Top Stories
ప్రధాన వార్తలు

అర్జెంటీనాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
బ్యూనోస్ ఎయిర్స్: అర్జెంటీనాలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. అర్జెంటీనాలో వచ్చిన భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 7.4గా నమోదైంది. దాంతో చిలీ, అర్జెంటీనా, దక్షిణ అమెరికా తీరాలను భూకంపం కుదిపేసింది. మరో రెండు భూప్రకంపనలు కూడా నమోదయ్యాయి. ఫలితంగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు.దక్షిణ అర్జెంటీనాలోని ఉషుయాకు దక్షిణంగా 219 కి.మీ దూరంలో ఉన్న డ్రేక్ పాసేజ్ వద్ద ఉదయం 9 సమయంలో ప్రకంపనలు సంభవించాయని యూఎస్ జియోలాజికల్ సర్వే స్పష్టం చేసింది. చిలీ తీరంలోని కొన్ని ప్రాంతాలను సాధారణ అలల స్థాయి కంటే 3 నుండి 10 అడుగుల ఎత్తులో అలలు తాకవచ్చని అమెరికా సునామీ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. ఒక మీటర్ ఎత్తు వరకు చిన్న అలలు కూడా అంటార్కిటికా తీరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రభావితం చూపే అవకాశం ఉందని పేర్కొంది.

వచ్చే మంగళవారం.. మరో భారీ అప్పుకు బాబు సిద్ధం!
విజయవాడ: ఇప్పటివరకూ రికార్డ్ స్థాయిలో అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. మరో భారీ అప్పుకు రెడీ అయ్యింది. రాష్ట్రాన్ని అప్పులు చేసి నడిపించడంలో భాగంగా వచ్చే మంగళవారం రూ. 7వేల కోట్ల అప్పుకి ఇండెంట్ పెట్టింది. రిజర్వ్ బ్యాంకుకి ఇండెంట్ పెట్టింది చంద్రబాబు సర్కార్. ఇప్పటివరకూ లక్షా 52 వేల కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. మళ్లీ రూ. 7వేల కోట్ల అప్పుకి సిద్ధం కావడం గమనార్హం.ఎన్నికల సమయంలో సంపద సృష్టి తనతోనే సాధ్యమని చెప్పిన చంద్రబాబు.. ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుల సృష్టి కోసమే వేట కొనసాగిస్తున్నారు. ఏడాది కాలంలోనే రికార్డు స్థాయిలో అప్పులు చేయడం చూస్తే చంద్రబాబు ‘సంపద సృష్టి’ భలేగా ఉంది అంటూ జనాలు నవ్వుకుంటున్నారు.

చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్.. సచిన్ రికార్డు బద్దలు
ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ యువ ఓపెనర్ సాయిసుదర్శన్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సుదర్శన్ విధ్వంసం సృష్టించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఎస్ఆర్హెచ్ బౌలర్లను ఊతికారేశాడు. ముఖ్యంగా గుజరాత్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన స్టార్ పేసర్ మహ్మద్ షమీకి సుదర్శన్ చుక్కలు చూపించాడు. ఆ ఓవర్లో ఐదు ఫోర్ల సాయంతో ఏకంగా 20 పరుగులు పిండుకున్నాడు. ఓవరాల్‌గా 23 బంతులు ఎదుర్కొన్న 9 ఫోర్ల సాయంతో 48 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో సుదర్శన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో అత్యంతవేగంగా 2000 పరుగుల మైలు రాయిని అందుకున్న భారత క్రికెటర్‌గా సాయి సుదర్శన్ రికార్డు సృష్టించాడు. సుదర్శన్ కేవలం 54 ఇన్నింగ్స్‌లలో అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ ఈ ఘనతను 59 ఇన్నింగ్స్‌లలో అందుకున్నాడు. తాజా మ్యాచ్‌తో సచిన్ రికార్డును ఈ తమిళనాడు బ్యాటర్ బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ షాన్ మార్ష్(53) అగ్రస్దానంలో ఉండగా.. రెండో స్దానంలో సుదర్శన్ కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు బ్రాడ్ హాడ్జ్ , మార్కస్ ట్రెస్కోథిక్, ముహమ్మద్ వసీం పేరిట సంయుక్తంగా ఉండేది. తాజా మ్యాచ్‌తో వీరిని సుదర్శన్ అధిగమించాడు. చదవండి: బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లకు షాక్.. అకౌంట్లు బ్లాక్

ప్రధాని సభలో ఏపీ హక్కులపై బాబు, పవన్‌లు మౌనం
అమరావతి: అమరావతి పునః ప్రారంభ కార్యక్రమంలో భాగంగా ఏపీకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఎదుట.. రాష్ట్ర హక్కులపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు మౌనం పాటించారు. రాష్ట్ర విభజన నాటి ఏపీ హక్కుల గురించి ప్రధాని మోదీ వద్ద.. వీరు కనీసం ప్రస్తావించలేదు. కేవలం ప్రధాని మోదీపై పొగడ్తల వర్షం కురిపించిన బాబు.. విభజన సమస్యల పరిష్కారం అంశానికి సంబంధించి మోదీ నుంచి ఎటువంటి ప్రకటన చేయించలేకపోయారు.విభజన హామీలు పెండింగ్ లో ఉన్నందను చంద్రబాబు, పవన్‌లు కనీసం మోదీ వద్ద ఆ ప్రస్తావన తెచ్చి ఉంటే బాగుండేది. కానీ వారు ఆ పని చేయలేదు. అమరావతిని రీలాంచ్ చేసే కార్యక్రమం వరకే పెట్టుకున్నట్లే చంద్రబాబు, పవన్‌ల ధోరణి కనబడింది. ప్రధాని బ్లెస్సింగ్స్ కావాలన్నారే కానీ ఏపీ హక్కుల కోసం మాత్రం అడగలేదు చంద్రబాబు. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరణ, పోలవరం ఎత్తు తగ్గింపుపై స్పష్టత తదితర అంశాలు మోదీ వద్ద చంద్రబాబు, వవన్‌లు ప్రస్తావించలేదు.అమరావతి రీలాంచ్ కార్యక్రమంలో భాగంగా కొత్తగా మరో శిలాఫలకాన్ని ఆవిష్కరించారే కానీ, విభజన నాటి ఏపీ హక్కుల గురించి మాత్రం మోదీ ప్రసంగంలో కానీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల ప్రసంగంలో కానీ కనీసం మచ్చుకైనా కనిపించకపోవడం గమనార్హం.పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు

శశిథరూర్‌పై ప్రధాని మోదీ వ్యాఖ్యల వెనుక..
'ఈ సమావేశం తర్వాత కొంతమందికి నిద్రపట్టదు' అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) చేసిన వ్యాఖ్యలకు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. కేరళలో శుక్రవారం పర్యటించిన మోదీ మాటల తూటాలతో ప్రత్యర్థులపై సూటిగా గురిపెట్టారు. సీనియర్ కాంగ్రెస్ నేత శశిథరూర్ భుజాలపైనుంచి ప్రతిపక్ష ఇండియా కూటమిపై తుపాకీ ఎక్కుపెట్టారు. 'మీ పార్టీకి చెందిన సీనియర్ నేత మా పక్కన నిలబడ్డారు చూడండి' అన్నట్టుగా గ్రాండ్ ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్‌కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.వారికి నిద్ర పట్టకపోవచ్చు..తిరువనంతపురం సమీపంలో నిర్మించిన ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ డీప్ వాటర్ మల్టీపర్పస్ సీపోర్టును ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేరళ సీఎం పినరయి విజయన్‌తో పాటు స్థానిక ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నేత శశిథరూర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. "ముఖ్యమంత్రి (పినరయి విజయన్)కి నేను చెప్పాలనుకుంటున్నాను, మీరు INDIA కూటమికి బలమైన స్తంభం, శశి థరూర్ (Shashi Tharoor) కూడా ఇక్కడ కూర్చున్నారు. ఈరోజు మీరు నాతో పాటు వేదిక పంచుకున్నారు. మీరు ఇక్కడ ఉండడం కొందరికి రుచించకపోవచ్చు. వారికి నిద్ర కూడా పట్టకపోవచ్చు. ఈ మెసేజ్ ఎక్కడికి వెళ్లాలో అక్కడికి చేరుతుంద"ని వ్యాఖ్యానించారు.గ్యాప్ పెరిగింది..తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న శశిథరూర్.. ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ (INDIA) కూటమిలో కీలక నేతగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ఆయనకు మధ్య దూరం పెరిగింది. పినరయి విజయన్ (Pinarayi Vijayan) సర్కారు తీసుకొచ్చిన ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, రెడ్ టేప్ కోత విధానాలపై కొద్ది రోజుల క్రితం శశిథరూర్ ప్రశంసలు కురిపించారు. అక్కడితో ఆగకుండా కాంగ్రెస్‌కు బద్దశత్రువైన ప్రధాని మోదీని పొగడ్తలతో ముంచెత్తారు. మోదీ అమెరికా పర్యటన, డొనాల్డ్ ట్రంప్‌తో భేటీపై పాజిటివ్ కామెంట్స్ చేశారు. దీంతో శశిథరూర్‌ను కాంగ్రెస్ హైకమాండ్ దూరం పెట్టింది. పార్టీకి తన అవసరం లేకపోతే స్పష్టంగా చెప్పాలని, తన దారి తాను చూసుకుంటానని గత ఫిబ్రవరిలో అధిష్టానాన్ని అడిగారు. ఈ నేపథ్యంలో థరూర్ బీజేపీలో చేరతారని ప్రచారం కూడా ఊపందుకుంది. అయితే తాను పార్టీ మారబోనని అప్పట్లో ఆయన స్పష్టం చేశారు.చదవండి: ప్రపంచానికి ఇదే సందేశం ఇచ్చాం.. మల్లిఖార్జున ఖర్గేపతాక శీర్షికలకు మోదీ వ్యాఖ్యలుతాజాగా థరూర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు పతాక శీర్షికలకు ఎక్కాయి. శశిథరూర్ భుజాల పైనుంచి ప్రతిపక్ష ఇండియా కూటమిపైకి మోదీ తుపాకీ ఎక్కుపెట్టారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇండియా కూటమిని డిఫెన్స్‌లో పడేసేందుకే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. మరోవైపు కేరళలో పాగా వేసేందుకు కాషాయ పార్టీ ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మోదీ వ్యాఖ్యలపై ఇండియా కూటమి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

భారీగా తగ్గుతున్న బంగారం ధరలు: కారణం ఇదే..
గ్లోబల్ మార్కెట్లలో టారిఫ్ భయం తగ్గిపోతున్న క్రమంలో.. బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. దీంతో గోల్డ్ రేటు లక్ష రూపాయల నుంచి సుమారు రూ. 7000 తగ్గింది. దీంతో కొనుగోలుదారుల్లో కూడా బంగారం కొనాలా? వద్దా? అనే ప్రశ్న మొదలైపోయింది. ఎందుకంటే ఇంకా తగ్గుముఖం పడుతుందేమో అనే ఆలోచన వారిలో తలుపుతట్టింది.గత వారం గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 3500.05 డాలర్ల వద్ద ఉంది. అయితే గురువారం రోజు 2.2 శాతం క్షీణించి 3216.41 డాలర్లకు పడిపోయింది. ప్రస్తుతం భారతదేశంలో కూడా బంగారం ధరలు రూ. 95510 వద్ద ఉన్నాయి. ఏప్రిల్ నెలతో పోలిస్తే.. ఈ ధరలు కొంత తక్కువే అని స్పష్టమవుతోంది.బంగారం ధరలు తగ్గడానికి కారణంప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం వల్ల సురక్షితమైన ఆస్తులకు డిమాండ్ తగ్గింది. దీంతో పెట్టుబడిదారులు మళ్ళీ లాభాలను ఆర్జించడానికి సిద్ధమయ్యాయి. అంతే కాకుండా దక్షిణ కొరియా, జపాన్, భారతదేశంతో సంభావ్య వాణిజ్య ఒప్పందాల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనలు.. చైనాతో ఒప్పందం గురించి సానుకూల వ్యాఖ్యలు కూడా బంగారం ధరల తగ్గుదలకు కారణమైందని ఏంజెల్ వన్‌లో కమోడిటీస్ అండ్ కరెన్సీల చీఫ్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ 'తేజస్ అనిల్ షిగ్రేకర్' అన్నారు.ఇదీ చదవండి: ఆ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు: జాబితాలో ఉన్న మోడల్స్ ఇవే..అమెరికా సుంకాలను నివారించడానికి అనేక ప్రధాన వాణిజ్య భాగస్వాములు "చాలా మంచి" ఆఫర్లను అందించారని, ఒప్పందం కుదుర్చుకున్న మొదటి దేశాలలో భారతదేశం ఉంటుందని అమెరికా ట్రెజరీ కార్యదర్శి 'స్కాట్ బెసెంట్' అన్నారు. మొత్తం మీద రాబోయే మూడు నుంచి నాలుగు నెలల్లో బంగారం మరింత తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

సింహాచలం ఘటన: ముగిసిన త్రీమెన్ కమిటీ ప్రాథమిక విచారణ
విశాఖ :సింహాచలంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతిచెందిన దుర్ఘటనలో త్రీమెన్ కమిటీ ప్రాథమిక విచారణ ముగిసింది. దీనిపై ప్రభుత్వానికి రేపు(శనివారం) నివేదిక ఇవ్వనుంది త్రీమెన్ కమిటీ. దీనివలో భాగంగా త్రీమెన్ కమిటీ చైర్మన్, మున్సిపల్ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ మాట్లాడుతూ ‘ సింహాచలం దుర్ఘటనపై రేపు ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం. ప్రమాదానికి కారణమైన గోడను నోటి మాటతో కట్టేశారు. గోడ నిర్మాణానికి ఎటువంటి అనుమతులు లేవు.విచారణలో భాగంగా వివిధ శాఖల వారిని విచారించాం. వైదిక నియమాలను ఉల్లంఘించినట్లు ఆలయ అర్చకులు చెప్పారు. ఆగమ శాస్త్రపరమైన సలహాలు లేకుండానే గోడ నిర్మించారని వైదికులు మా దృష్టికి తీసుకొచ్చారు. మాస్టర్ ప్లాన్ ఉల్లంఘనలు కనిపించాయి. ఎవరి అనుమతిలో మాస్టర్ ప్లాన్ పై నిర్ణయాలు తీసుకున్నారో తేలాలి. ప్రసాద్ స్కీం పనులు గత ఏడాది ఆగస్టులో పూర్తి కావాల్సి ఉంది. ఆలస్యానికి కారణం ఏంటని అడిగితే భిన్నమైన సమాధానాలు వచ్చాయి. అధికారుల మధ్య సమన్వయంపై ఉన్నతాధికారులతో మాట్లాడాలి’ అని స్పష్టం చేశారు.కాగా, సింహాచలం చందనోత్సవంలో గోడ కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. రూ.300 టికెట్ కౌంటర్ వద్ధ ఈ ప్రమాదం జరిగింది. ఇటీవలే అక్కడ గోడ నిర్మించారు. గోడ నాసిరకంగా నిర్మించడం వలనే కూలిపోయిందని అధికారులు భావిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున 2-3 గంటల మధ్య రూ.300 క్యూ లైన్లో ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతులను విశాఖపట్నం మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం గ్రామానికి చెందిన పిళ్లా ఉమామహేశ్వరరావు (30), ఆయన భార్య శైలజ (26)గా అధికారులు గుర్తించారు. వీరితో పాటు పిల్లా శైలజ తల్లి వెంకటరత్నం, మేనత్త గుజ్జురి మహాలక్ష్మి కూడా ఈ ఘటనలో మృతిచెందారు.

హైకోర్టు అనుమతిచ్చినా.. జేసీ ప్రభాకర్ రెడ్డి బరితెగింపు!
అనంతపురం: వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతిచ్చినా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తొడలు కొడుతున్నారు. పెద్దారెడ్డి తాడిపత్రి వస్తే తిరిగి వెళ్లడు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతి ఇచ్చినా... తాను మాత్రం దాడులు చేస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగా సవాల్ చేశారు.పెద్దారెడ్డికి ఎవరూ మద్దత ఇవ్వొద్దని, తనకు పెద్దారెడ్డితో గొడవలు ఉన్నాయని, ఒకవేళ వస్తే తిరిగి వెళ్లడు అంటూ వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతిచ్చిన క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలా వ్యాఖ్యానించడం ఏంటో అర్థం కావడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలు చేయడంలో తాము వెనక్కి తగ్గమని సంకేతాల్ని ఇచ్చిన జేసీపై విశ్లేషకులు మండిపడుతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్నా టీడీపీ పెద్దలు మాత్రం పెదవి విప్పడం లేదు. పార్టీలో సభ్యుడైన వ్యక్తిని కంట్రోల్ చేయాల్సిన వారు మిన్నుకుండిపోతుండటంతో జేసీ ప్రభాకర్ రెడ్డి పదే పదే రెచ్చిపోయి వ్యాఖ్యలు చేస్తున్నారనే అబిప్రాయం వ్యక్తమవుతోంది.

పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు
PM Narendra Modi AP Tour Updatesవెలగపూడి:02-05, 5.10 PMప్రధాని మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీమీ అందరిని కలవడం నాకు ఆనందంగా ఉందిఏపీకి కేంద్రం సంపూర్ణం సహకారం అందిస్తుందిమౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేస్తున్నాంఏపీలో కనెక్టవిటీ వేగంగా అభివృద్ధి చెందుతుందికనెక్టివిటీ అభివృద్ధి చెందితే అన్ని రంగాలకు లబ్ధిదీంతో రవాణా రంగం అభివృద్ధి చెంది రైతులకు మేలు జరుగుతుందిరైల్వే బడ్జెట్ లో ఏపీ వాటా 10 రెట్లు పెరిగిందికేంద్ర ప్రభుత్వం రైల్వేల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తోందిరూ. 9 వేల కోట్లకు పైగా ఏపీకి కేటాయిస్తున్నాంఏపీలో వందశాతం రైల్వేల విద్యుదీకరణ జరిగిందిమౌలిక సదుపాయాల కల్పనతో ఆర్ధిక వ్యవస్థ బలోపేతం చేస్తున్నాంనిర్మాణ రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయిగత పదేళ్లలో ఏపీలో 750 రైల్వే బ్రిడ్జిలు నిర్మించాంఏపీకి వందే భారత్, అమృత్ భారత్ రైళ్లు కేటాయించాంహైవేల నిర్మాణం వల్ల టూరిజం అభివృద్ధి చెందుతుందిపంట బీమా యోజన కింద రైతులకు ఇప్పటివరకూ రూ. 5,500 కోట్లు ఇచ్చాంఅంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఏపీలో ఘనంగా నిర్వహిస్తాంజూన్ 21 యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ఏపీకి వస్తానాగాయలంక క్షిపణి కేంద్రంతో దేశ రక్షణకు కొత్త శక్తి వస్తుందియూనిటీ మాల్ తో స్థానిక ఆర్థిక వ్యవస్థలు బలోపేతం అవుతాయియూనిటీ మాల్ లో హస్త కళాకారుల ఉత్పత్తులు ఒకేచోట అందుబాటులో ఉంటాయిరైతుల వికాసానికి కేంద్రం ప్రత్యేకంగా కృషి చేస్తోందిపథకాలు, పరిహారం కింద రైతులకు రూ. 17 వేల కోట్లు ఇచ్చాంపీఎం సమ్మాన్ నిధి ద్వారా రైతులకు సాయం చేస్తున్నాం02-05, 4.55 PMపలు ప్రాజెక్టులకు నరేంద్ర మోదీ శంకుస్థాపనలువేదికపై నుంచి ప్రాజెక్టుల శంకుస్థాపనలు చేసిన మోదీమొత్తం 18 ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలుఅమరావతిలో రూ. 49 వేల కోట్ల పనులకు మోదీ శ్రీకారంరూ. 8 వేల కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులకు సైతం మోదీ శంకుస్థాపనలురాజధాని సహా రూ. 58 వేల కోట్ల ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు02-05, 2:50PMప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రాష్ట్రానికి వచ్చారు. అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2.50 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు మోదీ,. ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయమునకు చేరుకున్న భారత ప్రధానికి ప్రజా ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో వెలగపూడి చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో వెలగపూడి సభా ప్రాంగణానికి బయల్దేరి వెళ్లారు. పలు కేంద్ర ప్రాజెక్ట్ లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మోదీ పాల్గొననున్నారు. దీనిలో భాగంగా 18 ప్రాజెక్ట్ లకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. భారీ భద్రత ఏర్పాట్లు..ప్రధాని పర్యటనకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 6 వేల మందికి పైగా పోలీస్ బలగాలను మోహరించారు. భద్రతను పర్యవేక్షించేందుకు 19 మంది ఐపీఎస్ అధికారులను నియమించారు. అమరావతిలోని సభా ప్రాంగణానికి చేరుకునేందుకు 11 మార్గాలను ఖరారు చేశారు. వాటిలో రెండు మార్గాలను ప్రముఖులకు కేటాయించారు. సభా ప్రాంగణం పరిసరాలను ఎన్ఎస్జీ కమెండోలు ఆ«దీనంలోకి తీసుకున్నారు. సభ కోసం 5 లక్షల మందిని సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బాధ్యత రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులకు అప్పగించింది. జన సమీకరణ కోసం 4,500 ఆర్టీసీ బస్సులను కేటాయించింది.

గలీజ్ మాటలు.. నా జీవితంతో ఆడుకుంటున్నారు.. బతకను: జానులిరి
జాను లిరి (Janu Lyri).. జానపద పాటలతో చాలా ఫేమస్ అయింది. యూట్యూబ్‌లో ఫోక్ సాంగ్స్‌కు హుషారుగా స్టెప్పులేసే జాను.. తర్వాత ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 షో విన్నర్‌గానూ నిలిచింది. పదో తరగతిలోనే పెళ్లి చేసుకున్న ఈ డ్యాన్సర్‌కు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. భర్తతో విభేదాల కారణంగా వీరు విడిపోయారు. అయితే జాను ఏం చేసినా సరే కొందరు తనను విమర్శిస్తూనే ఉన్నారు. ఈ మధ్య ఓసారి మంచి వ్యక్తి దొరికితే రెండో పెళ్లికి కూడా సిద్ధమే అంది. దాన్ని కూడా తప్పుపడుతూ తనను ట్రోల్ చేస్తున్నారు.గుక్కపెట్టి ఏడ్చిన జానుఈ విమర్శలను జాను లిరి భరించలేకపోయింది. నన్ను టార్గెట్ చేయడం ఆపండి అంటూ బోరుమని ఏడుస్తోంది. ఈ మేరకు పలు వీడియోలు షేర్ చేసింది. నా జీవితంతో ఆడుకుంటున్నారు. నేను నవ్వితే ఓవరాక్షన్.. నాకు పద్ధతి తెలీదు..కదా? ఫోక్ ఇండస్ట్రీలో పద్ధతిగా చీర కట్టుకుని డ్యాన్స్ చేస్తుంది నేనే. కెమెరా ముందు ఒకలా, వెనక ఒకలా ఉండను. అందరితో నవ్వుతూ ఉంటాను. నేనేం చేసినా తప్పే అంటున్నారు.బతకాలని లేదుఇన్‌స్టాగ్రామ్‌లో నా వాయిస్‌కు గలీజ్ మాటలు యాడ్ చేస్తున్నారు. అవి నా కొడుకు చూడడా? ఎక్కడికైనా వెళ్లి చచ్చిపోవాలనిపిస్తోంది. ఒకవేళ నేను నిజంగా చచ్చిపోతే మాత్రం మీరే కారణం. ఇంత నరకమా? మీ వ్యూస్ కోసం ఒకమ్మాయి జీవితాన్ని రోడ్డుమీద పడేస్తున్నారు. మా అమ్మానాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఒక్క మాట అనకుండా పెంచారు. కానీ ఈరోజు అడ్డమైన వెధవలతో మాటలు పడుతున్నాను. సూసైడ్ తప్పు అని నలుగురికీ చెప్పేదాన్ని.. కానీ ఇప్పుడర్థమవుతోంది.నా వల్ల కావట్లేదువాళ్లు పడే బాధల వల్ల చనిపోవట్లేదు. మీరు చేసే రచ్చ తట్టుకోలేక చనిపోతున్నారని! నా వల్ల కావట్లేదు. నా ఓపిక నశించింది. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అన్నయ్యతో మాట్లాడినా, అక్కతో మాట్లాడినా, నవ్వినా, కూర్చున్నా.. ఎందుకు నిందలేస్తున్నారు? నా గురించి మంచి పెట్టొచ్చు కదా.. బాధ తట్టుకోలేకపోతున్నా.. నా జీవితంతో ఆడుకోవడం ఎందుకు? నా వల్ల మీకేమైనా హాని జరిగిందా? నా కొడుకును బాగా చదివించి మంచి స్థాయిలో చూడాలనుకున్నాను. అప్పటివరకు నేను బతకనని నాకర్థమవుతోంది. నేను మధ్యలోనే పోతాను అంటూ జాను వెక్కి వెక్కి ఏడ్చేసింది. View this post on Instagram A post shared by Jimmidi Jhansi - Janulyri (@janulyri_official) ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: హీరోయిన్ రెచ్చగొట్టింది.. అందుకే సిక్స్ ప్యాక్ చేశా: అల్లు అర్జున్
గుజరాత్ చేతిలో ఓటమి.. సన్‌రైజర్స్ ప్లే ఆశలు గల్లంతు!
IPL 2025: శుబ్‌మన్ గిల్ది ఔటా? నాటౌటా?
అందుకే అప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాను: విరాట్ కోహ్లి
రోడ్డు ప్రమాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
ఎమ్4ఎమ్ మూవీ హీరోయిన్.. వేవ్స్ సమ్మిట్‌కు ప్రత్యేక ఆహ్వానం
అర్జెంటీనాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
పవన్ కల్యాణ్ హీరోగా కొత్త చిత్రం.. సాంగ్ రిలీజ్ చేసిన తండేల్ డైరెక్టర్
వచ్చే మంగళవారం.. మరో భారీ అప్పుకు బాబు సిద్ధం!
మళ్ళీ ఇదే కారు.. అమ్మకాల్లో అదే జోరు
చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్.. సచిన్ రికార్డు బద్దలు
సూర్యవంశీపై గిల్ కామెంట్స్.. జడేజా కౌంటర్
నా కొడుకును సంపేయండి
13ఏళ్లకే హీరో, 15ఏళ్లకే టాలీవుడ్ స్టార్..ఒక్క యాక్సిడెంట్‌తో తెరమరుగు..
ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
ఆ హీరోయిన్ల పేర్లు కలిసేలా విజయ్ (TVK) పార్టీ ఉంది: మంత్రి
తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్
Smita Sabharwal: స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్
మార్కెట్లోకి సరికొత్త హైటెక్ ఫ్యాన్: ధర ఎంతంటే?
IND vs ENG: ఇంగ్లండ్ టూర్‌కు వైభవ్ సూర్యవంశీ..
TG: హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు ఐపీఎస్‌లు
Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
అందరి అనుమానం అదే.. NIA ప్రశ్నకు తడబడ్డ జిప్‌లైన్ ఆపరేటర్
'ప్రవస్తి' నీకు నేను ఉన్నా.. మేము ఉన్నాం: గీతా మాధురి
‘ఎల్లమ్మ’ దొరకట్లేదు.. ఇప్పుడెలా?
ఫెన్సింగ్ కింద పాక్కుంటూ వెళ్లి.. గుంతలో దాక్కుని
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
మహేశ్ బాబు నయా లుక్.. ఎప్పుడు లేనంతగా
వివాహేతర సంబంధం.. శైలజ నుంచి ఫోన్ వచ్చిందని..!
చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా
ఈ స్కూటర్లపై రూ.40000 డిస్కౌంట్: అదే రోజు డెలివరీ..
నా కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తా..!
అక్షయ తృతీయ రోజు బంగారు నగలే కొనాలా?
ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో
ముక్కోణపు వన్డే సిరీస్.. టీమిండియా భారీ స్కోర్
ప్రస్తుతం మన దగ్గర ఉన్నవి ఇవే సార్! క్షిపణుల బదులు 130 ఇవే బిగించాం!
'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
బాలకృష్ణ విలన్‌ను ఎంపిక చేసుకున్న పూరీ జగన్నాథ్
1925లో బంగారం రేటు ఇంత తక్కువా?
వీళ్లు ఐదురూపాయలు బిచ్చమేశార్రా! దీంతో వైజాగ్‌లో ఐదెకరాల భూమి కొనేయవచ్చు... మనకూ ‘ఉర్సా’ లాంటి కంపెనీ ఉంటే!
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
ఆర్మూరు–జగిత్యాల హైవేకు ఓకే
‘ఛీ’నా రాజకీయం...
బంగారం భారీగా పడిపోతుంది!
కొందరికే ‘భరోసా’
మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని భావన యాదవ్
శ్రీకృష్ణ లీలలు
భారత్‌తో జాగ్రత్త.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హెచ్చరిక
ఇంట్లో పాముల కలకలం
నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..
ఈ ఐపీఎల్ సీజన్లో సెంచరీలు చేసిన నలుగురిలో ఓ 'కామన్ పాయింట్' ఉంది.. అదేంటి..?
బ్రదర్ కేటీఆర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: వైఎస్ జగన్
హైదరాబాద్‌లో హై అలర్ట్
ఎంత పనైపాయే..! పిల్లిలా కనిపించాలని సర్జరీ చేయించుకుంటే చివరికి..
RR VS GT: ఇది నా కల.. నాకు భయం లేదు: వైభవ్ సూర్యవంశీ
మూడో పంటగా సౌర విద్యుత్తు!
ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
ప్రొటోకాల్ రగడ.. తుమ్మల సమక్షంలో అధికారులపై ఎమ్మెల్యే ఫైర్
నచ్చిన వారితో శృంగారం.. అజిత్‌పై నటి 'హీరా' సెన్సేషనల్ కామెంట్
'లాహోర్‌ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
జాబ్ చేస్తానంటే ఇంట్లోకి రమ్మంటారు.. బాధ చెప్పుకున్న దీపిక
భద్రత కోసం రూ.70 కోట్లు!.. సుందర్ పిచాయ్ జీతం ఎంతంటే?
బెల్లంకొండ హీరో దెయ్యం సినిమా.. గ్లింప్స్ రిలీజ్
అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
3 నిమిషాలకో మరణం
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
త్రివిధ దళాలకు ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్.. సైన్యమే స్థలం,టైం చూసి..
కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి..?
వామ్మో.. ఇదేం ట్రాఫిక్!
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
పాక్ నడ్డి విరిగేలా..
సంధ్య థియేటర్ ఘటన.. బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్
ఉత్కంఠపోరు.. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
తండ్రికి బైక్‌ను బహుమతిగా ఇవ్వాలని బయలుదేరి..
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
కొత్త రేషన్ కార్డు దేవుడెరుగు..!
‘ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్‌నే’
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!
శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రత్యేకం
బాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు : వైఎస్ జగన్
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
అందంలోనే కాదు.. చదువులోనూ అదుర్స్
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
నీట్–2025కు పకడ్బందీ ఏర్పాట్లు
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
ఒకే ఇల్లు.. ఒకే వంట
మైక్రోసాఫ్ట్ సీఈవో, టెక్కీ తండ్రుల ఆవేదన ఫలితం..ఏఐ హెల్త్‌కేర్ రివల్యూషన్..!
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
‘పెగాసస్’పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
IPL 2025: ఒక్క విజయం.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ
మళ్లీ ఉగ్ర కాండ!
రెడ్ మిర్చిలా రెజీనా... విష్ణుప్రియ మౌంటైన్ ట్రిప్
వాడికి ఏడాదిన్నర వయసు.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్
ఏప్రిల్‌లో విడుదలైన టాప్ 10 మొబైల్స్
చిన్నప్పటి నుంచి చదువులో టాప్
బ్యాంకులో క్యాష్ వేస్తున్నారా..? జాగ్రత్త!!
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరు
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
మొక్కుబడిగా ఏసీ కొనవద్దు..
పహల్గామ్ దాడి.. నా పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు: విజయ్ ఆంటోనీ క్లారిటీ!
ఏపీ రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారు
సల్మాన్ ‘సౌత్’ వ్యాఖ్యలపై స్పందించిన నాని!
గుజరాత్ చేతిలో ఓటమి.. సన్‌రైజర్స్ ప్లే ఆశలు గల్లంతు!
IPL 2025: శుబ్‌మన్ గిల్ది ఔటా? నాటౌటా?
అందుకే అప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాను: విరాట్ కోహ్లి
రోడ్డు ప్రమాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
ఎమ్4ఎమ్ మూవీ హీరోయిన్.. వేవ్స్ సమ్మిట్‌కు ప్రత్యేక ఆహ్వానం
అర్జెంటీనాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
పవన్ కల్యాణ్ హీరోగా కొత్త చిత్రం.. సాంగ్ రిలీజ్ చేసిన తండేల్ డైరెక్టర్
వచ్చే మంగళవారం.. మరో భారీ అప్పుకు బాబు సిద్ధం!
మళ్ళీ ఇదే కారు.. అమ్మకాల్లో అదే జోరు
చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్.. సచిన్ రికార్డు బద్దలు
సూర్యవంశీపై గిల్ కామెంట్స్.. జడేజా కౌంటర్
నా కొడుకును సంపేయండి
13ఏళ్లకే హీరో, 15ఏళ్లకే టాలీవుడ్ స్టార్..ఒక్క యాక్సిడెంట్‌తో తెరమరుగు..
ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
ఆ హీరోయిన్ల పేర్లు కలిసేలా విజయ్ (TVK) పార్టీ ఉంది: మంత్రి
తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్
Smita Sabharwal: స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్
మార్కెట్లోకి సరికొత్త హైటెక్ ఫ్యాన్: ధర ఎంతంటే?
IND vs ENG: ఇంగ్లండ్ టూర్‌కు వైభవ్ సూర్యవంశీ..
TG: హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు ఐపీఎస్‌లు
Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
అందరి అనుమానం అదే.. NIA ప్రశ్నకు తడబడ్డ జిప్‌లైన్ ఆపరేటర్
'ప్రవస్తి' నీకు నేను ఉన్నా.. మేము ఉన్నాం: గీతా మాధురి
‘ఎల్లమ్మ’ దొరకట్లేదు.. ఇప్పుడెలా?
ఫెన్సింగ్ కింద పాక్కుంటూ వెళ్లి.. గుంతలో దాక్కుని
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
మహేశ్ బాబు నయా లుక్.. ఎప్పుడు లేనంతగా
వివాహేతర సంబంధం.. శైలజ నుంచి ఫోన్ వచ్చిందని..!
చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా
ఈ స్కూటర్లపై రూ.40000 డిస్కౌంట్: అదే రోజు డెలివరీ..
నా కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తా..!
అక్షయ తృతీయ రోజు బంగారు నగలే కొనాలా?
ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో
ముక్కోణపు వన్డే సిరీస్.. టీమిండియా భారీ స్కోర్
ప్రస్తుతం మన దగ్గర ఉన్నవి ఇవే సార్! క్షిపణుల బదులు 130 ఇవే బిగించాం!
'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
బాలకృష్ణ విలన్‌ను ఎంపిక చేసుకున్న పూరీ జగన్నాథ్
1925లో బంగారం రేటు ఇంత తక్కువా?
వీళ్లు ఐదురూపాయలు బిచ్చమేశార్రా! దీంతో వైజాగ్‌లో ఐదెకరాల భూమి కొనేయవచ్చు... మనకూ ‘ఉర్సా’ లాంటి కంపెనీ ఉంటే!
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
ఆర్మూరు–జగిత్యాల హైవేకు ఓకే
‘ఛీ’నా రాజకీయం...
బంగారం భారీగా పడిపోతుంది!
కొందరికే ‘భరోసా’
మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని భావన యాదవ్
శ్రీకృష్ణ లీలలు
భారత్‌తో జాగ్రత్త.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హెచ్చరిక
ఇంట్లో పాముల కలకలం
నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..
ఈ ఐపీఎల్ సీజన్లో సెంచరీలు చేసిన నలుగురిలో ఓ 'కామన్ పాయింట్' ఉంది.. అదేంటి..?
బ్రదర్ కేటీఆర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: వైఎస్ జగన్
హైదరాబాద్‌లో హై అలర్ట్
ఎంత పనైపాయే..! పిల్లిలా కనిపించాలని సర్జరీ చేయించుకుంటే చివరికి..
RR VS GT: ఇది నా కల.. నాకు భయం లేదు: వైభవ్ సూర్యవంశీ
మూడో పంటగా సౌర విద్యుత్తు!
ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
ప్రొటోకాల్ రగడ.. తుమ్మల సమక్షంలో అధికారులపై ఎమ్మెల్యే ఫైర్
నచ్చిన వారితో శృంగారం.. అజిత్‌పై నటి 'హీరా' సెన్సేషనల్ కామెంట్
'లాహోర్‌ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
జాబ్ చేస్తానంటే ఇంట్లోకి రమ్మంటారు.. బాధ చెప్పుకున్న దీపిక
భద్రత కోసం రూ.70 కోట్లు!.. సుందర్ పిచాయ్ జీతం ఎంతంటే?
బెల్లంకొండ హీరో దెయ్యం సినిమా.. గ్లింప్స్ రిలీజ్
అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
3 నిమిషాలకో మరణం
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
త్రివిధ దళాలకు ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్.. సైన్యమే స్థలం,టైం చూసి..
కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి..?
వామ్మో.. ఇదేం ట్రాఫిక్!
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
పాక్ నడ్డి విరిగేలా..
సంధ్య థియేటర్ ఘటన.. బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్
ఉత్కంఠపోరు.. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
తండ్రికి బైక్‌ను బహుమతిగా ఇవ్వాలని బయలుదేరి..
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
కొత్త రేషన్ కార్డు దేవుడెరుగు..!
‘ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్‌నే’
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!
శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రత్యేకం
బాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు : వైఎస్ జగన్
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
అందంలోనే కాదు.. చదువులోనూ అదుర్స్
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
నీట్–2025కు పకడ్బందీ ఏర్పాట్లు
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
ఒకే ఇల్లు.. ఒకే వంట
మైక్రోసాఫ్ట్ సీఈవో, టెక్కీ తండ్రుల ఆవేదన ఫలితం..ఏఐ హెల్త్‌కేర్ రివల్యూషన్..!
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
‘పెగాసస్’పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
IPL 2025: ఒక్క విజయం.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ
మళ్లీ ఉగ్ర కాండ!
రెడ్ మిర్చిలా రెజీనా... విష్ణుప్రియ మౌంటైన్ ట్రిప్
వాడికి ఏడాదిన్నర వయసు.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్
ఏప్రిల్‌లో విడుదలైన టాప్ 10 మొబైల్స్
చిన్నప్పటి నుంచి చదువులో టాప్
బ్యాంకులో క్యాష్ వేస్తున్నారా..? జాగ్రత్త!!
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరు
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
మొక్కుబడిగా ఏసీ కొనవద్దు..
పహల్గామ్ దాడి.. నా పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు: విజయ్ ఆంటోనీ క్లారిటీ!
ఏపీ రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారు
సల్మాన్ ‘సౌత్’ వ్యాఖ్యలపై స్పందించిన నాని!
సినిమా

