pavala syamala
-
నన్ను అనాథగా చంపేస్తారా? పావలా శ్యామల ఆవేదన
-
నేను విషం తాగి చస్తే మనశ్శాంతిగా ఉంటుందా? పావలా శ్యామల ఆవేదన
ప్రముఖ నటి పావలా శ్యామల (Pavala Syamala) కొన్నేళ్లుగా అనారోగ్యంతో సతమతమవుతోంది. అటు ఆర్థిక ఇబ్బందులు, ఇటు అనారోగ్యం ఆమెను కుంగదీస్తోంది. మొదట్లో అద్దె ఇంట్లో ఉన్న ఆమె తర్వాత అనాథాశ్రమంలోకి షిఫ్ట్ అయింది. దాదాపు 300 సినిమాలు చేసి గొప్ప నటిగా కీర్తి పొందిన ఆమె ఏళ్ల తరబడి సాయం కోసం ఎదురుచూస్తూనే ఉంది. ఆమె అడిగినప్పుడల్లా ఒకరిద్దరు సాయం చేస్తున్నా అది తన మందులకే సరిపోతోంది.కొన ఊపిరితో ఉన్నా..ఈ క్రమంలో తాజాగా మరోసారి పావలా శ్యామల తనకు సాయం చేయమని అర్థిస్తోంది. 'యాభై ఏళ్లు ఆర్టిస్టుగా బతికాను. ఈ మూడు సంవత్సరాల నుంచి నాకు ఎంత కష్టంగా ఉందో మీ అందరికీ తెలుసు. చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను కానీ ఎవరూ స్పందించలేదు. ఎలాగోలా ఇంతవరకు లాక్కొచ్చాను. ఇప్పుడు కొన ఊపిరితో ఉన్నాను. (చదవండి: పెళ్లికి ముందే ప్రియుడితో పూజ.. అబ్బాయి పేరెంట్స్ అయినా చెప్పాలిగా)నేను చస్తే మనశ్శాంతిగా ఉంటుందా?నా బిడ్డ కోసం బాధగా ఉంది. తను మాట్లాడలేదు. ఒక ఆర్టిస్టు బలవంతంగా విషం తాగి చచ్చిపోతే మీకు మనశ్శాంతిగా ఉంటుందా? ఎంతోమంది హీరోలతో కలిసి పని చేశాను. చిరంజీవి, ప్రభాస్, మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్.. ఇలా పెద్దపెద్ద హీరోలతో చేశా.. ఆఖరికి ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉన్నాను.శక్తి లేదుకానీ నా బిడ్డను చంపుకోలేకపోతున్నాను. ట్రీట్మెంట్ చేయించుకోలేక చాలా అవస్థ పడుతున్నాను. ఎవరికీ స్పందించే గుణం లేదా? ఇలా అనాథగా చంపేస్తారా? ఎవరి మనసులూ కరగవా? ఎవరికైనా నా దీన పరిస్థితి గురించి తెలుసా, తెలియదా? తెలియకపోతే దయచేసి ఈ వీడియో ద్వారా తెలియజేయమని కోరుకుంటున్నాను. నాకు ఇంక మాట్లాడే శక్తి లేదు' అంటూ సాయం చేయమని వేడుకుంటోంది.సినిమాపావలా శ్యామల.. కర్తవ్యం, అల్లరి రాముడు, మనసంతా నువ్వే, ఖడ్గం, ఇంద్ర, ఠాగూర్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం, నిన్నే ఇష్టపడ్డాను, గోలీమార్, శ్రీమన్నారాయణ, డీ ఫర్ దోపిడి, మత్తు వదలరా.. ఇలా వందలాది చిత్రాల్లో నటించింది. తన విచిత్రమైన డైలాగ్ డెలివరీతో అందరినీ అలరించింది. ఎంతోమందికి వినోదాన్ని పంచిన ఆమె ఇప్పుడు చావు కోసం ఎదురుచూస్తుండటం శోచనీయం.చదవండి: దుబాయ్ కారు రేసింగ్.. అజిత్ కుమార్ టీమ్ క్రేజీ రికార్డ్ -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం
టాలీవుడ్ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ మంచి మనసు చాటుకున్నారు. సీనియర్ నటి పావలా శ్యామల కష్టాల్లో ఉన్నట్లు తెలుసుకున్న ఆయన చలించిపోయారు. సాయం చేస్తానని గతంలో ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. పలు ఆరోగ్య సమస్యల వల్ల వైద్య ఖర్చులకు ఇబ్బందులు పడుతున్న పావలా శ్యామాలకు రూ. లక్ష సాయం చేశారు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ద్వారా ఆ డబ్బును ఆమెకు అందించారు.పావలా శ్యామలతో సాయిధరమ్ తేజ్ కూడా వీడియో కాల్లో మాట్లాడారు. ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. దీంతో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. 