AIDS Control Society
-
టీఎస్ఏసీఎస్లో ఉద్యోగాలు.. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ(టీఎస్ఏసీఎస్).. జిల్లాల్లోని కేంద్రాల్లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 40 ► పోస్టుల వివరాలు: మెడికల్ ఆఫీసర్–04, కౌన్సిలర్–01, ఫార్మసిస్ట్–01, స్టాఫ్ నర్సు–26, కేర్ కోఆర్డినేటర్–01, న్యూట్రిషనిస్ట్–01, రీసెర్చ్ ఫెలో(క్లినికల్)/సీనియర్ మెడికల్ ఆఫీసర్–01, రీసెర్చ్ ఫెలో(నాన్–క్లినికల్)–01, హెచ్ఐవీ రీసెర్చ్ ఫెలో(క్లినికల్)/సీనియర్ మెడికల్ ఆఫీసర్–01, హెచ్ఐవీ రీసెర్చ్ ఫెలో(నాన్–క్లినికల్)–01, ఏఎన్ఎం–01, డేటా మేనేజర్–01. ► అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్, బీఎస్సీ(నర్సింగ్), జీఎన్ఎం, ఎంబీబీఎస్, గ్రాడ్యుయేషన్, పీఎల్హెచ్ఐవీ మాస్టర్స్ డిగ్రీ, ఎండీ ఉత్తీర్ణులవ్వాలి. ► వేతనం: పోస్టును అనుసరించి నెలకు రూ.9000 నుంచి రూ.60,000 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా కేంద్రాల్లోని మెడికల్ సూపరింటెండెంట్/డైరెక్టర్ కార్యాలయాల్లోని దరఖాస్తులను అందజేయాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 30.08.2021 ► వెబ్సైట్: https://tsacs.telangana.gov.in -
ఎయిడ్స్‌కు 4,250 మంది బలి
సాక్షి, హైదరాబాద్: ఎయిడ్స్‌కు తెలంగాణలో అనేకమంది బలవుతున్నారు. దేశవ్యాప్తంగా ఎయిడ్స్ మరణాల్లో మన రాష్ట్రం ఏకంగా నాలుగో స్థానంలో ఉందని ఇటీవల కేంద్రం వెల్లడించింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ లెక్కల ప్రకారం 2018–19లో దేశవ్యాప్తంగా 51,911 మంది చనిపోగా, 2019–20 ఆర్థిక ఏడాదిలో డిసెంబర్ నాటికి 43,019 మంది మరణించినట్లు కేంద్రం తెలిపింది. జాతీయస్థాయిలో మరణాల సంఖ్య తగ్గగా, తెలంగాణలో మాత్రం ఆ సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2018– 19 ఆర్థిక ఏడాదిలో 2,925 మంది తెలంగాణలో ఎయిడ్స్ కారణంగా చనిపోగా, 2019–20 ఆర్థిక ఏడాదిలో గత డిసెంబర్ నాటికే 4,278 మంది చనిపోయినట్లు ఆ నివేదిక వెల్లడించింది. అంటే గత సంవత్సరం కంటే ఈ ఆర్థిక సంవత్సరం 9 నెలల కాలంలోనే ఇంతమంది చనిపోవడం గమనార్హం. మరణాల్లో పెరుగుదల 32%అధికంగా ఉంది. దేశంలో ఎయిడ్స్ కారణంగా మరణించిన వారిలో దాదాపు పదో వంతు ఉండటం గమనార్హం. ఇక 7,778 మరణాలతో మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంది. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం ప్రకారం గతేడాది డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 17.77 లక్షల మంది హెచ్ఐవీతో బాధపడుతున్నారని కేంద్రం తెలిపింది. అందులో తెలంగాణలో 83,861 మంది రోగులున్నారు. సెక్స్ వర్కర్లలో అధికం.. సెక్స్ వర్కర్లలో లైంగిక సంక్రమణ వ్యాధులు 25% ఎక్కువగా ఉన్నాయని తేలింది. తర్వాత వలస కార్మికులు 17%, లింగమార్పిడి 15%, మిశ్రమ సమూహాలు 12%, మిగిలిన ఇతరుల్లో లైంగిక సంక్రమణ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని తేలింది. 25 శాతం మంది మాత్రమే కండోమ్ వాడుతున్నారని ఓ అంచనా . ఎయిడ్స్ సోకినట్లు తెలియగానే కొన్నాళ్లపాటు మందులు వాడుతున్నారని, తర్వాత మధ్యలో నిలిపేయడం వల్ల మరణాలు అధికంగా సంభవిస్తున్నాయని డాక్టర్ కమల్‌నాథ్ తెలిపారు. -
మృత్యు ఘోష!
