Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Supreme Court Denies Anticipatory Bail To P Krishna Mohan Reddy and K Dhananjaya1
రాజకీయ దురుద్దేశాలకు తీవ్ర పర్యవసానాలు తప్పవు

ఈ కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలు..పక్షపాతం ఉందని పిటిషనర్లు కొంతమేర ప్రాథమికంగా రుజువు చేయగలిగారు. రాజకీయ దురుద్దేశాలు.. పక్షపాతానికి న్యాయపరమైన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని తగిన సమయంలో తేలుస్తాం.థర్డ్‌ డిగ్రీ ఉపయోగించినా.. బెదిరించినా.. ఒత్తిడి చేసినా.. ప్రలోభపెట్టినా వీటిని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తాం. నిందితులు, సహ నిందితుల నుంచి వాంగ్మూలాలను సేకరించే సమయంలో దర్యాప్తు సంస్థ కొన్ని సందేహాస్పద పద్ధతులను అనుసరిస్తోంది. పిటిషనర్లు, ఇతర సహ నిందితుల విషయంలో థర్డ్‌ డిగ్రీ ఉపయోగించడం, బెదిరించడం, ఒత్తిడి తేవడం, ప్రలోభపెట్టడం చెయ్యడానికి వీల్లేదు. సాక్షి, అమరావతి: ఏపీ మద్యం వ్యవహారంలో కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని, వాటిని ఎంతమాత్రం కొట్టిపారేయలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాజకీయ పక్షపాతం, దురుద్దేశాలకు న్యాయపరంగా తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అయితే, రాజకీయ దురుద్దేశాల కారణంతో.. నిందితులను కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌ చేయకుండా దర్యాప్తు అధికారిని నిరోధించలేమని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ జంషేడ్‌ బుర్జోర్‌ పార్థివాలా, జస్టిస్‌ ఆర్‌.మహాదేవన్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.\మద్యం వ్యవహారంలో రిటైర్డ్‌ ఐఏఎస్‌ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు ముందస్తు బెయిల్‌ ఇవ్వలేమని చెబుతూ, వారి పిటిషన్లను కొట్టివేసింది. పిటిషనర్లపై థర్డ్‌ డిగ్రీ ఉపయోగించడానికి వీల్లేదని ఏపీ సీఐడీ అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే, ఫలానా విధంగా వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేయడం గానీ, బెదిరించడం గానీ, ప్రలోభపెట్టడం గానీ చేయరాదంది. దర్యాప్తును నిష్పాక్షికంగా, పారదర్శకంగా కొనసాగించాలని ఆదేశించింది. పిటిషనర్లు రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసుకుంటే, కేసు పూర్వాపరాల ఆధారంగా విచారించి తగిన నిర్ణయం వెలువరించాలని కింది కోర్టు, హైకోర్టుకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విచారణ సమయంలో న్యాయవాదులు ఉండాలనుకుంటే, ఆ అభ్యర్థనతో హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్లకు సూచించింది. సీఐడీ దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నారు మద్యం కేసులో తమకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ రిటైర్డ్‌ ఐఏఎస్‌ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం జస్టిస్‌ పార్థివాలా ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు అభిషేక్‌ మను సింఘ్వీ, వికాస్‌ సింగ్‌ వాదనలు వినిపించారు. మద్యం కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని, ప్రభుత్వం మారగానే కేసు నమోదైందని వారు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సీఐడీ దర్యాప్తునకు పిటిషనర్లు పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే 13 గంటల చొప్పున వీరిని దర్యాప్తు అధికారి ప్రశి్నంచారన్నారు. ఎలాంటి అక్రమాల్లేవనీ సీసీఐ తేల్చింది... కొత్త మద్యం కంపెనీలకు అవకాశం కల్పించడం వెనుక అక్రమాలు జరిగాయని సీఐడీ ఆరోపిస్తోందని.. కానీ, ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) తేల్చిందని అభిషేక్‌ మను సింఘ్వీ, వికాస్‌ సింగ్‌ పేర్కొన్నారు. సీఐడీ రిమాండ్‌ రిపోర్టులో ఇప్పుడు చేస్తున్న ప్రతి ఆరోపణ.. గతంలో సీసీఐకి చేసిన ఫిర్యాదులో ఉన్నవేనని గుర్తు చేశారు. నాటి ఫిర్యాదును సీసీఐ క్షుణ్నంగా పరిశీలించి క్లీన్‌చిట్‌ ఇచ్చిందని వివరించారు.