Top Stories
ప్రధాన వార్తలు

‘పాకిస్తాన్ వద్దే కాదు.. చైనాకు కూడా ఆ సామర్థ్యం లేదు’
వాషింగ్టన్: ప్రపంచ దేశాల్లో అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థ కల్గిన దేశాల జాబితాలో భారత్ కు ప్రత్యేక స్థానం ఉందనే విషయం ఆపరేషన్ సిందూర్ తో మరోసారి నిరూపితమైంది. అత్యంత శక్తివంతమైన ఆర్మీ కల్గిన దేశాల జాబితాలో భారత్ ది నాల్గో స్థానం. ఇక్కడ చైనా కంటే భారత్ ఒక స్థానం కిందే ఉంది. టాప్ 5లో ఉన్న దేశాల్లో అమెరికా, రష్యా, చైనా, భారత్, దక్షిణకొరియాలు ఉన్నాయి. అయితే పాకిస్తాన్ తో ఉద్రిక్త పరిస్థితుల నడుమ భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో భారత్ బలం మరింత పెరిగిందని అంటున్నారు యుద్ధ రంగ నిపుణులు. అది కూడా అమెరికాకు చెందిన యుద్ధ రంగ నిపుణుడు రిటైర్డ్ కల్నల్ జాన్ స్పెన్సాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.పాకిస్తాన్ తో యుద్ధంలో భారత్ యుద్ధ నైపుణ్యంలో తిరుగులేదని నిరూపించుకుందన్నారు. అటు ఎఫెన్స్, ఇటు డిఫెన్స్ అయినా భారత్ శక్తి అమోఘమని కొనియాడారు. ఇక్కడ ప్రధానంగా భారత్ కు చెందిన బ్రహ్మోస్ క్షిపణిపై ప్రశంసలు కురిపించారు. భారత్ రక్షణ అమ్ముల పొదిలో ఉన్న బ్రహ్మోస్ పని తీరును ఎంత పొగిడినా తక్కువే అంటూ కితాబిచ్చారు. బ్రహ్మోస్ తరహా క్షిపణులు అటు పాకిస్తాన్ లోనే కాదు, చైనాకు కూడా లేవని బల్లగుద్దీ మరీ చెప్పారు. చైనా, పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలో భారత్ లో ఉన్న బ్రహ్మోస్ తో సరిపోల్చే క్షిపణులు కానీ ఆయుధ సామాగ్రి గానీ లేవన్నారు జాన్ స్పెన్సార్.. ఈ విషయాల్ని జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడేకు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు జాన్ స్పెన్సార్.‘ చైనా వైమానికి రక్షణ వ్యవస్థలు కానీ పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలు కానీ భారతదేశ రక్షణ వ్యవస్థలతో పోలిస్తే చాలా తక్కువ సామర్థ్యం కల్గి ఉన్నాయి. భారత్ బ్రహ్మోస్ క్షిపణి.. చైనా, పాకిస్తాన్ రక్షణ వ్యవస్థల్లో ఉన్న దానికంటే అధికరెట్లు బలంగా ఉంది. పాకిస్తాన్ లో ఉగ్ర స్థావరాలను, ఎయిర్ బేస్ లను భారత్ సునాయాసంగా ఛేదించడంలో బ్రహ్మోస్ కీలక పాత్ర పోషించింది. ఇక్కడ భారత్ క్లియర్ మెస్సేజ్ ఇచ్చింది. పాకిస్తాన్ లోని ఏ ప్రదేశాన్నైనా సునాయాసంగా ఛేదించగలదనే సందేశాన్ని భారత్ చాలా క్లియర్ గా పంపింది’ అని ఆయన పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: మోస్ట్ పవర్ ఫుల్ ఆర్మీ కల్గిన దేశాలు ఇవే..

వీరజవాన్ కుటుంబానికి వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం.. రూ.25 లక్షల చెక్కు అందజేత
శ్రీసత్యసాయి జిల్లా: ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా దేశ సరిహద్దుల్లోని కశ్మీర్లో ఈనెల 8న పాకిస్తాన్‌తో జరిగిన కాల్పుల్లో వీర మరణం పొందిన అగ్నివీర్ మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. దేశం కోసం ప్రాణాలర్పించిన మురళీ నాయక్ కుటుంబాన్ని ఈ నెల 13న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించిన సంగతి తెలిసిందే.. పార్టీ తరపున ఆయన రూ.25 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు.రూ.25 లక్షల రూపాయల చెక్కును వీర జవాను మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ అందజేశారు. గోరంట్ల మండలం కల్లి తండాకు వెళ్లి వీర జవాన్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం చెక్కును ఆమె అందించారు. కాగా, మూడు రోజల క్రితం (13వ తేదీన) మురళీ నాయక్ కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. మురళీనాయక్ స్వగ్రామమైన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చేరుకుని.. మురళీనాయక్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.మురళి తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరామ్ నాయక్‌లకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారు భావోద్వేగానికి గురయ్యారు. ‘మురళీ.. లే మురళీ.. జగన్ సార్ వచ్చారు.. లేచి సెల్యూట్ చేయి మురళీ’ అంటూ తండ్రి శ్రీరామ్ నాయక్ భావోద్వేగంతో పలికిన మాటలు అక్కడ ఉన్న వారందరికీ కన్నీళ్లు తెప్పించాయి. యావత్ దేశం గర్వపడేలా దేశ రక్షణలో విధులు నిర్వర్తించిన మురళీ కుటుంబానికి యావత్ దేశం రుణపడి ఉంటుందని వైఎస్ జగన్ అన్నారు.

‘సీఎంకు, డిప్యూటీ సీఎంకు మధ్య విబేధాలు’
హైదరాబాద్: రాష్ట్రం దివాలా తీసిందన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మంత్రి వర్గం అసంతృప్తిగా ఉందన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. ఈ రోజు(శుక్రవారం) మీడియాతో చిట్ చాట్ లో భాగంగా మాట్టాడుతూ.. ‘ సీఎం రేవంత్ కు, డిప్యూటీ సీఎంకు మధ్య విబేధాలు ఉన్నాయి. అందుకే సీఎం కామెంట్స్ ను మంత్రులు ఎవరూ సమర్థించలేదు. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ రెండుగా చీలిపోయింది. రేవంత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదని ఒరిజినల్ కాంగ్రెస్ మంత్రులు బాధపడుతున్నారు. మంత్రి వర్గ విస్తరణను సీఎం రేవంత్ అడ్డుకుంటున్నారు. కొత్తగా వచ్చేవారు సైతం వ్యతిరేకంగా ఉంటారని సీఎం రేవంత్ భావన. అందుకే గందరగోళ నివేదికలు హైకమాండ్ కి పంపి అడ్డుకుంటున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే ఎక్కడ బీసీలకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సి వస్తుందోనని జగన్నాటకం ఆడుతున్నారు. రేవంత్ లోపాలు, తప్పిదాలు అన్ని హైకమాండ్ దగ్గర ఉన్నాయి. లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే సీఎంను మార్చాలని హైకమాండ్ ఎదురుచూస్తోంది’ అని మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

బాబూ.. మీడియాతో పెట్టుకోకు!
ఎవరైనా బలవంతంగా ఇంట్లోకి చొరబడితే ఏం చేస్తాం?. ముందుగా అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఆ తరువాత పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. మరి పోలీసులే వ్యక్తుల ఇళ్లల్లోకి బలవంతంగా చొరబడితే? చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే? ప్రజల స్వేచ్ఛను కాపాడాల్సిన ప్రభుత్వమే వాటిని హరిస్తూ అరాచకాలకు పాల్పడితే? ఏపీలో ప్రస్తుత పరిస్థితి ఇదే.ఏపీ ప్రభుత్వం మిగిలిన పనులన్నీ పక్కనబెట్టి మరీ పోలీసులతో తప్పుడు కేసులు పెట్టిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను వేధిస్తూ చివరికి ప్రజల పక్షాన వార్తలు రాస్తున్న మీడియా గొంతు నొక్కేందుకూ ప్రయత్నిస్తోంది. సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి నివాసంపై పోలీసుల దాడిని కూడా ఈ కోణంలోనే చూడాలి. టీడీపీ, అధికారంలోకి వచ్చినప్పటి జనసేన, బీజేపీ కూటమి దుశ్చర్యలకు అంతు లేకుండా పోతోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎప్పుడూ మీడియాపై ఒక కన్నేసే ఉంచుతారు. బాకా మీడియాను ఒకరకంగా, వైఫల్యాలను, ప్రభుత్వ స్కామ్‌లను బయటపెట్టే మీడియాను మరో రకంగా చూస్తారు. మాట వినని జర్నలిస్టులను ఉద్యోగాల నుంచి తొలగించేలా యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకు వస్తారు కూడా. అనుకూలంగా ఉండే మీడియాకు రకరకాల రూపాలలో మేళ్లు చేస్తారు. తద్వారా ఆ యాజమాన్యాలను తన గుప్పెట్లో ఉంచుకుంటారు.1995లో తన మామ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక వర్గం మీడియా ద్వారా ఆయనపైనే వ్యతిరేక ప్రచారం అనండి.. దుష్ప్రచారం చేయించిన చరిత్ర చంద్రబాబుది అని అప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నవారు చెబుతుంటారు. ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా ఉంటూనే ఆయన తెలివిగా ఎన్టీఆర్ ప్రతిష్టను తగ్గించే వ్యూహాలు అమలు చేశారని ఆరోపణలున్నాయి. ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతిని బూచిగా చూపెట్టేందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలను బాగా వాడుకోగలిగేవారు. ఈనాడు చూడడానికే అసహ్యంగా ఉండే ఘోరమైన కార్టూన్లు ఎన్టీఆర్‌పై వేసేది. అయినా ఆ రోజుల్లో ఈ పత్రికలపై ఎన్టీఆర్ కేసులు పెట్టలేదు.మామను కూలదోసి ముఖ్యమంత్రి అయిన తరువాత చంద్రబాబు పాలన మాటెలా ఉన్నా అనుకూల మీడియా వ్యవస్థనైతే బాగానే ఏర్పాటు చేసుకున్నారు. మీటింగ్‌లు జరిగినా, జరగకపోయినా, కల్పిత కథనాలకు కొదవ ఉండేది కాదు. అదే టైమ్‌లో రాజకీయ ప్రత్యర్థులపై బురద చల్లే వ్యూహాలు పక్కాగా అమలయ్యేవి. ఆ రోజుల్లో కూడా ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాసే కొన్ని పత్రికలకు ప్రభుత్వ ప్రచార ప్రకటనలు నిలిపివేసే వారు. కానీ ఇప్పటిలా బరితెగించి మరీ కేసులు పెట్టేవారు కాదనే చెప్పాలి. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం చంద్రబాబుకు కొత్తకాదు. అయితే, ఆ హామీలను అమలు చేయకపోయినా ఎవరూ వాటిని గుర్తు చేయకూడదు! అందుకోసం ఆయన నానా ప్రయత్నాలూ చేస్తుంటారు.2014లో రైతుల సంపూర్ణ రుణమాఫీ కావచ్చు.. కాపుల రిజర్వేషన్ ఉద్యమం కావచ్చు.. మరేదైనా కావచ్చు. చంద్రబాబు పంథా ఒక్కటే. తనకు వ్యతిరేకంగా ఏదైనా జరుగుతుంటే అనుకూల మీడియా చేత వాటిని అణచివేసే ప్రయత్నం చేయడం. అంశం ఏదైనా.. టీవీ ఛానళ్లలో అనుకూల ప్రచారమే సాగాలన్నది ఆయన ఆకాంక్ష. కాపుల రిజర్వేషన్ విషయమే తీసుకుందాం.. ఇచ్చిన హామీ అమలుకు ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేపడితే ఆ విషయం ప్రజలలోకి వెళ్లనీయకుండా కొన్ని టీవీ చానళ్లను బ్లాక్ చేయడానికి యత్నించారు. ఇదే చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే మాత్రం అధికార పార్టీపై వ్యతిరేక వార్తలు రాయాలని జర్నలిస్టులకు నూరి పోస్తుంటారు. దానికి తగినట్లే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి తమ రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసం ఉన్నవి, లేనివి కల్పించి వార్తలు ఇచ్చేవి. ఈ మీడియా 2019-2024 మధ్యలో ముఖ్యమంత్రి జగన్‌పై కక్కినంత విషం బహుశా ప్రపంచంలోనే మరే మీడియా కక్కి ఉండదు. ఇందుకోసం పచ్చి అబద్ధాలు రాసేందుకూ వెనుకాడలేదు ఈ సంస్థలు.టీడీపీ మీడియా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్‌ను కించపరిచేలా కథనాలు ఇచ్చినా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ తదితరులు దారుణమైన వ్యాఖ్యలు చేసినా అప్పట్లో ఎవరిపై కేసులు పెట్టలేదు. కానీ 2024లో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు.. సాక్షి మీడియా అణచివేతకు యత్నిస్తూనే ఉన్నారు. పలువురు విలేకరులపై పోలీసు కేసులు నమోదవడం ఇందుకు నిదర్శనం. నెల్లూరు జిల్లా కావలి వద్ద ఎప్పుడో మూడేళ్ల క్రితం శిలాఫలకం పడవేశారంటూ అప్పటి ఎమ్మెల్యేతోపాటు విలేకరిపై కూడా కేసు పెట్టారట. అప్పుడు ఏం చేశారో కాని, కూటమి అధికారంలోకి వచ్చాక, టీడీపీ, జనసేన వారు లెక్కలేనని శిలా ఫలకాలను ధ్వంసం చేసినా ఒక్క కేసు నమోదు కాలేదు. మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఎవరెవరో ఫిర్యాదు చేయడం పోలీసులు హుటాహుటిన వైఎస్సార్సీపీ వారిని అరెస్టు చేయడం సాధారణమై పోతోంది.ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేశ్ ‘రెడ్ బుక్’పేరుతో కక్ష రాజకీయాలు చేస్తున్నారు. ఎందుకు ఇవన్నీ?. చాలా సింపుల్ ప్రభుత్వ తప్పులు ఎవరూ ఎత్తి చూపకూడదు. సూపర్ సిక్స్ తో సహా ఎన్నికల సమయంలో ఇచ్చిన 150 హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ఎవరూ ప్రశ్నించకూడదు. గత ప్రభుత్వం చేసిన అప్పులపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరుల అసత్యపు ప్రచారాన్ని ఎవరూ గుర్తు చేయకూడదు. ఏడాది తిరగకుండానే కూటమి ప్రభుత్వం చేసిన రూ.1.5 లక్షల కోట్ల అప్పులు ఎందుకు? దేనికి ఖర్చుపెట్టారు? అని ఎవరూ అడగకూడదు. ప్రభుత్వంలో జరుగుతున్న కుంభకోణాలను ఎవరూ వెలికి తీయకూడదు. సాక్షి మీడియా ఇవన్నీ చేస్తున్నందునే చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టి దాడి చేస్తోంది.నిజానికి సాక్షి మీడియా ప్రతీ వార్తనూ ఆధార సహితంగానే రాస్తుంది. సౌర శక్తి ఒప్పందాలనే తీసుకుందాం. జగన్ హయాంలో యూనిట్‌కు రూ.2.49లకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంస్థ సెకీతో ఒప్పందం చేసుకుంది. ఇందుకు గగ్గోలు పెట్టిన చంద్రబాబు, ఎల్లోమీడియా..లక్ష కోట్ల రూపాయల నష్టం జరిగిపోయిందని ప్రచారం చేశాయి. తీరా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిందేమిటి? అదే విద్యుత్తును రూ.4.60లకు కొనుగోలు చేస్తున్నారు. అంటే.. యూనిట్‌కు దాదాపు రెండు రూపాయలు ఎక్కువ పోసి కొంటున్నారన్నమాట. అయినా సరే.. దీనిపై ఈనాడు, ఆంధ్రజ్యోతుల్లో ఒక్క వార్త కూడా రాలేదు. సాక్షి మాత్రం పక్కా ఆధారాలతో జరిగిన అవినీతిని వివరించారు. సౌర శక్తి కొనుగోళ్ల విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో చంద్రబాబు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారింది.అలాగే.. విశాఖలో టీసీఎస్‌కు 99 పైసలకు ఎకరా భూమి ఇవ్వడం, ఊరు, పేరు లేని ఒక కంపెనీకి అరవై ఎకరాలు కట్టబెట్టడం, అమరావతి రాజధాని నిర్మాణాల పేరుతో అధిక రేట్లకు ఇష్టారాజ్యంగా టెండర్లు కేటాయించడం, అప్పుల కోసం ఏకంగా రాష్ట్ర ఖజానాను కూడా తాకట్టు పెట్టడం పెన్షన్లు మినహా మరే హామీ అమలు చేయకపోవడంతో ప్రజలలో అసంతృప్తి నెలకొనడం మొదలైన వార్తలను సాక్షి మీడియా ఇస్తోంది. ఏలికలకు ఇది పంటికింద రాయిలా మారింది. దీంతో సాక్షిని ఇబ్బంది పెట్టడానికి యత్నిస్తోంది. ఈ క్రమంలో ఆధారాలు లేని మద్యం స్కామ్‌ను సృష్టించి వైఎస్సార్సీపీ నేతల అరెస్టుకు చంద్రబాబు.. పోలీసులను ప్రయోగించారు. నిందితులు సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి ఇంటిలో ఉన్నారన్న అనుమానం వచ్చిందని పోలీసులు.. చెప్పా పెట్టకుండా విజయవాడలో ఆయన ఇంటిపై పడ్డారు. నిజంగా అలాంటి అనుమానం ఉంటే ఏమి చేయాలి? సెర్చ్ వారంటే ఇచ్చి సోదాలు చేయాలి. అసలు ఒక పత్రికా సంపాదకుడి ఇంటికి అంత ధైర్యంగా వెళ్లారంటే ఈ ప్రభుత్వం ఎంత నియంతృత్వంగా వ్యవహరిస్తున్నది అర్థం చేసుకోవచ్చు.సాక్షి సిబ్బందిని మానసికంగా వేధించడానికి ఇలా చేసినట్లు తెలుసుకోవడం కష్టం కాదు. ఇంత మాత్రానికే సాక్షి మీడియా వణికిపోతుందా?. 2008 నుంచి సాక్షి మీడియా ఇలాంటి ఆటుపోట్లను ఎన్నింటినో ఎదుర్కొంది. ఈ మీడియాను దెబ్బతీయడానికి చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిసి ఎన్ని కుట్రలు పన్నింది.. ఎన్ని కేసులు పెట్టించింది తెలియనిది కాదు. 2014 టర్మ్‌లో కూడా సాక్షిని లేకుండా చేయాలని ప్రయత్నించి విఫలం అయ్యారు. తిరిగి ఈ టర్మ్‌లో అంతకన్నా ఎక్కువగా కక్ష సాధింపు చర్యలకు తెగిస్తున్నారు. ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి వాటిని సమర్థంగానే ఎదుర్కొన్నారు. పోలీసులు మూడు గంటలపాటు అక్కడ ఉన్నా వారికి ఏమీ దొరకలేదు. దాంతో వారు సైలెంట్‌గా వెళ్లిపోక తప్పలేదు. సెర్చ్ వారంట్ లేకుండా వెళ్లడం ద్వారా పోలీసులు దుశ్చర్యకు పాల్పడినట్లు అయింది.ఇక, ఎమర్జన్సీలో సైతం ఇందిరాగాంధీ ఇలాంటి పద్దతులు అనుసరించి మీడియా గొంతు నులమాలని విశ్వయత్నం చేశారు. కానీ, అంతిమంగా ఆమె ఘోర పరాజయాన్ని మూట కట్టుకున్నారు. తొలుత ఇందిరాగాంధీ శిష్యుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి, ఆ తర్వాత తెలుగుదేశంను తన అధీనంలోకి తెచ్చుకుని రాజకీయం చేస్తున్న చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు అవే పద్దతులు అవలంభిస్తున్నారు. చరిత్ర చెప్పిన పాఠాలను మర్చిపోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఎవరికైనా ఓటమి తప్పదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

