Rahul Gandhi
-
ఏక్ హై తో మోదీ, అదానీ సేఫ్ హై: రాహుల్ గాంధీ
ముంబై/రాంచీ: ‘ఏక్ హై తో సేఫ్ హై’ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. సేఫ్ అంటే సురక్షితంతోపాటు బీరువా అనే అర్థం కూడా ఉంది. మోదీ పిలుపునకు, ముంబైలో అదానీ గ్రూప్‌నకు కట్టబెట్టిన ధారావి అభివృద్ధి పథకాన్ని ముడిపెడుతూ విమర్శలు గుప్పించారు. రాహుల్ సోమవారం ముంబైలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తన వెంట ఒక సేఫ్(చిన్నపాటి బీరువా) కూడా తీసుకొచ్చారు. అందులోంచి రెండు పోస్టర్లు బయటకు లాగారు.ఒక పోస్టర్‌పై నరేంద్ర మోదీ, గౌతమ్ అదానీ ఫోటో, మరో పోస్టర్‌పై ధారావి మ్యాప్ ఉంది. మోదీ, అదానీ ఫోటోపై ‘ఏక్ హై తో సేఫ్ హై’ అనే పిలుపును ముద్రించారు. కలిసి ఉంటే సురక్షితంగా ఉంటామని మోదీ చెబుతున్నారని, వాస్తవానికి సురక్షితంగా ఉన్నది ఎవరని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మోదీ, అదానీ కలిసికట్టుగా ముందుకుసాగుతూ, ఒకరికొకరు చక్కగా సహకరించుకుంటూ సురక్షితంగా ఉంటున్నారని మండిపడ్డారు. ధారావి అభివృద్ధి ప్రాజెక్టు పేరిట రూ.లక్ష కోట్ల విలువైన భూమిని అదానీకి అప్పగించారని మండిపడ్డారు. కేవలం అదానీ ప్రయోజనాల కాపాడేలా ధారావి ప్రాజెక్టు టెండర్లు రూపొందించారని విమర్శించారు.ధారావి ప్రజల సంక్షేమాన్ని పక్కనపెట్టి బడా పారిశ్రామికవేత్తల కోసమే మోదీ ప్రభుత్వం పని చేస్తోందని ధ్వజమెత్తారు. బాధితులకు న్యాయం జరిగేదాకా పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. ఇతర పారిశ్రామికవేత్తలకు దక్కిన ప్రాజెక్టులను నరేంద్ర మోదీకి సన్నిహితులైన బిలియనీర్లకు అప్పగించేలా కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. దేశంలో ఓడరేవులు, విమానాశ్రయాలతోపాటు దేశ సంపదను కేవలం ఒకే ఒక్క వ్యక్తికి కట్టబెడుతున్నారని ఆరోపించారు. మోదీ, అమిత్ షా, అదానీ కలిసుంటారు ‘‘ప్రధాని మోదీ ప్రవచిస్తున్న ‘ఏక్ హై తో సేఫ్ హై’కి అసలు అర్థం నేను చెబుతా. నరేంద్ర మోదీ, అమిత్ షా, గౌతమ్ అదానీ కలిసి ఉంటే సురక్షితంగా ఉంటారు. ఆ ముగ్గురూ కలిసే ఉంటున్నారు. దేశ సంపద మొత్తం అదానీ, అంబానీ లాంటి బడా బాబుల చేతుల్లోకి వెళ్లిపోతోంది. టెండర్లలో పారదర్శకతకు పాతరవేసి, ప్రాజెక్టులను వారికి కట్టబెడుతున్నారు’’ అని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. ఆయన సోమవారం జార్ఖండ్ రాజధాని రాంచీలో మీడియాతో మాట్లాడారు. మణిపూర్ గత ఏడాదిన్నర కాలంగా మండిపోతున్నా ప్రధాని మోదీ మొద్దునిద్ర వీడడం లేదని అన్నారు. హింసాకాండలో అమాయక ప్రజలు చనిపోతున్నా పట్టించుకోవడం లేదని చెప్పారు. రిజర్వేషన్లకు తాము వ్యతిరేకంగా కాదని రాహుల్ తేల్చిచెప్పారు. రిజర్వేషన్లను మరింత పెంచాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. -
బిలియనీర్లు, పేదలకు మధ్య పోరే ఈ ఎన్నికలు: రాహుల్
ముంబై: మహారాష్ట్ర ఎన్నికలు ఇద్దరు బిలియనీర్లు, పేదల మధ్య పోరుగా పేర్కొన్నారు కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ముంబైలోని భూమి అంతా తమ చేతుల్లోకి వెళ్లాలని ఆ బిలియనీర్లు కోరుకుంటున్నారని అంబానీ, అదానీలను పరోక్షంగా ఉద్ధేశిస్తూ విమర్శించారు. ఈ మేరకు ముంబైలో సోమవారం రాహుల్ మాట్లాడుతూ.. ఫాక్స్‌కాన్, ఎయిర్‌బస్ సహా రూ.7 లక్షల కోట్ల ప్రాజెక్టులను మహారాష్ట్ర నుంచి గుజరాత్‌కు తరలించారని మండిపడ్డారు. దీని వల్ల మహారాష్ట్రలో యువత ఉద్యోగాలు కోల్పోయారని ఆయన అన్నారు.‘మహారాష్ట్ర రైతులు, పేదలు, నిరుద్యోగులు, యువతకు సహాయం అవసరం. మహా వికాస్ అఘాడి ప్రభుత్వం మహారాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పరిరక్షిస్తుంది. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి మహిళ బ్యాంకు ఖాతాలో ఉచితంగా రూ.3000 జమ చేస్తాం, మహిళలకు, రైతులకు బస్సు ప్రయాణం, రూ.3 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం. సోయాబీన్‌కు క్వింటాల్‌కు రూ.7వేలు మద్దతు ధర ఇస్తాం. తెలంగాణ, కర్ణాటకలో మాదిరి మహారాష్ట్రలో కూడా కులగణన పూర్తి చేస్తాం. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించి, దేశంలో కుల గణన నిర్వహిస్తాం’ అని తెలిపారు.ఇక ఇటీవల ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ.. ‘ఏక్ హై తో సేఫ్ హై’ (ఐక్యంగా ఉంటేనే మనమంతా సురక్షితంగా ఉంటాం) అని ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ‘‘పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే మోదీ సర్కార్ పని చేస్తోంది. పేదల గురించి వారికి ఎలాంటి ఆలోచన లేదు. ధారావిలోని నివాసితుల ప్రయోజనాలను విస్మరించారు. మహారాష్ట్రలో ఎంవీఏ కూటమి అధికారంలోకి వచ్చాక అక్కడి ప్రజలకు భూములను తిరిగి అప్పగిస్తుంది’’ అని రాహుల్ భరోసానిచ్చారు. -
బైడెన్ లాగే మతిమరుపు
అమరావతి/ చిముర్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లాగే ప్రధాని నరేంద్ర మోదీ మతిమరుపుతో బాధపడుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని దేశ డీఎన్ఏగా భావిస్తుందని, అధికార బీజేపీ, రాష్ట్రయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లకు మాత్రం అదో ఖాళీ పుస్తకమని రాహుల్ గాంధీ అన్నారు. శనివారం రాహుల్ అమరావతిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చవచ్చని రాజ్యాంగంలో ఎక్కడా రాసిలేదని, కానీ మహారాష్ట్రలో అదే జరిగిందని పేర్కొన్నారు.బడా వ్యాపారవేత్తలకు సంబంధించి 16 లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేశారని బీజేపీపై ధ్వజమెత్తారు. ‘రాజ్యాంగమే మన దేశ డీఎన్ఏగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు అదో ఖాళీ పుస్తకం’అని రాహుల్ అన్నారు. ఎన్నికల ప్రచారసభల్లో రాహుల్ ప్రదర్శిస్తున్న రాజ్యాంగ ప్రతిలో లోపలి పేజీలు ఖాళీగా ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ విమర్శించిన నేపథ్యంలో రాహుల్ ఈ విధంగా స్పందించారు. నేను లెవనెత్తుతున్న అంశాలపైనే మోదీ మాట్లాడుతున్నారని సోదరి ప్రియాంకగాంధీ నా దృష్టికి తెచ్చారు. ‘కులగణన జరగాలని, రిజర్వేషన్లపై 50 శాతం గరిష్ట పరిమితిని ఎత్తివేయాలని నేను మోదీకి లోక్‌సభలో చెప్పాను.కానీ ఆయన మాత్రం నేను రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఎన్నికల సభల్లో చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ లాగే మతిమరుపుతో బాధపడుతున్నారు’అని రాహుల్ ధ్వజమెత్తారు. బైడెన్ ఒక సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌గా పరిచయం చేయడాన్ని ఉదహరించారు. అలాంటి లక్షణాలే మోదీలోనూ కనపడుతున్నాయని విమర్శించారు. రాహుల్ గాంధీ కులగణనకు వ్యతిరేకమని కూడా మోదీ చెబుతారని ఎద్దేవా చేశారు. రాహుల్ బ్యాగ్ తనిఖీ సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని అమరావతిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెలికాప్టర్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం తనిఖీ చేసింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రాహుల్ మహారాష్ట్రలోని అమరావతికి వెళ్లా రు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెలికాప్టర్ ధమన్‌గావ్ రైల్వే హెలిప్యాడ్‌లో దిగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ హెలికాప్టర్లో ఎన్నికల సంఘం అధికారులు సోదాలు చేశారు. ఎన్నికల సంఘం తనిఖీలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. -
