
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. బిజ్నోర్ జిల్లా మండవలి పోలీస్ స్టేషన్ పరిధిలోని రహత్‌పూర్ ఖుర్ద్ గ్రామంలో మహ్మద్ నజీమ్ అనే వ్యక్తి తన కూతురుని నేలకేసి కొట్టి చంపాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. మహ్మద్ నజీమ్ ఖుర్ద్ గ్రామానికి చెందిన మహతాబ్ జహాన్‌ను 18 నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఎనిమిది నెలల కూమార్తె ఉంది. అయితే మద్యానికి బానిసైన నిందితుడు నజీమ్ తరచూ భార్యతో గొడవ పడేవాడు. దీంతో కొన్ని రోజుల క్రితం అతడి నుంచి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె తల్లిదండులతో కలిసి నివసిస్తోంది.
ఈ క్రమంలో జూలై 31 రాత్రి మద్యం తాగి మహతాబ్ ఉండే నివాసానికి వచ్చిన నజీమ్ తన కుమార్తెను తనతో తిరిగి పంపించాలని డిమాండ్ చేశాడు. మహతాబ్ నిరాకరించడంతో.. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో నజీమ్ తన కుమార్తెను నేలకేసి చనిసోయే దాక కొట్టాడు. కాగా మహతాబ్ ఆ చిన్నారిని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. పాప చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఇక భార్య మహతాబ్ ఫిర్యాదు మేరకు ఆగస్టు 1న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు బిజ్నోర్ పోలీసు సూపరింటెండెంట్ ధరమ్‌వీర్ సింగ్ తెలిపారు. ఈ సంఘటన మూడు రోజుల క్రితం చోటు చేసుకోగా... ఆలస్యంగా వెలుగు చూసింది.
Comments
Please login to add a commentAdd a comment