‘కొండా సురేఖకు నా అభినందనలు’: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: మంత్రి కొండా సురేఖకు మాజీ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. మంత్రులు కమిషన్లు తీసుకోకుండా ఏ పనిచేయరంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందిస్తూ ట్వీట్ చేశారు.ఆ ట్వీట్లో ‘కనీసం ఇప్పటికైనా కొన్ని నిజాలు బయట పెట్టినందుకు మంత్రి కొండా సురేఖకు నా హృదయపూర్వక అభినందనలు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ‘కమీషన్ సర్కార్’గా మారిపోయింది. ఇది రహస్యమే కాదు. ఓపెన్ సీక్రెట్. అంతేకాదు, ఈ ప్రభుత్వంలో ఫైల్స్‌పై సంతకం చేసేందుకు మంత్రులు, వారి సహచర మంత్రులు 30శాతం కమిషన్ తీసుకుంటున్నారు. ఇదే కమిషన్ల వ్యవహరంలో సచివాలయంలో పలువురు కాంట్రాక్టర్లు ధర్నా చేసిన విషయం గుర్తుందా? అని ప్రశ్నించారు. ఆ ఘటనే ఈ ప్రభుత్వంలో మంత్రుల కమిషన్ల భాగోతాన్ని బహిర్గతం చేసింది. ఈ సందర్భంగా కొండా సురేఖని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కమిషన్లు తీసుకుంటున్న మంత్రుల వివరాల్ని బయటపెట్టాలి. ప్రజల ముందు బహిర్ఘతం చేయాలని అన్నారు. ఇదే అంశంపై రాహుల్ గాంధీ,రేవంత్‌రెడ్డిలు వారి సొంత కేబినెట్ మంత్రి చేసిన ఆరోపణలపై మీరు దర్యాప్తుకు ఆదేశించగలరా?’అని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు. Many congratulations to Minister Konda Surekha garu for finally speaking some truths!Congress in Telangana runs a “commission sarkaar”, and it's unfortunate this has become an open secret in TelanganaIn this 30% commission government, ministers, according to their own… https://t.co/3dMd2yDfb5— KTR (@KTRBRS) May 16, 2025

ఆఫీస్‌కు రాకపోతే వేరే ఉద్యోగం చూసుకోండి..
రిమోట్ వర్క్.. అదేనండి వర్క్ ఫ్రమ్ హోమ్. చాలా మంది ఉద్యోగులకు ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. ఓపక్క కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే మరో వైపు ఉద్యోగాన్ని చూసుకుంటున్న వారికి ఈ విధానం చాలా అనువుగా ఉంటోంది. అయితే కోవిడ్-19 మహమ్మారి విజృంభణ సందర్భంగా అమలులోకి వచ్చిన ఈ రిమోట్ వర్క్ విధానం నెమ్మదిగా తొలగిపోతోంది. చాలా కంపెనీలు ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు పిలుస్తున్నాయి.సౌకర్యవంతమైన ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి అలవాటు పడినవారు ఆఫీసులకు తిరిగివెళ్లడానికి ఇష్టపడటం లేదు. చాలా కంపెనీలు ఉద్యోగులను బలవంతంగానైనా ఆఫీసులకు రప్పిస్తున్నాయి. ఇలాగే ఉద్యోగులను ఆఫీసులకు రావాలని ఆదేశించడం ఓ ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీలో ఎలా బెడిసికొట్టిందో.. ఉద్యోగులు ఏం చేశారో చెబుతూ ఆ కంపెనీలో పనిచేసే వ్యక్తి రెడ్డిట్‌లో షేర్ చేసిన స్టోరీ ఆసక్తికరంగా మారంది.ఆఫీస్‌కు రాకపోతే ఏం చేస్తారు?కోవిడ్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేసిన కంపెనీ.. ఆ సమయంలో చాలా మందిని రిమోట్ వర్క్ విధానంలోనే నియమించుకుంది. కానీ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అందరూ క్రమంగా ఆఫీసులకు రావాలని యాజమాన్యం ఆదేశించింది. అసలు సమస్య ఏంటంటే.. దాదాపు చాలా మంది రిమోట్ వర్క్ విధానంలోనే ఉద్యోగాల్లో చేరారు. కొంత మంది తమ ప్రాంతాలకు మకాం మార్చారు. ఇప్పుడు వీళ్లకు ఎటువంటి ఆర్థిక సహకారం అందించకుండా ఏడాదిలోగా ఆఫీసులకు వచ్చేయాలని కంపెనీ చెబుతోంది.దీంతో ఉద్యోగులు గందరగోళంలో పడిపోయారు. ఈక్రమంలో కంపెనీ వైడ్ టౌన్ హాల్ సమావేశంలో ఆఫీస్‌కు రావడానికి అయిష్టంగా ఉన్నవారికి మినహాయింపులేమైనా ఉంటాయా అని ఓ ఉద్యోగి నేరుగా సీఈవోనే అడిగేశారు. దానికి సీఈవో స్పందిస్తూ "మీరు ఇంటి నుండి పని చేయాలనుకుంటే, వేరే చోట ఉద్యోగం చూసుకోండి" అంటూ బదులిచ్చారు. దీంతో అవాక్కైన ఉద్యోగులు ఆన్లైన్ కాల్స్‌లోకి రావడం మానేశారు. చాలా మంది వెంటనే రాజీనామా చేశారు. ఎక్కువ మంది వెళ్లిపోవడంతో కంపెనీకి షాక్ తగిలింది. క్యూసీ ఉద్యోగులతోనే యాప్ డెవలప్మెంట్ చేయించాల్సి వచ్చింది.

‘రోహిత్ శర్మ జట్టులో లేకపోయినా పెద్దగా నష్టమేమీ లేదు’
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)ను ఉద్దేశించి సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కలినన్ (Daryll Cullinan) ఘాటు వ్యాఖ్యలు చేశాడు. టెస్టు క్రికెట్లో భారత్‌కు రోహిత్ గొప్పగా చేసిందేమీ లేదని.. అతడు రిటైర్ అయినా టీమిండియాకు పెద్దగా నష్టం లేదని పేర్కొన్నాడు.అదే విధంగా.. విరాట్ కోహ్లి (Virat Kohli) లేకపోయినా.. బౌలర్లు రాణిస్తే భారత్ ఇంగ్లండ్‌లో గట్టెక్కగలదని డారిల్ కలినన్ అభిప్రాయపడ్డాడు. కాగా గత కొంతకాలంగా టెస్టుల్లో ఫామ్‌లేమితో సతమతమవుతున్న రోహిత్ శర్మ ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.న్యూజిలాండ్‌తో స్వదేశంలో 3-0తో రోహిత్ సేన వైట్‌వాష్ కావడం.. ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీని 3-1తో చేజార్చుకోవడంతో.. హిట్‌మ్యాన్‌పై విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ సిడ్నీలో ఆఖరిదైన ఐదో టెస్టు నుంచి తప్పుకొన్నా.. టెస్టుల్లో కొనసాగుతానని నాడు రోహిత్ స్పష్టం చేశాడు.రో- కో లేకుండానేఈ క్రమంలో ఇంగ్లండ్ పర్యటనలో అతడే పగ్గాలు చేపడతాడనే వార్తలు రాగా.. అనూహ్యంగా మే 7న రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత ఆరురోజులు తిరిగే లోపే విరాట్ కోహ్లి కూడా సంప్రదాయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఫలితంగా.. వీరిద్దరు లేకుండా యువ భారత జట్టు జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడబోతోంది.ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కలినన్ హిందుస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ గురించి చాలా రోజులుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికి అతడు సరైన నిర్ణయం తీసుకున్నాడు.రోహిత్ లేకపోయినా నష్టమేమీ లేదునిజం చెప్పాలంటే.. టెస్టుల్లో రోహిత్ కెరీర్ అంత గొప్పగా ఏమీలేదు. సొంతగడ్డ మీదైనా.. విదేశాల్లోనైనా అదే తీరు. ఇటీవల ఆస్ట్రేలియాతో సిరీస్‌లో కెప్టెన్‌గా ముందుండి నడిపించాల్సింది పోయి.. అతడే దారుణంగా విఫలమయ్యాడు. కాబట్టి రోహిత్ వీడ్కోలు పలకడం వల్ల భారత టెస్టు క్రికెట్‌కు వచ్చిన నష్టమేమీ లేదు’’ అని డారిల్ కలినన్ పేర్కొన్నాడు.బౌలర్లంతా ఫిట్‌గా ఉంటే చాలుఇక ఇంగ్లండ్‌తో సిరీస్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘టీమిండియా బౌలర్లందరూ ఫిట్‌గా ఉండి.. రాణించినట్లయితే ఇంగ్లండ్‌లో భారత్‌కు గెలుపు అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి’’ అని కలినన్ అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లి లేకపోయినా రాణించగల సత్తా టీమిండియాకు ఉందని పేర్కొన్నాడు. కాగా జూన్ 20 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్‌తో టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ తన ప్రయాణం మొదలుపెట్టే అవకాశం ఉంది.కాగా 58 ఏళ్ల డారిల్ కలినన్ 1993 నుంచి 2001 వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. సౌతాఫ్రికా తరఫున 70 టెస్టులు, 138 వన్డేలు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. సంప్రదాయ క్రికెట్లో 4554 పరుగులు, వన్డేల్లో 3860 రన్స్ సాధించాడు. మరోవైపు.. రోహిత్ శర్మ టీమిండియా తరఫున 67 టెస్టుల్లో 4301 పరుగులు చేయగా.. విరాట్ కోహ్లి 123 టెస్టులాడి 9230 రన్స్ సాధించాడు.చదవండి: మాట తప్పారు!.. ఆర్సీబీకి తిరిగి ఆడాలని అనుకోలేదు: పాటిదార్

‘ట్రైలర్ మాత్రమే చూశారు.. పాక్ తీరు మారకపోతే పూర్తి సినిమా చూపిస్తాం’
గాంధీనగర్: ఆపరేషన్ సిందూర్ (operation sindoor) ముగియలేదు. ట్రైలర్ మాత్రమే చూశారు. పాక్ తీరు మార్చుకోకపోతే సినిమా చూపిస్తాం’ అంటూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (rajnath singh) హెచ్చరికలు జారీ చేశారు. శుక్రవారం గుజరాత్‌లోని భుజ్ ఎయిర్ బేస్‌లో ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న ఎయిర్ వారియర్స్‌తో రాజ్‌నాథ్ భేటీ అయ్యారు. ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న ఎయిర్ వారియర్స్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అనంతరం, ఆయన మీడియా మాట్లాడారు. పాకిస్తాన్‌పై భారత్ విజయానికి ఎయిర్‌బేస్ సాక్ష్యం.పహల్గాం దాడి, ఆ తర్వాత ఆపరేషన్ సిందూర్‌ను ప్రపంచమంతా చూసింది. పాకిస్తాన్లో ఉగ్రశిబిరాలను ధ్వంసం చేశాం. బ్రహ్మోస్ మిస్సైల్ పవరేంటో పాకిస్తాన్‌కు చూపించాం. బోర్డర్ దాటకుండానే పాక్ ఉగ్ర శిబిరాలను నాశనం చేశాం. పాకిస్తాన్ ముఖ్య ఉగ్ర కేంద్రాన్ని ధ్వంసం చేశాం. నయా భారత్ ఎంటో ప్రపంచానికి తెలిసింది.మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజహార్‌కు పాక్ రూ.14కోట్లు ఇచ్చింది. ప్రపంచానికి మన సత్తా ఏంటో కళ్లకు కట్టేలా చూపించాం. మన వాయిసేన అసమాన ప్రతిభ కనబర్చి ప్రత్యర్థులను వణికించింది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఫండింగ్ చేస్తోంది. ఇది ఒక ట్రైలర్ మాత్రమే.. పాక్‌కు అసలు సినిమా ముందుంది’ అంటూ రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. Addressing the brave Air Warriors at the Air Force Station in Bhuj (Gujarat). https://t.co/3TGhBlyxFH— Rajnath Singh (@rajnathsingh) May 16, 2025

‘లెవన్’ మూవీ రివ్యూ
నవీన్ చంద్ర హీరోగా నటించిన తాజా చిత్రం ‘లెవన్’. సుందర్ సి వద్ద కలకలప్పు 2, వంద రాజవతాన్ వరువేన్, యాక్షన్ వంటి చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన లోకేశ్ అజ్ల్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. AR ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్,రేయా హరి నిర్మించిన ఈ చిత్రం నేడు(మే 16) తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.‘లెవన్’ కథేంటంటే.. అరవింద్(నవీన్ చంద్ర) ) ఓ సిన్సియర్ పోలీసాఫీసర్. ఏసీపీ హోదాలో వైజాగ్‌కి ట్రాన్స్ఫర్ అవుతాడు. వచ్చీరావడంతోనే ఓ దొంగతనం కేసును ఈజీగా సాల్వ్ చేస్తాడు. అదే సమయంలో వైజాగ్‌లో వరుస హత్యలు జరుగుతుంటాయి. తొలుత ఈ కేసును ఏసీసీ రంజిత్ కుమార్ (శశాంక్) డీల్ చేస్తాడు. విచారణ మధ్యలోనే అతనికి యాక్సిడెంట్ అవుతుంది. దీంతో ఈ కేసు అరవింద్ చేతికి వస్తుంది. అతనికి సహాయంగా ఎస్సై మనోహర్ ఉంటాడు. వీరిద్దరు కలిసి చేసిన విచారణలో చనిపోయినవారంతా కవలలు అని, ఇద్దరిలో ఒకరిని మాత్రమే చంపుతున్నారని తేలుతుంది. ఈ హత్యలు చేస్తున్న సీరియల్ కిల్లర్ ఎవరు? ఎందుకు చేస్తున్నాడు? ట్విన్స్‌లో ఒకరిని మాత్రమే ఎందుకు చంపుతున్నాడు? వారితో సీరియల్ కిల్లర్‌కు ఉన్న సంబంధం ఏంటి? ఏసీపీ అరవింద్ ఈ కేసును ఎలా డీల్ చేశాడు? చివరకు హంతకుడిని పట్టుకున్నారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. విలన్ క్రైమ్ చేయడం... పోలీసు అయిన హీరో ఆ కిల్లర్‌ని పట్టుకోవడం..అతనికో ప్లాష్ బ్యాక్ స్టోరీ..ఇలా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ల ఫార్మాట్ దాదాపు ఒకేలా ఉంటుంది. దీంట్లో క్రైమ్ జరిగిన తీరు.. వాటి చుట్టు అల్లుకున్న మైండ్ గేమ్, హీరో ఎంత తెలివిగా ఈ కేసును ఛేధించాడనే అంశాలపై సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సినిమాలకు బిగిసడలని స్క్రీన్‌ప్లే అవసరం. ప్రేక్షకుడు ఒక్క క్షణం కూడా తలను పక్కకు తిప్పుకోకుండా ఉత్కంఠ కలిగించే సన్నివేశాలతో కథనాన్ని నడిపించాలి. ‘లెవన్’ ఈ విషయంలో ఇది కొంతవరకు సఫలం అయింది. విలన్ ప్లాట్ రొటీన్‌గా ఉన్న ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కొత్తగా ఉంటుంది. ఈ సినిమాలో వచ్చే ట్విస్టులను ముందుగా డీకోడ్ చేయడం కొంతవరకు కష్టమే. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను రెగ్యులర్‌గా చూసేవాళ్లు విలన్ ఎవరనేది కనిపెట్టినా.. వాళ్ల మైండ్‌తో కూడా గేమ్ ఆడేలా స్క్రీన్‌ప్లే ఉంటుంది. సినిమా ప్రారంభంలో కథనం కాస్త నెమ్మదిగా సాగుతుంది. సీరియల్ కిల్లింగ్ కేసు హీరో చేతికి వచ్చిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. అదే సమయంలో హీరోహీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ ఇరికించినట్లుగా అనిపిస్తుంది. ప్రీఇంటర్వెల్ నుంచి కథనం మరింత ఆసక్తికరంగా సాగుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. మధ్యలో వచ్చే ప్లాష్‌బ్యాక్ స్టోరీ హృదయాలను హత్తుకుంటుంది. ఇక చివరిలో వచ్చే ట్విస్టులు అదిరిపోతాయి. ఈ కథకి లెవన్ అనే టైటిల్ ఎందుకు పెట్టారనేదానితో పాటు ప్రతి సీన్‌కి లాజిక్ ఉంటుంది. మొత్తంగా ‘లెవన్’ సినిమా రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ కథే అయినా.. కథనం మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. నవీన్ చంద్రకు పోలీసు పాత్రలు చేయడం కొత్త కాదు. ఈ మధ్య ఆయన ఎక్కువ ఇలాంటి పాత్రలే చేశాడు. ఇందులో ఏసీపీ అరవింద్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆయన బాడీలాంగ్వేజ్, లుక్ నిజమైన పోలీసుల అధికారిని గుర్తు చేసేలా ఉంటుంది. హీరోయిన్ రియా హరి పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. ఎస్సై మనోహర్‌గా దిలీపన్, పోలీసు ఉన్నతాధికారిగా ఆడుకాలం నరేన్, ఏసీపీ రంజిత్ కుమార్‌గా శశాంక్ తమ పాత్రలకు న్యాయం చేశారు. కిరీటీ, రవివర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. డి ఇమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయింది. తనదైన బీజీఎంతో అదరగొట్టేశాడు. పాటలు ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నంతా ఉన్నాయి.

