aaradugula bullet
-
Aaradugula Bullet: ‘గోపీచంద్‌కు సరైన స్క్రిప్ట్ ఇది’
ఆకతాయి కొడుకు, స్ట్రిక్ట్ తండ్రి అనే కాన్సెప్ట్‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ‘ఆరడుగుల బుల్లెట్’లో ఎమోషన్స్ బాగుంటాయి. ఫాదర్ అండ్ సన్ రిలేషన్, నయనతారతో లవ్ స్టోరీ, విలన్స్‌తో క్లాష్ హై ఓల్టేజ్‌గా ఉంటుంది. గోపీచంద్‌కు సరైన స్క్రిప్ట్ ఇది’అన్నారు దర్శకుడు బి.గోపాల్. మ్యాచో స్టార్ గోపీచంద్ - నయనతార హీరో హీరోయిన్లుగా మాస్ డైరెక్టర్ బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. జయ బాలాజీ రియల్ మీడియా బ్యానర్ మీద తాండ్ర రమేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 8న ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు బీ గోపాల్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► ఆరడుగుల బుల్లెట్ ఓ కమర్షియల్ సినిమా. తండ్రీ కొడుకుల మధ్య జరిగే కథ. ఆకతాయి కొడుకుని తండ్రి దూరంగా పెట్టడం, ఆ కుటుంబం కష్టాల్లో ఉంటే ఆ కొడుకే వచ్చి కాపాడతాడు. ఆ తండ్రి కొడుకును ఎంతలా అపార్ఠం చేసుకున్నాడు.. ఎంతలా మిస్ అయ్యాడు.. ఆ ఫ్యామిలీని అతను ఎలా కాపాడాడు అనేదే కథ. ►ఆకతాయి కొడుకు, స్ట్రిక్ట్ తండ్రి అనే కాన్సెప్ట్‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమాలో ఎమోషన్స్ బాగుంటాయి. వక్కంతం వంశీ కథ, అబ్బూరి రవి మాటలు బాగున్నాయి. ► వక్కంతం వంశీ అందించిన కథ నిర్మాతలకు, గోపీచంద్ అందరికీ నచ్చడంతోనే ఈ చిత్రాన్ని మొదలుపెట్టాం. ► 1985లో దర్శకుడిని అయ్యాను. కానీ నేను చేసింది 35 సినిమాలే. మామూలుగా అయితే వందల సినిమాలు చేయోచ్చు. కానీ నాకు కథ, స్క్రిప్ట్ నచ్చితేనే చేస్తాను. అందరికీ నచ్చేలా ఉంటేనే సినిమాను చేస్తాను. ► నేను చేసినవి ఏవీ కూడా నా కథలు కాదు. సీనియర్ రచయితలు,కొత్త రచయితలను అందరినీ అడుగుతుంటాను. మస్కా సినిమాతో కొత్త రచయితను పరిచయం చేశాను. చిన్ని కృష్ణను కూడా నేనే పరిచయం చేశాను. నాకు కథ నచ్చితేనే సినిమాకు న్యాయం చేయగలుగుతాను. ► స్క్రిప్ట్ బాగుంటే.. సూపర్ హిట్ అవుతాయి. లేదంటే ఫ్లాప్ అవుతాయి. క్రాక్ జనాలకు నచ్చింది. కాబట్టే సూపర్ హిట్ అయింది. చివరకు జనాలకు నచ్చితేనే ఆడుతాయి. సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి, ఇంద్ర బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి. ► ఓటీటీ కంటెంట్లను కూడా జనాలు బాగానే చూస్తున్నారు. కానీ నాకు మాత్రం థియేటర్లోనే సినిమా చూడటం ఇష్టం. పెద్ద తెరపై సినిమా చూసేందుకే జనాలు ఇష్టపడతారు. ► ఫ్యాక్షన్ కథ చేస్తున్నామని సినిమా చేస్తున్నంత వరకు నాకు తెలీదు. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, ఇంద్ర సమయంలోనూ ఫ్యాక్షన్ సినిమా చేస్తున్నాను అని అనుకోలేదు. ఇప్పుడు కూడా ఎవరైనా కథ చెబితే.. ఫ్యాక్షన్ డ్రాప్లో డైరెక్షన్ చేసేందుకు రెడీగా ఉన్నాను. బాలయ్య బాబుతో సినిమా చేయాలని చాలా ట్రై చేశాను. కానీ స్క్రిప్ట్ సరిగ్గా రాకపోవడంతో ఆలస్యమవుతూ వచ్చింది. బాలయ్య బాబుతో సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి కంటే బ్లాక్ బస్టర్ హిట్ తీయాలనే కోరిక ఉంది. ► నేను సాఫ్ట్‌గా ఉంటాను. మైకుల ముందు కూడా మాట్లాడటం రాదు. కానీ సినిమాల్లో మాత్రం హింస ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం నా స్క్రిప్ట్ రైటర్స్. స్క్రిప్ట్‌ను బట్టి, నా హీరోలను బట్టి ఓ డైనమిక్ షాట్‌ను పెట్టాలనిపిస్తుంది. అందుకే అలాంటి సీన్స్ పడ్డాయి. ► సినిమా అంటే పాటలు, ఫైట్లు పెడతాను. కానీ సిట్యువేషన్‌ను బట్టి ఫైట్లు పెడతాను. నరసింహానాయుడు ట్రైన్ సీక్వెన్స్‌లో బాలయ్య బాబుకు గొడ్డలి తగులుతుంది. ఆ సీన్‌కు అందరూ ప్రశంసలు కురిపించారు. కమర్షియల్ సినిమాలను ఆడియెన్స్‌కు నచ్చేట్టుగా తీయాలని ప్రయత్నిస్తాను. -
ఇలాంటి కథే చేయాలనుకున్నా!
‘‘ఇండస్ట్రీకి వచ్చినప్పట్నుంచీ గోపాల్‌గారితో సినిమా చేయాలని నా కోరిక. నిర్మాత బుజ్జి (నల్లమలుపు శ్రీనివాస్) కాంబినేషన్లో ఓసారి అనుకున్నా... సినిమా కుదరలేదు. వంశీ (వక్కంతం) కథ చెబుతాడు.. వినమని గోపాల్గారు ఫోన్ చేశారు. కథ విన్న తర్వాత ఆయనతో చేస్తే... ఇలాంటి కథే చేయాలనుకున్నా’’ అన్నారు గోపీచంద్. ఆయన హీరోగా బి. గోపాల్ దర్శకత్వంలో తాండ్ర రమేశ్ నిర్మించిన ‘ఆరడుగుల బుల్లెట్’ వచ్చే నెల 9న విడుదల కానుంది. గోపీచంద్ మాట్లాడుతూ – ‘‘చిరంజీవిగారు, బాలకృష్ణగారు వంటి పెద్ద హీరోలతో చేసిన గోపాల్‌గారితో వర్క్ ఎలా ఉంటుందో? అనుకున్నా. కానీ, కూల్‌గా షూటింగ్ జరిగింది. నయనతార లవ్లీ క్యారెక్టర్లో నటించారు. మణిశర్మగారు మంచి పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చారు. సినిమా ఈ స్థాయికి రావడానికి కారణమైన పీవీపీగారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘నా చిత్రాల్లో ఉండే మాస్, కామెడీలతో పాటు అన్ని ఎమోషన్స్ ఉన్నాయి’’ అన్నారు బి. గోపాల్. ‘‘కుటుంబమే ఆస్థి అని నమ్మే హీరో కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఏం చేశాడనేది చిత్రకథ’’ అన్నారు అబ్బూరి రవి. నిర్మాత తాండ్ర రమేశ్ పాల్గొన్నారు. -
సోలోగా వస్తోన్న కేశవ..?
డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో నిఖిల్, త్వరలో కేశవగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. థ్రిల్లింగ్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా స్వామి రారా కాంబినేషన్ రిపీట్ అవుతుండటం.. నిఖిల్ లుక్, ప్రమోషన్ సూపర్బ్‌గా ఉండటంతో కేశవపై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా కేశవకే ఫేవర్ చేసేలా ఉంది. మే 19న కేశవ రిలీజ్ అవుతోంది. అయితే ముందుగా అదే రోజు నాగచైతన్య రారండోయ్ వేడుక చూద్దాం, గోపిచంద్ ఆరడుగుల బుల్లెట్ సినిమాలను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. నాగచైతన్య సినిమా వారం వెనక్కి పోవటం నిఖిల్‌కు ప్లస్ అయ్యింది. అంతేకాదు ఆరడుగుల బుల్లెట్‌ను కూడా రెండు మూడు వారాలు వాయిదా వేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే నిఖిల్ కేశవకు పోటి లేకుండా పోతుంది. సోలోగా వారం పాటు థియేటర్లలో సత్తా చూపించే చాన్స్ ఉంటుంది. -
మే 19న గోపీచంద్ 'ఆరడుగుల బుల్లెట్'
వరుస చిత్రాలతో బిజీ షెడ్యూల్స్‌తో ఉన్న గోపీచంద్ నటించిన తాజా చిత్రం 'ఆరడుగుల బుల్లెట్' విడుదలకు రెడీ అవుతోంది. సీనియర్ డైరెక్టర్ బి గోపాల్ దర్శకత్వంలోజయా బాలాజీ రియల్ మీడియా పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తాండ్ర రమేష్ నిర్మాత. గోపీచంద్ సరసన నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను మే 19న విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత తాండ్ర రమేష్ మాట్లాడుతూ.. 'ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్, మాస్ ఆడియన్స్‌కు నచ్చే అంశాలు మేళవించి దర్శకులు బి.గోపాల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ రచయితలు వక్కంతం వంశీ అందించిన కథ, అబ్బూరి రవి మాటలు, బాల మురుగన్ సినిమాటోగ్రఫీ సినిమాకి హైలైట్స్‌గా నిలుస్తాయి. గోపీచంద్ కెరీర్ లోఈ చిత్రం ఓ మైలురాయిగా నిలుస్తుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకున్న 'ఆరడుగుల బుల్లెట్'ను మే 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం" అని తెలిపారు. -
మూడు నెలల్లో మూడు సినిమాలు
టాలీవుడ్ యాక్షన్ హీరో గోపిచంద్ వరుస రిలీజ్‌లకు రెడీ అవుతున్నాడు. తాజా చిత్రం గౌతమ్ నందతో పాటు చాలా కాలంగా చిత్రీకరణ దశలోనే ఉన్న మరో రెండు చిత్రాలను రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు. ముందుగా సీనియర్ దర్శకుడు బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆరడుగుల బుల్లెట్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్లాన్‌లో ఉన్నాడు. గోపిచంద్ సరసన నయనతార హీరోయిన్గా నటించిన ఈ సినిమా మే 3న రిలీజ్ కానుంది. ఆ తరువాత సంపత్ నంది దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న గౌతమ్ నంద సినిమాను రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు. ఆరడుగుల బుల్లెట్ రిలీజ్ అయిన నెల రోజుల తరువాత గౌతమ్ నంద రిలీజ్ కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాల తరువాత చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఆక్సిజన్ రిలీజ్‌ను ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఏఎమ్ రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఆక్సిజన్‌ను జూలై లేదా.. ఆగస్టులో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. -
మేలో 'ఆరడుగుల బుల్లెట్'
గోపిచంద్ హీరోగా సీనియర్ దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆరడుగుల బుల్లెట్. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఎట్టకేలకు మేలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. గోపిచంద్ సరసన నయనతార హీరోయిన్గా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందించాడు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు పలు సూపర్ హిట్ చిత్రాలకు కథ అందించిన వక్కంతం వంశీ కథ అందించాడు. జయ బాలాజీ రీల్ మీడియా బ్యానర్‌పై తాండ్ర రమేష్ నిర్మిస్తున్న ఆరడుగుల బుల్లెట్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శనివారం రిలీజ్ చేశారు.