ACA-VDCA stadium
-
వైజాగ్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు.. టికెట్ల బుకింగ్ ఎప్పటినుంచంటే?
ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి రెండు హోం మ్యాచ్‌లను వైజాగ్‌లోని ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ మ్యాచ్‌లకు సంబంధించి టిక్కెట్ల విక్రయాలపై ఢిల్లీ క్యాపిటల్స్ కీలక ప్రకటన చేసింది. ఈ రెండు మ్యాచ్‌లకు సంబంధించిన టిక్కెట్లను ఈ నెల 24 నుంచి ఆన్లైన్లో విక్రయించనున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ప్రతినిధులు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఏప్రిల్ 3న ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి హోం మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం టిక్కెట్లు ఆదివారం(మార్చి 24) అందుబాటులోకి రానున్నాయి. అదే విధంగా ఈ నెల 31న ఢిల్లీ క్యాపిటల్స్– చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌కు 27వ తేదీ నుంచి టిక్కెట్ల అమ్మకం ప్రారంభం కానుంది. .కాగా ఆన్లైన్లో కొనుగోలు చేసిన టికెట్లను పీఎం పాలెంలో ఉన్న స్టేడియం ‘బి’ గ్రౌండ్, నగరంలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెడెమ్షన్ కౌంటర్లలో ఫిజికల్ టిక్కెట్లను పొందాలి. రూ. 7,500, రూ. 5,000, రూ. 3,500, రూ. 3,000, రూ. 2,500, రూ. 2,000, రూ. 1,500, రూ. 1,000 విలువ చేసే టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉండనున్నాయి. కాగా ఢిల్లీ తమ తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. -
Ind Vs Eng: వైజాగ్ టెస్టుకు భారీ ఏర్పాట్లు..
విశాఖ స్పోర్ట్స్: పీఎంపాలెంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియం ముచ్చటగా మూడో టెస్ట్ మ్యాచ్ ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమైంది. ఇక్కడ తొలిసారిగా ఇంగ్లండ్ జట్టు టెస్ట్ మ్యాచ్ ఆడగా.. మరోసారి ఆడేందుకు ఆ దేశ జట్టు వచ్చింది. ఆతిథ్య జట్టుకు అచ్చొచ్చిన స్టేడియంగా పేరొందిన ఈ స్టేడియంలో 2016లో ఇంగ్లండ్‌తో, 2019లో దక్షిణాఫ్రికాతో ఆడి విజయాలను సొంతం చేసుకుంది. ఆయా సిరీస్‌ల్లో తొలి విజయాలతో చక్కటి ఆరంభాన్ని వైఎస్సార్ స్టేడి యం ఇచ్చింది. కాగా.. ఇంగ్లండ్ మ్యాచ్ అనగానే ఆ దేశం నుంచి మ్యాచ్‌ను తిలకించేందుకు భారీగా అభిమానులు తరలివస్తారు. టూ టైర్ సిటింగ్ ఏర్పాట్లు ఉన్న స్టేడియంలో సౌత్, నార్త్ బ్లాక్‌ల్లో అభిమానులకు అనుమతిస్తున్నారు. విద్యార్థులు, క్రికెట్ క్లబ్‌ల తరఫున ఆడే ఔత్సాహికులకు ఏసీఏ ఉచితంగానే టికెట్లను అందించే ఏర్పాట్లు చేసింది. ఇంగ్లండ్ అభిమానుల భద్రత, మ్యాచ్ నిర్వహణ, ఏర్పాట్లు, టికెట్ల విక్రయాలు తదితర అంశాలను ఎస్ఆర్ గోపీనాథ్‌రెడ్డి బుధవారం ‘సాక్షి’కి వివరించారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే.. ఇంగ్లండ్ అభిమానులకు ప్రత్యేక భద్రత వైఎస్సార్ స్టేడియంలో రెండో టెస్ట్ మ్యాచ్ వీక్షించేందుకు ఇంగ్లండ్ అభిమానులు ఏకంగా మూడు బాక్స్‌ల టికెట్లను కొనుగోలు చేశారు. వారి భద్రతకు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్, నగర పోలీస్ కమిషనర్ రిక్కీ నిర్వహించి ఏర్పాట్లు సమీక్షించనున్నారు. వీరంతా వివిధ ప్రాంతాల్లో హోటళ్లను బుక్ చేసుకున్నారు. స్టేడియంలో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశాం. ఎండను తట్టుకునేందుకు వీలుగా సన్‌స్క్రీన్ లోషన్‌ను వారి వెంట తెచ్చుకునేందుకు వెసులుబాటు కల్పించాం. మెరుగ్గా పారిశుధ్య నిర్వహణ స్టేడియంలో కొత్తగా కమోడ్లు ఏర్పాటు చేశాం. డ్రైనేజ్‌ను ఆధునికీకరించాం. మ్యాచ్ జరిగేప్పుడు పారిశుధ్య నిర్వహణ కోసం బెంగళూరుకు చెందిన ప్రముఖ సంస్థకు అప్పగించాం. ఇందుకోసం ఓ అప్లికేషన్ రూపొందించాం. స్టేడియంలో ఎప్పుడు, ఎక్కడ ఎలాంటి పరిశుభ్రత జరుగుతుందనే విషయాన్ని పర్యవేక్షిస్తాం. మ్యాట్స్, టైల్స్ తదితరాలను శుభ్రంగా ఉంచే ఏర్పాట్లు జరిగాయి. ఫోన్లో టికెట్ చూపిస్తే చాలు దేశంలోనే తొలిసారిగా డిజిటల్ టికెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. కొనుగోలు చేసిన టికెట్ ను ఫోన్లో చూపించి ప్రవేశం పొందవచ్చు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారు టికెట్ కోసం స్టేడియానికి రావాల్సిన అవసరం లేదు. లైన్లో వేచి ఉండక్కర్లేదు. దీనివల్ల పేపర్‌ను సేవ్ చేయవచ్చు. ఇటీవల జరిగిన టీ–20 మ్యాచ్‌కు ఈ విధానాన్ని అమలు చేద్దామని భావించాం. అయితే ట్రయల్‌రన్ నిర్వహిస్తే బాగుంటుందని ఇప్పుడు అమలు చేస్తున్నాం. లోటుపాట్లు ఉంటే సవరించుకుని.. సక్సెస్ అయితే ఇక డిజిటల్ టికెటింగ్కే ప్రాధాన్యమిస్తాం. 