యవస్థలు పని చేస్తున్నాయని ఆరోపించారు. దళితులు, గిరిజనుల, ఓబీసీలను పట్టించుకొనే దిక్కే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం, కార్పొరేట్ ప్రపంచం, మీడియాలో వారికి స్థానం దక్కడం లేదన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లోనూ రిజర్వేషన్లు మూడు ప్రధాన డిమాండ్లపై యువత ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గొద్దని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించినట్లుగానే దేశవ్యాప్తంగా కులగణన పక్కాగా నిర్వహించాలని అన్నారు. ప్రైవేట్ కాలేజీలు, యూనివర్సిటీల్లోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని తేల్చిచెప్పారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కింద కేటాయించిన నిధులను ఆయా వర్గాల సంక్షేమం కోసం జాప్యం లేకుండా విడుదల చేయాలన్నారు. ఎన్డీయే పాలనలో పెద్దగా ఆశించలేమని.. కేంద్రంలో, రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చాక యువత సంక్షేమం, అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యాసంస్థల్లో వెనుకబడిన వర్గాల వారి పట్ల వివక్ష కొనసాగుతోందని, మీడియాలో బీసీల ప్రాతినిధ్యం లేదని, ఈ అంశాలను పార్లమెంట్లో ప్రస్తావించాలని రాహుల్ గాంధీని ఓ విద్యార్థి కోరారు. ‘ఫూలే’ చిత్రం తిలకించిన రాహుల్ రాహుల్ గాంధీ గురువారం బిహార్ రాజధాని పాట్నాలోని సినిమా హాల్లో హిందీ చిత్రం ‘ఫూలే’ను తిలకించారు. బిహార్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సైతం రాహుల్‌తో కలిసి ఈ సినిమా చూశారు. 19వ శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత సామాజిక ఉద్యమకారుడు, సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల జీవితం ఆధారంగా ఫూలే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

ముగ్గురు జైషే ఉగ్రవాదుల హతం
త్రాల్: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా, త్రాల్ ప్రాంతంలోని నాదిర్ గ్రామంలో భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు మృతి చెందారు. గురువారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన ముగ్గురు ఉగ్రవాదులను ఆసిఫ్ అహ్మద్ షేక్, అమీర్ నజీర్ వని, యావర్ అహ్మద్ భట్‌గా గుర్తించారు. వీరందరూ పుల్వామా జిల్లా వాసులే. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు నిర్దిష్ట సమాచారం అందుకున్న భద్రతా దళాలు కార్డన్, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఉగ్రవాదుల జాడ కోసం భద్రతాదళాలు డ్రోన్లను ఉపయోగించాయి. ఉగ్రవాదులను గుర్తించిన అనంతరం.. లొంగిపోవాలని కోరాయి. అయితే, భద్రతా సిబ్బందిని చూసిన వెంటనే, ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. మూడు గంటల పాటు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. ఆ ప్రాంతంలో ఇంకా ఉగ్రవాదులు ఉండొచ్చని భద్రతా దళాలు భావిస్తున్నాయి. దీంతో ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. జమ్మూకశ్మీర్‌లో 48 గంటల్లో జరిగిన రెండో ఎన్కౌంటర్ ఇది. మంగళవారం షోపియాన్ జిల్లాలోని కెల్లర్ ప్రాంతంలో జరిగిన ఆపరేషన్‌లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయిన సంగతి తెలిసిందే.లొంగిపోవాలని తల్లి వేడుకున్నా...మరణించిన ఉగ్రవాదుల్లో ఒకరైన అమీర్ నజీర్ ఎన్‌కౌంటర్‌కు ముందు తల్లితో మాట్లాడిన వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఎన్‌కౌంటర్‌కు ముందు చివరి క్షణాల్లో నజీర్ తను దాక్కున్న ప్రదేశం నుంచి తల్లికి వీడియో కాల్ చేశాడు. తన తల్లితో, సోదరితో మాట్లాడాడు. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవద్దని, భద్రతాదళాలకు లొంగి పోవాలని నజీర్‌ను తల్లి వేడుకుంది. ఏకే 47 పట్టుకుని ఉన్న నజీర్ లొంగిపోవడానికి నిరాకరించాడు. ‘సైన్యాన్ని నా ముందుకు రానివ్వండి. అప్పుడు చూస్తా’ అని బదులిచ్చి కాల్ కట్ చేశాడు.