జో బైడెన్‌లాగే ప్రధాని మోదీకి మతిపోయినట్లుంది: రాహుల్
ముంబై: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శనివారం ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లాగే ప్రధాని మోదీక జ్ఞాపకశక్తి కోల్పోతున్నారని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ మాట్లాడే విషయాలపై మాత్రమే మోదీ తరుచూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహారాష్ట్రలోని అమరావతిలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి రాహుల్‌మాట్లాడుతూ.. బిడెన్ (81) పొరపాటున ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌గా పరిచయం చేసిన సంఘటనను ప్రస్తావించారు.‘ప్రధానిమోదీ ప్రసంగం విన్నట్లు మా సోదరి ప్రియాంక నాతో చెప్పింది. ఆయన ఆ స్పీచ్‌లో కాంగ్రెస్ ఏం మాట్లాడుతుతోందే దానిపైనే మోదీ మాట్లాడుతున్నారు. నాకు తెలిసి ఆయనకు జ్ఞాపకశక్తి తగ్గిపోయిందేమో.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వస్తే.. రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చారని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తప్పుగా అన్నారు. అతను తన జ్ఞాపకశక్తిని కోల్పోయాడు. అలాగే మన ప్రధాని కూడా జ్ఞాపకశక్తిని కోల్పోతున్నారు. గత ఏడాది కాలంగా నా ప్రసంగాల్లో రాజ్యాంగంపై బీజేపీ దాడి చేస్తోందని చెబుతున్నా.. కానీ కాంగ్రెస్ రాజ్యాంగంపై దాడి చేస్తోందని ప్రధాని మోదీ చెబుతున్నారు. దీనిపై ప్రజలు ఆగ్రహిస్తున్నారని తెలిసి ఇప్పుడు ఆయన నేను రాజ్యాంగంపై దాడి చేస్తున్నాను అని అబద్దాలు చెబుతున్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 50 శాతం రిజర్వేషన్ పరిమితిని రద్దు చేస్తామని లోక్‌సభలో కూడా చెప్పాను. కానీ మోదీ ఇప్పటికీ రాహుల్ గాంధీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెబుతున్నారు. అందుకే ఆయన జ్ఞాపకశక్తి కోల్పోయారని అనిపిస్తుంది’ అని పేర్కొన్నారు. అదే విధంగా దేశవ్యాప్తంగా కుల గణన నిర్వహించాలని మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
రాహుల్‌గాంధీ బ్యాగులు తనిఖీ చేసిన ‘ఈసీ’
ముంబయి: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం మహారాష్ట్ర వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బ్యాగులను ఈసీ అధికారులు తనిఖీ చేశారు. శనివారం(నవంబర్ 16) మధ్యాహ్నం అమరావతిలో రాహుల్ హెలికాప్టర్ ల్యాండ్ అవ్వగానే అధికారులు ఆయన బ్యాగులు చెక్ చేశారు. బ్యాగులతో పాటు రాహుల్‌గాంధీ వచ్చిన హెలికాప్టర్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీలు జరుగుతున్న సమయంలో రాహుల్ తన పార్టీ నేతలతో మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న పలువురు ప్రముఖ నేతల బ్యాగుల తనిఖీలు ఇటీవల చర్చనీయాంశమయ్యాయి. ఈ తనిఖీలు’ తాజాగా రాజకీయ దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఇటీవల మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బ్యాగులను ఎన్నికల అధికారులు పలుమార్లు తనిఖీ చేయడం వివాదానికి దారి తీసింది. విపక్ష నేతలను లక్ష్యంగా చేసుకున్నారంటూ ఎన్నికల అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు.అయితే,ఎన్నికల వేళ ఇది సాధారణ ప్రక్రియే అంటూ ఈసీ క్లారిటీ ఇచ్చింది. కాగా,మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలున్న మహారాష్ట్రలో నవంబరు 20న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.నవంబరు 23న ఫలితాలను వెల్లడించనున్నారు.ఇదీ చదవండి: కసబ్‌కు కాంగ్రెస్ బిర్యానీ పెట్టింది: జేపీ నడ్డా -
కేసీఆర్ ను ఫినిష్ చేస్తానన్న వారే ఫినిష్ అయ్యారు: కేటీఆర్
-
రాహుల్ హెలికాప్టర్ టేకాఫ్‌కు అనుమతి నిరాకరణ.. గంటపాటు ఆలస్యం
కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీకి శుక్రవారం అనుకోని అనుభవం ఎదురైంది. ఆయన ప్రయాణించాల్సిన హెలికాప్టర్‌కు ఏటీసీ నుంచి ఆనుమతి రాకపోవడంతో టేకాఫ్‌కు గంటకు పైగా ఆలస్యం అయ్యింది. దీంతో రాహుల్ చాలాసేపు హెలికాప్టర్లోనే ఉండాల్సి వచ్చింది.జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గొడ్డాలో ప్రచారానికి వెళ్లారు కాంగ్రెస్ నేత. అక్కడ బహిరంగ ర్యాలీలో ప్రసంగించడం ముగిసిన తర్వాత ఆయన ప్రచారం కోసం మరో ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. అయితే హెలికాప్టర్ టేకాఫ్‌కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అనుమతి రాలేదు. భద్రతా కారణాల పేరుతో క్లియరెన్స్ ఆలస్యంగా లభించింది. ఈ సమస్యతో 75 నిమిషాలపాటు రాహుల్ హెలికాప్టర్లోనే ఉండాల్సి వచ్చింది. హెలికాప్టర్ టేకాఫ్‌కు ఆలస్యం అవడంతో రాహుల్ ప్రయాణ షెడ్యూల్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనిపై రాజకీయ వివాదం చెలరేగింది.HUGE BREAKING 🚨⚡LoP Rahul Gandhi’s helicopter denied permission from flying in JharkhandIt’s been more than 2 hours but no permission granted yet 🚨Why is Modi & BJP so scared? pic.twitter.com/WJltLvaB5p— Ankit Mayank (@mr_mayank) November 15, 2024హెలికాప్టర్ టేకాఫ్‌కు అనుమతి ఆలస్యంపై కాంగ్రెస్ స్పందిస్తూ.. రాజకీయంగా ప్రేరేపితమైనదని మండిపడింది. ఇది బీజేపీ పన్నిన కుట్రేనని ఆరోపించింది. తమ ప్రచారాలను అణగదొక్కే ప్రయత్నమని పేర్కొంది. ‘రాహుల్ గాంధీ ప్రచార కార్యక్రమాలను ఆలస్యం చేయడానికి చేసిన ప్రయత్నమే.. అధికారులు తమ అధికారాన్ని ఉపయోగించి మాకు అడ్డంకులు సృష్టిస్తున్నారు’ అని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను బీజేపీ నాయకులు తోసిపుచ్చారు.మరోవైపు ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), స్థానిక అధికారులు కానీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే, అదనపు భద్రతా తనిఖీలు, ఎయిర్‌స్పేస్ మేనేజ్మెంట్ ఆందోళనలు హోల్డ్అప్కు కారణమై ఉండవచ్చని సమాచారం. -
యూపీ ప్రచారానికి అగ్రనేతలు అనుమానమే?