'గతంలో మా అమ్మాయికి ఆపరేషన్ అయిన సమయంలో సాయిధరమ్ తేజ్ నాకు ఫోన్ చేసి చాలా ధైర్యం చెప్పారు. త్వరలో వచ్చి కలుస్తానని చెప్పారు. కానీ, ఆయన రాలేదు. చాలా రోజులైపోయింది కాబట్టి నన్ను మర్చిపోయారనుకున్నాను. ఆయనకు ప్రమాదం జరిగినప్పుడు సురక్షితంగా బయటపడాలని దేవుడిని కోరుకున్నాను. దేవుడి దయ వల్ల అంతా మంచే జరిగింది. అయితే, నన్ను గుర్తుపెట్టుకొని సాయం చేసినందుకు తేజ్‌కు నా ధన్యవాదాలు. చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. ఆసుపత్రి ఖర్చులకు కూడా డబ్బు లేదు. దీంతో నా కూతురితో సహా చనిపోదామనుకున్నా..సమయానికి మీరు సాయం చేసి నాకూ, నా కూతురుకు ప్రాణభిక్ష పెట్టారు. అని సాయ్ ధరమ్ తేజ్‌తో వీడియో కాల్ మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్‌కు రూ.5 లక్షలు సాయిధరమ్‌తేజ్ విరాళం ఇచ్చారు. దానిలో భాగంగా రూ.లక్షను పావలా శ్యామలకు అందించారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన సాయాన్ని కూడా ఆమె మరోసారి గుర్తుచేసుకున్నారు.We extend our heartfelt thanks to the mega supreme hero, @IamSaiDharamTej Garu, for donating 5 lakhs to our @FilmJournalistsWe are grateful. As part of this donation, 1 lakh was given to senior artist #PavalaShyamala Garu through our association, keeping the promise made by you… pic.twitter.com/1FYiUAKoOL— Telugu Film Journalists Association (@FilmJournalists) July 26, 2024 -
'మళ్లీ చూస్తానో లేదో'.. కన్నీళ్లు పెట్టిస్తున్న నటి పావలా శ్యామల మాటలు!
ఇండస్ట్రీ రంగుల ప్రపంచం. పైకి కనిపించేదంతా నిజం కాదు. చాలామంది నటీనటులు సినిమాల్లో పేరు తెచ్చుకున్నప్పటికీ ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉంటారు. తెలుగు సీనియర్ నటి పావలా శ్యామల కూడా ప్రస్తుతం అలాంటి దీనస్థితిలోనే ఉన్నారు. చిరంజీవి, వెంకటేశ్, నాని, గోపీచంద్.. ఇలా చాలామంది స్టార్ హీరోల సినిమాల్లో నటించారు. కానీ ఆర్థికంగా స్థిరపడలేకపోయారు. ప్రస్తుతం అనాథాశ్రమంలో బతుకు వెళ్లదీస్తున్నారు. (ఇదీ చదవండి: ఎట్టకేలకు బయటకొచ్చిన అనుష్క.. ఇంతలా మారిపోయిందేంటి!?) గత కొన్నాళ్ల నుంచి పావలా శ్యామల దీనస్థితి గురించి ఏదో ఒక వీడియో కనిపిస్తూనే ఉంది. నటుడు కాదంబరి కిరణ్ కూడా ఈమెకు మనం ఫౌండేషన్ తరఫున రూ.25 వేల వరకు సాయం చేశారు. ప్రస్తుతం వీల్ ఛైర్‌కే పరిమితమైన పావలా శ్యామల.. తాజాగా ఓ రియాలిటీ షోకు వచ్చారు. తన మాటలతో అక్కడున్న వాళ్లందరినీ కంటతడి పెట్టించారు. 'అందరు హీరోలతో నటించాను. అన్ని హిట్ సినిమాల్లో ఉన్నాను. కానీ చివరకు నా బ్రతుకు ఇలా అవుతుందనుకోలేదు. ఇంతటి దుస్థితి వస్తుందని ఊహించలేదు. నా కష్టాలని చెప్పుకొని మిమ్మల్ని బాధపెట్టాలని మళ్ల మీ ముందుకు రాలేదు. నేను బ్రతికుండి మళ్లీ మిమ్మల్ని చూస్తానో లేదో అనే భయంతో, ఒకసారి మీకు కనిపించి మీ అభిమానం పొందాలని ఇప్పుడు వచ్చాను' అని పావలా శ్యామల చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) View this post on Instagram A post shared by ᴮⁱᵍᵍᵇᵒˢˢ_ʰᵉᵃʳᵗ (@biggboss_heart) -
దీనస్థితిలో పావలా శ్యామల.. కాదంబరి కిరణ్ ఆర్థిక సాయం!
