Abu Azmi
-
ఉద్ధవ్ ఠాక్రేకి ఎస్పీ నేత హెచ్చరిక
ముంబై: పౌరసత్వ సరవణ చట్టం(సీఏఏ), ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లను మహారాష్ట్రలో అమలుచేయవద్దని ఎస్పీ నేత అబూ అజ్మీ.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను హెచ్చరించారు. కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు సీఏఏపై వ్యతిరేకంగా తీర్మానం చేసినట్లుగా ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కూడా తీర్మానం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సీఏఏ ముస్లింల ప్రయోజనాలకు ఇబ్బంది కలిగించే విధంగా ఉందని అబూ అజ్మీ పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఎన్పీఆర్కు అనుమతి ఇస్తే తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఆయన అన్నారు. సీఏఏ, ఎన్పీఆర్లను మహారాష్ట్రలో అమలు చేయవద్దని అభ్యర్థించారు. (కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది: ఉద్ధవ్ ఠాక్రే) కాగా మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతుతో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కాగా, సీఏఏ అమలుకు మద్దతు తెలిపిన శివసేన.. ఎన్నార్సీని వ్యతిరేకిస్తామనడం పట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ మధ్య తేడాలను పరిశీలించాలని, ఎన్పీఆర్ను స్వాగతిస్తే.. ఎన్ఆర్సీని ఆపటం సాధ్యం కాదని కాంగ్రెస్‌నేత మనోజ్ తివారీ అన్నారు. రాజ్యాంగ పరంగా సీఏఏను సవరించాల్సిన అవసరం ఉన్నప్పటికీ లౌకికపరంగా చూస్తే ఈ చట్టాన్ని ఆమోదించలేమని ఆయన తెలిపారు. ఇక శుక్రవారం ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షాలతో భేటీ అయిన అనంతరం సీఏఏపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొనడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. -
టీమిండియా కాషాయ జెర్సీ వెనుక బీజేపీ?
న్యూఢిల్లీ/ముంబై: వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో టీమిండియా ఆరెంజ్ (కాషాయ) రంగు జెర్సీలను ధరించనుంది. అయితే టీమిండియా ఆరెంజ్ జెర్సీ ధరించడం వెనుక మోదీ ప్రభుత్వ ఒత్తిడి ఉందని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు ఆరోపించాయి. ఆదివారం టీమిండియా ఇంగ్లాండ్‌తో తలపడనున్న మ్యాచ్‌లో ఆరెంజ్ జెర్సీలను ధరించనుంది. కనీసం రెండు రంగుల జెర్సీలను తమ వెంట తెచ్చుకోవాలని ఐసీసీ అన్ని దేశాలను కోరింది. అందులో భాగంగానే టీమిండియా రెండు జెర్సీలతో ఇంగ్లండ్ వెళ్లింది. దేశం మొత్తాన్ని కాషాయికరణ చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని మహారాష్ట్రకు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబు అజ్మీ ఆరోపించారు. అసెంబ్లీ వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘క్రికెటర్లు ధరించే జెర్సీలకు ఆరెంజ్ రంగు పులుముతున్నారు. జాతీయ పతాకంలో మూడు వర్ణాలను నిర్ణయించిన వ్యక్తి ముస్లిం అని మోదీ గుర్తుపెట్టుకోవాలి. జెర్సీలకు మరో రంగు ఎంచుకోవాల్సి వస్తే త్రివర్ణాన్ని ఎంచుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. ప్రతిదాన్ని కాషాయికరణ చేయాలకుంటే ప్రజల నుంచి వ్యతిరేకత తప్పద’ని అబు అజ్మీ అన్నారు. ఈ వాదనను బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ వ్యతిరేకించారు. జెర్సీ రంగుపై రాజకీయం చేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కాషాయ రంగును ఎందుకు అంతగా వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. ఆరెంజ్ జెర్సీపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని శివసేన నేత, మహారాష్ట్ర మంత్రి గులాబ్రావ్ పాటిల్ అన్నారు. ఆటలకు, రాజకీయాలకు ముడి పెట్టడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ పేర్కొన్నారు. -