ఈ మేరకు సీసీఐ ఉత్తర్వులను వారు ధర్మాసనం ముందు ఉంచారు. అక్రమాలే లేవని తేలిన వ్యవహారంలో సీఐడీ కేసు నమోదు చేసిందని, రాజకీయ కక్ష సాధింపులకు ఈ కేసు ఓ ప్రత్యక్ష ఉదాహరణ అని తెలిపారు. ఈ కేసులో సాక్షులను సీఐడీ పలు రకాలుగా భయపెడుతోందన్నారు. కావాల్సిన విధంగా వాంగ్మూలం ఇవ్వకుంటే నిందితులుగా చేర్చేందుకు కూడా వెనుకాడడం లేదని తెలిపారు. వాంగ్మూలాలు తప్ప సాక్ష్యాలు ఏమీ చూపడం లేదని నివేదించారు. పిటిషనర్లకు మద్యం వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేదని, వారు కేవలం ప్రభుత్వ అధికారులుగా సమావేశాల్లో మాత్రమే పాల్గొన్నారని చెప్పారు. ఇదే నేరం అంటూ కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. పారదర్శక విధానాన్ని పూర్తిగా మార్చేశారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్థ అగర్వాల్‌ వాదనలు వినిపిస్తూ, ఇదో భారీ కుంభకోణమన్నారు. గతంలో మద్యం కొనుగోళ్లు చాలా పారదర్శకంగా జరిగేవని, గత ప్రభుత్వ హయాంలో దానిని పూర్తిగా మార్చేశారన్నారు. కీలక స్థానాల్లో కావాల్సిన వ్యక్తులను నియమించుకున్నారని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ... రాజకీయ దురుద్దేశాలను, ప్రాథమిక ఆధారాలను ఎలా సమతుల్యం చేస్తారని ప్రశ్నించింది. దీంతో ఇది విచారణకు స్వీకరించదగ్గ నేరమే కాదని వికాస్‌ సింగ్‌ సమాధానం ఇచ్చారు.ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును కోరారు. అలాగైతే ఎఫ్‌ఐఆర్‌ కొట్టివేతకు పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని ధర్మాసనం సూచించింది. ఆ పని కచి్చతంగా చేస్తామని వికాస్‌ తెలిపారు. సింఘ్వీ వాదనలు వినిపిస్తూ... పిటిషనర్లు ప్రభుత్వాధికారులుగా పదవీ విరమణ చేశారని, వారు ఎక్కడికీ పారిపోయే అవకాశం లేదని అన్నారు. ఆ అవసరం కూడా వారికి లేదన్నారు. కావాలంటే పాస్‌పోర్ట్‌ జప్తునకు ఆదేశాలు ఇవ్వొచ్చునన్నారు. అలాంటప్పుడు దేశం విడిచివెళ్లిపోతారన్న ఆందోళన అనవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా స్పందిస్తూ, ఈ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా ఈసీఆర్‌ నమోదు చేసిందన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం, పిటిషనర్లకు ముందస్తు బెయిల్‌ ఇవ్వలేమంటూ పిటిషన్లు కొట్టేసింది. బెయిల్‌ పిటిషన్‌ దాఖలుకు గోవిందప్పకు అనుమతి వికాట్‌ సంస్థ డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్ప అరెస్ట్‌ నేపథ్యంలో తాము దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ దవే సుప్రీంకోర్టుకు వివరించారు. రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌కు అనుమతి కోరగా.. ధర్మాసనం అనుమతిచ్చింది. బాలాజీ గోవిందప్ప రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసుకుంటే కేసు పూర్వాపరాల ఆధారంగా నిర్ణయం వెలువరించాలని కింది కోర్టు, హైకోర్టుకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ సమయంలో దవే స్పందిస్తూ, ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగానే గోవిందప్పను అరెస్ట్‌ చేశారన్నారు. ఇది ఏమాత్రం సహేతుకం కాదని, ఇలా అరెస్ట్‌ చేయడం తగదంటూ ఇదే కోర్టు గతంలో స్పష్టమైన తీర్పు ఇచ్చిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. పరిశీలించాలంటూ సంబంధిత తీర్పు కాపీని ధర్మాసనం ముందు ఉంచారు. ఇప్పుడు ఈ అంశాలన్నీ అవసరం లేదని, తాము బాలాజీ గోవిందప్పకు ముందస్తు బెయిల్‌ ఇవ్వలేదని ధర్మాసనం తెలిపింది. సుప్రీంకోర్టు హెచ్చరికలు ఇవీ... రాష్ట్ర ప్రభుత్వానికి... ఏపీ మద్యం వ్యవహారంలో కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయి. వాటిని ఎంతమాత్రం కొట్టిపారేయలేం. రాజకీయ పక్షపాతం, దురుద్దేశాలు ఉంటే, వాటికి న్యాయపరంగా తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.సీఐడీ అధికారులకు..పిటిషనర్లపై థర్డ్‌ డిగ్రీ ఉపయోగించడానికి వీల్లేదు. ఫలానా విధంగా వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేయడం గానీ, బెదిరించడం గానీ, ప్రలోభపెట్టడం గానీ చేయరాదు. దర్యాప్తును నిష్పాక్షికంగా, పారదర్శకంగా కొనసాగించాలి.రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై... పిటిషనర్లు రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసుకుంటే, కింది కోర్టులు కేసు పూర్వాపరాల ఆధారంగా విచారించి తగిన నిర్ణయం వెలువరించాలి. విచారణ సమయంలో న్యాయవాదులు ఉండాలనుకుంటే, ఆ అభ్యర్థనతో పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించాలి.