సినీ నటుడు,‘మనం సైతం' ఫౌండేషన్ నిర్వహకులు కాదంబరి కిరణ్ మరోసారి దాతృత్వం చాటుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటి పావల శ్యామలకు ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నాడు. సీనియర్ నటి పావల శ్యామలకు అనారోగ్య సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు తోడయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న కాదంబరి కిరణ్.. ఆమెకు రూ. 25,000 చెక్కును అందించారు. పావల శ్యామలకు మెరుగైన వైద్యం, కనీస అవసరాలను తీర్చేలా సాయం చేశారు. (చదవండి: అమ్మ చనిపోయిన కాసేపటికే ఏడుపు ఆపేశా: శ్రీదేవి చిన్నకూతురు) మీడియా ద్వారా విషయం తెలుసుకున్న కాదంబరి కిరణ్ హైదరాబాద్ శివారులోని ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్న నటి శ్యామల ను తనంతట తానే వెతుకుంటు వెళ్లి స్వయంగా సాయం చేసి పెద్దమనసు చాటుకున్నారు . ఆయన మానవత్వానికి పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. సినీ పరిశ్రమలో పేద కార్మికులకు, అవసరాల్లో ఉన్న పేదలకు సహాయం చేయడానికి ‘మనం సైతం' అనే ఫౌండేషన్ స్థాపించి దశాబ్దం పైగా నిర్విరామంగా సేవలు కొనసాగించడం విశేషం. -
మరింత దయనీయంగా పావలా శ్యామల పరిస్థితి.. ఏదో ఓరోజు..
జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకప్పుడు వెలుగు వెలిగిన ఎందరో తారలు చివరి దశలో మాత్రం కష్టాల కడలిలో మునిగిపోయారు. ప్రముఖ నటి పావలా శ్యామల పరిస్థితి కూడా అంతే! వెండితెరపై నవ్వుల వాన కురిపించిన ఆ నటి ఇప్పుడు నిస్సహాయస్థితిలోకి వెళ్లిపోయింది. తనను కాపాడండి అంటూ ఆ కళామాతల్లి ముద్దుబిడ్డ చేతులెత్తి అర్థిస్తోంది. దయనీయ జీవితం గడుపుతున్న నటి పావలా శ్యామల జీవిత కథ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. ఆర్థిక భారం, వయోభారం.. పావలా శ్యామల... అందరికీ ఆనందం పంచిపెట్టిన ఆమె చాలాకాలంగా దయనీయ జీవితం గడుపుతోంది. ఒకవైపు ఆర్ధిక భారం.. మరో వైపు వయోభారం ఆమెకు నరకం చూపిస్తున్నాయి.. అంతేకాకుండా ఎదిగిన కూతురు మంచానికి పరిమితమవ్వడం ఆమెకు మనోవేదనను కలిగిస్తోంది. గతంలో ఆమెకు కొంత మంది నుంచి సాయం అందినా అవి తాత్కాలిక ఉపశమనం మాత్రమే కల్గించాయి. అవార్డులను అమ్మేసుకుంది తనకు వచ్చిన అవార్డులను అమ్ముకొని ఆ డబ్బుతో బియ్యం, పప్పులు కొనుకొన్న రోజులున్నాయని ఆమె తాజాగా ఆవేదన వ్యక్తం చేసింది. అనారోగ్యంతో ఉన్న తాము తినడానికి తిండి లేక ఒక్కోసారి ఐదు రోజులు పస్తులుండాల్సి వచ్చిందని చెప్పింది. అలాంటిది ఇక మందులు ఎక్కడి నుంచి కొనుక్కోగలమని బాధపడింది. పరిస్థితులు ఇలాగే ఉంటే ఏదో ఓ రోజు ఇద్దరం మంచంలోనే ఆకలితో చనిపోతామని కంటతడి పెట్టుకుంది. ఆత్మహత్య చేసుకోవడానికి ధైర్యం సరిపోవడంలేదని చెప్తుందంటే ఆమె పరిస్థితి ఏ స్థితిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. సినీ కెరీర్.. పావలా శ్యామల 1984లో బాబాయ్ అబ్బాయ్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించింది. స్వర్ణ కమలం, కర్తవ్యం, ఇంద్ర, ఖడ్గం, బ్లేడ్ బాబ్జీ, గోలీమార్ సహా సుమారు 250 సినిమాలలో హాస్య నటిగా, సహాయ నటిగా నటించింది. అనేక అవార్డులు, సన్మానాలు అందుకున్న ఆమె