పాక్ అణ్వాయుధాలను మీరే పర్యవేక్షించాలి
శ్రీనగర్: అత్యంత దుష్ట దేశమైన పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలు ఉండడం ప్రపంచానికి ఎప్పటికైనా ప్రమాదకరమేనని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తేల్చిచెప్పారు. వాటిని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(ఐఏఈఏ) పర్యవేక్షణలోకి తీసుకురావాలని అన్నారు. పాక్ అణ్వాయుధాలు ఐఏఈఏ పరిధిలో ఉంటేనే ప్రపంచ భద్రతకు ముప్పు వాటిల్లదని స్పష్టంచేశారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత రాజ్‌నాథ్ సింగ్ తొలిసారిగా గురువారం జమ్మూకశ్మీర్‌లో పర్యటించారు. పహల్గాం ఉగ్రవాద దాడి మృతులతోపాటు పాకిస్తాన్‌పై దాడిలో ప్రాణత్యాగం చేసిన జవాన్లకు నివాళు లర్పించారు. శ్రీనగర్‌లోని బాదామీబాగ్ కంటోన్మెంట్లో సైనికులను ఉద్దేశించి మాట్లాడా రు. పాక్ అణు బెదిరింపులను భారత్ ఏమాత్రం లెక్కచేయలేదని గుర్తుచేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేసే విషయంలో మన పట్టుదలను దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చని అన్నారు. భారత్‌పై అణ్వాయుధాలు ప్రయోగిస్తామని పాక్ ఎన్నోసార్లు బెదిరించిందని తెలిపారు. పాక్ నిజస్వరూపం ప్రపంచం మొత్తం చూసిందని పేర్కొన్నారు. ధూర్త దేశం చేతిలో అణ్వాయుధాలు ఉండడం సరైనదేనా? అని ప్రపంచ దేశాలను రాజ్‌నాథ్ ప్రశ్నించారు. అందుకే పాక్ అణ్వాయుధాలను ఐఏఈఏ పరిధిలోకి తీసుకురావాలని స్పష్టంచేశారు. ఉగ్రవాదంపై మన పోరాటంలో ‘ఆపరేషన్ సిందూర్’ అతిపెద్ద చర్య అని వెల్లడించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించే విషయంలో ఎంతదూరమైన వెళ్తామని నిరూపించామని పేర్కొన్నారు.
ఎన్ఆర్ఐ

TANA: ‘ఆంధ్ర బాలానంద సంఘం’ ముచ్చట్లు విజయవంతం
డాలస్, టెక్సస్, అమెరికా: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా “రేడియో అన్నయ్య, అక్కయ్య గార్ల స్మృతిలో – “85 వసంతాల ఆంధ్ర బాలానంద సంఘం ముచ్చట్లు” అనే అంశంపై జరిపిన 79 వ అంతర్జాల అంతర్జాతీయ దృశ్య సమావేశం పెద్దల ప్రసంగాలు, బాలానందం పిల్లల పాటలతో కోలాహలంగా జరిగింది.తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు పాల్గొన్న అతిథులందరికీ స్వాగతం పలుకుతూ, బాలలకోసం ఏర్పడిన ఒక సంస్థ 85 వసంతాలు జరుపుకోవడం వెనుక ఈ సంస్థ స్థాపకులైన రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య గార్ల కృషి ఎంతైనా ఉందని అన్నారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు, డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “పిల్లలకు పసిప్రాయంలోనే గేయాలు, రూపకాలు, ఆటలు, పాటలతో తెలుగు భాష, సాహిత్యంపట్ల ఆసక్తి కల్గించి, వారిలో క్రమశిక్షణ, మానసిక వికాసం, విజ్ఞానం, సృజనాత్మకత, నాయకత్వ ప్రతిభను కల్గించడంలో ఆకాశవాణిలో కొన్ని దశాబ్దాలపాటు వారం వారం ‘బాలానందం’ కార్యక్రమంతో పిల్లలకు పెద్దపీట వేసిన రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య