Aditya Verma
-
‘ఆదిత్య వర్మ’తో సినిమాపై విక్రమ్ ఆసక్తి!
తండ్రి విక్రమ్‌తో కలిసి నటించడానికి యువ నటుడు ధ్రువ్ విక్రమ్ రెడీ అవుతున్నాడా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే బదులే వస్తోంది. నటుడు విక్రమ్ తన కొడుకు ధ్రువ్ విక్రమ్‌ను ఆదిత్యవర్మ చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేశారు. తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన అర్జున్‌రెడ్డి చిత్రానికి రీమేక్ అనే విషయం తెలిసిందే. కాగా తన కొడుకు తొలి చిత్రం విషయంలో విక్రమ్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎంతగా అంటే ముందుగా బాలా దర్శకత్వంలో రూపొందించిన వర్మ చిత్రం సంతృప్తిగా రాలేదని ఆ చిత్రాన్ని పక్కన పెట్టించి మరోసారి అర్జున్‌రెడ్డి చిత్రానికి పనిచేసిన అసోసియేట్‌ను దర్శకుడిగా పరిచయం చేసి అదే చిత్రాన్ని ఆదిత్యవర్మ పేరుతో పూర్తిగా రీషూట్ చేయించుకున్నారు. ఈ చిత్ర షూటింగ్ సమయంలో విక్రమ్ స్పాట్లోనే ఉన్నారు. ఈ విషయాన్ని నటుడు ధ్రువ్‌విక్రమ్‌నే తెలిపారు. అంత శ్రద్ధ తీసుకుని చేసినా ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే నటుడిగా ధ్రువ్‌విక్రమ్‌కు మంచి మార్కులే పడ్డాయి. కాగా ధ్రువ్‌విక్రమ్ చిత్రం ఏమిటన్న ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది. అయితే విక్రమ్ తన కొడుకుతో కలిసి నటించడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు. అందుకోసం మంచి కథను తయారు చేయమని తన సన్నిహిత దర్శకులకు చెప్పారు. అలా దర్శకుడు వెట్రిమారన్ విక్రమ్, ధ్రువ్‌విక్రమ్‌లకు ఒక కథను సిద్ధం చేశారట. ఈ విషయాన్ని ధ్రువ్‌విక్రమ్‌నే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఆ కథను తాను ఇంకా వినలేదని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా తండ్రీకొడుకులు కలిసి నటించడానికి కథ రెడీ అయ్యిందని, దీన్ని ఒక ప్రముఖ దర్శకుడు సిద్ధం చేసినట్లు తెలిసింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం విక్రమ్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో కోబ్రా చిత్రంతో పాటు, మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ చిత్రాలను పూర్తి చేసిన తరువాత తన కొడుకుతో కలిసి నటించే చిత్రం ఉంటే అవకాశం ఉంది. -
ఆదిత్య వర్మ రెడీ
‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ పడాల్సిన ఇబ్బందులు పడింది. చూడాల్సిన చిక్కులు చూసేసింది. ఇక ఆడియన్స్ సినిమా చూడటమే తరువాయి. ఈ రీమేక్ ద్వారా విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ హీరోగా పరిచయం అవుతున్నారు. తొలుత ఈ సినిమాని ‘వర్మ’ టైటిల్‌తో బాలా డైరెక్ట్ చేశారు. అవుట్‌పుట్ నచ్చలేదని నిర్మాణ సంస్థ మళ్లీ మొదటి నుంచి షూటింగ్ మొదలెట్టారు. ప్రస్తుతం వర్మ టైటిల్‌ను ‘ఆదిత్య వర్మ’గా మార్చి గిరీశయ్య దర్శకత్వం వహిస్తున్నారు. ఒరిజినల్ ‘అర్జున్ రెడ్డి’ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో గిరీశయ్య పని చేయడం విశేషం. ఇందులో బన్నితా సంధు, ప్రియా ఆనంద్ కథానాయికలు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. టీజర్ ఆదివారం రిలీజ్ అయింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిందట. రిలీజ్‌కు ‘ఆదిత్య వర్మ’ రెడీ అంటోంది చిత్రబృందం. -