నేడు తినడానికి తిండి కూడా లేక, అనారోగ్య సమస్యలతో సతమతమవుతోంది. పావలా శ్యామల ప్రస్తుతం ఫిర్జాదిగూడలోని ఓ వృద్దాశ్రమంలో ఉంటుంది. ఆ ఆశ్రమానికి నెలవారీ డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతోంది. ఆమెకు డబ్బు, మందులు, నిత్యావసర సరుకులు మరేదైనా ఇచ్చి సాయపడాలనుకొంటే నేరుగా ఆమె ఇంటికే వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. దినదిన గండంగా బతుకీడుస్తూ, ఆపన్నహస్త కోసం ఎదురుచూస్తున్న నటి పావలా శ్యామలకు సహాయం చేయాలనుకునేవారు కింద ఇస్తున్న బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులు పంపించవచ్చు. Neti Shyamala, A/c: 52012871059, IFSC :SBIN0020458, Srikrishna Nager, Yusuf guda Branch, Hyderabad , Cell : 9849175713. చదవండి: ఎంగేజ్మెంట్ ఆగిపోవడానికి కారణమిదే! పెళ్లి చేసుకోవాలనుంది.. త్వరలోనే.. : రేణు దేశాయ్ -
ఆ విషయం చిరంజీవికి తెలిస్తే సహించరు.. నటి పావలా శ్యామల
ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల అంటే టాలీవుడ్లో తెలియని వారు ఉండరు. ఆమె చాలా అగ్రహీరోల సినిమాల్లోనూ నటించింది. మెగాస్టార్‌తో పలు చిత్రాల్లో ఆమె కనిపించింది. కానీ ప్రస్తుతం వయసు రీత్యా ఇంట్లోనే ఉంటోంది. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. మెగాస్టార్‌పై ప్రశంసల వర్షం కురిపించింది పావలా శ్యామల. అలాగే కెరీర్లో తనకు జరిగిన అవమానంపై ఆమె మాట్లాడారు. ఆ విషయం చిరంజీవికి చెబితే ఊరుకోరని అన్నారు. పావలా శ్యామల మాట్లాడుతూ..'చిరంజీవి కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. అగ్రస్థానంలో ఉన్నప్పటికీ పని పట్ల ఆయనకు అంకితభావం ఎక్కువ. కరోనా సమయంలో ఎంతో మందికి సాయం చేశారు. నేను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నానని తెలిసి రూ.2 లక్షలు పంపారు. చిరంజీవిని ఒకసారి కలవాలని ఉంది. నాకు జరిగిన అవమానం గురించి ఆయనతో చెప్పాలి. ఆ విషయం చిరంజీవికి తెలిస్తే సహించరు' అని అన్నారు పావలా శ్యామల. అయితే ఆమెకు ఎదురైన అవమానం ఏంటనేది మాత్రం చెప్పలేదు. -
ఆత్మహత్య తప్ప మరో దిక్కు లేదు: పావలా శ్యామల
తెలుగులో మూడు వందలకు పైగా సినిమాల్లో నటించింది పావలా శ్యామల. ఆర్టిస్ట్‌గా ఎంతో పేరు తెచ్చుకున్న ఆమె ప్రస్తుతం దయనీయ స్థితిలో బతుకు వెళ్లదీస్తోంది. అనారోగ్యం పాలై అనాథాశ్రమంలో కూతురితో సహా జీవిస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన గోడు వెల్లబోడుసుకుంది. 'మా అసోసియేషన్‌లో మెంబర్షిప్ తీసుకోకపోతే చిరంజీవి లక్ష రూపాయలు కట్టి నాకు మెంబర్షిప్ ఇప్పించారు. నా కుమార్తె ఆరోగ్యం బాగోలేకపోతే మరో రూ.2 లక్షలిచ్చారు. అందరూ సాయం చేసిన డబ్బులతో ఇప్పటిదాకా నెట్టుకొచ్చాం. కానీ ఇప్పుడు ఆత్మహత్య తప్ప నాకు ఏ విధమైన బతుకుదెరువు లేదు. నేను, నా కూతురు బయటకు వెళ్లి విషం కొనుక్కొచ్చి తాగడానికి కూడా శక్తి లేదు. అలా అని చావమని ఎవరూ తెచ్చివ్వరు కదా? చావడానికి కూడా శక్తి లేని స్థితిలో ఉన్నాం. అప్పట్లో కరాటే కల్యాణి నాకు సాయం చేద్దామని వచ్చింది. కానీ ఇళ్లంతా వాసన అని చీదరించుకుంది. 