గార్ల కృషి అజరామరం అన్నారు. పిల్లలకు చిన్నవయస్సులోనే ఇలాంటి విషయాల పట్ల అవగాహన, ఆసక్తినికల్గించి సరైన దిశానిర్దేశం చెయ్యవలసిన బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు. ప్రత్యేక అతిథులుగా పాల్గొన్న శారదా శ్రీనివాసన్ (రేడియో హీరోయిన్, సుప్రసిద్ధ ఆకాశవాణి కళాకారిణి), డా. మండలి బుద్ధప్రసాద్ (అవనిగడ్డ శాసనసభ్యులు, రేడియో అన్నయ్య, అక్కయ్యగార్లతో ప్రత్యక్ష పరిచయం ఉన్నవారు), పద్మభూషణ్ పురస్కార గ్రహీత డా. కె.ఐ. వరప్రసాదరెడ్డి (బాలానంద కార్యక్రమాలను ఆస్వాదించినవారు), డా. మోహన్ కందా, ఐ.ఎ.ఎస్ (ఆంధ్రప్రదేశ్ పూర్వ ప్రధాన కార్యదర్శి, బాలానంద సంఘ పూర్వసభ్యులు), జంధ్యాల కామేశ్వరి-పాప (రేడియో అన్నయ్య గారి మేనకోడలు, ఆంధ్ర బాలానంద సంఘం అధ్యక్షులు), కలగా కృష్ణమోహన్ (బాలానందం పూర్వ సభ్యులు, ఆంధ్ర బాలానంద సంఘం ఉపాధ్యక్షులు, ప్రముఖ గీత రచయిత, సంగీత దర్శకులు) బాలానందం కార్యక్రమంతోను, రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లతో తమకున్న ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలతోపాటు ఎన్నో ఆసక్తికర విశేషాలను పంచుకుని వారికి ఘననివాళులర్పించారు. విశిష్టఅతిథులుగా - ఎన్.వి. అశోక్ (విశ్రాంత ఇంజనీర్, ‘బాలానందం’ పూర్వసభ్యులు), రావులపర్తి రాజేశ్వరి (విశ్రాంత బ్యాంకు అధికారి, ‘బాలానందం’ పూర్వ సభ్యురాలు),నండూరి సీతా సాయిరాం (విశ్రాంత ఉపాధ్యాయిని, ‘బాలానందం’ పూర్వ సభ్యురాలు),మాడభూషి బద్రినాథ్ (బాలానందం-నృత్య దర్శకులు), డా. ఆవుల హరిత (బాలానందం-కార్యవర్గ సభ్యురాలు), చినముత్తేవి కరుణ (బాలానందం-గాయకబృందం, శిక్షణా విభాగపు కార్యవర్గసభ్యురాలు), మాలెంపాటి నవ్య (ఐఐటి ఖర్గపూర్, ‘బాలానందం’ సంగీత, నృత్య కళాకారిణి), గోవిందు దేవరాజ (బాలానందం-గాయకబృందం, శిక్షణా విభాగపు కార్యవర్గసభ్యులు) పాల్గొని తమ స్వీయ అనుభవాలను, రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లు ఎంతో దూరదృష్టితో స్థాపించిన ఆంధ్ర బాలానందం సంఘం తమ పిల్లల జీవితాలలో తీసుకువచ్చిన మార్పులను వివరించి వారిరువురికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అన్నారు. తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ - ఒక సంస్థ ఎనిమిదన్నర దశాబ్దాలగా నిరాటంకంగా కొనసాగడం ఒక చరిత్ర అని, ఏ ఆశయంతో రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లు ఈ బాలానందం స్థాపించారో, అదే స్ఫూర్తితో ఉత్సాహంగా ఆంధ్ర బాలానంద సంఘం నిర్వహిస్తున్న అధ్యక్షురాలు జంధ్యాల కామేశ్వరి (పాప) వారి కార్యవర్గ సభ్యులకు, ఈ నాటి కార్యక్రమంలో శ్రావ్యంగా పాటలు పాడి ఆనందపరిచిన 25 మందికి పైగా పిల్లలకు, పాల్గొన్న అతిథులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 6 వ వార్షికోత్సవ వేడుకలు