హ్యాట్సాఫ్.. పోలీస్.. ఇంట్రస్టింగ్ స్టోరీ
అబిడ్స్: కుటుంబ కలహాలతో కలత చెందిన ఓ వైద్యురాలు హైదరాబాద్ ఉమెన్ పోలీస్ డీసీపీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డీసీపీ లావణ్య జాదవ్‌ను కలిసి తన సమస్యను వివరించగా ఆమెను షాహినాయత్‌గంజ్‌లోని సౌత్‌వెస్ట్ జోన్ మహిళా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలని సూచించారు. అక్కడికి వచ్చిన వెంటనే ఆమె మహిళా పోలీసులు, ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాసరావులను కలిసి తన వివరాలను చెప్పారు. వెంటనే వారు డాక్టర్ ఆయేషా ఫిర్యాదు చేసిన వ్యక్తిపై కేసును నమోదు చేసి కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆయేషా మాట్లాడుతూ.. హైదరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడడం, వారికి కౌన్సిలింగ్, సలహాలు ఇవ్వడం ఎంతో ధైర్యాన్ని ఇచి్చందన్నారు. తాను ఎంతో భయంగా మహిళా పోలీస్స్టేన్కు వచ్చానని కానీ ఇక్కడ పోలీసులు ఎంతో మర్యాదగా తన కేసును తీసుకొని పరిష్కారం దిశగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తనకేసు కాకుండా మిగతా మహిళల కేసులు కూడా పరిష్కారమే దిశగా ప్రయత్నిస్తున్నారని అందరికి మర్యాదనిస్తూ వారిలోని భయాన్ని దూరం చేస్తున్నారని తెలిపారు. చదవండి: Cannes Film Festival 2025: కాన్స్‌లో మెరిసిన 17 ఏళ్ల యువతార, బాలీవుడ్ అగ్ర హీరోయిన్లను..!ప్రతి ఒక్క మహిళా ధైర్యంగా తనకు జరుగుతున్న అన్యాయాన్ని మహిళా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చునని భరోసా కలిగిందన్నారు. హైదరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావును కలిసి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: బిగ్ బాస్ విన్నర్ లివర్‌లో టెన్నిస్ బాల్ అంత కణితి : వైరల్ పోస్ట్
కంబాలపల్లి C/O ప్రభుత్వోద్యోగులు
‘ఇక్కడి నుంచి పో..’: సహనం కోల్పోయిన స్టార్క్.. వీడియో వైరల్
గూగుల్ కొత్త ఫీచర్.. కొట్టేసిన ఫోన్ పనిచేయదు!
ఈ నెల 19 నుంచి ఏపీ ఈఏపీ సెట్
మద్యం కేసు రాజకీయ ప్రేరేపితం: పేర్ని నాని
నేను కోచ్‌గా ఉండుంటే.. రోహిత్‌కు అలా జరిగేది కాదు: రవిశాస్త్రి
వెండి గాజుల కోసం.. తల్లి చితిపై పడుకుని..కొడుకు కాదు!
వీర జవాన్ మురళి నాయక్‌కు టాలీవుడ్ కమెడియన్ నివాళి
‘సీఎంకు, డిప్యూటీ సీఎంకు మధ్య విబేధాలు’
'వాటర్ బర్త్' అంటే..? నటి కల్కి కోచ్లిన్ ప్రసవ అనుభవం..
‘త్వరలోనే తెలంగాణ సీఎం మార్పు.. రేవంత్ స్థానంలో కేసీఆర్’
గుడ్ న్యూస్.. సుడిగాలి సుధీర్ ఇంట్లో సంబరాలు
భారత్‌కు పాకిస్తాన్ లేఖ
పెళ్లి పెద్దగా పెద్దపల్లి కలెక్టర్
ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన..
దిగొచ్చిన బంగారం ధర! తులం ఎంతంటే..
మన వేలితో మన కన్నే..!
పసిడి ఢమాల్.. రూ.వేలల్లో తగ్గిన బంగారం
ఏపీ పోలీస్ ఆఫీసర్‌గా బాలకృష్ణ
ఇదే రీతిలో ‘సూపర్ సిక్స్ హామీలను’ అడిగే ప్రజలకు ‘ట్యాక్స్’ అని చెప్పి నోరెత్తకుండా చేద్దాం సార్!
ఈ రాశి వారికి ముఖ్యమైన పనులలో విజయం.. ఉద్యోగలాభం
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం.. భూలాభాలు
అలాగే ‘మన టెర్రరిస్టులు’ కూడా 100 మంది పోయారని చెప్పండి!
మళ్లీ రీమేక్ నే నమ్ముకున్న ఆమిర్.. మక్కీకి మక్కీ.. ట్రైలర్ రిలీజ్
..పన్లోపని తుర్కియే అధ్యక్షుడిని కూడా పిలుద్దాం సార్! కొంతకాలం పాలన చూసుకోమని చెబుదాం!
ఈ రాశి వారికి వ్యాపారాలలో ఊహించని లాభాలు.. ఉద్యోగాలలో హోదాలు
వాళ్లు ఇస్తానన్న విమానం ఇదేనట సార్!
కోటి ఇస్తావా.. ఫొటోలు అప్లోడ్ చేయమంటావా?
మా సైనికులు చనిపోయారు.. మరణాలపై పాక్ ప్రకటన
యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ గ్లోబ్ ముందు నిలబడి యుద్ధాన్ని నేనే ఆపా అని పెద్దగా అరుస్తున్నారు డాక్టర్!
కంబాలపల్లి C/O ప్రభుత్వోద్యోగులు
‘ఇక్కడి నుంచి పో..’: సహనం కోల్పోయిన స్టార్క్.. వీడియో వైరల్
గూగుల్ కొత్త ఫీచర్.. కొట్టేసిన ఫోన్ పనిచేయదు!
ఈ నెల 19 నుంచి ఏపీ ఈఏపీ సెట్
మద్యం కేసు రాజకీయ ప్రేరేపితం: పేర్ని నాని
నేను కోచ్‌గా ఉండుంటే.. రోహిత్‌కు అలా జరిగేది కాదు: రవిశాస్త్రి
వెండి గాజుల కోసం.. తల్లి చితిపై పడుకుని..కొడుకు కాదు!
వీర జవాన్ మురళి నాయక్‌కు టాలీవుడ్ కమెడియన్ నివాళి
‘సీఎంకు, డిప్యూటీ సీఎంకు మధ్య విబేధాలు’
'వాటర్ బర్త్' అంటే..? నటి కల్కి కోచ్లిన్ ప్రసవ అనుభవం..
‘త్వరలోనే తెలంగాణ సీఎం మార్పు.. రేవంత్ స్థానంలో కేసీఆర్’
గుడ్ న్యూస్.. సుడిగాలి సుధీర్ ఇంట్లో సంబరాలు
భారత్‌కు పాకిస్తాన్ లేఖ
పెళ్లి పెద్దగా పెద్దపల్లి కలెక్టర్
ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన..
దిగొచ్చిన బంగారం ధర! తులం ఎంతంటే..
మన వేలితో మన కన్నే..!
పసిడి ఢమాల్.. రూ.వేలల్లో తగ్గిన బంగారం
ఏపీ పోలీస్ ఆఫీసర్‌గా బాలకృష్ణ
ఇదే రీతిలో ‘సూపర్ సిక్స్ హామీలను’ అడిగే ప్రజలకు ‘ట్యాక్స్’ అని చెప్పి నోరెత్తకుండా చేద్దాం సార్!
ఈ రాశి వారికి ముఖ్యమైన పనులలో విజయం.. ఉద్యోగలాభం
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం.. భూలాభాలు
అలాగే ‘మన టెర్రరిస్టులు’ కూడా 100 మంది పోయారని చెప్పండి!
మళ్లీ రీమేక్ నే నమ్ముకున్న ఆమిర్.. మక్కీకి మక్కీ.. ట్రైలర్ రిలీజ్
..పన్లోపని తుర్కియే అధ్యక్షుడిని కూడా పిలుద్దాం సార్! కొంతకాలం పాలన చూసుకోమని చెబుదాం!
ఈ రాశి వారికి వ్యాపారాలలో ఊహించని లాభాలు.. ఉద్యోగాలలో హోదాలు
కోటి ఇస్తావా.. ఫొటోలు అప్లోడ్ చేయమంటావా?
వాళ్లు ఇస్తానన్న విమానం ఇదేనట సార్!
మా సైనికులు చనిపోయారు.. మరణాలపై పాక్ ప్రకటన
యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ గ్లోబ్ ముందు నిలబడి యుద్ధాన్ని నేనే ఆపా అని పెద్దగా అరుస్తున్నారు డాక్టర్!
సినిమా

టాలీవుడ్ మూవీలో అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్.. ఈవెంట్లో సందడి!
గత కొద్దిరోజులుగా 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్ సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కాసారిగా వీళ్లు స్టార్స్ అయిపోయారు. పచ్చళ్ల బిజినెస్ మూతపడినప్పటికీ వీరికి ఫాలోయింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఓ కస్టమర్‌తో వీరి సంభాషణ వైరల్ కావడంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన వీరి మాట్లాడిన డైలాగ్స్‌పై మీమ్స్, ట్రోల్స్ ఓ రేంజ్లో వచ్చాయి.ఇదంతా పక్కనపెడితే అలేఖ్య సిస్టర్స్‌లో ఒకరైన రమ్య సడన్‌లో సినిమా ఈవెంట్లో కనిపించింది. టాలీవుడ్ హీరో అశ్విన్ బాబు నటించిన తాజా చిత్రం వచ్చినవాడు గౌతమ్. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఈవెంట్లోనే రమ్య సందడి చేసింది. వేదికపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పక్కనే కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను సైతం రమ్య సోషల్ మీడియాలో షేర్ చేసింది.అయితే ఈవెంట్‌కు రమ్య హాజరు కావడంపై భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. పచ్చళ్ల బిజినెస్‌తో ఫేమస్ అయి.. ఏకంగా సినిమా ఛాన్స్ కొట్టేసిందా అంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరేమో ఏకంగా సెలబ్రిటీ అయిపోయారా? అంటూ కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఏదేమైనా రమ్య టాలీవుడ్ మూవీ ఈవెంట్లో కనిపించడంతో మరోసారి అలేఖ్య చిట్టి పికిల్స్ టాపిక్ తెరపైకి వచ్చింది. మరి అందరూ ఊహించినట్లుగానే రమ్య ఈ సినిమాలో నటించిందా? లేదా అన్నది తెలియాలంటే ఆమె దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిందే.గతంలో అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్‌లలో ఒకరికి తప్పుకుండా బిగ్‌బాస్‌లోకి ఛాన్స్ వస్తుందని నెట్టింట వైరలైంది. కానీ, రమ్యకు ఛాన్స్ దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని టాక్ వినిపించింది. మోడ్రన్ డ్రెస్‌లతో ఆమె రీల్స్ ఎక్కువగా ట్రెండ్ అవుతుంటాయి కూడా.. గతంలో జియోహాట్‌స్టార్‌లో పికిల్స్‌కు సంబంధించిన ఒక సీన్‌ను వారు షేర్ చేశారు. ప్రభాస్ ఛత్రపతి సినిమా నుంచి ఒక వీడియోను విడుదల చేశారు. ఇదే విషయంపై బిగ్‌బాస్ ఆదిరెడ్డి కూడా తన యూట్యూబ్ ఛానల్లో అభిప్రాయం చెప్పాడు. వారిలో ఒకరు బిగ్‌బాస్‌కు రావచ్చని ఆయన అభిప్రాయ పడ్డారు. View this post on Instagram A post shared by Ramya moksha kancharla 👻🌸 (@ramyagopalkancharla)

‘హరిహర వీరమల్లు’ వచ్చేస్తున్నాడు
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’(Hari Hara Veera Mallu) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ పవన్ కల్యాణ్ రాజకీయాలతో బీజీ కావడం వల్ల షూటింగ్ అనుకున్న సమయంలో పూర్తి కాలేదు. దీంతో విడుదలను వాయిదా వేస్తూ వచ్చారు మేకర్స్. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకోవడంతో రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. జూన్ 12నీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమాకు తొలుత క్రిష్ దర్శకత్వం వహించారు. షూటింగ్ ఆలస్యం కావడంతో ఆయన ఆ బాధ్యల నుంచి తప్పుకున్నాడు. దీంతో ఎ.ఎం. జ్యోతి కృష్ణ రంగంలోకి దిగి మిగిలిన భాగాన్ని తెరకెక్కించారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'మాట వినాలి', 'కొల్లగొట్టినాదిరో' గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకి, లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్ లను రూపొందించారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. GET READY FOR THE BATTLE OF A LIFETIME! ⚔️🏹Mark your calendars for #HariHaraVeeraMallu on June 12, 2025! 💥 💥The battle for Dharma begins... 🔥⚔️ #HHVMonJune12th #VeeraMallu #DharmaBattle #HHVMPowerstar @PawanKalyan @AMRathnamOfl @thedeol #SatyaRaj @AgerwalNidhhi… pic.twitter.com/3KKNcspFIr— Hari Hara Veera Mallu (@HHVMFilm) May 16, 2025

మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా.. కానీ
ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేస్తుంటాయి. కొన్నిసార్లు థియేటర్లలో రిలీజైన కొన్ని వారాలకే స్ట్రీమింగ్ అయిపోతుంటాయి. ఇప్పుడు కూడా ఓ తెలుగు మూవీ అలానే ఓటీటీలోకి వచ్చింది. కాకపోతే ఇక్కడే ఓ ట్విస్ట్. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది?గత నెల 24న థియేటర్లలో రిలీజైన తెలుగు మూవీ 'చౌర్యపాఠం'. బ్యాంక్ దొంగతనం నేపథ్య కథతో తీశారు. బాగానే ప్రమోట్ చేశారు కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో మూడు వారాలకే ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ప్రస్తుతం ఓవర్సీస్ (విదేశాల్లో) తెలుగు వెర్షన్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.(ఇదీ చదవండి: ఈ రోజుని ఎప్పటికీ గుర్తుంచుకుంటా.. అనసూయ పోస్ట్ వైరల్) బహుశా వచ్చే వారం మన దేశంలో తెలుగు వెర్షన్ అందుబాటులోకి రావొచ్చు అనిపిస్తుంది. ప్రముఖ దర్శకుడు నక్కిన త్రినాథరావు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. నిఖిల్ దర్శకత్వం వహించాడు. ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లు కాగా మస్త్ అలీ, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటించారు. చౌర్యపాఠం విషయానికొస్తే.. వేదాంత్ రామ్(ఇంద్రరామ్)కి దర్శకుడు కావాలనేది కల. నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోయేసరికి బ్యాంక్ దొంగతనం చేసి ఆ డబ్బులతో సినిమా తీయాలని ఫిక్స్ అవుతాడు. బబ్లూ, జాక్ డాన్ అనే ఇద్దరిని తన ప్లాన్ లో భాగం చేస్తాడు. అదే బ్యాంకులో పనిచేస్తున్న అంజలి(పాయల్ రాధాకృష్ణ) వీళ్లకు తోడవుతుంది. తర్వాత ఏం జరిగిందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి :రెండు రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు)

‘కన్నప్ప’ కామిక్ మూడో ఎపిసోడ్ రిలీజ్!
మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’(Kannappa) జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే. ముకేశ్ కుమార్‌సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్ హీరోయిన్గా నటించగా, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్లు, పాటలు పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. యూఎస్‌లో విష్ణు మంచు స్టార్ట్ చేసిన కన్నప్ప ప్రమోషనల్ టూర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక కన్నప్ప కథను అందరికీ తెలియాలనే ఉద్దేశంతో కామిక్ బుక్స్ రూపంలోకి విష్ణు మంచు తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే.కామిక్ సిరీస్‌లోని మొదటి రెండు ఎపిసోడ్లకు అఖండ స్పందన లభించింది. ఇక ఇప్పుడు మూడో అధ్యాయాన్ని విడుదల చేశారు. ఈ చివరి ఎపిసోడ్ తిన్నడు భావోద్వేగ, ఆధ్యాత్మిక పరివర్తనను సూచిస్తుంది. అతను ఒకప్పుడు దైవత్వం ఆలోచనను తిరస్కరిస్తాడు.. కానీ చివరికి శివుని భక్తుడిగా మారుతాడు. కన్నప్పగా మారడానికి అతని అద్భుతమైన ప్రయాణాన్ని ఈ మూడో అధ్యాయం వివరిస్తుంది. భక్తి, ప్రేమ, త్యాగం, విధితో నిండిన ఈ కథ అందరినీ ఆకట్టుకుంటుంది.ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ఈ విజువల్స్, వీడియో అందరినీ అబ్బుర పరిచేలా ఉంది. ఇంతకు మించి అనేలా సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని టీం చెబుతోంది. విజువల్ ఎఫెక్ట్స్‌లో జాప్యం వల్లే ఈ మూవీని జూన్ 27కి వ్యూహాత్మకంగా మార్చారు.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

'గిల్ వద్దు.. టీమిండియా కెప్టెన్‌గా అతడే బెటర్'
ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియాకు కొత్త టెస్టు కెప్టెన్ ఎంపిక చేసే పనిలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ పడింది. రోహిత్ శర్మ అనూహ్యంగా టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో కొత్త కెప్టెన్ ఎంపిక అనివార్యమైంది. పలు నివేదికల ప్రకారం టెస్టు కెప్టెన్సీ రేసులో స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. అతడితో పాటు పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా పేరు కూడా విన్పిస్తోంది. కానీ గిల్ తో పోలిస్తే బుమ్రాకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. గాయాల బెడద, వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ను దృష్టిలో పెట్టుకుని బుమ్రాకు జట్టు పగ్గాలు అప్పగించకూడదని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అనుభవం లేని గిల్ వైపు బీసీసీఐ సెలక్షన్ కమిటీ మొగ్గు చూపుతుండడం క్రికెట్ వర్గాల్లో అసంతృప్తికి దారితీసినట్లు తెలుస్తోంది.చాలా మంది మాజీలు భారత టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు గిల్‌కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్‌గా బుమ్రా ఉండాలని, శుబ్‌మన్ గిల్‌ను అతడి డిప్యూటీగా ఎంపిక చేయాలని జాఫర్ అభిప్రాయపడ్డాడు."భారత టెస్టు కెప్టెన్సీ రేసులో జస్ప్రీత్ బుమ్రా ముందంజలో ఉంటాడాని భావిస్తున్నాను. ఒకవేళ తనంతట తానుగా కెప్టెన్సీ ఆఫర్ తిరష్కరిస్తే తప్ప సెలక్టర్లు మరో ఆప్షన్‌ను పరిశీలించరు. అతడిని కెప్టెన్‌గా చేసి గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయాలి. బుమ్రాకు విశ్రాంతి అవసరమైనప్పుడల్లా గిల్ జట్టును నడిపిస్తున్నాడు. దీంతో గిల్‌కు పూర్తి స్ధాయి కెప్టెన్‌గా ఎదిగేందుకు తగినంత సమయం లభిస్తోంది" అని జాఫర్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. కాగా గిల్‌కు కెప్టెన్‌గా అంతర్జాతీయ స్ధాయిలో పెద్దగా అనుభవం లేదు. జింబాబ్వే సిరీస్‌లో భారత జట్టు సారధిగా గిల్ వ్యవహరించాడు. ఆ తర్వాత ఎప్పుడూ భారత జట్టును నడిపించలేదు. ఐపీఎల్ మాత్రం కెప్టెన్‌గా అతడికి అనుభవం ఉంది. గుజరాత్ టైటాన్స్ సారథిగా గిల్ కొనసాగుతున్నాడు. ఇక ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టును మే 23న బీసీసీఐ ప్రకటించే అవకాశముంది.చదవండి: BCCI - IND vs ENG: టీమిండియాలో అతడికి చోటు కష్టమే!