‘నవీ ముంబై, థానే, పూణె పేర్లు మార్చండి’
ముంబై: మహారాష్ట్రలోని పలు నగరాల పేర్లు మార్చాలనే ప్రతిపాదనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. శివసేన చాలా కాలం నుంచి జౌరంగబాద్ నగరం పేరును శంభాజీనగర్‌గా మార్చాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సమాజ్‌వాది పార్టీ నాయకుడు అబూ ఆజ్మీ కూడా రాష్ట్రంలోని పలు నగరాల పేర్లు మార్చాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం అసెంబ్లీలో ఆజ్మీ మాట్లాడుతూ.. నవీ ముంబై, థానే, పూణె నగరాల పేర్లు మార్చాలనే ప్రతిపాదనను సభ ముందు ఉంచారు. అదేవిధంగా ఈ ప్రతిపాదనల వెనుక బీజేపీకిలాగా ఎలాంటి రహస్య ఎజెండా లేదని ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నవీ ముంబై, థానే, పూణె నగరాల పేర్ల మార్పు ఎవరి మత విశ్వాసాలను దెబ్బతినకుండా ఉండాలని అన్నారు. అందుకే నవీ ముంబై పేరును ఛత్రపతి శివాజీ మహారాజ్ నగర్‌గా, థానే పేరును జిజామాతా నగర్‌గా, పూణె పేరును ఛత్రపతి శంభాజీ నగర్‌గా మార్చాలని కోరారు. మరోవైపు జౌరంగబాద్ పేరు మార్పుపై శివసేన ప్రతిపాదనను ఆయన వ్యతిరేకించారు. మొఘల్ చక్రవర్తి జౌరంగజేబు పేరుతో దానికి ఆ పేరు వచ్చిందని తెలిపారు. బీజేపీ నేతలు ఒకవేళ మతం పేరుతో నగరాల పేరును మార్పు చేస్తున్నట్టయితే.. వారి పార్టీలోని నాయకుల పేర్లు కూడా మార్చాలని అన్నారు. ఆ క్రమంలో ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేరును ముఖేశ్ చంద్రగా, షాహనవాజ్ హుస్సేన్ పేరును శంకర్ మహాదేవన్‌గా మార్చాలని ఎద్దేవా చేశారు. కాగా, ఆజ్మీ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజ్ పురోహిత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. భారతదేశ చరిత్ర గురించి ఆజ్మీకి తెలియదని విమర్శించారు. సోదరులను చంపి, సంగీతంపై నిషేధం విధించిన క్రూరమైన పాలకుడు జౌరంగజేబు.. అటువంటి వ్యక్తిని ఆజ్మీ కీర్తిస్తున్నాడని మండిపడ్డారు. తాము జౌరంగబాద్ పేరు శంభాజీనగర్‌గా మార్చాలని అనుకుంటున్నట్టు స్పష్టం చేశారు. -
బెంగళూరు ఘటనపై ఆ ఇద్దరికీ సమన్లు!
బెంగళూరు/న్యూఢిల్లీ: బెంగళూరులో మహిళలు బహిరంగంగా లైంగిక వేధింపులకు గురైన ఘటనపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వరకు, ఎస్పీ ఎమ్మెల్యే అబూ అజ్మీకి జాతీయ మహిళ కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) షాక్ ఇచ్చింది. ఆ ఇద్దరు నేతలకు సమన్లు జారీచేసింది. 'పార్టీలకతీతంగా కొందరు వ్యక్తులు జుగుప్సకరమైన వ్యాఖ్యలు చేశారు. ఉన్నతస్థానంలో ఉన్నవారే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. దేశం ఎటువైపు వెళ్తున్నట్టు?' అని ఎన్సీడబ్ల్యూ చీఫ్ లలితా కుమారమంగళం అన్నారు. బెంగళూరులో కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా పలువురు మహిళలపై ఆకతాయిలు బహిరంగంగా రెచ్చిపోయి.. లైంగికంగా తాకడం, వేధించడం వంటి వికృత చర్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందిస్తూ యువత పాశ్చాత్య ధోరణిని అవలంబిస్తుండటం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, యువతులు కూడా పాశ్చాత్య దుస్తులు వేసుకొని వేడుకల్లో పాల్గొన్నారని, ఇలాంటి ఘటనలు జరగడం మామూలేనని కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై ఎన్సీడబ్ల్యూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు దేశ మహిళలకు ఆయన క్షమాపణ చెప్పాలని, తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. 