Aganvadi workers
-
పనుల్లేక అల్లాడిపోతున్నాం నాయనా..
కదిరి: ‘నాయనా.. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వానలు లేవు. తాగడానికి నీళ్లు లేక అల్లాడిపోతున్నాం.. అందరం కూలి పని చేసుకునేటోళ్లం.. ఉపాధి పనులు చేసుకోమ్మని చెబితే వచ్చాం. అక్కడేమో అధికారులు (ఫారెస్టోళ్లు రిజర్వ్ ఫారెస్ట్‌లో) పనులు చేయడానికి వీళ్లేదని చెబుతున్నారు. మీరు ఈ దావన వస్తున్నారంటే.. మా బాధలు మీకన్నా జెప్పుకుందామని ఉన్నాం’ అని కదిరి రూరల్ పరిధిలోని కే కుంట్లపల్లికి చెందిన ఉపాధి కూలీలు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి తమ బాధలు తెలిపారు. వైఎస్.జగన్మోహన్రెడ్డి గురువారం బెంగళూరు నుంచి కదిరి మీదుగా పులివెందుల వెళ్లారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలు సోమేష్నగర్ వద్ద ఆయనను కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలని మొర పెట్టుకున్నారు. ఇందుకు ఆయన తన పక్కనే ఉన్న కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషాతో మాట్లాడుతూ వెంటనే వారి సమస్య పరిష్కారమయ్యేలా అధికారులతో మాట్లాడాలని సూచించారు. మన ప్రభుత్వమొస్తే మంచి రోజులొస్తాయి.. కదిరి పట్టణంలోని డిగ్రీ కళాశాల వద్ద అంగన్వాడీ కార్యకర్తలు జగన్మోహన్రెడ్డిని కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. తమ చేత గొడ్డుచాకిరీ చేయిస్తూ తక్కువ వేతనం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ అసెంబ్లీ సమావేశాల్లో మీ సమస్యలపై చంద్రబాబు సర్కారును నిలదీస్తామన్నారు. మన ప్రభుత్వం అధికారం లోకి రాగానే మీకు మంచి రోజులు వస్తాయని అని భరోసా ఇచ్చారు. అంగన్వాడీ కార్యకర్తలు మాబున్నీసా, సాయిలక్ష్మి, సుజాత, ఉష, సంధ్య, మాధవి, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి నరసింహులు, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు, ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు. వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం హిందూపురం(చిలమత్తూరు) : వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డికి గురువారం చిలమత్తూరు మండల సరిహద్దులోని టోల్గేట్ వద్ద ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన బెంగళూరు నుంచి పులివెందులకు వెళ్తుండగా మార్గమధ్యలో పార్టీ శ్రేణులు ఆయనను కలిసి సమస్యలపై వినుతులను అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ శంకర్‌నారాయణ, కదిరి ఎమ్మెల్యే చాంద్‌భాషా, హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త నవీన్ నిశ్చల్, చిలమత్తూరు మండల పార్టీ కన్వీనర్ సదాశివారెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు జగన్మోహన్రెడ్డి, రామచంద్రప్ప, కోడూరు సింగిల్ విండో అధ్యక్షులు నరసింహారెడ్డి, ఎంపీటీసీలు చెన్నక్రిష్ణ, లక్ష్మీరెడ్డి, నాగభూషణాచారి, సూర్యనారాయణ, సర్పంచ్ శ్రీకళ, విద్యార్థి సంఘం నాయకులు రామక్రిష్ణారెడ్డి, రైతు సంఘం నాయకులు రంగారెడ్డి, ప్రచార కార్యదర్శి భోగిరెడ్డి, శివశంకర్‌రెడ్డి, మైనార్టీ సెల్ నాయకులు ఫరూక్, కొడికొండ రామచంద్రారెడ్డి, గోవిందరెడ్డి, అంజినరెడ్డి,గోరంట్ల సింగిల్ విండో అధ్యక్షులు వెంకట రమణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ వెంకటరెడ్డి, తదితరులు వున్నారు. -
కదంతొక్కిన అంగన్వాడీలు
మంకమ్మతోట, న్యూస్‌లైన్: అంగన్వాడీ వ్యవస్థను ప్రైవేటీకరించవద్దని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు గురువారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కరీంనగర్ తెలంగాణ చౌక్ నుంచి బస్టాండ్ చౌరస్తా వరకు ప్రభుత్వ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి, దహనం చేశారు. కనీస వేతనం రూ.10వేలు చెల్లించాలని, పింఛన్, రిటైర్మెంట్ బెన్ఫిట్స్ ఇవ్వాలని బీఎల్ఓలు ర ద్దు చేయాలని, ఐకెపీ, సీడీఆర్ సంస్థ జోక్యాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. నెలరోజులుగా వివిధ రూపాల్లో నిరసనలు చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తమ డిమాండ్ల పరిష్కారానికి చొరవచూపాలని, లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షురాలు జె.శైలజ, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి ఈ.రమేష్, వనజ, కె.హేమలత, శిరీష, సువర్ణ, రజిత, భాగ్యలక్ష్మి, పుష్ప, విమల, రమతోపాటు వందలాది మంది అంగన్వాడీలు పాల్గొన్నారు. -
వికటించిన ‘ఐరన్ ఫోలిక్’
- 8 మంది చిన్నారులకు అస్వస్థత - ఆస్పత్రికి తరలింపు జంగంరెడ్డిపల్లి (అమ్రాబాద్), న్యూస్‌లైన్: ఓ అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చిన ఐరన్‌ఫోలిక్ ద్రావణం వికటించి ఎనిమిది మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వివరాలిలా ఉన్నాయి. ఇమ్యునైజేషన్‌లో భాగంగా బుధవారం ఉదయం అమ్రాబాద్ మండలం జంగంరెడ్డిపల్లి అంగన్వాడీ కేంద్రంలోని 30 మంది చిన్నారులకు ఏఎన్ఎంలు ఐరన్ ఫోలిక్ ద్రావణమిచ్చారు. వీరిలో సాయంత్రం అంజలి, జానకి, పండు, కృష్ణవంశీ, రంజిత్, జశ్వం త్తో పాటు మరో ఇద్దరు చిన్నారులు వాంతులు చేసుకున్నారు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెంటనే అంగన్వాడీ కార్యకర్త పద్మారాణితో కలిసి వాహనంలో బాధితులను అమ్రాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చా రు. అనంతరం అక్కడి వైద్యుల సూచన మేరకు అచ్చంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై ఏఎన్ఎం భాగ్యమ్మను వివరణ కోరగా వారికి పడకపోవడం వల్లే వాంతులు చేసుకున్నారని, ఎలాంటి అపాయం లేదన్నారు. -
అమృత హస్తవ్యస్తం
నెల్లూరు(పొగతోట), న్యూస్‌లైన్: ప్రజలను మభ్యపెట్టే ఉద్దేశంతో వివిధ పేర్లతో పథకాలను ఆర్భాటంగా ప్రకటిస్తున్న పాలకులు వాటి అమలు విషయాన్ని గాలికొదిలేస్తున్నారు. ఇదే అదునుగా వచ్చే అరకొర నిధులను క్షేత్రస్థాయిలో కొందరు స్వాహా చేస్తున్నారు. లబ్ధిదారుల జాబితాలో బినామీ పేర్లను నమోదుచేసి అందినకాడికి దోచుకుంటున్నారు. ఇందిరమ్మ అమృతహస్తం పథకం అమలు అస్తవ్యస్తంగా మారడమే ఇందుకు నిదర్శనం. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలులోకి తెచ్చింది. వారికి అమృతం లాంటి ఆహారం అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. అయితే క్షేత్రస్థాయిలో గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందడం రికార్డులకే పరిమితమవుతుండటంతో పథకం అమలు పక్కదారి పడుతోంది. సరుకుల సరఫరా కూడా అంతంత మాత్రంగానే ఉంది. పౌష్టికాహారం అందించే అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి రెండు నెలలుగా వేతనాలు పంపిణీ కూడా నిలిచిపోయింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇందిరమ్మ అమృతహస్తం పథకం అమలులోకి వచ్చింది. మాతాశిశు మరణాలను తగ్గించేందుకు వారి ఆరోగ్యం, పోషణ పద్ధతులను పోషకాహారంతో మెరుగు పరచడం ఈ పథకం లక్ష్యం. ఉదయగిరి, సీతారామపురం, వరికుంటపాడు, మర్రిపాడు, ఆత్మకూరు, ఏఎస్‌పేట, అనంతసాగరం, వెంకటాచలం, ముత్తుకూరు, మనుబోలు, రాపూరు, సైదాపురం, గూడూరు రూరల్, చిల్లకూరు మండలాల్లోని 1002 అంగన్వాడీ కేంద్రాల్లో అమృత హస్తం పథకం అమలవుతుంది. వీటిలో 957 కేంద్రాలు ఐసీడీఎస్, 45 ఐకేపీ పర్యవేక్షణలో నడుస్తున్నాయి. సుమారు 14 వేల మంది గర్భిణులు, బాలింతలు లబ్ధిదారులు పథకంలో లబ్ధిదారులుగా నమోదయ్యారు. వీరికి నిత్యం 125 గ్రాముల బియ్యం, 30 గ్రాముల కందిపప్పు, 16 గ్రాముల నూనె, 50 గ్రాముల కూరగాయలు, 200 మిల్లీలీటర్ల పాలుతో పాటు ఓ కోడిగుడ్డు పంపిణీ చేయాలి. ఈ క్రమంలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పౌష్టికాహార సామగ్రి పొందుతున్న వారి పేర్లు రోజూ రికార్డుల్లో నమోదం చేయడం లేదు. వారు పూర్తి స్థాయిలో హాజరైనట్లు కేంద్రాల నిర్వాహకులు రికార్డుల్లో పేర్కొంటున్నట్లు తెలిసింది. ఐకేపీ ఆధ్వర్యంలో నడిచే చిల్లకూరు మండలంలోని ఏరూరు, మోమిడి, వరగలి, తమ్మినపట్నం, లింగవరం తదితర ప్రాంతాల్లోని ఫీడింగ్ సెంటర్లలో ఆహార సరుకుల పంపిణీ నిలిచిపోయింది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో అనారోగ్యానికి గురవుతున్న గర్భిణులు, బాలింతల సంఖ్య ఎక్కువవుతోంది. ఉదయగిరి, మర్రిపాడు, వరికుంటపాడు, సీతారామపురం, ఆత్మకూరు, అనంతసాగరం, ఏఎస్‌పేట మండలాల్లోని పలు కేంద్రాల్లో కందిపప్పు, నూనె పంపిణీ సక్రమంగా లేదు. కోడిగుడ్డు పంపిణీ రికార్డులకే పరిమితమవుతోంది. ఈ గుడ్ల పంపిణీని పర్యవేక్షిస్తున్న ఐసీడీఎస్ సీడీపీఓల్లో కొందరు వాటిని సరఫరా చేయకుండానే చేసినట్లు కేంద్రాల నిర్వాహకుల నుంచి సంతకాలు సేకరిస్తున్నారని తెలిసింది. ఈ విధంగా స్వాహా చేసిన నగదును కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు వాటాలు పంచుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోషకాహార పంపిణీ కేంద్రాల నిర్వాహకులకు రెండు నెలలుగా జీతాలు పంపిణీ కావడం లేదు. జిల్లా అధికారులు స్పందించి అమృతం హస్తం పథకాన్ని సక్రమంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. -
గర్జించిన మహిళాలోకం
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: జై సమైక్యాంధ్ర నినాదాలతో కర్నూలు నగరం మారుమ్రోగింది. శనివారం మహిళా ఉద్యోగులు, ఉపాధ్యాయ, కార్మికులు, న్యాయవాదులు సమైక్య శంఖారావాన్ని పూరించారు. మహిళా ఉద్యోగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో డీఆర్డీఏ-ఐకేపీ, మహిళా ఉద్యోగులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు, ఆయాలు, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖ, వ్యవసాయ తదితర అన్ని శాఖలకు చెందిన మహిళా ఉద్యోగులు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. కలెక్టరేట్ వద్ద ర్యాలీని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్ వి.సి.హెచ్.వెంగల్రెడ్డి, కోశాధికారి శ్రీరాములు తదితరులు ప్రారంభించారు. రాజ్‌విహార్ వరకు చేపట్టిన ర్యాలీలో వేలాది మంది మహిళలు ఉద్యమ గళం వినిపించారు. సోనియా, దిగ్విజయ్‌సింగ్, కేసీఆర్, సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులకు వ్యతిరేకంగా నినదించారు. అనంతరం మండుటెండలోనే మానవహారం నిర్మించి రాకపోకలను స్తంభింపజేశారు. ర్యాలీ సందర్భంగా ప్రసంగాలు లేకుండా నినాదాలతోనే హోరెత్తించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ ముత్యాలమ్మ, సీడీపీఓలు, సూపర్వైజర్లు, మహిళా ఉద్యోగుల సంఘం నేతలు విజయకుమారి, సరస్వతి, జ్ఞానేశ్వరమ్మ, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘం నేతలు అరుణకుమారి, రాణి, మాధవీశ్యామల, విజయశంకర్, రెవెన్యూ శాఖకు చెందిన నాగమణి, మధుమతి, రామలక్ష్మి, వివిధ ఉద్యోగ సంఘాల నేతలు సింధుభైరవి, భాగ్యరేఖ, కళ్యాణి, విజయకుమారి, ఏపీజీఎల్ఐ ఉద్యోగులు ఇందిరాదేవి, పద్మావతి, మాధవీ కళ్యాణి, సౌజన్య, జానకి, నాగమణి బాయి తదితరులు పాల్గొన్నారు.