సాక్షి, అమరావతి: హెచ్ఐవీ బాధితుల మృతుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. గడిచిన మూడేళ్లలో మన రాష్ట్రంలో 37,199 మంది మృతి చెందారు. అంటే సగటున రోజుకు 34 మంది మృత్యువాత పడ్డారు. ఈ పరిస్థితి మరే రాష్ట్రంలో లేదు. ఇదేదో సర్వే చేసి ఇచ్చిన నివేదిక కూడా కాదు. లోక్‌సభలో ఓ సభ్యుడి ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానమిది. గత ఐదేళ్లలో ఏపీశాక్స్ (ఏపీ ఎయిడ్స్ నియంత్రణ మండలి) జబ్బు నియంత్రణకు, బాధితులకు మెరుగైన వైద్యం అందించడంలో ప్రణాళికా బద్ధంగా వ్యవహరించలేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో ఏపీశాక్స్ నిర్వహణ దారుణంగా ఉంది. దీని పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి లేకపోవడం, మందుల సరఫరా సరిగా లేకపోవడం తదితర కారణాల వల్ల మన రాష్ట్రంలో ఎక్కువ మంది బాధితులు మృతి చెందుతున్నారు. కౌన్సెలింగ్, స్క్రీనింగ్, టెస్టింగ్ పద్ధతులు పూర్తిగా గాలికొదిలేశారు. కొన్నిసార్లు ఏఆర్టీ (యాంటీ రిట్రో వైరల్) సెంటర్లలో బాధితులకు మందులు ఇవ్వడానికి కూడా అందుబాటులో లేని దారుణ పరిస్థితి ఉంటోందని బాధితులు వాపోతున్నారు. నియంత్రణలో దక్షిణాదిలో కేరళ భేష్ దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ రాష్ట్రం ఎయిడ్స్ నియంత్రణలో అద్భుతంగా పనిచేస్తున్నట్టు తేలింది. హెచ్ఐవీ వ్యాధిపై అద్భుతంగా అవగాహన కల్పించడం, బాధితులకు మెరుగైన వైద్యమందించడంలో సఫలీకృతమయ్యారు. అందుకే కేరళలో తక్కువ మృతులు చోటు చేసుకున్నాయి. మన రాష్ట్రంలో ప్రస్తుతం 5 లక్షల మంది పైనే హెచ్ఐవీ బాధితులున్నట్టు అంచనా. అయితే రికార్డుల్లో 3.50 లక్షల మందే ఉన్నారు. వీరిలో ఏఆర్టీ సెంటర్లలో కేవలం 1.70 లక్షల మంది మాత్రమే మందులు తీసుకుంటున్నారు. చాలా మంది తమపై వివక్ష చూపుతున్నారన్న కారణంగా మందులకు రాలేకపోతున్నారు. ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలికి ఉద్యోగులే బలం. ఈ శాఖలో 1200 మందిపైనే పనిచేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పథకం అమలు వీరే చూస్తారు. అయితే గడిచిన ఐదేళ్లలో తమను ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని, 15 ఏళ్లుగా పనిచేస్తున్నా కనీసం కాంట్రాక్టు ఉద్యోగులుగా కూడా పరిగణించడం లేదని వాపోతున్నారు. ఇలా ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉండటం పథకం అమలుపై ప్రభావం పడుతున్నట్లు ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. -
ఎందుకీ వివక్ష..!