మనోహర్ వెన్నుపోటుదారుడు: వర్మ
న్యూఢిల్లీ: బోర్డు పదవికి రాజీనామా చేసిన శశాంక్ మనోహర్‌ను ‘అధికారం కోసం ఏదైనా చేయగలిగే వెన్నుపోటుదారుడు’గా బీహార్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు ఆదిత్య వర్మ అభివర్ణించారు. ‘ఇచ్చిన హామీలను లెక్క చేయని మనిషి మనోహర్. ఆయనతో పోలిస్తే శ్రీనివాసన్ చాలా నయం. ఆయన తన శత్రువులతో నేరుగా, నిజాయితీగా తలపడేవాడు. పైగా తనను నమ్మినవారిని ఎప్పుడూ మోసం చేయలేదు’ అని ఆదిత్య వర్మ తీవ్రంగా వ్యాఖ్యానించారు. -
ఫోన్ ట్యాపింగ్ కు రూ.14 కోట్లు ఇచ్చారు!
న్యూఢిల్లీ:ఈ ఏడాది మార్చిలో క్రికెట్ సీనియర్ సభ్యుల సాధారణ వార్షిక సమావేశంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు బీహార్ క్రికెట్ అసోసియేషన్ (గుర్తింపులేదు) కార్యదర్శి ఆదిత్య వర్మ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇందులో బీసీసీఐ మాజీ కార్యదర్శి సంజయ్ పటేల్ పాత్ర ఉన్నట్లు ఆయన ఆరోపించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశారు. ఆ వివాదంపై ఒక కమిటీ వేసి నిజాలను వెలికి తీయాల్సిన ఉందని మోదీకి తెలిపారు. బోర్డు అధికారులు పాల్గొన్న ఆ సమావేశంలో సంజయ్ పటేల్ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని పేర్కొన్నారు. సంజయ్ పటేల్ రూ.14 కోట్లను లండన్ కు చెందిన ప్రైవేట్ సంస్థకు చెల్లించి మరీ ఫోన్ ట్యాపింగ్ తో పాటు ఈమెయిల్స్ హ్యాక్ చేసినట్లు ఆ లేఖలో తెలిపారు. లండన్ కు చెందిన ఓ డిటెక్టివ్ ఏజెన్సీ ద్వారా ఫోన్ ట్యాపింగ్ వివాదం బయటపడినట్లు ఆదిత్యవర్మ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఆ వ్యాఖ్యలను సంజేల్ పటేల్ కొట్టిపారేశారు. దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని.. తాను వేరే కారణాలతోనే ఆ డబ్బును వినియోగించినట్లు సంజయ్ స్పష్టం చేశారు. -
బీజేపీలో చేరిన ఆదిత్య వర్మ
న్యూఢిల్లీ: గుర్తింపులేని బీహార్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఆదిత్య వర్మ గురువారం బీజేపీలో చేరారు. ఆయనను బీహార్ బీజేపీ అధ్యక్షుడు మంగల్ పాండే సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ పై కేసు వేసి ఆయన వార్తల్లో నిలిచారు. ఎన్. శ్రీనివాసన్- బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవడానికి వర్మ కారణమయ్యారు. వర్మ పిటిషన్ వేయడంతో స్పాట్ ఫిక్సింగ్ పై దర్యాప్తుకు సుప్రీంకోర్టు జస్టిస్ ముగ్దల్ కమిటీ వేసింది. విచారణ పూర్తయ్యే వరకు బీసీసీఐ అధ్యక్ష పదవికి దూరంగా ఉండాలని శ్రీనివాసన్ ను కోర్టు ఆదేశించింది. శ్రీనివాసన్ ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తొలి చైర్మన్‌గా ఉన్నారు.