IPL 2025: నేనైతే వెళ్లేవాడిని కాదు.. మీరూ వెళ్లొద్దు: ఆసీస్ మాజీ క్రికెటర్
ఐపీఎల్-2025 (IPL 2025) ప్లే ఆఫ్స్ దశకు చేరుకున్న వేళ అనుకోని విధంగా వారం పాటు వాయిదా పడింది. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే, ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో లీగ్‌ను పునఃప్రారంభించేందుకు బోర్డు సిద్ధమైంది.కొందరు వచ్చేశారుఇప్పటికే పది ఫ్రాంఛైజీలకు తమ ఆటగాళ్లందరినీ ఒకే చోట చేర్చాల్సిందిగా ఆదేశించిన బోర్డు.. శనివారం (మే 17) నుంచి మ్యాచ్‌లు కొనసాగించనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంత మంది విదేశీ ఆటగాళ్లు భారత్‌కు చేరుకోగా.. మరికొంత మంది జాతీయ జట్టు విధుల దృష్ట్యా స్వదేశాల్లోనే ఉండిపోయారు.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మిచెల్ జాన్సన్ ఐపీఎల్ ఆడే విదేశీ ఆటగాళ్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘ఐపీఎల్ ఆడేందుకు తిరిగి ఇండియాకు వెళ్లాలా వద్దా అనే నిర్ణయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ఆటగాళ్లకే వదిలివేసింది.నేనైతే ‘నో’ చెప్పేవాడినినిజానికి మధ్యలోనే ఇలా లీగ్‌ను వదిలివేయడం నిరాశకు గురిచేస్తుంది. ప్రొఫెషనల్‌గా, ఆర్థికంగా ఒక్కోసారి ఎదురుదెబ్బలు తగులుతాయి. అయితే, అన్నింటికంటే భద్రతే ముఖ్యం. ఒకవేళ నేనే గనుక వారి స్థానంలో ఉండి ఉంటే.. ఇండియాకు వెళ్లి లీగ్ పూర్తి చేయాలని ఆదేశించినా.. కచ్చితంగా ‘నో’ చెప్పేవాడిని.ఎందుకంటే నా వరకు చెక్కుల కంటే కూడా ప్రాణాలు ముఖ్యమైనవి. అయితే, ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఐపీఎల్ ఒక్కటనే కాదు.. పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడేందుకు కూడా ఆటగాళ్లు అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదనే నేను భావిస్తున్నా’’ అని మిచెల్ జాన్సన్ ది వెస్ట్రన్ ఆస్ట్రేలియన్‌కు రాసిన కాలమ్‌లో పేర్కొన్నాడు.సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఓప్పుకోవడానికి కారణం అదేఅదే విధంగా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2025 ఫైనల్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘జూన్ 3న ఐపీఎల్ ఫైనల్ జరుగుతుంది. ఆ తర్వాత వారం రోజులకే లార్డ్స్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ ఉంది. కాబట్టి ఈ మెగా మ్యాచ్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో ఆటగాళ్లపై తీవ్రమైన ఒత్తిడి నెలకొంటుంది’’ అని మిచెల్ జాన్సన్ పేర్కొన్నాడు.అయితే, బీసీసీఐతో సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుకు ఉన్న ఆర్థిక సంబంధాల దృష్ట్యా ప్రొటిస్ ఆటగాళ్లంతా తిరిగి ఐపీఎల్లో పాల్గొంటారని జాన్సన్ అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్ ఫ్రాంఛైజీల సారథ్యంలోనే సౌతాఫ్రికా టీ20 లీగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.రిక్కీ పాంటింగ్ ఉండటమే కాదు.. వాళ్లనూ ఒప్పించాడుఇదిలా ఉంటే.. ధర్మశాలలో పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ అర్ధంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. పాక్ దుశ్చర్యలను తిప్పికొట్టేందుకు భారత్ అక్కడ బ్లాక్ అవుట్ (విద్యుత్ సరఫరా నిలిపివేయడం) ప్రకటించడంతో స్టేడియం కూడా చీకటైపోయింది.ఈ క్రమంలో ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులను సురక్షితంగా అక్కడి నుంచి తరలించింది బీసీసీఐ. అంతేకాదు.. వందే భారత్ రైలులో అత్యంత భద్రత నడుమ పంజాబ్, ఢిల్లీ ఆటగాళ్లను ఢిల్లీకి చేర్చింది. ఈ నేపథ్యంలో కాస్త భయాందోళనకు లోనైనప్పటికీ.. భారత్‌లోనే ఉండిపోవాలని పంజాబ్ కింగ్స్ హెడ్‌కోచ్, ఆసీస్ దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ నిర్ణయించుకున్నాడు. బీసీసీఐ చేసిన ఏర్పాట్లు, భారత ప్రభుత్వం తీసుకున్న రక్షణ చర్యల నేపథ్యంలో ఆటగాళ్లను కూడా ఇందుకు ఒప్పించాడు. అయితే, మిచెల్ జాన్సన్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. కాగా ముంబై ఇండియన్స్ తరఫున రెండుసార్లు (2013, 2017) ఐపీఎల్ గెలిచిన జట్టులో జాన్సన్ సభ్యుడు. చదవండి: మాట తప్పారు!.. ఆర్సీబీకి తిరిగి ఆడాలని అనుకోలేదు: పాటిదార్ఐపీఎల్ 2025 పునఃప్రారంభం.. ఎవరు తిరిగొస్తున్నారు.. ఎవరు రావడం లేదు..?

‘రోహిత్ శర్మ జట్టులో లేకపోయినా పెద్దగా నష్టమేమీ లేదు’
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)ను ఉద్దేశించి సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కలినన్ (Daryll Cullinan) ఘాటు వ్యాఖ్యలు చేశాడు. టెస్టు క్రికెట్లో భారత్‌కు రోహిత్ గొప్పగా చేసిందేమీ లేదని.. అతడు రిటైర్ అయినా టీమిండియాకు పెద్దగా నష్టం లేదని పేర్కొన్నాడు.అదే విధంగా.. విరాట్ కోహ్లి (Virat Kohli) లేకపోయినా.. బౌలర్లు రాణిస్తే భారత్ ఇంగ్లండ్‌లో గట్టెక్కగలదని డారిల్ కలినన్ అభిప్రాయపడ్డాడు. కాగా గత కొంతకాలంగా టెస్టుల్లో ఫామ్‌లేమితో సతమతమవుతున్న రోహిత్ శర్మ ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.న్యూజిలాండ్‌తో స్వదేశంలో 3-0తో రోహిత్ సేన వైట్‌వాష్ కావడం.. ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీని 3-1తో చేజార్చుకోవడంతో.. హిట్‌మ్యాన్‌పై విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ సిడ్నీలో ఆఖరిదైన ఐదో టెస్టు నుంచి తప్పుకొన్నా.. టెస్టుల్లో కొనసాగుతానని నాడు రోహిత్ స్పష్టం చేశాడు.రో- కో లేకుండానేఈ క్రమంలో ఇంగ్లండ్ పర్యటనలో అతడే పగ్గాలు చేపడతాడనే వార్తలు రాగా.. అనూహ్యంగా మే 7న రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత ఆరురోజులు తిరిగే లోపే విరాట్ కోహ్లి కూడా సంప్రదాయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఫలితంగా.. వీరిద్దరు లేకుండా యువ భారత జట్టు జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడబోతోంది.ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కలినన్ హిందుస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ గురించి చాలా రోజులుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికి అతడు సరైన నిర్ణయం తీసుకున్నాడు.రోహిత్ లేకపోయినా నష్టమేమీ లేదునిజం చెప్పాలంటే.. టెస్టుల్లో రోహిత్ కెరీర్ అంత గొప్పగా ఏమీలేదు. సొంతగడ్డ మీదైనా.. విదేశాల్లోనైనా అదే తీరు. ఇటీవల ఆస్ట్రేలియాతో సిరీస్‌లో కెప్టెన్‌గా ముందుండి నడిపించాల్సింది పోయి.. అతడే దారుణంగా విఫలమయ్యాడు. కాబట్టి రోహిత్ వీడ్కోలు పలకడం వల్ల భారత టెస్టు క్రికెట్‌కు వచ్చిన నష్టమేమీ లేదు’’ అని డారిల్ కలినన్ పేర్కొన్నాడు.బౌలర్లంతా ఫిట్‌గా ఉంటే చాలుఇక ఇంగ్లండ్‌తో సిరీస్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘టీమిండియా బౌలర్లందరూ ఫిట్‌గా ఉండి.. రాణించినట్లయితే ఇంగ్లండ్‌లో భారత్‌కు గెలుపు అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి’’ అని కలినన్ అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లి లేకపోయినా రాణించగల సత్తా టీమిండియాకు ఉందని పేర్కొన్నాడు. కాగా జూన్ 20 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్‌తో టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ తన ప్రయాణం మొదలుపెట్టే అవకాశం ఉంది.కాగా 58 ఏళ్ల డారిల్ కలినన్ 1993 నుంచి 2001 వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. సౌతాఫ్రికా తరఫున 70 టెస్టులు, 138 వన్డేలు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. సంప్రదాయ క్రికెట్లో 4554 పరుగులు, వన్డేల్లో 3860 రన్స్ సాధించాడు. మరోవైపు.. రోహిత్ శర్మ టీమిండియా తరఫున 67 టెస్టుల్లో 4301 పరుగులు చేయగా.. విరాట్ కోహ్లి 123 టెస్టులాడి 9230 రన్స్ సాధించాడు.చదవండి: మాట తప్పారు!.. ఆర్సీబీకి తిరిగి ఆడాలని అనుకోలేదు: పాటిదార్

IPL 2025 Restart: పీఎస్ఎల్కు గుడ్ బై చెప్పి ఐపీఎల్లో చేరిపోయిన మరో ప్లేయర్
శ్రీలంక విధ్వంసకర బ్యాటర్ కుసాల్ మెండిస్ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025కు మధ్యలోనే గుడ్ బై చెప్పాడు. ఆ లీగ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న మెండిస్.. బట్లర్‌కు ప్రత్యామ్నాయంగా గుజరాత్ టైటాన్స్ నుంచి ఆఫర్ రావడంతో ఐపీఎల్‌కు వచ్చేశాడు. మెండిస్ నిన్ననే గుజరాత్ జట్టులో చేరిపోయాడు. ఐపీఎల్‌లాగే పాకిస్తాన్ సూపర్ లీగ్ కూడా వాయిదా అనంతరం మే 17 నుంచి ప్రారంభం కానుంది. ఆ లీగ్‌లో కూడా ఐపీఎల్‌లాగే విదేశీ ఆటగాళ్లు స్వదేశాలకు వెళ్లిపోయారు. ఐపీఎల్లో దాదాపుగా అందరు విదేశీ ఆటగాళ్లు లీగ్ పునఃప్రారంభానికి అందుబాటులోకి వస్తుంటే.. పీఎస్ఎల్లో మాత్రం విదేశీ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. మెండిస్‌కు ముందు ఆస్ట్రేలియా బ్యాటర్ మిచెల్ ఓవెన్ కూడా పీఎస్ఎల్కు గుడ్ బై చెప్పి ఐపీఎల్లో చేరిపోయాడు. మిచెల్ ఓవెన్‌ను పంజాబ్ కింగ్స్ మ్యాక్స్‌వెల్‌కు ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసుకుంది. ఓవెన్, మెండిస్ ఇద్దరూ పీఎస్ఎల్తో ఒప్పందం ఉన్నప్పటికీ దాన్ని తెంచుకుని ఐపీఎల్ పంచన చేరాడు. భద్రతా కారణాల వల్ల పీఎస్ఎల్లో ఆడలేనని మెండిస్ తాజాగా స్పష్టం చేశాడు. అంతకుముందే ఓవెన్ తనకు ఐపీఎల్ ఆఫరే ముఖ్యమని పీఎస్ఎల్కు తేల్చి చెప్పాడు. వీరిద్దరిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చర్చలు తీసుకునే అవకాశం ఉంది. ఐపీఎల్ ప్రారంభానికి ముందు మరో విదేశీ ఆటగాడు కార్బిన్ బాష్ కూడా పీఎస్ఎల్కు హ్యాండిచ్చి ముంబై ఇండియన్స్‌లో చేరిపోయాడు. ఐపీఎల్ ఆఫర్ రావడం అదృష్టంగా భావించే విదేశీ ఆటగాళ్లు..పీఎస్ఎల్ లాంటి చిన్న లీగ్‌ను తృణప్రాయంగా వదిలేసుకుంటున్నారు.ఇదిలా ఉంటే, జాతీయ విధుల కారణంగా జోస్ బట్లర్ ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌కు అందుబాటులో ఉండడం లేదు. దీంతో గుజరాత్ అతనికి ప్రత్యామ్నాయంగా మెండిస్‌ను ఎంపిక చేసుకుంది. బట్లర్ మే 26 వరకు గుజరాత్‌కు అందుబాటులో ఉంటాడు. మెండిస్‌ను గుజరాత్ యాజమాన్యం రూ. 75 లక్షలకు సొంతం చేసుకుంది. ఈ సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్న బట్లర్ ప్లే ఆఫ్స్‌లో గుజరాత్‌కు అందుబాటులో లేకపోవడం ఆ జట్టు టైటిల్ విన్నింగ్ అవకాశాలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. ఈ సీజన్లో బట్లర్ 11 మ్యాచ్‌లు ఆడి 71.43 సగటుతో 500 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. బట్లర్ గుజరాత్ ఆడబోయే తదుపరి మూడు లీగ్ మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా గుజరాత్ ప్లే ఆఫ్స్ బెర్త్ అధికారికంగా ఖరారవుతుంది. గుజరాత్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఢిల్లీ (మే 18), లక్నో (మే 22), సీఎస్కేతో (మే 25) తలపడాల్సి ఉంది.
బిజినెస్

టీసీఎస్ ఘనత: వరల్డ్ టాప్ 50 బ్రాండ్లలో..
ప్రముఖ్ ఐటీ దిగ్గజం 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్' (TCS) కాంటర్ బ్రాండ్జెడ్ మోస్ట్ వాల్యూయబుల్ గ్లోబల్ బ్రాండ్స్ 2025 నివేదికలో.. ప్రపంచవ్యాప్తంగా 100 అత్యంత విలువైన బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. న్యూయార్క్‌లో కాంటార్ నిర్వహించిన స్పెషల్ 20వ ఎడిషన్ వేడుకలో.. టీసీఎస్ బ్రాండ్ వాల్యూ 57.3 బిలియన్ డాలర్లకు (రూ. 4.89 లక్షల కోట్లు) చేరుకుంది. ఇది గత ఏడాదికంటే 28 శాతం ఎక్కువని తెలుస్తోంది.మొమెంటమ్ ఐటీఎస్ఎంఏ నిర్వహించిన స్వతంత్ర బ్రాండ్ ఆడిట్లో ప్రపంచవ్యాప్తంగా 95 శాతం మంది బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లు టీసీఎస్ బ్రాండ్‌ను గుర్తించారని తేలింది. పరిశ్రమ రంగాలలో ప్రపంచంలోని ప్రముఖ బ్రాండ్లను కలిగి ఉన్న జాబితాలో.. TCS ప్రపంచవ్యాప్తంగా 45వ స్థానంలో ఉంది. ఇది కంపెనీ వేగవంతమైన వృద్ధిని సూచిస్తుంది. బ్రాండ్ విలువ, ఈక్విటీలో ఈ పెరుగుదల కంపెనీ నిరంతర బ్రాండ్ నిర్మాణ ప్రయత్నాలను హైలైట్ చేస్తుంది.ఈ సందర్భంగా కాంటర్ బ్రాండ్జెడ్ హెడ్ మార్టిన్ గెరిరియా అధిపతి మాట్లాడుతూ.. సరైన పెట్టుబడి, వ్యూహాత్మక దృష్టితో.. బ్రాండ్లు తమ యజమానులకు మంచి వృద్ధిని అందించగలవు. టీసీఎస్ ఈ ఏడాది చూపిన పనితీరు, ఏఐ సామర్థ్యాలను విస్తృతంగా వినియోగించుకోవడం వంటికి దీని వృద్ధికి దోహదపడ్డాయి. టీసీఎస్ చేపడుతున్న కార్యక్రమాలే సంస్థ బలమైన గుర్తింపుకు కారణమైందని ఆయన అన్నారు.ప్రపంచ టాప్ 50 బ్రాండ్లలో టీసీఎస్ ఒకటిగా చేరిన సందర్భంగా కంపెనీ మార్కెటింగ్ ఆఫీసర్ 'అభినవ్ కుమార్' మాట్లాడుతూ.. 20 సంవత్సరాలుగా కాంటార్ బ్రాండ్జెడ్ ప్రపంచంలోని అత్యంత విలువైన బ్రాండ్లను గుర్తించింది. పరిశ్రమలో మాకు ఉన్న బ్రాండ్ నాయకత్వంతో పాటు.. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ బ్రాండ్లలో TCS బ్రాండ్‌కు ఈ గుర్తింపు లభించడం చాలా సంతోషంగా ఉంది. సంస్థ వృద్ధికి దోహదపడిన నా సహోద్యోగులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.

నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
గురువారం భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ఉదయం నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. ఉదయం 9:40 గంటలకు సెన్సెక్స్ 205.81 పాయింట్లు లేదా 0.25 శాతం నష్టంతో 82,324.93 వద్ద, నిఫ్టీ 45.95 పాయింట్లు లేదా 0.18 శాతం నష్టంతో 25,016.15 వద్ద ముందుకు సాగుతున్నాయి.బియర్డ్‌సెల్, జీ లెర్న్, వాన్‌బరీ, శివమ్ ఆటోటెక్, రుద్రాభిషేక్ ఎంటర్ప్రైజెస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. డిదేవ్ ప్లాస్టిక్స్ ఇండస్ట్రీస్, సోలారా యాక్టివ్ ఫార్మా సైన్సెస్, న్యూలాండ్ లాబొరేటరీస్, సెనోర్స్ ఫార్మాస్యూటికల్స్, డేటామాటిక్స్ గ్లోబల్ సర్వీసెస్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).

జపాన్‌లో అదరగొట్టిన మేడ్ ఇన్ ఇండియా కారు
ఇండియన్ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన.. మారుతి సుజుకి ఫ్రాంక్స్ విదేశీ మార్కట్లకు కూడా ఎగుమతి అవుతోంది. ఇందులో జపాన్ కూడా ఉంది. ఇటీవల 'జపాన్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్' (JNCAP) క్రాష్ టెస్ట్‌లో భారతదేశంలో తయారైన 'ఫ్రాంక్స్' 4 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది.సుజుకి ఫ్రాంక్స్ అసెస్మెంట్లో 84 శాతం స్కోర్‌ను కలిగి ఉంది. మొత్తం 193.8 పాయింట్లలో 163.75 పాయింట్లను పొందగలిగింది. అంతేకాకుండా, ప్రివెంటివ్ సేఫ్టీ పెర్ఫార్మెన్స్ టెస్ట్‌లో 85.8 పాయింట్లకు గానూ 79.42 పాయింట్లను సాధించగా.. కొలిషన్ సేఫ్టీ పెర్ఫార్మెన్స్ టెస్ట్ 100 పాయింట్లలో 76.33 పాయింట్లను సొంతం చేసుకుంది.ఆఫ్సెట్ ఫ్రంటల్ కొలిషన్ టెస్ట్‌లో, సుజుకి ఫ్రాంక్స్ 24 పాయింట్లకు 21.08 పాయింట్లు సాధించింది. ఫుల్-ర్యాప్ ఫ్రంటల్ కొలిషన్ టెస్ట్, సైడ్ కొలిషన్ టెస్ట్ మరియు పాదచారుల లెగ్ ప్రొటెక్షన్ పెర్ఫార్మెన్స్ టెస్ట్‌లలో కూడా ఈ కారు లెవల్ 5/5 సాధించింది.జపాన్‌లో విక్రయించే సుజుకి ఫ్రాంక్స్ భారత మార్కెట్ నుంచి ఎగుమతి అయినప్పటికీ.. ఇది భారతీయ వెర్షన్ మాదిరిగా కాకుండా.. అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ ప్రివెన్షన్ సిస్టమ్ వంటి మరిన్ని లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ పొందుతాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి సేఫ్టీ అందిస్తాయి.

బోనస్ మరీ ఇంత తక్కువా!.. టెక్ దిగ్గజం ఎందుకిలా చేస్తోంది
భారతదేశంలో రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ 'ఇన్ఫోసిస్' బోనస్ విషయంలో ఉద్యోగులకు షాకిచ్చింది. క్లిష్టమైన ఆర్ధిక పరిస్థితుల కారణంగా.. 2025 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో అర్హులైన ఉద్యోగులకు 65 శాతం మాత్రమే బోనస్ చెల్లించనున్నట్లు వెల్లడించినట్లు తెలుస్తోంది. గత త్రైమాసికం (మూడో త్రైమాసికం)లో 80 శాతం బోనస్ అందించిన కంపెనీ.. రెండో త్రైమాసికంలో 90 శాతం బోనస్ చెల్లింది.2025 ఆర్ధిక సంవత్సరం రెండు, మూడు త్రైమాసికాలలో కంపెనీ ఉద్యోగులకు చెల్లించిన బోనస్.. నాల్గవ త్రైమాసికంలో చెల్లించనున్న బోనస్‌తో పోలిస్తే క్రమంగా తగ్గుతున్నట్లు స్పష్టమవుతోంది. పర్ఫామెన్స్ బోనస్ మే 2025 సైకిల్లో ప్రాసెస్ అవుతుందని తెలుస్తోంది.ఇక ఇన్ఫోసిస్ ఆఖరి త్రైమాసిక ఫలితాల విషయానికి వస్తే.. కంపెనీ లాభాలో అంతకు ముంది ఏడాది నాల్గవ త్రైమాసికం ఫలితాలతో పోలిస్తే 12 శాతం తగ్గి రూ. 7033 కోట్లకు చేరుకుంది. గత సంవత్సరం కంపెనీ నాల్గవ త్రైమాసిక ఫలితాల్లో సంస్థ లాభం రూ. 7696 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతం ఎగసి రూ. 40,925 కోట్లకు చేరింది. అంత క్రితం క్యూ4లో రూ. 37,923 కోట్ల టర్నోవర్ సాధించింది.ఇదీ చదవండి: వారానికి 90 గంటల పని!.. ఆయనతో పనిచేయడం నా అదృష్టంనియామకాలుటెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఈ ఆర్థిక సంవత్సరంలో 20,000 మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోందని కంపెనీ సిఎఫ్ఓ జయేష్ సంఘ్రాజ్కా స్పష్టం చేశారు. 2025 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ 6,388 మంది ఉద్యోగులను నియమించుకుంది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 323,578కి చేరుకుంది.
ఫ్యామిలీ

గురి తప్పని విజయం... భళా ముఖేశ్!
వెంట్రుక వాసిలో పతకాలు చేజారిపోయే పిస్టల్ షూటింగ్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ గుంటూరుకు చెందిన ముఖేశ్ నేలపల్లి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు. జూనియర్ పిస్టల్ షూటింగ్లో పతకాలతో భవిష్యత్ తారగా ఎదిగాడు.... గత ఏడాది పెరూలో జరిగిన వరల్డ్ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో మొత్తం 5 బంగారు, 2 కాంస్య పతకాలు సాధించి ముఖేశ్ రికార్డు సృష్టించాడు. ఈ నెల 17 నుంచి 26 వరకు జర్మనీలోని సుహుల్లో జరగనున్న జూనియర్ వరల్డ్ కప్ షూటింగ్ పోటీలకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ఢిల్లీలో నిర్వహిస్తున్న జాతీయ శిక్షణ శిబిరంలో ముఖేశ్ సాధన చేస్తున్నాడు. 11 ఏళ్ల వయస్సులో స్కూల్ నిర్వహించిన వేసవి శిబిరంలో బాస్కెట్‌బాల్ సాధన కోసం ముఖేశ్ చేరాడు. కోచ్ సూచనతో అనుకోని విధంగా పిస్టల్ షూటింగ్ శిక్షణలో అన్న హితేశ్‌తో కలిసి సాధన ప్రారంభించాడు. కొద్ది రోజులకే ముఖేశ్ పతకాలు సాధించడంతో తండ్రి శ్రీనివాసరావు 2018లో స్థానికంగా అందుబాటులో ఉన్న అంతర్జాతీయ కోచ్, ఇండియన్ అకాడమీ ఆఫ్ షూటింగ్ స్పోర్ట్ చీఫ్ కోచ్ నగిశెట్టి సుబ్రమణ్యం దగ్గర శిక్షణలో చేర్పించారు. తన ప్రతిభకు మరింత మెరుగులు దిద్దుకునేందుకు ముఖేశ్పుణేకు మకాం మార్చాడు. లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్ పుణేలో నిర్వహిస్తున్న ‘గన్ ఫర్ గ్లోరీ’ షూటింగ్ అకాడమీలో చేరాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్, ర్యాపిడ్ ఫైర్ పిస్టల్, స్టాండర్డ్ పిస్టల్, 50 మీటర్ల పిస్టల్‌లో విభాగాలలో ముఖేశ్ నిలకడగా రాణిస్తున్నాడు. జాతీయ స్థాయిలో 80కుపైగా పతకాలు సాధించిన ముఖేష్ భారత రైఫిల్ షూటింగ్ శిబిరానికి ఎంపికయ్యాడు.ఒలింపిక్స్ లక్ష్యంభారత జట్టు తరపున సీనియర్ విభాగంలో ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే నా లక్ష్యం. జర్మనీలో జరగనున్న పోటీల్లో 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో పోటీపడుతున్నాను. పతకాలతో తిరిగి వస్తానని ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. – ముఖేశ్– మురమళ్ళశ్రీనివాసరావు, సాక్షి స్పోర్ట్స్, గుంటూరు

ట్రావెల్ ఎక్స్పీరియన్స్: ఎందుకు రాయాలో తెలుసా..?
బస్సెక్కినా రైలెక్కినా విమానం ఎక్కినా మనకు కావలసింది ఏది? కిటికీ పక్కన సీటు? ఎందుకు? బయటకు చూస్తుంటే బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది? కొత్త ప్రాంతాలు కాబట్టి. పిల్లలూ... మనిషి పుట్టింది ఉన్న చోట ఉండటానికి కాదు. ప్రయాణించడానికి. తిరిగి లోకం చూడాలి. కొత్త మనుషులను కలవాలి. ప్రయాణాల్లో ఏం చూశారో, ఏం తెలుసుకున్నారో రాయాలి. అప్పుడు మీరు ‘ట్రావెల్ రైటర్’ అవుతారు. ‘యాత్రికుడు’ అనిపించుకుంటారు.పిల్లలూ! వేసవి సెలవుల్లో అమ్మా నాన్నలు మిమ్మల్ని ఏదో ఒక ఊరు తీసుకెళతారు. కొత్త ప్రదేశాలు చూపిస్తారు. మీరు అక్కడి వింతలు, విశేషాలు చూసి ఆనందిస్తారు. కొన్ని ఫొటోలు దిగి, తర్వాత ఇంటికి వచ్చేస్తారు. అక్కడితో ఆ పర్యటన ఓ గుర్తుగా మారుతుంది. అంతటితో సరేనా? దాన్ని మరింత పదిలం చేసుకోవాలని మీకు ఉండదా? మరి దానికేంటి మార్గం? ఒక్కటే. మీ పర్యటనలో మీకు ఎదురైన అనుభవాలను రాయడం. వాటిని రికార్డు చేసి పదిలంగా దాచుకోవడం.ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఎందుకు రాయాలి?ట్రావెలర్స్ ట్రావెల్ చేసి పొందిన అనుభవాలను రాయడం కొత్త విషయమేమీ కాదు. గతంలో ఎంతోమంది తాము చేసిన యాత్రల వివరాలు, విశేషాలను పుస్తకాల రూపంలో రాశారు. వాటిని ‘యాత్రా కథనాలు’ అంటారు. వాటిని చదవడం వల్ల అక్కడకు పోలేని వారికి ఆ ప్రాంతాల చరిత్ర, విశిష్టత, కల్చర్, లైఫ్‌స్టైల్ గురించి అవగాహన ఏర్పడుతుంది. కొత్త ప్రదేశాల్లో ఉండే వైవిధ్యం తెలుస్తుంది. ఇదే మీరూ చేయొచ్చు. మీరు చూసిన ప్రదేశాల తాలూకు విశేషాలను వ్యాసంగా రాయొచ్చు. దాన్ని మీ స్నేహితులకు, టీచర్లకు చూపించొచ్చు. దీనివల్ల మీ అనుభవాలకు విలువ ఏర్పడుతుంది. అందరిలోనూ ప్రత్యేకంగా నిలుస్తారు.యాత్రాకథనాలు రాయడం వల్ల కలిగే లాభాలుయాత్రాకథనాలు రాయడంలో మీ ఎక్స్ప్రెషన్దీ లాంగ్వేజ్దీ కీలకమైన పాత్ర. కొత్త ప్రాంతంలో మనకు ఎదురైన అనుభవాలను మన మాటల్లో పెట్టడం వల్ల మనసులోని భావాలను ఎలా వ్యక్తీకరించాలో తెలుస్తుంది. దీనివల్ల స్పష్టమైన దృక్పథం ఏర్పడుతుంది. నచ్చింది నచ్చనిది చెప్పడం చేతనవుతుంది. ఉదాహరణకు మీరు ఊటీ వెళ్లారనుకోండి. క్యాబ్‌డ్రైవర్ మీతో మంచిగా వ్యవహరిస్తే ఆ సంగతి రాస్తారు. ర్యాష్‌గా ఉంటే ‘ఊటి వెళ్లినప్పుడు మీరు సరైన డ్రైవర్‌ను ఎంచుకోండి. లేకుంటే ఇబ్బంది పడతారు’ అని రాస్తారు. అది చదివి మిగిలిన వారు అలర్ట్ అవుతారు.జ్ఞాపకశక్తి పెరుగుతుందిమీరు ట్రావెలింగ్‌లో చూసిన విషయాలు అప్పటికప్పుడు పుస్తకంలో రాసుకోవచ్చు లేదా వాటిని గుర్తు పెట్టుకొని ఇంటికి వచ్చాక రాసుకోవచ్చు. లేదా అక్కడే చిన్నచిన్న పాయింట్ల రూపంలో రాసుకొని, ఇంటికి వచ్చాక విస్తరించి రాయొచ్చు. ఇలా చేయడం వల్ల మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మీ ఆలోచనాధోరణి పదునెక్కుతుంది.చారిత్రక, సాంస్కృతిక అవగాహనమీరు చూసిన ప్రదేశాల గురించి రాయాలని అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఆ ప్రదేశాల గురించి గూగుల్ చేస్తారు. మీరు చూసిన చోటు గురించి మరిన్ని విషయాలు తెలుసుకుంటారు. ఉదాహరణకు రెండు రోజులు హంపీ చూసి వస్తారు. ఆ ప్లేస్ మీద మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. గూగుల్ చేసి యూట్యూబ్ ద్వారా హంపి గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకుంటారు. దీనివల్ల ఆ ప్రదేశాల చరిత్ర, సాంస్కృతిక విశేషాలు తెలుసుకుంటారు. ఇది మీకెంతో మేలు చేస్తుంది. నేరుగా తెలుస్తుందిఎప్పుడూ స్వీట్ తినని వారికి ఎంత చెప్పినా స్వీట్ అంటే ఏంటో తెలియదు. కేరళ ఎలా ఉంటుందో ఎన్ని వీడియోలు చూసినా నేరుగా చూడటంలోని మజా రాదు. కేరళ వెళితే హౌస్‌బోట్‌లో తిరుగుతున్నప్పుడు ఆ బ్యాక్‌వాటర్స్‌లో ఎంత బాగుంటుందో అనుభవించి రాస్తే ఆ ఫీలింగ్ వేరేగా ఉంటుంది. ప్రపంచంలో గొప్ప వారంతా నెలలో, మూడు నెలలకోసారి ఏదో ఒక కొత్త ప్రాంతానికి వెళతారు. ఎందుకంటే తిరిగితే నాలుగు విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు యూట్యూబ్ ట్రావెలర్స్ ఎందరో తిరుగుతూ వీడియోలు చేస్తూ సంపాదిస్తున్నారు కూడా. వేసవి సెలవులన్నీ నెక్స్ట్ క్లాస్ సబ్జెక్ట్స్ చదువుతూ వృథా చేయకండి. కిటికీ పక్కన ఒక్కసారైనా కూచోండి. కదలండి.– కె. (చదవండి: కళ్లకు గంతలు.. ‘కళ’అద్దే వింతలు..)