20 వేల టికెట్ల విక్రయం టెస్ట్ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఆన్లైన్లో 15 వేల టికెట్లు, కౌంటర్ల ద్వారా 5వేల టికెట్లు అమ్ముడుపోయాయి. స్టేడియం వద్ద ఆట చివరి రోజు వరకు కౌంటర్ ద్వారా టికెట్లను విక్రయించనున్నాం. శని, ఆదివారాల్లో అధిక సంఖ్యలో అభిమానులు రావచ్చని అంచనా వేస్తున్నాం. అభిమానులు తమ వాహనాలను కల్యాణ్‌కుమార్ పార్కింగ్ లేఅవుట్, బీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన స్థలంలో పార్కింగ్ చేసుకోవాలి. ఉచితంగా మంచినీటిని అందిస్తాం. స్టేడియంలో ఫుడ్‌స్టాళ్లు అందుబాటులో ఉంటాయి. స్టేడియంలోకి ఎలాంటి తినుబండారాలను అనుతించం. ఉదయం ఎనిమిది నుంచే స్టేడియంలోకి అనుమతిస్తాం. రోజుకు టికెట్ ధర కనీసం రూ.100 నుంచి గరిష్ట ధర రూ.500గా నిర్ణయించినట్లు గోపీనాథ్‌రెడ్డి వివరించారు. -
LLC 2023: వైజాగ్‌లో లెజెండ్స్ క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్‌లు
సాక్షి, విశాఖపట్నం: లెజెండ్స్ క్రికెట్ లీగ్ టీ–20 తొలి దశ మ్యాచ్‌లకు విశాఖ కూడా ఆతిథ్యం ఇవ్వనుంది. పీఎం పాలెంలో ఉన్న డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఇందుకు వేదిక కానుంది. ఈ విషయాన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 2 నుంచి 4 వరకు గల షెడ్యూల్లో భాగంగా ఇక్కడ ఐదు జట్లు ప్రత్యర్థులతో తలపడనున్నాయి. ఈ లీగ్‌లో పాల్గొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన దాదాపు 70 మంది క్రికెటర్లు వైజాగ్‌కు రానున్నారు. ►ఇక మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సారథిగా వ్యవహరించే ఇండియా క్యాపిటల్స్ కెవిన్ పీటర్స్‌న్, యశ్పాల్సింగ్, రిచర్డ్ పావెల్, మునాఫ్ పాటేల్, దిల్హార్ ఫెర్నాండో తదితరులు ఉన్నారు. ►మరోవైపు.. హర్బజన్‌సింగ్ కెప్టెన్‌గా వ్యవహరించే మణిపాల్ టైగర్స్ జట్టులో ఎస్. బద్రినాథ్, రాబిన్ ఊతప్ప, మహ్మద్ కైఫ్, ప్రవీణ్‌కుమార్, పంకజ్ సింగ్, మిశ్చెల్, కారీ అండర్సెన్ ఉన్నారు ►అదే విధంగా.. సురేష్ రైనా సారథిగా వ్యవహరించే అర్బన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో మార్టిన్ గప్టిల్, డ్వేన్ స్మిత్, ప్రజ్జాన్ ఓజా, టినో బెస్ట్, చమర కాపుగెందర భాగం కానున్నారు. ►ఇక పార్థీవ్ పటేల్ కెప్టెన్‌గా వ్యవహరించే గుజరాత్ జైంట్స్ జట్టులో క్రిస్ గేల్, కెవిన్ ఓ బ్రియన్, హమీద్ రజా, ఎస్. శ్రీశాంత్ ఉండనున్నారు. ►అదేవిధంగా ఆరోన్ ఫించ్ సారథిగా ఉన్న సదరన్ సూపర్‌స్టార్స్ జట్టులో అబ్దుల్ రజాక్, టేలర్, ఉపుల్ తరంగ, అశోక్ దిండా తదితరులు ఉన్నారు. షెడ్యూల్ ఇలా.. ►డిసెంబర్ 2- సాయంత్రం 7 గంటలకు ఇండియా క్యాపిటల్స్- మణిపాల్ టైగర్స్ ►3-మధ్యాహ్నం 3 గంటలకు గుజరాత్ జైంట్స్- సదరన్ సూపర్ స్టార్స్ ►4- సాయంత్రం 7 గంటలకు మణిపాల్ టైగర్స్- అర్బన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. కాగా రాంచి వేదికగా నవంబరు 18న మొదలైన లెజెండ్స్ లీగ్ డిసెంబరు 9న సూరత్‌లో జరిగే ఫైనల్‌తో ముగియనుంది. -
IND vs AUS 2nd ODI 2023: ఆసీస్ పేస్‌కు భారత్ బోల్తా
రెండు రోజులుగా కురిసిన వర్షాలతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సందేహం... తీరా మ్యాచ్ సమయానికి వరుణుడు కూడా కరుణించడంతో ... నిర్ణీత సమయానికే ఆట ప్రారంభం... ఇక పరుగుల విందు ఖాయమని అభిమానులు ఆశగా ఎదురుచూస్తుండగా... పిచ్‌పై ఉన్న తేమను సద్వినియోగం చేసుకున్న ఆసీస్ పేస్ బౌలర్లు మిచెల్ స్టార్క్, సీన్ అబాట్, నాథన్ ఎలిస్ నిప్పులు చెరిగే బంతులతో భారత బ్యాటర్లను బెంబేలెత్తించారు. స్టార్క్ స్వింగ్ బౌలింగ్‌కు భారత స్టార్ బ్యాటర్లు గిల్, రోహిత్, రాహుల్, సూర్యకుమార్ ఇలా వచ్చి అలా వెళ్లారు. దాంతో టీమిండియా 117 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఆసీస్ ఓపెనర్లు మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. భారత బ్యాటర్లు చేతులెత్తేసిన పిచ్‌పై ఆసీస్ ఓపెనర్లు అదరగొట్టి 11 ఓవర్లలోనే తమ జట్టుకు విజయాన్ని అందించారు. సాక్షి, విశాఖపట్నం: సిరీస్‌లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఆదివారం జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో భారత్‌పై ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 26 ఓవర్లలో కేవలం 117 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ పేసర్లు మిచెల్ స్టార్క్ (5/53), సీన్ అబాట్ (3/23), నాథన్ ఎలిస్ (2/13) తమ స్వింగ్ బౌలింగ్‌తో భారత్‌ను దెబ్బ కొట్టారు. భారత ఇన్నింగ్స్‌లో కోహ్లి (35 బంతుల్లో 31; 4 ఫోర్లు) టాప్ స్కోరర్‌కాగా... రోహిత్ శర్మ (15 బంతుల్లో 13; 2 ఫోర్లు), రవీంద్ర జడేజా (39 బంతుల్లో 16; 1 ఫోర్), అక్షర్ పటేల్ (29 బంతుల్లో 29 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మాత్రమే రెండంకెల స్కోరును దాటారు. అనంతరం ఆస్ట్రేలియా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 121 పరుగులు సాధించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (30 బంతుల్లో 51 నాటౌట్; 10 ఫోర్లు), మిచెల్ మార్ష్ (36 బంతుల్లో 66 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) అలరించారు. స్టార్క్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ప్రస్తుతం రెండు జట్లు 1–1తో సమంగా ఉండగా... సిరీస్‌లోని చివరిదైన మూడో వన్డే ఈనెల 22న చెన్నైలో జరుగుతుంది. సూర్యకుమార్ మళ్లీ విఫలం... బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉన్న విశాఖ పిచ్‌పై భారత బ్యాటర్లు తడబడ్డారు. పిచ్‌పై ఉన్న తేమను ఆసీస్ పేసర్ స్టార్క్ సద్వినియోగం చేసుకున్నాడు. స్వింగ్‌తోపాటు కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయడంతో భారత బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. స్టార్క్ బౌలింగ్‌లో గిల్, రోహిత్ వికెట్లకు దూరంగా వెళ్తున్న బంతులను ఆడి అవుటయ్యారు. సూర్యకుమార్ యాదవ్ వరుసగా రెండో వన్డేలోనూ స్టార్క్ బౌలింగ్‌లో తొలి బంతికే ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. ఆ తర్వాత రాహుల్, హార్దిక్, కోహ్లి, జడేజా కూడా ఎక్కువసేపు క్రీజులో నిలువ లేకపోయారు. అబాట్ వేసిన ఇన్నింగ్స్ పదో ఓవర్లో హార్దిక్ పాండ్యా (1) షాట్ ఆడతా... స్టీవ్ స్మిత్ స్లిప్‌లో తన కుడి వైపునకు గాల్లో అమాంతం డైవ్ చేస్తూ తీసుకున్న క్యాచ్ హైలైట్‌గా నిలిచింది. ధనాధన్ ఆట... స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు హెడ్, మార్ష్ శుభారంభం ఇచ్చారు. వీరిద్దరు భారత బౌలర్లపై ఎదురుదాడి చేశారు. ముఖ్యంగా మార్ష్ చెలరేగిపోయాడు. షమీ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో మార్ష్ 2 సిక్స్‌లు, 1 ఫోర్ కొట్టగా... సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో హెడ్ వరుసగా నాలుగు ఫోర్లు బాదాడు. అనంతరం హార్దిక్ వేసిన ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో మార్ష్ 3 సిక్స్‌లతో అలరించాడు. దాంతో ఆసీస్ 8 ఓవర్లలో 90 పరుగులు సాధించింది. ఆ తర్వాతా ఇదే జోరు కొనసాగించి ఆసీస్ 11 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) స్మిత్ (బి) స్టార్క్ 13; శుబ్‌మన్ గిల్ (సి) లబుషేన్ (బి) స్టార్క్ 0; విరాట్ కోహ్లి (ఎల్బీడబ్ల్యూ) (బి) ఎలిస్ 31; సూర్యకుమార్ యాదవ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) స్టార్క్ 0; కేఎల్ రాహుల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) స్టార్క్ 9; హార్దిక్ పాండ్యా (సి) స్మిత్ (బి) అబాట్ 1; రవీంద్ర జడేజా (సి) క్యారీ (బి) ఎలిస్ 16; అక్షర్ పటేల్ (నాటౌట్) 29; కుల్దీప్ యాదవ్ (సి) హెడ్ (బి) అబాట్ 4; షమీ (సి) క్యారీ (బి) అబాట్ 0; సిరాజ్ (బి) స్టార్క్ 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (26 ఓవర్లలో ఆలౌట్) 117. వికెట్ల పతనం: 1–3, 2–32, 3–32, 4–48, 5–49, 6–71, 7–91, 8–103, 9–103, 10–117. బౌలింగ్: మిచెల్ స్టార్క్ 8–1–53–5, కామెరాన్ గ్రీన్ 5–0–20–0, సీన్ అబాట్ 6–0–23–3, నాథన్ ఎలిస్ 5–0–13–2, ఆడమ్ జంపా 2–0–6–0. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ట్రావిస్ హెడ్ (నాటౌట్) 51; మిచెల్ మార్‡్ష (నాటౌట్) 66; ఎక్స్‌ట్రాలు 4, మొత్తం (11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 121. బౌలింగ్: షమీ 3–0–29–0, సిరాజ్ 3–0–37–0, అక్షర్ పటేల్ 3–0–25–0, హార్దిక్ పాండ్యా 1–0–18–0, కుల్దీప్ యాదవ్ 1–0–12–0. -