'సాయం చేద్దామంటే డబ్బులు తీసుకోలేదు. ఎవరు సాయం చేద్దామని వచ్చినా అంత కావాలి, ఇంత కావాలి అని డిమాండ్ చేస్తుంది' అని నా గురించి తప్పుగా మాట్లాడింది. ఆ మాటలు విని అసహ్యం పుట్టింది. నాకు, నా బిడ్డకు బాగోలేనప్పుడు ఇల్లు అందంగా, శుభ్రంగా ఎలా ఉంటుంది? సాయం పేరున ఇలాంటి మాటలు వినాలా అనిపించింది. ఇకపోతే ఉచిత అనాథాశ్రమంలో ఉండొచ్చు కదా? అంటున్నారు. ఇప్పుడున్న అనాథాశ్రమంలో డబ్బులు కడితేనే బాగా చూడట్లేదు. ఉదయం 11 గంటల వరకు పనమ్మాయి రావట్లేదు. అప్పటివరకు మా కుమార్తె ఇబ్బంది పడుతూనే ఉంది. మంచు విష్ణు మా ప్రెసిడెంట్ అయ్యాక నా సాయం కోసం ఓ అమ్మాయిని పెట్టారు. ఆమె నన్ను ఆపరేషన్ చేయించుకోమంది. కానీ డాక్టర్లు ఆపరేషన్‌కు నా శరీరం తట్టుకోదని చెప్పడంతో వద్దన్నాను. దీంతో ఆమె తనకిక ఎలాంటి సంబంధం లేదని చెప్పి వెళ్లిపోయింది. ఆ తర్వాత నేను బతికి ఉన్నానా? లేదా? అని కూడా ఎవరూ పట్టించుకోలేదు' అని బాధపడింది పావలా శ్యామల. చదవండి: దేవిశ్రీపై సైబర్ క్రైమ్‌లో కరాటే కల్యాణి ఫిర్యాదు బాలాదిత్యపై కక్ష, ఎలిమినేషన్ జోన్లో బిగ్‌బాస్ ముద్దుబిడ్డ -
ఆ బాధ చూడలేక కూతుర్ని చంపేయాలనుకున్నా: పావలా శ్యామల
‘‘మా అమ్మాయికి రెండేళ్ల క్రితం టీబీ వ్యాధి వచ్చినప్పుడు నాకు చేతనైనంత వరకు మందులు ఇప్పించాను. అప్పుడు చిరంజీవిగారు వాళ్ల అమ్మాయితో రెండు లక్షలు పంపించారు. మంచి డాక్టర్‌కి చూపించి, మంచి మందులు వాడాం. టీబీ వ్యాధి నయం అయిపోయింది. అయితే ఉన్నట్టుండి ఈ మధ్య కిందపడిపోయింది’’ అని సీనియర్ నటి పావలా శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ – ‘‘మాధవి (శ్యామల కుమార్తె) పడిపోయాక, డాక్టరు వద్దకు తీసుకెళితే మూడు చోట్ల కాలు ఎముకలు విరిగాయి.. రాడ్లు వేయాలి.. ఇందుకు రెండు నుంచి మూడు లక్షలు ఖర్చవుతుంది అన్నారు. ఆపరేషన్ చేయించకుంటే కాలు తీసేయాల్సి వస్తుందంటే ఆస్పత్రిలో చేర్పించాను. బిల్లు దాదాపు 4లక్షలయింది. బిల్లులో కొంత మొత్తం తగ్గించాక రూ.80 వేలు తక్కువ ఉండటంతో ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ (మా) వారు చెల్లించారు. రెండు నెలలు ఫిజియోథెరపీ చేస్తే కాలు బాగవుతుందని చెప్పారు. ఫిజియోథెరపీ మొదలుపెట్టాక, ఆ డాక్టరుకే దాదాపు లక్ష రూపాయలు ఫీజు చెల్లించాం. ఇక డబ్బులు చెల్లించలేమని డాక్టర్ని రావద్దని చెప్పాను. కానీ అమ్మాయి పడుతున్న బాధని మాటల్లో చెప్పలేను. దానికి బలమైన ఆహారం పెట్టలేక దాన్ని చంపేయాలని ప్రయత్నం చేశాను. కానీ తల్లిని కదా.. ఆ పని చేయలేకపోయాను. ఇది తెలిసిన చిరంజీవిగారు నాకు ‘మా’ సభ్యత్వం రుసుము చెల్లించారు. నేను చనిపోయినా ‘మా’ మెంబర్ని కాబట్టి అందరూ తీసుకెళ్లి దహన సంస్కారాలు చేస్తారు. ఇది ఆయన పుణ్యమే. కానీ ఇంకా మేము అనుభవించాల్సిన అవమానం, నరకం చాలా ఉంది. నా బాధ ఎవరి మనసుల్ని అయినా కదిలిస్తే దయచేసి జాలి పడండి.. కానీ అవమానించకండి.సహాయపడమని ప్రాధేయపడుతున్నా’’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. చదవండి: నటితో సహజీవనం: ఆమె ఎవరో తెలియదన్న మాజీ మంత్రి -
Pavala syamala : పావలా శ్యామలకు ఆర్థిక సహాయం చేసిన నటుడు
