Advanced rocket test
-
Next Generation Launch Vehicle: ఇస్రో అమ్ములపొదిలో ఎన్జీఎల్వీ!
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): సమీప భవిష్యత్తులో భారీ ప్రయోగాలకు తెర తీస్తున్న ఇస్రో, అందుకు తగ్గట్టుగా అత్యాధునిక రాకెట్ తయారీ ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఈ రాకెట్‌కు న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ (ఎన్జీఎల్వీ)గా నామకరణం చేశారు. తొలి నాళ్లలో చేపట్టిన రోహిణి సౌండింగ్ రాకెట్ల ప్రయోగాల తరువాత 40 కిలోల నుంచి 5,000 కిలోల ఉపగ్రహాలను మోసుకెళ్లే ఎస్ఎల్వీ, ఏఏస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ, ఎల్వీఎం03, ఎస్ఎస్ఎల్వీ... ఇలా ఆరు రకాల రాకెట్లను ఇప్పటిదాకా ఇస్రో అభివృద్ది చేసింది. గగన్‌యాన్ ప్రయోగంలో భాగంగా త్వరలో మానవసహిత అంతరిక్ష ప్రయోగంతో పాటు చంద్రుడిపై వ్యోమగాములను తీసుకెళ్లి సురక్షితంగా తీసుకొచ్చే ప్రయోగాన్నీ చేపట్టాలని భావిస్తోంది. వీటితో పాటు అత్యంత బరువుండే సమాచార ఉపగ్రహాలను జీటీఓ కక్ష్యలోకి పంపే సాంకేతిక పరిజ్ఞానాన్నీ సమకూర్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఏకంగా 20 వేల కిలోల బరువున్న ఉపగ్రహాలను భూమికి సమీపంలోని లియో అర్బిట్‌లోకి, 10 వేల కిలోల ఉపగ్రహాలను జీటీఓ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టే సామర్థ్యంతో ఎన్జీఎల్వీ తయారీకి ఇస్రో తెర తీసింది. రూ.1,798 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టును 2008లోనే కేంద్రం ఆమోదించింది. సెమీ క్రయోజనిక్ దశను అభివృద్దితో పాటు రాకెట్ విడి భాగాలను దేశీయంగానే రూపొందించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. 6న ‘ఎల్పీ1’ వద్దకు ఆదిత్య ఎల్1: సౌర ప్రయోగాల నిమిత్తం గత సెపె్టంబర్ 2న ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్1 ఉపగ్రహం జనవరి 6 సాయంత్రం సూర్యుడికి సమీపంలోని లాంగ్రేజియన్ పాయింట్ 1ను చేరనుంది. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఈ పాయింట్‌ను చేరాక సూర్యుని రహస్యాలను అధ్యయనం చేయనుంది. సౌర తుఫాన్ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వీటితో పాటు ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యు డి వెలుపలి వలయమైన కరోనాపై అధ్యయనాలు చేయనున్నారు. ఎన్జీఎల్వీ విశేషాలు... ► ఎన్జీఎల్వీ రాకెట్ ఎత్తు 75 మీటర్లు ► వెడల్పు 5 మీటర్లు. ► పీఎస్ఎల్వీ ఎక్స్ఎల్ తరహాలోనే దీనికీ ఆరు స్ట్రాపాన్ బూస్టర్లుంటాయి. ► ప్రయోగ సమయంలో 600 టన్నుల నుంచి 770 టన్నులు ► రాకెట్‌ను మూడు దశల్లో ప్రయోగిస్తారు. ► ఇది ఫాల్కన్, అట్లాస్–వీ, ప్రొటాన్–ఎం, లాంగ్ మార్చ్–58 రాకెట్లకు దీటుగా ఉంటుంది. ► ఇస్రో ౖచైర్మన్ సోమ నాథ్ ఇటీవలే ఎన్జీఎల్వీపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ► 2030–35 నాటికి మానవ అంతరిక్ష యానం, అత్యంత బరువైన ఉపగ్రహ ప్రయోగాలకు ఇది వీలుగా ఉంటుందని వివరించారు. -
Russia Ukraine War: ఉక్రెయిన్ చేతికి అమెరికా రాకెట్లు!