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ(ఏపీఎస్ఏసీఎస్)లో పనిచేస్తున్న ఉద్యోగులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. అత్యంత అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్న ఈ విభాగంలో సిబ్బంది సంక్షేమాన్ని సర్కారు పట్టించుకోవడం లేదు. మూడేళ్లుగా ఇంక్రిమెంట్లు సైతం మంజూరు చేయడం లేదని, సిబ్బంది జీతభత్యాల్లో సైతం తీవ్ర వ్యత్యాసాలు ఉన్నాయని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని ఆ విభాగం ఉద్యోగులు నిరసన బాట పట్టారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో 15 ఐసీటీసీ కేంద్రాలు, 3 పీపీటీసీ కేంద్రాలు, ఒక ఏఆర్టీ సెంటర్ ఉన్నాయి. వివిధ కేటగిరీల్లో 56 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు, ఐదుగురు స్టాఫ్ నర్సులు, ఒక ఫార్మాసిస్ట్, 25 మంది కౌన్సిలర్లు, 18 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, ఇద్దరు డేటా మేనేజర్లు, ఒక కోర్ కో ఆర్డినేటర్ ఉన్నారు. సంక్షేమానికి దూరంగా.. సొసైటీలో పనిచేస్తున్న ఉద్యోగులంతా కాంట్రాక్టు పద్ధతిలో విధుల్లో చేరిన వారే. ప్రభుత్వం 2002లో వీరిని నియమించింది. ఇక్కడి ఉద్యోగులకు ఇతర వైద్య శాఖ సిబ్బంది మాదిరిగా ఈపీఎఫ్, హెచ్ఆర్ఏ, ఈఎస్ఐ, ఆరోగ్య కార్డులు వంటి సౌకర్యాలే వర్తింపజేయడం లేదు. ఈ విభాగంలో పనిచేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 14 మంది మృతి చెందినా ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు. ఇక్కడి ఉద్యోగులు ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా రోగాలబారిన పడే ప్రమాదం ఉంది. జీతంలోనూ వ్యత్యాసాలే,.. వైద్య ఆరోగ్య శాఖలో ఒకే రకమైన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులందరికీ ఒకే రకమైన జీతాలు ఉండాలి. అయితే ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో పనిచేస్తున్న వారికి ఇతర విభాగాలతో పోల్చితే తక్కువగా చెల్లిస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు విధానంలో పరిచేస్తున్న స్టాఫ్‌నర్సుకు రూ.33వేలు జీతంకాగా, సొసైటీలో పనిచేస్తున్న స్టాఫ్‌నర్సుకు రూ.17,500లు చెల్లిస్తున్నారు. ఎంఎల్టీ, ఇతర సిబ్బందికి కూడా జీతంలో తేడాలు ఉన్నాయి. ఎయిడ్స్ విబాగంలో పనిచేస్తున్న వారికి ఎటువంటి రిస్క్, ప్రత్యేక అలవెన్సులు ఇవ్వడం లేదు. మూడేళ్లుగా ఇంక్రిమెంట్లు నిల్.. ఈ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి మూడేళ్లుగా ఇంక్రిమెంట్లు మంజూరు చేయడం లేదు. కేడర్‌ను బట్టి ఒక్కో ఉద్యోగికి రూ.1250 వంతున చెల్లించాలి. దీని ప్రకారం ఒక్కో ఉద్యోగికి ఎరియర్స్ సుమారు రూ.80వేలు నుంచి రూ.లక్ష వరకు బకాయిలు ఉన్నాయి. వీటిపై ప్రభుత్వం నోరు మెదపడం లేదు. ఉద్యోగుల పీఆర్సీతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా జీతం పెంచాల్సి ఉన్నా పాలకులు పట్టించుకోవడం లేదు. ఉద్యమ బాటలో.. సమస్యల పరిష్కారంలో సర్కారు అలసత్వాన్ని నిరసిస్తూ ఉద్యోగులు ఉద్యమాల బాట పట్టారు. ఇప్పటికే పలుమార్లు మంత్రులకు, జిల్లాలో ఉన్నాతాధికారులకు వినతులు అందజేసినా ఫలితం లేకపోవడంతో ఈ నెల 2 నుంచి 14 వరకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. నల్ల రిబ్బన్లు ధరించి విధులకు హాజరవుతున్నారు. ఈ సమయంలో ప్రభుత్వానికి అందజేయాల్సిన రిపోర్టులు, ఉత్తర ప్రత్యుత్తరాలను సైతం నిలుపుదల చేశారు. ఇంక్రిమెట్లు అందజేయాలి మూడేళ్లుగా ఏపీఎస్‌ఏసీఎస్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు బకాయిలు వెంటనే చెల్లించాలి. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాలు ఉద్ధృతం చేస్తాం. –కె.భాస్కరరావు, ఎంఎల్టీ సంఘం నాయకుడు, రాజాం. సమాన వేతనం ఇవ్వాలి వైద్య శాఖలో ఇతర విభాగాల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఒకే రకం ఉద్యోగుల మాదిరిగానే ఎయిడ్ కంట్రోల్ సొసైటీలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి. ప్రత్యేక అలవెన్సులు మంజూరు చేయాలి. – పి.శైలజారాణి, కౌన్సిలర్, రిమ్స్ -
ఎయిడ్స్‌తో అతలాకుతలమైన సిక్కోలు జిల్లా
రాజాం : కొద్ది సంవత్సరాల క్రితం హెచ్ఐవీ, ఎయిడ్స్‌తో అతలాకుతలమైన సిక్కోలు జిల్లా ప్రస్తుతం నియంత్రణ దిశలో సాగుతోంది. జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ యంత్రాంగం చైతన్య కార్యక్రమాలు, ప్రజల్లో కూడా వ్యాధి తీవ్రతపై అవగాహన పెంపొందించడం వంటి వాటి వల్ల క్రమేపీ హెచ్ఐవీ రోగుల సంఖ్య తగ్గుముఖం పట్టడం మం చి పరిణామంగా వైద్య యంత్రాంగం పరిగణి స్తోంది. అయితే ఈ వ్యాధి తమకు సోకిందని తెలియని వారు, తెలిసీ బయటకు చెప్పుకోలేని వారు, మానసికంగా కుంగిపోతున్నవారి లెక్కలు లేకపోవడం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలో తాజా స్థితిగతులు ఇలా... జిల్లాలో 2014-15 సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకూ ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఇతర సంస్థలు నిర్వహించిన రక్తదాన శిబిరాలు ద్వారా సేకరించిన రక్తం యూనిట్లు 6480 కాగా వీరిలో 25 మందికి హెచ్ఐవీ పాజి టివ్‌గా నిర్ధారించారు. ఇది 0.39 శాతం. అలాగే గ ర్భిణులను 20,268 మందిని పరీక్షించగా వీరిలో 29 మంది హెచ్ఐవీ(0.14 శాతం)తో బాధపడుతున్నట్టు గుర్తించారు. ఇక సాధారణ పరీక్షలు 29,628 మందికి జరపగా 667 మంది (2.25 శాతం)కి హెచ్ఐవీ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. అయితే గతేడాది(2013-14)తో పోల్చుకుంటే తగ్గుముఖం పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. గడిచిన ఏడాది రక్తదాతలకు 0.71 శాతం, గర్భిణులకు 0.16 శాతం, సాధారణ పరీక్షల్లో 2.52 శాతం కాగా ఈ ఏడాది కాస్త తగ్గుముఖం పట్టింది. రోగ నిర్ధారణ...రోగులకు చికిత్స ఇలా... జిల్లా వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్ అండ్ టెస్టింగ్ కేంద్రాలు(ఐసీటీసీలు) 15 చోట్ల ఉన్నాయి. అలాగే గ ర్భిణులను ప్రత్యేకంగా పరీక్షించేందుకు శ్రీకాకుళం రిమ్స్‌తో పాటు పాలకొండ, టెక్కలి ఏపీ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో పీపీటీసీ కేంద్రాలు సేవలందిస్తున్నాయి. హెచ్ఐవీ సోకిన వారికి సేవలందించేందుకు శ్రీకాకుళం రిమ్స్‌లో యాంటీ రిట్రో వైరల్(ఏఆర్టీ) కేంద్రం ఏర్పాటు కాగా దీనికి అనుబంధంగా ఏఆర్టీలను రాజాం, టెక్కలి, పాలకొండ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో ఉచితంగా మందుల పంపిణీ, కౌన్సిలింగ్ తదితర కార్యకలాపాలు చేపడుతున్నారు. అలాగే వ్యాధి సోకిన గర్భిణులకు చికిత్స ప్రారంభించేప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా రాగోలులో కేర్ అండ్ సపోర్టు సెంట ర్ను ఏర్పా టు చేశారు. జిల్లా వ్యాప్తం గా శ్రీకాకుళం, పలాసలలో రెండేసి, సోంపేట, పాతపట్నం, పూండిలలో ఒక్కొక్కటి చొప్పున ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ప్రభుత్వ అనుమతితో ప్రైవేటు పార్టనర్ల పేరిట పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే జిల్లాలోని మొత్తం 76 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు టెస్టింగ్ కిట్లను పంపిణీ చేయడంతో పీహెచ్సీ స్థాయిలోనూ పరీక్షలు ఆరంభం కానున్నాయి. అవగాహన పెంపొందించుకుంటే నియంత్రణ... ఇదే విషయమై జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నోడల్ అధికారి, జిల్లా అదనపు డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ డి.