స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 6 వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు హాజరయ్యారు. సింగపూర్ లోని తెలుగు వారంతా అన్ని విధాలా సుసంపన్నులని ఈ విధంగా లలిత కళలను ప్రోత్సహించడం ఆనంద దాయకమన్నారు. చిన్నారులు పాడిన పాటలు ఎంతో బాగున్నాయి అని , ఇంత చక్కగా నేర్పిన గురువును నేర్చుకున్న వారి శిష్యులను వారి తల్లిదండ్రులను ప్రశంసించారు. సంగీతం, నాట్యం వంటి కళల ద్వారా మనలో మృదుత్వం కలుగుతుందని, నేటి యాంత్రిక జీవితంలో ఈ మాధ్యమం ఎంతో ముఖ్యం అని కాబట్టి కళల పైన ఉన్న ఆసక్తిని తమ తమ ఆర్థిక సంపాదన రధ చక్రాల కింద పడి నలిగి పోనివ్వవద్దని కోరారు.ఈ కార్యక్రమానికి STS వైస్ ప్రెసిడెంట్ జ్యోతీశ్వర్ , శ్రీ సాంస్కృతిక కలసారథి అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్,TCSS అధ్యక్షులు గడప రమేష్, TAS (మనం తెలుగు ) అసోసియేషన్ అనిత రెడ్డి , కమల క్లబ్ మాజీ అధ్యక్షులు, సారీ కనెక్షన్ అడ్మిన్ పద్మజ నాయుడు , మగువ మనసు అడ్మిన్ వీర మాంగోస్ ఉష , సింగపూర్ తెలుగు టీవి రాధాకృష్ణ గణేశ్న , జయంతి రామ, భాగవత ప్రచార సమితి భాస్కర్ ఊలపల్లి, H& H శ్యామల , విష్ణు ప్రియ , సింగపూర్ తెలుగు వనితలు అడ్మిన్స్ క్రాంతి, దేదీప్య, జయ, ప్రత్యూష , అమ్ములు గ్రూపు నుండి అడ్మిన్ సునీత రామ్, , KCAS దివ్య ఇంకా పలువురు సింగపూర్ తెలుగు కమ్యూనిటీ వ్యవస్థాపకులు హాజరయి అందరూ కలిసి వైస్ ఛాన్స్‌లర్‌ను సన్మానించారు. స్వరలయ ఆర్ట్స్, సింగపూర్ వ్యవస్థాపక అధ్యక్షురాలు యడవల్లి శేషుకుమారి వారి శిష్యులు,స్నేహితులు కీర్తనలను ఆలపించారు. పద్మజ నాయుడు మాట్లాడుతూ శేషు గాన కోకిల అని పొగడగా ఆచార్య నిత్యానందరావు గారు కోకిల ఒక కాలంలో మాత్రమే పాడుతుందని కాని ఈమె 365 రోజులు గానం ఆలపిస్తారు అన్నారు. శ్యామల మాట్లాడుతూ వారి వెంకటేశ్వర గానామృతం కార్యక్రమానికి శేషు కుమారి 70 పాటలు 40 రాగాలలో స్వర పరిచి మూడున్నర గంటల సేపు పాడి అందరినీ అలరించిన వైభవం గుర్తు చేసి ఈ రోజుకి ఆ పాటలు తమ చెవులలో ప్రతి ధ్వనిస్తూ పరవసింప చేస్తాయని ప్రశంసించారు.పొట్టి శ్రీరాములు, తెలుగు విశ్వవిద్యాలయం సర్టిఫికేట్ కోర్సు మొదటి వత్సరం, రెండవ సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన స్వరలయ ఆర్ట్స్ విద్యార్థులకు వైస్ ఛాన్స్ లర్ బహుమతి ప్రధానం చేశారు. అతిథులకు మొమెంటోలను బహుకరించారు ఈ నెల ఆరవ తారీఖున స్వరలయ ఆర్ట్స్ వారు నిర్వహించిన త్యాగ రాజ ఆరాధన ఉత్సవాలలో పాల్గొని తమతో కలిసి పంచరత్నాలు పాడిన సౌభాగ్య లక్ష్మి తంగిరాల, షర్మిల చిత్రాడ, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, రాధికా నడదూర్, ప్రియ లకు మొమెంటోలను బహుకరించారు. శివ కుమార్ మృదంగం పై వాయిద్య సహకారం అందించారు ఈ కార్యక్రమానికి శ్రీమతి చైతన్య వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పలువురినీ లలిత కళారంగంలో ఉత్సాహ పరుస్తూ ముందుకు నడిచే ఇటువంటి కార్యక్రమానికి దాదాపుగా 200 మంది హాజరు కావటమే కాకుండా, సాంఘిక మాధ్యమాల ద్వారా కూడా వీక్షించి విశేషస్పందనలను తెలియజేయటం అభినందనీయం.

