టీఎస్‌ఏసీఎస్‌లో ఉద్యోగాలు.. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు | TSACS Recruitment 2021: Vacancies, Eligibility, Salary, Application Form | Sakshi
Sakshi News home page

టీఎస్‌ఏసీఎస్‌లో 40 పోస్టులు

Published Wed, Aug 18 2021 7:04 PM | Last Updated on Wed, Aug 18 2021 7:04 PM

TSACS Recruitment 2021: Vacancies, Eligibility, Salary, Application Form - Sakshi

తెలంగాణ స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ.. జిల్లాల్లోని కేంద్రాల్లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని తెలంగాణ స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ(టీఎస్‌ఏసీఎస్‌).. జిల్లాల్లోని కేంద్రాల్లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 40

పోస్టుల వివరాలు: మెడికల్‌ ఆఫీసర్‌–04, కౌన్సిలర్‌–01, ఫార్మసిస్ట్‌–01, స్టాఫ్‌ నర్సు–26, కేర్‌ కోఆర్డినేటర్‌–01, న్యూట్రిషనిస్ట్‌–01, రీసెర్చ్‌ ఫెలో(క్లినికల్‌)/సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌–01, రీసెర్చ్‌ ఫెలో(నాన్‌–క్లినికల్‌)–01, హెచ్‌ఐవీ రీసెర్చ్‌ ఫెలో(క్లినికల్‌)/సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌–01, హెచ్‌ఐవీ రీసెర్చ్‌ ఫెలో(నాన్‌–క్లినికల్‌)–01, ఏఎన్‌ఎం–01, డేటా మేనేజర్‌–01.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్, బీఎస్సీ(నర్సింగ్‌), జీఎన్‌ఎం, ఎంబీబీఎస్, గ్రాడ్యుయేషన్, పీఎల్‌హెచ్‌ఐవీ మాస్టర్స్‌ డిగ్రీ, ఎండీ ఉత్తీర్ణులవ్వాలి.

వేతనం: పోస్టును అనుసరించి నెలకు రూ.9000 నుంచి రూ.60,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా కేంద్రాల్లోని మెడికల్‌ సూపరింటెండెంట్‌/డైరెక్టర్‌ కార్యాలయాల్లోని దరఖాస్తులను అందజేయాలి.

► దరఖాస్తులకు చివరి తేది: 30.08.2021

► వెబ్‌సైట్‌:  https://tsacs.telangana.gov.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement