Addicted to alcohol
-
దారుణం: నా బిడ్డ నాకే కావాలన్నాడు.. నేలకేసి కొట్టాడు
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. బిజ్నోర్ జిల్లా మండవలి పోలీస్ స్టేషన్ పరిధిలోని రహత్‌పూర్ ఖుర్ద్ గ్రామంలో మహ్మద్ నజీమ్ అనే వ్యక్తి తన కూతురుని నేలకేసి కొట్టి చంపాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. మహ్మద్ నజీమ్ ఖుర్ద్ గ్రామానికి చెందిన మహతాబ్ జహాన్‌ను 18 నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఎనిమిది నెలల కూమార్తె ఉంది. అయితే మద్యానికి బానిసైన నిందితుడు నజీమ్ తరచూ భార్యతో గొడవ పడేవాడు. దీంతో కొన్ని రోజుల క్రితం అతడి నుంచి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె తల్లిదండులతో కలిసి నివసిస్తోంది. ఈ క్రమంలో జూలై 31 రాత్రి మద్యం తాగి మహతాబ్ ఉండే నివాసానికి వచ్చిన నజీమ్ తన కుమార్తెను తనతో తిరిగి పంపించాలని డిమాండ్ చేశాడు. మహతాబ్ నిరాకరించడంతో.. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో నజీమ్ తన కుమార్తెను నేలకేసి చనిసోయే దాక కొట్టాడు. కాగా మహతాబ్ ఆ చిన్నారిని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. పాప చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఇక భార్య మహతాబ్ ఫిర్యాదు మేరకు ఆగస్టు 1న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు బిజ్నోర్ పోలీసు సూపరింటెండెంట్ ధరమ్వీర్ సింగ్ తెలిపారు. ఈ సంఘటన మూడు రోజుల క్రితం చోటు చేసుకోగా... ఆలస్యంగా వెలుగు చూసింది. -
30 లక్షల మంది మైనర్లు మద్యం బానిసలు
సాక్షి, న్యూఢిల్లీ: మత్తుపదార్ధాలపై ఎంత అవగాహన కల్పిస్తున్నా చిన్నారులను వాటి నుంచి దూరం చేయలేకపోతున్నారనడానికి దేశంలో 30 లక్షల మంది మైనర్లు మద్యానికి బానిసయ్యారనే విషయమే నిదర్శనం. నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్మెంట్ సెంటర్ (ఎన్డీడీటీసీ), ఎయిమ్స్, ఢిల్లీల ఆధ్వర్యంలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ నిర్వహించిన జాతీయ స్థాయి సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింథియా అడిగిన ప్రశ్నకు బుధవారం రాజ్యసభలో కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత సహాయమంత్రి రతన్‌లాల్ కటారియా పలు అంశాలు వెల్లడించారు. దేశంలో 30 లక్షల మంది మైనర్లు మద్యం బానిసలేనని తెలిపారు. తొలిసారిగా 2017–18లో మత్తుపదార్ధాల వినియోగంపై సర్వే నిర్వహించామని ఆయా వివరాలు 2019లో ప్రచురించామని తెలిపారు. ప్రజలను మద్యం బానిస నుంచి విముక్తి చేయడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పలు సూచనలు చేశామని తెలిపారు. జువైనల్ హోమ్స్‌లో డీ అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, మత్తుపదార్ధాలకు బానిసలైన చిన్నారులను ఒక సమూహంగా ఏర్పాటు చేసి వారిని సంరక్షించాలని సూచించామన్నారు. దేశవ్యాప్తంగా 272 జిల్లాల్లో నషాముక్త్ భారత్ అభియాన్ పేరిట అవగాహన కార్యక్రమాలు ప్రారంభించామన్నారు. 10 నుంచి 18 ఏళ్ల మధ్య చిన్నారులను గుర్తించి వారికి అవగాహనతోపాటు ఇతరత్రా నైపుణ్య కార్యక్రమాల్లో భాగస్తులను చేస్తున్నట్లు కేంద్ర సహాయ మంత్రి కటారియా పేర్కొన్నారు. -
మనస్తాపంతోనే యువకుడి అఘాయిత్యం
సాక్షి, ఎచ్చెర్ల (శ్రీకాకుళం) : మండలంలోని పొన్నాడ వంతెన సమీపంలో కాలిన శరీరంతో ఉన్న యువకుని మృతదేహం కలకలం రేపింది. పక్కన పెట్రోల్ (ఖాళీ) సీసాలు, మద్యం బాటిళ్లున్నాయి. గుర్తు పట్టేందుకు వీలులేని విధంగా శరీరం కాలిపోయింది. ఎవరో హత్య ఎవరు చేసి ఉంటారని తొలుత అందరూ భావించారు. పోలీసుల దర్యాప్తులో ఆత్మ హత్యగా తేలింది. శ్రీకాకుళం పట్టణ కేంద్రానికి కిలో మీటరు దూరంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. పొన్నాడ వంతెన అనుకుని పోతన్న చెరువు ఉంది. ఆ చెరువు గట్టుపై గుర్తుతెలియని మృత దేహం స్థానికులకు మంగళవారం ఉదయం కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఎచ్చెర్ల ఎస్ఐ వై.