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేతల ప్రచారంపై సందిగ్ధత నెలకొంది. వయనాడ్ ఉప ఎన్నికకు పోలింగ్ ఈ నెల 13న ముగిసిన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాందీ, ప్రియాంకగాందీలు యూపీలో ఈ నెల 20న 9 స్థానాలకు జరుగనున్న ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని భావించినా ఇంతవరకు పార్టీ తరఫున ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా రాహుల్, ప్రియాంకలు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో వారు ప్రచారం చేయడం కష్టమేనని తెలుస్తోంది. నిజానికి యూపీలో జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయాలని భావించింది. 9 స్థానాలకు గానూ కనీసంగా 4 స్థానాలకు తమకు వదిలేయాలని భాగస్వామ్య పార్టీ అయిన సమాజ్‌వాదీ పార్టీని కోరినప్పటికీ ఆ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ నుంచి సానుకూల స్పందన రాలేదు. చివరి 2 స్థానాలు ఇచ్చేందుకు ఎస్పీ అంగీకరించినా, గెలుపు అవకాశాలు లేకపోవడంతో వాటిల్లో పోటీకి కాంగ్రెస్ నిరాకరించింది. తొమ్మిది స్థానాల్లోనూ ఇండియా కూటమి తరఫున ఎస్పీ అభ్యర్థులే పోటీ చేస్తారని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయా స్థానాల్లో అఖిలేశ్ యాదవ్ దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. అధికార బీజేపీని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ అగ్రనేతలు మాత్రం ఇంతవరకు ప్రచారంలో పాల్గొనలేదు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అజయ్‌రాయ్ సహా మాజీ ఎంపీ పీఎల్ పునియాలు ఎస్పీతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ప్రచారం కోసం కాంగ్రెస్, ఎస్పీలు నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర సీఎల్పీ నేత ఆరాధన మిశ్రా, కాంగ్రెస్ ఎంపీ తనూజ్ పునియాలు ఎస్పీతో కలిసి సంయుక్త ర్యాలీలు నిర్వహిస్తున్నా, అంతంతమాత్రం స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో అగ్రనేతలతో ఉమ్మడి ప్రచార ప్రణాళికను రూపొందించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఉమ్మడి ఎన్నికల ప్రచారాలు, బహిరంగ సభల కోసం సత్వరమే షెడ్యూల్ ఖరారు చేసి, అధికార బీజేపీ విభజన రాజకీయాలను బట్టబయలు చేసే కార్యాచరణ తీసుకోవాలని ఇరు పారీ్టల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నా.. అగ్రనేతల ప్రచారంపై ఇంతవరకు ఏఐసీసీ నుంచి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. -
Rahul Gandhi: ఏమీ ఉండదనే చదవలేదనుకుంటా
నందూర్బార్(మహారాష్ట్ర): తాను తరచూ ప్రదర్శించిన ఎరుపురంగు రాజ్యాంగప్రతి అంతా ఖాళీ అంటూ ప్రధాని మోదీసహా అధికార బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు లోక్‌సభలో విపక్ష నేత గట్టి సమాధానమిచ్చారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నందూర్బాగ్ పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ ప్రసంగిస్తూ ప్రధానిపై విమర్శలు గుప్పించారు. ‘‘ రాజ్యాంగ ప్రతి కవర్ ఎరుపు రంగులో ఉందా నీలం రంగులో ఉందా అనేది మనం ఎప్పుడూ చూడలేదు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రాణాలు ఇచ్చేందుకైనా సిద్ధపడ్డాం. ఇంతటి ఘనత గల రాజ్యాంగంలో ఏమీ లేదని, ఏమీ ఉండదని ప్రధాని మోదీజీకి గట్టి నమ్మకం కల్గిందేమో. ఎందుకంటే జీవితంలో ఆయన ఎప్పుడూ ఈ రాజ్యాంగాన్ని చదివిఉండరు. ఏమీ ఉండదనే చదవలేదనుకుంటా. అందుకే నేను ర్యాలీల్లో చూపించే ఎరుపురంగు రాజ్యాంగప్రతి లోపల అన్నీ తెల్లపేజీలే అని చెబుతున్నారు. మోదీజీ ఇది ఖాళీ పుస్తకం కాదు. భారతీయ ఆత్మ, జ్ఞానానికి ఆలవాలం ఈ పుస్తకం. బిర్సా ముండా, బుద్ధుడు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మా పూలే, మహాత్మాగాంధీల ఆత్మతో భారత రాజ్యాంగం నిండి ఉంది. అయినాసరే మీరు ఈ పుస్తకం ఖాళీ అని అంటున్నారంటే మీరు వీళ్లందరినీ అవమాని స్తున్నట్లే’’ అని రాహుల్ అన్నారు. ‘‘ ఆదివా సీలు, దళితులు, వెనుకబడిన వర్గాలకు నిర్ణయాధికారం దక్కాలి కాంగ్రెస్ పార్టీ ఆశిస్తోంది. బీజేపీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లు గిరిజనులను ఆదివాసీలు అని సంభోదించకుండా వనవాసులు అని పిలుస్తు న్నారు. నీరు, భూమి, అడవిపై తొలి హక్కు దారులు ఆదివాసీలే. ఎలాంటి హక్కులు కల్పించకుండా బీజేపీ ఆదివాసీలను అడవికి పరిమితం చేసింది. బిర్సా ముండా ఇవే హక్కుల కోసం పోరాడి వీరమరణం పొందారు’’ అని రాహుల్ అన్నారు. మేనిఫెస్టోను ప్రస్తావించిన రాహుల్‘‘మహారాష్ట్రలో విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంబీఏ) జనప్రయోజన వాగ్దానాలతో మేనిఫెస్టోను మీ ముందుకు తెచ్చింది. అధికారంలోకి వస్తే మా కూటమి సర్కార్ రైతులు, యువతకు నెలకు రూ.3,000 ఆర్థిక తోడ్పాటు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రూ.3,00,000 దాకా రుణమాఫీ, నిరుద్యోగయువతకు నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి అందించనుంది. దళితులు, వెనుకబడిన వర్గాలు, ఆదివాసీల అసలైన జనసంఖ్య తెలిస్తే వారికి ఆ మేరకు వనరుల్లో న్యాయమైన వాట దక్కుతుంది. అందుకు జనగణన ఎంతగానో దోహదపడనుంది. ప్రస్తుతం 80 శాతం గిరిజనుల జనాభాలో నిర్ణాయాత్మక స్థాయి లో కేవలం ఒక శాతం మంది మాత్రమే ఉన్నారు’’ అని అన్నారు. ఒక్కరే ఆదివాసీ ఆఫీసర్‘‘కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నత ఉన్న తాధికారులు 90 మంది ఉంటే వారిలో ఆదివాసీ వ్యక్తి ఒక్కరే ఉన్నారు. ఉదాహరణకు ఈ 90 మంది అధికారులు రూ.100 విలువైన ప్రజాపనులపై నిర్ణయాలు తీసుకుంటే ఆదివాసీ అధికారి నిర్ణయంపై ఆధారపడే పనుల విలువ కేవలం 10 పైసలు. మొత్తంగా చూస్తే పనిచేసే ఆ కొద్ది మంది ఆదివాసీ అధికారులను కీలకమైన శాఖల్లో ఉండనివ్వ రు. అప్రాధాన్యమైన విభాగాల్లో, పోస్టుల్లో నియమిస్తున్నారు. ఈ పద్ధతి మారాలి. మనం ఈ పద్ధతిని మారుద్దాం’’ అని రాహుల్ అన్నారు. -
కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎం!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుతం రాహుల్ గాందీకి తెలంగాణ రాష్ట్రం ఏటీఎంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడికి తెలంగాణ నుంచే డబ్బు మూటలు వెళ్తున్నాయని ఆరోపించారు. మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దుల్లో భద్రతను పెంచాలని, ఆన్లైన్ లావాదేవీలపై మరింత నిఘా పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్నామన్నారు. పలు సందర్భాల్లో తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ కట్టాలంటూ వ్యాఖ్యానించిన ప్రధానమంత్రి మోదీ.. సీఎం రేవంత్‌రెడ్డి అవినీతిపై చర్యలు తీసుకోరా అంటూ ప్రశ్నించారు.