గలీజ్ మాటలు.. నా జీవితంతో ఆడుకుంటున్నారు.. బతకను: జానులిరి
జాను లిరి (Janu Lyri).. జానపద పాటలతో చాలా ఫేమస్ అయింది. యూట్యూబ్‌లో ఫోక్ సాంగ్స్‌కు హుషారుగా స్టెప్పులేసే జాను.. తర్వాత ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 షో విన్నర్‌గానూ నిలిచింది. పదో తరగతిలోనే పెళ్లి చేసుకున్న ఈ డ్యాన్సర్‌కు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. భర్తతో విభేదాల కారణంగా వీరు విడిపోయారు. అయితే జాను ఏం చేసినా సరే కొందరు తనను విమర్శిస్తూనే ఉన్నారు. ఈ మధ్య ఓసారి మంచి వ్యక్తి దొరికితే రెండో పెళ్లికి కూడా సిద్ధమే అంది. దాన్ని కూడా తప్పుపడుతూ తనను ట్రోల్ చేస్తున్నారు.గుక్కపెట్టి ఏడ్చిన జానుఈ విమర్శలను జాను లిరి భరించలేకపోయింది. నన్ను టార్గెట్ చేయడం ఆపండి అంటూ బోరుమని ఏడుస్తోంది. ఈ మేరకు పలు వీడియోలు షేర్ చేసింది. నా జీవితంతో ఆడుకుంటున్నారు. నేను నవ్వితే ఓవరాక్షన్.. నాకు పద్ధతి తెలీదు..కదా? ఫోక్ ఇండస్ట్రీలో పద్ధతిగా చీర కట్టుకుని డ్యాన్స్ చేస్తుంది నేనే. కెమెరా ముందు ఒకలా, వెనక ఒకలా ఉండను. అందరితో నవ్వుతూ ఉంటాను. నేనేం చేసినా తప్పే అంటున్నారు.బతకాలని లేదుఇన్‌స్టాగ్రామ్‌లో నా వాయిస్‌కు గలీజ్ మాటలు యాడ్ చేస్తున్నారు. అవి నా కొడుకు చూడడా? ఎక్కడికైనా వెళ్లి చచ్చిపోవాలనిపిస్తోంది. ఒకవేళ నేను నిజంగా చచ్చిపోతే మాత్రం మీరే కారణం. ఇంత నరకమా? మీ వ్యూస్ కోసం ఒకమ్మాయి జీవితాన్ని రోడ్డుమీద పడేస్తున్నారు. మా అమ్మానాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఒక్క మాట అనకుండా పెంచారు. కానీ ఈరోజు అడ్డమైన వెధవలతో మాటలు పడుతున్నాను. సూసైడ్ తప్పు అని నలుగురికీ చెప్పేదాన్ని.. కానీ ఇప్పుడర్థమవుతోంది.నా వల్ల కావట్లేదువాళ్లు పడే బాధల వల్ల చనిపోవట్లేదు. మీరు చేసే రచ్చ తట్టుకోలేక చనిపోతున్నారని! నా వల్ల కావట్లేదు. నా ఓపిక నశించింది. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అన్నయ్యతో మాట్లాడినా, అక్కతో మాట్లాడినా, నవ్వినా, కూర్చున్నా.. ఎందుకు నిందలేస్తున్నారు? నా గురించి మంచి పెట్టొచ్చు కదా.. బాధ తట్టుకోలేకపోతున్నా.. నా జీవితంతో ఆడుకోవడం ఎందుకు? నా వల్ల మీకేమైనా హాని జరిగిందా? నా కొడుకును బాగా చదివించి మంచి స్థాయిలో చూడాలనుకున్నాను. అప్పటివరకు నేను బతకనని నాకర్థమవుతోంది. నేను మధ్యలోనే పోతాను అంటూ జాను వెక్కి వెక్కి ఏడ్చేసింది. View this post on Instagram A post shared by Jimmidi Jhansi - Janulyri (@janulyri_official) ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: హీరోయిన్ రెచ్చగొట్టింది.. అందుకే సిక్స్ ప్యాక్ చేశా: అల్లు అర్జున్

బలవంతంగానైనా సినిమాలకు గుడ్‌బై చెప్తా..: అజిత్
ముందుగా ప్లాన్ చేసుకోకుండా సినిమాల్లోకి వచ్చినవారిలో అజిత్ (Ajith Kumar) ఒకరు. అనుకోకుండా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తమిళంలో బిగ్గెస్ట్ స్టార్‌గా ఎదిగారు. ఈ మధ్యే పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చిన ఆయన హఠాత్తుగా సినిమాలను ఎప్పుడు వదిలేసేది కూడా తెలీదంటున్నారు.రిటైర్ అవొచ్చేమో..తాజాగా ఓ ఇంటర్వ్యూలో అజిత్ మాట్లాడుతూ.. 'ఎప్పుడేం జరుగుతుందో మనకు తెలీదు. రిటైర్మెంట్ నేను ప్లాన్ చేసుకోవాల్సిన పని లేదు. బలవంతంగా కూడా రిటైర్ అయిపోవచ్చేమో! చెప్పలేం.. ఈరోజుకు మనమింకా బతికున్నామన్నదే పెద్ద ఆశీర్వాదంలా భావించాలి. నేనేం ఫిలాసఫీలు చెప్పడం లేదు. ఈ ప్రయాణంలో ఎన్నో దెబ్బలు తగిలాయి, అవి సర్జరీల వరకు కూడా వెళ్లాయి. ఇకపోతే నా ఫ్రెండ్స్, చుట్టాల్లో క్యాన్సర్‌ను జయించినవాళ్లు కూడా ఉన్నారు. కాలాన్ని వృథాగా పోనివ్వనుజీవితం ఎంత విలువైనదో మాకు బాగా తెలుసు. అందుకే ఈ లైఫ్‌లో ప్రతి సెకనును వృథాగా పోనివ్వదల్చుకోలేదు. వీలైనంతవరకు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటాను. సినిమాల్లోకి రావాలని నేనెన్నడూ అనుకోలేదు. అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చాను. స్కూల్ అయిపోయాక ఆటోలు తయారుచేసే కంపెనీలో ఆరు నెలలు పని చేశాను. 18 ఏళ్ల వయసులో రేసింగ్ మొదలుపెట్టాను. ఆ తర్వాత వాణిజ్య ప్రకటనలు చేశాను. అలా సినిమాల్లోకి వచ్చాను' అని చెప్పుకొచ్చారు. అజిత్ చివరగా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాతో మెప్పించాడు. ఈ మూవీ కేవలం రెండు వారాల్లోనే రూ.200 కోట్లు రాబట్టింది.చదవండి: గలీజ్ మాటలు.. నా జీవితంతో ఆడుకుంటున్నారు.. బతకను: జానులిరి

ఉత్తమ చిత్రంగా హనుమాన్ నటి మూవీ
హనుమాన్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన 'శబరి'. తాజాగా ఈ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. దాసరి ఫిలిం అవార్డ్స్- 2025లో ఉత్తమ కథా చిత్రంగా శబరి అవార్డును కైవసం చేసుకుంది. తెలుగు సినిమా పరిశ్రమలో మరోసారి ప్రయోగాత్మక చిత్రం ఈ ఘనతను సాధించింది. ఈ సినిమాను ప్రముఖ ఎన్నారై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించారు.తొలి సినిమాకే కథాబలం ఉన్న చిత్రాన్ని ఎన్నుకొని అనిల్ క్యాట్జ్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. అద్భుతమైన భావోద్వేగాలతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఒక తల్లి తన బిడ్డను రక్షించేందుకు చేసిన ఒంటరి పోరాటాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. కాగా.. గతేడాది మే నెలలో థియేటర్లలో విడుదలైన శబరి మూవీకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన దక్కించుకుంది.

అటు రొమాన్స్.. ఇటు యాక్షన్.. 'కింగ్డమ్' తొలి పాట చూశారా?
విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ 'కింగ్డమ్'. మే 30న థియేటర్లలోకి రానుంది. కొన్నిరోజుల ముందు వరకు సినిమా వాయిదా పడుతుందని రూమర్స్ వినిపించాయి. కానీ తాజాగా పాటతో ప్రమోషన్స్ తో మొదలుపెట్టడంతో పుకార్లకు చెక్ పడింది. ఇప్పుడు ఆ పాటని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: అనిరుధ్ కి విజయ్ దేవరకొండ 'ప్రేమలేఖ') 'హృదయం లోపల..' అంటూ సాగే ఈ గీతంలో కింగ్డమ్ సినిమా కథేంటి అనేది కొంతలో కొంత రివీల్ చేశారని చెప్పొచ్చు. సూరి అనే రౌడీ, అతడితో ప్రేమలో ఉన్న ఓ డాక్టర్.. వీళ్లిద్దరూ కలిసి శ్రీలంక ఆర్మీపై ఏదో ప్లాన్ చేస్తున్నట్లు కనిపించారు. అదేంటి అనేది మాత్రం సినిమా చూసి తెలుసుకోవాలి.కింగ్డమ్ సినిమాలో సూరి అనే పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించాడు. అతడి ప్రేయసిగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. ఈ పాటలో ఓవైపు చంపడం చూపిస్తూనే, చివర్లో రొమాన్స్ కూడా చూపించారు. సినిమా కూడా అటు యాక్షన్, ఇటు రొమాన్స్ అనేలా ఉంటుందని హింట్ ఇచ్చారేమో?(ఇదీ చదవండి: అల్లు అర్జున్.. నెల్లూరు పెద్దారెడ్డి తాలుకా!)
న్యూస్ పాడ్‌కాస్ట్

ప్రతి ఇంటినీ చంద్రబాబు మోసం చేశారు: వైఎస్ జగన్ ఆగ్రహం

దేశవ్యాప్తంగా జనగణనతో పాటే కులగణన: కేంద్రం కీలక నిర్ణయం

ఏపీలో అంతులేని అవినీతి, అంతా అరాచకమే: వైఎస్ జగన్

రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం

ఏపీలో కేంద్ర సంస్థలకైతే కోట్లు.. ఉర్సా సంస్థకైతే ఊరకే!

పాక్ కాల్పుల పోరు.. బదులిచ్చిన భారత బలగాలు.

ఏపీ రాజధానిలో దోపిడీ ఐకానిక్.. 5 టవర్ల నిర్మాణ వ్యయం పెంపు

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు.. తీవ్రస్థాయికి ఉద్రిక్తతలు

పాకిస్తాన్‌కు భారత్ పంచ్.. పహల్గాం దాడిపై కేంద్రం సీరియస్

జమ్మూకశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి... కాల్పులకు 26 మంది బలి, మరో 20 మందికి పైగా గాయాలు.. మృతుల్లో ఇద్దరు విదేశీయులు
క్రీడలు

ఎస్ఆర్హెచ్ను చిత్తు చేసిన గుజరాత్
IPL 2025 Gujarat Titans vs Sunrisers Hyderabad Live Updates:ఎస్ఆర్హెచ్ను చిత్తు చేసిన గుజరాత్‌ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కథ దాదాపు ముగిసినట్లే. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ తేలిపోయింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 38 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. 225 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేయగల్గింది. లక్ష్య చేధనలో ఓపెనర్లు మంచి అరంభం ఇచ్చినప్పటికి, మిడిలార్డర్ విఫలమం కావడంతో ఆరెంజ్ ఆర్మీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ(74) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, సిరాజ్ తలా రెండు వికెట్లు సాధించగా.. ఇషాంత్ శర్మ, కోయిట్జీ తలా వికెట్ సాధించారు. ఓటమి దిశగా ఎస్ఆర్హెచ్సన్రైజర్స్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. 6 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయింది. క్లాసెన్(23).. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో ఔట్ కాగా.. సిరాజ్ బౌలింగ్‌లో అనికేత్ వర్మ(3), మెండిస్(0) ఔటయ్యారు. 17 ఓవర్లకు సన్‌రైజర్స్ 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ డౌన్అభిషేక్ శర్మ రూపంలో ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. 74 పరుగులు చేసిన అభిషేక్ ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 15 ఓవర్లకు సన్‌రైజర్స్ మూడు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ క్లాసెన్(22), అనికేత్ వర్మ(0) పరుగులతో ఉన్నారు.అభిషేక్ హాఫ్ సెంచరీగుజరాత్తో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 14 ఓవర్లకు సన్‌రైజర్స్ రెండు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(69), క్లాసెన్(16) పరుగులతో ఉన్నారు.ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ డౌన్..ఇషాన్ కిషన్ రూపంలో ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన కిషన్.. కోయిట్జీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 11 ఓవర్లకు సన్‌రైజర్స్ రెండు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(49), క్లాసెన్(10) పరుగులతో ఉన్నారు.ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ డౌన్..225 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ ట్రావిస్ హెడ్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన హెడ్.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లకు సన్‌రైజర్స్ వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది.చెలరేగిన గుజరాత్ బ్యాటర్లు.. ఎస్ఆర్హెచ్ ముందు భారీ టార్గెట్ అహ్మదాబాద్ వేదికగా ఎస్ఆర్హెచ్తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్(76) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జోస్ బట్లర్(64), సుదర్శన్(48) పరుగులతో రాణించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో జయ్‌దేవ్ ఉనద్కట్ మూడు వికెట్లు పడగొట్టగా.. కమ్మిన్స్, అన్సారీ తలా వికెట్ సాధించారు.గుజరాత్ రెండో వికెట్ డౌన్శుబ్మన్ గిల్ రూపంలో గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. 76 పరుగులు చేసిన గిల్.. దురదృష్టవశాత్తూ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. 13 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ రెండు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది.శుబ్‌మన్ గిల్ ఫిప్టీ..గుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 25 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 10 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 120 పరుగులు చేసింది. క్రీజులో బట్లర్(19), గిల్(52) ఉన్నారు.గుజరాత్ తొలి వికెట్ డౌన్..సాయిసుదర్శన్ రూపంలో గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 48 పరుగులు చేసిన సుదర్శన్.. జీషన్ అన్సారీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 103 పరుగులు చేసింది. క్రీజులో గిల్(42), బట్లర్(12) ఉన్నారు.దంచి కొడుతున్న గుజరాత్ ఓపెనర్లు..నరేంద్ర మోదీ మైదానంలో గుజరాత్ ఓపెనర్లు బౌండరీల వర్షం కురిపిస్తున్నారు. 6 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 82 పరుగులు చేసింది. క్రీజులో సుదర్శన్(45), శుబ్‌మన్ గిల్(36) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న గుజరాత్టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్(26), గిల్(10) ఉన్నారు. ఐపీఎల్-2025లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు సన్‌రైజర్స్ చాలా కీలకం. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే హైదరాబాద్.. ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందేఎస్ఆర్హెచ్ తమ తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. గుజరాత్ మాత్రం ఓ మార్పుతో బరిలోకి దిగింది. కరీమ్ జనత్ స్ధానంలో జట్టులోకి కోయిట్జీ వచ్చాడు.తుది జట్లుగుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, గెరాల్డ్ కోయెట్జీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణసన్రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ, మహమ్మద్ షమీ

ముంబైని ఓడించడం అంత ఈజీ కాదు.. టాప్-2లో నిలుస్తుంది: హర్భజన్
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా గురువారం జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది.ఈ విజయంతో ముంబై పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్‌పై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ఏడాది సీజన్ గ్రూపు స్టేజి పాయింట్ల పట్టికలో ముంబై మొదటి రెండు స్థానాల్లో నిలుస్తుందని జోస్యం చెప్పాడు."రాజస్తాన్ రాయల్స్‌పై ముంబై ఇండియన్స్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ప్రస్తుతం ముంబై ఛాంపియన్ టీమ్‌లా ఆడుతోంది. ముంబై ప్లేయింగ్ ఎలెవన్‌లో పది మంది ఆటగాళ్లకు ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించే సత్తా ఉంది. ఏ జట్టుకైనా హార్దిక్ సేనను ఓడించడం అంత సులువు కాదు. కచ్చితంగా గ్రూపు స్టేజిలో ముంబై టాప్-2లో నిలుస్తుందని నేను భావిస్తున్నాను. ముంబై గ్రూపు స్టేజిని 18 లేదా 20 పాయింట్లతో ముగుస్తుందని" హర్భజన్ తన యూట్యూబ్ ఛానెల్లో పేర్కొన్నాడు.

బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లకు షాక్.. అకౌంట్లు బ్లాక్
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌పై భారత్ కఠిన చర్యలు చేపట్టింది. సింధు జలాల ఒప్పందం రద్దు సహా దాయాదిపై అనేక ఆంక్షలు విధించింది. అదే విధంగా పాకిస్తాన్‌కు చెందిన సామాజిక మాధ్యమాల ఖాతాల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే పాక్ యూట్యూబ్ చానెళ్లు, ట్విటర్‌ను నిషేధించిన భారత్.. క్రీడాకారుల సోషల్ మీడియా అకౌంట్లపై కూడా దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇప్పటికే జావెలిన్ త్రోయర్, ప్యారిస్ ఒలింపిక్స్-2024 స్వర్ణ పతక విజేత అర్షద్ నదీమ్ (Arshad Nadeem) ఖాతాను దేశంలో నిలిపివేసింది.బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లకు షాక్ఇక పాకిస్తాన్ స్టార్ క్రికెటర్లు బాబర్ ఆజం (Babar Azam), కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (Mohammed Rizwan)లకు కూడా తాజాగా షాక్ తగిలింది. వీరిద్దరి ఇన్స్టాగ్రామ్ ఖాతాలను భారత్‌లో నిలిపి వేశారు. వీరి అకౌంట్లను ఓపెన్ చేయాలని చూస్తే.. ‘‘ఈ అకౌంట్ ఇండియాలో అందుబాటులో లేదు. చట్టపరమైన అభ్యర్థనల నేపథ్యంలో దీనిపై ఆంక్షలు ఉన్నాయి’’ అనే సందేశం కనిపిస్తోంది.కాగా పహల్గామ్ దాడి తర్వాత షోయబ్ అక్తర్, షాహిన్ షా ఆఫ్రిది, హ్యారిస్ రవూఫ్, షాహిద్ ఆఫ్రిది, వసీం అక్రం, వకార్ యూనిస్, బసిత్ అలీ తదితర క్రికెటర్ల అకౌంట్లను కూడా భారత్‌లో బ్లాక్ చేశారు. అదే విధంగా ఇతర సెలబ్రిటీలు మహీరా ఖాన్, ఫవాద్ ఖాన్, అలీ జాఫర్, హనియా ఆమిర్ ఖాతాలను కూడా నిలిపివేశారు.భారత్‌లో నిషేధంఇక పాకిస్తాన్ ఆటగాళ్లు ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్‌తో బిజీగా ఉన్నారు. ఐపీఎల్-2025తో పోటీ పడి చేతులు కాల్చుకున్న పాక్ క్రికెట్ బోర్డుకు.. పహల్గామ్ దాడి తర్వాత మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే అంతంత మాత్రమైన వ్యూయర్షిప్ ఉన్న ఈ లీగ్ ప్రసారాలను భారత్‌లో నిషేధించారు.కాగా జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో గల ప్రశాంతమైన బైసరన్ లోయలో ఉగ్రవాదులు ఇటీవల పాశవిక దాడికి తెగబడిన విషయం తెలిసిందే. బైసరన్ అందాలు చూసేందుకు వచ్చిన 26 మంది పర్యాటకులను కాల్చి చంపేశారు. దీంతో... అమాయక ప్రజల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులు, వారికి మద్దతు ఇస్తున్న వారిపై భారత్ కఠిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ముందుగా దాయాదికి బుద్ధిచెప్తోంది.చదవండి: ఆసియా కప్, బంగ్లాదేశ్ పర్యటనను రద్దు చేసుకోనున్న టీమిండియా..?

Eng Vs Zim Test: ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. అతడికి తొలిసారి పిలుపు
జింబాబ్వే (England Vs Zimbabwe)తో ఏకైక టెస్టు మ్యాచ్‌కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఇందుకు సంబంధించి పదమూడు మంది సభ్యులతో కూడిన వివరాలను శుక్రవారం వెల్లడించింది. కాగా.. 27 ఏళ్ల పేసర్ సామ్ కుక్ (Sam Cook)కు తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కడం విశేషం.ఇప్పటికే 318 వికెట్లుకుక్తో పాటు జోర్డాన్ కాక్స్‌ను కూడా ఈ మ్యాచ్‌కు ఎంపిక చేసిన ఇంగ్లిష్ జట్టు సెలక్టర్లు.. జోష్ టంగ్ (Josh Tongue)కు కూడా తిరిగి పిలుపునిచ్చారు. కాగా కౌంటీ క్రికెట్లో సామ్ కుక్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. నిలకడైన ఆటకు మారుపేరైన ఈ ఎస్సె.క్స్పేస్ బౌలర్ కౌంటీల్లో ఇప్పటికే 318 వికెట్లు తీశాడు.మరోసారి పిలుపుఅదే విధంగా ఇంగ్లండ్ లయన్స్ తరఫున ఆస్ట్రేలియా-ఎ జట్టుతో మూడు మ్యాచ్‌లలో కలిపి సామ్ కుక్ 13 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు.. జోర్డాన్ కాక్స్ 2024లోనే అరంగేట్రం చేయాల్సింది. న్యూజిలాండ్‌తో నవంబర్ నాటి మ్యాచ్‌లో అతడు ఆడాల్సి ఉండగా.. ప్రాక్టీస్ సెషన్లో కుడిచేతి బొటనవేలికి గాయమైంది. దీంతో అప్పుడు అవకాశం కోల్పోయిన అతడికి మళ్లీ సెలక్టర్లు పిలుపునిచ్చారు.ఇక జోష్ టంగ్ విషయానికొస్తే.. 2023లో ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ టెస్టు తర్వాత మళ్లీ జాతీయ జట్టుకు ఆడలేదు. కాగా స్వదేశంలో జింబాబ్వేతో టెస్టుతో కెప్టెన్ బెన్ స్టోక్స్ తిరిగి ఆటలో అడుగుపెట్టనున్నాడు.33 ఏళ్ల స్టోక్స్ గత కొంతకాలంగా పిక్కల్లో గాయంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. గతేడాది డిసెంబరులో న్యూజిలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడిన అతడు.. సర్జరీ తర్వాత కోలుకున్నాడు.కాగా మే 22-25 వరకు సొంతగడ్డపై ఇంగ్లండ్ జింబాబ్వేతో నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ ఆడనుంది. గాయాల కారణంగా మార్క్ వుడ్, బ్రైడన్ కార్స్,క్రిస్ వోక్స్, ఓలీ స్టోన్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. ఇక జోఫ్రా ఆర్చర్ ఇప్పట్లో టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చే పరిస్థితి కనబడటం లేదు.జింబాబ్వేతో టెస్టు మ్యాచ్‌కు ఇంగ్లండ్ జట్టు:జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), జోర్డాన్ కాక్స్ (వికెట్ కీపర్), సామ్ కుక్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, మాథ్యూ పాట్స్, జోష్ టంగ్.చదవండి: ఇంగ్లండ్‌తో టెస్టుల్లో అతడిని ఆడించండి.. అదరగొడతాడు: టీమిండియా మాజీ కోచ్
బిజినెస్

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 259.75 పాయింట్లు లేదా 0.32 శాతం లాభంతో 80,501.99 వద్ద, నిఫ్టీ 12.50 పాయింట్లు లేదా 0.051 శాతం లాభంతో 24,346.70 వద్ద నిలిచాయి.జుల్లుందూర్ మోటార్ ఏజెన్సీ ఢిల్లీ, స్పోర్ట్‌కింగ్ ఇండియా, జోడియాక్ క్లాతింగ్ కంపెనీ, క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్, ఫోర్స్ మోటార్స్ వంటి కంపెనీలు లాభాలను చవి చూశాయి. యునైటెడ్ పాలీఫ్యాబ్ గుజరాత్, గోద్రేజ్ ఆగ్రోవెట్, జీ-టెక్ జైన్ఎక్స్ ఎడ్యుకేషన్, వైశాలి ఫార్మా, మాలు పేపర్ మిల్స్ మొదలైన కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).

మూడు రోజుల్లో స్కైప్ కనుమరుగు
కరోనా సమయంలో పాపులర్ అయిన కొన్ని టెక్నాలజీ సర్వీసులు క్రమంగా కనుమరుగవుతున్నాయి. అందులో మైక్రోసాఫ్ట్ సర్వీసు స్కైప్ ఒకటి. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి 22 ఏళ్లు అయినా, కొవిడ్ సమయంలో చాలా మంది ఉద్యోగులు, బిజినెస్ సంస్థలు స్కైప్ సర్వీసులు విరివిగా వినియోగించుకున్నారు. కానీ కొవిడ్ అనంతరం క్రమంగా యూజర్ల నుంచి ఆదరణ తగ్గడం, మార్కెట్లో పోటీగా మెరుగైన ఇతర ప్రత్యామ్నాయాలు రావడంతో సవాళ్లు ఎదురవుతున్నాయి. దాంతో ఈ సర్వీసును మే 5, 2025 నుంచి నిలిపేస్తున్నట్లు ఇప్పటికే మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. అయితే స్కైప్ యూజర్లకు మైక్రోసాఫ్ట్ టీమ్స్‌వైపు మళ్లించేందుకు అన్ని ప్రయత్నాలు జరిగాయి. కాగా, కంపెనీ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన స్కైప్‌ను ఎందుకు నిలిపేస్తున్నారో నిపుణులు విశ్లేషిస్తున్నారు.మైక్రోసాఫ్ట్ టీమ్స్‌లోకి మార్పుమైక్రోసాఫ్ట్ తన కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌లను ఏకీకృతం చేయడం కూడా స్కైప్‌ను నిలిపేసేందుకు కారణమవుతుంది. మెసేజింగ్, వీడియో కాల్స్ ఇతర సర్వీసుల కోసం దాని ప్రాథమిక కేంద్రంగా మైక్రోసాఫ్ట్ టీమ్స్‌పై పూర్తిగా దృష్టి పెడుతోంది. దాంతో స్కైప్ వినియోగదారులను సైతం ఈ టీమ్స్‌లో చేరమని కొంత కాలంగా కోరుతుంది. ఇప్పటికే చాలామంది టీమ్స్‌లోకి మారారు.తగ్గుతున్న ప్రజాదరణస్కైప్ కొన్నేళ్లుగా మెరుగైన సర్వీసులు అందిస్తున్నప్పటికీ జూమ్, గూగుల్ మీట్, వాట్సాప్.. వంటి పోటీదారులు కూడా ఈ సర్వీసు అందిస్తున్నారు. దాంతో ఆఫీస్ 365లో భాగంగా ఉన్న మైక్రోసాఫ్ట్ టీమ్స్‌వైపు వినియోగదారులు నడిపించేలా సంస్థ చర్యలు తీసుకుంటోంది.వినియోగదారులకు మద్దతుగా..స్కైప్ నుంచి టీమ్స్‌కు మైగ్రేట్ అయ్యేందుకు మైక్రోసాఫ్ట్ యూజర్లకు చాలా నెలల సమయం ఇచ్చింది. టీమ్ల్లోకి లాగిన్ కావడానికి ఇప్పటికే ఉన్న స్కైప్ ఐడీలను ఉపయోగించవచ్చని తెలిపింది. ఇది యూజర్ ట్రాన్పర్మేషన్ను సులభతరం చేసింది. చాట్ హిస్టరీలు, కాంటాక్ట్‌లను నిరాటంకంగా టీమ్స్‌కు బదిలీ చేస్తామని మైక్రోసాఫ్ట్ హామీ ఇచ్చింది.పెయిడ్ సేవలు నిలిపివేతస్కైప్ క్రెడిట్, కాలింగ్ ప్రణాళికలతో సహా పెయిడ్ సేవల కోసం కొత్త సబ్ స్క్రిప్షన్లను మైక్రోసాఫ్ట్ నిలిపివేసింది. ఇప్పటికే ఉన్న వినియోగదారులు వారి తదుపరి రీఛార్జ్ సైకిల్ వరకు సబ్స్క్రిప్షన్లను కొనసాగించవచ్చని తెలిపింది. ఆ తర్వాత పెయిడ్ ఫీచర్లు నిలిచిపోతాయని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: గూగుల్ కథ కంచికేనా?ప్రత్యామ్నాయాలుమార్కెట్లో టీమ్స్‌కు కూడా ప్రత్యామ్నాయాలున్నాయి. యూజర్లు వీడియో కాలింగ్ ఫీచర్లను అందించే గూగుల్ మీట్, జూమ్ లేదా వాట్సాప్.. వంటి సర్వీసులకు కూడా మారవచ్చు. అయితే స్కైప్‌తో పోలిస్తే టీమ్స్ మరింత ఆధునిక, ఇంటిగ్రేటెడ్ అనుభవాన్ని అందిస్తుందని మైక్రోసాఫ్ట్ నొక్కి చెప్పింది.

రూ.21000 కోట్లు: మూడేళ్ళలో యూట్యూబర్ల సంపాదన..
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో చాలామంది సొంతంగా సంపాదించడానికి మార్గాలను వెతుకుతున్నారు. పెట్టుబడి లేకుండా సంపాదించడానికి యూట్యూబ్ ఓ మంచి ఫ్లాట్‌ఫామ్. దీనిని దృష్టిలో ఉంచుకుని చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానెల్స్ ప్రారంభిస్తున్నారు, ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. యూట్యూబ్ ద్వారా గత మూడేళ్ళలో కంటెంట్ క్రియేటర్లు ఎంత సంపాదించారనే విషయాన్ని సీఈఓ నీల్ మోహన్ వెల్లడించారు.గత మూడు సంవత్సరాలలో యూట్యూబ్.. భారతీయ క్రియేటర్లకు, మీడియా సంస్థలు మొదలైన వాటికి రూ. 21,000 కోట్లకు పైగా చెల్లించింది. ఈ విషయాన్ని సీఈఓ నీల్ మోహన్ ముంబైలో జరిగిన ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (WAVES)లో స్పష్టం చేశారు. అంతే కాకుండా.. యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సహించడానికి రాబోయే రెండు సంవత్సరాలలో.. రూ.850 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ పెట్టుబడి ప్రత్యేకంగా భారతదేశ కంటెంట్ క్రియేటర్ల ఆర్థిక వ్యవస్థను పెంచుతుందని ఆయన అన్నారు.ఇదీ చదవండి: 1925లో బంగారం రేటు ఇంత తక్కువా?: అదే ధర ఇప్పుడుంటే..భారతదేశంలోని సుమారు 100 మిలియన్ల కంటే ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ లేదా యూట్యూబర్లు కంటెంట్ అప్లోడ్ చేశారు. సుమారు 15,000 మంది యూట్యూబర్లు ఒక ఏడాదిలోనే 10 లక్షల సబ్స్క్రైబర్లను పొందిన రికార్డును సొంతం చేసుకున్నారు. కాగా 2005 ఫిబ్రవరి 14న ప్రారంభమైన యూట్యూబ్ 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