వైజాగ్‌లో సిరీస్ సాధిస్తారా!
సాక్షి, విశాఖపట్నం: ఆస్ట్రేలియాను టెస్టు సిరీస్‌లో ఓడించిన భారత జట్టు ఇప్పుడు వన్డే సిరీస్‌లో కూడా పడగొట్టేందుకు మరో మ్యాచ్ దూరంలో ఉంది. ఇరు జట్ల నేడు విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో రెండో వన్డే జరుగుతుంది. ఈ పోరులో గెలిస్తే సిరీస్ భారత్ ఖాతాలో చేరుతుంది. మరోవైపు సిరీస్‌ను సజీవంగా ఉంచేందుకు ఆసీస్‌కు ఈ మ్యాచ్‌లో గెలవడం తప్పనిసరి. వ్యక్తిగత కారణాలతో తొలి వన్డే నుంచి తప్పుకున్న రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో సారథిగా బాధ్యతలు తీసుకుంటాడు. మూడో స్పిన్నర్‌కు చోటు... తొలి వన్డేలో భారత పేసర్లు షమీ, సిరాజ్ చక్కగా రాణించారు. స్పిన్ విభాగంలో జడేజా రాణించగా, కుల్దీప్ మాత్రమే కొన్ని పరుగులిచ్చాడు. అయితే ముంబైతో పోలిస్తే వైజాగ్ పిచ్ స్పిన్‌కు మరింత అనుకూలంగా ఉండటంతో రెండో రెగ్యులర్ స్పిన్నర్ ఉంటే బాగుంటుందని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. అదే జరిగితే శార్దుల్ ఠాకూర్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం దక్కవచ్చు. మూడో పేసర్ పాత్రను హార్దిక్ సమర్థంగా నిర్వహిస్తుండటంతో శార్దుల్ అవసరం ఇప్పుడు జట్టుకు కనిపించడం లేదు. బ్యాటింగ్‌లో ఊహించినట్లుగానే మిడిలార్డర్లో శ్రేయస్ లేని లోటు కనిపిస్తోంది. సూర్యకుమార్ మరోసారి వన్డేల్లో అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లోనైనా ఆడకపోతే అతను వన్డే కెరీర్ ఇబ్బందుల్లో పడటం ఖాయం. రోహిత్ రాకతో ఓపెనింగ్‌లో జట్టు బలం పెరిగింది. గత మ్యాచ్‌లో విఫలమైన కోహ్లి తన స్థాయికి తగ్గట్లు ఆడితే భారీ స్కోరు ఖాయం. వార్నర్ ఆడితే... మరోవైపు ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన స్థితిలో బరిలోకి దిగుతోంది. అయితే ఆ జట్టు బ్యాటింగ్ బలహీనత తొలి వన్డేలో స్పష్టంగా కనిపించింది. గాయం నుంచి కోలుకున్న వార్నర్ ఆడితే జట్టులో ఎవరిని పక్కన పెడతారనేది ఆసక్తికరం. పైగా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు జరుగుతాయి. కీపర్ ఇన్‌గ్లిస్ స్థానంలో క్యారీ వస్తాడు. హెడ్, లబుషేన్ రాణించడం కీలకం. అయితే అన్నింటికి మించి స్టీవ్ స్మిత్ ఫామ్ ఆసీస్‌ను ఆందోళన పరుస్తోంది. భారత్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి అతను కనీసం ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఇప్పటికైనా అతను ఆ లోటును తీర్చుకుంటాడా చూడాలి. స్టార్క్ తన బౌలింగ్ పదును భారత్‌కు చూపించగా... తొలి వన్డేలో ఒక బౌలర్‌ను తక్కువగా ఆడించి ఇబ్బంది పడిన కంగారూలు ఈసారి ఎలా వ్యూహం మారుస్తారో చూడాలి. వాన గండం... విశాఖ పిచ్ మొదటి నుంచి బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. దాదాపు అన్ని మ్యాచ్‌లలో భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఈసారి కూడా అలాంటి పిచ్ ఎదురు కావచ్చు. అయితే వర్షం ఆటకు ఇబ్బందిగా మారవచ్చని తెలుస్తోంది. స్థానిక వాతావరణ సూచన ప్రకారం ఆదివారం వాన పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లి, సూర్యకుమార్, రాహుల్, పాండ్యా, జడేజా, సుందర్, కుల్దీప్, షమీ, సిరాజ్. ఆస్ట్రేలియా: స్మిత్ (కెప్టెన్), మార్‡్ష, హెడ్, లబుషేన్, క్యారీ, గ్రీన్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, అబాట్, స్టార్క్, జంపా. 7:విశాఖపట్నంలో భారత్ 9 వన్డేలు ఆడగా...7 గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఓడిపోగా, మరో మ్యాచ్ ‘టై’గా ముగిసింది. ఈ వేదికపై ఆడిన ఆరు వన్డేల్లో కోహ్లి 118, 117, 99, 65, 157 నాటౌట్, 0 స్కోర్లు నమోదు చేశాడు. -
Ind Vs Aus: ఆసీస్‌తో టీమిండియా ఢీ.. వైజాగ్‌లో మ్యాచ్.. ఎప్పుడంటే!