అమృత్ స్కీంలో జరిగిన స్కాంపై కేంద్ర విజిలెన్స్ కమిషన్‌తో విచారణ జరిపించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు ఈ స్కాంపై చర్యలు తీసుకోకపోతే తాము రాజ్యసభలో ఈ అంశాన్ని లెవనెత్తి దేశమంతా ఆలోచించేలా చేస్తామని కేంద్రమంత్రిని హెచ్చరించినట్లు చెప్పారు. మంగళవారం వసంత్‌విహార్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు సురేశ్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దామోదరరావు, మాజీ ఎంపీ బాల్క సుమన్, దాసోజు శ్రవణ్‌లతో కలిసి కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కొడంగల్ వాసులకు విషం సొంత బావమరిది సృజన్‌రెడ్డికి అమృతం ఇచి్చన సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్ వాసులకు మాత్రం విషం ఇచ్చారని కేటీఆర్ మండిపడ్డారు. బావమరిది కంపెనీని అందలమెక్కించేందుకు రేవంత్ భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రుణమాఫీ, రైతుబంధు, పింఛన్లు, తులం బంగారం, మహిళలకు రూ.2,500 ఇచ్చేందుకు డబ్బు లేదు కానీ.. మహారాష్ట్రలో మాత్రం రూ.300 కోట్లతో పేపర్ యాడ్స్ ఇచ్చారని ధ్వజమెత్తారు.రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతిపై వివరాలిచి్చనా కేంద్రం ఇప్పటివరకూ విచారణ జరపలేదని మండిపడ్డారు. బీజేపీకి చెందిన 8 మంది ఎంపీలు ఎవరైనా రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై ప్రశ్నించారా అని నిలదీశారు. సీఎం హైదరాబాద్‌ను నాలుగు ముక్కలుగా చేసే కుట్రలో బీజేపీ ఎంపీలు మద్దతు పలుకుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ నుంచి పెట్టుబడులు బీజేపీపాలిత రాష్ట్రాలకు తరలించాలన్నదే రేవంత్ ఎజెండా అని వ్యాఖ్యానించారు. రేవంత్ 26 సార్లు ఢిల్లీ వచ్చారు... 11 నెలల్లో 26 సార్లు ఢిల్లీకి వచి్చన సీఎం రేవంత్ తెలంగాణకు రూ.26 పైసలు కూడా తీసుకురాలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘నేను ఢిల్లీకి వస్తే మీకేం పని అని మంత్రి పొంగులేటి అంటున్నాడు. మీ కుంభకోణాలు, మీ చేతగాని పాలనను దేశ ప్రజల ముందుకు తెచ్చేందుకే ఢిల్లీకి వచ్చాను. పౌరసరఫరాల శాఖలో అవినీతి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీల లీలలు కూడా బయటపెట్టేందుకు మళ్లీ మళ్లీ ఢిల్లీకి వస్తాను. నేను ఈ సమావేశం అనంతరం హైదరాబాద్‌కు వస్తా.. మీకు (కాంగ్రెస్ ప్రభుత్వానికి) దమ్ముంటే ఏదైనా చేయండి. ఎన్ని ఏజెన్సీలనైనా రప్పించుకోండి’అని కేటీఆర్ అన్నారు. 2–3 వారాల క్రితం కోహినూర్ హోటల్లో పొంగులేటి అదానీని రహస్యంగా కలిసి కాళ్లు పట్టుకున్నారా లేదా అని వ్యాఖ్యానించారు. కులగణన పేరుతో 75 ప్రశ్నలు కేసీఆర్ పేరు తలవనిదే ఒక్కరోజు కూడా సీఎం రేవంత్‌కు నిద్రపట్టదని కేటీఆర్ విమర్శించారు. ప్ర జలు కేసీఆర్ పేరు మర్చిపోతే సీఎంకు వచి్చన బా ధ ఏంటని ప్రశ్నించారు. కులగణనకు తాము వ్యతిరేకం కాదని, కానీ ఆ పేరుతో 75 ప్రశ్నలు వేయడమేంటని నిలదీశారు. ఎవరైనా కులం, మతం వివరాలు అడుగుతారని, కానీ.. మీ ఇంట్లో ఫ్రిజ్ ఉందా, టీవీ ఉందా, ఏసీ ఉందా అనే ప్రశ్నలు అడుగుతున్నారని దుయ్యబట్టారు. అవి లేకపోతే నువ్వేమైనా కొనిస్తావా అంటూ సీఎంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎమ్మెల్యేలను మేకలను కొన్నట్లు కొంటున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. రాష్ట్రంలో తమ పార్టీకి చెందిన పదిమంది ఎమ్మెల్యేలను కూడా ఇలాగే కొన్నారనే విషయం మర్చిపోవద్దన్నారు.పనికిరాని పాలనలో ఆగంపసలేని, పనికిరాని పాగల్ పాలనలో తెలంగాణ ఆగమవుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘తెలంగాణ తల్లడిల్లుతూ తిరగబడుతోంది. కుటుంబ దాహం కోసం జరుగుతున్న కుట్రలపై లగచర్ల పోరాడుతోంది. మా భూములు మాకేనని కొడంగల్ కొట్లాడుతోంది. కుట్రలు, కుతంత్రపు పాలనలో జనం కోపం కట్టలు తెంచుకుంటోంది. ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర, హైడ్రా దౌర్జన్యాలు, మూసీలో ఇళ్ల కూల్చివేతలు ఇలా పలు అంశాలపై అనేక మంది ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్ల మహా ధర్నా, పెండింగ్ బకాయిల కోసం మాజీ సర్పంచ్ల నిరసన, పరీక్షల నిర్వహణపై విద్యార్థుల ఆగ్రహం, ఫార్మా పరిశ్రమలకు భూములు ఇవ్వమంటూ అన్నదాత కన్నెర్ర వంటి ఘటనలు రాష్ట్రంలో ప్రతీరోజు కనిపిస్తున్నాయి’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
రాజ్యాంగం అంతానికి కుట్రలు
గోండియా/న్యూఢిల్లీ: మన దేశ రాజ్యాంగాన్ని అంతం చేసేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్తోపాటు ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిరోజూ 24 గంటలూ పని చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యాంగాన్ని చదవలేదని తాను గ్యారంటీగా చెప్పగలనని అన్నారు. ఒకవేళ నిజంగా ఆయన చదివి ఉంటే రాజ్యాంగంలో రాసి ఉన్న అంశాలను తప్పనిసరిగా గౌరవించేవారని పేర్కొన్నారు.ఐక్యత, సమానత్వం, అన్ని మతాల పట్ల గౌరవాన్ని రాజ్యాంగం బోధిస్తోందని గుర్తుచేశారు. విద్వేషం, అణచివేత, అసమానత్వాన్ని వ్యతిరేకిస్తోందని తెలిపారు. మంగళవారం మహారాష్ట్రలోని గోండియాలో ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. పదేళ్లలో ఎంతమంది రైతుల రుణాలను మాఫీ చేశారో ప్రధానిని ప్రశ్నించాలని ప్రజలను కోరారు. ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలి్చవేయడం రాజ్యాంగబద్ధమేనా? అని నిలదీశారు. రాజ్యాంగాన్ని బలహీనపర్చడం బీజేపీకి అలవాటేనని మండిపడ్డారు. అత్యున్నత పర్యాటక కేంద్రంగా వయనాడ్ కేరళలోని వయనాడ్‌ను అత్యున్నత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని తాను, తన సోదరి ప్రియాంకాగాంధీ వాద్రా సంకలి్పంచామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక వీడియోను తన యూట్యూబ్ ఖాతాలో విడుదల చేశారు. సోమవారం ప్రియాంకతో కలిసి వయనాడ్ అడ్వెంచర్ పార్కును సందర్శించిన దృశ్యాలను పంచుకున్నారు. ఇటీవల ప్రకృతి విపత్తుల కారణంగా తీవ్రంగా నష్టపోయినప్పటికీ వయనాడ్ ప్రజల్లో ఆత్మస్థైర్యం తగ్గిపోలేదని, వారిని చూసి స్ఫూర్తిని పొందామని పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యరి్థగా ప్రియాంక పోటీ చేస్తున్న వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నిక బుధవారం జరుగనున్న సంగతి తెలిసిందే. -
ముంబయి: రాహుల్‌గాంధీపై అమిత్ షా ఫైర్
ముంబయి: రాహుల్‌గాంధీ నాలుగు తరాలొచ్చినా జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 పునరుద్ధరించలేరని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం(నవంబర్ 11) ముంబయిలో నిర్వహించిన ప్రచార సభలో అమిత్ షా ప్రసంగించారు.‘ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ఉగ్రవాదం, నక్సలిజం నిర్మూలించారు.మీ నాలుగు తరాలొచ్చినా కశ్మీర్లో ఆర్టికల్ 370 పునరుద్ధరణ సాధ్యం కాదని రాహుల్‌కు చెబుతున్నా.బీజేపీకి రాజకీయ అధికారం కన్నా కశ్మీర్ సమస్యే హృదయానికి దగ్గరగా ఉంటుంది’అని అమిత్ షా అన్నారు. కాగా, ఇటీవలే మహారాష్ట్రలో బీజేపీ మేనిఫెస్టోను అమిత్ షా విడుదల చేశారు.వృద్ధులకు పెన్షన్ పెంపు, మహిళలకు నగదు బదిలీ వంటి హామీలను బీజేపీ ఇచ్చింది. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరగనున్నాయి. 23న ఫలితాలు వెలువడనున్నాయి. మహాయుతి(ఎన్డీఏ), మహావికాస్ అఘూడీ(ఎంవీఏ) కూటములు ఎన్నికల్లో పోటీపడుతున్నాయి.ఇదీ చదవండి: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం.. కన్నెత్తి చూడని సెలబ్రిటీలు -
మహారాష్ట్రలో లబ్ధి కోసమే ఇక్కడ కులగణన డ్రామా