9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ’’ విశేష సంచిక ఆవిష్కారం
ఖతార్ దేశ రాజధాని దోహా మహానగరంలో 2024 నవంబర్‌లో జరిగిన "9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు" యొక్క సభా విశేష సంచిక అంతర్జాల మాధ్యమంలో ఆదివారం ఆవిష్కరించారు. 'వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా' ,'ఆంధ్ర కళా వేదిక - ఖతార్' సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహింపబడి, మధ్య ప్రాచ్య దేశాలలోనే తొలి సాహితీ సదస్సుగా రికార్డును సృష్టించిన ఈ '9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో పది దేశాల నుండి పాల్గొన్న వక్తలు, కవులు, రచయితలు ప్రసంగించిన అన్ని అంశాలను పొందుపరుస్తూ 380 పేజీలతో ఈ సభా విశేష సంచిక రూపొందించబడింది. ఈ ఉద్గ్రంధానికి సంపాదకులుగా రాధికా మంగిపూడి, విక్రమ్ సుఖవాసి, వంగూరి చిట్టెన్ రాజు, లక్ష్మి రాయవరపు, శాయి రాచకొండ వ్యవహరించారు.సదస్సు నిర్వాహకవర్గము, సంచిక సంపాదకులు, సదస్సులో వివిధ దేశాల నుండి పాల్గొన్న వక్తలు, రచయితలు అందరి సమక్షంలో ఈ పుస్తక ఆవిష్కరణ జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకించి అంతర్జాల మాధ్యమంలో ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. మరిన్నిNRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపకులు డా. వంగూరి చిట్టెన్ రాజు, ఖతార్ ఆంధ్ర కళా వేదిక నుండి విక్రమ్ సుఖవాసి ప్రధాన నిర్వాహకులుగా, వారి అధ్యక్షతన, రాధిక మంగిపూడి సభానిర్వహణలో దాదాపు మూడు గంటల పాటు ఆదివారం సాయంత్రం నిర్వహింపబడిన ఈ కార్యక్రమంలో భారత్, ఖతార్, అమెరికా, సౌదీ అరేబియా, బహరైన్, యూఏఈ, సింగపూర్ తదితర దేశాలనుండి వక్తలు, తెలుగు సంస్థల ప్రతినిధులు, రచయితలు పాల్గొన్నారు.అమెరికా నుండి చెరుకూరి రమాదేవి, శాయి రాచకొండ, భారత్ నుండి డా. వంశీ రామరాజు, డా. అద్దంకి శ్రీనివాస్, డా. బులుసు అపర్ణ, ఆచార్య అయ్యగారి సీతారత్నం, ఆచార్య త్రివేణి వంగారి, కస్తూరి అలివేణి, డా. దేవులపల్లి పద్మజ తదితరులు, బహరైన్ నుండి మురళీకృష్ణ, సౌదీ అరేబియా నుండి కోనేరు ఉమామహేశ్వరరావు, చివుకుల పట్టాభిరామ శర్మ, సింగపూర్ నుండి కవుటూరు రత్నకుమార్, యూఏఈ నుండి షేక్ రఫీ, డా. తాడేపల్లి రామలక్ష్మి, ఖతార్ నుండి శ్రీసుధ, గోవర్ధన్ రెడ్డి, మనీష్, మాధవి లలిత, గౌరీ బొమ్మన తదితరులు ఆసక్తిగా పాల్గొని సదస్సు యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.ఈ సభా విశేష సంచికలో నిర్వాహక సంస్థల పరిచయాలు, అధ్యక్షుల, సంచాలకుల ముందుమాటలు, సదస్సు ప్రకటనలు, వక్తలందరి ఫోటోలు, వ్యాసాలు, కథలు, కవితలతో పాటు, సదస్సు అనంతరం అందరూ అందించిన స్పందనలు కూడా జోడించడం, ఆనందంగా ఉందని, జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ సంచిక ఉందంటూ సంపాదకులను నిర్వాహకులను అభినందించారు.డా. వంగూరి చిట్టెన్ రాజు మాట్లాడుతూ "మధ్యప్రాచ్య దేశాలలో తెలుగు సాహిత్య అభిమానులందరికీ ఈ సదస్సు కొత్త స్ఫూర్తిని అందించిందని, సదస్సు ప్రభావం వలన ఎంతోమంది సాహిత్యంపై చక్కటి ఆసక్తి పెంచుకోవడం, కొత్త రచయితలు జనించడం.. ఆనందదాయకమని తెలియజేశారు. ఇటువంటి సదస్సులు మరిన్ని జరగాలని, కొత్త రచయితలు యువతరం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విక్రమ్ సుఖవాసి ఆంధ్ర కళావేదిక తరపున మరొకసారి అందరికీ తమ దేశానికి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తొలిసారి ప్రపంచ సదస్సుకు సంచాలకునిగా ఈ సంచికకు సహసంపాదకునిగా ఉండడం చాలా ఆనందంగా ఉందన్నారుఈ సంచికకు రూపకల్పన సహకారం అందించిన జేవి పబ్లికేషన్స్ అధినేత్రి జ్యోతి వలబోజు కూడా ఈ ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఇతర మధ్యప్రాచ్య దేశాల సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ తమ దేశాలలో కూడా ఇటువంటి సాహిత్య సదస్సులు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని 10వ ప్రపంచ సదస్సు జరపడానికి అవకాశం ఇమ్మని కోరుతూ తమ ఉత్సాహాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమం వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా యూట్యూబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారమైంది.