Pak PM Shahbaz Sharif Key Comments With India War2
అవును.. భారత్‌ క్షిపణుల దెబ్బ మాకు తగిలింది: పాక్‌ ప్రధాని

ఇస్లామాబాద్‌: ఆపరేషన్‌ సిందూర్‌పై ఇన్నాళ్లూ బుకాయించిన పాకిస్తాన్‌.. తాజాగా అసలు నిజాలను వెల్లడించింది. నూర్‌ ఖాన్‌, ఇతర వైమానిక స్థావరాలపై దాడి జరిగిందని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ అంగీకరించారు. దాడుల విషయం తెల్లవారుజామున 2.30 గంటలకు ఆర్మీ చీఫ్‌ జనరల్‌ అసీమ్‌ మునీర్‌ వివరించారని వెల్లడించారు. ఆ సమయంలో తమ వైమానిక దళం స్థానిక సాంకేతిక పరిజ్ఞానం, చైనీస్‌ యుద్ధ విమానాలను వినియోగించిందని షరీఫ్‌ పేర్కొన్నారు. ఇదే సమయంలో భారత్, పాకిస్తాన్‌లు కశ్మీర్‌ సహా తమ మధ్య విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి షహబాజ్‌ షరీఫ్‌ అన్నారు. భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఇప్పటికి మూడు సార్లు యుద్ధం జరిగినా వచ్చిందేమీ లేదు అంటూ సరికొత్త వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాత్రి సైనికులకు నివాళులర్పించే కార్యక్రమంలో పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షరీఫ్‌ మాట్లాడుతూ..‘భారత్, పాకిస్తాన్‌లు ఇప్పటి వరకు మూడుసార్లు యుద్ధాలు చేసినా ఏమీ సాధించలేకపోయాయి. జమ్మూకశ్మీర్‌ వంటి అన్ని ప్రధాన అంశాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. లేకుంటే మనం ప్రశాంతంగా ఉండలేం’ అని పేర్కొన్నారు.Pakistan PM Shahbaz Sharif says, "At around 2:30 am on 10 May, General Syed Asim Munir called me on secure line and informed me that India's ballistic missiles have hit Nur Khan Airbase and other areas.#nurkhanairbase #Pakistan #PakistanArmy pic.twitter.com/RKnWGP8WeS— Manish Shukla (@manishmedia) May 17, 2025తమది శాంతికాముక దేశమైనా స్వీయరక్షణకు తగినట్లు స్పందించే హక్కు ఉందని షెహబాజ్‌ అన్నారు. ‘భారత్‌కు దీటుగా జవాబిచ్చి’ పాక్‌ సైనిక చరిత్రలో స్వర్ణాధ్యాయాన్ని లిఖించారని కొనియాడారు. శాంతియుత వాతావరణం నెలకొనేందుకు ముందుకు వస్తే ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో సహకరిస్తామని భారత్‌కు హామీ ఇచ్చారు. కాల్పుల విరమణకు సహకరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.అనంతరం, పాక్‌ విదేశాంగ మంత్రి, ఉప ప్రధాని ఇశాక్‌ దార్‌ మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్‌ల మధ్య అపరిష్కృత, వివాదాస్పద అంశాలపై సమగ్ర చర్చలు జరుపుదామని కామెంట్స్‌ చేశారు. మరోవైపు.. తమపై భారత్‌ ఎలాంటి దురాక్రమణకు దిగినా దానికి బదులిస్తామని పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ పేర్కొంది. కాల్పుల విరమణకు భారత్‌ చిత్తశుద్ధితో కట్టుబడి ఉండాలని ఈ శాఖ అధికార ప్రతినిధి షఫ్ఖత్‌ అలీఖాన్‌ వ్యాఖ్యలు చేశారు. ఇక, కృతజ్ఞతా దినం సందర్భంగా ఇస్లామాబాద్‌లో 31 సార్లు, ప్రావిన్సుల రాజధానుల్లో 21 సార్లు గాల్లోకి కాల్పులు జరిపి సెల్యూట్‌ చేశారు. ప్రత్యేక ప్రార్థనలు, ర్యాలీలతో సైనికదళాలకు సంఘీభావం ప్రకటించారు.