కృష్ణ ఆధ్వర్యంలోని పోలీస్ సిబ్బంది చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కాలిన గాయాలతో మృతి చెంది ఉండటం, పక్కన పెట్రోల్ సీసాలు ఉండటం, మృతుని చెప్పులు, మద్యం బాటిళ్లు, అగ్గి పెట్టి సంఘటన స్థలంలో ఉన్నాయి. ఎవరో సజీవ దహనం చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు భావించారు. మృతుడు ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు సాగింది. శ్రీకాకుళం రిమ్స్ మార్చురీకి మృతదేహం తరలించి ఆచూకీ కోసం ప్రయత్నం ప్రారంభించారు. మృతదేహం గుర్తించటం కష్టంగా మారింది. మృతదేహం వాట్సప్‌లో హల్చల్ చేసింది. శ్రీకాకుళం పట్టణంలోని హయత్‌నగర్‌కు చెందిన సెగళ్ల షణ్ముఖరావుకు మృతదేహం ఫొటో చేరింది. మృతదేహం చూసిన ఆయన సోమవారం రాత్రి నుంచి తన అన్న కనిపించక పోవటంతో ఎచ్చెర్ల పోలీసులను సంప్రందించాడు. అనంతరం మార్చురీలో మృతదేహం చూసి తన అన్న సెగళ్ల మోహన్‌రావు (25)గా గుర్తించాడు. మృతుని తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మనస్తాపంతో అఘాయిత్యం! మృతుడు మోహన్‌రావు ఆటో డ్రైవర్. మద్యానికి బానిసగా మారాడు. ఇటీవల వివాహం కుదిరింది. యువకుని ప్రవర్తన తెలిసిన అమ్మాయి కుటుంబ సభ్యులు వివాహ నిశ్చయం రద్దు చేసుకున్నారు. దీంతో మానసిక పరిస్థితి సైతం సక్రమంగా లేకుండా పోయింది. వృద్ధులైన తల్లిదండ్రులు ఆదినారాయణ, నర్సమ్మ, అన్నయ్య రాజారావు, తమ్ముడు షణ్ముఖరావు ఉన్నారు. తాను చనిపోతానని తరచూ కుటుంబ సభ్యులు వద్ద అంటుండే వాడు. కొద్ది రోజుల నుంచి అపస్మారక స్థితికి చేరేలా మద్యం తాగుతున్నాడు. ఇంటి వద్ద సోమవారం సాయంత్రం ఆటో విడిచి పెట్టాడు. శ్రీకాకుళం బైక్‌పై వెళ్లి రాత్రి 8.30 సమీపంలో తమ్ముడికి బైక్ తాళాలు ఇచ్చేశాడు. మద్యం తాగివస్తానని, ఎదురు చూడద్దని తమ్ముడికి చెప్పి వెళ్లిపోయాడు. ఏకాంత ప్రదేశమైన పొన్నాడ వైపు మద్యం బాటిళ్లు, రెండు బాటిళ్లలో పెట్రోల్, అగ్గి పెట్టి తీసుకువెళ్లాడు. మద్యం మత్తులో పెట్రోల్ పోసుకుని నిప్పం టించుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల విచారణలో హత్యకు అవకాశం ఉన్న ఒక్క అంశం సైతం చిక్కలేదని ఎస్ఐ చెప్పారు. కుటుంబ సభ్యులకు ఎవరిపై అనుమానం సైతం లేదన్నారు. ఆత్మహత్యగా కేసుగా నమోదు చేశామన్నారు. కుటుంబ సభ్యులకు ఎటువంటి సందేహం ఉన్నా ఆ కోణంలో దర్యాప్తు చేస్తామన్నారు. ఉదయం పెద్ద ఎత్తున స్థానికులు, ప్రయాణికులు సంఘటన స్థలం వద్ద గుమిగూడారు. ఎస్ఐ కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మద్యానికి డబ్బివ్వలేదని..
భార్య గొంతుకోసి హత్య సంక్రాంతి రోజే దారుణం కేవీబీ పురం(పిచ్చాటూరు): మద్యానికి డబ్బు ఇవ్వలేదని గొంతుకోసి భార్యను హత్య చేసిన సంఘటన కేవీబీపురం మండలం సీకే పురంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సీకేపురానికి చెందిన కృష్ణయ్య(49), అముద(37) 19 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి రమ్య(17), శశి చంద్రిక(8) కుమార్తెలు ఉన్నారు. గ్రామానికి పక్కనే ఉన్న ఆదిత్య మిల్లులో అముద, పెద్ద కుమార్తె రమ్య కూలి పని చేస్తున్నారు. కృష్ణయ్య కూడా అదే కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ మానేశాడు. ఈ క్రమంలో అతను మద్యానికి బానిసయ్యాడు. తాగేందుకు డబ్బు కోసం తరచూ భార్యతో గొడవపడేవాడు. శుక్రవారం అర్ధరాత్రి పూటుగా మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. శనివారం తెల్లవారుజామున అముద కేకలు వేసింది. పక్క గదిలో పడుకున్న పిల్లలు లేచి వెళ్లారు. కృష్ణయ్య పరుగులు తీస్తూ కనిపిం చాడు. లోపలికి వెళ్లి చూడగా తల్లి అముద రక్తపు మడుగులో పడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. పిల్లలు కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న బంధువులు, స్థానికులు వచ్చి చూసే సరికి ఆమె మృతిచెందింది. పండుగ రోజే హత్య జరగడంతో గ్రామంలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పుత్తూరు సీఐ సాయినాథ్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి పెద్ద కుమార్తె రమ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దార్యప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
మద్యానికి బానిసై ఆత్మహత్య
గోదావరిఖని : కరీంనగర్ జిల్లా గోదావరిఖని మండలంలో బుధవారం ఓ ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడి మరణించాడు. అడ్డగుంటపల్లి గ్రామానికి చెందిన నవీన్(33) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత కొంతకాలంగా మద్యానికి బానిసైన నవీన్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.