వాషింగ్టన్/కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పదేపదే చేస్తున్న విజ్ఞప్తి పట్ల అగ్రరాజ్యం అమెరికా ఎట్టకేలకు సానుకూలంగా స్పందించింది. ఉక్రెయిన్‌కు హైటెక్, మీడియం రేంజ్ రాకెట్ సిస్టమ్స్ అందజేస్తామని ప్రకటించింది. ఇవి తక్కువ సంఖ్యలోనే పంపిస్తామని పేర్కొంది. ఉక్రెయిన్‌కు ఇప్పటికే ప్రకటించిన 700 మిలియన్ డాలర్ల భద్రతాపరమైన సాయంలో భాగంగానే రాకెట్ సిస్టమ్స్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇందులో రాకెట్ సిస్టమ్స్‌తోపాటు హెలికాప్టర్లు, జావెలిన్ యాంటీ–ట్యాంకు ఆయుధ వ్యవస్థ, టాక్టికల్ వాహనాలు, విడిభాగాలు ఉంటాయని అమెరికా ఉన్నతాధికారులు మంగళవారం స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌కు ఇవ్వనున్న ఆయుధ ప్యాకేజీని అతిత్వరలోనే బహిర్గతం చేస్తామన్నారు. అమెరికా ఇచ్చే ఆయుధాలు ఉక్రెయిన్‌లో తిష్టవేసిన రష్యా సైన్యంపై పోరాటానికే పరిమితం కానున్నాయి. సరిహద్దును దాటి రష్యా భూభాగంలో దాడి చేసే ఆయుధాలను ఉక్రెయిన్‌కు తాము ఇవ్వబోమని అమెరికా గతంలోనే తేల్చిచెప్పింది. అలాచేసే సంక్షోభం మరింత ముదురుతుందని అమెరికా భావిస్తోంది. ఉక్రెయిన్‌కు అడ్వాన్స్డ్ రాకెట్ సిస్టమ్స్, ఆయుధాలు అందజేయాలని తీసుకున్న నిర్ణయాన్ని అధ్యక్షుడు జో బైడెన్ సైతం ధ్రువీకరించారు. ఉక్రెయిన్ భూభాగంలో శత్రు శిబిరాలను ధ్వంసం చేయడానికి తమ ఆయుధాలు ఉపయోగపడతాయని ఆయన వ్యాఖ్యానించారు. సరిహద్దులకు ఆవల దాడులు చేయడాన్ని తాము ప్రోత్సహించబోమన్నారు. యుద్ధం వల్ల ఎదురయ్యే ఇబ్బందులు ఏమిటో రష్యాకు తెలిసేలా చేయడమే తమ ఉద్దేశమన్నారు. డోన్బాస్లో వినియోగం! ఉక్రెయిన్‌కు తాము ఇవ్వనున్న మీడియం రేంజ్ రాకెట్లు 70 కిలోమీటర్ల దాకా ప్రయాణిస్తాయని, నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదిస్తాయని అమెరికా అధికారులు తెలిపారు. వీటి సాయంతో రష్యా భూభాగంపై దాడి చేయబోమంటూ ఉక్రెయిన్ పాలకులు హామీ ఇచ్చారన్నారు. తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్బాస్లో రష్యా బలగాల భరతం పట్టేందుకు అమెరికా ఆయుధాలను ఉక్రెయిన్ సైన్యం రంగంలోకి దించబోతున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఉక్రెయిన్‌కు అమెరికా హై మొబిలిటీ ఆర్టిల్లరీ రాకెట్ సిస్టమ్స్(హైమార్స్) ఇవ్వబోతోంది. ఒక్కో కంటైనర్‌లో ఆరు రాకెట్లు ఉంటాయి. ఉక్రెయిన్‌కు అత్యాధునిక యాంటీ–ఎయిర్‌క్రాఫ్ట్ క్షిపణులు, రాడార్ సిస్టమ్స్ ఇస్తామని జర్మనీ చాన్సరల్ ఒలాఫ్ షోల్జ్ ప్రకటించారు. ఇలా అగ్నికి ఆజ్యం పోయొద్దంటూ రష్యా ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ ఘాటుగా స్పందించారు. నిత్యం 60–100 మంది ఉక్రెయిన్ జవాన్లు బలి రష్యాపై యుద్ధంలో తమకు జరుగుతున్న ప్రాణ నష్టంపై ఇన్నాళ్లూ పెదవి విప్పని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ అంశంపై ఇప్పుడిప్పుడే స్పందిస్తున్నారు. యుద్ధంలో నిత్యం 60 నుంచి 100 మంది సైనికులను కో ల్పోతున్నామని, మరో 500 మంది దాకా క్షతగాత్రులవుతున్నారని చెప్పారు. డోన్బాస్ లో భాగమైన డోంటెస్క్, లుహాన్స్క్లో పరిస్థితి అత్యంత సక్లిష్టంగా ఉందని పేర్కొన్నారు. రష్యా అణు విన్యాసాలు అణ్వస్త్రాలను నిర్వహించే తమ సిబ్బంది తాజాగా విన్యాసాలు నిర్వహించినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ఉక్రెయిన్‌పై యు ద్ధం నేపథ్యంలో ఇవానోవోలో ఈ విన్యాసాలు జరిగాయని తెలిపింది. వ్యూహాత్మక క్షిపణి దళాలు సైతం ఇందులో పాల్గొన్నాయని పేర్కొంది. పూర్తి వివరాలను వెల్లడించలేదు. చదవండి: రష్యా ఆర్థికంపై దెబ్బేసే నిర్ణయం! ఏంటంటే.. -
ఉత్తర కొరియా అత్యాధునిక రాకెట్ పరీక్ష
పరీక్షకు హాజరైన దేశాధ్యక్షుడు కిమ్‌జోంగ్ ఉన్ టోక్యో: ఉత్తర కొరియా సోహేలో శనివారం అత్యాధునిక రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్షకు ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ అత్యాధునిక రాకెట్ పరీక్షతో దేశ అంతరిక్ష కార్యక్రమం విప్లవాత్మకమైన విజయాన్ని సొంతం చేసుకుందన్నారు. ఈ రోజు ఉత్తర కొరియా సాధించిన విజయాన్ని ప్రపంచమంతా చూసిందని..స్వదేశీ రాకెట్ పరిశ్రమలో మార్చి 18 ని విప్లవాత్మకమైన రోజుగా అభివర్ణించారు. ఈ క్షిపణి పరీక్ష విజయం పట్ల ఆ దేశ మీడియా స్వదేశీ రాకెట్ పరిశ్రమను ఆకాశానికెత్తేసింది. గత రాకెట్ ఇంజిన్ల కంటే కచ్చితమైన, సురక్షితమైన నియంత్రణ వ్యవస్థను కలిగి ఉండటం ఈ రాకెట్ ప్రత్యేకతలు. పంచవర్ష ప్రణాళికలో భాగంగా భవిష్యత్తులో మరిన్ని ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టేందుకు, వచ్చే పదేళ్లలో చంద్రుడి వద్దకు ఉపగ్రహాన్ని పంపించేందుకు ఇటువంటి అత్యాధు నిక రాకెట్లు అవసరమవుతాయని ఉత్తర కొరియా అధికారులు చెబుతున్నారు.