Albanian PM Greet Italian PM Giorgia Meloni3
ఇటలీ ప్రధాని మెలోనీ ఖుషీ.. మోకాలిపై కూర్చొని దేశాధినేత స్వాగతం

టిరానా: అల్బేనియా దేశాధినేత ఎడీ రమా చర్చల్లో నిలిచారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి ఆయన స్వాగతం పలికిన తీరు ఆసక్తికరంగా మారింది. మోకాలిపై కూర్చొని ఎడీ.. ఆమెను ఆహ్వానించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అల్బేనియా రాజధాని టిరానాలో ఐరోపా రాజకీయ కమ్యూనిటీ సదస్సు జరిగింది. ఈ సమావేశానికి యూరోపియన్‌ యూనియన్‌ దేశాల నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ వచ్చారు. అనంతరం, మెలోనీ కారు దిగి వేదిక వద్దకు వస్తుండగా.. అల్బేనియా ప్రధాని ఎడీ మోకాలిపై కూర్చొని చేతులు జోడించి నమస్కారం చెబుతూ స్వాగతం పలికారు. రెడ్‌ కార్పెట్‌ మీద ఆమెను సాదరంగా ఆహ్వానించారు.‼️ The Prime Minister of Albania greeted Italian 🇮🇹 Prime Minister Giorgia Meloni with a deep bow and genuflectionA rare display of respect, elegance, and old-world chivalry pic.twitter.com/lKyoNXL8zN— Mambo Italiano (@mamboitaliano__) May 16, 2025ఇక, వర్షంలోనూ ఆయన పలికిన ఈ ఆత్మీయ ఆహ్వానానికి మెలోనీ ఫిదా అయ్యారు. మెలోనీ తన ‘ఇటాలియన్‌ సిస్టర్‌’ అని చెప్పే ఎడీ రమా ఆమె ఎప్పుడు కన్పించినా సరే ఇలాగే పలకరిస్తారు. ఈ ఏడాది జనవరిలో మెలోనీ పుట్టినరోజు నాడు ఓ సదస్సులో కలిసిన ఎడీ.. ఆమెకు మోకాలిపై కూర్చొని స్కార్ఫ్‌ను కానుకగా ఇచ్చారు. ఇటాలియన్‌ భాషలో ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.Bend it like Albanian PM not like #Bekcham. Grand welcome with respect for Italian PM #GiorgiaMeloni, truly commands the utmost respect of world leaders. pic.twitter.com/a4zSQFelwn— Vinay Kumar (@vinatanycost) May 16, 2025

TDP MLA Bonela Vijay Chandra Over Action With MRO4
టీడీపీ ఎమ్మెల్యే.. మహిళా ఎంఆర్వోకి అర్ధరాత్రి వాట్సాప్‌ కాల్‌ చేసి దూషణ..

సాక్షి, పార్వతీపురం మన్యం: ఏపీలో కూటమి సర్కార్‌ పాలనలో ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే అర్ధరాత్రి మహిళా ఎంఆర్వోకు ఫోన్‌ చేసి అసభ్య పదజాలంతో దూషించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. అనంతరం, సదరు మహిళా ఎంఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టీడీపీ ఎమ్మెల్యే ప్లేటు ఫిరాయించారు. రివర్స్‌లో ఆమెపైనే ఆరోపణలు చేశారు.వివరాల ప్రకారం.. పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర.. మహిళా ఎంఆర్వోకు అర్ధరాత్రి వాట్సాప్‌లో కాల్‌ చేశారు. ఈ క్రమంలో అసభ్య పదజాలంతో ఆమెను దూషించారు. దీంతో, సదరు మహిళా ఎంఆర్వో.. పోలీసులకు ఆశ్రయించారు. అనంతరం, టీడీపీ ఎమ్మెల్యే బోనెల.. బహిరంగంగా బ్లాక్‌మెయిల్‌కు దిగారు. సదరు అధికారి.. ఎస్టీ మహిళ కావడంతో తనపై కేసు నమోదు అవుతుందున్న భయంతో ఎంఆర్వోపై తీవ్ర ఆరోపణలు చేశారు.ఆయన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర స్పందిస్తూ..‘భూమి విషయమై మాట్లాడేందుకు అర్ధరాత్రి ఎంఆర్వోకు నేను ఫోన్‌ చేశాను. ఆమె ఎత్తకపోవడంతో వాట్సాప్‌ కాల్‌ చేశాను. ఎంఆర్వో ఆఫీసు అవినీతిమయంగా తయారైంది. ఎంఆర్వో మానసిన పరిస్థితి సరిగా లేదు. ఎంఆర్వోపై శాసనసభ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తా. ఆమె క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు.మరోవైపు... ఎంఆర్వోతో అనుచితంగా మాట్లాడిని ఎమ్మెల్యే తీరుపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఈ సందర్బంగా సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు స్పందిస్తూ.. మహిళా ఎంఆర్వోకు అర్ధరాత్రి ఎమ్మెల్యే ఫోన్‌ చేయడం సరికాదు. ఆమెను వేధింపులకు గురిచేయడమేంటని ప్రశ్నించారు.