బంగారం మాయలో పడొద్దు..
బంగారాన్ని సాంప్రదాయకంగా సురక్షితమైన, నమ్మదగిన పెట్టుబడిగా భావిస్తారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లు అస్థిరతకు లోనవుతున్న తరుణంలో బంగారంపై పెట్టుబడి ధోరణి ఇన్వెస్టర్లలో మరీ ఎక్కువైంది. బంగారం ధరలు 10 గ్రాములకు రూ .1 లక్షకు చేరువలో ఉన్నందున పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన అవకాశం అని చాలా మంది భావిస్తున్నారు. అయితే బంగారంపై పెట్టుబడులు ఎల్లప్పుడూ అద్భుతమైన రాబడిని ఇస్తాయనుకోవద్దని, బంగారం మాయలో పడొద్దని ఇన్వెస్టర్లను హెచ్చరిస్తున్నారు నితేష్ బుద్ధదేవ్ అనే చార్టర్డ్ అకౌంటెంట్.స్వల్పకాలిక ధోరణుల ఆధారంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలని ఇన్వెస్టర్లకు సీఏ బుద్ధదేవ్ సూచించారు. గత కొన్నేళ్లుగా బంగారం బలమైన రాబడులను అందించినప్పటికీ, ఎల్లప్పుడూ అలా ఉండదని ఆయన చెబుతున్నారు. వాస్తవానికి, బంగారం దాదాపు సున్నా రాబడిని అందించిన సుదీర్ఘ కాలం కూడా ఉంది. చాలా మంది కొత్త ఇన్వెస్టర్లు ఈ వాస్తవాన్ని విస్మరిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.ఈ లెక్కలు చూడండి..తన హెచ్చరికకు మద్దతుగా బుద్ధదేవ్ 2012 నుండి 2019 వరకు బంగారంపై రాబడులు ఏ మాత్రం ఉన్నాయనే దానికి సంబంధించిన చారిత్రక లెక్కలను ముందుపెట్టారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో బంగారం ధరలు మరీ అంత పెద్దగా పెరిగిందేమీ లేదు. 2012లో 10 గ్రాముల బంగారం ధర రూ.31,050 ఉండగా.. 2019 నాటికి అది స్వల్పంగా పెరిగి రూ.35,220కి చేరింది. అంటే 8 సంవత్సరాలలో పెరిగింది కేవలం రూ .4,170. శాతంలో చెప్పాలంటే మొత్తం 13% రాబడి. సగటున చూసినప్పుడు, కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు సంవత్సరానికి 1.5% కంటే తక్కువగానే ఉంది. ఇక 1992 నుంచి 2002 మధ్య కాలంలో బంగారం ధర 10 గ్రాములకు రూ.4,334 నుంచి కేవలం రూ.4,990కి పెరిగిందని, 1.5 శాతం కంటే తక్కువ వార్షిక రాబడులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.2020 తర్వాత బంగారం ఎందుకు పెరిగిందంటే..2020 తర్వాత బంగారం ధరలు అకస్మాత్తుగా పెరగడం యాదృచ్ఛికం కాదని బుద్ధదేవ్ వివరించారు. సురక్షిత ఆస్తులకు డిమాండ్‌ను పెంచిన 2019 కోవిడ్ మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ ఘర్షణ, పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఆందోళనలు, కేంద్ర బ్యాంకులు దూకుడుగా బంగారం కొనుగోలు చేయడం ఇవన్నీ బంగారం నాటకీయ పెరుగుదలకు దోహదం చేశాయి.ఈ అంశాలు మదుపర్లు బంగారం కొనుగోలుకు ఎగబడే పరిస్థితిని సృష్టించాయి, ధరలు భారీగా పెరిగాయి. కానీ సీఏ బుద్ధదేవ్ చెబుతున్నట్లుగా ప్రతి పెద్ద స్పైక్ తర్వాత సుదీర్ఘ ఫ్లాట్ లైన్ ఉంటుంది. అంటే ఇన్వెస్టర్లు బంగారం పనితీరులో బూమ్లతోపాటు పడిపోయే స్థితినీ అంచనా వేయాలి.బంగారం ఇప్పటికీ మంచి పెట్టుబడేనా అంటే బుద్ధదేవ్ ప్రకారం.. పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో బంగారానికి ఎప్పటికీ విలువ ఉంటుంది. కానీ ఇది డైవర్సిఫికేషన్, హెడ్జింగ్ సాధనంగా మాత్రమే ఉంటుంది. ఈక్విటీల మాదిరిగా స్థిరమైన రాబడిని అందించదు. కాబట్టి మొత్తం పోర్ట్‌ఫోలియోలో బంగారానికి కేవలం 5% నుండి 12% కేటాయించాలని ఆయన సిఫార్సు చేస్తున్నారు.
ఫ్యామిలీ

Good Health: వెజ్ తినాలా? నాన్ వెజ్ తినాలా?
ఓ మహిళ.. ఎదురుగా ఉన్న ఓ వ్యక్తితో.. జంతుబలి చేసే హక్కు మీకు ఎవరిచ్చారు..? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. మా ఇష్టం మాకు నచ్చింది మేం తింటాం.. అంటూ అవతలి వ్యక్తి సమాధానం ఇస్తున్నాడు. మాంసాహారం తింటాం అంటే కుదరదు.. ఎందుకు కుదరదో చెబుతాను వినండి.. అంటూ ఆమె శాకాహారం గొప్పతనం, మన సైక్లింగ్ ప్రకృతి నియమాలు ఇతర అంశాలను వివరించారు. మీరు ప్యూర్ వెజిటేరియన్‌గా మారతారా? అని హామీ తీసుకుంది. ఇంత చెప్పిన తర్వాత ఆ మనిషిలో ఆలోచన మొదలైంది. ఇంతకీ ఎవరా మహిళ.. ఆమె చేస్తున్న ప్రచారం ఏమిటి..? ఆమె పేరే విజయలక్ష్మి.. మియాపూర్‌లో నివాసం ఉంటున్నారు. ఓ కార్పొరేట్ స్కూల్లో కంప్యూటర్ సైన్స్ టీచర్. ప్రవృత్తి.. పది మంది గుమిగూడి ఉండే చోట శాకాహారంతో ప్రయోజనాలను వివరిస్తూ శాకాహారమే తినాలంటూ ప్రచారం చేయడం. ఎంతలా వారికి అవగాహన కల్పిస్తున్నారంటే ఆమె మాటలు విన్న తర్వాత చాలా మంది ఇక మాంసాహారం జోలికి వెళ్లకూడదని నిర్ణయం కూడా తీసుకుంటున్నారు. – సికింద్రాబాద్ శాకాహారంలో అనుభూతిని ఆస్వాదిద్దామా..? అంటూ మొదలవుతుంది ఆమె ప్రచారం. యునైటెడ్ వెజిటేరియన్స్ ఫోరం పేరుతో సోషల్ మీడియా వేదికగా ఓ పేజీ క్రియేట్ చేశారు. తనలాంటి భావజాలం ఉన్న వ్యక్తుల్ని ఆ వేదికపైకి రమ్మని పిలుపునిచ్చారు. ఒకరు, ఇద్దరు, ముగ్గురు.. అలా 200లకు చేరింది ఆ సంఖ్య. వీలున్నప్పుడల్లా పదిమంది జనం ఉండే చోట ప్రత్యక్షమవుతారు. శాఖాహారంలోని గొప్పతనాన్ని.. అది తీసుకోవడం వల్ల శరీర అవయవాల మీద పనితీరును.. ఇతర అంశాల్ని చక్కగా వివరించి మాంసాహారానికి దూరం చేసే ప్రయత్నం చేస్తారు. ఆ మాటలు విన్న ఎవరైనా క్చతంగా ఆకుకూరలు, కూరగాయలు గొప్పతనాన్ని ‘వంట’ పట్టించుకోవడం నిజం. పక్కా ప్రణాళికతో ప్రచారం.. యునైటెడ్ వెజిటేరియన్స్ ఫోరం వ్యవస్థాపకురాలైన ఎన్వీ విజయలక్ష్మి పనితీరు చాలా ఆసక్తికరం. స్వచ్ఛందంగా సేవలందించేందుకు సిద్ధమైన వలంటీర్లు ఎంతమంది అందుబాటులో ఉన్నారో తెలుసుకుంటారు. ఫలానా రోజు ఫలానా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఓ చిన్న పోస్టులు పెడతారు. ఆ ఏరియాలో ఉండే వలంటీర్లు.. అందుబాటులో ఉండే వారంతా సుముఖత వ్యక్తం చేస్తే వెంటనే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేస్తారు. తక్కువలో తక్కువ కనీసం 50 నుం 60 మంది ఆ కార్యక్రమానికి హాజరయ్యేలా చూసుకుంటారు. అక్కడికి వచ్చిన వారంతా బృందాలుగా విడిపోయి నాలుగైదు ప్రదేశాలకు వెళ్లి తమ సంస్థ లక్ష్యాన్ని వివరిస్తారు.మారేందుకు మీరు సిద్ధమా..? సోషల్ మీడియా వేదికగా యునైటెడ్ వెజిటేరియన్స్ ఫోరంలో చేరాలని ఉందా? అయితే అదే పేరుతో ఉన్న ఫేస్బుక్, ఇస్ట్రాగామ్ పేజీల ద్వారా గానీ.. సభ్యులుగా చేరిపోవచ్చు. ఆ మీదట వలంటీర్లుగా సేవలు అందించవచ్చు. ఆ మీదట శాకాహారం గొప్పతనాన్ని తెలుసుకొని మీరు శాకాహార ప్రియులుగా మారిపోవచ్చు. పాఠశాలలే టార్గెట్‌గా.. శాకాహారం వినియోగించాలనే ప్రచారాలను జనం రద్దీ ఉండే అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలను టార్గెట్ చేసుకుని ఎక్కువ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. చదువుకునే వయసు నుంచే జంతువధ చేయకూడన్న లక్ష్యాన్ని విద్యార్థుల్లో ఇనుమడింపజేయడం ద్వారా ఎక్కువ ఫలితాలు రాబట్టవచ్చన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. సదస్సులు, సమావేశాలు నిర్వహించడం, పవర్‌పాయింగ్ ప్రెజెంటేషన్లు ఇవ్వడం, కరపత్రాలు, స్టిక్కర్ల ద్వారా వీలున్న అన్ని మార్గాల్లో ప్రచారాలు కొనసాగించి శాకాహార భోజన ప్రియులను రూపొందిస్తున్నాం. పాఠశాలల్లో యునైటెడ్ వెజిటేరియన్స్ ఫోరం కమిటీలు ఏర్పాటు చేయడం, పోటీలు నిర్వహిస్తూ వారికి బహుమతులు, జ్ఞాపికలు అందజేసి ప్రోత్సహిస్తున్నాం. – ఎన్వీ విజయలక్ష్మి, వ్యవస్థాపకురాలు దేశమంతా ఒకే వేదికగా.. యునైటెడ్ వెజిటేరియన్ ఫోరం అనేది ఒక తెలంగాణకు మాత్రమే కాకుండా.. అన్ని రాష్ట్రాల్లోనూ విస్తరింపజేసి.. వీలైనంత ఎక్కువ మంది జనాభాను శాకాహారం వైపు తిప్పటిమే తమ ధ్యేయమని చెబుతున్నారు విజయలక్షి్మ. ఆ దిశగా విస్తృతంగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు చెప్పారామే. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఉండే తమ వాళ్ళ ద్వారా అవగాహన కార్యక్రమాల ద్వారా అవగాహన కార్యక్రమాలను ఫోకస్ చేస్తున్నారు ఈ వెజిటేరియన్ విజయక్ష్మిఆరోగ్య సూత్రాలు వివరిస్తూఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని పాటించడానికి శాకాహారం పాత్ర ఏంటో యునైటెడ్ వెజిటేరియన్స్ ఫోరం ప్రతినిధులు వివరిస్తారు. ఎదుటివారు మాంసాహార ప్రియులైన వారు అడిగే ప్రశ్నలకి శాకాహార పూరితమైన సమాధానాలు ఇచ్చి వెజిటేరియన్స్‌గా మారాలంటూ రిక్వెస్ట్ చేస్తారు. ఒక నెల రోజులు టైం తీసుకోండి.. పప్పు దినుసుల మీద దృష్టి పెట్టండి ఆకుకూరల్లో బలమైన పోషకాల కోసం మీరే తెలుసుకోండి.. మీరు తీసుకునే మాంసాహారాన్ని మేము చెప్పే శాకాహారాన్ని బేరీజు వేసుకోండి అంటూ జనం మెదడుల్లోకి శాఖాహార గొప్పతనాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చేయడమేంటి చాలామందిని మార్చి చూపించారు కూడా..

Dharmakirti గెలిచేది..నిలిచేది ధర్మమే...సత్యమే!
బౌద్ధమతాన్ని తార్కికంగా వివరించిన ప్రముఖ ఆచార్యుల్లో ధర్మకీర్తి ఒకడు. నలందా విశ్వవిద్యాలయంలో ఆచార్య ధర్మపాలునికి శిష్యుడై విద్యను ఆర్జిం భిక్షువయ్యాడు. దేశమంతా పర్యటించి అనేక చర్చల్లో, సదస్సుల్లో, సమావేశాల్లో పాల్గొన్నాడు. వాదంలో ధర్మ కీర్తిచే ఓడింపబడినవారు తమ ఓటమిని హుందాగా అంగీకరించకపోగా అవమానించడానికి పూనుకున్నారు. ఆయన రంన తాళపత్ర గ్రంథాలను సేకరిం, వాటిని కట్టగా కట్టి, కుక్క తోకకు ముడివేసి ఆ కుక్క పరుగులు తీసేట్టు దాన్ని గట్టి గట్టిగా కేకలు వేశారు. భయంతో ఆ కుక్క విచ్చలవిడిగా అటూ, ఇటూ పరుగులు పెట్టింది. దాని తోకకు కట్టిన ధర్మకీర్తి రచనలున్న తాళ పత్రాలు చిందరవందరై గాలి వీచి అన్ని దిక్కులకు ఎగిరిపోయాయి. ఆ దృశ్యాన్ని చూసి ధర్మ కీర్తి ప్రత్యర్థులు పగలబడి నవ్వుతూ ధర్మకీర్తిని హేళన చేసి, చులకనగా మాట్లాడారు. ఈ దెబ్బకు ఆయన దిగులు పడి కాళ్ళ బేరానికి వస్తాడని వారు ఆశించారు. కానీ ఆయన చాలా ప్రశాంతంగా, ‘ఈనాడు, ఈ నా గ్రంథాలు ఎలాగైతే అన్ని దిక్కులకు ఎగిరిపోతున్నవో, అలాగే ఒక నాటికి నా భావాలు, నా కీర్తి దశ దిశలకు వ్యాపించి తీరుతుంది’ అన్నాడు. అది అక్షరాలా నిజమైంది. ధర్మమే జయించింది. సత్యమే గెలిచింది.టిబెట్‌లో నేటికీ బౌద్ధ భిక్షువులు ధర్మకీర్తి రచనలను పరమ ప్రామాణికమైనవిగా భావించి ఆయనను గౌరవిస్తారు. రాహుల్ సాంకృత్యాయన్ ధర్మకీర్తిని శ్లాఘిస్తూ ‘విమర్శనాత్మకమైన వాదనా పటిమలోనూ, విస్పష్టమైన విశ్లేషణలోనూ, స్పష్టమైన భావుకతలోనూ ఆయనను మించిన వారు లేరు’ అంటారు. ‘న్యాయ బిందు’, ‘హేతుబిందు’ వంటి ఎనిమిది గ్రంథాలు ధర్మకీర్తి కీర్తి ప్రతిష్ఠలను గగనానికి చేర్చాయి.– రాచమడుగు శ్రీనివాసులు

