Air Force Chief
-
మహిళా ఉద్యోగి ఆత్మహత్య: ఎయిర్‌ఫోర్స్ చీఫ్ రాజీనామా
సియోల్ : ఓ మహిళా ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి ఆత్మహత్య ఎయిర్ ఫోర్స్ చీఫ్ రాజీనామాకు దారితీసింది. ఉద్యోగి మరణానికి బాధ్యత వహిస్తూ.. ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ లీ సియాంగ్యాంగ్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. పురుష సహోద్యోగి లైంగిక వేధింపుల కారణంగా ఓ మహిళా మాస్టర్ సార్జంట్ ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రజాగ్రహం వెల్లువెత్తింది. దీంతో జనరల్ లీ ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశ అధ్యక్షుడు మూన్ జే ఇన్... జనరల్ లీ రాజీనామాను ఆమోదించారు. కాగా, మహిళా సార్జంట్ వేధింపులకు సంబంధించి ఓ ఎయిర్ ఫోర్స్ మాస్టర్ సార్జంట్‌ను అరెస్ట్ చేసినట్లు రక్షణ శాఖ తెలిపింది. మార్చి నెలలో సదరు నిందితుడు కారులో బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అయితే, ఉన్నతాధికారులు ఈ సంఘటనను బయటకు రాకుండా చూడ్డానికి ప్రయత్నించారని, నిందితుడితో ప్రైవేటు సెటిల్మెంట్ చేసుకోవాలంటూ బాధితురాలపై ఒత్తిడి తెచ్చారని బాధితురాలి కుటుంబం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఆమె మే నెలలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపింది. ప్రెసిడెన్షియల్ పిటిషన్‌ను దాఖలు చేసింది. కేసును తుడిచిపెట్టడానికి ప్రయత్నించిన ఉన్నతాధికారులకు శిక్ష విధించాలంటూ శుక్రవారం మధ్యాహ్నం 34వేలకు పైగా మంది ఆ పిటిషన్‌పై సంతకం చేశారు. దీనిపై ప్రెసిడెంట్ మూన్ స్పందిస్తూ విచారణకు ఆదేశించారు. -
తేజస్ విమానం నడిపిన ఎయిర్ చీఫ్ మార్షల్
సాక్షి, చెన్నై: భారత వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా బుధవారం ఎంకే1 తేజస్ తేలికపాటి యుద్ధ విమానంలో విహరించారు. తమిళనాడులోని సూలూరు ఎయిర్‌స్టేషన్‌లో ఈ విమానాన్ని ఆయన పరిశీలించారు. ఇది నాలుగో తరం సూపర్సోనిక్ విమానాల్లో చిన్న ది, తెలికపాటిది. ఈ విమానాలను ఫ్లయింగ్ బుల్లెట్లుగా పిలుస్తారు. (హద్దు మీరుతున్న డ్రాగన్) తేజస్ విమానాన్ని ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా స్వయంగా నడిపారు. ఈ విమానాన్ని కోయంబత్తురు సమీపంలో ఉన్న సూలూరు 45వ స్కాడ్రన్ చేర్చారు. దీంతో సూలూరు ఎయిర్‌స్టేషన్ తేజస్ విమానాలను కలిగి ఉన్న రెండో ఐఏఎఫ్ స్కాడ్రన్గా నిలుస్తోంది. ఈ తేజస్ విమానం స్వదేశి పరిజ్ఞనంతో తయారు చేయబడింది. (మేకలు అమ్మి సొంతూరికి పయనం) -
అభినందన్ మనోధైర్యానికి మరో గుర్తింపు
న్యూఢిల్లీ : బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడి చేసిన తరువాత, ప్రతీకార ధోరణిలో పాకిస్థాన్ గత ఫిబ్రవరి 27న భారత్‌పై వాయుదాడులకు ప్రయత్నించినప్పుడు ఆ దేశానికి చెందిన ఎఫ్-16 యుద్ధవిమానాన్ని కుప్పకూల్చడంలో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ టీమ్ మొత్తానికి 51వ స్క్వాడ్రన్‌కు యూనిట్ సైటేషన్ అవార్డు దక్కింది. భారత వాయుసేన ప్రారంభమై 87 సంవత్సరాలు గడిచిన సందర్భంగా అక్టోబర్ 8న జరిగే ఎయిర్‌ఫోర్స్ డే వేడుకల్లో 51వ స్క్వాడ్రన్ తరఫున గ్రూప్ కెప్టెన్ సతీష్ పవార్ అవార్డు అందుకోనున్నారు. ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ బదౌరియా అవార్డును అందించనున్నారు. పాక్ విమానాల సమాచారాన్ని ముందుగానే గ్రహించి భారత వాయుసేన బృందాన్ని అప్రమత్తం చేసిన మింటీ అగర్వాల్ నాయకత్వంలోని 601 సిగ్నల్ యూనిట్‌కి కూడా ఈ అవార్డు అందించనున్నారు. పుల్వామా ఘటన తర్వాత భారత గగనతలంలోకి ప్రవేశించిన పాక్ యుద్ద విమానాలను వెంటాడే క్రమంలో అభినందన్ పాక్ ఆర్మీకి చిక్కిన సంగతి తెలిసిందే. పాక్ సైనికులు అతనిపై దేశరహస్యాల కోసం ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ అభినందన్ వాటిని బయటపెట్టలేదు. ఆ సమయంలో అభినందన్ చూపించిన తెగువ, ఆత్మస్థైర్యం ప్రతీ భారతీయుడిని కదిలించింది. ఈ నేపథ్యంలోనే అభినందన్‌ను వీరచక్ర పురస్కారానికి ఎంపిక చేశారు. భారత 73వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌కు ప్రభుత్వం వీరచక్ర పురస్కారాన్ని కూడా అందజేశారు. -
సొంత హెలికాప్టర్‌ను కూల్చడం పెద్ద తప్పు
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఫిబ్రవరి చివరలో.. తమ సొంత హెలికాప్టర్‌ను కశ్మీర్లో తామే కూల్చివేయడం అతిపెద్ద తప్పిదమని వైమానిక దళ(ఐఏఎఫ్) ప్రధానాధికారి రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా అంగీకరించారు. పాక్ వైపు నుంచి జరిగే ఏ దాడులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తక్కువ సమయంలోనే స్పందించి, సైన్యం, నౌకాదళంతో సమన్వయం చేసుకుని దాడులు చేయగలమన్నారు. ఫిబ్రవరి 27న పొరపాటున బుద్గాం జిల్లాలో ఐఏఎఫ్‌కు చెందిన ఎంఐ 17 చాపర్‌ను వైమానిక దళం భూమి మీది నుంచి ఆకాశంపై ప్రయోగించగల క్షిపణి ద్వారా కూల్చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు ఐఏఎఫ్ అధికారులు, ఒక పౌరుడు మరణించారు. ఈ ఘటనపై జరిపిన అంతర్గత విచారణ ముగిసిందని, బాధ్యులుగా తేలిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని భదౌరియా శుక్రవారం తన తొలి ప్రెస్మీట్లో వెల్లడించారు. ఇద్దరు సీనియర్ అధికారులపై కోర్టు మార్షల్ ప్రక్రియ ప్రారంభించామన్నారు.అంతకుముందు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్ర స్థావరాలపై ఐఏఎఫ్ చేసిన దాడులకు సంబంధించిన వీడియో క్లిప్‌లను ప్రదర్శించారు. చాపర్‌లోని సిబ్బంది, కంట్రోల్ సెంటర్లోని అధికారుల మధ్య సమాచార లోపం విచారణలో స్పష్టంగా కనిపించిందని భదౌరియా తెలిపారు. కూల్చివేతకు గురైన సమయంలో చాపర్‌లోని ‘ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫ్రెండ్ ఆర్ ఫో’(ఐఎఫ్ఎఫ్– మిత్రుడా, శత్రువా గుర్తించడం) సిస్టమ్ నిలిపేసి ఉందని వాయుసేన వర్గాలు వెల్లడించాయి. దాంతో శత్రు చాపర్‌గా భావించి దానిని క్షిపణి ద్వారా కూల్చివేశారన్నారు. ఫిబ్రవరి 27న కశ్మీర్‌లోని నౌషేరాలో భారత్, పాక్‌ల మధ్య యుద్ధ విమానాలు భీకర పోరు సలుపుతున్న సమయంలో భారత్‌కు చెందిన ఎంఐ 17 కూల్చివేతకు గురైన విషయం తెలిసిందే. డ్రోన్లతో ముప్పు సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా ఆయుధాలను జారవిడవడం కొత్త ముప్పుగా మారిందని భదౌరియా పేర్కొన్నారు. పాక్‌లోని ఉగ్ర సంస్థలే దీనికి పాల్పడుతున్నాయన్నారు. టిబెట్ ప్రాంతంలో చైనా భారీగా మిలటరీ కేంద్రాలను ఏర్పాటు చేస్తుండటాన్ని నిశితంగా గమనిస్తున్నామన్నారు.