ఎమ్మెల్యే తనయుడిపై కేసు నమోదు | police case files against mla son abhishek goud due to violates election code of conduct | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే తనయుడిపై కేసు నమోదు

Published Tue, Mar 25 2014 2:59 PM | Last Updated on Mon, Mar 25 2019 3:03 PM

police case files against mla son abhishek goud due to violates election code of conduct

మెదక్ జిల్లా పటాన్చెరువు ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ తనయుడు అభిషేక్ గౌడ్పై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. రామచంద్రాపురం మండలం తెల్లాపూర్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా అభిషేక్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ ప్రత్యర్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో విచారణ జరిపిన పోలీసులు అభిషేక్ గౌడ్పై కేసు నమోదు చేసి, పటాన్ చెరువు పీఎస్కు తరలించారు.

 

ఇటీవల తెలుగుదేశం పార్టీ నాయకుడు దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ కుషాయిగూడ పోలీసు స్టేషన్ పరిధిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారు. దీంతో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో వీరేందర్ గౌడ్పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement