Aces
-
'ఏస్'లతో సరికొత్త రికార్డు!
యూఎస్ ఓపెన్ లో భాగంగా క్రొయేషియా టెన్నిస్ స్టార్ ఇవో కార్లోవిక్ తన పదునైన సర్వీస్ తో రికార్డు సృష్టించాడు. మంగళవారం రాత్రి జరిగిన తొలిరౌండ్లో ప్రత్యర్థిపై ఏకంగా రికార్డు స్థాయిలో 61 ఏస్ లు సంధించి గతంలో ఉన్న 49 ఏస్'ల రికార్డు తిరగరాశాడు. తైవాన్ ప్లేయర్ లు యెన్సన్ పై 4-6, 7-6 (7/4), 6-7 (4/7), 7-6 (7/5), 7-5 తేడాతో నెగ్గి కార్లోవిక్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. ఆరడుగుల పదకొండు అంగులాల ఎత్తుండే ఈ ఆటగాడు ప్రత్యర్థిపై నెగ్గేందుకు ఏస్ లను తన అమ్ములపొదిలో ప్రధాన అస్త్రంగా మార్చుకున్నాడు. తొలి సెట్ ప్రత్యర్థిగా కోల్పోయిన తాను ముఖ్యంగా చెప్పాలంటే రెండో సెట్లో దాదాపు నేను ఆడిన షాట్లలో ఎక్కువగా ఏస్ ఉన్నాయని ఐదు సెట్ల సుదీర్ఘ మ్యాచ్ ముగిసిన అనంతరం కార్లోవిక్ తెలిపాడు. గతంలో మూడుసార్లు 50 అంతకంటే ఎక్కువ ఏస్'లు సంధించినా యూఎస్ ఓపెన్ లో మాత్రం ఈ సంఖ్యలో ఎవరూ సంధించకపోవడం గమనార్హం. కెరీర్ మొత్తంగా 11,277 ఏస్'లు సంధించిన కార్లోవిక్, రెండో స్థానంలో ఉన్న గోరాన్ ఇవానిసెవిక్ ఏస్'ల మధ్య వ్యత్యాసం 1000 అంటే మాటలు కాదు. ఓవరాల్ గా గ్రాండ్ స్లామ్ చరిత్రలో 113 ఏస్'లతో అత్యధికంగా ఆడిన ఆటగాడిగా జాన్ ఇస్నర్(వింబుల్డన్) పేరిట రికార్డు ఉంది. -
బదులు తీర్చుకున్న ఏసెస్
మావెరిక్‌పై గెలుపు న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లోఫిలిప్పీన్స్ మావెరిక్‌పై ఇండియన్ ఏసెస్ జట్టు బదులు తీర్చుకుంది. భారత అంచె పోటీల్లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ఏసెస్ 30-12 తేడాతో మావెరిక్‌పై సునాయాసంగా గెలిచింది. ముందుగా మిక్స్డ్ డబుల్స్‌లో బోపన్న- సానియా మీర్జా జోడి 6-2తో హ్యువే- టోమ్లజనోవిక్పై నెగ్గి శుభారంభాన్ని అందించింది. ఆ తర్వాత మహిళల సింగిల్స్‌లో రద్వాన్‌స్కా 6-1తో గజ్డోసోవాపై.. పురుషుల లెజెండ్స్ సింగిల్స్‌లో సాన్టోరో 6-1తో ఫిలిప్పోసిస్పై నెగ్గారు. ఇక పురుషుల డబుల్స్‌లో నాదల్- బోపన్న 6-4 వాసెలిన్- హ్యుయే జోడిపై.. పురుషుల సింగిల్స్‌లో నాదల్ 6-4తో వాసెలిన్‌ను ఓడించడంతో విజయం సంపూర్ణమైంది. మరో మ్యాచ్‌లో లియాండర్ పేస్‌కు చెందిన జపాన్ వారియర్స్ 24-21 తేడాతో యూఏఈ రాయల్స్‌ను ఓడించింది. -
ఏసెస్‌కు వరుసగా రెండో విజయం
కోబ్ (జపాన్): ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో డిఫెండింగ్ చాంపియన్స్ ఇండియన్ ఏసెస్ వరుసగా రెండో విజయం సాధించింది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఏసెస్ 27-22తో సింగపూర్ స్లామర్స్‌పై నెగ్గింది. లెజెండరీ సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ కార్లోస్ మోయా (స్లామర్స్) 6-5తో ఫ్యాబ్రిస్ సంటారో (ఏసెస్)పై గెలుపొందగా... మహిళల సింగిల్స్‌లో కరోలినా ప్లిస్కోవా (స్లామర్స్) 6-4తో సమంతా స్టోసుర్ (ఏసెస్)ను ఓడించింది. అయితే పురుషుల డబుల్స్‌లో డుడిగ్-బోపన్న (ఏసెస్) జోడి 6-4తో మార్సెలో మెలో-బ్రౌన్ (స్లామర్స్)పై; మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జా-డుడిగ్ (ఏసెస్) ద్వయం 6-3తో కిర్గియోస్-బెనిచ్ (స్లామర్స్)పై గెలిచారు. ఇక నిర్ణయాత్మక పురుషుల సింగిల్స్‌లో డుడిగ్ (ఏసెస్) అద్భుతంగా ఆడి 6-2తో కిర్గియోస్ (స్లామర్స్)పై నెగ్గడంతో ఏసెస్ 27-22తో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరో మ్యాచ్‌లో ఫిలిప్పిన్ మావెరిక్ 28-24తో జపాన్ వారియర్స్‌ను ఓడించింది.