మాయమైపోతున్న మనిషి కోసం.. శాలిని
కళ్లెదుటే తండ్రి మరణాన్ని చూసి తట్టుకోలేకపోయింది సాగయా ఏంజిలిన్ శాలిని. తండ్రితో కలిసి హాస్టల్‌కు వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. సహాయం కోసం ఎంతోమందిని వేడుకుంది. సహాయం చేసే బదులు తనని ఆశ్చర్యంగా చూస్తూ ఎవరి దారిలో వారు వెళుతున్నారు.కొందరైతే తన విషాదాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి వీడియోలు తీస్తున్నారు!‘సాటి మనిషి బాధను పంచుకునే టైమ్, దయ మానవులలో ఎందుకు మాయం అవుతుంది?’ అనే కోణంలో ఆలోచించింది. ఆ విషాద సంఘటన శాలినిని మానసికంగా, ఆర్థికంగా కృంగదీసింది. రెండు నెలల పాటు బయటి ప్రపంచంలోకి రాలేదు. ‘జీవితంలో విషాదం ఒక భాగం అని అర్థం చేసుకునే పరిణతి నాలో ఆ సమయంలో లేదు’ అని గతాన్ని గుర్తు చేసుకుంది శాలిని. తన దుఃఖాన్ని ఇతరులతో పంచుకొని మనసు తేలిక చేసుకోవడానికి ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా తన బాధనే కాదు ఇతరుల బాధను కూడా పంచుకుంటుంది. యాక్సిడెంట్ సంఘటన తరువాత తనకు ఎదురైన చేదు అనుభవం గురించి శాలిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోకు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఆ స్పందనే ఒక కమ్యూనిటీ ఏర్పాటుకు దారి తీసింది.ఇదీ చదవండి: Cannes: అరంగేట్రంలోనే ఎదురు దెబ్బ, లగేజీ మొత్తం గాయబ్! View this post on Instagram A post shared by Shalini (@shalini_robert_) బాధితులకు తమ వంతు సహాయపడడానికి కమ్యూనిటీ ఏర్పాటైంది. తమిళనాడు నలుమూలల నుంచి ఈ కమ్యూనిటీలో వందలాది సభ్యులు ఉన్నారు. బాధితులకు నైతికస్థైర్యం ఇవ్వడం నుంచి ఆర్థిక సహాయం అందించడం వరకు ఈ కమ్యూనిటీ పనిచేస్తోంది. చెన్నైలోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది శాలిని. తమ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా అనాథాశ్రమాలకు వెళ్లడం, అక్కడి పిల్లలతో గడపడం శాలిని కటుంబ సభ్యులకు సంప్రదాయంగా వస్తుంది. ఆ సంప్రదాయమే శాలినిని సామాజిక సేవ వైపు అడుగులు వేసేలా చేసింది. సివిల్ ఇంజనీరింగ్ చేసిన శాలిని ΄ార్ట్ టైమ్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తూ వచ్చిన డబ్బులతో పిల్లలకు సహాయపడేది. తరచుగా అనాథాశ్రమాలకు వెళుతూ పిల్లల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరిస్తుంటుంది. ‘నేను మీకు సహాయం చేస్తాను’ అని హామీ ఇవ్వడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంది. ‘నిలబెట్టుకోలేని హామీని ఇచ్చి వారిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు’ అంటుంది శాలిని. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం నుంచి ఎవరైన చిన్న షాప్ పెట్టుకోవడం వరకు తనవంతుగా సహాయం చేస్తుంటుంది. చదవండి: తీవ్ర నష్టాల్లో లగ్జరీ ఫ్యాషన్ హౌస్, 1700 మందికి ఉద్వాసన‘ఆర్థిక సహాయం మాత్రమే కాదు.. ప్రేమ పంచుకోవడం, ఎమోషనల్ సపోర్ట్‌తో ఎందరో జీవితాల్లో మార్పు తేవచ్చు’ అంటుంది శాలిని. ‘నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు నాన్న చనిపోయారు. ఎప్పుడూ బాధలో ఉండేదాన్ని. ఆత్మవిశ్వాసం కోల్పోయాను. ఆ సమయంలో శాలిని అక్క నాలో ధైర్యం నింపింది. ఉత్సాహాన్ని ఇచ్చింది. నేను తిరిగి చదువుకునేలా చేసింది. ఆమె నా వెనకాల ఉంది అనే భావన ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది’ అంటుంది తెన్కాశీకి చెందిన పద్దెనిమిది సంవత్సరాల ఆశ్మీ. శాలినిని అభిమానించే వాళ్లలో ఆశ్మీలాంటి వాళ్లు ఎంతోమంది ఉన్నారు. వారి అభిమానమే తన బలం.రోడ్డు ప్రమాదంలో తండ్రి... సహాయం కోసం అరుస్తూనే ఉంది శాలిని. ఇలా చూసి అలా వెళ్లిపోతున్నారు కొందరు. కొందరైతే ఫోన్లో వీడియోలు తీస్తున్నారు. ...తన బాధను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది శాలిని. మాయమై΄ోతున్న మనిషి కోసం, మానవత్వం కోసం, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం కోసం ఆన్లైన్ కమ్యూనిటీని ఏర్పాటు చేయడంలో కీలక ΄ పాత్ర పోషించింది తమిళనాడుకు చెందిన శాలిని... అలా ఎప్పుడూ చేయలేదుఇతరుల బాధలను సొమ్ము చేసుకోవాలని, నేను చేసిన వీడియోలు వైరల్ కావాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు. నేను పోస్టు చేసిన 190 వీడియోలు నిజాయితీతో చేసినవి మాత్రమే. బాధితుల సమస్యలు నా దృష్టిలో కంటెంట్ కాదు. ఏదో విధంగా వీడియోలు చేసి సొమ్ము చేసుకోవడం తేలికైన విషయం కావచ్చు. అయితే అలాంటి వారు వేగంగా నమ్మకంగా కోల్పోవడానికి ఎంతో సమయం పట్టదు. – శాలిని

జస్ట్ డ్రెస్సింగ్ మాత్రమే కాదు..ట్రెండ్‌కి తగ్గ ఆభరణాలతో మెరవండిలా..!
చక్కటి ఆభరణాలు వస్త్రధారణలో ఒక ముఖ్యమైన భాగం, ఇది దుస్తులను మెరిపించడం మాత్రమే కాదు డ్రెస్సింగ్ వెలవెల పోయేలా చేసే శక్తి కూడా కలిగి ఉంటుంది. మెరవాలంటే ట్రెండ్‌కు అనుగుణంగా ఉంటే మాత్రమే సాధ్యం. అయితే ప్రతి సీజన్లో రకరకాల ట్రెండ్లు వస్తుండటంతో, ఏది అనుసరించాలో, ఏది వదిలివేయాలో ? అనే గందరగోళం తప్పదు. ఈ నేపథ్యంలో సిటీ జ్యువెలరీ డిజైనర్లు అందిస్తున్న సూచనలివి.. లేయరింగ్, స్టాకింగ్.. పలు రకాల లెంగ్త్ ఉన్న చైన్ పెండెంట్లను లేయర్‌లాగా ధరించవచ్చు. లేదా ఒకే వైపు పలు బ్రేస్లెట్లను ఒకటిగా పేర్చవచ్చు. ఆల్ పీసెస్ రంగులు కలిసి కనబడేలా చూసుకోవడమే ఖచి్చతమైన స్టాక్‌కు కీలకం. ఇవి ఒక సాధారణ బైండింగ్ కారకంగా ఉండాలి. షాండ్లియర్ చెవిపోగులు.. ఈ షాండ్లియర్ శైలి చెవిపోగులు అత్యధికంగా మహిళల్ని ఆకట్టుకుంటాయి. దుస్తులకు నప్పేలా అలంకరణకు ఇది సరైన మార్గం. వీటిని మరే ఇతర ఆభరణాలూ లేకుండా ధరించవచ్చు. డైమండ్ షాండ్లియర్స్ కావచ్చు లేదా జడౌ చంద్బాలిస్ కావచ్చు చెవిపోగులు మాత్రం తప్పనిసరిగా ఉండాలి. బోల్డ్ రింగులు.. ఒక పెద్ద డేరింగ్ రింగ్ ధరించడం రూపానికి అత్యాధునికతను జోడిస్తుంది. దీని కోసం ఓ అసాధారణమైన డిజైన్లను ఎంచుకోవాలి. రత్నం, సిగ్నెట్ పెద్ద వాస్తవిక పువ్వులు వంటివి మరింత అందాన్నిస్తాయి. జడౌ..జతగా.. ఏదైనా భారతీయ ఆభరణాల శైలిలో జడౌ నెక్లెస్ ధారణ తరతరాల వారసత్వంగా వస్తోంది. పూర్వ కాలంలో చాలా ఆభరణాలు మొఘల్ ఇతివృత్తంతో ప్రభావితమయ్యాయి, అయితే ప్రస్తుతం ఆధునిక ఆభరణాల తయారీలో పురాతన పద్ధతుల్లో ఏదైనా ఒకదానిని జత కలపడం ఒక ప్రత్యేకమైన కొత్త సంప్రదాయంగా మారింది. ఆ విధంగా జడౌ నెక్లెస్‌కు ఆదరణ పెరిగింది. ఆమె..ఆభరణం.. కాబోయే వధువు అయితే, పెళ్లి రోజు లుక్‌లో ఆభరణాలు అతి ముఖ్యమైన భాగం. పెళ్లి ఆభరణాలు, అవి ఏ వధువునైనా యువరాణిగా చూపించగలవు. పెళ్లి వేడుకల్లో భారీ నెక్‌పీస్ ఎంచుకుంటారు. అయితే ఇవి విడదీసి, ధరించగలిగేలా ప్రత్యేకంగా రూపొందుతాయి. అన్నీ కలిపినప్పుడు అవి గ్రాండ్‌లుక్‌ని సంతరించుకుంటాయి. అలాగే వివాహానంతరం కూడా వాటిని సందర్భానుసారం ధరించవచ్చు. ఆఫీస్..డైమండ్ పీస్.. పని విధానాలకు అనుగుణంగా అలాగే సాయంత్రం సమావేశాల్లో సమర్థవంతంగా మమేకమయ్యే అందమైన పీసెస్, సెన్సిటివ్ డైమండ్ హగ్గీలు లేదా సాలిటైర్ స్టడ్లు రోజువారీ డ్రెస్సింగ్‌కు సరైన ఎంపిక. ఆఫీసుకు ఇండియన్ ఫార్మల్స్ ధరించడం ఇష్టపడితే, డైమండ్ సరౌండ్‌తో లేదా ఒక జత సింగిల్ పోల్కీ ఇయర్ స్టడ్‌తో సరిపెట్టొచ్చు. (చదవండి: కళ్లకు గంతలు.. ‘కళ’అద్దే వింతలు..)
ఫొటోలు
అంతర్జాతీయం

తుర్కియేను కుదిపేసిన భూకంపం.. భయంతో జనం పరుగులు
తుర్కియేలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.2గా నమోదైయినట్లు ఆ దేశ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ భూకంపం కారణంగా ఇస్తాంబుల్‌లో బలమైన ప్రకంపనలు రాగా, ఇళ్లలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా భయందోళనకు గురై.. ప్రాణ భయంతో ప్రజలంతా రోడ్లపైకి పరుగులు పెట్టారు. ఈ క్రమంలో రహదారులపై వెళ్తున్న కార్లు భూకంప తీవ్రతకు ఊగిపోయాయి.ఈ భూకంపం టర్కీలోని సెంట్రల్ అనటోలియా ప్రాంతంలోని కోన్యా ప్రావిన్స్‌ను తాకినట్లు సమాచారం. భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని సమాచారం. భూకంపానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలొ వైరల్‌గా మారాయి. భూకంపం కారణంగా భయాందోళనలకు గురైన కొందరు భవనాల నుండి దూకడానికి ప్రయత్నించగా.. కొందరు గాయపడినట్లు సమాచారం. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.🚨BIG BREAKING: Earthquake HITS Turkey🇹🇷 pic.twitter.com/Hd6NEFu15t— Manobala Vijayabalan (@ManobalaV) May 15, 2025

బహమాస్‌లో భారత విద్యార్థి మృతి
బోస్టన్: భారత సంతతికి చెందిన ఓ అమెరికా విద్యార్థి బహమాస్ ద్వీపంలో ప్రమాదవశాత్తూ మరణించాడు. 25 ఏళ్ల గౌరవ్ జైసింగ్ అమెరికాలో బెంట్లీ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ చదువుతున్నాడు. శనివారం వర్సిటీ అండర్ గ్రాడ్యుయేషన్ వేడుక నేపథ్యంలో సీనియర్ విద్యార్థులు బహమాస్ పర్యటనకు వెళ్లారు. అట్లాంటిస్ ప్యారడైజ్ ఐలాండ్ రిసార్ట్ అండ్ క్యాసినోలో బస చేశారు. మే 11 రాత్రి హోటల్ గదిలో మిత్రులతో కలిసి గడుపుతున్న గౌరవ్ పై అంతస్తు బాల్కనీ నుంచి పడిపోయాడు. అత్యవసర వైద్యం అందించి ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించినట్టు పోలీసులు తెలిపారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందని ధ్రువీకరించారు. దర్యాప్తు కొనసాగు తోంది. బోస్టన్‌కు 12 మైళ్ల దూరంలో ఉండే బెంట్లీ ఓ చిన్న ప్రైవేట్ విశ్వవిద్యాలయం.

ఇవేంటి! ఇంత అద్భుతంగా ఉన్నాయ్!
దోహా: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశానికి అధ్యక్షుడు. అపర కుబేరుడు. అలాంటి ట్రంప్ సౌదీ అరేబియా, ఖతార్ అధినేతల ప్రాభవం చూసి నోరెళ్లబెట్టారు. వారి రాజభవనాలను చూసి అసూయపడ్డానని స్వయంగా చెప్పారు. ఖతార్ రాజప్రాసాదాల ఠీవి, సౌకర్యాలు చూసి, ‘‘ఇవేంటి ఇంత అద్భుతంగా ఉన్నాయి! వీటిని జీవితంలో కొనలేం’’ అని వ్యాఖ్యానించారు. తన అత్యాధునిక ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విమానం కంటే అత్యంత విలాసవంత, అధునాతన బోయింగ్–747 రకం విమానాలను ఖతార్, సౌదీల్లో చూశానని చెప్పుకొచ్చారు. ఖతార్ నుంచి విమానాన్ని కానుకగా తీసుకోవడానికి సంకోచించబోనని బల్లగుద్దిమరీ చెప్పారు. ఖతార్ పాలకుడు అమీర్ తమీమ్ బిన్ హమాద్ అల్ థానీ రాజభవనం ‘అమీర్ దివాన్’ను చూసి దిగ్భ్రాంతికి లోనయ్యానని వెల్లడించారు. ‘‘స్వతహాగా నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని. నిర్మాణ నైపుణ్యం, కట్టడాల నేర్పు ఇట్టే పసిగడతా. మీ నివాసాలు భూలోక స్వర్గాలు. ఇంద్రభవనాలు. ఎంత పర్ఫెక్ట్గా కట్టారో!’’ అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు.

ఖతార్‌తో 200 బిలియన్ డాలర్ల డీల్
దోహా/రియాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌదీ అరేబి యా పర్యటన ముగించుకొని బుధవారం ఖతార్ చేరుకున్నారు. ఖతార్‌లో ఆయన ఘన స్వాగతం లభించింది. అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ నుంచి 160 విమానాలు కొనుగోలు చేసేందుకు ఖతార్ ఒప్పందం చేసుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ డీల్ విలువ 200 బిలియన్ డాలర్లు అని తెలిపారు. ఖతార్ పాలకుడు షేక్ తమిమ్ బిన్ హమద్ అల్–థానీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఈ పర్యటన కంటే ముందు ట్రంప్ మాట్లాడుతూ.. ఖతార్ నుంచి ఒక విమానాన్ని బహుమతిగా స్వీకరించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఖతార్ ఇచ్చే విమానాన్ని ఎయిర్‌ఫోర్స్ వన్‌గా వాడుకుంటానని వ్యాఖ్యానించారు. మరోవైపు తుర్కియేలో పర్యటించాలన్న ఆకాంక్షను ట్రంప్ వ్యక్తంచేశారు. ఉక్రెయిన్, రష్యా అధినేతలు జెలెన్స్కీ, పుతిన్ తుర్కియేలో ముఖాముఖి భేటీ కాబోతున్నట్లు ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ భేటీ పట్ల ట్రంప్ ఆసక్తి కనబరుస్తున్నారు. తాను తుర్కియేకు వెళ్తే పుతిన్ ఎంతగానో సంతోషిస్తారని ట్రంప్ చెప్పారు.ఒకప్పుడు ఉగ్రవాదుల జాబితాలో ఉన్న సిరియా అధ్యక్షుడితో ట్రంప్ సమావేశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం సౌదీ అరేబియాలో సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్– షారాతో సమావేశమయ్యారు. రెండు దేశాల అధినేతలు కలుసుకోవడం గత 25 ఏళ్లలో ఇదే మొదటిసారి. 50 ఏళ్లుగా అస్సద్ కుటుంబ పాలనలో అంతర్యుద్ధంతో నలిగిపోయి న సిరియాకు ఇటీవలే విముక్తి లభించిన సంగతి తెలిసిందే. ట్రంప్‌తో అల్–షారా కీలక అంశాలపై చర్చించినట్లు తెలు స్తోంది. ఇజ్రాయెల్ దేశాన్ని అధికారికంగా గుర్తించాలని, సిరియా నుంచి విదేశీ ఉగ్రవాదులను బయటకు వెళ్లగొట్టాలని అల్–షారాను ట్రంప్ కోరినట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ తెలిపారు. అల్– షారాతో భేటీ అనంతరం ఎయిర్‌ఫోర్స్ వన్‌లో డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడారు. సిరియా అధ్యక్షు డిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన ఆకర్ష ణీయంగా కనిపిస్తున్న అందమైన యువకుడు అంటూ కొనియాడారు. బలమైన వ్యక్తి, ఫైటర్ అంటూ శ్లాఘించారు. సిరియాపై ఆంక్షలు రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో సిరియా ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. తమ కు మంచి రోజులు వచ్చా యని ఆనందం వ్యక్తంచేశారు. అస్సద్ ప్రభుత్వ హయాంలో తిరుగుబాటు నాయకుడిగా గుర్తింపు పొందిన అల్–షారాను అమెరికా ప్రభుత్వం 2013లో అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఆయనపై 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. అదే అల్–షారా అధ్యక్షుడు కావడం, డొనల్డ్ ట్రంప్ ఆయనతో భేటీ కావడం విశేషం.
జాతీయం

జేపీ నడ్డా ఫోన్.. ట్వీట్ డిలీట్ చేసిన కంగనా!
న్యూఢిల్లీ: భారత్ లో యాపిల్ ఫోన్లు తయారీ అనవసరం అన్న రీతిలో ఆ సంస్థ సీఈవో టిమ్ కుమ్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ స్పష్టం చేసిన తరుణంలో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ పై వ్యవహారశైలిలో కాస్త ఘాటుగా రిప్లై ఇచ్చారు కంగనా. దీనిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. కంగనా రనౌత్ కు ఫోన్ చేసి ఆ ట్వీట్ డిలీట్ చేయించారు. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ట్రంప్ పై పెట్టిన పోస్ట్ ను వెంటనే డిలీట్ చేయాలంటూ ఆదేశించారు. దాంతో ఆ ట్వీట్ ను కంగనా వెంటనే డిలీట్ చేశారు.దీనిపై కంగనా మరొక ట్వీట్ చేస్తూ.. ‘ మా పార్టీ జాతీయ అధ్యక్షుడైన జేపీ నడ్డా ఆదేశాల మేరకు ఆ ట్వీట్ డిలీట్ చేశాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయాన్ని మాత్రమే చెప్పాను. కానీ నడ్డా జీ.. వివాదాల జోలికి వెళ్లొద్దు అని విషయం చెప్పారు. ఆయన మాట మీద గౌరవంతో ఆ ట్వీట్ ను వెంటనే తొలగించాను. ఆ పోస్ట్ ను ఇన్ స్టాగ్రామ్ లో కూడా పెట్టడంతో అక్కడ నుంచి తొలగించాను’ అని చెప్పుకొచ్చారు కంగనా.Respected national president Shri @JPNadda ji called and asked me to delete the tweet I had posted regarding Trump asking Apple CEO Tim Cook not to manufacture in India. I regret posting that very personal opinion of mine, as per instructions I immediately deleted it from…— Kangana Ranaut (@KanganaTeam) May 15, 2025ఇది కూడా చదవండి:భారత్‌లో ఐఫోన్ తయారీకి ఆసక్తి చూపడం లేదు: ట్రంప్