తెలుగు రాష్ట్రాల్లోని టీమిండియా అభిమానులకు గుడ్‌న్యూస్! వచ్చే ఏడాది న్యూజిలాండ్, ఆస్ట్రేలియా భారత పర్యటన నేపథ్యంలో రెండు మ్యాచ్‌లకు తెలంగాణ, ఆంధ్రపదేశ్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. కివీస్‌తో 2023లో టీమిండియా మొదటి వన్డేకు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది. జనవరి 18న ఈ మ్యాచ్ జరుగనుంది. అదే విధంగా.. మార్చి 19న ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ వైజాగ్‌లోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగనుంది. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి గురువారం విడుదల చేసిన షెడ్యూల్లో వివరాలు పొందుపరిచింది. న్యూజిలాండ్ భారత పర్యటన షెడ్యూల్ ►మూడు వన్డేలు- మూడు టీ20లు ►జనవరి 18- ఫిబ్రవరి 1 ►వేదికలు: హైదరాబాద్, రాయ్‌పూర్, ఇండోర్, రాంచి, లక్నో, అహ్మదాబాద్. ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటన ►నాలుగు టెస్టులు- మూడు వన్డేలు ►ఫిబ్రవరి 13- మార్చి 22 ►వేదికలు: నాగ్‌పూర్, ఢిల్లీ, ధర్మశాల, అహ్మదాబాద్, ముంబై, వైజాగ్, చెన్నై. పూర్తి షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి! చదవండి: Rohit Sharma: సగం సగం ఫిట్నెస్! ఓటమికి ప్రధాన కారణం వాళ్లే! ఇప్పటికైనా... IND vs BAN: వరుసగా రెండు సెంచరీలు.. రోహిత్ స్థానంలో జట్టులోకి! ఎవరీ ఈశ్వరన్? -
India Vs South Africa: ఇక గెలవాల్సిందే!
మన స్పిన్ తిరగట్లేదు. పేస్‌లో పదును లేదు. బ్యాటింగ్‌లో నిలకడ లేదు. రిషభ్ పంత్ కెప్టెన్ గా, బ్యాటర్‌గా ఏమాత్రం ప్రభావం చూపట్లేదు. సొంతగడ్డపై ఇన్ని ప్రతికూలతల తో తల్లడిల్లుతున్న టీమిండియా చావోరేవో తేల్చుకునేందుకు విశాఖపట్నంలో సిద్ధమైంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో నేడు జరిగే మూడో టి20లో తప్పక గెలవాల్సిన పోరులో జోరుమీదున్న దక్షిణాఫ్రికాను ఢీ కొట్టబోతోంది. ఇక్కడా ఓడితే... ఇక ముందు జరిగే రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా లాభముండదు. భారత్ లక్ష్యం సిరీసే అయితే వైజాగ్ నుంచే అంతా మార్చుకోవాలి. సీమర్లు నిప్పులు చెరగాలి. స్పిన్నర్లు తిప్పేయాలి. బ్యాటర్స్ బాధ్యతగా ఆడాలి. ఇవన్నీ ఈ మ్యాచ్‌లో కనిపిస్తే ఆఖరి దాకా సిరీస్ వేటలో ఉంటాం. సాక్షి, విశాఖపట్నం: ఈ ఏడాది టి20 ప్రపంచకప్ కోసం గట్టి ప్రత్యర్థితో ఏర్పాటు చేసిన సిరీస్ ఇది. సీనియర్లకు విశ్రాంతినిచ్చి కుర్రాళ్లను పరిశీలిస్తున్నారు. ఓ రకంగా కోచ్ ద్రవిడ్‌కే పరీక్షలాంటింది ఈ సిరీస్! గతంలో ఐపీఎల్, యువ జట్ల (అండర్ –19, భారత్ ‘ఎ’)ను తీర్చిదిద్దడంలో, కుర్రాళ్ల ప్రతిభను సానబెట్టడంలో సఫలమైన హెడ్ కోచ్‌ను సీనియర్ జట్టు ఫలితాలు కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ద్రవిడ్ పంథా మార్చాలి. ఫలితంపై కాకుండా ఆటగాళ్లలో పట్టుదల పెరిగేలా అతను స్ఫూర్తి నింపాలి. అప్పుడే వరుస ఓటమిల తాలుకు ఒత్తిడి తగ్గుతుంది. బ్యాటర్లు పరుగులపై దృష్టి పెడతారు. బౌలర్లు వైవిధ్యం కనబరుస్తారు. ఓపెనింగ్‌లో రుతురాజ్, ఇషాన్ పవర్ ప్లేను బాగా సద్వినియోగం చేసుకోవాలి. ఆ తర్వాత పంత్, హార్దిక్ ధాటైన ఇన్నింగ్స్ ఆడితే ఆఖర్లో దినేశ్ కార్తీక్ మెరుపులకు తగిన భారీస్కోరు సాధ్యమవుతుంది. అయితే ఓ పెద్ద స్కోరు చేస్తే పనైపోదని, గెలుపు దక్కదని తొలి మ్యాచ్‌లోనే సఫారీలు నిరూపించారు. కాబట్టి బౌలర్ల పాత్ర కూడా కీలకమే. వికెట్లు తీయడంలో ఏమాత్రం పట్టుసడలించకుండా ఉంటేనే విజయం దక్కుతుంది. ఆత్మవిశ్వాసంతో దక్షిణాఫ్రికా తొలి టి20ని బ్యాటింగ్‌తో, రెండో మ్యాచ్‌ను బౌలింగ్ ప్రతాపంతో చేజిక్కించుకున్న సఫారీ జట్టు ఆతిథ్య జట్టుకు