'ఒక హోంమంత్రి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం దురదృష్ణకరం, ఆమోదనీయం కాదు. వేడుకల సందర్భంగా మహిళలు పాశ్చాత్య దుస్తులు వేసుకున్నంత మాత్రాన భారతీయ పురుషులు అదుపుతప్పి రెచ్చిపోతారా? అని నేను మంత్రిని అడుగదలుచుకున్నా. మహిళలను గౌరవించడం భారతీయ పురుషులు ఎప్పుడు నేర్చుకుంటారు? ఆ మంత్రి వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పి.. రాజీనామా చేయాలి' అని లలిత కుమారమంగళం స్పష్టం చేశారు. -
బెంగళూరు ఘటనపై ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్
కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా బెంగళూరులో పోలీసుల సమక్షంలోనే పలువురు మహిళలు లైంగిక వేధింపులకు గురైన ఘటనపై ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ రిజ్వీ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. నగ్నత్వం మహిళలకు ఫ్యాషన్ మారిందని, అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన విపరీత వ్యాఖ్యలు చేశారు. మహిళలు, పురుషులు వేర్వేరని, కాబట్టి మహిళలు రాత్రిపూట బయటకు రావొద్దని ఆయన హితబోధ చేశారు. మన సంస్కృతికి వ్యతిరేకంగా నడుచుకునే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రాత్రిపూట ఒక యువతి భర్తతో, లేదా తండ్రితోనే బయటకు వెళ్లి వేడుకలు చేసుకోవాలి కానీ, గుర్తుతెలియని వారితో కాదని అన్నారు. స్త్రీ, పురుషుల మధ్య ఆకర్షణ ఉండటం సహజమేనని, కానీ ఈ విషయంలో ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దేశంలో మహిళల భద్రతపై ప్రశ్నించగా.. భారతీయ సంస్కృతి మారిపోతున్నదని, పాశ్చాత్యీకరణ మన సంస్కృతికి మచ్చగా మారిందని చెప్పుకొచ్చారు. పాశ్చాత్య సంస్కృతిని అనుసరించే మహిళలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆయన సూచించారు. బెంగళూరులో కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా పలువురు మహిళలపై ఆకతాయిలు రెచ్చిపోయి.. లైంగికంగా తాకడం, వేధించడం వంటి వికృత చర్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. -
ములాయం ఆవేశం.. పార్టీకి ప్రమాదం!
లక్నో: సమాజ్ వాదీ పార్టీలో తలెత్తిన సంక్షోభంపై పార్టీ సీనియర్ నేత అబు అజ్మీ స్పందించారు. పార్టీ పగ్గాలు సీఎం అఖిలేశ్ యాదవ్‌కు అప్పగించడమే ఉత్తమమని, కుమారుడు అఖిలేశ్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తే ప్రయోజనం ఉంటుందని నేతాజీ ములాయం సింగ్ యాదవ్‌కు సూచించారు. ములాయం కోపం విడిచిపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని, అఖిలేశ్‌కు మద్ధతు ఇవ్వాలని లేకపోతే పార్టీకే నష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు పార్టీ ఎన్నికల గుర్తు 'సైకిల్' తమ వర్గానికే చెందాలని ములాయం ఈసీకి విన్నవించగా.. నేడు సీఎం అఖిలేశ్ వర్గం గుర్తు తమకే ఇవ్వాలని సీఈసీని కలిసి ప్రస్తుత పరిస్థితిని వివరించనున్నారు. అఖిలేశ్ మద్ధతుదారుల వివరాలను బాబాయ్ రాంగోపాల్ యాదవ్ ఈసీకి అందజేయనున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ విజయం సాధిస్తే పగ్గాలు ఎవరికిచ్చినా తనకు అభ్యంతరం