టర్కీకి భారత్ ఫస్ట్ స్ట్రోక్.. ఇక సర్దేసుకోవడమే!
న్యూఢిల్లీ: పాకిస్తాన్ పై ఉగ్రవాదంపై పోరులో ఆపరేషన్ సిందూర్ ను భారత్ చేపట్టగా, దానికి వ్యతిరేకంగా పని చేసింది టర్కీ(తుర్కియే). ఇక్కడ ప్రత్యక్షంగా పాకిస్తాన్ కు సాయం చేసి భారత్ ను దెబ్బ కొట్టాలని యత్నించింది. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లలో సింహ భాగం టర్కీకి చెందినవే కావడమే కాకుండా, ఆ డ్రోన్లకు ఆపరేటర్లను కూడా సప్లై చేసింది టర్కీ. ఇది భారత్ కు మరింత కోపం తెప్పించింది. టర్కీ నుంచి ఏమైనా డ్రోన్లను కొనుగోలు చేశారా అని తొలుత భావించినా, ఆ డ్రోన్ల ఆపరేటర్లు కూడా ఆ దేశానికే చెందిన వారే కావడంతో వారి పన్నాగం బయటపడింది.దాంతో టర్కీపై విమర్శలు వెల్లువెత్తాయి. వరదల సమయంలో ఏ దేశం కూడా సాయం చేయడానికి ముందుకు రాకపోతే భారత్ వారికి ఆపన్న హస్తం అందించింది. దానిని మరిచిపోయి మన వేలితో మనల్నే పొడాలని చూసింది టర్కీ. ఇప్పుడు టర్కీకి బుద్ధి చెప్పే సమయం వచ్చేసింది.సెక్యూరిటీ క్లియరెన్స్ అనుమతులు రద్దు..!భారతదేశంలోని తొమ్మిది ప్రధాన విమానాశ్రయాలలో సింహభాగాన్ని నిర్వహిస్తున్న టర్కిష్ సంస్థ తన భద్రతా అనుమతిని కోల్పోయింది. ఈ రోజు(గురువారం) సాయంత్రం భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ టర్కీకి చెందిన సంస్థకు అనుమతులు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. జాతీయ భద్రత దృష్ట్యాసెలెబి గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భద్రతా అనుమతిని తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.ఇప్పటివరకూ ఉన్న పరిస్థితి ఇది..!భారత్‌లోని పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా అంశాల్లో కూడా తుర్కియే పరోక్షపాత్ర ఉంది. .వాటిలో కార్గో హ్యాండ్లింగ్ వంటి కీలక కాంట్రాక్టులను తుర్కియేకు చెందిన సెలెబీ ఏవియేషన్ కంపెనీ చెందిన అనుబంధ సంస్థ సంపాదించింది. భారత్‌లో 2008 నుంచి ఈ సంస్థ సేవలందిస్తోంది. ఏటా 58,000 విమానాలు, 5.4 లక్షల టన్నుల సరకు రవాణా బాధ్యతలను చూసుకుంటోంది. అందులో 7,800 మంది సిబ్బంది ఉన్నారు.హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, గోవా, కొచ్చిన్, కన్నూర్ వంటి కీలక విమానాశ్రయాల్లో హై సెక్యూరిటీ బాధ్యతలు సెలెబీవే! గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో మేనేజ్మెంట్, ఎయిర్‌సైడ్ ఆపరేషన్స్ విధులను ఈ సంస్థే చూస్తోంది. విమానాలను నిలిపి ఉంచే హై సెక్యూరిటీ జోన్, ఎయిర్‌సైడ్ జోన్లన్లా సంస్థ సిబ్బందే విధుల్లో ఉంటున్నారు. ప్రయాణికుల బ్యాగులు, కార్గో పనులను చూసుకునేదీ వాళ్లే. అంతర్జాతీయ సర్వీసుల్లో కూడా ఈ బాధ్యతలను వీళ్లకే అప్పగించారు. తాజా పరిణామాల నేపథ్యంలో దీనిపై ఆందోళనలు చోటు చేసుకున్నాయి. దాంతో భారత ప్రభుత్వం.. చర్యలు చేపట్టి ఆ సంస్థకు చెందిన అనుమతులను రద్దు చేసింది. ఇది తుర్కియేగా పిలువబడుతున్న టర్కీకి భారత్ ఇచ్చిన తొలి స్ట్రోక్.

జూమ్ కాల్‌తో భార్య రెండో పెళ్లి గుట్టురట్టు.. నాలుగేళ్ల కోర్టు పోరాటంలో భర్త విజయం
సాక్షి, బెంగళూరు: భార్య నుంచి విడాకులు కావాలని కోరుతూ నాలుగేళ్ల కోర్టు పోరాటంలో ఓ భర్త విజయం సాధించాడు. అంతేకాదు భర్త నుంచి తనకు రూ.3 కోట్ల భరణం కావాలన్న భార్య డిమాండ్‌ను కోర్టు తిరస్కరించింది. కోర్టు ఖర్చుల కింద రూ.30వేలు ఇస్తే సరిపోతుందంటూ భార్య నుంచి భర్తకు విడాకులు మంజూరు చేస్తూ ఫ్యామిలీ కోర్టు తీర్పును వెలువరించింది.కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే.. బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ దంపతులకు 2018లో వివాహం జరిగింది. అయితే, ఏ చీకు చింతా లేని దాంపత్య జీవితంలో వివాహానికి ముందు భార్య నెరిపిన ప్రేమాయణం చిచ్చుపెట్టింది.వివాహం తర్వాత భార్య.. భర్తతో అన్యోన్యంగా మెలుగుతూ వచ్చింది. కానీ అనూహ్యంగా అదే భార్య ప్రేమ పేరుతో ప్రియుడికి దగ్గరైంది. భర్తకు తెలియకుండా అతన్ని రెండో వివాహం చేసుకుంది. మొదటి భర్తతో కలిసి జీవించేది. డబ్బులు అవసరం అయినప్పుడల్లా రెండో భర్తకు డబ్బులు పంపిస్తుండేది. దీంతో భార్య చేస్తున్న ఖర్చులపై మొదటి భర్తకు అనుమానం మొదలైంది. ఇదే విషయంపై భార్యను నిలదీయాలని అనుకున్నాడు.కానీ అలా చేయలేదు. భార్య గుట్టు రట్టు చేసేందుకు పక్కా ప్లాన్ వేశాడు. తన స్నేహితుడి సాయంతో భార్యకు జూమ్ ఇంటర్వ్యూ నిర్వహించాడు. ఆ జూమ్ ఇంటర్వ్యూలో తనకు అన్వేక కారణాల వల్ల మొదటి వివాహం జరిగిందని, ఇప్పుడు ఆ వివాహ బంధానికి ముగింపు పలికి రెండో వివాహం చేసుకున్నట్లు తెలిపారు.ఈ పరిణామం తరువాత ఆర్టీఐ ద్వారా.. తన భార్యకు రెండో వివాహం ఎప్పుడు జరిగిందో తెలుసుకున్నాడు. మ్యారేజీ సర్టిఫికెట్లు, పాన్ కార్డ్‌లతో పాటు ఇతర ఆధారాల్ని సేకరించాడు. వాటి ఆధారంగా 2023 మార్చి నెలలో భార్య తన ప్రియుడిని రెండో వివాహం చేసుకున్నట్లు గుర్తించాడు. వెంటనే మంగళూరు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలని ప్రాధేయపడ్డాడు. భార్య నుంచి విడాకులు కోరాడు. భార్య మానసిక హింస, వివాహం నిబంధనలను ఉల్లంఘించడం, ప్రతిష్టకు భంగం కలిగించిందని ఆరోపించాడు. ఆర్టీఐ ద్వారా సేకరించిన ఆధారాల్ని కోర్టుకు అందించాడు. విచారణ చేపట్టిన కోర్టు విడాకుల విషయంలో భార్య నిర్ణయం తెలపాలని ఆదేశించింది. దీంతో భార్య.. భర్తపై గృహ హింస, డౌరీ హింస, గర్భం తొలగించమని బలవంతం చేశారని ఆరోపించింది. అంతేకాదు భరణం కింద రూ.3 కోట్లు, నెలకు ఖర్చుల కింద రూ.60వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది.ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. 2025,ఏప్రిల్ 23న భార్య నుంచి భర్తకు విడాకులు మంజూరు చేసింది. భార్య అడిగిన భరణాన్ని తిరస్కరించింది. న్యాయవాద ఖర్చుల నిమిత్తం రూ.30వేలు ఇవ్వాలని ఆదేశించింది.

కాల్పుల విరమణ ఎవరు కోరుకున్నారో అందరికీ తెలుసు: జైశంకర్
ఢిల్లీ: పాక్ ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించాల్సిందేనని భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తేల్చి చెప్పారు. కాల్పుల విరమణ ఎవరు కోరుకున్నారో అందరికీ తెలుసునంటూ ఆయన వ్యాఖ్యానించారు. భారత్ కేవలం పీవోకే, టెర్రరిజం గురించి మాత్రమే మాట్లాడుతోంది. సింధూ జలాల నిలిపివేతపై యథాతథ స్థితి కొనసాగుతోంది. ఉగ్రవాదులకు మౌలిక వసతులు కల్పించే వ్యవస్థను రుపుమాపాలి’’ అని జైశంకర్ పేర్కొన్నారు.పాకిస్థాన్‌తో చర్చలు ఉగ్రవాదంపై మాత్రమే ఉంటాయని ప్రధాని చాలా స్పష్టంగా చెప్పారని జైశంకర్ గుర్తు చేశారు. ఉగ్రవాదంపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని జైశంకర్ చెప్పారు. #WATCH | Delhi | "Our relations and dealings with Pakistan will be strictly bilateral. That is a national consensus for years, and there is absolutely no change in that. The prime minister made it very clear that talks with Pakistan will be only on terror. Pakistan has a list of… pic.twitter.com/j9lugNSpsd— ANI (@ANI) May 15, 2025కాగా, ఆపరేషన్ సిందూర్, పాకిస్తాన్‌తో తాజా ఉద్రిక్తతలు, నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో మంత్రులు, సీనియర్ ఉన్నతాధికారుల భద్రతపై కేంద్రం నిశితంగా దృష్టి పెట్టింది. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌కు భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. మంత్రి కాన్వాయ్‌లో మరో రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను చేరుస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది.ఢిల్లీలోని ఆయన నివాసం చుట్టూ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. జైశంకర్‌కు భద్రతను 2023లో వై నుంచి జెడ్ కేటగిరీకి పెంచారు. ఇప్పటికే రెండో అత్యున్నత స్థాయి భద్రత. అందులో భాగంగా 33 మందితో కూడిన సీఆర్పీఎఫ్ కమాండోల బృందం 24 గంటలూ ఆయనను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది.జెడ్ కేటగిరీలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ), 4 నుండి ఆరుగురు స్థానిక పోలీసు మంది కమాండోలతో సహా 22 మంది సిబ్బంది, ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ఎస్కార్ట్ వాహనాలుంటాయి. సాధారణంగా ఉన్నత స్థాయి రాజకీయ నాయకులకు, ప్రముఖులకు, బెదిరింపులను ఎదుర్కొంటున్న వారికి ఈ స్థాయి భద్రత అందిస్తారు. కేంద్ర రక్షణ జాబితాలోని వీఐపీ భద్రతా కవర్ జెడ్–ప్లస్ (అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్), జెడ్, వై, వై–ప్లస్, ఎక్స్ దాకా ఉంటుంది. ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో సహా దాదాపు 200 మందికి సీఆర్పీఎఫ్ వీఐపీ భద్రతా సంరక్షణ ఉంది.
ఎన్ఆర్ఐ

స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 6 వ వార్షికోత్సవ వేడుకలు
స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 6 వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు హాజరయ్యారు. సింగపూర్ లోని తెలుగు వారంతా అన్ని విధాలా సుసంపన్నులని ఈ విధంగా లలిత కళలను ప్రోత్సహించడం ఆనంద దాయకమన్నారు. చిన్నారులు పాడిన పాటలు ఎంతో బాగున్నాయి అని , ఇంత చక్కగా నేర్పిన గురువును నేర్చుకున్న వారి శిష్యులను వారి తల్లిదండ్రులను ప్రశంసించారు. సంగీతం, నాట్యం వంటి కళల ద్వారా మనలో మృదుత్వం కలుగుతుందని, నేటి యాంత్రిక జీవితంలో ఈ మాధ్యమం ఎంతో ముఖ్యం అని కాబట్టి కళల పైన ఉన్న ఆసక్తిని తమ తమ ఆర్థిక సంపాదన రధ చక్రాల కింద పడి నలిగి పోనివ్వవద్దని కోరారు.ఈ కార్యక్రమానికి STS వైస్ ప్రెసిడెంట్ జ్యోతీశ్వర్ , శ్రీ సాంస్కృతిక కలసారథి అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్,TCSS అధ్యక్షులు గడప రమేష్, TAS (మనం తెలుగు ) అసోసియేషన్ అనిత రెడ్డి , కమల క్లబ్ మాజీ అధ్యక్షులు, సారీ కనెక్షన్ అడ్మిన్ పద్మజ నాయుడు , మగువ మనసు అడ్మిన్ వీర మాంగోస్ ఉష , సింగపూర్ తెలుగు టీవి రాధాకృష్ణ గణేశ్న , జయంతి రామ, భాగవత ప్రచార సమితి భాస్కర్ ఊలపల్లి, H& H శ్యామల , విష్ణు ప్రియ , సింగపూర్ తెలుగు వనితలు అడ్మిన్స్ క్రాంతి, దేదీప్య, జయ, ప్రత్యూష , అమ్ములు గ్రూపు నుండి అడ్మిన్ సునీత రామ్, , KCAS దివ్య ఇంకా పలువురు సింగపూర్ తెలుగు కమ్యూనిటీ వ్యవస్థాపకులు హాజరయి అందరూ కలిసి వైస్ ఛాన్స్‌లర్‌ను సన్మానించారు. స్వరలయ ఆర్ట్స్, సింగపూర్ వ్యవస్థాపక అధ్యక్షురాలు యడవల్లి శేషుకుమారి వారి శిష్యులు,స్నేహితులు కీర్తనలను ఆలపించారు. పద్మజ నాయుడు మాట్లాడుతూ శేషు గాన కోకిల అని పొగడగా ఆచార్య నిత్యానందరావు గారు కోకిల ఒక కాలంలో మాత్రమే పాడుతుందని కాని ఈమె 365 రోజులు గానం ఆలపిస్తారు అన్నారు. శ్యామల మాట్లాడుతూ వారి వెంకటేశ్వర గానామృతం కార్యక్రమానికి శేషు కుమారి 70 పాటలు 40 రాగాలలో స్వర పరిచి మూడున్నర గంటల సేపు పాడి అందరినీ అలరించిన వైభవం గుర్తు చేసి ఈ రోజుకి ఆ పాటలు తమ చెవులలో ప్రతి ధ్వనిస్తూ పరవసింప చేస్తాయని ప్రశంసించారు.పొట్టి శ్రీరాములు, తెలుగు విశ్వవిద్యాలయం సర్టిఫికేట్ కోర్సు మొదటి వత్సరం, రెండవ సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన స్వరలయ ఆర్ట్స్ విద్యార్థులకు వైస్ ఛాన్స్ లర్ బహుమతి ప్రధానం చేశారు. అతిథులకు మొమెంటోలను బహుకరించారు ఈ నెల ఆరవ తారీఖున స్వరలయ ఆర్ట్స్ వారు నిర్వహించిన త్యాగ రాజ ఆరాధన ఉత్సవాలలో పాల్గొని తమతో కలిసి పంచరత్నాలు పాడిన సౌభాగ్య లక్ష్మి తంగిరాల, షర్మిల చిత్రాడ, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, రాధికా నడదూర్, ప్రియ లకు మొమెంటోలను బహుకరించారు. శివ కుమార్ మృదంగం పై వాయిద్య సహకారం అందించారు ఈ కార్యక్రమానికి శ్రీమతి చైతన్య వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పలువురినీ లలిత కళారంగంలో ఉత్సాహ పరుస్తూ ముందుకు నడిచే ఇటువంటి కార్యక్రమానికి దాదాపుగా 200 మంది హాజరు కావటమే కాకుండా, సాంఘిక మాధ్యమాల ద్వారా కూడా వీక్షించి విశేషస్పందనలను తెలియజేయటం అభినందనీయం.