కఠినమైన సవాళ్లు విసురుతోంది. ఆల్‌రౌండ్ ప్రదర్శన ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఇప్పుడు వరుసగా మూడో విజయంతో సిరీస్‌పైనే కన్నేసింది. ఈ సిరీస్ ఫలితాలని గమనిస్తే సఫారీ సమష్టి కృష్టితో నెగ్గుకొచ్చింది. కెప్టెన్ బవుమా, డసెన్, మిల్లర్, క్లాసెన్, ప్రిటోరియస్ అంతా బ్యాటింగ్‌లో మెరిపిస్తున్నారు. సీమర్లు నోర్జే, ప్రిటోరియస్, పార్నెల్, రబడ, స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌లు రెండో టి20లో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్గల ఆతిథ్య జట్టును ఎక్కడికక్కడ కట్టడి చేశారు. జట్లు (అంచనా) భారత్: పంత్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్, శ్రేయస్/దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, భువనేశ్వర్, చహల్. దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్), హెండ్రిక్స్, డసెన్, మిల్లర్, క్లాసెన్, ప్రిటోరియస్, పార్నెల్, రబడ, ఇన్‌గిడి/కేశవ్, నోర్జే, షమ్సీ. పిచ్, వాతావరణం ఇక్కడ జరిగిన రెండు అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ల్లోనూ తక్కువ స్కోర్లే నమోదయ్యాయి. రెండుసార్లూ చేజింగ్ జట్టే గెలిచింది. సీమర్లు, స్పిన్నర్లకు అనుకూలం. టాస్ నెగ్గిన జట్టు కచ్చితంగా ఫీల్డింగే ఎంచుకుంటుంది. రుతుపవనాల ఆగమనంతో వర్షం కురిసేందుకు 20 శాతం అవకాశముంది. -
విశాఖ టెస్టుకు సర్వం సిద్ధం
సాక్షి, విశాఖపట్నం: భారత్- దక్షిణాఫ్రికాల మధ్య మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ బుధవారం నుంచి విశాఖలో ప్రారంభంకానుంది. నగరంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరగబోయే తొలి టెస్ట్‌కు సర్వం సిద్దమైంది. సోమవారం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) నూతన అధ్యక్షుడు శరత్ చంద్రా రెడ్డి, కార్యదర్శి దుర్గారావు, కోశాధికారి గోపీనాథ్ రెడ్డి, తదితరులు స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. మ్యాచ్ వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్టేడియం సిబ్బందికి ఏసీఏ ఆధ్యక్షుడు శరత్ చంద్రా రెడ్డి సూచించారు. అనంతరం ఈ మ్యాచ్‌కు సంబంధించి ఏర్పాట్లపై కలెక్టర్ వినయ్ చంద్, పోలీస్ కమిషనర్ ఆర్కే మీనాలతో కలిసి ఏసీఏ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఏసీఏ అధ్యక్షుడు శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ.. ‘విశాఖలో జరిగే ఈ టెస్ట్ మ్యాచ్‌ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. అందుకోసం మ్యాచ్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. మ్యాచ్ నిర్వహణ కోసం ఏడు కమిటీలను ఏర్పాటు చేశాం. వర్షాల వలన వెలుతురులేమి సమస్య తలెత్తినా ఫ్లడ్ లైట్ల వెలుతురులో మ్యాచ్‌ను నిర్వహిస్తాం . ఒకవేళ వర్షం పడినా గంటలో తిరిగి మ్యాచ్ ప్రారంభమయ్యే విధంగా ఏర్పాట్లు చేశాం. స్టేడియం కెపాసిటీ 27,500 సీట్లు. ఇప్పటికే టికెట్ల అమ్మకాలు పూర్తయ్యాయి. స్టేడియంలో ఉన్న 20 గేట్లలో 12 గేట్లు తెరుస్తున్నాం. విద్యార్థులు ఉచితంగా మ్యాచ్ చూసేందుకు గేట్ నెంబర్ 8 నుంచి లోపలికి వచ్చేందుకు ఏర్పాట్లు చేశాం. స్కూలు, కాలేజ్ ఐడీ కార్డు చూపిస్తే చాలు. వెయ్యి మందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశాం. మ్యాచ్ సందర్బంగా ఎటువంటి ట్రాఫిక్ మళ్లింపులు లేవు’అని తెలిపారు. ఏసీఏను అభినందిస్తున్నా: విష్ణుకుమార్ రాజు భారత్-దక్షిణాఫ్రికాల మధ్య విశాఖ వేదికగా జరగబోయే టెస్టు మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ)ను మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అభినందించారు. దగ్గరుండి