హనుమకొండ/యాదగిరిగుట్ట రూరల్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో కులగణన డ్రామా ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు ధ్వజమెత్తారు. కులగణనలో ఆస్తులు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, ఆదాయం వంటి వివరాలు ఎందుకంటూ ప్రజలు అధికారులను నిలదీస్తున్నారని విమర్శించారు. ఆదివారం ఆయన హనుమకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించి ఏడాది అవుతున్నా దానిపై ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 11 నెలలవుతున్నా దానిని అమలు చేయలేదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తున్నామని అబద్ధాలు ఆడుతున్నారని, ఏ ఒక్కరికైనా బోనస్ ఇచ్చినట్లు చూపిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరం రాజీనామా చేస్తామని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతున్న సందర్భంగా వారోత్సవాలు నిర్వహించాలా..? విజయోత్సవాలు నిర్వహించాలా అనే ఆలోచన చేస్తున్నారని, వారు విజయోత్సవాలు నిర్వహిస్తే.. తాము కాంగ్రెస్ పరిపాలనా వైఫల్యాలపై వారోత్సవాలు నిర్వహిస్తామని అన్నారు.రేవంత్‌రెడ్డి రాగానే బీసీబంధు, రైతుబంధు, దళితబంధు.. ఇలా అన్నీ బందయ్యాయని కేటీఆర్ అన్నారు. కులగణన పూర్తయిన తర్వాత బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ బాంబులు.., ఆ బాంబులు పేలుతాయంటున్న ఆ మంత్రి ఏ ఒక్క బాంబు పేల్చేది లేదని, ఆయన ఏ మంత్రి ఏమోకాని బాంబుల మంత్రి అని పేరు పెట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ఉద్దేశించి అన్నారు. అధైర్యపడొద్దు.. మళ్లీ వచ్చేది కేసీఆర్ సారే రైతులు అధైర్యపడవద్దని, మళ్లీ కేసీఆర్ సారే వస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం ఆయన వరంగల్ జిల్లాలో పర్యటించేందుకు వెళ్తుండగా, భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామం వద్ద ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలసి కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా చొల్లేరు గ్రామానికి చెందిన తోటకూరి వెంకటమ్మ అనే వృద్ధురాలు కేటీఆర్ వద్దకు వెళ్లి.. ‘కేసీఆర్ సారు పాలననే బాగుండేది, మాకు రైతుబంధు క్రమం తప్పకుండా వేసేవాడు, ఆ డబ్బులతో వ్యవసాయం చేసుకుని సంతోషంగా ఉండేవాళ్లం, ఇప్పుడు రైతుబంధు రావడం లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాం’అని అన్నారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. బాధపడవద్దని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని, కేసీఆర్ సారే మళ్లీ సీఎం అవుతారని భరోసా ఇచ్చారు.పగ నామీదే అయితే పదవిని వదిలేస్తా: కేటీఆర్సిరిసిల్లటౌన్: ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నామీద పగ ఉంటే.. సిరిసిల్ల ఎమ్మెల్యే పదవిని రేపే వదిలేస్తా’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 11 నెలల్లో 34 మంది చేనేత కార్మికులు చనిపోయారని, ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి కళ్లు తెరవాలని, చేనేత కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సిరిసిల్లలో శనివారం ఆత్మహత్యకు పాల్పడిన నేత దంపతులు బైరి అమర్నాథ్, స్రవంతి పిల్లలు లహరి, శ్రీవల్లి, దీక్షిత్నాథ్లను ఆదివారం ఆయన పరామర్శించారు. పిల్లలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 34 మంది నేత కార్మికులు బలవన్మరణాలకు పాల్పడినా ప్రభుత్వానికి సోయి రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా సర్కారు సిగ్గు తెచ్చుకోవాలని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ, కేసీఆర్ కిట్ల ఆర్డర్లు రాక సిరిసిల్లలో నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే చోద్యం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల వస్త్రపరిశ్రమకు ఆర్డర్లు ఇచ్చేదాకా బీఆర్ఎస్ తరఫున ప్రభుత్వంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు -
Rahul Gandhi: బీజేపీ విధానాలతో ప్రజలకు చావులే
జంషెడ్పూర్/ధన్‌బాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు ప్రజల ప్రాణాలను బలిగొంటున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అనేవి రైతులు, కార్మికులు, పేదలను చంపేస్తున్న ఆయుధాలు అని ధ్వజమెత్తారు. విద్వేషాన్ని విశ్వసించే బీజేపీ–ఆర్ఎస్ఎస్, ప్రేమను నమ్మే ‘ఇండియా’కూటమి మధ్య యుద్ధం జరుగుతోందని చెప్పారు. హింసకు, ఐక్యమత్యాన్ని మధ్య యుద్ధం కొనసాగుతోందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విధానాలతో దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతోందని ఆరోపించారు. శనివారం జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్ విభజన రాజకీయాలు చేస్తున్నాయని, కులం, మతం, భాష ఆధారంగా సమాజాన్ని విడగొట్టాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని బీజేపీ–ఆర్ఎస్ఎస్ ప్రయతి్నస్తుండగా, తాము పరిరక్షించేందుకు పోరాడుతున్నామని తెలిపారు. కొందరు బడా పెట్టుబడిదారులకు ప్రధాని మోదీ నిధులు అందజేస్తున్నారని, వారు ఆ సొమ్మును విదేశాల్లో పెట్టుబడులుగా పెడుతున్నారని ఆరోపించారు. జంషెడ్‌పూర్‌లో ప్రసంగిస్తుండగా మధ్యలో ‘అజాన్’వినిపించడంతో రాహుల్ గాంధీ రెండు నిమిషాలపాటు విరామం ఇవ్వడం గమనార్హం.మహారాష్ట్రలోనూ కుల గణన సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలోనూ అధికారంలోకి వచ్చిన వెంటనే కుల గణన ప్రక్రియ ప్రారంభిస్తామని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చెప్పారు. తెలంగాణలో ప్రారంభమైన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ప్రస్తావిస్తూ ఈమేరకు ఆయన శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
ఆర్టికల్ 370 పునరుద్ధరణపై రాహుల్ గాంధీకి అమిత్ షా వార్నింగ్
రాంచీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాజ్యాంగానికి సంబంధించిన నకిలీ కాపీని చూపించి అవమానించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. మైనారిటీలకు రిజర్వేషన్లు అమలు చేసేందుక కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలను బీజేపీ ఎప్పటికీ అనుమతించదని అన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా.. పాలమూలో నిర్వహించిన సభలో మాట్లాడారు.‘‘రాహుల్ గాంధీ రాజ్యాంగం కాపీని చూపించారు. ఆయన చూపించిన రాజ్యాంగం కాపీ కవర్‌పై భారత రాజ్యాంగం అని వ్రాసి ఉంది. అందులో ఏ కంటెంట్ లేదు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేశాడు. నకిలీ రాజ్యాంగ కాపీతో బీఆర్ అంబేద్కర్‌ను అవమానించారు. నవంబర్ 26వ తేదీని రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. ఓబీసీలు, గిరిజనులు, దళితుల నుంచి రిజర్వేషన్లను లాక్కోవడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. ఆ రిజర్వెషన్లనుమైనారిటీలకు ఇవ్వాలని యోచిస్తోంది. ప్రధాని మోదీ నాయకత్వంలో.. మత ఆధారిత రిజర్వేషన్లను బీజేపీ ఎన్నటికీ అనుమతించదు. కశ్మీర్లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం. కాంగ్రెస్ నాలుగో తరం కూడా ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురాదని నేను రాహుల్ గాంధీని హెచ్చరిస్తున్నా. జార్ఖండ్‌లో జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వం.. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వాన్ని దించాల్సిన అవసరం ఉంది. ఇక.. అవినీతిపరులను తలకిందులుగా వేలాడదీస్తాం’ అని అన్నారు.ఇక.. జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. నవంబర్ 23న ఫలితాలు విడుదల కానున్నాయి.చదవండి: దారుణం: రైలు ఇంజిన్-బోగీల మధ్య ఇరుక్కుపోయి ఉద్యోగి మృతి -