న్యూజెర్సీ, పార్సిప్పనీలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం
న్యూజెర్సీలోని పార్సిప్పనీలో శ్రీ సీతారాముల కల్యాణం రమణీయంగా, కమనీయంగా సాగింది. న్యూయార్క్‌లోని శ్రీ రంగనాథ ఆలయం నుంచి స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను తీసుకొచ్చారు. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ ఊరేగింపుగా కల్యాణ మండపానికి స్వర్ణ సింహాసనంపై స్వామివారిని, అమ్మవారిని ఆసీనులను చేశారు. కళ్యాణం సందర్భంగా భక్తులు చేయించిన అభరణాలను వధూవరులకు ధరింపజేశారు. రాముల వారికి, సీతమ్మ వారికి పట్టు వస్త్రాలు, తాళిబొట్టు, మెట్టలు, ఆభరణాలు, ముత్యాల తలంభ్రాలను సమర్పించారు. మేళంతో ఊరేగింపుగా పట్ట వస్త్రాలను తీసువచ్చారు. సీతమ్మ, రామయ్యల ఎదుర్కోలు ఘట్టం కనులారా తిలకించిన భక్తులు ఆనందపరవశులయ్యారు. భక్తజనంతో న్యూజెర్సీలో పండగ వాతావరణం నెలకొంది. సంస్కృతి, సంప్రదాయలకు అనుగుణంగా వివాహ వ్యవస్థపై కృష్ణ దేశిక జీయర్ స్వామిజీ చేసిన వ్యాఖ్యానం విశేషంగా ఆకట్టుకుంది. దండలు మార్చుకునే క్రమంలో అర్చకులు నృత్య ప్రదర్శన చేసి సంప్రదాయాన్ని గుర్తు చేశారు. మరిన్నిNRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!అనంతరం గణపతి పూజ, విశ్వక్సేన ఆరాధన, మహాసంకల్పం, మంగళఅష్టకాలు, కన్యాదానం, తలంబ్రాల ఘట్టం, పూలదండల మార్పు, మహా హారతి, నివేదన తదితర ఘట్టాలు శాస్త్రోక్తంగా జరిగాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల నడుమ జగదభిరాముడు జానమ్మను మనువాడారు. కోదండ రాముడు సీతమ్మ మెడలో మూడుముళ్లు వేసిన వేళ, రఘునందనుడి దోసిట తలంబ్రాలు ఆణిముత్యాలే నీలపురాశులుగా, జగన్మాత లోకపావని సీతమ్మ దోసిట అక్షింతలు మణిమాణిక్యాలై సాక్షాత్కారించిన వేళ కల్యాణ ప్రాంగణం భక్తిపారవశ్యంతో ఓలలాడింది.ఈ సీతారాముల కాళ్యానికి పార్సిప్పనీకి మేయర్ జేమ్స్ బార్బెరియోతో పాటు 300 మందికి ప్రవాస తెలుగువారు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేశారు. దాదాపు అందరూ సంప్రదాయబద్ధంగా తయారై కళ్యాణంలో పాల్గొన్నారు. 72 పైగా జంటలు ఈ కళ్యాణ మహోత్సవంలో పాలు పంచుకున్నాయి. ఈ కల్యాణాన్ని ప్రవాసులు కన్నులారా వీక్షిం చి తరించారు. ఈ ఉత్సవం.. భద్రాచల రాముల వారి కళ్యాణమహోత్సవాన్ని తలపించింది. కల్యాణం అనంతరం ఉత్సవ మూర్తులను భక్తులు దర్శనం చేసుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, అక్షింతలు అందజేశారు.
క్రైమ్

అర్ధరాత్రి క్షుద్రపూజల కలకలం..!
కర్నూలు: పట్టణంలోని కర్నూలు – బెంగళూరు జాతీయ రహదారి పక్కన చెరుకులపాడు క్రాస్ రోడ్డులోని ఓ ఇంట్లో క్షుద్రపూజలు చేసి న ఫొటోలు, వీడియో లు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. ఓ వ్యక్తి మీద చేతబడి ప్రయోగించినట్లుగా తెలుస్తోంది. ఇందుకు పట్టణానికి చెందిన వ్యక్తి సూత్రధారిగా ఉండి కొందరి ఫొటోలతో, భయానక చేతబడి చేస్తున్నప్పటి ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. సేకరించిన సమాచారం మేరకు.. పట్టణానికి చెందిన వ్యక్తి సిఫారసుతో చెరుకులపాడు క్రాస్ రోడ్డులోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న వారు అందులో చేతబడులు చేస్తూ, గుప్తనిధుల వేటగాళ్లకు ఆసరాగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మిగనూరుకు చెందిన వ్యక్తికి అప్పు ఉండ గా అప్పు ఎగ్గొట్టేందుకు ఏకంగా ఆ వ్యక్తిపై చేతబడి ప్రయోగం చేసినట్లు సమాచారం. ఇందులో పట్టణానికి చెందిన పంచాయతీ కార్యాలయంలో అనధికారికంగా పనిచేస్తున్నకార్మికుడి ఫొటో ఉంది. ఇటీవల ఉలిందకొండకు చెందిన వ్యక్తిపై కూడా ఇక్కడి నుంచే చేతబడి ప్రయోగం చేసినట్లుగా తెలుసుకున్న ఉలిందకొండ వారు ఈ ఇంటికి చేరుకుని ఇంట్లో ఉన్నవారితో గొడవ పడినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ ఇళ్లు కేంద్రంగా రెండు నెలల పాటు మండలం వ్యాప్తంగా గుప్తనిధుల వేట కొనసాగినట్లుగా సైతం తెలుస్తోంది. పోలీసులకు సైతం సమాచారం అందినా చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.

భర్త మరణాన్ని జీర్ణించుకోలేక భార్య ఆత్మహత్య
ఉయ్యాలవాడ: విధి ఆటలో ఓ చిన్నారి అనాథగా మారింది. అభంశుభం తెలియని పసిపాప తొమ్మిది రోజుల వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పోయింది. ఈ విషాద ఘటన ఆర్. పాంపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పొగాకు నారాయణ కూలీ పనులకు వెళుతూ జీవనం కొనసాగించేవాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీన గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన మట్టి మిద్దె పనులకు వెళ్లాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ మిద్దె కూలి శిథిలాలు నారాయణపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటి నుంచి అతని భార్య లలిత (40) తీవ్ర మనోవేదనకు గురైంది. మనస్తాపంతో వారం రోజులుగా ఆహారం తీసుకోకుండా భర్త గురించే ఆలోచించింది. తన 45 రోజుల చిన్నారికి కూడా పోతపాలు తాపింది. చివరకు జీవితంపై విరక్తి చెంది బుధవారం ఉదయం లలిత రసాయన పౌడర్‌ను నీళ్లలో కలుపుకుని అపస్మారక స్థితిలో పడిపోయింది. గమనించిన బంధువులు, స్థానికులు చికిత్స నిమిత్తం 108లో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో లలిత మృతి చెందింది. తల్లిదండ్రుల మృతి చెంద డంతో 45 రోజుల చిన్నారి అనాథగా మిగిలింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పసిపాపకు తల్లిదండ్రులు లేకపోవడంతో నాయనమ్మ శివమ్మ దిక్కైంది. అమ్మపాల కోసం ఏడస్తున్న చిన్నారిని చూసి పలువురు కంటతడి పెట్టారు. కాగా నారాయణ మొదటి భార్య విజయలక్ష్మి ఐదేళ్ల క్రితం కుటుంబ కలహాలతో క్రిమి సంహారక మందు తాగి మృతి చెందింది. రెండేళ్ల క్రితం లలితను రెండవ వివాహం చేసుకున్నాడు. మృతురాలి తల్లి నారాయణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్.. ఇటీవల జిల్లాలో పలువురు ఆత్మహత్యకు కల్లాపికి ఉపయోగించే పేడ రంగును నీళ్లలో కలుపుకుని తాగి మృతి చెందుతుండటంతో కలెక్టర్ రాజకుమారి నెల క్రితం పేడ రంగు విక్రయాలను నిషేధించారు. అయినా కొందరు కిరాణ దుకాణ వ్యాపారులు విక్రయిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. పేడ రంగు విక్రయించకుండా అధికారులు దుకాణాలపై దాడులు చేయా లని గ్రామస్తులు కోరుతున్నారు.

తాళిబొట్లు తెంచి పడేసి హిజ్రాల ఆవేదన..!
