affiliated
-
బాబు పాలనపై జగన్ ఫైర్.. పార్టీ నేతలతో మీటింగ్ (ఫొటోలు)
-
వీకే నరేష్‌కి డాక్టరేట్ ప్రదానం
నటుడు వీకే నరేష్‌కి అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ‘ఐఎస్ సీఏహెచ్ఆర్’ నుంచి ఆయన ‘సార్’ అనే బిరుదుతోపాటు డాక్టరేట్‌ని అందుకున్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో తాజాగా జరిగిన 5వ ప్రపంచ కాంగ్రెస్ సమావేశాల్లో వీకే నరేష్‌కు ఈ అరుదైన గౌరవం దక్కింది. ఈ సమావేశాలను ‘నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్’ సంస్థతో పాటు ‘ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ హ్యూమన్ రైట్స్ (ఐఎస్ సీఏహెచ్ఆర్)’ కలిసి నిర్వహించాయి. ఐఎస్ సీఏహెచ్ఆర్ సంస్థ ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ. ఇది నాటో, యూరోపియన్ యూనియన్, అమెరికా వంటి దేశాల గుర్తింపు ఉన్న సంస్థ కూడా.. అక్కడ నరేష్‌కు మరో గౌరవం దక్కింది. మిలటరీ ఆర్ట్స్ గుడ్‌విల్ అంబాసిడర్‌తో పాటు లెఫ్టినెంట్ కల్నల్‌గా ఆయన్ను నియమించినట్లు సన్నిహితులు తెలిపారు. ఇకపై నరేష్ పేరు ముందు లెఫ్టినెంట్ కల్నల్, సార్... అనే హోదా చేరుతుంది. ఉగ్రవాదం, సామాజిక సమస్యలు వంటి అంశాలపై అనేక అంతర్జాతీయ వేదికలపై నరేష్ ప్రసంగించినందుకు గుర్తింపుగా ఈ గౌరవాలు దక్కాయి. -
పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ కీలక నిర్ణయం.. అనుబంధ సంఘాలపై ‘దృష్టి’
సాక్షి, హైదరాబాద్: పార్టీ అనుబంధ సంఘాల బలోపేతంపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే ప్రత్యేక దృష్టి సారించారు. పార్టీ ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పటికే పలుమార్లు అనుబంధ సంఘాల రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు హాజరైన ఆయన వచ్చే పర్యటనలో కూడా అనుబంధ సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేశారు. పార్టీకి అనుబంధంగా పనిచేసే యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సెల్లతో పాటు మహిళా కాంగ్రెస్ నేతలతో ఇప్పటికే సమావేశమై వారికి దిశానిర్దేశం చేసిన ఆయన ఈసారి పర్యటనలో యూత్ కాంగ్రెస్, టీపీసీసీ ఫిషర్మెన్ కమిటీలతో సమావేశం కానున్నారు. అనుబంధ సంఘాలే పార్టీకి బలమని తన తొలి పర్యటన నుంచి చెపుతున్న ఆయన తెలంగాణకు వచ్చిన ప్రతిసారీ ఆయా సంఘాల నేతలతో భేటీ అవుతున్నారు. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల ఏర్పాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చేయాల్సిన పోరాటాలపై యూత్‌కాంగ్రెస్, ఫిషర్మెన్ కాంగ్రెస్ నేతలకు భేటీల్లో ఠాక్రే దిశానిర్దేశం చేస్తారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఈసారి నాలుగు రోజుల టూర్ మాణిక్‌రావ్ ఠాక్రే మరోమారు నాలుగు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈనెల 23న హైదరాబాద్ రానున్న ఆయన 26వరకు ఇక్కడే ఉండనున్నారు. ఈనెల 23న పీసీసీ అధ్యక్షుడు రేవంత్, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, హాథ్‌సే హాథ్‌జోడో ఇంచార్జులతో ఆయన భేటీ కానున్నారు. ఫిబ్రవరి ఆరోతేదీ నుంచి ప్రారంభమైన యాత్రలు సాగుతున్న తీరు, నాయకుల సహకారం, ప్రజల నుంచి వస్తున్న స్పందన లాంటి అంశాలపై చర్చించనున్నారు. ఇక, 24వ తేదీన యూత్‌కాంగ్రెస్, ఫిషర్మెన్ కమిటీలతో సమావేశం కానున్న ఠాక్రే ఈనెల 25న కీలక సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందన్న అంచనాల నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన పార్టీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పలు కార్పొరేషన్ల మాజీ చైర్మన్లతో సమావేశం కానున్నారు. నగరంలో పార్టీ బలోపేతం తీసుకోవాల్సిన చర్యలు, గ్రేటర్ కాంగ్రెస్ కమిటీ పునరి్నయామకం తదితర అంశాలపై ఆయన చర్చించనున్నారు. ఆ తర్వాత 26న ఖమ్మంలో రేణుకాచౌదరి ఆధ్వర్యంలో హాథ్‌సే హాథ్‌జోడో యాత్రకు కూడా హాజరుకానున్నారు. 