రాహుల్ భావితరాలు కూడా.. ఆర్టికల్ 370ని పునరుద్ధరించలేవు
సాంగ్లి (మహారాష్ట్ర): కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీ, ఆయన వారసులు కూడా జమ్మూశ్మీమర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 పునరుద్ధరించలేరని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. అది వారి వల్లకాదన్నారు. సాంగ్లిలో మహాయుతి తరఫున శుక్రవారం అమిత్ షా ప్రచారంలో పాల్గొన్నారు. ప్రత్యేక ప్రతిపత్తి పునరుద్ధరించాలని సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం బుధవారం జమ్మూశ్మీమర్ అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీనికి కాంగ్రెస్ మద్దతునివ్వడంతో అమిత్ షా హస్తం పార్టీని లక్ష్యంగా చేసుకున్నారు. ఆర్టికల్ 370 రద్దును విపక్ష నేతలు రాహుల్ గాందీ, ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్లు వ్యతిరేకించారని షా గుర్తుచేశారు. ‘ఛత్రపతి శివాజీ మహారాజ్ గడ్డపై నుంచి చెబుతున్నా.. రాహుల్ బాబా. మీరు లేదా మీ నాలుగోతరం వారసులు కూడా ఆర్టికల్ 370ని పునరుద్ధరించలేరు. శ్మీమర్ కోసం దేశంలోని ప్రతి వ్యక్తి పోరాటానికి సిద్ధంగా ఉన్నారు’అని అమిత్ షా అన్నారు. ‘ఆర్టికల్ 370ని రద్దు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నపుడు పార్లమెంటులో నేనా బిల్లును ప్రవేశపెట్టాను. రాహుల్ గాం«దీ, మమతా బెనర్జీ, శరద్ పవార్, అఖిలేశ్ యాదవ్, ఎంకే స్టాలిన్లు దీన్ని వ్యతిరేకించారు. దీనివల్ల శ్మీమర్ లోయలో రక్తపాతం జరుగుతుందన్నారు. రక్తం ప్రవహించడం మాట అటుంచితే కనీ సం రాయి విసిరే సాహసం కూడా ఎవరూ చేయలేదు’అని అమిత్ షా పేర్కొన్నారు. యూపీఏ హయాంలో తరచూ ఉగ్రదాడులు జరిగేవి. ఉరి, పుల్వామా ఘటనల తర్వాత చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్‌తో పాకిస్తాన్‌లోని తీవ్రవాదులు తుడిచిపెట్టుకుపోయారని ఆయన అన్నారు. 70 ఏళ్లుగా అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని కాంగ్రెస్ అడ్డుకుందని ఆరోపించారు. మోదీ ప్రయత్నాల వల్ల అది సాకారమైందని అమిత్ షా అన్నారు. -
మణిపూర్‌ను మంటల్లోకి నెట్టేసింది
లోహార్‌దాగా/సిండెగా(జార్ఖండ్): కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బీజేపీపై విమర్శలను తీవ్రతరం చేశారు. కాషాయ పార్టీ మణిపూర్‌కు మంటపెట్టిందని, దేశ ప్రజలను మతం ప్రాతిపదికగా విభజించేందుకు ప్ర యత్నిస్తోందని మండిపడ్డారు. దేశంలోని 90 శాతం మంది ప్రజల హక్కులు, ప్రయోజనాలను దెబ్బతీస్తోందని విమర్శించారు. రాహు ల్ శుక్రవారం జార్ఖండ్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీల్లో పాల్గొని, ప్రసంగించారు. ‘బీజేపీ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులను ఒకరిపై మరొకరిని ఉసిగొల్పుతోంది. ఇటీవల హరియాణాలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో జాట్లు, జాట్‌యేతరుల మధ్య చిచ్చుపెట్టింది. ఇదే బీజేపీ నైజం’అని అన్నారు. ప్రజల మధ్య విద్వేషాలకు బదులు ప్రేమను పెంచేందుకే కశీ్మర్ నుంచి కన్యాకుమారి వరకు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు. ‘దళితులు, గిరిజనుల కోసం గళం వినిపించినప్పుడల్లా దేశాన్ని విభజిస్తున్నానంటూ నాపై బీజేపీ విమర్శలు చేస్తోంది. కానీ, నేను దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు, బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నా. దేశం జనాభాలో 90 శాతం ఉన్న గిరిజనులు, దళితులు, ఓబీసీలకు పాలనలో భాగస్వామ్యం కోసం మాట్లాడటమే తప్పయినట్లయితే, ఇకపైనా ఇదే పనిని కొనసాగిస్తా’అని రాహల్ అన్నారు. రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేస్తాం అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేస్తామని హామీ ఇచ్చా రు. జార్ఖండ్‌లో అధికారంలోకి వస్తే ఎస్టీల రిజర్వేషన్లను 26 శాతం నుంచి 28 శాతానికి, ఎస్సీల కోటాను 10 నుంచి 12 శాతానికి, ఓబీసీలకు 14 నుంచి 27 శాతానికి రిజర్వేషన్లను పెంచుతామన్నారు. కులగణనతో గిరిజనులు, దళితులు, ఓబీసీల ప్రాతినిధ్యం తగు రీతిలో పెరుగుతుందని చెప్పారు. బీజేపీ రైతు రుణాలు మాఫీ చేసిందా? యూపీఏ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు తీసుకున్న రూ.72 వేల కోట్ల రుణాలను మాఫీ చేసిందంటూ విమర్శలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం..దేశంలోని 25 మంది పారిశ్రామికవేత్తలు తీసుకున్న రూ.16 లక్షల కోట్ల రుణాలను రద్దు చేసిందని రాహుల్ చెప్పారు. ‘జార్ఖండ్‌లోని రైతుల రుణాలను బీజేపీ ప్రభుత్వం మాఫీ చేసిందా? లేదు..ఎందుకంటే మీరంతా గిరిజనులు, దళితులు, ఓబీసీలు కాబట్టి. పెట్టుబడిదారుల రుణాలను రద్దు చేసిన బీజేపీ ప్రభుత్వం మీరు తీసుకున్న అప్పులను మాత్రం మాఫీ చేయదు’అని ఎద్దేవా చేశారు. గిరిజన ప్రజల నుంచి నీరు, భూమి, అడవి(జల్, జంగల్, జమీన్)ని లాగేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది’అని ఆయన ఆరోపించారు. ఇది సైద్ధాంతిక పోరాటం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలను ఇండియా కూటమి, బీజేపీ–ఆర్ఎస్ఎస్ల మధ్య జరుగుతున్న సైద్థాంతిక పోరుగా రాహుల్ అభివరి్ణంచారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్ల లక్ష్యం దేశ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడమే, ఇండియా కూటమి లక్ష్యం రాజ్యాంగ పరిరక్షణే అన్నారు. జలం, అడవి, భూమి తమవేనని కాషాయ పార్టీ, ఆర్ఎస్ఎస్, పెట్టుబడిదారులు భావిస్తున్నారు..అందుకే, ప్రధాని మోదీ గిరిజనులను వనవాసీలంటూ సంబోధిస్తున్నారని ఆరోపించారు. -
నేను వ్యాపార వ్యతిరేకిని కాదు: రాహుల్ గాంధీ క్లారిటీ
న్యూఢిల్లీ: తాను వ్యాపారానికి వ్యతిరేకం కాదని, కేవలం గుత్తాధిపత్యాన్ని మాత్రమే వ్యతిరేకిస్తానని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తాను న్యాయమైన వ్యాపార పద్దతులకు మద్దతు ఇస్తానని పేర్కొన్నారు. భారత్‌లో కార్పొరేట్ శక్తులపై రాహుల్చేసిన వ్యాఖ్యలను బీజేపీ విమర్శించడంతో.. ఆయన ఈ విధంగా స్పందించారు. ఈ మేరకు గురువారం రాహుల్ మాట్లాడుతూ.. ‘నేను ఓ విషయాన్ని ఖచ్చితంగా స్పష్టం చేయాలనుకుంటున్నాను. బీజేపీలోని కొందరు వ్యక్తులు నన్ను వ్యాపార వ్యతిరేకిగా చిత్రీకరిస్తున్నారు. నేను వ్యాపార వ్యతిరేకిని అస్సలే కాదు. ఉద్యోగాల కల్పన, వ్యాపారానికి, ఆవిష్కరణలకు, పోటీతత్వానికి మద్దతు ఇస్తా.నేను గుత్తాధిపత్యానికి వ్యతిరేకిని. మార్కెట్ నియంత్రణ శక్తులకు వ్యతిరేకిని. కేవలం కొంతమంది వ్యక్తులే ఆధిపత్యం చేలాయించడానికి విరుద్దం’ అని రాహుల్ పేర్కొన్నారు. మేనేజిమెంట్ కన్సల్టెంట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించానన్న రాహుల్.. వ్యాపారం విజయానికి అవసరమైన అంశాలను అర్థం చేసుకోగలనని తెలిపారు. తన వ్యాఖ్యలు కేంద్రీకృత శక్తికి వ్యతిరేకంగా ఉన్నాయని, సంస్థకు వ్యతిరేకంగా కాదని పునరుద్ఘాటించారు. -
రాహుల్ గాంధీది ఏ కులం..?
-
సామాజిక న్యాయం జరగాలంటే కులగణన అవసరం
-
అణువణువునా కుల వివక్ష: రాహుల్‌గాంధీ
సాక్షి, హైదరాబాద్: ‘భారత సమాజంలో కుల వివక్ష అన్నిచోట్లా లోతుగా, బలంగా ఉంది. అణువణువునా దేశంలో కుల వివక్ష ఉందన్న వాస్తవాన్ని అందరం అంగీకరించాల్సిందే. ఈ వివక్ష కేవలం దేశ ప్రజల జీవితాలను విధ్వంసం చేయడమే కాదు.. భారత రాజ్యాంగానికి, జాతికి సైతం ముప్పులా పరిణమించింది..’ అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ కంపెనీలు, న్యాయ వ్యవస్థ, రాజకీయ రంగం.. ఇలా ప్రతిచోటా ఉన్న ఈ వివక్ష దేశ ప్రజల భవిష్యత్తుపై ప్రభావం చూపుతోందని, దేశంపై వారి నమ్మకాన్ని దెబ్బతీస్తోందని అన్నారు. తాను వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం లేదని, కులవివక్షను అందరూ అంగీకరించి దేశ వాస్తవ పరిస్థితిని ప్రజల ముందు ఉంచాల్సిందేనని స్పష్టం చేశారు. కులంతో కూడిన అసమానత చాలా దారుణమని, దళితులను ముట్టుకోని పరిస్థితులు ప్రపంచంలో మరెక్కడా ఉండవని చెప్పారు. టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన మంగళవారం బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో కులగణనపై రాష్ట్రస్థాయి సంప్రదింపుల సదస్సు జరిగింది. ఈ సదస్సుకు రాహుల్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఇది ఒక ఎక్స్‌రే లాంటిది ‘కుల వివక్ష ఎంత తీవ్రస్థాయిలో ఉందో దేశ ప్రజల ముందు ఉంచుదాం. ఇది కూడా ఎక్స్‌రే లాంటిదే. కుల వివక్షపై మాట్లాడితే దేశాన్ని నేను విభజించేందుకు ప్రయత్నిస్తున్నానని బీజేపీ నేతలు, దేశ ప్రధాని మోదీ విమర్శిస్తున్నారు. దేశ వాస్తవ పరిస్థితిని బయటపెడితే అది విభజించడమా? దేశంలో దళితులు, ఓబీసీలు, ఆదివాసీలు, మైనార్టీలు, మహిళలు, ఇతర కులాల వారు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలి. ఆ తర్వాత సంపద ఎలా పంపిణీ చేయాలో నిర్ణయించుకోవాలి. కార్పొరేట్ కంపెనీలు, న్యాయవ్యవస్థ, సైన్యంలో ఎంతమంది ఏ వర్గాల వారున్నారో అడగాలి. ఈ ప్రశ్నలను అడిగేందుకు ఎందుకు భయపడుతున్నారు? నిజాన్ని తొక్కిపెట్టాలనుకునే వారు, దీని గురించి దేశం తెలుసుకోకూడదని అనుకుంటున్నవారే ఈ ప్రశ్నలను అడ్డుకుంటున్నారు. వీరంతా కుల వివక్ష కారణంగా లబ్ధి పొందినవారే. దేశంలో కుల వివక్షను నిర్మూలిస్తానని ప్రధాని మోదీ బహిరంగంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? దేశంలోని కార్పొరేట్ కంపెనీల్లో ఎంతమంది దళితులు, న్యాయవ్యవస్థలో ఎంత మంది ఓబీసీలు, మీడియాలో ఎంతమంది ఆదివాసీలు పనిచేస్తున్నారో తెలుసుకునేందుకు మోదీ ఎందుకు ఇష్టపడడం లేదో చెప్పాలి..’ అని రాహుల్ డిమాండ్ చేశారు. కులగణనకు మోడల్‌గా తెలంగాణ ‘కులగణనకు తెలంగాణ మోడల్ అవుతుంది. ఈ అంశంలో తెలంగాణ నాయకత్వం చాలా బాగా పనిచేసింది. అయితే బ్యూరోక్రాటిక్ కులగణన వద్దు. ఈ కులగణనలో అడిగే ప్రశ్నలు అధికారులు ఎక్కడో కూర్చుని రాసేవి కాకూడదు. అదే జరిగితే ప్రజలను అవమానించడమే అవుతుంది. కులగణనలో ఏ ప్రశ్నలు అడగాలో దేశ ప్రజలే చెప్పాలి. దళితులు, ఓబీసీలు, ఆదివాసీలు, మహిళల నుంచి ఈ ప్రశ్నలు రావాలి. అప్పుడే దీని ఫలితం ఉంటుంది. కేవలం కులగణన జరగడమే కాకుండా దేశానికి అభివృద్ధి పరంగా, రాజకీయంగా ఓ అ్రస్తాన్ని ఇస్తుంది. తెలంగాణలో కేవలం కులగణన మాత్రమే జరగడం లేదు. దేశ భవిష్యత్తు కోసం ఓ పాలనా వ్యవస్థను డిజైన్ చేస్తున్నాం. తెలంగాణ నుంచే కార్యాచరణ చేపడుతున్నందుకు గర్వంగా ఉంది..’ అని రాహుల్ అన్నారు. ఉత్తమ్‌రెడ్డి.. ఎక్సెలెంట్ ప్రెజెంటేషన్ తెలంగాణలో కులగణన చేపడుతున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌లకు రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. తన ప్రసంగాన్ని చక్కగా అనువదించారని, ‘ఎక్స్లెంట్ ప్రెజెంటేషన్’ అంటూ రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని అభినందించారు. సదస్సులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల నేతలు ఆర్.కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్‌గౌడ్, ప్రొఫెసర్లు సింహాద్రి, కంచె ఐలయ్య, భూక్యా నాయక్, సూరేపల్లి సుజాత తదితరులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వందన సమర్పణ చేశారు. అంతకుముందు బేగంపేట విమానాశ్రయంలో రాహుల్‌గాంధీకి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీపీసీసీ నేతలు స్వాగతం పలికారు. సమావేశం ముగిసిన తర్వాత రాహుల్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. కులగణనకు ధైర్యం కావాలి: సీఎం రేవంత్ రాహుల్‌గాంధీ దేశ ప్రజలకు, తెలంగాణ పౌర సమాజానికి ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన చేపడుతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. కులగణనను ఎలాంటి న్యాయ వివాదాలు, విమర్శలకు తావివ్వకుండా 100 శాతం పూర్తి చేసి ఓబీసీల జనాభా లెక్కలను దేశానికి అందిస్తామని తెలిపారు. కులగణన నిర్ణయం తీసుకునేందుకు గుండె ధైర్యం కావాలని, సామాజిక బాధ్యతతో పాటు సమాన అవకాశాలుండాలనే పట్టుదల ఉండాలని రేవంత్ అన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే చిత్తశుద్ధి కూడా ఉండాలని, ఆ ఆలోచనతోనే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్నికలున్నా కులగణన సమావేశానికి రాహుల్ వచ్చారని చెప్పారు. రాహుల్ బాటలో తాము ఆయన సైనికులుగా ముందుకు వెళుతున్నామని అన్నారు. రాహుల్.. టైటానిక్ కథ ‘1912లో ఓ పడవ యూకే నుంచి అమెరికాకు బయలుదేరింది. దాని పేరు టైటానిక్. అది ఎప్పటికీ మునిగిపోదని తయారు చేసిన వాళ్లు అనుకున్నారు. కానీ సముద్రంలోని ఒక మంచు కొండను ఢీకొట్టి 20 నిమిషాల్లో ఆ పడవ మునిగిపోయింది. సముద్రం అడుగున ఉన్న ఆ కొండ కేవలం 10 శాతం మాత్రమే కనిపించడంతో ప్రమాదం జరిగింది. ఇలా దేశంలో కనిపించకుండా ఉన్న కుల వివక్ష అనే వ్యాధి చాలా ప్రమాదకరమైనది. దీని గురించి తెలుసుకునేందుకు పరీక్షలు చేయాలని అనుకుంటున్నాం. ఇందులో కులగణన అత్యంత కీలకం..’ అని రాహుల్ చెప్పారు. -
