ఆఫ్ఘాన్‌లో భారతీయ మహిళ కిడ్నాప్
కాబూల్ : ఆఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌లో తైమని ప్రాంతంలో భారతీయ మహిళను గురువారం రాత్రి ఆగంతకులు కిడ్నాప్ చేశారు. దీనిపై సమాచారం అందుకున్న ఆఫ్ఘాన్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ఆమెను విడిపించేందుకు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కిడ్నాప్‌ను గురైన సదరు మహిళ ఆగాఖాన్ ఫౌండేషన్‌లో విధులు నిర్వహిస్తున్నట్లు ఆఫ్ఘాన్ ఉన్నతాధికారులు వెల్లడించారు.
కిడ్నాప్ అయిన మహిళను క్షేమంగా విడిపించేందుకు ఆఫ్ఘాన్లోని భారతీయ రాయబార కార్యాలయం ఎప్పటికప్పుడు ఆ దేశ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. కిడ్నాప్‌నకు గురైన సదరు మహిళ భారత్‌లోకి కొల్‌కతాకు చెందిన వారని ఉన్నతాధికారులు చెప్పారు.