గోదావరిఖని : కరీంనగర్ జిల్లా గోదావరిఖని మండలంలో బుధవారం ఓ ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడి మరణించాడు. అడ్డగుంటపల్లి గ్రామానికి చెందిన నవీన్(33) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
గత కొంతకాలంగా మద్యానికి బానిసైన నవీన్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.