లేదని అఖిలేశ్ గతంలో పేర్కొన్నారు. పార్టీ నెగ్గితే మాత్రం తండ్రి ములాయం తనను సీఎం పదవి నుంచి తప్పిస్తారని అఖిలేశ్ గతంలోనే చెప్పారని ఎస్పీ నేత అబు అజ్మీ వివరించారు. సమష్టిగా పోటీచేసి భారీ మెజార్టీతో నెగ్గినా.. అఖిలేశ్‌ను తప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. పార్టీ నేతలు కూడా అఖిలేశ్ వైపు మొగ్గు చూపుతున్నారని, అందుకే ఆయనకు ములాయం సహకరిస్తేనే పార్టీ పటిష్టంగా ఉంటుందని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించారు. యూపీ నేతలతో పాటు పార్టీ మహారాష్ట్ర నేతల మద్ధుతును అఖిలేశ్ కూడగట్టుకుని అభివృద్ధి వైపు నడిపిస్తారని తాజా సంక్షోభంపై యూపీ సీఎంకు అబు అజ్మీ తన మద్ధతు తెలిపారు. -
ఇస్లం చట్టాలు రాజ్యాంగంతో సంభందం లేదు
-
మీ ఆత్మాహుతి బాంబర్లను పాక్ పంపండి
పాకిస్థాన్‌కు చెందిన నటీనటులంతా 48 గంటల్లోగా భారతదేశాన్ని వదిలి వెళ్లిపోవాలంటూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చేసిన హెచ్చరికలపై సమాజ్‌వాదీ పార్టీ మహారాష్ట్ర ఎమ్మెల్యే అబూ అజ్మీ స్పందించారు. దమ్ముంటే రాజ్ ఠాక్రే తన ఆత్మాహుతి బాంబర్లను పాకిస్థాన్‌లోని లాహోర్, కరాచీ నగరాలకు పంపాలని సవాలుచేశారు. పాకిస్థాన్ తన ఆత్మాహుతి దళాలను భారత్ పంపుతోందని, దానికి ప్రతీకారంగా కావలంటే మీ వాళ్లను పాక్ పంపాలని తెలిపారు. అంతేతప్ప చట్టబద్ధంగా భారతదేశ వీసా తీసుకుని ఇక్కడకు వచ్చేవారిని భయపెట్టొద్దని తెలిపారు. దానివల్ల మీ ఓటుబ్యాంకే దెబ్బతింటుందని అన్నారు. పాకిస్థాన్ విషయం పక్కన పెడితే.. మహారాష్ట్రలోని గడ్చిరోలి, చంద్రాపూర్ లాంటి ప్రాంతాల్లో నక్సలైట్లు పోలీసులపై దాడులు చేస్తున్నారని.. ముందుగా పార్టీ కార్యకర్తలను పంపి ఆ పోలీసులను రక్షించాలని అబూ అజ్మీ అన్నారు. పాకిస్థానీ ఉగ్రవాదులు మన 18 మంది జవాన్లను హతమార్చిన మాట నిజమేనని, దానిపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనంటూ అంతమాత్రాన అక్కడి నుంచి వచ్చే కళాకారులు, క్రీడాకారులను భయపెట్టడం సరికాదన్నారు. రాజ్‌ఠాక్రేకు దమ్ముంటే ఢిల్లీ వెళ్లి పాకిస్థాన్ రాయబార కార్యాలయాన్ని మూసేయాలని, అలాగే పాకిస్థాన్‌లోని భారత ఎంబసీకి వెళ్లి ఆ దేశం వాళ్లకు ఇక్కడి వీసాలు ఇవ్వకుండా చూడాలని తెలిపారు. -
ఆయన రెచ్చగొడుతుంటే, నిద్రపోతున్నారా?
లక్నో: ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుంటే నిఘా వర్గాలు నిద్రపోతున్నాయా అని ఉత్తర ప్రదేశ్ సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అబు అజ్మీ ప్రశ్నించారు. ఒకవేళ తీవ్రవాదులను జకీర్ నాయక్ ప్రోత్సహిస్తుంటే ఆయనపై చర్యలు తీసుకోకుండా దేశంలోని అధికారులంతా ఏమైపోయారని ఆయన నిలదీశారు. ఇస్లాంలోని వివిధ విశ్వాసాలు గల ప్రజల మనోభావాలను వెల్లడిస్తున్నందుకే ఆయనపై బురద చల్లుతున్నారని ఆరోపించారు. 'జకీర్ నాయక్ 25 ఏళ్లుగా మత బోధకుడిగా ఉన్నారు. తీవ్రవాదులకు ఆయన ప్రేరణ ఇస్తుంటే ఇంతకాలం ఎందుకు ఆయనపై చర్య తీసుకోలేదు. ఎందుకు దర్యాప్తు చేపట్టలేదు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపింది. అప్పటి వరకు ఆయనకు వ్యతిరేకంగా మీడియా విచారణ ఆపాల'ని అబు అజ్మీ పేర్కొన్నారు. హేతువాదులు నరేంద్ర దలోల్కర్, గోవింద్ పన్సారే, ఎంఎం కుల్బర్గీ హత్యలకు కారణమైన సనాతన సంస్థను నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు. -
'వారూ రేపిస్ట్లు కాబట్టే అలా మాట్లాడారు'
-
'కోరి వెళ్లే మహిళనూ ఉరి తీయాలి'