తెలంగాణ కులగణన దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది: రాహుల్ గాంధీ
హైదరాబాద్, సాక్షి: కులవివక్ష, కులవ్యవస్థ ఉన్నప్పుడు అసమానతలు కూడా ఎక్కువగా ఉంటాయని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. మంగళవారం సాయంత్రం నగరానికి వచ్చిన ఆయన.. బోయిన్పల్లి గాంధీ తత్వ చింతన కేంద్రంలో కులగణనపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.‘‘దేశంలో కుల వ్యవస్థ, కుల వివక్ష ఉందని అంగీకరిద్దాం. నేను దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నానని ఆరోపణలు చేస్తున్నారు. దేశం గురించి నిజం చెబితే దేశాన్ని విభజించడమా? కులగణన ద్వారా దళితులు, ఓబీసీలు, మహిళల సంఖ్యపై స్పష్టత వస్తుంది. కులగణన తర్వాత ఎవరి దగ్గర ఎంత ఆర్థిక వనరులున్నాయో తెలుసుకుందాం. కులగణన చేస్తామని పార్లమెంట్లో స్పష్టంగా చెప్పాను. అలాగే రిజర్వేషన్ల పరిమితిని తీసేస్తాం’’ అని రాహుల్ అన్నారు.రాష్ట్రంలో జరగబోయే కులగణన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. అయితే కులగణనలో ఏ ప్రశ్నలు అడగాలనేది అధికారులు నిర్ణయించకూడదని, సామాన్యులే నిర్ణయించాలని చెప్పారు. ఈ సమావేశంలో మేధావులు, బీసీ సంఘాలతో రాహుల్ ముఖాముఖిగా మాట్లాడారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి (బుధవారం, నవంబర్ 6) కులగణన ప్రారంభం కానుంది.ఇదీ చదవండి: తెలంగాణ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే.. ప్రశ్నలు ఇవే.. -
అప్పుడే రాహుల్ రాష్ట్రంలో అడుగు పెట్టాలి: బండి సంజయ్ సవాల్
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటనపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పాకే తెలంగాణలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఎన్నో హామీలు ఇచ్చారన్న సంజయ్.. వాటిపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉందన్నారు. మంగళవారం సిరిసిల్లా జిల్లా రుద్రంగిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బండి సంజయ్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సెంట్రల్ లైబ్రరీకి, యూనివర్సిటీకి వెళ్లి మరీ యువతకు రాహుల్ గాంధీ హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. మహిళలు, రైతులతో పాటు అన్ని వర్గాల వారికీ ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చారన్నారు. ఇక్కడ ఆరు గ్యారంటీలు, ఇచ్చిన హామీలేవీ అమలు చేయకుండానే మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణాలో అన్నీ చేసినట్టు కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటోందని మండిపడ్డారు. ఏ గ్యారంటీలు అమలు చేశారో ముందు చెప్పాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర డబ్బంతా తీసుకెళ్లి మహారాష్ట్రలో యాడ్స్ ఇస్తోందని ఆరోపించారు బండి సంజయ్. గతంలో కేసీఆర్ కూడా ఇక్కడి రైతులను ఎండబెట్టి పంజాబ్ రైతులకు ఇక్కడి డబ్బులిచ్చాడని విమర్శలు గుప్పించారు. ‘స్వయానా వ్యవసాయశాాఖ మంత్రే ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ కాలేదని చెప్పారు. ఆ విషయాన్ని అక్కడి యాడ్స్ లో ఎందుకు పేర్కొనలేదు..? ఆరు గ్యారంటీలు, ఇచ్చిన హామీలు ఏవి అమలు చేశారో చెప్పాకే రాహూల్ గాంధీ రాష్ట్రంలో అడుగు పెట్టాలి.దమ్ముంటే ఇప్పుడు రాహూల్ గాంధీ తెలంగాణాలో పాదయాత్ర చేయాలి. లక్షా యాభై వేల కోట్ల మూసీ ప్రాజెక్ట్ ఓ పెద్ద స్కామ్. కాంగ్రెస్ అధినేత్రి అల్లుడికి కట్టబెట్టేందుకు జరుగుతున్న ఓ పెద్ద స్కీమ్. దాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. సర్పంచుల సమస్యలకు కారణమే గత బీఆర్ఎస్ ప్రభుత్వం. మళ్లీ బీఆర్ఎస్సే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామనడం హాస్యాస్పదం. సర్పంచులను మోసం చేయడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ దొందూ దొందే’ అని మండిపడ్డారు. -
రేపటి నుంచి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కులగణన మొదలు
-
రాహుల్ రెండు గంటల పర్యటన
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ మంగళవారం హైదరాబాద్‌కు రానున్నారు. సుమారు రెండు గంటల పాటు నగరంలో గడపనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగణన కార్యక్రమంపై ప్రజాసంఘాలు, బీసీ సంఘాల నేతలతో సంప్రదింపులు జరపడంతో పాటు వారి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో జరగనున్న సమావేశంలో ఆయన పాల్గొంటారు.టీపీసీసీ వర్గాల సమాచారం ప్రకారం.. సాయంత్రం 4:45కు ప్రత్యేక విమానంలో మహారాష్ట్ర నుంచి రాహుల్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుంచి నేరుగా బోయిన్పల్లి సమావేశానికి వెళ్తా రు. దాదాపు 200 మంది ప్రజాసంఘాలు, బీసీ సంఘాల నేతలు, మరో 200 మంది కాంగ్రెస్ నాయకులతో జరిగే సదస్సులో పాల్గొంటారు. వారి అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు తన అభిప్రాయాలను వెల్లడించనున్నారు. కులగణన ప్రాధాన్యతను ఆయన వివరించనున్నారు.6:30 గంటల సమయంలో అక్కడి నుంచి బేగంపేట చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారు. కాగా టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ నేతృత్వంలో కులగణన సదస్సుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. సోమవారం హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆయన జిల్లా కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. బోయిన్‌పల్లిలో ఏర్పాట్లను సమీ క్షించారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు సదస్సులో పాల్గొంటారని టీపీసీసీ వర్గాలు తెలిపాయి.