Pahalgam tragedy ఐక్యంగా నిలబడటం మనకు తెలుసు
సిసలైన ఉద్వేగాలు సాటి మనుషులకు అర్థమవుతాయి. ఉద్వేగాలలోని నిజాయితీ ఉద్దేశాలలో ఉండదు. ‘పహల్గామ్’ ఘటన తరువాత ఏర్పడిన ఉద్వేగాలనూ, ఉద్దేశాలనూ కాస్త ముందు వెనుకలుగా వేరు చేసి మనమంతా ఒక్కటిగా శత్రువును ఎదుర్కొందాం అనే సందేశాన్ని ఇవ్వడంలో దేశవాసులు దాదాపు సఫలీకృతమయ్యారనే చెప్పాలి. అయితే అదంత సులువు కాలేదు. ఉద్దేశాలున్నవారు వాట్సప్‌లలో మునివేళ్లను కదిలించినంత వేగంగా ఉద్వేగాలున్నవారు కదిలించలేకపోయారు. అయినప్పటికీ వేగంగా మేలుకొని జవాబు చెప్పడానికి ప్రయత్నించారు. ఇందుకు అల్లాహ్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే.ఏప్రిల్ 22న కశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు మరణించారన్న వార్త వినగానే ముందు మనిషిగా, తర్వాత ముస్లింగా ఎంతో బాధను, ఆందోళనను అనుభవించాను. దేశంలోని కోట్ల ముస్లింలు ఇటువంటి పాశవిక దాడికి తీవ్రంగా నాలాగే బాధ పడ్డారు. మతం అడిగి ఇలాంటి దాడి చేశారన్న వార్త వారిని వేదనలో, విషాదంలో ముంచెత్తింది. ఈ తీవ్ర ఘటన తాలూకు విషాదాన్ని అనుభవించాలా, లేకుంటే తమకు ఏ సంబంధమూ లేకపోయినా జరిగే విద్వేష ప్రచారానికి కలత పడాలా అనే ఆందోళనలో వారు తల్లడిల్లారు. అయితే ఎవరైతే చావు నోటి వరకూ వెళ్లి వచ్చారో వారే ఈ పరిస్థితిని కుదుట పరచగలిగారు. మానవీయత ఉన్న కశ్మీరీలు తమ ప్రాణాలకు వారి ప్రాణాలను ఎలా అడ్డు పెట్టి కాపాడారో చెప్పిన కథనాలు దేశ ప్రజలకూ, ముఖ్యంగా ముస్లింలకూ ఊరటనిచ్చాయి. కశ్మీర్ విషయంలో భారత్–పాకిస్తాన్లల మధ్య చాలాకాలంగా సాగుతున్న వైరం లెక్కలేనంత మందిని బలిదీసుకున్నా గత దాడులన్నీ సైన్యంపై జరిగితే, ఈసారి పర్యాటకులపై హిందూ మతం పేరిట జరిగింది. ఈ దాడి వెనుక ఉగ్రవాదుల ప్రధాన ఉద్దేశం దేశాన్ని సంక్షోభంలోకి నెట్టడం, కశ్మీర్‌ను ప్రపంచ దృష్టికి తీసుకురావడం. ఈ ఉగ్రచర్యకు పాల్పడినవారు, వారికి ఆర్థిక సాయం అందింనవారు, స్పాన్సర్లు... పహల్గామ్ అమాయకుల ప్రాణాలను బలిదీసుకోవడంలో పాత్ర పోషింనవారే. వారందరినీ ఈ దాడికి జవాబుదారీగా చేసి, న్యాయస్థానం ఎదుట నిలబెట్టాలి. మతం అడగడం సిగ్గుచేటుప్రపంచంలోని ఏ మతగ్రంథం కూడా ప్రజలను చంపమని చెప్పలేదు. ఈ ఉగ్రదాడిలో బాధితుడి మతాన్ని అడగడం, అతను హిందువా, ముస్లిమా అని గుర్తించడానికి కల్మా పఠించమనడం సిగ్గుచేటు. శాంతిని కోరే భారతీయ ముస్లింలు ఇలాంటి నీచత్వాన్ని ఏ మాత్రం హర్షించరు. నిజమైన మానవుడంటే ప్రాణాలను కాపాడేవాడే కానీ ప్రాణాలను తీసేవాడు కాదు. ఖురాన్‌లోని సూరహ్ అల్–మాయిదా వచనం 5:32 ‘ఒక అమాయకుడిని చంపేవాడు మొత్తం మానవాళిని చంపినట్లే’ అని చెబుతుంది. ఈ సూర కరుణ, సానుభూతి, బలహీనుల రక్షణను ప్రోత్సహిస్తుంది. తాను ముస్లిం అని చెప్పుకొనే వ్యక్తి ఈ భూమిపై ఏ మానవుడినీ చంపడు.భారతదేశ ప్రజలు కోరుకునేది మత విద్వేషాలు కాదు. భారతదేశం ప్రపంచంలోని అన్ని దేశాల శరణార్థులను స్వీకరించిందే తప్ప, ఈ దేశం నుండి ఏ వ్యక్తిని ఇతర ప్రాంతాలకు శరణార్థిగా పంపలేదు. అదే ఈ దేశానికున్న ఘనత. ఇది గొప్ప ఆధ్యాత్మిక ప్రేమగల దేశం. ప్రపంచంలోని ఇతర దేశాల్లో నివసిస్తున్న ముస్లింలతో పోలిస్తే భారతదేశంలో ముస్లింలకు అత్యున్నత గౌరవం, రక్షణ దొరుకుతున్నాయి. ఉగ్రవాదంపై పోరాటంలో ఇక్కడి ముస్లింల పాత్ర ఇప్పుడు కీలకంగా మారింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏ మతాన్నీ కలవరపెట్టకుండా, ద్వేషించకుండా నిరసనలు, ప్రదర్శనలు నిర్వహించవచ్చు. రాజకీయ నాయకుల ప్రసంగాలు, మీడియా వ్యాఖ్యలను ఒక తటస్థ స్థితికి తేవాలి. సమస్యకు పరిష్కారం వెతకాలి. అన్ని మతాల ఆధ్యాత్మిక నాయకులు, సాధువులు, ముస్లిం, హిందూ మతాధికారులు, అన్ని మత పాఠశాలలు, ఇతర విద్యాసంస్థల అధిపతులు, ఉపాధ్యాయులు ఇందులో భాగం కావాలి. అన్ని మతాలను ప్రేమించడం ద్వారా ప్రజల్లో ఐక్యత, ఉమ్మడి విలువలను తీసుకురావాలి. ప్రభుత్వాన్నో, ఫలానా రాజకీయ పార్టీనో విమర్శించి చేతులు దులుపుకోకుండా ఉగ్రవాదాన్ని బలంగా ఎదుర్కోవడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడమే ఇప్పుడు మన ముందున్న బాధ్యత.చదవండి: అమాయకులను పొట్టనబెట్టుకున్నారు: వాళ్ల పాపానికి మేం మూల్యం చెల్లిస్తున్నాం!దేశం ఇలాంటి విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్న సమయంలో మీడియా దేశంలోని భిన్నవర్గాలను బలోపేతం చేయాలి. అంతేకానీ రాజకీయ పార్టీలు, మతాల పేరుతో వర్గాలను విభజించకూడదు. ముస్లింల వల్లే తాము బతికి ఉన్నామని చెప్పిన బాధితుల కుటుంబాల మాటలను మీడియా కూడా ప్లే చేయాలి. దురదృష్టవశాత్తు కొన్ని మీడియా సంస్థలు ఇలా చేయడం లేదు. పౌర హక్కులు, మానవ హక్కుల కార్యకర్తల్లాగే ఇప్పుడు మతస్వేచ్ఛ కార్యకర్తలు అవసరం. మత విద్వేషాన్ని ఆపేందుకు వారి తోడ్పాటు కావాలి. ఇదీ చదవండి: ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్భారత్–పాక్ అణుశక్తిని కలిగి ఉన్న దేశాలు. ఒకసారి యుద్ధం మొదలైందంటే ఇది ఎక్కడ ముగుస్తుందో తెలియదు. అందుకే యుద్ధకాంక్షను ఆపి, శాంతి వైపు చర్చలు జరపాలి. స్నేహపూర్వక దేశాలతో కూర్చుని ఈ సమస్యను పరిష్కరించాలి. యుద్ధమనేది అంతిమ పరిష్కారం. ఉగ్రదాడిలో అమాయకులు తమ ప్రాణాలు కోల్పోయారు. ఆ అమరవీరులకు వందనం చేద్దాం. భారతం చెప్పిందే మన సందేశం. కౌరవులు, పాండవుల మధ్య ఏ ఫిర్యాదులైనా ఉండొచ్చు... బయటి శత్రువుకు మేము నూటా ఐదుగురం అన్నాడు ధర్మరాజు. బయట శత్రువు కన్నెత్తి చూస్తే ఈ దేశంలోని అన్ని మతాల వారు ఐక్యమై సింహాల్లా గర్జించగలరని చాటడమే ఇప్పుడు కావలసింది. జై భారత్. జై హింద్.భారతం చెప్పిందే మన సందేశం. కౌరవులు, పాండవులు మధ్య ఏ ఫిర్యాదులైనా ఉండొచ్చు... బయటి శత్రువుకు మేము నూటా ఐదుగురం అన్నాడు ధర్మరాజు.-జహారా బేగంవ్యాసకర్త సామాజిక కార్యకర్త, యూఎస్ఏ

పాతచీరలను అప్‌సైక్లింగ్ చేసి..స్టైలిష్‌గా మార్చేయండిలా..!
అప్ సైక్లింగ్ వార్డ్రోబ్లను చెక్ చేసుకుంటే కుప్పలుగా ఉన్న చీరలు, దుపట్టాలు కొన్నిచీరలు తమ పెళ్లినాటివి అయి ఉంటాయి. అమ్మ, అమ్మమ్మలు ఇచ్చిన జ్ఞాపకాల చీరలు సరేసరి మరికొన్నింటికి బ్లౌజ్‌లు పాతవయ్యావని పక్కన పడేసినవి కొన్ని... ఓల్డ్మోడల్ అయ్యాయని కొన్నిపక్కన పెట్టేసినవి ఉంటాయి.ఇలాంటి వాటన్నింటినీ ఈ సమ్మర్ రోజుల్లో కొత్తగా రూపు కట్టేలా ప్లాన్ చేయవచ్చు. మారుతున్న ఫ్యాషన్ ట్రెండ్లను గమనిస్తూ కాలానుగుణంగా పాతచీరలను అప్‌సైక్లింగ్ చేసి, మీదైన కొత్తశైలిని వ్యక్తీకరించవచ్చు.అప్‌సైక్లింగ్ విధానం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా, పర్యావరణ అనుకూలతకు ప్రాధాన్యం ఇచ్చినవారం అవుతాం. వృధానూ అరికట్టవచ్చు.అంచులను మార్చి...అంచు ఉన్న కాటన్, పట్టుచీరలతో చేసిన ఇండోవెస్ట్రన్ మోడల్ డ్రెస్సులు ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నాయి. షిఫాన్, సిల్క్, కాటన్, ఆర్గంజా, నెటెడ్ చీరల నుండి అనార్కలీలు, లాంగ్ గౌన్లు, కుర్తీలు డిజైన్ చేయించవచ్చు. పట్టు, బ్రొకేడ్, బెనారస్ వంటి వాటితో ఓవర్ కోట్స్, లాంగ్ జాకెట్స్, పలాజోలు, స్కర్ట్లు డిజైన్ చేయవచ్చు.ప్యాచ్ వర్క్పల్లూ, లేదా అంచులు కొద్దిగా చిరిగిన చీరలకు చిరిగిన అంచును తీసివేసి, జరీ, సీక్వెన్స్, కుందన్ వర్క్ చేసిన ప్యాచ్‌వర్క్ అంచును జత చేసి, తిరిగి వాడచ్చు. పాతకాలం నాటి చీరలను సల్వార్ సూట్లుగా మార్చవచ్చు. చీర పల్లూని పైభాగానికి ఉపయోగించవచ్చు. అంచులను నెక్కి, చేతులకు వాడచ్చు. కాంట్రాస్ట్ ప్యాచ్‌వర్క్ బోర్డర్లనూ జత చేయవచ్చు. బాటమ్, దుపట్టా కోసం మరొక పాత చీరను ఉపయోగించవచ్చు.లాంగ్ గౌన్లువన్పీస్ లాంగ్గౌన్లు ఎప్పుడూ ట్రెండ్‌లోనే ఉంటున్నాయి. అందుకని, పాతచీరను ఉపయోగించి లాంగ్ గౌన్‌ను తయారు చేయించుకోవచ్చు. అదనపు మెటీరియల్‌కి కాంట్రాస్ట్ కలర్ లేదా మ్యాచింగ్ ఫ్యాబ్రిక్‌ను వాడచ్చు. చీరలను ఉపయోగించిన డ్రెస్సులనే కాదు, కటింగ్‌లో వృథాగా పడేసే ఫ్యాబ్రిక్‌తో ఫ్యాషన్ జ్యువెలరీనీ రూపొందించవచ్చు. ఇది ఇండోవెస్ట్రన్ వేర్కి ముఖ్యంగా వేసవిలో మరింత ఆధునిక అట్రాక్షన్‌ను అద్దుతుంది. (చదవండి: పేరెంట్స్ 'నో' చెప్పడం నేర్చుకోవాలి..! హెచ్చరిస్తున్న నిపుణులు)
ఫొటోలు


వేవ్స్ సమ్మిట్ లో శోభిత.. ఎంత అందంగా ఉందో? (ఫొటోలు)


దిల్ రాజు కూతురి 10వ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)


పూర్ణ కుమారుడి సెకండ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)


శిఖర్ ధావన్‌తో ప్రేమలో ఐరిష్ బ్యూటీ.. ఈమె గురించి తెలుసా? (ఫొటోలు)


స్టెప్పులేస్తే ఆ సంతోషమే వేరంటున్న నిక్కీ గల్రానీ (ఫోటోలు)


'మ్యాడ్ స్క్వేర్' స్వాతిరెడ్డికి పెళ్లయిపోయిందా? భర్త ఇతడే (ఫొటోలు)


న్యూయార్క్ వీధుల్లో హీరో రానా దంపతులు (ఫోటోలు)


సమ్మర్లో చిల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ (ఫోటోలు)


ఏప్రిల్ నెల స్వీట్ మెమొరీస్ అంటూ ఫోటోలు షేర్ చేసిన 'అల్లు స్నేహ'


RR vs MI: ముంబై ‘సిక్సర్’ రాజస్తాన్ ‘అవుట్’ మ్యాచ్ హైలైట్స్ (ఫోటోలు)
అంతర్జాతీయం

దూసుకొస్తున్న కాస్మోస్ 482
సోవియట్ యూనియన్ ఎప్పుడో అర్ధ శతాబ్దం క్రితం ప్రయోగించిన అంతరిక్ష నౌక ‘కాస్మోస్ 482’ త్వరలో భూమిపై కూలబోతోంది. మే నెల 8-11 తేదీల మధ్య అది భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. శుక్ర గ్రహాన్ని పరిశోధించడానికి 1972 మార్చి 31న సోవియట్ ఈ అంతరిక్ష నౌకను ప్రయోగించింది. వాస్తవానికి ‘కాస్మోస్ 482’ ఓ లాండింగ్ మాడ్యూల్. 495 కిలోల ల్యాండరును శుక్రగ్రహంపై దింపడం ఈ మిషన్ ఉద్దేశం. సాంకేతిక లోపం తలెత్తి ప్రయోగం విఫలమవడంతో ‘కాస్మోస్ 482’ స్పేస్ క్రాఫ్ట్ ముందుకు ప్రయాణించడానికి అవకాశం లేక భూకక్ష్యలోనే ఇరుక్కుపోయింది. గత 53 సంవత్సరాలుగా అది భూమి కక్ష్యలోనే పరిభ్రమిస్తోంది. ఇప్పుడు కూలే సమయం ఆసన్నమవడంతో శాస్త్రవేత్తలు దాని ఆర్బిటల్ ఎత్తును నిరంతరాయంగా గమనిస్తున్నారు. అంతరిక్ష నౌక కచ్చితంగా ఏ తేదీన భూమిపై కూలుతుందో త్వరలో తెలుస్తుంది. మే 8-11 తేదీల్లో ‘కాస్మోస్ 482’ భూమిపై కూలవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నప్పటికీ... ‘సూర్యుడి క్రియాశీలత’ ప్రభావంతో సదరు తేదీలకు కాస్త ముందుగా గానీ, లేదా ఆ తర్వాత గానీ నౌక కూలే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే సూర్యుడి క్రియాశీలత అధికంగా ఉంటే భూమి ఎగువ వాతావరణం త్వరగా వేడెక్కి వ్యాకోచిస్తుంది. ఫలితంగా దిగువ కక్ష్యలో పరిభ్రమించే వస్తువులను భూ వాతావరణం త్వరితగతిన లాక్కుంటుంది. అంటే ‘కాస్మోస్ 482’ అంతరిక్ష నౌక మనం అనుకున్న సమయం కంటే ముందుగానే కూలిపోవచ్చు. 52 డిగ్రీల ఉత్తర, దక్షిణ అక్షాంశాల్లో కూలవచ్చు!భూ వాతావరణంలోకి అనియంత్రిత ప్రవేశం’ కనుక ‘కాస్మోస్ 482’ స్పేస్ క్రాఫ్ట్ భూమిపై ఏ ప్రాంతంలో కూలిపోతుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. కానీ ప్రస్తుతం నౌక కక్ష్యను పరిశీలిస్తే భూమిపై 52 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 52 డిగ్రీల దక్షిణ అక్షాంశం మధ్య గల సువిశాల ప్రదేశంలో... అంటే ఉత్తరాన బ్రిటన్ మొదలుకొని దక్షిణాన న్యూజిలాండ్ దాకా ఎక్కడైనా అది కూలవచ్చు. భూమిపై జలావరణమే అధికం కనుక నౌక నేలపై కాకుండా సముద్రాల్లో కూలిపోయే అవకాశాలే ఎక్కువ. సముద్ర ప్రదేశాలు కాకుండా భూభాగంపై లేదా జనావాస ప్రాంతాలపై అది కూలిపోయే అవకాశాలు స్వల్పమే అయినప్పటికీ ఓ అంశం శాస్త్రవేత్తలను కొంచెం కలవరపెడుతోంది. ‘కాస్మోస్ 482’కు ఓ విశిష్టత ఉంది. అది ‘వెనెరా’ మిషన్ ల్యాండర్ల తరహా అంతరిక్ష నౌక. శుక్ర గ్రహంపై దిగేటప్పుడు అక్కడి కఠినాతి కఠినమైన అత్యధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర పీడనాన్ని తట్టుకునేలా ‘కాస్మోస్ 482’ను రూపొందించారు. సాధారణంగా ఖగోళ వస్తువులు భూవాతావరణంలోకి ప్రవేశించాక గాలి ఒరిపిడికి మండిపోయి చిన్న శకలాలుగా రాలిపోతాయి. వాటిలోని పెద్ద, బరువైన భాగాలు మాత్రమే భూమిని తాకుతాయి. డిజైన్ ప్రత్యేకత దృష్ట్యా ‘కాస్మోస్ 482’ మాత్రం భూ వాతావరణంలోకి ప్రవేశించినా ధ్వంసం అవదు. సముద్రాల్లో కాకుండా అది భూభాగంపై కూలిపోవడమంటూ సంభవిస్తే... ఏమాత్రం చెక్కు చెదరకుండా 495 కిలోల ‘కాస్మోస్ 482’ ధడేల్మని ‘ఒకే ముక్క’గా నేల రాలుతుంది! అలా చిన్న ఉల్క మాదిరి ప్రభావం చూపుతుంది. శాస్త్రవేత్తలకు ఆందోళన కలిగిస్తున్న అంశం ఇదే. - జమ్ముల శ్రీకాంత్

పాక్‌కు భారత్ సీరియస్ వార్నింగ్
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి (Terrorist attack) నేపథ్యంలో భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆ దాడి తర్వాత నియంత్రణ రేఖ వెంట పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఈ క్రమంలో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్, భారత్‌కు చెందిన మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్స్ హాట్లైన్లో మాట్లాడుకున్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ సైన్యం కాల్పులకు పాల్పడుతున్న విషయాన్ని ప్రస్తావించిన భారత్.. దాయాది దేశాన్ని హెచ్చరించినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. ఏయే రోజు ఎక్కడెక్కడ పాక్ కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడిందో వివరించిన భారత సైనిక అధికారులు.. ఇకపై కొనసాగిస్తే చర్యలు తప్పవని.. దీటుగా బదులిస్తామని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు.. యుద్ధ వాతావరణం నెలకొనడంతో సరిహద్దు ప్రజలు అప్రమత్తమవుతున్నారు. ఇదే సమయంలో పాకిస్థాన్ (Pakistan) కూడా భద్రతాపరంగా పలు చర్యలు తీసుకుంటోంది. తాజాగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిత్, స్కర్దు తదితర ప్రాంతాలకు విమాన సర్వీసులను పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA) రద్దు చేసింది. సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాకిస్థాన్ కూడా గగనతలాన్ని నిఘాను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే లాహోర్, కరాచీ నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లోని స్కర్దు, గిల్గిత్‌కు నడిచే విమాన సర్వీసులను పీఐఏ నిలిపివేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