9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ’’ విశేష సంచిక ఆవిష్కారం
ఖతార్ దేశ రాజధాని దోహా మహానగరంలో 2024 నవంబర్‌లో జరిగిన "9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు" యొక్క సభా విశేష సంచిక అంతర్జాల మాధ్యమంలో ఆదివారం ఆవిష్కరించారు. 'వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా' ,'ఆంధ్ర కళా వేదిక - ఖతార్' సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహింపబడి, మధ్య ప్రాచ్య దేశాలలోనే తొలి సాహితీ సదస్సుగా రికార్డును సృష్టించిన ఈ '9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో పది దేశాల నుండి పాల్గొన్న వక్తలు, కవులు, రచయితలు ప్రసంగించిన అన్ని అంశాలను పొందుపరుస్తూ 380 పేజీలతో ఈ సభా విశేష సంచిక రూపొందించబడింది. ఈ ఉద్గ్రంధానికి సంపాదకులుగా రాధికా మంగిపూడి, విక్రమ్ సుఖవాసి, వంగూరి చిట్టెన్ రాజు, లక్ష్మి రాయవరపు, శాయి రాచకొండ వ్యవహరించారు.సదస్సు నిర్వాహకవర్గము, సంచిక సంపాదకులు, సదస్సులో వివిధ దేశాల నుండి పాల్గొన్న వక్తలు, రచయితలు అందరి సమక్షంలో ఈ పుస్తక ఆవిష్కరణ జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకించి అంతర్జాల మాధ్యమంలో ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. మరిన్నిNRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపకులు డా. వంగూరి చిట్టెన్ రాజు, ఖతార్ ఆంధ్ర కళా వేదిక నుండి విక్రమ్ సుఖవాసి ప్రధాన నిర్వాహకులుగా, వారి అధ్యక్షతన, రాధిక మంగిపూడి సభానిర్వహణలో దాదాపు మూడు గంటల పాటు ఆదివారం సాయంత్రం నిర్వహింపబడిన ఈ కార్యక్రమంలో భారత్, ఖతార్, అమెరికా, సౌదీ అరేబియా, బహరైన్, యూఏఈ, సింగపూర్ తదితర దేశాలనుండి వక్తలు, తెలుగు సంస్థల ప్రతినిధులు, రచయితలు పాల్గొన్నారు.అమెరికా నుండి చెరుకూరి రమాదేవి, శాయి రాచకొండ, భారత్ నుండి డా. వంశీ రామరాజు, డా. అద్దంకి శ్రీనివాస్, డా. బులుసు అపర్ణ, ఆచార్య అయ్యగారి సీతారత్నం, ఆచార్య త్రివేణి వంగారి, కస్తూరి అలివేణి, డా. దేవులపల్లి పద్మజ తదితరులు, బహరైన్ నుండి మురళీకృష్ణ, సౌదీ అరేబియా నుండి కోనేరు ఉమామహేశ్వరరావు, చివుకుల పట్టాభిరామ శర్మ, సింగపూర్ నుండి కవుటూరు రత్నకుమార్, యూఏఈ నుండి షేక్ రఫీ, డా. తాడేపల్లి రామలక్ష్మి, ఖతార్ నుండి శ్రీసుధ, గోవర్ధన్ రెడ్డి, మనీష్, మాధవి లలిత, గౌరీ బొమ్మన తదితరులు ఆసక్తిగా పాల్గొని సదస్సు యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.ఈ సభా విశేష సంచికలో నిర్వాహక సంస్థల పరిచయాలు, అధ్యక్షుల, సంచాలకుల ముందుమాటలు, సదస్సు ప్రకటనలు, వక్తలందరి ఫోటోలు, వ్యాసాలు, కథలు, కవితలతో పాటు, సదస్సు అనంతరం అందరూ అందించిన స్పందనలు కూడా జోడించడం, ఆనందంగా ఉందని, జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ సంచిక ఉందంటూ సంపాదకులను నిర్వాహకులను అభినందించారు.డా. వంగూరి చిట్టెన్ రాజు మాట్లాడుతూ "మధ్యప్రాచ్య దేశాలలో తెలుగు సాహిత్య అభిమానులందరికీ ఈ సదస్సు కొత్త స్ఫూర్తిని అందించిందని, సదస్సు ప్రభావం వలన ఎంతోమంది సాహిత్యంపై చక్కటి ఆసక్తి పెంచుకోవడం, కొత్త రచయితలు జనించడం.. ఆనందదాయకమని తెలియజేశారు. ఇటువంటి సదస్సులు మరిన్ని జరగాలని, కొత్త రచయితలు యువతరం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విక్రమ్ సుఖవాసి ఆంధ్ర కళావేదిక తరపున మరొకసారి అందరికీ తమ దేశానికి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తొలిసారి ప్రపంచ సదస్సుకు సంచాలకునిగా ఈ సంచికకు సహసంపాదకునిగా ఉండడం చాలా ఆనందంగా ఉందన్నారుఈ సంచికకు రూపకల్పన సహకారం అందించిన జేవి పబ్లికేషన్స్ అధినేత్రి జ్యోతి వలబోజు కూడా ఈ ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఇతర మధ్యప్రాచ్య దేశాల సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ తమ దేశాలలో కూడా ఇటువంటి సాహిత్య సదస్సులు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని 10వ ప్రపంచ సదస్సు జరపడానికి అవకాశం ఇమ్మని కోరుతూ తమ ఉత్సాహాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమం వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా యూట్యూబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారమైంది.

న్యూజెర్సీ, పార్సిప్పనీలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం
న్యూజెర్సీలోని పార్సిప్పనీలో శ్రీ సీతారాముల కల్యాణం రమణీయంగా, కమనీయంగా సాగింది. న్యూయార్క్‌లోని శ్రీ రంగనాథ ఆలయం నుంచి స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను తీసుకొచ్చారు. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ ఊరేగింపుగా కల్యాణ మండపానికి స్వర్ణ సింహాసనంపై స్వామివారిని, అమ్మవారిని ఆసీనులను చేశారు. కళ్యాణం సందర్భంగా భక్తులు చేయించిన అభరణాలను వధూవరులకు ధరింపజేశారు. రాముల వారికి, సీతమ్మ వారికి పట్టు వస్త్రాలు, తాళిబొట్టు, మెట్టలు, ఆభరణాలు, ముత్యాల తలంభ్రాలను సమర్పించారు. మేళంతో ఊరేగింపుగా పట్ట వస్త్రాలను తీసువచ్చారు. సీతమ్మ, రామయ్యల ఎదుర్కోలు ఘట్టం కనులారా తిలకించిన భక్తులు ఆనందపరవశులయ్యారు. భక్తజనంతో న్యూజెర్సీలో పండగ వాతావరణం నెలకొంది. సంస్కృతి, సంప్రదాయలకు అనుగుణంగా వివాహ వ్యవస్థపై కృష్ణ దేశిక జీయర్ స్వామిజీ చేసిన వ్యాఖ్యానం విశేషంగా ఆకట్టుకుంది. దండలు మార్చుకునే క్రమంలో అర్చకులు నృత్య ప్రదర్శన చేసి సంప్రదాయాన్ని గుర్తు చేశారు. మరిన్నిNRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!అనంతరం గణపతి పూజ, విశ్వక్సేన ఆరాధన, మహాసంకల్పం, మంగళఅష్టకాలు, కన్యాదానం, తలంబ్రాల ఘట్టం, పూలదండల మార్పు, మహా హారతి, నివేదన తదితర ఘట్టాలు శాస్త్రోక్తంగా జరిగాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల నడుమ జగదభిరాముడు జానమ్మను మనువాడారు. కోదండ రాముడు సీతమ్మ మెడలో మూడుముళ్లు వేసిన వేళ, రఘునందనుడి దోసిట తలంబ్రాలు ఆణిముత్యాలే నీలపురాశులుగా, జగన్మాత లోకపావని సీతమ్మ దోసిట అక్షింతలు మణిమాణిక్యాలై సాక్షాత్కారించిన వేళ కల్యాణ ప్రాంగణం భక్తిపారవశ్యంతో ఓలలాడింది.ఈ సీతారాముల కాళ్యానికి పార్సిప్పనీకి మేయర్ జేమ్స్ బార్బెరియోతో పాటు 300 మందికి ప్రవాస తెలుగువారు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేశారు. దాదాపు అందరూ సంప్రదాయబద్ధంగా తయారై కళ్యాణంలో పాల్గొన్నారు. 72 పైగా జంటలు ఈ కళ్యాణ మహోత్సవంలో పాలు పంచుకున్నాయి. ఈ కల్యాణాన్ని ప్రవాసులు కన్నులారా వీక్షిం చి తరించారు. ఈ ఉత్సవం.. భద్రాచల రాముల వారి కళ్యాణమహోత్సవాన్ని తలపించింది. కల్యాణం అనంతరం ఉత్సవ మూర్తులను భక్తులు దర్శనం చేసుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, అక్షింతలు అందజేశారు.

పహల్గామ్ విషాదం, ఎన్ఆర్ఐల శాంతి ర్యాలీ
పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ అమెరికాలో ప్రవాస భారతీయులు శాంతి ప్రదర్శన చేపట్టారు. ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో న్యూయార్క్ ఐజాక్ హోవర్ పార్క్ లో శాంతిని కాంక్షిస్తూ కొవ్వత్తుల ప్రదర్శన చేశారు.అందమైన కాశ్మీర్ లోయ మరోసారి రక్తసిక్తం కావటం, ఉగ్రవాదులు అమాయకులైన టూరిస్టులను పొట్టన పెట్టుకోవటంపై ప్రవాస భారతీయులు ఆవేదన వ్యక్తం చేశారు. హింసామార్గంలో ఎవరూ కూడా లక్ష్యాలను సాధించలేరన్న విషయాన్నిపాకిస్తాన్ ప్రేరేపిత సంస్థలు గుర్తుపెట్టుకోవాలని సూచించారు.ఉగ్రవాదుల అణిచేతకు భారత ప్రభుత్వం చేపట్టే చర్యలకు అండగా ఉంటామని ఇండో అమెరికన్ కమ్యూనిటీ ప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులకు చెందిన వివిధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం(నైటా), వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భారతీయ జెండాలను ప్రదర్శిస్తూ, కొవ్వత్తులతో శాంతి ర్యాలీలో పాల్గొన్నారు.
క్రైమ్

అర్ధరాత్రి క్షుద్రపూజల కలకలం..!
కర్నూలు: పట్టణంలోని కర్నూలు – బెంగళూరు జాతీయ రహదారి పక్కన చెరుకులపాడు క్రాస్ రోడ్డులోని ఓ ఇంట్లో క్షుద్రపూజలు చేసి న ఫొటోలు, వీడియో లు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. ఓ వ్యక్తి మీద చేతబడి ప్రయోగించినట్లుగా తెలుస్తోంది. ఇందుకు పట్టణానికి చెందిన వ్యక్తి సూత్రధారిగా ఉండి కొందరి ఫొటోలతో, భయానక చేతబడి చేస్తున్నప్పటి ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. సేకరించిన సమాచారం మేరకు.. పట్టణానికి చెందిన వ్యక్తి సిఫారసుతో చెరుకులపాడు క్రాస్ రోడ్డులోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న వారు అందులో చేతబడులు చేస్తూ, గుప్తనిధుల వేటగాళ్లకు ఆసరాగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మిగనూరుకు చెందిన వ్యక్తికి అప్పు ఉండ గా అప్పు ఎగ్గొట్టేందుకు ఏకంగా ఆ వ్యక్తిపై చేతబడి ప్రయోగం చేసినట్లు సమాచారం. ఇందులో పట్టణానికి చెందిన పంచాయతీ కార్యాలయంలో అనధికారికంగా పనిచేస్తున్నకార్మికుడి ఫొటో ఉంది. ఇటీవల ఉలిందకొండకు చెందిన వ్యక్తిపై కూడా ఇక్కడి నుంచే చేతబడి ప్రయోగం చేసినట్లుగా తెలుసుకున్న ఉలిందకొండ వారు ఈ ఇంటికి చేరుకుని ఇంట్లో ఉన్నవారితో గొడవ పడినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ ఇళ్లు కేంద్రంగా రెండు నెలల పాటు మండలం వ్యాప్తంగా గుప్తనిధుల వేట కొనసాగినట్లుగా సైతం తెలుస్తోంది. పోలీసులకు సైతం సమాచారం అందినా చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.

భర్త మరణాన్ని జీర్ణించుకోలేక భార్య ఆత్మహత్య
ఉయ్యాలవాడ: విధి ఆటలో ఓ చిన్నారి అనాథగా మారింది. అభంశుభం తెలియని పసిపాప తొమ్మిది రోజుల వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పోయింది. ఈ విషాద ఘటన ఆర్. పాంపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పొగాకు నారాయణ కూలీ పనులకు వెళుతూ జీవనం కొనసాగించేవాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీన గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన మట్టి మిద్దె పనులకు వెళ్లాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ మిద్దె కూలి శిథిలాలు నారాయణపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటి నుంచి అతని భార్య లలిత (40) తీవ్ర మనోవేదనకు గురైంది. మనస్తాపంతో వారం రోజులుగా ఆహారం తీసుకోకుండా భర్త గురించే ఆలోచించింది. తన 45 రోజుల చిన్నారికి కూడా పోతపాలు తాపింది. చివరకు జీవితంపై విరక్తి చెంది బుధవారం ఉదయం లలిత రసాయన పౌడర్‌ను నీళ్లలో కలుపుకుని అపస్మారక స్థితిలో పడిపోయింది. గమనించిన బంధువులు, స్థానికులు చికిత్స నిమిత్తం 108లో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో లలిత మృతి చెందింది. తల్లిదండ్రుల మృతి చెంద డంతో 45 రోజుల చిన్నారి అనాథగా మిగిలింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పసిపాపకు తల్లిదండ్రులు లేకపోవడంతో నాయనమ్మ శివమ్మ దిక్కైంది. అమ్మపాల కోసం ఏడస్తున్న చిన్నారిని చూసి పలువురు కంటతడి పెట్టారు. కాగా నారాయణ మొదటి భార్య విజయలక్ష్మి ఐదేళ్ల క్రితం కుటుంబ కలహాలతో క్రిమి సంహారక మందు తాగి మృతి చెందింది. రెండేళ్ల క్రితం లలితను రెండవ వివాహం చేసుకున్నాడు. మృతురాలి తల్లి నారాయణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్.. ఇటీవల జిల్లాలో పలువురు ఆత్మహత్యకు కల్లాపికి ఉపయోగించే పేడ రంగును నీళ్లలో కలుపుకుని తాగి మృతి చెందుతుండటంతో కలెక్టర్ రాజకుమారి నెల క్రితం పేడ రంగు విక్రయాలను నిషేధించారు. అయినా కొందరు కిరాణ దుకాణ వ్యాపారులు విక్రయిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. పేడ రంగు విక్రయించకుండా అధికారులు దుకాణాలపై దాడులు చేయా లని గ్రామస్తులు కోరుతున్నారు.

తాళిబొట్లు తెంచి పడేసి హిజ్రాల ఆవేదన..!
తమిళనాడు: కూవాగంలో గత కొద్ది రోజులు సందడి చేసిన హిజ్రాలు బుధవారం విషాదంతో స్వస్థలాలకు తిరుగు పయనం అయ్యారు. మంగళవారం ఎంతో ఆనందంగా కట్టుకున్న మంగళ సూత్రాలను తెంచి పడేసి ఒప్పారి పెట్టారు. తెల్ల చీరలు ధరించి వితంతువులుగా మారి కూవాగం నుంచి తిరుగు పయనం అయ్యారు. ముందుగా ఉదయం కూత్తాండవర్ రథోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. రాష్ట్రంలోని కళ్లకురిచ్చి జిల్లా ఉలుందూర్ పేట సమీపంలోని కూవాగం గ్రామంలోని కూత్తాండవర్ ఆలయంలో రెండు వారాల పాటు చిత్తిరై ఉత్సవాలు అత్యంత వేడుకగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గత మూడు రోజులు హిజ్రాల సందడితో కూవాగం కళకళలాడింది. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, ఆలయ పూజారి చేతుల మీదుగా మంగళవారం హిజ్రాలు తాళిబొట్లు కట్టించుకున్నారు. రాత్రంతా ఆట పాటలతో సందడి చేశారు. రథోత్సవం బుధవారం ఉదయం కూత్తాండవర్ రథోత్సవం ఘనంగా జరిగింది. ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా జనసందోహం తరలివచ్చారు. ఈ వేడుక కోసం కూవాగం, పందలాడి, కిలక్కు కుప్పం, శిరులాయం కుళం గ్రామాల నుంచి ప్రజలు చేతులు, కాళ్లు, భుజాలు, శిరస్సు ఆకారాలను తీసుకొచ్చి రథంపై ఉంచారు. బ్రహ్మాండంగా కూత్తాండవర్ రథోత్సవ సేవ జరిగింది. అనంతరం బలిదానం జరిగింది. బలిదానంలో తమ ఆరాధ్యుడు బలి కావడంతో తమ భర్తను కోల్పోయినంతగా తీవ్ర వేదనతో ఒక్కసారిగా హిజ్రాలు విషాదంలో మునిగారు. తాము కట్టుకున్న మంగళ సూత్రాలను తెంచి పడేసి కన్నీటి సంద్రంలో మునిగారు. ఏడుపులు, పెడ»ొబ్బలతో ఒప్పారి పెట్టారు. అక్కడి కొలనులో స్నానం చేసి తెల్ల చీరల్ని ధరించి తమ స్వస్థలాలకు తిరుగు పయనమయ్యారు.

చేయి విరిగిందని వెళితే.. ప్రాణం పోయింది
తగరపువలస(విశాఖపట్నం): వాష్‌రూమ్‌లో జారిపడి చేయి విరిగిన ఓ మహిళ తొలుత సంగివలసలోని అనిల్ నీరుకొండ(ఎన్ఆర్ఐ) ఆసుపత్రిలో చికిత్స పొంది. అక్కడ పరిస్థితి విషమించడంతో నగరంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. తన భార్య మృతికి అనిల్ నీరుకొండ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆమె భర్త జనార్థన్ ఆరోపించారు. కుటుంబసభ్యులతో ఆసుపత్రి ముందు బైఠాయించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వివరాలివి. భీమిలి మండలం చిప్పాడలో నివాసముంటున్న దివీస్ ఉద్యోగి జనార్థన్ భార్య యర్రంశెట్టి రేవతి ఈ నెల 10న ప్రమాదానికి గురైంది. వెంటనే ఆమెను ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చేర్పించగా.. అక్కడ వైద్యం వికటించి అపస్మారక స్థితికి చేరుకుంది. మెరుగైన వైద్యం కోసం జనార్థన్ ఆమెను నగరంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి అత్యవసరంగా తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె బుధవారం మృతి చెందింది. దీంతో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రేవతి మృతదేహంతో ఎన్ఆర్ఐ ఆసుపత్రి ఎదుట ఆందోళన జరిగే అవకాశం ఉందని ముందే ఊహించిన సిబ్బంది.. మృతదేహాన్ని హుటాహుటిన కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం ఆమె స్వగ్రామమైన అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొవ్వూరుకు మృతదేహాన్ని పంపే ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో కేజీహెచ్ వద్ద ఆమె భర్త ఆందోళనకు సన్నద్ధమయ్యారు. తన భార్య అపస్మారక స్థితికి చేరుకోవడానికి కారణమైన వైద్యురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రిని తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. జనార్థన్‌కు సంఘీభావంగా ఆయన స్వగ్రామానికి చెందిన బంధువులు, దివీస్ ఉద్యోగులు, పలు ప్రజా సంఘాల నాయకులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సాయంత్రం 8 గంటల తర్వాత వారంతా కలిసి సంగివలసలోని ఆసుపత్రి ఎదుట పెద్ద ఎత్తున బైఠాయించి ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆసుపత్రి యాజమాన్యం ఆందోళనకారులు, బాధితుల తరపున వచ్చిన ప్రజా సంఘాల ప్రతినిధులతో చర్చలు ప్రారంభించింది. భీమిలి పోలీసులు ఆసుపత్రి వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్నారు.