తమిళనాడు: కూవాగంలో గత కొద్ది రోజులు సందడి చేసిన హిజ్రాలు బుధవారం విషాదంతో స్వస్థలాలకు తిరుగు పయనం అయ్యారు. మంగళవారం ఎంతో ఆనందంగా కట్టుకున్న మంగళ సూత్రాలను తెంచి పడేసి ఒప్పారి పెట్టారు. తెల్ల చీరలు ధరించి వితంతువులుగా మారి కూవాగం నుంచి తిరుగు పయనం అయ్యారు. ముందుగా ఉదయం కూత్తాండవర్ రథోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. రాష్ట్రంలోని కళ్లకురిచ్చి జిల్లా ఉలుందూర్ పేట సమీపంలోని కూవాగం గ్రామంలోని కూత్తాండవర్ ఆలయంలో రెండు వారాల పాటు చిత్తిరై ఉత్సవాలు అత్యంత వేడుకగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గత మూడు రోజులు హిజ్రాల సందడితో కూవాగం కళకళలాడింది. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, ఆలయ పూజారి చేతుల మీదుగా మంగళవారం హిజ్రాలు తాళిబొట్లు కట్టించుకున్నారు. రాత్రంతా ఆట పాటలతో సందడి చేశారు. రథోత్సవం బుధవారం ఉదయం కూత్తాండవర్ రథోత్సవం ఘనంగా జరిగింది. ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా జనసందోహం తరలివచ్చారు. ఈ వేడుక కోసం కూవాగం, పందలాడి, కిలక్కు కుప్పం, శిరులాయం కుళం గ్రామాల నుంచి ప్రజలు చేతులు, కాళ్లు, భుజాలు, శిరస్సు ఆకారాలను తీసుకొచ్చి రథంపై ఉంచారు. బ్రహ్మాండంగా కూత్తాండవర్ రథోత్సవ సేవ జరిగింది. అనంతరం బలిదానం జరిగింది. బలిదానంలో తమ ఆరాధ్యుడు బలి కావడంతో తమ భర్తను కోల్పోయినంతగా తీవ్ర వేదనతో ఒక్కసారిగా హిజ్రాలు విషాదంలో మునిగారు. తాము కట్టుకున్న మంగళ సూత్రాలను తెంచి పడేసి కన్నీటి సంద్రంలో మునిగారు. ఏడుపులు, పెడ»ొబ్బలతో ఒప్పారి పెట్టారు. అక్కడి కొలనులో స్నానం చేసి తెల్ల చీరల్ని ధరించి తమ స్వస్థలాలకు తిరుగు పయనమయ్యారు.

చేయి విరిగిందని వెళితే.. ప్రాణం పోయింది
తగరపువలస(విశాఖపట్నం): వాష్‌రూమ్‌లో జారిపడి చేయి విరిగిన ఓ మహిళ తొలుత సంగివలసలోని అనిల్ నీరుకొండ(ఎన్ఆర్ఐ) ఆసుపత్రిలో చికిత్స పొంది. అక్కడ పరిస్థితి విషమించడంతో నగరంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. తన భార్య మృతికి అనిల్ నీరుకొండ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆమె భర్త జనార్థన్ ఆరోపించారు. కుటుంబసభ్యులతో ఆసుపత్రి ముందు బైఠాయించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వివరాలివి. భీమిలి మండలం చిప్పాడలో నివాసముంటున్న దివీస్ ఉద్యోగి జనార్థన్ భార్య యర్రంశెట్టి రేవతి ఈ నెల 10న ప్రమాదానికి గురైంది. వెంటనే ఆమెను ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చేర్పించగా.. అక్కడ వైద్యం వికటించి అపస్మారక స్థితికి చేరుకుంది. మెరుగైన వైద్యం కోసం జనార్థన్ ఆమెను నగరంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి అత్యవసరంగా తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె బుధవారం మృతి చెందింది. దీంతో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రేవతి మృతదేహంతో ఎన్ఆర్ఐ ఆసుపత్రి ఎదుట ఆందోళన జరిగే అవకాశం ఉందని ముందే ఊహించిన సిబ్బంది.. మృతదేహాన్ని హుటాహుటిన కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం ఆమె స్వగ్రామమైన అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొవ్వూరుకు మృతదేహాన్ని పంపే ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో కేజీహెచ్ వద్ద ఆమె భర్త ఆందోళనకు సన్నద్ధమయ్యారు. తన భార్య అపస్మారక స్థితికి చేరుకోవడానికి కారణమైన వైద్యురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రిని తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. జనార్థన్‌కు సంఘీభావంగా ఆయన స్వగ్రామానికి చెందిన బంధువులు, దివీస్ ఉద్యోగులు, పలు ప్రజా సంఘాల నాయకులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సాయంత్రం 8 గంటల తర్వాత వారంతా కలిసి సంగివలసలోని ఆసుపత్రి ఎదుట పెద్ద ఎత్తున బైఠాయించి ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆసుపత్రి యాజమాన్యం ఆందోళనకారులు, బాధితుల తరపున వచ్చిన ప్రజా సంఘాల ప్రతినిధులతో చర్చలు ప్రారంభించింది. భీమిలి పోలీసులు ఆసుపత్రి వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్నారు.