సాక్షి, హైదరాబాద్ : హాస్యనటిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి పావలా శ్యామల ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఓ అద్దె ఇంట్లో ఉంటూ అనారోగ్యంలో బాధపడుతుంది. టాలీవుడ్లో ఇప్పటివరకు దాదాపు 250 చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నఆమె.. ఆర్థిక కారణాల వల్ల అవార్డులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో ఆమె ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులకు తోడు కూతురి అనారోగ్యంతో పావలా శ్యామల పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటికే ఆమెను ఆదుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి సహా ఇండస్ర్టీకి చెందిన కొందరు ముందుకు వచ్చారు. తాజాగా నటుడు జీవన్ కుమార్ కూడా పావలా శ్యామలకు సాయమందించారు. ఆమె పరిస్థితిని తెలుసుకొని స్వయంగా ఇంటికి వెళ్లిన ఆయన తనవంతు సాయాన్ని ఆమెకు అందించారు. ఈ నగరానికి ఏమైంది , ఫలక్నామా దాస్, సఫారీ వంటి సినిమాల్లో నటించిన జీవన్ కుమార్ నిత్యావసరాలతో పాటు ప్రతి రోజు భోజన వసతి కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ఇక జీవన్ కుమార్ అందించిన సహాయంపై నటి పావలా శ్యామల స్పందించారు. స్వయంగా ఇంటికి వచ్చి డబ్బులివ్వడం సంతోషమని, ఇప్పుడు తనకు బతకాలనే ఆశ ఉందని, తన కూతుర్ని కూడా బతికించుకుంటానని పేర్కొంది. ఇటీవలె పావలా శ్యామల ఇబ్బందులు తెలుసుకున్న నటి కరాటే కల్యాణి ఆమెను కలిసి తన వంతు సాయాన్ని అందించిన సంగతి తెలిసిందే. అలాగే మా అసోసియేషన్ ద్వారా కూడా సహాయం అందేలా ప్రయత్నం చేస్తానని అన్నారు. అదే విధంగా ప్రతి ఒక్కరు పావలా శ్యామలను ఆదుకునేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెకు సహాయం చేయడానికి దాతలు ముందుకు వస్తున్నారు.ఇక ఖడ్గం, ఆంధ్రావాలా, బాబాయ్ హోటల్, గోలీమార్ వంటి సూపర్ చిత్రాల్లో నటించి పావలా శ్యామల గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే. చదవండి : Pavala Syamala: పావలా శ్యామలకు మెగాస్టార్ చిరంజీవి సాయం పావలా శ్యామలకు ఆర్థిక సహాయం చేసిన డైరెక్టర్ -
Pavala Syamala: పావలా శ్యామలకు మెగాస్టార్ చిరంజీవి సాయం
సాక్షి, హైదరాబాద్ : నటి పావలా శ్యామల దీనగాధపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆమెను ఆదుకోవడానికి అవసరమైన చర్యలను తీసుకున్నారు. ‘మా’ సభ్యత్వంతో పాటు లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఈ మేరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈసీ సభ్యులు కరాటే కళ్యాణి, సురేష్ కొండేటి శ్యామల ఇంటికి చేరుకొని 'మా' అసోసియేషన్ కార్డు సహా 1,01,500 రూపాయల చెక్కును అందించారు. ఇక ‘మా’ మెంబర్ షిప్ కార్డ్ తో నెలకు 6 వేల చొప్పున ప్రతినెలా ఫించను రూపంలో అందుతుందని తెలిపారు. ‘మా’ సభ్యత్వం పొంది ఉంటే ఎవరైనా ఆర్టిస్ట్ అకాల మరణం చెందితే వారికి రూ. 3లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది. పావలా శ్యామల కూతురి వైద్యానికి సంబంధించి న్యూరో సిటీ సెంటర్ వైద్య నిపుణులు స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఇక చిరంజీవి తనకు సాయం చేయడం పట్ల పావలా శ్యామల ఆనందం వ్యక్తం చేశారు. గతంలోను ఉపాధి లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చిరంజీవి రూ. 