చిగురిస్తున్న ఇండో-కెనడా స్నేహం
భారత్-కెనడా మధ్య సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ స్నేహం కొత్త చివుళ్లు వేస్తోందా? ఏడాదిన్నర కాలానికి పైగా గాడి తప్పిన భారత్, కెనడా దౌత్య సంబంధాలు పట్టాలెక్కబోతున్నాయా... అంటే అవుననే చెప్పాలి. కెనడా సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన లిబరల్ పార్టీ నేత, ఆ దేశ ప్రస్తుత తాత్కాలిక ప్రధాని, కాబోయే పూర్తికాలపు ప్రధాని మార్క్ కార్నీకి భారత్ ప్రధాని మోదీ పంపిన అభినందన సందేశానికి సంకేతం అదే. మార్క్ కార్నీకి ముందు కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో ఉన్నప్పుడు గత అక్టోబరులో రెండు దేశాలూ పరస్పరం హై కమిషనర్లను బహిష్కరించాయి. ఈ ఏడాది జూన్ మాసానికల్లా హై కమిషనర్ల వ్యవస్థను పునరుద్ధరించాలని ఉభయ దేశాలు తలపోస్తున్నాయి. ప్రస్తుతం ‘స్పెయిన్’లో భారత రాయబారిగా వ్యవహరిస్తున్న దినేష్ కుమార్ పట్నాయక్ ను కెనడాలో తదుపరి హై కమిషనరుగా భారత్ నియమించే అవకాశముందని, ఇందుకు సంబంధించిన ప్రక్రియ త్వరలో ఆరంభమవనుందని తెలుస్తోంది. కెనడా ఎన్నికల ఓట్ల లెక్కింపు దాదాపు పూర్తయింది. 343 స్థానాలున్న పార్లమెంటు దిగువ సభలో లిబరల్ పార్టీ 168 సీట్లు, కన్జర్వేటివ్ పార్టీ 144 సీట్లు గెలుచుకున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తి మెజారిటీ రావాలంటే లిబరల్ పార్టీ 172 సీట్లు గెలవాలి. కానీ ఆ మేజిక్ నంబరుకు కొద్ది దూరంలో అది ఆగిపోయింది. చిన్న పార్టీల సహకారంతో లిబరల్ పార్టీ మైనారిటీ సర్కారు ఏర్పాటు చేసే అవకాశముంది. ఖలిస్థాన్ వేర్పాటువాద నేత హరదీప్ సింగ్ నిజ్జర్ 2023లో కెనడాలో హత్యకు గురయ్యాడు. భారత ప్రభుత్వ ఏజెంట్లే అతడిని హతమార్చారని కెనడా ఆరోపించడంతో ఆ దేశంతో భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయి. తదనంతర పరిణామాల్లో కెనడాలో భారత హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మను కెనడా వెళ్లగొట్టడం, ప్రతిగా కెనడా దౌత్యవేత్తలను ఇండియా బహిష్కరించడం చకచకా జరిగిపోయాయి. దరిమిలా చాలినంత మంది దౌత్యవేత్తలు లేక కెనడా కాన్సులేట్లు మూతపడ్డాయి. నాటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పదవి నుంచి దిగిపోయారు. మరోవైపు కెనడా ఎన్నికల్లో ఖలిస్థాన్ సానుకూల నేత, న్యూ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడు జగ్మీత్ సింగ్ కూడా ఓటమి పాలయ్యాడు. ఈ రెండు పరిణామాలు ఇండో-కెనడా బంధం మళ్లీ మొగ్గ తొడిగేందుకు పరిస్థితులను అనుకూలంగా మార్చాయి. ట్రూడోలా కాకుండా మార్క్ కార్నీ మరింత పరిణతితో వ్యవహరిస్తారని భారత్ అభిప్రాయపడుతోంది. - జమ్ముల శ్రీకాంత్

Bangladesh: చిన్మయ్ కృష్ణదాస్‌కు ఊరట
ఢాకా: ఇస్కాన్ మాజీ ప్రతినిధి, బంగ్లాదేశ్‌లో మైనారిటీ హక్కుల సాధన ఉద్యమకారుడు చిన్మయ్ కృష్ణదాస్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. బంగ్లాదేశ్ హైకోర్టు బుధవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రాజద్రోహం కేసులో కిందటి ఏడాది నవంబర్‌లో ఆయన్ని బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ ప్రచారకర్తగా పనిచేస్తున్న చిన్మయ్ కృష్ణదాస్ గతేడాది నవంబరులో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. అక్కడ బంగ్లా జాతీయజెండాను అగౌరవపరిచారనే అభియోగాలపై 2024 నవంబరు 25న ఢాకా హజారత్ షాహ్జలాల్ ఎయిర్‌పోర్టులో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అనంతరం జైలుకు తరలించారు. ఆయన తరఫున వాదనలు వినిపించేందుకు న్యాయవాదులను సైతం అక్కడి ఆందోళనకారులు అనుమతించలేదు. చివరకు చిన్మయ్ భాగస్వామిగా ఉన్న బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతన జాగరణ్ జోతే అనే సంస్థ.. 11 మందితో లాయర్ల బృందాన్ని ఏర్పాటుచేసింది. అయినా కూడా ఆయనకు బెయిల్ దక్కలేదు. మరోవైపు భారత్ సహా అంతర్జాతీయ సమాజం చిన్మయ్ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించింది. శాంతియుతంగా నిరసన తెలిపే మైనారిటీల హక్కులను కాలరాయడం సరికాదంటూ భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. చిన్మయ్ కృష్ణదాస్ స్వస్థలం చిట్టాగాంగ్‌లోని సట్కానియా ఉపజిల. 2016-2022 మధ్య ఇస్కాన్ చిట్టాగాంగ్ డివిజనల్ సెక్రటరీగా దాస్ పని చేశారు. ఆపై హిందూ మైనారిటీల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పడిన బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతన జాగరణ్ జోతే తరఫున ప్రతినిధిగా దాస్ పని చేశారు. సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఆయనకంటూ అక్కడ ఓ పేరుంది. బంగ్లా మీడియా ఆయన్ని శిశు బోక్తాగా అభివర్ణిస్తుంటుంది. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో పాటు మైనారిటీ ప్రోటెక్షన్ లా తేవడంంలోనూ దాస్ కృషి ఎంతో ఉంది. కిందటి ఏడాది.. అక్టోబర్ 25న చిట్టాగాంగ్‌లో, నవంబర్ 22వ తేదీన రంగ్‌పూర్‌లో ఆయన నిర్వహించిన ర్యాలీలు దేశవ్యాప్త చర్చకు దారి తీశాయి. చిట్టాగాంగ్‌లో నిర్వహించిన ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాకు పైన కాషాయ జెండాను ఎగరేయడంతోనే ఆయనపై రాజద్రోహం కేసు నమోదు అయ్యింది.
జాతీయం

కుల గణనపై మాజీ సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: దేశంలో జనాభా లెక్కలతో పాటు కుల గణన చేపట్టాలన్న కేంద్రం నిర్ణయంపై మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్పందించారు. జనగణనలో భాగంగా కుల గణన చేయడం చారిత్రక అవసరం అని ఎన్వీ రమణ అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే, జనగణనలో ప్రతి సామాజిక సూచికను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.తాజాగా మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘కులం, కులం ఆధారిత వివక్ష ఒక కఠినమైన వాస్తవం. చాలా కాలం పాటు మనం ఈ వాస్తవాన్ని అంగీకరించకుండా విస్మరించడానికే ప్రాధాన్యం ఇచ్చాం. ఇప్పుడు మనం చైతన్యంతో ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైంది. కుల గణన నిర్ణయం తీసుకున్న భారత ప్రభుత్వానికీ హృదయపూర్వక అభినందనలు. కులాన్ని ఒక గుర్తింపుగా తీసుకుని జనగణన (Census)లో భాగం కుల గణన నిర్వహించడం సరైన నిర్ణయం.ప్రామాణికమైన డేటాను సేకరించకపోతే సమగ్ర కోణంలో అభివృద్ధి కార్యాచరణను రూపొందించడం సాధ్యపడదు. కుల గణనతో మన సమాజంలోని అన్ని వర్గాలకు అధికారంలో, ఆర్థిక అభివృద్ధిలోను వారికి రావాల్సిన వాటా లభించేలా చేయడంలో తోడ్పడుతుంది. సామాజిక, ఆర్థిక, ఇతరత్రా అసమానతలను తగ్గించడంలో కూడా కుల గణన ఎంతో దోహదపడుతుంది. జనగణనలో ప్రతి సామాజిక సూచికను కూడా పరిగణనలోకి తీసుకోవాలి అని అన్నారు.

హారతి ఇస్తుండగా మంటలు అంటుకుని.. కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్ మృతి
జైపూర్: కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్ కన్నుమూశారు. ఈ ఏడాది మార్చి నెలలో తన ఇంటి పూజగదిలో హారతి ఇస్తుండగా అగ్ని ప్రమాదానికి గురైన గిరిజా వ్యాస్ చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు. The news of the demise of former Union Minister, former Rajasthan Congress President, and senior Congress leader Dr. Girija Vyas ji is deeply saddening.A distinguished intellectual, powerful orator, and capable administrator, she served the nation and the Congress Party with… pic.twitter.com/2fJN88nva7— B M Sandeep (@BMSandeepAICC) May 2, 2025సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ కేంద్రమంత్రి గిరిజా వ్యాస్ (Girija Vyas) మార్చి 31న అగ్ని ప్రమాదంలో పడ్డారు. రాజస్థాన్ రాష్ట్రం ఉదయపూర్‌లోని తన నివాసంలో పూజ చేసే సమయంలో హారతి (harathi) ఇచ్చే సమయంలో ఆమెకు మంటలు అంటుకున్నాయి. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్స నిమిత్తం ఉదయపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పలు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. మెరుగైన వైద్యం కోసం ఆమెను 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహ్మదాబాద్‌కు తరలించాలని సూచించారు. ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంపై గిరిజా వ్యాస్ సోదరుడు గోపాల్ శర్మ స్పందించారు. గిరిజా వ్యాస్ ఇంట్లో హారతి ఇచ్చే సమయంలో ప్రమాదవ శాత్తూ కింద నుంచి మంటలు ఆమె దుప్పటాకు అంటుకున్నాయి. వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. తాజాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గిరిజా వ్యాస్ కన్నుమూశారు. ఆమె మరణంపై పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. 👉 ప్రముఖ కాంగ్రెస్ నేత గిరిజా వ్యాస్ గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో కీలక పదవులు నిర్వహించారు.1985 నుండి 1990 వరకు ఎమ్మెల్యేగా, రాజస్థాన్ పర్యాటక మంత్రిగా పనిచేశారు1991లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. 1996, 1999లో ఉదయపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి, 2009లో చిత్తోర్‌గఢ్ నుండి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా, అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (NCW) చైర్ పర్సన్‌గా సేవలందించారు.

ఢిల్లీలో వర్ష బీభత్సం.. తల్లి, ముగ్గురు పిల్లలు మృతి
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం సృష్టించిన వర్షం బీభత్సంలో కుటుంబంలో నలుగురు మృతి చెందారు. వర్ష కారణంగా ద్వారాకాలో ఓ ఇంటిపై చెల్లి కూలింది. ఈ దుర్ఘటనలో తల్లి, ఆమె ముగ్గురు పిల్లలు మరణించారు. శుక్రవారం తెల్లవారు జామున ఢిల్లీ వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు చోటు చేసుకున్నాయి. దుమ్ముతో పాటు భారీ వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. వర్షం కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాతావరణ శాఖ సైతం ఢిల్లీలో రెడ్ జోన్ ప్రకటించింది. భారీ వర్షం కారణంగా ఏర్పడిన ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వర్షం దెబ్బకు విమానాల సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు ఆయా విమానయాన సంస్థలు అధికారికంగా ప్రకటించాయి. Severe thunderstorms and rain lash Delhi and NCR.IMD forecasts heavy rainfall, thunderstorms, and gusty winds for the next two days, issuing a yellow alert for the national capital.#Rain #IMD #DelhiRains #rainfall #thunderstorms #Weather pic.twitter.com/fiZb2DPJJS— All India Radio News (@airnewsalerts) May 2, 2025 ఎయిర్ పోర్టుకు వెళ్లే ముందు ప్రయాణికులు తమ విమానాల రాకపోకల్ని పరిశీలించాలని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రయాణికుల్ని కోరింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది #TravelAdvisoryThunderstorms and gusty winds have affected flight operations in parts of Northern India. Some of our flights to and from Delhi are being delayed, which is likely to impact our overall flight schedule. We are doing our best to minimise disruptions.We advise our…— Air India (@airindia) May 2, 2025‘ఢిల్లీకి వెళ్లే, బయల్దేరే ఎయిరిండియా విమానాల సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలో దుమ్ము తుఫాను, వర్షం కారణంగా విమానాల్ని దారి మళ్లిస్తున్నాం. ఫలితంగా మొత్తం విమానాల రాకపోకలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. అంతరాయాలను తగ్గించడానికి మా వంతు మేం కృషి చేస్తున్నాం’ అంటూ ఎయిరిండియా ట్వీట్లో పేర్కొంది.

పెళ్లి నగలు స్త్రీ ధనమే
తిరువనంతపురం: పెళ్లి సమయంలో వధువుకు బహుమతిగా ఇచ్చే బంగారు నగలు, నగదుపై హక్కెవరిదనే అంశంపై కేరళ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వాటిని స్త్రీ ధనంగా పరిగణించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అవి పూర్తిగా ఆ మహిళకే చెందుతాయని, చట్టబద్ధమైన పూర్తి హక్కులు ఆమెకే ఉంటాయని జస్టిస్ దివాన్ రామచంద్రన్, జస్టిస్ ఎంబీ స్నేహలతల ధర్మాసనం తెలిపింది. విడాకుల తర్వాత పెళ్లినాటి బంగారు నగలపై మహిళకు ఎలాంటి హక్కులేదంటూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎర్నాకులంలోని కలమసెర్రికి చెందిన మహిళ వేసిన పిటిషన్‌పై ఈ మేరకు తీర్పు వెలువరించింది.దురదృష్టవశాత్తూ భర్త, అత్తింటి వారు అలాంటి విలువైన ఆస్తులను బలవంతంగా స్వాధీనం చేసుకున్న అనేక సందర్భాలున్నాయని కూడా ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అనధికారికంగా చేతులు మారే ఇటువంటి ప్రైవేటు ఆస్తులపై తమకు హక్కుందని ప్రకటించుకునేందుకు అవసరమైన పత్రాలు మహిళల వద్ద ఉండవని, ఇలాంటి సందర్భాల్లో కోర్టులు విచక్షణను ఉపయోగించాల్సి ఉంటుందని తెలిపింది. 2010లో వివాహం సమయంలో పుట్టింటి వారు తమకు 63 సవర్ల బంగారంతోపాటు, రెండు సవర్ల గొలుసును, బంధువుల నుంచి అదనంగా మరో 6 సవర్ల ఆభరణాలు బహుమతిగా వచ్చాయని పిటిషనర్ తెలిపారు.వీటిలో మంగళసూత్రం, ఒక బంగారు గాజు, రెండు రింగులను మాత్రమే తనవద్ద ఉంచి మిగతా అన్నిటినీ భద్రత కోసమంటూ అత్తింటి వారు తీసుకున్నారని తెలిపారు. అదనంగా మరో రూ.5 లక్షలు డిమాండ్ చేయడంతో పుట్టింటికి వెళ్లగొట్టారని తెలిపారు. భర్త తన నగలను బ్యాంకులో ఉంచినట్లు తెలిపే పత్రాలను ఆమె కోర్టుముందుంచారు. పరిశీలించిన ధర్మాసనం 59.5 సవర్ల బంగారాన్ని లేదా మార్కెట్ విలువ ప్రకారం డబ్బు ఇవ్వాలని భర్తను ఆదేశించింది. బంధువులిచ్చిన నగలు, ఇతర విలువైన వస్తువులను కూడా ఇప్పించాలంటూ పిటిషనర్ చేసిన వినతిపై ధర్మాసనం.. తగు ఆధారాలు లేనందున తామేమీ చేయలేమని తెలిపింది.
ఎన్ఆర్ఐ