అన్ని ఏర్పాట్లను పరిశీలిస్తూ, సిబ్బందికి తగు సూచనలిస్తున్నారని కొనియాడారు. తొలిసారి విద్యార్థులకు ఉచితంగా మ్యాచ్ చూసే అవకాశం కల్పించిన నూతన ఏసీఏ వర్గానికి విష్ణుకుమార్ రాజు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కాగా, ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. దీంతో మధ్యాహ్నం వరకు ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమయ్యారు. వర్షం ఆగిపోయాక మధ్యాహ్నం నుంచి టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. రెండు గంటలకు పైగా సాగిన ప్రాక్టీస్ సెషన్లో సారథి విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, హనుమ విహారి, మయాంక్ అగర్వాల్, రవీంద్ర జడేజాలు చెమట చిందించారు. -
మహిళల కోసం ‘నిర్భీక్’ రివాల్వర్
జాతీయం: మహిళల కోసం ‘నిర్భీక్’ రివాల్వర్ ప్రత్యేకంగా మహిళల కోసం రూపొందించిన నిర్భీక్ అనే రివాల్వర్‌ను ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మార్చి 25న కాన్పూర్‌లో ఆవిష్కరించింది. 2012లో ఢిల్లీలో అత్యాచారం, హత్యకు గురైన నిర్భయ ఉదంతం నేపథ్యంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఈ రివాల్వర్‌ను తయారు చేసింది. మహిళలు తమను తాము కాపాడుకునేందుకు తయారు చేసిన ఈ రివాల్వర్ 525 గ్రాముల బరువు, 177.8 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. 50 అడుగులు (15 మీటర్ల) దూరంలోని లక్ష్యాలను కాలుస్తుంది. దీన్ని మహిళలు తమ పర్సులలో, హాండ్ బ్యాగుల్లో తీసుకువెళ్లేందుకు వీలుగా ఉంటుంది. దీని ధర రూ. 1,22,360. ప్రకృతి విపత్తుల బారినపడే నగరాల జాబితా: ఏడో స్థానంలో కోల్‌కతా ప్రపంచంలో ప్రకృతి విపత్తుల బారినపడే 616 నగరాల పరిస్థితులపై స్విస్ రే అనే సంస్థ మార్చి 26న ఓ నివేదిక విడుదల చేసింది. ప్రకృతి విపత్తుల ప్రమాదాలు గల నగరాల జాబితాలో కోల్‌కతా ఏడో స్థానంలో ఉందని తెలిపింది. భా రత్ నుంచి కోల్‌కతా నగరం ఒక్కటే ఈ జాబితాలో ఉంది. ఈ ప్రమాదాలు ఎదుర్కొనే నగరాల్లో టోక్యో(జపాన్) మొదటి స్థానం, మనీలా (ఫిలిప్పీన్స్) రెండోస్థానం, పెరల్ రివర్ డెల్టా (చైనా) మూడో స్థానం, ఒసాకా -కోబె(జపాన్) నాలుగో స్థానంలో ఉన్నాయి. ఐదో స్థానంలో జకార్తా (ఇండోనేషియా), నగోయా (జపాన్) ఆరో స్థానంలో ఉన్నాయి. పోలియో రహిత దేశంగా భారత్ భారత్‌ను పోలియో రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యు.హెచ్.ఒ) మార్చి 27న అధికారికంగా ప్రకటించింది. డబ్ల్యు.హెచ్.ఒ భారత్‌తో కలిపి మొత్తం 11 దేశాలను పోలియో వైరస్ రహిత దేశాలుగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన అధికార పత్రాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాంనబీ ఆజాద్ న్యూఢిల్లీలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి నుంచి అందుకున్నారు. 1995 నుంచి ముమ్మరంగా చేపట్టిన పోలియో నిర్మూలన కార్యక్రమాల వల్ల ప్రభుత్వం పోలియోను రూపుమాపగలిగింది. క్రీడలు దేవ్‌ధర్ ట్రోఫీ విజేత వెస్ట్‌జోన్ దేశవాళీ జోనల్ వన్డే క్రికెట్ టోర్నీ దేవ్‌ధర్ ట్రోఫీని వెస్ట్‌జోన్ గెలుచుకుంది. విశాఖలోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో మార్చి 28న జరిగిన అంతిమపోరులో వెస్ట్‌జోన్ 133 పరుగుల భారీ తేడాతో నార్త్‌జోన్‌ను ఓడించింది. ఈ ట్రోఫీని వెస్ట్ జోన్ గెలవడం ఇది మూడోసారి. క్యాండిడేట్ టోర్నీ టైటిల్ విజేత ఆనంద్ రష్యాలో జరిగిన క్యాండిడేట్ టోర్నీ చెస్ టైటిల్‌ను భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ కైవసం చేసుకున్నాడు. ఈ విజయంతో నవంబర్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలకు నిరుటి విజేత మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో తలపడేందుకు అర్హత సాధించాడు. ప్రపంచకప్ షూటింగ్లో హీనాకు రజతం భారత స్టార్ ఎయిర్ పిస్టల్ షూటర్ హీనా సిద్దూ అమెరికాలో జరిగిన ఐ.