2లక్షలు ఇచ్చి సాయం అందించారని, మళ్లీ ఇప్పుడు తనను ఆదుకున్నారని ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..'గతంలోనూ తీవ్ర మానసిక వేదనను అనుభవించాను. నా కుమార్తెకు టీబీ వ్యాధికి చికిత్స చేయించలేని పరిస్థితి. కాలు విరిగి తీవ్ర ఇబ్బందిలో ఉంటే.. అప్పుడు ఆ రెండు లక్షల ఆర్థిక సాయం నన్ను ఎంతో ఆదుకుంది. ఆ మేలు ఎన్నటికీ మర్చిపోలేను. అప్పుడు సినీ పరిశ్రమలో ఎవరూ సాయం చేయలేదు. కానీ నాకు మెగాస్టార్ కుమార్తె వచ్చి 2 లక్షల ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇప్పుడు ఈ కష్టంలో మరోసారి లక్షా పదిహేను వందల రూపాయలను చెక్ రూపంలో అందించారు.అంతేకాకుండా ప్రతి నెలా ఆరువేల రూపాయలు సాయం అందించేందుకు సాయపడ్డారు. మనస్ఫూర్తిగా చిరంజీవి గారికి నా ధన్యవాదాలు' అని అన్నారు. ఇక చిరంజీవి సాయానికి 'మా' కమిటీ సభ్యులు సైతం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చదవండి : పావలా శ్యామలకు ఆర్థిక సహాయం చేసిన డైరెక్టర్ పాపం పావలా శ్యామల.. తిండిలేక, అనారోగ్యంతో.. -
పావలా శ్యామలకు మెగాస్టార్ చిరంజీవి సాయం
-
పావలా శ్యామలకు ఆర్థిక సహాయం చేసిన డైరెక్టర్
హాస్యనటిగా ఎన్నో తెలుగు సినిమాల్లో నటించిన ప్రేక్షకులను దగ్గరైన నటి పావలా శ్యామల ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఓ అద్దె ఇంట్లో ఉంటూ అనారోగ్యంలో బాధపడుతున్నారు. దాదాపు 250 చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నఆమె.. ఆర్థిక కారణాల వల్ల అవార్డులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో ఆమె ఉన్నారు. ఒకవైపు కుమార్తె అనారోగ్యం.. మరోవైపు ఆర్థిక సమస్యలతో పావలా శ్యామల పరిస్థితి దారుణంగా మారింది. ఈ నేపథ్యంలో పావలా శ్యామల పరిస్థితిని తెలుసుకొని ఆమెకు సహాయం చేయడానికి సిసింద్రీ డైరెక్టర్ శివ నాగేశ్వర రావ్ ముందుకు వచ్చారు. తన వంతు సహాయంగా ఆమెకు 50వేల రూపాయలను అందించారు. ఆయన తరుపు వాళ్లు వచ్చి పావలా శ్యామలకు ఆ డబ్బును అందించారు. అనారోగ్యం సమస్యలతో సినిమాలకు దూరమైన ఆమె హైదరాబాద్‌లోని ఓ చిన్న ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. ఇటీవలె పావలా శ్యామల ఇబ్బందులు తెలుసుకున్న నటి కరాటే కల్యాణి ఆమెను కలిసి తన వంతు సాయాన్ని అందించిన సంగతి తెలిసిందే. అలాగే మా అసోసియేషన్ ద్వారా కూడా సహాయం అందేలా ప్రయత్నం చేస్తానని అన్నారు. అదే విధంగా ప్రతి ఒక్కరు పావలా శ్యామలను ఆదుకునేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెకు సహాయం చేయడానికి దాతలు ముందుకు వస్తున్నారు. ఇక ఖడ్గం, ఆంధ్రావాలా, బాబాయ్ హోటల్, గోలీమార్ వంటి సూపర్ చిత్రాల్లో నటించి పావలా శ్యామల గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే. గతంలో మెగాస్టార్ చిరంజీవి రూ.2 లక్షలు పంపించారని, తెలంగాణ ప్రభుత్వం తరపున ఆమెకు నెలకు 10వేల రూపాయల పెన్షన్ వచ్చేలా సహాయం అందించారని అయితే ప్రస్తుతం ఆ పెన్షన్ కూడా సరిగ్గా రావడం లేదని ఆమె ఆవేదన చెందారు. గత మూడు నెలలు ఇంటి అద్దె కూడా కట్టలేదని వాపోతున్నారు శ్యామల. చదవండి : పాపం పావలా శ్యామల.. తిండిలేక, అనారోగ్యంతో.. -
పాపం పావలా శ్యామల.. తిండిలేక, అనారోగ్యంతో..
