
మనోహర్ వెన్నుపోటుదారుడు: వర్మ
న్యూఢిల్లీ: బోర్డు పదవికి రాజీనామా చేసిన శశాంక్ మనోహర్‌ను ‘అధికారం కోసం ఏదైనా చేయగలిగే వెన్నుపోటుదారుడు’గా బీహార్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు ఆదిత్య వర్మ అభివర్ణించారు. ‘ఇచ్చిన హామీలను లెక్క చేయని మనిషి మనోహర్. ఆయనతో పోలిస్తే శ్రీనివాసన్ చాలా నయం. ఆయన తన శత్రువులతో నేరుగా, నిజాయితీగా తలపడేవాడు. పైగా తనను నమ్మినవారిని ఎప్పుడూ మోసం చేయలేదు’ అని ఆదిత్య వర్మ తీవ్రంగా వ్యాఖ్యానించారు.