Rohit Sharma Parents And Wife Ritika Cant Hold Tears Emotional VIdeo Viral5
రోహిత్‌ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక!

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) తల్లిదండ్రులు పూర్ణిమా శర్మ- గురునాథ్‌ శర్మ కన్నీటి పర్యంతమయ్యారు. కష్టాల కడలిని దాటి శిఖరాగ్రానికి చేరుకున్న కుమారుడిని చూసి పుత్రోత్సాహంతో పొంగిపోయారు. కాగా బ్యాటర్‌గా, కెప్టెన్‌గా తనకంటూ ప్రత్యేక అధ్యాయం రచించుకున్న రోహిత్‌ శర్మను అతని సొంత సంఘం ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ (MCA) సముచిత రీతిలో గౌరవించిన విషయం తెలిసిందే.ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియంలో ఒక ప్రేక్షకుల గ్యాలరీకి ‘రోహిత్‌ శర్మ స్టాండ్‌’ అని పేరు పెట్టింది. ఈ స్టాండ్‌ ఆవిష్కరణ కార్యక్రమంశుక్రవారం జరిగింది. రోహిత్‌ తల్లిదండ్రులు పూర్ణిమ, గురునాథ్, భార్య రితిక (Ritika), మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ఈ కార్యక్రమానికి హాజరై ‘రోహిత్‌ శర్మ స్టాండ్‌’ను ప్రారంభించారు. రోహిత్‌ భావోద్వేగంఈ సందర్భంగా మాట్లాడుతూ రోహిత్‌ భావోద్వేగానికి గురయ్యాడు. ‘నేడు ఇక్కడ జరిగిన కార్యక్రమాన్ని నేను కలలో కూడా ఊహించలేదు. ఇదో ప్రత్యేక అనుభూతి. మ్యాచ్‌లలో సాధించే ఎన్నో మైలురాళ్లకంటే విశేషమైంది.వాంఖడేలాంటి ప్రతిష్టాత్మక మైదానంలో ఎంతో మంది దిగ్గజాల సరసన నా పేరు కనిపిస్తున్న ఆనందాన్ని మాటల్లో వర్ణించలేదు. ఈ స్టేడియంలో నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. నేను ఇంకా క్రికెట్‌ ఆడుతున్నాను. వచ్చే బుధవారం ఇక్కడ నా స్టాండ్‌ ముందు ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడబోతున్నాను. అది చాలా గొప్ప అనుభవం అవుతుంది.ఇక భారత్‌ తరఫున మ్యాచ్‌ ఆడితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. నా కుటుంబ సభ్యులందరి ముందు ఈ కార్యక్రమం జరిగింది. అందరికీ ఎంతో కృతజ్ఞుడను’ అని రోహిత్‌ వ్యాఖ్యానించాడు. కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక!మరోవైపు.. కుమారుడి పేరిట స్టాండ్‌ ఆవిష్కరణ కాగానే పూర్ణిమా- గురునాథ్‌ ఆనందభాష్పాలు రాల్చగా.. రితిక కూడా తీవ్ర భావోద్వేగానికి లోనైంది. కన్నీళ్లు తుడుచుకుంటూ మామగారి వెనుకగా వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.కాగా కార్యక్రమంలో భారత మాజీ కెప్టెన్‌ అజిత్‌ వాడేకర్‌ పేరిట, సీనియర్‌ అడ్మినిస్ట్రేటర్, ఐసీసీ మాజీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ పేరిట కూడా స్టాండ్‌లను ఆవిష్కరించిన ఎంసీఏ... ఇటీవలే కన్నుమూసిన మాజీ అధ్యక్షుడు అమోల్‌ కాలే పేరిట ప్రత్యేక లాంజ్‌ను కూడా ప్రారంభించింది. ‘నేనైతే సిడ్నీలో రోహిత్‌ను ఆడించే వాడిని’ మరోవైపు.. ఆస్ట్రేలియాతో సిరీస్‌తో చివరి టెస్టుకు ముందు తాను ఫామ్‌లో లేనంటూ రోహిత్‌ శర్మ స్వయంగా తప్పుకొన్నాడు. సిడ్నీలో జరిగిన ఈ టెస్టుకు దూరమైన అతను మళ్లీ టెస్టు ఆడకుండానే ఇటీవల రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అయితే తాను జట్టు కోచ్‌గా ఉండి ఉంటే రోహిత్‌ను తప్పనిసరిగా ఆ టెస్టులో ఆడించే వాడినని మాజీ కోచ్‌ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.‘సిరీస్‌ ముగిసిపోలేదు కాబట్టి కచి్చతంగా అతడిని ఆడించే వాడిని. సిరీస్‌లో 1–2తో వెనుకబడి ఉన్న సమయంలో జట్టును వదలవద్దని చెప్పేవాడిని. ఆ టెస్టులో తేడా ఒక 30–40 పరుగులు మాత్రమే. ఫామ్‌ ఎలా ఉన్న అతనో మ్యాచ్‌ విన్నర్‌. పిచ్‌పై పరిస్థితిని అర్థం చేసుకొని ఓపెనర్‌గా ఒక 35–40 పరుగులు చేసి ఉంటే చాలు మ్యాచ్‌ ఫలితం మారిపోయేదేమో. సిరీస్‌ కూడా సమంగా ముగిసేది. అక్కడ రోహిత్‌ ఆడకపోవడం నన్ను చాలా కాలం వెంటాడింది’ అని రవిశాస్త్రి తన మనసులో మాటను పంచుకున్నాడు. చదవండి: Rohit Sharma Interesting Facts: పేద కుటుంబంలో పుట్టి.. కోటీశ్వరుడిగా! లగ్జరీ ఇల్లు, కార్లు.. ఆస్తి ఎంతంటే?#WATCH | Mumbai | Rohit Sharma stands unveiled at Wankhede stadium. Indian ODI men's cricket team captain Rohit Sharma and his family, Maharashtra CM Devendra Fadnavis, NCP-SCP chief Sharad Pawar, and others, are also present.The Mumbai Cricket Association (MCA) is formally… pic.twitter.com/K39kSfRkCY— ANI (@ANI) May 16, 2025