రత్నకుమారి, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఉమా మహేశ్వరరావు ఆదివారం రాత్రి ‘సాక్షి’తో మాట్లాడుతూ అవగాహన పెంచుకుంటే హెచ్ఐవీని అదుపులో ఉంచవచ్చునన్నారు. సందేహం ఉంటే పరీక్ష చేయించుకోవాలని, సరైన చికిత్స పొందితే దాదాపు 20 ఏళ్లు ఆరోగ్యంగా జీవించే అవకాశం ఉందని అన్నారు. కాగా హెచ్ఐవీ సోకిన రోగులకు రూ.వెయ్యి పింఛను, ఆర్టీసీలో ప్రయాణానికి 50 శాతం రాయితీ, ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా 50 శాతం రాయితీతో రుణాలు అందజేస్తున్నారు. కొద్ది నిమిషాలు చర్చిస్తే చాలు... హెచ్ఐవీ, ఎయిడ్స్ తీవ్రతను ప్రజలకు తెలియజేందుకు ప్రభుత్వ యంత్రాంగం బహుముఖ ప్రయత్నం చేస్తోంది. స్వచ్ఛంద సంస్థల సేవలను వినియోగించుకుంటోంది. అలాగే జిల్లాలో ఏ స్థాయి అధికారిక సమావేశం జరిగినా ప్రారంభంలో కొద్ది నిముషాలు ఎయిడ్స్‌పై చర్చించాలని నిర్దిష్టమైన ప్రభుత్వ ఆదేశాలున్నాయి. ఆరంభంలో అధికారులు ఈ నిబంధన పాటించి తర్వాత వదిలేశారు. మరో పక్క హెచ్ఐవీ, ఎయిడ్స్ జిల్లాలో చాపకింద నీరులా ప్రవేశిస్తోంది. రాజాం ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో హెచ్ఐవీ, ఎయిడ్స్ రోగులున్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. సమావేశాల ముందు ఎయిడ్స్‌పై చర్చించే ప్రక్రియ దాదాపు నిలిచిపోవడంతో గ్రామస్థాయి ప్రజలకు వ్యాధి తీవ్రతపై అవగాహన కలగడం లేదు. దీనిపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్యామల వివరణ ఇస్తూ ఇకపై అన్ని అధికారిక సమావేశాల్లో హెచ్ఐవీపై రెండు నిమిషాలైనా చర్చించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వ్యర్థ్దాలతో ఎయిడ్స చిహ్నం సీతంపేట : స్థానిక మం డల సహిత ఉపాధ్యాయుడు కందికప్ప చక్రధర్ నేడు ఎయిడ్స్ దినోత్స వం సందర్భంగా వ్యర్థపదార్థాలతో ఎయిడ్స్ చిహ్నమైన రెడ్‌రిబ్బన్‌ను వ్యర్థ పదార్థాలతో తయారు చేశారు. దీనికి మధ్యలో గ్లోబు ఉంచారు. దీన్ని తయారు చేయడానికి స్పైరల్ బైండింగ్ ఎరుపు పేపరు, ఎలక్ట్రానిక్ ప్లాస్టిక్ పైపు, పాత బంతి, రక్త పరీక్షల బీడలు, ఫెవికిక్ ఉపయోగించారు. రెండు గంటల సమయంలో దీన్ని తయారు చేసినట్టు చక్రధర్ తెలిపారు. -
వివక్ష తొలగితేనే హెచ్ఐవీ నియంత్రణ
=మానవతా దక్ఫథంతో వ్యాధిగ్రస్తులను ఆదరించాలి =రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ పీడీ పార్థసారథి విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ : సమాజంలో వివక్ష జీవించి ఉన్నంతకాలం హెచ్ఐవీని నియంత్రించడం సాధ్యం కాదని రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ ప్రాజెక్టు డెరైక్టర్ పి.