‘గజ’నిమ్మకాయ
తిక్క లెక్క
తేలికగా గుప్పిట్లో ఇమిడిపోయేలా ఉండదూ! ఈ ఫొటోలో కనిపిస్తున్న నిమ్మకాయను చూస్తే నోరెళ్లబెట్టక మానరు. ప్రపంచంలోనే అతి భారీ నిమ్మకాయ ఇది. ఇజ్రాయెల్లో ఆహ్రామ్ శామ్యూల్ అనే ఆసామీ తోటలో 2003లో పండింది ఇది.
మామూలు నిమ్మకాయల బరువు వంద గ్రాములకు ఇటూ అటుగా ఉంటే, ఈ నిమ్మకాయ మాత్రం ఏకంగా 5.265 కిలోల బరువు తూగి గిన్నెస్బుక్లోకి ఎక్కింది. ఇప్పటి వరకు ఈ రికార్డు చెక్కుచెదరకపోవడం విశేషం.