Albanian PM Greet Italian PM Giorgia Meloni6
ఇటలీ ప్రధాని మెలోనీ ఖుషీ.. మోకాలిపై కూర్చొని దేశాధినేత స్వాగతం

టిరానా: అల్బేనియా దేశాధినేత ఎడీ రమా చర్చల్లో నిలిచారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి ఆయన స్వాగతం పలికిన తీరు ఆసక్తికరంగా మారింది. మోకాలిపై కూర్చొని ఎడీ.. ఆమెను ఆహ్వానించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అల్బేనియా రాజధాని టిరానాలో ఐరోపా రాజకీయ కమ్యూనిటీ సదస్సు జరిగింది. ఈ సమావేశానికి యూరోపియన్‌ యూనియన్‌ దేశాల నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ వచ్చారు. అనంతరం, మెలోనీ కారు దిగి వేదిక వద్దకు వస్తుండగా.. అల్బేనియా ప్రధాని ఎడీ మోకాలిపై కూర్చొని చేతులు జోడించి నమస్కారం చెబుతూ స్వాగతం పలికారు. రెడ్‌ కార్పెట్‌ మీద ఆమెను సాదరంగా ఆహ్వానించారు.‼️ The Prime Minister of Albania greeted Italian 🇮🇹 Prime Minister Giorgia Meloni with a deep bow and genuflectionA rare display of respect, elegance, and old-world chivalry pic.twitter.com/lKyoNXL8zN— Mambo Italiano (@mamboitaliano__) May 16, 2025ఇక, వర్షంలోనూ ఆయన పలికిన ఈ ఆత్మీయ ఆహ్వానానికి మెలోనీ ఫిదా అయ్యారు. మెలోనీ తన ‘ఇటాలియన్‌ సిస్టర్‌’ అని చెప్పే ఎడీ రమా ఆమె ఎప్పుడు కన్పించినా సరే ఇలాగే పలకరిస్తారు. ఈ ఏడాది జనవరిలో మెలోనీ పుట్టినరోజు నాడు ఓ సదస్సులో కలిసిన ఎడీ.. ఆమెకు మోకాలిపై కూర్చొని స్కార్ఫ్‌ను కానుకగా ఇచ్చారు. ఇటాలియన్‌ భాషలో ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.Bend it like Albanian PM not like #Bekcham. Grand welcome with respect for Italian PM #GiorgiaMeloni, truly commands the utmost respect of world leaders. pic.twitter.com/a4zSQFelwn— Vinay Kumar (@vinatanycost) May 16, 2025