పార్థసారథి అన్నారు. హెచ్ఐవీ అనగానే ఎయిడ్స్ అని భయపడొద్దని, వ్యాధిగ్రస్తుల పట్ల అందరూ మానవత్వంతో వ్యవహరించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ కళాశాలల రెడ్‌రిబ్బన్ క్లబ్ విద్యార్థులు, అధ్యాపకులకు శుక్రవారం హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాలలో ఒక రోజు వర్క్‌షాప్ ఏర్పాటుచేశారు. వర్క్‌షాప్‌ను ప్రారంభించిన పార్థసారథి మాట్లాడుతూ 2003-04 సంవత్సరంలో వరంగల్ జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన కాలంలో హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు విస్తతంగా ప్రచారం నిర్వహించామని గుర్తుచేశారు. అప్పట్లో ఎయిడ్స్‌కు మందు లేకపోగా నియంత్రణే ప్రధానమని ప్రచారం చేశామని, అయితే ఇప్పుడు నియంత్రణకు కూడా మందులు లభిస్తున్నాయని తెలిపారు. హెచ్ఐవీ పాజిటివ్‌ను వైరస్‌గానే భావించాలని, ఆ తర్వాత కొన్నేళ్ల తర్వాత వ్యాధిగ్రస్తులు ఎయిడ్స్ బారిన పడతారని వివరించారు. ఎయిడ్స్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎంత ప్రచారం చేసినా కొత్తగా కేసులు వెలుగు చూస్తున్నాయని, కాకపోతే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సంఖ్య తగ్గిందని పార్థసారథి వివరించారు. అయితే, జీరో స్థాయికి తీసుకురావాలన్న తమ లక్ష్యం నెరవేరడం లేదని పేర్కొన్నారు. కళాశాలల్లో రెడ్‌రిబ్బన్ క్లబ్‌ల ద్వారా హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై విస్తత ప్రచారం చేయిస్తూ ఎన్ఎస్ఎస్ వలంటీర్లను భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు. ఓటు హక్కు మాదిరిగానే రక్తదానం యువతీయువకులు 18ఏళ్లు రాగానే ఓటు హక్కు పొందినట్లుగానే రక్తదానం చేయాలని పార్థసారథి సూచించారు. స్వచ్ఛందంగా అందరూ రక్తదానానికి ముందుకొస్తే రక్తాన్ని అమ్ముకుంటున్న వారి ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందన్నారు. జిల్లాలోని బ్లడ్ బ్యాంకులు ఎన్ని, ఎంత రక్తం అవసరమవుతుందో అంచనా వేసి అంతే మేర రక్తం సేకరించాలని సూచించారు. అంతేతప్ప ఎక్కువగా సేకరిస్తే నిరుపయోగమయ్యే ప్రమాదముందని తెలిపారు. సామాజిక సేవగానే భావించాలి విద్యార్థులు చదువుకుంటూనే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని, రక్తదానాన్ని కూడా సామాజిక సేవగా నే భావించాలని జాయింట్ కలెక్టర్ పౌసుమి బసు సూచిం చారు. ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టేందుకు నియంత్రణే మార్గమన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ పి.సాంబశివరావు మాట్లాడుతూ జిల్లాలో హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై విస్తత ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. నెహ్రూ యువకేంద్రం బాధ్యుడు మనోరంజన్ కుమార్ మాట్లాడుతూ ఈ ఏడాది 35వేల యూనిట్ల రక్తాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. కేయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ బి.సురేశ్‌లాల్ మాట్లాడుతూ ఈ విద్యాసంవత్సరంలో కేయూ ఎన్ఎస్ఎస్ మూడు జిల్లాల పరిధిలో 20వేల యూనిట్ల రక్తాన్ని సేకరించనున్నట్లు పేర్కొన్నారు. కేడీసీ ప్రిన్సిపాల్ ఆర్.మార్తమ్మ అధ్యక్షతన జరిగిన ఈ వర్క్‌షాప్‌లో అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ సూర్యప్రకాష్‌రావు, కోఆర్డినేటర్ బి.విక్టర్‌తో పాటు ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ బాధ్యులు, అధ్యాపకులు ఈ.శ్రీనివాస్, స్వప్నమాధురి, కల్యాణి, టి.స్వామి, జి.రమేష్, డాక్టర్ సోమిరెడ్డి, డాక్టర్ ఎన్వీఎన్.చారి, రజనీ లత, వినోలియా మిల్కా, డాక్ట ర్ చంద్రమౌళి పాల్గొన్నారు. కాగా, తొలుత కేడీసీలో ఎన్సీసీ వలంటీర్లచే పార్థసారథి గౌరవ వందనం స్వీకరించారు. అలాగే, కేడీసీలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని పార్థసారథి ప్రారంభించారు.