26 నుంచి మళ్లీ హాథ్‌సే హాథ్‌జోడో రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్కలు చేపట్టిన హాథ్‌సే హాథ్‌జోడో యాత్రలకు సోమవారం నాటి నుంచి విరామం ఇవ్వనున్నారు. యాత్రల్లో భాగంగా రేవంత్‌రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో, భట్టి ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఉన్నారు. సోమవారం యాత్ర ముగిసిన తర్వాత ఇరువురు నేతలూ హైదరాబాద్ వస్తారని, ఉగాది విరామం తర్వాత ఈనెల 26 నుంచి మళ్లీ యాత్ర ప్రారంభిస్తారని గాం«దీభవన్ వర్గాలు తెలిపాయి. వచ్చే నెల హైదరాబాద్‌కు ప్రియాంకాగాంధీ హాథ్‌సే హాథ్‌జోడో యాత్రల్లో భాగంగా మహిళలతో కలిసి యాత్రలో పాల్గొనేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ తెలంగాణకు వస్తారని, ఏప్రిల్ మొదటి వారంలో ఆమె హైదరాబాద్‌కు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. చదవండి: బీఆర్ఎస్కు కార్యకర్తలే బలం.. బలగం -
‘అధ్యక్ష’ నియామకాలపై టీడీపీలో అసంతృప్తి
సాక్షి, అమరావతి : పార్టీ అనుబంధ శాఖలకు కొత్తగా నియమించిన అధ్యక్షులపై టీడీపీలో అసంతృప్తి రగులుతోంది. కీలకమైన తెలుగు యువత, తెలుగు మహిళ అధ్యక్షులుగా నియమితులైన వారిపై పార్టీలోని ఇతర నేతల్లో ఆగ్రహం కనిపిస్తోంది. త్వరలో ఎన్నికలకు వెళ్లనున్న తరుణంలో పది అనుబంధ సంఘాలకు పార్టీ అధినేత చంద్రబాబు ఇటీవల అధ్యక్షులను నియమించారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షునిగా విజయవాడకు చెందిన దేవినేని అవినాష్ నియామకంపై పార్టీ సీనియర్లు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో పార్టీలో పనిచేస్తున్న వారిని విస్మరించి వేరే పార్టీ నుంచి కొంతకాలం క్రితం వచ్చిన అవినాష్‌కు పదవి ఇవ్వడం సరికాదంటున్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన అవినాష్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా నిర్వహించారు. ఆ పదవిలో ఉండగానే కొద్ది కాలం క్రితం టీడీపీలో చేరారు. వాస్తవానికి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీ వర్గానికి దక్కుతుందని పార్టీ నేతలు భావించారు. గతంలో నెల్లూరుకు చెందిన బీద రవిచంద్ర యాదవ్ ఈ పదవి నిర్వహించారు. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ పదవి చేపట్టారు. కానీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఈ పదవిలో ఎవరినీ నియమించలేదు. పలువురు నుంచి అభ్యర్థనలు వచ్చినా ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు దేవినేని అవినాష్‌కు ఆ పదవి ఇవ్వడంతో టీడీపీ బీసీ నేతలు కంగుతిన్నారు. ఇప్పటికే అవినాష్ సమీప బంధువు దేవినేని ఉమామహేశ్వరరావు మంత్రిగా ఉన్నారు. అవినాష్ సోదరుడు చంద్రశేఖర్ కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షునిగా ఉన్నారు. ఇలా పార్టీలోని ముఖ్య పదవులన్నీ ఒకే వర్గానికి ఇవ్వడం ఏమిటని బీసీ నేతలు మండిపడుతున్నారు. మహిళ అధ్యక్షురాలినియామకంపైనా అసంతృప్తి తెలుగు మహిళ అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ పోతుల సునీత నియామకంపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకూ ఆ పదవిని ఉత్తరాంధ్రకు చెందిన శోభా హైమావతి నిర్వహించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పదవిలో ఉన్నా ఆమెకు పెద్ద ప్రాధాన్యం ఇవ్వలేదు. కొద్దిరోజుల క్రితం ఆమెకు నామినేటెడ్ పదవి ఇచ్చారు. ఇప్పుడు హైమావతి స్థానంలో సునీతను నియమించడంపై కూడా కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ అయిన సునీత పార్టీలో కీలక నేత కాదని, ఆమె మహిళ అధ్యక్షురాలిగా రాణించలేరని చెబుతున్నారు. బీసీ సెల్ అధ్యక్షునిగా గుంటూరుకు చెందిన బోనబోయిన శ్రీనివాసరావును నియమించడంతో ఆ పదవిని ఆశించిన మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
అనుబంధ కళాశాలల సమావేశం వాయిదా
ఏయూక్యాంపస్:ఆంధ్రవిశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల యాజమాన్యాలతో ఏయూ కళాశాలల అభివృద్ధి సమాఖ్య(సిడిసి) ఈ నెల 10వ తేదీన నిర్వహించ తలపెట్టిన సమావేశం వాయిదా వేసినట్లు డీన్ టి.కోటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. వర్సిటీ ఉపకులపతి ఆచార్య నాగేశ్వరరావు ముఖ్యమంత్రి నేతత్వంలో జరిగే ఉపకులపతుల సమావేశంలో పాల్గొనవలసి ఉండటంతో సిడిసి సమావేశం వాయిదా వేస్తున్నామన్నారు. మరల ఎప్పుడు నిర్వహించేది వ్యక్తిగతంగా తెలియజేస్తామన్నారు. ఈ మార్పును గమనించి తదుపరి సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.