Dadasaheb Phalke grandson Comments On SS Rajamouli and Aamir Khan7
'దాదాసాహెబ్‌ ఫాల్కే' బయోపిక్‌లో ఎవరు.. క్లారిటీ వచ్చేసింది

భారతీయ సినీ పితామహుడు దాదా సాహెబ్‌ ఫాల్కే (అసలు పేరు ధుండీరాజ్‌ గోవింద్‌ ఫాల్కే) బయోపిక్‌ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. దాదా సాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌ చేసేందుకు ఇటు రాజమౌళి అటు ఆమిర్‌ ఖాన్‌ ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. దీంతో ముందుగా ఎవరు ఈ సినిమాను సెట్స్‌ పైకి తీసుకెళ్తారనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. ఇలాంటి సమయంలో దాదాసాహెబ్‌ ఫాల్కే మనవడు చంద్రశేఖర్‌ అసలు విషయం చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపుతుంది ఎవరో ఆయన పంచుకున్నారు.దాదాసాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌పై ఇండస్ట్రీలో చర్చ జరుగుతుందని ఆయన మనవడు చంద్రశేఖర్‌ అన్నారు. ఈ ప్రాజెక్ట్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన అన్నారు. 'దాదాసాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌ విషయంలో రాజమౌళి టీమ్‌ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మమ్మల్ని సంప్రదించలేదు. కానీ, ఆమిర్‌ టీమ్‌ నన్ను సంప్రదించింది. ఈ బయోపిక్‌ కోసం ఆమిర్‌ మూడేళ్ల నుంచి పరిశోధనలు చేస్తున్నారు. దర్శకుడు రాజ్‌కుమార్‌ హీరాణీ ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ బయోపిక్‌ సినిమా కోసం వర్క్‌ చేస్తున్నట్లు నాకు కూడా సమాచారం ఉంది. రాజ్‌కుమార్‌ హీరాణీ అసిస్టెంట్‌ ప్రొడ్యూసర్‌ హిందూకుష్‌ భరద్వాజ్ నాతో మూడేళ్లుగా టచ్‌లో ఉన్నారు. మా తాతగారి గురించి ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నారు. అతను నన్ను మళ్ళీ మళ్ళీ కలవడానికి, పరిశోధన చేయడానికి, వివరాలు అడగడానికి వచ్చేవాడు. దాదాసాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌లో ఆమిర్‌ ఖాన్‌ బాగా సెట్‌ అవుతాడు.' అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.దాదాసాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌లో ఎన్టీఆర్‌ నటించడం లేదని దీంతో క్లారిటీ వచ్చేసింది. తారక్‌ నటిస్తున్నారని వార్తలు వచ్చిన 24 గంటల్లోపే ఈ ప్రాజెక్ట్‌లో ఆమిర్‌ ఖాన్‌ చేస్తున్నట్లుగా ప్రకటన వచ్చింది. అయితే, మేడ్‌ ఇన్‌ ఇండియా... ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా బయోపిక్‌ ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’కు సమర్పకుడిగా వ్యవహరించనున్నట్లుగా 2023లో దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ చేశారు. వరుణ్‌ గుప్తా, ఎస్‌ఎస్‌ కార్తికేయ ఈ సినిమాను నిర్మించనున్నట్లు, నితిన్‌ కక్కడ్‌ (హిందీ చిత్రం ‘నోట్‌బుక్‌’ ఫేమ్‌) ఈ బయోపిక్‌కు దర్శకత్వం వహించనున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఆ తర్వాత ఈ సినిమా గురించి అప్‌డేట్‌ ఏదీ బయటకు రాలేదు. తాజాగా దాదాసాహెబ్‌ ఫాల్కే మనవుడి ప్రకటనతో క్లారిటీ వచ్చేసింది.