ఎస్.ఎస్.ఎఫ్ ప్రపంచ కప్‌లో రజత పతకం సాధించింది. ఫైనల్లో బల్గేరియాకు చెందిన బెనోవా అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం కైవసం చేసుకుంది. సంతోషికి స్వర్ణం నాగ్‌పూర్‌లో జరిగిన జాతీయ సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో రాష్ట్రానికి చెందిన లిఫ్టర్లు నాలుగు పతకాలు సాధించారు. మహిళల 53కిలోల విభాగంలో మత్స్య. సంతోషి స్వర్ణపతకం గెలుచుకుంది. ఆమె క్లీన్ అండ్ జర్క్‌లో 104 కిలోల బరువు ఎత్తి అగ్రస్థానంలో నిలిచింది. అలాగే మొత్తంగా 174 కిలోల బరువు ఎత్తిన సంతోషికి కాంస్యం కూడా వరించింది. కాగా పురుషుల 62 కిలోల కేటగిరీలో కె.గౌరీబాబు, పురుషుల 69 కిలోల విభాగంలో ఎం. రామకృష్ణ కాంస్యపతకాలు సాధించారు. ఈ ముగ్గురూ విజయనగరం జిల్లాకు చెందిన వారు కావడం విశేషం. బీసీసీఐకి ఇద్దరు అధ్యక్షులు ఐపీఎల్‌కు సంబంధించినంతవరకు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా సునీల్గవాస్కర్, ఐపీఎల్ మినహా మిగిలిన బోర్డు వ్యవహారాలన్నింటికీ సంబంధించి శివలాల్‌యాదవ్ తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రస్తుతం అధ్యక్షుడి హోదాలో కొనసాగుతున్న శ్రీనివాసన్‌ను పక్కనబెట్టాలని స్పష్టం చేసింది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై కేసును విచారిస్తున్న ఏకే పట్నాయక్, ఇబ్రహీం ఖలీవుల్లాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. కేసు విచారణ ముగిసేవరకు తమ ఆదేశాలమేర అప్పగించిన బాధ్యతలను నిర్వహించాలని సూచించింది. ఖలిస్తాన్ ఉగ్రవాది భుల్లర్‌కు శిక్ష తగ్గింపు ఖలిస్తాన్ ఉగ్రవాది దేవేందర్‌పాల్ సింగ్ భుల్లర్‌కు విధించిన మరణశిక్షను యావజ్జీవశిక్షగా మార్చుతూ సుప్రీంకోర్టు మార్చి 31న తీర్పునిచ్చింది. భుల్లర్ క్షమాభిక్షపై నిర్ణయం తీసుకునేందుకు విపరీతమైన జాప్యం జరగడం, ఆయన అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. 1993లో అప్పటి యూత్‌కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం.ఎస్.భిట్టాను హత్యచేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలోని యూత్‌కాంగ్రెస్ కార్యాలయం ఎదుట భుల్లర్ బాంబు పేలుళ్లకు పాల్పడ్డాడు. ఆ దాడిలో 9మంది చనిపోగా భిట్టా తీవ్రగాయాలతో బయటపడ్డాడు. ఈ కేసులో భుల్లర్‌ను దోషిగా నిర్ధారించిన హైకోర్టు, సుప్రీంకోర్టులు కింది కోర్టు విధించిన మరణశిక్షను సమర్థించాయి. ‘టార్క్’ ఏర్పాటు పన్ను చెల్లింపుదారుల్లో విశ్వసనీయతను పెంచి, ఆదాయపన్ను నిబంధనలను క్రమబద్ధీకరించే చర్యల్లో భాగంగా పన్నుల పరిపాలనా సంస్కరణల కమిషన్ (టాక్స్ అడ్మినిస్ట్రేషన్ రీఫార్మ్స్ కమిషన్-టార్క్)ను కేంద్రం ఏర్పాటు చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి సలహాదారైన పార్థసారథి షోమ్ టార్క్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. పన్నుల విషయంలో నిర్మాణాత్మక సంస్కరణలు, నిబంధనలపై దృష్టి పెట్టేందుకు టార్క్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అక్కంపల్లిలో పురాతన గుహలు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా అక్కంపల్లిలో ప్రాచీన మానవుల నివాసంగా ఉన్న గుహల సముదాయాన్ని పరిశోధకులు కనుగొన్నారు. ఈ గుహలలో ఉన్న చిత్రలేఖనం 7 వేల సంవత్సరాల క్రితం నాటి నాగరికత, సంస్కృతులను ప్రతిబింబిస్తున్నాయి. ఇందులోని ఐదు గుహలలో మూడు సహజ సిద్ధమైనవి కాగా రెండు రాళ్లు మలచినవిగా ఉన్నాయి.