డల్లాస్‌లో నిరాశ్రయుల ఆశ్రయ గృహంలో పేదలకు ఆహారం
తెలంగాణా పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (Telangana Peoples Association of Dallas) మరో సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో 'ఫుడ్ డ్రైవ్'తో అన్నార్తుల ఆకలి తీర్చింది. Austin Street Homeless Shelter లో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఒక రోజంతా సాగిన ఈ కార్యక్రమంలో TPAD సభ్యులు స్వయంగా పాస్తా, చికెన్, మాష్డ్ పొటాటో తదితర వంటకాలు తయారు చేసి.. అన్నార్తులకు వడ్డించారు. 450 మందికి పైగా నిరాశ్రయుల ఆకలి తీర్చారు. అనురాధ మేకల (ప్రెసిడెంట్), రావు కల్వల (FC చైర్), పాండు పాల్వే (BOT చైర్), రమణ లష్కర్ (కోఆర్డినేటర్), దీపికా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఫుడ్ డ్రైవ్‌లో 450 మందికి పైగా నిరాశ్రయులకు ఆహారం వడ్డించామని, టీప్యాడ్ చెందిన 50 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు తెలియజేశారు. టీప్యాడ్ సీనియర్ నాయకుడు రఘువీర్ బండారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. (మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Texas: మృత్యువుతో పోరాడి ఓడిన దీప్తి
ఆస్టిన్: అమెరికా టెక్సాస్‌లో తెలుగు విద్యార్థిని హిట్ అండ్ రన్ కేసు విషాదాంతంగా ముగిసింది. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వంగవోలు దీప్తి(Deepthi Vangavolu)కన్నుమూశారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు ఇచ్చిన సమాచారం ద్వారా కుటుంబ సభ్యులు ధృవీకరించారు. దీంతో గుంటూరులోని ఆమె స్వస్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీప్తి(23) తండ్రి హనుమంత రావు చిరువ్యాపారి. ఆమె కుటుంబం గుంటూరు(Guntur) రాజేంద్రనగర్ రెండో లైనులో నివాసం ఉంటోంది. టెక్సాస్‌లోని డెంటన్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో ఎంఎస్ చేసేందుకు వెళ్లారు. మరో నెల రోజుల్లో కోర్సు పూర్తి కావాల్సి ఉంది. అయితే ఈలోపు రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆమెను కబళించింది. ఈ నెల 12వ తేదీన స్నేహితురాలైన మేడికొండూరుకు చెందిన స్నిగ్ధతో కలిసి రోడ్డుపై నడచి వెళ్తుండగా వేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. దీప్తి తలకు తీవ్ర గాయమైంది. స్నిగ్ధకు కూడా గాయాలయ్యాయి. దీప్తి స్నేహితురాళ్లు ప్రమాద విషయాన్ని ఆమె తండ్రి హనుమంతరావుకు తెలిపారు. క్రౌడ్ ఫండింగ్(Crowd Funding) ద్వారా ఆమె చికిత్స కోసం ప్రయత్నాలు కొనసాగగా.. మంచి స్పందన లభించింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నెల 15న దీప్తి చికిత్స పొందుతూ కన్నుమూసింది. శనివారం(ఏప్రిల్ 19) నాటికి మృతదేహం గుంటూరుకు వచ్చే అవకాశం ఉంది. మరో బాధితురాలు స్నిగ్ధ ప్రస్తుతం అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. అవే ఆమె చివరి మాటలు..దీప్తి మృతి వార్త విని ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసెలా రోదిస్తున్నారు. చదువులో చాలా చురుకైన విద్యార్థిని అని, అందుకే పొలం అమ్మి మరీ అమెరికాకు పంపించామని చెప్పారు. నెల రోజుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి కావాల్సి ఉందని, ఆ టైంకి మమ్మల్ని అమెరికాకు రావాలని ఆమె కోరిందని, అందుకు ఏర్పాట్లలో ఉండగానే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 10వ తేదీన దీప్తి చివరిసారిగా తమతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. కాలేజీకి టైం అవుతోందని.. ఆదివారం మాట్లాడతానని చెప్పి హడావిడిగా ఫోన్ పెట్టేసిందని.. అవే తమ బిడ్డ మాట్లాడిన చివరి మాటలని గుర్తు చేసుకుని బోరున విలపించారు.

దుబాయి హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
ఇటీవల దుబాయిలో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ యువకుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇవ్వాలని జపాన్ పర్యటన నుంచి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పోరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టపు ప్రేమ్ సాగర్‌తో పాటు, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట కు చెందిన స్వర్గం శ్రీనివాస్ లు దుబాయి లో హత్యకు గురైన విషయం తెలిసిందే. దుబాయి నుంచి మృత దేహాలను త్వరగా స్వదేశానికి తెప్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం అధికారుల్ని ఆదేశించినట్లు అనిల్ తెలిపారు.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దుబాయి లోని భారత రాయబార కార్యాలయానికి, ఢిల్లీ లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖలు రాసినట్లు వెల్లడించారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:ఎన్నారై అడ్వయిజరీ కమిటీ చైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్ బృందం, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి లు మృతుల కుటుంబాలను పరామర్శించారు.

రాయలసీమ ప్రగతికి డాలస్‌లో జీఆర్ఏడీఏ అడుగులు
గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఏరియా (GRADA) ఆధ్వర్యంలో ఏప్రిల్ 13న ఫ్రిస్కో, టెక్సాస్‌లో రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం జరిగింది. రాయలసీమ సమస్యలు, అభివృద్ధి అవకాశాలు, తెలుగు భాషా సాహిత్యాల ప్రాముఖ్యతపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి రాయలసీమకు చెందిన రచయిత భూమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగంలో రాయలసీమ ప్రస్తుత పరిస్థితి, ముఖ్యంగా దీర్ఘకాలంగా వేధిస్తున్న నీటి సమస్యలు, వెనుకబాటుతనం గురించి ఎంతో ఆవేదనతో, స్పష్టంగా వివరించారు.మన ప్రాంత సహజ సంపద అయిన శేషాచలం అడవుల గురించి, ముఖ్యంగా ఎర్రచందనం చెట్ల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ విలువైన సంపదను అక్రమ మార్గాల్లో ఇతర దేశాలకు తరలించి లాభం పొందకుండా, స్థానికంగానే వాటి ఆధారిత పరిశ్రమలను స్థాపించి, ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా మన ప్రాంతాన్ని ఎలా ఆర్ధికంగా బలోపేతం చేయవచ్చో ఆయన చక్కగా వివరించారు. ఆయన మాటలు మనందరిలో కొత్త ఆలోచనలను రేకెత్తించాయి. సహజ వనరులను సక్రమంగా వినియోగించుకుంటే రాయలసీమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే ఆశాభావాన్ని ఆయన కలిగించారు.మరో గౌరవ అతిథిగా కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ఛాన్సలర్, ప్రఖ్యాత విద్యావేత్త ప్రొఫెసర్ పి. కుసుమ కుమారి హాజరయ్యారు. ఆమె తన ప్రసంగంలో తెలుగు భాష మాధుర్యం, సాహిత్యం గొప్పదనం, పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. నంద కోర్వి, అనిత నాగిరెడ్డి, సతీష్ సీరం, బ్రహ్మ చిరా, హరినాథ్ పొగకు, హేమంత్ కాకుట్ల, జగదీశ్వర నందిమండలం, జగదీష్ తుపాకుల, పవన్ పల్లంరెడ్డి, ప్రసాద్ నాగారపు, రాజు కంచం, శివ అద్దేపల్లి, శివ వల్లూరు, శ్రీధర్ బొమ్ము, శ్రీకాంత్ దొంత, సురేష్ మోపూరు, ఉమా గొర్రెపాటి, మరియు కార్తీక్ మేడపాటి ఈ సమావేశానికి హాజరయ్యారు.
క్రైమ్

పెళ్లికి ముందే చెప్పా.. నాకు లవర్ ఉన్నాడని..
విజయపుర(కర్ణాటక): వధువు మెడలో వరుడు తాళి కట్టే క్షణాల కోసం అందరూ ఎదురు చూస్తుండగా వరుడు మంటపం నుంచి లేచి పూలదండను విసిరేసి పెళ్లిని ఆపేశాడు. ఈ ఘటన చెన్నరాయపట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని దేవనహళ్లి తాలూకా బాలెపురలోని కల్యాణ మంటపంలో జరిగింది. యువతి మీద అనుమానంతో చివరి క్షణంలో వరుడు పెళ్లికి నిరాకరించాడు. వేణు అనే యువకుడు తన వివాహాన్ని రద్దు చేసుకున్నాడు. గతంలో సదరు వధువు వేరే యువకుడితో ప్రేమాయాణం నడిపిందని ఆరోపించాడు. అయితే పెళ్లికి ముందే అన్ని విషయాలు వరుడికి చెప్పానని వధువు తెలిపింది. అప్పుడు అన్నింటికి సరేనని, రాత్రి రిసెప్షన్ కూడా చేసుకుని, సరిగ్గా మంటపానికి వచ్చేసరికి పెళ్లికి వరుడు నిరాకరించాడని వధువు కన్నీటి పర్యంతమయింది. దీంతో వధువరులు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తమ వధువుకు న్యాయం చేయాలని ఆమె తరపు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

భూమికపై విచక్షణా రహితంగా దాడి చేసిన భర్త
గుడివాడరూరల్: అనుమానం పెనుభూతమై భార్యపై కత్తితో భర్త విచక్షణా రహితంగా దాడి చేసిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన మట్టా అశోక్, భూమికలకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న అశోక్ చెడు అలవాట్లకు బానిసై తరచూ అనుమానంతో భార్యను వేధిస్తుండేవాడు. ఇటీవల జరిగిన గొడవతో భార్య భూమిక పిల్లలను తీసుకుని సమీపంలో నివాసముంటున్న తల్లి రాణి ఇంటికి వెళ్లింది. ఈక్రమంలో మంగళవారం తన బట్టలు తీసుకునేందుకు చెల్లి అనుష్కతో కలిసి భర్త అశోక్ ఇంటికి వెళ్లిన భూమికపై భర్త కత్తితో విచక్షణా రహితంగా మొఖంపై దాడి చేసి పొట్టలో పొడిచాడు. అడ్డుకోబోయిన చెల్లిపై కూడా దాడి చేయడంతో ఆమె చేతికి తీవ్ర గాయమైంది. అనంతరం అశోక్ పరారయ్యాడు. గాయపడిన వారు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి వారిని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు. భూమిక పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య సేవల నిమిత్తం విజయవాడ తరలించారు. బాధితురాలి తల్లి రాణి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్పీ వి.దీరజ్ వినీల్, స్థానిక పోలీస్ అధికారులతో కలిసి గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వచ్చి ఘటనపై ఆరా తీశారు. అనంతరం ఇందిరానగర్ కాలనీలోని సంఘటనా స్థలానికి డీఎస్పీ వెళ్లి పరిశీలించారు.

అరెస్ట్ చేసిన బాలుడు ఎక్కడ?
హైదరాబాద్: ఎలాంటి తప్పు చేయని తన కుమారుడిని పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి అక్రమంగా నిర్బంధించారని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ మహిళ రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌కు బుధవారం ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కమిషన్..పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశిస్తూ మే 5వ తేదీకి వాయిదా వేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఏప్రిల్ 28న మహబూబ్‌నగర్ జిల్లా కడ్తాల్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసులు తన కమారుడు మేకల కళ్యాణ్‌పై ఎలాంటి కేసు నమోదు చేయకుండా, నోటీసులు ఇవ్వకుండా, కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం కూడా ఇవ్వకుండా బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని ఆరోపిస్తూ అలివేలు అనే మహిళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు దాఖలు చేసింది. పోలీసులు అక్రమ కస్టడీకి తీసుకున్న వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి చూడగా అక్కడ తన కుమారుడు కనిపించలేదని పిటిషన్లో పేర్కొన్నారు.తర్వాత మూడు గంటల సమయంలో తన కుమారుడి ఫోన్ నుంచి కాల్ రాగా అతన్ని కోర్టులో హాజరు పరుస్తున్నామని చెప్పిన పోలీసులు కోర్టు ఎదుట కూడా హాజరు పర్చకుండా ఎక్కడికి తీసుకెళ్లారో కూడా సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. దీంతో న్యాయవాది అమర్నాథ్ ఆధ్వర్యంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేస్తూ తనకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కమిషన్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేస్తూ ఈ కేసుపై విచారణ జరిపించి మే 5వ తేదీలోపు పూర్తి నివేదిక అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆ రోజుకు వాయిదా వేసింది.

థాయ్‌లాండ్‌లో హ్యాండ్లర్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు మంగళవారం అరెస్టు చేసిన అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా కేసు దర్యాప్తు ముమ్మరమైంది. ఈ దందాలో కీలక వ్యక్తిగా భావిస్తున్న ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’ థాయ్‌లాండ్‌లో ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. హవాలా నెట్వర్క్ మీద దృష్టి పెట్టిన పోలీసులు సహకరించిన వారి కోసం ఆరా తీస్తున్నారు. తదుపరి విచారణ నిమిత్తం జ్యుడీíÙయల్ రిమాండ్‌లో ఉన్న అభిష్ క్, హర్షవర్థన్, ధావల్, రాహుల్‌లను పోలీసు కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. దీనికి అనుమతి కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఓజీ కుష్ పండించేదీ అతడేనా..? ఓరిజినల్ గ్యాంగ్‌స్టర్, మారువానా, హైడ్రాపోనిక్ గాంజా, ఓజీ కుష్ ఇలా వివిధ పేర్లతో పిలిచే గంజాయితో పాటు మ్యాజిక్ మష్రూమ్స్‌ను ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’ సరఫరా చేస్తున్నాడు. ఈ గంజాయి థాయ్లాండ్లోనే ఎక్కువగా పండుతుంది. జబల్పూర్కు చెందిన హర్షవర్థన్‌కు ఓడల ద్వారా చేరింది కూడా థాయ్‌లాండ్ నుంచే. దీన్నిబట్టి ఈ ఓజీ కుష్‌ను హ్యాండ్లరే పండించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ నుంచి ఈ ఓజీ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు ఎగుమతి అవుతోంది. హైడ్రోఫోనిక్ టెక్నిక్ విధానంలో కృత్రిమ కాంతితో పండిస్తుంటారు. ఆన్లైన్లో విత్తనాలు ఖరీదు చేసి, ఎల్ఈడీ లైట్లను ఉపయోగించి గంజాయి మొక్కలను పెంచుతారు. ఏమాత్రం మట్టితో అవసరం లేకుండా ప్రత్యేకంగా తయారు చేసిన కుండీలు, ట్రేల్లో ఇసుక, కంకర లేదా నీటిలో అదనపు పోషకాలతో ఉపయోగించి సాగు చేస్తుంటారు. కొందరు మాత్రం కొబ్బరి పొట్టు నారలు, గులకరాళ్లు కూడా వాడతారు. నేలమీద పండే గంజాయి కంటే ఈ ఓజీ నాణ్యత ఎక్కువగా ఉంటుందని చెప్తుంటారు. ఈ మొక్కలు ఓపెన్–రూట్ వ్యవస్థ ద్వారా పోషకాలు, ఆక్సిజన్‌ను నేరుగా తీసుకోవడమే దీనికి కారణం. వ్యవస్థీకృతంగా సాగుతున్న వ్యాపారం... ఈ డ్రగ్స్ క్రమవిక్రయాల దందా మొత్తం పక్కా వ్యవస్థీకృతంగా సాగుతోందని పోలీసులు చెప్తున్నారు. ఎన్‌క్రిపె్టడ్ యాప్స్ ద్వారా ఇండియా నుంచి తనకు వచ్చిన ఆర్డర్ల విషయాన్ని ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’ ఆయా యాప్స్ ద్వారానే హర్షవర్థన్‌కు చేరవేస్తాడు. ఇతడు జబల్పూర్లో ఉన్న హవాలా ఏజెంట్‌కు ఆ కస్టమర్ వివరాలు పంపిస్తాడు. అతగాడు సదరు కస్టమర్ నివసించే ప్రాంతానికి చెందిన మరో హవాలా ఏజెంట్‌కు ఇవి అందిస్తాడు. ఆ వినియోగదారుడిని సంప్రదించే ఈ ఏజెంట్ డబ్బు ముట్టిన తర్వాత జబల్పూర్ ఏజెంట్‌కు బదిలీ చేస్తాడు. అతడి ద్వారా విషయం తెలుసుకునే హర్షవర్థన్ విషయాన్ని ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’కు చెప్తాడు. ఔన్స్ (28.34 గ్రాములు) డ్రగ్‌కు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు క్రిప్టో కరెన్సీ రూపంలో అతడికి పంపిస్తాడు. ఆపై డ్రగ్ హ్యాండ్లర్ నుంచి హర్షవర్థన్‌కు వచి్చ... అక్కడ నుంచి డీటీడీసీ, శ్రీ తిరుపతి, శ్రీ ఆంజనేయులు కొరియర్స్‌లో కస్టమర్‌కు చేరుతుంది. హర్షవర్థన్ కూడా పోలీసుల నిఘాకు చిక్కకుండా ఈ పార్శిల్ బుక్ చేస్తున్నాడు. అక్కడ కస్టమర్ చిరునామా, ఫోన్ నెంబర్ తప్పుగా ఇస్తాడు. దాని ట్రాకింగ్ ఐడీని వినియోగదారుడికి పంపిస్తాడు. దీని ద్వారా ట్రాక్ చేసే కస్టమర్ ఆ పార్శిల్ కొరియర్ ఆఫీసుకు చేరిందని గుర్తించిన వెంటనే అక్కడకు వెళ్లి తీసుకుంటారు. ఈ హవాలా, కొరియర్ నెట్వర్క్ పైనా హెచ్–న్యూ దృష్టి పెట్టింది. ఈ ముఠాలో కీలక పెడ్లర్‌గా ఉన్న హర్షవర్థన్‌కు చెందిన క్రిప్టో వాలెట్లో రోజుకు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు విలువైన బిట్కాయిన్లు డిపాజిట్ అవుతున్నట్లు గుర్తించామని అధికారులు చెప్తున్నారు.
వీడియోలు


ప్రమాదానికి కారణమైన గోడను నోటి మాటతో కట్టేశారు


Pahalgam : ఒక్కడి కుట్ర సంక్షోభంలోకి పాకిస్తాన్


అమరావతిలో మోదీ స్పీచ్


SV Mohan: నెత్తిన నీళ్లు.. నోట్లో మట్టి.. అమరావతి 2.0పై సెటైర్లు..


అమరావతిలో బాబు స్పీచ్ ఆసక్తిగా వింటున్న జనం


అమరావతి సభలో పాచిపోయిన భోజనం కూటమిపై మహిళలు ఫైర్


వెలగపూడిలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం


ఏపీలో రూ. 49 వేల కోట్లతో చేపడుతున్న పనులకు మోదీ శంకుస్థాపన


ఏపీ ప్రభుత్వం, సిట్, ముఖేష్ కుమార్ మీనాకు సుప్రీంకోర్టు నోటీసులు


10th పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన వారికి బంపర్ ఆఫర్