abhishek goud
-
అభిషేక్ సినిమాలకే పరిమితం
తన కుమారుడు అభిషేక్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు వస్తున్న వందతులను ఎవరూ నమ్మవద్దని ఎంపీ సుమలత అన్నారు. శనివారం అంబరీశ్ పుణ్యతిథిని పురస్కరించుకుని యశవంతపురలోని కంఠీరవ స్టూడియోలో అంబరీశ్ సమాధికి ఆమె నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మద్దూరు నుంచి అభిషేక్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. అనవసరంగా అభిషేక్‌ను రాజకీయాల్లోకి లాగ వద్దని, తను కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమన్నారు. రాజకీయాల్లోకి రావడానికి ఇంకా సమయం ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంపై ప్రస్తుతం దర్యాప్తు చేయాలని కోరటం లేదన్న సుమలత, ఎన్నికల సమయంలో తన ఫోన్ కూడా ట్యాపింగ్‌కు గురైందన్నారు. సుమలత వెంట అభిషేక్, నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
'అభిషేక్గౌడ్పై పీడీ యాక్ట్ నమోదు చేయాలి'
హైదరాబాద్: ఫేస్బుక్లో అమ్మాయిల్ని వేధించిన కేసులో అరెస్టైన కార్పొరేటర్ తనయుడు అభిషేక్గౌడ్పై తక్షణమే పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. గతంలో ఓ సారి ఇలాంటి కేసులోనే కటకటాలపాలైనా తీరు మార్చుకోకుండా బెయిల్ పై వచ్చి మళ్లీ తన వక్రబుద్ధితో అమ్మాయిలను ఏడిపిస్తున్న అభిషేక్‌గౌడ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 140వ డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ తనయుడు కావడంతోనే అభిషేక్‌ను పోలీసులు ఏమి అనడం లేదని తక్షణమే కార్పొరేటర్ తన పదవికి రాజీనామ చేయాలని మల్కాజిగిరి చౌరస్తాలో ఆందోళన నిర్వహించారు. -
న్యూడ్ ఫోటోలంటూ వేధింపులు, అభిషేక్ మళ్లీ అరెస్ట్
-
న్యూడ్ ఫోటోలంటూ వేధింపులు, అభిషేక్ మళ్లీ అరెస్ట్
హైదరాబాద్ : కటకటాలు లెక్కపెట్టి వచ్చినా...మల్కాజిగిరి టీఆర్ఎస్ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ కుమారుడు అభిషేక్ గౌడ్ బుద్ధి మారలేదు. మరోసారి తన పైత్యం ప్రదర్శించడంతో అతడిని సైబర్ క్రైమ్ పోలీసులు మళ్లీ శనివారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.తన వద్ద మీ న్యూడ్ ఫోటోలు ఉన్నాయంటూ అభిషేక్ గౌడ్ ఇద్దరు యువతలను బెదరించాడు. దాంతో ఆ యువతులిద్దరు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా వారు అభిషేక్ గౌడ్‌ను అరెస్టు చేశారు. కాగా గతంలోనూ అభిషేక్‌పై సోషల్ మీడియాలో ఫేక్ ఐడీలు సృష్టించి.. అమ్మాయిలను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఫిర్యాదులు అందటంతో అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అభిషేక్... వేధింపులకు విద్యార్థినులతో పాటు ఉద్యోగినులు గురయ్యారు. ఇతని వేధింపులు తట్టుకోలేక పలువురు ఆత్మహత్యయత్నం కూడా చేశారు. అయితే మరికొందరు ఈ వేధింపులపై షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేయడంతో ఓ ప్రత్యేక బృందం రంగంలోకి దిగి ఎట్టకేలకు అభిషేక్‌ను అరెస్ట్ చేశారు. -
ఎమ్మెల్యే తనయుడిపై కేసు నమోదు
మెదక్ జిల్లా పటాన్చెరువు ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ తనయుడు అభిషేక్ గౌడ్‌పై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. రామచంద్రాపురం మండలం తెల్లాపూర్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా అభిషేక్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ ప్రత్యర్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో విచారణ జరిపిన పోలీసులు అభిషేక్ గౌడ్‌పై కేసు నమోదు చేసి, పటాన్ చెరువు పీఎస్‌కు తరలించారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ నాయకుడు దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ కుషాయిగూడ పోలీసు స్టేషన్ పరిధిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారు. దీంతో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో వీరేందర్ గౌడ్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.