Kalyandurg Excise CI Haseena Slaps Attender8
అనంతపురం: వివాదంలో ఎక్సైజ్ సీఐ హసీనా భాను

సాక్షి, అనంతపురం: అనంతపురం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో సీఐ, అటెండర్‌ మధ్య పంచాయితీ చర్చనీయాంశంగా మారింది. కళ్యాణదుర్గం ఎక్సైజ్ సీఐ హసీనా భాను తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. సీఐ హసీనా భాను.. అటెండర్‌ను చెప్పుతో కొట్టిన ఘటన వివాదంగా మారింది. రెండు క్రితమే జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందివివరాల ప్రకారం.. కల్యాణదుర్గం ఎక్సైజ్ సీఐ హసీనా భాను, అటెండర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తన పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ అటెండర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఐ హసీనా భాను. ఈ విషయమై తనకేమీ తెలియదని సదరు అటెండర్‌.. ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాట పెరిగి.. ఆగ్రహానికి లోనైన సీఐ హసీనా భాను.. అటెండర్‌ను చెప్పుతో కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.

Sebi urges Karvy investors to file claims before June 2 deadline approaches9
డెడ్‌లైన్‌ దగ్గరపడుతోంది.. క్లెయిమ్స్‌ దాఖలు చేయండి

న్యూఢిల్లీ: కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ (కేఎస్‌బీఎల్‌) ఇన్వెస్టర్లు తమ క్లెయిమ్‌లను దాఖలు చేసేందుకు గడువు తేదీ అయిన జూన్‌ 2 దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో మదుపరులు త్వరపడాలని, సత్వరం క్లెయిమ్‌లను ఫైల్‌ చేయాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సూచించింది.దీనిపై సహాయం కోసం ఎన్‌ఎస్‌ఈని సంప్రదించవచ్చని లేదా టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800 266 0050కి కాల్‌ చేయొచ్చని (ఐవీఆర్‌ ఆప్షన్‌ 5), లేదా defaultisc@nse.co.in ఈమెయిల్‌ ఐడీకి మెయిల్‌ చేయొచ్చని ఒక ప్రకటనలో పేర్కొంది. కేఎస్‌బీఎల్‌ తమ క్లయింట్ల సెక్యూరిటీలను తనఖా పెట్టి భారీగా నిధులు సమీకరించడం, వాటిని సొంత అవసరాల కోసం ఇతర అనుబంధ సంస్థలకు మళ్లించడం తెలిసిందే.

TVK Vijay Key Orders To party Leaders10
తమిళ పాలిటిక్స్‌.. పార్టీ నేతలకు విజయ్‌ కీలక ఆదేశాలు

సాక్షి, చెన్నై: పార్టీ పరంగా కమిటీలు, పదవుల భర్తీ ప్రక్రియలన్నీ ఈ నెలాఖరులోపు ముగించే విధంగా ముఖ్య నేతలకు తమిళగ వెట్రి కళగం నేత విజయ్‌ ఆదేశాలు ఇచ్చారు. పార్టీ కార్యక్రమాలను జూన్‌ నుంచి విస్తృతం చేయడానికి సిద్ధమయ్యారు. పార్టీ ఏర్పాటుతో జిల్లాల కమిటీలు, అనుబంధ విభాగాల కమిటీలను విజయ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లాలో ముఖ్య పదవులన్నీ దాదాపుగా భర్తీ అయ్యాయి. ఇతర కమిటీలలో కొన్ని పదవుల భర్తీ కసరత్తులు జరుగుతున్నాయి. ఎన్నికలకు మరికొన్ని నెలలు ఉన్న దృష్ట్యా, ఇక ప్రజల్లోకి వెళ్లే విధంగా కార్యాచరణలో విజయ్‌ ఉన్నారు.ప్రస్తుతం విజయ్‌ నటిస్తున్న జననాయగన్‌ చిత్ర షూటింగ్‌ ఈనెలతో ముగియనున్నట్టు తెలిసింది. ఆ తర్వాత జూన్‌ మొదటి వారం నుంచి విజయ్‌ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా ప్రజల్లో ఉండబోతున్నారు. ఇందులో భాగంగా విజయ్‌ పర్యటనలకు సంబంధించి గత రెండు రోజులుగా చెన్నైలో జిల్లాల కార్యదర్శుల సమావేశం విస్తృతంగా సాగుతోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్‌ పర్యవేక్షణలో ఈ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీ పరంగా అన్ని ప్రక్రియలను, పదవుల భర్తీని ఈ నెలాఖరులోపు ముగించాలని విజయ్‌ ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. జూన్‌ నుంచి ఆయన పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండబోతున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్‌ సైతం సిద్ధమవుతోంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement