Ahuthi prasad
-
నటుడి కుమారుడిపై బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్ : నటుడు ఆహుతి ప్రసాద్ కుమారుడు కార్తీక్ ప్రసాద్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. ఆర్కే సినీప్లెక్స్‌లో చిత్ర ప్రారంభానికి ముందు జాతీయ గీతం వస్తుండగా కార్తీక్ ప్రసాద్ లేచి నిలబడలేదు. అక్కడున్న వారు జాతీయ గీతానికి గౌరవం ఇవ్వవా అని అడగడంతో కోపోద్రిక్తుడైన కార్తీక్ బూతులతో వారిపై మండిపడ్డాడు. దీంతో కార్తీక్ ప్రసాద్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, క్యాన్సర్‌తో ఆహుతి ప్రసాద్ నాలుగేళ్ల కిందటే మరణించిన విషయం తెలిసిందే. -
‘ఆహుతి’ ప్రసాద్
ఇన్ బాక్స్ ప్రముఖ సినీ నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్టు ఆహుతి ప్రసాద్ కేన్సర్ వ్యాధితో కన్నుమూయడం తెలు గు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. సహజ నటనతో డైలాగులతో అల రించిన ప్రసాద్ తొలిదశలో ఆహు తి సినిమాతో, మలిదశలో చంద మామ చిత్రంతో విశేష గుర్తింపు ను పొందారు. చందమామలో గోదావరి యాసతో ఆయన పలి కిన సంభాషణలు ఎన్నటికీ మర పురావు. సినిమాకే అంకితమై చివ రివరకు నటననే వృత్తిగా చేసు కున్న వారిలో ఆహుతి ప్రసాద్ ఉచ్ఛ స్థాయిలో, దెబ్బతిన్నప్పుడు కూడా వ్యక్తిత్వాన్ని చంపుకోకుం డా మెలిగారు. వయసు మీరకుం డానే వెళ్లిపోయిన ఆహుతి ప్రసాద్ కు నివాళి. కామిడి సతీష్ రెడ్డి, పరకాల -
రేపు ఆహుతి ప్రసాద్ అంత్యక్రియలు
-
రేపు ఆహుతి ప్రసాద్ అంత్యక్రియలు
హైదరాబాద్: ప్రముఖ నటుడు ఆహుతి ప్రసాద్ అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఎర్రగడ్డ శ్మశాన వాటికలో చేస్తారు. కేన్సర్‌తో ఆదివారం మధ్యాహ్నం కిమ్స్ ఆస్పత్రిలో మరణించిన ఆహుతి ప్రసాద్ భౌతికకాయాన్ని కాసేపట్లో ఫిలింనగర్‌లోని ఆయన నివాసానికి తరలిస్తారు. రేపు ఉదయం అభిమానుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్లో ఉంచుతారు. అనంతరం ఆయనకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. -
'రుద్రమదేవి' చిత్రంలో ఆహుతి ప్రసాద్
హైదరాబాద్: కేన్సర్‌తో మృతిచెందిన ప్రముఖ నటుడు ఆహుతి ప్రసాద్ నటించిన సినిమాలు కొన్ని విడుదల కావాల్సివుంది. గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నిర్మిస్తున్న రుద్రమదేవి సినిమాలో ఆయన నటించారు. ఆహుతి ప్రసాద్ నటించిన మరో రెండు సినిమాలు కూడా విడుదల కావాల్సివుంది. ఆహుతి ప్రసాద్ మొత్తం 122 చిత్రాల్లో నటించారు. హిందీ చిత్రం సూర్యవంశంతో పాటు రెండు తమిళ చిత్రాల్లో ఆయన నటించారు. -
నటుడు ఆహుతి ప్రసాద్ కన్నుమూత!
-
నటుడు ఆహుతి ప్రసాద్ కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ నటుడు ఆహుతి ప్రసాద్ కన్నుమూశారు. కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన కిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మరణించారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆహుతి ప్రసాద్ స్వస్థలం కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం కోడూరు. ఆయన అసలు పేరు అడుసుమిల్లి జనార్దన్ వర ప్రసాద్. ఈ ప్రశ్నకు బదులేది అనే సినిమా ద్వారా ఆయన వెండితెరకు పరిచయమయ్యారు. ఆహుతి చిత్రంతో మంచి పేరు రావడంతో ఆయన పేరు ఆహుతి ప్రసాద్‌గా స్థిరపడింది. ఆయన 122 సినిమాల్లో నటించారు. గులాబీ, నిన్నే పెళ్లాడుతా, చందమామ, జయం మనదేరా తదితర చిత్రాలు ఆయనకు మంచి పేరు తీసుకువచ్చాయి. విలన్, క్యారక్టర్ ఆర్టిస్ట్, హస్య నటుడిగా ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశారు. 2002, 2007 సంవత్సరాల్లో ఆయన నంది అవార్డు అందుకున్నారు. మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.