అయితే, దానిపై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పాక్ ఒప్పుకోకపోయినా, ఫిబ్రవరి 27న పాక్‌కు చెందిన ఎఫ్ 16ను భారత్ కూల్చివేయడం వాస్తవమేనని స్పష్టం చేశారు. మరో బాలాకోట్ తరహా దాడులకు సిద్ధమేనా అన్న ప్రశ్నకు.. ప్రభుత్వ ఆదేశాలపై, లక్ష్యాలేవైనా, వాటి పని పడ్తామని సంసిద్ధత వ్యక్తం చేశారు. భారత వైమానిక దళ సమాచార వ్యవస్థను భవిష్యత్తులో పాక్ అడ్డుకునే వీలు లేకుండా సాంకేతికతను మెరుగుపర్చామన్నారు. పాక్ ఎఫ్ 16ను కూల్చేసిన అనంతరం భారత వింగ్ కమాండర్ వర్ధమాన్ అభినందన్‌కు భారత వాయుసేన నుంచి సందేశాలు నిలిచిపోవడం వల్లనే, ఆయన ప్రయాణిస్తున్న మిగ్ 21ను పాక్ దళాలు కూల్చివేయగలిగాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. -
ఎయిర్‌ఫోర్స్ నూతన చీఫ్‌గా భదౌరియా
ఢిల్లీ: భారత వైమానిక దళం (ఐఏఎఫ్) అధిపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియాను కేంద్ర ప్రభుత్వం గురువారం నియమించింది. ప్రస్తుతం ఆయన వైమానిక దళానికి వైస్ చీఫ్‌గా సేవలందిస్తున్నారు. ఎయిర్‌ఫోర్స్ చీఫ్ బీఎస్ ధనోవా సెప్టెంబర్ 30న పదివి విరమణ అనంతరం ఆర్కేఎస్ భదౌరియా ఈ పదవిని చేపట్టనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఎయిర్ ఫోర్స్ చీఫ్ బీఎస్ ధనోవా విదవీ విరమణ పొందే రోజు భదౌరియా కూడా పదవి విరమణ పొందాల్సి ఉంది. కానీ, తాను ఇప్పుడు వైమానికి దళానికి చీఫ్‌గా ఎన్నికవడంతో.. భదౌరియా 62 ఏళ్లు వచ్చేవరకు మరో రెండేళ్ల పాటు భారత ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా కొనసాగనున్నారు. ఆయన పుణె నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వవిద్యార్థి.. దీంతోపాటు 26 భిన్నమైన విమానాలను 4250 గంటల పాటు నడిపిన అనుభవం ఉంది. భదౌరియా ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్, సదరన్ ఎయిర్ కమాండ్‌గా మార్చి 2017 నుంచి ఆగస్టు 2018 వరకు పనిచేశారు. తర్వాత శిక్షణా కమాండ్‌గా.. ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా కూడా సేవలందించారు. ప్రస్తుతం వైమానికదళానికి వైస్ చీఫ్‌గా పని చేస్తున్నారు. 36 ఏళ్ల తన సర్వీస్‌లో అతి విశిష్ట సేవ, వాయు సేన, పరమ్ విశిష్ట సేవ పతకాలను అందుకున్నారు. ఆయన ఈ ఏడాది జనవరిలో భారత రాష్ట్రపతికి గౌరవ సహాయకుడు ‘డి కాంపే’గా నియమితులయ్యారు. రాఫెల్ ఫైటర్ జెట్‌ను నడిపిన మొదటి భారత వైమానిక దళానికి నాయకత్వం వహించారు. జెట్ విమానాల కోసం ఫ్రాన్స్‌తో ఒప్పందం చేసుకోవడంలో భదౌరియా కీలకపాత్ర పోషించారు. -
భారత్‌కు పాక్ వార్నింగ్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఉగ్రవాదులు మాత్రమే కాదు.. అక్కడ బాధ్యతాయుతమైన అధికారాలు నిర్వహిస్తున్న పెద్ద వ్యక్తులు కూడా భారత్‌ను రెచ్చగొట్టే చర్యలు మానుకోవడం లేదు. జమ్మూకశ్మీర్ విషయంలో భారత్ ను ఎలా డీల్ చేయాలో తమకు బాగా తెలుసంటూ పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్‌సోహెయిల్ అమన్ భారత్‌కు వార్నింగ్ ఇచ్చాడు. వాస్తవాదీన రేఖ వెంబడి రెండు దేశాల మధ్య హింసాత్మక సంఘటనలు పెరిగిపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, అయిన తమకు ఎలాంటి ఆందోళన లేదని పేర్కొన్నారు. భారత ఆర్మీ జరిపిన కాల్పుల్లో 12మంది పౌరులు ముగ్గురు తమ జవాన్లు చనిపోయినట్లు పాక్ తెలిపింది. ఈ నేపథ్యంలో కరాచీలో అమన్ మీడియాతో మాట్లాడుతూ ‘ఇలాంటి చర్యలు భారత్ నిలిపివేస్తే మంచిది. వివాదాన్ని మరింత పెద్దది చేయాలని చూస్తే పాక్ సైన్యం కూడా ఆ పని చేయగలదు. ఈ విషయంలో భారత్‌తో ఎలా ముందుకు వెళ్లాలో మాకు బాగా తెలుసు’ అంటూ ఆయన బీరాలు పోయాడు.