పావలా శ్యామల.. గుర్తుందా మీకు? అదేనండీ గోలీమార్ సినిమాలో తన అమాయకపు మాటలతో విలన్‌కు చిరాకు తెప్పించి తన యజమాని చావుకు కారణం అవుతుంది. ఆ సినిమానైనా మర్చిపోతారేమో కానీ.. ఈ సీన్‌ని మాత్రం మర్చిపోలేం. అంతలా ఆ సీన్‌ని పండించారు పావలా శ్యామల. అలాంటి శ్యామల ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది. ఒకవైపు కూతురి అనారోగ్యం, మరోవైపు ఆర్థిక సమస్యలతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఖడ్గం, ఆంధ్రావాలా, బాబాయ్ హోటల్, గోలీమార్ వంటి సూపర్ చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్యామల.. ప్రస్తుతం ఓ అద్దె ఇంట్లో ఉంటూ అనారోగ్యంలో బాధపడుతున్నారు. దాదాపు 250 చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నఆమె.. ఆర్థిక కారణాల వల్ల అవార్డులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో ఆమె ఉన్నారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం తరపున ఆమెకు నెలకు 10వేల రూపాయల పెన్షన్ వచ్చేలా సహాయం అందించారు. అయితే ప్రస్తుతం ఆ పెన్షన్ కూడా సరిగ్గా రావడం లేదని ఆమె ఆవేదన చెందారు. గత మూడు నెలలు ఇంటి అద్దె కూడా కట్టలేదని వాపోతున్నారు శ్యామల. శ్యామల ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న ఆర్టిస్ట్ కరాటే కల్యాణి తన వంతు సాయాన్ని అందించారు. అలాగే మా అసోసియేషన్ ద్వారా కూడా సహాయం అందేలా ప్రయత్నం చేస్తానని అన్నారు. అదే విధంగా ప్రతి ఒక్కరు పావలా శ్యామలను ఆదుకునేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. -
'సినిమావాళ్ల మీద పడ్డాడు... దేవుడు'
హైదరాబాద్ : కష్టాల్లో ఉన్నప్పుడు చిత్రసీమలో ఆదుకునేవారు దిక్కుండరని క్యారెక్టర్ నటి పావలా శ్యామల ఆవేదన వ్యక్తంచేశారు. ఉదయ్ కిరణ్ అకాల మరణం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మానసిక ఒత్తిడిని అధిగమించలేక..తాను కూడా ఒకప్పుడు ఆత్మహత్యనే శరణ్యమని భావించానని ఆమె అన్నారు.... ఎవరైనా సరే చనిపోయాక అయ్యో అంటారే కానీ, బతికి ఉన్నప్పుడు ఒక్కరూ అండగా ఉండరన్నారు. ఎంత మానసిక క్షోభ అనుభవిస్తే ఆత్మహత్య చేసుకుంటాడో అర్థం చేసుకోవచ్చన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండేవారంటే బాగుండేదన్నారు. మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ నర్సింగ్ యాదవ్ మాట్లాడుతూ....ఉదయ్ కిరణ్,తాను అయిదారు చిత్రాలు కలిసి చేశామన్నారు. శ్రీరాం సినిమా షూటింగ్ సమయంలో కోఠీలో షూటింగ్ సమయంలో తన ఇంట్లో ఉండేవాడన్నారు. వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి అని, ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారన్నారు. నర్సింగ్ అన్నా... నర్సింగ్ అన్నా అని మాట్లాడేవాడని తెలిపారు. ఈ మధ్య కాలంలో దేవుడు....సినిమా వాళ్ల మీద పడ్డాడని, మంచివాళ్లనే తీసుకు వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయ్ కిరణ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కొద్ది రోజుల క్రితం శ్రీహరి, ఆతర్వాత ధర్మవరపు సుబ్రహ్మణం, ఇప్పుడు ఉదయ్ కిరణ్ మృతి కలిచి వేస్తుందన్నారు.